Chitra
-
నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో ఉంటావ్: సింగర్ చిత్ర ఎమోషనల్
ప్రముఖ సింగర్ చిత్ర తన కుమార్తె నందన వర్ధంతి సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా తన కూతురి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నువ్వు నాతో భౌతికంగా లేనప్పటికీ ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటావని ఎమోషనలైంది. నా చివరి శ్వాస వరకు నాతోనే ఉంటావంటూ ట్వీట్ చేసింది. కాగా సింగర్ కేఎస్ చిత్ర ప్రముఖ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోను పాటలు పాడారు. నాలుగు దశాబ్దాల సినీ సంగీత ప్రయాణంలో దాదాపు 25 వేలకు పైగా పాటలు ఆలపించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఇళయరాజా వంటి సంగీత దిగ్గజాలతో ఆమె పనిచేశారు. సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్ర విజయ్ శంకర్ అనే ఒక ఇంజినీర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 18 డిసెంబర్ 2002లో వీరికి నందన అనే అమ్మాయి జన్మించింది. నందనకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు 2011లో ఓ కచేరిలో పాల్గొనేందుకు చిత్ర దుబాయ్ వెళ్లారు. అదే సమయంలో నందన స్విమ్మింగ్ పూల్‌లో పడి మరణించింది. #Nandana pic.twitter.com/mImedLHMdv — K S Chithra (@KSChithra) April 14, 2024 -
స్టార్ హీరోయిన్ సౌందర్య మళ్లీ పుట్టిందా?.. అచ్చం ఆమెలానే అలరిస్తోంది!
తెలుగులో స్టార్ హీరోయిన్లలో సౌందర్య ఒకరు. అప్పట్లో మీనా, రమ్యకృష్ణ తర్వాత తనదైన అలరించిన హీరోయిన్ ఆమెనే. కన్నడకు చెందిన భామ.. మనవరాలి పెళ్లి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆమె వెండితెరకు దూరమైంది. రాజకీయాల్లో ఓ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన సౌందర్య.. 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించింది. దీంతో ఆమె మృతిని తెలుగు సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. భౌతికంగా సౌందర్య దూరమైన ఆమె సినిమాలు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. మహానటి సావిత్రి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఎవరంటే సౌందర్య పేరే వినిపిస్తుంది. అంతలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. సౌందర్య తెలుగుతో పాటు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించింది. 12 ఏళ్ల పాటు వెండితెరపై అభిమానులను అలరించింది. అయితే అచ్చం సౌందర్యలాగే అమ్మాయి సోషల్ మీడియాలో అలరిస్తోంది. మలేషియాకు చెందిన చిత్ర టిక్ టాక్ ఉన్న సమయంలోనే సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది. చూడడానికి సేమ్ టు సేమ్ మన సౌందర్యలాగే ఉండడం ఆమెకు కలిసొచ్చింది. చిత్ర తన ఇన్స్టాగ్రామ్ ద్వారా మనదేశంలోని అభిమానులకు సైతం దగ్గరైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన చిత్ర తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. చిత్ర మాట్లాడుతూ..' మా అమ్మది తమిళనాడు. నేను పుట్టి పెరిగింది మాత్రం మలేషియాలోనే. నేను కన్నడ, తెలుగు భాషలు అర్థం చేసుకోగలను. ఆమెలాగే ఉండడం నా అదృష్టం. మలేషియా నుంచే నేను రీల్స్ చేస్తున్నా. సినిమాల్లో నటించమని తెలుగువాళ్లు కొంతమంది నాకు కాల్స్ చేశారు. నాకు యాక్టింగ్ రాదు. సౌందర్య నటించిన అమ్మోరు, అంతఃపురం సినిమాలంటే ఇష్టం. సౌందర్య కుటుంబ సభ్యులు ఎవరు నాకు ఫోన్ చేయలేదు.' అంటూ చెప్పుకొచ్చింది. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్లు చిత్ర తెలిపింది. View this post on Instagram A post shared by Chitra❤ (@chitra_jii2) View this post on Instagram A post shared by Chitra❤ (@chitra_jii2) -
నా చిరునవ్వు వెనుక కూడా చాలా బాధలు ఉన్నాయి
-
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సెలబ్రిటీలు షేర్ చేసిన ఫోటోలు
► 100 జాతీయ జెండాలను పంచిన హీరోయిన నమిత ► జాతీయ జెండాతో రాశీ ఖన్నా ► స్వాతంత్య్ర దినోత్సవం రోజున బేబి సినిమా నుంచి మరో న్యూస్ ► వైట్ డ్రెస్‌లో జాతీయ జెండాతో హీరోయిన్ శ్రీలీల ► సైంధవ్ టీజర్‌ను పోస్ట్ చేసిన వెంకటశ్ View this post on Instagram A post shared by Namitha Vankawala (@namita.official) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Anand Deverakonda (@ananddeverakonda) View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Venkatesh Daggubati (@venkateshdaggubati) View this post on Instagram A post shared by Sunny Deol (@iamsunnydeol) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
భర్త గురించి మొదటిసారి షాకింగ్ నిజాలు బయటపెట్టిన సింగర్ చిత్ర
-
ఈ సాంగ్ పాడేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డా
-
నాకు ఇన్ని అవార్డులు రావడానికి కారణం ..
-
నా కోసం బాలు గారు వెయిట్ చేశారు
-
సక్సెస్ తో పాటు దేవుడు కష్టాలు కూడా ఇచ్చాడు..
-
ఆరోజు ఇళయరాజా తో తిట్లు తిన్న
-
వరల్డ్ మ్యూజిక్ డే.. టాప్ 10 పాటల్ని గుర్తుచేసుకుందామా
ఎండలు మండితే పాటలు ఓదార్పు. తొలకరి కురిస్తే పాటలు కాఫీకి తోడు.చలి చక్కిలిగిలి పెడితే పాటే కదా వెచ్చటి రగ్గు.సంగీతమూ సినిమా పాట లేకుండా జీవితం సాగేది ఎలా. నేడు వరల్డ్ మ్యూజిక్ డే. రావు బాల సరస్వతి, పి.లీల, జిక్కి,భానుమతి రామకృష్ణ, పి.సుశీల, ఎస్.జానకి,ఎల్.ఆర్.ఈశ్వరి, వాణి జయరాం, శైలజ, చిత్ర...వీరంతా మన సినీ కోయిలలుగా మన జీవన సందర్భాలను సంగీతమయం చేశారు.నేడు వీరి పాటలను తలుచుకోవడం మన విధి.వీరికి చేరేలా కృతజ్ఞత ప్రకటించడం మన సంతోషం. నేడు వరల్డ్ మ్యూజిక్ డే తానే మారెనా గుణమ్మే మారెనా దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా... రావు బాలసరస్వతి గొంతు మంచురాలిన దారిలో హంస నడకలా ఉంటుంది. నటీనటులే పాటలు పాడుకోవాలి అనుకునే రోజుల్లో ఆమె దాదాపుగా మన తొలి ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్. సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో ఆమె పాటలు రెక్కలు విప్పాయి. సువాసనలు చిమ్మాయి. ఆమె తన సినిమా కెరీర్‌ను కొనసాగించి ఉంటే లతా అంతటి గాయనిగా గుర్తింపు పొందేది. ఆమె మనకు పంచిన అమృతం తక్కువ. కాని దాని రుచి ఎంతో మక్కువ. తెల్లవార వచ్చె తెలియక నాసామీ మళ్లీ పరుండేవు లేరా... అప్రయత్నంగా వీచే గాలిలా, అనాయాసంగా తాకే ‘మళయ’మారుతంలా ఉంటుంది పి.లీల గొంతు. తెలుగు ఆమె మాతృభాష కాదు. కాని ప్రతి తెలుగు గృహిణి నాలుక మీద ఆమె పాట చర్విత చరణం అయ్యింది.‘సడిచేయకోగాలి సడి చేయబోకే’, ‘ఓహో మేఘమాల.. నీలాల మేఘ మాల’, ‘కలనైనా నీ వలపే... కలవరమందైన నీ తలపే’... పి.లీల సంగీతలీల అద్భుతం. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరెనురో రన్నో చిన్నన్న తెలుగు పాటల్లో తన ఏరువాకతో కొత్త నారును వేసి సమృద్ధికర పైరును శ్రోతలకు అందించిన గాయని జిక్కి. పిట్ట కొంచమే. కూత పది వర్ణాల పింఛమే. అల్లరి పాటైనా ఆర్ద్ర గీతమైనా జిక్కి చేత చిక్కిందంటే హిట్. ‘ఛాంగురే బంగారు రాజా’, ‘పులకించని మది పులకించు’... ఆమెకు శ్రీలంకలో కూడా ఫ్యాన్స్ ఉండేవారు. అందమైన పాటలు పాడి ‘జీవితమే సఫలము’ చేసుకున్న ప్రియమైన గాయని జిక్కి. ఓహోహోహో పావురమా ఓ... ఓహోహో పావురమా వెరపేలే పావురమా ఓహోహో ఓహో పావురమా ఈ పావురం డేగల్ని కూడా వేటాడగలదు. భానుమతి రామకృష్ణ సకల కళావల్లభురాలు. నాటి తెలుగు మహిళలకు పెద్ద ధైర్యం. ఇండస్ట్రీలో గొప్ప తెగువ. అలాంటి గొంతు, ఆ పాట తీరు రిపీట్ కాలేవు. కాబోవు. ‘ఎందుకే నీకింత తొందర’, ‘నేనే రాధనోయి’, ‘సావిరహే తవదీన’... ఎన్ని పాటలని. ఇక ‘మల్లీశ్వరి’ ఆమె ప్రతి పాట గండుమల్లె, రెక్కమల్లె. ‘మనసున మల్లెల మాలలూగెనే’.. ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ ముత్తయిదు కుంకుమ బతుకెంతొ ఛాయ తెలుగు పాటకు వంద సంవత్సరాల ఛాయను తెచ్చింది సుశీల. ఆమె రాకతో నటిని, గాయనిని దృష్టిలో పెట్టుకోకుండా ΄ాటకు అవసరమైన రేంజ్‌తో బాణీ కట్టడం మొదలెట్టారు సంగీత దర్శకులు. సుశీల ΄ాటలో నిష్ఠ ఉంటుంది. క్రమశిక్షణ ఉంటుంది. శ్రేష్టమైన ఉచ్చారణ. నూరుశాతం కచ్చితత్వం. ‘ఆకులో ఆకునై పూవులో పూవునై’, ‘జోరుమీదున్నావు తుమ్మెదా’, ‘ఇది మల్లెల వేళయనీ’... ఈ కెరటాలకు అంతులేదు. ఈ గాన సముద్రానికి ఉప్పదనం లేదు. అమృత సాగరం. నీలిమేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునేవేళా నూనె రాసి గట్టిగా బిగించి కట్టిన జడది అందమే. అది సుశీలమ్మ పౠటది. తల స్నానం చేసి వదులుగా వదిలన ముంగురులదీ అందమే. అది జానకమ్మ పౠటది. తెలుగు ΄ాట ఊపిరి పీల్చుకోవడానికి తెరిచిన పెద్ద గవాక్షం జానకి. తల్లిదండ్రులను చనువుగా ఒకమాటనగల చిన్న కూతురిలా ఉంటుందామె పాట. సరదా. హుషారు. అద్దంలో ఇమడగల కొండంత ప్రతిభ. ‘పగలే వెన్నెల’, ‘మనసా తుళ్లి పడకే’, ‘అందమైన లోకమని రంగురంగులున్నాయనీ’... ఇక నాదస్వరం ఎదుట పడగ ఎత్తి నిలిచిన పాట ‘నీలీల పాడెద దేవా’... మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు మాగమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడు ఆగేదెట్టాగ అందాక ఏగేదెట్టాగ గజ్జె కట్టి, బిగుతు దుస్తులు ధరించి, స్టేజ్ ఎక్కి జానపద శృంగారం ఒలికించిన ΄ాట ఎల్.ఆర్. ఈశ్వరిది. ఊరంటే గుళ్లు, ఇళ్లు మాత్రమే కాదు.. పొలాలుంటాయి.. మంచెలూ ఉంటాయి. ‘మసక మసక చీకటిలో’, ‘నందామయా గురుడ నందామయా’, ‘తీస్కో కోకకోలా’... ప్రతి పాటా సంపెంగ పొదలో పూసిన పువ్వు.అది మగాళ్లని ‘బలేబలే మగాడివోయ్’ చేసింది. విధి చేయు వింతలన్ని మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో వాణి జయరామ్‌ది పక్కింట్లో నుంచి వినిపించే పరిచిత గీతంలా ఉంటుంది. అదే సమయంలో దానికో వ్యక్తిత్వం ఉంటుంది. వాణి జయరామ్ పాటల మీద జోకులేయలేం. గౌరవించడం ప్రేమించడం తప్ప. ‘పూజలు సేయ పూలు తెచ్చాను’, ‘నేనా పాడనా పాట... మీరా అన్నదా మాట’, ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ’... అద్భుతం. లాలు దర్వాజ్ లష్కర్ బోనాల్కొస్తనని రాకపోతివి లక్డీకాపూలు పోరికి రబ్బరు గాజులు తెస్తనని తేకపోతివి ఎస్.పి.శైలజ పాటను ఒక పల్లవి ఒక చరణం వరకే అనుమతించింది తెలుగు పరిశ్రమ. ప్రతిసారి మైక్ అందలేదు. అందినప్పుడు ఆమె గొంతులో అందం దాగలేదు. ‘మాటే మంత్రము’, ‘నాంపల్లి టేషన్కాడి’, ‘కొబ్బరినీళ్ల జలకాలాడి’... ఆమె పాట, మాట రెండూ మృదురమే. రానేల వసంతాలె శృతి కానెల సరాగాలే నీవే జీవన రాగం... స్వరాల బంధం చిత్ర రాకతో మళ్లీ తెలుగు పాటకు టీనేజ్ వచ్చింది. కొత్త తరానికి ΄ాటను అందించింది చిత్ర. కాలేజీకెళ్లే అమ్మాయిలు ‘తెలుసా మనసా’ అని... ‘కన్నానులే కలలు’ అని... ‘ఎన్నెన్నో అందాలు’ అని పాడుకున్నారు. ‘మనసున ఉన్నది చె΄్పాలనున్నది’ అని కూనిరాగం తీసుకున్నారు. మన గాయనులు మనకు బుట్టల కొద్ది పాటలు పంచినందుకు కృతజ్ఞతలు. -
సిట్‌కు జవాబులు చెప్పకుండా ఏడ్చేసిన ప్రతాప్!
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో ప్రత్యే క దర్యాప్తు బృందం (సిట్) విచారణను ముమ్మరం చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలని 41–ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. అంబర్‌పేటకు చెందిన న్యాయ వాది పోగులకొండ ప్రతాప్‌గౌడ్, నిందితుడు నందుకుమార్ భార్య చిత్రలేఖలు విచారణాధికారి ఎదుట హాజరయ్యారు. మూడు బృందాలుగా ఏర్పడిన సిట్ అధికారులు, వేర్వేరు గదుల్లో 8 గంటలకు పైగా వారిని విచారించారు. నిందితుడు నందు, ఆయన భార్య చిత్రలేఖ, ప్రతాప్ గౌడ్‌కు మధ్య పలు ఫోన్ సందేశాలు, వాట్సాప్ చాటింగ్, కాల్ రికార్డ్లను గుర్తించిన పోలీసులు.. వాటిపై ప్రతాప్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. తొలుత తాను ఎవరితోనూ సంభాసించలేదని, మెసేజ్‌లు చేయ లేదని పోలీసులతో వాదించినట్లు సమాచారం. దీంతో అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసు లు ఆయన ముందు ఉంచి ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా ప్రతాప్ బోరున విలపించినట్లు తెలిసింది. నందుతో పరిచయం, ఇతరత్రా సంబంధాలపై ఆరా తీయగా జవాబు చెప్పకుండా దాటే శారు. సాయంత్రం వరకు ప్రతాప్‌ను విచారించినా లాభం లేకపోవటంతో శనివారం కూడా విచారణకు హాజరుకావాలని దర్యాప్తు అధికారి ఆయన్ను ఆదేశించారు. సోమవారం మరోసారి రండి..: నందు భార్య చిత్రలేఖను విచారించిన సిట్ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. పోలీసులు స్వా«దీనం చేసుకున్న సెల్ఫోన్లో ఆమెకు, ప్రతాప్ గౌడ్, నందుకు మధ్య పలు ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు బయటపడ్డాయి. ఆయా మెసేజ్‌లలో ఏ సమాచా రం ఉందని? ఎందుకు చేశారని చిత్రలేఖను ప్రశ్నించగా.. తెలియదు, గుర్తులేదు, నాకు రాలేదని వింత సమాధానాలు చెప్పినట్లు సమాచారం. నందుకు చెందిన డెక్కన్ కిచెన్, నివాసంలోని సీసీ రికార్డుల్లో నమోదైన పలువురు ఫొటోలను చూపించి, వారెవరు? ఎందుకొచ్చారని ఆమెను ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు తెలిసింది. అయితే ఆమె డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ కార్యకలాపాలు, లావాదేవీల గురించి ప్రశ్నించగా ధైర్యంగా సమాధానాలు ఇచ్చిన చిత్రలేఖ.. ఈ కేసుకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వకపోవటంతో, ఉద్దేశపూర్వకంగానే ఆమె అలా వ్యవహరించారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తిరిగి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. హైకోర్టు ఆదేశించినా శ్రీనివాస్ గైర్హాజరు: శుక్రవారం సిట్ విచారణకు హాజరుకావాలని శ్రీనివాస్‌ను హైకోర్టు ఆదేశించినా ఆయన గైర్హాజరయ్యారు. కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్‌ను ఈ కేసులో ఏ–7గా చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో విచారణకు హాజరైతే అరెస్టు చేస్తారేమోననే అనుమానంతో ఆయన గైర్హాజరైనట్లు సమాచారం. నందు, సింహయాజీలతో కలిసి శ్రీనివాస్ పలు ప్రాంతాల్లో సంచరించడానికి సంబంధించిన ఆధారాలు, నందుతో రూ.55 లక్షలకు సంబంధించిన లావాదేవీలను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఇదీ చదవండి: మల్లారెడ్డి కేసులో ట్విస్ట్.. హైకోర్టులో భద్రారెడ్డికి షాక్! -
దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటి నల్లెనై చిత్ర (56) శనివారం ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్ర మృతిపై పలువురు కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. (చదవండి: త్వరలోనే ఆ కల నెరవేరబోతుంది: మంచు విష్ణు) కేరళలోని కొచ్చిలో జన్మించిన చిత్ర బాల నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. 1980-90 మధ్య కాలంలో పలు కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించారు. వడక్కన్ వీరగాథ, పరంపర, కలిక్కలం, రాజవచ్చ తదితర మలయాళ చిత్రాలు నటిగా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చాయి. ఇటీవల సినిమాలకు దూరమైన ఆమె.. తమిళ సీరియల్స్‌తో బిజీ అయిపోయారు. ఆమెకు భర్త విజయరాఘవన్, కుమార్తె మహాలక్ష్మి ఉన్నారు. -
‘పద్మ’గీతం గానం: చిత్ర, బాలు
ఒకరు గురువు.. ఒకరు శిష్యురాలు ఒకరు తెలుగు. ఒకరు మలయాళం. ఒకరు లేరు. ఒకరు ఆ జ్ఞాపకాన్ని, గానాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరికి పద్మవిభూషణ్ వచ్చింది. ఒకరికి పద్మభూషణ్. పాటకు దక్కిన అంజలి ఇది. తెలుగు శ్రోతలకు ఈ ఇద్దరూ ఇచ్చిన వెలకట్టలేని గీతాలెన్నో. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్రలకు పద్మ పురస్కారాలు వచ్చిన సందర్భంగా ఆ పాటలు తలుచుకుని అభినందనలు తెలపాలి. ‘నిప్పులోన కాలదు... నీటిలోన నానదు.. గాలిలాగ మారదు... ప్రేమ సత్యము’ అని పాడతారు చిత్ర. ‘రాచవీటి కన్యవి.. రంగు రంగు స్వప్నము.. పేదవాడి కంటిలో ప్రేమరక్తము’ అని పాడతారు బాలు. వింటున్నవారందరూ ఏ వయసు వారైనా ప్రేమ స్పర్శను అనుభవిస్తారు. వారిద్దరి జోడి అలాంటిది. తెలుగు సినీ సంగీత అభిమానులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. దుఃఖంగా కూడా ఉన్నారు. సంతోషం చిత్ర, బాల సుబ్రహ్మణ్యంలకు ‘పద్మ’ అవార్డులు వచ్చినందుకు. దుఃఖం.. బాలుగారు లేనందుకు. ఉండి ఉంటే ఇవాళ వీరి యుగళ గీతాలు మరింత హుషారుగా మోగిపోయేవి. తెలుగులో బాల సుబ్రహ్మణ్యం తిరుగులేని మేల్ సింగర్. ఆయన పక్కన కొద్దిగా దస్తీ వేయగలిగినది మనో ఒక్కడే. కాని చిత్ర తెలుగులో టాప్ రేంజ్‌కు వెళ్లడం అంత సులువు కాదు. ఎందుకంటే ఆమె తెలుగులో 1985లో ‘సింధుభైరవి’తో అడుగుపెట్టే సమయానికి ఇక్కడ సుశీల, జానకిలు శక్తిమంతంగా ఉన్నారు. చక్రవర్తి, కె.వి.మహదేవన్‌లు బాలు, సుశీల, జానకీలతోటే అన్ని పాటలు పాడించేవారు. కొన్ని పాటలు శైలజ కు వెళ్లేవి. ఇందరు ఉండగా చిత్ర ప్రవేశం కష్టమే. కాని 1986లో ‘డాన్స్ మాస్టర్’ సినిమాకు డబ్బింగ్ పాడుతున్నప్పుడు బాలు చిత్రలోని టాలెంట్‌ను దగ్గరి నుంచి గమనించారు. ఆ సినిమాలో ‘రావేల వసంతాలే’ పాట చిత్రను ఇంటింట మోగే రేడియో గొంతుగా మార్చింది. అందులోని ‘జింగిల్జింగా జీమూతా జింగిల్జింగా’, ‘కవిత చిలికింది’ పాటలు బాలు, చిత్ర పాడారు. చిత్ర మలయాళీ. ఆమెకు తమిళం బాగానే తెలుసు. కాని తెలుగు బొత్తిగా తెలియదు. బాలు ఆమెకు సాయం చేసేవారు. తెలుగు ఉచ్ఛరణ దాదాపుగా ఆమె బాలు వల్లే నేర్చుకున్నారు. ‘చెప్పి చెప్పి ఒక దశలో నేను చెప్పను నువ్వే నేర్చుకో అన్నాను. పట్టుదలగా నేర్చుకుంది’ అని బాలు ఒక సందర్భంగా మెచ్చుకోలుగా అన్నారు. 1990 వరకు చిత్రకు తెలుగులో సరైన పూనిక దొరికలేదు. ‘ఆఖరి పోరాటం’లో చిత్ర, బాలు పాడిన ‘ఎప్పుడు ఎప్పుడు’, ‘అబ్బ దీని సోకు’ హిట్ అయినా. చిత్రకు తెలుగు అవకాశాలు ఇళయరాజా ఇస్తూ వెళ్లారు. ‘మరళమృదంగం’లో బాలు, చిత్ర పాడిన ‘గొడవే గొడవమ్మా’ పెద్ద హిట్. ‘వారసుడొచ్చాడు’లో ‘నీ అందం నా ప్రేమగీతం గోవిందం’ పాట కూడా. ఆ తర్వా ఇళయరాజా చిత్ర, బాలుల గళాలతో సృష్టించిన స్వరచరిత్ర ‘గీతాంజలి’. అందులో ఇద్దరూ కలిసి అమృతం కురిపించారు. ‘ఓ ప్రియా ప్రియా’, ‘ఓం నమహ’ డ్యూయెట్లు ఎంతో ప్రియమైనవి. ఇక ‘జగదేక వీరుడు–అతిలోకసుందరి’ కోసం వీరు పాడిన విఖ్యాత డ్యూయెట్ ‘అబ్బనీ తీయని దెబ్బ’ రికార్డులు సృష్టించింది. కీరవాణి రాకతో 1990లో ‘మనసు–మమత’ సినిమాతో కీరవాణి రాకతో బాలు, చిత్ర, కీరవాణిల పాటలు తెలుగు నేలను ఊపేశాయి. కీరవాణి చిత్రతోనే ఎక్కువ పాటలు చేశారు. బాలుకు కొత్త ఊపు తెచ్చారు. బాలు, చిత్ర కలిసి పాడిన ‘పూసింది పూసింది పున్నాగ’ కీరవాణి తెలుగువారికి ఇచ్చిన ఒక పున్నాగపువ్వు పరిమళం. ‘క్షణక్షణం’లో బాలు, చిత్ర ఆయన బాణీలకు హిట్ రేంజ్ తెచ్చారు. ‘అమ్మాయి ముద్దు ఇవ్వందే’, ‘జాము రాతిరి’... ఇప్పటికీ వింటున్నారు. ఇక కీరవాణి చేసిన ‘అల్లరి ప్రియుడు’ అచ్చంగా బాలు, చిత్రల మ్యూజికల్. ‘అహో.. ఒక మనసుకు నచ్చిన’, ‘రోజ్ రోజ్ రోజా పువ్వా’... పాటల పూలు. ఇక కీరవాణి సంగీతంలో వచ్చిన ‘క్రిమినల్’ క్లాసిక్ డ్యూయెట్ ‘తెలుసా.. మనసా’ ఎలా మరువగలం. ‘ఘరానా మొగుడు’, ‘అల్లరి అల్లుడు’, ‘పెళ్లి సందడి’.. ఇవన్నీ బాలు, చిత్రల మేజిక్‌తో నిండి ఉన్నాయి. ‘ఆపద్బాంధవుడు’లో ‘ఔరా అమ్మకచెల్లా’ ఎలా మర్చిపోగలం. రెహమాన్‌తో బాలు, చిత్రలు ఏ.ఆర్.రెహమాన్ పాటలతో తెలుగు సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. రెహమాన్ తొలి సినిమా ‘రోజా’లో వీరిద్దరూ కలిసి పాడిన ‘పరువం వానగా’... లోని మాధుర్యం ఎంతని. ఆ తర్వాత ‘డ్యూయెట్’లో బాలు, చిత్రల ప్రతిభకు గొప్ప ఉదాహరణగా ‘అంజలి.. అంజలి.. పుష్పాంజలి’ పాట ఉంటుంది. ఆ పాట చరణంలో హైపిచ్‌లో ఇద్దరూ పాడేది వినాలి. అందులో చిత్ర ఆలాపనలూ అద్భుతం. ఎన్నో ఆణిముత్యాలు.. చిత్ర, బాలూ లేకపోతే తెలుగులో 1990 –2000 మధ్య సినిమా సంగీతం లేదన్నంతగా వారు వందలాది గీతాలు పాడారు. ఆ తర్వాత కొత్తతరం సంగీత దర్శకులు వచ్చినా వీరి జోడుగానం కొనసాగింది. రాజ్కోటిల సంగీతంలో వచ్చిన ‘ప్రియరాగాలే’ (హలో బ్రదర్), ‘అందమా అందుమా’ (గోవిందా గోవిందా), ఎస్.ఏ.రాజ్‌కుమార్ సంగీతంలో వచ్చిన ‘గుండె నిండ గుడి గంటలే’, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చిన ‘నా మనసునే మీటకే’ (మన్మథుడు)... ఆ లిస్టుకు అంతే లేదు. చిత్ర బాలూను గురువుగా భావిస్తారు. ఆ గురుపరంపరను ఆమె కొనసాగిస్తున్నారు. శిష్యురాలికి ‘పద్మభూషణ్’, గురువుకు ‘పద్మవిభూషణ్’ వచ్చిన ఈ వేళ నిజంగా సంగీతమయమైన వేళ. పాటగా వ్యాపించి ఉన్న బాలు సంతృప్తి పడేవేళ. ‘నీ జత లేక పిచ్చిది కాదా మనసంతా.. నా మనసేమో నా మాటే వినదంటా’... – సాక్షి ఫ్యామిలీ -
నటి చిత్ర మరణంపై అనుమానాలు
సాక్షి, చెన్నై: లైంగిక వేధింపులు, బెదిరింపుల వల్లే నటి వీజే చిత్ర బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె మామ రవిచంద్రన్ ఆరోపించారు. ఈ మేరకు చెన్నై కమిషనరేట్‌లో సమగ్ర విచారణ కోరుతూ ఫిర్యాదు చేశారు. కాగా బుల్లితెర నటి చిత్ర బలన్మరణం గురించి తెలిసిందే. ఆమె ప్రియుడు, భర్త హేమనాథ్‌తో గొడవే ఈ బలన్మరణానికి కారణంగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో హేమనాథ్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో హేమనాథ్ తండ్రి, చిత్ర మామ రవిచంద్రన్ కమిషనరేట్‌లో ఓ ఫిర్యాదు చేశారు. (ప్రముఖ నటి వీజే చిత్ర ఆత్మహత్య) ఆ వ్యక్తులు ఎవరో.. కొద్ది రోజులుగా చిత్ర టెన్షన్‌తో ఉన్నట్టు కుమారుడు హేమనాథ్ తన దృష్టికి తెచ్చాడని ఆ ఫిర్యాదులో రవిచంద్రన్ పేర్కొన్నారు. ఏదో నంబర్ నుంచి కాల్ వచ్చినట్టు, ఆ సమయంలో దూరంగా వెళ్లి ఆగ్రహంతో ఆమె మాట్లాడిన అనంతరం ఆ నెంబర్‌ను డిలీట్ చేసినట్లు వివరించారు. చిత్ర వివాహం చేసుకోవడం ఎవరికో ఇష్టం లేనట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడు హేమనాథ్ చెప్పిన విషయాలు బట్టి చూస్తుంటే అనుమానాలు ఉన్నాయన్నారు. ఆమెకు ఫోన్ చేసిన వారి గురించి విచారించాలని కోరారు. ఒత్తిళ్లకు తలొగ్గి చిత్ర తల్లి విజయ నోరు మెదపడం లేదన్నారు. చిత్ర మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని కమిషనర్‌ను కోరారు. అలాగే తన కుమారుడిని విడుదల చేయించాలని విన్నవించారు. హోటల్లోని సీసీ కెమెరా దృశ్యాలు మాయం కావడం బట్టి చూస్తే అనుమానాలకు బలం చేకూరుతున్నాయని అన్నారు. (చచ్చిపో.. అంటూ చిత్రను ప్రేరేపించిన హేమనాథ్) -
చచ్చిపో.. అంటూ చిత్రను ప్రేరేపించిన హేమనాథ్
సాక్షి, చెన్నై: బుల్లి తెర నటి చిత్ర మరణం కేసు ఓ కొలిక్కివచ్చింది. చచ్చిపో అంటూ ఆమెను భర్త హేమనాథ్ ప్రేరేపించినట్టు విచారణలో వెలుగుచూసింది. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో హేమనాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాండియన్ స్టోర్స్ ముల్లై పాత్రధారిణి బుల్లి తెర నటి చిత్ర గతవారం చెన్నైలోని ఓ హోటల్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆమె మరణం వెనుక మిస్టరీ ఉందన్న ఆరోపణలతో నషరత్‌పేట పోలీసులు కేసును తీవ్రంగానే పరిగణించాల్సి వచ్చింది. ఆమెతో పాటు హోటల్లో ఉన్న రిజిస్టర్ మ్యారేజ్ భర్త, ప్రియుడు హేమనాథ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆరు రోజులుగా ఆయన వద్ద విచారించారు. తొలుత పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో కేసును పలు కోణాల్లో విచారించారు. అనేక మంది వద్ద విచారణ సాగింది. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించగా, చిత్ర ఆత్మహత్యకు హేమనాథ్ ప్రేరేపించినట్టు తేలింది. ఆ మేరకు వివరాలు.. చదవండి: (చిత్రను హేమనాథ్ కొట్టి చంపేశాడు..) అనుమానంతో.. లాక్డౌన్ కాలంలో ప్రేమలోపడ్డ చిత్ర, రియల్ వ్యాపారి హేమనాథ్ జంట, ఆంక్షల సడలింపుతో ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. తిరువాన్మీయూరులో ఓ ఇళ్లు నిర్మాణం, చెన్నై శివార్లలోని ఓ కల్యాణ వేదికలో హంగామా వివాహం కోసం షూటింగ్ బిజీలో ఉన్న చిత్రపై ప్రేమతో పాటు అనుమానం కూడా హేమనాథ్ పెంచుకున్నాడు. చివరకు హేమనాథ్ ఒత్తిడితో ఆమె రిజిస్టర్ మ్యారేజ్‌కు అంగీకరించక తప్పలేదు. ఆంక్షల సడలింపుతో రేయింబవళ్లు షూటింగ్ బిజీలో చిత్ర ఉండడంతో అనుమానం పెరిగింది. ఇది ఆ ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. సంఘటన జరిగిన రోజు అర్ధరాత్రి షూటింగ్ స్పాట్‌కు వచ్చి ఆమెను వెంట పెట్టుకు వెళ్లే సమయంలో కారులో గొడవపడ్డాడు. హోటల్‌కు వెళ్లిన తర్వా కూడా గొడవ జరిగింది. ఈ గొడవలో చచ్చిపో అంటూ గట్టిగా అరిచి గది నుంచి హేమనాథ్ బయటకు వచ్చేశాడు. దీంతో మనస్తాపం చెందిన చిత్ర ఆత్మహత్యకు పాల్పడినట్టు విచారణలో తేలింది. అయితే, ఆమె ఆత్మహత్య ›ప్రేరణకు హేమనాథ్ కారణం కావడంతో ఆయన్ను సోమవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. మంగళవారం పూందమల్లి కోర్టులో హాజరు పరిచినానంతరం పొన్నేరి జైలుకు తరలించారు. చదవండి: (ప్రముఖ నటి వీజే చిత్ర ఆత్మహత్య) ఆర్డీవో విచారణ.... చిత్ర మరణం కేసు విచారణకు శ్రీపెరంబదూరు ఆర్డీఓ దివ్యశ్రీ శ్రీకారం చుట్టారు. ఆమె తల్లి విజయ, తండ్రి కామరాజ్, సోదరి సరస్వతి, సోదరుడు శరవణన్లను విచారించారు.హేమనాథ్ తండ్రి రవిచంద్రన్, తల్లి వసంతల వద్ద కూడా మంగళవారం విచారణ సాగింది. హేమనాథ్‌ను పోలీసులు అరెస్టు చేసిన దృష్ట్యా, ఆయన్ను విచారించాల్సి ఉంది. -
చిత్ర మృతి కేసులో భర్త అరెస్టు
చెన్నై: నటి వీజే చిత్ర మృతి కేసులో ఆమె భర్త హేమనాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. చిత్ర మరణించిన నాటి నుంచి హేమనాథ్ సహా ఆమె సహ నటులు, సన్నిహితులను విచారించినట్లు తెలిపారు. సీరియల్లోని కొన్ని దృశ్యాల వల్ల భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, అదే ఆమె ఆత్మహత్యకు దారితీసినట్లు వెల్లడించారు. ‘‘టీవీలో చిత్ర నటించిన పలు సీన్ల గురించి హేమనాథ్ అభ్యంతరం తెలిపాడు. అదే రోజు ఆమె మృతిచెందింది. చిత్రను అతడు నెట్టివేయడంతో తీవ్ర వేదనకు గురైంది’’అని పేర్కొన్నారు. (చదవండి: చిత్రను హేమనాథ్ కొట్టి చంపేశాడు..) కాగా ఓ ప్రైవేట్ చానెల్లో ప్రజెంటర్‌గా కెరీర్ ఆరంభించిన చిత్ర ‘పాండ్యన్ స్టోర్స్’ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో హేమనాథ్ ఆమె జీవితంలో ప్రవేశించాడు. పెద్దల అంగీకారంతో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అయితే ముహుర్తానికి ముందే వీరు తమ రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు. ఈ క్రమంలో డిసెంబరు 10న తన షూటింగ్ అనంతరం భర్తతో కలిసి ఓ హోటల్‌కు చేరుకున్న చిత్ర తన గదిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. దీంతో హేమనాథ్ తమ కూతురిని కొట్టి చిత్రహింసలకు గురిచేసి చంపేశాడని ఆమె తల్లి ఆరోపించారు. ఇదిలా ఉండగా.. పోస్టుమార్టం నివేదికలో చిత్రది ఆత్మహత్యే అని తేలింది. ఈ క్రమంలో చిత్ర బలవన్మరణానికి పాల్పడేలా ప్రేరేపించిన ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. -
చిత్రను హేమనాథ్ కొట్టి చంపేశాడు..
సాక్షి, చెన్నై: చిత్రను హేమనాథ్ కొట్టి చంపేశాడని ఆమె తల్లి విజయ ఆరోపించారు. సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం అనంతరం గురువారం సాయంత్రం అభిమానుల కన్నీటిసంద్రం నడుమ బుల్లి తెర నటి చిత్ర భౌతికకాయానికి బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. చిత్ర బలవన్మరణం ఓ మిస్టరీగా మారింది. ఆమె ముఖంపై ఉన్న గాయాలు, ప్రతిరోజూ తిరువాన్మియూరులోని ఇంటి నుంచి షూటింగ్‌కు వెళ్లిన చిత్ర, నాలుగు రోజులుగా హోటల్లో బసచేయడం అనుమానాలకు దారితీశాయి. రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం జరిగినా, పెళ్లికి ముహూర్తం కుదిర్చినా, హేమనాథ్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అన్న ప్రశ్న తప్పడం లేదు. దీంతో రెండవ రోజుగా హేమనాథ్ వద్ద తీవ్ర విచారణ సాగుతోంది. పూందమల్లి అసిస్టెంట్ కమిషనర్ సుదర్శనం నేతృత్వంలోని బృందం ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చిత్రతో సన్నిహితంగా ఉన్న నటీ నటులు, స్నేహితుల వద్ద, పాండియన్ స్టోర్స్ యూనిట్‌ను విచారించేందుకు నిర్ణయించారు. పోస్టుమార్టంలో చిత్రది ఆత్మహత్యే అని తేలినట్టు సమాచారం. ఆత్మహత్యగా తేలినా, ఆమె మరణం వెనుక బలమైన కారణం ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు వేగం పెంచారు. ఈ పరిస్థితుల్లో హేమనాథ్‌పై చిత్ర తల్లి విజయ తీవ్ర ఆరోపణలు చేశారు. చదవండి: (ప్రముఖ నటి వీజే చిత్ర ఆత్మహత్య) భర్తతో చిత్ర(ఫైల్), మీడియాతో తల్లి విజయ చంపేశాడు.. నిశ్చితార్థం అయ్యే వరకు హేమనాథ్ పద్ధతిగానే ఉన్నాడని, ఆ తర్వాత అతడి నిజస్వరూపం బయటపడిందని చిత్ర తల్లి విజయ ఆరోపించారు. వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు బయలు దేరినట్టుందని, చిత్ర ఏ విషయాన్ని తమ దృష్టికి తీసుకు రాలేదని పేర్కొన్నారు. చిత్ర ఆత్మహత్య చేసుకునే పిరికిది మాత్రం కాదన్నారు. హేమనాథ్ ఆమెను కొట్టి చంపేసినట్టున్నాడని, సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. చిత్ర స్నేహితురాలు, నటి శరణ్య పేర్కొంటూ తామిద్దరం మంచి మిత్రులుగా ఉన్నట్టు, ఎప్పుడు వ్యక్తిగత విషయాలను తనతో పంచుకోలేదన్నారు. ఆర్థికపరంగా ఏదో సమస్యలో ఆమె ఉన్నట్టు గుర్తించానని, ఇందుకు కారణాలు తనకు తెలియదని పేర్కొన్నారు. పాండియన్ స్టోర్ ధారావాహికలో కొన్ని సన్నివేశాల విషయంగా చిత్రతో హేమనాథ్ గొడవపడ్డట్టు సమాచారం. చిత్ర మరణించిన హోటల్‌కు ఓ రాజకీయ ప్రముఖుడి కారు వచ్చి వెళ్లినట్టుగా కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. కన్నీటి వీడ్కోలు.... చిత్ర మృతదేహానికి కీల్పాకం ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మార్చురీ వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో వారిని కట్టడి చేయడానికి పోలీసులు శ్రమించారు. అంబులెన్స్‌లో ఆమె మృతదేహాన్ని కోట్టూరుపురానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఉంచారు. బుల్లి తెరకు చెందిన సహచర నటీ నటులు, టెక్నీషియన్లు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. సాయంత్రం ఊరేగింపుగా, అభిమానుల కన్నీటి సంద్రం నడుమ బీసెంట్ నగర్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిగాయి. -
ప్రముఖ నటి వీజే చిత్ర ఆత్మహత్య
-
ప్రముఖ నటి వీజే చిత్ర ఆత్మహత్య
సాక్షి, చెన్నై : పాండియన్ స్టోర్స్ తమిళ ధారావాహికలో ముల్లై పాత్రకు జీవం పోసి లక్షలాది మంది అభిమానుల్ని కట్టిపడేసిన బుల్లితెర నటి చిత్ర (28) బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇది ఆమె అభిమానులకు పెద్ద షాక్‌గా మారింది. ఆమె ముఖంపై గాయాలు ఉండడంతో కేసు మిస్టరీగా మారింది. ఆత్మహత్య చేసుకున్న హోటల్లో ఆమె వెంట కాబోయే భర్త హేమనాథ్ కూడా ఉండడంతో ఆయన వద్ద విచారణ జరుగుతోంది. విజయ్ టీవీలో ‘పాండియన్ స్టోర్ట్స్’ పేరిట అన్నదమ్ముళ్ల అనుబంధాన్ని చాటే కుటుంబ కథా ధారావాహిక ప్రతిరోజూ ప్రసారం అవుతోంది. ఇందులో ఆ కుటుంబంలో మూడో కోడలిగా ప్రవేశించిన చిత్ర ముల్లై పాత్రకు చిత్ర జీవం పోశారని చెప్పవచ్చు. గతంలో ఆమె టీవీ, స్టేజ్ షోల వ్యాఖ్యతగా వ్యవహరించినా, చిన్న చిన్న పాత్రల్లో కొన్ని ధారావాహికల్లో కనిపించినా, ముల్లై పాత్రతో లక్షలాది మంది గుండెల్లో గుడి కట్టుకున్నారు. ఆమె ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్లలో పదిహేనుల లక్షల మంది ఫాలోయర్స్ ఉండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో సెంబరంబాక్కంలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో సాగుతున్న ధారావాహిక షూటింగ్‌ను ముగించుకుని బుధవారం వేకువజామున రెండున్నర గంటలకు హోటల్‌కు వెళ్లిన కొన్ని గంటల్లో చిత్ర బలవన్మరణ సమాచారం రావడం ఆ యూనిట్‌కే కాదు, అభి మానులకు పెద్ద షాక్కే. కాబోయే భర్తతో హోటల్లో.. తిరువాన్నియూరుకు చెందిన రిటైర్డ్ సబ్ఇన్స్పెక్టర్ కామరాజ్ కుమార్తె ఈ చిత్ర. కరయాన్ చావడికి చెందిన పారిశ్రామిక వేత్త హేమనాథ్‌తో చిత్ర వివాహ నిశి్చతార్థం ఇటీవల జరిగింది. ఈవీపీ నుంచి తిరువాన్నియూరుకు వెళ్లి రావడానికి ఇబ్బందిగా ఉండడంతో పలంజూరులోని ఓ హోటల్లో ఆమెకు ఓ గదిని కేటాయించారు. బుధవారం వేకువజామున రెండున్నర గంటలకు షూటింగ్ ముగించుకుని హోటల్‌కు ఆమె వచ్చారు. తనకు కాబోయే భర్త హేమనాథ్‌తో కలిసి గదిలోకి వెళ్లారు. ఆ గదిలో ఏమి జరిగిందో ఏమోగానీ, లాబీ నుంచి హేమనాథ్ రిసెప్షన్‌కు పరుగులు తీసి, అక్కడున్న సిబ్బంది గణేషన్ ద్వారా మరో తాళం తీసుకుని చిత్ర ఉన్న గదిని తెరిచారు. అప్పటికే ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతుండడం ఓ మిస్టరీగా మారింది. నషరత్ పేట సీఐ విజయరాఘవన్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆర్డీఓ విచారణ.. స్నానం చేసి వచ్చే వరకు లాబీలో ఉండాలని చెప్పి చిత్ర తలుపు వేసుకున్నట్టు పోలీసులకు హేమనాథ్ వివరించారు. ఎంతకు తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన గణేషన్ ద్వారా మరో తాళం తీసుకుని లోనికి వెళ్లి చూసినట్టు పేర్కొన్నాడు. అదే సమయంలో తామిద్దరికి అక్టోబర్ 19న రిజిస్టర్ మ్యారేజ్ కూడా జరిగినట్టు హేమనాథ్ చెప్పడంతో, కేసు ఆర్డీఓ విచారణకు దారి తీసింది. చిత్ర మరణ సమాచారం అందుకున్న ఆమె తండ్రి కామరాజ్ కీల్పాకం ఆస్పత్రికి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. అక్కడి నుంచి నేరుగా నషరత్ పేట పోలీసుస్టేషన్‌కు చేరుకుని తన కుమార్తె మరణానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరగాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిత్ర కుడివైపు ముఖం భాగంలో, గొంతు, నాడి భాగంలో గాయాలు ఉండడం అనుమానాలకు దారి తీశాయి. దీంతో పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. హేమనాథ్ వద్ద తీవ్ర విచారణ సాగుతోంది. షూటింగ్ నుంచి రావ డానికి గల ఆలస్యంపై ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. ఆ హోటల్ సిబ్బంది గణేషన్ వద్ద కూడా విచారణ సాగుతోంది. ఆత్మహత్య తప్పు అని పదే పదే చెప్పుకొచ్చే చిత్ర ఈ చర్యకు పాల్పడి ఉండే అవకాశాలు లేదు అని ఆమె మిత్రులు, సహచర నటీమణులు పేర్కొంటున్నారు. తన భవిష్యత్తు గురించి ఆమె ఎంతగానో కలలు కంటున్నదని, ఆమె కష్టాలకు తగ్గ ఫలితం దక్కుతున్న సమయంలో ఇలా జరగడం జీరి్ణంచుకోలేకున్నామని బుల్లి తెర సహచర నటీ మణులు ఆవేదన వ్యక్తం చేశారు. #Chithra was in @vijaytelevision shoot yesterday and she made some posts and stories in Instagram15 hours before 😥#RIPChitra pic.twitter.com/6p8W4DjGe0 — Cinema Ticket (@CinematicketYT) December 9, 2020 -
బాలు నుంచి ఎంతో నేర్చుకున్నా!
ఎస్పీ బాలసుబ్రమణ్యం నుంచి ఎంతో నేర్చుకున్నానని గాయని చిత్ర పేర్కొన్నారు. ఎస్పీబీ గత నెల 25న మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం సినీ పరిశ్రమ ఎస్పీ బాలసుబ్రమణ్యం సంతాప సభను నిర్వహించింది. నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి నటులు విజయ్‌సేతుపతి, ప్రసన్న, వివేక్, జయరామ్, పార్థిబన్, దర్శకుడు శీనూస్వామి, గాయని చిత్ర, గాయకుడు మనో పాల్గొని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తమ అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఆయన సాధించిన కీర్తి కెరటాలను శ్లాఘించారు. గాయని చిత్ర మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటానని కలలో కూడా ఊహించలేదని అన్నారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని చిత్ర పేర్కొన్నారు. ఈ సంతాప సభకు రాలేకపోయిన దర్శకుడు భారతీరాజా ఎస్పీబీతో తన అనుబంధాన్ని పంచుకుంటూ ఒక వీడియా పంపించారు. అదేవిధంగా ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంను ఒకసారి కూడా ప్రత్యక్షంగా కలుసుకోలేకపోవడం తన దురదృష్టమని నటుడు విజయ్‌సేతుపతి వాపోయారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్, గాయని శైలజ, ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వారిని సినీ ప్రముఖులు పరామర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రికి సంతాప సభ నిర్వహించిన చిత్ర పరిశ్రమ ప్రముఖులకు ఎస్పీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. (సీఎం జగన్‌కు కృతజ్ఞతలు) -
నా మావయ్య.. భౌతికంగా లేరంతే: సునీత
సాక్షి, హైదరాబాద్: ‘‘ఒక శకం ముగిసింది. సంగీతం, ప్రపంచం ఇకపై మునుపటిలా ఉండబోవు. ఒక మంచి గాయనిగా పేరొందేలా నాకు మార్గనిర్దేశనం చేసిన ఆయనకు ధన్యవాదాలు చెప్పేందుకు మాటలు సరిపోవు. ఆయన సమక్షంలో ఇకపై సంగీత ప్రదర్శనలు ఉండబోవు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. సావిత్రమ్మ, చరణ్, పల్లవి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ప్రముఖ గాయని కేఎస్ చిత్ర గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నివాళులు అర్పించారు. సంగీత ప్రపంచానికి ఆయన లేని లోటు తీర్చలేనిదని ఉద్వేగానికి లోనయ్యారు. (చదవండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత) కోలుకుంటారని ఆశించాను: శ్రేయా ఘోషల్ లెజండరీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారులేరనే ఈ విషాదకర వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కోలుకుంటారని ఎంతగానో ఎదురుచూశాం. గొప్ప కళాకారులు. మంచి మనిషి. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. ఆయన ఆశీస్సులు నాకు లభించాయి. ఆయనతో కలిసి పాటలు పాడటం నాకు దక్కిన అదృష్టం. సంగీతం ఉన్నంతకాలం మీ వారసత్వం కొనసాగుతుంది. ఎస్పీబీ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. - శ్రేయా ఘోషల్ మీ ఆత్మకు శాంతి చేకూరాలి: కౌసల్య ఎస్పీ బాలుగారి మరణం భారత సంగీత ప్రపంచంలో పూడ్చలేని లోటు. సంగీతం పట్ల ఆయనకు ఉన్న ఆరాధనాభావం మనకు వీనులవిందైన పాటలు ఎన్నింటినో అందించింది. తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో మధుర గీతాలు ఆలపించిన ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. - కౌసల్య నా మావయ్య భౌతికంగా లేరు అంతే: సునీత నా ఛిద్రమైన జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి. నాకు పాట మీద ప్రేమ కలిగించి, పాడాలనే తపన పెంచి, నా బాగోగులు గమనిస్తూ నాకు బాసటగా నిలుస్తూ జీవితం మీద మమకారం పెంచిన వ్యక్తి. నా ఆత్మబంధువు. నా మావయ్య భౌతికంగా లేరు అంతే. - సింగర్ సునీత Rest in peace #SPB garu. Very sad to hear this devastating news of the greatest, the legendary #SPBalasubrahmanyam passing away. We were so hopeful that he was on the path to recovery. pic.twitter.com/SnpXYWOXmh — Shreya Ghoshal (@shreyaghoshal) September 25, 2020 -
ఇంతకీ నీ కథ ఏమిటి?
ఒక పేరుండని అమెరికన్ పట్టణంలో, బేస్మెంట్లో ఉన్న ఇండియన్ వీసా ఆఫీసు అది. మధ్యాహ్నం మూడు అవుతుంది. ఉన్నట్టుండి భూకంపం వస్తుంది. తొమ్మిదిమంది అక్కడ చిక్కుకుంటారు. ఆఫీసులోకి నీరు రావడం మొదలవుతుంది. ఫోన్లు పని చేయడం మానేస్తాయి. అక్కడ ఉన్నవారందరూ, భిన్నమైన నేప«థ్యాలు, సంస్కృతులకు చెందినవారు. వారిలో ఉమ సిన్హా కూడా ఉంటుంది. అమెరికాలో పాతికేళ్ళు ఉండి, స్వస్థలం అయిన కోల్‌కతా తిరిగి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు ఇంటికి రమ్మని పోరితే, అయిష్టంగానే వీసా కోసం వచ్చిన ఇంగ్లీష్ లిటరేచర్ విద్యార్థిని ఉమ. ఆ తొమ్మండుగురిలో, ప్రతీ ఒక్కరూ మిగతావారి ‘రూపురేఖల, కుల/మత భిన్నత్వాల ఆధారంగా’ తమ తమ అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. ‘ఈ పట్టణంలో భిన్నమైన జాతులవారు ఒకే చోట యాదృచ్ఛికంగా కలిసి ఉండటం అసాధారణమైనదేమీ కాదు. అయినప్పటికి, ఇదేదో యూఎన్ సమ్మిట్‌లా అనిపిస్తోంది’ అనుకుంటుంది ఉమ. అందరిలోనూ మొదట గాభరా, ఆ తరువాత స్వార్థం మొదలయినప్పుడు – ‘బతికి ఉండాలంటే ఒకే ఒక్క దారి మితంగా ఉన్న తిండీ, నీరు పంచుకోవడమే’ అంటూ, ఆర్మీలో పని చేసిన ఆఫ్రికన్ అమెరికన్ అయిన ‘కామెరాన్’ ఆ గుంపుకి నాయకత్వం వహిస్తాడు ‘వన్ అమేజింగ్ థింగ్ నవలలో. తను చదువుతున్న ఛాసర్ రాసిన, ‘కాంటర్బరీ టేల్స్’ పుస్తకం వల్ల ప్రేరణ పొందిన ఉమ అందరికీ సూచిస్తుంది: ‘ప్రతీ ఒక్కరికీ ఏదో కథ ఉండే ఉంటుంది. కనీసం ఒక ‘ఆశ్చర్యకరమైన సంగతి’ అయినా ఎదుర్కోకుండా ఎవరి జీవితమూ సాగదు. మీ మీ కథలు చెప్తే, సమయం గడుస్తుంది. భయమూ తగ్గుతుంది’. మిగిలిన వారు ముందు ప్రతిఘటించినప్పటికీ, కథలు మొదలవుతాయి. ‘ఉమ ఎప్పుడూ అంతే. అపరిచితుల జీవితాలపైన అనవసరమైన ఆసక్తి పెంచుకునే యువతి. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు, నేలమీదున్న ఇళ్ళని చూసి వాటి నివాసుల బతుకులను ఊహించుకునేది’ అంటారు రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుని. అందరూ తమ ప్రేమ, పెళ్ళి, కుటుంబం గురించిన కథలు చెప్తారు. వారి జీవితాల్లో ఉన్న సిగ్గు పడవలసిన రహస్యాలూ, అంతర్గత సంఘర్షణలూ, అనుభూతులూ బయట పడటం మొదలవుతుంది. గుంపు చేయవలసినదల్లా వాటిని వినడమే. ఏ ఒక్క కథ మీదా దృష్టి నిలపదు నవల. కథలూ విశేషమైనవి కావు. ఆ గుంపులో ఒకరైన జియాంగ్, ‘మనం పూర్తిగా మారిపోయి ఉండి కూడా దాన్ని గుర్తించకపోవచ్చు. మనం ఎదుర్కొన్న బాధాకరమైన అనుభవాల వల్ల మనం రాయిగా మారామనుకుంటాం. కానీ, మన జీవితాల్లోకి ప్రేమ నెమ్మదిగా ప్రవేశించి, లోలోపలే మనల్ని తునకలుగా చేసే గొడ్డలిగా మారుతుంది’ అన్న మాటలు, మిగతావారి మీద ప్రభావం చూపినప్పుడు, ఆ జీవన్మరణపు పరిస్థితిలో తాము చెప్పిన కథల వల్లే, తమని తాము అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు వారు. సంప్రదాయబద్ధంగా జీవిస్తున్నారనుకున్న తల్లిదండ్రుల్లో, తండ్రి తనకి ఫోన్ చేసి తల్లికి విడాకులిస్తున్నానని చెప్పాడన్న తన కథను ఉమ చెబుతుంది. కథలు పూర్తయేటప్పటికి రక్షణ దళం వచ్చిందని తెలుస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరి నేపథ్యానికున్న కులం, ప్రాపంచిక దృక్పథం, చర్మపు రంగు కూడా మూలపడతాయి. వారి కథల ద్వారానే ఆ పాత్రలను నిర్వచిస్తారు దివాకరుని. అందరి దృష్టికోణాలకి ప్రామాణికతను ఆపాదిస్తారు. కథలు మనకి సాధికారతనిచ్చి, విముక్తి కలిగించి మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం ఇస్తాయంటారామె. పుస్తకంలో ఉన్న శైలి స్పష్టమైనది. భాష సరళమైనది. నిర్దిష్టమైన ముగింపేదీ ఉండని ఈ నవలని ‘హేషెట్ బుక్స్’ 2010లో ప్రచురించింది. - కృష్ణ వేణి -
మూడు తరాల తల్లీకూతుళ్ల కథ
తల్లులు తమకి తెలియకుండానే కూతుళ్ళ జీవితం పైన ఎంత గంభీరమైన ప్రభావం చూపుతారో చిత్రిస్తారు రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుని. ‘బిఫొర్ వి విసిట్ ద గాడెస్’– మూడు తరాల తల్లీకూతుళ్ల కథ. అమ్మమ్మ సాబిత్రి, కూతురు బేలా, మనవరాలు తార. సాబిత్రి గతం– ఆమెకీ బేలాకీ అడ్డుపడటంతో, సాబిత్రి కూతుర్ని తననుంచి చాలా దూరం పెడుతుంది. దానివల్ల, బేలా తన ప్రేమికుడితో అమెరికా పారిపోయి తారాను కంటుంది. తల్లి వివాహం విఫలమయినప్పుడు, తార కాలేజి చదువు మధ్యలోనే ఆపేసి తల్లీతండ్రీ నుంచి దూరం అయి, డ్రగ్స్ తీసుకుంటూ, చిన్న పాటి ఉద్యోగాలు చేసుకుంటుంటుంది. ‘మన ప్రపంచం తలకిందులు అవుతున్నప్పుడే కాబోలు మనం తల్లులకి ఫోన్ చేస్తాం’ అనుకుంటూ, తల్లితో ఇన్నేళ్ళూ మాట్లాడ్డానికి మొహం చెల్లని బేలా, కూతురికి బుద్ధి చెప్పమని సాబిత్రిని అడగటంతో పుస్తకం ప్రారంభం అవుతుంది. తనెప్పుడూ చూడని, అమెరికాలో పుట్టి పెరిగిన మనవరాలికి తనేం సలహా చెప్పగలదా! అని సందేహపడుతూనే, ఇన్నేళ్ళూ రహస్యంగా ఉంచిన తన అనుభవాలని చెప్తే, తార చదువు కొనసాగిస్తుందని ఆశిస్తూ, సాబిత్రి ఆమెకి ఉత్తరం రాస్తుంది. తల్లులు తమకి తెలియకుండానే కూతుళ్ళ జీవితంపైన ఎంత గంభీరమైన ప్రభావం చూపుతారో అని చెప్తూ, తల్లీ కూతుళ్ళ మధ్యనుండే క్లిష్టమైన సంబంధాలని చిత్రిస్తారు రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుని. సున్నితమైన సంబంధాలు తెగిపోడానికి క్షణమాత్రం కూడా పట్టదన్న వాస్తవాన్ని చెప్తారు. పుస్తకం– బెంగాల్ కుగ్రామం నుంచి హ్యూస్టన్‌లో ఉండే మధ్యతరగతి జీవన విధానాల వరకూ పాఠకులని తీసుకెళ్తుంది. కథ 1950లకీ, 2020లకీ మధ్యన చోటు చేసుకున్నది. అద్భుతమైన వచనం ఉన్న నవల ఏ కాలక్రమానుసారాన్నీ అనుసరించక, తమ వాంఛలని వెంబడిస్తూ నిజమైన ప్రేమకోసం వెంపర్లాడిన ముగ్గురు స్త్రీల దృష్టికోణాలతో సాగుతుంది. వదిలిపెట్టిన చాలా భాగాలు ఫ్లాష్‌బ్యాకుల్లో కనబడతాయి. మిఠాయిల వ్యాపారం చేసే సాబిత్రి నూరు శాతం బెంగాలీ స్త్రీ. బేలా రెండు సంస్కృతులకీ మధ్య ఊగిసలాడేదయితే, తార తన మూలాలనుండి పూర్తిగా దూరం అయిన అమ్మాయి. మొదట్లో కష్టాల్లో ఉన్న కుటుంబం గురించిన సామాన్యమైన నవలే అనిపిస్తుంది. యీ స్త్రీలు తమ జీవితాలని మలిచిన పురుషులకి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వరు. ఆ పురుషుల పాత్రలకి కూడా గంభీరతను ఆపాదించి, వారి దృష్టికోణాలనీ పరిచయం చేయడం వల్ల నవల అసక్తికరమైనది అవుతుంది. నవల ముగ్గురి కథలనీ చివర్న ఒకటిగా కలిపేస్తుంది. పొట్టి సంభాషణల్లో కూడా చమత్కారపు పదబంధాలని చొప్పిస్తారు రచయిత్రి. ఉదా: ‘పశ్చాత్తాప పడటం కోసమని అన్ని అనుభూతులనూ కలిపి, ఒక గిన్నెలో తోడుబెట్టడం.’ ‘కిక్కిరిసిన వొంటరితనం ఉన్న గది.’ ‘రసగుల్లా, మిష్టీ దహీ’ వంటి మిఠాయిల ప్రస్తావనా, వర్ణనలూ నవల్లో ప్రధాన స్థానం ఆక్రమిస్తాయి. క్షమాపణ కోరని, నిర్భయులైన యీ మూడు ప్రధాన పాత్రలే దివాకరుని పుస్తకానికి గొప్ప బలం. ‘మంచి కూతుళ్ళు అదృష్ట దీపాలు. కుటుంబానికి వన్నె తెస్తారు. దుష్టురాళ్ళైన కూతుళ్ళు కుటుంబానికి కళంకం తెచ్చే కొరివికట్టెల వంటివారు’ అన్న సామెత నవల్లో చాలాసార్లే కనిపిస్తుంది. ఇది దివాకరుని పదకొండవ పుస్తకం. సైమన్ – షుస్టర్ 2016లో ప్రచురించింది. ఆడియో పుస్తకం ఉంది. కృష్ణ వేణి -
ప్రతి అక్షరం నాయకత్వ లక్షణం
అక్షరం.. చీకటిని చీల్చే దీపఖడ్గం. వట్టి పాదాలతో నిష్టగా ఆ ఖడ్గం అంచుపై నడిచి ఆ రుధిరధారతో పదునెక్కిన రచయిత్రి చిత్రాముద్గల్. దత్తా సామంత్ పేరు మీరు వినే ఉంటారు. శంకర్ గుహ నియోగి పేరు కూడా. ఇద్దరూ కార్మిక సంఘాల నాయకులు. ముంబై సిటీలోని లక్షల మంది జౌళి మిల్లు కార్మికుల యూనియన్ లీడర్ దత్తాసామంత్. 1997లో అండర్‌వరల్డ్ మాఫియా అతడిని చంపేసింది. అంతకుముందే 1991 శంకర్ గుహ నియోగి హత్య జరిగింది. ఛత్తీస్‌గఢ్ గని కార్మికుల ప్రియతమ నాయకుడు నియోగి. అక్కడి ఇండస్ట్రియల్ మాఫియా అతడిని చంపేసింది. ఈ రెండు హత్యలు భారతదేశంలోని కార్మిక సంఘాలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. అక్షర యోధురాలైన ముద్గల్ చేత ‘ఆవాన్’ అనే పుస్తకాన్ని రాయించాయి. దత్తా సామంత్ ఆమె తాత్విక గురువు కూడా. కార్మిక సంఘాల ఉద్యమాలు బలంగా వేళ్లూనుకుంటున్న సమయంలోని కార్మిక జీవితాలపై, ఆనాటి పరిస్థితులపై ముద్గల్ రాసిన ‘ఆవాన్’.. హిందీ సాహిత్యంలో ఒక ‘క్లాసిక్’గా నిలిచిపోయింది. కార్మిక సంఘ నాయకత్వ లక్ష్యంలోని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోడానికి అదొక ప్రామాణిక గ్రంథం అయింది. డెబ్బయ్ మూడేళ్ల ఈ వయసులోనూ ముద్గల్ ఆధునిక హిందీ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నవారిలో ఒకరిగా నిలబడే ఉన్నారు. ఇవాళ ఢిల్లీలో మొదలౌతున్న ఆరు రోజుల సాహిత్య అకాడమీ వేడుకల్లో అకాడమీ ఎగ్జిబిషన్‌కు చిత్రా ముద్గలే ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ముద్గల్ చెన్నైలో పుట్టారు. ముంబైలో చదువుకున్నారు. హిందీ లిటరేచర్‌లో ఎమ్మే చేశారు. తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా అవ«ద్ నారాయణ్ ముద్గల్ అనే జర్నలిస్ట్‌ని వివాహం చేసుకున్నారు. దత్తా సామంత్, శంకర్ గుహ నియోగి కార్మిక సంఘాల నాయకులైతే, చిత్రా ముద్గల్ అక్షర కార్మికురాలిగా కార్మిక ఉద్యమానికి జెండా పట్టిన యోధురాలు. ఆమె ప్రతి అక్షరం నాయకత్వ లక్షణం. - రచయిత్రి చిత్రా ముద్గల్