అమరావతి: దేశంలోనే వృత్తి నైపుణ్యంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఏపీ పోలీస్ అధికారులను డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అభినందించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఐదు రోజుల పాటు జరిగిన 66వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్-2022లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వృతి నైపుణ్యంలో ఆరు పతకాల( 2 బంగారు పతకాలు, 3 రజత పతకాలు, 1 కాంస్యం పతకం)తో దేశంలో అత్యధిక మెడల్స్ గెలుచుకున్న మూడో రాష్ట్రంగా నిలిచింది. ఈ మేరకు అత్యధిక స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణం, కాంస్యం, రజిత పతకాలు సాధించిన ఎపి పోలీస్ అధికారుల బృంధాన్ని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు.
కాగా, ఫిబ్రవరి 13వ తేదీ నుండి 17 తేదీ వరకూ భోపాల్‌లో జరిగిన 66వ అఖిల భారత పోలీస్ డ్యూటి మీట్-2022 లో వృతి నైపుణ్యమునకు సంబందించిన 11 విభాగాల్లో దేశంలోని 24 రాష్ట్రాలతో పాటు సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్‌కు చెందిన మొత్తం 28 టీమ్‌లతో సుమారు 2000 మందికి పైగా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
గతంలో ఎన్నడు లేని విధంగా పతకాలు సాదించిన ఏపీ పోలీస్ అధికారులకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి నగదు బహుమతిని అందించారు. స్వర్ణం పతక విజేతలకు 10 వేలు రూపాయలు, రజత పతక విజేతలకు 8 వేల రూపాయలు, కాంస్యం పతక విజేతలకు ఐదు వేల రూపాయల నగదు బహుమతితో అభినందించి ప్రోత్సాహం అందించారు.
అంతే కాకుండా పోలీస్ శాఖలో వృతి నైపుణ్యంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకి , పతకాలు సాదించిన విజేతలకి పోలీస్ శాఖ నుండి ప్రత్యేకంగా స్వర్ణ పతాకం సాదించిన విజేతకు మూడు లక్షల నగదు(మూడు ఇంక్రిమెంట్లు) కాంస్యం పతక విజేతలకు రెండు లక్షల నగదు(రెండు ఇంక్రిమెంట్లు), రజత పతక విజేతలకు లక్ష నగదు (ఒక ఇంక్రిమెంట్)బహుమతితో అభినందించి ప్రోత్సాహం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment