
కిందపడగానే పైకి లేస్తాం.. దెబ్బ తగిలితే ఆయింట్‌మెంట్ రాసుకుంటాం.. అలాగే నేరం జరగగానే పోలీసులను సంప్రదించాను అంటోంది హీరోయిన్ భావన. మలయాళంలో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో భావన (Actress Bhavana) జీవితంలో పెద్ద కుదుపు. 2017 ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
ఎందుకు భయపడాలి?
ఈ కేసులో హీరో దిలీప్ కుమార్ రెండునెలలపాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. తాజాగా భావన.. ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. నేను ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు భయపడాలి? ఎందుకు వెనకడుగు వేయాలి? అందుకే ఏదీ ఆలోచించకుండా నాకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ సమయంలో అదే కరెక్ట్ అనిపించింది, చేశాను. అయితే అప్పుడది పెద్ద సెన్సేషన్ అయిపోయింది.
మౌనంగా ఉంటే..
నేనేదో గొప్ప పని చేశానని ఇప్పటికీ అనుకోను. మౌనంగా ఉంటే సమస్య ఇంకా పెద్దదవుతుంది కదా అనిపించింది. నాకు నేను సర్ది చెప్పుకుని మౌనంగా ఉండి.. కొన్నేళ్ల తర్వాత బయటకు చెప్పాననుకోండి.. ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్‌గా ఉన్నావంటారు. అందుకే ఆ క్షణమే పోలీసులను ఆశ్రయించాను అని చెప్పుకొచ్చింది. భావన తెలుగులో ఒంటరి, మహాత్మ, హీరో చిత్రాలు చేసింది. ప్రస్తుతం తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది.
చదవండి: నాకు పొగరనుకున్నారు.. సినిమా ఛాన్సులు కోల్పోయా: యష్