
ప్రెగ్నెన్సీ జర్నీ అంత బాగానే జరిగినా.. డెలివరీ సమయంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానంటోంది నటి దేవిక నంబియార్ (Devika Nambiar). ఇటీవలే ఈమె రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తన డెలివరీ జర్నీ గురించి దేవిక మాట్లాడుతూ.. నా మొదటి ప్రెగ్నెన్సీ సాఫీగా సాగింది. ఇది కూడా అలాగే ఉంటుందనుకున్నాను. అందుకే బ్యాగ్ కూడా సర్దుకోలేదు. కానీ ఈసారి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే నేను కళ్లు తెరవకపోవడంతో అందరూ చాలా భయపడ్డారు.
స్పృహ కోల్పోయిన నటి
ఒకరోజు తర్వాత స్పృహలోకి వచ్చి నా బిడ్డను చూసుకున్నాను. అప్పటికీ నా కాళ్లు, చేతులు కదలకపోవడంతో చనిపోతానేమో అనుకున్నాను అని చెప్పుకొచ్చింది. దేవిక భర్త, సింగర్ విజయ్ మాట్లాడుతూ.. మాకు బిడ్డను చూపించారు కానీ నా భార్యను కలవనివ్వలేదు. సమయం గడిచేకొద్దీ నాలో భయం ఎక్కువైంది. నేను ఎలాగైనా కలవాల్సిందేనని చెప్పగా దేవిక స్పృహలోనే లేదని చెప్పారు. షాకయ్యాను. ఆమె ముక్కు, నోట్లో పైపులు పెట్టారు.
బోరున ఏడ్చేశా
తననలా చూడగానే అంతా అయిపోయిందనుకున్నాను. తనను వెంటిలేటర్‌పై పెట్టారు. ఆమెనలా ఎన్నడూ చూడలేదు. గదిలోకి వెళ్లి ఏదీ తినకుండా బోరుమని ఏడ్చాను అని చెప్పుకొచ్చాడు. కాగా దేవిక కలభ మజా, గల్ఫ్ రిటర్న్స్, పరయాన్ బాకీ వచెత్తు, స్నేహ కాదల్, వికడకుమారన్, కట్టప్పనేయిలే రిత్విక్ రోషన్ వంటి మలయాళ చిత్రాలతో పాటు తమిళంలోనూ నటించింది. ఈమె నటి మాత్రమే కాదు యాంకర్ కూడా! సినిమాల మధ్యలో ఆల్బమ్ సాంగ్స్ కూడా చేసింది.
చదవండి: ఎక్స్‌ట్రాలు ఎక్కువైతున్నాయ్.. ఇలాంటివారికి బుద్ధి చెప్పాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment