
మలయాళ నటి చిత్ర నాయర్ (Actress Chitra Nair) రెండో పెళ్లి చేసుకుంది. ఆర్మీ ఏవియేషన్ విభాగంలో పనిచేసే లెనీష్ అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే కావడం విశేషం! ఈ వివాహ వేడుకకు చిత్ర కుమారుడు, లెనీష్ కుమార్తె సహా ఇరువురి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు. అలాగే పెళ్లి వీడియోను చిత్ర సోషల్ మీడియాలో షేర్ చేసింది.
జాతకాలు చూసే పెళ్లి.. చివరకేమైంది?
గతంలో ఓ ఇంటర్వ్యూలో చిత్ర మాట్లాడుతూ.. నా కొడుక్కి పద్నాలుగేళ్లు. తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. నాకు 36 ఏళ్లు. అందరూ సంతూర్ మమ్మీ అని పిలుస్తుంటారు. నా పక్కన ఉన్న కొడుకుని చూసి నా తమ్ముడనుకుంటారు. 21 ఏళ్ల వయసులోనే నాకు పెళ్లయింది. అది పెద్దలు కుదిర్చిన సంబంధం. జాతకాలు అన్నీ చూశాకే నాకు పెళ్లి చేశారు. చివరకు ఏమైంది? ఎనిమిదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాం.

కచ్చితంగా ఆలోచిస్తా..
మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అని నన్నడిగితే కచ్చితంగా ఆలోచిస్తానని చెప్తాను. నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే ఎందుకు వదులుకుంటాను? ఈ విషయంలో నా కొడుక్కి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈసారి జాతకాలు కలిసాయా? లేదా? అని మాత్రం చూడను. అయితే ఇప్పుడే పెళ్లి గురించే ఆలోచించడం లేదు అని చెప్పుకొచ్చింది.
యాక్టర్‌గా మారిన టీచర్
కేరళకు చెందిన చిత్రనాయర్ గతంలో ఉపాధ్యాయినిగా పని చేసింది. కరోనా సమయంలో తన వృత్తిని వదిలేసి సినిమావైపు ఆసక్తి చూపించింది. ఆడిషన్స్‌కు వెళ్లి తనకంటూ కొత్తదారి నిర్మించుకుంది. మోహన్‌లాల్ 'ఆరట్టు' చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయమైంది. పార్ట్‌నర్స్, సురేశింతెయుమ్ సుమలతయుదెయుం హృదయహరియయ ప్రణయకథ, పొరట్టు నడకం, క్వీన్ ఎలిజబెత్, ఎన్న తాన్ కేస్ కొడు వంటి చిత్రాల్లో నటించింది.
చదవండి: ప్రభుదేవా కన్సర్ట్.. కనీస గౌరవం లేదు, వివక్ష చూపిస్తున్నారు: నటి
Comments
Please login to add a commentAdd a comment