Pregnancy
-
ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట జూన్‌లో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తోంది బాలీవుడ్ భామ. దీంతో నెటిజన్స్ ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సోనాక్షి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆమె ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ కూడా తెగ వైరలవుతున్నాయి.ఈ సందర్భంగా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించింది సోనాక్షి. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చింది. తాను ప్రస్తుతం గర్భవతిని కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం మేమిద్దరం సరదాగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నామని చెప్పింది. పెళ్లి తర్వాత తాను కొంత బరువు పెరగడంతో పాటు లావుగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది. అందువల్లే తనను గర్భవతి అంటూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారని వివరించింది. ప్రస్తుతం తామిద్దరం వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నామని సోనాక్షి తెలిపింది.కాగా.. తన భర్త బర్త్ డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది బాలీవుడ్ హీరోయిన్. డిసెంబర్ 10న జరిగిన జహీర్ ఇక్బాల్ పుట్టిన రోజు వేడుకలో సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా కూడా హాజరయ్యారు. ఈ ఏడాది జూన్ 23న ఒక ప్రైవేట్ వేడుకలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు, సన్నిహితులు హాజరయ్యారు. వీరిద్దరి రిసెప్షన్ వేడుకలో రేఖ, సల్మాన్ ఖాన్, అదితి రావ్ హైదరీ, హుమా ఖురేషి, ఆదిత్య రాయ్ కపూర్ పాల్గొన్నారు. -
కాబోయే అమ్మలకు 'టీకా'పలా!
కాబోయే అమ్మలకు టీకాపలా!గర్భవతులు తమ ఆరోగ్యం కోసం కొన్ని, తమకు పుట్టబోయే చిన్నారి ఆరోగ్యం కోసం మరికొన్ని వ్యాక్సిన్లు తీసుకుంటూ ఉండాలి. అయితే గర్భం రాకముందు కూడా కొన్ని వ్యాక్సిన్లు వేసుకోవాల్సి ఉంటుంది. కొందరిలో వారి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా ఇంకొన్ని వ్యాక్సిన్లు తీసుకోవాల్సి రావచ్చు. గర్భం కోసం ప్లాన్ చేసుకునే మహిళలు, ఆపై గర్భం ధరించాక గర్భవతులు... ఇలా మహిళందరూ తాము తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించి తెలుసుకోడానికి ఉపయోగపడే కథనం ఇది. గర్భవతినని తెలియగానే ఆమె తనకు వచ్చేందుకు అవకాశమున్న ఇన్ఫెక్షన్ల గురించి, తాను తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించి అవగాహన కలిగి ఉండాలి. గర్భిణులు తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ఇవి... టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ (డీపీటీ) వ్యాక్సిన్: టెటనస్ వచ్చిన బాధితుల్లో కండరాలు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. డిఫ్తీరియా వస్తే గొంతులోపల వెనక భాగంలో ఒక మందపాటి పొరగా ఏర్పడి, అది శ్వాస సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. ఇక ‘కోరింత దగ్గు’ అని పిలిచే పెర్టుసిస్ అనే వ్యాధితోపాటు పైన పేర్కొన్న మరో రెండు.. అన్నీ కలిసి మూడు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోడానికి గర్భవతి విధిగా డీపీటీ వ్యాక్సిన్ తీసుకోవాలి. సంక్షిప్తంగా ‘టీ–డాప్’ అని పిలిచే ఈ వ్యాక్సిన్‌ను గర్భధారణ జరిగిన ప్రతిసారీ తీసుకోవాలి. గర్భధారణ తర్వాత 20 వారాలప్పుడు దీన్ని తీసుకోవాలి. ఇక 27వ వారం నుంచి 36వ వారం మధ్యలో తీసుకోవడం కూడా మంచిదే. ఇలా చేయడం వల్ల పుట్టిన చిన్నారికి సైతం ఆ వ్యాధుల నుంచి కొంతకాలం పాటు రక్షణ లభించే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) వ్యాక్సిన్: గర్భవతి విధిగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. నిజానికి కేవలం గర్భవతులే కాదు... ప్రజలందరూ తీసుకోవడం మంచిదే. అయితే గర్భవతుల్లో ఫ్లూ వ్యాధి చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. ప్రతి సీజన్లో మహిళలందరూ దీన్ని తీసుకోవడంతో పాటు, గర్భవతులైతే మరింత తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక గర్భధారణ సమయంలో దీన్ని తీసుకోవడం వల్ల పిండంపై పడే దుష్ప్రభావంపై అధ్యయనాలు పెద్దగా లేవు. పైగా గర్భం ధరించి ఉన్నప్పుడు తీసుకునే ఈ వ్యాక్సిన్ బిడ్డ పుట్టాక మొదటి ఆర్నెల్లపాటూ చిన్నారికీ రక్షణ ఇస్తుందని కొందరు నిపుణుల అభిప్రాయం. కొన్ని సందర్భాల్లో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ముక్కుతో పీల్చడం ద్వారా కూడా తీసుకోవచ్చు. కానీ ఈ తరహా ముక్కుతో పీల్చే వ్యాక్సిన్‌ను లైవ్వైరస్తో తయారు చేస్తారు కాబట్టి గర్భవతులు మాత్రం పీల్చే వ్యాక్సిన్‌ను అస్సలు వాడకూడదు.గర్భం దాల్చడానికి ముందుగానే తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు... గర్భం దాల్చాలనుకున్న మహిళలు తాము ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోగానే కొన్ని వ్యాక్సిన్లను తప్పక తీసుకోవాలి. అవి... మీజిల్స్, మంప్స్, రుబెల్లా, చికెన్‌పాక్స్ వ్యాక్సిన్లు. గర్భం దాల్చిన తర్వాత తీసుకుంటే ఈ వ్యాక్సిన్లు గర్భవతికి ప్రమాదకరంగా పరణమించవచ్చు. అందుకే వీటిని ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడే తీసుకోవాలి. ఒకవేళ వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) పెద్దగా లేని గర్భవతికీ లేదా ఇమ్యూనిటీ చాలా బలహీనంగా ఉన్న మహిళలకు ఈ ఇన్ఫెక్షన్లు సోకితే అది చాలా ప్రమాదకారులు కావచ్చు. కాబట్టి వీటిని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు... మరీ చె΄్పాలంటే... ఇంకా గర్భం దాల్చక ముందే తీసుకోవడం మంచిది. (ఈ వ్యాక్సిన్లను రొటీన్ వ్యాక్సినేషన్లో భాగంగానే ఇస్తారు. ఒకవేళ అలా తీసుకోనివారు తప్పక ఈ వ్యాక్సిన్లు తీసుకోవాలి). ఒకవేళ మీజిల్స్, మంప్స్, రుబెల్లా (ఎమ్ఎమ్ఆర్) వ్యాక్సిన్‌ను బాల్యంలో తమ రొటిన్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తీసుకున్నారా లేదా అనే సందేహం ఉంటే ఆ విషయాన్ని తమ డాక్టర్‌తో చెప్పాలి. అప్పుడు వారు ఒక రక్తపరీక్ష ద్వారా ఆ వ్యక్తి ఎమ్ఎమ్ఆర్ వ్యాక్సిన్ తీసుకొని ఉన్నారా, లేదా అని తెలుసుకుంటారు. దాన్ని బట్టి అవసరమైతే ఆ వ్యాక్సిన్ ఇస్తారు. ఎమ్ఎమ్ఆర్ వ్యాక్సిన్ తీసుకోని మహిళలకు గర్భందాల్చాక అర్లీ ప్రెగ్నెన్సీ సమయంలో ఆ వ్యాధులు (మీజిల్స్, మంప్స్, రుబెల్లా) సోకితే గర్భస్రావం అయ్యే అవకాశాలూ ఉంటాయి.ఒకవేళ రుబెల్లా వైరస్ గానీ అర్లీ ప్రెగ్నెన్సీ సమయంలో సోకిందంటే... అది బిడ్డలో పుట్టుకతోనే వచ్చే తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. రుబెల్లా వైరస్ సోకడం వల్ల పుట్టిన బిడ్డలకు వినికిడి సమస్యలు, కళ్లు, గుండె, మెదడు సమస్యల వంటివి వచ్చేందుకు అవకాశాలెక్కువ. అర్లీ ప్రెగ్నెన్సీలో కాకుండా... రెండో త్రైమాసికం తర్వాతగానీ ఇవే ఇన్ఫెక్షన్లు సోకినా అవి బిడ్డపై అవి పెద్దగా ప్రభావం చూపవు. వారిసెల్లా (చికెన్‌పాక్స్) వైరస్ గర్భవతికి సోకవం వల్ల (ముఖ్యంగా అర్లీ ప్రెగ్నెన్సీలో) బిడ్డలో పుట్టుకతోనే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న రక్తపరీక్ష ద్వారా గర్భిణి గతంలోనే చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. కాబట్టి గర్భం దాల్చాలనుకునేవారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందరే ఈ పరీక్ష చేయించుకుని, ఒకవేళ చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఉండకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోడానికి నెల్లాళ్ల ముందే దాన్ని తీసుకోవడం మేలు. హ్యూమన్ పాపిలోమా వైరస్: హెచ్‌పీవీ అని సంక్షిప్తంగా పిలిచే ఈ వైరస్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ తొమ్మిదో ఏటి నుంచి 26 ఏళ్ల వయసు మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. నిజానికి ఈ వైరస్‌ను యాక్టివ్ వైవాహిక జీవితాన్ని ప్రారంభించకముందే తీసుకుంటే దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ సైతం నివారితమవుతుంది.గర్భిణికి ఇవ్వకూడని వ్యాక్సిన్... జోస్టర్ వ్యాక్సిన్‌ను గర్భవతికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది జీవించి ఉండే వైరస్‌తో తయారు చేసే వ్యాక్సిన్. కాబట్టి దీన్ని గర్భం దాల్చినవారికి ఇవ్వరు. సాధారణంగా దీన్ని 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారికి సిఫార్సు చేస్తుంటారు. ఆ సమయానికి గర్భధారణ వయసు ఎలాగూ మించిపోతుంది కాబట్టి దీని ప్రభావం గర్భధారణపై ఉండటానికి ఆస్కారం ఉండదు. ఇవీ... గర్భవతులు, గర్భం దాల్చాలనుకునే వారితో పాటు ఇతర మహిళలూ తెలుసుకోవాల్సిన వ్యాక్సిన్లు, వాటి గురించి వివరాలు. -
చిన్నప్పటి నుంచి డయాబెటిస్ ఉంటే ప్రెగ్నెన్సీలో సమస్యలు వస్తాయా..?
నాకు 35 ఏళ్లు. చిన్నప్పటి నుంచి డయాబెటిస్ ఉంది. ఇన్సులిన్ తీసుకుంటున్నాను. ఈమధ్యనే పెళ్లయింది. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– సీహెచ్. శరణ్య, గుంటూరుబ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా చూసుకుని, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. దీనివల్ల తల్లీబిడ్డలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ప్రెగ్నెన్సీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ను పెంచుతుంది. మామూలుగా కన్నా ప్రెగ్సెన్సీ సమయంలో రెండు మూడు రెట్ల ఎక్కువ ఇన్సులిన్ మోతాదు మీద ఉండాల్సి వస్తుంది. అలాగే చెకప్స్ విషయంలో కూడా రెండు వారాలకు ఒకసారి అబ్స్టట్రిషన్ని సంప్రదించాలి. మీరు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి హెచ్‌బీఏ1సీ లెవెల్స్‌ని చెక్ చేసుకోండి. థైరాయిడ్, సీబీపీ టెస్ట్స్ చేయించుకోండి. హెబీఏ1సీ 5.5 లోపు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి. ఆ లెవెల్ ఎక్కువగా ఉంటే డయబెటాలజిస్ట్ని సంప్రదించండి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ మోతాదును చేంజ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కనీసం మూడు నెలల ముందు నుంచి ఫోలిక్‌యాసిడ్ 5ఎమ్జీ మాత్రలను తీసుకుంటూండాలి. ప్రెగ్నెన్సీలో సుగర్స్ చాలా ఫ్లక్చువేట్ అవుతాయి. మొదటి మూడు నెలల్లో సుగర్ డౌన్ (హైపోగ్లైసీమియా) అయ్యే ప్రమాదం ఎక్కువ. డయాబెటిక్ రెటీనోపతి అంటే సుగర్ వల్ల కంటి సమస్య .. ఇది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీలో మూడు నెలలకు ఒకసారి కంటి, కిడ్నీకి సంబంధించి స్క్రీనింగ్ చేయించుకుంటూండాలి. డయాబెటిస్ కంట్రోల్లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మూడు నెలల్లోనే గర్భస్రావం అయ్యే చాన్సెస్, కంజెనిటల్ అనామలీస్ (పుట్టుకతో వచ్చే లోపాలు) ప్రమాదాలు ఎక్కువ. అంతేకాదు లోపల బిడ్డ ఎదుగుదలా సరిగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా బిడ్డకు గుండె సమస్యలు ఎక్కువవుతాయి. గ్రహణం మొర్రి, అంగిలి చీలి ఉండటం వంటి సమస్యలూ ఉంటాయి. హెబీఏ1సీ ఏడు శాతం దాటిన వారిలో ఇలాంటివి కనిపిస్తాయి. రెండు, మూడు త్రైమాసికాల్లో అంటే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో గ్లూకోజ్ సరిగా నియంత్రణలో లేకపోతే గర్భస్థ శిశువుకు కూడా గ్లూకోజ్ ఎక్కువ వెళ్తుంది. దీనివల్ల బిడ్డ ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటుంది. దాంతో బిడ్డకూ సుగర్ రావడం, డెలివరీ కష్టమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే క్రమం తప్పకుండా గ్రోత్ స్కాన్స్ చేయించుకుంటూండాలి. 24 వారాలప్పుడు బేబీ హార్ట్ స్కాన్ చేస్తారు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టే తొమ్మిదవ నెల వచ్చిన వెంటనే 37– 38 వారాలకు డెలివరీ ప్లాన్ చేస్తారు. బిడ్డ నాలుగు కేజీలు.. అంతకన్నా ఎక్కువ ఉంటే సిజేరియన్ ఆప్షన్‌కి వెళ్తారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేంత వరకు మల్టీవిటమిన్స్, డాక్టర్ నిర్ణయించిన మోతాదులో ఇన్సులిన్‌ను కంటిన్యూ చేయాలి. ప్రెగ్నెన్సీలో ఏ టైప్ ఇన్సులిన్‌ను వాడాలో ప్రిస్క్రైబ్ చేస్తారు. తక్కువ మోతాదులో ఆస్పిరిన్‌ను మొదటి మూడునెలల్లో స్టార్ట్ చేయాలి. లేకపోతే బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉన్నవారిలో రిస్క్ పెరుగుతుంది. హైబీపీ, ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మీరు సుగర్‌కి మాత్రలు వేసుకుంటున్నట్లయితే అవి ప్రెగ్నెన్సీలో సురక్షితమో కాదో డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవాలి. ఒకవేళ అవి సురక్షితం కాకపోతే వేంటనే ఆపేయించి, సురక్షితమైన మందులను ప్రిస్క్రైబ్ చేస్తారు. డెలివరీ తర్వాత చాలామందికి బ్లడ్ గ్లూకోజ్ నార్మల్ స్థాయికి వచ్చేస్తుంది. అప్పుడు మందుల మోతాదు కూడా తగ్గించేస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ కచ్చితంగా ఇవ్వాలి. డెలివరీ తర్వాత బిడ్డకు హఠాత్తుగా లో సుగర్ అవొచ్చు. అందుకే సీనియర్ నియోనేటాలజిస్ట్స్ ఉన్న చోటే డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. సుగర్ డౌన్ అయితే కొంతమంది పిల్లలను ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీలో మూడు నెలలకు ఒకసారి కంటి, కిడ్నీకి సంబంధించి స్క్రీనింగ్ చేయించుకుంటూండాలి. డయాబెటిస్ కంట్రోల్లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మూడు నెలల్లోనే గర్భస్రావం అయ్యే చాన్సెస్, కంజెనిటల్ అనామలీస్ (పుట్టుకతో వచ్చే లోపాలు) ప్రమాదాలు ఎక్కువ. (చదవండి: పొంచే ఉంది.. కొంచెం జాగ్రత్త!) -
చిన్నప్పటి నుంచి ఉంది ప్లానింగ్ ఎలా?
నాకు 35 ఏళ్లు. చిన్నప్పటి నుంచి డయాబెటిస్ ఉంది. ఇన్సులిన్ తీసుకుంటున్నాను. ఈమధ్యనే పెళ్లయింది. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– సీహెచ్. శరణ్య, గుంటూరుబ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా చూసుకుని, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. దీనివల్ల తల్లీబిడ్డలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ప్రెగ్నెన్సీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ను పెంచుతుంది. మామూలుగా కన్నా ప్రెగ్సెన్సీ సమయంలో రెండు మూడు రెట్ల ఎక్కువ ఇన్సులిన్ మోతాదు మీద ఉండాల్సి వస్తుంది. అలాగే చెకప్స్ విషయంలో కూడా రెండు వారాలకు ఒకసారి అబ్స్టట్రిషన్ని సంప్రదించాలి. మీరు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి హెచ్‌బీఏ1సీ లెవెల్స్‌ని చెక్ చేసుకోండి. థైరాయిడ్, సీబీపీ టెస్ట్స్ చేయించుకోండి. హెబీఏ1సీ 5.5 లోపు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి. ఆ లెవెల్ ఎక్కువగా ఉంటే డయబెటాలజిస్ట్ని సంప్రదించండి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ మోతాదును చేంజ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కనీసం మూడు నెలల ముందు నుంచి ఫోలిక్‌యాసిడ్ 5ఎమ్జీ మాత్రలను తీసుకుంటూండాలి. ప్రెగ్నెన్సీలో సుగర్స్ చాలా ఫ్లక్చువేట్ అవుతాయి. మొదటి మూడు నెలల్లో సుగర్ డౌన్ (హైపోగ్లైసీమియా) అయ్యే ప్రమాదం ఎక్కువ. డయాబెటిక్ రెటీనోపతి అంటే సుగర్ వల్ల కంటి సమస్య .. ఇది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీలో మూడు నెలలకు ఒకసారి కంటి, కిడ్నీకి సంబంధించి స్క్రీనింగ్ చేయించుకుంటూండాలి. డయాబెటిస్ కంట్రోల్లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మూడు నెలల్లోనే గర్భస్రావం అయ్యే చాన్సెస్, కంజెనిటల్ అనామలీస్ (పుట్టుకతో వచ్చే లోపాలు) ప్రమాదాలు ఎక్కువ. అంతేకాదు లోపల బిడ్డ ఎదుగుదలా సరిగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా బిడ్డకు గుండె సమస్యలు ఎక్కువవుతాయి. గ్రహణం మొర్రి, అంగిలి చీలి ఉండటం వంటి సమస్యలూ ఉంటాయి. హెబీఏ1సీ ఏడు శాతం దాటిన వారిలో ఇలాంటివి కనిపిస్తాయి. రెండు, మూడు త్రైమాసికాల్లో అంటే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో గ్లూకోజ్ సరిగా నియంత్రణలో లేకపోతే గర్భస్థ శిశువుకు కూడా గ్లూకోజ్ ఎక్కువ వెళ్తుంది. దీనివల్ల బిడ్డ ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటుంది. దాంతో బిడ్డకూ సుగర్ రావడం, డెలివరీ కష్టమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే క్రమం తప్పకుండా గ్రోత్ స్కాన్స్ చేయించుకుంటూండాలి. 24 వారాలప్పుడు బేబీ హార్ట్ స్కాన్ చేస్తారు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టే తొమ్మిదవ నెల వచ్చిన వెంటనే 37– 38 వారాలకు డెలివరీ ప్లాన్ చేస్తారు. బిడ్డ నాలుగు కేజీలు.. అంతకన్నా ఎక్కువ ఉంటే సిజేరియన్ ఆప్షన్‌కి వెళ్తారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేంత వరకు మల్టీవిటమిన్స్, డాక్టర్ నిర్ణయించిన మోతాదులో ఇన్సులిన్‌ను కంటిన్యూ చేయాలి. ప్రెగ్నెన్సీలో ఏ టైప్ ఇన్సులిన్‌ను వాడాలో ప్రిస్క్రైబ్ చేస్తారు. తక్కువ మోతాదులో ఆస్పిరిన్‌ను మొదటి మూడునెలల్లో స్టార్ట్ చేయాలి. లేకపోతే బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉన్నవారిలో రిస్క్ పెరుగుతుంది. హైబీపీ, ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మీరు సుగర్‌కి మాత్రలు వేసుకుంటున్నట్లయితే అవి ప్రెగ్నెన్సీలో సురక్షితమో కాదో డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవాలి. ఒకవేళ అవి సురక్షితం కాకపోతే వేంటనే ఆపేయించి, సురక్షితమైన మందులను ప్రిస్క్రైబ్ చేస్తారు. డెలివరీ తర్వాత చాలామందికి బ్లడ్ గ్లూకోజ్ నార్మల్ స్థాయికి వచ్చేస్తుంది. అప్పుడు మందుల మోతాదు కూడా తగ్గించేస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ కచ్చితంగా ఇవ్వాలి. డెలివరీ తర్వాత బిడ్డకు హఠాత్తుగా లో సుగర్ అవొచ్చు. అందుకే సీనియర్ నియోనేటాలజిస్ట్స్ ఉన్న చోటే డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. సుగర్ డౌన్ అయితే కొంతమంది పిల్లలను ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీలో మూడు నెలలకు ఒకసారి కంటి, కిడ్నీకి సంబంధించి స్క్రీనింగ్ చేయించుకుంటూండాలి. డయాబెటిస్ కంట్రోల్లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మూడు నెలల్లోనే గర్భస్రావం అయ్యే చాన్సెస్, కంజెనిటల్ అనామలీస్ (పుట్టుకతో వచ్చే లోపాలు) ప్రమాదాలు ఎక్కువ. -
అంతగనం ఏముంది అనుకోకండి : కోటి దిశగా దూసుకుపోతోంది!
సోషల్ మీడియాలో ఏది సంచలనంగా మారుతుందో.. ఏది వైరల్‌గా మారుతుంది ఊహించలేం. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.నైజీరియాకు కెందిన వైవన్నే అనే యూజర్ ఒక వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ది బ్యూటిఫుల్ రెస్క్యూ టీం అనే క్యాప్షన్‌తో పోస్ట్ అయిన ఈ వీడియో నెటిజనులకు బాగా నచ్చేసింది. రీట్వీట్లు, లైక్‌ల వర్షం కురుస్తోంది. సూపర్.. క్యూట్ అంటూ కమెంట్లు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఇది 90 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటే...మీరే చూసేయండి!That was a beautiful rescue team😁🥰 pic.twitter.com/75AZNcFi64— Yvonne (@Yummy_yvy) November 24, 2024 -
హై రిస్క్ ప్రెగ్నెన్సీ?!
నేనిప్పుడు ప్రెగ్నెంట్‌ని. రెండో నెల. తొలి చూలు. బరువు 110 కేజీలు ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఊబకాయం ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బ్లడ్ క్లాట్స్ రిస్క్ ఎక్కువ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అలా కాకుండా ఏమి చెయ్యాలి. కొన్ని మందులు రాశారు. అవి వాడొచ్చా? – మనీషా, బెంగళూరుకాళ్లల్లోని డీప్ వీన్స్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే చాన్స్ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ. దీనిని డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ)అంటారు. ఈ క్లాట్ కనుక రక్తనాళాల్లోకి వెళ్తే చాలా ప్రమాదం. ఇవి కొంతమందికి ఊపిరితిత్తులు, గుండెలోకీ మూవ్ అవుతుంటాయి. బ్లడ్ థిక్ కావడం వల్ల ఈ క్లాట్స్ ఫామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కొంతమందిలో ఇతరత్రా మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా నెమ్మదిగా రక్తప్రసరణ జరుగుతుంది. బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటే, రక్తం చిక్కనవుతుంది. జనరల్ సర్జరీ తర్వాత కూడా శరీరంలో ఈ ప్రోటీన్స్ పెరుగుతాయి. వీటన్నిటి దృష్ట్యా.. కొంతమందికి ప్రెగ్నెన్సీ తొలి వారల్లోనే బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి వస్తుంది. అలాంటి వారికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అధిక బరువు అంటే, బాడీ మాస్ ఇండెక్స్ 35 లేదా అంతకంటే ఎక్కువ, వయసు 35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, వ్యక్తిగతæ లేదా ఫ్యామిలీ హిస్టరీలో బ్లడ్ క్లాట్స్, స్ట్రోక్ ఉన్నవారు, ఏపీఎల్ఏ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నవారు, సివియర్ వెరికోస్ వీన్స్ ఉన్నవారు, బెడ్ రెస్ట్‌లో ఉన్నవారికి ఈ రిస్క్ ఎన్నో రెట్లు పెరుగుతుంది. బ్లడ్ క్లాట్ ఉన్నప్పుడు కాలులో నొప్పి , వాపు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ ఉంటే ఆయాసం, దగ్గు, ఛాతీ నొప్పి వంటివి ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఇలాంటి లక్షణాలు ఎప్పుడు కనిపించినా వెంటనే ఎమర్జెన్సీ డాక్టర్ని కలవాలి. లంగ్ స్కాన్, లోయర్ లింబ్ డాప్లర్ స్కాన్ ద్వారా క్లాట్స్ని కనిపెడ్తారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించి.. కాళ్లల్లో క్లాట్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇంట్లో, ఆఫీసులో ఒకే చోట కూర్చోకుండా, గంటకు ఒకసారి అయిదు నిమిషాలు వాకింగ్ చేయాలి. మంచం మీద పడుకున్నప్పుడు కూడా మోకాళ్లు, కాళ్లు కదుపుతూ ఉండాలి. తగినన్ని నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. రిస్క్ జోన్లోఉన్నవారికి వీటితో పాటు రిస్క్ అసెస్మెంట్ చేసి, మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కంప్రెషన్ స్టాకింగ్స్ లాంటివి కూడా బాగా ఉపయోగపడతాయి. బ్లడ్ థిన్ కావడానికి ఏ్ఛp్చటజీn జీn్జ్ఛఛ్టిజీౌnటఅనేవి ఉంటాయి. డాక్టర్ పర్యవేక్షణలో ఇస్తారు. డైలీ తీసుకోవాలి. వీటిని ఎప్పుడు, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. వీటి వలన బ్లడ్ క్లాట్ రిస్క్ బాగా తగ్గుతుంది. ఇవి గర్భస్థ శిశువుకేమీ ప్రమాదం కలిగించవు. -
గుడ్‌న్యూస్ చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య వంటి చిత్రాలతో తెలుగువారికి సుపరిచితమైన హీరోయిన్ సనా ఖాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. తాను మరోసారి తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ముగ్గురం నలుగురం కాబోతున్నామని పేర్కొంది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా అభిమానులు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినీ కెరీర్కాగా హీరోయిన్ సనా ఖాన్.. 2005లో యేహై హై సొసైటీ అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కళ్యాణ్‌రామ్ కత్తి మూవీతో తెలుగులో అరంగేట్రం చేసింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. 2019లో తమిళ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. మధ్యలో హిందీ బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. సినిమాలు మానేసిన తర్వాత నవంబర్ 2020 నవంబరులో ముస్లిం మతగురువు, వ్యాపారవేత్త అనాస్ సయ్యద్‌ని పెళ్లి చేసుకుంది. వీరికి 2023లో పాపాయి జన్మించింది. View this post on Instagram A post shared by Saiyad Sana Khan (@sanakhaan21) చదవండి: క్యారెక్టర్ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి -
పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి పోస్ట్ వైరల్
ప్రముఖ తమిళ నటి విద్యా ప్రదీప్ శుభవార్త చెప్పింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నానని, త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కడుపుతో ఉన్న ఫొటోలని షేర్ చేసింది. ఇందులో భర్తతో కలిసి హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'అమరన్' హిట్.. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఖరీదైన గిఫ్ట్)కేరళకు చెందిన విద్యా ప్రదీప్.. 2010 నుంచి సినిమాల్లో ఉంది. స్వతహాగా డాక్టర్ అయిన ఈమె.. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు నటిగా కొనసాగుతోంది. సహాయ పాత్రలతో పాటు పలు తమిళ చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.13 ఏళ్ల క్రితం మైకేల్ అనే ఫొటోగ్రాఫర్‌ని పెళ్లి చేసుకుంది. చాన్నాళ్లుగా వీళ్లిద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. సినిమాలు ఏవైనా ఉంటే విద్యా ప్రదీప్.. ఇండియా వచ్చి వెళ్తుండేది. ఇప్పుడు తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేసింది.(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి) -
ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు
నటి రాధికా ఆప్టే వచ్చే నెలలో (2024 డిసెంబరు) తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన కొత్త సినిమా ‘సిస్టర్ మిడ్నైట్’ ప్రీమియర్ షో సందర్భంగా బేబీబంప్ ఫోటోలతో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కు శుభవార్త అందించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రెగ్నెన్నీ బాధల గురించి చెప్పుకొచ్చింది.గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో తను అనుభవించిన భావోద్వేగం, గందరగోళం, నిరాశ లాంటి ఫీలింగ్స్ గురించి ఏకరువు పెట్టింది. ప్రెగ్నెన్సీ అని తెలిసిన తరువాత రెండు వారాల పాటు తనకు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నానని చెప్పింది. అంతేకాదు ఈమూడు నెలలు 40-డిగ్రీల వేడిలో షూటింగ్ చేయాల్సి వచ్చింది. మరోవైపు భయంకరమైనకడుపు ఉబ్బరం, తీవ్రమైన మలబద్ధకం, వాంతులతో బాధ పడినట్టు పేర్కొంది. బిడ్డ కడుపులో ఉన్నపుడు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని అందరూ చెప్పారు. కానీ తనకు మాత్రం నరకం కనిపించిందని తెలిపింది. పిల్లల్ని కనాలన్న ప్లానే లేదు. పైగా గర్భధారణ అంటే ఏమిటో, గర్భవతిగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో తెలియదు. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియదు. అలాంటి సమయంలో నేను గర్భం దాల్చాను. గర్భధారణ అనే దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి, ఎవరూ నిజం చెప్పరు. కొంతమందికి ఇదంతా చాలా సులువుగానే అయిపోతుంది. కానీ కొంతమందికి అలాకాదు. గర్భం ధరించడం బిడ్డల్ని అంటే ఫన్కాదు. ఇది చాలా సబ్జెక్టివ్ కేసు. శరీరం అనేక మార్పులకు లోనవుతుంది అంటూ చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే.కాగా రాధిక ఆప్టే 2012లో బ్రిటిష్ మ్యుజిషియన్ బెనెడిక్ట్‌ను వివాహమాడింది. పెళ్లంటే అస్సలు ఇష్టం లేదని, విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వీసా సులభంగా వస్తుందన్న ఉద్దేశంతోనే బెనెడిక్ట్‌ను వివాహం చేసుకున్నానని, కానీ ప్రస్తుతం తాను భర్తతో హ్యాపీగానే ఉన్నానని, తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
ప్లీజ్... ఇంకో బిడ్డను కనవచ్చు కదా!
‘మీరు ఇప్పుడు ప్రెగ్నెంటా?’ అని ప్రభుత్వ అధికారులు చైనాలోని మహిళలకు ఫోన్ చేసి అడుగుతున్నారు. అడిగితే అడిగారు అని సర్దుకున్నా ‘ఇంకో బిడ్డను కనవచ్చు కదా’ అని సలహా కూడా ఇస్తున్నారు. ఒకప్పుడు కఠినమైన జనన నియంత్రణ చర్యలు చేపట్టిన చైనా ఇప్పుడు అదనపు జనాభా కోసం ఎందుకు ఆరాటపడుతుంది?ప్రధాన కారణాలలో ఒకటి చైనాలో సంతానోత్పత్తి రేటు తగ్గడం. 2035 నాటికి చైనా జనాభాలో మూడింట ఒక వంతు 60 ఏళ్ల పైబడిన వారు ఉంటారని ‘వ్యూ’ రీసెర్చి నివేదిక చెప్పింది. ‘ప్రపంచ కర్మాగారం’గా తనకు తాను గర్వించుకునే చైనాకు యువ జనాభా అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జనాభా పెంచడానికి కృషి చేస్తోంది. జనాభా నియంత్రణ కోసం ‘వన్–చైల్డ్ పాలసీ’ని కఠినంగా అమలుచేసిన దేశంలో ఈ సరికొత్త మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. (చదవండి: వారి పిల్లలు చెట్లు దైవం, కృష్ణజింక) -
Health Tips: వైట్ డిశ్చార్జ్ అవ్వడం సాధారణమేనా?
నాకిప్పుడు ఏడవ నెల. బేబీకి కిడ్నీలో వాపు ఉందన్నారు. దీని వలన బేబీ పుట్టిన తర్వాత ఏమైనా సమస్య వస్తుందా? ఇది అందరికీ ఉంటుందా? – నీరజ, కర్నూలుమీరు చెప్పిన సమస్యను ఫీటల్ హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. ఇది సర్వసాధారణ సమస్య. సాధారణంగా ఐదవ నెల స్కాన్‌లో బయటపడుతుంది. కొద్దిమందికి మాత్రమే ఏడవ నెల, ఎనిమిదో నెల స్కానింగ్‌లలో కనబడుతుంది. ప్రెగ్నెన్సీలో తల్లి శరీరంలోని తాత్కాలికంగా కండరాలు సాగడం వలన బేబీకి కిడ్నీ వాపు కనిపించవచ్చు. ఇది డెలివరీ తరువాత తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు కిడ్నీకి, యురేటర్కి మధ్య బ్లాకేజ్ రావచ్చు లేదా యూరేటర్కి , బ్లాడర్కి మధ్య వాల్వ్ పనిచేయకపోవచ్చు. కిడ్నీలో సిస్ట్ ఉన్నప్పుడు బేబీ కిడ్నీలో వాపు ఎక్కువగా ఉంటుంది. డెలివరీ తర్వాత స్కానింగ్‌లో బేబీ సైజును బట్టి పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలావరకు మందులతోనే తగ్గిపోతుంది. అరుదుగా కొంతమందికి చిన్న సర్జరీ చేయాల్సి వస్తుంది. గర్భిణీలకు 8వ నెల, 9వ నెలలో చేసే స్కాన్‌లో బేబీ కిడ్నీ వాపును బట్టి పీడియాట్రిక్ నెఫ్రాలాజిస్ట్ను సంప్రదించి తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. డెలివరీ తర్వాత పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ చేసి, అవసరమైతే సర్జరీకి ప్లాన్ చేస్తారు. బేబీ స్కాన్‌లో రీనల్ పెల్విస్ వాపు 7 మి.మీ. కంటే ఎక్కువగా ఉన్నట్లయితే సర్జరీ అవసరమవుతుంది. సాధారణంగా 4 వారాల తరువాత మళ్లీ స్కానింగ్ చేసి, కణితి ఏమైనా ఉందో లేదో చూస్తారు. కణితి ఉన్నట్లయితే, హిస్ట్టరోస్కోపీ చేసి, దాన్ని చిన్న ప్రక్రియ ద్వారా తీసివేసి, బయాప్సీకి పంపుతారు. డెలివరీ తర్వాత బేబీకి ఇంకా కిడ్నీ సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్, కొందరికి అవసరాన్ని బట్టి ఎక్స్‌రే తీస్తారు. డెలివరీ తర్వాత స్కాన్‌లో నార్మల్‌గా ఉంటే ఆ తర్వాత ఏ పరీక్షలూ అవసరం ఉండవు.నాకు 25 ఏళ్లు. ఈ మధ్యే పెళ్లయింది. మొదటి నుంచీ వైట్ డిశ్చార్జ్ ఉంది. పెళ్లయ్యాక మరీ ఎక్కువైంది. కొన్నిసార్లు బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉంటున్నాయి. డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందా? లేదంటే మెడికల్ షాప్‌లో మందులు అడిగి వేసుకోవచ్చా?– సంధ్యారాణి, కామారెడ్డియంగ్ ఏజ్‌లో వైట్ డిశ్చార్జ్‌ని నిర్లక్ష్యం చేయకూడదు. చాలామందికి వైట్ డిశ్చార్జ్‌తో పాటు దుర్వాసన, దురద, మంట కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ అని అర్థం. ఇది యాంటీబయాటిక్స్‌తో తగ్గవచ్చు. కానీ డాక్టర్ని సంప్రదించకుండా మెడికల్ షాప్‌లో మందులు కొని వేసుకోవద్దు. గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే వెజైనల్ స్పెక్యులమ్ ఎగ్జామ్ చేసి సమస్యను తెలుసుకుంటారు. గర్భసంచి ముఖద్వారానికి ఇన్ఫెక్షన్ రావడం మంచిది కాదు. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కూడా అది హాని చేస్తుంది. అందుకే డాక్టర్‌కి చూపించుకుంటే అసలు సమస్య ఏంటనేది తెలుస్తుంది. కొంతమందికి గర్భసంచి ముఖద్వారం పైన కొన్ని గ్రోత్స్ ఉంటాయి. అదనంగా టిష్యూ పెరగడం వల్ల వస్తాయివి. వీటిని పాలిప్స్ అంటారు. సాధారణంగా ఇవి రెడ్ లేదా గ్రే కలర్లో ఉంటాయి. వీటికి సంబంధించి చాలావరకు ఏ సింప్టమ్ ఉండకపోవచ్చు. చెక్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కానీ కొంతమందికి ఎప్పుడూ నీళ్లలా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. లైంగికచర్యలో పాల్గొన్నప్పుడు స్పాటింగ్, బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటివి కనిపిస్తే కచ్చితంగా తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సెలైన్ సోనోగ్రఫీ ద్వారా ఈ పాలిప్ గర్భసంచిలో ఉందా లేదా గర్భసంచి ముఖద్వారం మీద ఉందా అని చెక్ చేస్తారు. పాలిప్ సైజ్, నేచర్ కూడా తెలుస్తాయి. హిస్టరోస్కోపీ ప్రక్రియ ద్వారా ఈ పాలిప్ని డే కేర్‌లోనే రిమూవ్ చేస్తారు. దాన్ని బయాప్సీకి పంపితే, అది ఎలాంటి పాలిప్, మళ్లీ వచ్చే చాన్స్ ఉందా, ఫాలో అప్ ఎలా చెయ్యాలి అనేవి డీటెయిల్డ్‌గా తెలుస్తాయి. ఏడాదికోసారి రెగ్యులర్ పెల్విక్ పరీక్ష చేయించుకోవాలి. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
ఆగస్టులో పెళ్లి.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో 'ఎవడు' సినిమాలో హీరోయిన్గా చేసిన అమీ జాక్సన్ మరోసారి ప్రెగ్నెన్సీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బేబీ బంప్‌తో ఉన్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)బ్రిటీష్ మోడల్ కమ్ యాక్టర్ అయిన ఈమె.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది. మన దక్షిణాదిలో ఎవడు, రోబో 2, ఐ తదితర చిత్రాల్లో నటించింది. కాకపోతే అనుకున్నంతగా ఫేమ్ రాకపోవడంతో కొన్నేళ్ల క్రితం జార్జ్ పయనెట్టు అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. వీళ్లకు కొడుకు పుట్టాడు. ఆ పిల్లాడికి ఇప్పుడు ఐదేళ్లు. అయితే 2022లో అమీ-జార్జ్ బ్రేకప్ చెప్పేసుకున్నారు.జార్జ్ నుంచి విడిపోయిన తర్వాత అమీ.. హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ చేసింది. 2022 నుంచి వీళ్లు రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన రెండు నెలలైన పూర్తి కాలేదు. అప్పుడే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. బేబీ బంప్ పిక్స్ చూస్తుంటే త్వరలో మరోసారి తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: Amaran Review: ‘అమరన్’ మూవీ రివ్యూ) -
భారత సైన్యం చేస్తున్న మేలు..!
ప్రపంచం 21వ శతాబ్దంలో ఉంది. విశ్వమంతా అరచేతిలో ఇమిడిపోయినంత టెక్నాలజీతో స్మార్ట్‌గా జీవిస్తోంది ప్రపంచం. మదిలో మెదిలిన సందేహానికి సమాధానాన్ని నిమిషంలో తెలుసుకోగలిగినంత టెక్నాలజీ అందుబాటులో ఉంది. అయినప్పటికీ గర్భిణి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియని జీవితాలు ఇంకా ఉన్నాయి. భారతీయ సైన్యంలో మహిళల బృందం ఇటీవల వారిని సమావేశపరిచి ప్రెగ్నెన్సీ అవేర్నెస్ సెషన్ నిర్వహించింది. అత్యంత ఆసక్తిగా వినడంతోపాటు ఇంత వరకు తమకు ఈ సంగతులు చెప్పిన వాళ్లు లేరని, మొదటిసారి వింటున్నామని ఆనందం వ్యక్తం చేశారా మహిళలు. ఇంతకీ ఇంతటి వెనుకబాటులో మగ్గిపోతున్న వాళ్లెవరంటే ఆఫ్రికా ఖండంలోని అబేయీ వాసులు. ఆల్ ఉమెన్ ప్లాటూన్ చొరవ సూడాన్, సౌత్ సూడాన్ల మధ్య తలెత్తిన వివాదంలో అబేయీ నలిగిపోతోంది. అబేయీలో శాంతి స్థాపన కోసం యునైటెడ్ నేషన్స్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మనదేశం నుంచి గత ఏడాది ఆల్ ఉమెన్ ప్లాటూన్ అబేయీలో అడుగుపెట్టింది. ఆ బృందం పేరు ‘యునైటెడ్ నేషన్స్ ఇంటిరిమ్ సెక్యూరిటీ ఫోర్స్ ఫర్ అబేయీ (యూనిస్ఫా)’. మన మహిళా సైనికులు అబేయీలో శాంతి స్థాపనతోపాటు ప్రజారోగ్యం కోసం కూడా పని చేస్తోంది. అందులో భాగంగా కెప్టెన్ జస్ప్రీత్ కౌర్, ఇండియన్ బెటాలియన్ మెడికల్ ఆఫీసర్ మేజర్ అభిజిత్ ఎస్‌లు అబేయీలోని రుమాజక్ గ్రామంలో స్థానిక మహిళలను సమావేశపరిచి వారికి గర్భధారణ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గర్భిణి తీసుకోవాల్సిన పోషకాహారం, ఈ సమయంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన హెల్త్ చెకప్‌లు, ప్రసవం తర్వాత బిడ్డ సంరక్షణలో తీసుకోవాల్సిన శ్రద్ధ మొదలైన విషయాలను వివరించారు. సేఫ్ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ గురించి బొమ్మలతో వివరిస్తూ ప్రచురించిన చిన్న పుస్తకాలను కూడా పంచారు. భారతీయ సైనిక మహిళల బృందం చొరవను, స్థానిక మహిళల ఆనందాన్ని యూఎన్ మిషన్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. (చదవండి: తండ్రి హత్యను ఛేదించేందుకు పోలీసుగా మారిన కూతురు..! చివరికి 25 ఏళ్ల తర్వాత..) -
ఫ్యాషన్ స్టైలిష్ట్ మెటర్నిటీ ఫోటో షూట్స్.. అర్థవంతంగా, అద్బుతంగా!
న్యూఢిల్లీకి చెందిన లండన్ ఫ్యాషన్ స్టైలిస్ట్ ప్రేరణ చాబ్రామరికొద్ది రోజుల్లో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఫ్యాషన్ డిజైనర్‌గా, యూట్యూబర్‌గా అభిమానులకు దగ్గరైన ఆమె ఈ సందర్భాన్ని సంతోషాన్ని ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. అంతేకాదు తన భర్తను కూడా తన ఫాలోవర్లకు పరిచయం చేసింది. అలాగే తను ఎందుకు మెటర్నిటీ ఫోటో షూట్ చేసుకున్నదీ వివరించింది.అసలు మెటర్నీటి ఫోటో షూట్ అవసరమా అని ఆలోచించి చివరికి రెండు రకాలు ఫోటోషూట్ చేసుకున్నాను అంటూ ఇన్‌స్టాలో అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. ఫ్యాషన్ డిజైనర్‌ను కాబట్టి క్రియేటివ్‌గా ఉంటాను, కనుక మెటర్నిటీ ఫోటోషూట్కూడా విభిన్నంగా ఉండాలని ఆలోచించానని ఆమె తెలిపారు. (పొట్టిగా ఉండే అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకోవద్దా? ఇవిగో ట్రిక్స్ అండ్ టిప్స్)‘‘మొదటి ఫోటో షూట్ కోసం పర్పుల్ అండ్ పింక్ కలర్ డ్రెస్ ఎంచుకున్నా..దీన్నే ది పెర్ల్స్ ఆఫ్ జాయ్ అంటాం. త్వరలోనే తల్లికాబోతుండటం ఆనందాన్ని తీసుకొచ్చింది. ఇపుడు అమ్మగామారబోతున్నాను.. దాదాపు కలలో జీవిస్తున్నాను. స్వేచ్ఛకు ప్రతీక అయిన పసుపు రంగులో రెండో ఫోటోషూట్ చేశాను. దీన్ని గోల్డెన్ బ్లూమ్ అంటాం. ఈ సందర్భంగా అమ్మ నాతో ఉండటం ఇంకా సంతోషం’’ అంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో ప్రేరణ వెల్లడించింది. -
తండ్రి కాబోతున్న టీమిండియా క్రికెటర్.. ఘనంగా భార్య సీమంతం (ఫొటోలు)
-
Mahathalli Jahnavi Dasetty: తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన 'మహాతల్లి' (ఫొటోలు)
-
ప్రెగ్నెంట్ సమయంలో.. ఎలాంటి ఆహార జాగ్రత్తలు పాటించాలి?
నాకు 3వ నెల. ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ ఆహారం తినకూడదు. తింటే ఎలాంటి ప్రమాదం ఉంటుంది. – హారిక, పెదపూడిగర్భధారణ సమయంలో రోజువారీ ఆహారాన్నే తినవచ్చు. ఇంటిలో తయారు చేసినది అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలామంది అపోహలతో ఆరోగ్యకరమైన ఆహారం కూడా తినరు. సాధారణంగా మీరు తినే ఆహారమే ఇప్పుడు కూడా తినండి. మీరు ఎప్పుడూ తినని కొత్త ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులను ఈ సమయంలో తినకండి. అవి మీ శరీరానికి సరిపడకపోతే వచ్చే ఇబ్బందులకు ఏమైనా మందులు వాడాల్సి వస్తే మంచిదికాదు. అందుకే కొత్తవి తినకండి.చాలామందికి గుడ్లు, మష్రూమ్స్, పల్లీలు, సోయా వల్ల ఎలర్జీలు వస్తాయి. పాశ్చరైజ్ చేయని చీజ్, పాలు, క్రీమ్ అసలు వాడకూడదు. వీటివల్ల ‘లిస్టెరియోసిస్’ ఇన్ఫెక్షన్ తల్లికి, బిడ్డకి వస్తుంది. మాంసాహారం తినేవారు చికెన్, మటన్లాంటివి బాగా ఉడికించి తినాలి. ఉడికించని మాంసంలో టాక్సోప్లాస్మా అనే పరాన్నజీవి ఉంటుంది. ఇది గర్భస్రావం, ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. లివర్‌తో తయారు చేసే ఆహార పదార్థాలలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది ఎక్కువ శాతం బిడ్డకి ప్రమాదం చేస్తుంది.గుడ్లు కూడా బాగా ఉడికించినవే తినాలి. తెల్లసొన అయితే ఇంకా మంచిది. బాగా ఉడికించని గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆహారాన్ని విషపూరితం చేస్తుంది. దీంతో బిడ్డకు ప్రమాదం లేదు కానీ తల్లికి వాంతులు, నీళ్ల విరేచనాలు కావచ్చు. చేపలు తినేవారు కూడా బాగా ఉడికించిన సముద్రపు చేపలను తినొచ్చు. ఒకవేళ తింటే కొన్ని కాలుష్య కారకాలు బిడ్డకు హాని చేస్తాయి. ట్యూనా చేపలో పాదరసం శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా తినకూడదు. ఆయిల్ ఎక్కువగా ఉండే చేపలు కూడా తినకూడదు. చాలామందిలో కాఫీ తాగడం మంచిదేనా అనే ప్రశ్న కూడా ఉంటుంది. నిజానికి మానేయడం మంచిది. కానీ అలవాటు ఉంది, తప్పకుండా తీసుకోవాలి అంటే రోజుకి 200 ఎంజీ కన్నా ఎక్కువ కాఫీ పొడిని తీసుకోకూడదు. అంటే ఒక కప్పు కాఫీ అని అర్థం. ఈ కెఫీన్ వేరే డ్రింక్స్‌లో కూడా ఉంటుంది. ఉదాహరణకి గ్రీన్ టీ లేదా మామూలు టీలో ప్రతి గ్రాముకు 75ఎంజీ కెఫీన్ ఉంటుంది. డార్క్ చాక్లెట్స్‌లో ప్రతి గ్రాముకు 10–25 ఎంజీ ఉంటుంది. కోలా డ్రింక్స్‌లో 40–80 ఎంజీ ఉంటుంది. ఫిల్టర్ కాఫీలో 140 ఎంజీ ఉంటుంది. అందుకే తాగకపోవడమే మంచిది. కనీసం మొదటి మూడునెలల్లో మానేయండి. పండ్లు, కూరగాయలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. గర్భధారణ సమయంలో డాక్టర్ సూచించిన మేరకే విటమిన్ మాత్రలు వేసుకోవాలి. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ఇవి చదవండి: ఒక అడవిలో తాబేళ్లు... చేపలు... కోతులు -
ఓపికతో పెంచండి ఒడిలో పిడుగులు
‘పిల్లలు పైకి కనిపించేటంత సున్నితమైన వాళ్లు కాదు. వాళ్లను డీల్ చేయడం కత్తిమీద సామే. పిల్లలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నామా లేక పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పడంలో విఫలమవుతున్నామా?’ పిల్లలపెంపకంలో కొత్తతరం ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్య ఇది. తల్లిదండ్రులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించడంలో నైపుణ్యాన్ని అలవరుచుకోవాలని చెప్పారు హైదరాబాద్‌కు చెందిన ఫ్యామిలీ కౌన్సెలర్ చెరువు వాణీమూర్తి. ఆమె గమనించిన అనేక విషయాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు.ప్లానింగ్ ఉంటోంది... కానీ! ఈ తరం పేరెంట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పటి నుంచే పిల్లల పెంపకం గురించి కచ్చితంగా ఉంటున్నారు. మంచి భవిష్యత్తు అందివ్వాలని, చక్కగా పెంచి ప్రయోజకులను చేయాలని కలలు కంటారు. ఎదురు చూసిన బిడ్డ చేతుల్లోకి వస్తుంది. వేడుకలతో బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించిన పేరెంట్స్ కూడా పెంచడంతో తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేక స్ట్రెస్‌కు లోనవుతున్నారు. ఆనందం వర్సెస్ సవాల్! పిల్లల పెంపకం తల్లిదండ్రులకు గొప్ప ఆనందం. అదే సమయంలో పెద్ద సవాల్ కూడా. అవగాహన లేకపోవడం వల్ల పేరెంటింగ్‌ను మోయలేని బాధ్యతగా భావిస్తున్నారు. పిల్లల విషయంలో తాము శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని గమనించుకోలేకపోతున్నారు. పిల్లలకు చిన్నప్పుడే ఎన్నో సంగతులు చెప్పేయాలని వారి వయసుకు మించిన జ్ఞానాన్ని బుర్రలో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు గ్రాహక శక్తి పిల్లలకు ఉందా లేదా అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు.క్వాలిటీ టైమ్ ఇవ్వాలి! టీవీ, ఫోన్, సోషల్ మీడియాతో కాలక్షేపం చేయకుండా పిల్లలతో మాట్లాడుతూ, వారితో ఆడుకోవాలి. ప్రతి చిన్న సమస్యకీ పరిష్కారాల కోసం యూ ట్యూబ్‌లో వెతికి, అవి తమకు వర్తించకపోతే సరిగ్గా పెంచలేకపోతున్నామని ఒత్తిడికి లోనవుతుంటారు. పిల్లల పెంపకంలో కొన్ని బాధ్యతలను గ్రాండ్ పేరెంట్స్‌కి కూడా పంచాలి. కొంతమంది... పిల్లలు తమకు మాత్రమే సొంతమని, తమ పిల్లల బాధ్యత పూర్తిగా తమదేనని, ఎవరి సాయమూ తీసుకోకుండా తామే చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు. ఆ ధోరణి మార్చుకోవాలి. మరికొంతమందిలో తమకు అన్నీ తెలుసని, ఎవరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదనే పెడధోరణి కూడా కనిపిస్తోంది. అది కూడా మంచిది కాదు. అన్నీ తెలిసిన వాళ్లు ఎవరూ ఉండరు. తెలుసుకుంటూ ముందుకు సాగాలి.పంచుకుంటూ పెంచాలి! చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. ఇవన్నీ సాధారణమేనని, పెంపకంలో ఇలాంటి ఒత్తిడులు ఉంటాయని ముందుగానే అవగాహన ఉండాలి. తల్లిదండ్రులిద్దరూ పిల్లల బాధ్యతను పంచుకుంటే ఇద్దరూ పెంపకాన్ని ఆస్వాదించవచ్చు. పిల్లలకు ప్రతి దశలోనూ తలిదండ్రుల సపోర్ట్, గైడెన్స్ అవసరమే. ఏ దశలో ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో పేరెంట్స్ తెలుసుకుని, తాము నేర్చుకుంటూ ముందుకు సాగుతుంటే స్ట్రెస్‌కు లోనుకాకుండా పేరెంటింగ్‌ని ఆస్వాదించగలుగుతారు. లెర్నింగ్ మైండ్ ఉంటే ఇది సాధ్యమే.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధికలిసి ప్రయాణించాలి! పేరెంటింగ్ అంటే పిల్లల పసితనం, బాల్యం, కౌమారం... ప్రతి దశల్లోనూ వారితో కలిసి సాగాల్సిన ప్రయాణం. తలితండ్రులు, పిల్లలు కలిసి చేయాల్సిన ప్రయాణం ఇది. ఈ ప్రయాణాన్ని సులభతరం చేసుకోవాలంటే తల్లిదండ్రులు– పిల్లల మధ్య రిలేషన్ గట్టిగా ఉండాలి. పిల్లలను బేషరతుగా ప్రేమను పంచుతున్నామా, వారి పట్ల కరుణతో ఉంటున్నామా, తమ పరిధులను, అభిరుచులను వారి మీద రుద్దుతున్నామా, ఇతర పిల్లలతో పోలుస్తూ తక్కువ చేయడం లేదా ఎక్కువ చేయడం వంటి పొరపాటు చేస్తున్నామా... అనే ప్రశ్నలు వేసుకోవాలి. పిల్లలు ఏ చిన్న తప్పు చేసినా, వారికి ఏ చిన్న సమస్య ఎదురైనా తాము పెంపకంలో విఫలమవుతున్నామేమోనని అపరాధభావానికి లోనుకావాల్సిన అవసరమే లేదు. -
సీరియల్ హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు వైరల్
సీరియల్ నటి దేవలీనా ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ విషయాన్ని కొన్నిరోజులు ముందు బయటపెట్టింది. ఇప్పుడు మరోసారి బేబీ బంప్ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో భర్తతో కలిసి క్యూట్ అండ్ స్వీట్ పోజుల్లో కనిపించింది. 2002 డిసెంబరులో ఈమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా)'కోడలా కోడలా కొడుకు పెళ్లామా' అనే డబ్బింగ్ సీరియల్‌తో తెలుగు వాళ్లకు పరిచయమైన నటి దేవలీనా భట్టాచార్జి. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈమె.. తన జిమ్ ట్రైనర్ షాన్వాజ్ షేక్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మతాలు వేరు అయినప్పటికీ చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి సందర్భం వచ్చిన ప్రతిసారీ భర్తతో ఉన్న ఫొటోలని దేవలీనా పోస్ట్ చేస్తూనే ఉంటుంది.తాజాగా ఆగస్టు 15న తన ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. ఆ తర్వాత కొన్నిరోజులకు పుట్టినరోజు జరుపుకొంది. ఇలా ప్రతిసారి తన పిక్స్ పోస్ట్ చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు బేబీ బంప్ క్లియర్‌గా కనిపిస్తున్న ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో ఈమెకు పలువురు నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో టాలీవుడ్ హీరోయిన్ భర్తకి తీవ్ర గాయాలు) View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) -
ప్రెగ్నెన్సీలో యోగా, నటి సొన్నల్లి సెగల్ వీడియో వైరల్
గర్భం దాల్చినపుడు వ్యాయామాలు చేస్తూ,యోగాసనాలు వేస్తూ (నిపుణుల సలహాతో) సహజ ప్రసవం కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. సెలబ్రిటీల దగ్గరనుంచి సామాన్యుల దాకా దీనిపై అవగాహన పెంచుకుంటున్నారు. తాజాగా నటి సొన్నల్లి సెగల్ ఏకంగా శీర్షాసనాలు వేస్తూ మరో అడుగు ముందుకేసింది.సొన్నల్లి సెగల్ మరికొన్ని రోజుల్లో మాతృత్వాన్ని రుచి చూడబోతోంది. ఇంతలో గర్భధారణ మధురిమలను ఆస్వాదిస్తోంది. సోషల్‌మీడియాలో ఫోటోలతో ఫ్యాన్స్ ఆకట్టుకోవడంలో సొన్నల్లి ముందుంటుంది. తాజాగా తన ప్రెగ్నెన్సీలో ప్రతిదశను షేర్ చేస్తూ, ఫిట్నెస్పైన తన ఆసక్తిని తెలియజేస్తోంది. ఇటీవల, సొన్నల్లి తన భర్త అశేష్ ఎల్ సజ్నానీతో కలిసి స్విట్జర్లాండ్‌లోని ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలలో రిలాక్సింగ్ బేబీమూన్ను ఆస్వాదించింది.తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో, అంత్యంత క్లిష్టమైన శిర్షాసనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. అత్యంత జాగ్రత్తగా ,నిపుణుల పర్యవేక్షణలో దీన్ని సాధన చేసింది. సంవత్సరాల నుండి యోగాభ్యాసంలో తలకిందులుగా వేసే ఆసనాలు ఇవి ఒక భాగం. అయితే గర్భం దాల్చినప్పుడు దీన్ని కొనసాగించగలనా? లేదా? అని భయపడ్డాను. కానీ యోగా గురువు, వైద్యుల సలహా మేరకు దీన్ని కొనసాగించగలను అని నిర్ధారించుకున్నాను. View this post on Instagram A post shared by Sonnalli A Sajnani (@sonnalliseygall) గర్భధారణకు ముందు ఎలాంటి ఆసనాలు వేసానో అవి చేయొచ్చని తనకు అర్థమైంది అంటూ ఆసనాలపై తనకున్న ప్రేమను వ్లెలడించింది. గర్భధారణ సమయంలో దీని వల్ల అపారమైన ప్రయోజనాలుంటాయని కూడా పేర్కొంది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ గర్బంతో ఉన్నపుడు వీటిని మొదలు పెట్టకూడదని స్పష్టం చేసింది. ఇలాంటి యోగాలసనాలతో ప్రసవ సమయంలో బేబీకి పెల్విస్ మరింత విశాల మవుతుందట. నాడీ వ్యవస్థ శాంతపర్చి, పాదాల వాపును తగ్గించడం, తిరిగి వచ్చే రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం లాంటి అనే ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది. కాగా సొన్నాల్లి సెగల్ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. యోగాతో పాటు, జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేయడం ఆమెకు అలవాటు. ఈక్రమంలో గతంలో గర్భంలో ఉన్నపుడే యోని ముద్ర అనే యోగా ఆసనం చేస్తున్న వీడియోను షేర్ చేసింది. -
ప్రెగ్నెన్సీ సమయంలో.. ఈ లక్షణాలు కనిపెట్టడమెలా?
నాకు ఏడవ నెల. నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే లక్షణాలను ఎలా కనిపెట్టాలి? ఎలాంటి పరీక్షలు చేస్తే తెలుస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – దివ్య శ్రీ, వికారాబాద్నెలలు నిండక ముందే ప్రసవించడం అనేది చాలామందికి అప్పటికప్పుడే మొదలవుతుంది. కానీ పదిమందిలో ఏడుగురికి ఏ ఇబ్బంది లేకుండా పురిటినొప్పులు తగ్గిపోతాయి. పూర్తిగా నెలలు నిండాకే డెలివరీ అవుతుంది. అయితే కొంతమందికి తరచూ నొప్పులు వచ్చి రక్తస్రావం, ఉమ్మనీరు పోవడం మొదలవుతుంది. ఇలా అయినప్పుడు సర్విక్స్ కూడా తెరుచుకుంటుంది. కాబట్టి నొప్పులు అదుపు చేయడం కష్టమవుతుంది. అలాంటి లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.డెలివరీ సురక్షితంగా అయ్యి బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండటానికి ముందస్తుగా అవసరమైన ఇంజెక్షన్లు, మందులు ఇచ్చే సమయం దొరుకుతుంది. 37వారాల లోపు ఇలా జరిగితే, దాన్ని ప్రీమెచ్యూర్ బర్త్ అంటారు. కొన్నిసార్లు 24–48 గంటలు నొప్పులు తగ్గే మందులు ఇవ్వొచ్చు. బిడ్డ ఊపిరితిత్తుల పరిపక్వత కోసం స్టెరాయిడ్స్ ఇస్తారు. ఇన్ఫెక్షన్లు రాకుండా హై యాంటీబయాటిక్స్ ఇస్తారు. యూరిన్, వెజైనల్ స్వాబ్స్ టెస్ట్‌కి పంపి, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఇలా తొందరగా నొప్పులు వచ్చాయా అని పరీక్షిస్తారు.పల్స్, బీపీ, బిడ్డ గుండె కొట్టుకోవడం ఎలా ఉన్నాయో చూస్తారు. స్కాన్‌లో బిడ్డ కదలికలు, రక్తప్రసరణను చూస్తారు. చాలామందికి నొప్పులు లేకుండా వాటర్ బ్రేక్ అయ్యి, వెజైనా నుంచి లీక్ అవుతుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే ఉమ్మనీరు పోతోంది, డెలివరీ ఎప్పుడైనా కావచ్చు అని అర్థం. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఒకవేళ నొప్పులు మొదలైనట్లయితే నెలలు పూర్తవకుండా పుట్టే బిడ్డను జాగ్రత్తగా చూసుకునే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలోనే డెలివరీ చేసుకోవాలి.నియోనాటాలజిస్ట్ కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో 24 వారాల నుంచి బిడ్డను జాగ్రత్తగా చూసే ఆధునిక పరికరాలు పెద్ద సెంటర్లలో ఉంటున్నాయి. తగిన శిక్షణ పొందిన డాక్టర్లు, నర్సులు ఉండాలి. ప్రీమెచ్యూర్ పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆ సమస్యలను తగ్గించడానికి తల్లికి ముందుగానే మందులు ఇవ్వడం జరుగుతుంది. కొందరి విషయంలో ఉమ్మనీరు పోవడం మొదలైనా, ప్రసవం మొదలుకాకపోవచ్చు. అలాంటి వారిని ఆసుపత్రిలో ఉంచి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.ఉమ్మనీరు, రక్తప్రసరణ ఎలా ఉందో పరీక్షిస్తూ, తల్లికి బిడ్డకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేకపోతే 37 వారాల వరకు పర్యవేక్షించేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే బిడ్డకు తల్లి కడుపులో అందే పోషకాలను, వాతావరణాన్ని బయట పూర్తిగా ఇవ్వలేము. అందుకే ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు గర్భంలో ఉంచేందుకే ప్రయత్నించాలి. తప్పనిసరి అనుకున్నప్పుడే డెలివరీ చేయాలి.ఇవి చదవండి: నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? -
‘అమ్మ’ అనే అబద్ధాన్ని నవ మాసాలు మోసింది
జనగామ: ఆమెకు పెళ్లయి మూడేళ్లు అయ్యింది. ఎంతకూ పిల్లలు పుట్టడం లేదు. అంతా ఏమనుకుంటారోనని తనలో తానే కుమిలిపోయింది. మానసికంగా కుంగిపోయింది. ఎలాగైనా ఈ అపవాదు నుంచి తప్పించుకోవాలనుకుంది. ఓ రోజు తాను గర్భం దాల్చినట్లు ఇంట్లో వారికి చెప్పింది. నమ్మకం కుదిరేలా కొద్దిరోజుల తర్వాత కడుపు చుట్టూ బట్టలు కట్టుకోవడం ప్రారంభించింది. నెలకోసారి ఆస్పత్రిలో చూపించుకుంటున్నట్టు కుటుంబసభ్యుల్ని నమ్మించింది. తొమ్మిది నెలలు అలాగే నెట్టుకొచ్చింది. చివరికి ప్రసవం కోసం అంటూ ఆస్పత్రికి వచ్చి శిశువు టాయ్లెట్లో జారి పోయిందని విలపిస్తూ చెప్పింది. అలా బయట పడదామని అనుకుంది. కానీ అంతా పరిశీలించిన వైద్యులు, సిబ్బంది చివరకు అదంతా ఉత్తదేనని తేల్చారు. ఈ విచిత్ర ఘటన బుధవారం జనగామ ఎంసీహెచ్‌లో జరిగింది. నెలనెలా ఆస్పత్రికెళుతున్నానంటూ.. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని ఓ తండాకు చెందిన మహిళ.. గత ఏడాది డిసెంబర్లో జనగామ చంపక్ హిల్స్ మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి (ఎంసీహెచ్) ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం అంటూ వచ్చింది. వైద్యులు పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. తర్వాత గత జూలైలో మరోసారి ఆస్పత్రికి వచి్చంది. గర్భవతినని చెప్పడంతో గైనిక్ వైద్యులు హార్ట్ బీట్, స్కానింగ్ తదితర పరీక్షలు చేసుకుని రావాలని సూచించగా వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. కానీ ఇంట్లో వారికి నెలనెలా పరీక్షల కోసం ఎంసీహెచ్‌కు వెళుతున్నట్టు చెప్పేది. బుధవారం డెలివరీ డేట్ అని చెప్పి కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రికి వచ్చింది. గైనిక్ డాక్టర్ ఆమెను పరీక్షించే సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. ఇరవై నిమిషాల తర్వాత బోరున విలపిస్తూ బయటకు వచ్చింది. మూత్ర విసర్జన చేస్తుండగా శిశువు టాయ్లెట్లోకి జారి పోయిందని చెప్పింది. వెంటనే వైద్యులు, సిబ్బంది అప్రమత్తమై టాయ్‌లెట్‌ను పరిశీలించారు. ఎలాంటి రక్తపు మరకలు కన్పించలేదు. దీంతో టాయ్‌లెట్‌కు అనుబంధంగా ఉన్న డ్రైనేజీ పైపులైన్లను పరిశీలించారు.శిశువు జాడ లేకపోవడంతో అనుమానం వచ్చిన డాక్టర్లు మహిళను ప్రశ్నించారు. స్కానింగ్ రిపోర్టు ఏదంటూ గట్టిగా నిలదీశారు. దీంతో తనకు గర్భం రాలేదని, ఎంతకూ పిల్లలు పుట్టకపోవడంతో ఇలా చేశానంటూ ఆ మహిళ చెప్పింది. అయితే అప్పటికే ఆ మహిళ కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి రావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. అన్ని పరీక్షలూ చేసి ఆమె గర్భం ధరించలేదని, అంతా ఉత్తదేనని నిర్ధారించారు. సదరు మహిళతో పాటు భర్తను సఖి కేంద్రానికి తరలించగా సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చారు. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు. పిల్లలు పుట్టడం లేదనే బాధతో, అమాయకత్వంతో ఆ మహిళ అలా చేసిందని వైద్యులు వ్యాఖ్యానించారు. -
Maternity Photoshoot: నిండు నెలల జ్ఞాపకం
ప్రీ వెడ్డింగ్ షూట్ వెడ్డింగ్ షూట్ తెలిసిందే. కాని ఇప్పుడు మెటర్నిటీ షూట్ ట్రెండ్‌లో ఉంది. స్త్రీలు తమ నిండు గర్భం సమయంలో భర్తతో కలిసి ఫొటో షూట్లో పాల్గొనడం ఒక ముఖ్య ఉత్సవంగా మారింది. తాజాగా దీపికా పడుకోన్ విడుదల చేసిన మెటర్నిటీ షూట్ ఫొటోలు ఈ ట్రెండ్ గురించి ప్రొత్సాహంగా మాట్లాడుతున్నాయి.తొలి చూలుతో పుట్టింటికి వచ్చిన కూతురు రేపో మాపో కాన్పు అవుతుందనగా ‘నొప్పులొస్తే నన్ను లేపమ్మా’ అందట నిద్రపోతూ. అప్పుడు తల్లి నవ్వుతూ ‘పిచ్చిపిల్లా... నొప్పులొస్తుంటే నేను నిన్ను లేపడం కాదే. నువ్వే గోల చేసి ఊరంతా లేపుతావు’ అందట. మాతృత్వపు మధురిమ స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైనది. గర్భం దాల్చడంతో మొదలు నెలలు నిండుతూ వెళ్లడం, శరీరంలో మార్పు ఉదర భాగం బిడ్డకు గూడుగా మారుతూ ఎదుగుతూ ఉండటం, ఆ మార్పులన్నీ చూసుకోవడం, చివరకు కాన్పు జరిగి అంతవరకూ గర్భంలో ఉన్న బిడ్డ ఒడికి చేరడం... స్త్రీకి ఇదంతా అద్భుత ఘట్టం. మానసిక శాస్త్ర అధ్యయనం ప్రకారం చాలామంది స్త్రీలకు గర్భం దాల్చినప్పుడు ఆ నిండుదనాన్ని నలుగురికీ చెప్పుకోవాలని ఉంటుందట. నిండు గర్భంతో అప్పుడప్పుడు నలుగురిలోకి రావడాన్ని ఇష్టపడతారట. కాలక్రమంలో ఈ ఇష్టం ఆ క్షణాలను ఫొటోలుగా దాచుకునే వరకూ వచ్చింది.1991లో మొదలైన ట్రెండ్హాలీవుడ్ ప్రసిద్ధ నటి డెమి మూర్ 1991లో తన ఏడు నెలల గర్భాన్ని ప్రదర్శిస్తూ ఒక మేగజీన్ కవర్ పేజీ మీద కనపడినప్పుడు అది ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం అయ్యింది. ప్రఖ్యాత మహిళా ఫొటోగ్రాఫర్ ఆనీ లీబోవిజ్ ఈ ఫొటో తీసింది. చాలామంది దీనిని స్త్రీ శరీర ధర్మానికి సంబంధించిన ఒక గౌరవ ప్రకటనగా భావిస్తే మరికొందరు ఇందులో అశ్లీలత ఉందని విమర్శలు చేశారు. అయితే కాలక్రమంలో సెలబ్రిటీలు చాలా మంది మెటర్నిటీ ఫొటోస్ను జనం ముందుకు తీసుకురాసాగారు.2012 నుంచి ఇండియాలోమన దేశంలో బాలీవుడ్ నుంచి సెలబ్రిటీలు మెటర్నిటీ షూట్‌ను 2010 నుంచి పరిచయం చేయసాగారు. కొంకణా సేన్, సోహా అలీ ఖాన్, నేహా ధూపియా, బిపాషా బసు, అనుష్కా శర్మ, కరీనా కపూర్, సోనమ్ కపూర్, ఇటీవల ఆలియా భట్... వీళ్ల ఫొటోషూట్లు సామాన్యజనానికి కుతూహలం రేకెత్తించాయి. మనం కూడా ఎందుకు ఇలాంటి జ్ఞాపకాలు నిక్షిప్తం చేసుకోకూడదు అనిపించేలా చేశాయి. ఇప్పుడు దీపికా పడుకోన్ తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి బ్లాక్ అండ్ వైట్‌లో చేసిన మెటర్నిటీ షూట్ అందరి చేత ప్రశంసలు పొందుతోంది. రెండు ఫ్యాషన్ బ్రాండ్ల నుంచి ప్రత్యేకంగా ఎంచుకున్న దుస్తులతో దీపిక ఈ షూట్ చేసింది. రణ్వీర్ సింగ్ ఈ షూట్లో సంబరంగా పాల్గొన్నాడు.మధ్యతరగతికి దూరం కాదుమెటర్నిటీ షూట్లకు సెలబ్రిటీలు లక్షలు ఖర్చు పెడుతుంటే మధ్యతరగతి స్త్రీలకు అదేమీ అందని కల కాదు. ్ర΄÷ఫెషనల్ ఫొటోగ్రాఫర్లతో మొదలు హాబీగా ఫొటోలు తీసేవారి వరకూ ఇలాంటి ఫొటోలు తీసి పెట్టేవారు ఉన్నారు. నాలుగు గంటల వ్యవధిలో మూడు రకాల డ్రస్సులతో ఫొటోలు తీసి పెట్టే ΄్యాకేజీలు కూడా ఉన్నాయి. ‘ఒకప్పుడు గర్భిణులు కెమెరా ముందుకు రావడానికి సిగ్గు పడేవారు. కాని తమ మాతృత్వ దశలను పదిలం చేసుకునేందుకు ఇప్పుడు సంతోషంగా ముందుకొస్తున్నారు’ అని ఇలాంటి ఫొటోలు తీసే ఒక ఫొటోగ్రాఫర్ అన్నారు.థీమ్ ఫొటోలుప్రెగ్నెన్సీ షూట్లో కూడా థీమ్స్ ఉన్నాయి. పల్లెటూరి జంటలుగా, నగర శ్రీమంతులుగా, గుడి ్రపాంగణంలో, తెలుగుదనంతో ఇలా చాలా రకాలున్నాయి. ఎనిమిదవ నెలలో ఈ ఫొటోషూట్ చేయించుకుంటే ఫొటోలు బాగావస్తాయంటున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం. మీ మనసులో ఈ ముచ్చట ఉంటే వెంటనే అందుకు సిద్ధం కండి. -
బేబీ బంప్ 'ఫోటోలు' షేర్ చేసిన దీపికా పదుకోనె (ఫొటోలు)
-
Health: ఎటువంటి మందులు వాడకుండానే ఇలా జరిగింది.. అసలు కారణాలేంటి?
నా వయసు 41. ఎటువంటి మందులు వాడకుండానే గర్భం వచ్చింది. అనారోగ్య సమస్యలేమీ లేవు. కానీ అందరూ బాగా భయపెడుతున్నారు. ఇంటి దగ్గర్లోని చిన్నాచితకా ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకోవద్దు అంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుకన్య, కరీంనగర్ఈ రోజుల్లో 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో గర్భం దాల్చేవారు పదిమందిలో ఒకరుంటున్నారు. వయసు పెరిగేకొద్దీ ఇబ్బందులు కూడా పెరుగుతాయి. వందలో పదిమందికి హై బీపీ రావచ్చు. బీపీ అదుపు కాకపోతే‘ప్రీఎక్లాంప్సియా’ అనే సమస్య ప్రతి వందమందిలో ఇద్దరికి ఎదురవుతుంది. ఇది తల్లికి, బిడ్డకి ప్రమాదం.ఇలా బీపీ రాకుండా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వాకింగ్ చెయ్యడం, ఆస్పిరిన్ అనే బ్లడ్ థిన్నర్ టాబ్లెట్ మూడవ నెల నుంచి తీసుకోవడం లాంటివి సహాయపడతాయి. అధిక బరువు ఉన్న వారిలో డయాబెటిస్ రిస్క్ కూడా నలభై ఏళ్ల తర్వాత ఎక్కువ ఉండొచ్చు. ఈ సమస్యను తొందరగా గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే తల్లికి, బిడ్డకి ప్రమాదం. డయాబెటిస్ గుర్తించకుండా, దానికి చికిత్స తీసుకోకపోతే బిడ్డ ఎదుగుదలలో ఉండే లోపాలు 5వ నెల స్కాన్ తీసినప్పుడు బయటపడతాయి. నలభైల్లో వచ్చే గర్భంలో బీపీ, సుగర్, బరువు చూసి తగిన జాగ్రత్తలు అనుసరించాలి.రక్తసంబంధీకుల్లో సుగర్, బీపీ ఉన్న చరిత్ర గలవారు నలభైల్లో గర్భం దాల్చాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ముందుగానే అన్ని చెకప్‌లు చేయించుకుని ప్లాన్ చేసుకోవాలి. రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం అనేది ప్రెగ్నెన్సీలో ప్రమాదానికి దారి తీస్తుంది. గడ్డకట్టిన రక్తం బ్రేక్ అయితే అది రక్తప్రసరణలో కలసి ఊపిరితిత్తులు, గుండెలో అడ్డంకి ఏర్పడి ప్రాణానికి ప్రమాదం కలుగజేస్తుంది. దీనిని పల్మనరీ ఎంబ్రాలిజమ్ అంటారు. అయితే నలభైలో గర్భం దాల్చిన వారికి ఇది పదింతలు ప్రమాదం. అందుకే దీనిని అరికట్టడానికి ముందుగానే మందులు మొదలుపెడతారు. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం కూడా ఒక నివారణే.కంప్రెషన్ స్టాకింగ్స్ తొడుక్కోవాలని సూచిస్తారు. ప్రమాద అంచనా అనేది గర్భధారణ సమయంలోనూ, ఆ తరువాత కూడా చేస్తారు. రోజుకి 6–8 గ్లాసుల నీరు తీసుకోవడం, వ్యాయామం చేయడం చాలా అవసరం. గుండె పట్టేసినట్టు, రక్తపు వాంతులు అవుతున్నా, ఆయాసం ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. రక్తప్రసరణలో వచ్చే మార్పుల వల్ల నలభైల్లో వచ్చే గర్భంలో బిడ్డ బరువు తక్కువగా ఉంటుంది. 6వ నెల నుంచి ప్రతి రెండు వారాలకి పొత్తికడుపు కొలతలను చూస్తారు. నెలకోసారి స్కాన్ చేసి, బిడ్డ ఎదుగుదలను అతి దగ్గరగా పర్యవేక్షిస్తారు. ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెబుతారు.ఇంక ప్రసవ సమయం కూడా బిడ్డ ఎదుగుదలను బట్టి నిర్ణయిస్తారు. చాలాసార్లు 37 వారాలకే డెలివరీ చెయ్యాల్సి వస్తుంది. 37 వారాల తర్వాత బిడ్డ కడుపులోనే ఉంటే వెయ్యిలో ఇద్దరికి మనకు తెలియకుండానే ఇబ్బందులు వస్తాయి. అందుకే డాక్టర్ సలహా మేరకు అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఈ వయసులో నార్మల్ డెలివరీ చెయ్యాలా లేక సిజేరియన్‌కి వెళ్లాలా అన్నది డాక్టర్ నిర్ణయిస్తారు. డెలివరీ సమయంలో ఎనస్థీషియా డాక్టర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో డెలివరీ చేసుకోవడం మంచిది. అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన డాక్టర్లు ఉన్న చోట డెలివరీకి ప్లాన్ చేసుకుంటే ఏ ఇబ్బందులు ఎదురైనా ఆసుపత్రి వాళ్లే చూసుకుంటారు.నియోనాటాలజిస్ట్ కూడా అందుబాటులో ఉండాలి. చాలాసార్లు ముందస్తుగా డెలివరీ అవ్వడం, పుట్టిన బిడ్డ తక్కువ బరువు ఉండే అవకాశాలుంటాయి. అందుకే బ్లడ్ బ్యాంకు అందుబాటులో ఉండే ఆసుపత్రులను ఎంచుకోవాలి. క్రమం తప్పకుండా చెకప్ చేయించుకుని, అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ చేస్తారు. ఈ రోజుల్లో నలభై పైబడిన వారిలో కూడా నార్మల్ డెలివరీ చేస్తున్నారు.హెల్త్ ట్రీట్: సీఫుడ్ రసాయనాలతో వంధ్యత్వం!సీఫుడ్‌లోని రసాయనాలతో వంధ్యత్వం సహా నానా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. ‘పెర్ అండ్ పోలీఫ్లూరోఆల్కైల్ సబ్‌స్టన్సెస్ (పీఎఫ్ఏఎస్) అనే రకానికి చెందిన ఈ వందలాది రసాయనాలు ఎక్కువగా సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు వంటి సీఫుడ్ ద్వారా శరీరంలోకి చేరి, శాశ్వతంగా తిష్ట వేసుకుంటున్నాయని, వీటి కారణంగా మహిళల్లో వంధ్యత్వం, రకరకాల క్యాన్సర్లు, నవజాత శిశువుల్లో శారీరక లోపాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని అమెరికాలోని న్యూహాంప్‌షైర్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడైంది.సీఫుడ్ మాత్రమే కాకుండా, ప్లాస్టిక్ ఫ్యాక్టరీల పరిసరాల్లో కొళాయిల ద్వారా సరఫరా అయ్యే మంచినీటిలోను, వాటి పరిసరాల్లో పండే తిండిగింజల్లోను కూడా పీఎఫ్ఏఎస్ రసాయనాలు మోతాదుకు మించి ఉంటున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. అయితే, ఈ రసాయనాల మోతాదు మిగిలిన పదార్థాల కంటే సీఫుడ్‌లో మరింత ఎక్కువగా ఉంటున్నట్లు రుజువైంది. ముఖ్యంగా కాడ్, సాల్మన్, స్కాలప్, ట్యూనా వంటి చేపల్లోను, సముద్రపు రొయ్యల్లోను, పీతల్లోను పీఎఫ్ఏఎస్ రసాయనాలు ప్రమాదకరమైన పరిమాణంలో ఉంటున్నాయని, ఇకపై వీటిని తినే ముందు జనాలు కాస్త ఆలోచించుకోవాలని న్యూహాంప్‌షైర్ పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన మేగన్ రోమానో హెచ్చరిస్తున్నారు.పీఎఫ్ఏఎస్ పదార్థాలు మట్టిలో కలసిపోవాలంటేనే వేలాది సంవత్సరాలు పడుతుందని, అలాంటిది ఇవి శరీరంలోకి చేరితే, వాటి వల్ల తలెత్తే అనర్థాలను ఊహించుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా సముద్రపు రొయ్యలు, పీతల్లో అత్యధికంగా ప్రతి గ్రాములోను 1.74–3.30 నానోగ్రాముల మేరకు పీఎఫ్ఏఎస్ పదార్థాలు ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు లాబొరేటరీ పరీక్షల్లో గుర్తించారు. ప్లాస్టిక్లోను, అగ్నిమాపక రసాయనాల్లోను ఎక్కువగా ఉండే పీఎఫ్ఏఎస్ రసాయన పదార్థాలు మానవ శరీరంలోకి మోతాదుకు మించి చేరుకుంటే, వంధ్యత్వం సహా నానా అనర్థాలు తప్పవని వారు చెబుతున్నారు.– డా. భావనా కాసుఇవి చదవండి: అతిగా కాఫీ తాగడం కూడా ఒక వ్యసనమేనని మీకు తెలుసా!?