Ranveer Singh
-
ఓటీటీలో సడన్ సర్ప్రైజ్ 'సింగం అగైన్' తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
బాలీవుడ్ భారీ యాక్షన్ సినిమా 'సింగం అగైన్'(Singham Again). ఇది సింగం మూవీ బ్లాక్‌బస్టర్ సిరీస్‌లో మూడో భాగంగా గతేడాదిలో విడుదలైంది. భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలో హిందీ వర్షన్ రన్ అవుతుంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్ కూడా సడెన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అజయ్ దేవ్‌గణ్(Ajay Devgn), అక్షయ్ కుమార్(Akshay Kumar), రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2024 నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగం అగైన్ దాదాపు రూ.372 కోట్లు రాబట్టింది.సింగమ్, సింగమ్ రిటర్న్స్, సింబా, సూర్యవన్షీ వంటి పోలీస్ కాప్ చిత్రాలతో దర్శకుడు రోహిత్‌శెట్టి ( Rohit Shetty) హిట్స్ కొట్టాడు. ఇప్పుడు అదే ఊపులో సింగం అగైన్ తెరకెక్కించాడు. అయితే, ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో కూడా మంచి ఆదరణ లభించింది. సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు తమిళ్ వర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు. 2011లో సింగం సినిమా రాగా దానికి సీక్వెల్‌గా 2014లో సింగం రిటర్న్స్ వచ్చింది. దశాబ్దకాలం తర్వాత దీనికి కొనసాగింపుగా సింగం అగైన్ తెరకెక్కించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవి బర్సూర్,థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ వర్ధంతి.. ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి)బాలీవుడ్ అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి... కాప్ యూనివర్స్‌లో పోలీసు బ్యాక్‌డ్రాప్ చిత్రాలను తెరకెక్కించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అనే ట్యాగ్ ఉంది. ఈ క్రమంలో ఆయన నుంచి వచ్చిన సింగమ్, సింగమ్ రిటర్న్స్, సింబా, సూర్యవన్షీ వంటి చిత్రాలే అని చెప్పవచ్చు. తన చిత్రాలలోని పాత్రలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘సింగమ్ అగైన్’లో దీపికా పదుకొణెని (Deepika Padukone) డి.సి.పి శక్తి శెట్టిగా అతిథి పాత్రలో ఆయన చూపించారు. కానీ లేడీ సింగమ్‌తో పూర్తిస్థాయి ప్రాధాన్య ఉన్న ఒక చిత్రం చేయాలనే ఆలోచన ఉన్నట్లు రోహిత్ చెప్పారు. చాలా రోజులుగా ఇదే విషయంపై ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, అది పట్టాలెక్కడం లేదు. కానీ, సింగం అగైన్ విడుదల తర్వాత దీపిక పదుకొణెతో లేడీ సింగమ్ తరహా సినిమాకచ్చితంగా ఉంటుందన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆ కథకు సంబంధించిన బలమైన ఆలోచన ఉందని పేర్కొన్నారు. కానీ దాన్ని స్క్రిప్ట్‌గా మార్చడానికే కుదర లేదని చెప్పారు. ఏది ఏమైనా లేడీ సింగమ్ సినిమా అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పడంతో ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. -
దీపికా స్టైలిష్ డ్రెస్, చూడ్డానికి చాలా సింపుల్ : కానీ ధర తెలిస్తే షాక్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా భర్తతో రణ్వీర్తో కలిసి విమానాశ్రయంలో తళుక్కున మెరిసింది. ఈ సందర్బంగా లవబుల్ కపుల్ ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్‌లో ఫ్యాన్స్‌ను మురిపించారు. ఎప్పటిలాగానే నవ్వుతూ మీడియాకు ఫోజులిచ్చారు.కుమార్తె దువాకు జన్మనిచ్చిన తరువాత తల్లిదండ్రులుగా జంటగా కనిపించారు. ట్రెండింగ్ వైడ్ లెగ్ జీన్స్, పాప్లిన్ స్లిట్ షర్ట్‌లో చాలా సింపుల్‌గా కనిపించింది. కానీ ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా?ఎయిర్‌పోర్ట్‌లో నల్ల చారల చొక్కా, ప్యాంట్ చాలా సింపుల్‌గా కంఫర్టబుల్‌గా చిక్ స్టైల్‌తో మెప్పించింది గ్లోబల్ ఐకాన్. లీ మిల్ కలెక్షన్‌కు చెందిన ఈ డ్రెస్ ధర 79,100. దీనికి జతగా సిటిజన్స్ ఆఫ్ హ్యుమానిటీ హై రైజ్ వైడ్ లెగ్ జీన్స్‌ను ధరించింది. దీని ధర సుమారు రూ. 39వేలే. (యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!)అంతేనా లగ్జరీ ఎలిమెంట్‌ను జోడిస్తూ లూయిస్ విట్టన్ సన్ గ్లాసెస్‌తో తన లుక్‌కి మోడ్రన్ టచ్ ఇచ్చింది. ఇంకా అద్భుతమైన కార్టియర్ శాంటాస్ డి కార్టియర్ వాచ్‌తో రూపాన్ని పూర్తి చేసింది, దీని ధర రూ.3,080,000. ఇదీ చదవండి: పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం Power couple Ranveer Singh and Deepika Padukone turn heads at the Mumbai airport with their effortless style and charm 💕#RanveerSingh #DeepikaPadukone #deepveer #Bollywood #iwmbuzz @RanveerOfficial @deepikapadukone pic.twitter.com/TE2Al4PK7J— IWMBuzz (@iwmbuzz) January 7, 2025 ఇక రణవీర్ సింగ్ తన జుట్టును పోనీ టైల్లో కట్టి, తన క్యాజువల్ బెస్ట్ డ్రెస్‌లో అందరికీ హాయ్ చెప్పాడు. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూతురు దువాతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఇటీవల దీపిక 39వ పుట్టినరోజు (జనవరి,5)కు ఈ జంట మాల్దీవుల్లో సెల్రబేషన్స్ ముగించుకొని తిరిగి ముంబై చేరుకున్నారు. కాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas)తో కలిసి దీపికా కల్కి( Kalki ) సినిమాలో నటించింది. గర్భంతో ఉన్న మహిళగా నటనతో విమర్శకులను సైతం మెప్పించింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నపుడే ఈ సినిమాలో నటించడం మాత్రమే కాదు, నిండు గర్భంతో ప్రమోషన్స్‌లో పాల్గొని అందర్నీ మెస్మరైజ్ చేసింది.ఈ ప్రమోషన్స్‌లో రూ.1.14 లక్షల విలువైన బ్లాక్ డ్రెస్‌తో ఆకట్టుకుంది. Magda రూ.41.500 విలువైన Butrym బ్రాండ్ స్టైలీష్ చెప్పులు ధరించింది. కోటి రూపాయల విలువచేసే బ్రేస్ లేట్ కూడా ధరించిన విషయం తెలిసిందే. -
భార్యకు స్టార్ హీరో స్పెషల్ విషెస్.. ఏకంగా ఐ లవ్ యూ చెబుతూ!
-
'రణ్‌వీర్‌లో ఆ లక్షణాలే నచ్చాయి'.. దీపికా పెళ్లి వీడియో వైరల్!
బాలీవుడ్ మోస్ట్ ఫేమస్ కపుల్స్‌లో దీపికా పదుకొణె- రణ్వీర్ సింగ్ ఒకరు. ఈ జంటకు ఇటీవలే కూతురు జన్మించింది. వీరి పెళ్లయిన ఆరేళ్లకు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. సెప్టెంబర్ 8న ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో దీపికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.అయితే ఈ జంట ఇవాళ తమ ఆరో వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2018లో ఇటలీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ఈ జంట ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుకల్లో బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. కొంకణి, సింధీ సంప్రదాయాల్లో నవంబర్ 14న వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరికి పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తన భర్త రణ్వీర్ సింగ్ గురించి దీపికా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోని చాలా మంది చూడని వ్యక్తికి నేను ఆకర్షితురాలినయ్యా. అతనినొక నిశ్శబ్దం. అంతేకాదు తెలివైన, సున్నితమైన వ్యక్తి. అతను ఏడిస్తే నాకు చాలా ఇష్టం. అంతకుమించి మంచి మనసున్న వ్యక్తి. అందుకే నేను ఇష్టపడ్డా' అని పెళ్లి వీడియోలో మాట్లాడింది.కాగా.. గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా (2013) సెట్లో వీరిద్దరు తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ జంట దాదాపు ఆరేళ్ల డేటింగ్ తర్వాత వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ రోజు మ్యారేజ్ డే సందర్భంగా దీపికా పదుకొణెకు స్పెషల్‌గా విషెస్ తెలిపారు. -
మా ప్రార్థనలకు సమాధానం దువా
బాలీవుడ్‌లోని వన్నాఫ్ ది క్రేజీ కపుల్స్ రణ్వీర్ సింగ్ – దీపికా పదుకోన్ తమ కుమార్తెకు దువా పదుకోన్ సింగ్ అని నామకరణం చేశారు. ఆ పేరును ఖరారు చేసినట్లుగా వెల్లడించి, దువా కాళ్లు మాత్రమే కనిపించేలా రణ్వీర్–దీపికలు ఓ ఫొటోను షేర్ చేశారు.‘‘మా కుమార్తెకు దువా పదుకోన్ సింగ్ అనే పేరు పెట్టాం. దువా అంటే ప్రార్థన. మా ప్రార్థనలకు దువా సమాధానం. అందుకే మా కుమార్తెకు ఆ పేరు పెట్టాం’’ అని పేర్కొన్నారు రణ్వీర్–దీపిక. 2018లో రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్ వివాహం చేసుకున్నారు. 2023 సెప్టెంబరులో దీపిక ఓ పాపకు జన్మనిచ్చారు. -
కూతురికి క్యూట్ నేమ్ పెట్టిన దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ జంట రణ్వీర్ సింగ్- దీపికా పదుకొణె తమ ముద్దుల కుమార్తె పేరును ప్రకటించారు. దువా పదుకొణె సింగ్ అని నామకరణం చేసిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈమేరకు చిన్నారి పాదాల ఫోటోను షేర్ చేశారు. 'దువా అంటే ప్రార్థన అని అర్థం. మా ప్రార్థనలకు సమాధానమే తను. మా మనసు సంతోషంతో, ప్రేమతో ఉప్పొంగిపోతోంది' అని రాసుకొచ్చారు.గుడ్ న్యూస్కాగా రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె.. రామ్ లీలా, బాజీరావు మస్తానీ, 83 వంటి సినిమాల్లో కలిసి నటించారు. 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపిక తాను గర్భవతిని అని గుడ్‌న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 8న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇకపోతే దీపిక, రణ్వీర్.. సింగం అగైన్ సినిమాలో గెస్ట్ రోల్లో మెరవనున్నారు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
గ్యాప్ ఇవ్వలా... వచ్చింది
నచ్చిన కథ దొరక్క కొందరు, చేసే పాత్రకు తగ్గట్టు మేకోవర్ అవ్వాలని మరికొందరు, వ్యక్తిగత జీవితంతో ఇంకొందరు... ఇలా కారణాలు ఏమైనా యాక్టర్స్ కెరీర్లో కొన్నిసార్లు గ్యాప్‌లు వస్తుంటాయి. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ గ్యాప్‌ను ఫిల్ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి గ్యాప్‌ల కారణంగా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించకుండా ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’ అంటున్న కొందరు బాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం.స్పీడ్ బ్రేకర్ గత ఏడాది బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేశారు షారుక్ ఖాన్. 2023లో షారుక్ ఖాన్ హీరోగా చేసిన ‘పఠాన్, జవాన్’ రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను అధిగమించగా, ‘డంకీ’ రూ. 450 కోట్ల కలెక్షన్స్‌ను సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఈ మూడు చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత ఏడాది రూ. 2,500 కోట్ల కలెక్షన్స్ పైగా రాబట్టగలిగారు షారుక్. కానీ ఈ ఏడాది షారుక్ జోరుకు స్పీడ్ బ్రేకర్ పడింది. 2024లో సిల్వర్ స్క్రీన్‌ని మిస్ చేసుకున్నారు షారుక్. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో షారుక్ తనయ సుహానా ఖాన్ మరో లీడ్ రోల్లో నటిస్తారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఇంకా ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. ‘కింగ్’ 2025 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ది బుల్ మిస్ అయ్యాడు ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3’... ఈ రెండు సినిమాలతో సల్మాన్ ఖాన్ గత ఏడాది వెండితెరపై కనిపించారు. ఇదే జోష్‌లో ఈ ఏడాది ఈద్‌కు సల్మాన్ ఖాన్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ కుదర్లేదు. ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్తో సల్మాన్ ఖాన్ చేయాల్సిన ‘ది బుల్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా సరైన సమయంలో సెట్స్ పైకి వెళ్లలేదు. దాంతో ఈ ఏడాది సల్మాన్ ఖాన్ వెండితెరపై కనిపించలేకపోయారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్‌తో సల్మాన్ ఖాన్ ‘సికందర్’ అనే యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ కానున్నట్లు యూనిట్ ప్రకటించింది. మరోవైపు దర్శకుడు విష్ణువర్ధన్తో సల్మాన్ చేయనున్న చిత్రం కూడా 2025లోనే రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. సో.. వచ్చే ఏడాది రెండుసార్లు సల్మాన్ తెరపై కనిపిస్తారని ఊహించవచ్చు. రెండేళ్లు పూర్తయినా... రెండేళ్లు దాటిపోయింది ఆమిర్ ఖాన్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి. 2022లో చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా (హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్) తర్వాత ఆమిర్ వెంటనే మరో సినిమా ఒప్పుకోలేదు. మరోవైపు తన కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి పనులతో కొన్నాళ్లు ఆమిర్ ఖాన్ బిజీ అయ్యారు. దాంతో ఆయన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ లేట్‌గా సెట్స్‌పైకి వెళ్లింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా వేశారని సమాచారం. భారీ చిత్రంతో... ‘యానిమల్’ సినిమాతో గత ఏడాది బ్లాక్‌బస్టర్ అందుకున్నారు రణ్‌బీర్ కపూర్. అయితే గత ఏడాది ‘తు ఝూతీ మై మక్కర్’ చిత్రంతో ఓ ఫ్లాప్ కూడా అందుకున్నారు ఈ హీరో. ఇక ఈ ఏడాది థియేటర్స్‌లో కనిపించకుండా బ్రేక్ తీసుకున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘రామాయణ్’ సినిమాతో ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ బిజీగా ఉన్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, యశ్ వంటి స్టార్స్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇది భారీ చిత్రం కాబట్టి షూట్‌కి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ఈ ఏడాది తెరపై కనిపించలేదు రణ్‌బీర్. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోందని, తొలి భాగం 2025లో రిలీజ్ అవుతుందని సమాచారం. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ హీరోగా నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ 2026లో విడుదల కానుంది. పర్సనల్ టైమ్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ్ కావడం లేదు. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం గత ఏడాది జూలైలో రిలీజ్ అయింది. అయితే వెంటనే మరో మూవీకి సైన్ చేయలేదు రణ్వీర్. ఫిబ్రవరి చివర్లో తాము తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్ వెల్లడించారు. సో... పర్సనల్ లైఫ్‌కు రణ్వీర్ టైమ్ కేటాయించారు. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. కానీ ఈ చిత్రం 2025లోనే రిలీజ్ అవుతుంది. కాగా అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సింగమ్ ఎగైన్’ సినిమాలో మాత్రం రణ్వీర్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. ఇక దీపికా పదుకోన్ ఈ ఏడాది సెప్టెంబరులో ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే,. బిజీ బిజీ... కానీ! ‘గదర్ 2’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి, మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు సీనియర్ హీరో సన్నీ డియోల్. 2023లో రిలీజైన ‘గదర్ 2’ సక్సెస్‌తో సన్నీ డియోల్‌కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ‘బోర్డర్ 2, లాహోర్ 1947, రామాయణ్’ (కీలక పాత్రధారి)లతో పాటు తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీ. ఈ సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే ఆరంభమైంది. కానీ ఈ ఏడాది సన్నీ థియేటర్స్‌లోకి వచ్చే చాన్సెస్ కనిపించడం లేదు. అయితే 2025లో ఆయన మూడు చిత్రాలతో కనిపించే అవకాశం ఉంది. -
ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న దీపికా పదుకొణె కంపెనీ
బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు చెందిన సంస్థ కేఏ ఎంటర్ప్రైజెస్ లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో రూ.17.8 కోట్లకు 1845 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది.ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సమాచారాన్ని సేకరించే జాప్కీ సంస్థకు లభించిన పత్రాలు ఈ కొనుగోలు వివరాలను వెల్లడించాయి. ఈ సేల్ డీల్ సెప్టెంబర్ 12న నమోదైంది. ఎనార్మ్ నాగ్‌పాల్ రియాల్టీ సంస్థ విక్రేత కాగా దీపికా పదుకొణె కంపెనీ కేఏ ఎంటర్ప్రైజెస్ కొనుగోలుదారుగా పత్రాలు చూపించాయి.పికా పదుకొణె కంపెనీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సాగర్ రేషమ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఎనార్మ్ నాగ్‌పాల్ రియాల్టీ సంస్థ అభివృద్ధి చేసింది. ఇందులో 4బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే అపార్ట్మెంట్లు ఉన్నాయి. కంపెనీ కొనుగోలు చేసిన ఫ్లాట్ 15వ అంతస్తులో ఉంది. బిల్ట్-అప్ ఏరియా రేటు చదరపు అడుగుకు రూ. 96,400. ఈ డీల్‌కు స్టాంప్ డ్యూటీ దాదాపు రూ. 1.07 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ. 30,000 చెల్లించినట్లు తెలుస్తోంది.బాలివుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ఇటీవలే తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. కాగా ఈ దంపతులు కొనుగోలు చేసిన మరొక ప్రాపర్టీ షారూఖ్ ఖాన్ రాజభవనం మన్నత్‌కు సమీపంలోని బాంద్రా బ్యాండ్స్టాండ్లో సముద్రానికి ఎదురుగా ఉన్న క్వాడ్రప్లెక్స్. దీని విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ జంట 2021లో అలీబాగ్‌లో రూ. 22 కోట్ల విలువైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు. -
బాజీరావు ఇల్లు
రణవీర్ సింగ్, దీపికా పడుకోన్ నటించిన బాజీరావ్ మస్తానీ సినిమా గుర్తందా? ఆ సినిమాలో బాజీరావు ఇల్లు శనివార్వాడా కళ్ల ముందు మెదులుతోందా? ఆ శనివార్ వాడా ఉన్నది పూణేకి సమీపంలోనే. ఆ సినిమాలో అనేక ప్రధానమైన సన్నివేశాల చిత్రీకరణ ఈ కోటలోనే జరిగింది. పూణేకి వెళ్లాల్సిన పని పడితే తప్పకుండా చూడండి. కోట ప్రధానద్వారం భారీ రాతి నిర్మాణం. ఏడంతస్థుల నిర్మాణంలో ఒక అంతస్థు మాత్రమే రాతి కట్టడం, ఆ తర్వాత ఇటుకలతో నిర్మించారు. కోటలోపల ప్రతి అంగుళమూ మరాఠాల విశ్వాసాలను, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంటుంది. 18వ శతాబ్దం నాటి ఈ నిర్మాణం భారత జాతీయ రాజకీయ క్లిష్టతలను కూడా ఎదుర్కొంది. 19వ శతాబ్దంలో కొంత భాగం అగ్నికి ఆహుతైపోయింది. నిర్మాణపరంగా, చరిత్ర పరంగా గొప్ప నేపథ్యం కలిగిన ఈ కోట పర్యాటకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. బాజీరావు మస్తానీ సినిమా తర్వాత పలువురి దృష్టి దీని మీదకు మళ్లింది. మహారాష్ట్ర టూరిజమ్ గార్డెన్లను మెయింటెయిన్ చేస్తోంది.కానీ పెరుగుతున్న పర్యాటకులకు తగినట్లు పార్కింగ్, రెస్టారెంట్ సౌకర్యం లేదు. ఈ కోటలో కాశీబాయ్ ప్యాలెస్, అద్దాల మహల్ పిల్లలను ఆకట్టుకుంటాయి. ఈ కోట లోపల తిరుగుతూ ఉంటే సినిమా దృశ్యాలు కళ్ల ముందు మెదులుతూ మనమూ అందులో భాగమైన భావన కలుగుతుంది. టీనేజ్ పిల్లలకు ఈ నిర్మాణాన్ని చూపించి తీరాలి. -
ఐశ్వర్యనే ఆదర్శం అంటున్న మామ్ దీపికా!
బాలీవుడ్ స్వీట్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ పండంటి పాపాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆడబిడ్డకు తండ్రి కావాలనే రణవీర్ కోరిక నెరవేరింది. అయితే దీపికా తన ముద్దుల తనయ పెంపకం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను ఫాలో కానుందని సమాచారం. విషయం ఏమిటంటే...సాధారణంగా చంటిపాపాయి పుట్టినపుడు ఇంట్లో అమ్మమ్మలు, నాన్నమ్మలు, ఇతర పెద్దవాళ్లు తల్లీ బిడ్డల రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంటారు. చంటిబిడ్డకు నలుగు పెట్టి నీళ్లు పోయడం, పాపాయికి పాలు పట్టించడం, బాలింతకు ఎలాంటి ఆహారం పెట్టాలి లాంటి జాగ్రత్తలు, బాధ్యతలు వాళ్లవే. మకొంతమంది తమ పాపాయిని జాగ్రత్తగా చూసేందుకు ఒక ఆయమ్మను, నానీనో పెట్టుకుంటారు. చాలామంది సెలబ్రిటీలు లక్షలు ఖర్చుపెట్టి మరీ నానీలను నియమించకుంటారు. కానీ దీపికా మాత్రం ఐశ్వర్య, అలియా భట్, అనుష్క శర్మ పేరెంటింగ్ స్టైల్‌ను ఫాలో అవుతోందట. బాలీవుడ్ లైఫ్ కథనం ప్రకారం దీపిక నానీని ఏర్పాటు చేసుకోకూడదని నిర్ణయించింది. స్వయంగా తానే చిన్ని దీపిక బాధ్యతలను చూసుకోనుందిట.ఆలియానే ఆదర్శంమరో విషయం ఏమిటంటే పాప ఫోటోను మరికొన్ని పాటు రివీల్ చేయకుండా గోప్యంగా ఉంచాలని భావిస్తోందట. కొంచెం పెద్దయ్యాక మాత్రమే తన బేబీని ప్రపంచానికి పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో ఆలియాను ఫాలో కానుందట. ఐశ్వర్య తన కుమార్తె పుట్టినపుడు నానీనీ పెట్టుకోలేదట. ఇందుకు ఆమె అత్తగారు జయా బచ్చన్ కూడా 'హ్యాండ్-ఆన్-మామ్' అంటూ పొగిడింది కూడా. ఆ తరువాత అనుష్క శర్మ , అలియా భట్ ఇదే బాటలో నడిచిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ‘బాస్! నేనూ వస్తా..’! ఆంబులెన్స్ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్ వీడియో -
దీప్‌వీర్ బిడ్డను చూసేందుకు తరలివెళ్లిన అంబానీ
బాలీవుడ్ నటులు రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ దంపతులకు ఇటీవల (సెప్టెంబర్ 8)న ఆడబిడ్డ పుట్టింది. ఈ నేపథ్యంలో పలువురుబాలీవుడ్ పెద్దలు, ఇతర సెలబ్రిటీలకు ఈజంటకు అభినందనలు అందించారు. మరికొంతమంది స్వయంగా హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి వెళ్లి రణ్వీర్, దీపిక తొలి సంతానాన్ని ఆశీర్వదించారు. అలాగే దీపికా, రణ్వీర్ దంపతులతో సన్నిహిత సంబంధాలున్న, వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భారీ భద్రత మధ్య దక్షిణ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. రణ్వీర్, దీపికకు అభినందనలు తెలిపారు. వారి ముద్దుల తనయను ఆశీర్వదించారు.Mukesh Ambani made a late night visit to H.N. Reliance Hospital to meet Deepika, Ranveer and their baby.#DeepikaPadukone #RanveerSingh pic.twitter.com/4oLdspp7PN— Deepika Padukone Fanpage (@DeepikaAccess) September 10, 2024 కాగా బిలియనీర్ ముఖేష్ అంబానీ బాలీవుడ్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు. అంబానీ ఇంట ఏ పండుగ, ఏ వేడుక జరిగిన బాలీవుడ్ పెద్దలంతా అక్కడ హాజరు కావాల్సిందే. అనంత్, రాధిక ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు, మొన్న అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ అతిరథ మహారథులంతా తరలి వచ్చారు. అయితే గర్భంతో ఉన్న నేపథ్యంలో దీపికా రాలేకపోయినప్పటికీ, రణ్వీర్ అనంత్ , రాధిక వివాహ వేడుకల్లో ప్రత్యేక డ్యాన్స్‌తో అలరించారు. -
బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. అభినందనల వెల్లువ!
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె బిడ్డకు జన్మనిచ్చారు. శనివారం సాయంత్రం ముంబయిలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికెళ్లిన దీపికా పదుకొణెకు ఇవాళ పండంటి ఆడబిడ్డ పుట్టింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న దీపికా, రణ్‌వీర్‌సింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. కాగా.. ఇటీవలే కల్కి మూవీతో అభిమానులను అలరించింది దీపికా పదుకొణె. 2018లో పెళ్లి చేసుకున్న దీపిక-,రణ్వీర్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. దీపికా గర్భంతో ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సెప్టెంబర్‌లో మొదటి బిడ్డను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఇవాళ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కాగా.. మొదటిసారి రామ్ లీలా చిత్రంలో దీపికా - రణ్వీర్ జంటగా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ అనంతరం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. -
ఆస్పత్రికి వెళ్లిన కల్కి భామ.. త్వరలోనే గుడ్‌న్యూస్!
బాలీవుడ్ భామ దీపికా పదుకొణె త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించిన ముద్దుగుమ్మ.. ఈ నెలలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నెలాఖరులోహా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పనుంది. తాజాగా తన తల్లి ఉజ్జల పదుకొణెతో కలిసి ముంబయిలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే దీపికా పదుకొణె రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రి వెళ్లనట్లు తెలుస్తోంది. ఇటీవలే తన భర్తతో కలిసి సిద్ధివినాయక ఆలయంలో పూజలు నిర్వహించారు. కొద్ది రోజుల క్రితమే తన భర్తతో కలిసి మెటర్నిటీ ఫోటో షూట్ పిక్స్ పంచుకున్నారు. షేర్ చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఫోటోలు వైరలయ్యాయి.ప్రస్తుతం గర్భంతో ఉన్న దీపికా పదుకొణె సినిమాలకు విరామం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి షూటింగ్స్‌లో పాల్గొనదని తెలుస్తోంది. ఇటీవలే ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి కల్కి 2898 ఏడీ సినిమాతో అభిమానులను అలరించింది. కల్కి పార్ట్-2 లోనూ దీపికా కనిపించనుంది. అంతే కాకుండా బాలీవుడ్ మూవీ సింగం ఎగైన్లోనూ నటించనుంది. -
ముంబై సిద్ధి వినాయకుడి ఆశీస్సులు తీసుకున్న దీపికా పదుకొణె దంపతులు
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణే, రణ్వీర్ సింగ్ దంపతులు ముంబైలో ప్రసిద్ధమైన సిద్ధి వినాయక మందిరాన్ని తాజాగా దర్శించుకున్నారు. కొద్దిరోజుల్లో తల్లిదండ్రులు కాబోతున్న ఈ దంపతులు వినాయకుడి ఆశీస్సులు తీసుకునేందుకు ఆలయానికి వచ్చారు. స్వామిని దర్శించుకున్న అనంతరం వారిద్దరూ ఎరుపు రంగు దారాన్ని తమ చేతికి కట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.2018లో దీపికా పదుకొణే, రణ్వీర్ సింగ్ వివాహంతో ఒక్కటయ్యారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భంతో ఉందని అభిమానులతో తొలిసారి అధికారికంగా పంచుకున్నారు. సెప్టెంబర్‌లో తమ జీవితంలో బిడ్డను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అందుకే ఇప్పటికే ముంబయిలో అత్యంత ఆధునాతన సౌకర్యాలతో లగ్జరీ విల్లాను నిర్మిస్తున్నారు. బిడ్డ పుట్టాకే ఆ ఇంట్లోకి వెళ్లనున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది.దీపికా పదుకొణె సెప్టెంబర్ 28న ముంబయిలోనే బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. కానీ, మొదట ప్రసవం కోసం లండన్‌కు వెళ్లనున్నారని కూడా వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం దక్షిణ ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోనే ఆమె డెలివరీకి కానున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల కల్కితో అభిమానులను అలరించిన దీపికా ప్రస్తుతం ప్రెగ్నెన్సీ క్షణాలను ఆస్వాదిస్తోంది. దీంతో ఆమె వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి షూటింగ్‌లోనూ పాల్గొనే అవకాశం లేదు. ఆ తర్వాతే కల్కి పార్ట్-2లో సెట్స్‌లో కనిపించే అవకాశముంది. View this post on Instagram A post shared by Voompla (@voompla) -
బేబీ బంప్ 'ఫోటోలు' షేర్ చేసిన దీపికా పదుకోనె (ఫొటోలు)
-
దీపికా పదుకొణెకు ప్రెగ్నెన్సీ.. అందుకోసం లండన్ వెళ్తున్నారా?
బాలీవుడ్ మోస్ట్ పాపులర్ జంటల్లో దీపికా పదుకొణె - రణ్వీర్ సింగ్ జంట ఒకరు. ఇప్పటికే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించిన ఈ కపుల్ త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భంతో ఉందని అభిమానులతో తొలిసారి అధికారికంగా పంచుకున్నారు. సెప్టెంబర్‌లో తమ జీవితంలో బిడ్డను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అందుకే ఇప్పటికే ముంబయిలో అత్యంత ఆధునాతన సౌకర్యాలతో లగ్జరీ విల్లాను నిర్మిస్తున్నారు. బిడ్డ పుట్టాకే ఆ ఇంట్లోకి వెళ్లనున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది.అయితే దీపికా పదుకొణె సెప్టెంబర్ 28న ముంబయిలోనే బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. మొదట ప్రసవం కోసం లండన్‌కు వెళ్లనున్నారని వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం దక్షిణ ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోనే డెలివరీకి కానున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల కల్కితో అభిమానులను అలరించిన దీపికా ప్రస్తుతం ప్రెగ్నెన్సీ క్షణాలను ఆస్వాదిస్తోంది. దీంతో ఆమె వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి షూటింగ్‌లోనూ పాల్గొనే అవకాశం లేదు. ఆ తర్వాతే కల్కి పార్ట్-2లో సెట్స్‌లో కనిపించే అవకాశముంది. కాగా.. దీపికా చివరిసారిగా కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న సింగం ఎగైన్‌లో రణ్వీర్ సింగ్‌తో కలిసి నటించనుంది. -
రూ.100 కోట్లతో దీపికా పదుకొణె లగ్జరీ విల్లా.. చేరేది ఎప్పుడంటే !
బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ మూవీతో తెలుగు ఆడియన్స్‌ను మెప్పించింది. అయితే ప్రస్తుతం గర్భంతో ఉన్న దీపికా సినిమాలకు దూరంగా ఉంటోంది. రణ్వీర్ సింగ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ ఈ ఏడాదిలోనే అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. బేబీ బంప్‌తోనే కల్కి మూవీ ప్రమోషన్లలో పాల్గొంది. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారు.రూ.100 కోట్లతో భవనం..అయితే బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఒకరైన దీపికా పదుకొణె, రణ్‌వీర్‌సింగ్ తమ కలల సౌధాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మన్నత్‌కు సమీపంలోనే వీరి లగ్జరీ భవనాన్ని నిర్మిస్తున్నారు. సముద్రానికి ఎదురుగా ఉన్న బాంద్రాలో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ బంగ్లా దాదాపు చివరిదశకు చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దీపికా పదుకొణె కొత్త ఇంటికి చేరనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే సకల సౌకర్యాలతో తమ కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నారు. వచ్చే నెలలో బిడ్డ పుట్టాక బాంద్రాలో ఉన్న తమ కొత్త ఇంట్లో అడుగుపెట్టనుంది దీపికా- రణ్వీర్ జంట. గతంలో ఈ జంట 2021లో అలీబాగ్‌లో రూ.22 కోట్ల విలువైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు.దీపికా- రణ్వీర్ ప్రేమకథ..2013లో వీరిద్దరు కలసి నటించిన హిట్ మూవీ గోలియోన్ కి రాస్లీలా: రామ్-లీలా సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాతే డేటింగ్ ప్రారంభించారు. మరో బ్లాక్‌బస్టర్ చిత్రం బాజీరావ్ మస్తానీలో కూడా కలిసి నటించారు. 2018లో ఇటలీలో ఒక సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా.. మరోసారి ఈ జంట సిల్వర్ స్క్రీన్‌పై మెరవనుంది. సింగం ఎగైన్‌లో వీరిద్దరు కనిపించనున్నారు. ఆ తర్వాత రణ్‌వీర్‌సింగ్ డాన్ 3లో కూడా నటించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
చైతూతో ఎంగేజ్మెంట్ తర్వాతా.. మారిపోయిన శోభిత ఇమేజ్...
-
ఐటం సాంగ్‌లో శోభిత ధూళిపాళ.. చై ఒప్పుకుంటాడా?
నాగచైతన్య- శోభిత ధూళిపాళ.. ఇద్దరూ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఆ ప్రేమను ఎన్నడూ బయటపెట్టలేదు. తమ మధ్య ఏమీ లేదన్నట్లుగానే ప్రవర్తించారు. కలిసి షికార్లకు వెళ్లినా గుట్టుగా దాచారు. ఎట్టకేలకు ఈ దాగుడుమూతలకు స్వస్తి పలుకుతూ ఈ మధ్యే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 8న ఇరు కుటుంబసభ్యులు తాంబూలాలు మార్చుకున్నారు. వీరి వివాహం ఈ ఏడాది చివర్లోనో లేదా వచ్చే ఏడాది మార్చిలోనో ఉందని ప్రచారం జరుగుతోంది.ఐటం సాంగ్ ఆఫర్అప్పటివరకు ఇద్దరూ తమ సినిమా పనులతో బిజీగా ఉండనున్నారు. తాజాగా శోభితకు బాలీవుడ్ నుంచి ఊహించని ఆఫర్ వచ్చిందట! మునుపెన్నడూ చేయని రోల్ ఇచ్చారట.. అదే ఐటం సాంగ్! రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న డాన్ 3లో శోభితను భాగం చేయాలని దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట! ఐటం సాంగ్ చేయాలంటూ శోభితకు ఆయన ఆఫర్ ఇచ్చారంటూ ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. శోభిత ఆన్సర్ ఏమై ఉంటుంది?ఈ క్రమంలో ఫర్హాన్ అక్తర్- శోభిత పలుమార్లు భేటీ కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు భోగట్టా! మరి శోభిత.. ఐటం సాంగ్‌కు ఓకే చెప్తుందా? లేదా ఆఫర్ తిరస్కరిస్తుందా? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయినా శోభిత ఐటం సాంగ్ చేసేందుకు చై ఒప్పుకుంటాడా? అని మరికొందరు సందేహిస్తున్నారు. అసలు డాన్ 3లో శోభిత పాత్ర ఉందా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!చదవండి: ఆడాళ్లకు మంచి లైఫ్ ఎక్కడుంది?: మంచు లక్ష్మి -
ఒలింపిక్స్‌లో పతకం మిస్.. లక్ష్యసేన్‌పై రణ్వీర్ సింగ్ ప్రశంసలు!
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్‌పై బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రశంసలు కురిపించారు. తాజాగా పారిస్‌లో జరుగుతన్న ఒలింపిక్స్‌లో కాంస్యపతకం దక్కకపోవడంపై స్పందించారు. పురుషుల బ్యాడ్మింటన్‌లో సెమీఫైనల్ చేరుకున్న తొలి భారత షట్లర్‌గా రికార్డ్ సృష్టించాడని రణ్వీర్ కొనియాడారు. ప్రస్తుతం నీ వయస్సు 22 ఏళ్లేనని.. మరో రోజు నువ్వు పోరాడాలంటూ మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు.నువ్వు ఓడిపోయినప్పటికీ నీ ప్రయత్నం గొప్పదని రణ్వీర్ సింగ్ ప్రశంసలతో ముంచెత్తారు. ఒలింపిక్స్‌లో నీ చురుకుదనం, ప్రదర్శన, ఏకాగ్రత అద్భుతంగా ఉందన్నారు. నిన్ను చూసి గర్వపడుతున్నానని.. నువ్వు ఒక స్టార్.. నీ కెరీర్ ఇప్పుడే ప్రారంభమైందని పోస్ట్‌లో రాసుకొచ్చారు. భవిష్యత్తులో రాబోయే యువతకు నువ్వు ఒక ఆదర్శమని రణ్వీర్ సింగ్ మద్దతుగా నిలిచారు. కాగా.. ఒలింపిక్స్‌లో జరిగిన కాంస్య పతక పోరులో మలేషియా ప్లేయర్ చేతిలో ఓటమి చెందారు. -
Ranveer Singh: ఆ ఠీవీ, ఆ దర్పం.. మహారాజులా ఉన్నాడే! (ఫోటోలు)
-
అనంత్ అంబానీ పెళ్లి.. నాగిని డ్యాన్స్‌తో అదరగొట్టిన స్టార్ హీరో!
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తనయుు అనంత్ అంబానీ పెళ్లి ముంబయిలో అత్యంత వైభవంగా జరిగింది. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ జూలై 12న వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లిలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పలువురు ప్రముఖ సినీతారలు సందడి చేశారు. నగరంలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుకకు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, మహేశ్ బాబు సతీసమేతంగా హాజరయ్యారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు కూడా హాజరైన నూతన వధువరూలను ఆశీర్వదించారు.అయితే ఈ పెళ్లిలో జరిగిన బరాత్‌లో బాలీవుడ్ హీరో, దీపికా పదుకొణె భర్త రణ్వీర్ సింగ్ సందడి చేశారు. అర్జున్ కపూర్, వీర్ పహారియాతో కలిసి స్టెప్పులు వేశారు. నాగిని డ్యాన్స్ చేస్తూ రణ్వీర్ సింగ్ అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by PopDiaries Spotlight (@popdiaries.bollywood) -
అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు
అంబానీల ఇంట్లో పెళ్లి గురించి ఎంత మాట్లాడుకున్నా తరగదు అన్నట్లు ఉంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా ఏదో ఓ పేరుతో ఫంక్షన్ నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా ముఖ్యమైన పెళ్లి వేడుక కూడా జరిపించారు. దీనికి బాలీవుడ్, టాలీవుడ్, టీమిండియా క్రికెటర్లతో పాటు ప్రధానమంత్రి స్థాయి నుంచి ముఖ్యమంత్రులు వరకు చాలామంది హాజరై, హాట్ టాపిక్ అయిపోయారు. ఇదంతా పక్కనబెడితే అనంత్.. తన స్నేహితులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!)ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ పెళ్లి వేడుక కనివినీ ఎరుగని రీతిలో జరిగింది. దాదాపు రూ.5000 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే అనంత్‌కి బాలీవుడ్లో బోలెడంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్లలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్వీర్ సింగ్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు వీళ్లకే తన పెళ్లి సందర్భంగా అనంత్ అంబానీ ఖరీదైన వాచీలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.లగ్జరీ వాచీలకు పెట్టింది పేరైన 'అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్' అనే వాచీనీ అనంత్ బహుమతులుగా ఇచ్చాడు. మార్కెట్లో ఒక్క వాచీ ధర రూ.2 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. వీటితో షారుక్, రణ్వీర్ పోజులిచ్చిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో స్పెషల్ ఎట్రాక్షన్ వీళ్లదే.. పిక్ అదిరిపోయింది!) View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) -
'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?
'హనుమాన్'తో ఓవర్ నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి ప్రశాంత్ వర్మ. అప్పటివరకు తెలుగులో పలు సినిమాలు తీసినప్పటికీ ఓ మాదిరి గుర్తింపు వచ్చింది. ఎప్పుడైతే 'హనుమాన్' థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకుందో ప్రశాంత్ వర్మ పేరు మార్మోగిపోయింది. సర్వత్రా ప్రశంసలు దక్కాయి. తర్వాత చేయబోయే ప్రాజెక్టుల్లో ఇతడు బిజీగా ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు ప్రశాంత్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది.(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. ఆవేదనతో మంచు విష్ణుకు నటి హేమ లేఖ)'హనుమాన్' తర్వాత దీనికి సీక్వెల్‌గా 'జై హనుమాన్' ఉందని ప్రకటించారు. త్వరగా ఈ మూవీ వస్తే బ్రేక్ ఇద్దామని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మ మాత్రం వేరే ప్రాజెక్టులు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. అలా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో 'రాక్షసుడు' అనే మూవీ ఓకే అయిందని కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. అనంతరం కొన్నాళ్లకు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాక్ వినిపించింది.ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ షాకింగ్ ట్వీట్ పెట్టాడు. 'ప్రతి తిరస్కరణ ఏదో ఒకరోజు తిరిగి ఆశీర్వాదం అవుతుంది' అని రాసుకొచ్చాడు. దీంతో ఎవరికీ తోచింది వాళ్లు అనేసుకుంటున్నారు. హీరో రణ్వీర్ సింగ్ రిజెక్ట్ చేయడమే ఈ ట్వీట్‌కి కారణమని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత? అసలేం జరిగిందనేది ప్రశాంత్ వర్మ చెప్తే తప్ప క్లారిటీ రాదు!(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్‌లు.. ఎక్కువగా ఆ రోజే!)One day you realise every rejection was a blessing in disguise! :)— Prasanth Varma (@PrasanthVarma) July 8, 2024 -
యంగ్ హీరోకి వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పిన స్టార్ హీరో
సాధారణంగా పుట్టినరోజు విషెస్ అంటే ట్వీట్ లేదంటే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి విషెస్ చెప్పొచ్చు. కానీ కొందరు మాత్రం డిఫరెంట్‌గా ట్రై చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇలానే ప్రయత్నించాడు. తన తోటీ హీరో అయిన రణ్వీర్ సింగ్‌కి క్రేజీ వీడియోతో శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇప్పుడిది వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'కల్కి' రికార్డుల పరంపర.. నైజాం, ఓవర్సీస్లో తగ్గేదే లే)బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో వీళ్లిద్దరూ కలిసి సూర్యవంశీ, సింగం-2 సినిమాల్లో కలిసి నటించారు. అలా వీరిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా రణ్వీర్ పుట్టినరోజు సందర్భంగా అక్షయ్ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసి మరీ విషెస్ చెప్పాడు.గతంలో మూవీ షూటింగ్ టైంలో తీసిన పాత వీడియోలో భాగంగా రణ్వీర్, అక్షయ్ క్రేజీ స్టెప్పులేస్తూ కనిపించారు. ఇకపోతే విషెస్ చెబుతూ రణ్‌వీర్‌ని అక్షయ్ పవన్ హౌస్‌తో పోల్చడం విశేషం. నిజం చెప్పాలంటే బాలీవుడ్లో ఈ ఇద్దరు హీరోలు పవర్ హౌస్ లాంటివాళ్లే. కానీ గత కొన్నాళ్ల నుంచి వీళ్లకు సరైన హిట్ పడట్లేదు. (ఇదీ చదవండి: డైరెక్టర్ రాజమౌళి జీవితంపై మూవీ.. ఓటీటీలో నేరుగా రిలీజ్) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) -
చిత్ర విచిత్రమైన డ్రస్సులు.. ఈ స్టార్ హీరో రూటే సెపరేటు (ఫొటోలు)
-
ఆ హీరోతో నా సినిమా అందుకే ఆగిపోయింది: దర్శకుడు శంకర్
భారత అగ్రదర్శకుల్లో ఒక్కరైన శంకర్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు ఇండియన్-2 ఈ నెలలోనే రిలీజ్‌కు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఆ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారాయన. మరోవైపు రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ నిర్మాణంలో ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ రెండూ కాకుండా.... శంకర్ ఇండియన్ 3పైనా ఫోకస్ చేశాడు. తాను తర్వాత తీయబోయే చిత్రం అదేనని తాజాగానూ స్పష్టం చేశారాయన. దీంతో శంకర్ అప్‌కమింగ్ ప్రాజెక్టు ఇంకా ఏదైనా ఉందా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో చాలా కాలం కిందట ఆయన డైరెక్షన్లో రావాల్సిన ఓ సినిమా.. ఇప్పుడు తెర మీదకు వచ్చింది. అదే ‘అన్నియన్’(అపరిచితుడు) రీమేక్.He is a maverick and charismatic showman no one else can play!Welcome aboard, @RanveerOfficial Can't wait for this magnificent journey to begin mid 2022.⁰@jayantilalgada @PenMovies pic.twitter.com/LJueK4d8ra— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021బాలీవుడ్ క్రేజీ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా అన్నియన్ రీమేక్ చేయాలని శంకర్ భావించారు. ఇందు సంబంధించిన టెస్ట్ షూట్ చేసి.. ఆ ఫొటోలను సైతం రిలీజ్ చేశారు. అయితే ఎందుకనో ఆ ప్రాజెక్టు గురించి తర్వాత అప్డేట్ లేకుండా పోయింది. తాజాగా.. ఇండియన్ 2 ప్రమోషన్లో శంకర్ ఈ ప్రాజెక్టు గురించి స్పందించారు.He is a maverick and charismatic showman no one else can play!Welcome aboard, @RanveerOfficial Can't wait for this magnificent journey to begin mid 2022.⁰@jayantilalgada @PenMovies pic.twitter.com/LJueK4d8ra— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021‘‘రణ్వీర్తో అన్నియన్ను హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నాం. కానీ, ఆ తర్వాత మా ఆలోచనలన్నీ మారిపోయాయి. భారీ బడ్జెట్‌తో ఇతర భాషల్లో చిత్రాలు తీద్దామని, అది అన్నియన్ కంటే గొప్పగా ఉండాలని మా నిర్మాతలు నన్ను కోరారు. దీంతో ఆలోచనల్లో పడ్డాం. రణ్వీర్తో సినిమా ఉంటుంది. కానీ, అది అన్నియన్ రీమేక్ కాదు. అంతకు మించిన కథతో తప్పకుండా ఆయనతో సినిమా తీస్తా’’ అని శంకర్ ప్రకటించారు. -
హబ్బీతో బేబీమూన్‌కు : భార్య అంటే ఎంత ప్రేమో! వైరల్ వీడియో
త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే బేబీమూన్కోసం లండన్‌కు పయనమయ్యారు. ఇద్దరూ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో అందంగా మెరిసారు. విమానాశ్రయంలో దర్శన మిచ్చిన ఈ జంట వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ లవ్‌బర్డ్స్ ఇద్దరూ చేతిలో చేయివేసుకుని మరీ కనిపించడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అలాగే కారు దిగిన వెంటనే దీపికా వైపు పరుగెత్తుతూ వాహనం నుండి బయటకు వచ్చేందుకు సాయం చేస్తూ, తన భార్యను అపురూపంగా, జాగ్రత్తగా చూసుకుంటున్న తమ అభిమాన హీరోను చూసి ఫ్యాన్స్ మురిసి పోతున్నారు. View this post on Instagram A post shared by Voompla (@voompla)కాగా తన అప్‌కమింగ్ మూవీ ‘కల్కి 2898 AD’కి సంబంధించిన ముంబైలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో దీపికా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దీపికా పదుకొనే ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి. ప్రభాస్ సరసన తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. రానా హోస్ట్ చేసిన ఈ ఈవెంట్లో ప్రభాస్‌తోపాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు. -
ఆగిపోయిన ప్రశాంత్ వర్మ సినిమా.. బాలీవుడ్ డెబ్యూకు బ్రేక్!
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో సూపర్‌డూపర్ హిట్ కొట్టాడు. దీంతో ఆయనతో కలిసి పని చేయాలని బాలీవుడ్ స్టార్స్ సైతం ఆశపడ్డారు. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ.. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి రాక్షస్ అనే టైటిల్ కూడా నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆగిపోయిన మూవీఇంతలోనే ఈ సినిమా ఆగిపోయినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. వీరి కాంబినేషన్లో ప్రాజెక్టు చేపట్టేందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. ఆ ప్రకటనలో ప్రశాంత్.. 'రణ్వీర్ చాలా ఎనర్జిటిక్ పర్సన్. ఎంతో టాలెంట్ ఉన్న ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి పని చేస్తాం అని పేర్కొన్నాడు.భవిష్యత్తులో..అటు రణ్వీర్ సింగ్ సైతం ప్రశాంత్ వర్మ టాలెంటెడ్ డైరెక్టర్. మేము కలిసి ఓ సినిమా చేయాలనుకున్నాం. అయితే ఫ్యూచర్లో తప్పకుండా కలిసి పని చేస్తాం అని తెలిపాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది హనుమాన్కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. An official statement from the team about #RanveerSingh’s Project with #PrasanthVarma and #MythriMovieMakers!!In a mutual understanding, the team decided to part ways with a possible collaboration in future. @RanveerOfficial @PrasanthVarma @MythriOfficial pic.twitter.com/OG2gqkwJMO— Ramesh Bala (@rameshlaus) May 30, 2024 చదవండి: కజ్రారే సాంగ్.. లైవ్‌లో డ్యాన్స్ మర్చిపోలేనన్న అమితాబ్.. -
Deepika Padukone : దీపికా పడుకోణె అమేజింగ్ లగ్జరీ కార్లు, విలువ ఎంతో తెలుసా?
బాలీవుడ్లో స్టార్ హీరోల హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా తానేంటో నిరూపించుకున్న అద్భుతమైన నటి దీపికా పదుకొణె. రెమ్యూనరేషన్ విషయంలో హీరోలతో పోటీ పడుతూ టాప్ నటుల్లో ఒకరిగా నిలిచింది. అందానికి తోడు నటనా నైపుణ్యంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో చోటు సంపాదించింది. అంతేనా మూడు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ టైమ్ మ్యాగజీన్ 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచింది. 2022లో టైమ్100 ఇంపాక్ట్ అవార్డు సొంతం చేసుకుంది.అద్భుతమైన నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌ను పెళ్లాడి పవర్ కపుల్ స్టేటస్‌ను దక్కించుకుంది. త్వరలో దీపికా, రణ్వీర్ జంట త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. లగ్జరీ కార్లు, బంగ్లా లాంటి విలాసవంతమైన జీవనశైలి వారి సొంతం. ఈ నేపథ్యంలో దీపికా గ్యారేజ్ కొలువుదీరిని లగ్జరీ వాహనాలకు గురించి తెలుస్తే షాక్ అవ్వాల్సిందే,. ఎందుకంటే దీపికా మొత్తం కార్ కలెక్షన్ విలువ రూ. 10 కోట్లు. దీపికా పదుకొణె కార్ కలెక్షన్..ఆడి క్యూ7 – ధర రూ. 80 లక్షలుమెర్సిడెస్ మేబ్యాక్ S500 – రూ. 2.40 కోట్లురేంజ్ రోవర్ వోక్ – రూ. 1.40 కోట్లుమినీ కూపర్ కన్వర్టిబుల్ – రూ. 45 లక్షలుమెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్- రూ. 1.60 కోట్లుఆడి A8 L- రూ. 1.20 కోట్లుఆడి A6- రూ. 55 లక్షలుBMW 5 సిరీస్- రూ. 60 లక్షలుపోర్షే కయెన్- రూ. 1 కోటిప్రస్తుతం దీపికా పదుకొణె కల్కి 2898 ఏడీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అలాగే "సింగం ఎగైన్"లో అనే మూవీలోనూ నటిస్తోంది. ఇందులో పోలీసు యూనిఫాంలో యాక్షన్ సన్నివేశాల్లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. -
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ల పెళ్లి ముచ్చట మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుని, ప్రీ వెడ్డింగ్ బాష్‌ను ఘనంగా నిర్వహించుకున్న లవ్‌బర్డ్స్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఛలో ఇటలీ..ఈ ఏడాది మార్చిలో జామ్‌నగర్‌లో వారి గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల తర్వాత, అనంత్ -రాధిక మర్చంట్ ఇటలీ నుండి ఫ్రాన్స్‌కు ప్రయాణించే క్రూజ్‌లో మూడు రోజుల వేడుకను నిర్వహించనున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా మరో ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించుకునేందుకు రడీగా ఉన్నారు. ఈ వేడుక కోసం బాలీవుడ్, క్రీడా, రాజకీయ రంగ ప్రముఖులు ఇటలీకి పయనమయ్యారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీతోపాటు,అనిల్ అంబానీ , కాబోయే వధువు రాధిక తండ్రితో కలిసి వెళ్లారు. ( ఇదీ చదవండి: అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ బాష్ : 800 మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?)అలాగే రాధిక-అనంత్‌కు మంచి స్నేహితులు బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ తన ముద్దుల తనయ రాహాలతో కలిసి బయలుదేరారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అలాగే ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి, పాపతో కలిసి ఎయిర్ పోర్ట్‌లో దర్శనిచ్చారు. అంతేనా సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ ఇంకా బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. (చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్ : రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా)కాగా అనంత్-రాధిక రెండవ ప్రీ వెడ్డింగ్ బాష్ మే 28వ తేదీనుంచి 30 మధ్య దక్షిణ ఫ్రాన్స్ తీరంలో క్రూయిజ్ షిప్లో జరుగుతందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. క్రూయిజ్ ఇటలీ నుండి బయలుదేరి, 2365 నాటికల్ మైళ్లు (4380 కిమీ) దూరం ప్రయాణించి దక్షిణ ఫ్రాన్స్‌లో ఉన్న వేదికకు చేరుకుంటుంది. -
బేబీ బంప్‌తో దీపిక క్యూట్‌గా, అపురూపంగా చూసుకున్న రణవీర్
View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన ఓటు హక్కును వినియోగించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల 5వ దశ పోలింగ్‌సందర్భంగా ముంబైలో పోలింగ్ స్టేషన్‌కు భర్త,స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా త్వరలో తల్లికాబోతున్న దీపికాను భర్త చేయిపట్టుకుని జాగ్రత్తగా పోలింగ్ బూత్ వద్దకు తీసు కెళ్లాడు. తెల్లటి చొక్కా , నీలిరంగు జీన్స్‌లో పదిలంగా తన గర్భాన్ని దాచుకుంటూ క్యూట్‌గా కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబోయే తల్లిగా తొలిసారి నిండుగా కనిపించడంతో చూలింత కళ ఉట్టిపడుతోంది అంటూ కమెంట్ చేశారు ఫ్యాన్స్ . దిష్టి తగల గలదు అంటూ కూడా కమెంట్ చేశారు.దీపికా-రణవీర్జంట ఈ ఏడాది సెప్టెంబరులోతమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అనేక హిట్ సినిమాలతో దూసుకుపోతున్న దీపిక రణవీర్‌ను ప్రేమ వివాహం చేసుకునంది. కొట్టిన దీపిక రణవీర్ సింగ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. సినిమా పరంగా దీపికా 'సింగం 3' ,'కల్కి’లో కనిపించనుంది. మరోవైపు రణవీర్ ఫర్హాన్ అక్తర్ 'డాన్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
పెళ్లి ఫోటోలు డిలీట్.. ఎయిర్‌పోర్ట్‌లో మెరిసిన స్టార్ కపుల్!
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ జంట ఒకరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. దీపికా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఈ దంపతులు ప్రకటించారు. త్వరలోనే ఈ జంట తమ మొదటి బిడ్డను జీవితంలోకి ఆహ్వానించనున్నారు.అయితే తాజాగా రణ్వీర్ సింగ్ తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. దీంతో వీరిద్దరిపై మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ జంట ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో మెరిసింది. రణవీర్‌తో కలిసి తిరిగివచ్చిన దీపికా జంటగా కనిపించారు. అయితే పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంపై ఇప్పటివరకు రణ్వీర్ సింగ్ స్పందించలేదు. దీపికా ఈ ఏడాది సెప్టెంబరులో తమ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.దీపికా సినిమాల విషయానికొస్తే రణవీర్ సింగ్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్లతో కలిసి సింఘమ్ ఎగైన్‌లో కనిపించనుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీలతో కల్కి 2898 ఏడీ చిత్రంలో నటించింది. మరోవైపు రణవీర్ సింగ్, కియారా అద్వానీ జంటగా డాన్- 3 చిత్రంలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సినిమా ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకోనుందా? అవును సోషల్ మీడియాలో ఇప్పుడు కొత్తగా ఈ చర్చే నడుస్తోంది. ఎందుకంటే సదరు హీరో ఇన్ స్టాలో ఉండాల్సిన పెళ్లి ఫొటోలు కనిపించట్లేదు. దీంతో పలు అనుమానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అసలు ఏమై ఉంటుందబ్బా అని అభిమానులు, నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఇందులో నిజమెంత?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే. అయితే వీళ్లలో కొందరు కలిసి ఉంటుంటే.. మరికొందరు మాత్రం మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి బాలీవుడ్ కపుల్ రణ్వీర్ - దీపిక చేరబోతున్నారా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే రణ్వీర్ తన ఇన్ స్టా ఖాతాలోని పెళ్లి ఫొటోల్ని డిలీట్ చేశాడు. దీంతో లేనిపోని అనుమానాలు వచ్చాయి.దీపిక ఇన్ స్టాలో ఉన్నాయి కానీ రణ్వీర్ ఖాతాలో మాత్రం పెళ్లి ఫొటోలు కనిపించట్లేదు. అయితే దీపికతో కలిసున్న మిగతా ఫొటోలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాదన్నట్లు దీపిక ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఇలాంటి టైంలో విడాకులు రూమర్ అనేది నమ్మేలా అనిపించట్లేదు. పెళ్లి పిక్స్ కనిపించకుండా పోవడం బహుశా ఏదో పొరపాటు వల్ల అయ్యిండొచ్చని వీళ్ల ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ విషయమై క్లారిటీ రావాలంటే రణ్వీర్ స్పందించాల్సిందే. (ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?) View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) -
ప్రశాంత్ - రణవీర్ సినిమా స్టార్ట్! జై హనుమాన్ కంటే ముందుగానే..!
-
డైరెక్టర్ కూతురి రెండో పెళ్లి.. స్టెప్పులతో అదరగొట్టిన స్టార్స్
ప్రముఖ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఏప్రిల్ 15న జరిగిన ఈ వివాహ వేడుకకు రజనీకాంత్, సూర్య, కమల్ హాసన్ సహా దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన స్టార్స్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంగళవారం ఎంతో వైభవంగా రిసెప్షన్ నిర్వహించగా బాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా సౌత్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తమ డ్యాన్సులతో స్టేజీ దద్దరిల్లేలా చేశారు. వీరితోపాటు శంకర్ రెండో కూతురు, హీరోయిన్ అదితి శంకర్ కూడా ఎంతో హుషారుగా చిందేయడం విశేషం. ఇక వీరంతా తమిళ హిట్ సాంగ్స్‌కు కాలు కదిపారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐశ్వర్య శంకర్ గతంలో క్రికెటర్ దామోదర్ రోహిత్‌ను పెళ్లాడింది. ఇతడు ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు రావడంతో ఐశ్వర్య తన నుంచి విడాకులు తీసుకుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తరుణ్ కార్తికేయన్‌తో నిశ్చితార్థం జరగ్గా రెండు రోజులక్రితమే ఘనంగా వివాహం జరిపించారు. #RanveerSingh & #AditiShankar dancing for ThalapathyVijay & #Trisha's Apadi Podu Song 🤩🔥pic.twitter.com/RFXuZLSZo1 — Kolly Corner (@kollycorner) April 16, 2024 చదవండి: నువ్వు వర్జినా..? ముందు నీ పెళ్లి గురించి చెప్పమన్న హీరోయిన్ తనయుడు -
Deepika Padukone: ఫైనల్లీ ఆ టాటూని తొలగించిన దీపికా పదుకొణె!
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్లో దీపికొ పదుకొణె- రణ్వీర్ సింగ్ జంట ఒకటి. రామ్ లీలా సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట.. 2018 నవంబర్ 14న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. త్వరలోనే ఈ బ్యూటీ ఓ బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భం దాల్చిందనే విషయాన్ని రణ్వీర్ వెల్లడించాడు. తాజాగా ఈ భామ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో చర్చనీయాంశంగా మారింది. శనివారం దీపికా తన ఇన్‌స్టా ఖాతాలో ఓ ఫోటోని షేర్ చేసింది.అందులో ఆమె మెడ కనిపించేలా వెనుక వైపు తిరిగి ఉంది. గతంలో ఆమె వీపు భాగంపై ఓ టాటూ ఉండేది. ఇప్పుడది కనిపించలేదు. ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో రణ్వీర్ సింగ్‌తో పెళ్లి కంటే ముందు దీపికా పదుకొణె మరో స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమాయణం కొనసాగించింది. ఈ ఇద్దరి ప్రేమ విషయం బాలీవుడ్ అంతా తెలుసు. పెళ్లి కూడా చేసుకుంటారని అంతా భావించారు. కానీ కారణం ఏంటో తెలియదు కానీ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రణ్‌బీర్‌తో స్నేహం ఏర్పడడం..అది కాస్త ప్రేమగా మారడంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే రణ్‌బీర్‌తో ప్రేమలో ఉన్న సమయంలో దీపికా తన వీపుపై RK(రణ్‌బీర్ కపూర్ షార్ట్ కట్) అని టాటూ వేయించుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆ టాటూని చెరిపేయలేదు. దీంతో అప్పట్లో ఈ టాటూపై బాలీవుడ్లో పెద్ద చర్చే జరిగింది. కానీ దీపికా మాత్రం ఆ టాటూపై స్పందించలేదు. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలో ఆ టాటూ కనిపించకపోవడంతో.. ప్రెగ్నెంట్ అయిన తర్వాత దీపికా ఆ టాటూని తొలగించిందనే నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన కల్కీ 2898 ఏడీ చిత్రంలో నటిస్తోంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
ఇప్పుడిదే ట్రెండ్.. రజనీ రెండు సినిమాల్లోనూ..!
సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైభీమ్' ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టైయాన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం. ఇదిలా ఉంటే జూన్ నెలలో ప్రారంభం కానున్న రజనీ 171వ చిత్రానికి సంబంధించిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కారణం ఈ చిత్రానికి లోకేష్‌కనకరాజ్ దర్శకత్వం వహించడమే! సపోర్టింగ్ రోల్స్.. రజనీకాంత్ ఇటీవల కాలంలో తన చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల కోసం ఇతర భాషలకు చెందిన స్టార్ నటులను వాడుకుంటున్నారు. జైలర్ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్‌లు అతిథి పాత్రల్లో నటించారు. అలాగే తాజాగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. షారుక్ 'నో'.. రణ్వీర్ 'ఓకే' త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న రజనీకాంత్ 171 చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ముందుగా షారుక్ ఖాన్‌ను నటింపజేయడానికి లోకేష్ కనకరాజ్ ప్రయత్నించగా, ఆయన నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ చిత్రానికి కళుగు (తెలుగులో గద్ద) అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో రజనీకాంత్‌తో కలిసి బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్ నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తాజా సమాచారం. అయితే ఆయన ఇందులో సపోర్టింగ్ పాత్రను పోషిస్తారా?లేక ప్రతినాయకుడిగా నటిస్తారా? అన్నది సస్పెన్స్! చదవండి: మలయాళంలో రూ.200 కోట్లు వసూలు చేసిన మంజుమ్మల్ బాయ్స్ ఎలా ఉంది? -
ఛీ, ఒంటి మీద దుస్తుల్లేకుండా కనిపించే ఆ హీరోనా?: నటుడు ఫైర్
ఇండియా ఫస్ట్ సూపర్ హీరో శక్తిమాన్.. ఈ సూపర్ హీరో పాత్రలో నటుడు ముకేశ్ ఖన్నా నటించాడు. నటించాడు అనడం కన్నా జీవించాడనే చెప్పాలి. అయితే కొన్నాళ్లుగా శక్తిమాన్ మళ్లీ రాబోతున్నాడని ప్రచారం జోరందుకుంది. అయితే ఈసారి టీవీలో కాకుండా వెండితెరపై రానుందని, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నోరు విప్పక తప్పట్లేదు ఈ క్రమంలో సదరు వార్తలపై ముకేశ్ ఖన్నా స్పందించాడు. 'రణ్వీర్ సింగ్ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని కొన్ని నెలలుగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై చాలామంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. నేను మాత్రం సైలెంట్‌గానే ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఛానల్స్ కూడా రణ్వీర్ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని ప్రచారం మొదలుపెట్టాయో.. అప్పుడే ఇక నోరు విప్పక తప్పదని నిర్ణయించుకున్నాను. అయినా ఒంటిమీద నూలు పోగు లేకుండా ఫోటోషూట్లు చేసే వ్యక్తి శక్తిమాన్‌గా కనిపిస్తాడా? ఇదేమైనా బాగుందా అసలు? ఎంత పెద్ద స్టార్ అయితే ఏంటి? అతడు ఎంత పెద్ద స్టార్ అయితే ఏంటి? నేనైతే నా అభిప్రాయం చెప్పాను. ఇప్పుడేమవుతుందో చూద్దాం.. విచ్చలవిడితనం సర్వసాధారణమైన విదేశాల్లో రణ్వీర్ తనకు నచ్చిన పాత్రలు చేస్తే బాగుంటుంది. నేను నిర్మాతలతో కూడా మాట్లాడాను. శక్తిమాన్ అంటే సూపర్ హీరో మాత్రమే కాదు సూపర్ టీచర్ అని నొక్కి చెప్పాను! ఒక నటుడు ఆ పాత్ర చేస్తున్నాడంటే చక్కగా మాట్లాడగలగాలి, జనాలు అతడు చెప్తే వినగలిగేలా ఉండాలి. కొందరు హీరోలు పేరుకే పెద్ద.. కానీ వారి ఇమేజ్ ఎప్పుడూ చిన్నగానే ఉంటుంది' అని సెటైర్లు వేశాడు ముకేశ్. View this post on Instagram A post shared by Mukesh Khanna (@iammukeshkhanna) చదవండి: లైసెన్స్ పొందా.. దుబాయ్‌లోనే ఉంచా.. అందులో తిరుగుతుంటే మజా.. -
Ranveer Singh : గూఢచారిగా ‘రణ్వీర్ సింగ్?
హీరో రణ్వీర్ సింగ్, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్యాథార్ కాంబినేషన్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ప్రస్తుతం అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ‘సింగమ్ ఎగైన్ ’ సినిమాలో ఓ లీడ్ రోల్ చేస్తున్నారు రణ్వీర్ సింగ్. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ‘సింగమ్ ఎగైన్’ లో తన పాత్ర షూటింగ్ పూర్తి కాగానే ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్లో ‘డాన్ 3’ సెట్స్‌లో రణ్వీర్ జాయిన్ అవుతారు. ఆ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి రాగానే సూపర్ హీరో ఫిల్మ్ ‘శక్తిమాన్ ’ను రణ్వీర్ ప్రాంరంభించాలనుకున్నారు. కానీ ‘డాన్3’ సెట్స్‌కి వెళ్లేందుకు సమయం పడుతుందట. దీంతో ఈ లోపు ఆదిత్యాథార్ చెప్పిన ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట రణ్వీర్. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రణ్వీర్ రోల్ కొత్తగా ఉంటుందని బీ టౌన్ టాక్. ఈ చిత్రంలో రణ్వీర్ గూఢచారిగా కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. వేసవి నుంచి చిత్రీకరణను ప్లాన్ చేస్తున్నారట. -
ప్రెగ్నెన్సీ ప్రకటించారో లేదో.. ‘ట్విన్స్’ అంటూ సందడి చేస్తున్న ఫ్యాన్స్
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ త్వరలోనే తమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ శుభవార్తను ఫిబ్రవరి 29న సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు దీపికా, రణ్వీర్. ఈ సందర్బంగా ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. అంతేకాదు పుట్టబోయేది కవలలు అంటు తెగ చర్చిస్తున్నారు ఫ్యాన్స్. ప్రెగ్నెన్సీని అలా ప్రకటించారో లేదో, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారు అంటూ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. ఇందుకు ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్న బ్లూ, పింక్ షేడ్స్‌లో షూస్, టోపీలు, ఫ్రాక్, ఇతర బొమ్మలను ఉదహరిస్తున్నారు. పింక్ కలర్ ఆడ బిడ్డకు, బ్లూ కలర్ మగబిడ్డకు సంకేతం కాబట్టి, దీపికా రణ్వీర్ దంపతులకు ట్విన్స్ పుట్టబోతున్నారంటూ నెటిజన్లు పలు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఇంకా బేబీ ఎవరనేది తెలియదు కాబట్టి ఈ రెండు కలర్స్ పెట్టారని మరో యూజర్ ఈ వాదనను కొట్టిపారేశారు. కాగా దీపికా, రణ్వీర్ 2018,నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరులో పుట్టనున్న బిడ్డకోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పెళ్లి తరువాతనటులుగా ఇద్దరూ దూసుకుపోతున్నారు. రోహిత్ శెట్టి 'సింగం ఎగైన్', నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ'లో దీపిక నటిస్తుండగా, మరోవైపు రణ్వీర్ 'సింబా 2', 'డాన్ 3' ,'సింగమ్ ఎగైన్' చిత్రాల్లో కనిపించనున్నాడు. -
ప్రెగ్నెంట్.. అయినా డ్యాన్స్, దాండియా చేసిన స్టార్ హీరోయిన్
'అందరూ పెళ్లి చేసుకుంటున్నారు.. పిల్లల్ని కంటున్నారు? మరి మీరెప్పుడు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందుతారు?'.. ఈ ప్రశ్న వినీవినీ విసిగెత్తిపోయారు బావుడ్ స్టార్ జంట రణ్వీర్ సింగ్- దీపికా పదుకోణ్. దాదాపు ఐదేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2018లో పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే వీరు తల్లిదండ్రులం కాబోతున్నామంటూ గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్‌లో డెలివరీ డేట్ ఇచ్చారని వెల్లడించారు. స్టేజీపై డ్యాన్స్ ఈ విషయాన్ని పక్కన పెడితే అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంతో గ్రాండ్‌గా జరుగుతున్న సంగతి తెలిసిందే! ఈ వేడుకలకు ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. అందులో రణ్వీర్-దీపికా కూడా ఉన్నారు. అందరూ ఆడిపాడుతుంటే చూస్తూ కూర్చోవాలా? అనుకున్నారో ఏమో కానీ.. ఇద్దరూ కలిసి స్టేజీపై ఓ పాటకు డ్యాన్స్ చేశారు. అక్కడితో ఊరుకోలేదు. స్టేజీ దిగాక ఇద్దరూ దాండియా ఆడుతూ ఎంజాయ్ చేశారు. ప్రెగ్నెంట్ అయినా కూడా దీపిక ఇలా డ్యాన్స్, దాండియా చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆశ్యర్యపోతున్నారు. తన ముఖం కళతో వెలిగిపోతోందని కామెంట్స్ చేస్తున్నారు. దీపిక భర్తను బెదిరించిన ఓరీ మరోవైపు ఎక్కడ పార్టీ ఉంటే అక్కడ వాలిపోయే ఓరీ కూడా ఈ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యాడు. ఇంకేముంది.. దీపికాతో కలిసి ఫోటోకు పోజిచ్చాడు. ఈ ఫోటో తీయడానికి రణ్వీర్ అష్టకష్టాలు పడుతుంటే బాగా తీయమని బెదిరించాడు ఓరీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Deepika Padukone TR (@deepikainfinity) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) చదవండి: మొగలిరేకులు ఫేమ్ దయ మృతికి కారణాలివే! -
రణ్వీర్ దశావతార్
తమ అభిమాన హీరో బొమ్మ గీసి ముచ్చటపడే అభిమానులు మనకు కొత్తేమీ కాదు. అయితే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అభిమాని పౌమిల్ కత్రి వినూత్న శైలితో తన అభిమానాన్ని చాటుకున్నాడు. రకరకాల స్కెచ్‌లు ఉన్న పరికరంతో కాన్వాస్‌పై ఒకే సమయంలో వివిధ సినిమాలలోని రణ్వీర్ క్యారెక్టర్లను గీసి నెటిజనులను ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ‘మేడ్ 10 స్కెచెస్ ఆఫ్ రణ్‌వీర్‌సింగ్ ఎట్ ఏ సేమ్ టైమ్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియో చూసి ముచ్చటపడిన రణ్‌వీర్‌సింగ్ పౌమిల్ను ప్రశంసిస్తూ కామెంట్ పెట్టడం మరో విశేషం. ఇక టాలెంటెడ్ ఆర్టిస్ట్ పౌమిల్ కత్రి విషయానికి వస్తే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన కత్రికి ఇన్‌స్టాగ్రామ్‌లో వందలాదిమంది ఫాల్వర్స్ ఉన్నారు. -
జామ్‌నగర్ ఎయిర్‌పోర్టులో దీపికా-రణ్వీర్.. ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి.. (ఫోటోలు)
-
హ్యాపీ... హ్యాపీ
‘పేరెంట్స్‌గా ఎప్పుడు ప్రమోట్ అవుతారు?’ అనే ప్రశ్నకు పెళ్లయినప్పట్నుంచి చిరునవ్వే సమాధానంగా ఇస్తూ వచ్చారు రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్. ఫైనల్‌గా తాము తల్లిదండ్రులు కానున్నట్లు ఈ భార్యాభర్తలు గురువారం ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. సెప్టెం బర్లో డెలివరీ డేట్ ఇచ్చినట్లు దీపిక పేర్కొన్నారు. ఈ హ్యాపీ న్యూస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగానే పలువురు ప్రముఖులు రణ్వీర్–దీపికలకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు షేర్ చేశారు. ఇక 2013లో ‘రామ్‌లీల’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు రణ్వీర్, దీపిక. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందట. ఆ తర్వాత ‘పద్మావత్’ కోసం రణ్వీర్–దీపిక కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో విడుదల కాగా, అదే ఏడాది నవంబరులో రణ్వీర్, దీపిక ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. -
తల్లిదండ్రులు కాబోతున్న దీపికా పదుకొనే, రణవీర్ సింగ్
-
తల్లి కాబోతున్న దీపిక.. భర్తతో సంతోష క్షణాలు (ఫోటోలు)
-
స్టార్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. అఫీషియల్‌గా ప్రకటించిన దంపతులు!
బాలీవుడ్ స్టార్ మోస్ట్ క్రేజ్ ఉన్న కపుల్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్. ఈ జంటపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఈ ఏడాదిలో వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్లు నెట్టింట టాక్ వినిపించింది. ఇటీవల బాఫ్టా వేడుకల్లో పాల్గొన్న దీపికా పదుకొణె చీరకట్టులో కనిపించింది. ఆ తర్వాత దీపికా వదులుగా ఉండే ఔట్ఫిట్లో కనిపించింది. దీంతో దీపిక ప్రెగ్నెన్నీతో ఉందంటూ సోషల్ మీడియాలో వైరలైంది. తాజాగా అందరూ ఊహించినట్లుగానే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది బాలీవుడ్ జంట. దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని బాలీవుడ్ దంపతులు తమ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. ఇకపోతే దీపిక.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌ని 2018లో పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
విదేశాల్లో శిక్షణ
ఇంటర్నేషనల్ ట్రైనింగ్‌కు రెడీ అవుతున్నారు కియారా అద్వానీ. బాలీవుడ్ ‘డాన్’ ఫ్రాంచైజీలో వస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘డాన్ 3’. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న ‘డాన్ 3’లో కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రంలో రణ్వీర్, కియారా.. ఇద్దరికీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయట. దీంతో అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్స్ పర్యవేక్షణలో ఇద్దరూ స్టంట్స్ నేర్చుకోనున్నారని బాలీవుడ్ టాక్. విదేశాల్లో ఈ శిక్షణ జరుగుతుందని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది సెప్టెంబరులో ్ర΄ారంభం కానుందని తెలిసింది. -
డాన్‌తో లవ్‌లో పడ్డ కియరా అద్వానీ!
డాన్‌తో లవ్‌లో పడ్డారు హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్ ‘డాన్’ ఫ్రాంచైజీలో రూపొందనున్న తాజా సినిమా ‘డాన్ 3’. రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్న ఈ సినిమాను దర్శక–నిర్మాత – నటుడు–రైటర్ ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘‘కొత్త శకం మొదలైంది. ‘డాన్’ యూనివర్స్‌లోకి కియారాకు స్వాగతం’’ అని ‘డాన్ 3’ మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో కియారాకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయట. ‘‘ఐకానిక్ ‘డాన్ 3’ ఫ్రాంచైజీలో భాగం కావడం థ్రిల్‌గా ఉంది’’ అన్నారు కియారా అద్వానీ. Welcome to the Don universe @advani_kiara #Don3@RanveerOfficial @ritesh_sid @PushkarGayatri @J10Kassim @roo_cha @vishalrr @excelmovies @chouhanmanoj82 #Olly pic.twitter.com/T5xGupgHiF — Farhan Akhtar (@FarOutAkhtar) February 20, 2024 -
డాన్ ప్రేయసి
డాన్‌తో లవ్‌లో పడ్డారు హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్ ‘డాన్’ ఫ్రాంచైజీలో రూపొందనున్న తాజా సినిమా ‘డాన్ 3’. రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్న ఈ సినిమాను దర్శక–నిర్మాత – నటుడు–రైటర్ ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘‘కొత్త శకం మొదలైంది. ‘డాన్’ యూనివర్స్‌లోకి కియారాకు స్వాగతం’’ అని ‘డాన్ 3’ మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో కియారాకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయట. ‘‘ఐకానిక్ ‘డాన్ 3’ ఫ్రాంచైజీలో భాగం కావడం థ్రిల్‌గా ఉంది’’ అన్నారు కియారా అద్వానీ. -
తల్లి కాబోతున్న 'కల్కి' హీరోయిన్? పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి కాబోతుందా? అవుననే సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే తాజాగా ఈ వార్తలకు బలమొచ్చేలా కొన్ని హింట్స్ కూడా వచ్చాయి. దీంతో ఈ బ్యూటీ ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఈమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో ప్రెగ్నెన్సీతో ఉందా అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ వార్తల్లో నిజమెంత? దీపికా పదుకొణె పేరు చెప్పగానే హిందీ హీరోయిన్ అని చాలామంది అనుకుంటారు. కానీ ఈమె పుట్టి పెరిగిందింతా బెంగళూరులోనే. కన్నడ సినిమాతోనే ఇండస్ట్రీలోకి వచ్చింది గానీ హిందీలో వరస ప్రాజెక్టులు చేస్తూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం 'కల్కి'లో ప్రభాస్ సరసన నటస్తోంది. హిందీలో 'సింగం రిటర్న్స్'లో మాత్రమే చేస్తోంది. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) తాజాగా ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల వేడుక 'బాఫ్టా'లో పాల్గొన్న దీపిక.. చీరకట్టులో కనిపించింది. అయితే ఈమెని సరిగా అబ్జర్వ్ చేస్తే బేబీ బంప్ ఉందేమోననే సందేహం వచ్చింది. తాజాగా ముంబయి తిరిగొచ్చేసిన దీపిక.. వదులుగా ఉండే ఔట్ఫిట్లో కనిపించింది. వీటితో పాటు దీపిక ప్రెగ్నెన్నీతో ఉందనే సమాచారం బయటకొచ్చింది. చేతిలో ఉన్న మూవీస్ షూటింగ్ చివరకు వచ్చేయడం, బేబీ బంప్‌తో కనిపించడం, ప్రెగ్నెన్సీ రూమర్స్ రావడంతో దీపిక పదుకొణె నుంచి త్వరలో గుడ్ న్యూస్ రాబోతుందనిపిస్తోంది. ఇకపోతే దీపిక.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌ని 2018లో పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో) #deepikapadukone airport look in a stylish way ✈️♥️ pic.twitter.com/b0x66dBAa0 — Womansera (@WomansEra2) February 20, 2024 -
బాలీవుడ్ కొత్త 'డాన్'గా రణ్వీర్ సింగ్.. సెప్టెంబరులో స్టార్ట్
బాలీవుడ్ కొత్త డాన్‌గా రణ్వీర్ సింగ్ మారనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన హిందీ ‘డాన్’ ఫ్రాంచైజీ చిత్రాల్లో ముందు 1978లో వచ్చిన ‘డాన్’లో అమితాబ్ బచ్చన్, ఆ తర్వాత 2006లో వచ్చిన ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’, ‘డాన్ 2’లో షారుక్ ఖాన్ హీరోలుగా నటించారు. అమితాబ్, షారుక్ డాన్లుగా మెప్పించారు. ఇప్పుడు కొత్త తరం డాన్‌గా బాలీవుడ్ తెరపైకి రణ్‌వీర్‌సింగ్ రానున్నారు. ‘డాన్ 3’లో రణ్వీర్ హీరోగా నటిస్తారని, ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’, ‘డాన్ 2’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాను తెరకెక్కిస్తారని ఇప్పటికే అధికారిక ప్రకటన వెల్లడైంది. కాగా ఈ సినిమా చిత్రీకరణను సెప్టెంబరులోప్రారంభించేలా ఫర్హాన్ అక్తర్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం అజయ్‌దేవగన్ మెయిన్ లీడ్ చేస్తున్న ‘సింగమ్ ఎగైన్’ సినిమాలో రణ్వీర్ సింగ్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో తన వంతు చిత్రీకరణను పూర్తి చేసుకున్న తర్వాత ‘డాన్ 3’ షూటింగ్లో పాల్గొంటారట రణ్వీర్ సింగ్. ఈ చిత్రం కోసం స్పెషల్‌గా మేకోవర్ కానున్నారు. ఇక ‘డాన్ 3’ తర్వాత రణ్వీర్ సూపర్ హీరో ఫిల్మ్ ‘శక్తిమాన్’ చిత్రీకరణలో పాల్గొంటారు. -
సింగమ్ వర్సెస్ సైతాన్ .. అదిరిపోయిన అర్జున్ కపూర్ ఫస్ట్ లుక్!
బాలీవుడ్ సింగమ్ ఫ్రాంచైజీలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింగమ్ ఎగైన్’. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, దీపికా పదుకోన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘సింగమ్’ ఫ్రాంచైజీ దర్శకుడు రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరగుతోంది. కాగా ఈ సినిమాలో అర్జున్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, ఆ పాత్రను సైతాన్గా అభివర్ణిస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు రోహిత్ శెట్టి. ‘ఈ తుఫానుకు సిద్ధంగా ఉండండి’ అంటూ అర్జున్ పాత్రను ఉద్దేశించి, సోషల్ మీడియాలో షేర్ చేశారు అజయ్ దేవగన్. రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్, జ్యోతీ దేశ్‌పాండే నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. మరోవైపు ‘సింగమ్ ఫ్రాంచైజీ’లో భాగంగా 2011లో ‘సింగమ్’, 2014లో ‘సింగమ్ రిటర్న్స్’ ఇప్పుడు ‘సింగమ్ ఎగైన్’ సినిమాల్లో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Rohit Shetty (@itsrohitshetty) -
‘ది గోట్ లైఫ్’ తప్పకుండా చూడాల్సిన సినిమా: రణ్వీర్ సింగ్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న తాజా చిత్రం "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ మూవీ సెకండ్ పోస్టర్ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. 'ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా..' అంటూ ఆయన పోస్టర్ రిలీజ్ సందర్భంగా క్యాప్షన్ రాశారు. ఈ సెకండ్ లుక్ పోస్టర్ ఎమోషనల్ గా ఉంది. ఒక ఆశతో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్న కథానాయకుడి భావోద్వేగం అంతా ఆయన మొహంలో కనిపిస్తోంది. నజీర్ క్యారెక్టర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంతగా ఒదిగిపోయారో ఈ పోస్టర్ చూపిస్తోంది. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు. ఇది పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా కావడం విశేషం. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) -
పిల్లలను కనడంపై దీపికా పదుకొణె ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ లిస్ట్‌లో దీపికా పదుకొణె-రణ్వీర్ సింగ్ జంట ఒకటి. ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన రణ్ వీర్ సింగ్, దీపికా.. 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. ఇటీవల ఈ జంట తమ ఐదో వివాహ వార్షికోత్సవాన్ని బెల్జియంలో ఘనంగా జరుపుకుంది. అయితే పెళ్లి చేసుకొని ఐదేళ్లు గడుస్తున్నా..ఇప్పటి వరకు ఈ జంటకు పిల్లలు లేరు. వరుస సినిమాలతో బిజీగా ఉండడం కారణంగా కొన్నాళ్ల పాటు పిల్లలను కనకుండా ఉండాలని ఈ జంట భావించిందట. అయితే ఇప్పుడు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై దీపికా పదుకొణె పరోక్షంగా స్పందించారు. పిల్లలు అంటే తనతో పాటు రణ్‌వీర్‌కు చాలా ఇష్టమని, సొంత కుటుంబాన్ని ప్రారంభించడం కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నామని చెప్పింది. అంతే కాదు తన పిల్లలను ఎలా పెంచాలనుకుంటున్నారో కూడా దీపికా చెప్పుకొచ్చింది. ‘నేను ఇప్పుడు ఎవరినైనా కలిస్తే చాలా ఎదిగిపోయావని పొగిడేస్తుంటారు. కానీ మా బంధువులు మాత్రం నన్ను ఒక సెలెబ్రిటీలా ట్రీట్ చేయరు. సినిమాల్లోకి రాకముందు ఎలా ఉన్నావో..ఇప్పుడు అలానే ఉన్నావని అంటుంటారు. మొదట నేను ఒక కూతురిని.. ఒక సోదరిని.. ఆ తర్వాతే సెలబ్రెటీని! ఫేమ్ వచ్చాక మన ప్రవర్తనలో మార్పు రాకూడదు. మా పేరెంట్స్ నన్ను అలానే పెంచారు. మా పిల్లల్ని కూడా రణ్వీర్, నేను అలానే పెంచాలనుకుంటున్నాం. మా పిల్లలకు మంచి విలువలు నేర్పించాలనుకుంటున్నాం’అని దీపికా చెప్పుకొచ్చింది. దీపికా సినిమాల విషయాకొస్తే.. పఠాన్, జవాన్ చిత్రాలతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కీ 2898’తో పాటు శెట్టి దర్శకత్వంలో 'సింగం ఎగైన్'లోనూ నటిస్తోంది. -
మేడమ్ టుస్సాడ్స్‌లో రణ్వీర్ సింగ్ మైనపు బొమ్మలు.. ఆవిష్కరించిన హీరో (ఫోటోలు)
-
రజనీ సినిమాలో రణ్వీర్?
రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది వేసవిలోప్రారంభం కానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ బాలీవుడ్ స్టార్స్ షారుక్‌ఖాన్, రణ్వీర్ సింగ్‌లను సంప్రదించారట. అయితే ఇటీవల కాలంలో ఇతర చిత్రాల్లో ఎక్కువగా గెస్ట్ రోల్స్ చేసిన కారణంతో రజనీ సినిమాకు షారుక్ సున్నితంగా నో చెప్పారని, దీంతో రణ్‌వీర్‌సింగ్‌ను లోకేష్ కలిసి కథ వినిపించారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. మరి... రజనీకాంత్ సినిమాలో రణ్‌వీర్‌సింగ్ నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు రజనీకాంత్ ప్రస్తుతం ‘వేట్టయాన్’ సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే రజనీకాంత్ ఓ లీడ్ రోల్ చేసిన ‘లాల్ సలామ్’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. -
100 కోట్లు కొల్లగొడుతున్న భార్య,భర్తలు
-
ఆ విషయాలు పంచుకోవడంలో పురుషులకు సిగ్గు.. : టాప్ హీరో
మారుతున్న జీవనశైలి కారణంగా లైంగిక ఆరోగ్యం, సంరక్షణ పెద్ద సవాలుగా మారింది. అందుకోసం కొన్ని కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. రానున్నరోజుల్లో ఆ సంస్థలకు ఆదరణ పెరుగుతుందని భావించి ప్రముఖులు సైతం అందులో పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా ‘బోల్డకేర్’ అనే సంస్థకు బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ సహ యజమానిగా చేరారు. సమాజంలో లైంగిక ఆరోగ్యానికి సంబంధించి ప్రజల్లో చాలా అవగాహన పెంపొందించాల్సి ఉందని, అందులో భాగంగా ఈ కంపెనీ ఎంతో కృషి చేస్తుందని రణ్వీర్ సింగ్ అన్నారు. ‘ఈ కంపెనీ లైంగిక ఆరోగ్య సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలను అందిస్తోంది. బోల్డ్ కేర్ సహ యజమానిగా బోర్డులోకి రావడం సంతోషంగా ఉంది. లైంగిక ఆరోగ్యం, సమస్యలు, వాటికి పరిష్కారాలు అందించడం ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా పురుషులు లైంగిక సమస్యలు, సంరక్షణ అంశాలను పంచుకోవడానికి సిగ్గుపడతారు. ఈ కంపెనీ అలాంటి వారికి ఎంతో మేలు చేస్తోంది’ అని ఆయన తెలిపారు. ‘లైంగిక సమస్యలు ఉన్న వ్యక్తులు మానసికంగా చాలా బాధను అనుభవిస్తారు. వారికి ఓదార్పుతోపాటు సమస్య పరిష్కారమయ్యేలా చూడాలి. సమాజంలో ఇలాంటి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆ ఆలోచన వల్లే నా కెరీర్ ప్రారంభంలో కండోమ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేశాను. సమస్యతో బాధపడుతున్న ప్రతిఒక్కరిలో అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని రణ్వీర్ సింగ్ వివరించారు. ఇదీ చదవండి: సత్యం రామలింగరాజుతోపాటు ఆ నలుగురికి రూ.624 కోట్లు లాభం.. 2021లో ప్రారంభమైన బోల్డ్ కేర్ కంపెనీ ఈ ఏడాదికిగాను రూ.40 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. సంస్థ ప్రారంభించిన 10 నెలల్లోనే 3 లక్షల యూనిట్లకు పైగా కండోమ్‌లను విక్రయించింది. కంపెనీ 15 లక్షలకు పైగా ఆర్డర్లను ప్రాసెస్ చేసింది. -
వస్తువు కొనుక్కునే ముందు టెస్ట్ చేస్తాం.. పెళ్లికి ముందు ఇదీ అంతే!
ఎవరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు. ఎప్పటికప్పుడు పరిస్థితుల వల్లో, మరే ఇతర కారణాల వల్లో మారుతూ ఉంటారు. ఒకప్పుడు సింగిల్‌గా ఉండాలనుకుంది స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. జీవితంలో పెళ్లి జోలికే వెళ్లకూడదనుకుంది. కానీ హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన తర్వాత పలువురితో ప్రేమాయణం సాగించి చివరకు హీరో రణ్వీర్ సింగ్‌ను పెళ్లాడింది. ఇతడే అసలైన జీవిత భాగస్వామి అనిపించడంతో సింగిల్‌గా ఉండాలనుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టేసింది. ఆ మధ్య కాఫీ విత్ కరణ్ షోకి భర్తతో కలిసి హాజరైంది దీపిక. చివరకు అతడితోనే పెళ్లి ఈ సందర్భంగా భర్త కంటే ముందు పలువురితోనూ ప్రేమలో పడ్డ విషయాన్ని బయటపెట్టింది. అంతేకాకుండా రణ్వీర్ సింగ్ పరిచయమయ్యాక కూడా చాలామందిని కలిశాను, కానీ ఎవరూ తనకంత కనెక్ట్ అవలేదని, మనసులో ఎక్కడో రణ్వీర్ సరైన జోడీ అనిపించిందని చెప్పుకొచ్చింది. ఇతరులతో డేట్‌కు వెళ్లినప్పటికీ చివరకు రణ్‌వీర్‌నే పెళ్లి చేసుకున్నానని చెప్పింది. చాలామంది దీపికా వ్యాఖ్యలను విమర్శించారు. ఎవరి దగ్గరా మోకరిల్లలేదు తాజాగా నటి ట్వింకిల్ ఖన్నా.. దీపికా వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచింది. 'అంకుల్ అండ్ ఆంటీస్.. దీపిక కాబోయే భర్తతో డేటింగ్లో ఉన్నప్పుడు ఏ పురుషుడి చుట్టూ తిరగలేదు. ఎవరి దగ్గరా మోకరిల్లలేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పినందుకు ఎందుకంత విమర్శిస్తున్నారు? అంతలా తిడుతున్నారు.. ఈ ట్రోలింగ్ ఏ రేంజ్‌కు వెళ్లిందంటే.. బనారస్ యూనివర్సిటీలో ఓ అమ్మాయి దీపికగా, కొందరు అబ్బాయిలు ఆమె మాజీ ప్రియులుగా యాక్ట్ చేసి నటిపై సెటైర్స్ వేస్తున్నారు. అది తప్పు కాదు నిజానికి దీపిక అన్నదాంట్లో తప్పేంటి? మనం ఒక సోఫా కొనేముందు దుకాణానికి వెళ్లి ఏది మృదువుగా ఉంది? ఏది సౌకర్యవంతంగా ఉంది? దాని నాణ్యత ఎలా ఉంది? ఇవన్నీ టెస్ట్ చేస్తాం కదా! మరి పెళ్లి విషయంలో ఆ మాత్రం ఆలోచిస్తే తప్పేంటట? మనకు ఎవరు కరెక్ట్ అనేది ఆలోచించి సెలక్ట్ చేసుకోవడం తప్పేం కాదు' అని చెప్పుకొచ్చింది ట్వింకిల్ ఖన్నా. చదవండి: సినిమా సూపర్ హిట్.. హీరోయిన్ అందంగా లేదట.. డైరెక్టర్ రెస్పాన్స్ చూశారా? -
పండగ సమయంలో ఆస్తి అమ్మేసిన స్టార్ హీరో.. ధర ఎన్ని కోట్లంటే?
ప్రముఖ బాలీవుడ్ నటుడు 'రణవీర్ సింగ్' (Ranveer Singh) ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఉన్న తన రెండు ఫ్లాట్లను విక్రయించాడు. ఈ ఫ్లాట్లను ఎప్పుడు కొనుగోలు చేసాడు? ఇప్పుడు ఇంతకు విక్రయించాడు? అనే మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. రణవీర్ సింగ్ 2014 డిసెంబర్లో ముంబైలోని ఒబెరాయ్ మాల్‌కు సమీపంలో రెండు ఫ్లాట్లను కొనుగోలు చేశాడు. ఒక్కొక్క ఫ్లాట్ కోసం సింగ్ రూ.4.64 కోట్లు, స్టాంప్ డ్యూటీల కోసం రూ.91.50 లక్షలు చెల్లించినట్లు ఆన్లైన్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ IndexTap.com ప్రకారం తెలిసింది. రణవీర్ సింగ్ కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్స్ విస్తీర్ణం 1,324 చదరపు అడుగులు. ప్రతి ఫ్లాట్‌లోనూ ఆరు పార్కింగ్ స్థలాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ ఫ్లాట్లను రూ. 15.25 కోట్లకు అదే గృహ సముదాయానికి చెందిన వ్యక్తి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: భారత్ నిర్ణయంతో చైనాకు రూ.50000 కోట్లు నష్టం - ఎలా అంటే? గోరేగావ్ అపార్ట్‌మెంట్‌తో పాటు, రణవీర్ సింగ్‌కి ఇతర హోల్డింగ్‌లు కూడా ఉన్నాయి. 2022 ఈయన బాంద్రా వెస్ట్‌లో 119 కోట్ల రూపాయలకు క్వాడ్రప్లెక్స్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసాడు. దీనికి స్టాంప్ డ్యూటీ రూ.7.13 కోట్లు. ఇది మొత్తం 11,266 చదరపు అడుగులు విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో టెర్రేస్ ప్రాంతం మాత్రమే 1,300 చదరపు అడుగులు. ఇందులో మొత్తం 19 కార్ పార్కింగ్ స్థలాలతో ఉన్నాయి. -
సూర్యవన్షీ సాహసం
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సింగమ్ ఎగైన్ ’. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ , రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకొనె, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అక్షయ్‌కుమార్ c చేసి, వీర్ సూర్యవన్షీ పాత్రలో ఆయన నటిస్తున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. అలాగే రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవన్షీ’ (2021) చిత్రం విడుదలై ఆదివారంతో రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో, ‘సింగమ్ ఎగైన్ ’ సినిమాలోని అక్షయ్ లుక్‌ను విడుదల చేసినట్లుగా రోహిత్ శెట్టి పేర్కొన్నారు. ఇందులో అక్షయ్ లుక్ చూస్తుంటే పోలీసాఫీసర్‌గా మరోసారి ఆయన సహసాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ‘సింగమ్ ఎగైన్ ’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. -
RanveerSingh-DeepikaPadukone: ఐదేళ్ల తర్వాత బయటకు వచ్చిన స్టార్ హీరోహీరోయిన్స్ పెళ్లి వీడియో (ఫోటోలు)
-
ఓటీటీలో సూపర్‌హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!
రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. అయితే ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా ఉచితంగా చూసేందుకు మేకర్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూలై 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకుముందు ఈ చిత్రం చూడాలంటే రూ.349 చెల్లించాల్సి ఉండగా.. ఇప్పుడు ఫ్రీగా చూసేయొచ్చు. కాగా.. ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ, తోట రాయ్ చౌదరి, ఆమీర్ బషీర్, చుర్ని గంగూలీ, అంజలి ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందించారు. ఓటీటీలో రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీలోని డిలీటెడ్ సన్నివేశాలను జోడించి మరి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీ రన్ టైమ్ పది నిమిషాలకు పెరిగింది. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకంపై హిరో జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి సంయుక్తంగా నిర్మించారు. -
ఓటీటీలో రిలీజైన సూపర్‌హిట్ సినిమా.. కానీ?
ఇది సూపర్‌హిట్ సినిమా. స్టార్స్ అయిన రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా లాంగ్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఇప్పుడీ చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఎందులో స్ట్రీమింగ్ అవుతోందో తెలుసా? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 23 సినిమాలు) కథేంటి? దిల్లీలో స్వీట్స్ బిజినెస్ చేసే పంజాబీ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు రాకీ రాంధ్వా (రణ్వీర్). తాత కన్వల్ (ధర్మేంద్ర), అమ్మమ్మ ధనలక్ష్మి (జయా బచ్చన్)తో కలిసి ఉంటాడు. అయితే కన్వల్.. తన ఫ్రెండ్ జామినీ ఛటర్జీ(షబానా అజ్మీ)ని కలవాలని ప్రయత్నిస్తుంటాడు. వాళ్లిద్దరినీ కలిపేందుకు రాకీ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలోనే జామిని మనవరాలు రాణీ (అలియాభట్)తో ప్రేమలో పడతాడు. మరి చివరకు ఏమైందనేదే 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ' స్టోరీ. ఆ ఓటీటీలోనే జూలై 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. మంచి టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అలాంటి ఇప్పుడు ఈ చిత్రాన్ని.. రెంట్(అద్దె) విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఈ చిత్రం చూడాలంటే రూ.349 కట్టాల్సి ఉంటుంది. అలా కాదంటే కొన్నిరోజులు ఆగితే ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. అది ఎప్పుడనేది ఇంకా ప్రకటించలేదు. ఇకపోతే ఈ మధ్య 'ఓ ఝమ్కా' అనే పాట తెగ ట్రెండ్ అయింది కదా. అది ఈ సినిమాలోనిదే. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజేనా!?) -
ప్లే ప్యూర్: బీజీఎంఐ బ్రాండ్ అంబాసిడర్‌గా రణ్వీర్ సింగ్
Ranveer Singh BGMI బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) గేమింగ్‌కు ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌ను నియమించుకున్నట్లు క్రాఫ్టాన్ ఇండియా వెల్లడించింది. గేమింగ్ థ్రిల్ ,సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ కరిష్మా రెండూ కలిపి దేశవ్యాప్తంగా మిలియన్ల మంది గేమర్లకు ఉన్నతమైన అనుభవాన్ని అందించడమే కంపెనీ లక్ష్యం. దేశవ్యాప్తంగా ఉన్న గేమింగ్ ఔత్సాహికులకోసం ఆకర్షణీయమైన కంటెంట్‌ను తీసుకురావడానికి ఈ సహకారం ఒక కొత్త మార్గాన్ని అందిస్తుందని, గేమింగ్ ఎంటర్టైన్మెంట్ కొత్త శకాన్ని ప్రారంభించనున్నామని తెలిపింది. యూజర్లను కట్టిపడేసే అనుభూతిని అందించే గేమ్‌లను రూపొందించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు క్రాఫ్టాన్ ఇండియా సీఈవో షాన్ హ్యునిల్ సోన్ తెలిపారు. దేశీ గేమింగ్ కమ్యూనిటీని కలిసేందుకు క్రాఫ్టాన్ భాగస్వామ్యం మంచి అవకాశం కాగలదని రణ్వీర్ సింగ్ పేర్కొన్నారు. -
సీతమ్మకొండపై హర్ శిఖర్ తిరంగా
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన సీతమ్మ కొండపై ‘హర్ శిఖర్ తిరంగా’కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కొండపై ఆర్మీ బృందం జాతీయ జెండాను విజయవంతంగా ఆవిష్కరించింది. దీంతో సీతమ్మకొండకు జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (నిమాస్) డైరెక్టర్ కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో 14 మందితో కూడిన ఆర్మీ బృందం సోమవారం మధ్యాహ్నం హుకుంపేట మండలంలోని మారుమూల ఓలుబెడ్డ గ్రామానికి చేరుకుంది. సర్పంచ్ పాంగి బేస్ ఆధ్వర్యంలో గిరిజనులంతా వారికి పూలమాలలతో స్వాగతం పలికారు. థింసా నృత్యాలతో ఆర్మీ బృందం కూడా సందడి చేసింది. మధ్యాహ్నం 1.30గంటలకు సీతమ్మ కొండపైకి బయలుదేరిన ఆర్మీ బృందం... గంటన్నరలో కొండపైకి చేరుకుని జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ సందర్భంగా కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎత్తయిన శిఖరంగా గుర్తించిన సీతమ్మ కొండపై జాతీయ జెండాను ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు. తమ యాత్ర, జాతీయ జెండా ఆవిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ, స్థానిక గిరిజనులు ఎంతో సహకరించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన హర్ శిఖర్ తిరంగా యాత్రను ప్రారంభించామన్నారు. సీతమ్మ కొండతో కలిపి ఇప్పటి వరకు 22 రాష్ట్రాల్లోని ఎత్తయిన పర్వత శిఖరాల్లో జాతీయ జెండాను విజయవంతంగా ఎగురవేశామన్నారు. మరో 6 రాష్ట్రాల్లో హర్ శిఖర్ తిరంగాను అక్టోబర్ 15వ తేదీకి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎవరెస్ట్ అధిరోహకుడు ఆనంద్‌కుమార్, టూరిజం అడ్వంచర్ స్పోర్ట్స్ ప్రతినిధి కుంతూరు కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
పదిహేడేళ్ల తర్వాత...
బాలీవుడ్ సీనియర్ డాన్స్‌కు నూతన డాన్ రణ్వీర్ సింగ్ అండ్ టీమ్ నుంచి ఆహ్వానాలు అందనున్నాయని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్ 3’ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ వెండితెరపై డాన్ పాత్రలు చేసిన అమితాబ్ బచ్చన్(డాన్– 1978), షారుక్ ఖాన్ (డాన్–2006, ‘డాన్ 2’–2011)లు ‘డాన్ 3’ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. ఇందుకోసం రణ్వీర్, ఫర్హాన్‌లు ప్రయత్నాలు మొదలు పెట్టారని టాక్. అయితే 2006లో వచ్చిన ‘కభీ అల్విదా నా కహ్నా’ తర్వాత అమితా»Œ , షారుక్ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. మరి..‘డాన్ 3’ కోసం దాదాపు 17ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారా? వేచి చూడాలి. -
దేశాలు వేరైనా డ్యాన్స్ నీదేనయా!
టాంజానియాలో కంటెంట్ క్రియేటర్ కలీపాల్ తన సోదరి నీల్పాల్తో కలిసి చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని’ సినిమాలోని ‘ఝుమ్ఖా’ పాటకు కలీపాల్, నీమ్పాల్లు స్టెప్పులు వేశారు. తమ సంప్రదాయ దుస్తులు ధరించి చేసిన ఈ డ్యాన్స్ వీడియో 1.4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ► ఏ దేశమేగినా గానం నుంచి నృత్యం వరకు ఏదో ఒక రూపంలో దేశం మనతో ఉంటుంది. తాజాగా ఐకానిక్ వాషింగ్టన్ మాన్యుమెంట్ (యూఎస్) బ్యాక్‌గ్రౌండ్‌గా స్వాతి జయశంకర్ భరతనాట్యం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘బ్యూటిఫుల్ బ్యాక్‌గ్రౌండ్ బ్యూటిఫుల్ డ్యాన్స్’ అంటూ కామెంట్ సెక్షన్ ప్రశంసలతో నిండిపోయింది. -
రణ్వీర్ సింగ్ రీల్ లగ్జరీ బంగ్లా: రియల్ ఓనర్ ఎవరో తెలిస్తే షాకవుతారు
Rocky RandhawaParadise: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ,స్టార్ హీరోయిన్ అలియా భట్ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ హిట్‌టాక్ సొంతం చేసుకుంది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ మూవీలో ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్ లాంటి బి-టౌన్‌కు చెందిన ప్రముఖులు నటించిన సంగతి తెలిసిందే. అయితే చిత్రం విడుదలైనప్పటి నుంచి రణ్వీర్ సింగ్ పాత్ర నివసించిన లగ్జరీ బంగ్లా హాట్ టాపిక్‌గా నిలిచింది. ‘రాకీ రంధావా పారడైజ్’ గా సినిమాలో చూపించిన సుందరమైన 'రాకీ రాంధావా' భవనంలోని అద్బుతమైన షాట్లు ప్రేక్షకులను కట్టి పడేశాయి. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండానే ఈ భవనంలోని దృశ్యాలు మంత్రముగ్దులను చేశాయి. షెహజాదా మూవీ చిత్రీకరణ కూడా ఇక్కడే జరిగిందట. విలాసవంతమైన భవనం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇదిఅందమైన భవనం లండన్‌లో ఉందని కొందరు , స్విట్జర్లాండ్‌లో ఉందని సినీ ప్రియులు ఊహాగానాలు చేశారు. కానీ ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉంది. ఇంతకీ ఈ భవనం ఎవరిది, ఇందులో విశేషాలేంటి తెలుసుకుందా రండి! గౌర్ మల్బరీ మాన్షన్స్ స్వర్గధామంగా చిత్రీకరించిన ‘రాకీ రంధావా’ అసలు పేరు ది గౌర్ మల్బరీ మాన్షన్స్ ఇదిగ్రేటర్ నోయిడా సెక్టార్-1లో ఉంది. దాదాపు 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంతేకాదు ఈ ఐకానిక్, యునైటెడ్ స్టేట్స్ కాపిటల్ భవనాన్ని కూడా పోలి ఉంటుందని కూడా అంచనా. ఫర్నీచర్, కళాఖండాలు, అలంకార వస్తువులు, ఫ్లోరింగ్, షాన్డిలియర్లు, కిటికీలు, మిర్రర్.. ఒకటేమిటి సర్వం పచ్చదనానికి మారు పేరుగా ఉన్నాయి. గౌర్స్ గ్రూప్ ఛైర్మన్ ,ఎండీ మనోజ్ గౌర్ బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త, గౌర్స్ గ్రూప్ ఛైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ సొంతంఈ గౌర్ మల్బరీ మాన్షన్స్ . రియల్ ఎస్టేట్ దిగ్గజం మనోజ్ క్రెడాయ్ నేషనల్ చైర్మన్ మరియు క్రెడాయ్ (NCR) అధ్యక్షుడు కూడా. గత 28 సంవత్సరాలుగా, గౌర్స్ గ్రూప్‌కు లీడ్ చేస్తున్న మనోజ్ అనేక ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తిచేశారు. డెలివరీ నుంచి నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్‌ల నాణ్యతతోపాటు అందుబాటులో ధరల్లో గృహాలను అందిస్తూ తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగం మాత్రమేకాదు మనోజ్ గౌర్ కూడా పర్యావరణ పద్ధతులను పాటించడంలోనూ దిట్ట. సోలార్ పవర్ ప్లాంట్‌లో రూ.80 కోట్లు పెట్టుబడులున్నాయి.. -
జేమ్స్‌బాండ్‌లా పోజు కొడుతున్న ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా?
స్టైల్‌గా కళ్లజోడు, చేతిలో గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? ఇతడు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో. ఈ మధ్యే రిలీజైన ఇతడి మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో అతడు హ్యాపీ మూడ్‌లో ఉన్నాడు. ఇటీవలి కాలంలో రూ.200 కోట్లు రాబట్టిన చిత్రం ఏంటా? అని చూస్తున్నారా? అది మన తెలుగులో కాదు, హిందీలో! జూలై 23న రిలీజైన రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ చిత్రం ఇప్పటివరకు రూ.200 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్ పనైపోయిందన్న రూమర్స్‌కు కలెక్షన్స్‌తో చెంపపెట్టు సమాధానమిచ్చిందీ చిత్రం. ఇందులో హీరోగా నటించిన రణ్వీర్ సింగ్ చిన్ననాటి ఫోటోయే పైన కనిపిస్తున్న చిత్రం! యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచే ఇష్టం రణ్‌వీర్‌కు చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే ఇష్టం. కానీ గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టడం అంత సులువు కాదని అతడికి చిన్నవయసులోనే అర్థమైంది. మొదట అతడు వాణిజ్య ప్రకటనలకు రచయితగా పని చేశాడు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ వర్క్ చేశాడు. ఇలా వివిధ రకాల పనులు చేసుకుంటూ పోతే అవకాశాలు వచ్చేది ఎప్పటికో అని ఆలోచించిన రణ్వీర్.. ఈ పనులన్నీ మానేసి ఆడిషన్స్‌కు వెళ్లడం మొదలుపెట్టాడు. చెప్పులరిగేలా తిరుగుతున్నా ఒక్కటంటే ఒక్క మంచి ఛాన్స్ కూడా రాలేదు. తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా అవార్డు అసలు సరైన దారిలోనే వెళ్తున్నానా? అని అనుమానపడుతున్న సమయంలో బ్యాండ్ బాజా బారత్ సినిమా ఆడిషన్స్‌లో సెలక్ట్ అయ్యాడు. అది కూడా హీరోగా! అంతేకాదు, ఈ చిత్రానికిగానూ ఉత్తమ డెబ్యూ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు సైతం అందుకున్నాడు, అక్కడి నుంచి హీరోగా తన ప్రస్థానం ముందుకు సాగింది. కొంత కాలానికే స్టార్ హీరో అయ్యాడు. హీరోయిన్ దీపికా పదుకొణెతో లవ్‌లో పడ్డ ఇతడు 2018లో ఆమెను పెళ్లాడాడు. వీరిద్దరూ బాలీవుడ్లో టాప్ పొజిషన్లో రాణిస్తూ స్టార్ జంటగా కీర్తి పొందుతున్నారు. ఇక రణ్వీర్.. స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తుంటాడు. రణ్వీర్ సినిమాల విషయానికి వస్తే.. రణ్వీర్ సింగ్ డాన్ 3 సినిమాలో నటించనున్నాడు. గతంలో వచ్చిన ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’, ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ సినిమాల్లో షారుక్ ఖాన్ నటించగా ఈ సీక్వెల్లో మాత్రం రణ్వీర్ ఎంట్రీ ఇచ్చాడు. గత రెండు సినిమాలను డైరెక్ట్ చేసిన ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నిద్ర పోతున్న సింహం లేచిందని ప్రపంచానికి తెలియాలి, వెళ్లి చెప్పు.. నేను తిరిగొస్తున్నానని’, ‘నేనే డాన్ని’ అనే డైలాగ్స్ ‘డాన్ 3’ అనౌన్స్మెంట్ వీడియోలో వినిపిస్తాయి. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరికల్లా ప్రారంభించి 2025లో రిలీజ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Excel Entertainment (@excelmovies) చదవండి: చాలామంది హేళనగా చూశారు: హీరోయిన్ -
కోలీవుడ్ హిట్ సినిమాలు హిందీలోనూ హిట్ ఆవుమా?
ఓ సినిమా హిట్ అయితే... ఆ సినిమాలోని కథ ఏ భాషకైనా, ప్రాంతానికైనా నప్పే విధంగా ఉంటే.. అందరి దృష్టీ ఆ సినిమా మీద పడుతుంది. అలా తమిళంలో హిట్టయిన చిత్రాల మీద హిందీ పరిశ్రమ దృష్టి పడింది. ఆ చిత్రాల రైట్స్ చేజిక్కించుకుని, రీమేక్ చేస్తున్నారు. మరి.. తమిళంలో హిట్ ఆన (అయిన) సినిమా హిందీలోనూ హిట్ ఆవుమా? (అవుతుందా?) అంటే.. వేచి చూడాల్సిందే. ఇక హిందీలో రీమేక్ అవుతున్న తమిళ చిత్రాల గురించి తెలుసుకుందాం. విమానయానం ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితంతో సుధ కొంగర దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా’). సూర్య హీరోగా నటించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజై, మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. సుధా కొంగరే రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రీమేక్‌కు సూర్య ఓ నిర్మాతగా ఉండటం విశేషం. సామాన్యులు సైతం విమానయానం చేసేందుకు గోపీనాథ్ ఏ విధంగా కృషి చేశారు? ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? అనేది ‘సూరరై పోట్రు’ కథాంశం. అలాగే విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘కత్తి’ (2014) రీమేక్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తారని సమాచారం. హిందీ రైట్స్‌ను దర్శక–నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ దక్కించుకున్నారు. హిందీ అపరిచితుడు విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అన్నియన్’ (‘అపరిచితుడు’) ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్లు శంకర్ ప్రకటించారు. ఇందులో రణ్వీర్ సింగ్ హీరోగా నటించాల్సింది. కొన్ని లీగల్ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై మానసిక వేదనకు గురైన ఓ మధ్యతరగతి యువకుడు ఏం చేశాడు? అనేది ఈ చిత్రం కథాంశం. గ్యాంగ్‌స్టర్ సెంటిమెంట్ చెల్లెలి సంరక్షణ కోసం ఓ గ్యాంగ్‌స్టర్ తన జీవితాన్ని ఏ విధంగా మార్చుకున్నాడు? ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్లలకు ఎలా బుద్ధి చెప్పాడు? అనే అంశాలతో రూపొందిన తమిళ చిత్రం ‘వేదాళం’. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో 2015లో విడుదలైన ఈ సినిమా హిట్ సాధించింది. ఈ సినిమా ‘వేద’గా హిందీలో రీమేక్ అవుతోంది. జాన్ అబ్రహాం టైటిల్ రోల్ చేస్తున్నారు. నిఖిల్ అద్వానీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్స్ తమన్నా, శర్వారి లీడ్ రోల్స్ చేస్తున్నారు. జాన్ అబ్రహాం సిస్టర్‌గా శర్వారి, హీరోయిన్గా తమన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 16ఏళ్లు కోమాలో ఉంటే.. దాదాపు 16 సంవత్సరాలు కోమాలో ఉన్న ఓ వ్యక్తి ఆరోగ్యం హఠాత్తుగా కుదుటపడుతుంది. కోమా నుంచి బయటకు వచ్చిన అతను సమకాలీన నాగరికత, జీవన విధానం, టెక్నాజీలను చూసి ఆశ్చర్యపో తాడు. ఈ పరిస్థితులను అతడు తన జీవితానికి ఎలా అన్వయించుకున్నాడు? తన పూర్వీకులకు చెందిన ఓ విగ్రహం అతని జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది? అన్నది ‘కోమాళి’ కథనం. ‘జయం’ రవి హీరోగా ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2019లో విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను బోనీ కపూర్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటిస్తారని బాలీవుడ్లో ఎప్పట్నుంచో ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇటు పోలీస్.. అటు ఎన్ఆర్ఐ బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఇటీవల రీమేక్స్ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ నిర్మిస్తన్న ఓ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తమిళ దర్శకుడు కాలిస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2016లో అట్లీ దర్శకత్వంలో వచ్చిన తమిళ హిట్ ఫిల్మ్ విజయ్ ‘తేరి’కి ఇది హిందీ రీమేక్ అని బాలీవుడ్ సమాచారం. ఓ రాజకీయ నాయకుడి కుమారుడు ఓ యువతిపై అత్యాచారం చేస్తే, అతన్ని చంపేస్తాడు ఓ పో లీసాఫీసర్. అప్పడు ఆ రాజకీయ నాయకుడు ఆ పోలీసాఫీసర్‌పై ఏ విధంగా పగ తీర్చుకున్నాడు? ఆ రాజకీయ నాయకుణ్ణి ఆ పోలీసాఫీసర్ ఎలా ఢీ కొన్నాడు? అన్నదే టూకీగా ‘తేరి’ కథాంశం. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా వరుణ్ ధావన్ నటిస్తున్నారు. అలాగే మరో తమిళ హిట్ ‘మనాడు’ హిందీ రీమేక్‌లో కూడా వరుణ్ ధావన్ నటించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. శింబు, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మానాడు’. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ రానా వద్ద ఉన్నాయి. ఓ ఎన్ఆర్ఐకి, పో లీసాఫీసర్కి మధ్య కొన్ని రాజకీయ అంశాల నేపథ్యంలో ఎలాంటి శత్రుత్వం ఏర్పడింది? అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది. ఎన్ఆర్ఐగా శింబు నటించగా, పోలీసాఫీసర్‌గా ఎస్జే సూర్య నటించారు. ట్రెండీ లవ్‌స్టోరీ రూ. 5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొంది, బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకుపైగా కలెక్షన్స్‌ను సాధించిన తమిళ ట్రెండీ లవ్‌స్టోరీ ‘లవ్ టుడే’. ప్రదీప్ రంగనాథన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇవానా హీరోయిన్. గత ఏడాది నవంబరులో విడుదలైన ఈ సినిమా హిందీ రీమేక్‌ను ఫ్యాంథమ్ స్టూడియోస్, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నాయి. ఇందులో హీరో హీరోయిన్లుగా ఆమిర్ ఖాన్ పెద్ద కొడుకు జైనైద్ ఖాన్, శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్లు ఫైనల్ అయ్యారని, షూటింగ్ కూడా మొదలైందని బాలీవుడ్ సమాచారం. ప్రేమలో ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి పరస్పర అంగీకారంతో వారి మొబైల్ ఫోన్స్‌ను మార్చుకున్నప్పుడు ఏం జరిగింది? అనే అంశంతో ‘లవ్ టుడే’ చిత్రం రూపొందింది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని తమిళ సినిమాలు కూడా హిందీలో రీమేక్ కానున్నాయని తెలుస్తోంది. -
కొత్త డాన్ వచ్చేశాడు.. షారుక్ ప్లేస్‌లో
బాలీవుడ్లో కొత్త డాన్ వచ్చాడు. ‘మై హూ డాన్’ అంటున్నారు రణ్వీర్ సింగ్. షారుక్ ఖాన్ హీరోగా ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’, ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ సినిమాలను డైరెక్ట్ చేసిన ఫర్హాన్ అక్తర్ బుధవారం ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. ఇందులో డాన్‌గా రణ్వీర్ సింగ్ నటించనున్నట్లు వెల్లడించారు. ‘నిద్ర పోతున్న సింహం లేచిందని ప్రపంచానికి తెలియాలి.. వెళ్లి చెప్పు.. నేను తిరిగొస్తున్నానని’, ‘నేనే డాన్ని..’ అనే డైలాగ్స్ ‘డాన్ 3’ అనౌన్స్మెంట్ వీడియోలో వినిపిస్తాయి. ‘డాన్ 3’ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించి, 2025లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
సోది సినిమా, అచ్చంగా సీరియల్.. కట్ చేస్తే రూ.200 కోట్లు
రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహాని.. సోది సినిమా.. అసలిది సినిమానా? అచ్చంగా సీరియలే.. అయినా ఇది ఎప్పుడో చూసిన కథే, కొత్తగా ఏముంది? ఇలా నానామాటలు అన్నారు. కొందరు మాత్రం సినిమాను ఆస్వాదించారు. లొసుగులు వెతకడం మాని సినిమాను సినిమాలా ఆదరించారు. మొదట్లో ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. నెగెటివిటీని దాటుకుని వందల కోట్లు రాబడుతోందీ చిత్రం. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో ఈ సినిమా దర్శకనిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. 'సినిమా రిలీజ్‌కు ముందు కొంత భయపడ్డాను. ఏడేళ్లుగా డైరెక్షన్‌కు దూరంగా ఉండటం వల్లో, లేదంటే మూడేళ్లుగా ఆందోళనతో బాధపడుతున్నందుల్లో.. ఎందుకో తెలియదు కానీ నాలో ఒకరకమైన భయం, నీరసం ఆవహించింది. అసలే బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు? ఎటువంటి ఫలితాలు వస్తాయో ఊహించలేకుండా ఉన్నాం. ఏదైతేనేం.. ఒకరకమైన డోలాయమానంలో ఉన్నాను. కానీ జూలై 23 శుక్రవారం.. నాలో ఎక్కడలేని ఉత్తేజం వచ్చి చేరింది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞుడిని. ప్రేమ, ఎనర్జీతో పనిచేసిన టీమ్ అందరి కృషి వల్ల దక్కిన ఫలితమే ఈ చిత్రం. ఈ సినిమాకు రచయితలుగా పనిచేసిన శషాంక్ ఖైతన్, సుమిత్ రాయ్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా మొదటి నుంచి వాళ్లు నాకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు. కామెడీని రెట్టింపు చేసేలా స్క్రీన్‌ప్లేలో ప్రధాన పాత్ర పోషించిన ఇషిత మైత్ర గురించి స్పెషల్‌గా చెప్పుకుని తీరాల్సిందే! సోమెన్ మిశ్ర ఈ టీమ్‌కు ఆధ్వర్యం వహించి ఉండకపోతే ఇదంతా సాధ్యమయ్యేదే కాదు' అని రాసుకొచ్చాడు. కాగా రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన 'రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహాని' చిత్రం జూలై 28న విడుదలైంది. జయా బచ్చన్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, అంజలి ఆనంద్, చుర్నీ గంగూలి, రాయ్ చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) చదవండి: భార్య చేతిలో చెయ్యేసి ఏడ్చిన నటుడు, వీడియో వైరల్ -
రిటైర్ అయిపోతే మంచిది
‘కరణ్ జోహార్.. ఫస్ట్ నువ్వు రిటైర్ అయిపో.. ప్రతిభ ఉన్న కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించు.. వారు అద్భుతాలు సృష్టిస్తారు’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అన్నారు. రణవీర్ సింగ్, ఆలియాభట్ జంటగా కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ ఈ నెల 28న విడుదలైంది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కరణ్ జోహార్‌పై మండిపడ్డారు కంగనా రనౌత్. ‘‘భారతీయ ప్రేక్షకులు మూడు గంటల సినిమాలో ఎన్నో వింతలు చూస్తున్నారు. కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే ఈ నెపోటిజం గ్యాంగ్ మాత్రం రూ.250 కోట్ల బడ్జెట్‌తో డైలీ సీరియల్స్ తీస్తున్నారు. 1990లలో తాను తీసిన చిత్రాలనే కాపీ కొట్టి రూ.250 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసినందుకు కరణ్ సిగ్గుపడాలి.. డబ్బులు ఎందుకు వృథా చేస్తున్నావ్? ప్రతిభ ఉన్న ఎంతో మంది యువత సరైన వనరులు లేక సినిమాలు తీయలేకపోతున్నారు. అలాంటి వాళ్లకి అవకాశం కల్పిస్తే కొత్త కథలతో మూవీస్ తీసి విప్లవాత్మక మార్పు తీసుకొస్తారు’’ అన్నారామె. అలాగే రణ్వీర్ సింగ్‌ని ఉద్దేశించి–‘‘డ్రెస్సింగ్ విషయంలో కరణ్‌ను ఫాలో కావొద్దు. ధర్మేంద్ర, వినోద్ ఖన్నా వంటి పెద్దలను స్ఫూర్తిగా తీసుకో. దక్షిణాది నటులను చూసి తెలుసుకో.. వాళ్ల లుక్‌లో ఓ డిగ్నిటీ, ఇంటిగ్రిటీ ఉంటాయి’’ అన్నారు కంగనా. -
'ఆ సినిమాకు రూ.250 కోట్లా? జనాలేమైనా పిచ్చోళ్లా? సిగ్గనిపించట్లేదా?'
సౌత్ సినిమాలు హిందీలో రిలీజై అక్కడి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించినప్పటి నుంచి బాలీవుడ్‌కు గడ్డుకాలం మొదలైంది. అక్కడి ప్రేక్షకులు హిందీ సినిమాలకంటే కూడా డబ్బింగ్ సినిమాలపైనే మోజు చూపించారు, వాటినే ఆదరిస్తూ వస్తున్నారు. పైగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్‌పై వ్యతిరేకత, ద్వేషం మరింత పెరిగింది. దీంతో చిన్న, మధ్య, భారీ తరహా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. ఏవో కొన్ని మాత్రమే గట్టెక్కాయి. అందులో కొన్ని బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. రెండు సినిమాలు అంతంతమాత్రమే ఇకపోతే ఇటీవల బాలీవుడ్లో ఓ కొత్త సినిమా రిలీజైంది. అదే 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని'. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూలై 28న రిలీజైంది. కరణ్ జోహార్ ఈ సినిమాకు దర్శకనిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా తొలి రోజు రూ.11 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. దీనిపై సినీ విశ్లేషకుడు గిరీశ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని, బ్రో సినిమాలు అంచనాలకు తగ్గట్లుగా ఆడటం లేదు. అందువల్ల అందరి కళ్లు వంద కోట్లకు చేరువలో ఉన్న హాలీవుడ్ మూవీ ఓపెన్‌హైమర్ మీదే ఉంది' అని ట్వీట్ చేశాడు. ఈ స్క్రీన్‌షాట్‌ను కంగనా రనౌత్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సదరు సినిమాలపై కౌంటర్లు వేసింది. ఈ చెత్త సినిమాకు రూ.250 కోట్లా? 'జనాలేమీ పిచ్చోళ్లు కారు. ఇలాంటి పేలవమైన సినిమాలను వారు తిరస్కరిస్తారు. అసలు ఆ కాస్ట్యూమ్స్, సెట్ అంతా కూడా ఫేక్. కరణ్ జోహార్ 90వ దశకంలో ఏం చేశాడో ఇప్పుడూ అదే చేస్తున్నాడు. నీ పని నువ్వు కాపీ చేసుకోవడానికి సిగ్గనిపించడం లేదా? సీరియల్ లాంటి ఈ చెత్త సినిమాకు రూ.250 కోట్లు ఎలా ఖర్చు పెట్టావో? ఏంటో?! నిజంగా టాలెంట్ ఉన్నవాళ్లు ఒకపక్క ఇబ్బందులు పడుతుంటే వీళ్లేమో కోట్ల కొద్ది డబ్బు ఎలా గుమ్మరిస్తున్నారో?' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని సినిమాలో ఓ స్టిల్ రిటైర్మెంట్ తీసుకో అక్కడితో ఆగకుండా.. 'మూడు గంటల నిడివి ఉన్నా సరే జనాలు ఓపెన్‌హైమర్ సినిమానే చూస్తారు. అత్తాకోడళ్ల డ్రామాపై సినిమా తీయడానికి రూ.250 కోట్లు అవసరమా? నీకు నువ్వేదో పెద్ద ఫిలిం మేకర్ అని చెప్పుకుంటావు కానీ నీ పతనం ఆల్రెడీ మొదలైంది. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకుండా రిటైర్మెంట్ తీసుకో. కొత్తవాళ్లకు ఛాన్స్ ఇవ్వు. అలాగే రణ్వీర్ సింగ్‌కు నా నుంచి ఓ విన్నపం. కరణ్ జోహార్ బాటలో నువ్వు నడవకు. అతడిలా రెడీ అవకు. ధర్మేంద్ర, వినోద్ ఖన్నాలా మంచి బట్టలు వేసుకో. సౌత్ హీరోలు ఎలా రెడీ అవుతారో కనీసం వారిని చూసైనా నేర్చుకో. నీ వేషధారణతో మన సంస్కృతిని నాశనం చేయకు' అని కౌంటర్లు ఇచ్చింది కంగనా. చదవండి: పెళ్లైన ఆరేళ్లకు భర్తతో విడాకులు.. మమ్మల్ని ద్వేషించకండి అంటూ నటి పోస్ట్ -
అసలు ఆ డైలాగ్స్ ఏంటి.? ఆలియా భట్ మూవీపై తీవ్ర అభ్యంతరం!
బాలీవుడ్ భామ ఆలియా భట్, రణ్వీర్ సింగ్ జంటగా తెరకెక్కించిన తాజా చిత్రం 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కథ'. ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 28న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. రణ్వీర్ సింగ్, ఆలియాభట్ ప్రస్తుతం ముంబయిలో బిజీ బిజీగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఈ మూవీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలోని కొన్ని పదాలు, డైలాగ్స్ తొలగించాలని ఆదేశించింది. (ఇది చదవండి: ఉపాసనపై రామ్‌చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!) సినిమాలో ఉపయోగించిన 'కస్' పదాన్ని మార్చాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మేకర్స్‌ను ఆదేశించింది. అంతేకాకుండా లోక్‌సభ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై డైలాగ్స్ తొలగించాలని సూచించింది. దీంతో కొన్ని అభ్యంతరకర పదాలు, డైలాగ్స్ తొలగించడానికి చిత్రబృందం అంగీకరించగా.. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి అనుమతి ఇచ్చింది. ఈ సినిమాలో చాలాసార్లు ఎక్కువగా వినియోగించిన బ్రా, ఓల్డ్ మాంక్ అనే పదాలను మారుస్తామని చెప్పడంతో సెన్సార్ బోర్డ్ అనుమతించింది. లోక్ సభ డైలాగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించిన డైలాగ్స్‌ను పూర్తిగా తొలగించాలని మేకర్స్‌ను కోరింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సన్నివేశంలో అభ్యంతకర పదాన్ని తొలగించాలని ఆదేశించింది. మహిళల లోదుస్తుల షాప్ సన్నివేశాల్లో 'బ్రా' అనే పదం వినియోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి పదాలు వాడితే స్త్రీలను కించపరచడమేనని చిత్రబృందంపై సెన్సార్ బోర్డ్ మండిపడింది. (ఇది చదవండి: బేబీ మూవీకి వైష్ణవి ఒప్పుకోలేదు.. సాయి రాజేశ్ షాకింగ్ కామెంట్స్!) రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీలో ధర్మేంద్ర, జయ బచ్చన్, షబానా అజ్మీలు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వయకామ్18 స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. కాగా.. జులై 28, 2023న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. -
ఎన్మ్యాక్లో భారీ ఆర్ట్ ఎగ్జిబిషన్.. సందడి చేసిన ఇషా అంబానీ, రణ్వీర్ సింగ్
ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో భారీ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ‘రన్ యాస్ స్లో యు క్యాన్’ (Run as slow as you can) పేరిట టాయిలెట్ పేపర్ అనే మ్యాగజైన్ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. జులై 22న ప్రారంభమైన ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ అక్టోబర్ 22 వరకు సుదీర్ఘంగా కొనసాగనుంది. ఏడేళ్ల లోపు చిన్నారులు, సీనియర్ సిటిజెన్లు, ఆర్ట్ విద్యార్థులకు ఈ ప్రదర్శన పూర్తిగా ఉచితమని కల్చరల్ సెంటర్ పేర్కొంది. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన కళ్లు చెదిరే కళాకృతులు చిన్నారులు, యువతను అమితంగా ఆకట్టుకుంటాయని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ చైర్పర్సన్ నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీ పేర్కొన్నారు. ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రఖ్యాత కళాకారులు, ఔత్సాహికులు తరలివచ్చారు. వీరితో కలిసి ఇషా అంబానీ సందడి చేశారు. ఇదీ చదవండి ➤ IPL 2023: ఫ్రీగా చూపించినా.. వేల కోట్లు సంపాదించారు! రంగురంగుల కార్నివాల్, 10,000 అరటిపండు బుడగలతో నిండిన స్విమ్మింగ్ పూల్, వింటేజ్ కారు, విలాసవంతమైన మొసలి ఆసనం, కళాకృతంగా తీర్చిదిద్దిన గోడలు వంటివి మంత్రముగ్ధులను చేస్తాయని, సందర్శకులు నచ్చినన్ని ఫొటోలు తీసుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించి బనానా పూల్‌లో ఆటలాడుతూ సందడి చేశారు. -
ముంబయిలో బాలీవుడ్ భామ ఆలియా భట్ సందడి (ఫొటోలు)
-
దీపికా పదుకోణె భర్తతో ఆలియా భట్ ర్యాంప్ వాక్
-
తారల మెరుపులతో మనీష్ మల్హోత్రా ఈవెంట్ (ఫొటోలు)
-
ఈ పాపని గుర్తుపట్టారా? ఇక్కడ పుట్టి బాలీవుడ్‌ని ఏలుతోంది!
దక్షిణాది భామల్ని బాలీవుడ్ పెద్దగా పట్టించుకోదు. ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్లి సినిమాలు చేసినా మహా అయితే ఒకటో రెండో అంతే. కానీ పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి మాత్రం.. ఇక్కడ నుంచి వెళ్లి హిందీలో పాగా వేసింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ హిందీ చిత్రసీమని ఏలుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ అంటే డైరెక్టర్స్ ఈమె వైపే చూస్తున్నారు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?) పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు దీపికా పదుకొణె. ప్రభాస్ ప్రాజెక్ట్ K అలియాస్ 'కల్కి 2898 AD'లో ఈమెనే హీరోయిన్. కాకపోతే వ్యక్తిగత కారణాల వల్ల శాన్ డియాగోలో జరిగిన కామికాన్ ఈవెంట్‌కి వెళ్లలేకపోయింది. సరే దీపికా వ్యక్తిగత విషయానికొస్తే.. బెంగళూరుకు చెందిన స్టార్ షట్లర్ ప్రకాశ్ పదుకొణె కూతురు ఈమె. తండ్రిలా స్పోర్ట్స్ ప్లేయర్ కాకుండా నటిగా మారింది. ఫస్ట్ మూవీ కన్నడలోనే చేసింది. కొన్నాళ్లకు బాలీవుడ్ కు షిప్ట్ అయిపోయింది. యాక్టర్ గా నిరూపించుకున్న ఈ బ్యూటీ.. స్టార్ హీరోల తనకోసం ఎదురుచూసే రేంజుకి వెళ్లిపోయింది. హిందీతో పాటు ఇంగ్లీష్ సినిమాల్లో నటించి, గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే పద్మావత్, రామ్ లీలా సినిమాల్లో తనతో కలిసి నటించిన రణ్వీర్ సింగ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఇద్దరూ బిజీ బిజీ. దీపికా చేస్తున్న వాటిలో ప్రభాస్ 'కల్కి', మన దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న మూవీ కావడం విశేషం. గ్లింప్స్‌లో దీపిక అలా కాసేపు కనిపించి సందడి చేసింది. View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఆ సీక్రెట్ బయటపెట్టిన కమల్) -
స్టార్ హీరోకు భార్య బర్త్ డే విషెస్.. ఇంత ఆలస్యంగానా..!
బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లో దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ జంట ఒకరు. గోలియోన్ కి రాస్లీలా: రామ్ లీలా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట ఆరేళ్ల పాటు డేటింగ్ ఉన్నారు. ఆ తర్వాత 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే చాలాసార్లు ఈ జంట విడిపోతున్నట్లు రూమర్స్ బీ టౌన్లో వినిపించాయి. కానీ వాటిని ఈ జంట కొట్టిపారేసింది. తామిద్దరం బాగానే ఉన్నట్లు పలుసార్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) ఇటీవలే జూలై 6న రణ్వీర్ సింగ్ బర్త్‌డే సందర్భంగా దీపికా విష్ చేయలేదు. అయితే బర్త్ డే అయిపోయిన రెండు రోజులకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో తన భర్తపై ప్రశంసలు కురిపించింది. పురుషుల ఫ్యాషన్‌కు బ్రాండ్‌గా నిలిచారంటూ భర్తను పొగిడింది . ఆ ఫోటోలు రణ్వీర్ సింగ్ డిఫరెంట్ డ్రెస్‌లో కనిపించారు. అంతే కాకుండా "హెల్ యా" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాగా.. దీపికా పదుకొణే ప్రస్తుతం ప్రభాస్ సరసన ప్రాజెక్ట్-కె చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో ఫైటర్‌లో నటించనుంది. రణ్వీర్ సింగ్ ప్రస్తుతం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రంలో కనిపించనున్నారు. (ఇది చదవండి: దీపికా- రణ్‌వీర్‌కు అసలేమైంది.. మరోసారి తెరపైకి రూమర్స్!) -
'పుష్ప-2'లో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో ప్రస్తుతం 'పుష్ప-2: ది రూల్'రూపొందుతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కుతుంది. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో తెలుగుతో పాటు కన్నడ, తమిళ పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులు పుష్ప-2 భాగస్వామ్యం కానున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్‌గా కీలక పాత్రలో కనిపించనున్నారట. ఇందులో ఎంత నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. -
దీపీక ఇంటర్వ్యూలో రన్వీర్ సర్ప్రైజ్
-
వైరల్ వీడియో: డ్యాన్స్‌తో అదరగొడుతున్న ముంబై పోలీస్
-
దీపికా- రణ్‌వీర్‌కు అసలేమైంది.. మరోసారి తెరపైకి రూమర్స్!
బాలీవుడ్ రొమాంటిక్ కపుల్స్‌లో దీపికా పదుకొణె- రణ్వీర్ సింగ్ జంట ఒకరు. ఎక్కడికెళ్లినా ఈ ప్రేమజంటపైనే అందరి దృష్టి ఉంటుంది. అంతే కాదు వీరిద్దరు చాలా అన్యోన్యంగా కనిపిస్తారు కూడా. ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఫోటోలకు ఫోజులిస్తారు. మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌గా ఈ జంటకు పేరుంది. అయితే ఇటీవల జరిగిన ఓ స్పోర్ట్స్ అవార్డ్ ఈవెంట్లో దీపికా-రణ్వీర్ సింగ్ జంట అభిమానులకు షాకిచ్చింది. ఎందుకంటే ఈవెంట్లో పాల్గొనేందుకు వచ్చిన జంట ఒకరికొకరు దూరం పాటించారు. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై మరోసారి చర్చకు దారితీసింది. దీపికా-రణ్వీర్ స్టోర్ట్స్ అవార్డ్స్ ఈవెంట్‌కు వెళ్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వీడియోలో రణ్వీర్ సింగ్.. దీపికా చేయి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆమె కనీసం పట్టించకోలేదు. దీంతో అలాగే ఇద్దరు నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఈ వీడియో చూసిన అభిమానులు వీరిమధ్య గొడవలు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. 'దీపికా కోపంగా ఉంది. అందుకే రణ్వీర్ చేతిని పట్టుకోలేదు. ఈవెంట్‌కి ముందు వాళ్ల మధ్య గొడవలు జరిగినట్లు అనిపిస్తోంది.' అంటూ కామెంట్స్ చేశారు. మరొకరు రాస్తూ..'ఇద్దరి బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. ఒకరు చేయి ఒకరు పట్టుకోవడానికి ఇష్టంగా లేరు.' అంటూ రాసుకొచ్చారు. కాగా.. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కించిన రామ్-లీలా సినిమా చేస్తున్న సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. దాదాపు ఆరేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట 2018లో ఇటలీలో సన్నిహితుల వేడుకలో పెళ్లి చేసుకున్నారు. అయితే గతంలో దీపికా పదుకొనె-రణ్వీర్ సింగ్‌లు విడాకులు తీసుకోబుతున్నారంటూ ప్రచారం జరిగింది. రణ్వీర్ నగ్న ఫొటోషూట్ వివాదం నుంచి వారి వైవాహిక బంధంలో మనస్పర్థలు వచ్చాయని, అందువల్లే వీరు విడిపోతున్నారనే రూమర్స్ వినిపించాయి. అయితే విడాకుల రూమర్స్‌పై దీపికా కొట్టిపారేసింది. మా మధ్య ఎలాంటి గొడవలు లేవని.. రణ్వీర్తో అంతా బాగానే ఉందని తెలిపింది. #DeepikaPadukone #RanveerSingh weird chemistry at event pic.twitter.com/cXO6RRRvYQ — Harminder 🍿🎬🏏 (@Harmindarboxoff) March 24, 2023 -
Virat Kohli: విరాట్ కోహ్లికి ఊహించని షాక్!
Virat Kohli- Ranveer Singh: భారత సెలబ్రిటీల జాబితాలో ముందు వరుసలో ఉండే పేరు విరాట్ కోహ్లి. అంతర్జాతీయ క్రికెట్లో 75 సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ రన్‌మెషీన్ పేరే ఓ బ్రాండ్ అనడంలో సందేహం లేదు. రికార్డుల రారాజు అయిన కింగ్ కోహ్లి.. బ్రాండ్ వాల్యూ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అయితే, తాజా నివేదికల ప్రకారం.. దేశంలోని మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీ ట్యాగ్‌ను కోహ్లి కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ స్థానాన్ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఆక్రమించినట్లు సమాచారం. కాగా గత ఐదేళ్లుగా కోహ్లి వరుసగా ఇండియా మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీగా కొనసాగుతున్నాడు. అయితే, 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ వదిలేసిన కోహ్లిని.. ఆ తర్వాతి ఏడాదిలో వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. అనంతరం కోహ్లి టెస్టు పగ్గాలు కూడా వదిలేశాడు. అగ్రస్థానంలో రణ్వీర్ సింగ్! ఓ వైపు కెప్టెన్సీ చేజారడం.. అదే సమయంలో నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన కోహ్లి ఖాతాలో వెయ్యి రోజుల పాటు సెంచరీ అన్నదే లేకుండా పోయింది. ఈ పరిణామాలు కోహ్లి బ్రాండ్ వాల్యూపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో క్రోల్స్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ రిపోర్టు 2022లో ఈ మేరకు రణ్వీర్ కోహ్లిని వెనక్కినెట్టి అగ్రస్థానానికి దూసుకువచ్చినట్లు పేర్కొంది. పడిపోయిన బ్రాండ్ వాల్యూ కోహ్లి బ్రాండ్ వాల్యూ 185.7 మిలియన్ డాలర్ల(2021లో) నుంచి గతేడాది 176.9 మిలియన్ డాలర్లకు పడిపోయినట్లు వెల్లడించింది. అదే సమయంలో 2021లో 158.3 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూ కలిగిన రణ్వీర్ సింగ్.. 2022లో 181.7 మిలియన్ డాలర్లతో టాప్‌లోకి దూసుకొచ్చినట్లు తెలిపింది. త్వరలోనే మళ్లీ పూర్వవైభవం అయితే, కోహ్లి బ్రాండ్ వాల్యూలో ఈ మేర పతనం తాత్కాలికమేనని.. త్వరలోనే అతడు పూర్వవైభవం పొందే అవకాశం ఉందని క్రోల్ వాల్యూయేషన్ సర్వీసెస్ ఎండీ అవిరల్ జైన్ మనీ కంట్రోల్‌తో వ్యాఖ్యానించారు. 34 ఏళ్ల కోహ్లి బ్రాండ్ వాల్యూ క్రికెటర్‌గా తారస్థాయికి చేరిందని.. త్వరలోనే నాన్- క్రికెటర్‌గానూ వాల్యూబుల్ సెలబ్రిటీగా అదే స్థాయికి చేరుకోగలడని పేర్కొన్నారు. భార్య అనుష్క శర్మతో విరాట్ కోహ్లి ధోని మాదిరి సతీమణి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి పలు బ్రాండ్లకు ఎండార్స్ చేస్తున్న కోహ్లి.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని మాదిరి నాన్- క్రికెటింగ్ విభాగంలోనూ సత్తా చాటగలడని జైన్ అభిప్రాయపడ్డారు. 2021లో కోహ్లి బ్రాండ్ వాల్యూలో 5 శాతం తరుగుదల నమోదైందని.. అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా మరోసారి కోహ్లి మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీ హోదా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. కింగ్ ఎల్లప్పుడూ కాగా ఆసియా కప్-2022 టీ20 టోర్నీతో సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి ఇటీవల ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా టెస్టుల్లోనూ శతక కరువు తీర్చుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 75 సెంచరీలు బాదిన అతడు.. బ్యాటర్‌గా పూర్వవైభవం సాధించాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి తిరిగి మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీ ట్యాగ్ పొంది రణ్వీర్ను వెనక్కినెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చదవండి: WC 2023: వరల్డ్‌కప్-2023 టోర్నీ ఆరంభం ఆరోజే.. ఫైనల్ ఎక్కడంటే! హైదరాబాద్‌లోనూ.. WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఫైనల్ చేరిన తొలి జట్టుగా.. పాపం ముంబై! -
అందరి కళ్లు దీపికా పదుకొణె వైపే.. ఆ శారీ అన్ని లక్షలా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ముంబైలో గురువారం జరిగిన ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కు బాలీవుడ్ నుంచి దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ పాల్గొన్నారు. తాజాగా ఈ వేడుకలో పాల్గొన్న బాలీవుడ్ జంట ధరించిన దుస్తులపై నెట్టింట చర్చ నడుస్తోంది. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె సంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కాగా.. దీపికా చీరలో అద్భుతంగా కనిపించగా.. రణ్వీర్ షేర్వాణీ ధరించి తళుక్కున మెరిశారు. దీపికా ధరించిన సిందూరి తాషి చీర దాదాపు రూ. 1.50 లక్షలుగా ధర ఉన్నట్లు తెలుస్తోంది. బంగారం, ఎరుపు కలయికతో రూపొందించిన ఈ చీరను షాలీనా నథాని అనే స్టైలిస్ట్ తయారు చేశారు. రణ్వీర్ సింగ్ షేర్వాణీ ధరించడంతో ఈ జంట మరింత ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలో వీరితో పాటు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్, మనీష్ మల్హోత్రా, అర్జున్ కపూర్, బోనీ కపూర్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్య, కత్రినా కైఫ్, జాన్వీ కపూర్, ఖుషి కపూర్, అనన్య పాండే సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. -
సాంగ్ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో మునిగిపోయిన బాలీవుడ్ జంట
బాలీవుడ్ ప్రేమజంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె నటనతో ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేశారు. 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు ఈ జంట. తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో ఈ ప్రేమజంట రెచ్చిపోయింది. ఓ సాంగ్ రిలీజ్ ఫంక్షన్లో వేదికపైనే ముద్దుల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె జంటగా తాజాగా నటించిన చిత్రం 'సర్కస్'. తాజాగా ఈ చిత్రంలోని 'కరెంట్ లగా రే' అనే పాటను ముంబయిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ పవర్ కపుల్స్ వారి ప్రేమను ఆపుకోలేకపోయారు. వేదికపైనే ముద్దుల్లో మునిగితేలారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో దీపికా పదుకొణె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు జోడిగా 'ప్రాజెక్ట్ కె' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. రోహిత్ శెట్టి మూవీ సర్కస్ విలియం షేక్స్పియర్ నాటకం ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో వరుణ్ శర్మ, పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సిద్ధార్థ జాదవ్, జానీ లివర్, సంజయ్ మిశ్రా, వ్రజేష్ హిర్జీ తదితరులు నటించారు. డిసెంబర్ 23న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
'నీకేం పోయే కాలం'.. రసెల్‌పై అభిమానుల ఆగ్రహం
వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిపై దుస్తులు లేకుండా ఫోటో దిగిన రసెల్ దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం ఆగ్రహాం తెప్పించింది. ప్రైవేట్ లీగ్స్ మోజులో పడి దేశానికి ఆడడం మానేసిన రసెల్‌పై.. ''నీకేం పోయే కాలం.. ఈ సోకులకేం తక్కువ లేదు.. ఇలాంటి వాటిలో కాదు ఆటలో చూపించు నీ ప్రతాపం'' అంటూ మండిపడ్డారు. కాగా భారత అభిమానులు మాత్రం రసెల్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. రసెల్ దిగిన న్యూడ్ ఫోటోనూ చాలామంది రణ్వీర్ సింగ్ ఫోటోతో పోలుస్తున్నారు కొన్ని నెలల క్రితం బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ఒక మ్యాగ్జైన్ కోసం ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫోటోషూడ్ ఇచ్చాడు. అప్పట్లో రణ్వీర్ ఫోటోషూట్‌పై పెద్ద వివాదామే నడిచింది. తాజాగా రసెల్‌ను కూడా రణ్వీర్తో పోలుస్తూ కామెంట్స్ చేశారు. ఇక రసెల్ విండీస్ తరపున ఆడి చాలా కాలమైపోయింది. విండీస్ క్రికెట్ బోర్డు సీఈవోతో గొడవ రసెల్‌ను జాతీయ జట్టుకు దూరం చేసింది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో చివరి మ్యాచ్ ఆడిన రసెల్ మళ్లీ జాతీయ జట్టు గడప తొక్కలేదు. ఇక ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ ఘోర ప్రదర్శన కనబరిచింది. కనీసం క్వాలిఫయర్ దశ కూడా దాటలేయపోయిన విండీస్ అవమానకర రీతిలో నిష్క్రమించింది. ఇక రసెల్ విండీస్ తరపున 56 వన్డేలు, 67 టి20మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఇటీవలే ఐపీఎల్లో కేకేఆర్ ఆండ్రీ రసెల్‌ను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు కేకేఆర్ 11 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా 16 మందిని వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం కోల్‌కతా పర్స్‌లో రూ. 7.5 కోట్లు ఉన్నాయి. కేకేఆర్ రిటైన్ లిస్ట్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రానా, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్ కేకేఆర్ రిలీజ్ లిస్ట్: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్ pic.twitter.com/TXsXnEC0Zy — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2022 pic.twitter.com/TXsXnEC0Zy — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2022 pic.twitter.com/TXsXnEC0Zy — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2022 wtf?! 😭😭😭 — fahad. (@abeeyaaar) November 18, 2022 చదవండి: సెలెక్టర్ల కథ ముగించారు.. రోహిత్ శర్మను ఎప్పుడు? -
ప్రస్తుతం బాలీవుడ్ కన్ను ఈ ట్రయాలజీపైనేనా?
ఫ్రాంచైజీ, రీమేక్స్, బయోపిక్స్ ట్రెండ్ల తర్వాత బాలీవుడ్ ప్రస్తుతం ట్రయాలజీ (ఒకే కథను మూడు భాగాలుగా) ట్రై చేస్తోంది. అరడజను ట్రయాలజీ ఫిలింస్ వెండితెరపైకి రానున్నాయి. ఆ ‘ట్రైయాలజీ’ చిత్రాల వివరాల్లోకి వెళితే... బ్రహ్మాస్త్రం ఐదేళ్లుగా సినీ లవర్స్ ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీ గురించి వింటూనే ఉన్నారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీలక పాత్రల్లో ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీలోని తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ రూపొందింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమా దక్షిణాది వెర్షన్‌కు రాజమౌళి సమర్పకులుగా ఉండటం విశేషం. ఈ ఏడాది సెప్టెంబరు 9న ఈ చిత్రం విడుదలైంది. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ రెండు, మూడు భాగాలపై ఫోకస్ పెట్టారు మేకర్స్. రెండో భాగంలోని ప్రధాన పాత్రల కోసం హృతిక్‌రోషన్ , రణ్వీర్ సింగ్, దీపికా పదుకోనె పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇతిహాసాల ఆధారంగా...! ట్రయాలజీ ఫిలింస్ తీసేంత స్కోప్ రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలకు ఉంది. ఆల్రెడీ బాలీవుడ్ ప్రముఖ దర్శకులు నితీష్ తివారి, రవి ఉడయార్లు కలిసి రామాయణం ఆధారంగా ఓ ట్రయాలజీని ప్లాన్ చేశారు. అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా వంటి అగ్ర నిర్మాతలు ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్రధారులుగా మహేశ్‌బాబు, రామ్‌చరణ్, హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ వంటి స్టార్ల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర ఆధారంగా హిందీలో ఓ ట్రయాలజీ రూపుదిద్దుకోనుంది. ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే టైటిల్‌ను కూడా ప్రకటించారు. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ చేయనున్న ఈ చిత్రానికి అదిత్య థార్ దర్శకత్వం వహిస్తారు. అలాగే ‘మహాభారతం’ ఆధారంగా సింగపూర్‌కు చెందిన కృష్ణ ఉదయశంకర్ రాసిన ‘ది ఆర్యావతార క్రానికల్స్’ (గోవింద, కౌరవ, కురుక్షేత్ర) పుస్తకం హక్కులను సోనమ్ కపూర్ దక్కించు కున్నారు. ‘ది ఆర్యావతార క్రానికల్స్’ను ట్రయాలజీగా నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సోనమ్ పేర్కొన్నారు. ఇంకా ‘మహాభారతం’ ఆధారంగా ఓ సినిమా చేయాలన్నది తన డ్రీమ్ అని దర్శకుడు రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కూడా ట్రయాలజీనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త నాగిని వెండితెరపై నాగిని అనగానే హిందీలో శ్రీదేవి, రీనా రాయ్, రేఖ గుర్తుకు వస్తారు. ఈ జాబితాలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరు చేరనుంది. ‘నాగిని’ ట్రయాలజీలో నటించేందుకు శ్రద్ధా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాల్ ఫురియా దర్శకత్వంలో ఈ ట్రయాలజీని నిఖిల్ ద్వివేది నిర్మించనున్నారు. ఛత్రపతి మహావీరుడు ఛత్రపతి శివాజీ జీవితంతో ఓ ట్రయాలజీని నిర్మించనున్నట్లు నటుడు, నిర్మాత రితేష్ దేశ్‌ముఖ్ రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఈ ట్రయాలజీని తెరకెక్కించేందుకు మరాఠీ దర్శకులు ‘సైరట్’ ఫేమ్ నాగరాజ్ మంజులే, రవీంద్ర జాదవ్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. శక్తిమాన్ ఇక బుల్లితెర, వెండితెర సూపర్ హీరోస్‌లలో శక్తిమాన్‌కు ఆడియన్స్‌లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సూపర్ హీరో క్రేజ్‌ను క్యాష్ చేసుకునే దిశలో ఇప్పటికే పలువురు నిర్మాతలు సినిమాలు తీశారు. తాజాగా అగ్ర నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ‘శక్తిమాన్’ టైటిల్‌తో ఓ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. ట్రయాలజీగా రూపొందించేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, టైటిల్ రోల్లో రణ్వీర్ సింగ్ కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇవే కాదు.. మూడు భాగాల చిత్రాలు మరికొన్ని తెరపైకి వచ్చే చాన్స్ ఉంది. -
రూ.3.9 కోట్ల విలువైన రణ్వీర్ కారుకు ఇన్సూరెన్స్ లేదా? అందులో నిజమెంత?
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌పై ఓ నెటిజన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ హీరో నడుపుతున్న కారుకు ఇన్సూరెన్స్ లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'దయచేసి ముంబై పోలీసులు అతనిపై కఠిన చర్యలు తీసుకోండి' అంటూ కారు ఇన్సూరెన్స్ సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేశాడు. అందులో జూన్ 28, 2020న బీమా గడువు ముగిసినట్లు ఉంది. అయితే ఆ కారు విలువ దాదాపు రూ.3.9 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రణ్వీర్ ముంబై విమానాశ్రయంలో తన ఖరీదైన ఆస్టన్ మార్టిన్‌ను నడుపుతూ కనిపించాడు. అయితే కారు ఫోటోలు తీసిన నెటిజన్ ఇన్సూరెన్స్ లేదంటూ ట్విటర్ ద్వారా ఆరోపించాడు. అయితే చివరికి ఆ నెటిజన్‌కు దిమ్మదిరిగే షాక్ తగిలింది. రణ్వీర్ సింగ్ నడిపిన కారుకు బీమా ఉన్నట్లు తేలింది. ఇన్సూరెన్స్‌కు సంబంధించిన రసీదును మీడియాలో పంచుకోవడంతో నెటిజన్ కంగుతిన్నాడు. దీంతో నెటిజన్లు ప్రముఖులపై ఫిర్యాదు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. Request @MumbaiPolice , @MTPHereToHelp to take cognisance against actor #RanveerSingh for driving Aston Martin with expired insurance. Insurance Nahi toh Next Time Tumhara Time Aayga" pic.twitter.com/eXqrrvyLw2 — Furkan Shaikh (@Furkanrshaikh) October 18, 2022 -
ఎట్టకేలకు విడాకుల వార్తలపై స్పందించిన దీపికా
బాలీవుల్ స్టార్ కపుల్ దీపికా పదుకొనె-రణ్వీర్ సింగ్‌లు విడాకులు తీసుకోబుతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రణ్వీర్ నగ్న ఫొటోషూట్ వివాదం నుంచి వారి వైవాహిక బంధంలో మనస్పర్థలు వచ్చాయని, అందువల్లే వీరు విడిపోతున్నారనే వాదనలు వినిపించాయి. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన రణ్వీర్-దీపికా విడాకుల వార్తలే దర్శనం ఇచ్చాయి. అయితే ఇప్పటి వరకు దీపికా-రణ్‌వీర్‌లు ఈ రూమర్లపై స్పందించలేదు. దీంతో ఈ వార్తలపై క్లారిటీ లేక ఈ జంట ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తమ విడాకుల రూమర్స్‌పై దీపికా స్పందించింది. చదవండి: కాస్టింగ్ కౌచ్‌పై స్పదించిన బిగ్‌బాస్ దివి.. ఇటీవల ఓ ఎగ్జిబిషన్ ఈవెంట్లో పాల్గొన్న దీపికాకు ఓ విలేకరి నుంచి విడాకులపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అలాంటిది ఏం లేదని, అవన్ని వట్టి పుకార్లనంటూ కొట్టిపారేసింది. ‘మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేం చాలా హ్యాపీగా ఉన్నాం. గత వారం రణ్వీర్ ఓ మ్యూజిక్ ఫెస్టివల్లో భాగంగా ఇంటికి దూరంగా ఉన్నారు. ఆయన తిరిగి ఇంటికి రాగానే నన్ను చూసి పట్టలేనంద ఆనందం చూపించాడు’ అంటూ డైవర్స్ రూమర్లకు చెక్ పెట్టింది. కాగా ఆరేళ్లు ప్రేమలో మునిగి తేలిన దీపికా-రణ్‌వీర్‌లు నవంబర్ 14, 2018లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే.. షారుక్ ఖాన్ పఠాన్, ప్రభాస్ ప్రాజెక్ట్ కె చిత్రాలతో దీపికా బిజీగా ఉంది. చదవండి: నయన్ సరోగసీ వివాదం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం? -
Neeraj Chopra: అల్లు అర్జున్‌తో 'తగ్గేదే లే'.. రణ్వీర్తో చిందులు
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' ఈవెంట్లో తళుక్కున మెరిశాడు. ఢిల్లీ వేదికగా సీఎన్ఎన్ న్యూస్-18 ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన ఈవెంట్లో నీరజ్ చోప్రాతో పాటు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ సహా మరికొంత మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప: ది రైస్ సినిమాకు ''ఇండియన్ ఆఫ్ ది ఇయర్'' అవార్డు అందుకోగా.. ఆ తర్వాత క్రీడా విభాగంలో నీరజ్ చోప్రా ఈ అవార్డు తీసుకున్నాడు. నీరజ్ చోప్రా, అల్లు అర్జున్‌లు ఒకే వేదికను పంచుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజిచ్చిన అనంతరం తనివీ తీరా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే నీరజ్ చోప్రా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ఫేమస్ డైలాగ్ 'తగ్గేదే లే' మేనరిజంను చేసి చూపించాడు. ఆ సమయంలో అల్లు అర్జున్ కూడా అక్కడే ఉండడంతో ఇద్దరు కలిసి తగ్గేదే లే అంటూ ఫోజిచ్చారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌తో కలిసి స్టేజీపై డ్యాన్స్‌తో అదరగొట్టాడు నీరజ్ చోప్రా. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ట్రోఫీని తొలిసారి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈటెను 88.44 మీటర్ల దూరం విసిరి ట్రోఫీ కొల్లగొట్టాడు. 2017, 2018 డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్‌కు నీరజ్ అర్హత సాధించినప్పటికి ట్రోఫీ కొట్టేలేకపోయాడు. ఈసారి మాత్రం ట్రోఫీ అందుకున్న నీరజ్ చోప్రా వచ్చే ఏడాది హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ బెర్తును ఇప్పటికే ఖరారు చేసుకున్నాడు. #NeerajChopra and #AlluArjun together doing a javelin throw and #Pushpa gesture! #IndinofTheYear @cnnbrk pic.twitter.com/JKZdLBrfvK — Griha Atul (@GrihaAtul) October 12, 2022 Grand finale #IndianOfTheYear #RanveerSingh and #NeerajChopra rock the stage @CNNnews18 pic.twitter.com/dOBATvOUwN — Griha Atul (@GrihaAtul) October 12, 2022 చదవండి: అంబటి రాయుడు, షెల్డన్ జాక్సన్ వాగ్వాదం.. వీడియో వైరల్ పుష్ప: తగ్గేదే లే అంటూ.. నాన్‌స్టాప్‌గా షూటింగ్! -
దీపికా పదుకొనె ఫోటోషూట్‌పై రణ్వీర్ సింగ్ కామెంట్
హీరోయిన్ దీపిక పదుకొనె తన అందం, నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకంది. స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇక దీపికా ఫ్యాషన్ ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన స్టైల్‌తో మెస్మరైజ్ చేసే దీపిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోషూట్‌ని షేర్ చేసింది. లూయిస్ విటాన్ బ్రాండ్‌కు చెందిన అవుట్‌ఫిట్‌లో ఫిదా చేసింది. ఈ ఫోటోపై ఆమె భర్త రణ్వీర్ సింగ్ హార్ట్ ఎమోజీ షేర్ చేస్తూ కామెంట్ చేశాడు. కాగా కొంతకాలంగా రణ్వీర్-దీపికల మధ్య విబేధాలు తలెత్తాయంటూ పుకార్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీపిక పోస్టుకు రణ్వీర్ కామెంట్ చేయడంతో అలాంటి రూమర్స్‌లో నిజం లేదంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక దీపిక ఫోటోషూట్ చూసి ఆలియాభట్ సహా పలువురు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) -
దీపిక పదుకొణేకు రణ్వీర్ స్పెషల్ విషెస్.. సోషల్ మీడియాలో వైరల్..!
బాలీవుడ్ రొమాంటిక్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొనే. ఈ ప్రేమ జంట ఎల్లప్పుడూ సోషల్ మీడియా పోస్ట్‌లతో అభిమానులను అలరిస్తుంటారు. తన భార్య సాధించిన విజయాల గురించి ఎంతో గర్వపడుతున్నట్లు చాలాసార్లు స్పష్టం చేశారు. తాజాగా ఆయన దీపికా పదుకొణెపై సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ప్రస్తుతం ఆమె ఓ షో కోసం పారిస్ వెళ్లగా.. అక్కడ ఏర్పాటు చేసిన ఆమె ఫోటో ముందు నిలబడి ఫోజులిచ్చాడు రణ్వీర్ సింగ్. రణ్వీర్ సింగ్ ఒక సుందరమైన శీర్షికతో దీపికకు శుభాకాంక్షలు తెలిపాడు. తన ఇన్‌స్టాలో రాస్తూ.. '.ఈరోజు గొప్ప ప్రదర్శన బేబీ! దీపికా పదుకొణేను' ట్యాగ్ చేశారు. రణ్వీర్ విషయానికి వస్తే చివరిసారిగా జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో కనిపించారు. ఇది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. రణ్వీర్ తదుపరి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న సిర్కస్ అనే కామెడీ ఎంటర్టైనర్లో కనిపించనున్నాడు. రణ్వీర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. మరో రొమాంటిక్ కామెడీ చిత్రం 'రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ'కోసం కరణ్ జోహార్‌తో జతకడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అలియా భట్ కథానాయికగా నటిస్తోంది. మరోవైపు దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్‌తో కలిసి యాక్షన్ థ్రిల్లర్ పఠాన్‌లో కనిపించనుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జనవరి 2023లో థియేటర్లలోకి రానుంది. ప్రభాస్ నటిస్తున్నప్రాజెక్ట్ కె చిత్రంతో ఆమె తెలుగులోకి కూడా అరంగేట్రం చేస్తోంది. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) -
దీపికా -రణ్‌వీర్‌లు విడాకులు తీసుకోబోతున్నారా? కారణం ఇదేనా!
బాలీవుడ్ క్యూట్ కపుల్లో దీపికా పదుకొనె-రణ్వీర్ సింగ్ జంట ఒకటి. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏ అవార్డు ఫంక్షన్స్, సినిమా ఈవెంట్స్‌లో చూసిన వీరిద్దరు చాలా అన్యోన్యంగా కనిపించేవారు. అలాంటి ఈ జంట త్వరలో విడాకులు తీసుకోబోతుందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పమన్నాయి. దీపికా-రణ్‌వీర్‌ల మధ్య మనస్పర్థలు వచ్చాయని, ప్రస్తుతం వీరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారంటూ బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: ‘పొన్నియన్ సెల్వన్’పై ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ, మండిపడ్డ సుహాసిని అలాగే రణ్వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్ వల్లే వీరిమధ్య విభేదాలు వచ్చాయంటున్నారు. అంతేకాదు ఉమైర సంధూ అనే రివ్యూవర్, ఫిలిం క్రిటిక్ దీపికా-రణ్‌వీర్‌ల బంధం చెడిందని, త్వరలోనే వారి విడాకుల ప్రకటన రానుందంటూ ట్వీట్ చేయడంతో ఈ వార్తలు ఒక్కసారి వైరల్‌గా మారాయి. దీంతో ఈ జంట ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై దీపికా ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రణ్వీర్ తమ విడాకుల రూమర్స్‌పై స్పందించాడు. చదవండి: పొన్నియన్ సెల్వన్: ఐశ్వర్యరాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ‘దీపికాతో నాకు 2012లో పరిచయం ఏర్పడింది. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఈ పదేళ్లలో తనపై ఇంకా ప్రేమ పెరిగింది. దీపికా నా లైఫ్‌లోకి వచ్చాక నా జీవితం ఇంకా అందంగా మారింది. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు’ అని స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే ఈ రోజు(శుక్రవారం) ఉదయం దీపికా తన తల్లి ఉజ్జల పదుకొనెతో ఎయిర్‌పోర్ట్‌లో దర్శనం ఇచ్చింది. ఈ వీడియోలో దీపికా చేతికి వెడ్డింగ్ రింగ్ కనిపించలేదు. అది పట్టేసిన నెటిజన్లు ’హో.. దీపికా వెడ్డింగ్ రింగ్ తీసేసింది.. అంటే వీరి విడాకుల వార్తలు నిజమేనా?’ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by HT City (@htcity) -
ఆ ఫోటో నాది కాదు, మార్ఫింగ్ చేశారు.. రణ్వీర్ సింగ్ కొత్త ట్విస్ట్
సోషల్ మీడియాలో నగ్న ఫోటోలు పెట్టిన వ్యవహారంలో రణ్వీర్ సింగ్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులకు రణ్వీర్ కొత్త ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలలో ఒకటి తనది కాదని, ట్యాంపర్ చేసి, మార్పింగ్ చేసినట్లు రణ్వీర్ ఆరోపించారు. ఇటీవల ముంబై పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రణ్వీర్ సింగ్ ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఓ మ్యాగజైన్ కోసం రణ్వీర్ సింగ్ నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలను రణ్వీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీనిపై పలు సామాజిక, మహిళ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో రణ్‌వీర్‌పై పోలీసు కేసు కూడా నమోదైంది. ఇక మహిళ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు రణ్‌వీర్‌పై కేసు నమోదు చేశారు -
రణ్వీర్ చెంప చెళ్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే..
ఇటీవల జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌కు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఈవెంట్లో బాడిగార్డ్.. రణ్వీర్ చెంప చెళ్లుమనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ప్రతి ఏటా నిర్వహించిన ప్రతిష్టాత్మక సైమా 2022 అవార్డు కార్యక్రమాన్ని శనివారం బెంగళూరులో ఘనంగా నిర్వహించారు. ఈ అవార్డు ఫంక్షన్‌కు దక్షిణాది చెందిన అగ్ర తారలతో పాటు బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. చదవండి: సిసింద్రి టాస్క్‌లో ట్విస్ట్.. శ్రీహాన్‌కు షాకిచ్చిన గలాట గీతూ టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, పూజా హెగ్డె, విజయ్ దేవరకొండ, సుకుమార్‌లు తదితరులు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణ్వీర్ సింగ్ కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఆయన తనదైన స్టైల్లో సందడి చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బాలీవుడ్ మోస్ట్ పాపులర్ యాక్టర్‌గా రణ్వీర్ ఈ అవార్డును కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఫంక్షన్‌కు హజరైన రణ్వీర్ బయట సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇక వారితో సరదాగా మాట్లాడుతూ సెల్ఫీలకు ఫోజులు ఇస్తున్నాడు. చదవండి: నేను సినిమాలు మానేయాలని కోరుకున్నారు, అది బాధించింది: దుల్కర్ ఈ క్రమంలో రణ్వీర్ మీదకు ఎగబడుతున్న జనాలను పక్కనే ఉన్న బాడిగార్డ్స్ కంట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాడీగార్డ్ చేయి రణ్వీర్ చెంపకు గట్టిగా తగిలింది. దాంతో రణ్వీర్ ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. గట్టిగా తగలడంతో కాసేపు చెంప మీద చేయి అలాగే ఉంచి అటూ ఇటూ చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తున్నారు. Oops! Who slapped him?#RanveerSingh #slapped #Viral pic.twitter.com/0jzekvpOMr — Payal Mohindra (@payal_mohindra) September 13, 2022 -
అట్టహాసంగా సైమా అవార్డు వేడుక (ఫొటోలు)
-
నగ్న ఫొటోషూట్ కేసు: విచారణలో రణ్వీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నగ్న ఫోటోషూట్ ఎంతటి వివాదం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ మ్యాగజైన్ కోసం రణ్వీర్ సింగ్ ఇటీవల నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పలు సామాజిక, మహిళ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో రణ్‌వీర్‌పై పోలీసు కేసు కూడా నమోదైంది. ఇక మహిళ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసు స్టేషన్లో రణ్‌వీర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: చిరు ఇంట వినాయక చవితి సెలబ్రేషన్స్, వీడియో షేర్ చేసిన మెగాస్టార్ ఇటీవల ఈ కేసులో ముంబై పోలీసులు రణ్‌వీర్‌కు సమన్లు జారీ చేసి ఈనెల 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా ఈ విచారణలో రణ్వీర్ అమాయకత్వాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. రీసెంట్గా ముంబైలోని చెంబూరు పోలీసు స్టేషన్లో విచారణకు హాజరైన రణ్వీర్ను పోలీసులు 2 గంటలకుపైగా విచారించినట్లు సమాచారం. తన నగ్న ఫొటోషూట్‌పై వివాదం నెలకొన్నప్పటికీ రణవీర్ సింగ్ ఇంత వరకు నోరు విప్పకపోవడం గమనార్హం. పోలీసుల ముందు కూడా అదే విధానాన్ని కొనసాగించాడట రణ్వీర్. ఫొటోషూట్ పరిణామాలపై తనకు అవగాహన లేదంటూ బుకాయిచ్చాడట అతడు. చదవండి: సుమన్ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ చానళ్లకు నటుడు వార్నింగ్ ఇక పోలీసులు ఏం అడిగిన ఇదే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదైనా పోలీసులకు నేరుగా చెప్పాలని, మీడియాకు ఎలాంటి ప్రకటన ఇవ్వొద్దంటూ రణవీర్ సింగ్ అతడి న్యాయవాదులు సూచించినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఈ మొత్తం విచారణ సమయంలో రణవీర్ మౌనంగా ఉన్నాడని, ఫొటోలను తాను అప్లోడ్ కానీ, పబ్లిష్ చేయలేదని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసులో రణ్‌వీర్‌పై ఐపీసీ సెక్షన్ 292, 294, 509, 67(ఏ) కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అవసరమైతే మరోసారి సమన్లు ఇచ్చి పిలిపిస్తామని విచారణాధికారి వెల్లడించారు. -
చిక్కుల్లో రణ్వీర్ సింగ్.. విచారణకు హాజరు కావాలని ఆదేశం
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ చిక్కల్లో పడ్డారు. ఆయన న్యూడ్ ఫోటోషూట్ వివాదంపై ముంబై పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశారు. ఈనెల 22న విచారణకు హాజరు కావాలని కోరుతూ రణ్‌వీర్‌కు సమన్లు అందజేశారు. కాగా ఇటీవలె ఓ మ్యాగజైన్ కోసం రణ్వీర్ సింగ్ నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో మహిళల మనోభావాలను ఆయన దెబ్బతీశారంటూ శ్యామ్ మంగారాం ఫౌండేషన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రణ్‌వీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు విచారణలో ముంబైలోని చెంబూరు పోలీస్ స్టేషన్‌కి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు అందజేశారు. -
రణ్‌వీర్‌ని ఫాలో అయిన నటి.. టాప్‌లెస్ ఫొటోతో రచ్చ
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్ ఎంతటి దూమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. ఈ సంఘటనలో సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు రణ్‌వీర్‌కు మద్దతు తెలుపగా పలు సామాజిక, మహిళ సంఘాలు అభ్యంతరం తెలిపారు. రణ్వీర్ ఫొటోషూట్ మహిళల మనోభవాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ అతడిపై ముంబై కోర్టులో కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికి ఈ వ్యవహరంపై వివాదం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో రణ్వీర్ బాటలోనే ఓ నటి టాప్‌లెస్‌గా ఫొటోషూట్ చేసి వార్తల్లోకి ఎక్కింది. చదవండి: మీ మాజీ భర్త షాహిద్ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్ చూశారా? అంతేకాదు దీనికి ఆమె జత చేసిన క్యాప్షన్ చర్చనీయాంశమైంది. రోహిత్ శెట్టి ‘ఖత్రోన్ కె ఖిలాడి 12’ ఫేం,టీవీ నటి ఎరికా ప్యాకర్డ్ తాజాగా తన టాప్‌లెస్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘దీనికి రణ్వీర్ సింగ్‌కు కంపెనీ ఇస్తున్నా.. కానీ మీరు నా బమ్స్ చూడలేరు’ అంటూ వివాస్పద క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఆమె బోల్డ్ ఫొటోషూట్‌పై బాలీవుడ్ బుల్లితెర నటీనటులు, ఫాలోవర్స్ ప్రశంసలు కురిపిస్తూ ఎరికాకు మద్దతు తెలుపుతుంటే.. పలువురు నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. ‘మరో వివాదానికి తెరలేపింది’ అంటూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: అంత్యక్రియలకు గైర్హాజరు.. భార్యతో కలిసి మేనత్త ఇంటికెళ్లిన తారక్ View this post on Instagram A post shared by Erika packard ❤️ (@erikapackard) -
దుస్తులు లేకుండా రణ్వీర్ సింగ్.. అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ కపూర్
Janhvi Kapoor Comments On Ranveer Singh Nude Photoshoot: బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు సంచలనంగా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రణ్వీర్ సింగ్‌పై ముంబైలోని చెంబూర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు. అంతకుముందు.. రణ్‌వీర్‌కు చాలా మంది సెలబ్రిటీలు మద్దుతు ఇస్తుండటంతో.. అదే ఒక మహిళ ఇలాగే ఫోటోషూట్ చేస్తే ప్రశంసిస్తారా అని టీఎమ్సీ ఎంపీ, బెంగాలీ నటి మిమీ చక్రవర్తి ప్రశ్నించారు. అయితే తాజాగా ఈ ఫొటోషూట్‌పై బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ స్పందించింది. ఢిల్లీలోని రిలయన్స్ డిజిటల్ షోరూమ్‌ను తాజాగా ప్రారంభించిన జాన్వీని పలువురు విలేకర్లు రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్‌పై తన అభిప్రాయం అడిగారు. దీనికి స్పందించిన జాన్వీ.. 'అది ఒక కళాత్మక స్వేచ్ఛ అని నేను భావిస్తున్నాను. అలాంటి దానికోసం ఎవరినైనా విమర్శించడం, విశ్లేషించడం సరైన పద్ధతి కాదని అనుకుంటున్నాను' అని తెలిపింది. కాగా 1972లో కాస్మొపాలిటన్ మ్యాగజైన్ కోసం పాప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్‌కు నివాళిగా రణ్వీర్ సింగ్ ఫొటోషూట్ చేసిన విషయం తెలిసిందే. .@papermagazine pic.twitter.com/RU2tzGNUOi — Ranveer Singh (@RanveerOfficial) July 22, 2022 -
రణ్‌వీర్‌కు వెర్రి ఎక్కువ.. తన నుంచి ఇది ఆశించడం సహజమే: నటి
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నగ్న ఫొటోషూట్ చేస్తున్న రచ్చ అంతాఇంతా కాదు. దీనిని కొందరు రణ్వీర్ను ప్రశంసిస్తోంటే మరికొందరు తప్పు బడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఒంటిపై నూలు పోగు లేకుండా ఫొటోలకు ఫోజులు ఇచ్చిన మహిళల మనోభవాలను దెబ్బతీశాడని ఆరోపిస్తూ స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు రణ్వీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబైలో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. చదవండి: షూటింగ్ సంక్షోభం.. దిగొచ్చిన అగ్ర హీరోలు.. చిరు లేఖ దీనిని ఖండిస్తూ ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రణ్‌వీర్‌కు మద్దతుగా నిచ్చాడు. తాజాగా నటి, మోడల్ కోయినా మిత్రా సైతం రణ్‌వీర్‌ని సమర్థించింది. రణవీర్ సాహసం చేశాడంటూ అతడిపై ప్రశంసలు జల్లు కురిపించింది. తాజాగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భందగా రణ్వీర్ నగ్నఫొటోషూట్పై స్పందిస్తూ అందులో తప్పేముందంటూ వెనకెసుకొచ్చింది. ‘రణ్వీర్ గురించి అందరికి తెలిసిందే. ప్రయోగాలు చేసే నటుల్లో ఆయన ముందుంటాడు. తొటి నటీనటుల పట్ల, ప్రజల పట్ల, ఫ్యాన్స్‌తో చాలా సరదాగా ఉంటాడు. ఆయన చిల్డ్ అవుట్ గాయ్. చదవండి: ఫ్యాన్స్‌కి షాక్.. ఏడాదికే బ్రేకప్ చెప్పుకున్న ‘బిగ్‌బాస్’ జోడీ అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటివి ఆశించడంలో తప్పులేదు. ఆయనకు కాస్తా వెర్రి ఎక్కువ. దానితోనే అందరిని ఆకర్షిస్తాడు. స్క్రీన్‌పై అయినా స్టేజ్‌పై ఆయినా తన ఎనర్జీ అంటే నాకు ఇష్టం. రణ్వీర్ మిగతా నటుల కంటే కొంచం భిన్నం. అలాంటి తను ప్రజలను ఆకర్షించడానికి ఇలా చేశాడంటే నేను ఒప్పకొను. ఆయనకు ఆ అవసరం కూడా లేదు. తనో స్టార్. ఇది కేవలం సరదా కోసం, కాస్తా క్రేజీగా ఉండేందు ఇలా చేశాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. అదే ఫన్‌తో ఈ ఫొటోలు షేర్ చేసి ఉంటాడు. కానీ భారతీయులు ఎప్పుడు ఇతరులను జడ్జ్ చేయడంలో ముందుంటారు కదా’ అంటూ చెప్పుకొచ్చింది. -
ఆమె భర్తలా కాదు.. నా ఒంటిపై దుస్తులైనా ఉన్నాయి: నటి
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసిన ఫోటోషూట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ మ్యాగజైన్ కోసం ఆయన నగ్నంగా ఫోటోలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. రణ్వీర్ చేసిన ఫోటోషూట్‌ని కొంతమంది కొంతమంది సమర్థిస్తుంటే..మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయంపై తాజాగా నటి, మోడల్ షెర్లిన్ చోప్రా స్పందిస్తూ..రణ్‌వీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు అతని భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గతంలో దీపిక తన దుస్తుల గురించి అవమానకరంగా మాట్లాడిందని, ఇప్పుడు ఆమె భర్త ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటో దిగినే స్పందించడం లేదని మండిపడింది. (చదవండి: అందుకే రణ్వీర్ నూలు పోగు లేకుండా ఫోటో షూట్ చేశాడేమో: ఆర్జీవీ) ‘గతంలో ఓ అవార్డు ఫంక్షన్‌కి వెళితే.. నా దుస్తుల పట్ల దీపిక అవమానకరంగా మాట్లాడింది. నన్ను చూసి అసహ్యించుకుంది. కనీసం అప్పుడు నా ఒంటిపై దుస్తులైనా ఉన్నాయి. ఆమె భర్తలా నేను నగ్నంగా ఫోటోలు దిగలేదు. ఓ మ్యాగజైన్ కోసం కాస్త బోల్డ్‌గా ఫోటో దిగితేనే..అందరూ నా క్యారెక్టర్ని తప్పుపట్టారు. మరి ఇప్పుడు రణ్వీర్ నగ్నంగా ఫోటోషూట్ చేస్తే.. ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. సమాజం కూడా ఎందుకు ఇలా ద్వంద్వ ధోరణిలో వ్యవహరిస్తుందో తెలియడం లేదు’అని షెర్లిన్ అసహనం వ్యక్తం చేసింది. -
మరి మహిళల నగ్న చిత్రాల సంగతేంటి?: ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్ ఎంతటి దుమారం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో రణ్వీర్ సింగ్ ఫొటోషూట్ హాట్‌టాపిక్ మారింది. ఈ విషయంలో కొందరు రణ్‌వీర్‌కు మద్దుతు ఇస్తుండగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళల మనోభవాలు దెబ్బతీశాడంటూ రణ్‌వీర్‌పై ముంబైలో పోలీసు కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై ‘కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. చదవండి: ప్రభాస్‌పై దిశ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇలాంటి హీరోని ఇంతవరకు చూడలేదు ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రణ్వీర్ సింగ్‌పై వస్తున్న విమర్శలు, ఎఫ్ఐఆర్ను ఖండించాడు. ఇందులో తప్పేముందంటూ రణ్‌వీర్‌కు మద్దతుగా నిలిచాడు. ‘రణ్వీర్ ఫొటోషూట్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ చెల్లదు. అది ఓ స్టుపిడ్ కేసు. ఎలాంటి కారణం లేకుండా నమోదైన కేసు అది. మహిళల మనోభవాలు దెబ్బతిన్నాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ నాకో విషయం అర్థం కావడటం లేదు. ఇప్పటికే ఎన్నో మహిళల నగ్న చిత్రాలు వచ్చాయి. వాటి వల్ల పురుషుల మనోభవాలు దెబ్బతినవా? దాని సంగతేంటి? ఇదో ముర్ఖపు వాదన. చదవండి: ఇక యాక్టింగ్‌కి బ్రేక్.. అందుకే అంటున్న స్టార్ హీరోయిన్ ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయను. మన సంస్కృతిలోనే మానవ శరీరానికి గౌరవం ఉంది. మానవ శరీరం భగవంతుడి అద్భుత సృష్టి అని నేను నమ్ముతున్నాను. అందుకే దీనికి నేను మద్దతు ఇవ్వను’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే రణ్‌వీర్‌కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాలు పలువురు సినీ ప్రముఖులు మద్దుతుగా నిలుస్తున్నారు. కాగా ఓ మ్యాగజైన్ కోసం రణ్వీర్ ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటో షూట్ ఇచ్చాడు. . ఈ ఫోటోని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయింది. ఇక దీనికి తన ఫ్యాన్ నుంచి ‘హాట్’ అంటూ కామెంట్స్ రాగా మరికొందరు ఈ పిచ్చి చేష్టలేంటని విమర్శిస్తున్నారు. -
రణ్వీర్ బాటలో మరో నటుడు, అతడి భార్య భలే ఆన్సరిచ్చిందిగా!
రణ్వీర్ సింగ్ ఫొటోషూట్ నెట్టింట ఎంత రచ్చ లేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నీ ధైర్యానికి సలామని కొందరు మెచ్చుకుంటుంటే.. మరికొందరేమో ఈ తెలివితక్కువ పనేంటని బుగ్గలు నొక్కుకున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ నటుడు కూడా రణ్వీర్ను ఫాలో అయ్యాడు. అతడిలాగే ఒంటిమీద నూలు పోగు లేకుండా దర్శనమిద్దామనుకున్నాడు. అనుకోవడమేంటి, ఆలోచన అమల్లో పెట్టేశాడు. అచ్చం రణ్వీర్ సింగ్లా పోజు పెట్టిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలాడు. ఇది చూసిన నెటిజన్లు అటు మెచ్చుకోకుండా, ఇటు నొచ్చుకోకుండా పడీపడీ నవ్వుతున్నారు. ఎందుకంటే ఆ ఫోటోలో కనిపించేదంతా నిజం కాదు. రణ్వీర్ 'పేపర్' మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటోను ఎడిట్ చేసి దానికి తన ముఖాన్ని అతికించాడు. తాను కూడా స్టోన్ మ్యాగజైన్ కోసం ఇలా మారానంటూ జోక్ చేశాడు. మొత్తానికి నకుల్ ఎడిటింగ్ టాలెంట్ చూసిన అభిమానులు నవ్వాపుకోలేకపోతున్నారు. అతడి భార్య జంకీ అయితే.. 'వెంటనే అతడికి పొట్టినిక్కర్లు పట్టుకెళ్లాల్సిందే' అని ఫన్నీగా కామెంట్ చేసింది. కాగా నకుల్ ప్యార్‌కా దర్ద్ హై మీఠా మీఠా, ఇష్క్బాజ్, బడే అచ్చె లగ్తే హై వంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యాడు. View this post on Instagram A post shared by Nakuul Mehta (@nakuulmehta) చదవండి: హోంటూర్ వీడియోను షేర్ చేసిన యాంకర్ శ్యామల ఆమె గొంతు పూర్తిగా పడిపోయింది: నటి శ్రీవాణి భర్త -
అందుకే రణ్వీర్ నూలు పోగు లేకుండా ఫోటో షూట్ చేశాడేమో: ఆర్జీవీ
ఓ మ్యాగజైన్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటో షూట్ చేయించుకున్నాడు. ఈ ఫోటోని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయింది. దీనిని కొంతమంది సమర్థిస్తుంటే..మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ముంబైలో రణ్‌వీర్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. ఇలాంటి తరుణంలో రణ్‌వీర్‌గా మద్దతుగా నిలిచాడు సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లింగ సమానత్వానికి న్యాయం చేయడం కోసమే రణ్వీర్ ఇలా ఫోటో షూట్ చేసి ఉండోచ్చని అభిప్రాయపడ్డాడు. (చదవండి: పవన్‌తో సినిమాకి భయపడుతున్న దర్శకులు...కారణం?) మహిళలు తమ శరీరాన్ని ప్రదర్శించగా లేనిది.. పురుషులు ఎందుకు అలా చూపించొద్దని ప్రశ్నించాడు. మహిళలతో సమానంగా మగవారికీ హక్కులు ఉన్నాయని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా.. మగవాళ్లు అమ్మాయిల నగ్న చిత్రాలను చూసి పొందే ఆనందం కంటే.. అబ్బాయిల నగ్న చిత్రాలను చూసి అమ్మాయిలు ఎక్కువ ఆనందం పొందుతారనేది నిజమా? కాదా? అంటూ ఓ పోల్ క్వశ్చన్ కూడా పెట్టాడు. I personally applaud and I am also thrilled to see the majority applauding @RanveerOfficial ‘s new age boldness💪💪💪 ..and I hope that the same majority will applaud a woman as much if she does the same ..There has to be a GENDER EQUALITY 💐💐💐 pic.twitter.com/9kVGMrYro1 — Ram Gopal Varma (@RGVzoomin) July 26, 2022 In the context of the new age nude pics of @RanveerOfficial ,here’s a question…Do women enjoy watching a man’s nude pics as much as men enjoy watching a woman’s nude pics? — Ram Gopal Varma (@RGVzoomin) July 26, 2022 -
రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్.. నటుడిపై కేసు నమోదు
ప్రస్తుతం ఎక్కడ విన్న బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ పేరు మార్మోగుతోంది. ఏ సోషల్ మీడియా సైట్లో చూసిన ఆయన లెటేస్ట్ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఎప్పుడైతే న్యూడ్ ఫోటోషూట్ ఫోటోస్ ఆన్లైన్లో షేర్ చేశారో అప్పటి నుంచి రణ్‌వీర్‌సింగ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా పేపర్ మ్యగజైన్ కోసం ఫోజులిచ్చిన విషయం తెలిసిందే. 1972లో కాస్మొపాలిటన్ మ్యాగజైన్ కోసం పాప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్‌కు నివాళిగా నటుడు ఈ ఫొటోషూట్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట్లో సంచలనంగా మారాయి. దీనిపై నెటిజన్లు నుంచి భిన్నమైన స్పందన లభిస్తోంది. ‘సూపర్ హాట్’ అంటూ రణ్వీర్ కోస్టార్స్, అభిమానులు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక నటుడి బోల్డ్ ఫోజులపై అనేక సోషల్ మీడియాలో పుట్టేడు మీమ్స్ సైతం పుట్టుకొచ్చాయి. మరోవైపు ఈ ఫోటోషూట్‌పై వివాదాలు, విమర్శలు కూడా చుట్టుముట్టాయి. తాజాగా నగ్న షోటోషూట్ నటుడిని చట్టపరమైన చిక్కుల్లో పడేసింది. చదవండి: Katrina Kaif-Vicky Kaushal: ‘కత్రినా నా భార్య’ అంటూ వీడియోలు, ఫొటోలు.. నిందితుడి అరెస్ట్ ఓ ఎన్జీఓ ఫిర్యాదు మేరకు రణ్వీర్ సింగ్‌పై ముంబైలో చెంబూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు. అంతకుముందు.. రణ్‌వీర్‌కు చాలా మంది సెలబ్రిటీలు మద్దుతు ఇస్తుండటంతో.. అదే ఒక మహిళ ఇలాగే ఫోటోషూట్ చేస్తే ప్రశంసిస్తారా అని టీఎమ్సీ ఎంపీ, బెంగాలీ నటి మిమీ చక్రవర్తి ప్రశ్నించారు. ఒకవేళ మహిళ ఫోటోషూట్ చేస్తే ఇప్పటికే ఆమె ఇంటిని తగలబెట్టే వారని, లేదా తనను చంపేస్తామని బెదిరించేవారని పేర్కొన్నారు. కాగా రణ్వీర్ కంటే ముందు విజయ్ దేవరకొండ, తరువాత విష్ణు విశాల్ సైతం న్యూడ్ ఫోటోలకు పోజులిచ్చి హాట్ టాపిక్‌గా మారారు. -
రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్‌పై రాజుకున్న వివాదం..
బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) సినిమాల మాట ఎలా ఉన్నా తన డ్రెస్సింగ్ స్టైల్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పటికే అతను వేసుకున్న డ్రెస్‌లపై నెటిజన్లు ఘోరమైన కామెంట్లు మీమ్స్ చేశారు. 'దీపికా నువ్ అయినా నీ భర్తకు చెప్పొచ్చుగా' అంటూ ట్రోల్ చేశారు. ఇక తాజాగా రణ్వీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫొటో షూట్ పెద్ద దుమారమే రేపుతోంది. మీమర్స్ అయితే మీమ్స్‌తో ఫన్నీగా, సీరియస్‌గా విరుచుకుపడుతున్నారు. పలువురు సెలబ్రిటీలు పొగడ్తుంటే నెటిజన్లు, ప్రేక్షకులు మాత్రం చీల్చి చెండాడుతున్నారు. తాజాగా రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్‌పై సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రణ్వీర్ సింగ్ ఒక మానసిక రోగి అంటూ బ్యానర్లు కట్టారు. నూలు పోగు కూడా లేకుండా ఉన్న రణ్వీర్ సింగ్‌ను చూసిన వారు దుస్తులు సేకరించి అతనికి పంపారు. చూస్తుంటే ఈ వివాదం ఇంకా కొనసాగేలా ఉందని తెలుస్తోంది. కాగా పేపర్ మ్యాగజైన్ కోసం రణ్వీర్ నగ్నంగా ఫోజులిచ్చిన విషయం తెలిసిందే. 1972లో కాస్మొపాలిటన్ మ్యాగజైన్ కోసం ప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్‌కు నివాళిగా ఈ ఫొటోషూట్ చేశారు. చదవండి: శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ .@papermagazine pic.twitter.com/RU2tzGNUOi — Ranveer Singh (@RanveerOfficial) July 22, 2022 చదవండి: 'గాడ్ ఫాదర్' షూటింగ్.. చిరంజీవి, సల్మాన్ ఫొటో లీక్ -
భర్త న్యూడ్ ఫొటోలు తీసిన హీరో భార్య.. వైరల్
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి కొత్త ట్రెండ్ వచ్చింది. అదే న్యూడ్ ఫొటో షూట్. విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ ప్రమోషన్స్‌తో మొదలైన ఈ ట్రెండ్‌ను వివిధ హీరోలు, నటులు ఫాలో అవుతూ కొనసాగిస్తున్నారు. విజయ్ దేవరకొండ తర్వాత ఓ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ నటుడు రాహుల్ ఖన్నా అర్ధనగ్నంగా ఫొటోలు దిగి నెట్టింట్లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలు చూసిన నెటిజన్స్ దుమ్మెత్తిపోశారు. ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ ఓ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫొజులిచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఈ ఫొటోషూట్‌ను నెటిజన్లు చీల్చి చెండాడారు. తాజాగా మరో హీరో ఇలాంటి న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దానికి 'ఈ ట్రెండ్‌లో నేను కూడా జాయిన్ అయ్యా' అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు విభిన్నమైన సినిమాలతో అలరించే తమిళ హీరో విష్ణు విశాల్. రానా నటించిన 'అరణ్య'లో ఓ పాత్రతోపాటు ఇటీవల 'ఎఫ్ఐఆర్' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విష్ణు హీరోగానే కాకుండా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి గుత్తా జ్వాల భర్తగా సుపరిచితమే. చదవండి: సమంత యాటిట్యూడ్‌కు స్టార్ హీరో ఫిదా.. సినిమాలో అవకాశం! దిగొచ్చిన శ్రావణ భార్గవి.. ఆ వీడియో డిలీట్.. నడుము కింద వరకు కనిపించేలా, కేవలం దుప్పటి మాత్రమే అడ్డుపెట్టుకుని సెమీ న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు విష్ణు విశాల్. 'నా భార్య గుత్తా జ్వాల ఫొటోగ్రాఫర్‌గా మారడంతో నేను కూడా ఈ ట్రెండ్‌లో జాయిన్ అయ్యా' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో కూడా నెట్టింటి వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ సెమీ న్యూడ్ ఫొటోలను ట్రెండ్‌గా తీసుకోని ఇంకెంతమంది హీరోలు ఫాలో అవుతారో చూడాలి. Well... joining the trend ! P.S Also when wife @Guttajwala turns photographer... pic.twitter.com/kcvxYC40RU — VISHNU VISHAL (VV) (@TheVishnuVishal) July 23, 2022 చదవండి: మిస్ ఇండియా సినీ శెట్టికి ఇష్టమైన తెలుగు హీరో అతడే.. ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం 'ది గ్రే మ్యాన్' రివ్యూ.. -
అమ్మ బాబోయ్, ఒంటి మీద నూలుపోగు లేకుండా హీరో పోజులు!
Ranveer Singh New Photoshoot: స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సినిమాలతోనే కాదు, తన డ్రెస్సింగ్ స్టైల్‌తోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే ఈసారి మాత్రం ఒంటి మీద నూలు పోగు లేకుండా దర్శనమిచ్చి షాకిచ్చాడు.పేపర్ మ్యాగజైన్ కోసం నగ్నావతారంలో ఫొటోలు దిగాడు. ఎలాంటి బట్టలు వేసుకోకుండా కూర్చుని, కార్పెట్ మీద దర్జాగా పడుకుని స్టిల్స్ ఇచ్చాడు. 1972లో కాస్మొపాలిటన్ మ్యాగజైన్ కోసం నగ్నంగా పోజులిచ్చిన పాప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్‌కు నివాళిగా ఈ ఫొటోషూట్ చేశారట. ఏదేమైనా ప్రస్తుతం రణ్వీర్ న్యూడ్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చాలామంది హీరో ఫొటోలను చూసి నవ్వాపుకోలేకపోతుండగా పలు మీమ్స్ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. అవేంటో మీరూ చూసేయండి.. Literally Lizards In My Room be like:#RanveerSingh pic.twitter.com/SMUBb7AZ2u — Yash Shashi Agarwal (@meagarwalyash) July 21, 2022 They said don’t wear such clothes, he took their advice too seriously #ranveersingh Why only i should suffer 😂 pic.twitter.com/DXclZdZ6CA — TRP king (@sid80dude) July 22, 2022 😂 Sorry, I'm not at all here to troll@RanveerOfficial I just found this picture genuinely funny🤣 #ranveerified #ranveersingh pic.twitter.com/xtZh2alnIH — Meena Choudhary (@MeenaC48) July 21, 2022 The Creation of #RanveerSingh pic.twitter.com/lCpXQApL9g — Sadman Kabbo (@sadman4kabbo) July 21, 2022 Fixed it.#RanveerSingh #ranveervswild pic.twitter.com/uDdQSobdof — Nobody (@to_mani) July 21, 2022 Street Dogs Under the Car when it's heavy rain outside🌧️#RanveerSingh pic.twitter.com/3dBUlbnMMy — Dharmik R (@ProfessorRd24) July 22, 2022 3 year old me when i don't want to take a bath...#RanveerSingh pic.twitter.com/XbXpvmE5Hw — Mirchi Teja (@JaiswalTanmay) July 21, 2022 You were laughing at his clothes, now what will u do.#RanveerSingh pic.twitter.com/cvoOMLR3Ny — saloon yousafzai (@saloonyousafza2) July 21, 2022 Deepika reaction after she finds out #RanveerSingh goes naked for magazine Photoshoot. pic.twitter.com/tEr34mVYHv — Priyanka Tiwari (@tw_priyanka) July 22, 2022 Who can relate ? Just for fun. #RanveerSingh #MEMES pic.twitter.com/hGXmqTImmd — Karanvir Sharma (@karanvirsharma9) July 22, 2022 When @deepikapadukone Not giving her costumes for photoshoot#RanveerSingh he did photoshoot with nude 💯🔥@RanveerOfficial pic.twitter.com/05hzg6Gieu — saikiran mandapuri (@saikiranM8721) July 21, 2022 no caption needed only draw 😜#RanveerSingh ❤️ pic.twitter.com/Mt9NW2RtDB — Sonu ♥ (@Sonu_Sidheart) July 22, 2022 Me after watching Ranveer singh nude photoshoot.😂😂#RanveerSingh #DeepikaPadukone pic.twitter.com/zjaxjhn9js — impowerpuffgrl (@ipowerpuff1) July 22, 2022 -
కొత్త ఫ్లాట్ కొన్న రణ్వీర్, ఎన్ని రూ.కోట్లో తెలుసా?
స్టార్ సెలబ్రిటీ జంట రణ్వీర్ సింగ్- దీపిక పదుకొణె కొత్త ఫ్లాట్ కొంది. ముంబైలో సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే బాంద్రాలో క్వాడ్రూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేశాడు రణ్వీర్. దీని విలువ రమారమి రూ.118.94 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ క్వాడ్రూప్లెక్స్ అపార్ట్మెంట్.. 16, 17, 18, 19 అంతస్థుల్లో విస్తరించి ఉంది. మొత్తంగా ఇది 11,266 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా అని తెలుస్తోంది. ఇక ఇప్పటికే స్టాంప్ డ్యూటీలో భాగంగా రణ్వీర్ రూ.7.13 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ రిజిస్ట్రేషన్‌తో రణ్వీర్.. షారుక్ ఖాన్ ఇంటికి సమీపంలోనే పాగా వేయనున్నాడన్నమాట. ఈ విషయం గురించి ఓ రియల్టర్ మాట్లాడుతూ.. 'సాగర్ రేషం భవనాన్ని రినొవేట్ చేస్తున్నాం. ఈ భవంతిలోని కింది ఫ్లోర్లను పాతవారికే అప్పజెపుతాం. ఇకపోతే 16వ అంతస్థు.. 4 బెడ్రూమ్లు ఉన్న ఫ్లాట్ కాగా 17, 18, 19 అంతస్థులు పెంట్‌హౌస్‌గా ఉన్నాయి' అని చెప్పుకొచ్చాడు. కాగా రణ్వీర్ చేతిలో ప్రస్తుతం రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని, సర్కస్ సినిమాలు ఉన్నాయి. చదవండి: మలయాళ దర్శకుడు కన్నుమూత లక్కీ చాన్స్ చేజార్చుకున్న కీర్తి సురేశ్? ట్రోల్ చేస్తున్న నెటిజన్లు! -
'శక్తిమాన్'గా రానున్న ఆ స్టార్ హీరో ?
Ranveer Singh As Shaktiman: శక్తిమాన్.. ఈ టీవీ షో అంటే 1990 కిడ్స్‌కు అమితమైన అభిమానం. ఇప్పుడంటే మార్వెల్, డిస్నీ వంటి హాలీవుడ్ సూపర్ హీలోలు ఉన్నారు కానీ, అప్పట్లోనే ఇండియన్ సూపర్ హీరోగా వెలుగొందాడు ఈ శక్తిమాన్. ఈ శక్తిమాన్ పాత్రలో ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే సుమారు 29 ఏళ్ల తర్వాత ఈ టీవీ షో సినిమాగా రానుంది. దీనికి సంబంధించిన హక్కుల్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాంగా తెరకెక్కించేందుకు 'భీష్మ్ ఇంటర్నేషనల్'తో కలిసి సోనీ పిక్చర్స్ నిర్మించనుంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో సూపర్ హీరో పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ పాత్ర చేసేందుకు రణ్వీర్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శక్తిమాన్‌గా రణ్వీర్ నటిస్తే ఆ పాత్రకు ఒక ప్రత్యేకత వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 'శక్తిమాన్' రీమేక్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చదవండి: బేబీ బంప్‌తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు.. తనకన్నా చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్, ఇద్దరు పుట్టాక పెళ్లి ! -
ఆరేళ్ల రిలేషన్.. కానీ అప్పుడే మా ప్రేమ బలపడింది: ఆలియా
ఆరేళ్లు ప్రేమలో మునిగి తేలిన బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్లు ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఎప్రీల్ 14న ఇరు కటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఈ జంట వివాహం ఘనంగా జరిగింది. ఇక పళ్లయిన రెండు నెలలకే ఆలియా ప్రెగ్నెన్సీని ప్రకటించి ఫ్యాన్స్‌కు శుభవార్త అందించింది. ఇదిలా ఉంటే రణ్‌బీర్, ఆలియా ప్రేమయాణంపై ఫ్యాన్స్‌కు ఎంతో ఆసక్తిగా ఉంటారు. బ్రహ్మస్త్రకు ముందు అసలు కలిసి నటించిన ఈ జంట మధ్య పరిచయం, ప్రేమ ఎలా మొదలైందా అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న సందేహమే. చదవండి: నటుడు ప్రభు ఇంట ఆస్తి వివాదం.. కోర్టును ఆశ్రయించిన తోబుట్టువులు అయితే తాజాగా ఓ షో పాల్గొన్న ఆలియా తమ ప్రేమ ఎక్కడ ఎప్పుడు మొదలైందనే దానిపై నోరు విప్పింది. తాజాగా ఆమె తాజాగా కాఫీ విత్ కరణ్ జోహార్ 7వ సీజన్లో హీరో రణ్వీర్ సింగ్‌తో కలిసి సందడి చేసింది. తమ మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ సోకు తొలి గెస్ట్స్‌గా వచ్చిన ఆలియా ఈ సందర్భంగా తన లవ్, మ్యారేజ్ లైఫ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చిన్నప్పటి నుంచే రణ్‌బీర్ అంటే క్రష్ అని గతంలో పలుమార్లు ఆలియా చెప్పిన సంగతి తెలిసిందే. కొంతకాలం సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఆలియా-రణ్‌బీర్ ఎప్పుడు తమ అభిప్రాయాలను పంచుకోలేదని చెప్పంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్రహ్మస్త్రం షూటింగ్ సమయంలోనే వీరిద్దరి ప్రేమ బలపడిందని చెప్పింది. చదవండి: నటి సాయి పల్లవికి హైకోర్టులో ఎదురుదెబ్బ ‘షూటింగ్ కోసం మేము ఒకే విమానంలో ప్రయాణిస్తున్నాం. అప్పుడు రణ్వీర్ సీటు సరిగా లేదు. దీంతో నా పక్కన వచ్చి కుర్చున్నాడు. అప్పుడు మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఒకరి అభిప్రాయలను ఒకరం షేర్ చేసుకున్నాం. దీంతో అప్పుడే డిసైడ్ అయ్యాం. మా ఈ లాంగ్ రిలేషన్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని చెప్పుకొచ్చింది. అయితే అంతకు ముందేప్పుడు వారిద్దరు నేరుగా ప్రపోజ్ చేసుకోలేదు కానీ ఒకరిపై ఒకరు ఇష్టంతో ఉన్నామని పేర్కొంది. కాగా ఈ రియల్ కపుల్ జంటగా నటించిన తొలి చిత్రం బ్రహ్మస్త్రం. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. -
పురుగును నమిలేసిన స్టార్ హీరో
స్టార్ హీరో రణ్వీర్ సింగ్ అడవిలో అడ్వెంచర్ చేశాడు. బేర్ గ్రిల్స్‌తో కలిసి అతడు చేసిన విన్యాసాలు రణ్వీర్ వర్సెస్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. అయితే అడవిలో అడుగుపెట్టడానికి ముందు రణ్వీర్ ఎలా సిద్ధమయ్యాడనేది తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్ గురువారం ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో సూటుబూటేసుకున్న హీరో తినడానికి రెడీ అయ్యాడు. అయితే అతడికోసం ఓ పురుగును ప్లేటులో పెట్టి సిద్ధంగా ఉంచారు. దీంతో చేసేదేం లేక రణ్వీర్ కొంత అయిష్టంగానే దాన్నో పట్టు పట్టాడు. ఆ పురుగును కరకరా నమిలి మింగాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇక అసలు షోలో ఇంకే రేంజ్లో రచ్చ చేస్తాడో అంటున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: నిశ్చితార్థం బ్రేక్ అయ్యాక ప్రేమలో పడ్డ విశాల్ సాయిపల్లవి 'గార్గి' ట్రైలర్ చూశారా? -
KK Singer Death: సింగర్ కేకే మృతిపై అక్షయ్, ఆర్ రెహమాన్ ఆవేదన
ప్రముఖ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) మంగళవారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. ఆయన హాఠాన్మరణం సినీ పరిశ్రమలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. సిద్ధూ మూసేవాలా హత్యోదంతం జరిగిన రెండు రోజులకే మరో ప్రముఖ గాయకుడి అకాల మరణం యావత్ సినిమా ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. ఆయన మృతి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కేకే మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా కెరీర్లో కేకే కూడా ఒక భాగం. నేను చేసిన చిత్రాలకు సంబంధించిన ఎన్నో పాటలకు స్వరాన్ని అందించారు. Dear KK ..what’s the hurry buddy ..gifted singers and artists like you made this life more bearable..#RIPKK — A.R.Rahman (@arrahman) June 1, 2022 ఆయన ఆలపించిన ‘తూ బోలా జైసే’ పాట వల్లే ఎయిర్ లిఫ్ట్ మూవీ క్లైమాక్స్ చక్కగా వచ్చింది. గత రాత్రి జరిగిన ఘటన నిజంగా షాకింగ్‌గా ఉంది’ అని పేర్కొన్నారు. అలాగే బాలీవుడ్ సింగర్ విశాల్ దడ్లానీ తీవ్ర దిగ్భ్రాంతీ వ్యక్తం చేస్తున్నారు. కేకే మరణవార్త తెలిసినప్పటి నుంచి ఆయన వరుస ట్వీట్స్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మిత్రలకు, సన్నిహితలకు ఓ విజ్ఞప్తి చేశారు. ‘స్నేహితులకు, మీడియా మిత్రలకు నా విన్నపం ఏంటంటే. కేకే గురించి మాట్లాడమని గాని, స్టేట్మెంట్ ఇవ్వమని గాని నన్ను అడగకండి ప్లీజ్. ఎందుకంటే ప్రస్తుతం ఆయన గురించి నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను. నాకంత శక్తి కూడా లేదు’ అంటూ రాసుకొచ్చారు. A request to friends from the media. Please don't call me for statements about #KK. I can't speak about him in the past tense, I simply don't have the strength for that. 🙏🏽 — VISHAL DADLANI (@VishalDadlani) June 1, 2022 వీరితో పాటు పలువకు బాలీవుడ్ హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తదితరులు సంతాపం ప్రకటించారు. కాగా కేకే 1968లో ఢిల్లీలో జన్మించారు. కేకే మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా వంటి తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కలతాలోని నజ్రుల్ మంచ్ వద్ద మంగళవారం రాత్రి ప్రదర్శన ఇచ్చిన అనంతరం కేకే అస్వస్థతకు గురి కాగా, ఆయన్ను సీఎంఆర్ఐ హాస్పిటల్ కు తరలించారు. కాని, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించడం తెలిసిందే. కేకే మృతిని అసహజ మరణం కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. So sad to hear about KK’s death. He sang the first song of my first film. A great friend since then. Why so early, KK, why? But you have left behind a treasure of a playlist. Very difficult night. ॐ शांति। Artists like KK never die. pic.twitter.com/MuOdAkEOJv — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 31, 2022 When beautiful voices are stopped in full flow, the universe loses a lifeline. In shock over the tragic deaths of two singing legends #sidhumoosewala & #KK. Numbed at the unfathomable loss 🙏 #RIPLegends. #RIPKK #RIPLegend #KKPassesAway #KrishnakumarKunnath #SidhuMooseWalaDeath pic.twitter.com/j7POeYmMBq — Suniel Shetty (@SunielVShetty) June 1, 2022 View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) -
పాన్ మసాలా ఎఫెక్ట్, బాలీవుడ్ స్టార్ హీరోలపై కేసు
సెలబ్రిటీలను అభిమానులు నీడలా వెంటాడుతుంటారు. వారు సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టిన లైకులు కొడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు. కానీ అభిమాన తారలు అనవసరమైన వాటిలో దూరినా, ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తుల ప్రకటనల్లో కనిపించినా అస్సలు ఊరుకోరు. సమాజానికి ఏం సందేశమిద్దామనుకుంటున్నారని ఫైర్ అవుతారు. ఇటీవలే పాన్ మసాలా యాడ్‌లో నటించినందుకు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్‌లపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే! దీంతో అక్షయ్ వెనకడుగు వేసి ఆ ప్రకటన నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ యాడ్ వివాదం ఇంకా సద్దుమణగలేదు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన సామాజికవేత్త తమన్నా హష్మీ ఈ హీరోలపై ఫిర్యాదు చేశాడు. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, రణ్వీర్ సింగ్ వంటి స్టార్ హీరోలు డబ్బు కోసం గుట్కా ప్రకటనల్లో కనిపించి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పై నలుగురు హీరోలపై సెక్షన్ 467, 468, 439, 120 బి కింద కేసు నమోదైంది. మే 27న ఈ కేసును న్యాయస్థానం విచారించనుంది. చదవండి 👉🏾 ఆస్కార్ కొత్త రూల్స్.. ఈ థియేటర్స్‌లో బొమ్మ పడాల్సిందేనట! రెండో పెళ్లి చేసుకున్న ముగ్గురు పిల్లల తల్లి -
సమంత పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో
Ranveer Singh About His Favourite Song Is Samantha Oo Antava: బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ ఇటీవల కపిల్ దేవ్ బయోపిక్ '83' చిత్రంతో అలరించాడు. తాజాగా రణ్వీర్ సింగ్ నటిస్తున్న విభిన్న చిత్రం 'జయేశ్‌భాయ్ జోర్దార్'. దివ్యాంగ్ ఠక్కర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలినీ పాండేతోపాటు అనన్య నాగల్ల కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు రణ్వీర్ సింగ్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో రణ్‌వీర్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈ ఇంటర్వ్యూలో హోస్ట్ రణ్వీర్ సింగ్‌ను 'తెలుగులో మీకు నచ్చిన పాట ఏది ?' అని అడిగాడు. దీనికి అల్లు అర్జున్ హీరోగా చేసిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రైజ్'లోని 'ఊ అంటావా మావా' అనే సాంగ్ ఇష్టమని తెలిపాడు రణ్వీర్. దీని గురించి రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ 'ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన పాట ఊ అంటావా మావా. ఆ సాంగ్ ప్లే అయినప్పుడు ఐయామ్ గోయింగ్ మ్యాడ్. ఆ పాట మీనింగ్ నాకు తెలియదు. కానీ నా మనసుకు మాత్రం బాగా నచ్చింది. అందుకే ఆ పాటంటే అంత ఇష్టం నాకు. 'అని పేర్కొన్నాడు. పుష్ప మూవీలో సమంత నర్తించిన ఈ స్పెషల్ సాంగ్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. చదవండి: ఓటీటీలోకి సిద్ధార్థ్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే.. Oo antava from Pushpa is one of my favourite song in recent time: Ranveer Singh 🎧🎺🎻🎸🎶🎵🎼🎹🥁@alluarjun #AlluArjun #Sukumar @ThisIsDSP @Samanthaprabhu2 #RanveerSingh #Pushpa #OoAntavaOoOoAntava pic.twitter.com/6yi5osOwuk — Sreedhar Marati (@SreedharSri4u) May 10, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అతి చిన్న వయసులో ర్యాపర్ మృతి.. ఇదే చివరి వీడియో
Gully Boy Fame Rapper MC Tod Fod Dies At Age 24 This Is The Last Video: బాలీవుడ్ ర్యాపర్ ధర్మేష్ పర్మార్ అకాల మరణం చెందాడు. ఎంసీ టాడ్ ఫాడ్గా పాపులారిటీ సంపాదించుకున్న ధర్మేష్ 24 ఏళ్ల వయసులో మరణించాడు. అయితే ఎంసీ టాడ్ ఫాడ్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. యంగ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'గల్లీ బాయ్'లో ఇండియా 91 ట్రాక్ కోసం ర్యాప్ చేశాడు ధర్మేష్. ర్యాపర్ టాడ్ ఫాడ్ మృతిపట్ల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతని అకాల మరణం పట్ల చింతిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో గల్లీ బాయ్ మూవీలో నటించిన రణ్వీర్ సింగ్, సిద్ధాంత్ చతుర్వేది ర్యాపర్ దర్మేష్ పర్మార్‌కు నివాళులు అర్పించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ర్యాపర్ టాడ్ ఫాడ్ ఫొటో షేర్ చేస్తూ హార్ట్ బ్రోకెన్ ఎమోజీని యాడ్ చేశాడు రణ్వీర్ సింగ్. అలాగే ర్యాపర్‌తో జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్‌ను పంచుకుంటూ 'రెస్ట్ ఇన్ పీస్ భాయ్' అని రాసుకొచ్చాడు సిద్ధాంత్ చతుర్వేది. 'మీరు చాలా త్వరగా వెళ్లిపోయారు. మన మార్గాలు వేరయ్యాయి. కానీ మీరు చేసినదానికి కృతజ్ఞతతో ఉండగలను. రెస్ట్ ఇన్ పీస్ బంటాయి.' అని గల్లీ బాయ్ మూవీ డైరెక్టర్ జోయా అక్తర్ పోస్ట్ చేశారు. జోయా అక్తర్ నిర్మాణ సంస్థ టైగర్ బేబీ ఫిల్మ్స్ నివాళులు తెలిపింది. View this post on Instagram A post shared by Zoya Akhtar (@zoieakhtar) ఎంసీ టాడ్ ఫాడ్ సభ్యుడిగా ఉన్న 'స్వదేశీ బ్యాండ్' తన అధికార పేజీలో అతని త్రోబ్యాక్ ప్రదర్శన వీడియోను షేర్ చేసింది. 'ఈ రాత్రే టాడ్ ఫాడ్ స్వదేశీ మేళాలో తన చివరి ప్రదర్శన ఇచ్చారు. అతని లైవ్ మ్యూజిక్ థ్రిల్, ప్యాషన్‌ను అనుభూతి చెందాలంటే మీరు అక్కడ ఉండాల్సింది. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు ఎల్లప్పుడూ మీ సంగీతంతో జీవిస్తారు.' అంటూ రాసుకొచ్చింది స్వదేశీ బ్యాండ్. View this post on Instagram A post shared by Swadesi (@swadesimovement) -
ఆ స్టార్ హీరోను 'ఆంటీ' అంటానంటున్న పూజా హెగ్డే
Pooja Hegde Reveals She Calls Ranveer Singh As Pammi Aunty: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటీవల 'రాధేశ్యామ్' సినిమాతో ప్రేక్షకులను, అభిమానులను పలకరించింది. ఈ సినిమాకు ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వస్తున్న బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబడుతోంది. ఈ సినిమా తర్వాత పూజా బాలీవుడ్లో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. బీటౌన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ 'సర్కస్' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోగా ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణ్వీర్ సింగ్‌ను తాను ఏమని పిలుస్తుందో చెప్పేసింది పూజా హెగ్డే. చదవండి: పూజా హెగ్డేపై నెటిజన్ల ఫైర్.. అసలేం చేసింది.. ఈ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే.. 'రణ్వీర్ సింగ్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. నేను తనని 'పమ్మీ ఆంటీ' అని పిలుస్తాను. ఎందుకంటే అతను ఎప్పుడూ సెట్లో సరదాగా ఉంటూ అందర్ని అదే పనిగా గమనిస్తూ ఉంటాడు. ఈ సినిమాలో మా ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. మీరు ఒక గొప్ప ఆన్‌స్క్రీన్ జంటను చూస్తారని నేను భావిస్తున్నాను.' అని చెప్పుకొచ్చింది. రొహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా విలియం షేక్స్పియర్ నాటకం 'ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్' ఆధారంగా తెరకెక్కించినట్లు సమాచారం. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, వరుణ్ శర్మ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చదవండి: మొక్కలు నాటిన పూజా హెగ్డే.. ఆ స్మైల్ చూడండి -
ఫుట్‌బాల్ మైదానంలో బాలీవుడ్ స్టార్ వింత ప్రవర్తన
బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్వీర్ సింగ్ ఫుట్‌బాల్ మైదానంలో సందడి చేశాడు. అయితే మ్యాచ్ చూడడానికి వచ్చిన రణ్వీర్ తన వింత ప్రవర్తనతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. విషయంలోకి వెళితే.. క్రిస్టల్ పాలెస్ ప్రీమియర్ లీగ్ వర్సెస్ మాంచెస్టర్ సిటీ మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. కాగా ఈ ప్రీమియర్ లీగ్‌కు రణ్వీర్ సింగ్ అంబాసిడర్ పాత్ర పోషించాడు. మ్యాచ్ హాఫ్ టైమ్ ముగిసిన తర్వాత రణ్వీర్ తన ఫుట్‌బాల్ నైపుణ్యం ప్రదర్శించాడు. పెనాల్టీ చాలెంజ్ పేరుతో నిర్వహించిన ఫన్ గేమ్‌లో రణ్వీర్.. తన కాలికున్న బూట్లను తీసేసి.. కేవలం తన కాళ్లతోనే బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించాడు. అనంతరం ఫుట్‌బాల్ స్టార్స్ చేసుకునే సెలబ్రేషన్‌తో మెరిశాడు. రణ్వీర్ సింగ్ చేష్టలు అభిమానులకు కాస్త వింతగా అనిపించినా.. సూపర్‌గా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను క్రిస్టల్ ప్యాలెస్ లీగ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ''హాఫ్ టైమ్ పెనాల్టీ చాలెంజ్‌ను రణ్వీర్ విజయవంతంగా పూర్తి చేశాడు.. కంగ్రాట్స్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక 2017 నుంచి రణ్వీర్ సింగ్ ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్‌కు భారత్ నుంచి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్‌లో ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫుట్‌బాల్‌కు భారత్ నుంచి క్రీడాకారులు రావాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే అంబాసిడర్ పాత్రలో ఇంగ్లండ్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్, టోటెన్హమ్ హాట్స్పుర్ స్టేడియాలకు రణ్వీర్ సింగ్ వెళ్లి వచ్చాడు. ఇక క్రిస్టల్ ప్యాలెస్ లీగ్, మాంచెస్టర్ సిటీ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు ICC Test Rankings: దుమ్మురేపిన శ్రేయాస్ అయ్యర్, బుమ్రా Cool as you like 🤣@RanveerOfficial completes the Selhurst Park half-time penalty challenge 👏#CPFC pic.twitter.com/pBj1YBwlmO — Crystal Palace F.C. (@CPFC) March 15, 2022 -
దీపికా బోల్డ్ సీన్స్‌పై భర్త రణ్వీర్ స్పందన, ఏమన్నాడంటే..
Ranveer Singh Intresting Comments On Wife Deepika: బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె నటించిన తాజా చిత్రం గెహ్రియాన్. ఇందులో దీపికా ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయింది. యంగ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేదితో లిప్ లాక్, రొమాంటి సీన్స్‌లో నటించింది. తన కజిన్ బాయ్‌ఫ్రెండ్‌తో ఎఫైర్ పెట్టుకునే అమ్మాయిగా దీపికా ఈ మూవీలో కనిపించింది. ఇక ఈ సినిమాలో దీపిక తన పాత్ర, ఇంటిమేట్లో సీన్స్‌పై వీపరితమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్న తరుణంలో రణ్వీర్ తన భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీపై నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇటీవల దీపికా-రణ్‌వీర్‌లు పర్యటనకు వెళ్లిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఈ బాలీవుడ్ జంట లిప్ కిస్ ఇచ్చుకుంటూ కనిపించారు. ఇదే ఫొటోను రణ్వీర్ షేర్ చేస్తూ.. గెహ్రియాన్‌లో ఆమె నటనపై ప్రశంసలు కురింపించాడు. ఇందులో తన నటన అద్భుతమని, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఆసక్తిగా స్పందించాడు. అంతేకాదు దీపికాను పోగుడుతూ అర్థంకానీ కఠినమైన ఇంగ్లీష్ పదాలతో ఆమె పాత్రను కొనియాడాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చదవండి: ఖిలాడి డైరెక్టర్‌తో రవితేజ వివాదం, రమేష్ వర్మ భార్య షాకింగ్ కామెంట్స్ ‘మీ లాంటి భర్త ఉంటే.. ప్రతి అమ్మాయి లక్కీ గర్ల్’ అని, క్యూట్ కపుల్, మీరు ఈ ఇంగ్లీష్‌ను కేంద్ర మంత్రి శశిథరూర్ దగ్గర నేర్చుకున్నారా? అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో దీపికా, సిద్ధార్థ్ చతుర్వేదితో రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. అంతేకాదు లెక్కలేనని లిప్ లాక్‌లు కూడా ఇచ్చింది. దీంతో ఇంటిమేట్ సీన్స్‌లో నటించేందుకు మీ ఆయన(రణ్వీర్ సింగ్) అనుమతి తీసుకున్నావా అంటూ ఆమెపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వీటిపై ఇప్పటికే దీపికా స్పందిస్తూ ట్రోలర్స్‌పై అసహనం వ్యక్తం చేసింది. అసలు ఇంత తెలివి తక్కువగా ఎలా ఉంటారంటూ వారిపై మండిపడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) -
ఓటీటీలోకి '83' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
83 Movie OTT Release Date: 1993 ప్రపంచకప్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం '83'. క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందిన ఈ చిత్రంలో కపిల్‌దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్, ఆయన భార్య రోమి భాటియాగా దీపిక పదుకొణె నటించారు. గతేడాది డిసెంబర్ కానుకగా విడుదలైన ఈ చిత్రం అనుకున్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయ్యింది.ఫిబ్రవరి 18నుంచి నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని చిత్రయూనిట్ ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో తాహీర్ రాజ్ భాసిన్, జీవా, కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. -
ఆయన్ని చూసి రణ్వీర్ సింగ్ కంటతడి.. దేవుడంటూ ఎమోషనల్
Ranveer Singh Breaks Down Tears After Met Govinda: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ మాజీ క్రికెటర్ హర్యానా హరికేన్ కపిల్ దేవ్ పాత్రలో మెప్పించి ఆకట్టుకుంటున్న చిత్రం '83'. 1983 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అశేష ప్రేక్షాదరణ పొందుతుంది. ముఖ్యంగా కపిల్ దేవ్లా డిట్టు దింపేసినా రణ్వీర్ సింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రణ్వీర్ సింగ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇటీవల కలర్స్ అందిస్తున్న 'ది బిగ్ పిక్చర్' రియాలిటీ షోను హోస్ట్ చేశాడు రణ్వీర్. ఈ షోకు హాజరైన ప్రముఖ నటుడు గోవిందాను చూసి ఉద్వేగానికి లోనయ్యాడు రణ్వీర్ సింగ్. తర్వాత రణ్వీర్ను ఓదార్చాడు గోవిందా. ఈ షోలో ప్రేక్షకులకు గోవిందాను పరిచయం చేస్తూ 'ఈ శుభ దినాన నా దేవుడే మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు. ది వన్ అండ్ ఓన్లీ , హీరో నెంబర్ వన్ గోవిందా' అంటూ స్టేజిపైకి ఆహ్వానించాడు. అనంతరం రణ్వీర్ సింగ్.. గోవిందా కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. రణ్వీర్ సింగ్ అభిమానాన్ని చూసిన గోవిందా సంతోషపడ్డాడు. తర్వాత వీరిద్దరూ కలిసి ఇష్క్ హై సుహానా, యూపీ వాలా తుమ్కా వంటి గోవిందా హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేసి సందడి చేశారు. ఈ పోగ్రామ్‌లో గోవిందా భార్య సునీత, కుమార్తె టీనా, కుమారుడు యశ్వర్ధన్ అహుజా వీడియో కాల్ ద్వారా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) ఇదీ చదవండి: 83 చిత్రంపై రజనీ కాంత్ రియాక్షన్.. పొగడ్తలతో బౌండరీలు -
83 చిత్రంలోని రణ్వీర్ సింగ్ యాసను ఇమిటేట్ చేసిన దీపికా.. ఫన్నీ వీడియో వైరల్
Deepika Padukone Imitates Ranveer Singh Dialogue From 83 Movie: ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ మూడ్‌లో ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు తమదైన శైలిలో వేడుకలు నిర్వహిస్తున్నారు. తమకు ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతున్నారు. కాగా బాలీవుడ్ పాపులర్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె కూడా న్యూ ఇయర్ వెకేషన్లో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి శుక్రవారం డిన్నర్ చేశారు. దీనికి సంబంధించిన ఒక ఫన్నీ వీడియోను షేర్ చేసుకున్నాడు రణ్వీర్ సింగ్. ఇటీవల విడుదలైన రణ్వీర్ సింగ్ 83 చిత్రం ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అందులో కపిల్ దేవ్ పాత్రలో అలరించిన రణ్వీర్ సింగ్ అద్భుత నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. సినిమాలో 'వరల్డ్ కప్ గెలవడానికి వచ్చాం' అని రణ్వీర్ సింగ్ చెప్పే డైలాగ్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఆ డైలాగ్‌ను అదే రణ్వీర్ యాసలో ఇమిటేట్ చేసింది దీపికా. క్యూట్‌గా ఇమిటేట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో 'హావింగ్ ఫన్ బేబీ' అని రణ్వీర్ అడగ్గా.. 'వీ హియర్ టు ఎంజాయ్.. వాట్ ఎల్స్ వి హియర్ ఫర్ (మేము ఇక్కడికి వచ్చిందే ఎంజాయ్ చేయడానికి. ఇక్కడికి ఇంకా దేనికి వచ్చాం)' అని రణ్వీర్ యాసలో దీపికా అనడం నవ్వు తెప్పిస్తోంది. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) రణ్వీర్-దీపికా జంట వెకేషన్ కోసం మాల్దీవులు వెళ్లినట్లు సమాచారం. వీరు బయలుదేరే ముందు ముంబై విమానాశ్రయంలో తళుక్కుమన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో వచ్చిన 83 సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ఇందులో కపిల్ దేవ్ భార్య రూమీ భాటియ పాత్రలో దీపికా పదుకొణె నటించింది. -
83 చిత్రంపై రజనీ కాంత్ రియాక్షన్.. పొగడ్తలతో బౌండరీలు
Super Star Rajinikanth Reaction On 83 Movie: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ మాజీ క్రికెటర్ హర్యానా హరికేన్ కపిల్ దేవ్ పాత్రలో మెప్పించి ఆకట్టుకుంటున్న చిత్రం '83'. 1983 వన్డే ప్రపంచకప్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రపంచకప్ సాధించిన కపిల్ డెవిల్స్ అద్బుతం చేసి చూపెట్టింది. అప్పటివరకు సాధారణ వ్యక్తులుగా కనిపించిన ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోయారు. ప్రపంచకప్ సాధించిన టీమిండియాలోని 14 మంది ఆటగాళ్లు తర్వాతి తరానికి ఒక ఐకాన్‌గా మారిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చిన 83 సినిమా డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా అశేష ప్రేక్షకాదరణ పొందుతుంది. నిమా తెరకెక్కించిన చిత్ర బృందానికి, ముఖ్యంగా కపిల్ దేవ్‌ను యాజ్ ఇట్ ఈజ్ దింపేసిన రణ్వీర్ సింగ్‌కు విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 83 సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ చిత్రాన్ని పొగడ్తలతో బౌండరీలు దాటించారు. 'వావ్ వాట్ ఏ మూవీ.. అద్భుతం..' అంటూ ఆకాశానికెత్తారు రజనీ కాంత్. అలాగే నిర్మాతలకు, చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా తెలిపారు సూపర్ స్టార్. ఈ ట్వీట్లో చిత్ర నిర్మాత కబీర్ ఖాన్, కపిల్ దేవ్, హీరో రణ్వీర్ సింగ్, నటుడు జీవాను మెన్షన్ చేశారు. #83TheMovie wow 👏🏻👏🏻 what a movie… magnificent!!! Many congratulations to the producers @kabirkhankk @therealkapildev @RanveerOfficial @JiivaOfficial and all the cast and crew … — Rajinikanth (@rajinikanth) December 28, 2021 ఇదీ చదవండి: 1983 వరల్డ్ కప్‌ను తెరపై చూపించిన '83' మూవీ రివ్యూ -
అమ్మ వరల్డ్ కప్ గెలిచాం.. రణ్వీర్ సింగ్ ఎమోషనల్ పోస్ట్..
83 Movie Success: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 83 చిత్రం ఈరోజు (డిసెంబర్ 24) థియేటర్లలో విడుదలైంది. భారత్‌కు తొలి ప్రపంచ కప్‌ను సాధించిపెట్టిన క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించాడు. కబీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1983లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ జైత్రయాత్ర నేపథ్యంగా తెరకెక్కింది. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ చక్కగా ఒదిగిపోయాడు. హెయిర్ స్టైల్ గెటప్ నుంచి కపిల్ ఆట ఆడే విధానం వరకు డిట్టు దించేశాడు రణ్వీర్. 83 సినిమా రివ్యూలో రణ్వీర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు రణ్వీర్. రణ్వీర్ తన పోస్ట్‌లో అమ్మ మేము గెలిచాం. అని పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌లో రణ్వీర్ తల్లి (అంజు భవ్నాని) 1983లోని అసలు ప్రపంచ కప్ పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేశాడు. అయితే సినిమా చిత్రీకరణ కోసం అసలైన 1983 ప్రపంచ కప్‌ను (అప్పట్లో ప్రుడెన్షియల్ కప్ అని పిలిచేవారు) కబీర్ ఖాన్ తీసుకున్నాడట. 'మేము లండన్‌లో లార్డ్స్ స్టేడియంలో ఐదు రోజులు షూట్ చేశాం. ఇంతకు ముందు లేని కెమెరా లేని లాంగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్‌లు, లాకర్ల గదులోకి వెళ్లి చూశాం. కపిల్‌కు ప్రపంచ కప్ బహుకరించిన బాల్కనీలోకి వెళ్లాం. అక్కడ వారు రణ్వీర్ కోసం వరల్డ్ కప్‌ను తీసుకొచ్చి అందించారు.' అని కబీర్ ఖాన్ తెలిపాడు. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) -
'83' సినిమా రివ్యూ
టైటిల్: 83 నటీనటులు: రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, పంకజ్ త్రిపాఠి, జీవా, హార్దీ సంధు, తాహీర్ భాసిన్, చిరాగ్ పాటిల్, సాకిబ్ సలీమ్ తదితరులు దర్శకుడు: కబీర్ ఖాన్ నిర్మాతలు: రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, కబీర్ ఖాన్, విష్ణు వర్దన్ ఇందూరి, సాజిద్ నడియడ్వాలా, రిలియన్స్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ సినిమాటోగ్రఫీ అసీమ్ మిశ్రా ఎడిటింగ్ నితిన్ బెద్ సంగీతం: జూలియస్ పేకియం స్వరాలు: ప్రీతమ్ విడుదల: డిసెంబర్ 24, 2021 క్రికెట్‌ను గ్రౌండ్లో, టీవీల్లో చూసి ఎంజాయ్ చేయడమే కాదు సినిమాగా వెండితెరపై ఆవిష్కరించిన అంతే ఉత్సాహం చూపిస్తారు అభిమానులు. క్రికెట్.. అంటే కేవలం ఒక ఆట కాదు. ఎందరో అభిమానులకు అది ఒక ఎమోషన్. కుల మతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసిన మతం క్రికెట్. ఈ మతం 1983 భారత క్రికెట్ టీమ్ సాధించిన వరల్డ్ కప్‌తో పునాది వేసుకుందని చెప్పవచ్చు. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించిన తాజా సినిమా '83'. ఈ సినిమాలో భారతదేశానికి తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా జర్నీని వెండితెరపై ఆవిష్కరించారు. అప్పుడు జరిగిన మ్యాచ్‌ను కొంతమంది టీవీల్లో వీక్షించగా.. మరికొంతమంది రేడియోల్లో విన్నారు. టీమిండియా విజయాన్ని తమ గెలుపుగా భావించి సంబురాలు చేసుకున్నారు. తర్వాతి తరానికి 25 జూన్, 1983 ఒక చరిత్ర. ఆ చరిత్రను వెండితెరపై ఆవిష్కరించారు డైరెక్టర్ కబీర్ ఖాన్. మరీ ఈ రోజు విడుదలైన '83' సినిమా ఎలా ఉందంటే? కథ: 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఇండియా టీమ్‌ను ఒక జట్టుగా కూడా చూడలేదు క్రికెట్ ప్రపంచం. అనేక అవమానాలు అడుగడునా ఎదుర్కొన్న భారత జట్టు వరల్డ్ కప్ ఫైనల్ వరకు ఎలా చేరింది. అప్పటికే రెండు సార్లు ప్రపంచకప్ గెలుచుకున్న వెస్టండీస్‌పై ఎలాంటి అంచనాలు లేని భారత్ గెలిచి వరల్డ్ కప్ ఎలా కొల్లగొట్టింది. ఈ క్రమంలో ఇండియన్ క్రికెటర్లకు కుటుంబ సభ్యులకు ఉన్న రిలేషన్ ఎలా ఉంది. వరల్డ్ కప్ గురించి ఇండియన్ క్రికేట్ టీమ్ సభ్యులు ఏమనుకున్నారు. కప్ గెలవడానికి ముందు క్రికెట్లో ఇండియాను భారతీయులు, విదేశీయులు ఎలా చూశారనేదే 83 చిత్రం కథ(83 movie review). విశ్లేషణ: క్రికెట్లో తమకంటూ ఒక స్థానం ఉండాలని పరితపించిన సగటు భారతీయుడి కథ ఇది. 1983 వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకోవడం ఒక భావోద్వేగపు సంఘటన. అందుకే దీన్ని ఒక సినిమాలా చూడలేం. సగటు సినీ ప్రేక్షకుడిగా కాకుండా క్రికెట్ ఆడే చిన్న పిల్లాడిలా చూస్తే సినిమా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. 1983లో హర్యనా హరికేన్ కపిల్ దేవ్ సారథ్యంలో ఇండియా ప్రపంచ కప్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకుడికి కథ ఎలాగు ముందే తెలుసు. కాబట్టి తెలిసిన కథను ప్రేక్షకుడు తెరపై చూడాలంటే సినిమా బాగా కనెక్ట్ కావాలి. అంటే అప్పుడు జరిగిన సంఘటనలు, అప్పటి ఎమోషన్‌ను కళ్లకు కట్టనట్లు చూపించాలి. ఆ ఎమోషన్‌ను సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా కొనసాగించడంలో దర్శకుడు కబీర్ ఖాన్ కొంతవరకు విజయం సాధించాడనే చెప్పవచ్చు. వరల్డ్ కప్ సిరీస్ ప్రారంభం నుంచి కప్ గెలిచే వరకూ భారత్ ఎలా నిలదొక్కుకుందని దర్శకుడు బాగా చూపించాడు. అప్పటివరకు ఇండియాలో మత ఘర్షణలు అనేకంగా జరిగేవి. ఈ మత ఘర్షణలకు ఒక్కసారిగా ముగింపు పలికింది 1983 వరల్డ్ కప్. ఈ అంశాన్ని తెరపై ఆవిష్కరించి విజయం సాధించాడు కబీర్ ఖాన్. ఈ సినిమాలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రోజున ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత సైన్యానికి పాక్ ఆర్మీ ఒక్క రోజు కాల్పుల విరమణ ఇవ్వడం, ఇంగ్లాండ్‌లో పనిచేస్తున్న భారతీయుల ఎమోషన్, పలు చోట్ల అల్లర్లను సినిమాలో సాధ్యమైనంత వరకూ బాగానే చూపించారు. అయితే కపిల్ భార్య రోమి భాటియా, మదన్ లాల్ భార్య అను మోహన్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతుందని స్టేడియం నుంచి హోటల్‌కు వెళతారు. ఈ దృశ్యాలను మాత్రం ప్రేక్షకుల హృదయాలకు తాకేలా తీయడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. సినిమా ఫస్టాఫ్ స్లోగా నడిచినట్లు అనిపించినా.. సెకాండాఫ్ మాత్రం బాగుంటుంది. క్యాస్టింగ్, సాంకేతికంగా బాగానే వర్క్ చేసినట్టు కనిపిస్తుంది. అప్పటి కాలాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఆర్ట్, కమెరా పనితనం మొత్తంగా చిత్ర బృందం ఎఫర్ట్ స్క్రీన్‌పై కనిపించింది. చిత్రంలో 1983 వరల్డ్ కప్‌లో జరిగిన పలు దృశ్యాలను చూపించడం బాగుంది. అప్పటి మ్యాచ్‌ను మళ్లీ లైవ్‌లో చూసిన అనుభూతిని ఇస్తుంది. సినిమాలో అక్కడక్కడ పలువురు ప్రముఖ క్రికెటర్లు కనిపించడం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే ? సినిమాలో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, పంకజ్ త్రిపాఠి వంటి భారీ తారగణంతో అప్పటి విజయాన్ని తెరపై చూపించిన ప్రయత్నమిది. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ ఎంతో చక్కగా ఒదిగిపోయాడు. గెటప్ దగ్గర నుంచి ఆట ఆడే తీరు వరకు కపిల్‌ను దింపేశాడు రణ్వీర్ సింగ్. ఆ పాత్రకు ఏం చేయాలో అంతా చేసి విజయం సాధించాడు. కపిల్ దేవ్ భార్య రోమి భాటియాగా దీపికా పదుకొణె బాగానే ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్ర ప్రభావం సినిమాలో అంతగా కనిపించదు. మాన్ సింగ్‌గా పంకజ్ త్రిపాఠికి మరో ఛాలెంజ్ రోల్ దక్కింది. ఆ పాత్రకు తగిన న్యాయం చేశాడు పంకజ్ త్రిపాఠి. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌గా జీవా తన నటనతో మెప్పించాడు. మిగతా నటీనటులు వారి పాత్రలకు తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పించింది. రణ్వీర్ సింగ్‌కు హీరో సుమంత్ డబ్బింగ్ చెప్పగా.. జీవాకు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చెప్పిన డబ్బింగ్ బాగా సూట్ అయింది. మొహిందర్ అమర్నాథ్ పాత్రలో సాకీబ్ నటించగా.. అతడి తండ్రి పాత్ర లాలా అమర్నాథ్గా మొహిందర్ అమర్నాథ్ నటించడం విశేషం. అలాగే సందీప్ పాటిల్ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్ పాటిల్ నటించాడు. 1983 వరల్డ్ కప్ విశేషాలు, హైలెట్స్, అభిమానుల సందడి ఎలా ఉందో చూడాలంటే '83' చిత్రం మంచి ఎంపిక. -
కపిల్‌దేవ్‌తో కింగ్ నాగార్జున.. 83 ప్రెస్మీట్లో స్టార్స్ సందడి
-
38 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ క్షణాలు.. కపిల్ దేవ్ భావోద్వేగపు వ్యాఖ్యలు
‘‘1983 జూన్ 25న జరిగిన వరల్డ్ కప్ పోటీలో నా సార థ్యంలోని భారత క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలిచిన క్షణాలు మరచిపోలేనివి. 38 ఏళ్ల తర్వాత ‘83’ ద్వారా మరోసారి ఆ క్షణాలను వెండితెరపై ప్రేక్షకులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలుచుకున్న నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘83’. కపిల్ దేవ్‌గా రణ్వీర్ సింగ్, కపిల్ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకోన్ నటించారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో దీపికా పదుకోన్, సాజిద్ నడియాద్వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘1983లో ఇండియా వరల్డ్ కప్ గెలవగానే భారతదేశం అంతా పండగ వాతావరణం నెలకొంది. ‘83’ ట్రైలర్ చూశాక కపిల్ దేవ్ నటించారా? అనిపించింది. ఆ పాత్రలో రణ్వీర్ అంతలా ఒదిగిపోయారు’’ అన్నారు. రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ– ‘‘కపిల్దేవ్లాంటి లెజెండ్ పాత్ర చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు. విష్ణు ఇందూరి మాట్లాడుతూ– ‘‘83’ రషెస్ చూసుకున్న ప్రతిసారీ కన్నీళ్లు వచ్చాయి.. అంతలా ఈ చిత్రంలోని భావోద్వేగాలుంటాయి’’ అన్నారు. మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్రను జీవా అద్భుతంగా చేశాడు. నేను, నాగార్జున ఇంజినీరింగ్‌లో క్లాస్మేట్స్. కాలేజ్‌లో సైలెంట్‌గా ఉన్న నాగ్.. ‘శివ’తో వైలెంట్‌గా ట్రెండ్ సెట్ చేశాడు’’ అన్నారు. కబీర్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం కపిల్‌తో పాటు అప్పటి టీమ్‌ని కలిసి సలహాలు తీసుకున్నాను. అప్పటి వార్తా కథనాలనూ రిఫరెన్స్‌గా తీసుకున్నాను. 1983లో వరల్డ్ కప్ గెలుచుకున్న క్షణాలు, ఆ తర్వాత పరిస్థితులను చూపించాం’’ అన్నారు. ‘‘అందరూ... ముఖ్యంగా యువతరం చూడాల్సిన సినిమా ఇది’’ అని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సుభాశిష్ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
1983 వరల్డ్‌కప్: టీమిండియా సభ్యుల మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా?
భారత క్రికెట్లో '1983' సంవత్సరం ఒక పెను సంచలనం. దేశంలో క్రికెట్‌ను పిచ్చిగా అభిమానించే స్థాయికి కారణమైన ఏడాది. క్రికెట్లో ఉండే మజాను భారత అభిమానులకు పరిచయం చేసింది ఆ సంవత్సరం. 1983 వన్డే ప్రపంచకప్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రపంచకప్ సాధించిన కపిల్ డెవిల్స్ అద్బుతం చేసి చూపెట్టింది. అప్పటివరకు సాధారణ వ్యక్తులుగా కనిపించిన ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోయారు. ప్రపంచకప్ సాధించిన టీమిండియాలోని 14 మంది ఆటగాళ్లు తర్వాతి తరానికి ఒక ఐకాన్‌గా మారిపోయారు. తాజాగా బాలీవుడ్లో కపిల్ డెవిల్స్ సాధించిన 1983 వరల్డ్‌కప్‌ను బేస్ చేసుకొని కబీర్ ఖాన్ దర్శకత్వంలో '83' సినిమా తెరకెక్కిందన్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభం నుంచే మంచి హైప్ తెచ్చుకుంది. ఈ మధ్యన విడుదలైన ట్రైలర్‌తో తెరపై ఒక అద్భుతం చూపించబోతున్నారని క్లియర్‌గా అర్థమవుతుంది. కపిల్ దేవ్‌గా రణ్‌వీర్‌సింగ్ నటిస్తుండడంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చి చేరింది. డిసెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనున్న '83' సినిమా బ్లాక్బాస్టర్గా నిలవడం ఖామమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక కలెక్షన్ల విషయంలోనూ ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను తిరగారాసే అవకాశముందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సినిమా సంచలనం చేస్తుందా లేదా అన్నది పక్కనబెడితే.. 1983 ప్రపంచకప్‌లో టీమిండియా జట్టు సభ్యుల పారితోషికం విలువ సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. చదవండి: 83 Movie Trailer Out: '83' ట్రైలర్ విడుదల.. సెలబ్రిటీల ప్రశంసలు ఇప్పుడంటే టీమిండియా క్రికెట్ బోర్డు బీసీసీఐ.. క్రికెట్‌ను కనుసైగలతో శాసిస్తోంది. ఏకంగా ఐసీసీని కూడా ఒప్పించగల శక్తి ఉంది. మరి 1983 ప్రపంచకప్‌లో పాల్గొన్న టీమిండియా జట్టు సభ్యుల రోజువారి అలవెన్స్, మ్యాచ్ ఫీజు తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ. అప్పట్లో కపిల్ సేనకు ఒక్కో మ్యాచ్‌కు ఫీజు రూ. 1500, అలవెన్స్ కింద రోజుకు రూ.200 చొప్పున మూడురోజులకు గానూ రూ.600.. మొత్తంగా రూ.2100 అందించారు. ఆ ప్రపంచకప్‌లో టీమిండియా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ జట్టు సభ్యులు ప్రతీసారి రూ.2100 మాత్రమే అందుకోవడం విశేషం. చదవండి: Kapil Dev: కపిల్‌లా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ చేయండి.. 2019లో మర్కండ్ వెయిన్గాంకర్ అనే జర్నలిస్ట్.. 1983 వరల్డ్‌కప్ టీమిండియా జట్టు 14 మంది సభ్యుల వేతనాలకు సంబంధించిన ఫోటోను తన ట్విటర్లో షేర్ చేస్తూ అప్పటి ఆటగాడు కనీస విలువ రూ.10 కోట్లుగా ఉంటుంది. అని చెప్పడం వైరల్‌గా మారింది. తాజాగా '83' సినిమా విడుదల నేపథ్యంలో మరోసారి టీమిండియా ఆటగాళ్ల వేతనాల ఫోటోను షేర్ చేయడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా 83 సినిమా నేపథ్యంలో 1983 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్ అయిన కపిల్‌దేవ్ సేనకు సినిమా టీమ్ ప్రత్యేకంగా రూ.15 కోట్లు అందించినట్లు సమాచారం. ఈ మేరకు కెప్టెన్ అయిన కపిల్ దేవ్ రూ. 5 కోట్లు తీసుకోనున్నాడని.. మిగతా రూ. 10 కోట్లను జట్టులోని మిగతా 13 మంది సభ్యలకు సమానంగా పంచనున్నట్లు సమాచారం. Each one of them deserve 10 Cr. pic.twitter.com/BzBYSgqit6 — Makarand Waingankar (@wmakarand) July 16, 2019 ఇక ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న ఒక క్రికెటర్‌కు ఇస్తున్న పారితోషికం ఈ విధంగా ఉంది ►ఒక టెస్టు మ్యాచ్ ఆడితే రూ. 15 లక్షలు.. ఒక వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు.. టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు అందుతుంది. ►సెంట్రల్ కాంట్రాక్ట్ కింద ఏప్లస్ కేటగిరీలో ఉన్న ఆటగాడికి ఏడాదికి గానూ రూ. 7 కోట్లు.. ఇక గ్రేడ్ ఏ కింద ఉన్న ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, గ్రేడ్ బి కింద ఉన్న ఆటగాళ్లకు రూ. 3 కోట్లు, గ్రేడ్ సి కింద ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. కోటి అందజేస్తున్నారు ►ఒక మ్యాచ్‌లో ఎవరైనా బ్యాట్స్‌మన్ డబుల్ సెంచరీ సాధిస్తే రూ. 7 లక్షలు. ఇక ఐదు వికెట్లు తీసిన బౌలర్‌కు.. టెస్టులో సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌కు రూ. 5లక్షలు అదనంగా ఇస్తున్నారు. 1983 ప్రపంచకప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా లీగ్ దశలో తొలుత ఓటములు ఎదురైనప్పటికీ బెరుకు లేకుండా ముందుకు సాగుతూ ఒక్క మెట్టు ఎక్కింది. చూస్తుండగానే సెమీస్‌లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో అప్పటికే రెండుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంది. ఫైనల్‌కు ముందు ''టీమిండియా ఇంతవరకు రావడమే గొప్ప.. బలమైన విండీస్‌ను మీరు ఓడించలేరు.. వట్టి చేతులతో ఇంటికి వెళ్లండి'' అంటూ పలువురు అవమానకరంగా మాట్లాడారు. వీటన్నింటిని ఒక చాలెంజ్‌గా స్వీకరించిన భారత్ ఫైనల్లో విండీస్‌తో పోరాడైనా కప్ సాధించాలనుకుంది. జూన్ 25, 1983న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కపిల్ సేన విండీస్ బౌలర్ల దాటికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంకేముంది ఈసారి కూడా టైటిల్ విండీస్‌దే అని అంతా భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. క్లైవ్ లాయిడ్ సేన బ్యాటింగ్ సాగుతున్న కొద్దీ టీమిండియా బౌలర్లు చెలరేగి వికెట్లు తీశారు. చివరికి విండీస్ 140 పరుగులకే ఆలౌట్ కావడంతో 43 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా విశ్వవిజేతగా అవతరించింది. చదవండి: MS Dhoni International Debut: ఎంఎస్ ధోని@17.. ఎన్నిసార్లు చదివినా బోర్ కొట్టదు -
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే: అతిథులెవరో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Bigg Boss Telugu 5, Grand Finale Guests: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కథ క్లైమాక్స్‌కు చేరింది. ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడొక లెక్క అన్నట్లుగా ఉంది కంటెస్టెంట్ల మధ్య పోటీ. ఇన్నివారాలు మేము పోరాడాం, ఇప్పుడు మా కోసం మీరు పోరాడండి అంటూ తమకు ఓట్లేసి గెలిపించే భారాన్ని ప్రేక్షకులపై వేశారు ఫైనలిస్టులు. వచ్చే వారమే విజేత ఎవరో తేలిపోనుంది. డిసెంబర్ 19న జరగనున్న గ్రాండ్ ఫినాలేను నెవర్ బిఫోర్ అనే రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. మొదట్లో ఆర్ఆర్ఆర్ టీమ్ ముఖ్య అతిథులుగా వస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ టాలీవుడ్ కాకుండా ఏకంగా బాలీవుడ్ నుంచి సెలబ్రిటీలను పట్టుకొచ్చే ప్లాన్‌లో ఉన్నారట బిగ్‌బాస్ నిర్వాహకులు. స్టార్ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేలతో పాటు బ్యూటిఫుల్ హీరోయిన్ అలియా భట్‌ను సైతం గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథులుగా తీసుకువచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నారట! అలాగే టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ సైతం షోలో సందడి చేయనున్నాడట! ఇదే నిజమైతే స్క్రీన్‌పై ఇంతమంది సెలబ్రిటీలను ఒకేసారి చూడటం ప్రేక్షకులకు కనులవిందు అనే చెప్పాలి! మరి గ్రాండ్ ఫినాలేకు ఈ నలుగురే ఫిక్స్ అయ్యారా? లేదంటే ఈ సీజన్ విజేతకు ట్రోఫీ అందించేందుకు మరెవరైనా సెలబ్రిటీ వస్తారా? అన్నది చూడాలి! -
కపిల్ దేవ్ బయోపిక్కు షాక్, నిర్మాతలపై చీటింగ్ కేసు
Ranveer Singh and Deepika Padukone's Film 83 in Legal Trouble: టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ బయోపిక్ ‘83’ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నిర్మాతలు చీటింగ్ చేశారంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ ఫిర్యాదు చేసింది. అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టే ఆలోచనతో నిర్మాతలను కలిశారు. సినిమా హక్కులు ఇస్తామని చెప్పి రూ. 15.90 కోట్లు ఖర్చు చేయించారని.. తీరా చూస్తే తమను మోసం చేశారంటూ ముంబై కోర్టును ఆశ్రయించారు. చదవండి: బిగ్‌బాస్‌పై యాంకర్ రవి తల్లి షాకింగ్ కామెంట్స్ 83 సినిమా నిర్మాతలపై ఐపీసీ 406, 420, 120బీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దీపికా పదుకొనె, కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ట్రైలర్ కూడా విడుదల కాదా దీనికి విశేష స్పందన వచ్చింది. చదవండి: మంచు లక్ష్మిపై ఆర్జీవీ ప్రశంసలు, మురిసిపోతున్న నటి 1983 నాటి ప్రపంచ కప్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ చిత్రంలో రణ్వీర్ సింగ్.. కపిల్ దేవ్ పాత్ర పోషిస్తుండగా ఆయన భార్య రూమీ భాటియాగా దీపికా కనిపించబోతోంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో నిర్మాతలు ఆరోపణలు ఎదుర్కొవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ సినిమాలో సునీల్ గవాస్కర్ పాత్రలో తాహిర్ రాజ్ బాసిన్, కృష్ణమాచార్య శ్రీకాంత్‌గా జీవా, మదన్ లాల్ పాత్రలో హార్డీ సందు, మహీంద్రనాథ్ అమర్ నాథ్ పాత్రలో సకీబ్ సలీమ్ నటించారు. -
ఇది సిక్సర్‌కు మించినది.. సెలబ్రిటీల ప్రశంసల జల్లు
Ranveer Singh 83 Movie Trailer Out And Got Appreciation: క్రికెట్ ప్రియులకు ఆ ఆట అన్నా, ఆటపై వచ్చే సినిమాలన్న పిచ్చి ఇష్టం. వాటిపై సినిమాలు వస్తే ఇండియా వరల్డ్ కప్ గెలిచినంతగా ఆనందపడతారు. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఎంఎస్. ధోనీ చిత్రానికి ఎంత హిట్ ఇచ్చారో తెలిసిందే. అలాంటి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సినీ, క్రికెట్ అభిమానుల కోసం తెరకెక్కిందే '83' చిత్రం. ఎంతగానో ఎదురు చూస్తున్న బాలీవుడ్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె నటించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. గత క్రిస్మస్ కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనాతో ఆలస్యం అయింది. అశేష అభిమానుల ఎదురుచూపుల మధ్య ఎట్టకేలకు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. రణ్వీర్ సింగ్ క్రికెట్ దిగ్గజం, ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌గా కనిపించిన 3 నిమిషాల 49 సెకన్ల ట్రైలర్‌ను అభిమానులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం తెగ ఇష్టపడుతున్నారు. ఈ ట్రైలర్‌ను రణ్వీర్ సింగ్ తన ఇన్‌స్టా గ్రామ్‌లో 'అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇంక్రెడబుల్ ట్రూ స్టోరీ #83 ట్రైలర్ హిందీ భాషలో వచ్చేసింది. డిసెంబర్ 24, 2021న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మళయాలం భాషల్లోనే కాకుండా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.' రాస్తూ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌పై చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ షేక్‌హ్యాండ్ ఎమోజీతో వ్యాఖ్యానిస్తే, 'వాట్ ఏ వావ్... ఇది సిక్సర్‌ని మించినది. మీరు చేయలేనిది అంటూ ఏముంది రణ్వీర్ సింగ్. గూస్బంప్స్ తెప్పించింది. ఇది కచ్చితంగా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది.' అని రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్ చేసింది. ఇషా డియోల్ 'ఔట్ స్టాండింగ్. రణ్వీర్ సింగ్ నిన్ను చూసి గర్వపడుతున్నాను.' అని తెలిపింది. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్, అతని భార్య పాత్రలో దీపికా నటించారు. అలాగే తాహీర్ రాజ్ భాసిన్, జీవా, సాకిబ్ సలీమ్, జతిన్ సర్నా, చిరాగ్ పాటిల్, దిన్కర్ శర్మ, నిశాంత్ దహియా, హార్డీ సంధు, సాహిల్ ఖట్టర్, అమ్మీ విర్క్, ఆదినాథ్ కూడా యాక్ట్ చేశారు. దీపికా పదుకొణె, కబీర్ ఖాన్, విష్ణువర్ధన్ ఇందూరి, సాజిద్ నదియడ్‌వాలా, ఫాంటమ్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. -
కత్రీనా కైఫ్-రణ్వీర్ సింగ్ మధ్య పోటీ.. ఎవరు గెలుస్తారో ?
Katrina Kaif And Ranveer Singh: కొవిడ్ కారణంగా చాలా నెలలు థియేటర్లన్ని మూసివేశారు. నెలల తరబడి వినోదం పంచేందుకు సినిమాలు ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడెప్పుడూ విడుదలై ప్రేక్షకులు ముందుకు వెళ్దామా అని తహతహలాడాయి. ఇక ఆ సమయం వచ్చేసింది. ఇప్పుడు పరిస్థితులు కొంతమేర మెరుగుపడ్డాయి. ఇటీవల పలు సినిమాలు థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని కూడా దక్కించుకున్నాయి. అందుకే వచ్చే సంవత్సరమైనా ప్రేక్షకుల ముందుకు వెళ్దామని సిద్ధంగా ఉన్నాయి. అందులో ప్రధానంగా రెండు క్రేజీ సినిమాలు ఉన్నాయి. అవి వాటి రిలీజ్ డేట్‌ను ప్రకటించాయి. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న 'సర్కస్', కత్రీనా కైఫ్ 'ఫోన్ భూత్' సినిమాలు ఒకేరోజు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రెండు చిత్రాలను వచ్చే ఏడాది జూలై 15న రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్. అక్షయ్ కుమార్ హీరోగా 'సూర్యవంశీ' తెరకెక్కించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి. ఇప్పుడు ఆయన రణ్వీర్ సింగ్‌తో రూపొందిస్త్నున చిత్రమే 'సర్కస్'. ప్రముఖ రచయిత షేక్స్పియర్ నాటకం 'ది కామెడీ ఎర్రర్స్' పుస్తకం ఆధారంగా కథ సాగుతుందని సమాచారం. పూజా హెగ్డే, జాక్వెలైన్ ఫెర్నాండేజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్ డిసెంబర్ 1 నుంచి ఊటీలో ప్రారంభం కానుంది. గుర్మీత్ సింగ్ డైరెక్షన్లో వస్తున్న చిత్రం 'ఫోన్ భూత్'. ఈ సినిమా హార్రర్ కామెడీ తరహాలో సాగనుంది. ఇందులో సిద్ధాంత్ ఛతుర్వేది, రితేష్ సిద్వానీ నటిస్తున్నారు. రణ్వీర్ సింగ్ 'సర్కస్', కత్రీనా కైఫ్ 'ఫోన్ భూత్' రెండూ కామెడీ నేపథ్యంలోనే రానున్నాయి. ఈ రెండింట్లో ఏ చిత్రాన్ని బాక్సాఫీస్ వరించనుందో చూడాలి. -
కపిల్ దేవ్ బయోపిక్: ఉత్కంఠ రేపుతున్న ‘83’ మూవీ టీజర్
Ranveer Singh 83 Movie Teaser Out:1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్ రాజ్ భాసీన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దీపికా పదుకొనె, కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. చదవండి: ఎట్టకేలకు విడాకులపై స్పందించిన ప్రియాంక-నిక్ జోనస్ ఈ నేపథ్యంలో మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా 83 టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం. 1983లోని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారధ్యంలోని భారత జట్టు తొలిసారి ప్రపంచ కప్పును గెలుచుకుంది. దీని ఆధారంగా దర్శకుడు 83 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆనాడు లండన్ లార్డ్ క్రికెట్ స్టేడియంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరిత సంఘటనలను చూపిస్తూ మేకర్స్ టీజర్‌ను వదిలారు. చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్ ఎంట్రీ.. ఈ టిజర్ చూస్తుంటే సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక కపిల్ దేవ్‌గా రణ్వీర్ సింగ్ పూర్తిగా ట్రాన్స్‌ఫాం అయ్యాడు. స్టేడియంలో చివరి బంతిని కపిల్ క్యాచ్ పడుతున్న సీన్‌తో ఈ టీజర్ ముగిసింది. ఈ సిన్నివేశంలో చూస్తుంటే క్రికెట్ అభిమానులకు గూస్ బంప్స్ రాకతప్పదు అనేలా టీజర్‌ను ఆసక్తిగా మలిచారు మేకర్స్. కాగా ఈ మూవీలో కపిల్ దేవ్‌గా రణ్వీర్ నటిస్తుండగా.. ఆయన భార్య రొమి భాటియా పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. చదవండి: బిగ్‌బి రియాలిటీ షోలో ఒక్కసారిగా ఏడ్చేసిన స్టార్ హీరో -
రహస్యంగా 'దీప్‌వీర్' మూడో వివాహ వార్షికోత్సవం.. వీడియో వైరల్
Ranveer And Deepika Secret 3rd Wedding Anniversary: బాలీవుడ్ పాపులర్ కపుల్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఇటీవల ఉత్తరాఖండ్‌లో తమ మూడో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈసారి వీరిద్దరూ వార్షికోత్సవ వేడుకలను రహస్యంగా ఉంచారు. కానీ వారు డెహ్రాడూన్ విమానాశ్రయం నుంచి అభిమానులతో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ కంఫర్ట్ వేర్ ధరించిన 'దీప్‌వీర్' అల్మోరాలో అభిమానులతో ఆనందంగా ఫోజులిచ్చారు. View this post on Instagram A post shared by Deepika padukone⚡ (@deepikanpadukonefp) View this post on Instagram A post shared by Deepika padukone⚡ (@deepikanpadukonefp) View this post on Instagram A post shared by Deepika padukone⚡ (@deepikanpadukonefp) ఇటలీలోని సుందరమైన లేక్ కోమోలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వరుసగా 2018 నవంబర్ 14, 15న కొంకణి, సింధీ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. తర్వాత కుటంబం, స్నేహితుల కోసం బెంగళూరు, ముంబైలో రెండు గ్రాండ్ రిసెప్షన్లను నిర్వహించిందీ దీప్‌వీర్ జంట. ఇదిలా ఉంటే కబీర్ ఖాన్ చిత్రం 83లో రణ్వీర్ సింగ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో లెజెండరీ క్రికెటర్ కపీల్ దేవ్‌గా నటించగా, దీపికా పదుకొణె రోమీదేవిగా కనిపించనున్నారు. హాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 'ది ఇంటర్న్' హిందీ రీమేక్ 'పఠాన్ అండ్ ఫైటర్'లో దీపికా నటించనున్నారు. View this post on Instagram A post shared by Deepika padukone⚡ (@deepikanpadukonefp) -
ప్రేమలో పడ్డానంటున్న ‘లవ్లీ’ బ్యూటీ, ఎప్పటికీ డిలిట్ చేయనంటున్న దీపికా
► ‘నేను చెప్పేది పూర్తిగా వినే ఓపిక లేకుంటే వెళ్లిపోండి, ఎందుకంటే నేను పెద్ద పెద్ద ప్యారగ్రాప్లు రాస్తాను, ఒక్క వ్యాఖ్యంలో చెప్పడం రాదు’ అంటున్న కాజోల్ ► గత జ్ఞాపకాలతో లవ్‌లో పడ్డానంటున్న లవ్వీ బ్యూటీ శాన్వి శ్రీవాత్సవ ► క్యూట్‌గా ఉంది, ఎప్పటికీ డిలీట్ చేయనంటున్న దీపిక పదుకొనె ► తీర్థ యాత్రలు అయిపోయాయి, పెయింటింగ్‌తో బిజీ అయిపోయిన సమంత View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shanvi sri (@shanvisri) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Mishti Chakravarty (@mishtichakravarty) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) -
వీడియోలో అడ్డంగా దొరికిపోయిన అక్షయ్.. అయినా వదలని కత్రీనా
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్ జంట నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యవంశీ’. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అజయ్‌దేవ్‌గణ్, రణ్వీర్ సింగ్ కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 5న థియేటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ పారంభించింది ఈ చిత్రబృందం. ఆ సమయంలో తీసిన ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది క్యాట్. మా బోయ్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడండంటూ అక్షయ్, రోహిత్‌ను చూపించింది ఈ బ్యూటీ. అందులో అక్షయ్ కళ్లు మూసుకొని, రోహిత్ కాళ్లపై తలపెట్టి పడుకొని ఉన్నాడు. కత్రీనా వీడియో తీయడం చూసిన రోహిత్, అక్షయ్ రికార్డు చేయొద్దు అంటూ పరుగు లంకించుకున్నారు. ‘ఇప్పుడు మేము అంతా బాగా కనిపించడం లేదు. మాకు ఫేమ్ ఉంది. రికార్డు చేయొద్దు’ అంటు పరిగెత్తుతున్న అక్షయ్ కిందపడ్డాడు. అది చూసిన పట్టువదలని ఈ భామ గొల్లున నవ్వుతూనే వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో మూవీ ప్రమోషన్స్ గురించి వారు ఎంత ఎక్సయిట్మెంట్తో ఉన్నారో చూడండి అంటూ వెటకారమాడింది ఈ బ్యూటీ. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: OMG 2: శివుడిగా అక్షయ్ కుమార్.. లుక్ అదిరిందిగా! View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
వైరల్: బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన జాన్వీ.. ఎంజాయ్ చేసిన సారా
ఒకరు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. మరొకరు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. స్టార్ వారసురాళ్లుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీస్ అనంతరం తమ అందచందాలతో పాటు నటనతోనూ ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొట్టారు. ఈ అందగత్తెలు తాజాగా బెల్లీ డాన్స్ వేసి మరోసారి అందరి మనసులను దొచుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్, సల్మాన్ ఖాన్ బాటలో పయనిస్తూ రణ్‌వీర్‌సింగ్ ‘ది బిగ్ పిక్చర్’ అనే షోకి హోస్ట్ చేస్తున్నాడు. ఈ షో కలర్స్ టీవీలో ప్రసారమవుతోంది. తాజాగా జాన్వీ, సారా గెస్ట్స్‌గా వచ్చిన ఎపిసోడ్ ప్రొమోని సోషల్ మీడియాలో షేర్ చేసింది టీవీ మేనేజ్మెంట్. అందులో జాన్వీ గతంలో బెల్లీ డ్యాన్స్ నేర్చుకుందని చెప్పింది. దీంతో తమకు దాన్ని నేర్పించమని అడిగాడు రణ్వీర్. తన నడుమును వయ్యారంగా ఊపుతూ వారికి చూపించింది ఈ బ్యూటీ. పక్కనే ఉన్న సారా ఆమెను ఉత్సాహపరుస్తూనే తను సైతం బెల్లీ డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించింది. ఇద్దరూ అందాల భామలు చేసిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
రాంగ్ స్టెప్ వేశారో.. మీ ఫ్యూచర్‌కు దెబ్బే.. అక్షయ్ వీడియో వైరల్
సాక్షి, ముంబై: ఈ దీపావళికి ఎట్టకేలకు బిగ్ స్క్రీన్‌ను పలకరించనున్న బాలీవుడ్ మూవీ సూర్యవంశీ టీమ్ ఉత్సాహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. రణవీర్‌తో కలిసి స్పెప్పులతో ఇరగదీసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. (Prabhas: క్లాస్ అయినా మాస్ అయినా.. మోత మోగాల్సిందే!) ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. సూర్యవంశీ మూవీలోని లేటెస్ట్ ట్రాక్ ‘ఐలారే అల్లా’ పాటకు రణవీర్‌తో కలిసి స్టెప్పులేశాడు అక్షయ్. ఈ క్రేజీ డాన్స్‌కు మీరు అడుగులు రోపండి అని పోస్ట్ చేశారు. అంతేకాదు.. జాగ్రత్త.. ఎక్కడైనా పొరపాటు జరిగిందో, మీ ఫ్యూచర్‌కు దెబ్బే అంటే స్వీట్ వార్నింగ్ ఇవ్వడం విశేషం. ఈ మూవీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఐలారే పాటను గురువారం ట్విటర్లో షేర్ చేశారు.(Prabhas Birthday Special: పండగలా దిగొచ్చిన ‘డార్లింగ్’కు హ్యాపీ బర్త్‌డే) రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ సూర్యవంశీ. అజయ్ దేవగన్‌ని ‘సింగం’గా, రణ్‌వీర్‌ని ‘సింబా’గా చూపించిన రోహిత్ తాజాగా అక్షయ్‌ని ‘సూర్యవంశీ’ గా చూపించబోతున్నాడు. అంటే సింగిల్ ఫ్రేమ్‌లో ‘సింగం’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ అన్నమాట. వీరితోపాటు కత్రినా కైఫ్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. (Freida Pinto: అవును..నా డ్రీమ్ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్నా!) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నవంబర్ 5న దీపావళికి విడుదల కానుంది. తమ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసి ఆదరించాలంటూ దర్శకుడు రోహిత్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. ఈ మూవీ ప్రమోషన్లో ప్రస్తుతం అంతా బిజీబిజీగా ఉన్నారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్లను వాయిదా వేసుకున్నాయి. ఓటీటీలో కంటే థియేటర్లో రిలీజ్ కోసం వేచి ఉండాలని నిర్ణయించుకున్న కొన్ని సినిమాలలో సూర్యవంశీ కూడా ఒకటి. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) The celebrations have begun & here is your party starter pack!!#AilaReAillaa song out now - https://t.co/mLu67F7jTr#Sooryavanshi releases this Diwali, 5th November in cinemas. #BackToCinemas pic.twitter.com/R3HJwOzFT4 — Karan Johar (@karanjohar) October 21, 2021 -
ఐపీఎల్ కొత్త జట్టు కోసం బాలీవుడ్ స్టార్ జంట ఆసక్తి, ఎవరో తెలుసా?
Ranveer Singh Deepika Padukone to Bid for New IPL Franchise: వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లు రాబోతున్నాయనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్రాంచైజీలను విక్రయించేందుకు బీసీసీఐ టెండర్లకు ఆహ్వానించింది. ఆ గడువు ఈ నెల 20 తేదీతో ముగిసింది. ఈ క్రమంలో అక్టోబర్ 25న కొత్త జట్లుకోసం బిడ్డింగ్ ప్రక్రియ దుబాయ్‌లో జరగునుంది. అయితే ఈ బిడ్డింగ్ ప్రక్రియకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ జంట రణవీర్ సింగ్- దీపికా పదుకొనే కొత్త ఫ్రాంచైజీను దక్కించుకునేందకు పోటీ పడుతున్నట్లు సమాచారం. మరో వైపు కొత్త ఫ్రాంచైజీ కోసం ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యూనైటెడ్ కూడా పోటీ పడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటినుంచి బాలీవుడ్ తారలు ప్రీతి జింటా, షారుఖ్ ఖాన్ పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు యాజమానులుగా ఉన్నారు. కాగా దీపికా తండ్రి ప్రకాశ్ పదుకునే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఆయన గతంలో ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా నిలిచాడు. ఇక రణ్వీర్ సింగ్ ప్రస్తుతం ప్రముఖ బాస్కెట్‌బాల్ లీగ్ ఎన్బీఏ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. అదేవిధంగా రెండు కొత్త ఐపీఎల్ జట్లలో అహ్మదాబాద్, లక్నో ముందు వరుసలో ఉన్నాయని సమాచారం. కాగా గతంలో రాంచీ, లక్నో, అహ్మదాబాద్, గౌహతి, కటక్‌ను బీసీసీ షార్ట్ లిస్ట్ చేసింది. చదవండి: టీ20 ప్రపంచకప్ ఫేవరెట్ ఆ రెండు జట్లే: షేన్ వార్న్ -
పుట్టబోయే పాప కోసం పేర్లు వెతుకుతున్న రణ్‌వీర్‌సింగ్
బాలీవుడ్‌లోని బ్యూటీఫుల్ కపుల్స్‌లో దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ జంట ఒకటి. సినిమాలతో ఎంతో బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ బిజీ షెడ్యూల్లోనూ రణ్వీర్ ఓ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ షో పేరు ‘ది బిగ్ పిక్చర్’. అందులో రణ్వీర్ పుట్టబోయే పాప కోసం పేరు వెతుకుతున్నట్లు తెలిపాడు. కలర్స్ టీవీలో ప్రసారం కానున్న ఈ షో ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో కంటెస్టెంట్‌తో రణ్వీర్ మాట్లాడుతూ.. ‘నాకు పెళ్లి అయిందని మీ అందరికీ తెలుసు. రెండు, మూడు సంవత్సరాల్లో పిల్లలు కూడా పుడతారు. మీ వదిన చాలా క్యూట్‌గా ఉంటుంది. నేను చాలాసార్లు నీలాంటి పాపని నాకు ఇవ్వు. నా లైఫ్ సెట్ అయిపోతుందని అడుగుతుంటా. పాప వస్తే నా జీవితం అద్భుతంగా మారుతుంది’ అని అన్నాడు. అంతేకాకుండా భవిష్యత్తులో పుట్టబోయే పాప కోసం మంచి పేరు కోసం వెతుకుతున్నట్లు తెలిపాడు. అయితే రణ్వీర్ ప్రస్తుతం సూర్యవంశీ, ‘83’, ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ వంటి చిత్రాల్లో నటిస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. చదవండి: దీపికాకు గ్లోబల్ అవార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ View this post on Instagram A post shared by Pinkvilla (@pinkvilla) -
అసలు ఇతను కపిల్ దేవేనా.. ఎంతలా మారిపోయాడో చూడండి..!
Kapil Dev Channels Ranveer Singh In Hilarious Advertisement: క్రికెట్ దిగ్గజం, భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన యోధుడు, లెజండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ మైదానంలో ఎంత సౌమ్యంగా ఉండేవాడో అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి తన సహజ స్వభావానికి విరుద్ధంగా వెక్కిలి చేష్టలు చేస్తూ, రంగురంగుల దుస్తుల్లో.. భిన్నంగా కనిపించాడు. ఇదంతా చేసింది నిజ జీవితంలో అనుకుంటే పొరపాటే. ప్రముఖ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు యాప్ 'క్రెడ్' ప్రకటన కోసం కపిల్ ఇలా నటించాడు. ఈ యాడ్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ బాడీ లాంగ్వేజ్‌ని అనుకరిస్తూ.. కపిల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. Heads, I'm fashionable. Tails, I'm still fashionable. pic.twitter.com/vyKIrmLLOD — Kapil Dev (@therealkapildev) October 15, 2021 క్రికెట్ మైదానంలో ధగధగ మెరిసే దుస్తులు ధరించి, ప్రత్యర్థులను స్లెడ్జింగ్ చేస్తూ.. సైడ్ ఆర్మ్ బౌలింగ్ చేస్తూ నవ్వులు పూయించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తన సహజత్వానికి భిన్నంగా కపిల్ ఇలా దర్శనమివ్వడంతో అభిమానులు అవాక్కవుతున్నారు. కపిల్ ఇలా కూడా ఉంటాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వెంకటేష్ ప్రసాద్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా వంటి ప్రముఖులు గతంలో ఈ యాడ్‌లో సందడి చేశారు. ఇదిలా ఉంటే, కపిల్ దేవ్ టీమిండియాకు 1983 వన్డే ప్రపంచకప్‌ను అందించిన వైనాన్ని ఆధారంగా చేసుకుని.. రణ్వీర్ సింగ్ హీరోగా 83 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో కపిల్ పాత్రలో రణ్వీర్ ఒదిగిపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు రివర్స్‌గా కపిల్ కూడా రణ్వీర్ను అనుకరించేందుకు ఈ యాడ్‌లో నటించినట్లు సమాచారం. ఈ వీడియోను కపిల్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'నేను ఎంతో ఫ్యాషన్‌గా ఉన్నాను. ఇప్పటికీ నేను ఫ్యాషన్‌గా ఉన్నాను' అంటూ క్యాప్షన్ కూడా జోడించాడు. చదవండి: రేపటి నుంచే మరో మహా క్రికెట్ సంగ్రామం.. -
మార్కెట్లోకి కొత్త కారు.. తెగ కొనేస్తున్న బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్
స్టార్ హీరోలకు, హీరోయిన్లకు లగ్జరీ కార్లు అంటే మక్కువ ఎక్కువ. మార్కేట్లోకి వచ్చిన కొత్తరకం మోడల్ కార్లను ఎప్పుడెప్పుడు తమ ఇంటిముందు పార్క్ చేయాలాని ఎదురు చూస్తుంటారు. అందుకే కొత్త రకం కారు వచ్చిందంటే చాలు క్షణం అలస్యం చేయకుండా కొనేస్తారు. దేశంలో భాగ పేరొందిన మోడల్స్‌లో సూపర్-హాట్ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ 600 ఒకటి. దీని ధర 2- 4 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారు అంటే హీరో, హిరోయిన్లు తెగ ఇష్ట పడుతున్నారు. ఇటీవల ఈ మోడల్ కారును కొనుగోలు చేసిన వారిలో భాగ పేరొందిన స్టార్ హీరో, హీరోయిన్ల గురుంచి తెలుసుకుందాం. ఈ ఖరీదైన కారును నడుపుతు వారు రహదారిపై కనిపించారు. 1.రామ్ చరణ్ దక్షిణాది అతిపెద్ద హీరోలలో రామ్ చరణ్ ఒకరు. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ సంఖ్య ఈ కారు కోసం అతను చెల్లించిన మొత్తం కంటే ఎక్కువ. హై సెక్యూరిటీ, అధునాతన టెక్నాలజీతో చరణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కారు ధర రూ.4 కోట్లు ఉంటుందట. అయితే చెర్రి దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. 2.రణవీర్ సింగ్ మిస్టర్ బాజీరావ్ 'మస్తానీ' గత సంవత్సరం జూలైలో ఈ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ కారును కొన్నాడు. భారతదేశంలో ప్రారంభించిన ఒక నెల తరువాత దీనిని కొనుగోలు చేశాడు. దీనిని కొనుగోలు చేసిన తర్వాత లంబోర్ఘినిని కూడా కొనుగోలు చేశాడు.(చదవండి: ఆపిల్ కొంపముంచిన చిప్స్...!) 3. అర్జున్ కపూర్ 'అర్జున్ కపూర్' పరిచయం అవసరంలేని బాలీవుడ్ స్టార్. ఎందుకంటే ఇతడు హీరోగా మాత్రమే కాకుండా అసిస్టెంట్ ప్రొడ్యూసర్, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసారు. అతడు ఇషాక్ జాదే వంటి సినిమా వల్ల బాగా పాపులర్ అయ్యాడు. జర్మనీ లగ్జరీ వాహన తయారీ సంస్థ Mercedes-Maybach GLS 600 కారుని ఈ ఏడాది సెప్టెంబర్ లో కొనుగోలు చేశాడు.(చదవండి: సౌరవ్ గంగూలీపై కోకాకోలా కీలక నిర్ణయం..!) 4. కృతి సనన్ ‘మిమి’ సక్సెస్.. చేతిలో ‘ఆదిపురుష్’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోయిన్ కృతీ సనన్ తనకు తానే ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చుకున్నారు. సరికొత్త మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును తనకు తానే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నారు కృతీ సనన్. 5. ఆయుష్మాన్ ఖురానా 2018లో వచ్చిన ‘అంధాదూన్’ అనే సినిమాతో ఆయన నేషనల్ అవార్డు అందుకున్న ఆయుష్మాన్ ఖురానా ఈ ఏడాది జూలై నెలలో ఖరీదైన మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును కొన్నారు. -
ప్రొఫెసర్ జాబ్ వదిలేసి.. బాలీవుడ్ ఫ్యాషన్‌కే ట్రెండ్ సెట్టరయ్యింది.!
భద్రజీవిత ప్రమాణాలతో పోల్చితే, దిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో చేస్తున్న ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులుకొని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం రిస్క్ అనిపించవచ్చు. అందుకే ‘’ అని నిటషా గౌరవ్‌తో అన్నవాళ్లే ఎక్కువ. చదవండి: Health Tips: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..! విజయం దక్కాలంటే రిస్క్ చేయడం తప్పనిసరి అనే వాస్తవం నిటషాకు తెలియనిదేమీ కాదు. ‘నిఫ్ట్’లో ప్రొఫెసర్ అయినంత మాత్రాన, ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ న్యూయార్క్, లండన్ కాలేజీ ఆఫ్ ఫ్యాషన్‌లో చదువుకున్నంత మాత్రాన అవకాశాలు వెదుక్కుంటూ రావు అనే విషయం ఆమెకు తెలియనిదేమీ కాదు. నిటషా గౌరవ్ ఎందుకంటే...ప్రతి హీరోకి ఒక బాడీలాంగ్వేజ్ ఉంటుంది. ‘నాకు ఇలాంటి స్టైల్ ఉండాలి’ అని అతను అనుకుంటాడు. ‘మా హీరోకి ఇలాంటి స్టైలే ఉండాలి’ అని డైరెక్టర్ అనుకుంటాడు. ‘మా హీరోకి ఇలాంటి స్టైల్ ఉండాలి’ అని అభిమాని అనుకుంటాడు. చాలా సందర్భాల్లో హీరోకి నచ్చిన స్టైల్ అభిమానికి నచ్చకపోవచ్చు. ఇద్దరికీ నచ్చింది డైరెక్టర్‌కు నచ్చకపోవచ్చు. మరి ముగ్గురు మెచ్చేలా స్టైల్ డిజైనింగ్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు. అకడమిక్ చదువులు మాత్రమే పనికిరాకపోవచ్చు. నిటషా మాటల్లో చెప్పాలంటే ఒక పుస్తకంలా హీరోని అధ్యయనం చేయాలి. చదవండి: షుగర్ వ్యాధిగ్రస్తులకు ‘తీపి’ కబురు.. పామ్ నీరా, బెల్లం! ‘బ్యాండ్ బాజా బరాత్’ సినిమా విడుదలైన రోజులవి. అప్పటికింకా రణ్‌వీర్‌సింగ్ అంత పెద్దస్టార్ కాలేదు. అంతమాత్రాన ‘మీకు స్టైలిష్ట్‌గా పనిచేస్తాను’ అంటే వెంటనే ‘ఓకే’ అని ఎవరూ అనరు. కొత్త హీరోలు, కొత్త భయాలు ఉంటాయి! ఇప్పుడిప్పుడే ప్రయోగాలు వద్దనుకుంటారు. అయితే రణ్వీర్సింగ్లాంటివారు దీనికి మినహాయింపు. కొత్తవాళ్లను ప్రోత్సహిస్తారు. రణ్వీర్ ‘ఫిల్మ్‌ఫేర్’ పత్రిక ముఖచిత్రం కోసం రణ్వీర్ స్టైలిస్ట్‌గా అడుగుపెట్టింది నిటషా. ఆ కవర్‌కు ఎంత పేరొచ్చిందంటే...‘ఎవరీ స్టైలిస్ట్?’ అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అలా రణ్‌వీర్‌కు నిటషా మీద నమ్మకం కుదిరింది. కట్ చేస్తే.... బాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా పది సంవత్సరాల మైలురాయిని దాటేసింది! ‘అదృష్టవశాత్తు అవకాశం వచ్చింది.. వినియోగించుకున్నాను’ అన్నట్లుగా కాకుండా మెన్ ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన ట్రెండ్ సెట్టర్‌గా పేరు తెచ్చుకుంది నిటషా. రణ్‌వీర్‌కు మాత్రమే కాదు ప్రియాంకచోప్రా, అర్జున్ కపూర్, విద్యాబాలన్, వరుణ్ ధవన్...ఇలా ఎంతోమంది తారలకు స్టైలిస్ట్‌గా పనిచేస్తుంది. తాను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టకముందు స్టైలింగ్‌లో ‘రూల్‌బుక్’ అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ‘రూల్‌బుక్’కు అతీతంగా ఏమీ చేయడానికి కుదరదు. అదంతే! అన్నట్లుగా ఉండేది. ‘అప్పుడప్పుడూ రూల్స్ బ్రేక్ చేయడం కూడా మంచి రూలే’ అంటున్న నిటషా చాలాసార్లు ‘రూల్‌బుక్’కు అతీతంగా వెళ్లింది. కొన్నిసార్లు పాఠాల్లో లేని ‘స్ట్రీట్ లుక్’ను సృష్టించింది. ‘స్టైల్ అనేది నేల విడిచి సాము చేయకూడదు. అది మన వ్యక్తిత్వంలో భాగంగా కనిపించాలి’ అంటున్న నిటషాకు 70’లలోని బాలీవుడ్ సినిమా స్టైల్ అంటే ఇష్టం. విజయం గొప్పదనం ఏమిటంటే...అది అందుకున్న వ్యక్తికి మాత్రమే పరిమితం కాదు. దాని వెలుగులు దశదిశలా వ్యాపించి ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తాయి. సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా రాణించాలనుకుంటున్న ఎంతోమంది ఔత్సాహికులకు ఇప్పుడు నిటషా గౌరవ్ రోల్ మోడల్. చదవండి: టెంపుల్ డ్యాన్స్ వీడియోలతో .. ప్రాచీన ఆలయాలకు నూతన శోభ!!