సాక్షి, విజయవాడ: కోనసీమ ఉద్రిక్తతలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. కోనసీమలో పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. కొందరు ఆందోళన పేరుతో యువకులు విధ్వంసానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అయితే పోలీసులు ఎంతో సంయమనం పాటించారని తెలిపారు. విధిలేని పరిస్థితుల్లోనే గాల్లోకి కాల్పులు జరిపినట్లు చెప్పారు. విశాఖపట్నం, కృష్ణాజిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను మోహరించామని, విధ్వంసం వెనుక ఎవరున్నారో విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.
కలెక్టరేట్ దగ్గరకు వచ్చిన ఆందోళనకారులతో మాట్లాడామని, వారి అభ్యర్దన మేరకు 12 మందిని కలెక్టర్‌ను కలవటానికి అవకాశం కల్పించామని డీజీపీ తెలిపారు. ఆ తర్వాత కొందరు పక్కకు వెళ్లి అల్లర్లకు పాల్పడినట్లు చెప్పారు. ఇద్దరు వీఐపీల ఇళ్లు తగులబెట్టారని, వాహనాలకు నిప్పు పెట్డారని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వంతో చర్చించాలి కానీ విధ్వంసం చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. ప్రస్తుతం అల్లర్లు సద్దుమనిగాయని, ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు.
చదవండి: కోనసీమ ఆందోళనల్లో జనసేన, టీడీపీ హస్తం: హోంమంత్రి సీరియస్
Comments
Please login to add a commentAdd a comment