ప్రెగ్నెన్సీ ప్రకటించారో లేదో.. ‘ట్విన్స్‌’ అంటూ సందడి చేస్తున్న ఫ్యాన్స్‌ | Fans Speculate that Deepika Padukone Ranveer Singh expecting TWINS | Sakshi
Sakshi News home page

ప్రెగ్నెన్సీ ప్రకటించారో లేదో.. ‘ట్విన్స్‌’ అంటూ సందడి చేస్తున్న ఫ్యాన్స్‌

Published Mon, Mar 4 2024 11:39 AM | Last Updated on Mon, Mar 4 2024 1:11 PM

Fans Speculate that Deepika Padukone Ranveer Singh expecting TWINS - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ త్వరలోనే  తమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ శుభవార్తను ఫిబ్రవరి 29న సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు  దీపికా,  రణ్‌వీర్‌. ఈ సందర్బంగా ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌గా మారింది. అంతేకాదు పుట్టబోయేది కవలలు  అంటు తెగ చర్చిస్తున్నారు  ఫ్యాన్స్‌.   

ప్రెగ్నెన్సీని అలా ప్రకటించారో లేదో, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారు అంటూ ఫ్యాన్స్‌ తెగ సందడి చేస్తున్నారు. ఇందుకు ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్న బ్లూ, పింక్‌ షేడ్స్‌లో  షూస్‌, టోపీలు, ఫ్రాక్‌, ఇతర బొమ్మలను ఉదహరిస్తున్నారు.  పింక్‌  కలర్‌ ఆడ బిడ్డకు, బ్లూ కలర్‌ మగబిడ్డకు సంకేతం కాబట్టి, దీపికా రణ్‌వీర్‌ దంపతులకు ట్విన్స్‌ పుట్టబోతున్నారంటూ నెటిజన్లు పలు  ఊహాగానాలు  చేస్తున్నారు. అయితే ఇంకా బేబీ ఎవరనేది తెలియదు  కాబట్టి ఈ రెండు కలర్స్‌ పెట్టారని మరో యూజర్‌ ఈ వాదనను కొట్టిపారేశారు. 

కాగా దీపికా, రణ్‌వీర్‌ 2018,నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరులో పుట్టనున్న  బిడ్డకోసం అందరూ  ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. పెళ్లి తరువాతనటులుగా ఇద్దరూ దూసుకుపోతున్నారు. రోహిత్ శెట్టి 'సింగం ఎగైన్', నాగ్ అశ్విన్  'కల్కి 2898 ఏడీ'లో దీపిక నటిస్తుండగా, మరోవైపు రణ్‌వీర్ 'సింబా 2', 'డాన్ 3' ,'సింగమ్ ఎగైన్' చిత్రాల్లో కనిపించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement