Malayalam actress
-
నేను సంతూర్ మమ్మీలా ఉంటా.. రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి?: నటి
మలయాళ నటి చిత్ర నాయర్ (Actress Chitra Nair) రెండో పెళ్లి చేసుకుంది. ఆర్మీ ఏవియేషన్ విభాగంలో పనిచేసే లెనీష్ అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే కావడం విశేషం! ఈ వివాహ వేడుకకు చిత్ర కుమారుడు, లెనీష్ కుమార్తె సహా ఇరువురి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు. అలాగే పెళ్లి వీడియోను చిత్ర సోషల్ మీడియాలో షేర్ చేసింది.జాతకాలు చూసే పెళ్లి.. చివరకేమైంది?గతంలో ఓ ఇంటర్వ్యూలో చిత్ర మాట్లాడుతూ.. నా కొడుక్కి పద్నాలుగేళ్లు. తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. నాకు 36 ఏళ్లు. అందరూ సంతూర్ మమ్మీ అని పిలుస్తుంటారు. నా పక్కన ఉన్న కొడుకుని చూసి నా తమ్ముడనుకుంటారు. 21 ఏళ్ల వయసులోనే నాకు పెళ్లయింది. అది పెద్దలు కుదిర్చిన సంబంధం. జాతకాలు అన్నీ చూశాకే నాకు పెళ్లి చేశారు. చివరకు ఏమైంది? ఎనిమిదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాం.కచ్చితంగా ఆలోచిస్తా..మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అని నన్నడిగితే కచ్చితంగా ఆలోచిస్తానని చెప్తాను. నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే ఎందుకు వదులుకుంటాను? ఈ విషయంలో నా కొడుక్కి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈసారి జాతకాలు కలిసాయా? లేదా? అని మాత్రం చూడను. అయితే ఇప్పుడే పెళ్లి గురించే ఆలోచించడం లేదు అని చెప్పుకొచ్చింది.యాక్టర్‌గా మారిన టీచర్కేరళకు చెందిన చిత్రనాయర్ గతంలో ఉపాధ్యాయినిగా పని చేసింది. కరోనా సమయంలో తన వృత్తిని వదిలేసి సినిమావైపు ఆసక్తి చూపించింది. ఆడిషన్స్‌కు వెళ్లి తనకంటూ కొత్తదారి నిర్మించుకుంది. మోహన్‌లాల్ 'ఆరట్టు' చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయమైంది. పార్ట్నర్స్, సురేశింతెయుమ్ సుమలతయుదెయుం హృదయహరియయ ప్రణయకథ, పొరట్టు నడకం, క్వీన్ ఎలిజబెత్, ఎన్న తాన్ కేస్ కొడు వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by chithra_nair_L (@chithra_nair_official) చదవండి: ప్రభుదేవా కన్సర్ట్.. కనీస గౌరవం లేదు, వివక్ష చూపిస్తున్నారు: నటి -
హీరోయిన్ బీచ్ ఫోటోషూట్.. యూట్యూబ్ ఛానెల్‌కు నటి స్ట్రాంగ్ వార్నింగ్!
ప్రముఖ మలయాళ నటి పార్వతి ఆర్ కృష్ణ అలాంటి వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో తన ఫోటోలను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఇటీవల తన ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను కొందరు యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులు మిస్యూజ్ చేయడంపై ఆమె స్పందించింది. తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోషూట్ చిత్రాలను అసభ్యకరమైన రీతిలో ప్రదర్శిస్తే చర్యలు తప్పవని వెల్లడించింది. ఈ విషయంపై ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది.వీడియోలో పార్వతి ఆ కృష్ణ మాట్లాడుతూ.. 'నాపై వచ్చిన ఒక తీవ్రమైన సమస్యపై మాట్లాడేందుకుందుకే ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నా. నా వృత్తిలో భాగంగా నేను తరచుగా ఫోటోషూట్లలో పాల్గొంటాను. ఎక్కడైనా కానీ నా అందాన్ని ప్రదర్శించడంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. నా బీచ్ ఫోటోషూట్ సమయంలోనూ ఎక్కడ కూడా హద్దులు మీరి అందాలను ప్రదర్శించలేదు. కానీ యూట్యూబ్ ఛానెల్ వాళ్లు మాత్రం నా ఫోటోలను వారికిష్టమొచ్చినట్లు ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. నా అనుమతి లేకుండా నా వీడియోలు, చిత్రాలను అసభ్యంగా చూపిస్తే మీ ఛానెల్ మూసేవరకు పోరాటం చేస్తా. ఇలాంటి సమస్యలపై ఇతరులు ఎందుకు స్పందించలేదో నాకు అర్థం కావడం లేదు. నా ఫోటోలను దుర్వినియోగం చేసేవారు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. నా వ్యక్తిగత జీవితంలోకి మీరు అడుగుపెడితే ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చూస్తారు' అంటూ హెచ్చరించింది నటి. కాగా.. పార్వతి ఆర్ కృష్ణ పలు మలయాళ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by PARVATHY KRISHNA (@parvathy_r_krishna) -
మళ్లీ పెళ్లి చేసుకున్న మలయాళ హీరోయిన్ (ఫోటోలు)
-
మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ప్రియుడితో ఏడడుగులు..
హీరోయిన్ స్వాసిక విజయ్ (Swasika Vijay) మళ్లీ పెళ్లి చేసుకుంది. ప్రియుడు, నటుడు ప్రేమ్‌తో ఏడడుగులు వేసింది. వీరిద్దరికీ గతేడాది జనవరి 26న పెళ్లి జరిగింది. అయితే కేరళ సాంప్రదాయం ప్రకారం ఆ వివాహం జరిగింది. దీంతో తమ మొదటి వార్షికోత్సవాన్ని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నారు. తమిళ సాంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. ఆలోచనను ఆచరణలో పెట్టారు. మరోసారి వేలు పట్టుకుని..వధూవరుడిలా ముస్తాబై మండపంలో కూర్చున్నారు. ప్రేమ్.. మరోసారి అర్ధాంగితో కలిసి ఏడడుగులు వేశాడు. భార్య కాలికి మెట్టలు తొడిగాడు. ఈ వీడియోను దంపతులిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. చూస్తుండగానే ఏడాది అయిపోయింది. మేము తమిళ సాంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇందుకోసం సహకరించిన అందరికీ థాంక్యూ. దీన్ని నిజమైన పెళ్లిలా అందంగా, అద్భుతంగా జరిపారు అని ప్రేమ్ రాసుకొచ్చాడు. స్వాసిక, ప్రేమ్ 'మనంపోలే మాంగళ్యం' సీరియల్లో కలిసి నటించారు.(చదవండి: వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం'.. 12 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)హీరోయిన్గా కెరీర్ మొదలుస్వాసిక అసలు పేరు పూజా విజయ్ (Pooja Vijay). వైగై (2009) అనే తమిళ సినిమాతో హీరోయిన్గా తన ప్రయాణం మొదలుపెట్టింది. ఆ మరుసటి ఏడాది ఫిడల్ చిత్రంతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ప్రభువింటే మక్కళ్, కట్టప్పనయిలే రిత్విక్ రోషన్, పొరింజు మరియమ్ జోస్, చతురం, వాసంతి వంటి చిత్రాల్లో నటించింది. తర్వాత సీరియల్స్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. పలు రియాలిటీ షోలలోనూ మెరిసింది. చివరగా లబ్బర్ పందు సినిమాతో అలరించింది. సూపర్ హిట్‌గా లబ్బర్ పందులబ్బర్ పందు సినిమా విషయానికి వస్తే.. రూ.5 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు రాబట్టింది. గల్లీ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. హరీశ్ కల్యాణ్, దినేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. View this post on Instagram A post shared by Prem Jacob (@premtheactor) View this post on Instagram A post shared by Swaswika (@swasikavj) చదవండి: మీ తెలుగోడు నా జీవితాన్నే మార్చేశాడు.. డైరెక్టర్‌తో బాబీ డియోల్ -
నిర్మాత లవ్ రిజెక్ట్ చేశా.. ఆ కోపంతో రైల్లో నుంచి తోసేయాలని..: దృశ్యం నటి
దృశ్యం సినిమాతో పాపులరైంది అంజలి నాయర్ (Anjali Nair). తాజాగా ఈ బ్యూటీ తనకు గతంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. అంజలి మాట్లాడుతూ.. ఉన్నయే కాదలిప్పన్ (Unnaiye Kadhalipen) అనే తమిళ సినిమా చేస్తున్నప్పుడు ఆ మూవీ నిర్మాత నాకు ప్రపోజ్ చేశాడు. అతడు ఆ సినిమాను నిర్మించడంతో పాటు అందులో విలన్‌గానూ నటించాడు. తన ప్రపోజల్‌ను నేను తిరస్కరించాను. దాంతో అతడు నేను వేరే సినిమాకు వెళ్లినప్పుడు ఆ సెట్స్‌కు వచ్చి వేధింపులకు గురి చేశాడు.రైల్లో నుంచి నెట్టేయాలని..ఒకసారి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్‌గా వచ్చి నా బ్యాగు తీసుకున్నాడు. తిరిగిచ్చేయమని అతడిని వెంబడించినప్పుడు రైలు డోర్ దగ్గర నన్ను బయటకు నెట్టేయాలని చూశాడు. ఒకసారి అతడి సోదరి నాకు ఫోన్ చేసి ఆమె తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. నన్ను చూడాలని కలవరిస్తోందని చెప్పింది. అతడు ఇంట్లో ఉంటే రానని చెప్పాను. అందుకామె.. తన సోదరుడు ఇంట్లో లేడని స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయాడని, కంగారుపడాల్సినం అవసరం లేదని సర్ది చెప్పింది.కత్తితో బెదిరించి సంతకం..నిజమేననుకుని వెళ్లాను. నేను ఇంట్లో ఓ గదిలోకి వెళ్లగానే బయట నుంచి గడియ పెట్టారు. ఆ గదిలో ఆ రాక్షసుడు ఉన్నాడు. కొన్ని పేపర్లు నా ముందు పెట్టి సంతకం పెట్టమన్నాడు. కత్తితో బెదిరించడంతో సంతకం చేశాను. ఆ పేపర్లలో లవ్ లెటర్ కూడా ఉంది. తర్వాత ఎలాగోలా ఆ గది నుంచి బయటపడ్డాను. అయితే అతడి నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్గా నటించాలని కాంట్రాక్ట్ పేపర్‌పై నాతో బలవంతంగా సంతకం చేయించుకున్నాడని అర్థమైంది.(చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లి రాజు.. తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్!)అంత చెండాలంగా లెటర్ రాస్తారా?నేను సినిమా చేయనని చెప్పాను. ఆధారాలతో సహా అతడిపై కేసు పెట్టాను. అప్పుడు అతడు నేను రాసినట్లుగా లవ్ లెటర్స్‌ను సాక్ష్యంగా చూపించాడు. నేనొకటే అడిగా.. ప్రేమించే ఏ అమ్మాయైనా అంత చెండాలంగా లవ్ లెటర్ రాస్తుందా? అని ప్రశ్నించాను. ఆ కేసు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తర్వాత మళ్లీ ఎప్పుడూ అతడు నాకు కనిపించలేదు అని చెప్పుకొచ్చింది. సినిమాఅంజలి.. మలయాళంలో ద కింగ్ అండ్ ద కమిషనర్, 5 సుందరికల్, పట్టం పోలే, వెనిసిలె వ్యాపారి, ఏంజెల్స్, టమార్ పడార్, 100 డిగ్రీ సెల్సియస్, సెకండ్స్, సెంట్రల్ థియేటర్, లైలా ఓ లైలా, బెన్, దూరం, తీరం, ఆమి, దృశ్యం 2, మాన్స్టర్ సినిమాలు చేసింది. తమిళంలో ఇదువుమ్ కాదంధు పొగుం, నెల్లు, ఆగడు సినిమాలు చేసింది. ఇటీవలే చిత్తా(తెలుగులో చిన్నా) సినిమాకుగానూ ఉత్తమ సహాయ నటిగా రాష్ట్రీయ అవార్డు గెలుచుకుంది. కాగా అంజలి దర్శకుడు అనీశ్‌ను 2011లో పెళ్లి చేసుకుంది. వీరికి అవని అనే కూతురు ఉంది. 2016లో అతడికి విడాకులు ఇచ్చింది. 2022లో అజిత్ రాజును రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఓ కూతురు పుట్టింది.చదవండి: నాన్న చేసిన పనికి అమ్మ ఏడుస్తూ... ఈ బతుకే వద్దనుకున్నా! -
'హనీరోజ్ డ్రెస్‌పై చర్చ.. అందులో ఎలాంటి తప్పు లేదు'.. ప్రముఖ కామెంటేటర్
ప్రముఖ మలయాళ నటి హనీరోజ్ (Honey Rose) వేధింపుల కేసులో ఇప్పటికే వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. చాలాసార్లు తనను సోషల్ మీడియా వేదికగా ఇబ్బందులకు గురి చేశాడని హానీ రోజ్ ఆరోపించిస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సుమారు 30మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బిజినెస్మెన్ బాబీ చెమ్మనూరు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వయనాడ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు.అయితే హనీ రోజ్ ఫిర్యాదు తర్వాత ప్రముఖ మలయాళ కామెంటేటర్ రాహుల్ ఈశ్వర్ హీరోయిన్‌పై విమర్శలు చేశారు. ఈ విషయంలో వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌కు రాహుల్ ఈశ్వర్ మద్దతుగా నిలిచారు. తాజాగా ఓ టీవీ డిబేట్లో పాల్గొన్న రాహుల్ ఈశ్వర్.. హనీ రోజ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. హనీ డ్రెస్ గురించి చర్చించడంలో తప్పు లేదని.. తన మార్కెటింగ్ సామర్థ్యాన్ని ఆమె ఉపయోగించుకుందని రాహుల్ హనీ రోజ్‌ను విమర్శించాడు.తనపై రాహుల్ ఈశ్వర్ చేసిన కామెంట్స్‌కు హనీ రోజ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. మీకు భాషపై పట్టు ఉన్న మాట వాస్తవమే కానీ.. మహిళల దుస్తులను చూసినప్పుడు మాత్రం నియంత్రణ కోల్పోతున్నారని ఆయన మాటలు వింటేనే అర్థమవుతోందని మండిపడింది.హనీ రోజ్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'మీ భాషపై నియంత్రణ చాలా తక్కువ. ఒక సమస్యపై చర్చ జరిగినప్పుడు.. చర్చకు రెండు వైపులా ఆలోచిస్తే మంచిది. భాషపై మీకున్న అద్భుతమైన పట్టుతో ఎల్లప్పుడూ చర్చలకు సిద్ధంగా ఉంటారు. కానీ రాహుల్ ఈశ్వర్ తన భాషా నైపుణ్యంతో మహిళల సమస్యల విషయంలో మాత్రం తటస్థంగా వ్యవహరిస్తాడు. భాషపై మీ నియంత్రణ గొప్పదే అయినప్పటికీ, మహిళల దుస్తుల విషయానికి వస్తే అది కాస్తా తడబడుతున్నట్లు కనిపిస్తోంది. రాహుల్ ఈశ్వర్ గుడిలో పూజారి కాకపోవడమే మంచిదైంది. లేకుంటే తాను ఉన్న గుడికి వచ్చే మహిళలకు డ్రెస్ కోడ్ పెట్టేవాడు. ఎలాంటి వస్త్రధారణ మీ స్వీయ నియంత్రణకు భంగం కలిగిస్తుందో ఎవరు అంచనా వేయగలరు?. నేను ఎప్పుడైనా మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎదుర్కోవలసి వస్తే ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటా" అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిందిఅసలేం జరిగిందంటే..గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై డబుల్ మీనింగ్‌తో పోస్టులు పెడుతున్నారని హనీ రోజ్ ఆరోపించారు. కొందరు తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఇన్‌స్టాలో కొద్దిరోజుల క్రితం తెలిపారు. ఒక వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నాని ఒక లేఖను హనీరోజ్ విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడని అందులో రాసుకొచ్చింది. తప్పుడు కామెంట్ల గురించి తాను సైలెంట్‌గా ఉంటుంటే.. ఆ వ్యాఖ్యలను నువ్వు స్వాగతిస్తున్నావా..? అని చాలామంది అడుగుతున్నారని ఆమె తెలిపారు.హనీరోజ్ సినీ కెరీర్..వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఈ ఒక్క సినిమాతోనే 10 చిత్రాలకు దక్కినంత పేరు, గుర్తింపు ఆమె రావడం విశేషం. దీంతో తెలుగు రాష్ట్రాలలో పదుల సంఖ్యలో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు గెస్ట్‌గా వెళ్లారు. వాస్తవంగా 2008లోనే ఆలయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) -
హనీరోజ్ ఫిర్యాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్
సోషల్‌మీడియా వేదికగా మలయాళ నటి హనీరోజ్‌ను (Honey Rose) ఇబ్బందులకు గురిచేసిన వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను కొంత కాలంగా ఒక వ్యాపారవేత్త ఇబ్బంది పెడుతున్నాడని కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సుమారు 30మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో కీలకమైన వ్యక్తి వివరాలను తాజాగా పోలీసులు ప్రకటించారు.హనీరోజ్‌ను ఇబ్బంది పెడుతున్న ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును ( Boby Chemmanur) సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హనీరోజ్ ఫిర్యాదు చేసిన సమయం నుంచి అతను పరారీలో ఉన్నాడు. వయనాడ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే, అంశంపై హనీరోజు కూడా స్పందించారు. అతనిని అరెస్ట్ చేయడం తనకెంతో ప్రశాంతంగా ఉందని ఆమె అన్నారు. ఈ కేసు అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయన్ ( Pinarayi Vijayan) వద్దకు తీసుకెళ్లానని ఆమె తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న అందరిపై తగిన చర్యలు తీసుకుంటామని సీఎం మాట ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.అసలేం జరిగిందంటే..గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై డబుల్ మీనింగ్‌తో పోస్టులు పెడుతున్నారని హనీ రోజ్ ఆరోపించారు. కొందరు తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఇన్‌స్టాలో కొద్దిరోజుల క్రితం తెలిపారు. ఒక వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నాని ఒక లేఖను హనీరోజ్ విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడని అందులో రాసుకొచ్చింది. తప్పుడు కామెంట్ల గురించి తాను సైలెంట్‌గా ఉంటుంటే.. ఆ వ్యాఖ్యలను నువ్వు స్వాగతిస్తున్నావా..? అని చాలామంది అడుగుతున్నారని ఆమె తెలిపారు. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న సింగిల్ టేక్ హీరోయిన్.. బాలకృష్ణ సినిమాతో గుర్తింపు)ఆ వ్యక్తి గతంలో కొన్ని కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించాడు. పలు వ్యక్తిగత కారణాల వల్ల చాలాసార్లు నిరాకరించాను. అందుకు ప్రతీకారంగా నేను హాజరయ్యే ప్రతి ఈవెంట్‌కు రావడం.. వీలు కుదిరినప్పుడల్లా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆమె తెలిపింది. కానీ, తనపై ఎవరైనా వివరణాత్మక విమర్శలు చేస్తే స్వాగతిస్తానని ఆమె పేర్కొన్నారు. తన లుక్స్‌పై వేసే సరదా జోక్స్ కూడా తీసుకుంటానన్నారు. తనపై వచ్చిన కొన్ని మీమ్స్ కూడా సరదాగేనే ఉంటాయని అన్నారు. ఇలాంటివి తనను బాధించవని కూడా తెలిపారు. కానీ, దానికంటూ ఒక హద్దు ఉంటుందని దానిని దాటి ఇలా అసభ్యకరంగా చేసే కామెంట్స్‌ను ఏమాత్రం సహించనని హనీరోజ్ హెచ్చరించారు.ఎవరీ బంగారు బాబీ..?భారత్‌లో బంగారు వ్యాపారంలో బాబీ చెమనూరు ప్రముఖులుగా ఉన్నారు. గతంలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ డిగో మారడోనాను కొచ్చికి తీసుకొచ్చి తన జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేశాడు. అలా ఆయన పేరు అందరికీ పరిచయమే. వ్యాపారంలో భాగంగా నటి హనీరోజ్‌ను అతను ఆహ్వానించినా పలు కారణాలతో ఆమె వెళ్లలేకపోయింది. దీంతో ఆమెను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఈ ఒక్క సినిమాతోనే 10 చిత్రాలకు దక్కినంత పేరు, గుర్తింపు ఆమె రావడం విశేషం. దీంతో తెలుగు రాష్ట్రాలలో పదుల సంఖ్యలో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు గెస్ట్‌గా వెళ్లారు. వాస్తవంగా 2008లోనే ఆలయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. -
బాలకృష్ణ హీరోయిన్‌కు వేధింపులు.. మద్దతుగా నిలిచిన అమ్మ!
ప్రముఖ నటి హనీ రోజ్ (Honey Rose) పోలీసులను ఆశ్రయించింది. తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఆధారంగా కేరళలోని ఏర్నాకుళం పోలీసులు చర్యలు చేపట్టారు. హనీ రోజ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలోని కుంబళంకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు.అసభ్యకరమైన పోస్టులు..గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై డబుల్ మీనింగ్‌తో పోస్టులు పెడుతున్నారని హనీ రోజ్ ఆరోపించారు. ఈ పోస్ట్ కింద తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఇన్‌స్టాలో ద్వారా వెల్లడించింది. దీనిపై ఇప్పటికే హనీ రోజ్ ఎర్నాకులం సెంట్రల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దాదాపు 30 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.అసలేం జరిగిందంటే..:ఒక వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నాని ఆదివారం సాయంత్రం హనీరోజ్ విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడని రాసుకొచ్చింది. ఈ కామెంట్స్ గురించిన నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఇలాంటి వాటిని మీరు స్వాగతిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారని తెలిపింది. ఆ వ్యక్తి గతంలో కొన్ని కార్యక్రమాలకు నన్ను పిలిచాడు. వ్యక్తిగత కారణాల వల్ల చాలాసార్లు నిరాకరించాను. అందుకు ప్రతీకారంగా నేను హాజరయ్యే ప్రతి ఈవెంట్‌కు రావడం.. వీలు కుదిరినప్పుడల్లా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆమె తెలిపింది.హనీకి మద్దతుగా అమ్మ..నటి హనీరోజ్‌పై సోషల్‌మీడియాలో వస్తున్న పోస్టులపై చట్టపరమైన చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మలయాళ నటీనటుల సంస్థ(AMMA)అమ్మ తెలిపింది. ఈ విషయంలో హనీ రోజ్ చేస్తున్న న్యాయ పోరాటానికి అమ్మ సహకారం, పూర్తి మద్దతు ఉంటుందని లేఖ విడుదల చేసింది. అవసరమైతే న్యాయ సహాయం అందజేస్తామని అమ్మ అడ్ హాక్ కమిటీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలియజేసింది. హనీ రోజ్‌ను సోషల్ మీడియా ద్వారా పరువు తీయడానికి కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నాలను అమ్మ సంఘం ఖండించింది.చులకన వ్యాఖ్యలుఒకసారి అతడి షాప్‌కు వెళ్లినప్పుడు కూడా మీడియా ముందు నాపై చులకన వ్యాఖ్యలు చేశాడు. అవి నన్నెంతో అసౌకర్యానికి గురి చేశాయి. అప్పుడు నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇంటికి వెళ్లాక ప్రోగ్రామ్ నిర్వాహకులకు కాల్ చేసి నాపై చీప్ కామెంట్లు చేస్తే సహించేది లేదని చెప్పాను. అప్పటినుంచి తన ప్రోగ్రామ్స్‌కు వెళ్లడమే మానేశాను.మరోసారి దిగజారుడు వ్యాఖ్యలుఅయితే నేను హాజరైన ఓ ప్రోగ్రామ్‌కు అతడు గెస్టుగా వచ్చాడు. అతడు వస్తున్నాడన్న విషయం నాకు తెలియదు. అక్కడికి వెళ్లాక నాతో డైరెక్ట్‌గా మాట్లాడలేదు కానీ అందరిముందు మళ్లీ నాపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. తర్వాత మరోసారి తన బిజినెస్ ప్రమోషన్స్‌లో పాల్గొనమని ఆఫర్ ఇచ్చాడు. నేను కుదరదన్నాను. అతడి మేనేజర్.. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నేను వారి ఆఫర్‌ను తిరస్కరించాను.హనీ రోజ్ సినిమాలు..కాగా వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ పేరు టాలీవుడ్ (Tollywood)లో మార్మోగిపోయింది. ఈ మలయాళ భామ 2008లో ఆలయం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇందులో హనీ ఊరమాస్ లుక్‌లో కనిపించనుంది. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) -
అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్పందించిన నటి!
డైరెక్టర్ పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'. ఈ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్లో అవార్డ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఈ అవార్డును దక్కించుకోలేదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును సొంతం చేసుకుంది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్ఠాత్మక పామ్ డి ఓర్ స్క్రీనింగ్ కాంపిటీషన్లో 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రం 'గ్రాండ్ ప్రిక్స్' అవార్డు దక్కించుకుంది.ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటి దివ్యప్రభ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో అను అనే నర్సు పాత్రలో దివ్య ప్రభ మెరిసింది. అయితే ఈ మూవీలో ఆమెకు సంబంధించిన న్యూడ్ సీన్స్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దివ్య ప్రభపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తాజాగా లీకైన వీడియోలపై నటి దివ్య ప్రభ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఈ చిత్రానికి సంతకం చేసినప్పుడే ఇలాంటి స్పందన వస్తుందని ఊహించానని తెలిపింది.దివ్య ప్రభ మాట్లాడుతూ..'ఇది నిజంగా చాలా దారుణం. నేను ఆ పాత్ర కోసం సైన్ చేసినప్పుడు కూడా కేరళలోని ఓ వర్గం ప్రజల నుంచి అలాంటి స్పందన వస్తుందని ముందే ఊహించా. ఒకవేళ ఆ పాత్రకు ఆస్కార్ వచ్చినప్పటికీ మలయాళీ మహిళలు అలాంటి పాత్రలు చేయకూడదు. ఆ లీక్ అయిన వీడియోలను షేర్ చేసిన వారు మనదేశ జనాభాలో 10 శాతం మంది ఉన్నారు. కానీ వారి మనస్తత్వం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఇలాంటి చర్యను వ్యతిరేకించే పురుషులు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నా. మలయాళీలు కూడా సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్‌లో ఉన్నారు. మా చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఆమోదం లభించింది. అదే మాకు ముఖ్యం. ఒక నటిగా స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తా. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్లో నా పాత్ర గురించి ముందే తెలుసు. కానీ కొంతమంది ఫేమ్ కోసమే చేశానని నన్ను విమర్శించారు. ఇప్పటికే అనేక అవార్డులను గెలుచుకున్నా. అలాగే విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాల్లో నటించా. ఫేమ్ కోసం నగ్నంగా నటించాల్సిన అవసరం లేదు' అని వివరించింది.కాగా.. ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు. -
జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య
ఒకప్పుడు పెళ్లి కోసం యువత ఎగబడే వాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉద్యోగాలు, ఇండిపెండెంట్‌గా బతకడం లాంటివి చెబుతూ అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు సింగిల్‌గానే ఉండిపోతున్నారు. ఇలాంటి వాళ్లలో సినిమా హీరోహీరోయిన్లు కూడా ఉన్నారండోయ్. వాళ్లకు పెళ్లిపై నమ్మకమున్నా సరే ఎందుకో చేసుకోవట్లేదు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి మాత్రం జీవితంలో తాను పెళ్లి చేసుకోనని చెబుతోంది.(ఇదీ చదవండి: అక్కినేని హీరోతో పెళ్లి.. స్పందించిన మీనాక్షి చౌదరి)మలయాళంలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య.. తెలుగులోనూ 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది. గతంలో పెళ్లి చేసుకోనని ఓసారి చెప్పిన ఈమె.. ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇందుకు గల కారణాల్ని కూడా బయటపెట్టింది.'జీవితంలో నేను పెళ్లి చేసుకోను. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. నాకు తెలిసిన చాలామందిని చూశారు. ఒక్క జంట తప్పితే మిగిలిన వాళ్లందరూ రాజీ పడి బతుకుతున్నారు. పెళ్లి వల్ల చాలామంది వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు. అందుకే పెళ్లి వద్దని ఫిక్సయ్యాను. 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు గురువాయూర్ గుడిలో చాలా పెళ్లిళ్లు చూశాను. అవి చూసినప్పుడల్లా నేను కూడా అలానే చేసుకోవాలని అనుకున్నా. కానీ పెద్దయిన తర్వాత పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది.'(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్‌కి విడాకులు ఇచ్చేసిన భార్య)'కొన్నేళ్ల ముందు వరకు కూడా పెళ్లి చేసుకోవాలనే అనుకున్నారు. ఓ మ్యాట్రిమోని సైట్లో నేను నా ప్రొఫైల్ కూడా పెట్టాను. కానీ అది ఫేక్ అని చాలామంది అనుకున్నారు. కానీ కొన్నాళ్లకు పెళ్లిపై నా అభిప్రాయం మారిపోయింది' అని ఐశ్వర్య లక్ష్మీ చెబుతోంది.తమిళ నటుడు అర్జున్ దాస్‌తో ఈమె ప్రేమలో ఉందని కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మాటలతో అవన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయాయి. ఐశ్వర్య ప్రస్తుతం తెలుగులో సాయితేజ్ లేటెస్ట్ మూవీలో చేస్తోంది.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!) -
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో భర్త పోస్ట్!
ప్రముఖ బుల్లితెర నటి మాళవిక కృష్ణదాస్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గతంలో ప్రెగ్నెన్సీ ప్రకటించిన నటి.. సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. బిడ్డ పుట్టిన విషయాన్ని ఆమె భర్త తేజస్ జ్యోతి ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. బిడ్డ చేతిని పట్టుకున్న ఫోటోను ఆయన పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బుల్లితెర జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. మాళవిక కృష్ణదాస్, తేజస్ జ్యోతి బుల్లితెర జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరు ప్రముఖ రియాలిటీ షో నాయికా నాయకన్లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ఆ షో ద్వారానే మరింత ఫేమస్ అయ్యారు. రియాలిటీ షోలో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత మాళవిక, తేజస్ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ బుల్లితెర ప్రేమజంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేశారు.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మాళవిక ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీపై పోస్టులు పెడుతూనే ఉంటోంది. బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన భర్తతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. కాగా.. మాళివిక కృష్ణదాస్ మలయాళంలో పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించింది. View this post on Instagram A post shared by Malavika Krishnadas (@malavika_krishnadass) -
నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్లో హీరోయిన్గా చేసిన కేరళ బ్యూటీ అంజు కురియన్ నిశ్చితార్థం చేసుకుంది. రోషన్ జాకబ్ అనే వ్యక్తితో కొత్త జీవితం మొదలుపెట్టేందుకు సిద్ధమైపోయింది. ఇతడి ఇండస్ట్రీకి చెందినవాడేం కాదు. అయితే ఎంగేజ్మెంట్ ఫొటోలతో అందరినీ సర్ప్రైజ్ చేసిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే నెటిజన్లు, నటీనటులు ఈమెకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: స్టార్ హీరోతో నిశ్చితార్థం.. హీరోయిన్ ప్రియాంక మోహన్ ఏమందంటే?)స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తమిళ చిత్రాల్లోనూ నటించింది. 2013లో 'నేరమ్' అనే మలయాళ మూవీతో కెరీర్ మొదలుపెట్టింది. ప్రేమమ్, ఓం శాంతి ఓషానా తదితర సినిమాల్లోనూ సహాయ పాత్రలు పోషించింది. 'కవి ఉద్దేశించతు' అనే మూవీతో హీరోయిన్ అయిపోయింది. 2018లో 'ఇదం జగత్' అనే తెలుగు చిత్రంలోనూ హీరోయిన్గా చేసింది. చివరగా 'అబ్రహం ఓజ్లర్' మూవీలో కనిపించింది.31 ఏళ్ల అంజు కురియన్ ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంది. బహుశా వచ్చే డిసెంబరులో పెళ్లి చేసుకునే అవకాశముంది. మరి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత నటిగా కొనసాగుతుందా? లేదంటే పుల్‌స్టాప్ పెట్టేస్తుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్) View this post on Instagram A post shared by Anju Kurian (Ju) (@anjutk10) -
బెస్ట్ ఫ్రెండ్‌తో పెళ్లి రద్దు.. మరొకరితో నటి ఏడడుగులు
మలయాళ నటి శ్రీ గోపిక గుడ్‌న్యూస్ చెప్పింది. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. వరుణ్దేవ్తో ఏడడుగులు వేశానని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. అందులో నటి ఎంతో సింపుల్‌గా, క్యూట్‌గా ఉంది.జూన్‌లో ఎంగేజ్మెంట్కాగా గోపిక.. గతంలో తన బెస్ట్ ఫ్రెండ్ వైశాఖ్ రవితో పెళ్లికి రెడీ అయింది. వీరిద్దరికీ ఈ ఏడాది జూన్‌లో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం ఇరువురూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. కానీ పెళ్లి చేసుకునేలోపే ఇద్దరూ విడిపోయారు. నిశ్చితార్థం ఫోటోలను సైతం డిలీట్ చేశారు. ఇంతలోనే శ్రీగోపిక పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ జంట కలకాలం కలిసుండాలని కోరుకుంటున్నారు.వైశాఖ్‌తో శ్రీగోపిక ఎంగేజ్మెంట్ ఫోటోసినిమా, సీరియల్స్కాగా శ్రీ గోపిక.. 90 ఎమ్ఎల్ అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. రూల్ నెంబర్ 4, వోల్ఫ్ వంటి తమిళ చిత్రాలతో పాటు నాన్సెన్స్ అనే మలయాళ మూవీలోనూ మెరిసింది. బుల్లితెరపై ఉయిరే సీరియల్‌తో క్రేజ్ తెచ్చుకుంది. చదవండి: Bigg Boss Tamil: ఎలిమినేషన్లో కొత్త ట్విస్ట్ ఇచ్చిన తమిళ బిగ్‌బాస్ -
ఒకప్పుడు బిజీ హీరోయిన్.. నానితో హిట్ సినిమా.. ఇప్పుడేమో సొంత అకాడమీ (ఫొటోలు)
-
పనిమనిషిపై దాడి.. హీరోయిన్‌పై కేసు నమోదు
మలయాళ హీరోయిన్ పార్వతి నాయర్‌పై కేసు నమోదైంది. దొంగతనం నెపంతో తనపై దాడి చేసిందని ఆమె పనిమనిషి సుభాష్ చంద్రబోస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పార్వతితోపాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.అసలేం జరిగిందంటే?సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి కేజేఆర్ స్టూడియోలో హెల్పర్‌గా పని చేసేవాడు. 2022 నుంచి పార్వతి నాయర్ ఇంట్లో పనిమనిషిగా చేరాడు. అదే ఏడాది అక్టోబర్‌లో చెన్నైలోని పార్వతి నాయర్ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, రూ.1.5 లక్షలు విలువైన ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్‌టాప్ చోరీకి గురైంది. తన పనిమనిషి సుభాషే ఈ దొంగతనం చేశాడని పార్వతి ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సుభాష్‌ను అరెస్ట్ చేశారు. తర్వాత కొద్దిరోజులకు అతడిని విడుదల చేశారు.స్టూడియోలో రభసతర్వాత సుభాష్.. తిరిగి కేజేఆర్ స్టూడియోలో పనిలో చేరాడు. అయితే స్టూడియోలోనే ఉన్న పార్వతి తనను కొట్టిందని ఆరోపించాడు. ఆమెతోపాటు ఉన్న మరో నలుగురు వ్యక్తులు తనను తీవ్రంగా దుర్భాషలాడారని చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సైదాపేట్ 19 ఎమ్ఎమ్ కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు పార్వతితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.సినిమా..కాగా మలయాళ కుటుంబానికి చెందిన పార్వతి సొంతభాషలోనే కాకుండా కన్నడ, తమిళ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. పాప్పిన్స్, స్టోరీ కాతే, డి కంపెనీ, యాంగ్రీ బేబీస్ ఇన్ లవ్, ఉత్తమ విలన్, వాస్కోడిగామ, కొడిత్త ఇదంగళై నిరప్పుగ, 83, ధూమం, గోట్.. తదితర చిత్రాల్లో నటించింది.చదవండి: 'దేవర'ఈవెంట్ రద్దుకు కారణం ఇదే.. ఆర్గనైజర్ల వివరణ -
సీనియర్ నటి కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం
మలయాళ ప్రముఖ నటి కవియూర్ పొన్నమ్మ (79) తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఈమె.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి మలయాళ చిత్రాల్లో ఈమె పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇలా ఈమె మృతి చెందడంపై స్టార్ హీరోహీరోయిన్లతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా)'తల్లి పాత్రలతో మలయాళ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న కవియూర్ పొన్నమ్మ మృతి పట్ల ప్రగాఢ సంతాపం. ఆమె జీవితం సినిమాకే పరిమితం కాదు. థియేటర్, టెలివిజన్ రంగాలకు కూడా విస్తరించింది' అని ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.ఇకపోతే పొన్నమ్మ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. కలమస్సేరి మున్సిపల్ టౌన్ హాల్లో ప్రజల సందర్శనార్ధం ఆమె పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. గాయనిగా పొన్నమ్మ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత నాటకరంగంలోకి ప్రవేశించి, అనంతరం నటిగా మారారు. అలా దాదాపు 1000 సినిమాల్లో నటించారు. ఈమె చేసిన తల్లి పాత్రలతో అందరికీ దగ్గరైపోయారు. అలానే విలన్ తరహా పాత్రల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.ప్రతికూల పాత్రలతో సహా విభిన్న పాత్రలను పోషించింది. మేఘతీర్థం చిత్రాన్ని కూడా నిర్మించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) -
ఒక్కటే తెలుగు సినిమా.. హీరోతో ప్రేమ పెళ్లి.. ఈమెని గుర్తుపట్టారా?
ఒక్కటే తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసింది. అది కూడా నాగచైతన్యతో. కానీ ఏం లాభం. బాగుందన్నారు కానీ ఎందుకో ఆ మూవీ సరిగా ఆడలేదు. దీంతో టాలీవుడ్లో లీడ్ రోల్లో మరో సినిమా చేయలేదు. అదే టైంలో తమిళ, మలయాళంలో మాత్రం నటించేసింది. రెండేళ్ల క్రితం తమిళ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు మంజిమ మోహన్. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? 'ఏ మాయ చేశావె' లాంటి హిట్ తర్వాత నాగచైతన్య-గౌతమ్ మేనన్.. 'సాహసం శ్వాసగా సాగిపో' అనే మూవీ చేశారు. రోడ్ జర్నీ స్టోరీతో తీసిన ఈ లవ్ స్టోరీతోనే మంజిమ తెలుగు ప్రేక్షకులకు పరిచయం. కానీ అంతకు ముందే చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో ఫేమస్.(ఇదీ చదవండి: తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్.. అరెస్ట్ ఎప్పుడు?)మలయాళ సినిమాటోగ్రాఫర్ విపిన్ మోహన్ కూతురైన మంజిమ.. 1997-2001 మధ్య పలు మలయాళ చిత్రాల్లో బాలనటిగా చేసింది. పెద్దయిన తర్వాత పిల్లల షోకు హోస్ట్‌గా చేసి బోలెడంత క్రేజ్ సొంతం చేసుకుంది. అలా హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది.తెలుగులో హీరోయిన్ గా చేసిన మూవీ 'సాహసం శ్వాసగా సాగిపో'. ఎన్టీఆర్ బయోపిక్ 'కథానాయకుడు', 'మహానాయకుడు' సినిమాల్లో భువనేశ్వరి పాత్ర పోషించింది. 'బూ' అనే హారర్ మూవీ కూడా చేసింది. కాకపోతే వీటిలో అతిథి పాత్రలే. వ్యక్తిగత విషయానికొస్తే తమిళ హీరో గౌతమ్ కార్తిక్‌తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న మంజిమ.. 2022లో అతడిని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి సినిమాలకు దూరమైపోయింది.(ఇదీ చదవండి: Bigg Boss 8: టాస్క్‌ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?) -
తమిళ డైరెక్టర్ నా జీవితంతో ఆడుకున్నాడు: మలయాళ నటి
ఓ తమిళ డైరెక్టర్ తనను కీలుబొమ్మలా వాడుకున్నాడంటోంది మలయాళ నటి సౌమ్య. 18 ఏళ్ల వయసులో అతడు చేసిన పాడుపని, వేధింపుల వల్ల నరకయాతన అనుభవించానంటోంది. ఇప్పటికైనా తన పేరును పోలీసుల ముందు బయటపెడతానని చెప్తోంది.18 ఏళ్ల వయసులో..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌమ్య మాట్లాడుతూ.. 18 ఏళ్ల వయసులో కాలేజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒక తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పుడు నా పేరెంట్స్‌కు సినిమాల గురించి పెద్దగా ఏమీ తెలియదు. అయితే నటి రేవతి మా ఇంటికి దగ్గర్లోనే ఉండేది. తనను చూసి నేను కూడా ఊహల ప్రపంచంలో తేలిపోయాను. ఆ ఆఫర్‌కు ఓకే చెప్తూ స్క్రీన్ టెస్ట్‌కు వెళ్లాను. అప్పుడు నాది చిన్నవయసు కావడంతో నాకంత తెలిసేది కాదు.ఆమెకు బదులుగా అతడు..కానీ ఆ సినిమా డైరెక్టర్‌ను కలిసిన ఫస్ట్ మీటింగ్‌లోనే నాకు ఇబ్బందిగా అనిపించింది. ఈ విషయం ఇంట్లో చెప్పాను. అప్పటికే అతడు మా నాన్నను కలిసి స్క్రీన్ టెస్ట్ కోసం ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేశామంటూ ఒప్పించాడు. తనతో అవుట్డోర్ షూట్‌కు తొలిసారి వెళ్లినప్పుడు అతడేమీ నాతో మాట్లాడలేదు. నిజానికి ఆ సినిమాకు అతడి భార్య దర్శకురాలు అని అగ్రిమెంట్ పేపర్లో రాసుంది. కానీ రియాలిటీలో మాత్రం ఆమెకు బదులుగా అతడే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అతడి భార్య లేని సమయంలో..తను నన్ను కోపంగా చూస్తూనే కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఒకరోజు ఆ దంపతులు వారి ఇంటికి తీసికెళ్లారు. (వారికి ఓ కూతురు ఉండేది కానీ తండ్రి అత్యాచారం చేశాడంటూ ఇంటి నుంచి పారిపోయింది) సడన్‌గా నన్ను కూతురిలా భావిస్తూ నాతో చాలా మంచిగా ఉన్నారు. రుచికరమైన భోజనం పెడుతూ బాగా చూసుకున్నారు. ఓ రోజు ఆ డైరెక్టర్ అతడి భార్య లేని సమయంలో నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టాడు.బలవంతంగా..ఒక్కసారిగా షాకయ్యాను. నేనే ఏదైనా తప్పు చేశానా? అని భయపడిపోయాను. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. అయినా రిహార్సల్స్ కోసం ప్రతిరోజు అక్కడికి వెళ్లేదాన్ని. అలా అతడు నెమ్మదిగా నన్ను అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు. ఓ రోజయితే బలవంతంగా నాపై అత్యాచారం చేశాడు. ఇలా చాలాసార్లు నన్నొక బానిసగా చూశాడు.నాతో బిడ్డను కంటానని..నన్ను కూతురిగా పిలుస్తూనే నాతో బిడ్డను కంటానని చెప్పేవాడు. నాతో ఆడుకున్నాడు అని చెప్తూ ఎమోషనలైంది. ఇదంతా నిస్సిగ్గుగా బయటకు చెప్పడానికి 30 ఏళ్లు పట్టిందని, కచ్చితంగా అతడి పేరు పోలీసులకు వెల్లడిస్తానంది. అలాగే తనను వేధించిన ఓ నటుడి పేరు హేమ కమిటీ రిపోర్టులో ఉందని పేర్కొంది. చదవండి: హత్యకు ముందు రేణుకాస్వామి పరిస్థితి.. ఫోటోలు వైరల్ -
సీన్‌కి అనవసరమైనప్పటికీ నన్ను తాకాడు: మలయాళ నటి మాలా పార్వతి
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమా కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు మలయాళ సినీ ప్రముఖులపై కేసులు నమోదు అయ్యాయి. అలాగే పలువురు నటీమణులు తమకు ఎదురైన ఇబ్బందుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. తాజాగా మలయాళ నటి మాలా పార్వతి స్పందించారు. ‘‘2010లో నేనొక సినిమా చేశాను. సినిమాలో నా కూతురు న్యాన్సీ (నిత్యామీనన్) నా చుట్టూ తిరుగుతూ సరదాగా ఆడుకునే సీన్ అది. ఆ సమయంలో నా భర్త పాత్రధారి న్యాన్సీని ఆ΄్యాయంగా టచ్ చేయాలి. అయితే ఆ వ్యక్తి ఓ చేత్తో న్యాన్సీని టచ్ చేసి, మరో చేత్తో అన వసరం అయినప్పటికీ నన్ను బలంగా తాకాడు. నాకు నొప్పిగా అనిపించింది.ఆ తర్వాత దర్శకుడు శిబీ మలైయిల్ టచ్ లేకుండా ఈ సీన్‌ని రీ టేక్ చేశారు. కానీ అదే వ్యక్తితో ఒకరి పక్కన మరొకరు కూర్చోవడం, హత్తుకోవడం వంటి సన్నివేశాలు ఉన్నాయి. చె΄్పాలంటే నాకు ఆ సినిమా ఓ టార్చర్లా అనిపించింది. నాకు కంఫర్ట్‌గా అనిపించక΄ోవడంతో ఆ సినిమాలో నేను సరిగ్గా నటించలేకపోయాను కూడా. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడ్డాను’’ అని ఓ ఆంగ్ల మీడియాతో మాలా పార్వతి చె΄్పారు. అలాగే ఆమె జీవితంలోని మరో ఘటనను కూడా పంచుకున్నారు. ఆ ఘటన గురించి మాట్లాడుతూ– ‘‘2019లో ‘హ్యాపీ సర్దార్’ అనే సినిమా చేశాను. నా కోసం నేను నా ఖర్చుతో క్యారవేన్ పెట్టుకున్నాను. అయితే క్యారవేన్కు నేనెలా అర్హురాలినంటూ ఓ సీనియర్ నటుడు నన్ను ప్రశ్నించాడు. నా సొంత ఖర్చులతో నేను పెట్టుకున్నానని చెప్పినా అతని వైఖరి మారలేదు. నా క్యారవేన్ను కొందరు నటీమణులు కూడా వినియోగించుకున్నారు. అయితే ఓ రోజు నా క్యారవేన్ దగ్గర రాత్రివేళ అనుకోని ఘటనలు జరుగుతున్నాయని నాకో ఫోన్‌కాల్ వచ్చింది. నేను హడావిడిగా వెళ్లాను. నా క్యారవేన్ కనిపించలేదు. దగ్గర్లో ఓ చెట్టు కింద పార్క్ చేసి ఉందని గమనించాను. నేను అక్కడికి వెళ్తుంటే ఇద్దరు బౌన్సర్స్ నన్ను చూసి పారి΄ోయారు. అక్కడే ఉన్న అమ్మాయిలను నేను తీసుకువచ్చాను. ఈ భయంకరమైన ఘటన గురించి ఓ సీనియర్ మలయాళ నటుడికి ఫిర్యాదు చేస్తే... ‘‘నువ్వు సామాజిక కార్యకర్తలా వచ్చావా? లేక నటించడానికి వచ్చావా? అని ప్రశ్నించాడు. ఇలాంటివారి వల్లే సినిమాల్లో మహిళలకు భద్రత లేకుండాపోయిందని చాలా బాధ కలిగింది.‘హ్యాపీ సర్దార్’ సినిమా నా నట జీవితాన్ని మార్చేసింది. నా గొంతును న్యాయం కోసం వినిపించినందు వల్లే నాకు అవకాశాలు తగ్గి΄ోయాయి’’ అన్నారు మాలా పార్వతి. ఇదిలా ఉంటే... 2010లో మాలా పార్వతి చేసిన చిత్రాల్లో ‘అపూర్వ రాగం’లో నిత్యా మీనన్ ఆమె కూతురి పాత్ర చేశారు. సో... ఈ సినిమాలో నటించిన ఓ నటుడి గురించే ఆమె పేర్కొని ఉంటారని ఊహించవచ్చు. ఇక ప్రస్తుత పరిణామాల రీత్యా ఇప్పటికే ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అధినేత మోహన్‌లాల్‌తో పాటు ΄్యానల్ సభ్యులందరూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
ఇదో పిరికి చర్య: రాజీనామాలపై తంగలాన్ నటి
హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు డైరెక్టర్స్, నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. ఇప్పటికే కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు అధ్యక్షుడు మోహన్‌లాల్‌తో సహా 17 మంది సభ్యులు రాజీనామా చేశారు. తాజాగా తన సభ్యత్వానికి రాజీనామా చేయడంపై తంగలాన్ నటి పార్వతి తిరువోతు రియాక్ట్ అయ్యారు.అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ మూకుమ్మడి రాజీనామా చేయడంపై నటి పార్వతి తిరువోతు తీవ్రంగా మండిపడ్డారు. ఇది పిరికిపంద చర్యలా ఉందని తెలిపారు. ఫిల్మ్ అసోసియేషన్‌లో నిరంకుశ పాలన నడుస్తోందని ఆరోపించింది. అయితే తమకు మాట్లాడే అవకాశం లేకపోవడంతో సంతోషంగా అసోసియేషన్‌కు రాజీనామా చేశానని పార్వతి తెలిపారు. మీడియాతో మాట్లాడే బాధ్యత నుంచి తప్పుకోవడం పిరికితనంగా అనిపించిందని పేర్కొన్నారు.ఈ విషయంలో కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పార్వతి తిరువోతు ఆరోపించారు. మహిళలు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి పేర్లతో రావాలని లాంటి ప్రకటనలు చేయడం చూస్తుంటే వారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. పేర్లు చెప్పడం ముఖ్యమా? ఆ మహిళకు న్యాయం జరగడమా? అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. -
ప్రముఖ నటుడు లిఫ్ట్‌లో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు: నటి
మలయాళ సినిమా ఇండస్ట్రీలో మహిళలను దారుణంగా వేధిస్తున్నారని జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదికను బయటపెట్టడం సంచలనంగా మారింది. లేడీ ఆర్టిస్టులను అడ్జస్ట్మెంట్ అడుగుతున్నారని పేర్కొంది. ఈ క్రమంలో మలయాళ నటి ఉష తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. 1992లో మోహన్‌లాల్‌తో కలిసి సినిమా చేస్తున్న రోజులవి.. టీమ్ అంతా కలిసి బహ్రెయిన్ వెళ్లాం. అక్కడ ఓ షో పూర్తవగానే అందరం తిరుగుప్రయాణానికి రెడీ అయ్యాం. లిఫ్ట్‌లో నాతో అసభ్యంగా..మోహన్‌లాల్ మా సామాన్లు తెచ్చేసుకోమని చెప్పాడు. నేను గదిలోని నా సామాను సర్దేసుకుని లిఫ్ట్ ఎక్కాను. అప్పటికే అందులో ఓ సీనియర్ నటుడు ఉన్నాడు. లిఫ్ట్ తలుపులు మూసుకోగానే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే కోపంతో చెంప చెళ్లుమనిపించాను. మలయాళ చిత్రపరిశ్రమలో అందరూ ఎంతగానో అభిమానించే ఆ నటుడు ఇలా చీప్‌గా ప్రవర్తిస్తాడని అస్సలు ఊహించలేదు. ఈ మాట మోహన్‌లాల్‌కు చెప్తే మంచి పని చేశావన్నాడు.ఛాన్సులు తగ్గిపోయాయి..కానీ అందరూ నాకు పొగరు అని ముద్ర వేశారు. ఈ సంఘటన తర్వాత అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడా పెద్ద మనిషి బతికి లేడు కాబట్టి తన పేరు చెప్పదల్చుకోలేదు. మరి ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నారంటారేమో.. ఈ విషయం నేను గతంలో చెప్పాను. అందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతుండటంతో మరోసారి చెప్తున్నాను అని ఉష పేర్కొంది.చదవండి: ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదు.. పెదవి విప్పండి: ఖుష్బూ -
పెళ్లి గురించి ప్రశ్నించిన నెటిజన్.. హీరోయిన్ అదిరిపోయే రిప్లై!
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం తంగలాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చియన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ గతంలో ఎప్పుడు చూడని లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఇవాళ హీరోయిన్ మాళవిక మోహనన్ ఎక్స్ వేదికగా అభిమానులతో ఆస్క్ మాళవిక అనే సెషన్ నిర్వహించారు. ఇందులో చాలామంది ఫ్యాన్స్ ఆమెను ప్రశ్నించారు. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు వేశారు. ఓ నెటిజన్ ఏకంగా మాళవిక పెళ్లి గురించి ఆరా తీశారు. మీరెప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? అంటూ పోస్ట్ చేశారు. దీనిపై మాళవిక స్పందిస్తూ.. నా పెళ్లి చూడాలనే తొందర ఎందుకు? అంటూ గట్టిగానే రిప్లై ఇచ్చేసింది. మరికొందరు తంగలాన్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా.. తంగలాన్ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. అ Why you in a rush to see me married? :( https://t.co/epaOAhywvs— Malavika Mohanan (@MalavikaM_) July 31, 2024 -
చావే దిక్కనుకున్నా.. కూతురి కోసం ఆగిపోయా: లేడీ కమెడియన్
ఆర్య.. లేడీ కమెడియన్. బడాయి బంగ్లా అనే కామెడీ షోతో తన పేరు కాస్తా ఆర్య బడాయిగా మారిపోయింది. నటిగా, హాస్య నటిగా, యాంకర్‌గా, జడ్జిగా ఇలా వివిధ పాత్రలు పోషించే ఆమె సినిమాలు, రియాలిటీ షోలతో ఫుల్ బిజీగా ఉంది. అందరినీ కడుపుబ్బా నవ్వించే ఆర్య జీవితంలో మాత్రం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. 2008లో ఐటీ ఇంజనీర్ రోహిత్ సుశీలన్ (నటి అర్చన సుశీలన్ సోదరుడు)ను పెళ్లాడగా వీరికి రోయ అనే కూతురు పుట్టింది. కూతురి పేరు మీద ఓ బొటిక్ కూడా ఓపెన్ చేసింది. అయితే ఏమైందో ఏమో కానీ 2019లో భర్తతో విడిపోయి కూతురితో ఒంటరిగా నివసిస్తోంది.బిగ్‌బాస్ తర్వాత డిప్రెషన్తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాధను బయటపెట్టింది. బిగ్‌బాస్ నుంచి వచ్చాక డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడలేకపోయాను. చనిపోయేందుకు ప్రయత్నించాను. నిద్రమాత్రలు తీసుకున్నాను. కానీ నా కూతురిని చూసి ఆగిపోయాను. తనే నన్ను ఆ బాధలో నుంచి బయటపడేసింది. ఎప్పుడైనా సరే మనకు తట్టుకోలేనంత బాధ అనిపిస్తే దాన్నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తాం. చావు ఒక్కటే మార్గం అనుకుంటాం. మరణమే మార్గమనుకున్నాలాక్డౌన్లో నాకూ అలాంటి పరిస్థితే ఎదురైంది. మాట్లాడేందుకు కూడా ఎవరూ లేరు. చావే సరైన నిర్ణయమనుకున్నాను. కానీ నా కూతురు.. తన పరిస్థితి ఏం కావాలి? తనను చూసుకోవడానికి మా నాన్న కూడా లేరు. ఆయన ఉండుంటే కూతుర్ని ఆయన చూసుకుంటాడన్న ధీమాతో ఎప్పుడో ప్రాణాలు వదిలేసేదాన్ని. నేను, అమ్మ, వదిన, పాప.. వాళ్లకంటూ ఉన్నది నేనేగా! అందరినీ వదిలేసిపోతే వాళ్లుం ఏం చేస్తారు? నా కూతురు జీవితం ఏమైపోతుంది? పాపను తన తండ్రి బాగానే చూసుకుంటాడు.కూతురి కోసం ఆలోచించి ఆగిపోయాకానీ చుట్టూ ఉన్న సమాజం ప్రేమలో ఓడిపోయి మీ అమ్మ బలవన్మరణానికి పాల్పడిందంటూ కాకుల్లా పొడిచి మరీ చెప్తారు. అవన్నీ ఆలోచించి ఆగిపోయాను. నా కుటుంబంతో, ఫ్రెండ్స్‌తో మాట్లాడాను. మళ్లీ సరైన దారిలోకి వచ్చాను. పెళ్లి విఫలమవడాన్ని భరించాను, తర్వాత బ్రేకప్ బాధనూ తట్టుకున్నాను, ఆఖరికి నాన్న మరణాన్ని సైతం తట్టుకుని నిలబడ్డాను. అందుకే అందరూ నన్ను బోల్డ్ అని పిలుస్తుంటారు. కానీ నేను చాలా ఎమోషనల్.. అని ఆర్య చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Arya Babu (@arya.badai) చదవండి: నటుడి ఇంట మొన్న విషాదం.. అంతలోనే సంతోషం.. -
హీరో భార్యనని చెప్పారు.. అంతా అతని వల్లే: నటి
మలయాళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్య. తనదైన నటనతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే నటిగా ఎంత ఫేమస్ అయిందో.. అంతే వేగంగా రూమర్స్‌తో వార్తల్లోనూ నిలిచింది. తాను ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు స్టార్ హీరోను పెళ్లి చేసుకున్నానంటూ ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది. తాను తమిళ నటుడు మాధవన్ భార్యనని ప్రచారం జరిగిందని తెలిపింది. కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ అవార్డు వేదికలో నటుడు మాధవన్‌తో కలిసి ఈ విషయాన్ని వెల్లడించింది. కావ్య మాధవన్ మాట్లాడూతూ..'హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన టైంలో ఓ సినిమా షూటింగ్ కోసం ఊటీ వెళ్లా. నా అసలు పేరు కావ్య మాధవన్. అక్కడి ప్రజలకు నేనంతగా తెలియదు. కానీ నేను మొదటిసారిగా తమిళనాడుకు వచ్చా. అయినా అక్కడ ప్రజలు నన్ను అదేపనిగా చూస్తూనే ఉన్నారు. నన్ను చూసేందుకు ఇంతమంది ఎందుకు వస్తున్నారో నాకు మొదట్లో అర్థం కాలేదు. దానికి కారణం ఆ సినిమా హీరో జయసూర్యనే. తాను మాధవన్ భార్యనని అక్కడున్న వారందరికీ అతనే చెప్పాడంటా. దీంతో అందరూ నన్ను చూసేందుకు తరలివచ్చారని' తెలిపింది. తనపేరులో మాధవన్ అని ఉండడంతో అందరూ నిజంగానే ఆయన భార్యనే అనుకున్నారని కావ్య వెల్లడించింది. -
ఎలాంటి సందేశం ఇస్తున్నారు?.. అమలాపాల్‌పై విమర్శలు!
మలయాళ బ్యూటీ అమలాపాల్ తెలుగువారికి కూడా సుపరిచితమే. ఇద్దరమ్మాయిలతో మూవీలో అమాయకమైన అమ్మాయిగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలే తల్లైన ఈ ముద్దుగుమ్మ మలయాళ చిత్రం లెవెల్ క్రాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది. అందులో భాగంగా కేరళలోని ఎర్నాకులంలో ఓ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్‌కు హాజరైంది. అయితే ఈ కార్యక్రమంలో అమలాపాల్ ధరించిన డ్రెస్‌పై నెట్టింట చర్చ నడుస్తోంది.అలాంటి డ్రెస్‌లో కాలేజీ ఈవెంట్‌కు రావడం అసభ్యకరంగా ఉందంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. పొట్టి దుస్తులతో కనిపించి విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల్లో నిర్వహించే ఈవెంట్లకు వెళ్లేటప్పుడు మినిమం సెన్స్ ఉండాలంటూ అమలాపాల్‌ను విమర్శిస్తున్నారు. అయితే తన డ్రెస్‌పై వస్తున్న విమర్శలపై అమలాపాల్ తాజాగా స్పందించింది. ఆ డ్రెస్‌లో తాను సౌకర్యంగానే ఉన్నానని తెలిపింది. అలాంటి డ్రెస్‌లో ఈవెంట్‌కు వెళ్లడం తప్పుగా అనిపించలేదని.. అయితే ఇక్కడ నా ఫోటోలు ఎలా తీశారనేదే అసలు సమస్య అని అన్నారు. ఆ దుస్తుల్లో నన్ను చూడటం వల్ల విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడలేదని అమలాపాల్ స్పష్టం చేసింది. అంతే కాదు.. నేను అన్నిరకాల దుస్తులు ధరిస్తానని తెలిపింది. డ్రెస్ ఎంపిక విషయంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే అలా కనిపించానని చెప్పుకొచ్చింది. కాగా.. గత నెలలోనే అమలాపాల్ మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను ఆమె పెళ్లాడింది. ఈ ఏడాది మార్చిలో గర్భం ధరించినట్లు ప్రకటించింది. ఆమె నటించిన లెవెల్ క్రాస్ చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
నటికి సర్జరీ? ట్రాన్స్‌జెండర్‌లా ఉందంటూ ట్రోల్స్
సాంప్రదాయమైన దుస్తులు మాత్రమే ధరించే సెలబ్రిటీలు అరుదుగా కనిపిస్తారు. దాదాపు అందరు సినీతారలు మోడ్రన్, గ్లామర్‌గా కనిపించడానికే ఓటేస్తున్నారు. ఆఫర్లు రావాలంటే అందాల ప్రదర్శన తప్పనిసరి అన్నట్లుగా మారింది. మలయాళ బ్యూటీ సానియా ఇయప్పన్ కూడా ఇదే నమ్మింది. కొన్నిసార్లు చీర కడుతూనే ఎక్కువ సార్లు మోడ్రన్ దుస్తుల్లో కనువిందు చేస్తోంది.ఇలా అయిపోయిందేంటి?ఈ మధ్యే ఓ మాగజైన్ కోసం ఫోటోషూట్ చేసింది. ఇది చూసిన కొందరు నటి సర్జరీ చేయించుకుందని విమర్శిస్తున్నారు. తన ముఖమేంటి మగవాడిలా కనిపిస్తోంది? సడన్‌గా చూసి ట్రాన్స్‌జెండర్ అనుకున్నాను. ఆమెకు ఆ హెయిర్ స్టైల్ అస్సలు సెట్టవ్వలేదు. తన ముక్కు, పెదాలకు ఏదో సర్జరీ చేయించుకున్నట్లుగా ఉంది.. దీనివల్ల ఆమె సహజ అందం కోల్పోయింది అని కామెంట్లు చేస్తున్నారు.అలాగైతే హాలీవుడ్‌కు వెళ్లేదాన్నిఇలా తనను ట్రోల్ చేయడం ఇది కొత్తేం కాదు. సానియా పొట్టి బట్టలు, కురచ దుస్తులు ధరించిన ప్రతిసారి నెటిజన్లు ఇలానే ట్రోల్ చేస్తుంటారు. అయితే ఈ నెగెటివ్ కామెంట్లను అస్సలు లెక్క చేయనని, తన జీవితం తన ఇష్టమని, తనకు నచ్చినట్లుగానే బతుకుతానని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.డ్యాన్సర్ నుంచి నటిగాకాగా సానియా ఇయప్పన్.. చిన్న వయసులోనే బుల్లితెరపై మెరిసింది. 2014లో వచ్చిన సూపర్ డ్యాన్సర్ అనే రియాలిటీ షోలో పాల్గొని విన్నర్‌గా నిలిచింది. D ఫర్ డ్యాన్స్: రెండో సీజన్లో సెకండ్ రన్నరప్‌గా సరిపెట్టుకుంది. చిన్న వయసులో డ్యాన్స్ స్టెప్పులతో మైమరిపించిన సానియా మలయాళ క్వీన్ మూవీతో హీరోయిన్గా మారింది. లూసిఫర్, ప్రేతమ్ 2, కృష్ణకుట్టి పని తుడంగి, సెల్యూట్, సాటర్డే నైట్ వంటి మలయాళ చిత్రాల్లో మెరిసింది. View this post on Instagram A post shared by 𝐕𝐀𝐍𝐈𝐓𝐇𝐀 (@vanithamagazine) చదవండి: రాజమౌళి ఓ పిచ్చోడు.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
కట్నం ఇచ్చి మరీ పెళ్లి.. అతడు డబ్బు తీసుకుని వెళ్లిపోతే?: హీరోయిన్
ఈ రోజుల్లో వైవాహిక బంధం మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతోంది. పెళ్లి ఆల్బమ్ వచ్చేలోపే విడాకులంటున్నారు. దశాబ్దాలు కలిసున్న జంటలు సైతం విడిపోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ ధోరణి సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే హీరోయిన్ భామ కూడా విడాకులు తీసుకుందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. భర్తతో కలిసున్న ఫోటోలు డిలీట్ చేయడం, తాను సింగిల్ మదర్‌నని ప్రకటించడంతో విడాకులు నిజమేనని అంతా ఫిక్సయ్యారు.కట్నం ఇచ్చి మరీ పెళ్లితాజాగా ఈ నటి పెళ్లి గురించి ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. అమ్మాయిలు పెళ్లెందుకు చేసుకోవాలి? తన దగ్గరున్న డబ్బు కట్నంగా ఇచ్చి మరీ పెళ్లి చేసుకోవాలా? అవసరమే లేదు. పెళ్లయ్యాక ఆ భర్త మనల్ని వదిలేస్తే? మన డబ్బుతో వాళ్లు సుఖంగా బతుకుతారు. కానీ మనం మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తాం. అసలు మన జీవితంలోకి వచ్చేవాళ్లతో మనం ఎలా మసులుకోవాలనేది తెలుసుకునేలోపే అంతా అయిపోతుంది అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.పెళ్లితో సినిమాలకు దూరంకాగా భామ, అర్జున్ 2020 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత భామ సినిమాలకు గుడ్‌బై చెప్పింది. వీరికి గౌరి అనే కూతురు పుట్టింది. దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భామ తన కూతురే ప్రపంచంగా బతుకుతోంది. నివేద్యం చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన భామ మలయాళ, కన్నడ, తమిళ చిత్రాల్లో యాక్ట్ చేసింది. తెలుగులో మంచివాడు అనే ఒకే ఒక్క సినిమాలో కనిపించింది.చదవండి: Nawazuddin Siddiqui: సౌత్ సినిమాలు అందుకే చేస్తున్నా.. -
ప్రియుడితో పెళ్లి.. అనుకున్నది సాధించానంటున్న హీరోయిన్
మలయాళ హీరోయిన్ పుణ్య ఎలిజబెత్ గుడ్‌న్యూస్ చెప్పింది. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. టోబి కోయిపల్లి అనే వ్యక్తిని పెళ్లాడినట్లు తెలిపింది. ఈ మేరకు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది. 'నాకు 30 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకున్న నా ప్రియుడు గతవారమే పెళ్లి ముహూర్తం పెట్టేశాడు. అలా మేమిద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యాక ఈరోజు 30వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను' అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు పుణ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ పెళ్లి కోసం ఫ్యామిలీ అంతా కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతా కలిసి ఈ మ్యారేజ్ వేడుకలను రెట్టింపు సంతోషంతో ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ బ్యూటీ 2018లో తోబమ అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టింది. గౌతమంటే రాధం అనే మాలీవుడ్ సినిమాలోనూ కథానాయికగా మెరిసింది. మార, గెట్ సెట్ బేబీ, లియో వంటి తమిళ చిత్రాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Punya Elizabeth (@punya_elizabeth) View this post on Instagram A post shared by Magic Motion Media | Photography & Films (@magicmotionmedia) View this post on Instagram A post shared by Punya Elizabeth (@punya_elizabeth) View this post on Instagram A post shared by Punya Elizabeth (@punya_elizabeth) చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే? -
Namitha Pramod: క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న మలయాళ బ్యూటీ (ఫోటోలు)
-
మలయాళ నటి దేవి నంద ట్రెడిషనల్ లుక్స్ (ఫోటోలు)
-
కొత్త కారు కొన్న హీరోయిన్.. భర్తతో విడిపోయిందా?
కన్నడ హీరో దర్శన్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో గజ ఒకటి. ఈ మూవీ హీరోయిన్ నవ్య నాయర్ అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. ఈమె అసలు పేరు ధన్య వీణ. కానీ సినిమాల్లోకి వచ్చేవారికి ఈ పేరేం బాగుంటుందని దర్శకుడు శిబి మలయిళ్ తనకు నవ్య నాయర్ అని నామకరణం చేశాడు. ఈ హీరోయిన్ మలయాళంలో ఎక్కువ సినిమాలు చేసి అక్కడే స్థిరపడిపోయింది. కొత్త కారుకన్నడలో దృశ్యం 1, 2 చిత్రాల్లోనూ నటించింది. తాజాగా ఈమె కొత్త కారు కొనుక్కుంది. బీఎమ్‌డబ్ల్యూ కారు కొన్న ఆమె అందుకోసం రూ.1.3 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ కారు ముందు కుమారుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే యూట్యూబ్‌లో వ్లాగ్ పెట్టింది. ఈ ఫోటోలు, వీడియోలలో ఎక్కడా ఆమె భర్త కనిపించలేదు. ఇది చూసిన జనాలు నీ భర్త ఎక్కడంటూ నటిని నిలదీస్తున్నారు. అదేంటి? నువ్వు సింగిల్ మదర్వా? నీ భర్తతో కలిసున్నావా? లేక విడిపోయావా? అని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మరి దీనికి నవ్య ఏమని సమాధానమిస్తుందో చూడాలి!పాత చీరల బిజినెస్నవ్యకు 2010లో బిజినెస్మెన్ సంతోష్ మీనన్‌తో పెళ్లయింది. వివాహం తర్వాత సినిమాలు తగ్గించేసిన ఆమె కేరళ నుంచి ముంబైకి షిఫ్ట్ అయింది. కరోనా, లాక్డౌన్ పరిణామాల తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఆ మధ్య చీరల బిజినెస్ కూడా ప్రారంభించింది. తను వాడిన చీరలను అమ్ముతూ సొమ్ము చేసుకుంటోంది. అటు డ్యాన్స్ క్లాసుల ద్వారానూ సంపాదిస్తోంది. View this post on Instagram A post shared by Navya Nair (@navyanair143) View this post on Instagram A post shared by Navya Nair (@navyanair143) చదవండి: కత్రినా లేకుండానే ఫంక్షన్‌కు.. నటితో హీరో స్టెప్పులు.. -
ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఇంతకీ ఆమె ఎవరు?
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న కల్కి 2898 ఏడీ చిత్రం మరో వారంలో థియేటర్లకు రానుంది. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇటీవల ముంబయిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్‌తో పాటు రానా కూడా పాల్గొన్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సైన్స్ ఫిక్షన్ మూవీగా భారీ బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.అయితే గత కొద్ది రోజులుగా మూవీ ప్రమోషన్స్‌లో మేకర్స్ కొత్త పంథాను ఫాలో అవుతున్నారు. ఇటీవల దిశా పటానీ బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. తాజాగా మరో నటిని కూడా పరిచయం చేశారు. కల్కిలో కీలక పాత్ర పోషించిన అన్నా బెన్ను మేకర్స్ పరిచయం చేశారు. ఈ చిత్రంలో ఆమె కైరా పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఇంతకీ ఆమె ఎవరంటూ నెటిజన్స్ వెతకడం మొదలు పెట్టారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందాం.కేరళలోని కొచ్చికి చెందిన అన్నాబెన్ కల్కిలో కీలక పాత్రలో కనిపించనుంది. మలయాళంలో కుంబలంగి నైట్స్ అనే సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. అంతే కాకుండా ఉత్తమ నటిగా సహా పలు అవార్డులు అందుకున్నారు. మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన ఆమె కల్కితో టాలీవుడ్ అభిమానులను పలకరించనున్నారు. కాగా.. కల్కి చిత్రంలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, శోభన లాంటి అగ్రతారలు నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. -
నా జుట్టు నా ఇష్టం.. మీకేంటి సమస్య?: జై భీమ్ నటి
ఈరోజుల్లో సెలబ్రిటీలు ఏం చేసినా తప్పయిపోతోంది. నచ్చిన డ్రెస్ వేసుకున్నా, హెయిర్ కట్ చేసుకున్నా, ఏదైనా కొత్తగా ట్రై చేసినా.. జనాలకు నచ్చలేదంటే చాలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జై భీమ్ నటి లిజొమోల్ జోస్‌ను ఇలాగే విమర్శించారట.లిజొమోల్ జోస్దాని గురించి ఆమె మాట్లాడుతూ.. ఈ మధ్యే నేను నా హెయిర్ కట్ చేసుకున్నాను. అది నా ఇష్టం. కానీ అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. కొందరైతే నీ జుట్టు ఎందుకు కత్తిరించుకున్నావు? అని ప్రశ్నిస్తున్నారు. చిన్నగా ఉంటే బాగుంటుందనిపించింది, కట్ చేసుకున్నాను. దాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది.శృతి రామచంద్రన్అదే ఇంటర్వ్యూలో ఉన్న నటి శృతి రామచంద్రన్ మాట్లాడుతూ.. జనాలతో ఇదే సమస్య.. నేను, మా ఆయన కనిపిస్తే చాలు, మీకు పిల్లలెందుకు లేరు? అని అడుగుతారు. వాళ్ల జీవితాల గురించి వాళ్లు ఎంత ఆలోచిస్తారో తెలీదు కానీ పక్కవారి గురించి మాత్రం మరీ ఎక్కువ ఆలోచిస్తారు అని చెప్పుకొచ్చింది. కాగా శృతి రామచంద్రన్.. తెలుగులో డియర్ కామ్రేడ్ మూవీలో యాక్ట్ చేసింది. -
లవ్ మ్యారేజ్.. పిల్లలెప్పుడని ఒత్తిడి తెచ్చారు.. ఎనిమిదేళ్లకు..
పెళ్లయిన ప్రతి జంటకు ఎదురయ్యే ప్రశ్న.. ఏదైనా విశేషముందా? ఈ మాట వినీవినీ విసుగెత్తిపోయే జంటలెన్నో! కొందరు దంపతులు తమ ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకుంటారు. మరికొందరికేమో ప్రెగ్నెన్సీ వచ్చినా అది నిలవదు.. మిస్క్యారేజీ(గర్భస్రావం) అవుతుంటుంది. మలయాళ బుల్లితెర నటి సెంథిల్ శ్రీజకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.ప్రెగ్నెన్సీ నిలవలేదుపదవ పెళ్లి రోజు సందర్భంగా శ్రీజ భర్త సెంథిల్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. తనకు రెండు మూడుసార్లు గర్భస్రావమైంది. మేము ఏ విషయమైనా ఇంట్లోవాళ్లతో షేర్ చేసుకుంటాం. అలా ప్రెగ్నెన్సీ గురించి చెప్పి వాళ్లు సంతోషించేలోపే మిస్క్యారేజ్ అయిందని చెప్పేవాళ్లం. పిల్లల కోసం ఎంత ఎదురుచూశామో! మా కలలు నీరుగారిపోయిన సమయంలో తను మరోసారి ప్రెగ్నెంట్ అయింది. అంతకుముందు కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ నిలవలేదు కాబట్టి అప్పుడు దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.ఈసారి కూడా..ఒకవేళ ఈసారి కూడా గర్భం నిలవకపోతే పిల్లలు లేరని బాధపడకూడదని శ్రీజ నాతో అంది. కానీ మా కన్నా ముందు చుట్టుపక్కల వారి బాధ భరించలేకపోయాం. ఎప్పుడూ దాని గురించే అడుగుతూ ఒత్తిడికి గురి చేసేవారు. మా అదృష్టం కొద్దీ ఆ ప్రెగ్నెన్సీ నిలబడి దేవ్ జన్మించాడు. పెళ్లైన కొత్తలో మా ఇద్దరికీ కొంత కన్ఫ్యూజన్ ఉండేది. పెళ్లికి ముందు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. కానీ వివాహం తర్వాత మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం కొంత తగ్గిపోయింది. కొంతకాలం తర్వాత మళ్లీ మంచి స్నేహితులుగా మారిపోయాం. ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటున్నాం. మొదటి మూడేళ్లు..లవ్ మ్యారేజ్ అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లయినా సరే.. మొదటి మూడేళ్లు ఎలాగోలా మ్యానేజ్ చేసుకుంటే తర్వాత జీవితమంతా సాఫీగా ఉంటుంది. మేము ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉండేవాళ్లం. బాబు పుట్టాక పోట్లాడుకునేంత తీరిక దొరకడం లేదు అని చెప్పుకొచ్చాడు. సెంథిల్, శ్రీజ.. సూపర్ హిట్ తమిళ సీరియల్ 'శరవణన్ మీనాక్షి'లో కలిసి నటించారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023లో దేవ్ అనే కుమారుడు జన్మించాడు.చదవండి: 12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో.. -
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ అంటూ అసభ్యంగా రాశారు: హీరోయిన్ ఆవేదన
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి మంజిమా మోహన్. తమిళ సినిమాల్లో తనదైన నటనతో ప్రశంసలు అందుకున్నారు. సాహసమే శ్వాసగా సాగిపో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ ముద్దుగుమ్మ. అయితే ప్రముఖ నటుడు గౌతమ్ కార్తీక్‌ను 2022లో ఆమె వివాహం చేసుకుంది. కానీ అప్పట్లో వీరి పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్స్ వచ్చాయి. గౌతమ్ తండ్రి వీరి పెళ్లితో సంతోషంగా లేరని.. పెళ్లికి ముందే మంజిమ గర్భవతి అని కొందరు అసభ్యకరమైన వార్తలు రాసుకొచ్చారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మంజిమ వాటిపై స్పందించింది. అవన్నీ ఒట్టి రూమర్స్ అని కొట్టిపారేసింది. అంతే కాకుండా తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.మంజిమ మోహన్ మాట్లాడుతూ.. 'నా పెళ్లి గురించి సోషల్ మీడియాలో అవాస్తవాలే వచ్చాయి. పెళ్లి కాకముందే నేను గర్భవతినని రాశారు. దీంతో మా మామయ్య అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలొచ్చాయి. ఇలాంటి రూమర్స్ మా కుటుంబ సభ్యులను బాధపెట్టాయన్నది నిజం. పెళ్లికి ముందు కూడా ఇలా అసభ్యంగా కామెంట్స్ చేశారు. కానీ అవేవీ నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. కానీ పెళ్లయిన తర్వాత నాలో భయం మొదలైంది. ఇలాంటి వ్యాఖ్యలు చదివి ఎందుకు బాధగా ఉన్నావని గౌతమ్ అడిగేవాడు. నాపై వస్తున్న కామెంట్స్ చూసి గౌతమ్‌కి నేను సరైన జోడీ కాదనే ఫీలింగ్ కలిగేది. కానీ గౌతమ్ నాకు సపోర్ట్‌గా నిలిచారు. ఏదైనా బాధలో ఉంటే చెప్పాలని నన్ను అడిగేవాడు.' అని తెలిపింది.కాగా.. మలయాళంలో సూపర్ హిట్ అయిన కలియూంజల్ సినిమా ద్వారా మంజిమా మోహన్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మధురనోంబరకాట్టులో తన నటనకు గాను ఆమె కేరళ రాష్ట్ర ఉత్తమ బాలనటిగా అవార్డును గెలుచుకుంది. ఆమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ విపిన్ మోహన్ కుమార్తెగా ఇండస్ట్రీలో ప్రవేశించింది. ముత్తయ్య డైరెక్ట్ చేసిన దేవరట్టం సినిమాలో గౌతమ్, మంజిమ కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్న్నారు. చివరిగా 2023లో బూ చిత్రంలో నటించిన మంజిమ ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు. -
డబ్బుల కోసమే నటించా.. నాలా చాలామంది ఉన్నారు: నటి
ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో "ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్" చిత్రానికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు దక్కింది. పాయల్ కపాడియా ఈ చిత్రాన్ని తెరకెకక్కించారు. అయితే ఈ సినిమాలో మలయాళ నటి కని కుస్రుతి కీలక పాత్ర పోషించింది. తాను సినిమాల్లో నటించడం ప్రారంభించినప్పుడు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించింది. కేన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేసిన కని కస్రుతి పుచ్చకాయను పోలి ఉన్న హ్యండ్బ్యాగ్తో కనిపించిన అందరి దృష్టిని ఆకర్షించింది. తాజా ఇంటర్వ్యూలో తాను పడిన కష్టాలను పంచుకుంది.కని కుస్రుతి మాట్లాడుతూ..'నేను ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. తనకు జీవనోపాధి కోసం మాత్రమే సినిమాల్లో నటించాల్సి వచ్చింది. 2020లో నేను నటించిన మలయాళ చిత్రం "బిరియాని"కి కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్, మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నా. కానీ అంతకుముందు నా జీవితమంతా కన్నీళ్లతో పోరాటమే. నా దగ్గర డబ్బు లేని సమయంలో సజిన్ (సజిన్ బాబు) నన్ను సంప్రదించాడు. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆయనతో ఓకే మాట చెప్పా. ఇందులో నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ క్యారెక్టర్ నేను చేయలేను అని చెప్పా. మరొకరిని వెతకండి సలహా ఇచ్చా. ఆ సమయంలో నాకు డబ్బు అవసరం ఉన్నప్పటికీ సినిమా చేయాలని అనిపించలేదని చెప్పింది. మూడు నెలల తర్వాత చిత్రనిర్మాత మళ్లీ నన్ను సంప్రదించారని' కుస్రుతి తెలిపింది.బిరియానీకి రూ.70,000 ఆఫర్కుస్రుతి మాట్లాడుతూ.. "నాకు ఈ సినిమా చేయడానికి ఆసక్తి లేదు. కానీ నా దగ్గర డబ్బు లేదని చెప్పా. నాకు దాదాపు రూ.70 వేల ఆఫర్ ఇచ్చారు. అది నాకు చాలా పెద్ద మొత్తం. అప్పుడు నా ఖాతాలో కేవలం రూ.3 వేలు మాత్రమే ఉంది.' తన కన్నీళ్ల బాధను పంచుకుంది. కాగా..ఒకవేళ తాను థియేటర్‌కే పరిమితమైన ఉంటే.. బాగా సంపాదించగలిగితే సినిమాల్లోకి రాకపోవచ్చని ఆమె అన్నారు. భవిష్యత్తులో జీవనోపాధి పొందే పరిస్థితులు లేకుంటే.. నాకు ఇష్టం లేని పనులు చేయవలసి రావొచ్చని.. అలాంటి వారు చాలా మంది ఉన్నారని' ఆమె చెప్పింది. -
తెలుగు సినిమా హీరోయిన్.. ముచ్చటగా మూడో పెళ్లి
హీరోయిన్ మీరా వాసుదేవన్ పెళ్లిపీటలెక్కింది. ముచ్చటగా మూడోసారి తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. కెమెరామెన్ విపిన్ పుత్యాంగంతో ఏడడుగులు వేసింది. ఈ శుభవార్తను మీరా సోషల్ మీడియా వేదికగా ఆలస్యంగా వెల్లడించింది. ఏప్రిల్ 21న కోయంబత్తూరులో పెళ్లయిందని, రిజిస్టర్ ప్రక్రియ ఈరోజు పూర్తయిందంటూ శుక్రవారం నాడు వివాహ ఫోటోలు షేర్ చేసింది. అలాగే తన భర్త గురించి వివరాలను సైతం పొందుపరిచింది.సింపుల్‌గా పెళ్లివిపిన్ కేరళలోని పాలక్కడ్ ప్రాంతానికి చెందినవాడు. ఈయన ఒక సినిమాటోగ్రాఫర్. అప్పట్లో అంతర్జాతీయ అవార్డు సైతం గెలుచుకున్నాడు. విపిన్, నేను ఒక ప్రాజెక్టు కోసం 2019 మే నుంచి కలిసి పని చేస్తున్నాం. గతేడాదే కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చాం. అలా ఈ ఏడాది ఒక్కటయ్యాం. ఇరు కుటుంబాలు సహా ఇద్దరు ముగ్గురు బంధుమిత్రుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సీరియల్ నుంచి సినిమాల్లోకి..కాగా మీరా వసుదేవన్ 2001లో సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. రెండు మూడు ధారావాహికల్లో కనిపించిన ఆమె గోల్మాల్ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా మారింది. అంజలి ఐ లవ్ యూ అనే చిత్రంలోనూ నటించింది. తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ హీరోయిన్గా యాక్ట్ చేసింది. ప్రస్తుతం నాలుగు మలయాళ సినిమాలు చేస్తోంది.రెండు పెళ్లిళ్లుతన వ్యక్తిగత విషయానికి వస్తే.. మీరా వాసుదేవన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ తనయుడు విశాల్ అగర్వాల్‌ను 2005లో వివాహం చేసుకుంది. పెళ్లయిన ఐదేళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. సీరియల్ షూటింగ్లో లవ్..తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ బంధం కూడా ముక్కలైంది. 2016లో భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి సింగిల్ మదర్‌గా ఉంటున్న ఈమె కుడుంబవిలక్కు అనే సీరియల్ షూటింగ్లో ఆ ధారావాహిక కెమెరామన్ విపిన్‌తో ప్రేమలో పడింది. ఆ ప్రేమను ఇప్పుడు పెళ్లి బంధంతో పదిలపర్చుకున్నారు. View this post on Instagram A post shared by Meera Vasudevan (@officialmeeravasudevan)చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి -
సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
క్యాస్టింగ్ కౌచ్.. ఈ భయంతోనే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ అంటేనే భయపడతారు. కొందరు సెలబ్రిటీలు దీనికి లొంగిపోతే మరికొందరేమో వాటిని తిరస్కరిస్తూ ధైర్యంగా ముందడుగు వేశారు. తన కెరీర్లో కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయంటోంది నటి సుచిత్ర పిళ్లై. ఈ మలయాళ నటి ఫ్రెంచ్, హాలీవుడ్ సినిమాలు సైతం చేసింది. ఎక్కువగా బాలీవుడ్ మూవీస్‌లో మెరిసిన ఈమె సింగర్ కూడా! తాజాగా సుచిత్ర క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.ఏదో ఒక దశలో క్యాస్టింగ్ కౌచ్'కొన్నిసార్లు అవకాశాలు వస్తాయి.. కానీ దానికి బదులుగా మరింకేదో అడుగుతుంటారు. అదే క్యాస్టింగ్ కౌచ్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు. నన్ను చూస్తే గంభీరంగా కనిపిస్తానని అంటుంటారు.. కాబట్టి మరీ అంత ఘోరమైన అనుభవాలైతే ఎదురవలేదు. ఎవరైనా ఏదైనా అడగాలన్నా నా ముఖం చూసి నోరు మూసుకుని ఉంటారని జనాలు జోకులేస్తుంటారు.సౌత్‌లో సినిమాలు చేస్తారా?అయితే దక్షిణాది చిత్రపరిశ్రమ నుంచి నాకు ఓసారి ఫోన్‌కాల్ వచ్చింది. ఇదెప్పుడో ఏళ్లక్రితం జరిగిన ముచ్చట. సౌత్‌లో సినిమాలు చేస్తారా? అని అడిగారు. సరేనన్నాను. అయితే ఒక మంచి సినిమా ఉంది. చాలా పెద్ద హీరో, ప్రముఖ డైరెక్టర్ కాంబినేషన్లో రాబోతోంది. మీరు అందులో హీరోకి సోదరిగా నటిస్తారా? అది చాలా ప్రాధాన్యత ఉన్న రోల్ అని చెప్పగా మంచిదే కదా అనుకున్నాను. కాంప్రమైజ్అప్పుడతడు మా నిర్మాతకు ఇదే మొదటిసారి.. మీరు కాంప్రమైజ్ అవుతారా? అని అడిగాడు. నా రెమ్యునరేషన్ తగ్గించుకోమంటున్నాడేమోనని లేదు, సారీ అని చెప్పేశా.. కానీ అతడు మళ్లీ కాంప్రమైజ్ కావాలి అని నొక్కి చెప్పాడు. నాకు విషయం అర్థమై.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాతో మీరిలాగేనా మాట్లాడేది అని కోప్పడ్డాను. ఒక్కసారి వస్తే చాలంటూ..అంటే డైరెక్టర్స్ చాలాకాలంగా ఈ పద్ధతి ఫాలో అవుతున్నారు. నిర్మాత కొత్తవాడు కాబట్టి తను ఓసారి రమ్మని అడుగుతున్నాడు అని పేర్కొన్నాడు. నేను మీ ప్రాజెక్ట్‌కు కరెక్ట్ వ్యక్తిని కాదు, రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేశాను. అలాంటి దారిలో వెళ్లడం నాకే మాత్రం నచ్చదు' అని సుచిత్ర చెప్పుకొచ్చింది.చదవండి: డిప్రెషన్లో ఉపాసన.. రామ్‌చరణ్ (ఫోటోలు) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటి కనకలత కన్నుమూశారు. తిరువనంతపురంలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె చాలా కాలంగా పార్కిన్సన్స్, మతిమరుపుతో బాధపడుతున్నారు. దీంతో కోలుకోలేక మరణించారు. కాగా.. 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్న కనకలత.. 16 ఏళ్ల తర్వాత తన భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఎలాంటి సంతానం లేకపోవడంతో 34 ఏళ్లుగాతన సోదరి విజయమ్మతో కలిసి ఉంటోంది.కాగా.. కనకలత మలయాళం, తమిళ సినిమాలు, సీరియల్స్‌లో ఎక్కువగా నటించారు. దాదాపు రెండు భాషల్లో 360కి పైగా చిత్రాలు చేశారు. యాత్రామొళి, గురు, కిలుకిల్ పంబరం, పార్వతీ పరిణయం, తుంపోలి కడపురం, అతిర కన్మణి, ఎఫ్ఐఆర్, ఆకాశ గంగ, దోస్త్, నెమలి, మంత్రమోతీరం, కౌరవులు, కార్య, జాగురా, రాజు లాంటి సినిమాలు చేసింది. కనకలత చివరిసారిగా ‘పూక్కాళం’, ‘మూడు రోజులు సినిమాల్లో నటించింది. ఆమెకు చిత్ర పరిశ్రమ నుండి ఆఫర్లు వచ్చనప్పటికీ.. ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె నటనకు విరామం తీసుకుంది. ఆమెకు మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(అమ్మ), ఫిల్మ్ అకాడమీ ఆర్థిక సాయంతో చికిత్స తీసుకున్నారు. -
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో వచ్చామా, పనిచేశామా, వెళ్లిపోయామా అనేలా ఉంటారు. మరికొందరు మాత్రం ఊహించని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. భావన అలాంటి హీరోయిన్ అని చెప్పొచ్చు. 'మహాత్మ', 'ఒంటరి' లాంటి తెలుగు సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ జీవితంలో కాంట్రవర్సీలు బోలెడు ఉన్నాయి. కిడ్నాప్, లైంగిక దాడికి గురవడం, అబార్షన్ అయిందని రూమర్స్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వచ్చిన పుకార్ల గురించి స్పందించింది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)కేరళకు చెందిన భావన.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్లో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు కిడ్నాప్ అయింది. ఓ స్టార్ హీరోని ఈమెని ఎత్తుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ కేసులో మలయాళ హీరో దిలీప్ని అరెస్ట్ కూడా చేశారు. ఈ రచ్చ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భావన.. 2018లో నిర్మాత నవీన్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటోంది. తాజాగా ఈమె నటించిన 'నడికర్' అనే మలయాళ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. అప్పట్లో తన అబార్షన్ గురించి వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది.'అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నానని అన్నారు. అలువాలో గర్భస్రావం అయిందని, కొచ్చి-చెన్నైలోనూ అబార్షన్ చేయించుకున్నానని ప్రచారం చేశారు. ఇలా పలుమార్లు జరగడం వల్ల నేను చనిపోయానని కూడా మాట్లాడారు. వాటిని ఇప్పుడు గుర్తుచేసుకుంటే చిరాకేస్తోంది. అప్పుడు నా గురించి వచ్చిన రూమర్స్ విని మెంటల్‌గా చాలా డిస్ట్రబ్ అయ్యాను. కానీ ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్‌గా నిలబడ్డాను' అని భావన చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్‌పై స్పందించిన నటి) -
గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
క్లాసికల్ డ్యాన్సర్, ప్రముఖ నటి కపిల వేణుకు చేదు అనుభవం ఎదురైంది. ఓ గుడిలో తన ఫ్రెండ్ డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చూడటానికి వెళ్లగా.. ఊహించని అనుభవం తనకు ఎదురైందని చెప్పుకొచ్చింది. ఈ మేకరు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. అసలేం జరిగిందో చెబుతూనే తనే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందని తనని తాను సముదాయించుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)'నా స్నేహితురాలి డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చూడటం కోసం లోకల్‌గా ఉండే ఓ గుడికి ఒంటరిగా వెళ్లాను. అక్కడ ఆల్రెడీ ఉత్సవం జరుగుతోంది. దారి తెలియక అందరూ బయటకు వచ్చే దారి నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాను. అయితే అక్కడే ఉన్న ఓ వాలంటీర్.. నన్ను టచ్ చేసి ఆపాడు. చాలా రూడ్‌గా మాట్లాడాడు. ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా ఇలా చేయడం ఏంటని కాస్త గట్టిగానే అడిగాను. ఇద్దరు మధ్య కాస్త వాదన జరిగింది. ఈ టైంలో మరో ఆరుగురు వాలంటీర్లు మేమున్న చోటుకు వచ్చారు. వాళ్లందరూ కూడా నాదే తప్పన్నట్లు చెప్పారు. సీన్ చేయకుండా, వెంటనే వెళ్లిపోవాలని కామెంట్ చేశారు''దీంతో ఏడుస్తూ పోలీసుల దగ్గర వెళ్లాను. ఆ తర్వాత కమిటీ మెంబర్లలో ఒకాయన వచ్చి వాలంటీర్లతో మాట్లాడి, నా తండ్రి పేరు తెలుసుకుని నన్ను లోపలికి పంపించేశాడు. ఇంకేదో జరుగుతుందనుకుంటే నాన్న పేరు తెలుసుకుని లోపలికి పంపేయడం నాకు నిజంగా నచ్చలేదు. అయినా గుడికి ఒంటరిగా వెళ్లాలనుకోవడం నాది తప్పు. జనాలు ఎక్కువగా వచ్చారు. వాళ్లని కంట్రోల్ చేయడం వాలంటీర్లకు కష్టమే. అయినా సరే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సింది' అని వేణు కపిల ఇన్ స్టాలో రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్‌లో ఉండేది అదొక్కటే: నటి దివ్య) View this post on Instagram A post shared by Kapila Venu (@kapilavenu) -
నటుడితో ప్రేమ? అవమానిస్తున్నారంటూ నటి భావోద్వేగం
సెలబ్రిటీల చుట్టూ పుకార్లు వైఫైలా ఉంటాయి. దాదాపు ప్రతి సెలబ్రిటీ ఎప్పుడో ఓసారి ఇలాంటి గాసిప్‌ల బారిన పడినవారే! మలయాళ నటి రేఖ రతీశ్ కూడా 42 ఏళ్ల వయసులో ఓ వ్యక్తిపై మనసు పారేసుకుందని, అతడిని మనువాడబోతుందంటూ పుకార్లు వెలువడ్డాయి. తన కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చేశాడని రకరకాలుగా కథనాలు అల్లేశారు. ఇది చూసిన రేఖకు ఒళ్లు మండిపోయింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నేను ఈ మధ్యే కొత్త కారు కొన్నాను.కారు కొన్నా..మీడియా నావెంట వెంటపడతుందనే షోరూమ్‌కు వెళ్లలేదు. నా కుమారుడు, మేనల్లుడు కలిసి షోరూమ్‌కు వెళ్లి కారు తీసుకున్నారు. నా సంతోషాన్ని అభిమానులతో పంచుకోవాలని సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశాను. అది చూసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇష్టారీతిన కథనాలు అల్లేశాయి. నా కుటుంబంలోకి కొత్త వ్యక్తిని స్వాగతించానంటూ నాతో పని చేసిన ఓ నటుడి ఫోటోను జత చేసి ఏదేదో రాశారు. ఇంత నీచానికి దిగజారుతారా?ఓపక్క చెత్త కామెంట్లు..నాకంటూ ఓ కుమారుడున్నాడు. వీళ్ల వార్తలు చూసి చుట్టూ ఉన్నవాళ్లు అతడిని ఎంత హేళన చేస్తారో మీకేమైనా అర్థమవుతుందా? ఇప్పటికే ఆన్లైన్లో చెత్త కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడిలా ఏది పడితే అది రాయడం వల్ల నా కుటుంబసభ్యులే నన్ను అనుమానిస్తూ అవమానించారు. ఎంతో బాధేసింది. నాతో లింక్ పెట్టిన ఆ నటుడు నన్ను చెల్లి అని పిలుస్తాడు. మీరు నా రిలేషన్షిప్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ నాకు మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు. నా కుమారుడే నా ప్రపంచం' అని నటి కుండ బద్ధలు కొట్టింది. View this post on Instagram A post shared by RekhaRatheesh (@rekharatheesh3) చదవండి: చాహల్.. ధనశ్రీని పెళ్లి చేసుకుని తప్పు చేశావ్! 'వీడియోలో అతడెవరు?' -
వీడియో: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
మరో ప్రముఖ హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది. కుర్రాళ్ల మనసుల్ని బ్రేక్ చేస్తూ ప్రముఖ నటుడితో ఏడడుగులు వేసింది. హల్దీ, సంగీత్ లాంటి వాటిని గ్రాండ్‌గా చేసుకున్నారు. పెళ్లి మాత్రం సంప్రదాయ పద్ధతిలో ఓ గుడిలో సింపుల్‌గా చేసేసుకున్నారు. తాజాగా బుధవారం ఈ పెళ్లి జరగ్గా ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్? పెళ్లి కొడుకు ఎవరంటే?(ఇదీ చదవండి: అతని పెళ్లి కోసం కుటుంబంతో సహా వెళ్లిన విజయ్ దేవరకొండ)దళపతి 'బీస్ట్' సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అపర్ణా దాస్.. ఆ తర్వాత హీరోయిన్గా ఫేమ్ సంపాదించింది. 'దాదా' అనే తమిళ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. గతేడాది తెలుగులో వచ్చిన 'ఆదికేశవ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మలయాళంలోనే హీరోయిన్గా ఓ సినిమా చేస్తోంది.సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు. కానీ అపర్ణ దాస్ మాత్రం కేవలం 28 ఏళ్ల వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టేసింది. 'మంజుమ్మల్ బాయ్స్'తో పాటు పలు మలయాళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దీపక్ పరంబోల్ని అపర్ణ పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకు హాజరైన పలువురు నటీనటులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: కారు కొన్న 'బిగ్‌బాస్' దీప్తి సునయన.. రేటు ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by Siju Wilson (@siju_wilson) -
అక్కడ స్టార్ హీరోయిన్.. తెలుగులో ఒకే ఒక్క సినిమా!
ఎంత టాలెంట్ ఉన్నా సరే.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఇండస్ట్రీలో లక్ కలిసొస్తేనే అవకాశాలు, ఆర్భాటాలు.. లేదంటే ఇక్కడ పట్టించుకునే నాధుడే ఉండడు. అయితే గుర్తింపు తెచ్చుకోవడం ఒక సాహసమైతే.. ఆ క్రేజ్‌ను కాపాడుకోవడం కూడా అంతకుమించిన సాహసం. కొందరికి అన్నీ కలిసొచ్చి స్టార్స్‌గా వెలిగిపోతుంటారు. అది ఎంతకాలమన్నది వారి చేతుల్లోనే ఉంటుంది. పైన కనిపిస్తున్న నటి ఒకప్పుడు మలయాళంలో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించింది. తెలుగులోనూ ఓ సినిమా చేసింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా? అదే తొలి, చివరి సినిమా తన పేరు సంవృత సునీల్. కేరళలో పుట్టిపెరిగిన ఈమె 2004లో రాసికన్ సినిమాతో మలయాళ చిత్రపరిశ్రమలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఉయిర్ మూవీతో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. తెలుగులో రాజశేఖర్ సరసన 'ఎవడైతే నాకేంటి' సినిమా చేసింది. టాలీవుడ్లో అదే ఆమె తొలి, చివరి సినిమా. మలయాళంలోనే ఎక్కువ మూవీస్ చేసిన ఆమె 2012లో అమెరికాకు చెందిన ఇంజనీర్ అఖిల్ జయరాజ్‌ను పెళ్లాడింది. వీరికి అగస్త్య, రుద్ర అని ఇద్దరు కుమారులు సంతానం. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంవృత 2019లో ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. 2008లో ఆమె నటించిన కాల్చిలంబు 2021లో రిలీజ్ అవడం విశేషం. వెండితెరపై కనిపించకుండా పోయిన ఈమె ఆమధ్య బుల్లితెరపై జడ్జిగా కనువిందు చేసింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి అమెరికాలోనే ఉంటోంది. అక్కడే మలయాళీల కొత్త సంవత్సరం విషును సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Samvritha Akhil (@samvrithaakhil) చదవండి: మరో అమ్మాయితో నా భర్త ప్రేమ వ్యవహారం.. ఆ ఏడాది మానసికంగా ఎంతో ఒత్తిడి! -
మలయాళ నటి అదితి రవి ఫోటోలు వైరల్
-
అసలు ఆమెను ఎలా తీసుకున్నారు?.. బుల్లితెర నటిపై విమర్శలు
గతేడాది మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నేరు. మలయాళంలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ప్రియమణి లాయర్‌గా కనిపించారు. కోర్టు రూమ్ డ్రామా కాన్సెప్ట్‌తో డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి హరిత జి నాయర్. మోహన్ లాల్ వద్ద జూనియర్ లాయర్ పాత్రలో మెప్పించింది. మొదట ఫాహద్ ఫాజిల్ నటించిన కార్బన్ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత రియాల్టీ షోలు, సీరియల్స్‌తో బిజీగా మారిపోయింది. హరిత నాయర్ ప్రస్తుతం శ్యామంబరం సీరియల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె శ్యామాంబరం సీరియల్లో నల్లగా ఉండే అమ్మాయి పాత్రలో నటించింది. అయితే ఈ పాత్రకు ఆమెను ఎంపిక చేయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ పాత్రలో అసలు హరితను ఎలా తీసుకున్నారంటూ నెటిజన్స్ విమర్శించారు. అయితే ఇలాంటి కామెంట్స్‌పై హరిత సైతం తనదైన శైలిలో స్పందించింది. క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ తెల్లగా ఉన్నారా? లేదా నల్లగా ఉన్నారా? అనేది ముఖ్యం కాదని హితవు పలికింది. కేవలం క్యారెక్టర్ యాక్టింగ్ ఎబిలిటీ మాత్రమే చూడాలని.. రంగును కాదని సూచించింది. తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగానే బదులిచ్చింది బుల్లితెర భామ. కాగా.. మొదటి నర్సుగా కెరీర్ ప్రారంభించిన హరిత.. తక్కువ కాలంలోనే మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Zee Keralam (@zeekeralam) View this post on Instagram A post shared by Haritha.G Nair (@haritha.girigeeth) -
హిట్ సినిమాలో రోల్.. నటిపై నెటిజన్స్ ట్రోలింగ్!
గుడ్‌నైట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మణికందన్, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం లవర్. తమిళంలో ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 10న 'ట్రూ లవర్'గా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్‌గా ఐషు పాత్రలో నటి హరిణి సుందరరాజన్ కనిపించింది. ప్రభు రామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన లవర్ మంచి హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకు నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైంది. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై సోషల్ మీడియా వేదికగా నటి మండిపడింది. మీరు నాపై కోపం ప్రదర్శించడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నా పాత్ర నచ్చకపోతే ఒక నటి పట్ల అలా నీచంగా, అగౌరవంగా ప్రవర్తించడం సరైంది కాదని ట్వీట్ చేసింది. ఇకనైనా ఇలాంటి విమర్శలకు ముగింపు పలకాలని కోరింది. కాగా.. హరిణి ఫింగర్‌టిప్ అనే తమిళ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. హీరోయిన్ స్నేహితురాలిగా.. లవర్ చిత్రంలో దివ్య (శ్రీ గౌరీ ప్రియ), అరుణ్ (మణికందన్) ప్రేమించుకుంటారు. అతనిపై అభద్రతా భావంతో అరుణను దివ్య తన మాటలతో దుర్భాషలాడుతూ ఉంటుంది. దీంతో అరుణ్‌కు బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. అదే సమయంలో దివ్యకి స్నేహితురాలైన ఐషూ అతనితో బంధానికి ముగింపు చెప్పమని సలహా ఇస్తుంది. దీంతో నెటిజన్ల దృష్టిలో ఐషూ ఒక చెడ్డ స్నేహితురాలిగా కనిపించింది. ప్రేమ జంటకు సమస్యలు సృష్టించారంటూ ఆన్లైన్ ట్రోలింగ్‌కు గురైంది. చాలామంది నెటిజన్స్ ఆమె పాత్రపై కామెంట్స్ చేయడంతో హరిణి స్పందించింది. అది కేవలం సినిమాలో పాత్ర మాత్రమేనని మీకు తెలియదా? అంటూ ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసింది. Secondly, don’t these thick heads realise that this behaviour only warrants the need for more Aishus? Disagreement does not have to be shown with disrespect. — Rini (@rinibot) April 10, 2024 This morning, I woke up to some idiots in my DMs swearing at me because they don’t like Aishu in Lover. Firstly, that they think it’s okay to be vile and disrespectful towards an actor because they didn’t like a character they played is beyond me. — Rini (@rinibot) April 10, 2024 -
ఆ హీరోతో ఓ సినిమా చేశా.. అయినా నంబర్ బ్లాక్ చేశాడు: హీరోయిన్
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జై గణేష్'. ఈ సినిమాకు రంజిత్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురువారం థియేటర్లలో విడుదల కానుంది. వీరిద్దరు చివరిసారిగా 2017లో విడుదలైన'మాస్టర్‌పీస్' చిత్రంలో కనిపించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ మహిమ నంబియాన్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'మాస్టర్‌పీస్ చిత్రం తర్వాత ఉన్ని ముకుందన్ తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడని తెలిపింది. జై గణేశ్ మూవీలో నటించేవరకు తనను అన్‌బ్లాక్ చేయలేదని కూడా ఆమె పేర్కొంది. మహిమ నంబియార్ మాట్లాడుతూ..'ఉన్ని ముకుందన్ నంబర్ తీసుకోవడానికి స్క్రిప్ట్ రైటర్ ఉదయ్కృష్ణకి కాల్ చేశా. అతని వద్ద నుంచి ఉన్ని ముకుందన్ నంబర్ తీసుకుని వాట్సాప్‌లో వాయిస్ మేసేజ్ పంపా. నేను మహిమను. నేనెవరో నీకు తెలుసు అనుకుంటున్నా. ఉదయన్ నీ నంబర్ ఇచ్చాడని చెబుతూనే ఉదయన్ అనే పదాన్ని రెండు మూడు సార్లు రిపీట్ చేశా. దీంతో ఉన్ని నా వాయిస్ మేసేజ్ విని బ్లాక్ చేశాడు. కానీ ఉన్ని ఎందుకు అలా చేశాడో అర్థం కాలేదు. ఆ తర్వాత ఉన్ని ఉదయన్కి ఫోన్ చేశాడు. ఆమె చాలా అహంకారి. ఆమె మిమ్మల్ని ఉదయన్ అని పిలుస్తోంది. సీనియర్ని ఇలాగేనా పిలిచేది అన్నాడట. దీంతో ఏడేళ్లుగా నా నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశాడు' అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాజాగా ఉన్ని ముకుందన్ ఈ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో కోపంతో తన నంబర్‌ను బ్లాక్ చేశానని వెల్లడించారు. ఆ తర్వాత బ్లాక్ చేసిన సంగతే మరిచిపోయినట్లు తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత మహిమ ఆర్డీఎక్స్లో నటించి హిట్ కొట్టినప్పుడు చూశాను. ఆ తర్వాత రంజిత్ శంకర్ సినిమాలో మహిమ హీరోయిన్గా నటిస్తుందని తెలిసింది. దీంతో వెంటనే ఆమె కాంటాక్ట్‌ని బ్లాక్ చేసిన విషయం గుర్తుకొచ్చింది. వెంటనే అన్‌బ్లాక్ చేసి మెసేజ్ పంపాను.. నేను ఉన్నిని.. మీరు ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని' ఉన్ని ముకుందన్ అన్నారు. కాగా.. ఏడేళ్ల తర్వాత వీరిద్దరు జంటగా నటించిన జై గణేష్ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పండగ వేళ మేలిముసుగులో కవ్విస్తున్న ఈ భామ ఎవరు?
-
గొంతు పోగొట్టుకున్న నటి.. మాట్లాడలేని స్థితిలో!
మలయాళ నటి, క్లాసికల్ డ్యాన్సర్ తారా కల్యాణ్ స్పాస్మోడిక్ డిస్ఫోనియా అనే గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతోంది. దీని వల్ల ఆమె మాట్లాడలేకపోతోంది. బలం కూడదీసుకుని ఒక్క పదం పలకాలన్నా ఎంతో ఇబ్బందిగా ఉంటోందట! తాత్కాలికంగా ఆమె గొంతును కోల్పోయిందని తారా కల్యాణ్ కూతురు సౌభాగ్య వెంకటేశ్ వెల్లడించింది. తన యూట్యూబ్ ఛానల్లో తల్లి సమస్యను బయటపెట్టింది. 'రెండేళ్ల క్రితం అమ్మకు థైరాయిడ్ సంబంధిత సర్జరీ జరిగింది. దాని వల్లే ఇప్పుడు గొంతు పోయిందనుకున్నాం. పైగా చాలా ఏళ్లుగా తన వాయిస్‌ను ఉపయోగించే డ్యాన్స్ క్లాసులు నేర్పిస్తూ ఉంటుంది. ఎక్కువగా గొంతును ఉపయోగించడం వల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చనుకున్నాం. కానీ స్పాస్మోడిక్ డిస్ఫోనియా అనే వ్యాధి వచ్చిందని, దానివల్లే గొంతు మూగబోయిందని తెలిసింది. బొటాక్స్ చేయిస్తే అమ్మ కోలుకుంటుందన్నారు. ఆ సర్జరీ చేసే సమయంలోనే అమ్మమ్మ(తారా తల్లి) చనిపోయింది. వైద్యులు తనను పూర్తిగా విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ అమ్మమ్మ చనిపోయిన బాధ ఒకవైపు అమ్మను కుంగదీస్తోంది. ప్రస్తుతం మంచినీళ్లు తాగడానికి కూడా అమ్మ ఇబ్బందిపడుతోంది. తగిన విశ్రాంతి తీసుకుంటే వీలైనంత త్వరగానే అమ్మ ఎప్పటిలా మాట్లాడగలదు' అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Thara Kalyan (@tharakalyan) చదవండి: హీరోయిన్ నయా బిజినెస్! వాడిపడేసిన చీరలు అమ్మకానికి.. -
స్కూల్లో హేళనలు.. అన్నింటినీ అధిగమించి నటిగా!
కనీ కుశ్రుతి.. మలయాళ నటి. కానీ వెబ్ సిరీస్‌ల వల్ల దేశవ్యాప్తంగా వెండితెర, వెబ్‌తెర అభిమానులకు పరిచయమైంది. నటనలోనే కాదు అసలు ఆమె పెరిగిన విధానంలోనే ప్రత్యేకత ఉంది. కనీ కుశ్రుతి సొంతూరు తిరువనంతపురం. తల్లిదండ్రులు.. జయశ్రీ ఏకే, మైత్రేయ మైత్రేయన్. ఇద్దరూ హేతువాదులు, సామాజిక కార్యకర్తలు. కులాన్ని సూచించే ఇంటిపేరును తొలగించుకున్నారు. ఇంటి పేరు లేదు తమ కూతురుకీ ఇంటిపేరునివ్వలేదు. ఈ పెంపకం బయట సమాజానికి చిత్రంగా ఉండటంతో స్కూల్లో.. తోటి వాళ్ల మధ్య ఎన్నో హేళనలకు గురైంది కనీ. అయినా తమ తీరును మార్చుకోలేదు ఆమె తల్లిదండ్రులు. ఏటికి ఎదురీదే ధైర్యాన్ని నూరిపోశారు కూతురికి. అమ్మానాన్న పెట్టిన తొలిపేరే అసలు పేరని.. కులాన్ని సూచించే తోక పేరు అవసరంలేదని చెప్పి నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ మీద కనీకి చిన్నప్పుడే అవగాహన కల్పించారు. కానీ టెన్త్ క్లాస్‌లో చివరి పేరు కచ్చితంగా కావాల్సి వచ్చింది కనీకి. అప్పుడు తెలుసుకుంది ఆమె తమ చివరిపేరు కుశ్రుతి(ఆకతాయి, అల్లరచిల్లర అని తెలుగు అర్థం) అని! సర్కారు బడిలో కాన్వెంట్ స్కూల్‌కి పంపే ఆర్థిక స్థోమత ఉన్నప్పటికీ కనీ తల్లిదండ్రులు ఆమెను సర్కారు బడిలోనే చదివించారు. స్కూల్లో ఉన్నప్పుడు వర్క్‌షాప్ కోసం ఒక మోడర్న్ స్కూల్‌కి వెళ్లిందట కనీ. ఆ స్కూల్.. అందులోని క్లాస్ రూమ్స్ చూసి ఆశ్చర్యపోయిందట. ఆ స్కూల్‌తో తమ బడిని పోల్చుకుని ‘నన్నెందుకు అలాంటి స్కూల్లో చేర్పించలేదు’ అని అమ్మానాన్నలను అడిగిందట. ‘సామాన్యులు సర్కారు బడికే వెళ్తారు. నువ్వూ సామాన్యురాలివే. ఇక్కడి నుంచే ప్రపంచాన్ని చదవాలి’ అని చెప్పారట. అన్నట్టుగానే ఆ బడి తనకు ప్రపంచాన్ని చూడ్డం నేర్పింది అంటుంది కనీ. పారిస్‌లో థియేటర్ ఆర్ట్స్ చదివింది. వేధింపుల వల్ల సినిమాలకు దూరం! 2000 సంవత్సరంలో అభినయ థియేటర్ రీసెర్చ్ సెంటర్లో చేరి.. 2006 వరకు ఆ గ్రూప్‌తోనే ఉంది. ఆమె ప్రతిభకు ముచ్చటపడిన మలయాళ ఫిలిం ఇండస్ట్రీ .. ‘మనుష్యపుత్రి’ మూవీతో ఆమెకు వెల్కమ్ చెప్పింది. ఆ తర్వాత ‘కేరళ కేఫ్’ లోనూ నటించింది. గుర్తింపు వచ్చింది మాత్రం ‘బిర్యానీ’ చిత్రంతోనే. అయితే సినీపరిశ్రమలో తనకెదురైన లైంగిక వేధింపులను భరించలేక ఒకానొక దశలో సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకుని కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. మంచి పాత్రలు రావడంతో మళ్లీ సినిమాలు చేస్తోంది. చదవండి: రెండు ఓటీటీల్లో హనుమాన్.. అక్కడ హిందీలో.. ఇక్కడ తెలుగులో! -
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా.. తెలుగులో ఆ ఒక్క సినిమా మాత్రమే!
నివేద్యం సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భామ. ఈ భామ తన అందంతో మలయాళంలో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. మలయాళంతో పాటు కన్నడ,తమిళం చిత్రాల్లో నటించింది. సినిమాల్లో సక్సెస్ సాధించిన భామ.. తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రమే చేసింది. టాలీవుడ్ హీరో తనీశ్ నటించిన మంచివాడు అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు లక్ష్మి నారాయణ దర్శకత్వం వహించారు. తెలుగులో పెద్దగా ఛాన్సులు రాకపోయినప్పటికీ తమిళం, కన్నడ, మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది. అయితే పెళ్లయ్యాక నటనకు కాస్త దూరంగా ఉన్న భామ.. గతంలో భర్తతో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఇలాంటి వాటిపై ఆమె కనీసం స్పందించలేదు. 2018లో చివరిసారిగా ఖిలాఫత్ అనే మలయాళ చిత్రంలో నటించిన భామ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా భామ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Bhamaa (@bhamaa) -
రెండో పెళ్లి చేసుకున్న సైతాన్ నటి.. వరుడు ఎవరంటే?
ప్రముఖ మలయాళ నటి లేనా తెలుగులో వచ్చిన సైతాన్ వెబ్ సిరీస్‌లో నటించింది. మహి వీ రాఘవ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సిరీస్‌లో లేనా మేరీ జోసెఫ్ పాత్రలో మెప్పించింది. ఆమె ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న ఆడుజీవితం చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ భామ వివాహాబంధంలోకి అడుగుపెట్టిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ 42 ఏళ్ల నటి జనవరి 17న ప్రముఖ ఆస్ట్రోనాట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను పెళ్లాడినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. నెలన్నర తర్వాత రివీల్.. పెళ్లి చేసుకున్న దాదాపు 40 రోజుల తర్వాత తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది లేనా. అయితే ఇది ఆమెకు రెండో వివాహం కాగా.. మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఇటీవల కేరళలో పర్యటించిన మోదీ గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో పాల్గొనే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. వారిలో పైలట్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా ఉన్నారు. గగన్‌యాన్‌లో పాలుపంచుకునే నలుగురి పేర్లను మోదీ ప్రకటించిన వెంటనే లేనా తన పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ప్రశాంత్ నాయర్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. లేనా తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఈరోజు, ఫిబ్రవరి 27, 2024న, మన ప్రధాని మోదీ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు మొదటి భారతీయ ఆస్ట్రోనాట్ వింగ్స్ బహుకరించారు. మన దేశం, కేరళ, ముఖ్యంగా నాకు ఇది చాలా గర్వించదగ్గ చారిత్రక సందర్భం. అధికారికంగా నేను ప్రశాంత్‌ను జనవరి 17, 2024న సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నానని మీకు తెలియజేయడానికి ఈ ప్రకటన కోసం వేచి ఉన్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష ఫ్లైట్ మిషన్ గగన్‌యాన్ కోసం శిక్షణ పొందిన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. వారిలో కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఎంపికయ్యారు. ఈ నలుగురు వ్యోమగాములు రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. View this post on Instagram A post shared by Lenaa ലെന (@lenaasmagazine) -
కాసేపట్లో డెలివరీ.. డ్యాన్స్ చేసుకుంటూ వెళ్లిన నటి
ప్రెగ్నెన్సీ అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. కొందరైతే కాలు తీసి అడుగు ముందుకువేయడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. మరికొందరేమో వ్యాయామాలు, రన్నింగ్‌లు చేస్తూ సర్ప్రజ్ చేస్తుంటారు. తాజాగా మలయాళ బుల్లితెర నటి లక్ష్మి ప్రమోద్ కూడా ఇలాంటి పనే చేసింది. స్వతహాగా డ్యాన్సర్ కావడంతో లేబర్ రూమ్‌కు వెళ్లేముందు చిందులేసింది. నిండు గర్భిణి అన్న విషయాన్ని మర్చిపోయి హాయిగా డ్యాన్స్ చేసింది. దీన్ని ఆమె భర్త అజర్ మహ్మద్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను నటి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. లేబర్ రూమ్‌కు వెళ్లేముందు ఒక రీల్ చేస్తే బాగుంటుందనిపించింది. అయినా డ్యాన్స్ చేసుకుంటూ లేబర్ రూమ్‌కు వెళ్తావా? అని అడిగారుగా.. వారికోసమే ఈ వీడియో అని రాసుకొచ్చింది. ఇది చూసిన కొందరు డెలివరీ తర్వాత కూడా ఇలాగే డ్యాన్స్ చేయ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే తర్వాత నటికి పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో అభిమానులు నటి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Lekshmi Pramod (@laxmi_azar) చదవండి: ఆ సినిమా 14 సార్లు చూశా.. డైలాగ్ చెప్తూ తడబడ్డ నందమూరి హీరో! -
ఏడాది కిందట నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన హీరోయిన్
పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఎందరో ఇంట్ల పెళ్లి బాజాలు మోగనున్నాయి. సెలబ్రిటీలు కూడా బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెడుతూ వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. దిల్ రాజు సోదరుడి కుమారుడు, రౌడీ బాయ్స్ హీరో ఆశిష్ రెడ్డి వాలంటైన్స్ డే రోజే పెళ్లి చేసుకోగా రకుల్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరి 21న ప్రియుడితో మెడలో మూడు ముళ్లు వేయించుకోనుంది. నిశ్చితార్థం అయిన ఏడాదిన్నరకు పెళ్లి తాజాగా మరో బ్యూటీ ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. నారాయణ అండ్ కో సినిమా హీరోయిన్ ఆరతి త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 26న వైవాహిక బంధంతో ఒక్కటి కానున్నట్లు తెలిపింది. కాగా ఈ జంట గతేడాది ఫిబ్రవరి 16న నిశ్చితార్థం చేసుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత అదే రోజు తమ పెళ్లి తేదీని వెల్లడించడం విశేషం. అప్పటినుంచే లవ్.. మోడల్, నటి ఆరతి.. మలయాళ బిగ్‌బాస్ కంటెస్టెంట్ డాక్టర్ రాబిన్ రాధాకృష్ణన్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన రాధాకృష్ణన్‌ను ఇంటర్వ్యూ చేసింది ఆరతి. అప్పుడు ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఆరతి హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంది. View this post on Instagram A post shared by Dr Robin Radhakrishnan (@dr.robin_radhakrishnan) చదవండి: విశ్వక్ ఆడిషన్ ఇచ్చిన సినిమాకు నాగచైతన్య హీరోగా.. -
భర్త చేతిలో మోసపోయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. చివరికీ!
మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో ఆర్య ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది. అంతే కాకుండా మలయాళ బిగ్‌బాస్ సీజన్-2లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. వీటితో పాటు బడాయి బంగ్లా, స్టార్ మ్యూజిక్ లాంటి రియాలిటీ షోలలో కనిపించింది. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ముఖ్యంగా తన భర్త రాహుల్ సుశీలన్తో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత తొలిసారి తన విడాకులపై స్పందించింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆర్య మాట్లాడుతూ.. 'ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తున్నా. వదిలించుకోవడానికే అతను నన్ను బిగ్ బాస్‌కి పంపాడా అనే అనుమానం ఉంది. ముఖ్యంగా షోలో వెళ్లడానికి నాకు మద్దతు ఇచ్చిన వ్యక్తి. నాకు ఓ కుమార్తె ఉంది. మా నాన్న చనిపోయి చాలా కాలం కూడా కాలేదు. బిగ్‌బాస్ వెళ్లమని ఆయనే నాకు సపోర్టు చేసి మరీ ఎయిర్‌పోర్టులో దింపారు. నాకు అక్కడ బిగ్‌బాస్‌లో ఉన్నన్ని రోజులు ఎవరితోనూ పరిచయం లేదు. నేను హౌస్ నుంచి వచ్చేలోగా నాకు దూరం కావాలనేది అతని ప్లాన్ అని తెలీదు. కానీ ఇది ఒక అవకాశం అని నేను భావిస్తున్నా' అని తెలిపింది. కొవిడ్ వల్ల నేను బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చి నా భర్తకు చాలాసార్లు కాల్ చేశా. కానీ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసిన ఏకైక నంబర్ అతనిదే. అతను ఫోన్ తీయకపోవడంతో.. నేను అతని సోదరికి ఫోన్ చేశా. ఆమె జరిగిన విషయమంతా నాకు చెప్పింది. అతని మరో మహిళ వివాహేతర సంబంధంలో ఉన్నాడని నాకు అప్పుడే తెలిసింది. దీంతో అతన్ని కాల్చి చంపాలన్నా కోపం వచ్చింది. కానీ ఇప్పుడైతే అలాంటి కోపం లేదు. కానీ అతనికి ఏదైనా చెడు జరిగిందని తెలిస్తే మాత్రం సంతోషిస్తా.' అంటూ తన కోపాన్ని బయటపెట్టింది. ఆ సమయంలో అతను దుబాయ్‌లో ఉన్నందున.. కొవిడ్ వల్ల అతన్ని కలిసేందుకు వీలు కాలేదని ఆర్య తెలిపింది. కాగా.. ఆర్య చివరిగా మలయాళ కామెడీ చిత్రం క్వీన్ ఎలిజబెత్‌లో నటించారు. ఈ చిత్రాన్ని ఎం పద్మకుమార్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్వేతా మీనన్, నరేన్, జానీ ఆంటోనీ, మీరా జాస్మిన్, నీనా కురుప్ ప్రముఖ పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Arya Babu (@arya.badai) -
నేను హీరోయిన్గా పనికిరానని అవమానించారు.. ఇప్పుడు..
ప్రతిభ కలిగిన నటీమణుల్లో నటి ఇనయ ఒకరు. వాంగ చుడవా చిత్రంలో హీరోయిన్గా నటించి తానేమిటో నిరూపించుకుందీ బ్యూటీ. మాతృభాష మలయాళం అయినా తమిళంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఇనయ ఎలాంటి పాత్రనైనా చాలెంజ్‌గా తీసుకుని నటించగలదు. ఒక పక్క హీరోయిన్గా బిజీగా ఉంటూనే, మరో పక్క వ్యాపార రంగంలోనూ రాణిస్తోంది. ఈమె అనోరా ఆర్ట్ స్టూడియో పేరుతో మహిళా దుస్తుల వ్యాపారాన్ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తోంది. ఈమె ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఏడాదయ్యింది. బర్త్‌డే సెలబ్రేషన్స్ ఈ సందర్భంగా తన షాపు తొలి వార్షికోత్సవాన్ని, తన పుట్టినరోజు వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఈ పార్టీకి పలువురు సినీ ప్రముఖులు, తన సంస్థ సిబ్బంది పాల్గొని ఇనయాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో ఇనయ మాట్లాడుతూ.. తాను హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ తుక్కుదురై. ఇందులో యోగిబాబు హీరోగా నటించారు. ఇది వినోదభరిత కథా చిత్రంగా ఉంటుంది. నేను పనికిరానన్నాడు ఈ తరహా కామెడీ కథా చిత్రంలో నటించడం నాకు ఇదే తొలిసారి! తొలి రోజుల్లో ఒక దర్శకుడు నేను సినిమాకు పనికి రానని అవమానించారు. అలాంటిది ఇప్పుడు తమిళం, మలయాళం భాషల్లో హీరోయిన్గా అలాగే వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాను. నాకు దర్శకత్వం వహించాలని ఆసక్తి ఉంది. అందుకు కథలు కూడా రెడీగా ఉన్నాయి. అయితే డైరెక్టర్‌గా మారడానికి ఇంకా సమయం ఉంది' అని ఇనయ పేర్కొంది. చదవండి: నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్ సేతుపతి థ్రిల్లర్ సినిమా -
అలా చేస్తే ఈ సమాజం నన్ను బతకనిస్తుందా?: నటి
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మలైకొట్టై వాలిబన్. గురువారం (జనవరి 25న) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది బిగ్‌బాస్ బ్యూటీ సుచిత్ర నాయర్. మలయాళ ఇండస్ట్రీలో ఇదే తనకు తొలి సినిమా కావడం విశేషం. తాజాగా ఈ నటి తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. బోలెడు కథలు విన్నాను.. 'బిగ్‌బాస్ షోలో నన్ను చూసిన డైరెక్టర్ లిజో సర్.. తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. అదే 'మలైకొట్టై వాలిబన్'. నా తొలి సినిమా ఇంత పెద్ద బడ్జెట్లో ఉండటం, గొప్ప నటీనటులతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య ఈ మూవీలో నుంచి విడుదలైన పాటలో మోహన్‌లాల్‌తో పాటు నేనూ ఉన్నాను. అది చూసి చాలామంది నాకు సినిమా ఆఫర్లు ఇచ్చారు. బోలెడన్ని కథలు విన్నాను కానీ ఇంతవరకు ఏదీ ఓకే చేయలేదు. వాలిబన్ రిలీజయ్యాక మంచి కథలు సెలక్ట్ చేసుకుంటాను. మలయాళంలో మంచి సినిమాలు చేయాలనుంది. గాఢంగా ప్రేమించాను.. బ్రేకప్.. ఇక పెళ్లంటారా? వివాహంపైన నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. కానీ పెళ్లి చేసుకోకపోతే నా కుటుంబం, ఈ సమాజం ఊరుకుంటుందా? పదేపదే గుర్తుచేస్తూనే ఉంటుంది. పెళ్లి అవసరం లేదనుకున్నాను కానీ జీవితాంతం ఈ ఒత్తిడి భరించడం నా వల్ల కాదు. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఎప్పుడు దొరికితే అప్పుడు పెళ్లి చేసుకుంటాను. అయినా ఇప్పటికీ నేను నా బ్రేకప్ బాధలో నుంచి పూర్తిగా బయటపడలేదు. మొదట్లో ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ అతడు నాకు చాలా కండీషన్స్ పెట్టేవాడు. నచ్చిన దుస్తులు వేసుకోనిచ్చేవాడు కాదు, బయట తిరగనిచ్చేవాడే కాదు. నేను ఏం మాట్లాడినా అడ్డుపడేవాడు. తనకోసం ఎంతో చేశా.. నాకు నచ్చినట్లుగా బతకనివ్వలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఏం చేయాలన్నా తన అనుమతి తప్పనిసరి. నన్ను నన్నుగా ఉండనివ్వలేదు. మా మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయాం. పంజరంలో నుంచి బయటకు వచ్చినట్లుగా అనిపించింది. తన కోసం ఎన్నో అవకాశాలను వదిలేసుకున్నాను. చేయాల్సిన పనులు వాయిదా వేసుకున్నాను. ఇలాంటి వ్యక్తిని ప్రేమించానా? అని నన్ను నేనే అసహ్యించుకున్నాను' అని చెప్పుకొచ్చింది సుచిత్ర. కాగా సుచిత్ర నాయర్.. వానంబడి సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో విలన్‌గా మెప్పించిన ఆమె మలయాళ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో పాల్గొంది. View this post on Instagram A post shared by 𝙎𝙪𝙘𝙝𝙞𝙩𝙝𝙧𝙖 𝙉𝙖𝙞𝙧 (@suchithra_chanthu) చదవండి: ఓటీటీలో అదరగొడుతున్న 'నెరు' సినిమా ఎలా ఉందంటే? -
గోపిచంద్ సినిమాతో ఎంట్రీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్ తలుపు తట్టింది. ఒంటరి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మలయాళం, తమిళం, కన్నడలో పలు సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో కేవలం హీరో, మహాత్మ, నిప్పు లాంటి చిత్రాల్లో మాత్రమే కనిపించిది. తన 22 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్లో కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే చేసింది. ఇంతకీ ఆమె హీరోయిన్ ఎవరో గుర్తుకు వచ్చిందా? ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్లో అలా వచ్చి.. ఇలా గుడ్ బై చెప్పిన అందాల ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం పదండి. కేరళలోని త్రిసూర్‌లో జన్మించిన భావన..2002లో మలయాళంలో నమ్మల్ అనే చిత్రం తన కెరీర్ ప్రారంభించింది. మొదటి సినిమాకే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత మలయాళంలో ఛాన్సులు కొట్టేసిన ముద్దగుమ్మ చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత 2008లో గోపీచంద్ నటించిన ఒంటరి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నితిన్ సరసన హీరో చిత్రంలో మెరిసింది. శ్రీకాంత్ నటించిన మహాత్మ చిత్రంతో గుర్తింపు వచ్చినప్పటికీ.. టాలీవుడ్ ఈ కేరళకుట్టికి పెద్దగా కలిసిరాలేదు. తెలుగులో కేవలం నాలుగు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. అయితే తమిళం, కన్నడలో ఛాన్స్‌లు రావడంతో టాలీవుడ్‌కు బైబై చెప్పేసింది. భావన చివరిసారిగా రవితేజ నటించిన నిప్పు చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. నిర్మాతతో ప్రేమ పెళ్లి అయితే 2012లో కన్నడలో రోమియో చిత్రంలో నటించారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నవీన్‌తో భావనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ.. 2018లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఇటీవలే వీరిద్దరు ఆరో వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం భావన తన భర్తతో కలిసి బెంగళూరులో స్థిరపడింది. కాగా.. భావన చివరిసారిగా మలయాళ చిత్రం 'ఎన్టిక్కక్కకోరు ప్రేమోందర్న్'లో కనిపించింది. View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) -
నేనే పాపం చేశాను.. నాపై ఎందుకింత పగ?: నటి
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ కోసం పరితపించే నటీనటులు ఎందరో! కొందరు ఒక్క అవకాశంతోనే తమ సత్తా ఏంటో నిరూపించుకుంటారు. మరికొందరు ఆ అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతారు. నెమ్మదిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. నటి షాలిన్ జోయా ఈ కోవలోకే వస్తుంది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ సీరియల్స్‌తో నటిగా కెరీర్ ఆరంభించింది. తర్వాత సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ క్లిక్ అవడంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. తొక్కేయాలని చూస్తున్నారు షాలిన్ సీరియల్స్‌కు గుడ్‌బై చెప్పేసి సినీనటిగా మారింది. ఆ మధ్యలో బుల్లితెర షోలకు హోస్ట్‌గానూ వ్యవహరించింది. మలయాళంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఈమె రాజమంత్రి మూవీతో తమిళ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది. ఈ మధ్యే విడుదలైన కన్నగి అనే తమిళ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించింది. అయితే తన ఎదుగుదలను తొక్కేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది షాలిన్. తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు మలయాళ ఇండస్ట్రీలో నాకు హీరోయిన్గా ఒక్క ఛాన్స్ రాలేదు. తమిళ్లో వచ్చింది, చేశాను. నేను మాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నానని చాలామంది అనుకుంటున్నారు. అది నిజం కాదు, నన్నిక్కడ పెద్దగా పట్టించుకోలేదు. మంచి అవకాశాలు ఇవ్వడం లేదు. ఆ విషయం నాకు మాత్రమే తెలుసు. అవకాశాలొస్తేనే కదా నటిస్తాను. ఎందుకని నాపై కక్ష ఈ మధ్య ఓ వీడియో చూశాను. నేను కోలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నానని నాకు ఇక్కడ సపోర్ట్ చేయొద్దంటున్నాడో పెద్దాయన. ఇదెంతవరకు కరెక్టో నాకు అర్థం కావడం లేదు. నేను ఎవరికీ ఏ పాపం తలపెట్టలేదు. ఎందుకని నా మీద ఇలా పగబడుతున్నారు. తమిళంలో లీడ్ రోల్ ఛాన్స్ రాగానే చాలా సంతోషించాను. అది నా చేతి నుంచి జారిపోకూడదని ఆ దేవుడిని ఎంతగానో ప్రార్థించాను. మలయాళంలో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. వస్తే కచ్చితంగా చేస్తాను. నాకు డైరెక్షన్‌పై కూడా ఆసక్తి ఉంది. ఇప్పటివరకు ఎనిమిది షార్ట్ ఫిలింస్ రాసి, వాటికి దర్శకత్వం వహించాను' అని చెప్పుకొచ్చింది షాలిన్ జోయా. -
రియల్ లైఫ్‌లో ఒక్కటి కానున్న రీల్ జంట!
మలయాళీ ముద్దుగుమ్మ స్వసిక విజయ్ పెళ్లి చేసుకోబోతుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. నటుడు ప్రేమ్ జకోబ్తో ఏడడుగులు వేయనుందని భోగట్టా! తాజాగా ఈ పుకార్లపై నటి స్పందిస్తూ.. నిజంగానే వైవాహిక బంధంలో అడుగుపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ నెలలోనే పెళ్లి జరగనుందని స్పష్టం చేసింది. జకోబ్తో కలిసి కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. ఆ సీరియల్ నుంచే.. కాగా వీరిద్దరూ 'మనంపోలే మాంగళ్యం' అనే సీరియల్లో జంటగా నటించారు. అప్పటినుంచే వీరి మధ్య ప్రేమ మొదలైంది. ఆన్‌స్క్రీన్ జంటగా ప్రేక్షకుల మనసులు దోచుకున్న వీరు మరికొద్దిరోజుల్లోనే ఆఫ్‌స్క్రీన్ జంటగానూ మెప్పించనున్నారు. స్వసిక విజయ్ మొదట్లో హీరోయిన్గా నటించింది. తర్వాత సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు పోషించింది. తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈమె సీరియల్స్ కూడా చేసింది. తెలుగులో ఆ సినిమాలో హీరోయిన్గా స్వసిక నటి మాత్రమే కాదు యాంకర్ కూడా! పదేళ్లుగా ఎన్నో షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ వస్తోంది. అలా యాంకర్‌గా కూడా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. వీటికి తోడు షార్ట్ ఫిలింస్, మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లలోనూ యాక్ట్ చేసింది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. 2012లో వచ్చిన 'ఎటు చూసినా నువ్వే' చిత్రంలో హీరోయిన్గా నటించింది. చదవండి: బీడీల మీద బీడీలు తాగిన మహేశ్.. అసలు విషయం బయటపెట్టిన సూపర్ స్టార్ -
54 ఏళ్లు.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన హీరోయిన్
లక్ష్మీ గోపాలస్వామి.. నటిగా కన్నా కూడా భరతనాట్య కళాకారిణి అని పిలిపించుకోవడమే ఆమకు ఇష్టం. నాట్యం ద్వారానే కళ్లతో పలు భావాలను అవలీలగా పలికించగల నైపుణ్యాన్ని ఒడిసిపట్టుకుంది. తన అభినయంతో మలయాళ, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి పేరు సంపాదించుకుంది. సెకండ్ హీరోయిన్గా ఎక్కువ సినిమాలు చేసిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయింది. తెలుగులో అరవింద సమేత వీరరాఘవ, సైరా సినిమాల్లో తళుక్కుమని మెరిసింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెరపైనా సందడి చేస్తోంది. సరైనవాడు దొరకలేదు ఆదివారం(జనవరి 7న) ఈ నటి బర్త్‌డే. 54 ఏళ్ల వయసున్న ఈ నటి ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయింది. డ్యాన్స్, నటనల మధ్య పెళ్లి విషయాన్ని మర్చిపోయిందా? అని అప్పట్లో చాలామంది గుర్తు చేశారు. దీనికి సదరు నటి స్పందిస్తూ.. 'నా అందం చూసి, సమాజంలో నా గౌరవం చూసి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడేవారు నాకవసరం లేదు. ఇవేవీ లేకపోయినా నన్ను నన్నుగా ఇష్టపడేవాడినే పెళ్లి చేసుకుంటాను. అది కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికైతే సరైనవాడు దొరకలేదు' అని చెప్పింది. ఎప్పటికీ సింగిల్‌గానే.. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా మళ్లీ పెళ్లి ఊసే ఎత్తలేదు లక్ష్మి. ఇప్పుడేకంగా పెళ్లీడు దాటిపోవడంతో వివాహం గురించే ఆలోచించడం లేదని చెప్తోంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే వయసు కాదని, దాని గురించి అడగొద్దని విన్నపిస్తోంది. ఇది విన్న జనాలు ఇక లక్ష్మి ఎప్పటికీ సింగిల్‌గానే ఉంటుందా! అని మాట్లాడుకుంటున్నారు. చదవండి: వర్మ ఆడిషన్‌కు వెళ్లా.. నన్ను వెళ్లిపోమని చెప్పాడు.. తర్వాత పిలవనేలేదు -
పెళ్లంటే ఇంట్రస్ట్ లేదు, సహజీవనం చేస్తా: హీరోయిన్
మోడలింగ్‌తో కెరీర్ మొదలుపెట్టింది మోనిశ మోహన్ మీనన్. ఈ ఏడాది రిలీజైన ఫైట్ క్లబ్ మూవీలో హీరోయిన్గా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. అయితే ఆమెకు డైరెక్షన్ అంటే ఇష్టమట. అందుకే సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇంట్లో అందరూ తన ఇష్టాన్ని వ్యతిరేకించినా లెక్క చేయలేదు. తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అక్కడి నుంచి పారిపోయి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.. కో డైరెక్టర్‌గా న్యూ నార్మల్ అనే షార్ట్ ఫిలిం తెరకెక్కించింది. ఈ లఘు చిత్రం మంచి ఆదరణ పొందడంతోపాటు ఆమెకు బోలెడన్ని అవకాశాలను తెచ్చిపెట్టాయి. అయితే దర్శకురాలిగా కాకుండా హీరోయిన్గా ఛాన్సులు అందుకుంది మోనిశ. వాళ్ల సినిమాలు చూసే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోనిశ మాట్లాడుతూ.. 'అంజలి మీనన్, జోయా అక్తర్ వంటి దర్శకురాళ్ల సినిమాలు చూశాక నాకూ డైరెక్టర్ అవ్వాలనిపించింది. ఇదే విషయం ఇంట్లో చెప్తే నాన్న ఒప్పుకోలేదు. ఇంజనీరింగ్ చదివితే సరిపోతుంది.. సినిమాలు గట్రా ఏమీ వద్దన్నాడు. కానీ నా మనసు మాత్రం అటే లాగేది. ఇంజనీరింగ్ అయ్యాక ఇన్ఫోటెక్లో పని చేశాను. అప్పుడు కూడా సినిమా వైపు వెళ్తానంటే ఇంట్లో అంతా తిరస్కరించారు. వీళ్లు ఒప్పుకునేలా లేరని 2016లో ఇల్లు వదిలి బయటకు వచ్చాను. రీసెర్చ్ టీమ్‌లో అడుగుపెట్టా.. ఆ తర్వాత దర్శకుడు రోషన్ 'కాయంకులం కొచున్ని' సినిమా కోసం ఒక రీసెర్చ్ టీమ్ కావాలని పేపర్లో యాడ్ ఇచ్చాడు. ఈ అధ్యయనాల గురించి నాకు పెద్దగా అవగాహన లేకపోయినా ఎలాగోలా సినిమాల్లో దూరిపోవాలని ప్రయత్నించాను, సక్సెస్ అయ్యాను. రీసెర్చ్ టీమ్‌లో బాగా పని చేసినవారికి అసిస్టెంట్‌గా ఛాన్స్ ఇస్తానన్నాడు. అలా ముప్పుతిప్పలు పడి ఆయన చెప్పింది అధ్యాయం చేసి మంచి మార్కులు కొట్టేశాను. పెళ్లిపై ఆసక్తి లేదు తర్వాత ఆయన తెరకెక్కించిన నాలుగు సినిమాలకు తన దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎన్నాళ్లని చేస్తాను.. ఎప్పటికైనా దర్శకురాలిని అవ్వాలన్నదే నా కల. అలా న్యూ నార్మల్ అనే షార్ట్ ఫిలిం తీశాను. చాలా సంతృప్తిగా అనిపించింది. పెళ్లి విషయానికి వస్తే.. నాకలాంటి ఆలోచనే లేదు. పెళ్లికి బదులుగా సహజీవనం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు రెండు నెలలు కాగానే బ్రేకప్ చెప్పుకుని మరొకరిని ప్రేమిస్తున్నారు. ఈ మాత్రందానికి పెళ్లెందుకు?' అంటోంది మోనిశ. చదవండి: అల్లు అర్జున్ ఇంటి భవన నిర్మాణానికి పని చేశా.. పెద్ద దెబ్బ తగిలి రక్తం.. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. యంగ్ హీరోయిన్ మృతి!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి మలయాళ నటి లక్ష్మీకా సజీవన్ కన్నుమూశారు. ప్రస్తుతం యూఏఈలో ఉన్న ఆమె గుండెపోటుతో కేవలం 27 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు. ఈ వార్త మాలీవుడ్ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. అజు అజీష్ దర్శకత్వం వహించిన 'కాక్క' షార్ట్ ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష్మిక ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. లక్ష్మిక సజీవన్ తన కెరీర్లో పంచవర్ణతతా, సౌదీ వెల్లక్కా, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాదన్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్, దుల్కర్ సల్మాన్ నటించిన ఒరు యమందన్ ప్రేమకథా చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Lakshmika Sajeevan (@lakshmikasajeevanoffical) -
ఎనిమిది నెలల గర్భిణి.. నటి కన్నుమూత..
మలయాళ చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. బుల్లితెర నటి రెంజూష మీనన్ మరణవార్త మరువకముందే మరో బుల్లితెర నటి, డాక్టర్ ప్రియ(35) గుండెపోటుతో మరణించింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన ప్రియ ప్రెగ్నెన్సీ చెకప్‌లో భాగంగా ఇటీవలే ఆస్పత్రికి వచ్చింది. ఇంతలోనే ఆమెకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి గర్భంలో ఉన్న శిశువును బయటకు తీశారు. శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రియను మాత్రం బతికించలేకపోయారు. ప్రియ మరణవార్తను నటుడు కిషోర్ సత్య సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'ప్రియ గుండెపోటుతో మరణించింది. అప్పుడే పుట్టిన శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి అమాయక మనుషులకు దేవుడు ఎందుకింత అన్యాయం చేశాడో అర్థం కావట్లేదు. 35 ఏళ్లకే ఆమెకు నిండునూరేళ్లు నిండిపోయాయా? ఈ బాధ నుంచి ఆమె తల్లి, భర్త ఎలా బయటపడగలరు? వారికి భగవంతుడు ఈ బాధను తట్టుకోగలిగే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Kishor Satya (@kishor.satya) చదవండి: స్టేజీపై బాగా నటించావ్.. శెభాష్ బండ్ల గణేశ్ -
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బుల్లితెర నటి ఆత్మహత్య!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ బుల్లితెర నటి రెంజూష మీనన్ ఆత్మహత్యకు పాల్పడింది. తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించింది. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ షాకయ్యారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. రెంజూషా మీనన్ మలయాళ సీరియల్ 'స్త్రీ'తో నటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత ఆణె అనేక చిత్రాలలో కీలక పాత్రల్లో నటించింది. తన భర్తతో కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తోంది. అయితే ఆమె మరణానికి కొన్ని గంటల ముందే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో రీల్స్ చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించింది. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఆమె ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం. ఆ కారణంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు. రెంజూషా టీవీ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. కొచ్చికి చెందిన రెంజూషా ఒక మొదట యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత 'స్త్రీ' సీరియల్‌తో బుల్లితెరపై మెరిసింది. 'నిజలాట్టం,' 'మగలుడే అమ్మ,' బాలామణి' లాంటి ధారావాహికల్లో కనిపించింది. అంతే కాకుండా 'సిటీ ఆఫ్ గాడ్' మరియు 'మెరిక్కుండోరు కుంజడు' అనే సినిమాల్లో కూడా కనిపించింది. చివరిసారిగా 'ఆనందరాగం' అనే టీవీ షోలో లీడ్ రోల్ పాత్ర పోషించింది. View this post on Instagram A post shared by Sumesh Surya (@sumeshsurya) #Malayalam TV and film actress Renjusha Menon found dead in her flat Renjusha Menon made her debut as an actor with the Malayalam serial 'Sthree'. She also played many supporting roles in several films.https://t.co/iGKNsYWFvZ — South First (@TheSouthfirst) October 30, 2023 View this post on Instagram A post shared by Sreedevi Anil (@anil_sreedevi) -
స్టార్ హీరోయిన్ కూతురు బర్త్‌డే.. సోషల్ మీడియాలో వైరల్!
అమ్మా, నాన్న.. ఓ తమిళ అమ్మాయి చిత్రంతో రవితేజ సరసన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ భామ ఆసిన్. ఆ తర్వాత శివమణి, లక్ష్మీనరసింహా, షుర్షణ, అన్నవరం లాంటి చిత్రాల్లో స్టార్ హీరోలతో నటించింది. తమిళంతో పాటు హిందీలోనూ పలు సినిమాల్లో కనిపించింది. కోలీవుడ్‌లో కమల్ హాసన్ సరసన దశవతారం, సూర్యకు జంటగా గజిని లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. ఆసిన్ ఏకంగా ఎనిమిది భాషల్లో మాట్లాడగలదు. అన్ని భాషల్లోనూ తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునే టాలెంట్ ఆమె సొంతం. (ఇది చదవండి: రికార్డులు కొల్లగొడుతున్న లియో.. కమల్, రజినీ చిత్రాలను వెనక్కినెట్టి!) తాజాగా అసిన్ తన కుమార్తె అరిన్ పుట్టినరోజు వేడుకలు చేసుకుంది భామ. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఆసిన్ కూతురు తన ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. కాగా.. ఆసిన్ చివరిసారిగా 2015లో వచ్చిన అభిషేక్ బచ్చన్, రిషి కపూర్, సుప్రియా పాఠక్‌లతో కలిసి ఆల్ ఈజ్ వెల్ అనే కామెడీ చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా బాలీవుడ్లో అమీర్ ఖాన్ నటించిన గజిని, రెడీ, బోల్ బచ్చన్, హౌస్‌ఫుల్ -2 లాంటి హిట్ చిత్రాలలో నటించింది. కాగా.. అసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంట అక్టోబర్ 2017లో తమ కుమార్తె అరిన్‌ను స్వాగతించారు. అయితే రాహుల్ శర్మను పెళ్లాడిన తర్వాత ఆసిన్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. (ఇది చదవండి: గర్భస్రావమని చెప్పినా వినలేదు.. మరుసటి రోజే షూటింగ్: బుల్లితెర నటి) -
హీరోయిన్గా ఊర్వశి వారసురాలు ఎంట్రీ?
ముందానై ముడిచ్చు చిత్రంతో కథానాయకిగా పరిచయమై తన చిలిపితనంతో కూడిన నటనతో అందరినీ ఆకర్షించిన మలయాళ నటి ఊర్వశి. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. 1980-90 ప్రాంతంలో ప్రముఖ కథానాయకిగా వెలిగిన ఆమె తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు. (ఇది చదవండి: బిడ్డతో తొలిసారి ఫారిన్ టూర్‌కు చెర్రీ దంపతులు.. పెళ్లి కోసమేనా?) నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే మలయాళ నటుడు మనోజ్ కే.జయన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుంజట్టా అనే కూతురు ఉంది. అయితే కొన్నేళ్లకే మనస్పర్థల కారణంగా ఊర్వశి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అయినా కూతురు ఇద్దరి వద్ద ఉంటూ పెరుగుతూ వచ్చింది. కాగా.. ఆ తరువాత ఊర్వశి రెండో పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఆమె కూతురు కుంజట్టాతో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో ఊర్వశి వారసురాలు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. కుంజట్టాకు కథనాయకికి కావలసిన అన్ని లక్షణాలు ఉండడంతో తర్వాత హీరోయిన్ అనే ప్రచారం ఊపందుకుంది. ఊర్వశి ఉద్దేశం కూడా అదే కావచ్చు అంటున్నారు ఫ్యాన్స్. అందుకే ఇన్నాళ్లకు తన కూతురితో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కుంజట్టాను హీరోయిన్గా పరిచయం చేయడానికి కొందరు దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు టాక్. అయితే ఈ విషయంపై ఊర్వశి ఎలాంటి ప్రకటన చేయలేదు. (ఇది చదవండి: ఇండియాలో అమ్ముడయ్యేది ఆ రెండే.. హీరోయిన్ భర్త షాకింగ్ కామెంట్స్! ) -
'నటితో అసభ్య ప్రవర్తన.. ఎయిర్పోర్ట్ అధికారులపై తీరుపై ఆగ్రహం'
ప్రస్తుత కాలంతో మహిళలపై ప్రతి రోజు ఎక్కడో ఒకచోట వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లోనూ ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారు. వీరిలో సామాన్య మహిళలే కాదు.. సెలబ్రిటీలు సైతం బాధితులవుతున్నారు. తాజాగా మలయాళ నటి దివ్యప్రభకు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. ముంబయి నుంచి కొచ్చిన్ వెళ్తుండగా తన పక్కనే ఉన్న ప్రయాణికుడు వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ సంఘటన అక్టోబర్ 10న మంగళవారం జరగ్గా.. తాజాగా నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. (ఇది చదవండి: ‘ఇండియన్ 3’కి కమల్ గ్రీన్ సిగ్నల్.. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి!) ఇన్‌స్టాలో దివ్య ప్రభ రాస్తూ.. 'ప్రియమైన మిత్రులారా.. నేను ముంబయి నుంచి కొచ్చికి ఎయిరిండియా ఫ్లైట్‌లో వచ్చా. ఈ ప్రయాణంలో నాకు ఊహించని సంఘటన ఎదురైంది. దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఫ్లైట్‌లో తోటి ప్రయాణీకుడు తాగిన మత్తులో నన్ను వేధించాడు. ఈ విషయాన్ని ఎయిర్ హోస్టెస్‌కు చెబితే.. టేకాఫ్‌కు ముందు నా సీటును మాత్రమే మార్చారు. కొచ్చి విమానాశ్రయంలో దిగిన తర్వాత సమస్యను ఎయిర్పోర్ట్ అధికారులకు వివరించాను. వారు నన్ను ఎయిర్‌పోర్ట్‌లోని పోలీసు సహాయ పోస్ట్‌కు వెళ్లమని సలహా మాత్రమే ఇచ్చారు. అయితే ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయవలసిందిగా కేరళ పోలీసులకు ఈ మెయిల్ ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేశా. ప్రయాణీకుల భద్రత ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకుందాం. తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ప్రోత్సహిద్దాం. ఈ విషయంలో మీ సపోర్ట్ కావాలి' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: 'నేను ఆరోజు ఏడుస్తానేమో'.. కూతురి పెళ్లిపై స్టార్ హీరో ఎమోషనల్! ) ఈ వేధింపులకు సంబంధించి కంప్లైంట్‌తో పాటు ఎయిరిండియా ప్లైట్ టికెట్‌ను కూడా షేర్ చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని.. అదే సమయంలో విమానాల్లో ప్రయాణీకుల భద్రత కోసం కూడా చర్యలు తీసుకోవాలని ఆమె ఎయిర్పోర్ట్ అధికారులను కోరారు. ముఖ్యంగా ఎయిరిండియా సిబ్బంది, అధికారుల స్పందన తనను నిరాశకు గురిచేసిందని దివ్య ప్రస్తావించారు. అయితే ఎయిర్పోర్ట్ అధికారుల తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు, ఎయిర్పోర్ట్ అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ దివ్యకు మద్దతుగా నిలుస్తున్నారు. మలయాళ నటి అన్నా బెన్ దివ్యకు మద్దతుగా పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Divyaprabha (@divya_prabha__) -
మూడు దశాబ్దాల పాటు సినిమాలు.. ఇప్పుడేమో అత్యంత దీన స్థితిలో !
ఒకప్పుడు తన సినిమాలతో అభిమానులను అలరించిన నటి కనకలత. ఆమె సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ తనదైన నటనతో మెప్పించింది. మలయాళ చిత్రాలైన ప్రియం, అధ్యతే కన్మణి చిత్రాలతో ఆమెకు గుర్తింపు లభించింది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా మలయాళం, తమిళంలో ఇండస్ట్రీలో కొనసాగారు. (ఇది చదవండి: యాత్ర 2.. ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్.. ఒక్కటి గుర్తుపెట్టుకోండి!) అయితే ప్రస్తుతం కనకలత పరిస్థితి అత్యంత దయనీయ స్థితిలో ఉంది. ఆమెకు అల్జీమర్స్‌తో పాటు పార్కిన్సన్స్ వ్యాధి సోకింది. తాజాగా కనకలత అనారోగ్యం గురించి ఆమె సోదరి విజయమ్మ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆగస్టు 2021లో ఆమె అనారోగ్యం బారిన పడినట్లు తెలిపింది. ప్రస్తుతం రోజుల తరబడి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆహారం తీసుకునే పరిస్థితిలోనే లేరని సోదరి చెబుతోంది. కేవలం లిక్విడ్ ఫుడ్తోనే కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిపింది. ఆమె తన రోజువారీ కాలకృత్యాలు సైతం మరచిపోతోందని.. డైపర్లు ఉపయోగించాల్సి వస్తోందని వివరించింది. తన పేరు కూడా గుర్తు లేదని ఆమె సోదరి వాపోయింది. ప్రస్తుతం విజయమ్మ, ఆమె మేనల్లుడు కనకలత వద్దే ఉంటున్నారు. కాగా.. 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్న నటి 16 ఏళ్ల తర్వాత భర్త నుంచి విడిపోయింది. అయితే ఆమెకు ఎలాంటి సంతానం కలగలేదు. (ఇది చదవండి: షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!) ప్రస్తుతం ఆమెకు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) నుంచి నెలకు రూ. 5000 అందుతోంది. ఆమెకు సంస్థ బీమా కూడా ఉంది. ఆమె అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ మీడియా ఆర్టిస్ట్స్ (ATMA), ఫిల్మ్ అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం కూడా అందుకుంటోంది. కనకలత తన కెరీర్లో 360కి పైగా సినిమాల్లో నటించారు. ఆమె చివరిసారిగా పూక్కలం అనే చిత్రంలో కనిపించింది. నాటకాల ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది -
సినిమాల్లోకి వస్తానని అస్సలు ఊహించలేదు: ప్రియా ప్రకాశ్
ఒక్క అడుగు జీవితాన్ని మార్చేస్తుందంటారు. అలా ఒకే ఒక్క చిత్రం నటి ప్రియా ప్రకాష్ వారియర్ జీవితాన్నే మార్చేసింది. ఆమె హీరోయిన్గా పరిచయమైన మలయాళ చిత్రం ఓరు అదారు లవ్. ఈ చిత్రం విజయం సాధించిందా అంటే అదీ లేదు. అయితే ట్రైలర్.. ఆ చిత్రానికి కావలసిన దానికంటే ఎక్కువ క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. ముఖ్యంగా నటి ప్రియాప్రకాష్ వారియర్ తన లవర్‌కు కన్ను కొట్టే దృశ్యం యువత గుండెల్లో గిలిగింతలు పెట్టించింది. ఆ చిత్రం మలయాళంతో పాటు ఇతర భాషల వ్యాపారానికి కూడా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ప్రియా ప్రకాష్ వారియర్‌ను పాపులర్ చేసింది. (ఇది చదవండి: త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!) అయితే ఇదంతా జరిగి చాలాకాలమైంది కదా.. మళ్లీ ఇప్పుడెందుకు అంటారా? దీనిపై ప్రియా ప్రకాష్ వారియర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. తనకు చిన్నతనం నుంచి సినిమాలు చూడడం చాలా ఇష్టమని చెప్పింది. సినిమాలు చూసి ఇంటికి వచ్చిన తరువాత అద్దం ముందు నిలబడి ఆయా చిత్రాల హీరోయిన్ల మాదిరి నటించేదానినని చెప్పింది. తాను నటి అవుతానని తన తల్లిదండ్రులే కాదు.. తానూ ఊహించలేదని తెలిపింది. అలా చదువుకుంటున్న సమయంలోనే ఆడిషన్లో పాల్గొన్న సెలెక్ట్ అయ్యానని.. ఆ చిత్రాన్ని పూర్తి చేయడానికి తన తల్లిదండ్రులు అంగీకరించినట్లు చెప్పింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు రావడంతో నటిగా మారినట్లు చెప్పింది. కాగా ప్రియా ప్రకాశ్ మలయాళంతో పాటు తెలుగు తమిళం , హిందీ భాషల్లోనూ నటిస్తోంది. కాగా తను తొలి చిత్రం ట్రైలర్లో కన్ను కొట్టిన దృశ్యాన్ని బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ చూసి చాలా మంచి నటి అవుతుందని, ఈ నటి తన కాలంలో ఎందుకు రాలేదని ప్రశంసలు కురిపించారట. దీంతో ఆయన ప్రశంసల కంటే పెద్ద అవార్డు ఏముంటుందని పేర్కొంది . నటిగా తాను ఎంత పాపులర్ అయ్యానో తెలియదు.. కానీ రిషికపూర్ కితాబును జీవితాంతం మరిచిపోలేనని ట్విట్టర్లో వెల్లడించింది. (ఇది చదవండి: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. స్టార్ హీరోయిన్‌కు సమన్లు!) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) -
ఆ సమయంలో ఉన్న ఊరినే వదిలేసి వెళ్లా: యమదొంగ హీరోయిన్
జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ నటి మమతా మోహన్‌దాస్. ఇటీవలే చాలా రోజుల తర్వాత మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జగపతిబాబు నటించిన రుద్రంగి సినిమాతో టాలీవుడ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 2005లోనే మయూకం మలయాళ మూవీతో తెరంగేట్రం చేసిన ఈ మలయాళీ భామ ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో సత్తాచాటారు. (ఇది చదవండి: మరోసారి ఇలాంటి పని చేస్తే చెంప పగలగొడతా.. నటుడికి వార్నింగ్ ఇచ్చిన యాంకర్) దాదాపు 18 ఏళ్ల పాటు కథానాయకిగా కొనసాగుతున్న ఈ బహుభాషా నటి తన సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఆమె క్యాన్సర్ బారిన పడి.. ఆ మహమ్మారిని జయించడంతో పాటు మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే క్యాన్సర్ వ్యాధిని జయించడం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ సమయంలో అవగాహన ఉండటం చాలా ముఖ్యమని తెలిపారు. ఆ వ్యాధిపై అవగాహన ఉంటే దాని నుంచి బయటపడడం సాధ్యమేనని మమతా మోహన్‌దాస్ పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సానుభూతి చాలా లభిస్తుందన్నారు. కానీ సానుభూతి ఆశిస్తే కలిగే నష్టాలే ఎక్కువ అన్నారు. అలాంటి సానుభూతి తనకు అక్కరలేదని తెలిపారు. ఆ సమయంలో తాను ఉన్న ఊరిని వదిలేశానని, సినిమాలను కూడా పక్కన పెట్టానని చెప్పుకొచ్చింది. ఆసుపత్రిలోనే ఉండే చికిత్స పొందినట్లు తెలిపారు. (ఇది చదవండి: నమ్రతా బాటలోనే మహేశ్ బాబు హీరోయిన్.. ఏంటా నిర్ణయం!) ఆ సమయంలో తాను కేవలం తల్లిదండ్రుల ఆదరాభిమానాలను మాత్రమే ఆశించానని చెప్పారు. క్యాన్సర్ వ్యాధిని జయించే వరకు కేరళ దరిదాపుల్లోకి కూడా రాలేదన్నారు. అయితే ఈ వ్యాధి నుంచి బయటపడ్డ అంతకుముందు రూపం మళ్లీ రాదని.. ఈ విషయాన్ని గ్రహించాలని మమతా చెప్పారు. కాగా ప్రస్తుతం మమతా మోహన్‌దాస్ మలయాళంలో మూడు చిత్రాలు.. తమిళంలో విజయ్ సేతుపతికి జంటగా మహరాజా చిత్రంతో పాటు ఊమై విళిగల్ అనే మరో సినిమాలో నటిస్తున్నారు. -
ఇద్దరు పిల్లల తండ్రిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న నటి?!
నటి రస్నా.. మలయాళ బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు. మలయాళంలో పారిజాతం సీరియల్ చూసిన ఎవ్వరూ ఈమెను అంత ఈజీగా మర్చిపోలేరు. ఇందులో ఆమె ద్విపాత్రిభినయం చేసి తన నటనతో అందరినీ మెప్పించింది. తర్వాత ఈ సీరియల్ తమిళ, కన్నడ భాషల్లోనూ రీమేక్ అవగా అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. ఇంతలా పాపులారిటీ తెచ్చుకున్న రస్నా కొంతకాలానికి ఉన్నట్లుండి స్మాల్ స్క్రీన్‌పై కనిపించకుండా పోయింది. దానికి గల కారణమేంటో చూద్దాం.. సీరియల్స్‌తో ఫేమస్ రస్నా ఆరో తరగతి చదువుతున్నప్పుడే తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించింది. తర్వాత అమ్మక్కై సీరియల్లో కనిపించింది. అక్కడ క్లిక్ అవడంతో పారిజాతం ఆఫర్ వచ్చింది. అప్పటికి ఆమె ఇంకా ఇంటర్ చదువుతోంది. ఈ ధారావాహిక తర్వాత ఆమె సింధూరచెప్, వెళంకన్ని మాటవ్, బృందావనం, వధు అండ్ నందనం వంటి సీరియల్స్ చేసింది. బుల్లితెరపై స్టార్‌గా వెలుగొందుతున్న రోజుల్లో ఆమె దర్శకనిర్మాత బైజు దేవరాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది నటి. ప్రేమను వ్యతిరేకించిన కుటుంబం వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఇతడి కోసం మతం మార్చుకున్న రస్నా తన పేరును సాక్షిగా మార్చుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు దేవానంద(7), విఘ్నేశ్(5) సంతానం. అయితే రస్నా పెళ్లిని ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. అందుకు కారణం దర్శకుడికి అప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. ఇది అభిమానులకు సైతం నచ్చలేదు. రస్నా, దేవరాజ్ మధ్య ఏజ్‌గ్యాప్ కూడా చాలా ఎక్కువే! అతడితో పెళ్లేంటని ఫ్యాన్స్ సైతం వ్యతిరేకత వ్యక్తం చేశారు. భర్త బిజినెస్ చూస్తున్న నటి ఇద్దరు పిల్లల తండ్రిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుందన్న ఆరోపణలు వచ్చాయి. కానీ వీళ్లు దాన్ని పట్టించుకోలేదు. ఎవరేమనుకున్నా తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు. అంతే కాదు, దేవరాజ్ తీస్తున్న కొత్త సీరియల్ ప్రమోషన్స్‌లోనూ చురుకుగా పాల్గొంది రస్నా. సోషల్ మీడియాలోనూ సీరియల్‌ను ప్రమోట్ చేసింది. భర్త బిజినెస్ వ్యవహారాలను సైతం చూసుకుంటోంది. చదవండి: బన్నీకి జాతీయ అవార్డు.. లేట్‌గా విష్ చేసిన చరణ్ -
బిగ్ హీరోతో సినిమా ఛాన్స్.. ఈ ఒక్క కారణంతో నన్ను తొలగించారు: యంగ్ హీరోయిన్
‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కేరళ బ్యూటీ ఇవాన. ఎలాంటి అంచనాలు లేకుండా తమిళనాటలో మొదట విడుదలైన ఈ చిత్రం తర్వాత తెలుగులో కూడా విడుదలైంది. ఈ సినిమాను కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే.. రూ.60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి తమిళ్లో చరిత్ర సృష్టించింది. ఇందులో హీరోయిన్గా నటించిన ఇవానకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నిర్మించిన lgm చిత్రంతో ఇవాన మళ్లీ తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే ఇవానా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. (ఇదీ చదవండి: పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంలో విషాదం.. గుండెపోటుతో స్పందన మృతి) ఇవానా తక్కువ ఎత్తు ఉండటం వల్ల తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొవడమే కాకుండా వచ్చిన సినిమా అవకాశాలను కూడా కోల్పోయానని తెలిపింది. అలాంటి సమయంలో చాలా బాధ కలిగిందని ఆమె చెప్పింది. వారు శారీరక రూపం గురించి ఎందుకు మాట్లాడుతారు అని తనలో తాను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటానని పేర్కొంది. అలా బాధలో ఉన్న తనకు ఒకరోజు కన్నడలోని ఒక బిగ్ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కింది. సినిమా పూజా కార్యక్రమం కూడా చేశారు. కానీ ఆఖరి నిమిషంలో హీరో పక్కన తన ఎత్తు సరిపోదని చెప్పి తిరష్కరించారని ఇవాన చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: బాబు.. నువ్వే మా జీవితంలో వెలుగు నింపావ్..నిహారిక పోస్ట్ వైరల్) లవ్ టుడే సినిమా విడుదల సమయంలో కూడా తాను బాడీ షేమింగ్ గురించి ఎదుర్కొన్నానని ఇవానా ఇలా వెల్లడించింది. 'నేను పొట్టిగా ఉన్నానని అందరూ అంటారు. స్కూల్లో చదువుతున్నప్పుడు నాకు కూడా అలానే అనిపించింది. స్కూల్ అసెంబ్లీ ఏర్పాటు సమయంలో నన్నే ముందు వరసలో నిల్చోబెట్టేవారు.. ఎందుకంటే నేను హైట్ తక్కువని. అదంతా చిన్న క్లాసులో నుంచే నాకు అనుభవమే. ఒక్కోసారి స్నేహితులు ఎగతాళి చేసినప్పుడు దాని ప్రభావం రోజంతా ఉంటుంది.' అని ఇవానా తెలిపింది. -
చంపేస్తానని బెదిరిస్తున్నాడు.. యువ హీరోయిన్ ఫిర్యాదు
టాలీవుడ్లో 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అర్థనా బిను. 2016లో వచ్చిన ఈ సినిమాలో రాజ్ తరుణ్‌కు జోడీగా నటించింది. చూడటానికి అచ్చ తెలుగమ్మాయిలా ఉంటుంది ఈ మలయాళీ బ్యూటీ. ఆ సినిమా తర్వాత ఇంతవరకు తను ఏ తెలుగు మూవీలో నటించలేదు. కానీ తమిళ్,మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక) తాజాగా హీరోయిన్ 'అర్థనా బిను' తన తండ్రి విజయకుమార్‌పై షాకింగ్ ఆరోపణలు చేసింది. తన తల్లి విడాకులు తీసుకోవడంతో తండ్రికి దూరంగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రి, నటుడు విజయకుమార్ అక్రమంగా ఇంట్లోకి చొరబడిన వీడియోను షేర్ చేసింది. తన తల్లి నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ అతను అప్పుడప్పుడు ఇంటికి వచ్చి గందరగోళం చేస్తుంటాడని ఆరోపించింది. తన కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె తెలిపింది. 'ఈ రోజు, అతను మా ఇంటి కాంపౌండ్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. అప్పటికే మేము ఇంటిలోపల నుంచి తలుపు లాక్ చేయడంతో కిటికీ ద్వారా బెదిరింపులకు దిగాడు. నా చెల్లెలుతో పాటు అందరినీ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా సినిమాల్లో నటించడం ఆపేయ్ లేదా తను చెప్పిన సినిమాల్లో మాత్రమే నటించాలని షరతులు పెడుతున్నాడు. నాతో ఉండే నటల గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నాడు. చివరకు మా అమ్మ పనిచేసే ప్రదేశంతో పాటు సోదరి చదువుకునే విద్యా సంస్థ వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించినందుకు అతనిపై కోర్టులో కేసు నడుస్తుండగా ఇప్పుడు ఇంటికి వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు.' అని తెలిపింది. (ఇదీ చదవండి: స్పై సినిమా ఎఫెక్ట్.. అభిమానులను క్షమాపణ కోరిన హీరో నిఖిల్) తనను సినిమాలు చేయకుండా, నటించకుండా ఆపాలని తండ్రి విజయకుమార్ తనపై కూడా కేసు పెట్టాడని అర్థనా పేర్కొంది. 'నేను నా ఇష్టానికి మాత్రమే సినిమాల్లో నటిస్తున్నాను. మూవీలో నటించడం నా అభిరుచి, నాకు ఆరోగ్యం సహకరించినంత కాలం నటిస్తూనే ఉంటాను. సినిమాల్లో నటించకుండా ఆపాలని నాపై కేసు పెట్టాడు. నేను షైలాక్లో నటించినప్పుడు కూడా, అతను లీగల్‌గా కేసు పెట్టాడు. ఆ సినిమా ఆగిపోకుండా ఉండేందుకు నేను నా సొంత ఇష్టానుసారం సినిమాలో నటించానని అధికారిక చట్టపరమైన పత్రాలపై సంతకం చేయాల్సి వచ్చింది. అని వాపోయింది. View this post on Instagram A post shared by Arthana Binu (@arthana_binu) -
'సైతాన్' వెబ్ సిరీస్.. ఆ బోల్డ్ సీన్స్ చేసిన నటి ఎవరో తెలుసా?
ఇటీవలే మహీ వీ రాఘవ దర్శకత్వంలో వచ్చిన వెబ్ సరీస్ సైతాన్. అయితే ఈ సిరీస్‌లో అంతా బోల్డ్ కంటెంట్‌తో సరికొత్త సంచలనం సృష్టించింది. గతంలో బోల్డ్ కంటెంట్ అనగానే చాలామందికి 'మీర్జాపుర్' గుర్తొస్తుందేమో. కానీ ఇప్పుడు దాన్ని తలదన్నే రీతిలో 'సైతాన్' తెరకెక్కించారు. ఎందుకంటే ఈ సిరీస్ లో బూతులు, అడల్ట్ సీన్స్ లెక్కకు మించి ఉన్నప్పటికీ.. ఎమోషన్ కూడా అదే స్థాయిలో వర్కౌట్ అయింది. దీంతో సిరీస్ సూపర్ హిట్ అయింది. అయితే ఈ సిరీస్‌లో బోల్డ్ సీన్లలో నటించిన నటి ఎవరో తెలుసా? ఇంతకు ముందు ఆమె ఎన్ని సినిమాలు చేసింది? అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటనే దానిపై ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తోంది. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: 'సైతాన్' దర్శకుడి వెంటపడుతున్న ఓటీటీలు!) మహీ వి రాఘవ వెబ్ సిరీస్ సైతాన్లో హీరో తల్లిగా సావిత్రి పాత్రలో నటించింది. ఆమె అసలు పేరు షెల్లీ నబుకుమార్ అలియాస్ షెల్లీ కిశోర్. ఆమె 1983 ఆగస్టు 18న దుబాయ్‌లో జన్మించింది. మలయాళంలో సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కుంకుమపువ్వు సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. మిన్నల్ మురళి, తంగ మీన్కల్ లాంటి మలయాళ చిత్రాల్లోనూ నటించింది. ఆమెకు 2006లో ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకుంది. ఇటీవల తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్ సైతాన్లో ఆమె నటించింది. ఇందులో ముగ్గురు పిల్లలకు తల్లిగా ఆమె నటించింది. ఈ సిరీస్‌లో ఆమె నటన మరింత బోల్డ్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఈ సిరీస్‌తో ఒక్కసారిగా తెలుగులోనూ పాపులర్ అయిన షెల్లీ కిశోర్ ప్రస్తుతం మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. (ఇది చదవండి: అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!) View this post on Instagram A post shared by Shelly.n.kumar (@shelly.n.kumar) -
నువ్వు లేకుండా ఇల్లు బోసిపోతోంది.. మిస్ యూ: సీనియర్ హీరోయిన్
మలయాళ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ పార్వతి జయరామ్. 70కు పైగా సినిమాలు చేసిన ఆమె హీరో జయరామ్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. వీరికి కాళిదాస్, మాళవిక అని ఇద్దరు సంతానం. కుటుంబం కోసం భార్యాభర్తలిద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పదని, అందుకే తాను సినిమాలకు దూరమయ్యానని గతంలో చెప్పుకొచ్చింది పార్వతి. తాజాగా ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ షేర్ చేసింది. తన పెంపుడు శునకం చనిపోవడంతో దానితో కలిసి ఆడుకున్న క్షణాలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనలైంది నటి. 'మెస్సిమ్మ.. మాటలు రావడం లేదు. 40 రోజుల బేబీగా నా దగ్గరకు వచ్చావు. నాపై ఎనలేని ప్రేమ కురిపించావు. నన్నొక ఉత్తమ వ్యక్తిగా మలిచావు. నీ చిలిపి చేష్టలను, సాంగత్యాన్ని మిస్ అవుతాను. ఆ భగవంతుడు నిన్ను నాకు ఒక కొడుకుగా ఇచ్చాడు.. అలాంటిది ఇప్పుడు నిన్ను వదిలి ఉండటం అనేది ఊహించుకోలేకపోతున్నాను. నువ్వు లేకుండా ఇల్లు బోసిపోతోంది. ఇప్పుడు నువ్వు ఆ నింగిలోని ప్రకాశవంతమైన నక్షత్రాల్లో ఒకటిగా మిగిలిపోయావేమో.. ఎక్కడున్నా కూడా అదే చిలిపితనంతో అంతే సంతోషంగా ఉండాలి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. ఇట్లు నీ అమ్మ, నాన్న, కన్నన్, చక్కి' అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు పెంపుడు కుక్క అంటే ఎంత ఇష్టమో అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aswathi Jayaram (@aswathi_jayaram) చదవండి: కోడలితో కలిసి కొడుకు టార్చర్.. పోలీసులను ఆశ్రయించిన నటి -
రోజుకు రూ.4 లక్షలు.. దారుణంగా మోసపోయా: షకీలా
ఒకప్పుడు నటి షకీలా ఈ పేరు వింటేనే ఒకప్పుడు కుర్రకారు గుండెలు లయ తప్పేవి. ఆమె నటించిన చిత్రాలు విడుదల అవుతున్నాయి అంటే మలయాళ సూపర్‌స్టార్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అంతటి చరిత్ర ఉన్న శృంగార కథానాయకి షకీలా. ఒకప్పుడు మలయాళంలో గంటల కాల్షీట్స్ ఇచ్చి నటించిన మోస్ట్ వాంటెడ్ నటి. (ఇది చదవండి: విషమంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం.. ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు!) బహుభాషా నటిగా గుర్తింపు పొందిన షకీలా ఒక సమయంలో చిత్రానికి దర్శకత్వం వహించే ప్రయత్నం కూడా చేశారు. అదే విధంగా తన జీవిత చరిత్రను కూడా రాసుకున్నారు. అలాంటి నటి ప్రస్తుతం అడపా దడపా వస్తున్న అవకాశాల్లో నటిస్తూ సీరియళ్లలో, టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాలం గడుపుతున్నారు. అయితే షకీలా బాగా ఆస్తులు కూడబెట్టారని, బీఎండబ్ల్యూ కారులో తిరుగుతున్నారనే ప్రచారం జరిగింది. ఇలాంటి వార్తలపై స్పందించిన షకీలా ఒక భేటీలో పేర్కొంటూ నిజమే తాను చాలా ఆస్తులు సంపాదించుకున్నానన్నారు. ఒకప్పుడు రోజుకు రూ.4 లక్షలు తీసుకున్నానని చెప్పారు. అయితే తన సంపాదన అంతా ఆదాయ శాఖాధికారులు సోదాలు చేస్తారని తన సోదరి ఆస్తులు రాయించుకుని మోసం చేసినట్లు తెలిపింది. అలాంటిది తనకు ఇప్పుడు బీఎండబ్ల్యూ కారు ఉన్నట్లు వదంతులు పుట్టిస్తున్నారని.. నిజానికి సొంత ఇల్లు కూడా లేక తాను అద్దె ఇంటిలో ఉంటున్నట్లు నటి షకీలా పేర్కొంది. (ఇది చదవండి: రైలు ప్రమాద ఘటనతో నా గుండె పగిలింది: అల్లు అర్జున్) -
మాళవిక బోల్డ్ కామెంట్స్.. సిగ్గుపడి మెలికలు తిరిగిపోయిన డైరెక్టర్!
‘ఎవడే సుబ్రమణ్యం’తో టాలీవుడ్ పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్. యంగ్ హీరో నాగశౌర్యతో ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి సినిమాలో కనిపించింది. ఆ చిత్రంలో బోల్డ్ సీన్స్‌లో తనదైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం అన్నీ మంచి శకునములే అంటూ మరోసారి టాలీవుడ్ సినీ ప్రియులను పలకరించేందుకు సిద్ధమైంది. నందిని రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా మే 18న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది భామ. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న 'తోడేలు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ప్రమోషన్లలో భాగంగా మాళవిక తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తాజాగా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్‌తో కలిసి వీడియోలో కనిపించింది. ఆయనతో మాట్లాడుతూ.. 'నిన్ను ఉంచుకుంటాను అబ్బాయి' అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. దానికి అనుదీప్ సిగ్గుపడుతూ మరీ కళ్లు మూసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే కేవలం సినిమా ప్రమోషన్ల కోసమే చేసినా.. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంతే కాకుండా 'అలా అనుదీప్ గారిని ఉంచుకోవడం జరిగింది' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: స్విమ్ షూట్లో బిగ్ బాస్ బ్యూటీ.. నెటిజన్స్ ట్రోలింగ్!) View this post on Instagram A post shared by Malvika Nair (@malvikanairofficial) -
ఆడిషన్‌కు వెళ్తే గదిలో నాతో అసభ్యంగా.. ఏడ్చినా వినలేదు: నటి
తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలిననే పేర్కొంది మాళవిక శ్రీనాథ్. మూడేళ్ల క్రితం ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది మలయాళ నటి. 'మూడేళ్ల క్రితం ఇది జరిగింది. మంజు వారియర్ సినిమాలో ఆమె కూతురిగా నటించాలంటూ ఓ ఆఫర్ వచ్చింది. మంజు వారియర్ మూవీ అనగానే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. అందుకే ఆలస్యం చేయకుండా ఓకే చెప్పాను. త్రిస్సూర్‌లో ఆడిషన్‌కు వెళ్లాం. గాజు గ్లాసుతో ఉన్న గదిలో ఆడిషన్ జరిగింది. ఆ తర్వాత నా జుట్టంతా చిందరవందరగా ఉందని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి సరిచేసుకోమని ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు. సరేనని నేను ఆ గదిలోకి వెళ్లగానే అతడు నన్ను వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. ఒక్కసారిగా షాక్ అయిన నేను తన నుంచి విడిపించుకునేందుకు చాలా ప్రయత్నించాను. నువ్వు మంజు వారియర్ కూతురిగా స్క్రీన్‌పై కనిపించాలంటే సైలెంట్‌గా ఉండు అని చెప్పాడు. నేను ఏడుస్తూ తన చేతిలో ఉన్న కెమెరాను పగలగొట్టేందుకు ప్రయత్నించాను. అతడు దాన్ని సరిచేసుకునే క్రమంలో వెంటనే అక్కడి నుంచి పారిపోయాను' అని చెప్పుకొచ్చింది. కాగా మాళవిక.. మధురం, సాటర్డే నైట్ వంటి చిత్రాలు చేసింది.