
సాక్షి, అమరావతి: అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రైల్వే అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మరోవైపు ప్రధాన రైల్వేస్టేషన్ల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు.
గుంటూరులో 200 మంది ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు, విశాఖలో ఆందోళనకారులు నిరసనలకు ప్లాన్ చేశారనే విషయాన్ని నిఘా వర్గాలు ముందే గ్రహించాయి. దీంతో ఎక్కడికక్కడ ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఆర్మీ ఇనిస్టిట్యూట్ సెంటర్ల నుంచి పోలీసులు అభ్యర్థుల వివరాలను తీసుకుంటున్నారు.
చదవండి: (ఏపీ పోలీసుల అదుపులో సాయి ఢిపెన్స్ అకాడమీ డైరెక్టర్)
Comments
Please login to add a commentAdd a comment