'కల్కి' హీరోయిన్ దీపికా పదుకొణె.. తాను తల్లి కాబోతున్నట్లు ఈ మధ్యే అనౌన్స్ చేసింది. దీంతో అందరూ ఈ బ్యూటీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ మరో స్టార్ హీరోయిన్ ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఈమె ప్రముఖ హీరోకి భార్య కావడం విశేషం. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు? ఎప్పుడు బిడ్డకు జన్మనివ్వనుంది?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
కన్నడలో స్టార్ హీరోయిన్ మిలానా నాగరాజ్. అప్పట్లో పలువురు అగ్రహీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈమె.. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీకే చెందిన డార్లింగ్ కృష్ణ అనే హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2021లో వీళ్ల వివాహం జరిగింది. 2013 నుంచి నటిస్తున్న ఈమె.. పెళ్లి తర్వాత కూడా ఓవైపు హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ పలు చిత్రాలు తీస్తోంది.
మిలానా నాగరాజ్ లేటెస్ట్ మూవీ 'ఫర్ రెన్'... రెండు వారాల క్రితమే అంటే ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈమె చేతిలో 'అరామ్ అరవింద స్వామి' అనే సినిమా ఉంది. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చింది. సెప్టెంబరులో తాను బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో అందరూ రియల్ లైఫ్ హీరోహీరోయిన్ జోడీకి శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment