
రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ ఇస్తాం.. అనగానే ఎవరైనా ఏం చేస్తారు? ఎగిరిగంతేస్తారు. అందులోనూ రజనీకి భార్యగా అనేసరికి లోలోపలే సంతోషపడిపోయింది మలయాళ నటి శినీ సారా. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. అదేంటి? ఆల్‌రెడీ రజనీకి భార్యగా రమ్యకృష్ణ నటిస్తోందిగా అని స్ఫురించింది. కేవలం తన దగ్గర డబ్బు గుంజేందుకే ఇలాంటి కాకమ్మ కహానీలు చెప్పాడని అర్థం కావడంతో నిరాశగా నిట్టూర్పు విడ్చింది.
ఆర్టిస్ట్ కార్డ్ ఉందా?
ఈ మోసం గురించి శినీ సారా మాట్లాడుతూ.. కాస్టింగ్ ఏజెన్సీ ద్వారా అందిన మీ అప్లికేషన్‌ను సెలక్ట్ చేశాం అంటూ వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. జైలర్ 2 మూవీలో రజనీకాంత్ భార్య కోసం నటుల్ని వెతుకుతున్నట్లుగా ఉంది. తర్వాత వారు ఫోన్ చేసి ఆర్టిస్ట్ కార్డు ఉందా? అని అడిగారు. మలయాళంలో అయితే అలాంటి కార్డులు ఏవీ లేవన్నాను. సరే దానికి అవసరమైన ఏర్పాట్లు తామే చూసుకుంటామన్నారు. సురేశ్ కుమార్ అనే వ్యక్తి మీకు ఫోన్‌లో సంప్రదిస్తాడని చెప్పారు.
జైలర్ 2లో రజనీ భార్యగా ఛాన్స్
రెండు రోజుల తర్వాత ఆ సురేశ్ కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. చీర కట్టుకుని వీడియో కాల్‌లో ఇంటర్వ్యూకు హాజరవమన్నారు. జైలర్ 2లో రజనీకాంత్ భార్యగా నన్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. నాకసలు అర్థం కాలేదు. అప్పటికే జైలర్ 2లో రజనీ భార్యగా రమ్య కృష్ణ నటిస్తోంది. ఇదే విషయం చెప్పాను. దాంతో అతడు మరో సినిమా కోసం సెలక్ట్ చేశామన్నాడు. అయితే ఆర్టిస్ట్ కార్డ్ తప్పనిసరిగా అవసరం ఉంటుందని.. దానికోసం అప్లై చేయాల్సి ఉంటుందన్నాడు.

డబ్బు అడగడంతో అనుమానం మొదలు
ఇందుకోసం ఓ అప్లికేషన్ కూడా పంపిస్తున్నానని, అందులో అన్ని వివరాలు పొందుపరచమని చెప్పాడు. ఇదంతా నిజమేననుకుని ఆధార్ కార్డ్ వివరాలు, నా ఫోటో షేర్ చేశాను. వెంటనే అతడు రూ.12,500 డబ్బు కట్టమన్నాడు. అందుకోసం నాకు రెండు రోజుల గడువు ఇవ్వమని అడిగాను. దానికతడు.. వీలైనంత త్వరగా కట్టేయాలని, ఇప్పుడే డబ్బు పే చేయమన్నాడు. అప్పుడు నాకు అనుమానం మొదలైంది.
తస్మాత్ జాగ్రత్త
కోలీవుడ్‌లో నాకు తెలిసిన స్నేహితులు మాల పార్వతి, లిజొమోల్‌కు ఫోన్ చేశాను. కానీ వారు నా కాల్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు మరొకరికి కాల్ చేయగా.. ఆర్టిస్ట్ కార్డ్ లేకపోయినా తమిళ ఇండస్ట్రీలో పనిచేయొచ్చని తెలిపారు. దీంతో నాకు జరిగింది స్కామ్ అని తెలిసిపోయింది. ఇలాంటివారిని నమ్మి చాలా మంది డబ్బులు మోసపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది.
చదవండి: ప్రేయసి కోసం ముందు జాగ్రత్తలు తీసుకున్న 60 ఏళ్ల హీరో.. అప్పుడే..!
Comments
Please login to add a commentAdd a comment