
ఇప్పుడంతా ఓటీటీల (OTT Movies) జమానా. భాషతో సంబంధం లేకుండా నటీనటులు అభిమానుల్ని సంపాదించుకుంటున్నారు. అలా ఓటీటీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమున్న మలయాళ నటి అనస్వర రాజన్ (Anaswara Rajan).
ఈమె నటించిన 'మిస్టర్ & మిసెస్ బ్యాచిలర్' అనే మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు ఈమెపై ఆరోపణలు చేశాడు. తానేం తప్పు చేయలేదని ఇచ్చిపడేసిన అనస్వర రాజన్.. దర్శకుడికి అదే రేంజులో ఇచ్చిపడేసింది.
(ఇదీ చదవండి: సింగర్ కల్పనకు ఏమైంది? పోలీసుల అదుపులో భర్త)
అసలేం జరిగింది?
ఇంద్రజిత్ సుకుమారన్, అనస్వర రాజన్ జంటగా నటించిన 'మిస్టర్ & మిసెస్ బ్యాచిలర్' మూవీ లెక్క ప్రకారం గతేడాది ఆగస్టులోనే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ అనుకోని కారణాల వల్ల అది జరగలేదు. కొన్నిరోజుల క్రితం పలు మీడియా ఛానెళ్లకి ఇంటర్వ్యూలు ఇచ్చిన దర్శకుడు దీపు కరుణాకరన్(Deepu Karunakaran).. హీరోయిన్ అనస్వర రాజన్ అస్సలు ప్రమోషన్ కోసం సహకరించట్లేదని చెప్పాడు. ఆమెపై లేనిపోని ఆరోపణలు చేశాడు.
తాజాగా దర్శకుడి కామెంట్స్ పై స్పందించిన అనస్వర రాజన్.. ఆయన అన్ని అబద్ధాలే చెబుతున్నాడని క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా కోసం ఇచ్చిన ఒకేఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ తనదేనని, సినిమా పోస్టర్స్ కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశానని చెప్పుకొచ్చింది. రిలీజ్ డేట్ మార్పు గురించి తనకు అస్సలు సమాచారం ఇవ్వలేదని వాపోయింది.
(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్)
ఇలానే తనపై ఆరోపణలు చేస్తూ పరువు తీసేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఎంతవరకైనా వెళ్తానని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సదరు దర్శకుడిపై అనస్వర ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వివాదం మలయాళ చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది.
అనస్వర నటించిన చిత్రాల విషయానికొస్తే.. సూపర్ శరణ్య, ప్రణయ విలాసం, గురువాయూర్ అంబలనడయిల్, నెరు తదితర చిత్రాలు ఉన్నాయి. ఈమె నటించిన లేటెస్ట్ హిట్ మూవీ 'రేఖాచిత్రం' ఈ శుక్రవారం నుంచి సోనీ లివ్ ఓటీటీలోకి రానుంది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కానుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)