కోనసీమ కేరళను తలపిస్తోంది | chitra visits konaseema | Sakshi
Sakshi News home page

కోనసీమ కేరళను తలపిస్తోంది

Published Fri, Apr 8 2016 9:47 AM | Last Updated on Wed, May 29 2019 3:21 PM

chitra visits konaseema

సినీ నేపథ్య గాయని చిత్ర

తాళ్లరేవు : కొబ్బరి చెట్లు, గలగలా పారే గోదావరితో కోనసీమ ప్రాంతం కేరళను తలపిస్తోందని ప్రముఖ నేపథ్యగాయని చిత్ర పేర్కొన్నారు. కోనసీమ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చి యానాం జీవీఎస్ రెసిడెన్సీలో బస చేసిన ఆమెను ‘సాక్షి’ పలుకరించింది. తాను తూర్పుగోదావరి జిల్లాకు రావడం ఇదే ప్రథమమని, ఈ ప్రాంతం తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ముఖ్యంగా గోదావరి అందాలు చూస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతోందన్నారు. ఇక్కడ దట్టమైన కొబ్బరితోటలు, పచ్చని చెట్ల నడుమ ప్రయాణిస్తుంటే కేరళలో ఉన్న అనుభూతి కలుగుతుందన్నారు. ఇక్కడి ప్రజల ఆప్యాయతానురాగాలను ఎన్నటికీ మరువలేనన్నారు. అవకాశం వస్తే మరోమారు జిల్లాకు వచ్చి ఇక్కడి పర్యాటక ప్రదేశాలన్నింటిని వీక్షించాలని ఉందన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement