rajendranath reddy
-
టీడీపీలో ‘ఆడియో’ దుమారం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్‌రెడ్డితో జరిపిన ఫోన్ సంభాషణ రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిసి రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం ఆ ఆడియో సంభాషణను విలేకరుల సమావేశంలో బహిర్గతం చేశారు. ఈ ఆడియో తనది కాదని ప్రశాంతిరెడ్డి కామాక్షమ్మ అమ్మవారి సాక్షిగా చెప్పగలరా అని రాజేంద్రనాథ్‌రెడ్డి సవాల్ విసిరారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి వారి కుటుంబంతో తమకు అనుబంధం ఉందన్నారు. నేటికీ జగన్మోహన్రెడ్డితో ఆ అనుబంధం కొనసాగుతోందని ఆయన స్పష్టంచేశారు. ఓడితే ముఖం చాటేస్తారు: విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పెద్దలపట్ల అగౌరవంగా మాట్లాడడం, ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలగుతాం అని చెప్పడం చూస్తే వారి వ్యవహారం ప్రజలకు బాగా అర్థమవుతుందన్నారు. ఓడిపోతే విదేశాల్లో వ్యాపారాలు, లావాదేవీలు చేసుకుంటూ ప్రజా జీవితంలోకి రారని వారి మాటల బట్టి తెలుస్తోందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వైఎస్సార్సీపీ అభ్యర్థులు కావాలో ఓడిపోతే ముఖం చాటేసే టీడీపీ అభ్యర్థులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ఎవరూలేకే టీడీపీ వైఎస్సార్సీపీ నుంచి అభ్యర్థులను దిగుమతి చేసుకుందన్నారు. నా సోదరుడికి రూ.3 కోట్లు ఆఫర్ ఇచ్చారు: ప్రసన్నకుమార్‌రెడ్డి ఇక తన సోదరుడు రాజేంద్రకు ప్రశాంతిరెడ్డి రూ.3 కోట్లు ఆఫర్ ఇచ్చి పార్టీలోకి ఆహా్వనించినా వారి ప్రలోభాలకు తలొగ్గలేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని వాడు అని సం¿ోదించడం చూస్తే ఎంత అహంకారంతో మాట్లాడుతోందో అర్థమవుతోందన్నారు. ఆడియో సంభాషణ ఇలా.. రాజేంద్ర: హలో ప్రశాంతక్కా.. బావున్నావక్కా.. ప్రశాంతి: ఎక్కడున్నావ్? రాజేంద్ర: అక్కా బెంగళూరులో ఉన్నా. అక్కా ఇక్కడ రెండు పీజీలు ఏర్పాటుచేశాను ప్రశాంతి: నీవు ఇక్కడ లేవా? రాజేంద్ర: పీజీలు ఏర్పాటుచేసి ఇక్కడే ఉన్నాను. వచ్చిపోతుంటాను అక్కా. ప్రశాంతి: నేనెందుకు చేశానంటే.. ఇప్పుడే నీవు చెప్పొద్దు.. కోవూరు నుంచి పోటీచేయమని అడుగుతున్నారు వాళ్లు.. సర్వేపల్లి నుంచి పోటీచేయమని అడిగారు.. ఈ పార్లమెంట్ నియోజకవర్గం కాదు కదా అని వద్దన్నాను. కోవూరు తీసుకోమన్నారు.. ఫస్ట్ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అల్లుడు కోసం ఉంచారు.. ఆయన పార్టీలోకి రాకపోవడంతో నన్నే చేయమంటున్నారు. రాజేంద్ర: అక్కా.. అక్కా.. ప్రశాంతి: ఇంకా వాళ్లు (వైఎస్సార్సీపీ) మా వెంటçపడే ఉన్నారు. నాక్కూడా పార్టీ మారడం ఇష్టంలేదు, ఫస్ట్ నుంచి ఈ పార్టీ అంటే ఇష్టం నాకు.. మరీ వాళ్లు ఈ మాదిరి చేసేసరికి అన్నను కని్వన్స్ చేయలేకపోయా. నాకు ఇంత అవమానం జరిగితే ఇంకా వెంటపడతావా అన్నారు. నాది చేతగానితనం అనుకుంటావా. నాకు రాజకీయం అవసరంలేదు. నేను పోటీచేస్తా.. గెలిస్తే గెలుస్తా.. లేకుంటే ఓడిపోతా. ఆ తర్వాత క్విట్ అయిపోతా.. పోటీచేయకుండా ఉండనన్నాడు.. రాజేంద్ర: అక్కా.. అక్కా.. ప్రశాంతి: వీళ్లందరూ నన్ను ఉండమంటున్నారు. లేదులే మేం ఎంపీ ఎలక్షన్ చేసుకుంటాం అన్నాను.. లేదులే అన్నాను. కోవూరు అయితే ఆదాల అల్లుడు అనుకున్నారు. కావలిలో కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు. కోవూరే తీసుకోమంటున్నారు. రాజేంద్ర: అవును కదక్కా అందరం ఇంట్లో వారం కదా. ప్రశాంతి: ఇంట్లో వారమే కానీ వాళ్లు పోటీచేయమంటున్నారు.. అన్న కూడా పార్టీ వీడుతున్నారు కాబట్టి వైఎస్సార్సీపీ నుంచి ప్రెజెర్స్ ఉంటాయి.. ఆత్మకూరు అయితే పదివేలతో ఆనం రామనారాయణరెడ్డి ఓడిపోతాడు.. అయితే, విక్రమ్ బాగా చేస్తున్నాడు.. రామనారాయణరెడ్డి పోయినా కూడా ప్రాబ్లమ్ అవుతుంది.. రాజేంద్ర: అక్కా.. నేను మధ్యస్తంగా ఏమి చెప్పలేను.. నాకు ఇద్దరు కావాలక్కా.. ఈ మ«ధ్య అన్నకు దూరంగా ఉన్నా. ప్రశాంతి: మీడియాకు వీడియోలు పెడుతున్నావు కదా.. ప్రతి ఎలక్షన్‌కు అన్నదమ్ముల మధ్య మామూలే కదా.. రాజేంద్ర: కానీ, మా మధ్య ఏమీలేవక్కా.. అన్న గెలుపు కోసం గట్టిగా కృషిచేసేవాళ్లం. ప్రశాంతి: ఎక్కడా చెప్పకు రాజేంద్ర.. మేమైతే ఇంకా ఓకే చెప్పలేదు రాజేంద్ర. అంతా బంధువులు కదా.. సర్వేపల్లి గురించి చెప్పినా నేను ఒప్పుకోలేదు. నీవు సర్వేపల్లిలో అయితే గెలుస్తావన్నారు.. గెలవనని కాదు. నాకు ఇష్టంలేదు అని చెప్పా.. మరీ ఆయనకు (సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి) టికెట్ ఇవ్వమనే చెప్పారు.. నేను వద్దని చెప్పాను.. ఎవరు ముందుకు రాకపోతే ఆయనకే టికెట్ ఇస్తారు కదా పాపం.. -
స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికలు
సాక్షి, అమరావతి: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలుస్వేచ్ఛగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో డీజీపీ కేవీ రాజేంద్రనాధ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎస్ సమీక్షించారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, ఐటీ, స్వీప్, శాంతి భద్రతలు, కమ్యూనికేషన్ ప్లాన్, కంప్లైంట్ రిడ్రస్సల్, ఓటరు హెల్ప్ లైన్, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. ఓటు హక్కు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 46,165 పోలింగ్ కేంద్రాలున్నాయని, కనీసం 50 శాతం కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. వెబ్ కాస్టింగ్ ఉన్న కేంద్రాలు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కంట్రోల్ రూమ్‌లతో అనుసంధానమై ఉంటాయని, వాటిలో పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పారు. జనవరి నుండి ఇప్పటివరకు రూ.78 కోట్ల నగదు, రూ.41 కోట్ల విలువైన ఖరీదైన వస్తువులు, రూ.30 కోట్ల విలవైన వివిధ డ్రగ్స్ వంటివి మొత్తం రూ.176 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన గత నాలుగు రోజుల్లోనే వివిధ రూ. 3.39 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తామన్నారు. అక్రమాల నియంత్రణకు రాష్ట్ర సరిహద్దులు, ఇతర ప్రాంతాల్లో 60 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు సహా 121 చెక్ పోస్టులు ఏర్పాటుచేస్తున్నామన్నారు. డీజీపీ కేవీ రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తుకు 1.50 లక్షల మంది రాష్ట్ర పోలీసులు, 522 కంపెనీల స్టేట్ ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు, 465 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వు పోలీసులతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి హోంగార్డు తదితర స్థాయి పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది, వాహనాలు సిద్ధం: మీనా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనా ఎన్నికల సన్నద్దతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో 4,09,41,182 మంది ఓటర్లున్నట్లు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందికి 12,683 వాహనాలు, పోలింగ్ సిబ్బందికి 13,322 వాహనాలు అవసరమని చెప్పారు. 175 మంది అసెంబ్లీ, 25 మంది పార్లమెంట్ రిటర్నింగ్ అధికారులు, 829 మంది అసెంబ్లీ, 209 మంది పార్లమెంట్ ఎఆర్ఓలు, 5,067 మంది సెక్టోరల్ అధికారులు, 5,067 మంది సెక్టోరల్ పోలీస్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 55,269 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2,48,814 మంది పోలింగ్ అధికారులు, 46,165 బూత్ స్థాయి అధికారులు, 416 మంది జిల్లా స్థాయి నోడల్ అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపు, తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలను కల్పించామన్నారు. ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు నియోజకవర్గాల పరిధిలో మోడల్ కోడ్ బృందాలు చురుగ్గా పని చేస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో హోం, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యా శాఖల ముఖ్య కార్యదర్శులు హరీశ్ కుమార్ గుప్త, శశిభూషణ్ కుమార్, ప్రవీణ్ ప్రకాశ్, స్టేట్ టాక్స్ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, విద్యా శాఖ కమిషనర్ సురేశ్ కుమార్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్, సీడీఎంఏ శ్రీకేశ్ బాలాజీ రావు, అదనపు సీఈవో హరీంద్ర ప్రసాద్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ రవి ప్రకాశ్ పాల్గొన్నారు. -
నేరాలకు కళ్లెం..భద్రతకు భరోసా
-
శాంతిభద్రతలు భేష్
పోలీసు యంత్రాంగం అత్యుత్తమ పనితీరుతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిస్థాయిలో విజయవంతమవుతోందని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానంగా దిశ వ్యవస్థతో మహిళల భద్రతను పటిష్టపరచడం దేశానికే ఆదర్శప్రాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ మొబైల్ యాప్, దిశ వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో మహిళా పోలీసు వ్యవస్థతో మహిళల భద్రతకు పూర్తి భరోసా కల్పి స్తున్నామని తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. – సాక్షి, అమరావతి వినూత్న విధానాలతో నేరాల కట్టడి విజబుల్ పోలీసింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమర్థ వినియోగం, వినూత్న విధానాలతో నేరాల కట్టడి సాధ్యమైంది. 2022 కంటే 2023లో రాష్ట్రంలో నేరాలు 8.13శాతం తగ్గాయి. 2022లో 1,75,612 కేసులు నమోదు కాగా 2023లో 1,61,334 కేసులకు తగ్గాయి. హత్యలు, దాడులు, దోపిడీలు, దొంగతనాలు, ఘర్షణలు, మహిళలపై నేరాలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. హత్యలు, హత్యాయత్నం కేసులు 10శాతం, దోపిడీలు 28.57శాతం, దొంగతనాలు 37.24 శాతం, పగటి దొంగతనాలు 13.41 శాతం, రాత్రి దొంగతనాలు 13.54 శాతం, రోడ్డు ప్రమాదాలు 7.83 శాతం, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 15.20 శాతం, సైబర్ నేరాలు 25.52 శాతం తగ్గాయి. పోలీసు బీట్లు పునర్వ్యవస్థీకరించడం, నిరంతర పర్యవేక్షణ, అనుమానితుల వేలిముద్రల సేకరణ, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం వంటి విధానాలను పటిష్టంగా అమలు చేశాం. మహిళా భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించి సత్ఫలితాలను సాధించాం. అసాంఘిక శక్తులపై నిఘా, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, మహిళా పోలీసుల సమర్థ వినియోగం, పీడీ యాక్ట్ ప్రయోగం, కన్విక్షన్ బేస్డ్ విధానాలతో నేరాలను గణనీయంగా తగ్గించగలిగాం. పోలీసు శాఖకు చెందిన 4,92,142 కేసులను లోక్ అదాలత్‌ల ద్వారా పరిష్కరించాం. రౌడీలపై ఉక్కుపాదం మోపుతున్నాం. రాష్ట్రంలోని 4వేల మంది రౌడీల్లో వెయ్యి మంది జైళ్లలో ఉన్నారు. ఈ ఏడాది 900 మంది రౌడీలకు న్యాయస్థానాల ద్వారా శిక్షలు విధించగలిగాం. మరో 200 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశాం. మహిళలకు పటిష్ట భద్రత 2023లో రాష్ట్రంలో మహిళలపై నేరాలతోపాటు అన్ని రకాల నేరాలను గణనీయంగా తగ్గించడంలో పోలీసు యంత్రాంగం సమర్థవంతమైన పాత్ర పోషించింది. క్షేత్రస్థాయి వరకు పోలీసింగ్ వ్యవస్థను విస్తృత పరచడం, సమర్థ పర్యవేక్షణ, సున్నిత ప్రాంతాల జియో మ్యాపింగ్ వంటి విధానాలతో మహిళలకు పటిష్ట భద్రత. 2022లో కంటే 2023లో మహిళలపై అత్యాచార కేసులు 28.57శాతం, వరకట్న కేసులు 11.76శాతం, మహిళలపై ఇతర నేరాలు 14శాతం తగ్గడమే అందుకు నిదర్శనం. సమర్థ పోలీసింగ్ విధానాలతో రాష్ట్రంలో అన్ని రకాల నేరాలు భారీగా తగ్గాయి. డ్రగ్స్, గంజాయి కట్టడి డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను సమర్థంగా కట్టడి చేస్తున్నాం. నాటుసారాపై ఉక్కుపాదం మోపాం. మూడేళ్లలో 5 లక్షల కేజీల గంజాయిని జప్తు చేశాం. గిరిజనులకు 2.52 లక్షల ఎకరాల్లో ప్రత్యమ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నాం. విలేకరుల సమావేశంలో అదనపు డీజీ (శాంతి, భద్రతలు) శంకబ్రత బాగ్చి, డీఐజీ రాజశేఖర్‌బాబు కూడా పాల్గొన్నారు. -
15మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 15మంది సీఐలకు పదోన్నతిపై డీఎస్పీలుగా పోస్టింగులు ఇచ్చారు. వీరి పదోన్నతులను ప్రభుత్వం ఆగస్టులో ఖరారు చేసింది. కాగా వారికి తాజాగా పోస్టింగులు ఇస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి: ఎస్.వహీద్ బాషా( సీఐడీ), ఎం.హనుమంతరావు(సీఐడీ), టీవీ రాధా స్వామి (ఎస్బీ, గుంటూరు), డి.శ్రీహరిరావు (ఏసీబీ), జి.రాజేంద్ర ప్రసాద్ (ఇంటెలిజెన్స్), బి.పార్థసారథి ( సీఎస్బీ, విజయవాడ), కె.రసూల్ సాహెబ్ (సీఐడీ), ఎం.కిశోర్ బాబు ( విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), డీఎన్వీ ప్రసాద్ (ఇంటెలిజెన్స్), జి.రత్న రాజు ( పోలవరం), పి.రవిబాబు (ఇంటెలిజెన్స్), షేక్ అబ్దుల్ కరీమ్ (పీసీఎస్ అండ్ ఎస్), ఎస్. తాతారావు (విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), కోంపల్లి వెంకటేశ్వరరావు(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), సీహెచ్.ఎస్.ఆర్.కోటేశ్వరరావు(ఏసీబీ). -
ఏపీ పోలీస్ దేశానికే ఆదర్శం: తానేటి వనిత
సాక్షి, అనంతపురం: ఏపీ పోలీస్ దేశానికే ఆదర్శమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పోలీస్ శిక్షణా కళాశాలలో సోమవారం.. డీఎస్పీల పాసింగ్ ఔట్ పేరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, సీఎం జగన్ నాయకత్వంలో శాంతి భద్రతలు బాగున్నాయన్నారు. సీఎం ఆదేశాలతో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. దిశా యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని, సీఎం జగన్ ఏపీ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశారని హోంమంత్రి అన్నారు. మహిళల అదృశ్యంపై నిర్లక్ష్యం వహించొద్దు: డీజీపీ ప్రజలతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు ముందుకెళ్లాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి సూచించారు. మహిళల అదృశ్యంపై నిర్లక్ష్యం వహించొద్దని, ఫిర్యాదు వచ్చిన వెంటనే సీరియస్‌గా స్పందించాలన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. చంద్రబాబు లేఖ వ్యవహారంపై సమగ్ర విచారణ చంద్రబాబు లేఖ వ్యవహారంపై స్పందించిన డీజీపీ.. మీడియాతో మాట్లాడుతూ, దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. నిజానిజాలు తేలిన తర్వాతే చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదు. భువనేశ్వరి యాత్రపై టీడీపీ నేతలు అనుమతి కోరలేదు. టీడీపీ ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం లేదు’’ అని డీజీపీ స్పష్టం చేశారు. చదవండి: ఉత్తరం.. ఉత్తదే చంద్ర'లేఖ'లో ఇంద్రజాలం! -
పోలీసు సంస్మరణ దినోత్సవంలో ఏపీ డీజీపీ స్పీచ్
-
లోకేష్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన పోసాని
సాక్షి, అమరావతి: ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి బుధవారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని డీజీపీకి పోసాని ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి కుట్ర చేస్తున్నట్టు సమాచారం ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం మీడియాతో పోసాని మాట్లాడారు. లోకేష్‌తో తనకు ప్రాణహాని ఉందని అన్నారు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని పేర్కొన్నారు. డీజీపీ దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్లినట్లు తెలిపారు. తరకు భద్రత కల్పిస్తానని డీజీపీ హామీ ఇచ్చినట్లు చెప్పారు. టీడీపీలో చేరాలని అడిగితే నిరాకరించానని.. అందుకే లోకేష్ ఇగో హర్ట్ అయ్యిందన్నారు. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు, లోకేష డ్రామాలు ఆడుతున్నారని పోసాని మండిపడ్డారు. కాపులకు అన్యాయం చేసిందే టీడీపీనే అని విమర్శించారు. ‘టీడీపీలోకి నన్ను చేర్చుకోవాలని లోకేష్ ప్రయత్నించారు. ఆయన పీఏ చైతన్య ద్వారా కలిసే ప్రయత్నం చేశారు. నేను చేరనని చెప్పడంతో నాపై కక్ష పెంచుకున్నాడు. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, ప్రజలే ముఖ్యమని కాంగ్రెస్‌లో ఉన్నపుడు చంద్రబాబు చెప్పారు. కానీ కాంగ్రెస్ ఒడిపోగానే టీడీపీలో చేరి చంద్రబాబు ఎన్టీఆర్ పక్కన చేరారు. తరువాత ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబుకు పదవి ఇష్టం లేకపోతే పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చేస్తానని ప్రమాణం చేయాలి. లోకేష్ నాపై హత్యాయత్నం చేసే అవకాశం ఉంది. ఎన్టీ రామారావుకు చెప్పే వెన్నుపోటు పొడిచారా?. నేను అగ్రెసివ్‌గా మాట్లాడతా కాబట్టి నన్ను చంపాలనుకుంటున్నారు. లోకేష్ బండారం మొత్తం బయట పెట్టింది నేనే. లోకేష్ అందరినీ బట్టలు విప్పి కొడతా అంటున్నారు. ఎన్నిసార్లు, ఎంతమంది బట్టలూడ దీస్తావ్? ప్రజలకు ఏం చేస్తావో చెప్పు’ అని పోసాని లోకేష్‌పై మండిపడ్డారు. చదవండి: కాలుష్య రహిత విద్యుత్ ఉత్పాదనలో తొలిస్థానంలో ఏపీ: సీఎం జగన్ -
మువ్వన్నెల కాంతుల్లో మురిసిన రాష్ట్రం
సాక్షి, అమరావతి: స్వేచ్ఛామారుతంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రతి మదిలో పంద్రాగస్టు సంతోషం ఉప్పొంగింది. గుండెల్లో జాతీయ భావా న్ని నింపుకొని.. గుండెలపై జాతీయ జెండాను పెట్టుకున్నవారితో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మురిసిపోయింది. త్యాగధనుల స్మరణలో.. ప్రజాసంక్షేమ నాయకత్వంలో.. బంగారు భవిష్యత్తు ధీమాలో రాష్ట్రంలో 77వ స్వాతంత్య్రదిన వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా సాగాయి. త్రివర్ణపతాక రెపరెపల నడుమ సాయుధదళాల కవాతు, దేశభక్తిని నింపిన పోలీసు అందరినీ ఉత్తేజితుల్ని చేశాయి. స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్‌ను పరిశీలించారు. గ్యాలరీల్లో ఆసీనులైన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రత్యేక ఆహా్వనితులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తర్వాత సాయుధదళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన వేడుకల్లో 14 ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ప్రతిబింబిస్తూ శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. అగ్నిమాపక, పాఠశాల విద్య, వైద్యం, అటవీ, పరిశ్రమలు, రెవెన్యూ, గృహనిర్మాణ, సంక్షేమ, మహిళా అభివృద్ధి–శిశుసంక్షేమ, గ్రామీణ పేదరిక నిర్మూలన, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు, వ్యవసాయ, పశుసంవర్థక, గ్రామ–వార్డు సచివాలయాల శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. పాఠశాల విద్య–సమగ్ర శిక్ష శకటానికి మొదటి బహుమతి దక్కగా వైద్య ఆరోగ్యశాఖ, గ్రామ–వార్డు సచివాలయాలశాఖ రెండు, మూడు బహుమతుల్ని దక్కించుకున్నాయి. దేశభక్తిని చాటిన సాయుధదళాల కవాతు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సాయుధదళాల కవాతు స్వతంత్ర భారతావని రక్షణ, దేశభక్తిని, అమరవీరుల త్యాగనిరతిని చాటిచెప్పింది. తెలంగాణ రాష్ట్ర 17వ స్పెషల్ పోలీసు బెటాలియన్, ఏపీ ఎన్సీసీ బాలబాలికల బృందం పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు, యూత్ రెడ్‌క్రాస్, మాజీ సైనికుల కవాతు ప్రశంసలు అందుకుంది. ఏపీఎస్పీ బ్రాస్‌బ్యాండ్, ఫైర్‌బ్రాండ్ బృందాల కళాప్రదర్శన ఆçహూతుల్లో స్వాతంత్య్ర ఉద్వేగాన్ని పెంచింది. కవాతులో ఉత్తమ ప్రదర్శనగా సాయుధదళాల విభాగంలో 9వ ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్, ద్వితీయ స్థానంలో 16వ ఏపీఎస్పీ విశాఖ బెటాలియన్ నిలిచాయి. అన్ ఆర్మ్డ్ విభాగంలో ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రథమ స్థానం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందం ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, మేయర్ భాగ్యలక్ష్మి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఆర్టీఐ ప్రధాన కమిషనర్ ఆర్ఎం బాషా, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, తెలుగు–సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలకు అవార్డులు ఈ ఏడాది జరిగిన పదోతరగతి పరీక్షల్లో నూరుశాతం విద్యార్థుల ఉత్తీర్ణతతో పాటు విద్యార్థుల సరాసరి అత్యధిక మార్కులు సాధించిన స్కూళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవార్డులను అందజేశారు. సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జియ్యమ్మవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (పార్వతీపురం మన్యం జిల్లా), ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల (భీమునిపట్నం), భద్రగిరిలోని ఏపీ గిరిజన బాలికల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల–యూఆర్జేసీ (పార్వతీపురం మన్యం జిల్లా), మంచాల ఏపీ మోడల్ స్కూల్ (అనకాపల్లి జిల్లా), పెద్దపవని ఏపీ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా), డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ (కర్నూలు), వీరఘట్టం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (పార్వతీపురం మన్యం జిల్లా) ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అవార్డులను అందుకున్నారు. -
పోలీసుల మీదే దాడులు చేస్తే ఎలా?
నరసాపురం రూరల్ :పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారని, శాంతిభద్రతల పరిరక్షణలో తరతమభేదాలు ఉండవని, ఏ రాజకీయ పార్టీ అయినా తమకు ఒక్కటేనని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టంచేశారు. పోలీసుల మీదే దాడులు చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. దాతల సహకారంతో అధునాతన వసతులతో నరసాపురంలో నిర్మించిన డీఎస్పీ క్వార్టర్, కార్యాలయ భవన సముదాయాన్ని ఆయన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పుంగనూరు ఘటనలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పోలీసులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాజకీయ పార్టీలు తమ కేడర్‌ను నియంత్రించుకోవాలన్నారు. పోలీసులపై తిరుగుబాటు చేసి దాడిచేస్తే ఇక శాంతిభద్రతలను కాపాడటం ఎలా అని డీజీపీ ప్రశ్నించారు. అనుమతి తీసుకున్నచోట కాకుండా వేరే చోట సభను నిర్వహించుకుంటే పోలీసులకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ సంఘటనలో 20 మందిని అరెస్టుచేశామని, బాధ్యులెవరినీ వదిలేదిలేదని ఆయన స్పష్టంచేశారు. అలాగే, సోషల్ మీడియాలో కావాలని చేస్తున్న దుష్ప్రచారాలు, నేర ప్రవృత్తితో పెట్టే పోస్టులపై పోలీసు వ్యవస్థలో సాఫ్ట్వేర్ సెల్‌ను ఏర్పాటుచేశామని డీజీపీ చెప్పారు. తప్పుడు ఆరోపణలు, ఉద్రేకపరిచే స్టేట్మెంట్లు ఇవ్వొద్దని డీజీపీ కోరారు. గంజాయి సాగు వ్యవస్థను నేల రాసేశాం.. ఇక మూడు దశాబ్దాల నుంచి విశాఖ ప్రాంతంలో వేళ్లూనుకున్న గంజాయి సాగును నేల రాసేశామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. మొత్తం 7,500 ఎకరాల్లో గంజాయి సాగును తుదముట్టించామని తెలిపారు. ఆ సాగు చేసిన రైతులకు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకుని జీవించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతోందని డీజీపీ చెప్పారు. మహిళల రక్షణ కోసం అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్ సత్ఫలితాలిస్తోందన్నారు. పోలీసులు, ఎస్ఐల నియామకానికి ఓకే.. పోలీసు రిక్రూట్మెంట్కు సంబంధించి 6,800 మంది పోలీసులు, 500 ఎస్సై పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని డీజీపీ చెప్పారు. ఎస్సై పోస్టులకు సంబంధించి ఆగస్టు మూడో వారంలో నియామకాలు జరిగే అవకాశముందని తెలిపారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందన్నారు. -
కఠిన చర్యలు తప్పవు
సాక్షి, అమరావతి: పుంగనూరు ఘటనపై విచారణకు ఆదేశించామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారందరిపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. ఘటన పూర్వాపరాలపై విచారణ జరపాలని డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌లను ఆదేశించామన్నారు. ఈ విషయమై శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అక్కడ వాహనాలను సైతం టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారని చెప్పారు. రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామన్నారు. ఘటన స్థలిలో సీసీ కెమెరా పుటేజీలను విశ్లేషస్తున్నామని, ఇప్పటికే పలువురిని గుర్తించామని.. మరికొందరు అనుమానితుల కదలికలపై నిఘా పెట్టామన్నారు. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుందన్నారు. చంద్రబాబు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. -
‘అమాయకులు బలికావొద్దనే సంయమనం పాటించాం’
సాక్షి, విజయవాడ: అన్నమయ్య జిల్లాలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. పుంగనూరులో చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులు చేశారు. ఇక, ఎల్లో బ్యాచ్ దాడిలో పదుల సంఖ్యలో పోలీసులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. పోలీసులపై టీడీపీ శ్రేణుల దాడిని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా పోలీసులు అధికారుల సంఘం ప్రతినిధులు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తల దాడుల్లో 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరులో టీడీపీ కార్యకర్తల విధ్వంసాన్ని పోలీసులు అరికట్టారు. చంద్రబాబు కావాలనే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. పుంగనూరులో అనుమతి లేకుండగా టీడీపీ కార్యకర్తలు చొరబడ్డారు. పోలీసులను తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలో పోలీసులు సంయమనం కోల్పోతే పుంగనూరులో పరిస్థితి మరోలా ఉండేది. ఇది పోలీసుల చేతకానితనం అనుకుంటే పొరపాటే. ఈ దాడిలో అమాయకులు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదనే సంయమనం పాటించాం. పుంగనూరు ఘటనపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేయమని డీజీపీని కోరాం. మాకు అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా ఒక్కటే అని స్పష్టం చేశారు. విచారణకు డీజీపీ ఆదేశం.. ఇదిలా ఉండగా.. పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని, వాహనాలను సైతం ఉద్దేశపూర్వకంగా తగులపెట్టారని డీజీపీ అన్నారు. రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామన్నారు. లా అండ్ ఆర్డర్‌కి విఘాతం కలిగించిన వారందరిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీ కెమెరా పుటేజీని విశ్లేషిస్తున్నాం. ఇప్పటికే అనేక మంది నిందితులను గుర్తించాం. మరికొందరి కదలికలపై నిఘా పెట్టాం. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుంది. ఈ ఘటన వెనుక ఎవరున్నారో ప్రాథమిక సమాచారం ఉంది. రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టాం. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించేదిలేదన్నారు. ఇక, పుంగనూరు పీఎస్‌లో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ఐపీపీ 147, 148, 332, 353, 128బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: టీడీపీ రౌడీల దాడి: పోలీసులను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి -
పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ ఆదేశం
సాక్షి, అమరావతి: పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని, వాహనాలను సైతం ఉద్దేశపూర్వకంగా తగులపెట్టారని డీజీపీ అన్నారు. ‘‘రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించాం. లా అండ్ ఆర్డర్‌కి విఘాతం కలిగించిన వారందరిపై కఠినచర్యలు తప్పవు. సీసీ కెమెరా పుటేజీని విశ్లేషిస్తున్నాం. ఇప్పటికే అనేక మంది నిందితులను గుర్తించాం. మరికొందరి కదలికలపై నిఘా పెట్టాం. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుంది. ఈ ఘటన వెనుక ఎవరున్నారో ప్రాథమిక సమాచారం ఉంది. రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టాం. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించేదిలేదు’’ అని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. కేసు నమోదు.. పుంగనూరు పీఎస్‌లో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ఐపీపీ 147, 148, 332, 353, 128బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. చదవండి: టీడీపీ రాక్షస క్రీడ -
పంద్రాగస్టుకు ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: వచ్చేనెల 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి 77వ భారత స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించి శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూస్తూ విస్తృత ఏర్పాట్లుచేయాలన్నారు. అదేరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమానికి కూడా ఏర్పాట్లుచేయాలని సీఎస్ వారిని ఆదేశించారు. మొత్తం ఏర్పాట్లన్నింటినీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ పోలీస్ కమిషనర్ పర్యవేక్షించాలన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమాభివృద్ధి పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు ఆయా శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటుచేయాలని జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఈ వేడుకలకు హాజరయ్యే అతిథులందరికీ ప్రొటోకాల్ సహా తగిన ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. రాజ్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం సహా ఇతర ప్రముఖ కార్యాలయాల భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని కూడా సీఎస్ సూచించారు. పోలీసు శాఖ విస్తృత బందోబస్తు.. మరోవైపు.. వీడియో లింక్ ద్వారా సమావేశంలో పాల్గొన్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖ పరంగా విస్తృత బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏర్పాట్లన్నింటినీ విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఏపీఎస్పీ అదనపు డీజీపీలు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారని చెప్పారు. రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. శకటాల ప్రదర్శనకు ఇప్పటివరకూ 13 శాఖలు ముందుకొచ్చాయని, పర్యాటక శాఖ శకటం కూడా ఏర్పాటుచేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. ఈ వేడుకలను ప్రజలందరూ తిలకించేందుకు వీలుగా స్క్రీన్లు ఏర్పాటుచేయడంతోపాటు ఆలిండియా రేడియో, దూరదర్శన్ సహా వివిధ చానాళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లుచేస్తున్నామన్నారు. ఇక వేడుకల అనంతరం ఆయా శకటాలను విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులో తిప్పనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ప్రత్యేక బస్సులు.. అనంతరం.. ఎన్టీఅర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొనేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ కూడా మాట్లాడారు. అంతకుముందు.. రాష్ట్ర ప్రొటోకాల్ విభాగం సంచాలకులు ఎం. బాలసుబ్రహ్మణ్యంరెడ్డి వివిధ శాఖలపరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) చిరంజీవి చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పవన్‌పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వాలంటీర్లపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం డీజీపీ రాజేంద్రనాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. పవన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని వారు కోరారు. డీజీపీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రతినిధులు ఉన్నారు. అనంతరం, ఎమ్మెల్సీ పోతుల సునీత మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు హేయమైనవి. చంద్రబాబు, నారా లోకేశ్‌లకు రాజకీయాలు చేసే దమ్ములేక పవన్‌ను అడ్డుపెట్టుకుంటున్నారు. పవన్ వారి కోసమే రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు, లోకేశ్‌ల జేబు సంస్థగా పవన్ పనిచేస్తున్నాడు. పవన్‌కు మహిళలంటే గౌరవం లేదు. వ్యక్తిగత జీవితంలో మహిళలను మోసం చేసిన మోసగాడు పవన్. అందుకే వాలంటీర్ల పట్ల పవన్ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. పవన్‌ను రెండు చెప్పులతో కొట్టడానికి వాలంటీర్లంతా సిద్ధంగా ఉన్నారు. పవన్‌కు ఇదే మా హెచ్చరిక. మేం చాటలు, చెప్పులు ఎత్తితే నీ గతేంటో తెలుసుకో పవన్. మహిళలు, వాలంటీర్లకు పవన్ తక్షణమే సమాధానం చెప్పాలి. పవన్.. చంద్రబాబేనా నీ కేంద్ర నిఘా సంస్థ. చంద్రబాబు నీ చెవిలో ఊదితేనే ఇవన్నీ మాట్లాడుతున్నావ్. పవన్ వంటి వ్యక్తులు రాష్ట్రంలో యాత్రలు చేయడానికి లేదు. పవన్‌ను అరెస్ట్ చేయమని డీజీపీని కోరాం అని తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంతకు దిగజారుతారా.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారా?: పేర్ని నాని ఫైర్ -
కోటి 75 లక్షలు తీసుకుని ఏం చేసాడు అంటే..!
-
నిందితుల పై పీడీ యాక్ట్..!
-
డబ్బుల కోసమే ఏ కిడ్నాప్..!
-
రౌడీషీటర్లు లేకుండా విశాఖ ప్రశాంతంగా ఉంది: డీజీపీ రాజేంద్రనాథ్
సాక్షి, మంగళగిరి: విశాఖలో కిడ్నాప్ ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ వివరణ ఇచ్చారు. డబ్బు కోసమే కిడ్నాప్ చేశారని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగానే ఉన్నాయని వెల్లడించారు. రౌడీషీటర్లు లేకుండా విశాఖ ప్రశాంతంగా ఉంది. ఏపీ క్రైమ్‌రేట్ తగ్గిందని స్పష్టం చేశారు. కాగా, డీజీపీ రాజేంద్రనాథ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కిడ్నాప్ విషయం విశాఖ ఎంపీ ఫోన్ చేసి అక్కడి సీపీకి సమాచారం ఇచ్చారు. ఆడిటర్, ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు సమాచారం వచ్చింది. రిషికొండలో బాధితులు ఉన్నట్టు ట్రేస్ చేశాం. పోలీసులకు సమాచారం వచ్చినట్టు నిందితులకు తెలిసింది. ఎంపీ కొడుకు, భార్య, మరో వ్యక్తిని తీసుకుని మళ్లీ పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారు. పద్మనాభపురం వరకూ వెళ్లి అక్కడ బాధితులను వదిలి పారిపోయారు. డబ్బు కోసమే ముందుగా ఎంపీ కుమారుడిని కిడ్నాప్ చేశారు. కుమారుడితో ఫోన్ చేయించి తల్లిని రప్పించారు. గంటల వ్యవధితోనే కిడ్నాపర్లను పట్టుకున్నాం. కిడ్నాపర్లు రూ.కోటి 75లక్షలు తీసుకున్నారు. ఇప్పటి వరకు రూ.85లక్షలు రికవరీ చేశాం. కత్తితో చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. ఇవాళ నిందితులను కోర్టులో హాజరుపరుస్తాం. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందనడం సరికాదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగానే ఉన్నాయి. రౌడీషీటర్లు లేకుండా విశాఖ ప్రశాంతంగా ఉంది. పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు కాబట్టే గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకోగలిగాం. భూ కబ్జాల కేసులు తక్కువ నమోదవుతున్నాయి. గంజాయి పంటలను రెండు సంవత్సరాల నుండి ధ్వంసం చేస్తున్నాం. గంజాయి అమ్మేవాళ్లపై పీడీ యాక్ట్‌లు పెడుతున్నాం. ఒరిస్సా నుండి గంజాయి వస్తోంది.. మన రాష్ట్రంలో గంజాయి సాగు లేదు. నిందితులకు వేగంగా శిక్షలు పడుతున్నాయి అని వెల్లడించారు. ఇది కూడా చదవండి: పవన్ పార్టీకి అతీగతీ లేదు.. లోకేష్‌ది దిగజారుడు రాజకీయం -
AP: 50 మంది డీఎస్పీలు బదిలీ
సాక్షి, అమరావతి: ఏపీలో 50 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీల బదిలీల వివరాలు -
తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.19.28 లక్షలు జప్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, రెండు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో రూ.19.28 లక్షల అనధికారిక నగదును స్వాదీనం చేసుకుంది. వరుసగా రెండో రోజు గురువారం కూడా ఏసీబీ అధికారులు ఆయా కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. పలు అక్రమాలకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలను గుర్తించారు. నగదుపై అధికారులు ఇచ్చిన వివరణను విశ్లేషించాక సబ్ రిజిస్ట్రార్లు, ఇతరులపై పీసీ చట్టం కింద క్రిమినల్ కేసుల నమోదుతో పాటు, తహసీల్దార్లపై శాఖా పరమైన చర్యలకు సిఫార్సు చేస్తామని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. జప్తు చేసిన నగదు ♦ గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి రూ.1.04 లక్షలు ♦ జలుమూరు తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ అధికారి నుంచి రూ.27,500. ♦ బద్వేల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం విధులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగి వద్ద రూ.2.70 లక్షలు, డాక్యుమెంట్ రైటర్ నుంచి రూ.2.10 లక్షలు ♦ అనంతపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ప్రైవేట్ డ్రైవర్ ఎస్కే ఇస్మాయిల్ డాక్యుమెంట్ రైటర్ల నుంచి వసూలు చేసిన రూ.2 లక్షలకు పైగా నగదు ♦కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ చాంబర్ నుంచి రూ.41 వేలు, డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.94 వేలు జప్తు వన్నం సతీశ్ అనే డాక్యుమెంట్ రైటర్ ఆరు నెలల్లో సబ్ రిజిస్ట్రార్‌కు రూ.94 వేలు, సబ్ రిజిస్ట్రార్ అటెండర్‌కు రూ.1.20 లక్షలు ఫోన్ పే ద్వారా పంపినట్టు గుర్తించారు. ♦ తిరుపతి రూరల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ వద్ద రూ.90 వేలు, ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల వద్ద రూ.56 వేలు, జూనియర్ అసిస్టెంట్ వద్ద రూ.9 వేలు ♦ నర్సాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సబ్ రిజిస్ట్రార్ చాంబర్ నుంచి రూ.30 వేలు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద రూ.20 వేలు, సీనియర్ అసిస్టెంట్ వద్ద రూ.9,500, ప్రైవేటు ఉద్యోగి వద్ద రూ.6 వేలు. ♦ జగదాంబ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం( విశాఖపట్నం)లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ ప్రైవేటు ఉద్యోగి మూడు విడతల్లో ఓ సబ్ రిజిస్ట్రార్‌కు రూ.90 వేలు పంపినట్టు గుర్తించారు. డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.39 వేలు స్వాధీనం చేసుకున్నారు. ♦ తుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.20 వేలు, లెక్కల్లోకి రాని మరో రూ.20 వేలు. -
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డీఎస్పీల బదిలీలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డీఎస్పీల బదిలీ జరిగింది. రాష్ట్రంలో సుమారు 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ.. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. విశాఖకు సంబంధించి బదిలీ అయ్యిన వారిలో ..అనకాపల్లిలో ఏడీపీఓగా విధులు నిర్వర్తిస్తున్న సునీల్‌కి విశాఖ క్రైమ్ ఏసీపీగా బదిలీ, ఏసీబీ డీఎస్పీగా ఉన్న సుబ్బరాజుకి అనకాపల్లి ఎస్డీపీఓగా బదిలీ, కాశీబుగ్గలో ఎస్డీపీఓగా విధులు నిర్వహిస్తున్న శివరాం రెడ్డికి విశాఖ నార్త్ ఏసీపీగా, అలాగే హర్బర్ ఏసీపీగా పనిచేస్తున్న శిరీషకి నెల్లూరు జిల్లాకి బదిలీ అయ్యింది. ఈ మేరకు విశాఖ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయిన అధికారులంతా నార్త్ విశాఖ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న ఏసీసీ శ్రీనివాసరావుకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బదిలీల ఉత్తర్వుల కాపీ కోసం క్లిక్ చేయండి (చదవండి: బాబు చీకటికి.. జగన్ వెలుగులకు ప్రతినిధి) -
నకిలీ హోంగార్డుల కేసు ఏసీబీకి..
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా పోలీసుశాఖలో వెలుగుచూసిన నకిలీ హోంగార్డుల నియామకం కుంభకోణం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి బదిలీ అయింది. కేసును పోలీసుశాఖ నుంచి ఏసీబీకి బదిలీచేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు కేవలం ఏడుగురు నిందితులుగా ఉన్న ఈ కేసులో ఇప్పుడు మరో 86 మందిని చేర్చారు. మొత్తం నిందితులు 93 మందిలో.. నకిలీ హోంగార్డులు 90 మంది, విధుల నుంచి తొలగించిన హోంగార్డులు ఇద్దరు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. అక్రమాలకు పాల్పడినవారిలో వణుకు ఈ కేసు దర్యాప్తును ఏసీబీ చేపట్టడంతో అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు, పోలీసుల్లో వణుకు మొదలైంది. నకిలీ హోంగార్డుల నుంచి టీడీపీ నేతలు వసూలు చేసిన రూ.5 కోట్లలో చిత్తూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత సింహభాగాన్ని చినబాబుకు ముట్టచెప్పినట్లు ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంలో డీఎస్పీలు, జిల్లా పోలీసుశాఖకార్యాలయంలో పనిచేసే ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, నాటి ఓ పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో సాక్ష్యాలు సేకరించి నిందితులకు ఉచ్చు బిగించడంపై న్యాయసలహాలు తీసుకుంటున్నారు. దొడ్డిదారిన నియమించిన అధికారులు 2014 నుంచి 2019 వరకు విడతలవారీగా చిత్తూరు జిల్లా పోలీసుశాఖలో 90 మంది హోంగార్డులను చేర్చారు. పోలీసుశాఖ నుంచి నోటిఫికేషన్ లేకుండా, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించకుండా కొందరు పోలీసు అధికారులు, తెలుగుదేశం నేతలు కలిసి వీరిని చేర్పించేశారు. ఈ దొడ్డిదారి నియామకాల్లో నాటి టీడీపీ ప్రభుత్వ మంత్రి నుంచి జిల్లాకు చెందిన టీడీపీ తమ్ముళ్లు ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. టీడీపీ నేతలు చెప్పిందే చాలు అన్నట్టు.. పోలీసుశాఖలోని పెద్ద హోదాల్లో పనిచేసిన అధికారులు ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ హోంగార్డులను ఆన్–పేమెంట్ కింద టీటీడీ, అగ్నిమాపకశాఖ, జైళ్లశాఖ, విద్యుత్‌శాఖ, రవాణాశాఖ, లా అండ్ ఆర్డర్ విభాగాల్లో చొప్పించేశారు. దొడ్డిదారిన, తప్పుడు డ్యూటీ ఆర్డర్ (డీవో)లతో పోస్టులు పొందిన నకిలీ హోంగార్డులకు ప్రభుత్వం రూ.12 కోట్లకుపైగా వేతనాలు కూడా చెల్లించింది. ఈ బాగోతాన్ని గుర్తించిన చిత్తూరు జిల్లా పోలీసుశాఖ గతేడాది జూలై 16వ తేదీన ఏఆర్ఐ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు డిసెంబర్ 11న ఏడుగురిని (నకిలీ హోంగార్డులు నలుగురు, విధుల నుంచి తొలగించిన హోంగార్డులు ఇద్దరు, ఒక కానిస్టేబుల్‌ను) అరెస్టు చేశారు. రూ.కోట్లు చేతులు మారడం, పోలీసుశాఖలోని ఉద్యోగుల ప్రమేయం ఉండటంతో డీజీపీ ఈ కేసును ఏసీబీకి బదిలీ చేశారు. -
ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతాం: ఏపీ డీజీపీ
సాక్షి, తూర్పుగోదావరి: గత ఏడాది వ్యవధిలో 77 వేల కేసులు తగ్గించామని, రాష్ట్రంలో పోలీసు శాఖపై ప్రజలకు విశ్వసనీయత పెరిగిందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన రాజమండ్రిలో పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, మహిళా పోలీసులతో చిన్న గొడవలు పరిష్కారం అవుతున్నాయన్నారు. ‘‘శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీసుల పని అని, ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతామని డీజీపీ ప్రశ్నించారు. నిర్దేశించిన ప్రదేశాల్లో సభలు పెట్టుకోవాలని సూచించాం. ఇరుకైన ప్రదేశాల్లో సభలు అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. అనపర్తి కేసులపై దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామన్నారు. కళాశాలల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టామని డీజీపీ పేర్కొన్నారు. చదవండి: ఏపీ సర్కార్‌పై ఐరాస శాశ్వత సభ్యుడు ఉన్నావా షాకిన్ బృందం ప్రశంసలు -
పోలీస్ డ్యూటీ మీట్లో సత్తా చాటిన ఏపీ పోలీసులు
సాక్షి, అమరావతి: అఖిల భారత డ్యూటీ మీట్లో రాష్ట్ర పోలీసులు సత్తా చాటారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు పోలీస్ డ్యూటీ మీట్ జరిపారు. పోలీస్ వృత్తి నైపుణ్యాలకు సంబంధించి మొత్తం 11 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో 24 రాష్ట్రాల పోలీస్ విభాగాలు, కేంద్ర పోలీస్ బలగాలకు చెందిన మొత్తం రెండు వేల మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పోలీస్ అధికారులు రెండు స్వర్ణ పతకాలు, మూడు రజత పతకాలు, ఓ కాంస్య పతకంతో మొత్తం ఆరు పతకాలు గెలుచుకుని దేశంలో మూడో స్థానంలో నిలిచారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్ర పోలీస్ అధికారులను డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి మంగళవారం అభినందించారు. పోలీస్ శాఖ నుంచి స్వర్ణ పతక విజేతలకు రూ.3లక్షలు, రజత పతక విజేతలకు రూ.2లక్షలు, కాంస్య పతక విజేతకు రూ.లక్ష చొప్పున నగదు బహుమతులు అందించారు. -
AP: ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు డీజీపీ అభినందన
అమరావతి: దేశంలోనే వృత్తి నైపుణ్యంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఏపీ పోలీస్ అధికారులను డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అభినందించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఐదు రోజుల పాటు జరిగిన 66వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్-2022లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వృతి నైపుణ్యంలో ఆరు పతకాల( 2 బంగారు పతకాలు, 3 రజత పతకాలు, 1 కాంస్యం పతకం)తో దేశంలో అత్యధిక మెడల్స్ గెలుచుకున్న మూడో రాష్ట్రంగా నిలిచింది. ఈ మేరకు అత్యధిక స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణం, కాంస్యం, రజిత పతకాలు సాధించిన ఎపి పోలీస్ అధికారుల బృంధాన్ని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు. కాగా, ఫిబ్రవరి 13వ తేదీ నుండి 17 తేదీ వరకూ భోపాల్‌లో జరిగిన 66వ అఖిల భారత పోలీస్ డ్యూటి మీట్-2022 లో వృతి నైపుణ్యమునకు సంబందించిన 11 విభాగాల్లో దేశంలోని 24 రాష్ట్రాలతో పాటు సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్‌కు చెందిన మొత్తం 28 టీమ్‌లతో సుమారు 2000 మందికి పైగా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా పతకాలు సాదించిన ఏపీ పోలీస్ అధికారులకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి నగదు బహుమతిని అందించారు. స్వర్ణం పతక విజేతలకు 10 వేలు రూపాయలు, రజత పతక విజేతలకు 8 వేల రూపాయలు, కాంస్యం పతక విజేతలకు ఐదు వేల రూపాయల నగదు బహుమతితో అభినందించి ప్రోత్సాహం అందించారు. అంతే కాకుండా పోలీస్ శాఖలో వృతి నైపుణ్యంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకి , పతకాలు సాదించిన విజేతలకి పోలీస్ శాఖ నుండి ప్రత్యేకంగా స్వర్ణ పతాకం సాదించిన విజేతకు మూడు లక్షల నగదు(మూడు ఇంక్రిమెంట్లు) కాంస్యం పతక విజేతలకు రెండు లక్షల నగదు(రెండు ఇంక్రిమెంట్లు), రజత పతక విజేతలకు లక్ష నగదు (ఒక ఇంక్రిమెంట్)బహుమతితో అభినందించి ప్రోత్సాహం అందించారు. -
రాష్ట్ర వ్యాప్తంగా 20 పీఎస్‌లను ఏర్పాటు చేశాం: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
-
తగ్గిన నేరాలు..పెరిగిన భద్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు శాఖ నేరాలను నియంత్రించి శాంతిభద్రతలను సమర్థంగా పరిరక్షిస్తోందని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. వినూత్న పోలీసింగ్ విధానాలతో 2022లో అన్ని రకాల నేరాలు తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన భద్రతను అందించగలిగామని తెలిపారు. ఆయన బుధవారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పోలీసు శాఖ వార్షిక నివేదిక – 2022ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి, అక్రమ మద్యం దందాను సమర్థంగా కట్టడి చేశామన్నారు. అసాంఘిక శక్తులపై నిఘా, పీడీ యాక్ట్ ప్రయోగం, తక్షణ అరెస్టులతో రాష్ట్రంలో హత్యలు, ఘర్షణలను నియంత్రించినట్లు తెలిపారు. గ్రామాల సందర్శన, అవగాహన కార్యక్రమాలతో ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు, దాడులను గణనీయంగా తగ్గించామన్నారు. దిశ వ్యవస్థను పటిష్టంగా అమలు చేశామన్నారు. నేర ప్రభావిత ప్రదేశాల జియో మ్యాపింగ్, మహిళా పోలీసుల పర్యవేక్షణ తదితర చర్యలతో మహిళా భద్రతను పటిష్టం చేసినట్లు చెప్పారు. రోడ్లపై బ్లాక్ స్పాట్లు గుర్తించడం, ఇతరత్రా చర్యలతో రోడ్డు ప్రమాదాలను తగ్గించామన్నారు. లోన్ యాప్ వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో 36 అవార్డులు సాధించిందని చెప్పారు. 420 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ పోస్టుల్లో హోంగార్డులకు తొలిసారిగా రిజర్వేషన్ కల్పించామన్నారు. కొత్తగా నాలుగు ఐఆర్ బెటాలియన్లు మంజూరయ్యాయని అన్నారు. 2023లో కూడా సమర్థ పోలీసింగ్‌తో శాంతిభద్రతలను పరిరక్షిస్తామని చెప్పారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించిన ప్రధానాంశాలు ఇవీ... ► 2020లో రాష్ట్రంలో 2,92,565 కేసులు, 2021లో 2,84,753 కేసులు నమోదు కాగా 2022లో కేసులు 2,31,359కి తగ్గాయి. గత సంవత్సరంతో కలిపి పెండింగ్ కేసులు 3,77,584 ఉండగా, 2,66,394 కేసుల దర్యాప్తు పూర్తయింది. దీంతో పెండింగ్ కేసుల సంఖ్య 1,11,190కి తగ్గింది. 96 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు చేశారు. నేరాలకు శిక్షలు 66.69 శాతానికి పెరిగాయి. 2020లో 21 పోక్సో కేసుల్లో శిక్షలు పడగా, 2022లో ఆరు నెలల్లోనే 90 కేసుల్లో శిక్షలు పడ్డాయి. 42 కేసుల్లో జీవిత ఖైదు పడటం గమనార్హం. రాష్ట్రంలో 2021లో 945 హత్య కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 857కు తగ్గాయి. రోడ్డు ప్రమాదాలు 2021లో 19,203 జరగ్గా 2022లో 18,739కు తగ్గాయి. ► లైంగిక దాడి కేసులు 2021లో 1,456 నమోదు కాగా, ఈ ఏడాది 1,419 నమోదయ్యాయి. పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో మహిళలు ధైర్యంగా ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో కేసుల సంఖ్య పెరిగింది. మహిళలపై వేధింపుల్లో 2021లో 10,373 కేసులు నమోదు కాగా 2022లో 11,895 నమోదయ్యాయి. ► దిశ యాప్‌ను 1,37,54,267 మంది డౌన్లోడ్ చేసుకోగా, 1,11,08,227 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2022లో దిశ యాప్ వినతుల్లో 17,933 కేసుల్లో తక్షణ చర్యలు తీసుకుని 1,585 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ► ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారం కేసులు 2021లో 231 నమోదు కాగా, 2022లో 205కు తగ్గాయి. దాడులపై 2021లో 606 నమోదవగా 2022లో 585 నమోదయ్యాయి. ► అక్రమ మద్యం, నాటుసారాపై మొత్తం 37,189 కేసులు నమోదు చేసి 28,803 మందిని అరెస్టు చేశారు. 169 మందిపై పీడీ యాక్ట్ అమలు చేశారు. 2,093 గ్రామాలను నాటు సారా లేని గ్రామాలుగా ప్రకటించారు. కేవలం 103 గ్రామాలు మాత్రమే నాటు సారా లేని గ్రామాలుగా ప్రకటించాల్సి ఉంది. నాటుసారా తయారీపైనే ఆధారపడుతున్న 1,363 కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించారు. ► ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 7119.85 ఎకరాల్లో గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. కేవలం ఐదు రోజుల్లో 720 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,45,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 70 శాతం ఒడిశా నుంచి తరలిస్తున్నదే. -
ఏపీలో ఈ ఏడాది భారీగా తగ్గిన క్రైం రేట్
సాక్షి, విజయవాడ: ఏపీలో క్రైమ్ రేటు తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మెరుగైన పోలీసింగ్‌తో నేరాలు తగ్గించగలిగామన్నారు. లోక్ అదాలత్ ద్వారా పెద్ద ఎత్తున కేసులు పరిష్కరిస్తున్నాం. 1.08 లక్షల కేసులు పరిష్కరించాం. చోరీ కేసుల్లో రికవరీ శాతం బాగా పెరిగిందని డీజీపీ పేర్కొన్నారు. ‘‘గతేడాది 2,84,753 కేసులు నమోదు కాగా, 2022లో 2,31,359 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2021లో 945 హత్య కేసులు నమోదు కాగా, 2022లో 857 హత్య కేసులు మాత్రమే నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు 2021లో 19,203 జరగగా 2022 లో 18739 ప్రమాదాలు జరిగాయి. బ్లాక్ స్పాట్ లను గుర్తించి నివారణా చర్యలు చేపట్టాం. కన్విక్షన్ బేస్ పోలింగ్ విధానాన్ని ఈ సంవత్సరం జూన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. ఈ విధానం ద్వారా ప్రతి ఒక్క యూనిట్ అధికారి సీపీ/ ఎస్పీ తమ పరిధిలోని అత్యంత ముఖ్యమైన ఐదు కేసులు(మహిళలకు సంబంధించిన కేసులకు మొదటి ప్రాధాన్యత) పర్యవేక్షణ చేస్తారు’’ అని డీజీపీ వివరించారు. ‘‘ప్రతి రోజు షెడ్యూల్ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు ట్రైల్ పురోగతిపై సమీక్ష నిర్వహించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశాం ఈ విధానం ద్వారా కేసు ట్రైల్ సమయాన్ని తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే నేరస్తులకు శిక్ష పడేవిధంగా చేయొచ్చు. అంతేకాకుండా ఏ ఒక్క నేరస్థుడు తప్పించుకోకుండా చూడటం ముఖ్య ఉద్దేశం’’ అని రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి: కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం యనమల.. ఆ లీకుల వెనుక అసలు వ్యూహం ఇదే.. -
అక్రమ ఆయుధాల సుపారీ గ్యాంగ్ అరెస్ట్
సాక్షి, అమరావతి: అక్రమ ఆయుధాల తయారీ, విక్రయాలతోపాటు నకిలీ నోట్ల దందా నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ముఠా అనంతపురం, బళ్లారి కేంద్రాలుగా వివిధ రాష్ట్రాల్లో కిరాయి హత్యలకు పాల్పడుతూ, నకిలీ నోట్ల ముద్రణ, చలామణి చేస్తున్నట్టు గుర్తించారు. ఈ గ్యాంగ్‌కు చెందిన ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేయడంతోపాటు వారి నుంచి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తీగ లాగితే.. అనంతపురం జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అంతర్ రాష్ట్ర అక్రమ ఆయుధాల ముఠా వ్యవహారం బయటపడింది. దాంతో అనంతపురం జిల్లా పోలీసులతో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. బెంగళూరుకు చెందిన రౌడీషీటర్లు జంషీద్, ముబారక్, అమీర్ పాషా, రియల్ అబ్దుల్ షేక్ మహారాష్ట్రలోని సిర్పూర్ నుంచి గంజాయి, మధ్యప్రదేశ్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ వారిని అరెస్ట్ చేసి 12 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ టీమ్ వారిని విచారించి మరింత కీలక సమాచారాన్ని రాబట్టింది. అనంతరం మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో హిరేహాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించింది. ఆయుధాల తయారీదారుడు, డీలర్ రాజ్‌పాల్‌సింగ్‌తోపాటు ఆయుధాల సరఫరాదారుడిగా ఉన్న సుతార్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయుధాల డీలర్ల నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలతో బెంగళూరుకు చెందిన ముఠా సభ్యులు కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రాజ్‌పాల్‌సింగ్ దేశంలోని వందలాది ప్రాంతాలకు అక్రమ ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు కూడా బయటపడింది. నిందితులు ఆరుగురిపై గంజాయి అక్రమ రవాణా, నకిలీ నోట్ల రాకెట్, అక్రమ ఆయుధాలు, కిరాయి హత్యలు తదితర అభియోగాలపై ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవాలలో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ముఠా నెట్‌వర్క్‌పై మరిన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అసాంఘిక శక్తులను ఉపేక్షించేదే లేదు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఈ క్రమంలో అనంతపురం జిల్లా పోలీసులు కీలక కేసును ఛేదించారు. బెంగళూరుకు చెందిన కిరాయి హంతకుల ముఠా అనంతపురం–బళ్లారి కేంద్రాలుగా కొంతకాలంగా నకిలీ నోట్లు, అక్రమ ఆయుధాల దందా నిర్వహిస్తున్నట్టు గుర్తించాం. అక్రమ ఆయుధాల తయారీదారు, డీలర్‌తోపాటు అంతర్ రాష్ట్ర ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. – కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ -
శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించేది లేదు: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
-
మాచర్ల ఘటన: నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు: డీజీపీ
విజయవాడ : మాచర్ల ఘటనపై విచారణకు ఆదేశించారు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి. దీనిలో భాగంగా ఐజీ త్రివిక్రమ్‌ను మాచర్లకు పంపారు.మాచర్లలో నిన్న(శుక్రవారం) రాడ్లు, కర్రలతో స్వైర విహారం చేసిన ఘటనపై డీజీపీ ఆరా తీశారు. అదనపు బలగాలను కూడా మాచర్లలో మోహరించినట్లు డీజీపీ తెలిపారు. ప్రస్తుతం మాచర్లలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అవాంఛనీయ శక్తులను ఉపేక్షించబోమని పేర్కొన్న డీజీపీ.. మాచర్ల ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ అల్లర్ల ఘటనకు సంబంధించి నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు డీజీపీ. చదవండి: టీడీపీ రౌడీల స్వైర విహారం -
డీజీపీని కలిసిన వల్లభనేని వంశీ.. టీడీపీ నేతలకు వార్నింగ్
సాక్షి, విజయవాడ: సంకల్ప సిద్ధి ఈ కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్కాంలో తనకు ప్రమేయం ఉందంటూ అసత్య ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు, పచ్చ మీడియా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ డీజీపీని కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డికి గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే వంశీ మీడియాతో మాట్లాడుతూ.. ‘సంకల్ప సిద్ధి స్కాంలో ఓలుపల్లి రంగా ద్వారా నాకు, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి సంబంధం ఉందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రెస్మీట్లో చెప్పారు. 3 నెలలుగా నేను గన్నవరంలో ఉండటంలేదని, హైదరాబాద్‌లో ఉంటూ రూ.600 కోట్లతో బెంగళూరులో కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టానంటూ నిరాధార ఆరోపణలు చేశారు. చదవండి: (రాయలసీమ ప్రగతికి మరో ‘హైవే’.. రూ.1,500.11 కోట్లతో 4లేన్ల రహదారి) ఈ స్కాంలో వందల కోట్లు సంపాదించానంటూ పుకార్లు పుట్టించారు. ఈ అసత్య ప్రచారాన్ని టీవీ 5, ఏబీఎన్ ఛానళ్లు గత నెల 26, 27 తేదీల్లో లైవ్ టెలికాస్ట్‌గా, 27, 28 తేదీల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కథనాలుగా ఇచ్చాయి. గతంలోనూ గల్ఫ్‌లో కాసినోలు పెట్టించానని, చీకోటి ప్రవీణ్‌తో సంబంధాలున్నాయని టీడీపీ నేతలు ప్రచారం చేసి నా ప్రతిష్టకు భంగం కలిగించాలని విఫలయత్నం చేశారు. చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో నాకు, కొడాలి నానికి ఎలాంటి ప్రమేయం లేదని ఈడీ తేల్చిన తరువాత తోక ముడిచారు. సంకల్ప స్కాంలో నాపై చేసిన ఆరోపణలకు వారి వద్ద ఉన్న ఆధారాలు వెంటనే బయటపెట్టాలి’ అని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక అసత్య ప్రచారాలతో ప్రజలను నమ్మించేందుకు పచ్చ మీడియా పని చేస్తోందన్నారు. ఈ కేసులో తన అనుచరులు ఉంటే అరెస్ట్ చేయాలని, సీబీఐ, స్వతంత్ర సంస్థలతో విచారించాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. తన ప్రతిష్టకు భంగం కలిగించిన టీవీ5, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడుపై పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు. -
రాష్ట్రంలో గంజాయికి అడ్డుకట్ట
దొండపర్తి (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో గంజాయి, ఎర్ర చందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా త్వరలోనే పొరుగు రాష్ట్రాల అధికారులతో తిరుపతిలో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయి కట్టడిపై పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో దృష్టి సారించిందని చెప్పారు. ఈ ఏడాది 1.32 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, 1,599 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితులు 12 రాష్ట్రాలకు చెందిన వారని, వారందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. సైబర్ కేసులను ఛేదించడానికి అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఏడాదిలోగా 6,500 మంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా 47 వేల కేసులు పరిష్కారం రాష్ట్ర వ్యాప్తంగా లోక్ అదాలత్ ద్వారా 47 వేల కేసులు పరిష్కారమయ్యాయని, వీటిలో పెండింగ్‌తో పాటు విచారణలో ఉన్న 36 వేలు ఐపీసీ కేసులు ఉన్నాయన్నారు. లక్ష వరకు పెట్టీ కేసులను కూడా పరిష్కరించినట్లు చెప్పారు. న్యాయ వ్యవస్థతో సమన్వయం చేస్తూ ఒకే లోక్ అదాలత్‌లో ఇంత పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేసిన రాష్ట్రంలోని పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించారు. దోషులకు సత్వరమే శిక్ష పడేలా సమగ్ర విచారణ దోషులకు సత్వరమే శిక్ష పడేలా నేర నిరూపణలో వేగవంతమైన, సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం స్వయంగా ఎస్పీలే నాలుగైదు పెండింగ్ కేసులు పర్యవేక్షించేలా ఆదేశించామని, దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ప్రధానంగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ పర్యవేక్షణలో దిశ స్టేషన్లో నమోదైన మైనర్ బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్లు శిక్ష పడేలా చేశారని తెలిపారు. ఇదే తరహాలో రాష్ట్రంలో మరో రెండు నెలల్లో 120 కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన విజయవంతానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని డీజీపీ అభినందించారు. విశాఖలో నేరాలు అదుపులో ఉన్నాయని చెప్పారు. హత్యలు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గాయని వివరించారు. ఈ సమావేశంలో, విశాఖ డీఐజీ హరికృష్ణ, విశాఖ నగర సీపీ సీహెచ్ శ్రీకాంత్, డీసీపీ (లా అండ్ ఆర్డర్) సుమిత్ సునీల్ గరుడ్ తదితరులు పాల్గొన్నారు. -
మోసకారి లోన్‌యాప్ కంపెనీలపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: మోసాలు, వేధింపులకు పాల్పడే లోన్‌యాప్ కంపెనీలు, వాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా విధి విధానాలను రూపొందించినట్లు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేని లోన్‌యాప్‌ల డెవలపర్లు, వాటితో ఒప్పందం చేసుకునే గూగుల్ ప్లే స్టోర్స్, యాప్ స్టోర్స్ వంటి కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లుగా ఉండే టెలికాం కంపెనీలు, యాప్‌ల ఖాతాలను నిర్వహించే బ్యాంకులపైన కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. డీజీపీ శుక్రవారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే పోలీసు శాఖ రాష్ట్ర, జిల్లా స్థాయిలో బ్యాంకు అధికారులతో సమావేశమై కొత్త విధివిధానాలను వివరించిందని తెలిపారు. విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న నకిలీ లోన్ యాప్ ముఠాలు ఇక్కడ ఏజంట్లను నియమించుకుని మోసాలకు పాల్పడుతున్నాయన్నారు. అందుకోసం ఎక్కడో ఉన్నవారి పేరున మన రాష్ట్రంలో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. అటువంటి ఖాతాలను నిశితంగా పరిశీలించాలని, ఒక్కసారిగా భారీగా నగదు జమ అయ్యే ఖాతాలను వెంటనే జప్తు చేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే బ్యాంకులపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. రాష్ట్రంలో మోసాలకు పాల్పడే లోన్ యాప్ కంపెనీలపై ఇప్పటికే 75 కేసులు నమోదు చేసి, 71 మందిని అరెస్టు చేశామని, బ్యాంకు ఖాతాల్లోని రూ.10.50 కోట్లు జప్తు చేశామని వెల్లడించారు. మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించిన 230 కంపెనీల్లో 170 కంపెనీలను బ్లాక్ చేయించామని చెప్పారు. చైనా తదితర దేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడే వారిపై చర్యల కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇంటర్‌పోల్ వంటి సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లోన్‌యాప్ మోసాలపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రిజర్వ్ బ్యాంకు అనుమతి లేని యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవద్దని, ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని చెప్పారు. మోసాలు, వేధింపులు ఎదుర్కొనే వారు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. టోల్‌ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేస్తే పోలీసులు తక్షణం సహకరిస్తారని చెప్పారు. బెదిరింపులు, ఫొటో మార్ఫింగులకు భయపడి ఆత్మహత్య యత్నాలు వంటి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. లంచగొండి సీఐ, ఎస్సై అరెస్ట్ హత్య కేసులో నిందితుల జాబితాలో పేర్లు చేర్చకుండా ఉండేందుకు లంచం తీసుకున్నట్టు రుజువు కావడంతో కృష్ణా జిల్లా పమిడిముక్కల సీఐగా చేసిన ఎం.ముక్తేశ్వరరావు, తోట్లవల్లూరు ఎస్సైగా చేసిన వై.అర్జున్‌లను శుక్రవారం అరెస్టు చేసినట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వారిని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు. డీజీపీ తెలిపిన ప్రకారం ఈ కేసు వివరాలు తోట్లవల్లూరుకు చెందిన గడికొయ్య శ్రీనివాసరెడ్డి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి, మిథునలను పోలీసులు ఈ ఏడాది జులై 26న అరెస్టు చేశారు. ఈ కేసులో శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు సీఐ ముక్తేశ్వరరావు రూ.15 లక్షలు, ఎస్సై అర్జున్ రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి బంధువు జొన్నల నరేంద్రరెడ్డి ద్వారా వ్యవహారం నడిపారు. శ్రీకాంత్ రెడ్డి తల్లిదండ్రులు నరేంద్రరెడ్డికి రూ.19.36 లక్షలు ఇచ్చారు. ఇందులో నుంచి నరేంద్రరెడ్డి సీఐ ముక్తేశ్వరరావుకు రూ.12.50 లక్షలు, ఎస్సై అర్జున్‌కు రూ.1.50 లక్షలు ఇచ్చారు. ఈ విషయం శ్రీకాంత్‌రెడ్డి బంధువు పుచ్చకాయల శ్రీనివాసరెడ్డికి తెలిసింది. పోలీసుల పేరు చెప్పి నరేంద్రరెడ్డి ఎక్కువ తీసుకున్నారని ఆయన శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెప్పారు. దాంతో నరేంద్రరెడ్డి ఆగ్రహించి శ్రీనివాసరెడ్డిని హత్య చేశాడు. ఈ కేసులో ఆత్కూరు పోలీసులు నరేంద్రరెడ్డిని విచారించడంతో సీఐ, ఎస్సైల అవినీతి కూడా బయటపడింది. దాంతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి సీఐ, ఎస్సైపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. వారు లంచం తీసుకున్నట్టుగా విచారణలో వెల్లడైంది. దాంతో వారిద్దరినీ అరెస్టు చేశామని, విధుల నుంచి తొలగిస్తామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. -
ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా?
సాక్షి, అమరావతి: నిత్యావసర వస్తువుల చట్టం (ఈసీఏ) కింద నిత్యావసరాలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాల జప్తు వ్యవహారంలో రాష్ట్ర డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యక్తిగత హాజరుకు హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 30న స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈసీ చట్టం కింద అక్రమ రవాణా వాహనాలను జప్తు చేసే అధికారం సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)కన్నా తక్కువ స్థాయి అధికారులకు లేదంటూ తాము పలుమార్లు ఉత్తర్వులు జారీ చేసినా క్షేత్రస్థాయిలో పట్టించుకోకపోవడంపై వివరణ ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఈ వాహనాల జప్తు అధికారం ఎస్‌ఐకన్నా తక్కువ స్థాయి అధికారులకు లేదంటూ అన్ని జిల్లాల యూనిట్లకు, పోలీస్ కమిషనర్లకు డీజీపీ స్వయంగా జారీచేసిన సర్క్యులర్ అమలుకు నోచుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. స్థాయి లేని అధికారులు తమ వాహనాలు జప్తు చేస్తూనే ఉన్నారన్న ఫిర్యాదులతో పిటిషన్లు దాఖలవుతూనే ఉన్నాయని తెలిపింది. సంబంధిత అధికారి జప్తు చేస్తేనే ఆ వాహనాలపై కేసులు చెల్లుబాటు అవుతాయని, లేని పక్షంలో చెల్లవని స్పష్టం చేసింది. ఆ కేసులు న్యాయ సమీక్షకు నిలబడవని తేల్చి చెప్పింది. కిందిస్థాయి పోలీసు అధికారుల అవిధేయత, అరాచక శైలిపై స్వయంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారంటూ తమ వాహనాలను పోలీసులు జప్తు చేశారని, వాటిని విడుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మారుతీనగర్‌కు చెందిన షేక్ మహ్మద్, మరొకరు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి విచారణ జరిపారు. -
వారిపై కఠిన చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీని కోరారు. ఆమె బుధవారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి కలిసి ఈమేరకు ఫిర్యాదు చేశారు. వైఎస్ భారతి గతంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ నిందాపూర్వకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నవారు, యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ పోస్టులను సోషల్ మీడియా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పద్మ విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియా వైఎస్ భారతిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పారిశ్రామికవేత్త, సామాజిక సేవాతత్పరురాలు భారతిపై దుష్ప్రచారం చేయడాన్ని యావత్ సమాజం ఖండిస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు. మహిళలను అడ్డంపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకునే ఎవరికైనా కఠినమైన సంకేతాలు పంపాల్సిన అవసరం ఉన్నందునే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కుటుంబ కలహాల కారణంగానే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. భార్యాభర్తలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చేలా ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పోలీస్ శాఖ, మానసిక వైద్యుల సంఘం రాష్ట్ర శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా బెంజిసర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం వరకూ విద్యార్థులు, పోలీస్ సిబ్బందితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తొలుత బెంజిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానసిక వైద్యుల సంఘం రూపొందించిన పోస్టర్‌ను డీజీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో పిల్లలు అనాథలుగా మారే అవకాశం ఉందన్నారు. ఆరి్థక ఇబ్బందులు, అనారోగ్యాలతో కూడా కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. చదువుల విషయంలో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తీసుకు రావొద్దని సూచించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఒత్తిడిలేని విద్యా విధానమే లక్ష్యంగా ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తోందన్నారు. అనంతరం ‘సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు.. మేం ఆత్మహత్య చేసుకోం’ అని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ టీకే రాణా, మానసిక వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.ప్రభాకర్, కార్యదర్శి డాక్టర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
వినాయక ఉత్సవాలపై ఎలాంటి ఆంక్షలు లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినాయక చవితి నిర్వహణ పైన, వినాయక విగ్రహాల నిమజ్జనం పైన ఎటువంటి ఆంక్షలు లేవని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది పోలీసులు కొత్తగా ఆంక్షలు విధిస్తున్నారంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దని చెప్పారు. ప్రజలు ఎప్పటిలా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు పోలీసు శాఖ పూర్తిగా సహకరిస్తుందని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వినాయక ఉత్సవ కమిటీలు స్థానికంగా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. వినాయక ఉత్సవాల నిర్వాహకులు ఎటువంటి అఫిడవిట్లు సమర్పించాల్సిన అవసరం లేదని డీజీపీ స్పష్టం చేశారు. వినాయక ఉత్సవాల నిర్వహణ కమిటీలకు పూర్తిగా సహకరించాలని ఎస్పీలు, డీఐజీలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఏటా మాదిరిగానే వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు శాఖ ఈ ఏడాది కూడా సూచనలు చేస్తోందన్నారు. ఈ జాగ్రత్తలు పాటించండి ► వినాయక మండపాల ఏర్పాటుపై ఉత్సవ కమిటీలు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. ► విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవాలు నిర్వహించే రోజులు, నిమజ్జనానికి ఉపయోగించే వాహనం, నిమజ్జనం కోసం తీసుకువెళ్లే రూట్ వివరాలను స్థానిక పోలీసులకు తెలపాలి. ► అగ్నిమాపక, విద్యుత్తు శాఖ సూచనల మేరకు వినాయక మండపాల వద్ద ముందుజాగ్రత్త చర్యగా తగినంత ఇసుక, నీళ్లు ఏర్పాటు చేయాలి. ► కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారమే వినాయక మండపాల వద్ద స్పీకర్లు ఏర్పాటు చేయాలి. ఉదయం 6 నుంచి రాత్రి 10గంటల వరకే స్పీకర్లను ఉపయోగించాలి. ► మండపాల వద్ద క్యూలైన్ల నిర్వహణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు పోలీసు శాఖకు సంబంధిత కమిటీలు సహకరించాలి. ► మండపాల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలి. నిర్వాహక కమిటీ సభ్యులు రాత్రివేళల్లో మండపాల వద్ద తప్పనిసరిగా కాపలా ఉండాలి. ► విగ్రహ నిమజ్జన ఊరేగింపు కోసం వేషధారణలు, డీజే వంటి వాటిపై స్థానిక పోలీసులకు ముందుగా సమాచారం అందించాలి. ► ఇంతకుమించి ఎవరైనా ఇతర నిబంధనలు విధిస్తే అదనపు డీజీ (శాంతి భద్రతలు) రవిశంకర్ అయ్యన్నార్ (ఫోన్: 99080–17338), డీఐజీ రాజశేఖర్‌బాబు (ఫోన్: 80081–11070) దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. -
డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి పతకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి ఉత్తమ పోలీస్ సేవా పతకం(ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్–పీపీఎం) లభించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల వేళ కేంద్ర హోం శాఖ ఈ అవార్డును ప్రకటించింది. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు ఉత్తమ సేవలు–2020 సంవత్సరానికి ఈ పురస్కారం దక్కింది. ఈ పతకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున అందజేయనున్నారు. 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా పనిచేస్తున్న సంగతి తెల్సిందే. రాజేంద్రనాథ్‌రెడ్డి గతంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌తోపాటు పలు హోదాల్లో విధులు నిర్వహించారు. వెంకటరెడ్డికి ఐపీఎం రిటైర్డ్ ఏఎస్పీ నల్లమిల్లి వెంకటరెడ్డి తన సర్వీస్ కాలంలో అందించిన ఉత్తమ సేవలకు కేంద్ర హోం శాఖ ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం) ప్రకటించింది. సబ్ ఇన్స్పెక్టర్ 1989 బ్యాచ్‌కు చెందిన వెంకటరెడ్డి పోలీస్ శాఖలో విశిష్టమైన సేవలందించారు. సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీగా అనేక హోదాల్లో విధులు నిర్వర్తించిన ఆయన పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేసుకున్నారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖలో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో గతేడాది ఆయన అందించిన సేవలకు కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వెంకటరెడ్డి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. -
లోన్ యాప్ బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
-
లోన్ యాప్స్ ఆగడాలపై పూర్తి స్థాయిలో నిఘా: ఏపీ డీజీపీ
సాక్షి, అనంతపురం: లోన్ యాప్స్ ఆగడాలపై లోతుగా విచారణ చేస్తున్నామని.. వీటిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించిన నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. చదవండి: తిట్టుకున్న టీడీపీ మహిళా నేతలు.. గొడవ ఎందుకంటే? లోన్ యాప్ బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామన్నారు. పోలీసులపై రాజకీయ నాయకులు విమర్శలు మానుకోవాలన్నారు. నిరాధారణమైన ఆరోపణలు చేసే రాజకీయ నేతలు విశ్వసనీయతను కోల్పోతారని డీజీపీ అన్నారు. -
టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ టాప్
సాక్షి, అమరావతి: అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా గవర్నెన్స్ నౌ–2022 కింద ప్రకటించిన అవార్డుల్లో 14 అవార్డులను కైవసం చేసుకుంది. పోలీస్ ప్రధాన కార్యాలయం నాలుగు, విశాఖపట్నం సిటీ, శ్రీకాకుళం, కాకినాడ, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లా పోలీస్ విభాగాలు ఒక్కొక్కటి చొప్పున, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాలు రెండు అవార్డుల చొప్పున దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం మాట్లాడుతూ.. ఏపీ పోలీస్ శాఖ టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతోందని, స్వల్ప కాలంలోనే మొత్తంగా 189 జాతీయ అవార్డులను దక్కించుకోవడం తమ శాఖ పనితీరుకు నిదర్శనమని చెప్పారు. ఏ టెక్నాలజీని వినియోగించినా వాటి ఫలాలను క్షేత్రస్థాయిలో అందించి ప్రజలకు సత్వర న్యాయం చేసినప్పుడే అది అర్థవంతమవుతుందన్నారు. ఈ విజయం వెనుక సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఏపీ పోలీస్ శాఖను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. అవార్డులు ఇలా.. శ్రీకాకుళం కమ్యూనిటీ పోలీసింగ్, విశాఖపట్నం సిటీ మహిళా భద్రత, కాకినాడ స్ట్రాటజిక్ రెస్పాన్స్ సెంటర్, ఎన్టీఆర్ ఈ–పోలీసింగ్ ఇనిషియేటివ్, రోడ్డు సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ప్రకాశం సర్వేలెన్స్ అండ్ మానిటరింగ్, చిత్తూరు నేరాల గుర్తింపులో టెక్నాలజీ వినియోగం, తిరుపతి మహిళల భద్రత, పోలీసింగ్ ఇనిషియేటివ్ టెక్నాలజీ, కడప కమాండ్ అండ్ కంట్రోల్ విభాగంలోను అవార్డులను దక్కించుకోగా, పోలీస్ ప్రధాన కార్యాలయానికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్‌లో రెండు, పోలీస్ ఆధునికీకరణలో రెండు మొత్తం నాలుగు అవార్డులు దక్కాయి. -
వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లో 9న ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదకాకాని వద్ద జాతీయ రహదారి – 16 సమీపంలో జరిగే వైఎస్సార్సీపీ ప్లీనరీ, బహిరంగ సభ సందర్భంగా ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని భారీ వాహనాలతో పాటు ఇతర ట్రాఫిక్ ప్లీనరీ జరిగే జాతీయ రహదారిపైకి రాకుండా ఇతర మార్గాల్లోకి మళ్లించినట్టు చెప్పారు. ఈ నిబంధనలు శనివారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ► చెన్నై వైపు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం, నందిగామ, వైపు వెళ్లే భారీ గూడ్స్ వాహనాలను ఒంగోలు జిల్లా త్రోవగుంట నుంచి చీరాల–బాపట్ల–రేపల్లె– అవనిగడ్డ– పామర్రు– గుడివాడ– హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు. ► గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను బుడంపాడు క్రాస్ మీదుగా తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూరి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు– గుడివాడ– హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు. ► విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే లారీలు, ఇతర భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ– పామర్రు– అవనిగడ్డ– రేపల్లె– బాపట్ల– చీరాల– త్రోవగుంట– ఒంగోలు మీదుగా మళ్లించారు. ► విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే లారీలు, భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు– మైలవరం– జి.కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు. ► హైదరాబాద్ వైపు నుంచి విశాఖపట్నం వెళ్లే భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం వద్ద నుంచి జి.కొండూరు – మైలవరం– నూజివీడు– హనుమాన్ జంక్షన్ మీదుగా అనుమతిస్తారు. ► చెన్నై వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే మల్టీ యాక్సిల్ గూడ్స్ వాహనాలను ఎటువంటి మళ్లింపు లేకుండా జాతీయ రహదారికి సమీపంలోని చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద నిలిపివేసి, రాత్రి 10 గంటల తర్వాత అనుమతిస్తారు. ► విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే మల్టీ యాక్సిల్ గూడ్స్ వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద, పొట్టిపాడు టోల్గేట్ వద్ద జాతీయ రహదారికి సమీపంలో నిలిపివేసి, రాత్రి 10 గంటల తర్వాత అనుమతిస్తారు. ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్ ఇలా.. ► విజయవాడ నుంచి ప్లీనరీకి వచ్చే బస్సులకు కాజా టోల్ ప్లాజా వద్ద ఉన్న ఆర్కే వెనుజియా లేఅవుట్ వద్ద, కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ► గుంటూరు నుంచి ప్లీనరీకి వచ్చే బస్సులకు నంబూరు, కంతేరు రోడ్డుపైన, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలకు కేశవరెడ్డి స్కూల్, అమలోద్భవి హోటల్, రైన్ ట్రీ అపార్ట్మెంట్స్ పక్కన పార్కింగ్ ఇచ్చారు. -
అగ్నిపథ్ ఆందోళనలు: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, అమరావతి: అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రైల్వే అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మరోవైపు ప్రధాన రైల్వేస్టేషన్ల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. గుంటూరులో 200 మంది ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు, విశాఖలో ఆందోళనకారులు నిరసనలకు ప్లాన్ చేశారనే విషయాన్ని నిఘా వర్గాలు ముందే గ్రహించాయి. దీంతో ఎక్కడికక్కడ ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఆర్మీ ఇనిస్టిట్యూట్ సెంటర్ల నుంచి పోలీసులు అభ్యర్థుల వివరాలను తీసుకుంటున్నారు. చదవండి: (ఏపీ పోలీసుల అదుపులో సాయి ఢిపెన్స్ అకాడమీ డైరెక్టర్) -
ప్రభుత్వ ఆస్తుల జోలికి వెళ్తే కఠిన చర్యలు: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
సాక్షి, విజయవాడ: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. తాజాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిఘా వర్గాల సమాచారం మేరకు.. ప్రధాన రైల్వేస్టేషన్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ, గుంటూరు, అనకాపల్లి, విశాఖపట్నం, తిరుపతిలో హైసెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరిస్థితులను సమీక్షించుకుంటూ రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ పలు చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. రైళ్లలో అనుమానితులను అదుపులోకి తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్తుల జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు కేసుల్లో ఇరుక్కుంటే అనంతరం ఏ ఉద్యోగమూ రాదంటూ వార్నింగ్ ఇచ్చారు. అబద్ధపు ప్రచారాలు, పుకార్లు పుట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది కూడా చదవండి: ఎక్కడికక్కడ ఆందోళనకారులు అరెస్ట్ -
అమలాపురం ఘటన.. డీఐజీ, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, విజయవాడ: కోనసీమ జిల్లాలో పరిస్థితిపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరా తీశారు. ఏలూరు రేంజ్ డీఐజీ, ఎస్పీలతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమలాపురంలో పరిస్థితిని డీఐజీ, ఎస్సీలు సమీక్షిస్తున్నారు. అమలాపురం ఘటనలో ఏడు కేసులు నమోదు చేశామని.. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశామని డీజీపీ తెలిపారు. రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. 3 బస్సుల దగ్ధంపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశామన్నారు. చదవండి: అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'! -
శభాష్.. పోలీస్..
సాక్షి, అమరావతి: అమలాపురంతోసహా కోనసీమలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం తక్షణం చర్యలు చేపట్టింది. అత్యంత సమర్థంగా, సంయమనంతో వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. కోనసీమలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు కొన్ని అసాంఘిక శక్తులు అమలాపురంలో మంగళవారం మధ్యాహ్నం అల్లర్లు, విధ్వంసానికి పాల్పడిన విషయం తెలియగానే పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కేంద్రం అమలాపురంలో ఉన్న పోలీసు బలగాలు తక్షణం రంగంలోకిదిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించాయి. అల్లరిమూకలు ఎస్పీ సుబ్బారెడ్డితోపాటు 20 మందిపై రాళ్లతో దాడిచేసినప్పటికీ పోలీసులు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా వ్యవహరించారు. ఆందోళనకారులను హెచ్చరించేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. కానీ పక్కా పన్నాగంతో విధ్వంసరచన చేస్తున్న అల్లరిమూకలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయినప్పటికీ పోలీసు కాల్పుల వరకు పరిస్థితి దిగజారకుండా పోలీసు అధికారులు, బలగాలు అత్యంత సంయమనంతో వ్యవహరించాయి. డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. పరిస్థితి చేయిదాటుతోందని గుర్తించగానే అదనపు పోలీసు బలగాలను అమలాపురానికి పంపించారు. కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, రాజమహేంద్రవరం ఎస్పీ ఐశ్వర్యరస్తోగీ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌లను వెంటనే అమలాపురం వెళ్లాలని ఆదేశించారు. విశాఖపట్నం, కృష్ణాజిల్లాల నుంచి కూడా అదనపు పోలీసు బలగాలను అమలాపురానికి తరలిస్తున్నారు. అమలాపురంతోపాటు కోనసీమ అంతటా పరిస్థితిని పోలీసులు మంగళవారం రాత్రి 8.30 గంటలకల్లా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ముందుగానే దాదాపు నాలుగువేల మందిని వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి అల్లర్లు, దాడులకు పాల్పడేలా కొన్ని శక్తులు కుట్రపన్నాయని పోలీసులు గుర్తించారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు తదితరాలను పరిశీలిస్తున్నారు. అమలాపురంలో అల్లర్ల సమయంలో తీసిన వీడియో ఫుటేజీ, ఫొటోల ఆధారంగా కుట్రదారులు, అల్లర్లకు పాల్పడ్డవారిని గుర్తించనున్నారు. అల్లర్లకు బాధ్యులపై కఠిన చర్యలు అమలాపురంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం. అసాంఘిక శక్తులు రాళ్లు రువ్వినా సంయమనం కోల్పోకుండా పోలీసులు సమర్థంగా వ్యవహరించారు. విధ్వంసానికి పాల్పడినవారు, అందుకు కుట్రపన్నినవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మకుండా పోలీసులకు సహకరించాలని కోరుతున్నా. – కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ -
కోనసీమలో పరిస్థితి అదుపులోనే ఉంది: ఏపీ డీజీపీ
సాక్షి, విజయవాడ: కోనసీమ ఉద్రిక్తతలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. కోనసీమలో పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. కొందరు ఆందోళన పేరుతో యువకులు విధ్వంసానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అయితే పోలీసులు ఎంతో సంయమనం పాటించారని తెలిపారు. విధిలేని పరిస్థితుల్లోనే గాల్లోకి కాల్పులు జరిపినట్లు చెప్పారు. విశాఖపట్నం, కృష్ణాజిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను మోహరించామని, విధ్వంసం వెనుక ఎవరున్నారో విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. కలెక్టరేట్ దగ్గరకు వచ్చిన ఆందోళనకారులతో మాట్లాడామని, వారి అభ్యర్దన మేరకు 12 మందిని కలెక్టర్‌ను కలవటానికి అవకాశం కల్పించామని డీజీపీ తెలిపారు. ఆ తర్వాత కొందరు పక్కకు వెళ్లి అల్లర్లకు పాల్పడినట్లు చెప్పారు. ఇద్దరు వీఐపీల ఇళ్లు తగులబెట్టారని, వాహనాలకు నిప్పు పెట్డారని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వంతో చర్చించాలి కానీ విధ్వంసం చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. ప్రస్తుతం అల్లర్లు సద్దుమనిగాయని, ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. చదవండి: కోనసీమ ఆందోళనల్లో జనసేన, టీడీపీ హస్తం: హోంమంత్రి సీరియస్ -
మూడేళ్లలో నేరాల సంఖ్య తగ్గింది
తిరుపతి క్రైం/తిరుమల: గడచిన మూడేళ్లలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని డీజీపీ కాసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో క్రైం రేటును ప్రామాణికంగా తీసుకోకుండా క్రైమ్ రేటును గణించినట్టు చెప్పారు. శనివారం తిరుపతిలోని ఎస్వీ సెనేట్ హాల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో గస్తీ పెంచడంతోపాటు నేర చరిత్ర కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు. రాష్ట్రంలో యాక్సిడెంట్ల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పదో తరగతి తెలుగు పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరిగిన మాట వాస్తవమేనని, ఈ కేసులో పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే నారాయణను అరెస్ట్ చేశామని చెప్పారు. కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన ఏపీపీ సుజాతను సస్పెండ్ చేశామని చెప్పారు. ప్రాసిక్యూషన్‌కు ఏపీపీ సుజాత సహకరించకపోవడంతో చర్యలు తీసుకున్నామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత దిశ, మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు ఆందోళనకరంగా లేవని, అయినా వాటి నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గంజాయి సాగు, రవాణాను నిరోధించాం రాష్ట్రంలో గంజాయి సాగు జరగకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రత్యామ్నాయ పంటలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నట్లు డీజీపీ చెప్పారు. మల్కాన్‌గిరి జిల్లా నుంచి గంజాయి అక్రమ రవాణాను పూర్తి స్ధాయిలో నిరోధించినట్లు తెలిపారు. నిషేధిత వస్తువులు అక్రమంగా రవాణా చేస్తే చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకుంటామని, నేరాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని సరిహద్దుల్లో త్వరలో చెక్ పోస్టు ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, తిరుమల శ్రీవారిని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం దర్శించుకున్నారు. -
ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేస్తాం: ఏపీ డీజీపీ
సాక్షి, అమరావతి: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్రైమ్ రేటు తగ్గింపు, నాటు సారా అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. నెల్లూరు కోర్టులో దొంగతనంపై సాక్ష్యాలు ఆధారంగా ముందుకెళ్లామని చెప్పారు. విచారణలో వాస్తవాలని బట్టి ముందుకెళ్లాలని తెలిపారు. కేసులపై ఆరోపణలు చేయవచ్చు, కానీ వాస్తవాలు విచారణలో బయటపడతాయని తెలిపారు. ఎవరిదగ్గరైనా ఆధారాలుంటే ఇవ్వాలని సమన్లు జారీ చేశామని అన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టామని పేర్కొన్నారు. దిశ యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటే మహిళల వ్యక్తిగత సమాచారానికి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఆలూరు ఘటనలో 82 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. కఠినంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఉషశ్రీ చరణ్ ర్యాలీకి, చిన్నారిని తీసుకెళ్లే సమయానికి గంట తేడా ఉందని చెప్పారు. పాడేరు, మన్యం జిల్లాల్లో పోలీసు కార్యాలయాలు 15 రోజుల్లోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. -
కొత్త జిల్లాలకు సరిపడా సిబ్బంది
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో కొత్త జిల్లాలకు సరిపడా పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఇటీవలే రాష్ట్రానికి కేంద్రం ఐపీఎస్‌లను కేటాయించిందని, అందువల్ల కొత్త జిల్లాలకు వారి కొరత ఉండదని విశాఖలో సోమవారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలో గ్రామ పోలీసు చట్టం బ్రిటీష్ కాలం నుంచీ అమలులో ఉందని.. గ్రామస్థాయిలో పోలీసు విజిలెన్స్ కోసం సచివాలయ పోలీసు వ్యవస్థ అవసరమని డీజీపీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గాయని తెలిపారు. వైఎస్ వివేకా ఘటనపై సీబీఐ దర్యాప్తు జరుగుతోందని.. ఈ సమయంలో దీనిపై మాట్లాడటం సరికాదని విలేకరుల ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఒడిశాతో కలిసి గంజాయి కట్టడి ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంజాయి సాగవుతోందని.. దీనిని కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. గంజాయి సాగు, సరఫరా నియంత్రణ కోసం ఒడిశాతో కలిసి పనిచేస్తున్నామన్నారు. నిజానికి గంజాయి సాగు మొదటినుంచీ ఉందని.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దానిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా కాలేజీలు, రిసార్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. దిశ యాప్ మహిళల రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్), మిలాన్–2022ను విజయవంతంగా నిర్వహించిన పోలీసులను డీజీపీ అభినందించారు. కరోనా కారణంగా నిలిచిపోయిన పోలీసుల వీక్లీ ఆఫ్‌లను తిరిగి అమలుచేస్తామని ఆయన స్పష్టంచేశారు. సమావేశంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా కూడా పాల్గొన్నారు. -
మహిళలపై దాడులను నివారించేందుకు ప్రత్యేక చర్యలు
-
శాంతిభద్రతలకు అగ్ర ప్రాధాన్యం
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు పూర్తి భద్రత కల్పించడమే తన ప్రధాన లక్ష్యాలని నూతన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానంగా మహిళలు, బడుగు, బలహీన వర్గాలు, సామాన్యుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. పూర్తి అదనపు బాధ్యతలతో రాష్ట్ర డీజీపీగా శనివారం ఆయన మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో గౌతం సవాంగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యం, సహకారంతో సవాళ్లను దీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. మత సామరస్యానికి భంగం కలిగించే, ఇతరత్రా అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. క్షేత్ర స్థాయి నుంచి పోలీసు వ్యవస్థ పూర్తి బాధ్యత, జవాబుదారీతనంతో పని చేసేలా సమన్వయపరుస్తామని చెప్పారు. పోలీసు అధికారులు, సిబ్బంది తమ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి నిబద్ధతతో వ్యవహరించాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. దిశ యాప్, దిశ మహిళా పోలీసు వ్యవస్థ, గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసుల నియామకం.. తదితర చర్యలతో క్షేత్ర స్థాయిలో పోలీసు వ్యవస్థ మరింత బలోపేతమైందని చెప్పారు. గంజాయి సాగు, సైబర్ నేరాలు, డ్రగ్స్, ఎర్రచందనం స్మగ్లింగ్ మొదలైనవి పూర్తిగా కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తదనుగుణంగా కొత్తగా పోలీసు జిల్లాలు, యూనిట్లను పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పారు. అందుకోసం ఇప్పటికే ఓ కమిటీని నియమించామని తెలిపారు. ప్రముఖుల పర్యటనల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అదనపు డీజీ (శాంతి భద్రతలు) నేతృత్వంలో ఓ కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. దుర్గమ్మ పంచ హారతుల సేవలో డీజీపీ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. సతీమణితో కలిసి అమ్మవారి పంచ హారతుల సేవలో పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, వెస్ట్ ఏసీపీ హనుమంతరావు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: సవాంగ్ రాష్ట్ర ప్రజలకు డీజీపీగా రెండేళ్ల 8 నెలల పాటు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గౌతం సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొని నిష్పక్షపాతంగా పనిచేసి, పోలీసు వ్యవస్థ ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేశామన్నారు. బదిలీని పురస్కరించుకుని పోలీసు అధికారులు మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో శనివారం సవాంగ్ దంపతులున్న ప్రత్యేక వాహనాన్ని అధికారులు తాళ్లతో లాగుతూ ఘనంగా వీడ్కోలు పలికారు. సవాంగ్ మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. దిశ యాప్‌ను 1.10 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారని, స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై 40 వేలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 7,552 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేయడం దేశంలోనే రికార్డని చెప్పారు. తనకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వీడ్కోలు కార్యక్రమం
-
ఏపీ: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ నూతన డీజీపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, 1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఆయన 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. చదవండి: (సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు: మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్) -
సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు: మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, విజయవాడ: మంగళగిరిలోని 6వ బెటాలియన్ గ్రౌండ్లో బదిలీ అయిన డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. బెటాలియన్ పోలీసు కవాతు నిర్వహించింది. ఈసందర్భంగా బదిలీ అయిన డీజీపీ గౌతమ్ సవాంగ్, నూతన డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సవాంగ్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. 'నా 36 సంవత్సరాల పోలీసు సర్వీసు ఇవాళ్టితో ముగుస్తోంది. డీజీపీగా 2 ఏళ్ల 8 నెలల కాలం పనిచేశా. ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనల ప్రకారం ఈ రెండున్నర ఏళ్ల పాటు పని చేశాను. చాలా సంస్కరణలు, పోలీసు వ్యవహార శైలిలో మార్పులు తెచ్చేందుకు కృషి చేశాను. ప్రజలకు పోలీసు వ్యవస్థను చేరువ చేసేందుకు పని చేశాను. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2 ఏళ్ల 8 నెలల పాటు నన్ను డీజీపీగా కొనసాగించిన సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు. దిశా, మొబైల్ యాప్ నుంచి కూడా కేసులు నమోదు అయ్యేలా చేశాం. బాధితులు పోలీసు స్టేషన్‌కు రాకుండానే ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకున్నాం. 36 శాతం కేసులు డిజిటల్‌గా వచ్చిన ఫిర్యాదులే. 75 శాతం కేసుల్లో కోర్టులు విచారణ చేసి శిక్ష వేశాయి. స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 40 వేలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. స్పందన, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మహిళలు, చిన్నారుల భద్రత కోసం పనిచేశాం. దిశా యాప్ డౌన్లోడ్ లక్ష్యాన్ని సీఎం జగన్ నిర్ధేశించారు. ప్రస్తుతం కోటి 10 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేశారు. అలాగే పోలీస్ సేవా వెబ్ సైట్ ద్వారా డిజిటల్‌గా ఎఫ్ఐఆర్లను డౌన్ లోడ్ చేసే అవకాశం కల్పించాం. డీజీపీ కార్యాలయం నుంచి ఇన్ స్పెక్టర్ కార్యాలయం వరకు డిజిటల్‌గా అనుసంధానం చేశాం. ఏపీ పోలీసు వ్యవస్థలో డీజిటల్‌గా చాలా మార్పులు చేయగలిగాం. పోలీసులకు వీక్లి ఆఫ్‌లు కల్పించారు. 7,552 ఎకరాల్లో పండించిన గంజాయిని తొలిసారిగా ధ్వంసం చేశాం. పోలీస్ వ్యవస్థ పై ప్రజలకు చాలా ఆశలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో సవాళ్ళను ఎదుర్కొంటూనే పని చేయాల్సి ఉంటుంది. నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పోలీస్ వ్యవస్థను ఉన్నత శిఖరాలపై నిలబెడతారని ఆశిస్తున్నా. సీఎం జగన్ మనపై ఉంచిన బాధ్యతలు పూర్తిగా నిర్వహించాలి' అని గౌతమ్‌సవాంగ్ అన్నారు. -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీఎంతో ఆయన సమావేశమయ్యారు. 1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి.. 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. చదవండి: (చిరంజీవికి సీఎం అత్యంత గౌరవమిచ్చారు.. అదంతా తప్పుడు ప్రచారం: అలీ) -
ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి
-
ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, అమరావతి/రాజుపాళెం(వైఎస్సార్ జిల్లా) /పరిగి(అనంతపురం): రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డికి ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్‌ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. 1992∙బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఆయన 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. స్వగ్రామంలో సంబరాలు.. వైఎస్సార్ జిల్లా రాజుపాళెం మండలంలోని పర్లపాడుకు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి.. తండ్రి వెంకటపతిరెడ్డి తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. రాజేంద్రనాథ్‌రెడ్డి సోదరుడు వ్యాపారవేత్తగా రాణిస్తుండగా.. సోదరి కర్నూలు జిల్లా నంద్యాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. రాజేంద్రనాథ్ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవారని పర్లపాడు గ్రామస్తులు చెప్పారు. ఆయన మైదుకూరు ప్రభుత్వ పాఠశాల, అనంతపురంలోని కొడిగెనహళ్లి గురుకుల పాఠశాల, రాజస్థాన్‌లోని బిట్స్ పిలానీలో విద్యాభ్యాసం చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన 1992లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆయనకు ప్రభుత్వం డీజీపీ బాధ్యతలు అప్పగించడంతో స్వగ్రామం పర్లపాడులో గ్రామస్తులు మంగళవారం సంబరాలు చేసుకున్నారు. గ్రామంలోని శివాలయంలో ఆయన పేరు మీద పూజలు, అభిషేకాలు నిర్వహించగా.. ఎస్సీ కాలనీలో కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన విద్యాభ్యాసం చేసిన అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లి పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడు మురళీధరబాబు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: AP: వైద్య, ఆరోగ్య శాఖలో మరో 2,588 పోస్టులు -
అవకతవకలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై కేసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవకతవకలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్‌లు మంగళ, బుధవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15 ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహించాయి. ఇందుకు సంబంధించిన వివరాలను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) కేవీఎన్ రాజేంద్రనాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల తనిఖీల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన రోగులకు చికిత్స చేయడానికి నిరాకరించడం, ప్రభుత్వం నిర్దేశించిన దాని కంటే అధిక చార్జీల వసూలు, పేషెంట్ల సంఖ్యపై తప్పుడు సమాచారం, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల దుర్వినియోగం, అనుమతి లేకుండా కోవిడ్ చికిత్స వంటి అవకతవకలను గుర్తించినట్టు డీజీ వివరించారు. విశాఖపట్నంలోని రమ్య ఆస్పత్రి, విశాఖ జిల్లా నీరుకొండలోని అనిల్ నీరుకొండ(ఎన్ఆర్ఐ భీమిలి), గోపాలపట్నంలోని ఎస్ఆర్ ఆస్పత్రి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని చైత్ర, విజయవాడలోని అచ్యుత ఎన్క్లేవ్, శ్రీరామ్, గుంటూరులోని విశ్వాస్ ఆస్పత్రి, చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్ ప్రసాద్, అనంతపురంలోని ఆశా ఆస్పత్రిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు వివరించారు. వాటిపై ఐపీసీ 188, 420, 269 సెక్షన్లు, విపత్తుల నిర్వహణ చట్టంలోని 51(ఎ), 51(బి), 53 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసినట్టు రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్‌లు ఏర్పాటు చేసిన తరువాత ఇప్పటివరకు నిర్వహించిన దాడుల్లో అక్రమాలకు పాల్పడిన 37 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. సోదాల్లో అవకతవకలు వెలుగుచూసిన ఆస్పత్రులకు జరిమానా, పనిష్మెంట్ ఇచ్చి వైద్య, ఆరోగ్య శాఖ పునరుద్ధరించినప్పటికీ ఆవే ఆస్పత్రులు మళ్లీ అక్రమాలకు పాల్పడితే వాటి యాజమాన్యాలను అరెస్ట్ చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. -
విజిలెన్స్ డీజీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్ పతకం
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి, విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కొట్ర సుధాకర్లకు రాష్ట్రపతి పతకం (ప్రెసిడెంట్ మెడల్) దక్కింది. విశిష్ట సేవలు అందించినందుకుగాను వీరిద్దరు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ (పీపీఎం)కు, ప్రతిభావంతమైన సేవలు అందించినందుకు రాష్ట్రానికి చెందిన మరో 15 మంది పోలీస్ మెడల్స్(పీఎం)కు ఎంపికయ్యారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పోలీస్ విభాగాల్లో సేవలందించిన వారికి నాలుగు రకాల మెడల్స్‌ను ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ శనివారం జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకం (పీపీఎంజీ–ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ)కి నలుగురు, పోలీస్ శౌర్య పతకం (పీఎంజీ)కి 286 మంది, రాష్ట్రపతి పోలీస్ పతకం (పీపీఎం)కి 93, పోలీస్ పతకం (పీఎం)కు 657 మంది పోలీసులు ఎంపికయ్యారు. పోలీసు మెడల్‌కు ఎంపికైన వారు వీరే.. అలాగే, ప్రతిభావంతమైన సేవలు అందించినందుకు రాష్ట్రానికి చెందిన 15 మంది పోలీస్ మెడల్ (పీఎం)కు ఎంపికయ్యారు. వారిలో విజయవాడ అదనపు ఎస్పీ అమలపూడి జోషి, మంగళగిరి ఏపీఎస్పీ అడిషనల్ కమాండెంట్ చింతలపూడి వీఏ రామకృష్ణ, విజయవాడ సీఐడీ డీఎస్పీ ఎం.భాస్కరరావు, విశాఖ గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ విజయకుమార్, విజయవాడ రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జాన్‌మోజెస్ చిరంజీవి, నెల్లూరు ఏఆర్ ఎస్సై నన్న గౌరి శంకరుడు, అనకాపల్లి ఏఎస్సై విక్టోరియా రాణి, చిత్తూరు ఏఎస్సై కేఎన్ కేశవన్, అనంతపురం ఏఆర్ ఎస్సై ఎస్.రామచంద్రయ్య, ఒంగోలు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, విజయవాడ ఎస్ఐబీ హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్, విజయనగరం ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణరాజు, కర్నూలు పోలీస్ కానిస్టేబుల్ రామన్న, విశాఖ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ సూర్యనారాయణ, విశాఖపట్నం ఏసీబీ ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ ఎంవీ సత్యనారాయణరాజులు ఉన్నారు. మరోవైపు.. తెలంగాణా అడిషనల్ డీజీపీ (పర్సనల్) బి.శివధర్‌రెడ్డికి కూడా రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పతకం లభించింది. 12 మంది పోలీసు అధికారులకు ప్రతిభావంతమైన సేవా మెడల్స్ లభించాయి. ఏపీకి జీవన్ రక్షా పాదక్ అవార్డులు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ఆమోదం మేరకు ఇచ్చే జీవన్ రక్షా పాదక్ సిరీస్ అవార్డులనూ కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సర్వోత్తమ్ జీవన్ రక్షాపాదక్, ఉత్తమ్ జీవన్ రక్షాపాదక్, జీవన్రక్షా పాదక్ విభాగాల్లో అవార్డులు ప్రకటించింది. ఉత్తమ్ జీవన్ రక్షా పాదక్ విభాగంలో ఏపీ నుంచి మీసాల ఆనంద్‌కు, జీవన్ రక్షా పాదక్ విభాగంలోనూ ఏపీ నుంచి రాజేష్, ముఖేష్కుమార్లకు అవార్డు దక్కింది. అలాగే, అగ్నిమాపక విభాగంలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ చింతాడ కృపావరం, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బి.వీరభద్రరావులకు ఫైర్ సర్వీస్ మెడల్స్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకం లభించింది. డీజీపీ అభినందనలు విధి నిర్వహణలో గొప్ప సేవలు అందించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రానికి చెందిన పలువురు పోలీసులకు కేంద్ర పతకాలు రావడంపట్ల ఆయన వారిని అభినందించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్లకు శనివారం ఆయన ఫ్యాక్స్ మెస్సేజ్ ఇచ్చారు. వీరు సాధించిన పతకాలు రాష్ట్రానికి, పోలీసు శాఖకు గర్వకారణమన్నారు. రాజేంద్రనాథ్ విశిష్ట సేవలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి తన 25 సంవత్సరాల సర్వీసులో అనేక సంచలనాత్మక కేసులను సమర్ధవంతంగా డీల్ చేశారు. ప్రధానంగా విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో చిన్నారి వైష్టవి దారుణ హత్యలో నిందితులను మూడ్రోజుల్లోనే పట్టుకున్నారు. అలాగే.. - విజయవాడ వన్‌టౌన్‌లో ఎప్పుడూ లేని విధంగా అప్పట్లో మతకలహాలు చోటు చేసుకోవడంతో అందులోని నిందితులను వెంటనే పట్టుకున్నారు. సంఘ విద్రోహులకు నగర బహిష్కరణ విధించారు. - తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖుల విగ్రహాల ధ్వంసం కేసు.. నెల్లూరు జిల్లాలోని కేథలిక్ సిరియన్ బ్యాంకు దోపిడీ కేసు, డెకాయిట్ల ఆగడాలను నిలువరించడంలో విశేష ప్రతిభ కనబరిచారు. - ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా వ్యవహరిస్తూ కీలకమైన కేసుల విచారణలో ముఖ్య భూమిక వహిస్తున్నారు. రాజధాని నిర్మాణం, ఇతర అక్రమాలకు సంబంధించిన కేసుల విచారణ ఇందులో ముఖ్యమైనవి. -
'నువ్వు అరిస్తే ఏమీ కాదు.. '
హైదరాబాద్: ఆంధ్రపద్రేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పట్ల డీఎస్పీ అగౌరవంగా మాట్లాడారని డోన్ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో ఉన్న భూమా నాగిరెడ్డిని 'నువ్వు అరిస్తే ఏమీ కాదు' అంటూ డీఎస్పీ ఏకవచనంతో మాట్లాడారని, ఎమ్మెల్యేలతో మాట్లాడేతీరు ఇదేనా అని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. భూమా నాగిరెడ్డితో అగౌరవంగా మాట్లాడిన విషయం వీడియో రికార్డులో స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. భూమా కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియతో పోలీసులు దురుసుగా వ్యవహరించారని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మహిళా ఎమ్మెల్యేతో ఇలా ప్రవర్తించడం సరికాదని రాజేంద్రనాథ్ రెడ్డి ఖండించారు. ఈ విషయంపై పోలీసులను గట్టిగా ప్రశ్నించినందుకే భూమా నాగిరెడ్డిపై పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని అన్నారు. శాసనసభ్యులకే రక్షణ లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటని రాజేంద్రనాథ్ రెడ్డిఆవేదన వ్యక్తం చేశారు. -
టీడీపీ హైడ్రామా
డోన్‌టౌన్/డోన్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. అధికారం చేపట్టడమే తరువాయి.. అసలు రంగు బయటపెడుతున్నారు. నిన్న మొన్నటి వరకు అధికారంలో లేకపోవడంతో మౌనందాల్చిన ‘పచ్చ’దండు ఎన్నికలు ముగియగానే ఇతర పార్టీలపై తమ ప్రతాపం చూపుతోంది. తమకు అనుకూలంగా ఓటు వేయలేదని.. మరో పార్టీకి సహకరించారనే కారణాలతో బౌతిక దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా టీడీపీ శ్రేణులు చెలరేగిపోతున్నారు. తాజాగా ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఎంపీటీసీ అభ్యర్థులతో బేరాలకు దిగుతున్నారు. దారికి రాకపోతే కిడ్నాప్ చేసేందుకూ వెనుకాడటం లేదు. మంగళవారం ప్యాపిలి మండలంలో ఓ మహిళా ఎంపీటీసీని ఈ కోవలోనే కిడ్నాప్‌నకు యత్నించడం కలకలం రేపింది. డోన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభ్యునిగా ఎంపికయ్యారు. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కైనా ఆయన గెలుపును నిలువరించలేకపోయాయి. ప్రాదేశిక పోరులోనూ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పైచేయి సాధించింది. ప్యాపిలి మండలంలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వైఎస్ఆర్సీపీ అత్యధికంగా 12 స్థానాల్లో గెలుపొందగా.. టీడీపీ 9 స్థానాలను దక్కించుకుంది. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో స్థానిక నాయకులు ప్యాపిలి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్యాపిలి ఎంపీటీసీ-2 స్థానంలో గెలుపొందిన అలివేలమ్మను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించారు. ససేమిరా అనడంతో భయభ్రాంతులకు గురి చేశారు. విషయం తెలుసుకున్న మండల జెడ్పీటీసీ సభ్యుడు దిలీప్ చక్రవర్తి, అంకిరెడ్డి, బోరెడ్డి శ్రీరామిరెడ్డి తదితరులు ఆమెకు రక్షణ కల్పించారు. అయినప్పటికీ ఓ పోలీసు అధికారి ప్రమేయంతో మంగళవారం అలివేలమ్మను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. రక్షణ పేరిట ఆమెతో పాటు కుటుంబ సభ్యులను సదరు పోలీసు అధికారి పత్తికొండ నియోజకవర్గానికి తన వాహనంలో తరలించారు. ఈ విషయమై వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆమెను ఇంటికి చేర్చారు. ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ శ్రేణులు ఇలాంటి చర్యలకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. -
ఎన్నికలు వద్దు.. పెట్టాల్సిందే !
సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య వాగ్యుద్ధం సచివాలయ హౌసింగ్ సొసైటీ భేటీలో ఉద్రిక్తత సాక్షి, హైదరాబాద్: సచివాలయ హౌసింగ్ సొసైటీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. మంగళవారం సచివాలయంలోని డి-బ్లాక్‌లో.. సొసైటీ పాలక మండలికి ఎన్నికల నిర్వహణ కోసం తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయడానికి సహకార శాఖ అధికారి రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన సొసైటీ సమావేశం జరిగింది. ఎన్నికలు నిర్వహించడానికి తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయాలంటే మొత్తం సభ్యుల్లో మూడో వంతు (1,200 మంది) హాజరు కావాలని, కానీ 200 మంది సభ్యులే హాజరైనందున సమావేశాన్ని వాయిదా వేయాలని నరేంద్రరావు నేతృత్వంలోని తెలంగాణ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇందుకు సొసైటీ ప్రస్తుత అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, మురళీమోహన్ తదితర సీమాంధ్ర ఉద్యోగులు అభ్యంతరం తెలిపారు. 150 మంది సభ్యులు హాజరైతే తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయడానికి చట్టం అవకాశం కల్పిస్తోందని, ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశం వాయిదా వేస్తే.. తదుపరి భేటీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించాలని కోరారు. సొసైటీలో ఎక్కువ మంది సభ్యులు సీమాంధ్ర వారే ఉన్నారని, విభజన జరిగే సమయంలో ఎన్నికలు జరిగితే వారికే అధికారం దక్కుతుందని, తర్వాత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని తెలంగాణ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నికలు వాయిదా వేయాలని పట్టుబట్టారు. ఎన్నికలు జరగకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, బ్యాంకుల నుంచి రుణాలు కూడా అందడం లేదని, ఎన్నికలు జరపాల్సిందేనని సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేయడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో కొట్టుకునే వరకు వెళ్లింది. సీమాంధ్ర ఉద్యోగులు తమను దుర్భాషలాడారని, కొట్టేందుకు ప్రయత్నించారని, తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగులు డి-బ్లాక్ ముందు కాసేపు ధర్నా చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సీఎస్ చాంబర్ వద్దకు వెళ్లిన తెలంగాణ ఉద్యోగులు.. సీమాంధ్ర ఉద్యోగులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. యూనియన్ల గుర్తింపు రద్దు చేయడానికి వెనుకాడం: సీఎస్ తన చాంబర్ వద్ద ఉద్యోగులు గందరగోళ పరిస్థితులు సృష్టించడం పట్ల సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు ప్రాంతాల ఉద్యోగులు తన చాంబర్ వద్ద నుంచి వెళ్లిపోవాలని గట్టిగా చెప్పారు. ఉద్యోగుల మధ్య విభేదాలు మితిమీరుతున్నాయని, ఇక మీదట సి-బ్లాక్ వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని, యూనియన్ల గుర్తింపు రద్దు చేయడానికీ వెనకాడమంటూ ఉద్యోగ సంఘాలకు సీఎస్ నోటీసు జారీ చేశారు. -
చైన్ స్నాచింగ్‌లపై ప్రత్యేక నిఘా
రామచంద్రాపురం, న్యూస్‌లైన్ : ఆర్సీ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరుగుతున్న చైన్ స్నాచింగ్‌ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఐజీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం రామచంద్రాపురం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించా రు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. పాత కేసు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న నేరాలు, కేసులు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామచంద్రాపురం పట్టణ పరిధిలో జరుగుతున్న చైన్ స్నాచింగ్‌ల విషయం తన దృష్టి లో ఉందని, అందుకు సంబంధించిన విషయంపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో నిఘాను పటిష్టం చేస్తున్నామన్నారు. రామచంద్రాపురం పటాన్చెరు పరిధిలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు పరిశీలనలో ఉందని తెలిపారు. మహబూబ్‌నగ ర్, ప్రకాశం జిల్లాల సరిహద్దులోని నల్లమల అ డవిలో ఓ దళం సంచరిస్తున్నట్లు అనుమానం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కవిత, సీఐలు శ్రీనివాస్, శంకర్‌రెడ్డి, భీంరెడ్డి,గంగాధర్, ఎస్ఐలు రవీందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, వెంకట్, లోకేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పటాన్చెరు పీఎస్ తనిఖీ చేసిన ఐజీ పటాన్చెరు టౌన్ : శాంతి భద్రతల పరిరక్షణలో భా గంగా గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు హైదరాబాద్ రేంజ్ ఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపా రు. పోలీస్ స్టేషన్ల సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆయన పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌ను సం దర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలీస్‌స్టేషన్ పని తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. క్రైం రేటు అదుపులో ఉందన్నారు. దోపిడీ దొంగతనాలు, చైన్‌స్నాచింగ్, మర్డర్ కేసులు ఛేదించడంలో పోలీసు లు మంచి పనితీరును చూపుతున్నారని కొనియాడారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి గ్రామానికి ఓ పోలీస్ నేతృత్వంలో రక్షణ కల్పిస్తామన్నారు. అతని ద్వారా ఎప్పటికప్పుడు పోలీస్‌స్టేషన్ అధికారికి సమాచారం అందుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ విజయ్‌కుమార్, డీఎస్పీ కవిత, సీఐలు శంకర్‌రెడ్డి, మహబూబ్‌ఖాన్‌లు ఉన్నారు.