konaseema
-
మండపేటలో జనావాసాల మధ్య వైన్ షాపు ఏర్పాటు
-
ముప్పేట దాడి
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: గోదావరి జిల్లాల కొబ్బరి మార్కెట్లో నెల ముక్కుడు కాయకు డిమాండ్ రాగా.. నిన్నటి వరకు జోరు మీద ఉన్న పచ్చికాయకు డిమాండ్ తగ్గుతోంది. జాతీయ మార్కెట్లో కొబ్బరికి డిమాండ్ రావడం ఉత్తరాది మార్కెట్లో కొత్త తలనొప్పులకు కారణమైంది. దిగుబడి పెరిగి, కాయకు ధర రావడంతో రైతులు ముప్పెటకాయ (అన్ మెచ్యూర్, పక్వానికి రాని, లేతకాయ)ను కూడా కోయిస్తున్నారు. దీని వల్ల కొబ్బరికాయ నిల్వ సామర్ధ్యం తగ్గి పాడైపోవడంతో ఉత్తరాది వ్యాపారులు నిల్వకాయపై మక్కవ చూపుతున్నారు.మహా కుంభమేళా, మహా శివరాత్రి విక్రయాల జోరుతో దిగుబడి పెరిగినా కొబ్బరి కాయకు మంచి ధర వచ్చింది. వారం రోజుల క్రితం పచ్చికొబ్బరి వెయ్యి కాయల ధర రూ.15,500 నుంచి రూ.16 వేలకు చేరింది. అటువంటిది ఇప్పుడు రూ.13,500 నుంచి రూ.14 వేలకు తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం ముప్పెటకాయ సేకరణ. ధర అధికంగా ఉండడం, దింపు కార్మికుల కొరతతో రైతులు ముప్పెటకాయ కాయను సైతం సేకరిస్తున్నారు. కాయ పక్వానికి రావాలంటే కనీసం 11 నుంచి 12 నెలల సమయం పడుతోంది. ముప్పెటకాయకు 9 నెలల నుంచి 10 నెలలు సరిపోతోంది. పక్వానికి వచ్చిన కాయతో పాటు ముప్పెటకాయను కూడా విక్రయిస్తున్నారు. ఈ కాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం లేక తొందరగా పాడవుతున్నాయి. అలాగే దీని నుంచి వచ్చే ఎండు కొబ్బరి తక్కువ. స్థానిక ఎండు కొబ్బరి నుంచి 69 శాతం కొబ్బరి నూనె వస్తే ముప్పెట నుంచి కేవలం 62 శాతం మాత్రమే వస్తోంది. పక్వానికి వచ్చిన కాయను నిల్వ ఉంచితే కురిడీ తయారీ సమయంలో వెయ్యికాయలకు సగటున 100 కాయలు దెబ్బతింటే, ముప్పెటకాయ వల్ల 200 వరకు దెబ్బతింటాయి. దీనికి తోడు ఈ కాయ నుంచి పీచు బలహీనంగా ఉండడంతో పాటు చిప్ప పలచగా ఉంటోంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నందున ఈ కాయ కొనుగోలకు ఉత్తరాది వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారు. పాత దింపు కాయ కొనుగోలుకు వారు ఆసక్తి చూపడంతో దాని ధర పెరిగింది. వారం రోజుల క్రితం రూ.13 వేలు ఉండగా, ఇప్పుడు రూ.14 వేల నుంచి 15 వేల మధ్య లావాదేవీలు జరుగుతున్నాయి. గోదావరి లంక గ్రామాల్లో నిల్వ ఉన్న కాయకు మరింత డిమాండ్ ఉంది. ఇదే సమయంలో పచ్చికాయ కొబ్బరి రాశుల విక్రయాలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
కోనసీమలో మంత్రి అచ్చెన్నకు జనసేన కార్యకర్తల షాక్
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో మంత్రి అచ్చెన్నాయుడికి జనసేన కార్యకర్తలు షాక్ ఇచ్చారు. పి.గన్నవరంలో మంత్రి పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి సమావేశంలో గందరగోళం నెలకొంది.జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్న మాట్లాడుతున్న సమయంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా అచ్చెన్నాయుడు ఎలా మాట్లాడతారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోటే పవన్ పేరు పలకరా అంటూ నిరసన వ్యక్తం చేశారు.జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో పవన్ పేరు ప్రస్తావించక పోవడంతో టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం జరిగింది. జనసేన కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోబోయారు. దీంతో వివాదం మరింత ముదిరింది. షాక్ తిన్న అచ్చెన్నాయుడు సభ నుంచి వెళ్లిపోయారు. -
ఐఆర్ రాదు.. డీఏ లేదు!
రాయవరం: ఎన్నికల ముందు ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు హామీలు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీఏలపై ప్రకటన వస్తుందని, 12వ పీఆర్సీ చైర్మన్‌ను ప్రకటిస్తారని, పీఆర్సీ ఇచ్చే లోగా మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటినా వాటి విషయం పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెండింగ్ డీఏలు, పీఆర్సీ చైర్మన్‌ను నియమించి, ఐఆర్ ప్రకటిస్తారని అందరూ ఆశించారు. సంక్రాంతి కానుకగానైనా ఇస్తారని ఆయా వర్గాలు ఆశించినప్పటికీ, అటువంటి ప్రకటన ఏదీ రాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు డీలా పడ్డారు. పీఆర్సీ చైర్మన్‌ను నియమించి, నివేదిక ఇచ్చేలోగా ఇంటెర్మ్ రిలీఫ్ (మధ్యంతర భృతి) కోసం ఉద్యోగులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల కరువు భత్యం(డీఏ) బకాయిలు ఉన్న నేపథ్యంలో ఐఆర్‌పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లలో నెలకొంది.పీఆర్సీ ఏర్పాటు ఎప్పుడు?వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 12వ పీఆర్సీ చైర్మన్‌ను నియమించారు. అయితే ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. 2024 మే నెలలో సాధారణ ఎన్నికల అనంతరం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను నియమించాల్సి ఉంది. కమిషన్ చైర్మన్‌ను నియమించిన వెంటనే మధ్యంతర భృతిని మంజూరు చేయాల్సి ఉంది.43 శాతానికి మించి ఇస్తారా..2014లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పీఆర్సీ నివేదిక ఇచ్చేలోగా 2014 ఫిబ్రవరిలో 27శాతం ఐఆర్‌ను ప్రకటించారు. పీఆర్సీ నివేదికను రాష్ట్ర విభజన జరిగిన తేదీని ప్రాతిపదికగా తీసుకుని, అప్పటి నుంచి ఆర్థిక లబ్ధిని కల్పించారు. 43శాతం ఫిట్మెంట్తో కిరణ్‌కుమార్‌రెడ్డి అనంతరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీఆర్సీని అమలు చేశారు. అయితే పీఆర్సీ అరియర్ల విషయంలో మాత్రం శీతకన్ను వేశారు. ఎన్నో విజ్ఞాపనలు, ఆందోళనలతో ఎట్టకేలకు 2016 అక్టోబర్ నుంచి సీపీఎస్ ఉద్యోగులకు మూడు విడతలుగా, రెగ్యులర్ ఉద్యోగులకు ఒక విడతగా పీఆర్సీ అరియర్లు చెల్లించారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే అరియర్లు ఇచ్చారనే ఆరోపణలు కూడా అప్పట్లో విన్పించాయి. ఇప్పుడు కూడా అదేవిధంగా 43 శాతానికి మించి ఫిట్మెంట్ ఇవ్వాలనే డిమాండ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి విన్పిస్తోంది.ఆందోళనకు సిద్ధంపీఆర్సీ ప్రకటించిన తర్వాత నివేదిక వచ్చేలోపు ఐఆర్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. పీఆర్సీ కమిషన్‌ను నియమించిన తర్వాత నివేదిక ఇవ్వడానికి సాధారణంగా ఏడాది సమయాన్ని ఇస్తారు. పీఆర్సీ కమిటీ నియామకం అయిన తర్వాత వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాల్సి ఉంటుంది. పీఆర్సీ కమిటీ నివేదిక వచ్చేలోగా ప్రకటించాల్సిన మధ్యంతర భృతి కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. ఐఆర్ ఇవ్వాల్సిందేనంటూ వివిధ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. ఐఆర్ ప్రకటన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.డీఏలు ఇచ్చేదెన్నడు?ప్రతి ఆరు నెలలకు ఒకసారి దేశవ్యాప్తంగా ధరల సూచి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కరవు భత్యం ప్రకటిస్తుంది. దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం రేషియో ప్రకారం డీఏ ఇవ్వాల్సి ఉంది. గతేడాది జనవరి, జూలైలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు డీఏలను ఇవ్వాల్సి ఉంది. ఈ నెల పోతే మరో డీఏను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. అయినప్పటికీ రెండు డీఏలను ఇప్పటికీ ఇవ్వక పోవడాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే రెండు డీఏలను ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉద్యోగులపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఉమ్మడి జిల్లాలో ఉద్యోగుల పరిస్థితి ఇదీ..ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ శాఖల్లో ఉద్యోగులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగులు కలిసి సుమారు 42వేల వరకు ఉండగా, పెన్షనర్లు 38వేల వరకు ఉన్నట్లు సమాచారం. వీరందరూ రెండు విడతల కరవు భత్యంతో పాటు, 12వ పీఆర్సీ మధ్యంతర భృతి ప్రకటనకు ఎదురుచూస్తున్నారు.గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదుఉద్యోగులు, ఉపాధ్యాయులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు సాకుగా చూపి తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు. మధ్యంతర భృతిని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. సీపీఎస్ రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి.– గొల్లవిల్లి నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం, కోనసీమ జిల్లాఐఆర్ ప్రకటించాలిఅందరికీ ఆమోదయోగ్యమైన ఐఆర్‌ను ప్రభుత్వం ప్రకటించాలి. పెండింగ్ డీఏలను విడుదల చేయాలి. ఆర్థిక పరమైన బకాయిలను విడుదల చేయాలి. న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించకుంటే పోరాట బాటను పట్టాల్సి వస్తుంది.– చింతాడ ప్రదీప్‌కుమార్, అధ్యక్షుడు, పీఆర్టీయూ, కాకినాడ జిల్లా -
కోనసీమ కొబ్బరికి రాజయోగం.. భారీగా పెరిగిన ధరలు
-
కోనసీమలోనూ భీమవరం తరహా పందేల ఏర్పాట్లు
సాక్షి, అమలాపురం: కోడిపందేలంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతమే గుర్తొస్తుంది. ఈసారి భీమవరం తరహా ఏర్పాట్లను తలదన్నేలా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పందేలకు పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. సినిమా సెట్టింగ్‌లను తలపించేలా.. పెద్దపెద్ద సినిమాల ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ల మాదిరిగా కోనసీమలో ఏర్పాట్లు చేస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐ.పోలవరం మండలం మురమళ్లలో కోడిపందేలు, గుండాటలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ హయాంలో 2014–2019 మధ్య ఇక్కడ పెద్దఎత్తున కోడి పందేలు, పొట్టేలు పందేలు, గుండాటలు నిర్వహించారు. ఈసారి అంతకుమించి మురమళ్లల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) స్వగ్రామం మురమళ్ల కావడం, ఆయన అశీస్సులు పుష్కలంగా ఉండటంతో నిర్వాహకులు రెండు ఫుట్‌బాల్ మైదానాలంత స్థలంలో పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 10 ఎకరాల స్థలంలో 10 వేల మందికి పైగా కూర్చుని పందేలు చూసేలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చే 500 మంది వీవీఐపీల కోసం సోఫా సెట్లు, కూలర్లు ఏర్పాటు చేయనున్నారు. రెండు బరుల్లో పందేలు నిర్వహించనున్నారు. పందేలు అందరికీ కనిపించేలా చుట్టూ భారీ ఎల్సీడీలు ఏర్పాటు పెడుతున్నారు. కోడి పందేలతోపాటు గుండాటలు కూడా పెద్దఎత్తున నిర్వహించనున్నారు. కోనసీమ రుచులను చూపించేందుకు ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటవుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలోని పేరొందిన బిర్యానీలు, మాంసాహారం, ఆత్రేయపురం పూతరేకులతో పాటు పలు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.ఆంధ్రా గోవా అంటూ..ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం బీచ్‌ను ‘ఆంధ్రా గోవా’గా అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తరచూ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈసారి పండుగ మూడు రోజులు బీచ్‌వద్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన నాయకులు సమీపంలోనే కోడి పందేలు, గుండాటలకు సిద్ధమవుతున్నారు. ఇందుకు వేలం పాటలు కూడా నిర్వహించినట్టు సమాచారం. ఆంధ్రా గోవా అని పిలుస్తున్నందుకు పండుగ రోజులలో బీచ్‌ను గోవా తరహాలో జూద కేంద్రంగా మారుస్తున్నారని స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
Konaseema: ఏపీలో ఘోర ప్రమాదం
-
కోనసీమలో టీడీపీ Vs జనసేన.. ఫోన్ సంభాషణ వైరల్
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ నేతలు తమను గుర్తించకపోవడంపై జనసేన కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ పనులు సైతం టీడీపీ నేతలే సర్దుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మలికిపురం మండలం గూడపల్లి గ్రామంలో రోడ్ల కాంట్రాక్టుల విషయమై ఓ టీడీపీ నేతకు జనసేన కార్యకర్త ఫోన్ చేసి నిలదీశారు. జనసేన- టీడీపీ నాయకుల సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉచిత ఇసుక పేరుతో కూటమి ప్రభుత్వం రాజోలు ప్రజలను అన్యాయం చేసిందంటూ సోషల్ మీడియాలో జనసేన కార్యకర్త పెట్టిన పోస్ట్ హల్చల్ చేస్తోంది. -
ప్రీమియం పిడుగు
ఆలమూరు: అందరికీ పట్టెడన్నం పెట్టే రైతులను దేశానికి వెన్నెముక అని భావిస్తారు. వారి సంక్షేమానికి ఎన్ని చర్యలు తీసుకుంటే దేశం అంత అభివృద్ధి చెందుతుంది. కానీ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులపై పగ సాధిస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపి వేసింది. బీమా కోసం తప్పనిసరిగా ప్రీమియం కట్టాలనే నిబంధన తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉచిత పంటల బీమా రద్దుతో ప్రతి సీజన్లో ఎకరాకు ప్రీమియంగా రూ.615 చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. గత ప్రభుత్వం విత్తు దశ నుంచి పంట చేతికి వచ్చే వరకూ అండగా ఉన్న సంగతిని ఇప్పుడు అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు.రైతుల అవస్థలుఅన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాది రూ.20 వేలు సాయం అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం దాని అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రైతులు వరిసాగు చేపట్టారు. ఇప్పుడు కొత్తగా వారిపై బీమా ప్రీమియం పేరుతో అదనపు భారాన్ని మోపేందుకు కూటమి సిద్ధమైంది. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో సుమారు 1.68 లక్షల ఎకరాల్లో 1.16 లక్షల మంది రైతులు వరిసాగు చేస్తున్నారు.నష్టపరిహారంపంటసాగు కోసం బ్యాంకు లేదా సొసైటీ నుంచి రుణాలు తీసుకున్న రైతులకు సంబంధిత సంస్థలే బీమా సొమ్మును చెల్లిస్తాయి. తర్వాత రైతుల నుంచి వసూలు చేస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బ్యాంకుల ద్వారా బీమా చేయించుకున్న రైతులకు పరిహారం అందుతుంది. రుణాలు తీసుకోలేని రైతులు, కౌలు రైతులకు మాత్రం బీమా సౌకర్యం ఉండదు. ఈ సమస్య పరిష్కారానికి ఆనాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను చేయాలని సంకల్పించి, ఆ దిశగా చర్యలు తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఈ– క్రాప్ చేయించుకున్న ప్రతి రైతుకు ఉచిత పంటల బీమాను అమలు చేసింది. దీంతో చిన్న, సన్నకారు రైతులు బీమా చేయించుకోలేకపోయినా పంటలు దెబ్బతిన్నప్పుడు నష్టపరిహారం అందేది.ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాను రద్దు చేయడంతో రైతులపై భారం పడింది. రానున్న రబీ సీజన్‌కు గాను డిసెంబరు 15 నాటికి పంటల బీమా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ), గ్రామ సచివాలయాల్లో రైతులు తమ ప్రీమియం చెల్లించవచ్చని వ్యవసాయశాఖ సూచించింది.అన్నదాతల ఆవేదనగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి సర్కారు నిలిపివేయడంతో అన్నదాతల్లో ఆందోళన ప్రారంభమైంది. వచ్చే రబీ సీజన్ నుంచి రైతులే ప్రీమియం చెల్లించుకోవాలని కూటమి ప్రభుత్వం స్పష్టం చేయడంతో కలవరం మొదలైంది. ఎకరాకు రైతు ప్రీమియం వాటాగా రూ.630 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా జిల్లా రైతాంగంపై రూ.104.32 కోట్లు భారం పడనుంది.రైతులకు అండగా వైఎస్సార్ సీపీవర్షాలు, వరదలతో పంటకు నష్టం వాటిల్లినప్పుడు రైతులను ఆదుకునేందుకు దోహదపడుతుందనే ఉద్దేశంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఉచిత పంటల బీమాను ప్రవేశపెట్టారు. రైతులపై ప్రీమియం భారం పడకుండా 2019 జూలైలో ఖరీఫ్ సీజన్ నుంచి నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ – క్రాప్ నమోదు ప్రామాణికంగా సాగు విస్తీర్ణం అంతటికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేలా చూశారు. దీనివల్ల పంటల బీమా కోసం రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద నిర్ణీత సమయానికి రైతుల ఖాతాల్లో రూ.13,500 జమ అయ్యేది. ఏటా 1.15 లక్షల చొప్పున జిల్లాలోని దాదాపు ఎనిమిది లక్షల మంది రైతుల తరఫున ప్రీమియం రూపంలో ప్రభుత్వం బీమా కంపెనీలకు ఐదేళ్లలో దాదాపు రూ.150 కోట్లు చెల్లించింది. అలాగే పంట నష్టపోయిన లక్షల మంది రైతులకు ఐదేళ్ల కాలంలో రూ.284.19 కోట్లు పరిహారం అందించింది.రైతులే చెల్లించాలిరాబోయే రబీ సీజన్ నుంచి పంటల బీమా ప్రీమియాన్ని రైతులే స్వచ్ఛందంగా చెల్లించాలి. వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి రైతులు దీనిపై అవగాహన పెంచుకోవాలి. రబీసాగులోని పంటల బీమాపై విధి విధానాలు పూర్తిగా ఖరారు కాలేదు.– ఓలేటి బోసుబాబు, జిల్లా వ్యవసాయాధికారి, అమలాపురం -
దీవెనపై దాష్టీకం
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై జులుం ప్రదర్శిస్తున్నాయి. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు తొలి సెమిస్టెర్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఫీజు కడతారా..? లేదా..? అని వారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. ట్యూషన్ ఫీజులో సగం చెల్లించాలని హుకుం జారీ చేస్తున్నాయి. ఒక్కసారిగా రూ.35 వేల నుంచి రూ. 60 వేలు చెల్లించాలంటే ఎలాగని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షలకు అనుమతించాలంటే ఫీజు కట్టాల్సిందేనని తెగేసి చెబుతున్నాయి. ఈ పరిణామంతో పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ‘విద్యా, వసతి దీవెన’ పథకాల్లో విద్యార్థులకు అవసరమైన సమయాల్లో ఆర్థిక ఆసరా అందేది. ప్రస్తుతం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఆ పథకాలకు మంగళం పాడింది. ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకువస్తామని ప్రకటనలు చేసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా.. నేటికీ అతీగతి లేదు. దీంతో అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి ఎదురైందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఫీజుల దోపిడీపై పలు విద్యార్థి సంఘాలు ఉద్యమబాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి.మితిమీరిన ఒత్తిళ్లుఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు కళాశాల యాజమాన్యాలు నిర్ణయించాయి. పరీక్ష ఫీజు రూ.1,250 చెల్లించాలని నోటీసులు జారీ చేశాయి. చిన్న మొత్తమే కదా అని ఫీజు చెల్లించేందుకు వెళుతున్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో సగం కడితేనే పరీక్ష ఫీజు చెల్లించేందుకు వీలుగా ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందని చావు కబురు చల్లగా చెబుతున్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో వసతులను బట్టి ట్యూషన్ ఫీజు రూ.43 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఉంటుంది. సెమిస్టర్ పరీక్షలు రాయాలంటే రూ.32 వేల నుంచి రూ.63 వేల వరకు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేదంటే పరీక్షలకు అనుమతించబోమని కనికరం లేకుండా మాట్లాడుతున్నట్టు తెలిసింది. ఈ పరిణామం నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆవేదన నింపుతోంది. ఆ విద్యార్థులు కష్టపడి ఏపీఈసెట్‌లో ఉత్తమ ర్యాంక్ సాధించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఉందనే భరోసాతో మంచి కళాశాలల్లో అడ్మిషన్లు పొందారు. తీరా ఫీజుల ఒత్తిడి ప్రారంభమవడంతో ఏం చేయాలో దిక్కుతోచక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ సెకెండ్, థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులపై కళాశాల యాజమాన్యాలు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. చేసేది లేక.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న తల్లిదండ్రులు ఎలాగోలా అప్పులు తెచ్చి ఫీజులు చెల్లిస్తుంటే.. మరి కొందరు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.విద్యాదీవెనకు మంగళంపేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యాదీవెన పథకాన్ని తీసుకువచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపులు, క్రైస్తవ వర్గాలకు చెందిన వేలాది మంది పేద విద్యార్థులు ప్రైవేటు డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరారు.జిల్లా వ్యాప్తంగా సుమారు 10 ఇంజినీరింగ్ కళాశాలలు, 7 డిగ్రీ కళాశాలలు 7 ఉండగా.. 25 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చదువుతున్నారు. వీరంతా గతంలో విద్యా దీవెన పథకంలో ఆర్థిక సాయం పొందేవారు. కళాశాలలను గ్రేడ్లుగా విభజించి ఏ–గ్రేడ్ కళాశాలలో చదివే వారికి ఏడాదికి రూ.18,400, బీ–గ్రేడ్ కళాశాలల్లో చదివేవారికి రూ.15,300 చొప్పున గత ప్రభుత్వం చెల్లించేది. నాలుగు దశల్లో ఫీజు రీయింబర్స్ చేసి సొమ్ములను విద్యార్థులు, తల్లుల ఉమ్మడి ఖాతాలలో జమ చేసింది. ఆ సొమ్ముతో విద్యార్థులు ఫీజులు కట్టేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలో జిల్లాలోని 70,241 మంది విద్యార్థులకు రూ.142.99 కోట్లు చెల్లించింది.రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టతేదీ?గత ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాదీవెన పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. ఆ పథకం స్థానంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని ప్రకటించింది. అధికారం చేపట్టి నెలలు గడుస్తున్నా నేటికీ పథకం విధి విధానాలపై స్పష్టత ఇవ్వలేదు. సాధ్యాసాధ్యాలపై స్పష్టత ఇచ్చే వరకు విద్యార్థులను ఫీజుల విషయంలో ఇబ్బందులు పెట్టవద్దని కళాశాల యాజమాన్యాలకు సైతం ప్రభుత్వం ఆదేశాలిచ్చిన దాఖలాలు లేవు. పథకం ఎప్పటి నుంచి అమలవుతుందన్న విషయంలో కూడా ఎలాంటి స్పష్టతా లేదు. అసలు అమలు చేస్తారా..? చేతులేత్తేస్తారా..? అన్న ప్రశ్న తల్లిదండ్రుల్లో ఉత్పన్నమవుతోంది. దీంతో రంగంలోకి దిగిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తమ ఫీజులు రాబట్టుకునేందుకు విద్యార్థులపై ఒత్తిడి పెంచేశారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులపై ఇవి మరింత తీవ్రమయ్యాయి. కాలయాపన చేసి పథకాన్ని నీరుగార్చేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.మితిమీరుతున్న ప్రైవేటు కళాశాలల ఆగడాలుప్రైవేటు కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాల ఆగడాలు మితిమీరుతున్నాయి. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు పెద్ద ఎత్తున దోపిడీకి ఎగబడుతున్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజు వేధింపులు పెరిగిపోయాయి. ఫీజులు చెల్లించకపోతే పరీక్షలు రాయనివ్వబోమని చెప్పడం దారుణం. దీనిపై ఆందోళనలు ఉధృతం చేస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఎప్పుడు అమలు చేస్తుందో ప్రకటించాలి.– తాడేపల్లి విజయ్‌కుమార్, అంబేడ్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడుయాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలిఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఎవరి అకౌంట్లో జమ చేస్తారో చెప్పాలి. ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి బలవంతం వసూలు చేస్తున్నారు. ఫీజు కట్టకపోతే హాల్ టికెట్లు ఆపుతామని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా భయపెట్టి విద్యార్థుల దగ్గర నుంచి ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాంటి యజమాన్యాలపై తక్షణం చర్యలు తీసుకోవాలి.– వై.భాస్కర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు -
స్కవర్ స్లూయిజ్ నుంచి నీరు విడుదల
ఆత్రేయపురం: కాటన్ బ్యారేజీ ముందు భాగంలో పేరుకుపోయిన మట్టిని తొలగించడానికి గోదావరి హెడ్ వర్క్సు ఎస్ఈ ఆర్.కాశీ విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో స్కవర్ స్లూయిజ్ గేట్లు ఎత్తి భారీ స్థాయిలో నీటిని నదిలోకి విడుదల చేశారు. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద సెంట్రల్ డెల్టా స్కవర్ స్లూయిజ్‌కు సంబందించిన గేట్లను మంగళవారం తెరిచారు. ఏటా ఈ సీజన్లో బ్యారేజీకి ఎగువన పేరుకుపోయిన మట్టి, సిల్ట్, చెత్తా చెదారాలను తొలగించడానికి హెడ్ వర్క్సు శాఖ ఈ ఆపరేషన్ నిర్వహించడం అనవాయితీ. దానిలో భాగంగా హెడ్ వర్‌ుక్స అధికారులు బొబ్బర్లంక స్కవర్ స్లూయిజ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఎస్ఈ కాశీ విశ్వేశ్వరరావు స్కవర్ స్లూయిజ్ ద్వారా 4,800 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు తెలిపారు. దీనివల్ల ఎగువన పేరుకు పోయిన బురద మట్టి ఈ నీటి ప్రవాహం ద్వారా గోదావరి దిగువకు చేరుకుంటుందన్నారు. కార్యక్రమంలో డీఈఈ కె. అనంద్‌బాబు, ఏఈలు అద్దంకి సాయిరాం, రేవు సునీల్‌బాబు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నువ్వా.. నేనా..
రావులపాలెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక మాటున కూటమి నాయకులు దోపీడీకి పాల్పడుతున్నారు. యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చేస్తూ అక్రమార్జనలో పోటీ పడుతున్నారు. ప్రజలు తమ అవసరాల నిమిత్తం ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన ప్రకటనతో వీరు మరింత విజృంభించారు. ముఖ్యమంత్రి ప్రకటనతో సామాన్యులకు ఎంత లాభం కలిగిందో తెలియదు గానీ కూటమి నాయకులకు మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. నిబంధనలను తొంగలోకి తొక్కి కూటమి నాయకులు ఇసుక తవ్వకాలను నడిపిస్తున్నారు. రావులపాలెం మండలం గోపాలపురం పాత ఇసుక ర్యాంపు బాటలో మంగళవారం వందల ట్రాక్టర్లతో అక్రమ తవ్వకాలకు తెరలేపారు.ట్రాక్టర్ ఇసుక రూ.600ప్రభుత్వం ఉచిత ఇసుకను ప్రకటించడంతో పాటు సీనరీజ్ను రద్దు చేసింది. అయితే గోపాలపురంలో ట్రాక్టర్ ఇసుకకు రూ.600 వసూలు చేస్తున్నారు. ఇందులో రూ.350 కూలీలకు కేటాయించగా, రూ. 250 బాట నిర్వహణ పేరుతో కూటమి నాయకులు జేబులు నింపుకొంటున్నారు. అయితే బాట నిర్వహణకు రూ.50 కేటాయించినా మిగిలిన రూ. 200లో రూ.100 బీ టాక్స్, మరో రూ.100 గ్రామానికి చెందిన నాయకుడికి ఏ టాక్స్‌గా కేటాయించినట్లు తెలుస్తుంది. ఒక్క రోజులోనే సుమారు 600 ట్రాక్టర్లకు ఎగుమతి చేయగా కూలీలకు కేటాయించిన సొమ్ము కాకుండా నాయకుల జేబుల్లోకి సుమారుగా రూ.1,50,000 వరకు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు.సీఆర్‌జెడ్ పరిధిలో తవ్వకాలుఇటీవల కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలోకి మండలంలోని గోపాలపురం, కొమరాజులంక, ముమ్మిడివరప్పాడు, రావులపాలెం గ్రామాలు చేరాయి. వీటిలో అక్రమ మైనింగ్ తవ్వకాలు చేపట్టకూడదంటూ నిబంధనలు ఉన్నాయి. ఇటీవల కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా సాండ్ కమిటీ ఆయా ఊర్లను మినహాయించి, మిగిలిన గ్రామాలైన పొడగట్లపల్లి, ఊబలంక గ్రామాల్లో ఇసుకర్యాంపుల నిర్వహణకు పరిశీలన చేసింది. గోదావరిలో నీటి ప్రవాహం ఉండడంతో మరో పది రోజులు సమయం పడుతుందని అధికారులు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో గోపాలపురంలో పాత ఇసుక ర్యాంపులో ఇసుక మేటలు తేలడంతో కూటమి నాయకులు వాటిని సొమ్ము చేసుకునేందుకు నిబంధనలు లెక్కచేయకుండా తవ్వకాలు చేపట్టారు. స్థానిక కూటమి నాయకుల ట్రాక్టర్లకు పదుల సంఖ్యలో ట్రిప్పులు ఇస్తున్నారని, గృహ అవసరాల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి తెచ్చుకున్న తమ ట్రాక్టర్లకు ఒక ట్రిప్పు మాత్రమే ఇచ్చారంటూ పలువురు ట్రాక్టర్ డ్రైవర్లు చెబుతున్నారు. గ్రామానికి చెందిన తెలుగుదేశం రాష్ట్ర నాయకుడి అనుచరులు ఈ దందాకు తెరలేపారు. ఒక్కరోజులోనే రూ.లక్షల్లో జేబులు నింపుకొన్నారు. లారీ ఇసుకను రూ.20 వేలకు పైగా విక్రయిస్తూ అక్రమార్జనకు బాటలు వేసుకున్నారు.దోపిడీకి తెరగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లోకి రావడంతో ఇదే వంకతో కూటమి నాయకులు ఇసుక దోపిడీకి తెర తీశారు. అధికారులు కోడ్ హడావుడిలో ఉంటారని, తమకు అడ్డు చెప్పేవారే ఉండరని భావించి అక్రమ తవ్వకాలకు బాటలు వేశారు. గోపాలపురంలో నిబంధనలను సైతం తుంగలోకి తొక్కి ఇసుక తవ్వకాలు చేపట్టారు. -
మాట వినకుంటే బెల్డ్ తీస్తాం
సాక్షి, అమలాపురం: మద్యం ముంగిటకే తెస్తున్నారు.. వీధివీధినా బెల్టు షాపుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు.. దీనికి సరిహద్దులూ నిర్ణయిస్తున్నారు.. ఇప్పటికే మద్యం దుకాణాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి? వీటి పరిధిలో బెల్టు షాపులు ఎక్కడ పెట్టాలో అనే అంశాలపై కూటమి చెందిన కొందరు నేతలు హుకుం జారీ చేశారు. సిండికేట్ నిర్ణయించిన ‘హద్దులు’ దాటితే ‘బెల్టు’ తీస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. జిల్లాలో కొత్త మద్యం పాలసీ ప్రకారం 133 మద్యం దుకాణాలను కేటాయించారు. పలుచోట్ల దుకాణాలు తెరిచి మద్యం విక్రయాలు జరుపుతున్నారు. మద్యం దుకాణాలు పూర్తి స్థాయిలో తెరిచేందుకు మరో రెండు, మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.సిండికేట్‌పై స్పష్టత లేకపోవడంతో పలుచోట్ల ఆలస్యమవుతుంది. ఈసారి ప్రభుత్వం మద్యం దుకాణాలకు మున్సిపాలిటీ, మండలాల యూనిట్‌గా దరఖాస్తులు కోరిన విషయం తెలిసిందే. దీనివల్ల మద్యం వ్యాపారుల మధ్య సరిహద్దు సమస్యలు వస్తున్నాయి. ఉదాహరణకు అంబాజీపేట మండలంలో మొత్తం ఐదు మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంబాజీపేట బస్టాండ్, మెయిన్ రోడ్డు ఇలా కిలోమీటర్ పరిధిలోనే మూడు దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సిండికేట్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఇంతలోనే పాత సిండికేట్‌దారులు తమ చుట్టూ ఉన్న బెల్టు షాపులతో మాట్లాడుకుని వ్యాపారం ప్రారంభించడంతో మిగిలిన వ్యాపారులు మండిపడుతున్నారు. దీంతో టీడీపీలో కీలక నేతలు రంగప్రవేశం చేసి వ్యాపారులను సిండికేట్ చేసేపనిలో పడ్డారు. అంబాజీపేటలోనే కాదు.. జిల్లాలో పలుచోట్ల ఇదే పరిస్థితి ఉంది.వారి కనుసన్నల్లోనే..జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు, వారి సోదరులు, ముఖ్య అనుచరులు, పాత మద్యం మాఫియా కనుసన్నల్లోనే దుకాణాల సరిహద్దులు నిర్ణయిస్తున్నారు. ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలు రావడంతో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు వీరికి వంత పాడుతున్నారు. దుకాణాల ఏర్పాటు వాటి పరిధిలో బెల్టు షాపుల నిర్ణయం వీరి కనుసన్నల్లో జరుగుతోంది. టీడీపీ మద్యం సిండికేట్ ఎంత బలంగా ఉందంటే జిల్లాలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో సైతం వీరి హవా సాగిస్తున్నారు. కొత్తగా బెల్టు షాపులను కూడా తెరిపిస్తున్నారు. గతంలో కంటే ఈసారి బెల్టు షాపులు రెట్టింపు కానున్నాయని అంచనా. మద్యం దుకాణాలకు చేసిన దరఖాస్తులకు భారీగా చేతి చమురు వదలడం, ఎకై ్సజ్ ట్యాక్స్ అధికంగా ఉండడంతో బెల్టు అమ్మకాలపై అధికంగా ఆశలు పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా బెల్ట్ దుకాణాలను పెద్ద ఎత్తున తెరుస్తున్నారు. టీడీపీ కీలక నేతలు మద్యం అమ్మకాలు అధికంగా జరిగే బెల్టు షాపులను తమ వద్దనే ఉంచుకోవడం గమనార్హం.ఎక్కడెక్కడ ఎలా అంటే..అమలాపురం నియోజకవర్గంలో మొత్తం 18 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 200 వరకు బెల్ట్ షాపులు వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకూ కేవలం 28 బెల్ట్‌షాపులు తెలిచారు. మద్యం షాపుల మధ్య సరిహద్దులను నిర్ణయించి, తరువాత బెల్టుపై దృష్టి సారించనున్నారు. టీడీపీలో మద్యం వ్యాపారులు సిండికేట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తమ పార్టీకి చెందని వారిని సైతం సిండికేట్‌లోకి ఆహ్వానిస్తున్నారు. అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లో దుకాణాల ఏర్పాటుపై తుది చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ మద్యం దుకాణాల కన్నా బెల్టు షాపులు పొందడంపైనే అందరూ దృష్టిసారించారు. ఎస్.యానాం, ఎన్.కొత్తపల్లి వంటి ప్రాంతాల్లో బెల్టుషాపులపై కీలక నేతలు దృష్టి సారించారంటే ఇక్కడ బెల్ట్ అమ్మకాలు ఏ స్థాయిలో జరుగుతాయో అర్థం చేసుకోవచ్చు.మండపేట నియోజకవర్గంలో మద్యం దుకాణాలు ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. సిండికేట్ ఏర్పాటుపై చర్చలు నడుస్తున్నాయి. ఇవి పూర్తయితేనే బెల్టు షాపులపై ఒక అంచనాకు వచ్చే అవకాశముంది.కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం 25 షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో కనీసం 150కి పైగా బెల్ట్ షాపులు వస్తాయని అంచనా. ఇప్పటికే నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను కొనసాగించడంతో పాటు టీడీపీ అనుకూలంగా ఉండే వారితో కొత్తగా బెల్టు షాపుల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.రామచంద్రపురం నియోజకవర్గంలో వెల్ల గ్రామంతో బెల్ట్ షాపు బోణీ అయ్యింది. ఇక్కడ ఆరు దుకాణాలకు వేలం జరగగా, మూడు చోట్ల మాత్రమే కొత్తగా ప్రారంభించారు. దుకాణాలు పూర్తిగా తెరిస్తే బెల్టుషాపులు మొదలవుతాయని అంచనా.పి.గన్నవరం నియోజకవర్గంలో దుకాణాల ఏర్పాటు ప్రాంతాలపైనే ఇంకా స్పష్టత రాలేదు. దుకాణాలను పంచుకున్న తరువాతనే బెల్టుషాపులపై స్పష్టత రానుంది. టీడీపీ సిండికేట్‌తోపాటు గత ఎన్నికల్లో భారీగా ఎన్నికల ఫండ్ ఇచ్చిన ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ఏర్పడిన సిండికేట్‌దారులు సైతం తమ హవా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు.ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలోని తీరంలో ఉండే బెల్టుషాపుల్లో లూజు సేల్స్ అధికం. కాని బెల్టుపై స్థానిక మత్స్యకార పెత్తందారుల నిర్ణయమే అంతిమం. వీటి ద్వారా పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరిగే అవకాశమున్నందున వీరితో స్థానిక నేత సోదరుడు చర్చలు జరుపుతున్నారు. ఐ.పోలవరం మండలంలో ఇప్పటికే బెల్టు అమ్మకాలు మొదలయ్యాయి. స్థానికంగా ఉన్న టీడీపీ నేత సోదరుడు ఆధ్వర్యంలో ఇక్కడ సిండికేట్ నడుస్తోంది.రాజోలులో దుకాణాల సరిహద్దులు తేలడం లేదు. ఇవి కొలిక్కి వచ్చిన తరువాతే బెల్టు షాపుల ఏర్పాటుపై ఒక అవగాహనకు రానున్నారు. కూటమి ప్రభుత్వం మద్యం విధానం ఆయా పార్టీల నాయకులకు కల్పతరువుగా మారనుంది. -
యుద్ధ విద్యల జమానా.. కోనసీమ చెడీ తాలింఖానా
కోనసీమ.. మైమరపించే ప్రకృతి అందాలకే కాదు.. ఆధ్యాత్మిక సౌరభాలకు.. సంస్థానాల పాలనకు.. స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలకు ఆలవాలంగా నిలుస్తోంది. ఇక్కడ జరిగే సంక్రాంతి.. దసరా పండగలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ప్రభల తీర్థాలతోపాటు దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించే చెడీ తాలింఖానా ప్రదర్శన సైతం జాతీయ స్థాయిలో గుర్తింపు సంతరించుకుంది. బ్రిటిష్ కాలంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని సంస్థానాల్లో యువకులకు యుద్ధ విద్యలు నేర్పించేందుకు చెడీ తాలింఖానా మొదలైంది. తరువాత కాలంలో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తికి.. సమరయోధుల మధ్య ఐక్యతకు ప్రతీకగా మారింది. నాటినుంచి నేటి వరకు దశాబ్దాల కాలంగా ఈ వీరుల విద్య కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలలో భాగమైంది. ఏటా దసరా ఉత్సవాలలో కత్తులు, బళ్లేలు, బాణా కర్రలతో సాగే ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ నెల 12న దసరా రోజున రాత్రి చెడీ తాలింఖానా ప్రదర్శనలు అమలాపురంలో వీధుల్లో రోమాంచితం కానున్నాయి. – సాక్షి, అమలాపురంబర్మాలో శిక్షణ పొంది.. చెడీ తాలింఖానా బర్మా (మయన్మార్)కు చెందిన విద్య. ఉమ్మడి గోదావరి జిల్లాలోని సంస్థానాల్లో పనిచేసే సైనికులకు, యువతకు యుద్ధ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అమలాపురం పట్టణానికి చెందిన అబ్బిరెడ్డి రామదాసు (తొలి తరం వ్యక్తి) బర్మా వెళ్లి శిక్షణ పొంది వచ్చారు. పిఠాపురం, పెద్దాపురం, మొగల్తూరు తదితర సంస్థానాల నుంచి, స్థానిక యువకులు ఆయన దగ్గర ఈ విద్య నేర్చుకునేవారు. స్వాతం్రత్యానికి పూర్వం బ్రిటిష్ సేనలతో పోరాడే భారతీయులలో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ దసరా, వినాయక చవితి ఉత్సవాలను ప్రోత్సహించారు. ఊరేగింపులలో జాతీయ సమైక్యత చాటాలని ఆయన ఇచ్చిన పిలుపుతో దసరా ఉత్సవాలలో చెడీ తాలింఖానా ప్రదర్శన ఒక భాగమైంది. దసరా ఉత్సవాల్లో ఇది ప్రారంభమై 168 ఏళ్లు అయ్యింది. అమలాపురం పట్టణంలో దసరా రోజు సాయంత్రం నుంచి ఏడు వీధులకు చెందినవారు దసరా వాహనాలను ఊరేగిస్తారు. ఈ ప్రదర్శనలో చెడీ తాలింఖానా, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. నాలుగు తరాలుగా.. అమలాపురానికి చెందిన అబ్బిరెడ్డి రామదాసు చెడీ తాలింఖానాకు అంకురార్పణ చేశారు. తరువాత ఆయన కుమారుడు అబ్బిరెడ్డి నరసింహరావు (రెండవ తరం వ్యక్తి) ఈ వీర విద్యను ప్రోత్సహించారు. అబ్బిరెడ్డి రామదాసు (మూడవ తరం) తాత బాటలో ఈ విద్యకు రాష్ట్రస్థాయి గుర్తింపును తీసుకువచ్చారు. అబ్బిరెడ్డి మల్లేశ్వరస్వామి (మల్లేష్–నాల్గవ తరం) తాత, తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మల్లేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా యూఎస్‌లోని టెక్సాస్‌లో పనిచేస్తున్నారు. దసరా సమయంలో ముందుగానే ఇక్కడకు వచ్చి స్థానికులకు శిక్షణ ఇస్తుంటారు. కత్తులు దూస్తూ.. బళ్లేలు తిప్పుతూ.. దసరా వస్తుందంటే చాలు అమలాపురంలో సంప్రదాయ చెడీ తాలింఖానా ప్రదర్శనకు సిద్ధమయ్యే యువతీ యువకులు ఎందరో. దసరా సందర్భంగా వీధుల్లో అమ్మవారు వివిధ రకాల రథాలపై కొలువై ఊరేగింపుగా వెళతారు. దీనికి ముందే ఏడు వీధులకు చెందిన యువకులు పట్టా కత్తులకు పదును పెడతారు. బళ్లేలు, బాణా కర్రలు, కత్తులతో విన్యాసాలు చేస్తారు. రాచరిక యుద్ధాన్ని తలపించే ఈ సాహసోపేత విన్యాసాలను తిలకించేందుకు దసరా రోజు రాత్రి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున జనం తరలివస్తారు. కళ్లకు గంతలు కట్టుకుని మనిషి శరీరంపైన, కంఠం, నుదురు, పొత్తికడుపుపై కొబ్బరికాయలు, కాయగూరలు పెట్టి నరకడం వంటి విన్యాసాలు తాలింఖానాలో ముఖ్య ఘట్టాలు. అగ్గి బరాటాలు, లేడి కొమ్ములు, పట్టా కత్తులను చురుగ్గా కదిలిస్తూ యువకులు చేసే విన్యాసాలు యుద్ధ సన్నివేశాలను తలపిస్తాయి. ప్రదర్శన ఆసాంతం ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుంది. పట్టణానికి చెందిన ఏడు వీధులలో కొలువు తీరిన వాహనాలను సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారు జాము వరకు ఊరేగిస్తారు. త్వరలో వెబ్సైట్ చెడీ తాలింఖానాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్నదే నా ధ్యేయం. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా దీనికి విస్తృత స్థాయిలో ప్రచారం తీసుకువస్తున్నాం. త్వరలోనే తాలింఖానాకు ప్రత్యేక వెబ్సైట్ డిజైన్ చేస్తాం. – అబ్బిరెడ్డి మల్లేష్, అమలాపురం -
ఉత్తరాంధ్ర ఉక్కిరి బిక్కిరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ఎచ్చెర్ల క్యాంపస్/అనకాపల్లి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులు, వాగులు, చెరువులు, గెడ్డలు పొంగిపొర్లాయి. ఈ వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టినా.. ఇంకా నదులు, కాలువలు పొంగిపొర్లుతునే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో పరివాహక ప్రాంతాల్లోని వాగులు, ఏర్లు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల చెరువులు దెబ్బతిన్నాయి. అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడువేల ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. ఈ జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో కాకినాడ జిల్లా ఏలేరు పరీవాహక ప్రాంతం రైతుల కొంప ముంచింది. విజయనగరం జిల్లాలో మాత్రం ఈ వర్షాలు మేలు చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆయా జిల్లాల్లో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నష్టం..భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు సమాచారం. కానీ, వాస్తవ పరిస్థితులు చూస్తుంటే మూడువేల హెక్టార్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కె.కొత్తూరు, గార, రాగోలు వంటి ప్రాంతాల్లో కూరగాయల పంటలు సుమారు 78 ఎకరాల్లో నీటమునిగింది. జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు.. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు.. రహదారులు దెబ్బతిన్నాయి. నాలుగు కల్వర్టులు కొట్టుకుపోయాయి. పొలాల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలు కొన్నిచోట్ల పాక్షికంగా నీటమునిగి ఉండగా మరికొన్నిచోట్ల పూర్తిగా మునిగిపోయాయి. విజయనగరం జిల్లాలో..విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కొన్నిచోట్ల నష్టం కలిగించినా వ్యవసాయానికి ఎంతో మేలు చేశాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లాలో సుమారు 513 హెక్టార్లలో వరి పొలాలు నీటమునిగాయి. స్వల్పంగా 6.2 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతింది. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 66 హెక్టార్లలో ఉద్యాన తోటలు నేలకొరిగాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 ఇళ్లు శిథిలమవగా.. 8 పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెల్లిగడ్డపై కల్వర్టు దెబ్బతినగా.. బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిలోని కాజ్వే కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నాగావళి, చంపావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో 70 స్తంభాలు నేలకొరిగాయి. 26 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ మంగళవారం పునరుద్ధరించారు. తాటిపూడి, వట్టిగెడ్డ, మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్లు నిండిపోవడంతో దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. \అనకాపల్లి జిల్లాలో ఏడువేల ఎకరాలు..అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 7 వేల ఎకరాలు నీట మునిగినట్లు తెలుస్తోంది. వీటిలో 6 వేల ఎకరాల్లో వరి పంట, మరో ఒక వెయ్యి ఎకరాల్లో చెరకు, మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన, ఇతర పంటలు నీట మునిగాయి. వ్యవసాయ అధికారుల ఇచ్చిన నివేదిక ప్రకారం.. అనకాపల్లి జిల్లాలో 1,528 హెక్టార్ల వరి పంట నీట మునిగింది. జిల్లాలో 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 4 పూర్తిగా, 36 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 48 విద్యుత్ పోల్స్‌కు నష్టం వాటిల్లింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని తాండవ, కోనాం, కళ్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో సోమవారం గేట్లు ఎత్తివేశారు. తాండవ రిజర్వాయర్ మినహా మిగతా రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో అదుపులోనే ఉంది. ‘కోనసీమ’ను ముంచేస్తున్న వర్షాలు.. వరదలుఅధిక వర్షాలు, వరుసగా మూడుసార్లు వరదలతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలు, పరిశ్రమలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు తొలి నుంచి అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మొత్తం వరి ఆయకట్టు 1.90 లక్షల ఎకరాలు కాగా అధికారులు 1.63 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేశారు. జూలై వర్షాలు, వరదలకు సుమారు 3 వేల ఎకరాల్లో వరిచేలు దెబ్బతిన్నాయి. తాజాగా వరదలకు ముమ్మిడివరం మండలం అయినాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి.ఇవి కాకుండా లంక గ్రామాల్లో 5,996.30 ఎకరాల్లో అరటి, కురపాదులు, బొప్పాయి, తమలపాకు, పువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, జిల్లాలో 1,800 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఇటీవల వర్షాలు, వరదల కారణంగా.. రోజుకు 30 లక్షల ఇటుక తయారుచేయాల్సి ఉండగా, సగటున 12 లక్షల కూడా జరగడంలేదు. మరోవైపు.. కొబ్బరి పీచు పరిశ్రమల్లో కూడా సగం ఉత్పత్తి మించి జరగడంలేదు. కోనసీమ జిల్లాలో 400 వరకు చిన్నా, పెద్ద పరిశ్రమలున్నాయి. వర్షాలవల్ల డొక్క తడిచిపోవడంతో పీచు చేసే పరిస్థితి లేదు. అలాగే పీచు తడిసిపోవడంవల్ల తాడు తయారీ... క్వాయరు పిత్ బ్రిక్ తయారీ ఆగిపోతుంది.ముందుచూపులేకే ఏలేరు ముంచింది..ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో ఏలేరు పరీవాహక ప్రాంత రైతుల కొంప ముంచింది. ఊళ్లకు ఊళ్లు, వేలాది ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలున్నా ప్రభుత్వం ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలను నియంత్రించడంలో ఘోర వైఫల్యం ఏలేరు ముంపునకు కారణమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా కాకినాడ జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని నియోజకవర్గాలలో సుమారు 67 వేల ఎకరాలు సాగవుతుంటాయి. ఈ ప్రాజెక్టు నుంచి మిగులు జలాలు విడుదల చేసిన ప్రతి సందర్భంలో దిగువన పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి.పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో గట్లకు గండిపడి గ్రామాలపైకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. ఉగ్రరూపం దాల్చిన ఏలేరు, సుద్దగడ్డలతో పిఠాపురం నియోజకవర్గంలోని కాలనీలు, రోడ్లు పూర్తిగా నీటి మునిగాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా పెరిగిన వరద నీటితో పంట భూములు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు కాలనీలు ముంపులోనే ఉన్నాయి. 216 జాతీయ రహదారిలో గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.చచ్చినా ఇళ్లు ఖాళీ చేయం చింతూరులో వరదనీటిలోనే బాధితుల ఆందోళనచింతూరు: ఏటా వరదలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తేనే ఇళ్లను ఖాళీచేస్తామని లేదంటే వరద నీటిలోనే చచ్చిపోతామంటూ అల్లూరి జిల్లా చింతూరుకు చెందిన వరద బాధితులు తమ ఇళ్లను ఖాళీచేయకుండా వరదనీటిలో ఆందోళన చేపట్టారు. శబరి నది ఉధృతికి మంగళవారం చింతూరులో వరద పెరగడంతో శబరి ఒడ్డు ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి వెంటనే ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని గ్రామస్తులకు సూచించారు.దీనిపై ఆగ్రహించిన బాధితులు ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ఇళ్లను వరద ముంచెత్తిందన్నారు. వరద అంతకంతకూ పెరుగుతుండడం, బాధితులు ఇళ్లను ఖాళీచేసేందుకు ససేమిరా అనడంతో చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వభరత్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ వెళ్లి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాము కష్టపడి సంపాదించిన సొమ్ము వరద పాలవుతోందని, ఇక తాము ఈ కష్టాలు పడలేమని స్పష్టంచేశారు. దీంతో.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారు హమీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించి ఇళ్లను ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్లారు.బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలివరద ముంపులో ఉన్న బాధితులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. ఏటా వస్తున్న వరద నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలి. ప్రజలు ఇబ్బందులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలి.– వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ, కాకినారైతాంగాన్ని నట్టేట ముంచిన వరద..పభుత్వం, అధికారుల నిర్లక్ష్యంవల్లే ఏలేరు వరద ఉధృతి రైతులను నట్టేట ముంచింది. ఏలేరు ప్రాజెక్టులో 24 టీఎంసీల నీరుచేరే వరకు నీటిని నిల్వ ఉంచడం దారుణం. 19 టీఎంసీలు ఉన్నప్పుడే అధికారులు మెల్లమెల్లగా నీటిని విడుదల చేసి ఉంటే ఇంత ఉధృతి ఉత్పన్నమయ్యేది కాదు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి – గంథం శ్రీను, రైతు, మర్లావ, పెద్దాపురం మండలంబీర పంట పోయింది..రెండు ఎకరాల్లో బీర పంట సాగుచేశాను. గత జూలై వరదలకు పంట మొత్తం దెబ్బతింది. అప్పటికే ఎకరాకు రూ.40 వేల చొప్పున రూ.80 వేలు పెట్టుబడిగా పెట్టాను. పదకొండు రోజులు వరద నీరు ఉండడంతో పంట అంతా కుళ్లిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – ధూళిపూడి రామకృష్ణ, సలాదివారిపాలెం, ముమ్మిడివరం మండలం, కోనసీమ జిల్లా -
కాలేజీ నిర్మాణం
సాక్షి, అమలాపురం: కోనసీమ వాసుల చిరకాల స్వప్నం తీరే దారి కనబడడం లేదు.. అమలాపురం సమీపంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం ఇంచు కూడా కదలడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశలో ప్రారంభమైన ఈ కాలేజీల నిర్మాణాలకు నిధుల కొరత ఉండడంతో నిలిపివేయాలని సీఎం చంద్రబాబు సూచించడంతో పనులకు బ్రేక్ పడ్డాయని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారంతా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌కు సోమవారం మొరపెట్టుకున్నారు.గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేసింది. ఇందుకు రూ.500 కోట్లు కేటాయించింది. అమలాపురం రూరల్ సమనస, చిందాడగరువు పరిధిలో దీని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి, రెండో దశలో నిర్మాణ పనులు మొదలు పెట్టిన పలు మెడికల్ కాలేజీలు పూర్తి కావడం, అక్కడ తరగతులు ప్రారంభం కావడం తెలిసిందే. మూడో దశలో అమలాపురంలో మెడికల్ కాలేజీ నిర్మాణం మొదలు పెట్టారు. దీనికి అనుబంధంగా అమలాపురం ఏరియా ఆసుపత్రిని బోధనాసుపత్రిగా గుర్తించారు. ఇది ప్రస్తుతం 100 పడకల ఆసుపత్రి కాగా, దీనిని వెయ్యి పడకల ఆసుపత్రిగా విస్తరించాలని నిర్ణయించారు. తొలి దశలో 650 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు రెండో దశలో 350 పడకలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల అమలాపురం పట్టణ నడిబొడ్డున అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తోందని ప్రజలు ఆనందపడ్డారు.అప్పుడు వేగం.. ఇప్పుడు జాప్యంగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. పలు నిర్మాణాలు చురుగ్గా సాగాయి. కొన్ని భవనాలకు రెండు, నాలుగు అంతస్తులు నిర్మించారు. అయితే ఎన్నికల నాటి నుంచి నెమ్మదించిన పనులు కొత్త ప్రభుత్వంలో దాదాపు నిలిచిపోయే పరిస్థితికి వచ్చాయి. నిధుల కొరతతో మూడో దశ ఆసుపత్రి నిర్మాణ పనులు నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం నుంచి సూచనలు అందడంతో నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ ఇక్కడ పనులు ఆపేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా పనుల్లో వినియోగించే కీలక సామగ్రి తరలిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీనిపై స్పందించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు నిరాకరించారు.పనులు కొనసాగించండిమెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నిలిచిపోయాయని స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు వినతిపత్రంతో పాటు మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు వినియోగించిన సామగ్రి తరలిపోతున్న ఫొటోలను సైతం జత చేశారు. మెడికల్ కళాశాలకు గత ప్రభుత్వం 47 ఎకరాల భూమి కొనుగోలు చేసి నిర్మాణ పనులు మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ 40 శాతం పనులు జరిగాయని వివరించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత మూడో దశలో మెడికల్ కళాశాలల పనులు నిలిపివేయాలని ఆదేశాలు వచ్చినట్లు గుత్తేదారు సంస్థ చెబుతోందని, నిర్మాణ సామగ్రితోపాటు ఐరన్, ఇసుక, సిమెంట్‌ను మెగా సంస్థ తరలించుకుపోతోందని చెప్పారు. కళాశాలను పూర్తి చేయాలని వారు కోరారు. జిల్లా వాసులు అత్యవసర వైద్యం కోసం కాకినాడ, రాజమహేంద్రవరం వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. అమలాపురం జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామ్‌గోపాల్, సర్పంచ్ పొనకల గణేష్, ఉప సర్పంచ్ రాజులపూడి భాస్కరరావు, మాజీ సర్పంచ్ జలదాని కాశీ విశ్వేశ్వరరావు, కరెళ్ల సూరిబాబు, వై.ఏసుబాబు, సీహెచ్‌వీ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.ఆశలపై నీళ్లుగత ప్రభుత్వం మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వడంతో పాటు 47 ఎకరాలు కొనుగోలు చేసి పనులు మొదలు పెట్టింది. ఈ పనులు వేగంగా జరగడం చూసి కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, బోధనాసుపత్రి లేని లోటు తీరుతోందని జిల్లా వాసులు సంబరపడ్డారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరాల్లో మాత్రమే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు (జీజీహెచ్)లు ఉన్నాయి. కోనసీమలో కిమ్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఉన్నా రోగుల అవసరాలు పూర్తిగా తీర్చడం లేదు. అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీల్లో ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. జనరల్ ఆసుపత్రి లేని లోటు పట్టిపీడిస్తోంది. రామచంద్రపురం, మండపేటలకు కాకినాడ, రాజమహేంద్రవరం కొంత దగ్గర. కానీ అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలకు దూరం అవుతోంది. ఇక్కడ జీజీహెచ్ నిర్మించాలని స్థానికులు దశాబ్దాలుగా కోరుతున్నా ఫలితం లేకుండా పోయింది. రూ.కోట్ల విలువైన చమురు, సహజ వాయువులను కొల్లగొట్టుకుపోతున్న చమురు సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ నిధులతో మెడికల్ కాలేజీ, జీజీహెచ్ నిర్మించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది.ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లాంమెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయాన్ని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు దృష్టికి తీసుకు వెళ్లాం. ఆయన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రితో మాట్లాడతానని చెప్పారు. నిర్మాణ పనులు నిలిచిపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.– పందిరి శ్రీహరి, జెడ్పీటీసీ సభ్యుడు, అమలాపురం -
కోనసీమ పనసకు గిరాకీ
సాక్షి అమలాపురం: చూడగానే నోరూరించే పనస పంటకు కోనసీమ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తేనెలూరే రుచి ఉండే ఈ పనస తొనలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. కొబ్బరి, అరటి తరువాత కోనసీమలో పండే విలువైన పంటల్లో పనస ఒకటి. ఈ కారణంగా తూర్పు, పశ్చిమ ఏజెన్సీలలో పండే పనసకన్నా కోనసీమలో పండే పనసకు మంచి డిమాండ్ ఉంది. 79.36 ఎకరాల్లో సాగు వేసవి వచ్చి0దంటే చాలు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పనస కాయల ఎగుమతులు జోరందుకుంటాయి. జిల్లాలో డెల్టా ప్రాంతంతోపాటు గోదావరి లంక గ్రామాల్లో కొబ్బరి తోటల్లో పనస చెట్లను పెంచడం రైతులకు ఆనవాయితీగా వస్తోంది. జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగు జరుగుతుంది. ఇక్కడ కొబ్బరి తోటల్లో మధ్యన, గట్ల మీద, సరిహద్దుల్లో పనసను రైతులు పెంచుతుంటారు. పనస మీద వచ్చే ఆదాయానికి తోడు ఏళ్ల పాటు చెట్టును పెంచితే టేకు, మద్ది కర్రతో సమానంగా ఆదాయం వస్తున్నది. దీని వల్ల డెల్టా, గోదావరి లంకల్లో పనస చెట్లు గణనీయంగా ఉంటాయి. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం జిల్లాలో 79.36 ఎకరాల్లో పనస సాగు జరుగుతున్నది.కానీ వాస్తవంగా కొబ్బరి తోటలు, రోడ్లు, పంట కాలువల వెంబడి చెట్లను కూడా పరిగణలోకి తీసుకుంటే ఇందుకు రెండుమూడు రెట్లు సాగు జరుగుతున్నదని అంచనా. ఏజెన్సీతో పోల్చుకుంటే డెల్టా, గోదావరి లంకల్లో పెరిగే పనస తొనల రుచి అధికం. అందుకే జిల్లా నుంచి వచ్చే పనసను కోనసీమ పనసగా చెప్పి ఇతర పట్టణాల్లో అమ్ముతుంటారు. సీజన్లో రూ.ఐదు కోట్ల ఎగుమతులు వేసవి సీజన్లో జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున పనస కాయలు రవాణా అవుతుంటాయి. కొబ్బరి తరహాలోనే పనసకు సైతం అంబాజీపేట అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్. రోజుకు 500కు పైగా పనస కాయలు వస్తాయని అంచనా.కాగా, జిల్లా నుంచి రోజుకు 800 నుంచి వేయి కాయల వరకు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి పనస ఎగుమతి అవుతున్నది. మార్చి నుంచి జూలై నెల వరకు ఒక్క అంబాజీపేట నుంచే రూ.5 కోట్ల విలువైన పనస ఎగుమతి అవుతున్నదని అంచనా. మొత్తం జిల్లావ్యాప్తంగా రూ.7 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నదని తెలుస్తున్నది. దిగుబడి పెరిగి.. ధర తగ్గింది.. గత నాలుగైదు ఏళ్ల కన్నా ఈ ఏడాది దిగుబడి అధికంగా ఉంది. చెట్టుకు సగటున 10 నుంచి 15 కాయల వరకు వస్తుంటాయి. ఈసారి 25 కాయలకు పైబడి దిగుబడిగా వస్తోంది. దీనివల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. కాయ సైజు, బరువును బట్టి రూ.100 నుంచి రూ.400 వరకు ధర ఉంటున్నది. ఏడాది పొడవునా పనస పొట్టు కూరల్లో వినియోగించే పనస పొట్టు ఏడాది పొడవునా కోనసీమలో దొరుకుతున్నది. ఇది కూడా ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున రవాణా జరుగుతున్నది. కేజీ పనస పొట్టు ధర రూ.175 నుంచి రూ.200 వరకు ఉంది. ఇది డిసెంబర్ నుంచి జూలై వరకు స్థానికంగా లభ్యమవుతున్నది. పెరిగిన ఎగుమతులుగతంలో కన్నా గత ఐదేళ్లుగా అంబాజీపేట మార్కెట్ నుంచి ఎగుమతులు పెరిగాయి. ఎక్కువగా హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, తెనాలికి పనస కాయల ఎగుమతి జరుగుతున్నది. ఈ ఏడాది కాయల దిగుబడి అధికంగా ఉంది. అయితే ఎగుమతులు పెరగడం వల్ల సరుకు నిల్వ ఉండడం లేదు. మా దుకాణాల వద్ద రిటైల్ అమ్మకాలు కూడా పెరిగాయి. – కుంపట్ల నాగేశ్వరరావు, వ్యాపారి, అంబాజీపేట -
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉడుమూడి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. రహదారి పక్కన ట్రాక్టర్ ఫై ధాన్యం బస్తాలు ఎగుమతి చేస్తుండగా కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడే దుర్మరణం చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోగా, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. -
జనసేన ఖాళీ: వైఎస్సార్సీపీలో చేరిన DMR శేఖర్ దంపతులు
-
సీఎం జగన్ తోనే సామాజిక న్యాయం...
-
కోనసీమలో డ్రోన్ హబ్ ప్రారంభం
సాక్షి,అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ హాబ్ను కలెక్టర్ శుక్లా మంగళవారం ప్రారంభించారు. అమలాపురం స్టేడియంలో 21 ఫ్లయింగ్ డ్రోన్లను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ..రూ.2 కోట్లతో దేవగుప్తం పీఏసీఎస్ 21 డ్రోన్లను కొనుగోలు చేసిందన్నారు. ఒక్కొక్క డ్రోన్ 6–8 నిమిషాల్లో ఒక ఎకరానికి స్ప్రేయింగ్ ప్రక్రియను పూర్తి చేస్తుందని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్‌గా కొనుగోలు చేసిన ఈ డ్రోన్స్‌ను అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులో తెస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు స్పేయర్ ఎకరాకు రూ.వెయ్యి ఖర్చుతో పిచికారీ చేస్తున్నారని, డ్రోన్ టెక్నాలజీతో ఎకరాకు రూ.300 అవుతుందన్నారు. రైతులు బృందంగా ఏర్పడితే రూ.10 లక్షలు విలువైన వ్యవసాయ డ్రోన్‌ను కొనుగోలు చేయవచ్చన్నారు. దేవగుప్తం పీఏసీఎస్ చైర్మన్, రాష్ట్ర అగ్రి మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి) మాట్లాడుతూ ప్రతి మండలంలో ఒక డ్రోన్ ఉండేలా ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు. వైఎస్సార్ హార్టీకల్చర్ వర్సిటీ సభ్యుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినా««ద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మహాసేన రాజేష్ గోబ్యాక్’ అంటూ జనసైనికుల నిరసన
సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ-జనసేన సమావేశం రసాభాసగా మారింది. మహాసేన రాజేష్‌కి టికెట్ కేటాయింపుపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజేష్ గోబ్యాక్’ అంటూ జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. టీడీపీ నేత హరీష్ మాధుర్ కారును జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
జనాలు లేరు..‘జెండాలూ’ లేవు.. నీరసంగా లోకేశ్ యువగళం
తాళ్లరేవు: టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తోన్న యువగళం పాదయాత్ర డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నీరసంగా సాగుతోంది. లోకేశ్ బస చేసిన తాళ్లరేవు మండలం సుంకరపాలెం శిబిరం నుంచి ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. లచ్చిపాలెం, బాపనపల్లి, పి.మల్లవరం, తాళ్లరేవు, కోరంగి, పటవల, జి.వేమవరం మీదుగా చొల్లంగి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం లచ్చిపాలెం, బాపనపల్లి గ్రామాల మధ్య టీడీపీ నేతలు పలు సంఘాలు, రైతులతో సమావేశాలను ఏర్పాటు చేశారు. అయితే జనం లేకపోవడంతో వాటిని రద్దు చేశారు. పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన ఎంతకీ రాకపోవడంతో చేసేదిలేక స్థానిక టీడీపీ నేతలు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులను పంపాలని యాజమాన్యాలను అభ్యర్థించారు. దీంతో మండల పరిధిలోని పలు కళాశాలలు, పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు రహదారి వద్ద లోకేశ్‌కు స్వాగతం పలికారు. కోరంగిలో లోకేశ్ మాట్లాడుతూ..టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని చెప్పారు. లిక్కర్ వేలంపాటలో కల్లు గీత కార్మికులకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, పాదయాత్రలో ఎక్కడా జనసేన కార్యకర్తలు, జెండాలు కనిపించకపోవడం గమనార్హం. చదవండి: ఇక కాళ్ల బేరమే! -
కంద దుంపకు అరటి గెల..
-
ధాన్యంలాగే కొబ్బరీనూ..
సాక్షి అమలాపురం/ అంబాజీపేట : కొబ్బరి కొనుగోలులో దళారుల వ్యవస్థను తొలగించడంతోపాటు రైతులకు రవాణా, కూలి ఖర్చుల భారం తగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొబ్బరి ధరలు తగ్గిన నేపథ్యంలో నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) ఆధ్వర్యంలో శనివారం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుంది. ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లుగానే ఈ కేంద్రాల్లో కూడా కొబ్బరి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. గతంలో మార్కెట్ యార్డుల కేంద్రంగా కొబ్బరి కొనుగోలు చేయగా, ఈసారి ఆర్బీకే స్థాయిలో కొబ్బరి కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయంతో రైతులకు మేలు జరగనుంది. గతంలో ఇలా.. గతంలో రైతులు మార్కెట్ యార్డులకు ఎండుకొబ్బరిని తీసుకువెళ్లాల్సి వచ్చేది. రోజుంతా అక్కడే కళ్లాలలో ఎండబెట్టేవారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే కొనేవారు. లేదంటే వెనక్కి తెచ్చుకోవాల్సిందే. ఇది రైతులకు నష్టాన్ని కలగజేసేది. ఒకవేళ కొనుగోలు చేసినా నాఫెడ్‌కు తీసుకువెళ్లడానికి రవాణా ఖర్చుతోపాటు ఎండబెట్టడం, మూటలు కట్టడానికి ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వచ్చేది. ప్రస్తుతం రోజుకు కూలి ఖర్చు రూ.600లు కాగా.. యార్డు వరకు తీసుకొస్తే రూ.వెయ్యి వరకు కూలి ఇవ్వాల్సి వచ్చేది. అధికారులే కళ్లాలు వద్దకు వచ్చి నాణ్యత నిర్ధారించి, అక్కడే కొనుగోలు చేయనున్నారు. ఇలా కొన్న కొబ్బరిని రైతులే సమీపంలోని నాఫెడ్ కేంద్రాలకు తరలించాల్సి ఉంది. రైతులపై ఈ భారం మాత్రమే పడనుంది. కూలి ఖర్చులు కలిసిరావడం అంటే రైతులకు క్వింటాల్‌కు రూ.500ల నుంచి రూ.800లు వరకు మిగలనుంది. రైతులే సొంతంగా ఎగుమతి చేస్తే కూలి ఖర్చులు కూడా కలిసివస్తాయి. ఈ విధానంవల్ల దళారుల పాత్ర దాదాపు లేనట్లే. గతంలో ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన కొబ్బరి 90 శాతం దళారులదే. ఇప్పుడు రైతులు నేరుగా లబ్ధిపొందనున్నారు. ♦ నాఫెడ్ కేంద్రాలు సేకరించిన కొబ్బరిని ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ♦ రైతులు ముందుగా ఆర్బీకేల్లో పేరు, ఇతర వివరాలు నమోదు చేయించుకోవాలి. ఆర్బీకేల ద్వారా కళ్లాల్లోనే కొనుగోలు.. ♦ ఎకరాకు నెలకు రెండు కొబ్బరి బస్తాల (క్వింటాల్) చొప్పున కొనుగోలుకు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు రైతులకు ధ్రువీకరణ పత్రాలిస్తారు. ♦ రైతుల వివరాలతో పాటు, కొబ్బరి విక్రయాలకు సంబంధించి కంటిన్యూస్ మోనిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైనిస్ అండ్ ప్రొక్యూర్మెంట్ (సీఎం యాప్)లో నమోదు చేస్తారు. ♦ దీని ఆధారంగా నాఫెడ్‌కు ఇంప్లిమెంట్ ఏజెన్సీగా ఉన్న ఆయిల్ ఫెడ్ అధికారులు రైతుల వద్దకు వెళ్లి కొబ్బరి కొనుగోలు చేస్తారు. సర్కారు ప్రత్యేక చొరవతో కేంద్రం అనుమతి.. రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 1.78 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఇక్కడ సగటున 106.90 కోట్ల కాయలు దిగుబడిగా వస్తాయని అంచనా. తమిళనాడు, కేరళ, కర్ణాటకల నుంచి పోటీవల్ల ఉత్తరాదికి ఎగుమతులు క్షీణించడంతో కొబ్బరి ఉత్పత్తుల ధరలు తగ్గాయి. వెయ్యి కాయల ధర రూ.7 వేలు ఉంది. ధరలు పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నాఫెడ్ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకొచ్చింది. జిల్లాలో తొలుత అంబాజీపేటలోను, తరువాత కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి ముమ్మిడివరం, తాటిపాక, రావులపాలెం, నగరం మార్కెట్ యార్డుల్లో వీటిని ప్రారంభించనున్నారు. మిల్లింగ్ కోప్రా (ఎండు కొబ్బరి)ని క్వింటాల్‌కు రూ.10,860లు, బాల్‌కోప్రా (కురిడీ కొబ్బరి గుడ్డు) క్వింటాల్ రూ.11,750 చొప్పున కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుత మార్కెట్లో ఎండు కొబ్బరి ధర రూ.8 వేలు, కురిడీ కొబ్బరి గుడ్డు రూ.తొమ్మిది వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. ఈ కేంద్రాల ఏర్పాటువల్ల బహిరంగ మార్కెట్లో కొబ్బరికాయకు ధర వస్తోందని, స్థానికంగా నిల్వ ఉన్న కొబ్బరి మార్కెట్‌కు వెళ్తే వచ్చే దసరా, దీపావళికి డిమాండ్ వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. షెడ్యూలు ప్రకారం కొనుగోలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్బీకే స్థాయిలో కొబ్బరి కొనుగోలు చేస్తాం. రైతులు మార్కెట్ యార్డుల వద్దకు వచ్చి కొబ్బరి ఎండబెట్టి అమ్మకాలు చేయాల్సిన అవసరం ఉండదు. మేం కొనుగోలు చేసిన తరువాత సమీపంలో యార్డుకు తరలిస్తే సరిపోతోంది. సీఎం యాప్‌లో నమోదును బట్టి ఆయా ఆర్బీకేలకు ఒక షెడ్యూలు పెట్టుకుని కొబ్బరి కొనుగోలు చేస్తాం.– యు. సుధాకరరావు, మేనేజర్, ఆయిల్‌ఫెడ్ -
కోనసీమలో ‘నల్ల బంగారం’
సాక్షి అమలాపురం: కోనసీమలో తయారయ్యే ‘కొబ్బరి చిప్ప బొగ్గు’ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ సౌందర్యానికి ఫేస్‌ప్యాక్‌గా, తాగునీటిని శుద్ధిచేసేందుకు వినియోగించడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు, దేశ రక్షణకు చెందిన విడి భాగాలు, ఆటో మొబైల్ పరిశ్రమలలో కీలక విడిభాగాల తయారీలో ఈ బొగ్గు అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. తయారీదారుల ఇంట నల్ల బంగారమై మెరుస్తోంది. ఇటువంటి అత్యుత్తమమైన, నాణ్యమైన కొబ్బరి చిప్ప బొగ్గు తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిలుస్తోంది. నదీతీరంలో బొగ్గు తయారీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లో వైనతేయ నదీతీరంలో బొగ్గు తయారవుతోంది. ఇక్కడ నుంచి ఏడాదికి రూ. 2 కోట్ల విలువ చేసే 700 నుంచి 900 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడు లోని కాంగాయం, పల్లడం, కోయింబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, మన రాష్ట్రంలోని నెల్లూ రు, గూడూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రయోజనాలెన్నో.. కొబ్బరి చిప్ప బొగ్గు ప్రయోజనాలు తెలిస్తే నిజంగా నల్ల బంగారమే అంటారు. సౌందర్య పోషణకు వాడే ఫేస్‌ప్యాక్‌లతోపాటు కాస్మోటిక్స్, సబ్బులలో వాడకం అధికం. ఆటోమొబైల్‌లో కీలకమైన స్పేర్ పార్టుల తయారీ, రక్షణ రంగంలో యుద్ధ పరికరా లు, గ్యాస్ మాస్కుల తయారీలో వినియోగిస్తారు. పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తిలో అధిక శాతం రికవరీకి ఇది దోహదపడుతుంది. నీటిలోని క్లోరిన్, పురుగు మందులు, మలినాలను, వైరస్, బ్యాక్టీరియాలను నివారిస్తుంది. దీనిలో అధిక ఉష్ణ విలువ ఉంటుంది. మండించడానికి సమర్థవంతమైన ఇంధన వనరు గా ఉపయోగపడుతుంది. చిప్ప బొగ్గుతో భూమిలో వేగంగా సేంద్రియ కర్భనం ఉత్పత్తి అవుతుంది. బాగా ఆరిన కొబ్బరి చిప్ప బొగ్గు అత్యధిక ధర కేజీ రూ.35 నుంచి రూ.38 వరకు ఉండగా, ఈ ఏడాది ఆశించిన ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీ రూ.24 నుంచి రూ.26 కాగా, తడిసిన బొగ్గు ధర రూ.19 వరకు మాత్రమే ఉంది. దీనివల్ల నష్టపోతున్నామని, ఎగుమతులు లేక సరుకు పెద్ద ఎత్తున పేరుకుపోయిందని, అక్టోబర్ నుంచి మంచి ధర వస్తుందని తయారీదారులు ఆశలు పెట్టుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడెక్టులో భాగంగా కోనసీమ జిల్లాను కొబ్బరికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ చిప్ప బొగ్గు తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. కోకోనట్ బోర్డు, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువైన యూనిట్‌కు 35 శాతం వరకు రాయి తీ అందించనుంది. అంతకన్నా పెద్ద ప్రాజెక్టు పెట్టుకుంటే రూ.పది లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నా రు. జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా) ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో జిల్లాలో కోకోనట్ మిల్క్ యూనిట్‌తోపాటు కోకోనట్ చార్ కోల్ పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తోంది. మన్నిక ఎక్కువ.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక కన్నా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యమైంది. చిప్ప దళసరి కావడంతోపాటు దీనిలో అధిక శాతం గ్యాస్ నిక్షిప్తమైనందున ఇది వేగంగా మండుతోంది. మిగిలిన రాష్ట్రాలలో ఆరు బయట బొగ్గు తయారీ ఎక్కువ. కోనసీమలో బొగ్గు తయారీ డ్రమ్ములలో చేస్తారు. దీనివల్ల బూడిద శాతం తక్కువగా ఉంటోంది. ఇక్కడ తయారయ్యే బొగ్గు ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటుంది. మార్కెట్ అవకాశాలు పెరగాలి మనం తయారు చేసే బొగ్గే అత్యంత నాణ్యమైంది. మార్కెటింగ్ అవకాశాలు పెద్దగా లేక అనుకున్న ధర రావడం లేదు. ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నుంచి బొగ్గు తీసుకెళ్లి మరింత నాణ్యంగా తయారు చేసి కేజీ రూ.50 నుంచి రూ.70 చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మనకు మాత్రం ఆ ధర రావడం లేదు. మార్కెటింగ్ అవకాశాలు పెరిగితే మరింత ధర వచ్చే అవకాశముంది.– మట్టపర్తి రామకృష్ణ,ముంజువరం, పి.గన్నవరం మండలం అత్యంత ధృడమైంది ఇక్కడ తయారయ్యే కొబ్బరి చిప్పలో 80 నుంచి 90 శాతం మేర చిన్న చిన్న రంధ్రాలు ఉండడంతో ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటోంది. ఆటోమొబైల్, రక్షణ పరికరాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీలో అధికంగా వాడుతున్నారు. – ఎ.కిరిటీ, ఉద్యాన శాస్త్రవేత్త, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
కచ్చిడి చేపలతో ఒక్కరోజులోనే మిలియనీర్.. ఎందుకింత విపరీతమైన క్రేజ్?
ఏపీ సెంట్రల్ డెస్క్: మహారాష్ట్రకు చెందిన ఓ జాలరికి దొరికిన కచ్చిడి చేపలతో ఒక్క రోజులోనే మిలియనీర్ అయిపోయాడు. యాభై కేజీల కచ్చిడి చేప కలకత్తాలో రూ.13 లక్షలకు అమ్ముడుబోయింది. కాకినాడ కుంభాభిషేకం రేవులో కచ్చిడి చేప 4 లక్షల రూపాయలు పలికింది. కోనసీమలోని అంతర్వేది తీరంలో కచ్చిడి దొరికిన మత్స్యకారుడిపై కాసుల వర్షం కురిసింది. ఇలాంటి వార్తలు తరచూ చూస్తున్నాం. అసలేంటీ కచ్చిడి చేప. పులసకే తాతలా ఉంది. కళ్లు బైర్లు కమ్మే రేటు ఎందుకు పలుకుతోంది. కేజీ రూ. 20 వేలకు పైగా ధర పలికేంత విషయం కచ్చిడిలో ఏముంది. సింగపూర్, మలేసియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, జపాన్, ఇదర ఆగ్నేయాసియా దేశాల్లో దీనికి అంత డిమాండ్ ఎందుకు.. అంటే ఇది ఔషధాల గని కాబట్టి. బురద ప్రాంతాల్లో నివాసం హిందూ మహా సముద్రం, దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఇవి నివసిస్తాయి. పర్షియన్ గల్ఫ్, భారత్ తీరం, జపాన్, పవువా న్యూగినియా, ఉత్తర ఆ్రస్టేలియా సముద్ర ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. నదీ ముఖద్వారాలు సమీపంలో, అడుగున బురదగా, బండరాళ్లు ఉండే ప్రాంతాల్లో జీవిస్తాయి. సాధారణంగా ఇవి 60 మీటర్ల లోతులో సంచరిస్తూ ఉంటాయి. ఆహారం కోసం వలస వెళ్తూ ఉంటాయి. ఎన్నో పేర్లు.. ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో కచ్చిడిగా పిలుస్తున్న ఈ చేప శాస్త్రీయ నాయం ప్రొటోనిబియా డయాకాంథస్. దీనిని ఘోల్ ఫిష్ అని, సీ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో టెలియా భోలా, కచ్చర్ భోలా అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని బ్లాక్స్పాటెడ్ క్రోకర్ అని, ఆ్రస్టేలియాలో బ్లాక్ జ్యూఫిష్ అని అంటారు. జీవితకాలం 15 ఏళ్లు.. వీటి నోరు పెద్దగా ఉంటుంది. పక్కన నాలుగు రెక్కలు (ఫిన్స్), వెన్నుముక పొడవునా మరో ఫిన్ ఉంటుంది. రెండు వెన్నుముకలతో పొట్ట తర్వాత నుంచి కిందకు వంగి.. తోకవరకు సన్నగా ఉంటుంది. ఇవి అవకాశాన్ని బట్టి అన్ని రకాల ఆహారాలను తింటాయి. ముఖ్యంగా పీతలు, రొయ్యలు, లాబ్స్టర్లను ఇష్టంగా లాగిస్తాయి. చిన్న చేపలను వేటాడతాయి. సముద్రంలో ఎక్కడెక్కడ తిరిగినా ఏటా గుడ్లు పెట్టే సమయానికి మాత్రం తమ ఆవాసాలకు గుంపులుగా చేరతాయి. మే నుంచి అక్టోబర్ మధ్య కాలంలో నదులు సముద్రంలో కలిసే చోట్లకు వచ్చి గుడ్లుపెడతాయి. వీటి జీవితకాలం 15 ఏళ్లు. అయితే పుట్టినప్పటి నుంచి చాలా వేగంగా ఎదుగుతాయి. నాలుగేళ్లలోనే మూడు అడుగుల సైజుకు పెరిగి సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఐదు అడుగుల వరకూ కూడా పెరిగే ఇవి.. 60 కేజీలకు పైగా బరువుతూగుతాయి. ఎన్నో ఉపయోగాలు కచ్చిడి చేపలోని ఔషధ గుణాల వల్లే దానికంత క్రేజ్ వచ్చింది. ఐయోడిన్, ఒమెగా–3, డీహెచ్ఏ, ఈపీఏ, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం లాంటి మినరల్స్ గని ఈ చేప. దీని కడుపు క్రింది భాగంలో చిన్న సంచిలాంటి శరీర భాగం ఉంటుంది. ఆ సంచిలో లభించే ఔషధాల వల్ల మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ సంచి కారణంగానే దీనిని సీ గోల్డ్ అని పిలుస్తారు. ఈదడానికి ఉపయోగపడే వీటి రెక్కలతో సింగపూర్‌లో వైన్ తయారు చేస్తారు. కంటి చూపును మెరుగుపరిచే చాలా విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్ ఈ చేపలో పుష్కలంగా లభిస్తాయి. ఈ చేపలో చర్మానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనితో చర్మంపై ముడతలు పడవు. ముదిమి ఛాయలు దరిదాపులకు రాకుండా నవయవ్వనంగా చర్మం మెరుస్తుంది. చిన్న పిల్లల్లో మొదడు సక్రమంగా ఎదుగుదలకు ఈ చేపలో పెద్దఎత్తున లభించే ఒమెగా–3 ఎంతో ఉపయోగపడుతుంది. క్రమం తప్పక తింటూ ఉంటే ఐక్యూ (ఇంటెలిజెన్స్ కొషెంట్) కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. కచ్చిడిలోని విటమిన్స్, మినరల్స్ మన శరీరంలోని కండరాలు బలంగా మారడానికి ఎంతో దోహదపడతాయి. ప్రమాదంలో కచ్చిడి.. ప్రపంచ దేశాల్లో అతిగా వేటాడటం, తీర ప్రాంతం కాలుష్యంగా మారడం వల్ల దీని ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది. గుడ్లు పెట్టేందుకు తీర ప్రాంతాలకు వచ్చే సమయంలో వీటిని ఎక్కువగా వేటాటం వల్ల వాటి సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది. ఇటీవల కాలంలో దీనిని రక్షించడానికి ఆ్రస్టేలియా కొన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అలాగే భారత్ తీర ప్రాంతంలో మెకనైజ్డ్ బోట్లతో వేట నిషేధం, ఇవి గుడ్లు పెట్టే సీజన్లో వేటకు విశ్రాంతి ప్రకటించడం వల్ల వీటికి రక్షణ లభిస్తోంది. -
సీఎం జగన్‌కు కోనసీమ బ్రహ్మరథం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కోనసీమలో మహిళలు, యువకులు బ్రహ్మరథం పట్టారు. అమలాపురం రూరల్ జనుపల్లిలో శుక్రవారం వైఎస్సార్ సున్నా వడ్డీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అమలాపురం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి అక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ దూరం ఉన్న జనుపల్లిలోని స్టేడియం సభాస్థలికి చేరుకోవడానికి అరగంటకు పైగా పట్టింది. అడుగడుగునా ప్రజలు జైజగన్ నినాదాలు చేస్తుండగా.. వారందరికీ అయన అభివాదం చేస్తూ.. ముందుకు సాగారు. ప్రాంగణం బయట, రోడ్లపైన జనం బారులు తీరారు. అమలాపురం, ఎర్రవంతెన–నల్లవంతెన మార్గం తిరునాళ్లను తలపించింది. బాధితులకు సీఎం ఓదార్పు.. తాడేపల్లి తిరిగి వెళ్లే సమయంలో హెలిప్యాడ్ వద్ద బాధితులు సీఎం జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వికలాంగులు, వృద్ధులు, అభాగ్యులు, అనారోగ్యంతో బాధపడుతున్న సుమారు 146 మంది విన్నపాలను సీఎం జగన్ రెండు గంటలపాటు ఎంతో ఓపికగా ఆలకించారు. తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఆదేశించారు. వారంతా భోజనం చేయలేదని తెలుసుకుని, వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అంతకు ముందు సీఎం జగన్ అమలాపురం–బెండమూర్లంక మధ్య రూ.17.44 కోట్లతో 8 కిలోమీటర్ల రోడ్డు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. బెండమూర్లంక ఓహెచ్‌ఆర్‌సీ ట్యాంకు నుంచి ఓఎన్జీసీ ప్లాంట్ వరకు రూ.7.62 కోట్ల ఓఎన్జీసీ సీఎస్ఆర్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి, సాంఘిక సంక్షేమ నిధులు రూ.12.16 కోట్లతో అంబేడ్కర్ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. -
వెళ్లి పోయావా మిత్రమా!
కోనసీమ: ఊహకు ఊపిరిలా.. ఆశకు శ్వాసలా.. మది నిండా మధుర జ్ఞాపకాలతో సందడి చేశారు. నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చుకున్నారు.. స్నేహితుల దినోత్సవం వేళ దోస్తులంతా కలసి చేసిన సందడి కొద్ది క్షణాల్లోనే ఆవిరి అయ్యింది. తమ స్నేహితుడు కళ్ల ముందే కాలువలో గల్లంతైన ఘటన చూసిన సహచరులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటన ఎస్.యానం కట్టు కాలువ వద్ద జరిగింది. స్నేహితులు, కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడిలో కొత్త కాలనీకి చెందిన చిత్రి ముఖేష్ కుమార్ (19) తన పదకొండు మంది మిత్రులతో కలసి ఎస్.యానం బీచ్‌కు వెళ్లాడు. అక్కడ ఆట పాటలతో సముద్ర స్నానాలు చేసి సాయంత్రం వరకూ సరదాగా గడిపారు. తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఇంటికి వెళుతూ ఒంటిపై ఉన్న ఇసుకను తొలగించుకునేందుకు బీచ్‌ను ఆనుకుని ఉన్న కట్టు కాలువలో స్నానాలకు దిగారు. సముద్ర పోటు సమయం కావడంతో కాలువలో నీరు ఎక్కువగా ఉంది. దీంతో ముఖేష్ కుమార్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు చూస్తుండగానే అతను నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్నేహితులు చేతనైన సాయం చేద్దామనుకున్నా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. స్నేహితుల దినోత్సవం రోజునే తమ మిత్రుడు ఇలా కొట్టుకుపోతుంటే తట్టుకోలేక హాహాకారాలు చేశారు. ఈ సంఘటనను తెలుసుకున్న ఎస్సై జి.వెంకటేశ్వరరావు, పోలీసులు, గ్రామస్తులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ముఖే‹Ùకుమార్ ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం రాత్రి వరకూ గాలింపు కొనసాగింది. ముఖేష్ కుమార్ సోదరుడు తరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్వరరావు వివరించారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమ, మంగళవారాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో.. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి, వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. వరద సహాయ, పునరావాస చర్యలు అమలు చేసిన తీరుపై స్వయంగా బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకోనున్నారు. గోదావరి వరదలతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఇటీవల పలు ప్రాంతాలు వరద ముంపునకు గురైన విషయం తెలిసిందే. అయితే సహజంగా అలాంటి సమయంలో ముఖ్యమంత్రి ఆ ప్రాంతాల్లో పర్యటించడం పరిపాటి. గత ప్రభుత్వాల్లో అలానే చేసేవారు. అలా చేస్తే అధికార యంత్రాంగం అంతా సీఎం వెంట ఉంటుందని, అప్పుడు బాధితులకు సహాయ కార్యక్రమాలు అందించడానికి ఇబ్బంది ఎదురవుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచించారు. హడావుడి, ఫొటో సెషన్ వల్ల ఒరిగేదేమీ ఉండదని భావించారు. బాధితులందరికీ సాయం అందాలంటే తను చేయాల్సింది అలా కాదని, తొలుత సహాయ కార్యక్రమాల కోసం అవసరమైన నిధులు విడుదల చేశారు. బాధితుల తరలింపు, పునరావాసశిబిరాల ఏర్పాటు, ఆహారం, మంచినీరు, మందులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. తద్వారా ఉన్నతాధికారులు, సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల సహకారంతో సాయం అందలేదన్న మాటకు తావు లేకుండా చేశారు. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడింది. శిబిరాల నుంచి ప్రజలు ఇళ్లకు వెళ్లిపోయారు. అన్ని ప్రాంతాలకు రాకపోకలను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించి సాయం అందిన తీరు గురించి ప్రజలతో స్వయంగా మాట్లాడటానికి రెండు రోజుల పర్యటన తలపెట్టారు. ఇలా తను సీఎం అయినప్పటి నుంచి సరికొత్త సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలతో నేడు మాటామంతి సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడతారు. కూనవరం బస్టాండ్ సెంటర్లో కూనవరం, వీఆర్ పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకుంటారు. అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. సాయంత్రానికి రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తానేలంక రామాలయంపేట గ్రామం వెళతారు. అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
కాటన్ బ్యారేజ్ 15.9 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
-
లంకల్ని ముంచెత్తిన గోదావరి
-
కోనసీమలో సీఎం వైఎస్ జగన్ తొలిసారి పర్యటన...
-
హిందూ ధర్మంపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదు: మంత్రి కొట్టు
సాక్షి, బీఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా: హిందూ సంస్కృతి గురించి పవన్‌కు ఏం తెలుసని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. హిందూ ధర్మంపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదని విమర్శించారు. అన్నవరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని.. దళారీ వ్యవస్థకు తావు లేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. వివాహ వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి పవన్ కల్యాణ్.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నాడని మండిపడ్డారు. లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసే స్థోమత ఉన్న వారు కూడా స్వామివారి మీద భక్తితో పిల్లలకు అన్నవరంలో వివాహం చేస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. అన్నవరంలో సరాసరి ఏడాదికి ఏడు లక్షల వ్రతాలు, 4 వేల వివాహాలు జరుగుతాయని తెలిపారు. ఆలయంలో జరిగే పెళ్లిళ్లకు ఆలయ నిర్వాహకులు బాధ్యులు కాదని పేర్కొన్నారు. అన్నవరంలో దళారీ వ్యవస్థ నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నామని, వివాహాలు జరిగే తీరును క్రమబద్ధీకరించామని తెలిపారు. వీటి కోసం ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. ఈ చర్యతో బ్రోకర్ల పనులకి అడ్డుకట్ట పడటంతో.. వీళ్లంతా పవన్ కళ్యాణ్ సంప్రదించారని అన్నారు. చదవండి: పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా విషం చిమ్ముతోంది: మంత్రి అంబటి ‘రోజురోజుకి పవన్ కళ్యాణ్ దిగజారి పోతున్నాడు. చంద్రబాబులాంటి శనిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబును వదులుకుంటేనే నీకు రాజకీయ భవిష్యత్తు. సమాజంలో సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉంటే దానిని కూడా చూడలేకపోతున్నావు. ప్రజా నాయకుడైన వైఎస్ జగన్‌ను విమర్శిస్తే ప్రజలే నీకు మరోసారి బుద్ధి చెప్తారు. చంద్రబాబు ఐడియాలజీని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నావు. రాష్ట్రంలో దేవాలయాలు కూల్చేసింది నీ దత్తతండ్రి చంద్రబాబే. గతంలో దేవాలయాలు కూల్చి వేసినప్పుడు కళ్ళు మూసుకున్నావా? అప్పుడు కోర్టులో ఎందుకు కేసు వేయలేకపోయావని నిలదీశారు. వేషాలు వేసి మోసాలు చేసి, హిందూ ధర్మం కూడా పాటించలేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని బీసీ సంక్షేమశాఖా మంత్రి వేణుగోపాల కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను తీర్చే సెఈం జగన్ పట్ల అనుచితంగా మాట్లాడటం దారుణమని అన్నారు. హిందూ ధర్మం గురించిపవన్ మాట్లాడితే ఎవరు వినరని అన్నారు. ఒక్కొక్క ప్రాంతంలో కులాలు, ప్రాంతాలు, వాలంటీర్ల గురించి మాట్లాడటం పవన్ నైజమని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చే రెమ్యునరేషన్ మీద ఆధారపడిన పవన్.. గత ఎన్నికల్లో ఓచోట గెలిచిన వ్యక్తిని కూడా తన దగ్గర కూర్చోబెట్టుకోలేకపోయాడని దుయ్యబట్టారు. -
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్
సాక్షి, బీఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా: రాజోలు మండలం శివకోడులో రొయ్యల చెరువులకు నీళ్లు కోసం తవ్విన బోరుబావి నుంచి ఓఎన్జీసీ గ్యాస్ బయటకు వస్తుంది. గ్యాస్ లీక్‌తో మంటలు ఉద్ధృతంగా ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కు(ఓఎన్జీసీ) సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఓఎన్జీసీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలలను ఆర్పడంతోపాటు బోరుబావిలోంచి గ్యాస్ రావడానికి గల కారణాలు పరిశీలిస్తున్నారు. కాగా ఘటన స్థలానికి మూడు వైపులా మూసేసిన ఓఎన్జీసీ ఆన్ షోర్ బావులు ఉన్నాయి. అయితే నివాస స్థలాలకు దూరంగా ఉండటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: అదుర్స్.. సిరి ధాన్యాల టిఫిన్స్.. తింటే లాభాలేంటో తెలుసా? -
కోనసీమ వీధుల్లో.. కేరళ దరువు
సాక్షి, అమలాపురం/అయినవిల్లి: కేరళతో చాలా విషయాల్లో కోనసీమకు దగ్గర పోలికలుంటాయి. ప్రకృతి అందాలు.. కొబ్బరి చెట్లు.. పచ్చని చేలు.. విస్తారమైన సముద్ర తీరంతో రెండు ప్రాంతాలూ దాదాపు ఒకేలా అగుపిస్తాయి. కోనసీమను మినీ కేరళగా కూడా అభివర్ణిస్తారు. ఆ ప్రభావమో ఏమో కానీ అరుదైన వాయిద్య కళ కేరళ చెండా మేళానికి ఈ సీమలో ఘనమైన గుర్తింపు లభిస్తోంది. దేవాలయాల వద్ద జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల సమయంలో నిర్వహించే ఊరేగింపుల్లో కేరళ చెండా మేళం అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ కళలో కేరళలో శిక్షణ పొందిన స్థానిక కళాకారులు తమ ప్రతిభా పాటవాలతో ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రదర్శనలు ఇస్తూ శభాష్ అని కితాబులందుకుంటున్నారు. కేరళ అనగానే కథాకళి, కొడియాట్టం, తెయ్యం వంటి కళారూపాలు గుర్తుకు వస్తాయి. అటువంటి వాటిలో చెండా మేళం ఒకటి. దీని ప్రదర్శనలో స్థూపాకార పెర్కషన్ వాయిద్యాన్ని వాయిస్తారు. దాని నుంచి వచ్చే లయబద్ధమైన శబ్దానికి అనుగుణంగా నృత్యం చేస్తూ వీరు చేసే ప్రదర్శన ఆకట్టుకుంటోంది. బృందంలోని మహిళా కళాకారులు పెద్దపెద్ద చిడతలతో తాళం వేస్తారు. కేరళలో 300 సంవత్సరాలకు పైగా అత్యంత ప్రజాదరణ పొందిన కళారూపం చెండా మేళం. ఇందులో 30 నుంచి 100 మంది వరకూ సభ్యులుంటారు. కేరళలోని అన్ని పండగల్లో చెండా మేళం తప్పనిసరి. కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడుల్లో దీనికి విశేష ఆదరణ ఉంది. సామాజిక మాధ్యమాలు విస్తృతమైన తరువాత దీనికి దేశవ్యాప్తంగా ఆదరణ వచ్చింది. కేరళ కళాకారులకు దీటుగా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా గడచిన ఒకటిన్నర దశాబ్దాలుగా ఈ కళా ప్రదర్శన జరుగుతోంది. తొలి రోజుల్లో కేరళ నుంచి వచ్చిన కళాకారులు దీనిని ప్రదర్శించేవారు. అయితే ఇది వ్యయప్రయాసలతో కూడుకొని ఉండేది. దీంతో అయినవిల్లి మండలం ముక్తేశ్వరానికి చెందిన నాయీ బ్రాహ్మణులు ఈ కళలో శిక్షణ పొంది, 30 మందితో బృందాన్ని తయారు చేశారు. స్థానికంగా ఉన్న ఎల్.గురునాథం తొలుత మంగళ వాయిద్యాలు వాయించేవారు. తరువాత తీన్మార్లోకి మారారు. వీటికన్నా కేరళ చెండాకు ఆదరణ ఉందని తెలుసుకుని ఈ బృందాన్ని తయారు చేశారు. తరువాత ముక్తేశ్వరంతోపాటు ఇదే మండలంలో అయినవిల్లి, విలస గ్రామాల్లో కూడా కేరళ చెండా బృందాలు తయారయ్యాయి. గురునాథం కేరళలోని త్రిశూర్‌లో ప్రముఖ గురువు రాజేష్ మాలా వద్ద శిక్షణ పొందారు. అనంతరం ఇక్కడకు వచ్చి, స్థానికులకు శిక్షణ ఇచ్చారు. అయితే మెరుగైన మేళంగా శిక్షణ ఇచ్చేందుకు ఏటా కొంతమందిని త్రిశూర్ పంపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కేరళ చెండా కళను ప్రదర్శించే కోనసీమ బృందాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉంది. ఈ బృందాలు కేరళ సంప్రదాయ వ్రస్తాలు ధరించి మరీ ప్రదర్శన ఇవ్వడం విశేషం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రాంతాల్లో వీరు ప్రదర్శనలు ఇచ్చారు. సింహాచలం, అన్నవరం, అంతర్వేదితో పాటు హైదరాబాద్ మియాపూర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి తదితర ఆలయాల వద్ద వీరు ప్రదర్శన ఇచ్చారు. వీటితో పాటు పలు జిల్లాల్లో ఆలయాల ప్రారంభోత్సవం, రథోత్సవాలు, అమ్మవార్ల ఊరేగింపులు, తీర్థాలు, జాతర్లలో చెండా ప్రదర్శన తప్పనిసరిగా మారింది. ఇక ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థల ప్రచార హోరు, పెళ్లి ఊరేగింపుల్లో కేరళ చెండా ప్రదర్శన ఉండాల్సిందే. చివరకు చిన్న పిల్లల పుట్టిన రోజులకు సైతం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ప్రదర్శనకు దూరం, సమయాన్ని బట్టి రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకూ వసూలు చేస్తున్నారు. కేరళలో చెండా మేళం తరహాలోనే తంబోళా మేళానికి కూడా ఆదరణ పెరుగుతోంది. దీంతో స్థానిక కళాకారులు ఈ కళను సైతం నేర్చుకుని రాణిస్తున్నారు. మా ప్రదర్శన ప్రత్యేకం వివిధ రకాల ఊరేగింపుల్లో మా ప్రదర్శన ప్రత్యేకంగా నిలుస్తోంది. వీక్షించేందుకు వచ్చే వారిలో ఎక్కువ మంది మా ప్రదర్శన తిలకిస్తారు. ఇటీవలి కాలంలో మా చెండా మేళానికి డిమాండ్ పెరుగుతోంది. – కోటి, చెండా మేళం కళాకారుడు త్వరలో కాంతారా ప్రదర్శన మొదట తారసాలు, తరువాత తీన్మార్ వాయించే వాళ్లం. ఇప్పుడు కేరళ చెండా, తంబోళం మేళాలు ప్రదర్శిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల కొద్దీ ప్రదర్శనలు ఇచ్చాం. ఇటీవల విశాఖ జిల్లాలో కాంతారా కళను ప్రదర్శించాము. కాంతారాను త్వరలో పూర్తి స్థాయి ప్రదర్శనగా మారుస్తాం. – ఎల్.గురునాథం, ముక్తేశ్వరం, అయినవిల్లి మండలం -
కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 9 మంది తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. టాటా మ్యాజిక్ వాహనంలో రంపచోడవరం నుంచి మందపల్లి శనేశ్వరస్వామి దైవ దర్శనం కోసం పదిమంది వెళ్తున్నారు. ఈ క్రమంలో వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి నలుగురితో భీమవరం వెళుతున్న కారుని ఢీకొట్టడంతో మడికి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా , కారులో ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చదవండి: అక్కను వేధించవద్దన్నందుకు అమానుషం -
కోనసీమలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
భలే.. భలే.. కొబ్బరిపువ్వు
సాక్షి, అమలాపురం: దేవాలయాల్లోనో, శుభకార్యాల్లోనో కొబ్బరి కాయ కొట్టినప్పుడు అందులో పువ్వు కనిపిస్తే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఆ కొబ్బరి పువ్వు ఇప్పుడు కొంతమంది వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. సాధారణంగా కొబ్బరికాయలోని నీరు ఇంకిపోయాక మొక్క మొలకెత్తే సమయంలో ఈ కొబ్బరిపువ్వు కాయ లోపల తయారవుతుంది. ఈ సమయంలో కొబ్బరికాయను కొడితే లోపల దూదిలా తెల్లగా ఉండే కొబ్బరిపువ్వు ఉంటుంది. దీనిని చాలామంది ఇష్టంగా తింటారు. గతంలో ఇవి కొబ్బరి పంట ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా లభించేవి. ఇప్పుడు మహానగరాల్లో కూడా లభిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చెన్నై వంటి నగరాల్లో కొబ్బరి పువ్వుకు మంచి డిమాండ్ ఉంది. ఈ ప్రాంతాలకు గోదావరి జిల్లాల నుంచి ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల ద్వారా రోజూ కొబ్బరి పువ్వు ఎగుమతి అవుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ముంజవరం, ముంగండ, మలికిపురం మండలం రామరాజులంక, పెదతిప్ప, రాజోలు, మామిడికుదురు మండలాలతో పాటు, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, దెందులూరు, పెదవేగి ప్రాంతాల్లో కొబ్బరి పువ్వు ఎక్కువగా లభ్యమవుతోంది. గోదావరి ప్రాంతం నుంచి ఈ వేసవి సీజన్లో రోజుకు 3 వేల నుంచి 5 వేల పువ్వులు హైదరాబాద్‌కు ఎగుమతి అవుతున్నాయి. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ రోజుకు 8 వేల నుంచి 10 వేల వరకు ఎగుమతి అవుతాయి. కాయ కన్నా ప్రియం కొబ్బరి పువ్వును వాడుక భాషలో కొబ్బరి గుడ్డుగా పిలుస్తారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కొబ్బరి గుడ్డుకు సైజును బట్టి రూ. 30 నుంచి రూ.70 వరకూ ధర ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా చెన్నై, బెంగళూరు మార్కెట్లకు ఈ పువ్వులు ఎగుమతి అవుతున్నాయి. పెద్దసైజు పువ్వులను ఆ మార్కెట్లలో రూ. 100 వరకూ అమ్ముతున్నారు. గోదావరి జిల్లాల్లో కొబ్బరి రైతుల వద్ద నుంచి వ్యాపారులు అన్ సీజన్లో పువ్వు సైజును బట్టి రూ. 4 నుంచి రూ. 9 మధ్యలోనే కొంటున్నారు. అదే సీజన్లో రూ.12 నుంచి రూ.15 వరకూ ధర చెల్లిస్తున్నారు. నీళ్ల కంటే ఎక్కువ పోషకాలు కొబ్బరి నీళ్లు, కొబ్బరి కంటే కూడా కొబ్బరి పువ్వులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పువ్వు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేయడంలో బాగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, అలసట, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుందని వివరిస్తున్నారు. కిడ్నీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ డ్యామేజ్ వంటి జబ్బులను నివారించడంలో కొబ్బరి పువ్వు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను దరి చేరకుండా చేస్తాయి. చర్మ సౌందర్యాన్ని సైతం రెట్టింపు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి మంచిది కొబ్బరి పువ్వులో 66 శాతం కార్బోహైడ్రేట్లు, 64 శాతం సాల్యుబుల్ సుగర్స్ ఉంటాయి. ఫైబర్‌తో పాటు మినరల్స్, న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిని తినడం ఆరోగ్యపరంగా మంచిది. – బి.శ్రీనివాసులు, వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా కేంద్రం అధిపతి, అంబాజీపేట, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గతం కన్నా ఎగుమతులు పెరిగాయి ఐదారేళ్ల క్రితం కొబ్బరి గుడ్డు ఉచితంగా ఇచ్చేవారు. మరీ డిమాండ్ ఉంటే పువ్వు రూపాయి ఉండేది. ఇప్పుడు కొబ్బరి కాయకన్నా ఎక్కువ ధర పలుకుతోంది. ఇటీవల ఎగుమతులు బాగా పెరిగాయి. కోనసీమ నుంచే కాకుండా ఏలూరు నుంచి కూడా ఎగుమతి అవుతోంది. అప్పుడప్పుడు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా హైదరాబాద్‌కు కొబ్బరి గుడ్డు వస్తోంది. – సూదాబత్తుల వెంకట రామకృష్ణ, వ్యాపారి, అంబాజీపేట -
వేటకు వేళాయె..రా!
సాక్షి, అమలాపురం/ఉప్పలగుప్తం: విస్తారమైన సముద్ర తీరం.. అపారమైన మత్స్యసంపద.. వేటలో సిద్ధహస్తులైన మత్స్యకారులకు కోనసీమ సముద్ర తీరం మత్స్య సంపదకు అక్షయపాత్రే. అందుకే స్థానిక మత్స్యకారులతోపాటు వేటలో నిష్ణాతులైన అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతానికి చెందిన అనేకమంది మత్స్యకారులు కుటుంబాలతో ఇక్కడకు వలస వచ్చి వేటను సాగిస్తుంటారు. ఏటా ఎనిమిది నెలల పాటు ఇక్కడి తీరంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సముద్ర తీరాన్ని ఆనుకుని పలు మత్స్యకార గ్రామాలున్నాయి. కాట్రేనికోన మండలం పల్లం, చిర్రయానాం, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, అల్లవరం మండలం నక్కా రామేశ్వరం, మలికిపురం మండలం తూర్పుపాలెం వద్ద సముద్రతీరం గట్టు మీద పదుల సంఖ్యలో గుడిసెలతో చిన్నచిన్న గ్రామాలు కనిపిస్తుంటాయి. అంతమాత్రాన ఇవి రెవెన్యూ రికార్డుల్లో నమోదైన గ్రామాలు కాదు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పరిసర ప్రాంతాల నుంచి వేట కోసం ఇక్కడకు వలస వచ్చిన మత్స్యకారుల ఆవాసాలు. ఒక విధంగా ఇవి ‘వలస’ గ్రామాల కింద లెక్క. పూరి గుడిసెలు, రేకుల షెడ్లలో నివాసం. వినాయక చవితి తరువాత మత్స్యకారులు నక్కపల్లి నుంచి నేరుగా బోట్ల మీద తాము నివాసముండే ప్రాంతాలకు కుటుంబాలతో సహా వస్తారు. అప్పటి నుంచి మేలో సముద్ర వేట నిషేధం విధించే వరకు ఎనిమిది నెలలపాటు ఇక్కడే నివాసముంటారు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు సముద్ర వేటకు వెళ్లడం.. శనివారం వేటకు సెలవు పెట్టి స్థానికంగా మార్కెట్ పనులు చూసుకోవడం వీరి దినచర్య. గడిచిన 25 ఏళ్లుగా మత్స్యకారులు ఇక్కడకు వలస వస్తుండడం గమనార్హం. కోనసీమకు ఎందుకు వలస అంటే.. గోదావరి నదీపాయలతోపాటు ప్రధాన మురుగునీటి కాలువలు మొగల ద్వారా సముద్రంలో కలుస్తాయి. సముద్ర ఉప్పునీటిలో మొగల ద్వారా చప్పనీరు వివిధ మార్గాల ద్వారా పెద్దఎత్తున చేరడంవల్ల ఈ తీరంలో మత్స్యసంపద అధికంగా దొరుకుతుంది. నక్కపల్లి తీరం కన్నా కోనసీమ తీరంలోనే మత్స్య సంపద అధికంగా దొరుకుతుందని వీరు చెబుతుంటారు. పండుగప్ప, చందువా, కొయ్యింగ, బొమ్మిడి చుక్క, గులిగింత, మడ పీత, చుక్కపీత, టైగర్ రొయ్యలు, జెల్లలు, ఇసుక దొందులు, టేకు చేపలతోపాటు అత్యంత ఖరీదైన ‘కచ్చిడి చేప’లు కూడా దొరుకుతాయి. కచ్చిడి చేప ఖరీదు రూ.75 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటోంది. స్థానిక మత్స్యకారుల ఎదురు పెట్టుబడి వలస మత్స్యకారులకు స్థానిక మత్స్యకార వ్యాపారులు ఎదురు పెట్టుబడి పెడతారు. సీజన్‌లోని ఎనిమిది నెలలకు గాను బోటుకు వచ్చి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తారు. వలస మత్స్యకారులు వేటాడి తెచ్చిన మత్స్య సంపద ద్వారా వచ్చిన ఆదాయంలో పదిశాతం ఈ వ్యాపారులు తిరిగి తీసుకుంటారు. తెల్లవారుజాము నుంచే వేట.. నిజానికి.. ఈ మత్స్యకారులు తెల్లవారుజామునే బృందాలుగా బోటు మీద వేటకు బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంట, రెండు మధ్య వేట నుంచి తిరిగి వస్తారు. మత్స్య సంపదకు తీరాన్ని ఆనుకునే వేలం నిర్వహిస్తారు. గులిగింత, ఎర్ర గులిగింత, కచిడి, కూనాలు, పండుగప్ప, చందువాలు ఇటు చెన్నై, అటు కోల్‌కతా, హైదరాబాద్ మార్కెట్లకు ఎగుమతి అవుతుంటాయి. మిగిలిపోయిన చేపలను మత్స్యకార మహిళలు ఎండబెట్టి ఎండుచేపలుగా తయారుచేస్తారు. వేటకు వెళ్లే బోటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు విలువ చేసే మత్స్య సంపద వస్తోంది. ఏటా క్రమం తప్పకుండా.. మా ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీల కాలుష్యంవల్ల కొన్నేళ్లుగా వేట గిట్టుబాటు కావడంలేదు. ఇక్కడ మాకు వేటకు వెళ్లడానికి పడవలు గట్టుపై పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మత్స్య సంపద మా ప్రాంతంలో కన్నా ఇక్కడ ఎక్కువ. – దోని చిన్నా, వేంపాడు గ్రామం, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా మత్స్య సంపద ఎక్కువ ఈ జిల్లాలో గోదావరి పాయలు ఎక్కువ. చప్పనీరు, ఉప్పునీరు కలిసే చోట మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. మా ప్రాంతం కన్నా ఇక్కడ రెట్టింపు ఆదాయం వస్తోంది. 8 నెలలు ఇక్కడే ఉంటాం. – సోడిపల్లి అప్పలరాజు, రాజయ్యపేట, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా మేం పెట్టుబడి పెడతాం నాకు సొంతంగా రెండు బోట్లు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నుండి వేట నిమిత్తం ఈ ప్రాంతానికి వస్తున్న మత్స్యకారులకు మేం పెట్టుబడి పెడతాం. వేటలో వచ్చే ఆదాయంలో 10% మాకు ఇవ్వాలి. వారికి ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటాం. – బొమ్మిడి రాంబాబు, వ్యాపారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
కోనసీమ అల్లర్ల కేసులో కీలక నిర్ణయం
-
గణతంత్ర దినాన... తెలుగు ప్రభలు
భారతదేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాల సమాహారం. వందల ఏళ్ల నాటి సంప్రదాయాలను నేటికీ కొనసాగించడం దేశం గర్వించదగ్గ విషయం. సంక్రాంతి పర్వ దినాలలో భాగంగా కోన సీమ ప్రాంతంలో నిర్వహించే ప్రభల తీర్థాలు అత్యంత విశిష్టమైనవే కాక 400 సంవత్సరాల చరిత్ర కలిగినవి. ఈ ఏడాది ఢిల్లీలో జరిగే ప్రధాన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ప్రభల తీర్థం’ ఇతివృత్తంగా తయారుచేసిన శకటాన్ని ప్రదర్శిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం, జగ్గన్నతోటలో నిర్వహించే ప్రభల తీర్థం కోనసీమలో అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక వేడుక. క్రీ.శ 17వ శతాబ్దంలో ప్రభల తీర్థాన్ని ప్రారంభించారని అంటారు. 11 గ్రామాల నుండి వచ్చిన ఏకాదశ రుద్రులు ఇక్కడ కొలువై ఉంటారని ప్రతీతి. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభల తీర్థం విశిష్టతను కొనియాడుతూ నిర్వాహకులకు లేఖను రాశారు. సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో వెదురు, తాటి కర్రలను, రంగు రంగుల కొత్త బట్టలు, నూలుదారాలను, కొబ్బరి తాళ్ళను, రంగు కాగితాలను, నెమలి పింఛాలను ఉపయోగించి ఒక అందమైన ప్రభను తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆయా గ్రామాల నుండి ఉత్సవ ప్రదేశానికి అంగరంగ వైభవంగా భుజాలపై ఆ ప్రభలను మోసుకువస్తారు. కుల మతాలకు అతీతంగా ఈ తీర్థానికి భక్తులు హాజరవ్వడం విశేషం. ప్రతియేటా సంక్రాంతి పర్వదినాల్లో కనుమ నాడు ఈ తీర్థాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కోనసీమ వ్యాప్తంగా దాదాపు 200 గ్రామాల్లో ప్రభల తీర్థాలను నిర్వహిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలోనే కాక కృష్ణా జిల్లాలోనూ ప్రభల సంప్రదాయం ఉన్నది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశ, విదేశాలలో ఎక్కడ ఉన్నా... సంక్రాంతి సమయానికి మాత్రం వారి వారి స్వగ్రామాలకు చేరుకొని, ప్రభల తీర్థా లలో పాల్గొంటారు. మేళ తాళాలు, సంప్రదాయ నృత్యాల నడుమ బాణసంచా కాలుస్తూ సంప్రదాయ సంగీత వాద్యాలు, ‘గరగ’ జానపద కళారూపం వంటివాటిని ప్రదర్శిస్తూ వేడుకలు చేసుకుంటారు. సంప్రదాయ కళలకు, వాటినే నమ్ముకుని జీవిస్తున్న కళాకారులకు ఈ ఉత్సవాలు ప్రోత్సాహం ఇస్తాయి. చిన్న చిన్న బొమ్మలు, జీళ్ళు, కర్జూరం, గృహోపకరణాలు వంటివాటిని అమ్ముకుని జీవించే అనేక మంది చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూత ఇస్తున్నాయి ఈ తీర్థాలు. ప్రభల తీర్థ మహోత్సవాల్లో కొలువుదీరే ప్రభలలో వాకల గురువు (52 అడుగుల ఎత్తు), తొండవరం (51 అడుగుల ఎత్తు) ప్రభలు రాష్ట్రంలోనే అత్యంత ఎల్తైన ప్రభలుగా గుర్తింపబడ్డాయి. ఇంత ఎల్తైనప్రభలను తయారు చేయడం, వాటిని గ్రామస్థులు తమ భుజస్కంధాలపై ఎత్తుకుని కొబ్బరి, వరి పొలాలు, కాలువలు దాటుకుంటూ తీర్థం జరిగే ప్రదేశానికి తీసుకురావడం ఎంతో శ్రమతో కూడిన పని. పెద్ద ప్రభలకు బాసటగా పిల్ల ప్రభలను కొలువుదీరుస్తారు. వీటిని స్వయంగా 10 నుండి 15 ఏళ్ల వయసు ఉన్న చిన్నారులు తయారు చేస్తారు. సమాజంలో శాంతి, లోక కల్యాణం కోసం ప్రజలు ఏకాదశ రుద్రులను ప్రార్థిస్తారు. రైతులను సంఘటితం చేసేందుకు, వారి ఐక్యతను పెంపొందించేందుకు ఇవి ఉపయోగపడతాయని భావి స్తారు. ఇంతటి సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ప్రభల తీర్థాలను ప్రతిబింబిస్తూ... గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శించ తలపెట్టిన రాష్ట్ర శకటం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. శకటం ముందు భాగంలో కోనసీమ జిల్లాలో సంక్రాంతి పర్వదినాల సందర్భంగా అలంకరించినట్లుగా ఉన్న ఒక గూడు ఎడ్ల బండిపై రైతు కుటుంబం ప్రయాణిస్తున్నట్లుగా చిత్రించారు. అలాగే కోనసీమ ప్రకృతి అందాలను ప్రతిబింబించే విధంగా వరి పొలం గట్టుపై ఈ బండి వెళుతున్నట్లుగాను, వరి ధాన్యాన్నీ, ఈ ప్రాంతంలో పండే కొన్ని కూరగాయలను, పొలాలను కూడా చిత్రించారు. దాని వెనుకే శోభాయమానంగా అలంకరించిన ప్రభలను, బోయీలు మోస్తున్న పల్లకీని ప్రదర్శిస్తున్నారు. ప్రభలను రైతులు పూజించే విధానాన్నీ, కోనసీమలో సంప్రదాయ ‘గరగ నృత్యం’ విశిష్ట తనూ తెలిపేవిధంగా ప్రదర్శన ఉంటుంది. వెనుక భాగంలో కోనసీమ కొంగుబంగారం కొబ్బరి చెట్లు ఎటూ ఉంటాయనుకోండి! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ శకటం ప్రదర్శించడం ద్వారా తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేసింది. తద్వారా రైతు పండుగకు అగ్రతాంబూలం ఇచ్చింది. (క్లిక్ చేయండి: సకల శక్తుల సాధన సబ్‌ప్లాన్) - నేలపూడి స్టాలిన్ బాబు సామాజిక రాజకీయ విశ్లేషకులు -
కోనసీమ తేజం.. జగ్గన్నతోటలో పరమ శివుడి ప్రభల ఉత్సవం (ఫొటోలు)
-
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో కోనసీమ ‘ప్రభల శకటం’
సాక్షి, న్యూఢిల్లీ, అంబాజీపేట: దేశ రాజధానిలో ఈనెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకాదశ రుద్రుల ప్రభల శకటం ఎంపికైంది. సంక్రాంతి సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే వేడుకలు, పంటలు చేతికి అందే సమయంలో రైతన్నల ఆనందోత్సాహాలను ప్రతిబింబించేలా శకటం ముస్తాబవుతోంది. కోనసీమలో కనుమ రోజు జగ్గన్నతోటలో జరిగే ఏకాదశ రుద్రుల ప్రభల చరిత్రను ప్రతిబింబించేలా శకటాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఏకాదశ రుద్రుల ప్రభల చరిత్రను వివరిస్తూ గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ సభ్యులు రాష్ట్రపతికి లేఖ పంపారు. ప్రభల ఉత్సవంపై వారు రాసిన లేఖకు ప్రధాని మోదీ స్పందిస్తూ నాలుగు శతాబ్దాలుగా ప్రభల వేడుక నిర్వహించడం ఆనందదాయకమన్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో గ్రామీణ ప్రాంతాలు పట్టుగొమ్మలుగా నిలుస్తున్నాయని అభినందించారు. ఇదీ విశిష్టత ఏకాదశ రుద్రులను కనుమ రోజు దర్శించుకుంటే ముక్తి కలుగుతుందని, పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఏటా సంక్రాంతి మర్నాడు అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థానికి 410 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. లోకకళ్యాణం కోసం పెద్దాపురం సంస్ధానాధీశుడు రాజా వత్సవాయి జగన్నాథరాజు (జగ్గన్న) హయాంలో 17వ శతాబ్ధంలో తొలిసారిగా ఇక్కడ నిర్వహించారు. ప్రభల ఉత్సవానికి మరో స్థల పురాణం కూడా ఉంది. 17వ శతాబ్ధంలో శివభక్తుడైన జగ్గన్న ఇక్కడున్న పెద్ద మర్రిచెట్టు కింద నిత్యం ధ్యానం చేసుకునేవాడట. పూజలపై పెద్దాపురం సంస్ధానాధీశులు అభ్యంతరం తెలపడంతో జగ్గన్న నేరుగా హైదరాబాద్‌లో ఉండే నవాబును కలిసి ఆయన మెప్పు పొందారట. నవాబు 8 పుట్లు (64 ఎకరాలు) భూమిని దానంగా ఇచ్చి అక్కడే శివ పూజ చేసుకునేందుకు జగ్గన్నకు అనుమతి ఇచ్చారు. కాలక్రమేణ ఆ ప్రాంతం జగ్గన్నతోటగా ప్రసిద్ధికెక్కినట్లు స్థల పురాణం చెబుతోంది. జగన్నాధ మహారాజుకు పరమేశ్వరుడు కలలో కనిపించి ప్రభల తీర్థం నిర్వహించమని, ఆదేశించడంతో జగ్గన్నతోట ప్రభల తీర్ధంగా పేరు వచ్చినట్లు ప్రచారం కూడా ఉంది. -
మండ పీతకు మంచి డిమాండ్.. 4 లక్షల ఆదాయం!
సాక్షి, అమలాపురం: ఆక్వాలో కీలకమైన చేపలు, వనామీ రొయ్యల పెంపకం సంక్షోభంలో కూరుకుపోతోంది. మరీ ముఖ్యంగా వనామీ సాగు రైతులకు నష్టదాయకంగా మారింది. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నా ఎగుమతిదారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులకు నష్టాలు తెచ్చిపెడుతోంది. దీంతో పలువురు ఆక్వా రైతులు ప్రత్యామ్నాయ సాగు వైపు దృష్టిసారించారు. ప్రస్తుతం వారు పీతల సాగుపై ఆసక్తి చూపుతుండగా.. అందుకు ప్రభుత్వం దన్నుగా నిలిచేందుకు సిద్ధమైంది. పీతల సాగుకు మద్దతుగా పలు చర్యలు తీసుకుంటోంది. కోనసీమలో ఒకటిన్నర దశాబ్దాలుగా తీర ప్రాంత మండలాల్లో పీతల సాగు చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా సాగు విస్తీర్ణం మాత్రం పెద్దగా పెరగలేదు. జిల్లాలో ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో కేవలం 200 ఎకరాల్లో సాగు జరుగుతోంది. దీనిని మరింత పెంచేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో మన దేశం నుంచి పీతల ఎగుమతి పెరుగుతోంది. సెల్లా సెరటా, స్కెల్లా ట్రాంక్బారికా (మండ పీత) రకాలకు మంచి డిమాండ్ ఉంది. ఇవి కిలో రూ.600 నుంచి రూ.వెయ్యి వరకూ ధర పలుకుతున్నాయి. ఈ రకం పీతల పెంపకం లాభదాయకంగా ఉంటుందని మత్స్యశాఖాధికారులు చెబుతున్నారు. ఎకరా సాగుకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఖర్చు కాగా, దిగుబడిని బట్టి ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఆదాయం వచ్చే అవకాశముంది. చిర్రయానాంలో హేచరీ పీతల సాగు ప్రోత్సాహంలో భాగంగా కాట్రేనికోన మండలం చిర్రయానాం వద్ద ప్రైవేట్ హేచరీ నిర్మాణానికి మత్స్యశాఖ ప్రోత్సాహం అందిస్తోంది. స్థానికంగా హేచరీ వస్తే పీతల సీడ్ తక్కువ ధరకు రావడంతో పాటు సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఆర్జీసీ విజయవాడ నుంచి, చెన్నై నుంచి తీసుకువస్తున్నారు. ఇది రైతులకు భారంగా మారింది. ఇదే సమయంలో సాగు ప్రోత్సాహంలో భాగంగా పెట్టుబడికి అవసరమైన రుణ పరిమితిని ఇటీవల డిస్ట్రిక్ట్ లెవిల్ టెక్నికల్ కమిటీ (డీఎల్టీసీ) పెంచిన విషయం తెలిసిందే. కమిటీ ఎకరాకు రూ.78 వేలుగా పేర్కొనగా, జిల్లా కలెక్టర్ శుక్లా దీనిని రూ.లక్షకు పెంచాలని సూచించారు. వనామీకి ప్రత్యామ్నాయంగా పీతల సాగు పెంచితే అటు వనామీకి కూడా మంచి డిమాండ్ వస్తోందని అంచనా. మూడు రకాలుగా.. పీతల సాగు మూడు రకాలుగా చేయవచ్చు. కానీ జిల్లా రైతులు కేవలం సంప్రదాయ పద్ధతిలో చెరువుల చుట్టూ వలలు వేసి పెంపకం చేపడుతున్నారు. సాధారణ ఆక్వా చెరువుల మాదిరిగానే ఇక్కడా చేస్తున్నారు. దీంతో పాటు బాక్సులలో పీతలను పెంచే అవకాశముంది. అభివృద్ధి చెందిన దేశాల్లో బాక్సులలో పీతలను పెంచుతున్నారు. మూడో రకం సాఫ్ట్ సెల్స్ ఎప్పటికప్పుడు సేకరించడం ద్వారా సాగు చేస్తారు. మన తీరం అనుకూలం జిల్లాలో ఇప్పుడు మూడు మండలాల్లో మాత్రమే చాలా తక్కువ మొత్తంలో పీతల సాగు జరుగుతోంది. పీతల సాగుకు తీర ప్రాంత మండలాలు అనుకూలం. ఇటు వరికి, అటు రొయ్యల సాగుకు పనికిరాని చౌడు నేలల్లో సైతం పండించవచ్చు. ఆక్వా రైతులు ముందుకు వస్తే ప్రభుత్వం సాగుకు సాంకేతిక సహకారం, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తుంది. –షేక్ లాల్ మహ్మద్, జిల్లా మత్స్యశాఖాధికారి -
నాలుగేళ్లుగా నాన్న కోసం.. సముద్రంలో దారి తప్పి పాకిస్థాన్‌లో బందీలుగా..
అమలాపురం టౌన్: అది 2018 నవంబర్ 29వ తేదీ. మంగళూరు సముద్ర తీరం నుంచి 22 మంది మత్స్యకారులతో అరేబియా సముద్రంలో చేపల వేటకు బోటు బయలుదేరింది. వీరిలో 20 మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారు. మిగిలిన ఇద్దరూ మన జిల్లా వారు. వారు చేపల వేట సాగిస్తున్న బోటు అనుకోకుండా పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి అనుకోకుండా ప్రవేశించింది. చదవండి: హరిపురం ఘటనపై విస్తుపోయే వాస్తవాలు.. చక్రం తిప్పిన టీడీపీ నేత! అలా ఆ దేశ సముద్ర సరిహద్దు గస్తీ పోలీసులకు ఈ 22 మంది మత్స్యకారులూ పట్టుబడ్డారు. ఆ దేశంలో బందీలుగా మారిపోయారు. ఆ 22 మందిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 20 మంది గుర్తింపు కార్డులూ సక్రమంగా ఉండటంతో ఆ దేశ చెర నుంచి కొద్ది నెలలకే విడుదలయ్యారు. మన జిల్లాలోని ఐ.పోలవరం మండలం పశువుల్లంకకు చెందిన పెమ్మాడి నారాయణరావు, కాట్రేనికోన మండలం గచ్చకాయలపొరకు చెందిన మూదే అన్నవరం ఇంకా ఆ దేశంలో బందీలుగానే మగ్గిపోతున్నారు. వీరికి వేట బోట్ల పరంగా గుర్తింపు కార్డులు లేకపోవడంతో నాలుగేళ్లుగా కరాచీ జైలులో మగ్గుతున్నారు. వారి కోసం కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. హిందీలో ఉత్తరాలు రాయిస్తూ.. ఆధార్ కార్డులో తప్ప నారాయణరావు, అన్నవరం ఫొటోలు తీయించుకున్న సందర్భాలు కూడా అంతగా లేవు. దీంతో వారి పాత ఫొటోలనే చూసుకుంటూ ఆయా కుటుంబ సభ్యులు తమ వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. నారాయణరావు, అన్నవరం ఉత్తరాలు రాసేంత అక్షరాస్యులు కూడా కారు. నారాయణరావు మాత్రం హిందీ భాషలో ఎవరితోనో చాటుగా ఉత్తరం రాయించి చివర సంతకాలు చేసి పోస్టు చేయిస్తున్నాడు. అప్పుడప్పుడూ వస్తున్న ఆ ఉత్తరాలను ఇక్కడ హిందీ భాష తెలిసున్న వారితో చదివించుకుని, అతడి కుటుంబీకులు కొంత తృప్తి పడుతున్నారు. మరో మత్స్యకారుడు అన్నవరం నుంచి అతడి కుటుంబీకులకు అటువంటి ఉత్తరాలు వచ్చిన దాఖలాలు లేవు. ఇటీవల అన్నవరం ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటోందని, అతడి పరిస్థితి చూస్తే బాధనిపిస్తోందని తోటి బందీ నారాయణరావు తన కొడుకు దుర్గాప్రసాద్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. అన్నవరానికి కుమార్తె మాత్రమే ఉంది. ఆమె ముమ్మిడివరం మండలం కొత్తలంకలో ఉంటోంది. ఆమె కూడా తన తండ్రి కోసం తల్లడిల్లుతోంది. రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న ‘రిలేషన్ ఫ్యామిలీ లింక్స్’ కార్యక్రమంలో భాగంగా పాక్‌లో బందీ అయిన నారాయణరావుతో కోనసీమలోని అతడి కుటుంబీకులకు ఉత్తరం రాయించి, ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ ద్వారా ఇక్కడి వారికి అందే ఏర్పాటు చేసింది. అలాగే నారాయణరావు కుమారుడు దుర్గాప్రసాద్ కూడా తన తండ్రికి రాసిన ఉత్తరాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ పాక్ చెరలో ఉన్న నారాయణరావుకు పంపించే ఏర్పాటు చేసింది. నారాయణరావుకు భార్య, కుమారుడు దుర్గా ప్రసాద్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లయ్యాయి. దుర్గా ప్రసాద్ కుటుంబం ఉపాధి నిమిత్తం సొంతూరు పశువుల్లంక నుంచి హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడే అతడు వడ్రంగి మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. ఆ దేశం నుంచి తండ్రి రాసిన ఉత్తరం చూసి, ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమవుతున్నాడు. పాక్ చెర నుంచి తమ వారిని విడిపించి, తమకు అప్పగించాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు, ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. ఎదురు చూస్తున్నాను నాన్న నారాయణరావు సముద్రంలో బోట్లపై ఇతర రాష్ట్రాల్లోకి కూడా వెళ్లి కొన్ని రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేవాడు. 2018లో వెళ్లిన నాన్న నెలలు గడస్తున్నా ఇంటికి చేరుకోలేదు. ఆరా తీస్తే పాకిస్థాన్‌కు బందీగా చిక్కుకుపోయాడని ఆరు నెలల తర్వాత తెలిసింది. చాలా బాధపడ్డాం. అప్పటి నుంచీ నాలుగేళ్లుగా నాన్న కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. చాలా ఇబ్బందులు పడుతూ అప్పుడప్పుడు నాన్న మాత్రం అక్కడి నుంచి ఉత్తరాలు రాస్తున్నాడు. ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నాను. తగిన ఆధారాలు సమర్పించాను. – పెమ్మాడి దుర్గాప్రసాద్, పాక్ బందీ నారాయణరావు కుమారుడు, వడ్రంగి మేస్త్రి, హైదరాబాద్ -
అమరావతి పాదయాత్రకు బ్రేక్
-
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం
-
ఏసీబీ వలలో ఎంపీడీవో
పి.గన్నవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎంపీడీవో కె.ఆర్.విజయ రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఎంపీ ల్యాడ్స్ మంజూరు కోసం మండల పరిషత్ నుంచి 10 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. మండలంలోని రాజులపాలెంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.1.15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహించాలని పంచాయతీలో నిర్ణయించారు. ఎంపీ లాడ్స్ మంజూరుకు ముందుగా గ్రామ పంచాయతీ నుంచి 10 శాతం, మండల పరిషత్ నుంచి 10 శాతం సొమ్ము మ్యాచింగ్ గ్రాంటుగా చెల్లించాల్సి ఉంది. మండల పరిషత్ మ్యాచింగ్ గ్రాంటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉప సర్పంచ్ ఎన్.విజయలక్ష్మి ఇటీవల ఎంపీడీవో విజయను కోరారు. అనుమతి ఇచ్చేందుకు ఎంపీడీవో రూ.50 వేలు డిమాండ్ చేశారు. ఈ నెల 6న విజయలక్ష్మి ఎంపీడీవోకు రూ.10 వేలు ఇచ్చారు. మిగిలిన సొమ్ము కూడా ఇవ్వాలని ఎంపీడీవో ఒత్తిడి చేయడంతో ఉప సర్పంచ్ తమను ఆశ్రయించినట్టు ఏసీబీ ఏఎస్పీ సీహెచ్ సౌజన్య తెలిపారు. సోమవారం మధ్యాహ్నం విజయలక్ష్మి నుంచి రూ.40 వేలు తీసుకుంటుండగా ఎంపీడీవో విజయను పట్టుకున్నట్టు చెప్పారు. తమ పరీక్షల్లో ఎంపీడీవో నగదు తీసుకున్నట్టు నిర్ధారణ అయిందన్నారు. ఎంపీడీవోను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, అరెస్టు చేస్తామని ఏఎస్పీ చెప్పారు. ఈ దాడుల్లో సీఐలు వి.పుల్లారావు, బి.శ్రీనివాస్, వై.సతీ‹Ù, ఎస్ఐ ఎస్.విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు. -
World Coconut Day: రైతుకు సిరి.. ఉపాధికి ఊపిరి
సాక్షి అమలాపురం/ అంబాజీపేట (పి.గన్నవరం): కొబ్బరి అనగానే కోనసీమ గుర్తుకు వస్తుంది. రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా, సుమారు 93 వేల ఎకరాలకు పైగా కోనసీమలోనే ఉంది. 70 వేల మందికిపైగా రైతులు కొబ్బరి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. దీర్ఘకాలిక ఉద్యాన పంటల్లో ఒకటిగా... నెలనెలా క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించే పంటగా పేరొందింది. అంతేకాదు కొబ్బరి నుంచి సుమారు 160 రకాలకు పైగా ఉత్పత్తులను తయారు చేసే అవకాశముంది. ఇంత విలువైన బంగారు పంటపై రైతులే కాకుండా దింపు, వలుపు, తరుగు కార్మికులుగా, మోత, రవాణా కూలీలుగా వేలాది మంది జీవిస్తున్నారు. జిల్లాలో సుమారు ఐదు వేల మంది వరకు నేరుగా ఉపాధి పొందుతున్నారు. కాయర్ ఉత్పత్తి పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువత ఉపాధి పొందుతుండగా, కూలీలుగానే కాకుండా పీచుతో కళాత్మక ఉత్పత్తుల తయారీతో మహిళలు జీవనం సాగిస్తున్నారు. కొబ్బరి ఎగుమతి, దిగుమతుల చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకు దళారులు, ట్రాన్స్‌పోర్టు యాజమానులు ఇలా వేలాది మంది ఉపాధికి కొబ్బరి ఊపిరిగా నిలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీ అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవం సందర్భంగా నారికేళంతో వివిధ వర్గాల జీవనం పెనవేసుకుపోయిన తీరుపై కథనం... చిన్ననాటి నుంచి అనుబంధం కొబ్బరితో చిన్ననాటి నుంచి అనుబంధం ఉంది. మా కొబ్బరి తోటల్లో ఇంచుమించు ప్రతీ చెట్టు చిన్నప్పుడు నేను సేకరించి విత్తనాల నుంచి మొలక వచ్చినదే. అందుకే వీటితో నాకు సొంత పిల్లలతో ఉన్నంత అనుబంధం ఉంది. బహుశా అందుకేనేమో పెద్దలు కొబ్బరి చెట్టును కన్న కొడుకుతో పోలుస్తారు. 1960ల నుంచి కోనసీమలో కొబ్బరిసాగు బాగా పెరిగింది. మా లంక గ్రామాల్లో ఇది 1980 నుంచి ఆరంభమైంది. – గోదాశి నాగేశ్వరరావు, కొబ్బరి రైతు, లంకాఫ్ ఠాన్నేల్లంక మాది నాలుగవ తరం కురిడీ వ్యాపారంలో మాది నాలుగవ తరం. 60 ఏళ్లకు పైగా మా కుటుంబం ఈ వ్యాపారంలో భాగస్వామిగా ఉంది. ఈ వ్యాపారాన్ని ఇష్టపడి చేయాలని, నిజాయితీగా ఉండాలని మా పెద్దలు చెప్పేవారు. దేశంలో కురిడీ వ్యాపారంలో మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందంటే దీని వల్లే. వ్యాపారం కన్నా ముందు రైతులుగా కొబ్బరి చెట్టును ప్రేమిస్తాం. బహుశా దాని వల్లనేమో కొబ్బరి మా జీవితాల్లో ఇంతగా కలిసిపోయింది. మా తరువాత తరం కూడా ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. – అప్పన బాలాజీ, కురిడీ కొబ్బరి వ్యాపారి, మాచవరం, అంబాజీపేట మండలం మూడున్నర దశాబ్దాలుగా ఆయిల్ వ్యాపారం మాది కొబ్బరి నూనె వ్యాపారం. మూడున్నర దశాబ్దాలుగా ఇదే వ్యాపారం చేస్తున్నాం. అంబాజీపేటలో ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో మాది ఒకటిగా పేరొచ్చింది. గతంలో రైతులు కొబ్బరి ఎండబెట్టి సొంతంగా ఆయిల్ తయారు చేయించుకునేవారు. ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే మా పిల్లలు సైతం ఈ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. – గెల్లి నాగేశ్వరరావు, కొబ్బరి నూనె వ్యాపారి, అంబాజీపేట 60 ఏళ్లుగా ఇక్కడే రాజస్థాన్‌లోని నాగూర్ మాది. మా తండ్రితోపాటు మా కుటుంబ సభ్యులు 60 ఏళ్లకు ముందే ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాం. అప్పుడు నా వయస్సు రెండేళ్లు. తొలి నుంచి మాది కొబ్బరి కమీషన్ వ్యాపారం. కోనసీమ కొబ్బరి ఉత్తరాదికి పంపడంలో మా కుటుంబం కీలకంగా ఉండేది. అన్నదమ్ములమంతా ఇక్కడ కమీషన్ వ్యాపారం చేసేవాళ్లం. 1980 నుంచి 1996 వరకు కోనసీమ కొబ్బరి దేశీయ మార్కెట్లో ఉజ్వలంగా ఎదిగింది. తుపాను వచ్చిన తరువాత బాగా దెబ్బతింది. ఇప్పటికీ కమీషన్ వ్యాపారం జరుగుతున్నా అంతగా లేదు. – సంపత్ కుమార్ ఫారిక్, కొబ్బరి కమీషన్ వ్యాపారి, అంబాజీపేట కొబ్బరి వలుపే జీవనాధారం ఇప్పుడు నా వయస్సు 49. నా పదిహేనవ ఏట నుంచి కొబ్బరి వలువులో జీవనోపాధి పొందుతున్నాను. ఈ పని తప్ప మరొకటి రాదు. కుటుంబాన్ని పెంచి పోషించింది కూడా ఈ వృత్తిలోనే. నేనే కాదు చాలామంది మా వలుపు కార్మికులకు మరోపని రాదు. ఇన్నేళ్లుగా కొబ్బరితోనే మా జీవనం సాగిపోతోంది. – విప్పర్తి సత్యనారాయణ (బంగారి), పోతాయిలంక, అంబాజీపేట మండలం పరాయి రాష్ట్రమైనా కొబ్బరే ఆధారం మాకు స్థానికంగా పనులు లేక తమిళనాడులోని కాంగేయం వెళ్లిపోయాం. పరాయి రాష్ట్రానికి వెళ్లినా జీవనోపాధికి కొబ్బరి మీదనే ఆధారపడాల్సి వస్తోంది. నేను గడిచిన ఆరు ఏళ్లుగా తమిళనాడులో ఎండు కొబ్బరి తరిగే పనిచేస్తున్నాను. – దోనిపూడి దుర్గాప్రసాద్, తరుగు కార్మికుడు -
పెట్రోలు పోసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం
(కోనసీమ) రాజోలు: ఒంటిపై పెట్రోలు పోసుకుని ఓ వివాహిత రాజోలు సర్కిల్ పోలీసు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన యర్రంశెట్టి విజయలక్ష్మి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ఆమె విజయలక్ష్మి ఏ1 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్‌గా, ఆమె భర్త రమేష్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పని చేసుకుంటూ సుమారు రూ.80 లక్షల అప్పులు చేశారు. కొన్ని బకాయిల నిమిత్తం విజయలక్ష్మి పుట్టిల్లు ఇరుసుమండలో ఉన్న స్థలాన్ని, కేశవదాసుపాలెంలోని డాబా ఇంటిని అమ్మేందుకు.. అప్పులు ఇచ్చిన వ్యక్తులతో పెద్దల సమక్షంలో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా అప్పు ఇచ్చిన కొందరు బకాయి కింద ఇరుసుమండలోని భూమిని స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, భూసర్వే పనుల్లో వివాదం తలెత్తింది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు విజయలక్ష్మి తన స్కూటర్‌పై రాజోలు సర్కిల్ పోలీసు కార్యాలయానికి వచ్చింది. వెంట లీటరు బాటిల్లో పెట్రోలు పోయించి తెచ్చుకుంది. సర్కిల్ కార్యాలయం ఎదుట సిమెంట్ బల్లపై కూర్చుని సీఐ ఎప్పుడు వస్తారని అక్కడున్న సెంట్రీ కానిస్టేబుల్‌ను అడిగింది. సీఐ శిక్షణలో ఉన్నారని, సోమవారం వస్తారని కానిస్టేబుల్ చెప్పాడు. వెంటనే ఆమె కూడా తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పు పెట్టుకుంది. మంటలు పూర్తిగా వ్యాపించడంతో హాహాకారాలతో పరుగులు తీస్తూ పక్కనే ఉన్న ట్రెజరీ, రెవెన్యూ కార్యాలయాల సమీపానికి వచ్చింది. అక్కడ ఉన్న పలువురు ఆమెను రక్షించేందుకు తడి గోనె సంచులు, ఇసుక వేసి, మంటలను ఆదుపు చేశారు. హుటాహుటిన రాజోలు ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. డాక్టర్ రాంజీ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స చేశారు. విజయలక్ష్మి శరీరం సుమారు 80 శాతం కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె వాంగ్మూలాన్ని రాజోలు మెజి్రస్టేట్ జి.సురేష్‌బాబు నమోదు చేశారు. దీనిపై కేసు నమోదు చేస్తామని ఎస్సై కృష్ణమాచారి తెలిపారు. -
Terrace Gardens: డాబాలే.. పొలాలై..
ఉదయం లేచింది మొదలు ఈ రోజు ఏం కూర వండాలని తెగ ఆలోచిస్తుంటారు ఆడవాళ్లు. కానీ డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలంలోని అర్తమూరుకు చెందిన వల్లూరి సత్యవేణి మాత్రం డాబా మీదకు వెళతారు. అప్పుడే తాజాగా కాసిన కూరగాయలు తెచ్చి వంట కానిచ్చేస్తారు. అక్కడేమి అద్భుతం ఉండదు. సత్యవేణి ప్రేమగా పెంచుకుంటున్న గార్డెన్ ఉంటుంది. ఆమె ఒక్కరే కాదు.. ఇప్పుడు చాలా ఇళ్ల వద్ద కనిపిస్తున్న పరిస్థితి ఇది. కోవిడ్ తర్వాత ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడవడంతో చాలా ఇళ్లపై డాబాలు మినీ వనాలను తలపిస్తున్నాయి. వీటితో పాటు పొలం గట్లు, దిమ్మలు కూరగాయల పాదులు, ఆకుకూరలతో నిండిపోతున్నాయి. గతంలో ఎక్కువ మంది రైతులు వ్యవసాయం చేయడం వలన కౌలు రైతులు పెద్దగా ఉండేవారు కాదు. పొలాల్లో దిమ్మలపై పశువుల మకాంలు ఏర్పాటు చేసుకుని ఖాళీ స్థలాల్లో కూరగాయలు, పొలం గట్లపై కందులు సాగు చేసేవారు. తద్వారా ఇంటి అవసరాలు తీరడంతో పాటు మార్కెట్లో అమ్మడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునేవారు. మరోపక్క గృహిణులు ఇంటి పెరటిలో కూరగాయలు, ఆకుకూరల మొక్కలు పెంచేవారు. కాలక్రమంలో వ్యవసాయం చేసే రైతులు తగ్గిపోగా కౌలు రైతులు పెరిగారు. శిస్తు చెల్లించే క్రమంలో సాగు విస్తీర్ణం పెంచుకునేందుకు కౌలుదారులు ప్రాధాన్యమిస్తున్నారు. పారలంకతో గట్లు కుచించుకుపోతుండగా దిమ్మలు కరిగిపోయి పొలాల్లో చాలా వరకూ కూరగాయల సాగు తగ్గిపోయింది. మరోపక్క ఇళ్ల వద్ద పెరడులు కనుమరుగైపోయి మార్కెట్లో దొరికే ఎరువులు, పురుగు మందులతో పండించిన కూరగాయలు, ఆకుకూరల పైనే ఆధారపడాల్సి వస్తోంది. వెలగతోడులో పొలం గట్లపై వేసిన బెండ మొక్కలను పరిశీలిస్తున్న ప్రకృతి వ్యవసాయాధికారి కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా సేంద్రియ పద్ధతిలో ఇళ్ల వద్ద, పొలాల్లోను కూరగాయలు, ఆకుకూరల సాగును ప్రోత్సహిస్తోంది. గ్రామాల్లోని డ్వాక్రా మహిళలకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సేంద్రియ సేద్యం ద్వారా తక్కువ ఖర్చుతో కూరగాయలు, ఆకుకూరల సాగుపై శిక్షణ ఇస్తున్నారు. రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా వారికి వంగ, మిరప, టమాటా, ఆనప, బెండ వంటి కూరగాయలతో పాటు గోంగూర, తోటకూర, పాలకూర తదితర ఆకుకూరల విత్తనాలు అందజేస్తున్నారు. కరోనా తర్వాత ఆరోగ్యం పట్ల ప్రజల్లో శ్రద్ధ పెరిగింది. మార్కెట్లో రసాయనాలు వినియోగించిన కూరగాయలు కొనే కన్నా ఇంటి వద్ద సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీలైనంతలో ఇంటి వద్ద ఖాళీ ప్రదేశాలు, మేడ పైన కూరగాయలు, ఆకుకూరలు పెంచుకుంటున్నారు. మరోపక్క పొలంబడి ద్వారా రైతులకు శిక్షణ ఇచ్చి గట్లు, దిమ్మలపై కూరగాయల సాగును కూడా ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రోత్సహిస్తోంది. ఆకుకూరలు, కాయగూరలతో పాటు మునగ, బొప్పాయి విత్తనాలు, మొక్కలు అందజేస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతిలో లభించే వనరులతో కషాయాల తయారీపై శిక్షణ ఇస్తూ సేంద్రియ పద్ధతిలో రైతులతో సాగు చేయిస్తున్నారు. ఆయా పంటలను ఎప్పటికప్పుడు వ్యవసాయ సిబ్బంది పరీక్షించి రైతులకు అవసరమైన సూచనలు ఇస్తున్నారు. ఈ తరహాలో పండించిన వాటికి మంచి డిమాండ్ ఉంటోంది. మార్కెట్ ధరలతో పోలిస్తే సేంద్రియ కూరగాయలను రెట్టింపు ధరకు కొనుగోలు చేసేందుకు కూడా వినియోగదారులు వెనుకాడటం లేదు. ప్రకృతి వ్యవసాయ విభాగం గణాంకాల ప్రకారం జిల్లాలోని 14,800 మంది మహిళలు కిచెన్ గార్డెన్ ద్వారా సేంద్రియ పద్దతిలో ఇళ్ల వద్ద కూరగాయలు పెంచుతుండగా, 5,400 మంది రైతులు పొలం గట్లు, దిమ్మలపై వీటిని సాగు చేస్తున్నారు. మరింత మందితో సాగు చేయించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ప్రకృతి వ్యవసాయ అధికారులు తెలిపారు. మా ఇల్లే మినీ వనం ప్రకృతి వ్యవసాయ అధికారుల సూచనలతో సేంద్రియ సాగుపై అవగాహన పెంచుకుని మేడపై సాగు చేయడం మొదలు పెట్టాం. ఆకుకూరలు, కూరగాయలతో పాటు డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, అంజీర వంటి పండ్లు, పూల మొక్కలు కూడా పెంచుతున్నాం. ఇంట్లో కూరల కోసం వీటి నుంచి వచ్చిన కూరగాయలు, ఆకు కూరలనే వినియోగిస్తుంటాం. ఎక్కువగా కాపుకొచ్చినప్పుడు ఇరుగుపొరుగు వారికి ఇస్తూంటాం. – వల్లూరి సత్యవేణి, అర్తమూరు ఆరోగ్యవంతమైన జీవనం పొలం గట్లు, ఇళ్ల వద్ద సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. డ్వాక్రా మహిళలు, రైతులకు శిక్షణతో పాటు విత్తనాలు, మొక్కలు అందజేస్తున్నాం. సేంద్రియ సాగు వలన ఆరోగ్యవంతమైన జీవనంతో పాటు పర్యావరణానికి హాని జరగకుండా ఉంటుంది. గట్లపై కందులు, కూరగాయల సాగుతో వరిపై మొవ్వు, పచ్చదోమ వంటి చీడపీడల బెడద చాలా తక్కువగా ఉంటుంది. – బి.జగన్, మండల ప్రకృతి వ్యవసాయ అధికారి, మండపేట -
గోదావరి గట్లు.. ఇక దిట్టంగా..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వరదల వేళ గోదావరి నది పరీవాహక ప్రాంతాల ప్రజలు నిశ్చింతగా జీవించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత పాలకుల నిర్లక్ష్యంతో గాలికొదిలేసిన ఔట్‌ఫాల్ స్లూయిజ్‌లు, పంట కాలువ గట్లు, డ్రెయిన్ల గట్లను పటిష్టం చేయాలని నిర్ణయించింది. దాదాపు పదిహేనేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పనులు తప్ప.. తరువాత వచ్చిన పాలకులెవరూ వీటి జోలికి పోలేదు. గోదావరి వరదలతో ముప్పు పొంచి ఉందని తెలిసినా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగానే గత నెల వరదలు పరీవాహక ప్రాంతాలతో పాటు గోదావరి లంకల్లోని ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేశాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికారులు నిత్యం అప్రమత్తంగా వ్యవహరించడంతో కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలకు ముప్పు తప్పింది. ఇటీవల ఆయన స్వయంగా ముంపు బాధిత లంకల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పర్యటించి, పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆ సందర్భంలోనే తక్షణం పటిష్టం చేయాల్సిన కాలువ, డ్రెయిన్ గట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పలు మండలాల్లో 23 పనులు అత్యవసరమని గుర్తించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పనులకు రూ.5 కోట్లు మంజూరు చేశారు. పునరావృతం కాకుండా.. గత నెలలో వచ్చిన వరదలతో ఎదురైన కష్టాలు భవిష్యత్తులో ఎదురు కాకుండా అత్యవసర పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఔట్‌ఫాల్ స్లూయిజ్‌లకు లీకేజీలు ఏర్పడి, భారీగా వరదలు వస్తే గట్లు కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే తాజా పనుల్లో వాటికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవలి వరదలతో గోదావరి పాయల నుంచి నీరు పోటెత్తి పంట కాలువలపై నుంచి పొంగి ప్రవహించి, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. దెబ్బ తిన్న డ్రైన్ గట్ల వల్ల కూడా దాదాపు ఇదే పరిస్థితి ఏర్పడింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం.. తాజా పనుల్లో వీటికి ప్రాధాన్యం ఇచ్చింది. ధవళేశ్వరం హెడ్ వర్క్స్ పరిధిలో.. సఖినేటిపల్లి మండలం గొంది వశిష్ట ఎడమ గట్టు, గోడి అవుట్‌ఫాల్ స్లూయిజ్ మరమ్మతులకు రూ.22 లక్షలు. గోడి వశిష్ట ఎడమ గట్టు నొవ్వ అవుట్‌ఫాల్ స్లూయిస్జ్కు రూ.18 లక్షలు. మామిడికుదురు మండలం లూటుకుర్రు వైనతేయ కుడిగట్టు వాడబోది అవుట్‌ఫాల్ స్లూయిజ్ పునర్నిర్మాణానికి రూ.8 లక్షలు. ఆదుర్రు – వైనతేయ కుడిగట్టు బచ్చలబండ అవుట్‌ఫాల్ స్లూయిజ్ రక్షణకు రూ.5 లక్షలు. గోగన్నమఠం వైనతేయ కుడిగట్టు కడలి అవుట్‌ఫాల్ స్లూయిజ్ రక్షణకు రూ.8 లక్షలు. పి.గన్నవరం మండలం వైనతేయ ఎడమ గట్టున కె.ముంజవరం అవుట్‌ఫాల్ స్లూయిజ్ పరిధిలో కోతకు గురైన కట్ట మరమ్మతులకు రూ.10 లక్షలు. ఐ.పోలవరం మండలం పాత యింజరం వద్ద అవుట్‌ఫాల్ స్లూయిజ్ రక్షణకు రూ.40 లక్షలు. జి.మూలపొలం అవుట్‌ఫాల్ స్లూయిజ్ పునర్నిర్మాణానికి రూ.28 లక్షలు. కేశనకుర్రు పీఐపీ వరద గట్టుపై అవుట్‌ఫాల్ స్లూయిజ్ పునర్నిర్మాణానికి రూ.45 లక్షలు. కాట్రేనికోన మండలం గొల్లగరువు అవుట్‌ఫాల్ స్లూయిజ్ రక్షణకు రూ.38 లక్షలు. ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి షట్టర్ల మరమ్మతులకు రూ.16 లక్షలు. గౌతమి కుడి గట్టుపై ప్రధాన అవుట్‌ఫాల్ స్లూయిజ్ స్క్రూ గేరింగ్, షట్టర్ మరమ్మతులకు రూ.44 లక్షలు. గోదావరి సెంట్రల్ డివిజన్లో.. 1986 వరద స్థాయికి అనుగుణంగా అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద ఇరువైపులా ఐ.పోలవరం కుడి కాలువ గట్టు బలోపేతానికి రూ.40 లక్షలు. అన్నంపల్లి అక్విడెక్ట్‌కు ఇరువైపులా ఐ.పోలవరం ఎడమ కాలువ గట్టు బలోపేతానికి రూ.25 లక్షలు. అనాతవరం బ్రాంచి కెనాల్‌పై 0.80 కిలోమీటర్ వద్ద కల్వర్టు నిర్మాణానికి రూ.15 లక్షలు. గన్నవరం ప్రధాన కాలువపై వరద గేట్లు, గన్నవరం అక్విడెక్ట్ రెయిలింగ్ మరమ్మతులకు రూ.80 లక్షలు. రాజోలు, అమలాపురం డ్రైనేజీ సబ్ డివిజన్లలో.. ఇందుపల్లి ఎగువ కౌశిక మీడియం డ్రెయిన్ ఎడమ గట్టుకు రూ.6 లక్షలు. బండారులంక ఎగువ కౌశిక కుడి ప్రధాన డ్రెయిన్Œ కుడి గట్టుకు రూ.4 లక్షలు. సాకుర్రు మేజర్ డ్రెయిన్Œపై గట్లకు రూ.12 లక్షలు. బండారులంక ఎగువ కౌశిక మీడియం డ్రెయిన్ కుడిగట్టుకు రూ.10 లక్షలు. సాకుర్రు గున్నేపల్లి, సాకుర్రు మేజర్ డ్రెయిన్ గట్లకు రూ.10 లక్షలు. రాజోలులో నామనపాలెం మీడియం డ్రెయిన్, కోతకు గురైన ఒడ్డుకు రూ.15 లక్షలు. పొన్నమండ–2 డ్రెయిన్ అవుట్‌ఫాల్ స్లూయిజ్ షట్టర్ల మరమ్మతులకు రూ.5 లక్షలు. త్వరలో పనులు మొదలుపెడతాం ఈ రోజే పనులకు ఆమోదం తెలియచేశాం. వీటిని అత్యవసరంగా చేపట్టాల్సి ఉంది. వివిధ శాఖలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని, వరదల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులకు ఆమోదం తెలియజేశాం. వీటితో పాటు శాశ్వత ప్రాతిపదికన చేపట్టే పనులు కూడా మరికొన్ని ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులతో ముందుగా అత్యవసర పనులు చేపడుతున్నాం. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనుకుంటున్నాం. త్వరలో టెండర్లు కూడా పిలిచి పనులు వేగవంతం చేస్తాం. – హిమాన్షు శుక్లా, కలెక్టర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అత్యవసర పనులు చేపడుతున్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు అత్యవసర పనులను ప్రతిపాదించాం. గోదావరి హెడ్‌వర్క్స్ డివిజన్లో ఇవి చాలా కీలకమైనవి. ఇటీవలి వరదలతో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లు, వాటి షట్టర్లు పటిష్టమైతే వరదల సమయంలో ప్రమాదాలను చాలా వరకూ నియంత్రించవచ్చు. ఇందుకు తగ్గట్టుగానే ఈ పనులు మొదలు పెట్టనున్నాం. – ఆర్.కాశీవిశ్వేశ్వరరావు, ఈఈ, గోదావరి హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం నిధుల కేటాయింపు ఇలా.. అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లకు : రూ.2.82 కోట్లు పంట కాలువ గట్ల రక్షణకు : రూ.1.60 కోట్లు డ్రెయిన్ల గట్ల పటిష్టతకు : రూ.62 లక్షలు -
ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్
-
కోనసీమ వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
పుచ్చకాయలవారి పేట: గ్రామంలో జరుగుతున్న సహాయక చర్యలపై సీఎం జగన్ ఆరా
-
బూరెలలంక: స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం జగన్
-
వరద నష్టంపై అంచనాలు పూర్తి కాగానే ఆదుకుంటాం: సీఎం జగన్
-
ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలి: సీఎం జగన్
-
వరద బాధితులందరికీ అండగా ఉంటాం- సీఎం జగన్
-
చంటోడి చిలిపి పని
-
సీఎం జగన్ ఎదురెళ్లి స్వాగతం పలికిన లంక గ్రామస్థులు
-
ట్రాక్టర్ పై బాధితుల వద్దకు వెళ్తున్న సీఎం జగన్
-
కోనసీమ చేరుకున్న సీఎం జగన్
-
అంబేద్కర్ కోనసీమ వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
05: 30PM ►రాజోలు మండలం మేకలపాలెంలో సీఎం జగన్ పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను గ్రామస్తులు సీఎం దృష్టికి తీసుకురాగా.. సమస్యలన్నింటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 04: 10PM ►అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం మేకలపాలెంకు సీఎం జగన్ చేరుకున్నారు. కరకట్టవాసి నాగరాజు కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. మేకలపాలెంలో ఏటిగట్టును పరిశీలించారు. 03: 30PM ►కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాడ్రేవుపల్లికి చేరుకున్నారు. కాసేపట్లో రాజోలు మండలం మేకలపాలెంకు వెళ్లనున్నారు. అక్కడ వరద బాధితులను సీఎం పరామర్శించనున్నారు. 02: 30PM ►అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పుచ్చకాయలవారి పేట, ఊడుమూడి లంకలో వరద బాధితులను నేరుగా కలిసి పరామర్శిస్తున్నారు. వరద బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. 12: 58PM ►అరిగెలవారిపేటకు చేరుకున్న సీఎం జగన్ ►అరిగెలవారిపేట వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్ ►అరిగెలవారిపేటలో వంతెన నిర్మిస్తానని సీఎం జగన్ హామీ 12:01PM ►పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ ►నక్కా విజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్ ►సీఎం జగన్ జేబులోంచి పెన్ తీసుకున్న 8 నెలల బాబు ►8 నెలల బాబుకు తన పెన్ గిఫ్ట్‌గా ఇచ్చిన సీఎం జగన్ ►శిబిరాల్లో బాగా చూసుకున్నారా అంటూ బాధితులను అడిగిన సీఎం జగన్ ►కలెక్టర్‌కు ఎన్ని మార్కులు వేయొచ్చని అడిగిన సీఎం జగన్ ►వాలంటీర్లు బాగా పనిచేశారని సీఎంకు చెప్పిన వరద బాధితులు 11: 20AM ►ట్రాక్టర్లో లంక గ్రామాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్ 11:15AM ►పంటుపై లంక గ్రామాలకు చేరిన సీఎం జగన్ 11: 06 AM ►పంటుపై లంక గ్రామాల్లోకి వెళ్తున్న సీఎం జగన్ 10:34 AM ►పి.గన్నవరం మండలం జి. పెదపూడి చేరుకున్న సీఎం జగన్ ►జి. పెదపూడిలో కురుస్తున్న భారీ వర్షం ►వర్షంలోనే వరద బాధితులకు వద్దకు సీఎం జగన్ 9: 45AM డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్ ► అక్కడి నుంచి పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. బాధితులతో సీఎం జగన్ నేరుగా మాట్లాడనున్నారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు. ► అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. ► అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుంటారు. ► అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుని.. వరద బాధితులతో సమావేశం అవుతారు. ► అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. ► రాత్రికి రాజమండ్రిలోనే సీఎం జగన్ బస చేయనున్నారు. వరద బాధితుల పరామర్శ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. డా.బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
-
రేపు కోనసీమకు సీఎం జగన్
-
AP: వరద బాధితులకు సాయం..హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ
గోదావరి ఉగ్రరూపం కారణంగా కోనసీమ లంక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో వరద బాధిత కుటుంబాలకు రూ. 2వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. లంక గ్రామాల ప్రజలకు తాగునీరు, రేషన్, పశుగ్రాసాన్ని అధికారులు అందిస్తున్నారు. ఇక, అల్లూరి సీతారామారాజు జిల్లాలో పెద్ద ఎత్తున సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతానికి ధవళేశ్వరం వద్ద గోదావరి వదర ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.30 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ అధికారులు హెచ్చరించారు. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఇక, సహాయక చర్యల్లో 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో 385 గ్రామాలు వరద ప్రభావితమయ్యాయి. ఇప్పటివరకు 97,205 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 256 మెడికల్ క్యాంప్స్ నిర్వహించి.. 1,25,015 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుతోంది. ప్రాజెక్ట్స్ స్పీల్వే వద్ద 36.1 మీటర్లకు వరద నీరు చేరుకుంది. 48 గేట్ల ద్వారా దిగువకు 19.58లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్తోంది. కాగా, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పొన్నపల్లి వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఏటిగట్టు ఫుట్‌పాత్ రెయిలింగ్ కోతకు గురైంది. ఈ క్రమంలో ఫుట్‌పాత్ రెయిలింగ్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక, వశిష్ట గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. కానీ, ఇంకా ముంపులోనే 33 లంక గ్రామాలు ఉన్నాయి. -
కోనసీమ: వరద బాధితులకు ప్రత్యేక శిబిరాలు
-
వరద ప్రవాహానికి మునిగిన అక్విడెక్ట్ బ్రిడ్జి
-
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు పోటెత్తిన వరద
-
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద హై టెన్షన్
సాక్షి, తూర్పుగోదావరి: భారీ వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు వరద పోటెత్తింది. వరద నీరు మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. దీంతో, 24 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలవుతోంది. 20.6 అడుగులకు నీటిమట్టం చేరింది. 23.94 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోగా కొనసాగుతోంది. గోదావరి ఉప నదులు గౌతమి, వశిష్ట, వృద్ధ గౌతమి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు పరిస్థితులను పరీక్షిస్తున్నారు. మరోవైపు.. కోనసీమ జిల్లాలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద ప్రమాదకర పరిస్థితి నెలకొంది. వరద ప్రవాహానికి అక్విడెక్ట్ బ్రిడ్డి మునిగిపోయింది. కాగా, అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద కుడిగట్టు బలహీనంగా ఉంది. ఈ క్రమంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: వర్షాల ఎఫెక్ట్.. రైలులో భద్రాచలానికి గవర్నర్ తమిళిసై.. అటు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే -
తమలపాకు.. పోక సాగు చేస్తున్న కోనసీమ రైతులు
సాక్షి, అమలాపురం: కోనసీమలో పండే కొబ్బరి.. కోకో... చేపలు... రొయ్యలకే కాదు. ఇక్కడ పండే తమలపాకు, పోక (వక్క)కు సైతం దేశంలో మంచి డిమాండ్ ఉంది. తమలపాకు, పోకకు ఉత్తర... దక్షిణ భారత దేశంలోని పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఒకప్పటి తమలపాకు సాగు విస్తీర్ణం తగ్గినా... అడపాదడపా ధరలు తగ్గుతున్నా కూడా ఇక్కడ తమలపాకు పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది.. పోక సైతం ఉత్తర, దక్షిణ భారతాలకు ఎగుమతి అవుతుండడం గమనార్హం. ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్న ఈ రెండు పంటల విలువ నెలకు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా. ఉత్తరాదికి కోనసీమ తమలపాకు పి.గన్నవరం, రావులపాలెం, అయినవిల్లి లంక గ్రామాల్లో తమలపాకు సాగు జరుగుతోంది. సాగు విస్తీర్ణం తగ్గినా ఇక్కడ 218.24 ఎకరాల్లో పంట పండుతోంది. గన్నవరం లంకలను ఆనుకుని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే చాకలిపాలెం, కనకాయిలంక, దొడ్డిపట్ల వంటి ప్రాంతాల్లో పండే తమలపాకు సైతం ఈ జిల్లా నుంచే ఎగుమతవుతోంది. మహారాష్ట్రలోని ముంబై, పూనే, నాగపూర్, అమరావతి, బుషావళీ, యావత్మాల్కు వెళుతోంది. అక్కడి నుంచి గుజరాత్‌లోని సూరత్, వడోదర, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్‌లోని కాండ్వా, ఇండోర్లతోపాటు ఛత్తీస్‌గఢ్‌లకు మన తమలపాకును ఎగుమతి చేస్తారు. పొన్నూరు, కళ్లీ, పావడ రకాలు చేస్తున్నారు. గతంలో ఇక్కడ నుంచి రోజుకు సగటున రెండు లారీల చొప్పున ఎగుమతి కాగా, ఇప్పుడు పశ్చిమ నుంచి వచ్చే ఆకుతో కలిపి రోజుకు ఒక లారీ ఎగుమతి జరుగుతోంది. బుట్టకట్టుబడి కళాత్మకం ఇతర రాష్ట్రాలకు తమలపాకు ఎగుమతి చేసేందుకు వెదురుబుట్టలలో వట్టిగడ్డి వేసి తడిపిన 150 తమలపాకును ఒక మోద (పంతం) చొప్పున కట్టుబడి కడతారు. ఇది ఎంతో కళాత్మకంగా ఉంటుంది. బుట్టకు వచ్చి 20 మోదలు (3వేల) ఆకులుంటాయి. అన్ సీజన్ కావడంతో బుట్ట ధర రూ.600 వరకు ఉంది. ఈ ఏడాది సీజన్లో రూ.1,200 వరకు పలికింది. స్థానికంగా ఎగుమతి చేసే తమలపాకును పెద్దబుట్టలో 100 మోదలు (15 వేల ఆకులు)లు ఉంచి ఎగుమతి చేస్తారు. కేరళకు కోనసీమ వక్క కోనసీమలో అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, కొత్తపేటతోపాటు ద్వారపూడి మండలాల్లో సుమారు 386 ఎకరాలలో పోక సాగు జరుగుతోంది. కొబ్బరి తోటల్లో గట్ల మీద విరివిరిగా కూడా సాగవుతోంది. దేశవాళీ రకం మల్నాడు (కర్ణాటక రకం), హైబ్రీడ్‌లో మంగళ, సుమంగళను సాగుచేస్తున్నారు. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సాకు పోక అధికంగా ఎగుమతి అవుతోంది. పోక విస్తృతంగా పండే కేరళలో దిగుబడి తగ్గడంతో ఇక్కడ నుంచి ఆ రాష్ట్రానికి ఎగుమతి అవుతుండడం విశేషం. ప్రస్తుతం దీని ధర కేజీ రూ.400 వరకు ఉంది. ఎర్రచెక్కలు (పూజా సుపారీ) తయారీ ప్రత్యేకం. పోక చెక్కలను మరిగేనీటిలో కవిరి, సున్నంతో కలిపి ఉడకబెడతారు. ఇలా చేయడం వల్ల పోక చెక్కలకు ఎరుపు రంగు వస్తోంది. ఎర్రచెక్కల కేజీ ధర రూ.450 నుంచి 500 వరకు ఉంటుంది. కిళ్లీలకు అధికం కోనసీమ నుంచి వెళుతున్న తమలపాకు, వక్కలను కిళ్లీల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. గోదావరి నీటి మాహత్మ్యమో ఏమో కాని కోనసీమలో పండే తమలపాకు రుచి బాగుంటుందని ఉత్తరాది వ్యాపారులు దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. వీటితో తయారు చేసే కిళ్లీలకు డిమాండ్ ఎక్కువ. ఉత్తర, దక్షణాదిలలో జరిగే శుభ కార్యక్రమాలలో సైతం వీటి వినియోగం ఎక్కువ. పంట తగ్గినా డిమాండ్ ఉంది మన ప్రాంతంలో పండే తమలపాకుకు మహారాష్ట్రలో మంచి డిమాండ్ ఉంది. అక్కడ నుంచే మిగిలిన రాష్ట్రాలకు వెళుతోంది. మన దగ్గర లేకపోతేనే మిగిలిన ప్రాంతాల్లో కొంటారు. ఇప్పుడు సీజన్ కాకపోవడం వల్ల ధర తగ్గింది. పెట్టుబడులు పెరగడం వల్ల తమలపాకు సాగు కష్టాలతో కూడుకున్నదిగా మారిపోయింది. – మయిగాపుల రాంబాబు, గోపాలపురం, రావులపాలెం మండలం స్థానికంగా కూడా డిమాండ్ తమలపాకుకు ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా స్థానికంగా కూడా డిమాండ్ ఉంది. ఇక్కడ వ్యాపారులకు పంపాల్సి వస్తే 100 మోదలు పంపుతాము. స్థానికంగా కూడా కిళ్లీలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యక్రమాలకు తమలపాకును అధికంగా వినియోగిస్తారు. – గోవిందరాజులు, గోపాలపురం, రావులపాలెం మండలం పూజా సుపారీ ప్రత్యేకం కాయల నుంచి పోక చెక్కలను తయారు చేయడం శ్రమతో కూడుకున్నదే. వక్కలను వేరు చేసి ఎండబెట్టడం, వచ్చిన దానిని గ్రేడ్ చేసి ప్యాకింగ్ చేయడం మేమే చేస్తాం. ఒక విధంగా ఇది శ్రమతో కూడుకున్నదే. పూజా సుపారీని మాత్రం ప్రత్యేకంగా తయారు చేస్తాం. అందుకే దీనికి ఎక్కువ ధర ఉంటుంది. – కడలి దుర్గాభవాని, తయారీదారు, బండారులంక, అమలాపురం మండలం -
కోనసీమలో క్రాప్ హాలీడేలేదన్న కలెక్టర్ హిమాంషు శుక్లా
-
Konaseema: కోనసీమలో సాగుకు శ్రీకారం
సాక్షి, అమలాపురం: నైరుతి రుతుపవనాల పలకరింపు పెద్దగా లేకున్నా గోదారి నీటి లభ్యతతో ఆయకట్టు రైతులు సాగుకు ఉరకలేస్తున్నారు. కోనసీమ జిల్లాలో ఇప్పటికే ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట వ్యవసాయ సబ్ డివిజన్లలో జోరుగా ఆకుమడులు పడగా, ఇప్పుడు అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం సబ్ డివిజన్ల పరిధిలో నారుమళ్లు వేస్తూ ముందస్తు సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. జిల్లాలో 1.79 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని అంచనా కాగా.. ఇప్పటివరకు పది వేల ఎకరాలకు సరిపడా నారుమళ్లు పడ్డాయి. వర్షాలు పడితే నెలాఖరు నాటికి ఇంకా ఎక్కువగా పడే అవకాశముందని జిల్లా వ్యవసాయ అధికారి వై. ఆనందకుమారి ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: కాలం దాచుకున్న కథ ఇది! వర్షాలు పడి భూమి చల్లబడితే రైతులు సాగుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వేస్తే మొలక దెబ్బతింటుందని రైతులు ఆలోచిస్తున్నారు. మరోవైపు.. తెలుగుదేశం పార్టీ మద్దతున్న కోనసీమ రైతు పరిరక్షణ సమితి నాయకులు చేస్తున్న సాగుసమ్మె ప్రకటనల నేపథ్యంలో సైతం అంబాజీపేట, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో అన్నదాతలు నారుమళ్లు పోస్తుండడం విశేషం. ముంపు కారణంగా ఈ ప్రాంతంలోనే రైతులు సాగుకు దూరమని టీడీపీ అనుకూల రైతు నాయకులు ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. అటువంటి చోట రైతులు నారుమళ్లకు సిద్ధంకావడం విశేషం. అంబాజీపేట మండలం గంగలకుర్రు, పుల్లేటికుర్రులలో గడిచిన రెండ్రోజుల్లో రైతులు పెద్దఎత్తున నారుమళ్లు పోశారు. అలాగే, అల్లవరం మండలం కోడూరుపాడు, బోడసకుర్రు, అల్లవరం, ఎంట్రికోన, మొగళ్లమూరు, తుమ్మలపల్లి గ్రామాల్లో రైతులు దమ్ము చేస్తున్నారు. ఉప్పలగుప్తం మండలం మునిపల్లిలో నారుమడిలో విత్తనాలు చల్లుతున్న రైతు కోనసీమలో పంట విరామంలేదు: కలెక్టర్ ఖరీఫ్ రైతులకు సాగునీటి సరఫరా, ఎరువులు, విత్తనాలు అందించడంలో అలసత్వం వహిస్తే ఊరుకునేదిలేదని, రైతుల నుంచి ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని కలెక్టర్ హిమాన్షు శుక్లా హెచ్చరించారు. జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టరేట్లో శుక్రవారం జరిగింది. వ్యవసాయ, సాగునీటిపారుదల శాఖలతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముందస్తు సాగుకు దన్నుగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సిద్ధంచేశామన్నారు. ఈ ఏడాది డ్రైనేజీ, హెడ్‌వర్క్స్ పరిధిలో 82 పనులకు రూ.8.82 కోట్ల నిధులు వచ్చాయని, గుర్రపుడెక్క, కాలువల్లో పూడికతీత పనులకు ఈ నిధులు వినియోగిస్తామన్నారు. అల్లవరం మండలం బోడసకుర్రులో దమ్ము చేస్తున్న రైతులు ఈ పనులను తక్షణం పూర్తిచేయాలని, పనుల ప్రగతిని ప్రతీరోజూ తనకు నివేదించాలని ఆదేశించారు. ఇక కోనసీమలో పంట విరామం అనేదిలేదని, సాగు పూర్తయ్యే వరకూ అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ.. ఇళ్ల నుంచి, పంచాయతీల్లో డ్రెయిన్ల నుంచి వచ్చిన మురుగునీరు కాలువల్లో కలుస్తోందని వివరించారు. పంట కాలువల్లో మురుగునీరు కలవడంవల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ ధ్యానచంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి వై. ఆనందకుమారి, జిల్లా ఇరిగేషన్ అధికారి రవిబాబు, మధ్య డెల్టా బోర్డు చైర్మన్ కుడుపూడి బాబు, వ్యవసాయ సలహా మండలి సభ్యుడు గుబ్బల రమేష్ పాల్గొన్నారు. -
సోము వీర్రాజుపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై కేసు నమోదైంది. బుధవారం ఉదయం రావుపాలెం జొన్నాడ వద్ద సోము వీర్రాజు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. విధుల్లో ఉన్న ఎస్ఐని వెనక్కి నెట్టి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు.. సోము వీర్రాజుపై ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, బుధవారం ఉదయం.. కోనసీమ జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని సోమువీర్రాజును పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన సోమువీర్రాజు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఎస్సైని తోసేసి బెదిరింపులకు దిగారు. నా కారు ఎవరు ఆపమన్నారు ?. నేను మీతో మాట్లడను ఎస్పీతోనే మాట్లడతా అంటూ రచ్చ చేశారు. తన కారు ఎదుట ఉన్న మరొక వాహనదారుడిపైనా బండి తీయాలంటూ సోమువీర్రాజు రుబాబు చేశారు. ఇది కూడా చదవండి: ప్రజలతో మమేకం అయితేనే ప్రజాస్పందన తెలిసేది.. బాబుకి అది తెలీదు -
నీట్ పీజీ ఫలితాలు.. కోనసీమ విద్యార్థినికి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్
అల్లవరం (కోనసీమ జిల్లా): పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశపరీక్షలో కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి బట్టుపాలెంకి చెందిన యాళ్ల హర్షిత జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. తాజాగా విడుదల చేసిన పీజీ నీట్ ఫలితాల్లో హర్షితకు 99.17 శాతం మార్కులు వచ్చాయి. భీమనపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన హర్షిత 9.3 గ్రేడ్ సాధించి విశాఖపట్నంలో ఇంటర్ బైపీసీ పూర్తి చేసింది. ఇంటర్‌లోనూ 9.3 గ్రేడ్ సాధించి ఎంసెట్‌లో 180వ ర్యాంక్ దక్కించుకుంది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అభ్యసించింది. ఎంబీబీఎస్‌లో ప్రథమ స్థానంలో నిలిచి ఆరు బంగారు పతకాలు సాధించింది. పోస్ట్రుగాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్)– చండీగఢ్ నిర్వహించిన ప్రవేశపరీక్షలోనూ జాతీయ స్థాయిలో 47వ ర్యాంకుతో సత్తా చాటింది. పీడియాట్రిక్స్‌లో పీజీ చేయడమే తన లక్ష్యమని హర్షిత తెలిపారు. తమ కుమార్తె నీట్ పీజీలో మంచి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు యాళ్ల శ్రీనివాసరావు, కాంతామణి ఆనందం వ్యక్తం చేశారు. కాగా హర్షిత తమ్ముడు శివ సుబ్రహ్మణ్యం శ్రీకాకుళంలోని జెమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించిన హర్షితకు పలువురు అభినందనలు తెలిపారు. -
అమలాపురం అల్లర్లు: మరో 20 మంది అరెస్ట్
సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంసానికి సంబంధించిన కేసుల్లో మరో 20 మంది నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం అరెస్ట్‌లు 91కి చేరుకున్నాయి. నిందితుల ఒప్పుకోలు, సహ నిందితుల వాంగ్మూలం, వీడియోలు, సిసి టివి పుటేజ్, టవర్ లొకేషన్, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. అమలాపురం ఘటనలకు సంబంధించి మొత్తం ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. చదవండి: (నాణ్యమైన వైద్యం జగనన్న లక్ష్యం: మంత్రి విడదల రజిని) -
అమలాపురం విధ్వంసకారుల అరెస్ట్
-
అమలాపురం విధ్వంసం కేసులో మరో 25 మంది అరెస్ట్
అమలాపురం టౌన్: అమలాపురంలో ఈ నెల 24న జరిగిన విధ్వంసకర ఘటనల్లో మరో 25 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ జి.పాలరాజు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసుల్లో 19 మంది అరెస్ట్ చేశామని, తాజా అరెస్టులతో ఆ సంఖ్య మొత్తం 44కు చేరిందని చెప్పారు. ఆదివారం మరికొందరిని అరెస్ట్ చేస్తామన్నారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో కోనసీమ, కాకినాడ జిల్లాల ఎస్పీలు కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఏఎస్పీలు లతామాధురి, చక్రవర్తితో కలసి డీఐజీ పాలరాజు శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. శనివారం అరెస్ట్ చేసిన నిందితుల్లో అమలాపురం పట్టణం, అంబాజీపేట, అల్లవరం, అయినవిల్లి మండలాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇళ్ల దహనం, బస్సులు, పోలీసు వజ్ర వాహనం ధ్వంసం కేసుల్లో వీరంతా నిందితులని పేర్కొన్నారు. 20 వాట్సాప్ గ్రూపుల స్క్రీన్ షాట్స్, గూగుల్ ట్రాక్స్, టవర్ లోకేషన్లు, సీసీ ఫుటేజీలు ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎలా బయలుదేరాలి వంటి సూచనలు వాట్సాప్ గ్రూపుల్లో వెళ్లాయని తెలిపారు. మరో వారంపాటు 144 సెక్షన్ కోనసీమలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధించిన సెక్షన్ 144ను మరో వారం రోజులపాటు పొడిగిస్తున్నట్లు డీఐజీ చెప్పారు. ఇంటర్నెట్ సేవల నిలిపివేత కూడా మరో 24 గంటలపాటు కొనసాగుతుందన్నారు. సోమవారం నుంచి ఇంటర్నెట్ను పునరుద్ధరించే అవకాశాలున్నాయని తెలిపారు. నష్టాలు నిందితుల నుంచే రికవరీ ఆందోళనకారులు ఆ రోజు ప్రభుత్వ,ప్రైవేటు ఆస్తులను ధ్వసం చేసి అపార నష్టాన్ని కలిగించారని డీఐజీ పాలరాజు తెలిపారు. వీరిపై ప్రివెన్షన్ ఆప్ డ్యామేజ్ పబ్లిక్ ప్రాపర్టీ (పీడీపీపీ) యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల నష్టాలను నిందితుల వ్యక్తిగత ఆస్తుల నుంచి రికవరీ చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, ఆర్ అండ్ బీ అధికారుల ద్వారా నిందితుల వ్యక్తిగత ఆస్తులను విలువ గట్టి వాటిని సీజ్ చేశామని చెప్పారు. ఆస్తులు ధ్వంసం చేసిన దృశ్యాలను, వాట్సాప్ గ్రూపుల్లో విధ్వంసానికి వ్యూహరచనతో మెసేజ్‌లను డీఐజీ పాలరాజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విలేకరులకు చూపించారు. -
కోనసీమ దుర్ఘటనలో జనసేన,టీడీపీ కుట్రలు బట్టబయలు
-
Amalapuram: జనసేన, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు.. కుట్ర బట్టబయలు
సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్: అమలాపురంలో అల్లర్లు, విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సాగిన విధ్వంసకాండ కుట్ర వెనుక సూత్రధారులు, దాడుల్లో పాత్రధారులను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే వీడియో క్లిప్పింగులు, సోషల్ మీడియా పోస్టులు, కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వీడియో క్లిప్పింగుల ఆధారంగా 70 మందికిపైగా నిందితులను గుర్తించారు. ఇందులో భాగంగా గురువారం ఒక్కరోజే 19 మందిని అరెస్టు చేశారు. మరో 46 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు.. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట రామారావు ఉన్నారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప అనుచరుడు వడగన నాగబాబుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ప్రత్యేక బృందాల ద్వారా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ విషయాన్ని డీఐజీ పాలరాజు మీడియాకు తెలిపారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో కోనసీమ, కాకినాడ జిల్లా ఎస్పీలు కెఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, ఎం.రవీంద్రనాథ్‌బాబు, కోనసీమ ఏఎస్పీ లత మాధురితో కలిసి పాలరాజు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న అమలాపురం పట్టణంలో పలు కూడళ్లలో ఉన్న సీసీ పుటేజ్‌లు, వాట్సాప్ గ్రూపులు, టీవీ చానల్స్‌లో ప్రసారమైన దృశ్యాలను ఆధారంగా చేసుకుని నిందితులను గుర్తించామన్నారు. అలాగే 12 వాట్సాప్ గ్రూపులను గుర్తించామని పేర్కొన్నారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఆందోళనకారులు పరస్పర సమాచారం చేర వేసుకుంటూ.. ఫలానా చోటకు రావాలని, ఫలానా చోట పోలీసుల బందోబస్తు అధికంగా ఉందని.. అడ్డదారుల్లో రావాలని ఆ దారులు తెలియజేస్తూ గ్రూపుల్లో సమాచారం పంపించారని తెలిపారు. ఈ 12 వాట్సాప్ గ్రూపుల్లో ఆ రోజు సాగిన పోస్టింగ్‌లు, మెసేజ్‌లు సేకరించామని చెప్పారు. వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లపైనా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పతో పళ్లంరాజు ఉద్దేశపూర్వకంగానే ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు.. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇళ్లపై ఆందోళనకారులు ఉద్దేశపూర్వకంగా దాడి చేసి నిప్పుపెట్టారని డీఐజీ పాలరాజు చెప్పారు. నిందితులపై హత్యాయత్నంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, పథకం ప్రకారం దాడులు, దొమ్మి తదితర కేసులు నమోదు చేశామన్నారు. పోలీసు బందోబస్తు పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ ఆందోళనకారులు దాడులకు తెగబడిన పరిస్థితులపై పోలీసుశాఖ పునః సమీక్షించుకుంటుందన్నారు. నల్లవంతెన వద్ద పోలీసుల వజ్ర వాహనాన్ని ధ్వంసం చేయడంతోపాటు కలెక్టరేట్ వద్ద, ఎర్ర వంతెన వద్ద బస్సులను తగలబెట్టడం, తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇళ్లకు నిప్పు పెట్టాలని పథక రచన చేసుకుని ఎర్రవంతెన వైపు నుంచి వెళ్లారన్నారు. ఈ కేసుల దర్యాప్తులో ఆరు పోలీసు బృందాలు ఉన్నాయని.. మరో ఆరు బృందాలు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించే పనిలో ఉన్నాయని చెప్పారు. ఈ విధ్వంస ఘటనల్లో పాల్గొన్నవారి పేర్లను గ్రామాలవారీగా సేకరించి జాబితాలను తయారుచేస్తున్నామన్నారు. దాడుల్లో రౌడీషీటర్ల పాత్ర ఉందన్నారు. శుక్రవారం మరో కొంత మందిని అరెస్టు చేస్తామని చెప్పారు. అరెస్టులు కొన్ని రోజులపాటు కొనసాగుతాయన్నారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అనుచరుడు, రౌడీషీటర్ గంధం పళ్లంరాజుతో నాగబాబు (గళ్ల చొక్కా వ్యక్తి), పళ్లంరాజు (తెల్ల చొక్కా వ్యక్తి) సోషల్ మీడియా పోస్టుల ద్వారానే కుట్ర అమలు కుట్రదారులు అమలాపురంలో విధ్వంసానికి పక్కాగా పన్నాగం పన్నారని పోలీసులు గుర్తించారు. ప్రధానంగా అల్లర్లకు ఆజ్యం పోయడానికి సోషల్ మీడియాను వాడుకున్నారు. ఈ నెల 19 నుంచి వర్గ విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులను తమ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేసినట్టు గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా పరస్పరం దూషణలకు పాల్పడ్డారు. విద్వేషాలు రేకెత్తించేలా వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడాన్ని ట్రెండ్‌గా మార్చారు. దాంతో సహజంగానే కోనసీమలో ఇరువర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు, వాహనాల దహనాలు, పరస్పరం దూషణల పర్వం కొనసాగింది. వీటిని అవకాశంగా చేసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కొందరు నేతలు రంగంలోకి దిగారు. ఈ నెల 24న ర్యాలీ సందర్భంగా విధ్వంసానికి పాల్పడేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ర్యాలీలో వేలాదిమంది పాల్గొన్నప్పటికీ విధ్వంసం కుట్రను ఎంపిక చేసిన కొంతమందికే ముందుగా చెప్పారు. ర్యాలీ రూట్‌మ్యాప్, ఎక్కడ దారి మళ్లించాలి, పోలీసులపై రాళ్లు రువ్వడం, మంత్రి విశ్వరూప్ రెండు ఇళ్లు, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై దాడులు.. ఇలా అన్నీ పక్కాగా సోషల్ మీడియా పోస్టుల ద్వారానే కథ నడిపించినట్టు పోలీసులు గుర్తించారు. పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో అన్యం సాయి వాటి ఆధారంగానే దర్యాప్తు ముమ్మరం.. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగానే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విధ్వంసానికి కుట్ర పన్నిన సూత్రధారులు, అల్లర్లలో పాల్గొన్నవారి సోషల్ మీడియా పోస్టులను పోలీసులు పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 46 మందితో పాటు అరెస్టు చేసిన 19 మందినీ వారి సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా విచారిస్తున్నారు. ఆ పోస్టులు మొదటగా ఎక్కడ నుంచి వచ్చాయన్న అంశాన్ని ఆరా తీస్తున్నారు. వారి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. ఇక సూత్రధారుల అరెస్టులే.. సేకరించిన కీలక ఆధారాలతో అమలాపురంలో విధ్వంస కాండ వెనుక అసలు కుట్రదారులు ఎవర్నది గుర్తించే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడంతోపాటు ఈ కుట్ర వెనుక అసలు సూత్రధారుల పాత్రను తగిన ఆధారాలతోసహా నిరూపించే దిశగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విధ్వంసం వెనుక అసలు పాత్రధారులు, కుట్రదారులను ఒకట్రెండు రోజుల్లో అరెస్టు చేసే అవకాశాలున్నాయి. సంచలన విషయాలు వెల్లడించే రీతిలో అరెస్టులు ఉండొచ్చని విశ్వసనీయ సమాచారం. ప్రశాంతంగా కోనసీమ.. అమలాపురంలో పోలీసుల చర్యలతో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వ్యాపార దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తున్నాయి. ఆర్టీసీ కూడా పూర్తి స్థాయిలో సర్వీసులు నడుపుతోంది. దాదాపు వెయ్యి మంది పోలీసులతో అత్యంత పకడ్బందీగా బందోబస్తు కొనసాగుతోంది. ప్రజాభీష్టం మేరకే అంబేడ్కర్ జిల్లా శ్రీకాకుళం రూరల్: ప్రజాభీష్టం మేరకే కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టామని హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. కోనసీమ ప్రస్తుతం ప్రశాంతంగానే ఉందని.. 2 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కోనసీమ అల్లర్ల వెనుక ఎవరున్నారో పోలీసులు కూపీ లాగుతున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు దండ వేస్తున్న అరిగల వెంకట రామారావు(ఎడమవైపు), మోకా సుబ్బారావు(కుడివైపు) పోలీసులు అరెస్ట్ చేసిన 19 మంది వీరే.. గురువారం పోలీసులు అరెస్టు చేసిన 19 మంది నిందితుల్లో 18 మంది జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందినవారే. టీడీపీ కార్యకర్తలు.. దున్నల తాతాజీ ధనుంజయ దిలీప్, అల్లబిల్లి సూర్యనారాయణమూర్తి, జనసేన పార్టీ కార్యకర్తలు.. అన్యం దుర్గా సాయికుమార్, కల్వకొలను సత్యనారాయణమూర్తి, కురసాల సురేష్ నాయుడు, నార్కెడిమిల్లి కృష్ణకిశోర్, అడ్డాల నాగ శ్రీరంగ గణేష్, చిట్టూరి ప్రసాద్, విత్తనాల శివనాగ మణికంఠ, ఎర్రంశెట్టి బాలాజీ, నల్లా సురేష్, విత్తనాల ప్రభాకర్, పలివెల శేఖర్, నేదునూరి వెంకటేష్, నడవపల్లి భవానీ శివశంకర్, కంచిపల్లి వెంకటేశ్వరరావు, బీజేపీ కార్యకర్తలు..సత్తిరెడ్డి సతీష్, ఎర్రంశెట్టి సాయిబాబులతోపాటు ఏ పార్టీకి చెందని వాసంశెట్టి రాము ఉన్నారు. వీరిలో 12 మంది అమలాపురం పట్టణానికి చెందినవారు కాగా అమలాపురం రూరల్ మండలానికి చెందినవారు ముగ్గురు, పి.గన్నవరానికి చెందినవారు ఇద్దరున్నారు. అల్లవరం, అయినవిల్లిలకు చెందినవారు చెరొకరు ఉన్నారు. -
మా మంత్రి, ఎమ్మెల్యే మీద మేమే దాడి చేయించుకుంటామా?: సజ్జల
-
కోనసీమ అల్లర్లు.. అన్యం సాయి జనసేనకు చెందిన వ్యక్తే: సజ్జల
సాక్షి, అమరావతి: కోనసీమ అల్లర్ల వెనుకున్న కుట్రకోణం స్పష్టంగా అర్థమవుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కొందరి ప్రవర్తనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. అమలాపురం దాడులపై ప్రతిపక్షాల స్పందన చూస్తుంటే.. వాళ్లే కథంతా నడిపించారనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు. అల్లర్ల కేసులో నిందితులపై కఠిన చర్యలుంటాయన్నారు. ‘దాడులకు కారణం వైఎస్సార్సీసీనేని టీడీపీ, జనసేన ఆరోపణలు చేస్తున్నాయి. టీడీపీ, జనసేనవి దుర్మార్గపు రాజకీయ ఆలోచనలు. మా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై మేమే దాడులు చేయించుకుంటామా? అన్యం సాయి జనసేనకు చెందిన వ్యక్తే. జనసేన కార్యక్రమాల్లో అన్యంసాయి పాల్గొన్న ఫోటోలు వచ్చాయి. విపక్షాల అరోపణలకు ఏమైనా అర్థం ఉందా.ఇలాంటి అడ్డగోలు ఆరోపణలు వారి విచక్షణకే వదిలేస్తున్నాం. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదివారు. చదవండి: కోనసీమ అల్లర్లు.. చంద్రబాబు స్క్రిప్టు పవన్ చదువుతున్నాడు: మంత్రి రోజా అంబేద్కర్ పేరు విషయంలో టీడీపీ, జనసేన వైఖరి చెప్పాలి. అడ్డ దారుల్లో ప్రయోజనం పొందాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. ఏం చెప్పాలనుకున్నారో పవన్‌కే తెలియడం లేదు. అల్లర్ల విషయం వదిలేసి ఏవేవో మాట్లాడుతున్నారు. టీడీపీ హయాంలో అత్యాచార ఘటనపై పవన్‌కు వివరాలు అందిస్తాం. కులం, మతాలను అడ్డుపెట్టుకొని మేం అధికారంలోకి రాలేదు. సీఎం జగన్ కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు’ అని సజ్జల అన్నారు. చదవండి: అమలాపురం అల్లర్ల ఘటన: ‘ఆ రెండు పార్టీలు ఎందుకు ఖండిచడం లేదు’ -
అమలాపురం అల్లర్ల ఘటన: పోలీసుల అదుపులో అనుమానితుడు అన్యం సాయి
-
పోలీసుల అదుపులో కోనసీమ అల్లర్ల కేసు అనుమానితుడు?
సాక్షి,అమలాపురం: అమలాపురం అల్లర్ల కేసులో అనుమానితుడు అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20న కలెక్టరేట్ వద్ద.. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టొంద్దంటూ అన్యం సాయి ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్ చల్ చేశాడు. జనసేన కార్యక్రమాల్లో అనుమానితుడు సాయి చురుగ్గా పాల్గొన్నట్టు తెలుస్తోంది. పవన్, నాగబాబు, జనసేన నాయకులతో అతను దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోనసీమ అల్లర్ల కేసులో సాయి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతనిపై గతంలో రౌడీషీట్ నమోదై ఉందని పోలీసులు తెలిపారు. (చదవండి: అమలాపురం ఘటన వెనుక కుట్ర.. వదిలేదే లేదు: మంత్రి బొత్స) -
అమలాపురం అల్లర్లపై స్పీకర్ సీరియస్.. అప్పుడుంటది బాదుడే బాదుడు!
సాక్షి, శ్రీకాకుళం: కోనసీమ దుర్ఘటన బాధాకరమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం విచారం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం నూటికి కోటి శాతం కరెక్టేనన్నారు. జిల్లాలకు మహానీయుల పేర్లు పెడితే తప్పేంటి అని ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగం అనుభవిస్తూ ఆయన పేరును వ్యతికేరిస్తారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు జిల్లాలో విలేకరుల సమావేశంలో స్పీకర్ బుధవారం మాట్లాడారు. కులాలు, మతాలు, జాతుల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని మండిపడ్డారు. ‘అమలాపురం అల్లర్ల వెనుక ఎవురున్నారో త్వరలో తెలుస్తుంది. కుట్రవెనుక దాగి ఉన్న నిందితులను గుర్తించాకా.. అప్పుడుంటది బాదుడే బాదుడు. శ్రీకాకుళం జిల్లాకు అంబేద్కర్ 2 జిల్లాగా పేరు పెట్టమనండి, ఏ రాజకీయ పార్టీ అడ్డుకుంటుందో చూస్తా. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే సామాజిక న్యాయం జరిగింది’ అని స్పీకర్ పేర్కొన్నారు. చదవండి: అమలాపురం ఘటన వెనుక కుట్ర ఉంది: మంత్రి బొత్స -
ప్రజా ప్రతినిధుల ఇళ్లను తగలబెట్టడం హేయమైన చర్య
-
అమలాపురానికి అదనపు బలగాలు
-
పక్కా స్కెచ్ తోనే మంత్రి ఇంటి పై దాడి..?
-
అమలాపురంలో విధ్వంసం
-
కొనసీమ నిరసనలు.. విధ్వంసానికి పాల్పడితే ఊరుకునేది లేదు: డీజీపీ
-
కోనసీమలో పరిస్థితి అదుపులోనే ఉంది: ఏపీ డీజీపీ
సాక్షి, విజయవాడ: కోనసీమ ఉద్రిక్తతలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. కోనసీమలో పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. కొందరు ఆందోళన పేరుతో యువకులు విధ్వంసానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అయితే పోలీసులు ఎంతో సంయమనం పాటించారని తెలిపారు. విధిలేని పరిస్థితుల్లోనే గాల్లోకి కాల్పులు జరిపినట్లు చెప్పారు. విశాఖపట్నం, కృష్ణాజిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను మోహరించామని, విధ్వంసం వెనుక ఎవరున్నారో విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. కలెక్టరేట్ దగ్గరకు వచ్చిన ఆందోళనకారులతో మాట్లాడామని, వారి అభ్యర్దన మేరకు 12 మందిని కలెక్టర్‌ను కలవటానికి అవకాశం కల్పించామని డీజీపీ తెలిపారు. ఆ తర్వాత కొందరు పక్కకు వెళ్లి అల్లర్లకు పాల్పడినట్లు చెప్పారు. ఇద్దరు వీఐపీల ఇళ్లు తగులబెట్టారని, వాహనాలకు నిప్పు పెట్డారని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వంతో చర్చించాలి కానీ విధ్వంసం చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. ప్రస్తుతం అల్లర్లు సద్దుమనిగాయని, ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. చదవండి: కోనసీమ ఆందోళనల్లో జనసేన, టీడీపీ హస్తం: హోంమంత్రి సీరియస్ -
పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దు: పిల్లి సుభాష్‌చంద్రబోస్
న్యూఢిల్లీ: ప్రజల విజ్ఞప్తి మేరకే కోనసీమకు డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టారని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని సంఘవిద్రోహ శక్తులు అశాంతిని రేకేత్తించాయి. ఈ ఘటనలతో నేను సిగ్గుపడుతున్నా. చంద్రబాబు సైతం అంబేడ్కర్ జిల్లా పేరు పెడతా అని చెప్పారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మీడియా ముందుకు రావాలి. వెనక ఉండి రెచ్చగొట్టడం మానుకోవాలి. బయట ఒక మాట లోపల ఒక మాట చెప్పకూడదు. పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దు. అంబేడ్కర్ పేరు పెట్టుకోవడం మన అదృష్టం. ఉద్యమకారులు సంయమనం పాటించండి. అంబేడ్కర్ వల్లనే మన దేశంలో ప్రజాస్వామ్యం వర్దిల్లుతోంది. మనతో పాటు స్వాతంత్ర్యం వచ్చిన పాకిస్తాన్లో రాజ్యాంగం ఫెయిల్ అయిందని ఎంపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. చదవండి 👇 ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. స్పందించిన మంత్రి విశ్వరూప్ అమలాపురానికి అదనపు బలగాలు కోనసీమ: అమలాపురంలో విధ్వంసం కొనసాగుతోంది. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అమలాపురం చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాజమండ్రి, కాకినాడ, కృష్ణా జిల్లాల నుంచి అదనపు బలగాలు తరలిస్తున్నారు. ఇంకా రోడ్లపై వేలాదిమంది ఆందోళనకారులు ఉన్నారు. ఆందోళన విరమించి వెళ్లి పోవాలని నిరసనకారులను పోలీసులు కోరుతున్నారు. చదవండి 👇 (Konaseema: కోనసీమ ఉద్రిక్తతలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి) -
Konaseema: కోనసీమ ఉద్రిక్తతలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి
-
Konaseema: కోనసీమ ఉద్రిక్తతలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, తాడేపల్లి: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. కోనసీమ ఉద్రిక్తతలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల విభజన సందర్భంగా ఆ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని వినతులు వచ్చాయి. విస్తృతంగా డిమాండ్ ఉండటంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు వెనుక ఏ శక్తులు ఉన్నాయో కానీ గతంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. అంబేడ్కర్ ఒక జాతీయ మహా నేత, భరత మాత ముద్దుబిడ్డ. దానికి దురుద్దేశాలు ప్రేరేపించే శక్తులు కూడా ఉండొచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 'రెచ్చగొట్టడం ఎవరూ చేసినా తప్పే.. మా పార్టీకి వచ్చే ప్రయోజనం ఇందులో ఏమీ లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం చేసింది అయితే కాదు. ఒక మహానేత పేరు పెడితే పునరాలోచించాలిల్సిన అవసరం ఏముంది. అంతటి నాయకుడు పేరును పెట్టడం అందరూ ఓన్ చేసుకోవాలి. ముందు అందరూ సంయమనం పాటించాలి.. అన్ని వర్గాలతో చర్చలు జరుపుతాము. ఆ పేరు పెట్టడంపై అన్ని వర్గాల ఆమోదం ఉంది కాబట్టి పరిష్కరించలేని సమస్య అయితే కాదని' సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి 👇 (ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. స్పందించిన మంత్రి విశ్వరూప్) (Konaseema: మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు) -
ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. స్పందించిన మంత్రి విశ్వరూప్
సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు. దీనిపై మంత్రి విశ్వరూప్ స్పందిస్తూ.. 'నా ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరం. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ డిమాండ్ చేశాయి. అంబేడ్కర్ పేరు పెట్టాలని జనసేన నిరసనలు కూడా చేసింది. అయితే ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లను సృష్టిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు చేస్తున్న కుట్రలివి. జిల్లాకు అంబేడ్కర్ పేరును వ్యతిరేకించడం సరికాదు. ఆయన పేరు పెట్టడంపై అందరూ గర్వపడాలి. ప్రస్తుత సమయంలో అందరూ సంయమనం పాటించాలి' అని మంత్రి విశ్వరూప్ కోరారు. చదవండి: (Konaseema: మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు) -
Konaseema: మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనం రాళ్లదాడి చేశారు. ఈ దాడుల్లో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. 2 ప్రైవేట్ కాలేజ్ బస్సులు దగ్ధం చేశారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇల్లు దగ్ధం అమలాపురంలో విధ్వంసం కొనసాగుతోంది. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిని ఆందోళనకారులు దగ్ధం చేశారు. చదవండి: (MLC Ananta Babu Case: చట్టం ముందు ఎవరైనా ఒక్కటే: సజ్జల) -
ఆహా ఏమి రుచి.. ఆత్రేయపురం మామిడి తాండ్ర..
ఆత్రేయపురం(కోనసీమ జిల్లా): రుచికి.. శుచికి.. తియ్యని మామిడి తాండ్రకు కేరాఫ్ అడ్రస్‌గా ఆత్రేయపురం పేరు గాంచింది. చుట్టూ పచ్చని పొలాలు.. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ గ్రామం తాండ్ర తయారీలో ప్రసిద్ధి పొందింది. అనేక మంది ప్రజలు దీనినే వృత్తిగా మార్చుకుని జీవనోపాధి పొందుతున్నారు. తియ్యని లాభాలు ఆర్జిస్తున్నారు. ఏటా వేసవి వచ్చిందంటే తాండ్ర తయారీలో ప్రజలు నిమగ్నమవుతుంటారు. సుమారు 500 కుటుంబాల వారు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తాటి చాపలపై మామిడి తాండ్ర పూస్తుంటారు. ఈ మూడు నెలలూ అనేక మందికి జీవనోపాధి కలి్పస్తుంటారు. ఇప్పుడు తయారు చేసిన తాండ్రను నిల్వ ఉంచి, ఏడాది పొడవునా విక్రయిస్తూంటారు. 60 టన్నులు.. రూ.66 లక్షలు ప్రస్తుత సీజన్లో ఆత్రేయపురం కేంద్రంగా సుమారు రూ.66 లక్షల విలువైన 60 టన్నుల మామిడి తాండ్ర తయారవుతోంది. దీని తయారీకి అవసరమైన మామిడి కాయలను నూజివీడు, సత్తుపల్లి, కోరుకొండ, గోకవరం, తుని, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రధానంగా కలెక్టర్ రకం మామిడినే తాండ్ర తయారీకి వాడుతుంటారు. ఆత్రేయపురానికి రోజూ రెండు లారీల చొప్పున మామిడి కాయలు తీసుకొస్తుంటారు. దిగుమతి చేసుకున్న మామిడి కాయలను కావు వేసి పండ్లుగా తయారు చేస్తారు. గుజ్జు తీసి.. చక్కెర వేసి.. పండిన మామిడి నుంచి గుజ్జు తీస్తారు. ఆ గుజ్జులో తగు పాళ్లలో పంచదార కలుపుతారు. తర్వాత ఎండలో ఉంచిన తాటి చాపలపై కూలీల సాయంతో ఒక్కో పొరను పూస్తారు. ఇలా రోజుకు ఒక్కో పొర చొప్పున ఐదారు పొరలు పూసిన అనంతరం మామిడి తాండ్ర తయారవుతుంది. మామిడి తాండ్ర పూసిన తాటి చాపలు వారం రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. దీనివల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అనంతరం ఆరంగుళాల పొడవు, వెడల్పు ఉండేలా ముక్కలు కోసి తిరిగి ఎండబెట్టి విక్రయాలకు సిద్ధం చేస్తారు. ప్రస్తుతం ఉన్న మామిడి ధరలతో తాండ్ర తయారీ తలకు మించిన భారంగా మారిందని తయారీదారులు వాపోతున్నారు. పెరిగిన ధరలతో గుబులు ప్రస్తుతం మామిడి దిగుబడి అంతంత మాత్రంగానే ఉండటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. టన్ను మామిడి కాయల ధర రూ.18 వేలు, పంచదార క్వింటాల్ రూ.3,800 పలుకుతుండటంతో రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని వ్యాపారులు అంటున్నారు. దీంతో సామాన్యులు మామిడి తాండ్ర తయారీకి ముందుకు వెళ్లే పరిస్థితులు లేవని తయారీదారుడు కఠారి సురేష్ ‘సాక్షి’కి తెలిపారు. టన్ను మామిడి కాయలతో 250 కిలోల తాండ్ర తయారవుతుండగా.. ప్రస్తుత ధరల ప్రకారం, కూలీల ఖర్చులతో కలసి సుమారు రూ.25 వేల వరకూ అవుతోంది. ఈ పరిస్థితుల్లో కిలో తాండ్రను రూ.150 నుంచి రూ.200 వరకూ అమ్మితేనే గిట్టుబాటు అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి విదేశాలకూ.. ఆత్రేయపురంలో తయారైన మామిడి తాండ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఇలా గ్రామానికి అంతర్జాతీయంగా పేరు తెస్తున్నారు. శ్రమనే దైవంగా నమ్ముకుని ఆత్రేయపురం పరిసర ప్రాంతాల ప్రజలు మామిడి తాండ్ర తయారీలో నిమగ్నమవుతున్నారు. లాభాలు ఆర్జించడంతో పాటు గ్రామానికి గుర్తింపు తీసుకురావడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది తక్కువ రేటు మామిడి తాండ్ర పుట్టిన ప్రాంతంగా ఆత్రేయపురం ఖ్యాతికెక్కింది. వేసవిలో టన్నుల కొద్దీ మామిడి కాయలను కొనుగోలు చేసి, తాండ్ర తయారు చేస్తారు. దీనిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ ఏడాది మామిడికాయలు తక్కువ రావడంతో రేటు కూడా ఎక్కువగా ఉంది. తాండ్ర తయారు చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కకపోవచ్చు. – కఠారి సురేష్, ఆత్రేయపురం ప్రభుత్వం చేయూతనివ్వాలి ఈ ప్రాంతంలో ఎందరో మహిళలు ఉపాధి పొందుతున్న మామిడి తాండ్ర తయారీకి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలి. అలాగే ఈ ప్రాంతంలో స్టాల్స్ నిర్మించుకోవడానికి, నాణ్యమైన సరుకులు కొనుగోలు చేయడానికి సాయం అందించాలి. -చిలువూరి చిన వెంకట్రాజు, ఆత్రేయపురం -
జలజలా.. గోదాహరి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఏటా లక్షలాది ఎకరాల్లో రెండు పంటలకు నీరందిస్తూ.. అన్నదాతలకు తోడుగా నిలుస్తోంది గోదారమ్మ. ధవళేశ్వరం బ్యారేజీ దిగువన తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల్లో ఖరీఫ్, రబీ పంటలకు గోదావరి జలాలు పుష్కలంగా అందుతున్నాయి. ఈ మూడు డెల్టాల్లో ఒక్క రబీలోనే 8,96,533 ఎకరాల్లో గోదావరి జలాలు గలగలా పారుతూ పసిడి పంటలు పండిస్తున్నాయి. రబీలో మూడు డెల్టాలకు ఈ నదీమతల్లి 101.739 టీఎంసీల నీరు అందిస్తోంది. తద్వారా లక్షల టన్నుల వరి సిరులు కురిపిస్తూ కోట్ల మంది ఆకలిని తీరుస్తోంది. అంతేకాదు.. అటు లక్షలాది మంది దాహార్తినీ తీరుస్తోంది. ముఖ్యంగా వేసవిలో అవిభక్త ఉభయ గోదావరి జిల్లాల్లో తాగునీటికి గోదావరే శరణ్యం. ఎండల తీవ్రత పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని స్థానిక సంస్థల యంత్రాంగాలు గోదావరి జలాలను ఒడిసి పట్టే పనిలో బిజీగా ఉన్నాయి. ఇతర సీజన్లలో కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తాగునీటికి గోదావరి జలాలే ప్రధాన ఆధారం. వేసవి అవసరాలకు సరఫరా రబీ సీజన్ ముగియడంతో ఈ నెల 15 నుంచి పంట కాలువలకు నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ నెల 16 నుంచి నెలాఖరు వరకూ తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు తాగునీటి నిల్వల కోసం సరఫరా చేస్తున్నారు. వేసవి అంతటికీ సరిపోయేలా తాగునీటి చెరువులు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను గోదావరి జలాలతో నింపుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, మండపేట, రామచంద్రపురం, అమలాపురం వంటి పట్టణాల్లో వేసవి తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ నీరే ఆధారం. కాకినాడ సిటీ, పెద్దాపురం నియోజకవర్గాల ప్రజల తాగునీటి అవసరాల కోసం సామర్లకోట సాంబమూర్తి రిజర్వాయర్‌లో గోదావరి జలాలను నిల్వ చేస్తున్నారు. కాకినాడ నగరంలో అధిక జనాభాను దృష్టిలో ఉంచుకొని అదనంగా అరట్లకట్ట రిజర్వాయర్ కూడా ఏర్పాటు చేశారు. సామర్లకోటకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాగార్జున ఫిల్టర్‌బెడ్‌లో కూడా గోదావరి జలాలు నిల్వ చేస్తున్నారు. పిఠాపురం పట్టణ ప్రజల కోసం చిత్రాడ మంచినీటి చెరువునే వేసవి రిజర్వాయర్‌గా మలచి గోదావరి జలాలతో నింపుతున్నారు. చివరకు కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి పరిధిలోని యానాం పట్టణ ప్రజలకు కూడా గోదావరి జలాలే ఆధారం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానవతా దృక్పథంతో స్పందించడంతో యానాం ప్రజలకు గోదావరి జలాలు అందుతున్నాయి. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందు జాగ్రత్తగా గోదావరి జలాలు నిల్వ చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 42.54 లక్షల గ్రామీణ జనాభా తాగునీటి అవసరాలకు గోదావరి జలాలనే వినియోగిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా రోజుకు 80 మిలియన్ లీటర్ల గోదావరి జలాలను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 1,600 ఓవర్‌హెడ్ ట్యాంకులను గోదావరి నీటితో నింపుతున్నారు. అలాగే 66 మంచినీటి చెరువుల్లో 0.27 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొన్న టిప్పర్.. నలుగురు దుర్మరణం
యానాం/ఐ.పోలవరం: పూర్వపు తూర్పు గోదావరి జిల్లా.. ప్రస్తుత కోనసీమ జిల్లాలోని 216 జాతీయ రహదారిలో ఎదుర్లంక–యానాం బాలయోగి వారధిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నలుగురు ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను టిప్పర్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన మరొకరు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందారు. ఐ.పోలవరం పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన దంపతులు గుబ్బల సుబ్రమణ్యం (49), గుబ్బల మంగాదేవి (44).. మనమడు యశ్వంత్ శివకార్తీక్ (3), మనవరాలు తేజశ్రీలక్ష్మి (6)తో కలిసి మోటార్‌సైకిల్‌పై రామచంద్రపురం సమీపంలోని ద్రాక్షారామ నుంచి స్వగ్రామానికి వస్తున్నారు. అదే సమయంలో.. బాలయోగి వారధిపై అమలాపురం వైపు నుంచి ఎదురుగా వస్తున్న టిప్పర్ ఆటోను తప్పించబోయి వీరి బైక్‌ను బలంగా ఢీకొంది. దీంతో సుబ్రమణ్యం, మంగాదేవి, అనసూరి జశ్వంత్ శివకార్తీక్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన శ్రీలక్ష్మిని స్థానికులు హుటాహుటిన అమలాపురం ఆసుపత్రికి, అక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతిచెందింది. కుమార్తె ఇంటికి వెళ్లొస్తూ.. సుబ్రమణ్యం, మంగాదేవి దంపతులు శనివారం ద్రాక్షారామలోని చిన్న కుమార్తె అనసూరి వెంకటేశ్వరి ఇంటికి వెళ్లారు. ఆమె పిల్లలు శివకార్తీక్, తేజశ్రీలక్ష్మీలను తీసుకుని ఆదివారం సాయంత్రం బయలుదేరి ఈ ప్రమాదానికి గురయ్యారు. సుబ్రమణ్యం రొయ్యల చెరువుల వద్ద కూలిగా పనిచేస్తున్నాడు. ఈ ప్రమాదంతో అమలాపురం–కాకినాడ మధ్య సుమారు 3 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి కారకుడైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా: పినిపే విశ్వరూప్
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో మళ్లీ చోటు దక్కడంతో ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ తన రాజకీయ ప్రయాణంలో నాలుగోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సచివాలయంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సాయంత్రానికి అమలాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్‌తో ‘సాక్షి’ ముచ్చటించింది. ప్రశ్న: ఆర్టీసీ నష్టాల్లో ఉంది. డీజిల్ ధర పెరిగి సంస్థకు భారమవుతున్న తరుణంలో మీ ప్రణాళికలు ఏంటి? మంత్రి: డీజిల్ ధరల పెరుగుదలే ఆర్టీసీకి పెనుభారం. ఉన్నతాధికారులతో సమీక్షించి సంస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తా. ప్రశ్న: ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి సంస్థకు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. తదుపరి మీ చర్యలు ఎలా ఉంటాయి? జవాబు: ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం చరిత్రాత్మకం. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆర్టీసీని మరింత సంరక్షిస్తాను. ప్రశ్న: శాఖాపరంగా కొత్త నిర్ణయాలుంటాయా? జవాబు: వాహన కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి పెడతాం. దశల వారీగా విద్యుత్ బస్సులను ప్రవేశపెడతాం. టీటీడీ బస్సుల నుంచే ఈ విధానానికి శ్రీకారం చుడతాం. కొండ పైన, కిందన 50 చొప్పున వంద బస్సులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. మే 15వ తేదీ నుంచి స్వామివారి సన్నిధి నుంచే తొలి బస్సును సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ప్రశ్న: విద్యుత్ బస్సుల ప్రయోగాన్ని ఎలా కొనసాగిస్తారు? జవాబు: తిరుపతిలో విజయవంతమైతే వాహన కాలుష్య నివారణే లక్ష్యంగా రాష్ట్రంలో దశల వారీగా ఎంపిక చేసిన నగరాల్లో, ఆ తర్వాత పట్టణాల్లో ఈ బస్సులను ప్రారంభిస్తాం. ప్రశ్న: రవాణా రంగంలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలేమిటి? జవాబు: ఆర్టీఏ లేదా అధికారిక కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ– బ్రేక్ ఇన్స్పెక్టర్లు) పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. త్వరలోనే 90 పోస్టులను భర్తీ చేస్తాం. ప్రశ్న: ప్రైవేటు రంగ రవాణా, హైటెక్ బస్సులకు అనుమతులు తదితర విషయాల్లో అక్రమాల నివారణకు చర్యలేమిటి? జవాబు: ప్రైవేటు ట్రాన్స్‌పోర్టుపై తొలుత ప్రత్యేక దృష్టి పెడతాను. బస్సులకు నిర్ణీత కాలంలో అనుమతులు (పర్మిట్లు) తీసుకోకుండా ఒకే నంబరుతో నాలుగైదు రిజిస్ట్రేషన్లు చేయించి, హైటెక్ బస్సులను అక్రమంగా నడపడానికి అడ్డుకట్ట వేస్తాను. ప్రశ్న: ఆటో, చిన్న రవాణా వాహనాలతో జీవనోపాధి పొందే చిన్న కుటుంబాల వారి విషయంలో? జవాబు: ప్యాసింజర్ ఆటోలు, గూడ్స్ ఆటోల వంటి వాహనాలు రవాణా రంగంపై ఆధారపడి వేలాది వాహనదారులు, కారి్మకులు జీవనోపాధి పొందుతున్నారు. వీరికి పోలీసులు లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వేధింపులు లేకుండా సాధ్యమైనంత వరకూ మానవతా దృక్పథంతో చూసేలా అధికారులతో సమీక్షించి ఆదేశాలిస్తాను. ప్రశ్న: వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో రెండోసారి మంత్రి అయ్యారు. మీ స్పందన? జవాబు: చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ నాపై ఉంచిన బాధ్యతలను అప్పుడు ప్రతిపక్షంలో.. ఇప్పుడు ప్రభుత్వంలో నెరవేర్చాను. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూనే విధేయుడిగా ఉంటాను. -
ఉద్యోగమిచ్చి.. ఉచ్చులోకి దించి
అమలాపురం టౌన్: ఉద్యోగమంటూ ఎర వేశారు.. వ్యూహాత్మకంగా వలలోకి దించారు.. ది జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ మల్టీ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ బోర్డు తిప్పేసిన సంఘటనలో విశ్రాంత ఉద్యోగులే చాలామంది మోసపోయారు. ఈ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా 29 బ్రాంచ్‌లు ఉన్నాయి. ‘జయలక్ష్మి’ యాజమాన్యం తమ సంస్థలో డిపాజిట్ల సేకరణకు ఆది నుంచి ముందు చూపుతో వ్యవహరించింది. ముందుగా పలు వాణిజ్య బ్యాంకుల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అధికారుల వివరాలు సేకరించింది. తమ సొసైటీ బ్రాంచుల్లో వివిధ ఉద్యోగాలను ఎరగా చూపి వారికి కీలక పోస్టులను అప్పగించింది. మేనేజర్ స్థాయి కూర్చీల్లో కూర్చోబెట్టి గతంలో వారు పనిచేసిన బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేసిన వ్యక్తులను పాత పరిచయాలతో తమ సొసైటీ వైపు ఆకర్షించేలా చేసుకుంది. అవిభక్త జిల్లా నుంచి ఇతర బ్యాంక్‌లు, డీసీసీబీల బ్రాంచ్‌ల్లో దాదాపు 45 మంది విశ్రాంత అధికారులకు ‘జయలక్ష్మి’ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చింది. వాణిజ్య బ్యాంక్‌లు, డీసీసీబీ తదితర బ్యాంక్‌లు వడ్డీ 5 నుంచి 6 శాతం ఇస్తుంటే.. తమ జయలక్ష్మి సొసైటీలో 10 శాతానికి మించి అధిక వడ్డీ ఇస్తున్నామని చెప్పి ఆకర్షించింది. ఉద్యోగుల విశ్వాసంతో వల డీసీసీబీ బ్రాంచ్‌ల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కొందరు మేనేజర్లకు ‘జయలక్ష్మి’ బ్రాంచీల్లో ఉద్యోగాలు ఇచ్చి వారికి ఆకర్షణీయమైన జీతాలతో మేనేజర్లుగా కూర్చోబెట్టింది. ఉదాహరణకు కోనసీమ జిల్లాలో ఉన్న ఏడు జయలక్ష్మి బ్రాంచ్‌ల్లో ఐదుగురు మేనేజర్లు విశ్రాంత డీసీసీబీ బ్రాంచ్‌ల మేనేజర్లే. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్లాన్ ప్రకారం వివిధ వాణిజ్య బ్యాంకుల మేనేజర్లు, అకౌంటెంట్లుగా ఉద్యోగ విరమణ చేసిన వారినే ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంది. విశ్రాంత అధికారులకు తమ సొసైటీల్లో ఉద్యోగాలు ఇచ్చి ఇతర బ్యాంకుల్లో డిపాజిట్లు కొల్లగొట్టాలని ముందస్తు ప్రణాళికతో వ్యవహరించారు. వారి చేత ఆయా బ్యాంకుల్లో డిపాజిట్‌దారులను నమ్మించి, ఒప్పించి అక్కడ డిపాజిట్ల సొమ్మును ‘జయలక్ష్మి’లో వేసేలా చేయడంలో యాజమాన్యం సఫలీకృతమైంది. అమలాపురం జయలక్ష్మి బ్రాంచ్‌లో దాదాపు రూ.48 కోట్ల మేర డిపాజిట్‌దారులు దాచుకున్న సొమ్మును దోచేస్తే అందులో సుమారు రూ.15 కోట్లు అప్పటివరకూ డీసీసీబీ బ్రాంచ్‌లో డిపాజిటర్లుగా ఉన్నవారి నుంచి మళ్లింపు అయ్యింది. అవిభక్త జిల్లాలో పలు వాణిజ్య బ్యాంకుల డిపాజిట్‌దారుల నుంచి సుమారు రూ.50 కోట్లు, డీసీసీబీ బ్రాంచ్‌ల్లో దాదాపు రూ.150 కోట్ల వరకూ ఇలా గత కొన్నేళ్లలో ఆయా బ్రాంచ్‌ల్లో దాచుకున్న డిపాజిట్దారులే తమ సొమ్మును ఈ సొసైటీ డిపాజిట్లలోకి మళ్లించుకునేలా వారిలో నమ్మకాన్ని నింపగలిగింది. వారినే వాడుకుంది.. పలు బ్యాంకుల బ్రాంచ్‌ల విశ్రాంత మేనేజర్లకు తమ సొసైటీ బ్రాంచ్‌ల్లో తిరిగి మేనేజర్ల ఉద్యోగాలు కల్పించి ‘జయలక్ష్మి’ యాజమాన్యం పావులుగా వాడుకుంది. ఉదాహరణకు అమలాపురంలో ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు తమ కుటుంబ సభ్యుల ద్వారా రూ.45 లక్షల వరకూ ‘జయలక్ష్మి’లో డిపాజిట్ చేశారు. గతంలో ఓ వాణిజ్య బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేసి రిటైర్ తర్వాత జయలక్ష్మిలో మేనేజర్ అయిన ఓ అధికారి మాటలను నమ్మి అన్ని లక్షలు డిపాజిట్లు చేశానని ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు లబోదిబోమంటున్నారు. ఇలా రూ.లక్షలు దాచుకుని నేడు దోపిడీకి గురైన ఏ విశ్రాంత ఉద్యోగిని కదిపినా ఒక్కో కన్నీటి కథ చెబుతున్నారు. తాము డిపాజిట్ చేయడం వెనుక ఫలానా బ్యాంక్ విశ్రాంత మేనేజరో.. బ్యాంక్ అధికారో ఉన్నారని.. వారి మాటలను నమ్మే సొమ్ము వేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన కోనసీమ ప్రజలు
-
కాంతి నింపిన సంక్రాంతి
భీమవరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/నెట్వర్క్: ఏ వీధి చూసినా రంగులద్దిన రంగవల్లులు.. వాటిపై గొబ్బెమ్మలు.. ప్రతి ఇంటి నుంచి కమ్మటి పిండివంటల వాసనలు.. యువతీయువకుల కేరింతలు.. సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుచేస్తూ గోపూజలు.. కోడిపందేలు, ఎడ్లపందేలు.. గాలిపటాలు.. క్రీడాపోటీలు.. ముగ్గుల పోటీలు.. రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూడురోజులు కనిపించిన దృశ్యాలివి. భోగి రోజైన శుక్రవారం మొదలైన కోడి పందాల జాతర కనుమ రోజైన ఆదివారం సా.5 గంటలతో పరిసమాప్తమైంది. బరుల వద్ద ఏకంగా బౌన్సర్లను రంగంలోకి దించారు. భీమడోలు మండలం గుండుగొలనులో పేకాట శిబిరం వద్దకు మఫ్టీలో వెళ్లిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై పేకాట రాయుళ్లు దాడి చేయడంతో వారిపై కేసు నమోదు చేశారు. ఇక తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని పల్లంకుర్రులో నిర్వహించిన భారీ కోడి పందేల్లో ఇన్నోవా కారును బహుమతిగా పెట్టడం విశేషం. ‘పశ్చిమ’ంలోని కాళ్ల మండలం సీసలిలో నిర్వాహకులు రెండు బుల్లెట్లు సిద్ధంచేశారు. అలాగే, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదాయ కోడి పందేల్లో గెలుపొందిన విజేతలకు బులెట్, స్కూటీలను బహుమతులుగా అందజేశారు. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దలను స్మరించుకుని వారికి పిండివంటలు నివేదించారు. విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో బొజ్జన్నకొండ వద్ద కనుమ సందర్భంగా జాతర కోలాహలంగా జరిగింది. ఇక్కడి బౌద్ధస్థూపం వద్ద జరిగిన బౌద్ధమేళాలో మయన్మార్ బౌద్ధ భిక్షువు వెనరబుల్ ఆయుపాల మహాథేరోజీ పాల్గొన్నారు. సింహాచలంపై మకరవేట ఉత్సవాన్ని నిర్వహించారు. విశాఖలో గాలిపటాలు ఎగురవేశారు. ఆలయాల్లో ఘనంగా గోపూజలు కనుమ పండుగ సందర్భంగా దేవదాయశాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలన్నింటిలోనూ ఆదివారం గోపూజ కార్యక్రమాలు నిర్వహించింది. దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ సతీ సమేతంగా విజయవాడ దుర్గగుడిలో గోపూజ చేశారు. అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో జరిగిన గోపూజలో ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తిరుపతి ఇస్కాన్ మందిరం వేదికగా సిద్ధరామేశ్వర, రాజరాజేశ్వరి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గోమాతలకు సీమంతాలు, గోదూడలకు నామకరణ ఉత్సవం నిర్వహించారు. గుడివాడలో జాతీయ ఎడ్ల పందేలు మంత్రి కొడాలి నాని సారథ్యంలో కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని లింగవరం రోడ్డులో జాతీయ స్థాయి ఎడ్ల పందేలు నిర్వహించారు. రసవత్తరంగా పందుల పందేలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలో మూడురోజుల పాటు పందుల పందేలు రసవత్తరంగా సాగాయి. పితృదేవతల స్మరణ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సింహపురీయులు శనివారం పితృదేవతలను స్మరిస్తూ నెల్లూరులోని పవిత్ర పినాకిని తీరంలో ఉన్న సమాధుల తోట (బోడిగాడితోట)లో తమ పూర్వీకుల సమాధుల వద్ద పూజలు చేశారు. బహుమతులందజేసిన ఎమ్మెల్యే రోజా వైఎస్సార్ జిల్లా శెటిపల్లె గ్రామం తిమ్మక్కగారిపల్లెలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. సందడిలేని అతిథులు సంక్రాంతి కోడి పందేలను.. ఇక్కడి వారి ఆత్మీయ విందును రుచిచూసి మళ్లీ ఏడాది వరకు ఎదురుచూసే అతిథులు ఈసారి పెద్దగా ఇటువైపు కన్నెత్తి చూడలేదు. అంబరాన్నంటిన ప్రభల సంబరం అమలాపురం: సంక్రాంతి పండగ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా ప్రభల తీర్థాలు వైభవంగా జరిగాయి. జిల్లాలో సంక్రాంతి నుంచి ముక్కనుమ వరకూ ప్రభల తీర్థాలు జరుగుతాయి. గత ఏడాది స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ మెప్పు పొందిన అంబాజీపేట మండలం జగ్గన్నతోట ప్రభల తీర్థం ఆదివారం నయనానందకరంగా సాగింది. ఏకాదశ రుద్రులను (11 ప్రభలను) పంటపొలాలు, కాలువలు దాటుతూ తరలించిన తీరు భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ముఖ్యంగా గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం ప్రభలు అప్పర్ కౌశిక కాలువను దాటి వచ్చే అపురూప దృశ్యాన్ని పెద్దసంఖ్యలో భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. మొత్తం 11 ప్రభలు జగ్గన్నతోటలో ఒకేచోట కొలువుదీరి భక్తులను పరవశింపజేశాయి. అంబాజీపేట మండలంలో వాకలగరువు సరిహద్దున జరిగిన తీర్థాల్లో వాకలగరువు ప్రభ 47 అడుగులు, తొండవరం ప్రభ 46 అడుగుల ఎత్తున రూపుదిద్దుకుని భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 60 గ్రామాల్లో ప్రభల తీర్థాలు కనులపండువగా జరిగాయి. జగ్గన్నతోట ప్రభల తీర్థానికి అప్పర్ కౌశిక కాలువను దాటి వస్తున్న గంగలకుర్రు అగ్రహారం ప్రభ రంగంపేటలో ఉత్సాహంగా జల్లికట్టు చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఎ.రంగంపేట గ్రామంలో నిర్వహించిన పశువుల పండుగ వేడుక అంబరాన్నటింది. పశువుల యజమానులు వాటి కొమ్ములకు పలకలను కట్టి పందేలకు సిద్ధం చేశారు. జిల్లాలోనే ఎడ్ల పందేలు (జల్లికట్టు)కు అత్యంత ప్రాధాన్యత ఉన్న గ్రామం రంగంపేట. జల్లికట్టును చూడటానికి జిల్లా నలుమూలల నుంచేగాక ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. ఎద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. -
ఏపీలో గోవా తరహా బీచ్‌లు, కేరళ బ్యాక్ వాటర్ అందాల.. ఎక్కడో తెలుసా?
సాక్షి, అమరావతి: మంచు సోయగాల సొగసులో.. పైరగాలుల చలిలో.. పచ్చని దుప్పటిలో.. హాయిగా ఒదిగి.. గోదావరి గలగలల మధ్య.. పిల్లకాలువల సవ్వడిలో మునిగి.. దివిని మించిన దీవిలా ప్రకృతి ఒడిలో దిండి సేదతీరుతోంది. గోవా తరహా బీచ్‌లు.. కేరళలో కనిపించే బ్యాక్‌వాటర్స్ అందాలు.. హౌస్ బోట్ల పరుగుల సమాహారంతో కోనసీమ సిగలో సరికొత్త అందాలను సంతరించుకుని .. పర్యాటకులను ‘దిండి’ యాత్రకు ఆహ్వానిస్తోంది. అటు గోదావరి.. ఇటు సముద్రం ఒకవైపు బంగాళాఖాతం.. మరోవైపు గోదావరి.. ఈ రెండింటి సంగమం అన్నాచెల్లెళ్ల గట్టును బోటు ప్రమాణంలో వీక్షించవచ్చు. సముద్రం ఒడ్డును కొలువైన లక్ష్మీనరసింహస్వామి, సమీపంలోని అయినవిల్లి, ముక్తేశ్వరం ఆలయాలను దర్శించవచ్చు. శతాబ్దాలుగా భద్రపరచబడిన తమిళ సంస్కృతిని చాటే పేరూరు వారసత్వం గ్రామం, లైట్‌హౌస్ ఇతర సందర్శనీయ స్థలాలు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి 80 కిలో మీటర్లు, రాజోలు నుంచి 8 కిలోమీటర్లు, పాలకొల్లు రైల్వే స్టేషన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దిండి ఉంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు పర్యటనకు అనుకూలం. దిండిలో రెండు రిసార్టులు దిండిలో పర్యాటక శాఖకు చెందిన హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్‌లో 32 ఏసీ గదులతో పాటు రెస్టారెంట్, కాన్ఫరెన్స్ హాల్, స్విమ్మింగ్ పూల్ ఉంది. సాధారణ రోజుల్లో రోజుకు 50శాతం ఆక్యుపెన్సీతోనూ, వీకెండ్లో వంద శాతం గదులు నిండిపోతున్నాయి. అంతేకాకుండా దిండిలో వాటర్ స్పోర్ట్స్ ఆస్వాదించేందుకు 200 నుంచి 500 మందికి పైగా పర్యాటకులు వస్తున్నారు. దిండి కోనసీమ గాడ్ సిటీ కేరళ తరహా అందాలకు దిండి పెట్టింది పేరు. ఇక్కడ పర్యాటక శాఖ రిసార్టు అత్యాధుని సౌకర్యాలతో బస కల్పిస్తోంది. హౌస్ బోట్ల ప్రయాణం కోసం పర్యాటకులు పోటీపడుతుంటారు. వీటిని కుటుంబ సమేతంగా గడపడానికి అనువుగా తీర్చిదిద్దాం. – సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీపీ ప్రత్యేక ఆకర్షణగా హౌస్ బోట్లు.. తూర్పుగోదావరి జిల్లాలోని దిండిలోని దట్టమైన మడ అడవులు మధ్య బ్యాక్ వాటర్స్‌లో బోటు ప్రయాణం పర్యాటకులను కట్టిపడేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర పర్యాటక శాఖ కేరళ తరహా హౌస్బోట్లను ప్రవేశపెట్టింది. వీటిలో అటాచ్డ్ బాత్రూమ్, ఏసీ, సిటౌట్, డైనింగ్ ఏరియా... ఇలా నక్షత్రాల హోటల్‌ను మరిపించే సౌకర్యాలతో రెండు హౌస్ బోట్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఈ బోట్లు దాదాపు 40 కిలో మీటర్ల మేర గోదావరిలో ప్రయాణిస్తాయి. దిండిలో బయలు దేరి రాజోలు లంక ఐలాండ్Š, నరసాపురం రేవు నుంచి తిరిగి గమ్యస్థానానికి చేరుకుంటాయి. మరోవైపు రెండు పాంటూన్ బోట్లు, ఒక లగ్జరీ బోటు, స్పీడ్ బోటు సౌకర్యం కూడా ఉంది. చదవండి: ఒంగోలు జాతి కోడె దూడ ధర రూ.2 లక్షలు -
కోనసీమ కుర్రాళ్ల కారుణ్యం
అమలాపురం టౌన్: వారిద్దరూ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కుర్రాళ్లు. కష్టపడి ఉన్నత శిఖరాలను ఆధిరోహించిన యువ కిశోరాలు. ఒకరు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్ కాగా మరొకరు ఐఏఎస్ అధికారి, అనంతపురం జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణ పూర్తి చేసుకుని కాకినాడ సర్వజనాసుపత్రి కోవిడ్ నోడల్ ఆఫీసర్‌గా పనిచేస్తోన్న గోకరకొండ సూర్య సాయి ప్రవీణ్‌చంద్. అమలాపురంలో కోవిడ్ బారిన పడి అవస్థలు పడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు సాత్విక్ రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని తన తండ్రి కాశీ విశ్వనాథ్‌కు అందించారు. ఒక్కో కోవిడ్ బాధిత జర్నలిస్ట్ కుటుంబానికి రూ.5 వేల సాయం అందించాలని కోరారు. ఈ బాధ్యతను అమలాపురంలోని తన మిత్రుడు నల్లా శివకు అప్పగించారు. అలాగే, ప్రవీణ్‌చంద్ జిల్లాలోని పలు ఆస్పత్రులకు ఏసీటీ గ్రాంట్ సంస్థ సహకారంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సమకూర్చుతున్నారు. తూర్పు గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ఆస్పత్రులకు 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించారు. -
కోనసీమలో పల్లెపోరు
సాక్షి, అమలాపురం: రాజకీయంగా చైతన్యవంతమైన తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ (అమలాపురం డివిజన్)కు ఒక గుర్తింపు ఉంది. ఒకవైపు సముద్రం, మూడు వైపులా గోదావరి నదీపాయల మధ్య ఉండే ఈ ప్రాంతానికి రాజకీయంగా ప్రత్యేక స్థానముంది. పూర్తి వ్యవసాయ ఆధారితమైన ఈ ప్రాంతం కొబ్బరి సాగులో దేశంలోనే గుర్తింపు పొందింది. స్వతంత్ర ఉద్యమం నాటినుంచి ఇక్కడ రాజకీయ చైతన్యం అధికం. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంతోమంది దళితులు, వెనుకబడిన వర్గాల వారు ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఇక్కడ పంచాయతీ ఎన్నికలు నాలుగో దశలో జరుగుతున్నాయి. ఈనెల 21న ఎన్నికలు జరగనున్న ఐదు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 273 పంచాయతీలున్నాయి. వీటిలో 14 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 259 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 711 మంది తలపడుతున్నారు. జాతీయస్థాయిలో రాణింపు కోనసీమకు చెందిన పలువురు నాయకులు జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉన్నత పదవులు పొందారు. దివంగత కళా వెంకట్రావు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో రెవెన్యూ, ఆంధ్రాలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. దివంగత జీఎంసీ బాలయోగి దేశంలోనే అత్యుత్తమైన పదవుల్లో ఒకటైన లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. మాజీమంత్రి పరమట వీరరాఘవులు పంచాయతీ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తరువాత అల్లవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. దివంగత మాజీమంత్రి మోకా విష్ణుప్రసాద్ తొలుత సర్పంచ్‌గా తరువాత అల్లవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మార్కెటింగ్, గిడ్డంగులశాఖ మంత్రిగా పనిచేశారు. సాధారణ గృహిణిగా ఉన్న చిల్లా జగదీశ్వరి సైతం తొలుత సర్పంచ్‌గా, తరువాత అల్లవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పోరు ఏకపక్షమే కోనసీమలో పంచాయతీ పోరు ఏకపక్షమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వలంటీర్ల వ్యవస్థతో పల్లె కేంద్రంగా సాగుతున్న పాలనతో గ్రామాలు అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పల్లెల్లోనే ఉపాధి అవకాశాలు పెరగడంతో యువతలో ఉద్యోగ భరోసా ఏర్పడింది. రైతుభరోసా ద్వారా పెట్టుబడి సహాయం, కనీస మద్దతు ధరలు అందేలా తీసుకుంటున్న చర్యలు, రైతులకు ఉచితంగా బోర్లు వేయించడం వంటివి రైతులకు ఎంతో లబ్ధి కలిగిస్తున్నాయి. గత ఏడాది కరోనా లాక్డౌన్ సమయంలో వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలు, వరదలు, వర్షాల వల్ల మూడుసార్లు ఆయా ప్రాంతాల్లో పంట దెబ్బతిన్న రైతులకు రెండు నెలల వ్యవధిలోనే ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ముఖ్యంగా కొబ్బరికాయ ధర రూ.6కు పడిపోయిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయించింది. అప్పటినుంచి కొబ్బరి ధర రూ.10కి తగ్గలేదు. ఈ చర్యలన్నీ రైతులకు ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత పెంచాయి. దీంతో కోనసీమ గ్రామాలు వైఎస్సార్సీపీ అభిమానులకే పట్టంకట్టే పరిస్థితి కనిపిస్తోంది. తొలి మూడు విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికారపార్టీకి ఏకపక్షంగా ఉండటంతో ప్రతిపక్ష పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన వారిలో గెలుపు నమ్మకం సడలిపోయింది. -
నేడు జగ్గన్నతోట ప్రభల తీర్థం
అమలాపురం/ అంబాజీపేట: సంక్రాంతంటే.. భోగి మంటలు.. కొత్తవస్త్రాలు.. ధాన్యం కుచ్చులు.. పిండివంటలు.. కోడి పందేలు మాత్రమే కాదు. అబ్బురపరిచే ప్రభల తీర్థాలు కూడా. ఈ తీర్థాలకు పైరు పచ్చని సీమ కోనసీమ వేదికవుతోంది. సంక్రాంతి సమయంలో కోనసీమ వీధుల్లో నడయాడుతున్న ఇంద్రధస్సులా తీర్థాలకు వెళ్లే రంగురంగుల ప్రభలు సీమ అందాలను రెట్టింపు చేస్తాయంటే అతిశయోక్తి కాదేమో. సీమలో జరిగే ప్రభల తీర్థాలకు వందల ఏళ్ల పురాణ చరిత్ర ఉంది. పెద్ద పండగ నాడు మొదలై... ముక్కనుమ, ఆ తరువాత రోజు వరకు కోనసీమ నలుమూలల సుమారు 90 వరకు ప్రభల తీర్థాలు జరుగుతాయి. వీటిని చూసేందుకు స్థానికులు.. జిల్లా వాసులే కాదు.. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తుల తరలివస్తారు. ఇక్కడ జరిగే ప్రభల తీర్థాలు రాజులు.. బ్రిటిష్ పాలనల్లో సైతం నిరాటంకంగా కొనసాగాయి. అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కారణంగా ఈసారి ఆంక్షల నడుమ ప్రభల తీర్థాలు జరగనున్నాయి. చదవండి: పలకరింపే పులకరింపైతే.. ప్రతిరోజూ పండగే ఏకాదశ రుద్రుల కొలువు అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి ఐదు శతాబ్ధాల చరిత్ర ఉంది. నాలుగు గ్రామాల శివారులోని ఒక కొబ్బరితోటలో సాగుతుంది. కనుమపండగ నాడు జరిగే తీర్థంలో మొసలపల్లి భోగేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామిలు జగ్గన్నతోటలో సమావేశమై లోక కల్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా జరిగే సమావేశానికి వ్యాఘ్రేశ్వరస్వామి అధ్యక్షతవహిస్తారు. స్వామివారి ప్రభ తీర్థానికి వచ్చే సమయంలో మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి పైకెత్తి దింపుతారు. గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు ప్రభలు జగ్గన్నతోటను ఆనుకుని ఉండే పెద్ద కౌశికను దాటుకు వచ్చేతీరు ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుంది. ఇదే మండలం వాకలగరువు, తొండవరం గ్రామంలో ఏటా ఒకరికొకరు పోటీ పడుతూ 42 అడుగులకు పైబడి ఎత్తులో ప్రభలు నిర్మిస్తారు. -
ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్
-
కోనసీమలో గ్యాస్ బ్లో అవుట్
ఉప్పూడి నుంచి సాక్షి ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ఉలిక్కిపడింది. ఓఎన్జీసీ బావిలో గ్యాస్ బ్లో అవుట్ సంభవించడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. గాలి ఎటువీస్తే అటు వైపు గ్యాస్ మళ్లుతుండటంతో పరిసర ప్రాంతాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఓఎన్జీసీ బావి నుంచి ఒక్కసారిగా గ్యాస్ పెద్ద శబ్దంతో ఎగసిపడింది. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న పీఎఫ్‌హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు గ్యాస్‌ను అదుపుచేసే యత్నం చేశారు. ఇంతలో వెల్ క్యాప్ నుంచి ఒక్కసారిగా భారీ శబ్దంతో విస్ఫోటనం సంభవించింది. దానికి అతి దగ్గరగా ఉన్న ఇద్దరూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పుకున్నట్టు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. అయితే.. ఆ ఇద్దరి ఆచూకీ లభించలేదని స్థానికులంటున్నారు. తర్వాత బావి నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున గ్యాస్ ఎగదన్నడంతో ఆ ప్రాంతమంతా మంచు కమ్మేసినట్టుగా గ్యాస్ అలముకుంది. చిన్న నిప్పురవ్వ వెలువడినా పెను ప్రమాదం సంభవిస్తుందనే ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆటోలపై మైకుల ద్వారా అధికారులు ప్రచారం చేస్తున్నారు. మొబైల్ ఫోన్లు, ఫ్లాష్ లైట్లు కూడా ఉప్పూడి గ్రామ పరిసరాలకు తీసుకు రాకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కట్టడి చేసింది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఘటనా స్థలం చుట్టుపక్కలంతా గాఢాంధకారం అలముకుంది. ఉప్పూడి గ్రామంలో 1600 మంది దాకా ఉన్నారు. వారిని చెయ్యేరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. మూత తెరిచే ప్రయత్నంలోనే ఘటన అడవిపేట ఓఎన్జీసీ డ్రిల్ సైట్‌కు అనుబంధంగా ఉన్న ఉప్పూడి–1 బావిలో 2006 ముందు వరకూ ఓఎన్జీసీ సొంతంగా గ్యాస్‌ను వెలికితీసింది. తర్వాత బావిలో సహజ వాయువు నిక్షేపాలు తగ్గుముఖం పట్టడంతో బావిని మూసేసింది. 3 కి.మీ లోతున ఈ బావిలో గ్యాస్ ఉంది. 2006లో దీనికి వెల్ క్యాప్ (బావికి మూతవేయడం) వేసిన ఓఎన్జీసీ.. గతేడాది కోల్‌కతాకు చెందిన పీఎఫ్‌హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో గ్యాస్ వెలికితీత ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్నుంచి ఆ సంస్థ పర్యవేక్షణలోనే ఈ బావి నిర్వహణ సాగుతోంది. బావిలో గ్యాస్ నిల్వలను అంచనా వేసేందుకు మూత తెరిచేందుకు సంస్థ సిబ్బంది ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే గ్యాస్ ఒక్కసారిగా ఎగదన్నింది. నిపుణుల పర్యవేక్షణ లేకుండానే.. బావిని మూసేశాక పునరుద్ధరణ కోసం జరిగే ప్రయత్నాల్లో భాగంగా బావిని తిరిగి తెరవాలంటే ఓఎన్జీసీ నిపుణుల పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. అటువంటిదేం లేకుండా బావి తెరవడం విస్ఫోటనానికి కారణమైంది. ఈ విస్ఫోటనంతో తమకు సంబంధం లేదని ఓఎన్జీసీ చెబుతోంది. ఘటన జరిగిన కొద్దిసేపటికే బావి వద్ద పనిచేస్తున్న ఎఫ్హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు పరారవ్వడం గమనార్హం. ఈ విషయాన్ని అమలాపురం డీఎïస్పీ షేక్ మాసూమ్ బాషా ధ్రువీకరించారు. పీఎఫ్‌హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థపై కేసు నమోదు చేసేందుకు పోలీసు అధికారులు నిర్ణయించారు. -
అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం
అమలాపురం/ అంబాజీపేట(పి.గన్నవరం): కోనసీమలో ప్రభల తీర్థాలతో సంక్రాంతి, కనుమ పండుగల నాడు ఆధ్యాత్మిక పరవళ్లు తొక్కింది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా సీమలో పలు ప్రాంతాల్లో ప్రభల తీర్థాలు నభూతో...అన్నట్టుగా సాగాయి. ముఖ్యంగా కనుమ పండగ నాడు పచ్చని సీమలో రంగురంగులు హద్దుకున్న ప్రభలు కొలువుదీరాయి. ఊరేగింపుగా వెళుతూ వీధులు.. చేలు.. తోటలను పుణీతం చేశాయి. ఈ గ్రామం తిరునాళ్లు చూసినా ఇసుక వేస్తే రాలని జనంతో కిటకిటలాడాయి. సముద్ర ఘోషను తలపించేలా వేలాది మంది భక్తుల ఓంకార నాదాలు..వందల మంది భక్తులు తమ భుజస్కాందాలపై ప్రభులను మోస్తూ ముందుకు సాగారు. బాణా సంచా కాల్పులు.. ప్రభలకు వేలాడదీసిన జేగంటల శబ్దాలతో కోనసీమ వ్యాప్తంగా ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లాయి. కోనసీమలో ఈ తీర్థాలు నాలుగు రోజులపాటు సాగుతాయి. కొత్తపేట తీర్థం బుధవారం జరగగా, గురువారం కనుమ పండుగ రోజున అంబాజీపేట మండలం జగ్గన్నతోట, వాకలగరువు, మామిడికుదురు మండలం కొర్లగుంటతోపాటు సుమారు 60కు పైగా తీర్థాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా కొత్త ప్రాంతాల్లో కూడా ప్రభల తీర్థలు జరిగాయి. తీర్థాలకు కొత్త ప్రభలు కూడా తరలివచ్చాయి. చారిత్రాత్మక ప్రధాన్యత ఉన్న అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట ప్రభల తీర్థం వేడుకలు ఆకాశమే హద్దుగా అన్నట్టుగా జరిగాయి. తీర్థానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందినవారు..ఎన్ఆర్ఐలు తీర్థానికి కుటుంబాలతో కలిసి వచ్చారు. సంప్రదాయ వస్త్రధారణలతో యువతులు ప్రభల అందాలతో పోటీ పడ్డారు. వృద్ధులు, యువకులు, మహిళలు అనే తేడా లేకుండా తీర్థానికి వచ్చి సందడి చేశారు. ప్రభల ఊరేగింపు సంప్రదాయ పద్ధతిలో సాగింది. రంగురంగు ప్రభలు ఒకచోట కొలువుదీరిన అందమైన దృశ్యాన్ని తిలకించి భక్తులు పులకరించిపోయారు. తీర్థానికి వ్యాఘ్రేశ్వరం నుంచి వచ్చిన వ్యాఘ్రేశ్వరరావు స్వామి ప్రభ వచ్చినప్పుడు మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి పైకెత్తి లేపారు. గంగలకుర్రు అగ్రహారం శ్రీ ఉమా పార్వతి సమేత వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి ప్రభలు అప్పర కౌశిక దాటుకుని వచ్చే దృశ్యాన్ని వేలాది మంది భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. తీర్థానికి పెద్దవి 11 ప్రభలు కాగా, వాటితోపాటు చిన్నచిన్న ప్రభలు మరో ఎనిమిది వరకు వచ్చాయి. ఉదయం 11 గంటలకు తీర్థానికి ప్రభల రాక ఆరంభమైంది. మధ్యాహ్నం 12.30 గంటలకు గంగలకుర్రు, 1.00 గంట సమయంలో గంగలకుర్రు అగ్రహారం ప్రభులు కౌశిక దాటి వచ్చాయి. కేరళ డప్పు వాయిద్యాలు, మేళ తాళాలు, బాణాసంచా కాల్పులతో గంగలకుర్రు ప్రభ ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. భక్తుల దర్శనానికి కొద్దిసేపు ఉంచి తరువాత వెనకకు తీసుకుని వెళ్లారు. ఎప్పటిలానే సంప్రదాయబద్ధంగా పలు కుటుంబాల వారు గూడు ఎడ్లబండ్లపై తీర్థానికి రావడం పలువురిని ఆకట్టుకుంది. ఆ ప్రభ ఎత్తు 54 అడుగులు: అంబాజీపేట మండలం వాకలగరువులో జరిగే ప్రభల తీర్థం మొత్తం కోనసీమలో జరిగే తీర్థాల్లో హైలెట్‌గా నిలిచింది. కోనసీమలో ఎక్కడా లేని విధంగా వాకలగరువుకు చెందిన శ్రీ ఉమా సర్వేశ్వరస్వామి ప్రభను భక్తులు 54 అడుగుల ఎత్తున తయారు చేశారు. గత ఏడాది 48 అడుగులు ఉన్న ప్రభను ఈసారి ఏకంగా ఆరు అడుగులు పెంచారు. అదే విధంగా తీర్థానికి వచ్చే తొండవరం ఉమా తొండేశ్వరస్వామి 48 అడుగులు ఎత్తున ఏర్పాటు చేశారు. గత ఏడాది ఇది 46 అడుగులు మాత్రమే. ఈ రెండు ప్రభలు వాకగరువు రావిచెట్టు సెంటరు వద్ద ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున భక్తులు తిలకించారు. ఇదే మండలం చిరతపూడి చిట్టి చెరువు గట్టు వద్ద కూడా ప్రభల తీర్థం జరిగింది. పి.గన్నవరం మండలం గాజులుగుంట, నాగుల్లంక, ఉడిమూడిలోను, వాడ్రేవుపల్లి, కొత్తపేటలో మందపల్లి, అవిడి డ్యామ్ సెంటరు, వాడపాలెం, రావులపాలెం మండలం దేవరపల్లిలో గురువారం ప్రభల తీర్థాలు జరిగాయి. మామిడికుదురు మండలం కొర్లగుంటలో జరిగిన తీర్థంలో 12 ప్రభలు కొలువుదీరాయి. ఇక్కడకు సైతం ప్రభలు పంటచేలు, కాలువులు దాటుకుని వచ్చాయి. అమలాపురం మండలం సాకుర్రు గరువు, బండారులంక, అమలాపురం పట్టణంలో గనికమ్మగుడి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, రాజోలు నియోజకవర్గ పరిధిలో మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం, రాజోలు పొదలాడ, ముమ్మిడివరం మండలం పల్లిపాలెం, క్రాప చింతలపూడి, చెయ్యేరు, ఐ.పోలవరం శివారు పెదమడి, ఐ.పోలవరం మండలం గుత్తెనదీవిలల్లో ప్రభలు తీర్థాలు అంగరంగ వైభవంగా సాగాయి. -
కార్తీకం వచ్చిందమ్మా.. కోనసీమ చూసొద్దామా!
సాక్షి, ముమ్మిడివరం: కోనసీమలో కార్తీక మాసం సందడి నెలకొంది. అటు భక్తిభావంతో, ఇటు వినోద, విహారయాత్రలతో కోనసీమ కళకళలాడుతోంది. తన సహజ సిద్ధమైన అందాలతో సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. పచ్చని తీవాచీ పరిచినట్టుగా ఉండే పంటపొలాలు, అడుగడుగునా దర్శనమిచ్చే దేవాలయాలు, గోదావరి పాయల గలగలలు, ఇసుక తిన్నెలతో కూడిన సముద్రపు సోయగాలు చారిత్రక ప్రదేశాలతో కోనసీమలో ప్రకృతి రమణీయత ఉట్టి పడుతోంది. కార్తికమాసం వచ్చిదంటే కోనసీమ వాసుల ఆనందానికి అవధులుండవు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో సరదాగా వనభోజనాల్లో పాల్గొంటారు. మరికొందరైతే ఉపవాస దీక్షలతో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. సముద్రం వెంబడి సరుగుడు తోటలు, రిసార్టులు, లైట్ హౌస్‌లు, తీరప్రాంతాలు, కోరంగి అభయారణ్యం, కందికుప్ప లైట్‌హౌస్, అన్నంపల్లి అక్విడెక్టు, పీడబ్యూడీ బంగ్లాలు, ముఖ్యమైన పిక్నిక్ స్పాట్లుగా గుర్తింపు పొందాయి. వీటితో పాటు ఆదుర్రు బౌద్ధ స్తూపం, దిండి బోటు హౌస్, రిసార్టులు, పర్యాటక కేంద్రాలుగా అందరినీ అలరిస్తున్నాయి. అలాగే అయినవిల్లి శ్రీసిద్ధి వినాయక స్వామి, ముక్తేశ్వరంలోని క్షణముక్తేశ్వరస్వామి, మురమళ్ల వీరేశ్వరస్వామి, వాడపల్లి, అమలాపురం వేంకటేశ్వరస్వామి, కుండలేశ్వరం కుండలేశ్వరస్వామి ఆలయాలు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. విహారం కాకూడదు.. విషాదం పిక్నిక్‌లంటే తమను తాము మరిచిపోయేంత సంతోషంగా గడుపుతారు.అయితే ఈ విహారం ఒక్కొక్కసారి విషాదంగా మారుతోంది. ముఖ్యంగా సముద్రం స్నానాలకు వెళ్లే పర్యాటకులు మృత్యువాత పడుతున్నారు. ప్రధానంగా అంతర్వేది, ఓడలరేవు, కొమరిగిరిపట్నం, కాట్రేనికోన సముద్ర తీరాల వద్ద ఏటా ఏదొక దుర్ఘటన జరుగుతూనే ఉంది. ఏదొక ప్రమాదం జరిగే వరకు పోలీసులు సైతం స్పందించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సముద్ర తీరంలో గస్తీ ఏర్పాటు చేస్తున్నా అనుకున్నంత ప్రయోజనం చేకూరడం లేదని పర్యాటకులు వాపోతున్నారు. -
గరాజీ.. భలే రుచి..
సాక్షి, మామిడికుదురు (పి.గన్నవరం): బియ్యం పిండి, పంచదారతో తయారు చేసే ‘గరాజీ’లు నోరూరిస్తాయి. మామిడికుదురు, నగరం గ్రామాలకు మాత్రమే పరిమితమైన ఈ వంటకం ముస్లిం వంటకంగా ప్రాచుర్యం పొందింది. పై రెండు గ్రామాల్లో 216వ నంబర్ జాతీయ రహదారి పక్కన గాజు సీసాల్లో వీటిని ఉంచి విక్రయిస్తుంటారు. సైజును బట్టి ఒక్కొక్క గరాజీని రూ.నాలుగు, రూ. ఐదుకు విక్రయిస్తారు. మళ్లీమళ్లీ తినాలనిపించే గరాజీలను ఇతర ప్రాంతాల వారు మిక్కిలిగా ఇష్టపడతారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తదితర సుదూర ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లకు వీటిని తీసుకు వెళుతుంటారు. 12 గంటల పాటు బియ్యం నానబెట్టిన తరువాత ఆ బియ్యాన్ని మెత్తగా దంచి పిండిని గుడ్డతో జల్లిస్తారు. పంచదారను తీగలా సాగే విధంగా పాకం పెడతారు. రెండు కిలోల బియ్యం పిండికి అర కిలో పంచదారను పాకంగా పెడతారు. ఈ పాకంలో బియ్యం పిండి కలిపిన తరువాత ఈ రెండింటి మిశ్రమాన్ని నూనెలో దోరగా వేయిస్తారు. గుండ్రంగా వేయించిన గరాజీని బయటకు తీసి దానిని మడచి మళ్లీ వేయిస్తారు. ఈ విధంగా గరాజీలు తయారు చేస్తారు. గరాజీలను వేడివేడి పాలలో వేసుకుని తింటే సేమ్యాను మించిన రుచి ఉంటుంది. ఈ ప్రాంతంలో గరాజీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అన్ని వర్గాల వారు వీటిని అమితంగా ఇష్టపడతారు. -
కొబ్బరి రైతులను ముంచుతున్న ఆక్వా
సాక్షి, అమలాపురం: కోనసీమ కొబ్బరి రైతుకు కొత్త కష్టమొచ్చింది. ఆక్వా సాగు పుణ్యమాని తూర్పు గోదావరి జిల్లాలో వందలాది కొబ్బరి చెట్లు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు రొయ్యలు, చేపల చెరువులున్న ప్రాంతాల్లో కొబ్బరి కాయ సైజు గణనీయంగా తగ్గిపోతోంది. గడచిన ఐదేళ్ల కాలంలో కాయ సైజు సగటున 100 గ్రాముల వరకు తగ్గినట్టు అంచనా. కొబ్బరి ధర పతనానికి.. మార్కెట్ సంక్షోభానికి కాయ సైజు తగ్గడం కూడా ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. నాణ్యమైన దిగుబడి ఉండే తోటల్లో పక్వానికి వచ్చిన కొబ్బరి కాయ సగటు బరువు డొక్కతో కలిపి 600 గ్రాముల వరకు ఉంటుంది. డొక్క తీసిన తరువాత కాయ బరువు మన రాష్ట్రంలో సగటున 450 గ్రాములు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, విజయనగరం జిల్లాలో అయితే 450 నుంచి 500 గ్రాముల వరకు బరువు ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో డొక్క తీసిన కాయ బరువు 500 గ్రాముల వరకు, కేరళలో 550 గ్రాముల వరకు వస్తోంది. మన రాష్ట్రంలో కొబ్బరి తోటలకు పెట్టింది పేరైన కోనసీమతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో వలిచిన కాయ సగటు బరువు 400 గ్రాముల వరకు ఉండేది. ఇప్పుటికీ ఆరోగ్యకరమైన తోటల్లో దిగుబడి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. కానీ.. తీరప్రాంత మండలాలు, ఆక్వా చెరువులు ఉన్న మండలాల్లో మాత్రం కాయ బరువు గణనీయంగా తగ్గుతోంది. ఇక్కడ వలిచిన కాయ సైజు 250 గ్రాములకు మించడం లేదని రైతులు వాపోతున్నారు. కాయ బరువు తగ్గడమే కాదు.. కాయ స్వరూపం మరింత కోలగా మారిపోతోంది. కోనసీమతోపాటు తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, ముమ్మిడివరం, తాళ్లరేవు, తొండంగి మండలాల పరిధిలో ఆక్వా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి ఎక్కువగా సాగయ్యే నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఆకివీడు తదితర మండలాల్లో సుమారు 25 వేల ఎకరాలకు పైబడి కొబ్బరి తోటలు ఆక్వాబారిన పడి కాయ సైజు తగ్గిపోతోంది. ఉప్పు వల్ల ముప్పు ఇటీవల ఆక్వా సాగు విస్తీర్ణం పెరుగుతున్న స్థాయిలోనే కొబ్బరికి నష్టం కలుగుతోంది. ఆక్వా ప్రభావం వల్ల ఇప్పటికే వందలాది కొబ్బరి చెట్లు మోడువారిన విషయం తెలిసిందే. ఇది వెనామీ రొయ్యల్ని పెంచే చెరువు గట్ల మీద ఉన్న కొబ్బరి చెట్లకు మాత్రమే పరిమితమైందని రైతులు భావించేవారు. కానీ.. భూమి పొరల ద్వారా వస్తున్న ఆక్వా ఉప్పు నీటివల్ల కలుగుతున్న నష్టాన్ని గుర్తించలేకపోయారు. ఆక్వా సాగు చేస్తే చెరువు చుట్టూ సుమారు 2 కిలోమీటర్ల పరిధిలోని భూమిలో సూక్ష్మ పోషకాలు నశించడంతోపాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. నీరు ఉప్పగా మారిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకున్నవారు లేరు. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. కొబ్బరికి భూమి ద్వారా సహజ సిద్ధంగా అందే నీరు ఉప్పగా మారడంతో తెగుళ్లు, పురుగుల దాడిని తట్టుకునే శక్తిని కోల్పోతోంది. మరోవైపు పోషకాలు అందక కొబ్బరికాయ సైజు తగ్గుతోంది. ఫలితంగా ఇక్కడ పండే కొబ్బరి కాయలకు డిమాండ్ తగ్గి ధర పడిపోతోంది. ఇతర రాష్ట్రాల్లో పండే కొబ్బరి కాయల్లో నూనె శాతం 69 ఉంటే.. ఇక్కడి కాయల్లో 61 శాతం మాత్రమే ఉంటోంది. ఫలితంగా ఈ ప్రాంత కొబ్బరి ధరలు దారుణంగా పతనమయ్యాయి. రానున్న రోజుల్లో మరింతగా దిగజారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉప్పు సాంద్రత ప్రమాదకర స్థాయిలో ఉంది ఆక్వా సాగు వల్ల, సముద్రం ఎగదన్ని వస్తున్నందు వల్ల నదులు, మురుగునీటి కాలువల్లో ఉప్పు సాంద్రత ప్రమాదకర స్థాయికి పెరిగింది. భూగర్భ జలాలు సైతం ఉప్పు బారిన పడుతున్నాయి. మరోవైపు కొబ్బరి ఆక్వా బారిన పడటంతో రోగ నిరోధక శక్తి తగ్గుతోంది. కోనసీమలో చాలాచోట్ల లవణాల సాంద్రత 2000 పీపీఎం దాటింది. ఇది ప్రమాద తీవ్రతకు సూచిక. ఈ పరిస్థితులే కొబ్బరి కాయ సైజు తగ్గడానికి, దిగుబడి పడిపోవడానికి కారణం. – డాక్టర్ పి.కృష్ణకిశోర్, ప్రిన్సిపాల్, ఎస్కేబీఆర్ పీజీ కాలేజీ, అమలాపురం శక్తి హరిస్తోంది ఆక్వా చెరువుల వల్ల భూగర్భ జలాల్లో లవణ శాతం పెరిగి కొబ్బరి చెట్లకు సూక్ష్మ పోషకాలు, ప్రొటీన్లు అందడం లేదు. దీనివల్ల చెట్టు శక్తిహీనమై దిగుబడి తగ్గుతోంది. గడిచిన ఐదేళ్లలో కాయ సైజు భారీగా తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే కష్టం. ఆక్వా చెరువుల చుట్టూ ఉన్న చెట్లకు నల్లముట్టి పురుగు, తెల్లదోమ ఉధృతి కూడా ఎక్కువైంది. –ఎన్‌బీవీ చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
కోనసీమ తిరుపతిలో వైభవంగా దివ్యకల్యాణం
రాజమండ్రి: కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలోని వాడపల్లి వెంకటేశ్వరస్వామి దివ్యకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రధానాలయం నుంచి పల్లకిపై కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. విశ్వక్సేన పూజ, రక్షాబంధనం, మధు పర్కప్రాసన, కన్యాధానం కార్యక్రమాలను వేద పండితులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. -
కోనసీమ తిరుపతిలో వైభవంగా దివ్యకల్యాణం
-
కో‘ఢీ’ పందాలకు సర్వం సిద్ధం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. డూడూ బసవన్నలు, హరిదాసులు పల్లెటూర్లలో సందడి చేస్తున్నారు. ఇంటిముందు తీర్చిదిద్దిన రంగ వల్లులతో ప్రతి పల్లె కలర్ ఫుల్ గా కనపడుతోంది. సంక్రాంతి పండుగ స్పెషల్ కోడి పందాలకు నిర్వాహకులు బరులు సిద్ధం చేసుకుంటున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో నిర్వహించే కోడి పందాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా జనాలు తరలివస్తున్నారు. వీఐపీల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భీమవరం, ఏలూరు, నరసాపురం, అమలాపురం, కాకినాడ ప్రాంతాల్లోని హోటల్ గదులు ఇప్పటికే బుక్ అయిపోయాయి. కోడి పందాలతో పాటు గుండాట, పేకాటకు కూడా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా పందాలను నిర్వహించడానికి ఫ్లడ్ లైట్లను కూడా వాడుతున్నారు. పోలీసులు తమ జోలికి రాకుండా చూడాలంటూ అధికార పార్టీ నేతలపై పందెం రాయుళ్లు ఒత్తిడి తెస్తున్నారు. ఈ సారి పందేలు 100 కోట్ల రూపాయలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు పందాలు జరగకుండా అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు. పొట్టేళ్లు, కోడి పందాలకు బరులు సిద్ధం.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో పొట్టేళ్లు, కోడి పందాలకు బరులు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో పందాలు నిర్వహణకు సర్వం సిద్దమయ్యాయి. పందాలకు హైదరాబాద్ నుంచి అంపాపురంకు పొట్టేళ్లు చేరుకున్నాయి. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి పందెం కోళ్లను తరలించారు. దివిసీమలో ఘనంగా పడవ పోటీలు.. సంక్రాంతి పండుగను పురస్కరించుకోని కృష్ణా జిల్లా నాగాయలంకలో దివిసీమ సంప్రదాయ పడవ పోటీలు ప్రారంభం అయ్యాయి. మండలి చైర్మన్ బుద్ధప్రసాద్ ఆదివారం ఈ పోటీలను ప్రారంభించారు. తొలి రోజు నాటు(కోల) పడవల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో 40 టీమ్‌లు పాల్గొన్నాయి. తెలంగాణలోను కోడి పందాలు.. ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఖమ్మంతో పాటు.. తెలంగాణలోని పలు పల్లెల్లో కూడా కోడి పందాలు నిర్వహణకు రంగం సిద్దమైంది. సత్తుపల్లిలో పందెం రాయుళ్లు కోడి పందాలకు బరులు సిద్ధం చేశారు. పండుగ సంబరాల పేరుతో చేపడుతున్న ఈ పందాలను ఎలాగైనా అడ్డుకుని తీరుతామని పోలీసులు చెబుతున్నారు. -
సిరుల కోనసీమా.. నీకెన్ని కష్టాలమ్మా!
సాక్షి, రాజోలు: ‘‘బయటి ప్రపంచానికి కోనసీమ అంటే చాలా సిరిసంపదలున్న ప్రాంతంగా అనిపిస్తుంది. కానీ గడిచిన నాలుగేళ్లుగా చంద్రబాబు దుర్మార్గ పాలనలో ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. గోదావరి ప్రవహించే ఈ గడ్డపై మంచినీళ్ల కోసం జనం ఇక్కట్లు పడుతున్నారు. వరికి కనీసమద్దతు ధర దొరకడంలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొబ్బరి ధర 4వేల రూపాయలు పడిపోయింది. బోరు వేస్తే ఉప్పునీళ్లు, లేదంటే ఆయిల్ కంపెనీల కారణంగా కలుషితమైన నీరు వస్తుంది. కోనసీమ దాహార్తిని తీర్చేందుకు దివంగత మహానేత వైఎస్సార్ ప్రారంభించిన నీటిశుద్ధి కేంద్రాలను ప్రభుత్వం సరిగా నిర్వహించడంలేదు. సంపదగల ఈ ప్రాంతం నుంచే చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. దేశంకాని దేశంలో ఘోరమైన కష్టాలు అనుభవిస్తోన్న వారిని ఇక్కడి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలులేవు. ఈ ప్రాంతానికి పట్టిన చంద్రబాబు పీడ విరగడయ్యేరోజులు దగ్గర్లోనే ఉన్నాయి. జనం ఆశీర్వాదంతో రాబోయే ప్రజా ప్రభుత్వంలో కోనసీమకు తిరిగి జీవం పోస్తామని మాటిస్తున్నా..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 194వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దళారీల నాయకుడు చంద్రబాబు: ధాన్యం పండిచే రైతులు, కొబ్బరి రైతులు, తమలపాకు రైతులు, సరుగుడు సాగుదారులు... ఎవర్ని కసిలినా కష్టాలు, కన్నీళ్లే. ఇక కూలీల పరిస్థితైతే ఇంకా దారుణం. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. కోనసీమలో రబీ పంటకు సాగునీరు లేదు. సరే, ఏదోరకంగా కాపాడుకుని పంటను మార్కెట్‌కు తీసుకొస్తే కనీస మద్దతు ధర దొకదు. ధాన్యం దళారీలపాలైపోయిన తర్వాతగానీ కొనుగోలు కేంద్రాలను తెరవడు ఈ ముఖ్యమంత్రి. దళారీలకు పెద్ద నాయకుడు చంద్రబాబు కాబట్టే రైతులు, పేదల కష్టాలు రెట్టింపు అయ్యాయి. నాలుగేళ్ల పాటు ప్రజల కష్టాలు పట్టించుకోకుండా.. ఇంకో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని పట్టించుకున్నట్లు నటించడం మొదలుపెట్టాడు. ఈయన తీరు చూస్తుంటే నాకొక కథ గుర్తుకొస్తోంది... సార్.. టైమిస్తే స్టేట్ ఫస్టొస్తా!: అనగనగా ఒక విద్యార్థి ఉన్నాడు.. ఈ చంద్రబాబు మాదిరి. ఆ విద్యార్థి వార్షిక పరీక్షలు రాయడానికి వెళ్లాడు. మూడు గంటల పరీక్షలో రెండున్నర గంటలు ఏమీ రాయకుండా కూర్చున్నాడు. తీరా పరీక్ష సమయం దగ్గరపడుతుందనగా, మాస్టారు దగ్గరికొచ్చి.. ‘సార్.. నాకు ఇంకో మూడు గంటలు టైమివ్వండి పరీక్ష రాస్తాను’ అన్నాడు. విద్యార్థి తీరుకు విస్తుపోయిన మాస్టారు.. ‘మరి ఇంతసేపు ఏం చేశావయ్యా!’ అని నిలదీస్తాడు. అప్పుడా విద్యార్థి.. ‘సార్, మీరు నెల టైమిస్తే స్టేట్ ఫస్ట్ వస్తా, ఐదు నెలలు టైమిస్తే ప్రపంచంలోనే ఫస్టొస్తా..’ అని చెబుతాడు.. 2020 కల్లా దేశంలో, 2050 కల్లా ప్రపంచంలో ఏపీని నంబర్ వన్ చేస్తానంటున్న చంద్రబాబు ఈ కథలోని విద్యార్థి అయితే, మాస్టారుగా ఆయన్ని నిలదీసేది ప్రజలు. బాబు చేతిలో మోసపోనివారు లేరు: రైతు రుణాల మాఫీ, డ్వాక్రా పొదుపు సంఘాల రుణాల మాఫీ, ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ భృతి, కులానికో పేజీ చొప్పున అన్ని కులాలకు మేలు... అంటూ పెద్ద ఎత్తున హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటిలో ఏఒక్కదానినైనా నెరవేర్చాడా? కాపులకు రిజర్వేషన్ ఇస్తానన్నది ఈయనే కదా, ఆ విషయం అడిగితే వాళ్లను తిడతాడు, రిజర్వేషన్ అడిగిన మత్స్యకారుల తాటతీస్తానంటాడు, న్యాయం చేయమని వచ్చిన నాయీ బ్రహాహ్మణులనేమో తొకలు కత్తిరిస్తానని బెదిరిస్తాడు. అసలు ఇలాంటి వాడు మనిషేనా, ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉన్నదా అని అడుగుతున్నాను.. అయ్యయ్యో మీకు ఏమీ రావట్లేదా?: నాలుగేళ్లూ కళ్లుమూసుకున్న చంద్రబాబు ఆరునెల్లో ఎన్నికలుండటంతో కపటనాటకాలు మొదలుపెట్టాడు. అయ్యయ్యో.. మీకు పెన్షన్లు రావట్లేదా, రేషన్ కార్డులు లేవా.. మీకు బియ్యం రావట్లేదా.. ఆగండి.. ఇప్పుడే ఆఫీసర్లకు ఆర్డర్ ఇస్తా.. అంటాడు. ఇళ్ల స్థలాల కోసం కోట్లు కుమ్మరిస్తున్నానంటాడు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు అన్నా క్యాంటీన్లు, రెండు రూపాలయలకే మంచినీరు, ఆక్వా రైతుల కోసం ఏదో చేసినట్లు బిల్డప్ ఇస్తాడు. విభజన హామీలు చేయలేదు కాబట్టి ఎన్టీఏ నుంచి బయటికొస్తా అంటాడు. అయ్యయ్యో.. ప్రత్యేక హోదా రాలేదా, మోదీతో పోరాడుతా.. అని ఢిల్లీకి పోయి మోదీ ముందు వంగివంగి సలామ్‌లు చేస్తాడు.. ఈ మోసకారిని క్షమించొద్దు: ఈ చెడిపోయిన వ్యవస్థ మారాలంటే ప్రజలందరూ సహకరించాలి. ఒక నాయకుడు మాట చెప్పి, దాన్ని నెరవేర్చని పక్షంలో రాజీనామాచేసే రోజులు రావాలి. పొరపాటునగానీ ఈ దుర్మార్గ చంద్రబాబును క్షమిస్తే, మరిన్ని ఆకర్షణలతో ప్రజలముందుకొస్తాడు. ఇంటికో కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానంటాడు. ఓటుకు మూడు వేలు చొప్పున కొనే ప్రయత్నం చేస్తాడు. అతను ఇచ్చేవి తీసుకున్నా పర్లేదుగానీ, ఓటు మాత్రం మీ మనస్సాక్షిని అనుసరించి వేయండి. మోసగాళ్లు, అవినీతిపరులు మనకు నాయకులుగా ఉండటం శ్రేయస్కరంకాదని గుర్తించాలి... డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాం: దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో మన ప్రజా ప్రభుత్వం ఏర్పడితే ఏమేం చేస్తామన్నది నవరత్నాల ద్వారా వివరించాం. ఈ రోజు డ్వాక్రా మహిళల కోసం ఏమేం చేయబోతున్నామో మరోసారి గుర్తుచేసుకుందాం.... ఎన్నికల నాటికి ఎంతైతే బ్యాంకుల్లో అప్పు ఉంటుందో ఆ అప్పంతా నేరుగా అక్కచెల్లెమ్మలకే నాలుగు దఫాలుగా ఇస్తాం. వడ్డీ లేకుండా రుణాలు అందిస్తాం. ఆ వడ్డీని ప్రభుత్వమే చెల్లించే ఏర్పాట్లు చేస్తాం. గతంలో మహానేత వైఎస్సార్ రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు కట్టించారు. ఆయన బాటలోనే ఇంకా ఇల్లులేని ప్రతి పేదకూ పక్కా ఇల్లు కట్టిస్తానని మాటిస్తున్నా. ఆ ఇల్లు అక్కచెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తాను. ఎప్పుడైనా హఠాత్తుగా డబ్బు అవసరమైతే, నేరుగా బ్యాంకు వెళ్లి ఇంటిపై పావలా వడ్డీకే రుణం తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తాం. మనం అధికారంలోకి వచ్చాక విడదలవారీగా మద్యనిషేధాన్ని అమలులోకి తెచ్చుకుందాం. ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నా...’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
కోనసీమలో ఆక్వా పంజా
-
కోనసీమకు... గ్యాస్ ట్రబుల్!
గోదావరి గలగలలు.. స్వాగతం పలికే ఏటిగట్లు.. కొబ్బరి చెట్లు.. ఇలా అడుగడుగునా ప్రకృతి సోయగాల నిలయం కోనసీమ ప్రాంతం. ఇప్పుడీ అందాల సీమ గత కొన్నేళ్లుగా గ్యాస్ లీకేజీలవల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటోంది. తరచూ ఓఎన్జీసీ, గెయిల్‌లకు చెందిన గ్యాస్ పైపులైన్ల లీకేజీలు.. కాలం చెల్లిన పైపులైన్లతో ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందోనని దినదినగండంలా బతుకుతోంది. కొత్త బావుల అన్వేషణకు వేల కోట్లు ప్రైవేటు సంస్థలకు ధారపోస్తున్న ఆయిల్ సంస్థలు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారిన పైపులైన్ల పునరుద్ధరణకు మాత్రం ముందుకు రావడంలేదు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఉభయగోదావరి, కృష్టాజిల్లా పరిధిలో విస్తరించి ఉంది. మూడు జిల్లాలో దాదాపు 600 బావులు తవ్వారు. వీటిలో ప్రస్తుతం 110 గ్యాస్, 43 ఆయిల్ బావులు మాత్రమే పనిచేస్తు న్నాయి. జిల్లాల్లో మోరి, అడవిపాలెం, పొన్నమండ, కేసనపల్లి దక్షిణం, కేసనపల్లి తూర్పు, పాసర్లపూడి, ఎండమూరుల్లో గ్యాస్ కలెక్టింగ్ సెంటర్లు (జీసీఎస్) ఉన్నాయి. మూడు జిల్లాల పరిధిలో 710కి.మీ.మేర పైపులైన్లున్నాయి. ఇందులో 90 శాతం తూర్పు గోదావరి జిల్లాలోనే ఉన్నాయి. ప్రస్తుతం రాజమహేంద్ర వరం అసెట్ రోజుకు 816 మెట్రిక్ టన్నుల ఆయిల్, 2.839 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి జరుగుతోంది. జిల్లాలో ఎక్కువగా కేసవదాసుపాలెం (మోరీ) జీసీఎల్ పరిధిలోని పైపులైన్లు తరచూ లీక్ అవుతున్నాయి. ఓఎన్జీసీ పనిలా... భూగర్భంలో ఉన్న చమురు, గ్యాస్ నిక్షేపాలను వెలికితీస్తుంది. ఆయిల్‌ను మాత్రమే ఈ సంస్థ శుద్ధిచేసి విక్రయిస్తుంది. ఆయిల్ నుంచి గ్యాస్‌ను విడగొట్టి గెయిల్‌కు విక్రయిస్తుంది. గెయిల్ (గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) పనిలా... ఈ సంస్థ ఓఎన్జీసీ నుంచి చమురు కొనుగోలు చేసి దేశంలోని వివిధ పవర్ ప్రాజెక్టులకు, ఎరువులు తదితర భారీ ఫ్యాక్టరీలకు ప్రత్యేక పైప్లైన్లను వేసి గ్యాస్‌ను విక్రయిస్తుంది. కేజీ బేసిన్లో గెయిల్ పైప్లైన్లు, ఓఎన్జీసీ పైప్లైన్లు వేర్వేరుగా ఉంటాయి. నగరం ఘటనతో వణికిపోతున్న జనం... కోనసీమలోని నగరం గ్రామంలో 2014 జూన్ 27న గ్యాస్ పైప్‌లైన్ విస్ఫోటం జరిగింది. అక్కడ నుంచి విజయవాడ సమీ పంలోని ల్యాంకో విద్యుత్ ప్రాజెక్టుకు సరఫరా చేసే సహజ వాయువు పైప్‌లైన్ పేలిపోయింది. ఈ భారీ విస్ఫోటంలో 22 మంది మత్యువాత పడగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతటి ప్రమాదం మరోసారి జరగకపోయినా దాని ఆనవాళ్లు తరుచూ లీకేజీలతో బయటపడుతున్నాయి. నిపుణులు ఏమంటున్నారంటే.. ఓఎన్జీసీ బావుల ద్వారా ఉత్పత్తి అవుతున్న చమురు, సహజ వాయువు నిక్షేపాలను గ్యాస్ కలెక్టింగ్ స్షేషన్ (జీసీఎస్)లకు తరలించేందుకు నాలుగు అంగుళాల పరిమాణం కలిగిన పైప్లైన్లు వేస్తారు. పైపు పైభాగంలో రబ్బర్ కోటింగ్‌తో కూడిన పేపర్‌ను చుట్టి భూ అంతర్భాగంలో రెండు మీటర్ల లోతులో ఏర్పాటుచేస్తారు. ఇలా వేసిన పైపులు 30 ఏళ్లు పనిచేయాల్సి ఉండగా కేవలం 20 ఏళ్లకే పాడైపోతున్నాయని ఓఎన్జీసీ నిపుణులు చెబుతున్నారు. అలాగే, బావుల నుంచి నిక్షేపాల పరిమాణం తగ్గిపోవడంతో ఇసుక వస్తోందని, దీనివల్ల పైపులు కోతకు గురవుతున్నాయంటున్నారు. భూమిలో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉండడం కూడా పైపులు త్వరగా పాడైపోవడానికి ఒక కారణం కావచ్చని చెబుతున్నారు. అలాగే, రైతులు ట్రాక్టర్లతో దున్నడం.. దమ్ము చేయడం కూడా పైపులు పాడైపోవడానికి కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు. ఇవీ లోపాలు.. - బావులకు గతంలో సెక్యూరిటీ గార్డులుండేవారు. ఇప్పుడీ వ్యవస్థను రద్దు చేయడంతో ఎక్కడేం జరుగుతుందో తెలియడంలేదు. బావుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటుచేసి వదిలేస్తున్నారు. నిబంధనల ప్రకారం జనసంచారం ఉన్న చోట పైపులైన్లు వేయకూడదు. - లీకేజీ చోటుచేసుకున్నప్పుడు ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ ఇక్కడ అందుబాటులో లేదు. అదే విదేశాల్లోనైతే ఎక్కడికక్కడ లాకింగ్ సిస్టమ్‌ను పక్కాగా అమలుచేస్తున్నారు. ప్రమాదాల తీవ్రతను తగ్గించగలుతున్నారు. - అధికారుల పర్యవేక్షణ సరిగ్గా ఉండటంలేదు. సిబ్బంది మధ్య సమన్వయ లోపం ఉంది. తరుచూ తనిఖీలు చేయడంలేదన్న విమర్శలున్నాయి. పాడైన పైపులైన్లు వెంటనే గుర్తించడంలేదు. పైపులైన్ల నుంచి కొన్నిచోట్ల ముడిచమురు చోరీ జరుగుతోంది. మమ్మల్ని పట్టించుకోలేదు నగరం పేలుడులో తీవ్రంగా గాయపడ్డా. నాతోపాటు మా కుటుంబంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు పరిహారం ఇచ్చారు. నాకు నాలుగున్నర నెలలపాటు గెయిల్ ఆధ్వర్యంలోనే చికిత్స అందించారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. తదుపరి ఆరు నెలలపాటు ఆస్పత్రిలో చికిత్స పొందాను. గెయిల్ ఇచ్చిన ఐదు లక్షలతోపాటు అదనంగా మరో రూ.2.25 లక్షలు ఖర్చయింది. ఇళ్లు దెబ్బతిన్నందుకుగాను పరిహారం ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు. ఇప్పటికీ గెయిల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా. – బోనం పెద్దిరాజు, నగరం సాయం కోసం పేలుడు సంఘటనలో నా కొడుకులు మోహన వెంకటకృష్ణ, మధుసూదన్, మామయ్య వెంకటేశ్వర రావు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద కొడుకు వెంకట కృష్ణ పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగా ఉంది. రెండు చేతులు సరిగ్గా పనిచేయడంలేదు. చేతులకు అపరేషన్ గురించి పట్టించుకోలేదు. ఆపరేషన్‌కు అయిదు లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అంత స్థోమత మాకు లేదు. గెయిల్ వారే ఆ ఖర్చు భరించాల్సి ఉంది. దీంతోపాటు పిల్లలకు చదువు చెప్పిస్తామన్నారు. దరఖాస్తు చేసినా ఫలితం లేదు. – వానరాశి దుర్గాదేవి, బాధితురాలు.. పక్కన వెంకటకృష్ణ అమలుకు నోచుకోని హామీలు... - 27 మంది మృతి చెందిన ఘటన చోటుచేసుకున్న నగరం గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామంటూ చేసిన వాగ్దానం నేటికీ అమలుకు నోచుకోలేదు. - రాష్ట్ర పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో 200 మంది ఉద్యోగులు 20 రోజులపాటు రెండు విడతలుగా చేసిన ఇంటింటి సర్వేను ఇంతవరకూ అమలుచేయలేదు. - ‘నగరం’లో కమ్యూనికేషన్ స్కిల్ సెంటర్ ఏర్పాటుచేస్తామన్న హామీకి మోక్షం కలగలేదు. - స్థానికంగా ఉన్న పీహెచ్‌సీని అభివృద్ధి చేస్తామన్నారు. ఇంతవరకు ఒక్కపైసా ఇవ్వలేదు. - నగరం ఘటనలో బాధితులకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఒక్కరికీ చేయలేదు. గాయపడ్డ వారికీ ఆర్థిక సాయం పూర్తిస్థాయిలో అందలేదు. నగరం ఘటన తర్వాత ప్రధాన లీకేజీలు.. - మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం గ్రామాల్లో 2015లో ఓఎన్జీసీ బావి లీకైంది. ఇదే మండలం గొల్లపాలెంలో 2016 నవంబరులో ముడి చమురు పైపు పేలింది. 2017 ఫిబ్రవరిలో తూర్పుపాలెం డ్రిల్లింగ్ బావిలో బ్లోఅవుట్ ప్రమాదం తృటితో తప్పింది. - రాజోలు మండలం వేగివారిపాలెంలో ఆయిల్, గ్యాస్ పైప్‌లైన్ లీకైంది. - సఖినేటిపల్లి మండలం మోరిలో గత ఏడాది గ్యాస్ పైప్‌లైన్ పేలింది. - ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అంతర్వేదికరలోని ఓఎన్జీసీ సైటులో కేవీ 5, 20 బావులకు సంబంధించిన ఉమ్మడి పైపులైను తుప్పుపట్టి కేశవదాసుపాలెం వరిచేలో భారీగా గ్యాస్ ఎగజిమ్మింది. అదే ప్రాంతంలో కేవీ 13, 14 బావుల పైపు లైను నుంచి గ్యాస్‌తో కూడిన చమురు ఎగజిమ్మింది. అంతర్వేదికరలోని కేవీ 15 బావికి చెందిన పైపులైను నుంచి కేశవదాసుపాలెంలో వరిచేలో గ్యాస్ ఎగిసిపడింది. - గతనెల 23న అంతర్వేదికరలోని కేవీ 49–4 నంబర్ బావి నుంచి మోరి జీసీఎస్‌కు సరఫరా చేస్తున్న పైపు నుంచి కేశవదాసుపాలెంలో గ్యాస్ లీకైంది. అదే నెల 28న అంతర్వేదికర గ్రామంలో ఓఎన్జీసీ వెల్ నం.11 వద్ద సుమారు రెండు గంటలపాటు గ్యాస్ లీకైంది. - ఈ నెల 4న కేశవదాసుపాలెంలో మోరి జీసీఎస్ సమీపంలోని కేవీ 22 బావి నుంచి గ్యాస్‌ను సరఫరా చేస్తున్న పైపు ద్వారా గ్యాస్ లీకైంది. - కేశవదాసుపాలెం చేలో ఉన్న పైపు నుంచి రెండు గంటలపాటు గ్యాస్‌తో కూడిన చమురు ఎగజిమ్మింది. నెలకోసారి చొప్పున ఇక్కడ గ్యాస్, ముడి చమురు లీకవుతున్నా పట్టించుకోవడంలేదు. ఇలా ఇంకా అనేకం సంఘటనలు జరుగుతున్నా పైపులైన్ల లీకేజీని నియంత్రించే చర్యలు కనిపించడం లేదు. ప్రధాన కారణాలివే.. - ప్రస్తుతం గ్యాస్, ఆయిల్ సరఫరా అవుతున్న పైపులైన్లలో చాలావరకూ 20 ఏళ్ల క్రితం వేసినవే. సాధారణంగా పదేళ్లకోసారి పైపులైన్లు మార్చాల్సి ఉంది. తుప్పు పట్టినా చూసీచూడనట్టు వదిలేస్తున్నారే తప్ప మార్చేందుకు ప్రయత్నించడంలేదు. - ఇక పైప్లైన్లు దెబ్బతినడానికి మరో ప్రధాన కారణం.. ఆయిల్, గ్యాస్ సరఫరా చేసే పైపులలో నీరు ప్రవహించడం. దీన్నివల్ల పైపులైన్లు వేగంగా తుప్పుపట్టి పోతున్నాయి. ఆయిల్, గ్యాస్‌తోపాటు వచ్చే నీటిని అదుపుచేయడం సాధ్యపడటంలేదు. అందుకుతగ్గ సాంకేతిక నైపుణ్యంతోపాటు పైపులైన్ల పర్యవేక్షణకు సంబంధించిన పరికరాలూ ఈ సంస్థల వద్ద లేవు. - గల్ఫ్ వంటి దేశాలలో సుమారు 20 అడుగుల లోతులో, 6 మీటర్ల వెడల్పున స్థలాన్ని సేకరించి పైపులు వేస్తారు. ఆ స్థలంలో రైతులు, స్థల యజమానులు ఎటువంటి పనులు చేపట్టకుండా గట్టి భద్రతా చర్యలుంటాయి. కానీ, మన దేశంలో కేవలం మూడు నుంచి నాలుగు అడుగుల లోతునే పైప్ లైన్లను, అదీ నివాస ప్రాంతాల మీదుగా కూడా వేసినట్టు తెలుస్తోంది. దీంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. -
పిల్లలకు దానగుణం నేర్పించండి
తల్లిదండ్రులకు మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ లక్ష్మీనారాయణ సూచన ఘనంగా కోనసీమ ఐ బ్యాంక్ సప్తమ వార్షికోత్సవం అమలాపురం టౌన్ : పుట్టినరోజు వేడుకలు చేసుకుని అవి వాట్సాప్‌ల్లో పెట్టి ఆనందించే నేటి యువత అదే పుట్టిన రోజున రక్తం దానం చేసి ఆ దృశ్యాన్ని వాట్సాప్‌ల్లో పెట్టినప్పుడు వచ్చే ఫలితాలు పవిత్రం, పరమార్థంతో ఉంటాయని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మహారాష్ట్ర అడిషనల్ డీజీసీ లక్ష్మీనారాయణ అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇదే స్ఫూర్తిని.. దానగుణాన్ని నేర్పించాలని ఆయన సూచించారు. అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం జరిగిన యర్రా బలరామమూర్తి కోనసీమ ఐ బ్యాంక్ సప్తమ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవ సేవే మాధవ సేవ సూక్తిని అందరూ తప్పకు పాటించాలని లక్ష్మీనారాయణ సూచించారు. నేత్ర, అవయవ, రక్త దానాలు చేయడం అలవర్చుకోవాలని కోరారు. మనం చనిపోయిన తర్వాత మన్నులో కలిసిపోయే అవయవాలను నిర్వీర్యం చేసే కంటే అవయవదానం చేస్తే మన మరణాంతరం మానవాళికి ఉపయోగపడతాయని గుర్తు చేశారు. ఒక పల్లె ప్రాంతమైన కోనసీమలో యర్రా బలరామమూర్తి ఐ బ్యాంక్ గత ఏడేళ్లలో 1200 కార్నియాలను సేకరించి 700 మందికి కంటి చూపు ఇచ్చేందుకు దోహదపడిదంటే సాధారణ విషయం కాదని లక్ష్మీనారాయణ అన్నారు. ఆ ఐబ్యాంక్ చైర్మన్ యర్రా నాగబాబును, వారి తండ్రి యర్రా బలరామమూర్తిని సభాముఖంగా ప్రశంసించారు. మనకు మంచి చేసినప్పుడు భగవంతుడికి మన థాంక్స్ చెప్పుకోవడం కాదు... సమాజ హితమైన నేత్ర, రక్త, అవయవ దానాలు చేసినప్పుడు భగవంతుడే మనకు థాంక్స్ చెప్పినట్టుగా మీ దానాలు పొందిన వారే పొగుడుతున్నప్పుడు అనిపిస్తుందని లక్ష్మీనారాయణ అన్నారు. ఐ బ్యాంక్ చైర్మన్ యర్రా నాగబాబు అధ్యక్షతన జరిగిన ఈ వేడుక సభలో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, పాముల రాజేశ్వరిదేవి, చిల్లా జగదీశ్వరి, రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు, రాష్ట్ర కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా నవీన్, రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ డైరెక్టర్ గణపతి వీర రాఘవులు, రాష్ట్ర కాపు వెబ్ సైట్ అధ్యక్షుడు యాళ్ల వరప్రసాద్ పాల్గొని ఐ బ్యాంక్ సేవలను కొనియాడారు. తొలుత వార్షికోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం నేత్రదానం చేసిన వారి కుటుంబీలకు, ప్రొత్సహించిన వారికి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. కోనసీమ ఐ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ అయ్యగారి వెంకటేశ్వరరావు, టెక్నీషియన్ కె. స్వర్ణలత సేవలను కూడా వక్తలు కొనియాడారు. -
కోనసీమలో నాఫెడ్ కేంద్రం?
సర్వేకు వస్తున్న ఆయిల్‌ఫెడ్ అధికారులు స్థానిక కొబ్బరి రైతులకు సమాచారం అమలాపురం/ అంబాజీపేట : కోనసీమలో మరోసారి నాఫెడ్ కేంద్రం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఆయిల్‌ఫెడ్ అధికారులు రెండు, మూడు రోజుల్లో మార్కెట్ సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు స్థానిక రైతు సంఘం ప్రతినిధులకు సమాచారం అందింది. అంబాజీపేట మార్కెట్లో ఎండు కొబ్బరి క్వింటాల్ ధర రూ.7 వేల వరకూ ఉంది. ఇదే సమయంలో వెయ్యి పచ్చికాయల ధర రూ.7 వేలు ఉంది. పచ్చికాయ, ఎండుకొబ్బరి ధరలు ఒకేలా ఉండడంతో రైతులు ఎండుకొబ్బరి తయారీ దాదాపు నిలిపివేశారు. గత ఫిబ్రవరిలో క్వింటాల్ రూ.8.500 ఉండగా, పచ్చికాయ ధర కూడా రూ.8,500 ఉంది. మార్చి నాటికి ఎండుకొబ్బరి ధర రూ.8 వేలకు, పచ్చికాయ ధర రూ.7 వేలకు తగ్గింది. ఏప్రిల్ నెలలో ఎండుకొబ్బరి ధర రూ.7,800, పచ్చికాయ ధర రూ.7,300 తగ్గింది. తాజాగా ఈ రెండు ఉత్పత్తుల ధరలు రూ.ఏడు వేలకు చేరాయి. దీంతో రైతుల్లో కలవరం మొదలైంది. సిండికేట్‌గా మారిన వ్యాపారులు? డిమాండ్ ఉన్నా వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు తగ్గిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఎండు కొబ్బరిని కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,500 చొప్పున కొనుగోలు చేస్తారు. బయట మార్కెట్ కన్నా ఇది తక్కువే అయినా కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే ధర మరింత పతనమయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమలో కాకున్నా కనీసం కొబ్బరి వాణిజ్య కేంద్రమైన అంబాజీపేటలోనైనా నాఫెడ్ కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు పట్టుబడుతున్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన రైతుల సమావేశంలో ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి ఈ విషయంపై భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల జమ్మిల్ నుంచి వివరాలు సేకరించారు. మార్కెట్లో ధర ఉంది కదా? ఇప్పుడెందుకు కేంద్రాలని ఆయన ప్రశ్నించారు. నెల రోజుల నుంచి ధర పడిపోతోందని, కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే రైతులు మరింత నష్టపోతారని బీకేఎస్ ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన ఆయన నాఫెడ్‌కు నోడల్ ఏజెన్సీ అయిన ఆయిల్‌ఫెడ్ అధికారులకు ఈ కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. ఇందుకు స్పందించిన ఆ సంస్థ అధికారులు కోనసీమలో మార్కెట్ సర్వే చేసేందుకు రెండు, మూడు రోజుల్లో వస్తున్నట్టు స్థానిక రైతు సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో... జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రాల్లో పెద్దగా కొనుగోళ్లు లేకున్నా.. రైతులకు కొంతలో కొంతైనా కనీస మద్దతు ధర దక్కుతోంది. ఇవి లేకుంటే ఇప్పుడున్న ధర కూడా రాదని రైతుల అభిప్రాయం. కొబ్బరి రైతులు సైతం ఇదే తరహాలో తమకు నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
కోనసీమలో మాంగల్యం తంతునానేనా
అమలాపురం టౌ¯ŒS: కోనసీమకు చెందిన వర్ధమాన సినీ హీరో చేత¯ŒS శ్రీను ఈ సీమ పచ్చని పల్లెల్లోనే ప్రేమలో పడి పెళ్లి కొడుకయ్యాడు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. ఇదంతా నిజ జీవితంలో కాదండోయ్... ‘మాంగల్యం తంతు నానేనా’ చిత్రం షూటింగ్లో భాగంగా. మానసి మూవీస్ పతాకంపై దర్శకుడు మల్లిబాబు తెరకెక్కిస్తున్న ‘మాంగల్యం తంతునానేనా’ చిత్రంలో హీరో చేత¯ŒS శ్రీను లవర్ బోయ్‌గా నటిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన హీరో కోనసీమలో పల్లెటూరిలో ఉన్న అమ్మాయికి మధ్య జరిగే ప్రేమాయణమే ఈ చిత్రకథ. కోనసీమలోని అంతర్వేది, అల్లవరం మండలం గూడాల, రాజోలు మండలం సోంపల్లి తదితర గ్రామాల్లోని ఈ సినిమా చిత్రీకరణ జరిగిం.? ఇక్కడి వరి చేలు, గోదావరి గట్లు, ఏటి గట్లపై హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలతో ఓ పాట కూడా చిత్రీకించారు. గూడాలలో వారిద్దరి పెళ్లి చూపులు, పెళ్లి తతంగం దృశ్యాలను తెరకెక్కించారు. వినూత్నంగా ‘పెళి్లకి ముందు ప్రేమ కథ’ పాటల విడుదల తాను హీరోగా నటించిన, చిత్రీకరణ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్న ‘పెళి్లకి ముందు ప్రేమ కథ’ చిత్రం పాటలను తమ నిర్మాత, దర్శకుడు వినూత్నంగా విడుదల చేయాలనే ప్రయత్నంలో ఉన్నారని హీరో చేత¯ŒS శ్రీను తెలిపారు. అమలాపురంలోని ప్రసిద్ధ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ మేడిది రమేష్‌బాబు స్వగృహంతో చేత¯ŒS శ్రీను మంగళవారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. నిజజీవితంలో హీరో హీరోయిన్ల జంటలతో ఈ సినిమాలోని ఒక్కో పాటను విడుదల చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. నాగార్జున, అమల, శ్రీకాంత్, ఊహ, రాజశేఖర్, జీవిత, వరుణ్ సందేశ్, హృత్రిక, నందూ, గీతామాధురి దంపతుల చేతుల మీదుగా చిత్రంలో ఐదు పాటలను విడుదల చేయనున్నారని చెప్పారు. ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ చిత్రంలో హీరోయి¯ŒSగా సునయన నటించిదన్నారు. మరో రెండు కొత్త చిత్రాల్లో తాను నటిస్తున్నానని, వాటికి ఇంకా పేర్లు పెట్టలేదని చేత¯ŒS శ్రీను తెలిపారు. అంతకు ముందు మేడిది నాగేంద్ర ఆధ్వర్యంలో యువకులు హీరో చేత¯ŒS శ్రీనుకు స్వాగతం పలికారు. సినీ నటుడు గనిశెట్టి రమణలాల్ కూడా పాల్గొన్నారు. -
కోనసీమలో ఐబీఎం ప్రతినిధులు
-పలు ప్రాంతాల్లో పర్యటన -కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల పరిశీలన అంబాజీపేట (పి.గన్నవరం) :కోనసీమలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల అ«ధ్యయనానికి ఇంటర్నేషన్ బిజినెస్ మెషీన్(ఐబీఎం)కు చెందిన ముగ్గురు ప్రతినిధులు శనివారం కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకంలో భాగంగా అమెరికాకు చెందిన మెర్రీలాన్, డెన్మార్క్‌కు చెందిన క్రిస్టిన్, ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్రీల బృందానికి ఇక్రిశాట్ మేనేజర్ జి.పార్థసారథి నాయకత్వం వహించారు. అంబాజీపేటలో విలేకరులతో సమావేశమయ్యారు. అయినవిల్లిలో కొబ్బరికాయల దింపు, వలుపు, కాయలను ముక్క పెట్టడం, ప్యాక్ హౌస్‌లలో నిల్వ చేయడాన్ని పరిశీలించారు. అయినవిల్లిలంకలో కొబ్బరి పీచు పరిశ్రమను సందర్శించి తాడు తయారీ, మార్కెటింగ్, కొబ్బరి తోటలలో అంతర పంటల సాగును పరిశీలించారు. అయినవిల్లికి చెందిన విళ్ళ దొరబాబు నిర్వహిస్తున్న ఎకో టూరిజంను సందర్శించి ఉద్యాన శాఖ విద్యార్థులకు ఏవిధంగా శిక్షణ ఇస్తున్నారో పరిశీలించారు. అమలాపురం రూరల్ మండలం చిందాడ గరువులో కొబ్బరి చెట్ల నుంచి కల్పరస తీసే విధానం, వర్మీ కంపోస్టు నిర్వహణ, ఒంగోలు జాతి ఆవుల సంరక్షణల గురించి నిర్వాహకుడు అడ్డాల గోపాలకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఎంట్రికోనలో కొబ్బరి కలెక్షన్ గ్రేడింగ్ సెంటర్‌ను సందర్శించారు. బండారులంకలో సమయమంతుల పండుకు పొలంలో కోప్రా డ్రైయర్, అరటి పళ్ళను సహజంగా ముగ్గపెట్టే పద్ధతిని పరిశీలించారు. అంబాజీపేటలోని కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ అధ్యక్షుడు గణపతి వీరరాఘవులుతో సమావేశమై కొబ్బరి కాయలు వలిచే యంత్రాన్ని, గణపతి బాబులుకు చెందిన మిల్లులో కొబ్బరి నూనె తీసే విధానాన్ని పరిశీలించారు. బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు నిర్మిస్తున్న ప్యాక్ హౌస్‌ను సందర్శించి ఆయన సాగు చేస్తున్న 24 రకాల మొక్కలను పరిశీలించారు. గత పది రోజులుగా ఈ బృందం ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లతో కలిసి వివిధ అంశాలపై అధ్యయనం చేస్తున్నారని, ప్రభుత్వానికి నేరుగా నివేదిక సమర్పిస్తారని ఇక్రిశాట్ మేనేజర్ పార్థసారథి తెలిపారు. వీరి వెంట అమలాపురం ఏడీహెచ్ సీహెచ్ శ్రీనివాస్, బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మీలు, ఉపాధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావు, దంగేటి గిరిధర్, ఉద్యాన శాఖ ఏఓ వెంకటేశ్వరరావు, ఎంపీఈఓ సీహెచ్ రాజేష్ ఉన్నారు. -
కోనసీమలో అక్రమ ఆక్వాసాగు
-
కక్కలేక..మింగలేక
అనుచరులపై కేసులు పెట్టడంపై ‘సీమ’ నేత అసహనం రాజకీయ గురువు అండ ఉండడంతో పోలీసులను ఏమీ చేయలేకపోతున్న వైనం (లక్కింశెట్టి శ్రీనివాసరావు) పైరు పచ్చని కళకళలు.. కొబ్బరాకుల గలగలలతో కేరళను తలపించే సీమ ప్రాంతమది. ఆ ప్రాంత ప్రధాన కేంద్రంలో ఇద్దరు గురుశిషు్యలున్నారు. ఆ ఇద్దరూ అక్కడ రాజ్యమేలుతున్నవారే. సము ద్ర తీరానికి సమీపాన చమురు, సహజవాయు వు ఉత్పత్తి అయ్యే ప్రాంతానికి చెందిన శిషు్య డు ఒకప్పుడు సామాన్యుడు. అప్పట్లో చిన్నచిన్న కాంట్రాక్టులు చేసుకునే పరిస్థితి. అతడి గురువుది కూడా శిషు్యడికి పొరుగున ఉన్న ప్రాంతమే. శిషు్యడు ఎప్పుడూ గురువు వెంటే తిరిగేవాడు. గురువేమో అధికార పార్టీలో పెద్ద నాయకుడు. రాష్ట్రంలో కూడా పెద్ద పదవిలో ఉన్నారు. ఆయన ప్రోత్సాహంతో తన స్థాయికి తగ్గట్టు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాడా శిషు్యడు. ఇదే అదునుగా అతగాడి అనుచరుల ఆగడాలు ఇటీవల బాగా పెరిగాయి. వారికి కళ్లెం వేసేందుకు ఓ పోలీసు అధికారి చట్ట ప్రకారం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. సొంత పార్టీలో ఇద్దరు నేతలు పోట్లాడుకుంటే నేరం చేసినవాడిపై కేసులు పెట్టాడా ఖాకీ. సీమ కేంద్రానికి సమీపంలో ఓ వ్యక్తిని కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టిన 15 మంది నిందితుల్లో శిషు్యడి అనుచరుడే కీలక నిందితుడు. ఆ నిందితుడికి స్థానిక సంస్థల పదవి కూడా ఉంది. అతడిని కేసు నుంచి ఎలాగైనా తప్పించాలంటాడు శిషు్యడు. ఆరేడు నెలలుగా అరెస్టు చేయకుండా చూస్తూ వచ్చామంటారు పోలీసులు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలన్న పోలీసు సమక్షంలో గురువుపైనే నోరు పారేసుకున్నాడా ప్రజాప్రతినిధి. అందువల్లనే కేసు బిగించారని శిషు్యడి అనుమానం. గురువు చెప్పకుండా తన అనుచరుడి అరెస్టు వరకూ పోలీసులు వెళ్లి ఉండరనే అనుమానం శిషు్యడికుంది. ఈ నేపథ్యంలో గురువు మెచ్చి తెచ్చుకున్న ఆ పోలీసు అధికారి అంటే శిషు్యడు మండిపడిపోతున్నాడు. అయితే గురువు ఇష్టపడి వేయించుకున్న పోలీసు అధికారి కావడంతో.. తన అనుచరులపై కేసులు పెడుతున్నా అతడిని ఏమీ అనలేకపోతున్నాడు. పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని చెప్పలేక, వారిని కేసుల నుంచి బయటపడేసే చేవ లేక, అలాగని గురువును గట్టిగా అడగలేక.. కక్కలేక.. మింగలేక కొట్టుమిట్టాడుతున్నాడు. అతడి వాలకం చూస్తూంటే భవిష్యత్తులో అవకాశం దొరక్కపోతుందా అని కాచుకుని కూర్చున్నట్టుగా కనిపిస్తోంది. రాజకీయంగా ఓనమాలు నేర్పిన గురువు పైనే బాణం ఎక్కుపెట్టే సాహసం చేస్తాడా అనేది పక్కనబెడదాం. జరుగుతున్న పరిణామాలను మాత్రం అనివార్యంగా భరించాల్సి వస్తోందని సన్నిహితుల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నాడా శిషు్యడు. అలాగని ఆ ఖాకీ అధికారిని వదిలేస్తే ఎలాగని మధనపడిపోతున్నాడు. పోనీ గురువును కాదని అతడిని సాగనంపేంతటి తెగువ శిషు్యడికి ఉందా అంటే అదీ లేదు. కానీ ఏదోరకంగా మంత్రాంగం నడిపైనా అతడిని సీమ కేంద్రం నుంచి తప్పించాలని శిషు్యడు ఎత్తులు వేస్తున్నాడట. అవి ఎంతవరకూ ఫలితాన్నిస్తాయో చూడాల్సిందే మరి! -
పోలీసుల గుప్పెట్లో కోనసీమ
-
కోనసీమ ముఖద్వారం ఖాకీమయం
ముందస్తుగా బందోబస్తు భారీగా మోహరించిన పోలీసు బలగాలు పోలీసు ఉన్నతాధికారుల సమీక్షలు జాతీయ రహదారిపై కవాతు అనంతపురం నుంచి వాటర్ కెనా¯ŒS వాహనం రాక కాపు సత్యాగ్రహ పాదయాత్ర జరిపి తీరతామని కాపు వర్గీయులు, అడుకుంటామని పోలీసులు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటుతో కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం ఖాకీమయంగా మారింది. పలువురు పోలీసు ఉన్నతాధికారులు రావులపాలెం వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సెక్ష¯ŒS–30 పోలీస్‌యాక్ట్ అమలులో ఉందని ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు చెబుతున్నారు. – రావులపాలెం (కొత్తపేట) కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రావులపాలెం నుంచి ఈ నెల 25న కాపు సత్యాగ్రహ పాదయాత్ర చేపట్టనుండటంతో పోలీసులు ముందస్తుగా భారీ బలగాలను మోహరిస్తున్నారు. సోమవారం నాటికి సుమారు 500 మంది పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి రావులపాలెం చేరుకున్నారు. వీరిలో వివిధ జిల్లాలకు చెందిన డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెచ్‌సీలు, కానిస్టేబుళ్ళు, ఏపీఎస్పీ స్పెషల్ పార్టీ, ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఆందోళన కారులను చెదరగొట్టేందుకు అనంతపురం నుంచి వాటర్ కెనా¯ŒS వాహనాన్ని ఇప్పటికే రావులపాలెంలో సిద్ధంగా ఉంచారు. కాగా ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ , జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్ దామోదర్, అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య తదితర పోలీస్ ఉన్నతాధికారులు రావులపాలెం పోలీస్‌స్టేçÙ¯ŒSలో పరిస్థితిని సమీక్షించారు. డీఐజీ రామకృష్ణ స్టేష¯ŒSలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం సెక్ష¯ŒS–30 పోలీస్‌యాక్ట్ అమలులో ఉందని ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించకూడదని డీఎస్పీ అంకయ్య తెలిపారు. పోలీసుల కవాతు రావులపాలెం చేరుకున్న వివిధ పోలీస్ బలగాలతో సోమవారం సాయంత్రం జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై కవాతు నిర్వహించారు. ఇప్పటికే పోలీసులు మండలంలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి 144 సెక్ష¯ŒS, 30 పోలీస్‌యాక్ట్ అమలులో ఉన్నందున ఎలాంటి సభలు సమావేశాలు ఆందోళనలు, ర్యాలీలుచేపట్టరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ముద్రగడ పాదయాత్ర ప్రారంభిస్తారని చెప్పుతున్న కళావెంకట్రావు సెంటరులో ముద్రగడ ఫొటోలతో పాదయాత్రకు సంబంధించి ఫ్లేక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే 25 నుంచి ముద్రగడ పాదయాత్రకు సంబంధించి కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు కల్యాణ మండపంలో కాపు నేతలతో సమాలోచనలు చేశారు. నేడు రావులపాలెంకు ముద్రగడ జగ్గంపేట : కాపు సత్యాగ్రహ యాత్రకు మాజీ మంత్రి, ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మంగళవారం సాయంత్రం తన నివాసం నుంచి రావులపాలెంకు పయనమవ్వనున్నారు. రావులపాలెం నుంచి బుధవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించేందుకు ముందు రోజే ముద్రగడ అక్కడకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు అనుచరులు తెలిపారు. మూడు వేల మందితో పోలీస్ బందోబస్తు అంబాజీపేట (పి.గన్నవరం) : కోనసీమ డివిజ¯ŒS పరిధిలో మూడు వేల మంది పోలీస్‌లతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య తెలిపారు. బుధవారం నుంచి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు సత్యాగ్రహ పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో సోమవారం స్థానిక పోలీస్ స్టేష¯ŒSలో ఆయన సమీక్షించారు. అనంతరం డీఎస్పీ విలేకర్లతో మట్లాడుతూ ఈ పాదయాత్రకు సంబంధించి అనుమతి కోరుతూ ఎలాంటి దరఖాస్తు రాలేదన్నారు. రావులపాలెం, అంబాజీపేట, కొత్తపేట, అమలాపురం, అల్లవరం, రాజోలు, మలిక్కిపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం తదితర మండలాల పోలీస్ స్టేష¯ŒSలకు 150 మంది కానిస్టేబుల్స్‌తో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. సెక్ష¯ŒS 30, 144 అమలులో ఉందని గ్రామాల్లో ఎటువంటి సభలు, సమావేశాలు, గుంపులుగా తిరగవద్దని డీఎస్పీ సూచించారు. కోనసీమలో డ్రో¯ŒSలు, కెమెరాలు, షాడో టీంలు గస్తీ నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్ఐ ఆర్.భీమరాజు డీఎస్పీ వెంట ఉన్నారు. -
కోనసీమలో కొలువైన చిత్ర కళా ప్రదర్శన
నేడు 400 మంది చిత్రకారులకు పురస్కారాలు, సత్కారాలు అమలాపురం టౌన్ (అమలాపురం) : కోనసీమ చిత్ర కళా పరిషత్ 27వ జాతీయ స్థాయి చిత్ర కళా ప్రదర్శనలు అమలాపురంలోని సత్య సాయి కల్యాణ మండపంలో శనివారం నుంచి మొదలయ్యాయి. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు చిత్ర కళల పండుగు జరగనుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 500 మంది చిత్రకారులు గీసిన అపురూప చిత్రాలు ఇక్కడ ఒకే వేదికపై కొలువుదీరాయి. జిల్లా నలుమూలల నుంచి ఈ చిత్ర ప్రదర్శనలు చూసేందుకు కళాభిమానులు తరలివచ్చారు. ఈ ప్రదర్శనలను అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్, అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు ప్రారంభించారు. కోనసీమ చిత్ర కళా పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి కొరసాల సీతారామస్వామి ఆధ్వర్యంలో ఈ జాతీయ స్థాయి చిత్ర కళా ప్రదర్శనలు ఏర్పాటయ్యాయి. పరిషత్ జాతీయ స్థాయిలో పెద్దలు, పిల్లలకు నిర్వహించిన చిత్రకళా పోటీల్లో ప్రత్యేక నగదు అవార్డులు, బంగారు పతకాలకు ఎంపికైన చిత్రాలు ప్రదర్శనలో ఉంచడంతో చిత్ర కళాభిమానులకు కనువిందు చేశాయి. ప్రముఖ చిత్రకారుడు, సినీ పబ్లిసిటీ ఆర్టిస్ట్ కడలి సురేష్ కుంచె నుంచి జాలు వారిన రాయాయణంలోని పలు ఘట్టాలకు చెందిన దృశ్యాలు దాదాపు 15 ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. అవి కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నేడు 400 మంది చిత్రకారుల రాక కోనసీమ చిత్ర కళాపరిషత్ జాతీయ చిత్ర కళా పోటీల్లో విజేతలైన 400 మంది చిత్రకారులు ఆదివారం ఉదయం అమలాపురంలోని చిత్ర కళా వేదిక అయిన సత్యసాయి కల్యాణ మండపానికి రానున్నారు. ఒక్కొక్క చిత్రకారుడికి పరిషత్ తరపున పురస్కారం ప్రదానం చేయటమే కాకుండా సాదరంగా సత్కరించనున్నారు. రూ.30 వేల నుంచి రూ.వెయ్యి వరకూ ప్రకటించిన దాదాపు 50 నగదు పురాస్కారాలు, 350 మంది బాల చిత్రకారులకు బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు. పరిషత్ గౌరవ అధ్యక్షునిగా రాజప్ప, అధ్యక్షునిగా రమణబాబు ఈ పరిషత్ అధ్యక్షునిగా మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు వ్యవహరించే వారు. ఆయన మరణం తర్వాత ఆ పదవీ బాధ్యతలను మెట్ల తనయుడైన మెట్ల రమణబాబుకు అప్పగించారు. అలాగే పరిషత్ గౌరవ అధ్యక్షునిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కొత్తగా బాధ్యతలు చేపట్టారు. -
హరివిల్లుల యాత్ర
వేల రంగుల హరివిల్లులు భువిపై విరిసినట్టు.. ఎటు చూసినా హరితవర్ణాన్ని అద్దుకొన్న ఆ తావుల్లో.. రంగురంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దిన ప్రభలు కొలువుతీరాయి. సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని కోనసీమ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రభల తీర్థాలు కన్నుల పండువగా జరిగాయి. అంబాజీపేట మండలం మొసలపల్లి సమీపంలోని జగ్గన్నతోటతో పాటు, ఇతర ప్రాంతాల్లో జరిగిన ప్రభల తీర్థాలకు వేలాదిగా జనం తరలివచ్చారు. -
భూమి గుల్ల.. భద్రత డొల్ల
చమురు సంస్థల తీరుతో కేజీ బేసి¯ŒS తీరానికి శాపం నిత్య ప్రమాదాలతో భద్రతలేని జీవనం అభివృద్ధికి అక్కరకు రాని సీఎస్సార్ నిధులు మొండిచేయి చూపిస్తున్న చమురు సంస్థలు పార్లమెంట్ కమిటీ సభ్యులూ...మీరైనా చేస్తారా న్యాయం కృష్ణా – గోదావరి బేసి¯ŒS (కేజీ బేసి¯ŒS).. దేశ ఆదాయానికి అక్షయపాత్ర. అపార చమురు, సహజవాయువులు నిక్షిప్తమైన గని. తూర్పుతీరంలో ప్రపంచస్థాయిలో చమురు, సహజవాయుల పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేసింది. వెలికితీసే కొద్దీ లక్షల కోట్ల రూపాయిల ఆదాయాన్ని అందించే కేజీ బేసి¯ŒS దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలిచింది. ఇదంతా నాణానికి ఓ వైపు ఉన్న వెలుగులు.. చమురు సంస్థల కార్యకలాపాల వల్ల భూమి కుంగిపోతోందని రైతుల అపోహలు.. బ్లో అవుట్లు, గ్యాస్ పైపులైన్ల లీకేజ్‌లతో జీవనానికే భద్రతలేకుండా పోయిందనే భయాలు.. పచ్చని కోనసీమలో కాలుష్య కాసారంగా మార్చేశారనే ఆరోపణలు.. కోట్లు కొల్లగొడుతూ స్థానికాభివృద్ధిని గాలికి వదిలేసిందనే ఆవేదనలు... రహదారులను ఛిద్రం చేసేశారనే విమర్శలు.. ఇవన్నీ నాణానికి మరోవైపు అలముకున్న చీకట్లు... పార్లమెంటరీ పెట్రోలియం స్టాండింగ్ కమిటీ మంగళవారం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – అమలాపురం కోనసీమ ఓ ‘మండు’పాతర.. పచ్చని కోనసీమ ఇప్పుడొక మందుపాతరగా మారింది. రూ.కోట్ల విలువైన చమురు, సహజవాయువులను తరలించేందుకు కోనసీమలో వందల కిలోమీటర్ల మేర పైప్లైన్లు వేసుకుపోయారు. వీటి నాణ్యత విషయంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)తోపాటు చమురు సంస్థలు రాజీపడడం అవి ఎప్పుడు? ఎక్కడ? లీవువుతాయో అనే భయం స్థానికులను వెన్నాడుతోంది. కోనసీమలో, మరీ ముఖ్యంగా రాజోలు దీవిలో గ్యాస్ లీకేజ్‌లు నిత్యకృత్యంగా మారిపోయాయి. నగరం దుర్ఘటనకు గ్యాస్పైల్లై¯ŒS పేలడం కారణం. ఇవి కాకుండా సిస్మిక్ సర్వేలపేరుతో నిరంతరం జరిగే బాంబింగ్‌లు కూడా కోనసీమవాసులకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నాయి. కాలుష్యం ముప్పులో... చమురు, సహజవాయువుల వెలికితీత వల్ల పచ్చని కోనసీమ కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. సముద్రగర్భం (ఆఫ్‌షోర్)లోనే కాకుండా భూమి మీద (ఆ¯ŒSషోర్)లో ఓఎన్జీసీ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పైప్లైన్ల ఏర్పాటుతో కొబ్బరితోట, పచ్చని చేలను తొలగిస్తోంది. దీనికితోడు చమురు శుద్ధి తరువాత వచ్చే చమురు మడ్డిని సముద్రంలోకి, కాలువల్లో వదలడం వల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదు. అలాగే సంస్థల వద్ద వృథాగా ఉండే గ్యాస్ మండించడం వల్ల కూడా గాలిలో తేమ తగ్గి వేడిగా మారుతోంది. ఈ కారణంగా గడిచిన పదేళ్లకన్నా కోనసీమలో సగటు ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు శాతం పెరిగాయి. అక్కరకు రాని సీఎస్ఆర్ నిధులు ఓఎన్జీసీ ఏటా దాదాపు రూ.600 కోట్ల్ల లాభాన్ని ఆర్జిస్తోంది. లాభంలో రెండు శాతం నిధులను కార్పొరేట్ సోషల్ రెస్పా¯Œ్సబులిటీ (సీఎస్ఆర్)కి విధిగా కేటాయించాలి. అంటే కేజీ బేసి¯ŒSలో ఆ సంçస్థ రూ.12 కోట్ల వరకూ సీఎస్ఆర్ నిధులు కేటాయించాల్సి ఉంది. గెయిల్ పైపులైన్లు అధికంగా కోనసీమలోనే ఉన్నాయి. 1998లో వేసిన ఈ పైపులైన్లను గెయిల్ ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితుల్లో కొనసాగిస్తోంది. నగరంలో గ్యాస్ పైపులైను విస్ఫోటం తర్వాత కూడా ఆ సంస్థ పైపులైన్ల పటిష్టతకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విశేషం. గైయిల్ పైపులైన్లు కోనసీమలో అధికంగా ఉంటే ఆ సంస్థ విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రికి రూ.50 లక్షలు సీఎస్ఆర్ కింద ఇచ్చింది. అదే కోనసీమలో పైపులైను పేలిపోయి నగరంలో 29 మంది చనిపోయిన పరిస్థితుల్లో ఆ సంస్థ స్థానికంగా ఆస్పత్రి నిర్మాణానికి నిధులు కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తోంది. మామిడికుదురు మండలం నగరంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇప్పటి వరకూ కార్యరూపం లేదు. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేష¯ŒS తన ప్రాజెక్టు కాస్ట్లో ఒక శాతం నిధులు సీఎస్సార్గా ఖర్చు చేయాల్సి ఉంది. రూ.నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు కాస్ట్లో ఒక శాతం అంటే రూ.40 కోట్లు ఖర్చు చేయాలి. ఇందులో 60 శాతం కోనసీమకు, 40 శాతం పాండిచ్ఛేరి పుదుచ్ఛేరి యానానికి ఇవ్వాల్సి ఉంది. అవి కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదు. రిలయి¯Œ్స చమురు సంస్థ 2008లో అమలాపురం పార్లమెంట నియోజకవర్గ పరిధిలోని భైరవపాలెం, గాడిమొగ ప్రాంతాలను దత్తత తీసుకుంది. చిత్రమేమిటంటే గాడిమొగ ప్లాంట్‌కు రిలయ¯Œ్స వారి వాహనాలు వెళ్లేందుకు వీలుగా రూ.22 కోట్లతో రోడ్డు నిర్మించుకుని ఆ నిధులను సీఎస్ఆర్ నిధులుగా చూపించి నయవంచన చేసిందనే ఆరోపణలున్నాయి. రూ.45 వేల కోట్ల ప్రాజెక్టైన రిలయ¯Œ్స భైరవపాలెంలో రూ.75 లక్షలతో కల్యాణ మండపం, గాడిమొగలో రూ.మూడు కోట్లతో పీహెచ్‌సీని సీఎస్ఆర్తో నిర్మిస్తామన్నారు. పూర్తి చేయలేదు. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో కెయిర్న్ ఎనర్జీ సంస్థ గ్రామంలో 200 ఎకరాల్లో గ్రీ¯ŒS బెల్ట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా... 23 ఏళ్లుగా దానిని పట్టించుకోవటంలేదు. గ్రామంలో డ్రైన్ల నిర్మించకుండా రోడ్లు వేయడం వల్ల వర్షాకాలం ముంపులో ఉండిపోతున్నాయి. 1995 నుంచి ఏడాదికి రూ.కోటి సీఎస్ఆర్ ఎస్.యానాం గ్రామాభివృద్ధికి నిధులు ఇవ్వాల్సి ఉండగా ఏ ఏడాదికి పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు. విషాదాలకు ముగింపు ఎప్పుడు? l చమరు సంస్థల కార్యకలాపాలు ఆరంభమైన తరువాత జరిగిన అది పెద్ద ఘటన పాశర్లపూడి బ్లోఅవుట్. ఈ ప్రమాదం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 1995లో జరిగిన ఈ ఘటన కోనసీమవాసులకు ఇక్కడ జీవనం ఎంత ప్రమాదకరమైందో తెలియజేసింది. సుమారు రూ.వంద కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. దేవర్లంకతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఇళ్లు బీటలు వారి నష్టపోయారు. ∙ అమలాపురం మండలం తాండవపల్లిలో 2006లో బ్లో అవుట్ జరిగింది. ఒక రోజులోనే మంటలు అదుపులోకి వచ్చినా పాశర్లపూడి బ్లో అవుట్ స్థాయిలో మంటలు ఎగిసిపడడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఓఎన్జీసీకి సుమారు రూ.50 కోట్ల మేర ఆస్తినష్టం జరిగింది. మామిడికుదురు మండలం నగరంలో 2014 జూ¯ŒS 27న గ్యాస్పైప్లై¯ŒS పేలుడు ఘటన 29 మందిని పొట్టనబెట్టుకుంది. కోనసీమలో ఇదే అత్యంత విషాదకరమైన ఘటన. ఇందుకు చమురు సంస్థల నిర్లక్ష్యమే కారణం. ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు చమురు సంస్థల కార్యకలాపాల వల్ల ముందుగా నష్టపోయిదే మత్స్యకారులే. సముద్రగర్భంలో రిగ్గింగ్, భారీ ఓడలు, పడవులు రాకపోకలకు వీలుగా సముద్రతీరం, గోదావరి నదీపాయల్లో డ్రెడ్జింగ్ చేయడం వల్ల అపార మత్స్యసంపద లేకుండా పోతోంది. వారం వేటాడినా గతంలో వచ్చే మత్ససంపదలో సగం కూడా రావడం లేదని, జీవనం గగనంగా మారిందని మత్స్యకారులు వాపోతున్నారు. ఆయా చమురు సంస్థలు తమ కార్యకలాపాలు ఆరంభించిన రోజుల్లో కొద్ది నెలల పాటు మత్స్యకారులకు పరిహారం చెల్లించినా తరువాత పట్టించుకున్న పాపానపోలేదు. భూమి కుంగిపోతుందా? ఓఎన్జీసీ, ఇతర చమురు సంస్థల కార్యకలాపాల వల్ల భూమి కుంగిపోతోందని, భవిష్యత్తులో తీరంలో భూములు లేకుండా పోతాయని కోనసీమ వాసుల ప్రధాన ఆరోపణ. భూమి కుంగిన కారణంగా కొద్దిపాటి వర్షానికే తమ చేలు ముంపుబారిన పడడం, తుపాన్ల సమయంలో సముద్రం పోటెత్తి ఉప్పునీరు చేలను ముంచెత్తుతోందంటున్నారు. ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో సుమారు మూడు వేల ఎకరాల్లో వరిచేలు ఉప్పుబారిన పడుతున్నాయి. వీటిలో రెండు వేల ఎకరాల్లో రైతులు రెండుపంటల సాగును వదిలేశారు. చమురు, సహజవాయువుల వెలికితీసే సమయంలో భూమి అగాధంగా మారుతోంది. దీనిని వాటర్ ఇంజెక్ష¯ŒS విధానంలో ఇసుకను నింపాల్సి ఉన్నా చమురు సంస్థలు సొమ్ములు మిగుల్చుకునే ఉద్దేశంతో చేయడం లేదని రైతుల ఆరోపణ. చమురు సంస్థల కార్యకలాపాల వల్ల భూమి కుంగిపోతోందని ఇటీవల కోనసీమలో పర్యటించిన పర్యావరణ, భూగర్భ శాస్త్రవేత్తల బృందం నిర్ధారించడం, ఇందుకు పలు ఉదాహరణలు చూపడం విశేషం. ఈ చిత్రం చూశారా? ఎస్.యానాంలో చమురు, సహజ వాయువుల ఉత్పత్తి సంస్థ కెయిర్న్ ఎనర్జీ çకమ్యూనిటీ సోషల్ రెస్పా¯Œ్సబులిటీ (సీఎస్ఆర్) నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన ఆస్పత్రి ఇది. నిర్మించి ఆరేళ్లు పూర్తవుతున్నా ఈ ఆస్పత్రి ప్రారంభం కాలేదు. వైద్యులు, సిబ్బంది లేక నిరుపయోగంగా మారింది. ఆస్పత్రి నిర్మాణం వరకే తమ బాధ్యతని వైద్యం తమకు సంబంధంలేదని చమురు సంస్థ చేతులు దులుపుకొంది. చమురు సంస్థల వల్ల స్థానికులకు కలుగుతున్న ప్రయోజనాన్ని ఈ భవనం తేటతెల్లం చేస్తోంది. ధ్వంసమవుతున్న రోడ్లు ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల గ్రామీణ, ఆర్అండ్బీ రహదారులు ధ్వంసమవుతున్నాయ. అమలాపురం–ఎస్.యానాం, అమలాపురం– ఓడలరేవులతోపాటు కాట్రేనికోన, మలికిపురం, మామిడికుదురు మండలాల్లో పలు రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. కనీసం తమ సంస్థ వాహనాలు తిరిగే రహదారులను సైతం చమురు సంస్థలు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. -
కోనసీమ ప్రత్యేక జిల్లాయే అందరి లక్ష్యం
కేఏఎస్ఎస్ అధ్యక్షుడు ఆర్వీ నాయుడు కొత్తపేట : కోనసీమ ప్రత్యేక జిల్లా సాధన ప్రతీఒక్కరి లక్ష్యం కావాలని కోనసీమ అభివృద్ధి సాధన సమితి (కేఏఎస్ఎస్) అధ్యక్షుడు ఆర్వీ నాయుడు పిలుపునిచ్చారు. కొత్తపేటలో సంఘ ప్రణాళిక కార్యదర్శి సత్తిరాజు ఆదిత్యకిరణ్ స్వగృహంలో బుధవారం సమితి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సమితి వ్యవస్థాపకుడు పాలూరి సత్యానందం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్వీ నాయుడు మాట్లాడారు. కోనసీమలో ఎన్నో ఆర్థిక వనరులున్నా, అవి కోనసీమ అభివృద్ధికి దోహదపడటం లేదని పేర్కొన్నారు. ఇక్కడి చమురు, సహజ వాయువు వంటివి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కోనసీమ ప్రత్యేక జిల్లా ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. జిల్లా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, కోనసీమలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను కలిసి, వారి మద్దతుతో ఈ డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని తీర్మానించారు. ఈ సమావేశంలో సమితి ప్రతినిధులు కముజు గంగాధరరావు, బండి రామకృష్ణ, అడ్డగాళ్ళ సాయిరాం, గాడి సత్తిబాబు, వాడపల్లి సూరిబాబు, మోకా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు -
‘కోనసీమ రాకెట్’ సాత్విక్‌కు సత్కారం
అమలాపురం : షటిల్ బ్యాడ్మింట¯ŒSలో అంతర్జాతీయ క్రీడావేదికలపై వరుస విజయాలతో దూసుకుపోతున్న ‘కోనసీమ రాకెట్’ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌ను అమలాపురంలో గురువారం ఘనంగా సత్కరించారు. పట్టణానికి చెందిన సాత్విక్‌ను పీడీలు, పీఈటీలు, పట్టణ ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. స్థానిక ఆఫీసర్స్ క్లబ్లో బాలికల గ్రిగ్ పోటీల సందర్భంగా సాత్విక్‌ను అమలాపురం పీఈటీల అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో సన్మానించారు. అసోసియేష¯ŒS అధ్యక్షుడు ఉండ్రు ముసలయ్య మాట్లాడుతూ అమలాపురం నుంచి అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణిస్తున్న సాత్విక్‌ను జిల్లా క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సాత్విక్ ఒలింపిక్స్‌లో ఆడి దేశానికి పతకాన్ని సాధించే రోజు రావాలని ఆకాంక్షించారు. సన్మాన కార్యక్రమంలో అసోసియేష¯ŒS కార్యదర్శి ఎం.రమేష్, బాలికల జో¯ŒS గ్రిగ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.సూర్యనారాయణ, పీఈటీలు బీవీవీఎస్ఎ¯ŒSమూర్తి, బీటీ వర్మ, పాయసం శ్రీనివాసరావు, జి.శ్రీనివాసరావు, కమల్, కె.వెంకటేశ్వరరావు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
కోనసీమకు భారీగా పోలీసు బలగాలు
అమలాపురం టౌన్ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈనెల 16 నుంచి కోనసీమలో నిర్వహించనున్న పాదయాత్రకు జిల్లా పోలీసు శాఖ బందోబస్తు పరంగా ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. అమలాపురం డివిజ¯ŒSకు జిల్లాలోని మిగిలిన పోలీసు డివిజన్ల నుంచి పోలీసు బలగాలను పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి తోడు కృష్ణా జిల్లా నుంచి శుక్రవారం కోనసీమకు 500 మంది పోలీసులను ఇక్కడకు రప్పించారు. అమలాపురం డివిజ¯ŒSలోని అయిదు పోలీసు సర్కిళ్లకు సంబంధించి ఒక్కో సర్కిల్‌కు 100 మంది చొప్పున కృష్ణా జిల్లా పోలీసులను బందోబస్తుకు సిద్ధం చేశారు. 16 నుంచి యాత్ర పూర్తయ్యే వరకూ ప్రత్యేక పోలీసు బలగాలను ఇక్కడ మోహరించనున్నారు. కాపు ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మరింత పటిష్టం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
కోనసీమ రైల్వేలైన్ వంతెన టెండర్లు రద్దు
డిసెంబరులో కొత్తగా టెండర్లు అమలాపురం : కోనసీమ రైల్వేలైన్ బాలారిష్టాలు వీడడం లేదు. కోటిపల్లి నుంచి అమలాపురం మీదు నర్సాపురం వరకు సాగే ఈ రైల్వేలైన్ లో కీలకమైన గౌతమీ నదిపై వంతెన నిర్మాణానికి రైల్వేశాఖ పిలిచిన టెండరు రద్దయింది. ఈ నిర్మాణానికి సింగిల్ టెండరు పడగా, దీనికి సాంకేతిక అనుమతి లభించపోవడంతో రైల్వే శాఖాధికారులు రద్దు చేశారు. దశాబ్ధకాలంలో పెండింగ్‌లో ఉన్న కోనసీమ రైల్వేలేన్ కు గత బడ్జెట్లో గ్రీ¯ŒSసిగ్నల్ లభించిన విషయం తెలిసిందే. ఈ లైన్ నిర్మాణానికి రైల్వేశాఖ గత బడ్జెట్లో సుమారు రూ.270 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిధులను కోటిపల్లి వద్ద గౌతమీ నదిపై వంతెన నిర్మాణానికి కేటాయించారు. సుమారు 3.5 కిమీల నిడివిగల వంతెన నిర్మాణానికి జూలై24న టెండర్లు పిలిచారు. అయితే ఒక్క టెండరు మాత్రమే పడగా, దానికి సైతం సాంకేతిక అనుమతి లభించలేదు. దీంతో టెండరు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని రైల్వేశాఖాధికారులు నిర్ణయించారు. డిసెంబరు నెలాఖరు నాటికి టెండర్లు ఖరారవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి టెండర్లలో ఎక్కువ కంపెనీలు పాల్గొనే అవకాశముందని రైల్వే శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. సాంకేతిక కారణాలతో టెండరు రద్దు చేయడంపై రైల్వే ఉన్నతాధికారులతో అమలాపురం పార్లమెంట్ సభ్యుడు పండుల రవీంద్రబాబు మంగళవారం హైదరాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్త, రైల్వేఛీప్ ఇంజినీరు బ్రహ్మానందరెడ్డిలతో చర్చించి టెండరు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. కోనసీమ రైల్వేలైన్ కు సంబంధించి కోటిపల్లి నుంచి అమలాపురం నిర్మాణం జరిగే భట్నవిల్లి వరకు భూసేకరణ గతంలోనే పూర్తయింది. తాజాగా పేరూ రు వరకు సర్వే ఆరంభించగా, దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ సర్వేను బోడసకుర్రు, వైనతేయ గోదావరి వరకు చేపట్టాలని ఇటీవల నిర్ణయించారు. ఇందుకు రైల్వేశాఖ రూ.45 కోట్లు కేటాయించింది. రెవెన్యూ, రైల్వే శాఖలు సంయుక్తంగా చేపడుతున్న ఈ సర్వే డిసెంబరు నెలాఖరుకు పూర్తయ్యే అవకాశముంది. కోటిపల్లి వద్ద వంతెన నిర్మాణానికి టెండర్లు పిలవడం, మరోవైపు భూసేకరణకు సర్వే శరవేగంగా జరగడంతో రైల్వేలైన్ నిర్మాణ కల సాకారమవుతోందని కోనసీమవాసులు గంపెడాశతో ఉన్నారు. అయితే వంతెన టెండర్లు రద్దయ్యాయని తెలిసి వారు నిరాశ చెందుతున్నారు. -
కేరళ హంగులతో కోన సీమ అభివృద్ధి
ఏపీ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీకాంత్ దిండి(మలికిపురం) : కోనసీమ పర్యాటకాన్ని కేరళ హంగులతో అభివృద్ధి చేయనున్నట్టు ఏపీ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీకాంత్ పేర్కొన్నారు. శనివారం దిండి టూరిజం కేంద్రంలో కేరళ కన్సల్టెన్సీలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కన్సల్టెన్సీ ప్రతినిధులు ఇచ్చిన ప్రదర్శనను ఆయన తిలకించారు. ఆయన మాట్లాడుతూ కోనసీమ సంప్రదాయాలకు అనుగుణంగా కేరళ నమూనాలతో టూరిజం అభివృద్ధి చేసేందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు సూచించారు. కోనసీమ పర్యాటక ప్రదేశాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పారు. కేరళకు దీటుగా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆర్డీఓ గణేష్‌కుమార్, అఖండ గోదావరి ప్రత్యేకాధికారి భీమశంకరం తదితరులు పాల్గొన్నారు. -
ఉలిక్కిపడ్డ కోనసీమ
తాడికోన ఓఎన్జీసీ రిగ్ నుంచి ఎగదన్నుతున్న గ్యాస్ మళ్లీ బ్లో అవుట్ తప్పదేమోనని ప్రజల ఆందోళన అస్సాంకు చెందిన ఓఎన్జీసీ ఉద్యోగికి తీవ్ర గాయాలు ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించిన 200 ఇళ్లు పొరగు గ్రామాల్లో పునరావసం గ్యాస్ అదుపునకు ఓఎన్జీసీ నిపుణుల బృందం విశ్వ ప్రయత్నం శనివారం ఉదయానికి అదుపులోకి వచ్చే అవకాశం అమలాపురం టౌన్/అమలాపురం రూరల్: కోనసీమ ప్రజలు శుక్రవారం సాయంత్రం మరోసారి ఉలిక్కి పడ్డారు. అల్లవరం మండలం తాడికోనలో ఓఎన్జీసీకి చెందిన ఎస్ఆర్–ఎసీ అనే పాత రిగ్ నుంచి ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడి, పెద్ద శబ్దంతో గ్యాస్ ఎగదన్నటంతో అల్లవరం మండల ప్రజలు భయకంపితులయ్యారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఆ రిగ్‌ను రీ ఢ్రిల్లింగ్ చేయటం కోసం ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది పనులు మొదలు పెట్టారు. అప్పుడు కొద్దిగా గ్యాస్ లీక్ అవటంతో సిబ్బంది అప్రమత్తమై అరికట్టారు. ఈ సమయంలోనే అస్సాంకు చెందిన ఓఎన్జీసీ ఉద్యోగి సయ్యద్ అన్సాల్ అక్ (39) తీవ్రగాయాలపాలయ్యాడు. గ్యాస్ ఒత్తిడి, శబ్దానికి అతను షాక్‌కు గురయ్యాడు. అమలాపురం కిమ్స్ అస్పత్రికి తక్షణమే తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అతను శుక్రవారం రాత్రికి కూడా కోమాలోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. రిగ్‌కు రీ డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో ఎయిర్ హౌస్ అనే పరికరం పగిలి గ్యాస్ కిక్ (ఎగదన్నటం) ఇవ్వటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాయంత్రం ఆరు గంటలకు గ్యాస్ ఒత్తడి. శబ్దం తీవ్రత పెరగటంతో ఓఎన్జీసీ కూడా ప్రమాద సంకేతాలను గమనించి నర్సాపురం, రాజమహేంద్రవరం నుంచి నిపుణుల బృందాలను యుద్ధప్రాతిపదికన రంగంలోకి దింపింది. యాంటీ బ్లో అవుట్ నిపుణుల బృందం రాత్రి పది గంటల వరకూ గ్యాస్ అదుపునకు శ్రమించినా ఫలితం కనిపించలేదు. శనివారం ఉదయానికి గ్యాస్ అదపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన తొమ్మిది అగ్ని మాపక శకటాలు, చమురు సంస్థలకు చెందిన ఆరు అగ్ని మాపక శకటాలు నిరంతరాయంగా నీరు వెదజల్లుతునే ఉన్నాయి. రక్షణ వలయంలో తాడికోన... ముందు జాగ్రత్త చర్యగా రిగ్‌కు 500 మీటర్ల దూరం వరకూ ఎవరూ ఉండ వద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆర్డీవో గణేష్‌కుమార్, డీఎస్పీ లంక అంకయ్య రంగంలోకి దిగి తాడికోనలో 200 ఇళ్లను ఖాళీ చేయించారు. దాదాపు 500 మంది బా«ధితులను పక్క గ్రామమైన గూడాలలోని పాఠశాల, పంచాయతీ భననాలతోపాట గ్రామ పెద్ద పోలిశెట్టి భాస్కరరావు ఇంట్లోకి తరలించి పునరావసం కల్పించి భోజన వసతి కల్పించారు. ఫోటోలు తీస్తే ఫ్లాష్ వల్ల గ్యాస్ రగిలే అవకాశం ఉన్న దృష్ట్యా సెల్ ఫోన్లను కూడా వినయోగించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్యాస్ అదపులోకి రాకపోతే 1995లో ఇదే మండలం దేవరలంకలో బ్లో అవుట్ జరిగినప్పుడు ముందు గ్యాస్‌ను పూర్తిగా మండించి వెల్‌క్యాప్ వేయటం ద్వారా అదపు చేశారు. ఆ ప్రక్రియలోనే ఈ గ్యాస్‌ను అదపు చేద్దామా? అనే ఆలోచనలో ఓఎన్జీసీ అధికారులు ఉన్నట్లు తెలిసింది. ముందే చెప్పాం.. స్పందించలేదు... గ్రామస్తుల ధర్నా ఉదయమే రిగ్ వద్ద గ్యాస్ లీకయింది. కంగారు పడ్డాం. అప్పుడే రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫోన్లు చేశాం. ఓఎన్జీసీ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఎవరూ స్పందించిలేదంటూ తాడికోన గ్రామస్తులు రిగ్ వద్ద ధర్నా చేశారు. తాడికోన సర్పంచి దాసరి సంజీవరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన తెలిపారు. రూరల్ సీఐ దేవకుమార్, అల్లవరం తహసీల్దార్ పాము సుబ్బారావు, అల్లవరం ఎస్సై డి.ప్రశాంతకుమాÆŠఅ క్కడి పరిస్థితి సమీక్షించి ఉన్నతాధికారులు నివేదిస్తున్నారు. అదుపు చేస్తున్నారు...ఆందోళన వద్దు: ఉప ముఖ్యమంత్రి రాజప్ప తాడికోనలో గ్యాస్‌ను ఓఎన్జీసీ నిపుణులు అదపు చేస్తున్నారు. శనివారం ఉదయం కల్లా అదుపులోకి వస్తుందని ఎవరూ ఆందోళన చెందనవసం లేదని ఉప ముఖ్యమంత్రి రాజప్ప కోనసీమ ప్రజలకు సూచించారు. హైదరాబాద్‌లో అసెంబ్లీ సమావేశాల్లో రాజప్ప, ఎమ్మెల్యే ఆనందరావులు తక్షణమే స్పందించి ఓఎన్జీసీ రాజమహేంద్రవరం ఎసెట్ మేనేజన్ సన్యాల్, ఆర్డీవో గణేష్‌కుమార్‌తో ఫోన్లతో మాట్లాడి ముందు జాగ్రత్తగా పునరావస చర్యలకు ఆదేశించారు. అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా ఓఎన్జీసీ అధికారులతో ఫోన్లో చర్చించారు. -
కోనసీమ అందాలపై శతకం అంకితం
అంతర్వేది(సఖినేటిపల్లి) : అంతర్వేది పుణ్యక్షేత్రంలో మంగళవారం సాగరసంగమం వద్ద ప్రముఖ తెలుగు వేదకవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు స్వీయ రచన చేసిన కోనసీమ శతకాన్ని వాయుదేవునికి అంకితం చేశారు. గాలిపటంపై కోనసీమ గొప్పతనాన్ని వర్ణిస్తూ పటానికి ఒక వైపు 60, రెండోవైపు 48 పద్యాలు రాసి వశిష్టగోదావరి, సముద్రం సంగమం ప్రదేశంలో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వశాంతిని కలిగించు వేదఘోషను ప్రతిధ్వనించే సాగరసంగమం, పుణ్యతీర్థాల క్షేత్రాల ముక్తి సీమ–కోనసీమ, వేదాన్ని– వ్యవసాయాన్ని ప్రతిబింబించే కోనసీమ, గలగల పారే గోదావరి, పక్షుల కిలకిలరావాలతో పులకరించే కోనసీమ, సంప్రదాయం–సంపద కలిగియుండే కోనసీమ, సుఖశాంతులతో ధాన్యాగారంగా తులతూగే కోనసీమ లోగిళ్లు, రేయింబవళ్లు కష్టించి పనిచేసే రైతుల మధుర సీమ కోనసీమ, కదలి గౌతమీపై గాలి, కడలి గాలి, చెరువులోని కలువతామరుల కమ్మనిగాలి, పైరుగాలి–తోట గాలిల సమ్మేళనం మానససరోవరం కోనసీమ అంటూ తదితర వాటిపై ఆయన 108 పద్యాలను రాశారు. తొలుత శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆయన స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామలింగేశ్వరరావు కుటుంబ సభ్యులకు అర్చకులు ఆశీర్వచనాలు చెప్పి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా నిత్యాన్నదాన పథకంలో ఆయన భోజనం చేశారు. వెంట శతావధానులు పాలపర్తి శ్యామలానంద్ప్రసాద్, గురు సహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్, సాహతీవేత్త ధవేజీ పాల్గొన్నారు. -
దక్షిణ కోనసీమ ఇందుకూరుపేట
ఇందుకూరుపేట: పచ్చని పొలాలు..పొడవాటి కొబ్బరి చెట్లు.. ఆహ్లాద వాతావరణంతో ఇందుకూరుపేట మండలం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది. వేసవికాలం, వర్షాకాలం తేడా లేకుండా పచ్చగా పరిఢవిల్లుతూ జిల్లా వాసులుకు దక్షణ కోనసీమగా నిలుస్తోంది. -
పావనసీమ
-
కోనసీమలో నీట మునిగిన గ్రామాలు
-
కోనసీమ కేరళను తలపిస్తోంది
సినీ నేపథ్య గాయని చిత్ర తాళ్లరేవు : కొబ్బరి చెట్లు, గలగలా పారే గోదావరితో కోనసీమ ప్రాంతం కేరళను తలపిస్తోందని ప్రముఖ నేపథ్యగాయని చిత్ర పేర్కొన్నారు. కోనసీమ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చి యానాం జీవీఎస్ రెసిడెన్సీలో బస చేసిన ఆమెను ‘సాక్షి’ పలుకరించింది. తాను తూర్పుగోదావరి జిల్లాకు రావడం ఇదే ప్రథమమని, ఈ ప్రాంతం తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ముఖ్యంగా గోదావరి అందాలు చూస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతోందన్నారు. ఇక్కడ దట్టమైన కొబ్బరితోటలు, పచ్చని చెట్ల నడుమ ప్రయాణిస్తుంటే కేరళలో ఉన్న అనుభూతి కలుగుతుందన్నారు. ఇక్కడి ప్రజల ఆప్యాయతానురాగాలను ఎన్నటికీ మరువలేనన్నారు. అవకాశం వస్తే మరోమారు జిల్లాకు వచ్చి ఇక్కడి పర్యాటక ప్రదేశాలన్నింటిని వీక్షించాలని ఉందన్నారు. -
త్వరలోనే కోనసీమకు రైలు కూత
కేక్ కట్ చేసిన కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అమలాపురం రూరల్ : కేంద్ర రైల్వే బడ్జెట్లో కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌కు రూ.200 కోట్లు కేటాయించడంతో త్వరలోనే నిర్మాణ పనులు మొదలై అంతే త్వరలో కోనసీమలో రైలు కూత వినిపించనుందని సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. రైల్వే లైను శిలాఫలకం వద్ద శుక్రవారం జరిగిన సంబరాల్లో ఆయన కేక్ కట్ చేశారు. 2000 సంవత్సరంలో నాటి ఏన్డీఏ ప్రభుత్వంలో కోనసీమ రైలుకు పునాదిరాయి పడితే, నేడు అదే ప్రభుత్వంలో ఆ రైలు సాకారమవుతోందన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు అయితాబత్తుల అభిషేక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అల్డా చైర్మన్ యాళ్ల దొరబాబు, రాష్ట్ర కిసాన్‌మోర్చా అధ్యక్షుడు పూడి తిరుపతిరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
కోనసీమలో ‘సర్వమంగళం’
ఐ.పోలవరం : తన దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్వమంగళం’ పూర్తి కుటుంబ కథాచిత్రమని ఆ సినిమా డెరైక్టర్ ఛత్రపతి శివాజీరాజు చెప్పారు. చిత్రం అందరి మన్ననలు పొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సర్వమంగళం’ చిత్రీకరణ గత రెండురోజులుగా మండలంలోని కేశనకుర్రుపాలెం గ్రామంలో జరుగుతోంది. ఈ సందర్భంగా శివాజీరాజు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా శ్రీనివాసరెడ్డి, పూర్ణ నటిస్తున్నారని తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు కోనసీమ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుందని చెప్పారు. కాగా ఈ చిత్రంలో నారాయణరావు, వేణుగోపాల్, కృష్ణుడు తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారని శివాజీరాజు చెప్పారు. కాగా గ్రామంలో జరుగుతున్న సినిమా షూటింగ్‌ను చూసేందుకు పరిసర గ్రామాల నుంచి వచ్చిన వారితో కేశనకుర్రుపాలెం సందడిగా కనిపించింది. -
కోనసీమకు ఆక్వా మొబైల్ ల్యాబ్
అమలాపురం రూరల్:తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా ఆక్వా సాగు జరిగే కోనసీమలో త్వరలో ఆక్వా మెుబైల్ ల్యాబ్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర మత్య్సశాఖ కమిషనర్ రామ్‌శంకర్‌నాయక్ చెప్పారు. అమలాపురం క్షత్రియ కల్యాణమండపంలో బుధవారం జరిగిన జిల్లాస్థాయి ఆక్వా సదస్సులో అమలాపురంలో ఆక్వా ల్యాబ్ ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కమిషనర్‌ను కోరారు. ల్యాబ్ ఏర్పాటుకు ఎన్నో నిధులు, శాస్త్రవేత్తలు అవసరమని, ప్రస్తుతం తాత్కాలికంగా ఓ మెుబైల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి 104 మాదిరిగా అన్ని గ్రామాలకు ల్యాబ్ సౌకర్యాలు అందేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సంచార ల్యాబ్ ఉదయం నుంచి రాత్రి వరకూ గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. రొయ్యలు, చేపలు, పీతల పెంపకందారులు సంఘాలుగా ఏర్పడితే ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఆక్వా సాగుకు వరికి మాదిరిగానే సాగునీరిచ్చేలా ప్రభుత్వం ఇటీవల క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అయితే వరి సాగుకు వాడగా మిగిలిన నీటినే ఆక్వా సాగుకు ఇస్తారని చెప్పారు. ఉప్పునీరు, మంచినీరు రొయ్యల పెంపకం రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నాణ్యమైన విత్తనాలతోపాటు ప్రభుత్వ రాయితీలు అందుతాయన్నారు. -
మెగాస్టార్ సినిమాలు నేలక్లాసులో చూశా..
*'ముఠామేస్త్రి' పోస్టర్‌కు కూరగాయల దండేశా *నేను కోనసీమ కుర్రాడినని గర్వంగా చెప్పుకొంటా.. *'మంత్ర-2' కథానాయకుడు చేతన్ శ్రీను అమలాపురం : 'అమలాపురంలో నా చిన్నతనంలో చిరంజీవి సినిమాల్ని స్నేహితులతో కలసి నేల టిక్కెట్లు కొనుక్కుని చూసేవాడిని. 'ముఠామేస్త్రి' సినిమా వచ్చినప్పుడు చిరంజీవి పోస్టర్‌కు కూరగాయల దండ వేశాం' అని అప్పటి జ్ఞాపకాల్ని నెమరేసుకున్నాడు 'మంత్ర-2' హీరో చేతన్ శ్రీను. ఛార్మితో కలిసి ఆ చిత్రంలో నటించిన చేతన్ అమలాపురంలో పుట్టి పదేళ్ల దాకా ఇక్కడ పెరిగినోడే. ఆ చిత్రం విడుదలయ్యాక ఆ యువ హీరో తన సొంతూరు అమలాపురంలోనూ, చిన్న తనంలో తాను తిరిగిన కోనసీమలోనూ గత మూడు రోజులుగా సందడి చేస్తున్నాడు. చేతన్‌కు ఇక్కడి యువత బ్రహ్మరథం పడుతున్నారు. అమలాపురం కొంకాపల్లిలో వైఎస్సార్ సీపీ నాయకుడు మేడిది రమేష్‌బాబు ఇంట మంగళవారం చేతన్ 'సాక్షి'తో కొద్దిసేపు ముచ్చటించారు. అమలాపురంతో తనకున్న అనుబంధాన్ని ఇలా నెమరేసుకున్నారు.. 'నేను అమలాపురంలోనే పుట్టాను. సెయింట్ జాన్స్ స్కూలులో అయిదో తరగతి వరకూ చదువుకున్నా. మా నాన్న సత్యనారాయణకు మద్రాసులో చందమామ పత్రికలో ఆర్టిస్ట్‌గా ఉద్యోగం రావటంతో మా కుటుంబం అక్కడే స్థిర పడిపోయింది. నా 11 ఏటనే తమిళ సినిమాల్లో సినీ ప్రస్థానం మొదలైంది. తర్వాత చదువు పూర్తి చేసి ముంబైలోని అనుపమకేర్ యాక్టింగ్ స్కూల్లో చేరా. అక్కడే యాడ్ ఫిలిమ్స్‌లో అవకాశాలు వచ్చాయి. ఫైవ్ స్టార్, మ్యాంగ్ జ్యూస్ తదితర యాడ్‌ల్లో పనిచేశా. హెయిర్ కలర్ గార్నియర్‌కు అంబాసిడర్‌గా ఉండి యాడ్ ఫిలిమ్స్‌లో గుర్తింపు తెచ్చుకున్నా. తమిళంలో హీరోగా చేసిన నాలుగు సినిమాల్లో 'కరుంగళి' లో కోనసీమ అమ్మాయి అంజలితో హీరోగా నటించా. తెలుగులో మరో నాలుగు సినిమాల్లో హీరోగా పనిచేస్తున్నాను. మంత్ర -2 సినిమా పెద్ద హిట్ కాకపోయినా తెలుగులో నా తొలి సినిమా విడుదలైన ఆనందాన్ని సొంతూరు, సొంతగడ్డ వారితో పంచుకోవాలని వచ్చాను. నా రెండో తెలుగు సినిమా ‘రాజు గారి గది’ ఈనెలలోనే విడుదల కానుంది. సెరో గ్రూప్స్ సంస్థ నేను హీరోగా తీస్తున్న చిత్రాన్ని దాదాపు కోనసీమలోనే తీసే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాక భారీ బడ్జెట్‌తో నిర్మించే మరో రెండు సినిమాల్లో నటించేందుకు అంగీకారాలు కుదిరాయి. నాకు రఘువరన్, ప్రకాశ్‌రాజ్‌లు స్ఫూర్తి. బాల నటుడిగా వారిద్దరితో కలిసి నటించినప్పుడు వారి నటన నాపై బలమైన ముద్ర వేసింది. ‘నాది అమలాపురం...నేను కోనసీమ కుర్రాడి’నని గర్వంగా చెప్పుకుంటాను. ఎప్పటికైనా రాజమౌళి దర్శకత్వంలో పనిచేయాలని ఆశగా ఉంది. మంత్ర- 2లో ఛార్మి నాకు నటనపరంగా చాలా సహకరించారు. -
సమయం సందర్భం లేకుండా అశ్లీల నృత్యాలు
-
కోనసీమలో గ్యాస్ పైప్ లైన్ లీకేజ్
-
కోనసీమ ఆప్యాయత నన్ను కట్టిపారేస్తుంది
కోనసీమ అభిమానం, ఆప్యాయత తనను కట్టి పారేస్తాయని దివంగత హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ పలు సందర్భాల్లో చెప్పేవారు. కావడానికి పశ్చిమగోదావరి వాస్తవ్యుడే అయినా.. ఆయనకు తూర్పుగోదావరి జిల్లాతోను, అందునా కోనసీమ ప్రాంతంతోను అనుబంధం జాస్తి. ఎమ్మెస్ 700 చిత్రాల్లో నటించగా, వాటిల్లో 100కు పైగా సినిమాల షూటింగ్‌లు ఈ జిల్లాలోనే జరిగాయి. దీంతో ఆయనకు తూర్పుగోదావరిలో పలువురు అభిమానులే కాకుండా సన్నిహితులు కూడా అయ్యారు. ఇక్కడ జరిగిన పలు సినిమా షూటింగ్లలో ఆయన పాల్గొన్నారు. కోనసీమలో జరిగిన కబడ్డీ.. కబడ్డీ, చెడుగుడు, రామదండు, పందెం, ప్రేమలో పావని-కళ్యాణ్, చందమామ కథలు, శశిరేఖ పరిణయం, బావ వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు. పెదపట్నం లంక, మామిడికుదురు, నగరం, సోంపల్లి, అంతర్వేది, అంతర్వేదికర, దిండి, చింతలపల్లి, గుడిమూల వంటి ప్రాంతాల్లో షూటింగ్‌లు జరిగాయి. అమలాపురంలో 2004లో జరిగిన చెన్నమల్లేశ్వర కళా పరిషత్ నాటకోత్సవాలకు ఎమ్మెస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరిషత్ అధ్యక్షుడు నల్లా సత్యనారాయణ ఆయనకు మంచి మిత్రుడు. కోనసీమ అంటే మాత్రం ఎమ్మెస్‌కు ప్రత్యేక అభిమానం. 'ఇక్కడి పచ్చని వాతావరణం.. ప్రజలు చూసే ఆత్మీయత.. ఆతిథ్యం నన్ను కట్టిపడేస్తుంటాయి' అని పలు సందర్భాల్లో చెప్పేవారు. గత డిసెంబర్ 21న భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చిన ఆయన విద్యార్థులను కలుసుకున్నారు. బహుశా తనకు ఇష్టమైన కోనసీమను చూడడం అదే ఆఖరుసారి అవుతుందని ఎమ్మెస్ అనుకుని ఉండరు. ఆయన దర్శకత్వం వహించిన భజంత్రీలు సినిమా షూటింగ్లో కొంతభాగం కోరుకొండలో జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో 'నువ్వే.. నువ్వే' చిత్రంలో కానిస్టేబుల్‌గా ఎమ్మెస్ నటించింది పది నిమిషాలే అయినా ఆయన పండించిన కామెడీ ప్రేక్షకుల గుండెల్లో కలకాలం నిలిచిపోతుంది. రచయితగా, హాస్య నటునిగానే కాదు.. కుమారుడు విక్రమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకునిగా కూడా ఎమ్మెస్ మారారు. ఈ చిత్రానికి జిల్లాలోని ముమ్మిడివరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, దివంగత తాడి తాతారావు నిర్మాతగా వ్యవహరించారు.