Agnipath Scheme
-
నైపుణ్యమే ‘అగ్ని’కి ఆజ్యం!
అగ్నిపథ్ విషయంలో మొదటి నుంచీ సమస్య ఉంది. పైగా అగ్నివీర్లను కేవలం ఆరు నెలల శిక్షణతో సైన్యంలోకి చేర్చుకున్నారు. నిజానికి గ్రామీణ నేపథ్యం, విద్యా స్థాĶæయులు, చేర్చుకున్న వయస్సు దృష్ట్యా, అగ్నివీరుడు సమర్థమైన నైపుణ్యాలతో బయటకు వచ్చే అవకాశం లేదు. ప్రాణాంతక ఆయుధాల వ్యవస్థలు, సంక్లిష్టమైన యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ ఆపరేషన్ లేదా నిర్వహణను కొత్తగా చేరినవారికి అప్పగించాలంటే వారి అనుభవం చాలదు. అలాగని మొత్తానికే ఈ పథకాన్ని అవతల పడేయవలసిన అవసరం లేదు. ఈ పథకాన్ని రద్దు చేసే బదులు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి లోపాలను అధిగమించ డానికి ప్రభుత్వం ఈ çపథకాన్ని సవరించాలి. అగ్నివీర్ పదవీ కాలాన్ని నాలుగేళ్ల నుండి ఏడేళ్లకు పొడిగించడం మంచి ఆలోచన కావచ్చు.కార్గిల్ జిల్లాలోని హిల్ స్టేషన్ అయిన ద్రాస్‌లో గత శుక్రవారం జరిగిన కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, కాస్త తీవ్రంగానే స్పందించి ఉండవచ్చు. అగ్నిపథ్ అంశాన్ని ప్రతి పక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపణ. సైన్యాన్ని నిత్య యవ్వనంతో ఉంచడం, అలాగే దానిని నిరంతరం యుద్ధానికి సన్నద్ధం చేయటం ఈ పథకం లక్ష్యం. ‘‘దురదృష్టవశాత్తు కొంత మంది వ్యక్తులు జాతీయ భద్రతకు సంబంధించిన ఈ సున్నితమైన విషయాన్ని రాజకీయ అంశంగా మార్చారు’’ అని ఆయన అన్నారు.మోదీ మరింత శక్తిమంతంగా చెప్పడానికి మరిన్ని పదాలు వాడి ఉండవచ్చు కానీ ఈ సందర్భం వాటికి తగినదా అనేది ఒక ప్రశ్న. నిజానికి ఒక ఆదర్శవంతమైన, హూందా అయిన సంప్రదాయానికి నాంది పలుకుతూ ప్రతిపక్షం, ప్రధానమంత్రి ఈ వేదికను ఉమ్మడిగా పంచుకుని ఉండవలసింది. కానీ బహుశా అది మరీ ఎక్కువగా ఆశించటమే అవుతుంది. గడచిన 10 ఏళ్లలో సైన్యాన్ని సంస్కరించడం కోసం చాలా ఎక్కువగానే కృషి జరిగిందనటంలో సందేహం లేదు. ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ నియామకం, ‘డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్’ ఏర్పాటు, ‘డిఫెన్స్ అక్విజిషన్ పాలసీ’ సంస్కరణ, రక్షణ పరిశ్రమ నిర్బంధ స్వదేశీకరణ, అలాగే రక్షణ పరిశ్రమలో ప్రైవేట్ రంగానికి తలుపులు తెరవడం, ఆ రంగానికి డిఫెన్స్ ‘ఆర్ అండ్ డి’ నిధుల నుండి 25 శాతం అందించడం... వీటిలో కొన్ని. కానీ అగ్నిపథ్ దానికై అదిగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ఈ పథకం కింద, ఒక అగ్నివీర్ సైనికుడిని 17–21 సంవత్సరాల వయస్సులో నియమిస్తారు. అతను/ఆమె నాలుగు సంవత్సరాలు సైన్యానికి సేవలందిస్తారు. ఆ తర్వాత సైన్యం నుంచి వేరుపడి తగిన ప్యాకేజీతో నిష్క్రమిస్తారు. ఇలా రిటైరైన వారిలో 25 శాతం మందికి మరో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పాటు తిరిగి సైన్యంలో చేరే అవకాశం ఉంటుంది. బహుశా వీరు పెన్షన్ కు అర్హులు అవుతారు. ఇక అగ్నివీర్లలో ఎక్కువ మంది విషయానికొస్తే, వారిలో 75 శాతం మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో చేరే అవకాశం కలిగి ఉంటారు. అక్కడ వారు ప్రాధాన్యతా ప్రాతిపదికన రిక్రూట్మెంట్కు అర్హులు అవుతారు. 2023 చివరలో, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణే తన అముద్రిత జ్ఞాపకాల రచనలో ఈ పథకం నౌకాదళానికి, వాయుసేనకు పిడుగుపాటు వంటిది అని వ్యాఖ్యానించారు. ఆ రెండింటికీ కాకుండా దీనిని తాను కేవలం సైన్యం (ఇండియన్ ఆర్మీ) కోసం మాత్రమే, అది కూడా 75 శాతం సిబ్బందిని ఉంచుకొని 25 శాతం సిబ్బందిని వదిలించుకోవాలనీ ప్రతిపాదించానని వ్యాఖ్యానించారు. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ దీనిని కాస్తా మార్చేసి, 75 శాతం అగ్నివీర్లను పంపించి, 25 శాతం మందిని మాత్రమే ఉంచుకోవటం జరుగుతోందని అనడంతో వివాదం తలెత్తింది. అగ్నిపథ్ విషయంలో మొదటి నుంచీ సమస్య ఉంది. సైన్యం కోసం ఒక అగ్నివీర్ ఏమి చేయగలడు లేదా ఏమి చేయాలి?అన్నదే ఆ ప్రశ్న. ఆర్మీ సగటు వయస్సును అగ్నిపథ్ తగ్గించేస్తుంది అనేది ప్రాథమిక వాదన. ఒక ప్రభుత్వ అఫిడవిట్... ప్రపంచవ్యాప్తంగా కనిష్ఠస్థాయి ర్యాంక్ సిబ్బంది సగటు వయస్సు 26 సంవత్సరాలు కాగా, ఇండియాలోనే ఆ సగటు వయస్సు 32 ఏళ్లు అని పేర్కొంది. కానీ మన సైన్యంలో నియామక వయస్సు దశాబ్దాలుగా 16.5–21 ఏళ్ల వయస్సులోనే ఉంటోంది. ఇప్పుడు అగ్నిపథ్‌లో భాగంగా 75 శాతం అగ్నివీర్లను బయటికి పంపించటం ద్వారా, ప్రతి వలయంలో కొత్త సిబ్బందిని చేర్చడం ద్వారా, ఈ పథకం సైనిక వయస్సును తగ్గించాలని ఆశిస్తోంది. అయితే దాని వల్ల ప్రతిఫలంగా ఏం పొందుతుంది?భారతీయ నియామకాలలో గ్రహించవలసిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి. యువకులు లేదా యువతులు మొదట సైనికులుగా నియ మితులు అయినప్పుడు వారు తరచుగా తక్కువ బరువుతో, పోషకాహార లోపంతో ఉండి, విభిన్న నేపథ్యాల నుండి వచ్చినవారై ఉన్నారు. తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణ కేవలం శరీరాకృతి, క్రమశిక్షణ పరంగా వారిని ఒక కొలిక్కి తెస్తుంది. ఆ తర్వాత ట్యాంకులు, ఫిరంగిదళాలు, వాయు రక్షణ వ్యవస్థల నిర్వాహకులుగా మరింత సాంకేతిక ఉద్యోగాలు చేయగలిగిన పదాతిదళానికి తగిన ట్లుగా వీరికి వృత్తిపరమైన శిక్షణ అవసరం. ఇది కేవలం నైపుణ్యం కోసం. ఇది కాక మరొక సంవత్సరం వరకు ఎక్కడైనా వీరికి శిక్షణ అవసరం కావచ్చు.ఇప్పుడు, అగ్నివీర్లను కేవలం ఆరు నెలల శిక్షణతో సైన్యంలోకి చేర్చుకున్నారు. గ్రామీణ నేపథ్యం, విద్యా స్థాĶæయులు, చేర్చుకున్న వయస్సు దృష్ట్యా, అగ్నివీరుడు సమర్థమైన నైపుణ్యాలతో బయ టకు వచ్చే అవకాశం లేదు. మెరుగైన దేశాల్లో, ఒక రిక్రూట్ అయిన సైనికుడు ముందే డ్రైవింగ్ వంటి నైపుణ్యంతో వస్తాడు, కానీ భారత దేశంలో దానికి మాత్రమే మూడు నెలలు పట్టవచ్చు.కాగా, మాజీ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్ ఒక సందర్భంలో మాట్లా డుతూ... పదాతి దళ సిబ్బందికి, సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా అవసరం లేని సైన్యానికి అగ్నిపథ్ ఉపయోగపడుతుందనీ, అయితే వైమానిక దళానికి, నౌకాదళానికి ఇది పెద్ద సమస్యగా మారుతుందనీ పేర్కొన్నారు. ‘‘ప్రాణాంతక ఆయుధాల వ్యవస్థలు, సంక్లిష్టమైన యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ ఆపరేషన్ లేదా నిర్వహణను అప్పగించ డానికి ముందు తగినంత అనుభవాన్ని పొందడానికి కనీసం అయి దారేళ్ల సమయం అవసరం అవుతుంది’’ అంటారాయన. అగ్నిపథ్ పథకంలో యువతీయువకుల ప్రొఫైల్ మిలటరీ అవసరాలకు కాకుండా మరి దేనికోసమో ఉద్దేశించినట్లు అనిపిస్తోందన్న ఆరోపణలు ఉండగా ప్రభుత్వం వాటిని ఖండించింది. వాస్తవానికి ప్రభుత్వం పునరాలోచన తర్వాతనైనా ఈ పథకం దేశానికి ఆర్థిక పరిపుష్టిని చేకూర్చే అంశాలతో ప్రేరేపితమైందనే వాస్తవాన్ని ముందుగా తెలియజేయాల్సింది. అయితే ఈ పరిపుష్టి ఒక దశాబ్దం తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది. తాజా బడ్జెట్ ప్రకారం రూ. 1.41 లక్షల కోట్లు లేదా రక్షణ బడ్జెట్లో 22.7 శాతాన్ని వినియో గిస్తున్న పెన్షన్ బిల్లు సైన్యానికి గుదిబండ అయింది. యువశక్తి కోసం గతంలో వచ్చిన పిలుపుల దృష్ట్యా, మనం మొత్తానికే ఈ పథకాన్ని అవతల పడేయవలసిన అవసరం లేదు. ఈ పథకాన్ని రద్దు చేసే బదులు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి లోపాలను అధిగమించడానికి ప్రభుత్వం ఈ çపథకాన్ని సవరించాలి. అగ్నివీర్ పదవీ కాలాన్ని నాలుగు సంవత్సరాల నుండి ఏడేళ్లకు పొడిగించడం మంచి ఆలోచన కావచ్చు, ఇది కొంతకాలంగా ఉన్న ఆలోచన. ఇది శిక్షణ కోసం తగినంత సమయాన్ని నిర్ధారిస్తుంది. అలాగే సేవకు సమర్థవంతమైన సహకారాన్ని అందిస్తుంది. అగ్నివీర్లు సైన్యం నుంచి బయటికి వచ్చినప్పుడు వారి వయస్సు 24–28 సంవత్సరాల మధ్య ఉంటుంది, ఇది వారికి కొంత ఆలస్యంగా తెరచుకునే అనేక అవకాశాలకు అనువుగా ఉంటుంది.1999లో కార్గిల్ యుద్ధంలో మరణించిన 550 మంది సైనికులు అగ్నివీరులు కాదని, శిక్షణ పొందిన, దృఢమైన, అంకితభావం కలిగిన సైనికులు అనే విషయం గుర్తుంచుకోండి. ఆ రకమైన సామర్థ్య పరీక్ష ఇప్పటికీ అగ్నివీర్ పథకం కోసం వేచి ఉంది.మనోజ్ జోషీ వ్యాసకర్త న్యూఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్లోడిస్టింగ్విష్డ్ ఫెలో ‘ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అగ్నిపథ్‌పై విపక్షాల విమర్శలు.. ప్రధాని మోదీ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సైనికుల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్ సెక్టార్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. విపక్షాలపై ధ్వజమెత్తారు.భారతదేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. భారత సైన్యం ప్రారంభించిన కీలకమైన సంస్కరణలకు అగ్నిపథ్ పథకం ఒక ఉదాహరణ అని చెప్పారు. ప్రపంచ దేశాల సైనికుల సగటు వయసు కంటే భారత సైనికుడి సగటు వయసు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. దీనిపై అనేక కమిటీలు చర్చించాయే కానీ, ఏ ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోలేదు. అగ్నిపథ్ స్కీం ద్వారా మేం ఈ సమస్యకు పరిష్కారం తీసుకువచ్చాం. ఈ పథకం ద్వారా భారత సైన్యంలో యువరక్తం పొంగిపొర్లుతుంది... అన్నివేళలా యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది.భారత బలగాలకు సంబంధించిన పెన్షన్ సొమ్మును పొదుపు చేయడానికే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు విధుల్లో చేరిన ఉద్యోగులకు 30 ఏళ్ల తర్వాత పింఛన్ అనే ప్రశ్న తలెత్తుతుంది. కానీ మేమే ఈ అంశంపై ఎందుకు నిర్ణయం తీసుకున్నాం, అది తర్వాత వచ్చే ప్రభుత్వాలకే వదిలేయాలని ఆలోచించలేదు. ఎందుకంటే ఎందుకంటే రక్షణ దళాలు అంటే మాకు గౌరవం ఉంది, వారి నిర్ణయం పట్ల మాకు గౌరవం ఉంది. మేం 'రాజనీతి' కోసం కాకుండా 'రాష్ట్రనీతి' కోసం పని చేస్తున్నాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
ఒకే యూనిఫామ్, విధులతో.. లక్ష మంది అగ్నివీరులు చేరిక
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ప్రథకం కింద ఇప్పటివరకు లక్షమంది అగ్నివీరులు శిక్షణపొంది వివిధ విభాగాల్లో చేరినట్లు ఆర్మీ పేర్కొంది. సుమారు 70 శాతం మంది అగ్నివీరులు వివిధ ఆర్మీ యూనిట్ల పనిచేస్తున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ (ఆర్మీ అడ్జటెంట్ జనరల్) సీబీ పొన్నప్ప ఆదివారం తెలిపారు.‘2022 జూన్‌లో అగ్నిపథ్ పథకం అమలులోకి వచ్చింది. జనవరి, 2022 నుంచి 2023 మధ్య మొదటి బ్యాచ్ నియామకం పూర్తి అయింది. ఈ పథకం ద్వారా లక్ష మంది అగ్నివీరులో అర్మీలో జాయిన్ అయ్యారు. ఇందులో 200 మంది మహిళలు ఉన్నారు. ఇక.. రిక్రూట్ అయిన 70 వేల మంది అగ్నివీరులు వివిధ విభాగాలు, బెటాలియన్లలో చేరారు. ఇందులో కూడా 100 మంది మహిళలు ఉన్నారు’అని తెలిపారు.దీంతోపాటు మరో 50 వేల అగ్నివీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని 2024-25 ఏడాదికి గాను నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద రెండు రకాల సైనికులను ఆర్మీ తయారు చేస్తోందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.‘ఇతర సైనికుల మాదిరిగానే అగ్నివీరు అన్ని రకాల విధులను నిర్వర్తించాలి. నిబంధనల్లో కూడా పేర్కొన్నాం. ఆపరేషనల్, వృత్తిపరమైన విధులను అగ్నివీరులు నిర్వహించాలి. వీరంతా ఆయా యూనిట్లలో చేరి విధులు చేపడతారు. ఒకే విధమైన యూనిఫామ్, ఒకే విధమైన విధులు నిర్వహిస్తారు’అని లెఫ్టినెంట్ జనరల్ సీబీ పొన్నప్ప తెలిపారు.కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో సెలెక్ట్ అయినవారు నాలుగు సంవత్సరాల పాటు సాయుధ బలగాల్లో పనిచేస్తారు. వారిని అగ్నివీర్లు అంటారు. 17.5 ఏళ్ల నుంచి 21 సంవత్సరాల వయస్సు అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నాలుగు ఏళ్ల తర్వాత కేవలం 25 శాతం మందిని మాత్రమే కొనసాగిస్తారు. మిగతావారంతా రిటైర్ అవుతారు. ఈ పథకం విధివిధానాలు నియామక ప్రక్రియ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు సైతం ఈ పథకాన్ని రద్దు చేయాని డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్ట్‌లో సైతం ఈ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. -
ఎన్డీయే సర్కార్‌కు ‘అగ్ని’పరీక్ష తప్పదా?
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఇంకా కొలువు దీరలేదు. ఈలోపే మిత్రపక్షాల నుంచి డిమాండ్లు మొదలవుతున్నాయి. అయితే అవి కేబినెట్ కూర్పు విషయంలోనే కాదులేండి.దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న అగ్నివీర్ పథకాన్ని సమీక్షించాల్సిందేనని ఎన్డీయే మిత్రపక్షం జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) ఇప్పుడు కోరుతోంది. ఆ పార్టీ నేత కేసీ త్యాగి మీడియాతో మాట్లాడుతూ ఈ స్వరం వినిపించారు. ’’అగ్నిపథ్ పథకం మీద దేశవ్యాప్తంగా ఎంతో వ్యతిరేకత ఉంది. ఆ పథకం తెచ్చినప్పుడు సైన్యం వర్గాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. .. వాళ్ల కుటుంబాలు కూడా రోడ్డెక్కి పోరాటం చేశాయి. ఎన్నికల్లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది కూడా. కాబట్టి, దానిని కచ్చితంగా సమీక్షించాల్సిందే. ఈ పధకంపై ప్రజలు లేవనెత్తిన లోటుపాట్లను వివరంగా చర్చించి వాటిని చక్కదిద్దాలని మా పార్టీ కోరుకుంటోందని చెప్పారు.‘‘ అని కేసీ త్యాగి అన్నారు.ఇక.. ఉమ్మడి పౌరస్మృతిపై పార్టీ అధ్యక్షుడి హోదాలో బిహార్ సీఎం నితీష్ కుమార్ లా కమిషన్ చీఫ్‌కు లేఖ రాసిన సందర్భాన్ని కూడా త్యాగి గుర్తుచేశారు. తాము ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకం కాదని, అయితే యూసీసీపై ప్రభావితమయ్యే అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఓ పరిష్కారం అన్వేషించాలని త్యాగి పేర్కొన్నారు.రెండేళ్ల కిందట.. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం గత ఎన్డీయే హయాంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ‘అగ్నిపథ్’. అయితే నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసు అంశంపై ఆ సమయంలోనే తీవ్ర దుమారం రేగింది. దేశవ్యాప్తంగా నిరసనజ్వాలలు పెల్లుబిక్కాయి. మరోవైపు ప్రతిఏపక్షాలు సైతం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినప్పటికీ.. అగ్నివీర్ పథకం ద్వారా అగ్నీవీర్‌లను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా.. ఇండియా కూటమిలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాల్సిందేననే గళం బలంగా వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఆ తప్పిదాన్ని ఒప్పుకుని.. వెంటనే దానిని రద్దు చేయాలని కోరుతున్నారాయన. కిందటి నెలలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అగ్నిపథ్ పథకానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వెలిబుచ్చారు. అయితే ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఏడాది మార్చిలో ఒక ప్రకటన చేశారు. దీనిపై కాంగ్రెస్ ఇది ఎన్నికల జిమ్మిక్కు అంటూ మండిపడింది. -
Rahul Gandhi: ‘అగ్నిపథ్’లో వివక్షను అడ్డుకోండి
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకం అమలులో జోక్యం చేసుకుని అమర జవాన్ల కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమే అయినప్పటికీ జాతి భద్రతపై ప్రభావం కలిగించే ఈ అంశంపై సాయుధ బలగాల సుప్రీం కమాండర్‌గా ప్రత్యేక పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు శనివారం రాహుల్ ఒక లేఖ రాశారు. దేశం కోసం జీవితాలనే త్యాగం చేస్తున్న అగ్నివీర్లకు మిగతా సైనికుల మాదిరిగానే ప్రయోజనాలను వర్తింపజేయాలని కోరారు. -
‘అగ్నిపథ్’ స్కీమ్‌పై వ్యాఖ్యలు... క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
న్యూఢిల్లీ:అగ్నిపథ్ స్కీమ్‌పై దేశ ప్రజలకు తామిచ్చిన హామీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)పరిధిలోకే వస్తుందని ఎన్నికల కమిషన్(ఈసీ)కి కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ మేరకు పార్టీ ఈసీకి ఒక లేఖ రాసింది. సాయుధ దళాలను రాజకీయం చేయవద్దని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఈసీ సూచించిన నేపథ్యంలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.అగ్నిపథ్ స్కీమ్ విషయమై శుక్రవారం(మే24) ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎక్స్ సర్వీస్‌మెన్ విభాగం చీఫ్ కల్నల్ రోహిత్ మీడియా సమావేశంలో స్పందించారు. ‘సాయుధ దళాలు దేశ భద్రత కోసం గొప్పగా పనిచేస్తున్నాయి. మేం కేవలం అగ్నిపథ్ స్కీమ్ గురించే మట్లాడుతున్నాం. ఈ స్కీమ్‌ను తీసుకువచ్చి ఆర్మీని మోదీ ప్రభుత్వం బలహీనపరిచింది. ఈ స్కీమ్ దేశ ప్రజలు, ఆర్మీ జవాన్ల ప్రయోజనాలకు ఎంత మాత్రం మేలు చేయదు. అందుకే రద్దు చేస్తాం’అని తెలిపారు. -
‘అగ్నివీర్’ అమరుడైతే ఆర్థిక సాయం అందదా? ఇండియన్ ఆర్మీ ఏమంటోంది?
ఇండియన్ ఆర్మీలో ‘అగ్నిపథ్’ పథకం ప్రారంభమైనప్పటి నుంచి విమర్శలకు గురవుతూనే ఉంది. కేవలం నాలుగేళ్ల పరిమితితో సైన్యంలో చేరిన అగ్నివీరుడు అమరుడైతే ఆర్థిక సాయం అందిస్తారా? అనే అంశంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఇటీవల ఒక సైనికుడు మరణించిన నేపధ్యంలో అతనిని ‘అమరవీరుడు’గా గుర్తించలేదు. అలాగే ఆర్మీ తరపున తగిన గౌరవం అందించలేదు. దీనిపై విమర్శలు చెలరేగడంతో సైనికాధికారులు సమాధానమిస్తూ ఆ సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అయితే సియాచిన్‌లో విధులు నిర్వహిస్తున్న అగ్నివీర్ అక్షయ్ లక్ష్మణ్ గవాటే వీరమరణం పొందారు. లక్ష్మణ్ ‘అగ్నివీరుడు’ కావడంతో అతని కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయరా? అంటూ ప్రతిపక్షం ఇండియన్ ఆర్మీకి సవాల్ విసిరింది. ఈ ఆరోపణలపై భారత సైన్యం స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఆర్మీ ఒక ప్రకటనలో ‘అగ్నివీర్’ స్కీమ్ కింద రిక్రూట్ అయిన సైనికుడు అమరుడైన సందర్భంలో అందించే ఆర్థిక సహాయంపై సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే వాదనలు జరుగుతున్నాయి. అందుకే దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. అగ్నివీర్ యోజన కింద రిక్రూట్ అయిన సైనికులకు అందించే ప్రయోజనాలివే.. రూ. 48 లక్షల జీవిత బీమా సేవా నిధి సొమ్ము. ఇందులో అగ్నివీర్ జీతం నుంచి 30 శాతం జమ అవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వం దానికి జత చేరుస్తుంది. ఈ డబ్బుపై వడ్డీని కూడా అందిస్తారు. రూ. 44 లక్షల ఆర్థిక సహాయం మిగిలిన సర్వీస్ జీతం.. ఇటువంటి సందర్భంలో రూ. 13 లక్షలకు మించి అందిస్తారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్ నుండి రూ.8 లక్షల సహాయం. ఏడబ్ల్యుడబ్ల్యు నుండి రూ.30 వేలు సత్వర సహాయం అగ్నివీర్ అమరవీరుడైతే సుమారు రూ. ఒక కోటి రూపాయల ఆర్థిక సహాయం అతని కుటుంబానికి అందుతుంది. సేవా నిధి రూపంలో వచ్చిన డబ్బుపై పన్ను ఉండదు. ఒక అగ్నివీర్ జవాన్ విధులలో లేని సమయంలో మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 48 లక్షల బీమా, మరణించిన తేదీ వరకు లెక్కించిన సేవా నిధి సొమ్ము, కార్పస్ ఫండ్ సొమ్ము అందిస్తారు. ఇది కూడా చదవండి: లాక్డౌన్ దిశగా ఢిల్లీ? స్కూళ్ల మూసివేత? వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఆదేశాలు? #Agniveer (Operator) Gawate Akshay Laxman laid down his life in the line of duty in #Siachen. #IndianArmy stands firm with the bereaved family in this hour of grief. In view of conflicting messages on social media regarding financial assistance to the Next of Kin of the… pic.twitter.com/46SVfMbcjl — ADG PI - INDIAN ARMY (@adgpi) October 22, 2023 -
అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పులు.. అగ్నివీర్లకు గుడ్‌న్యూస్!
ఢిల్లీ: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోని త్రివిధ దళాల్లో అగ్నిపథ్ స్కీమ్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఈ పథకం కింద త్రివిధ దళాల్లో ఎంపికైన వారిని అగ్నివీర్లు అని పిలుస్తున్నారు. అయితే, అగ్నిపథ్ పథకంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అగ్నివీర్లకు శుభవార్త అందించింది. వివరాల ప్రకారం.. అగ్నిపథ్ పథకంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. అగ్నివీర్ల కాల పరిమతి, వయస్సును పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఈ పథకం కింద ఎంపిక చేసిన యువతలో 25 శాతం మందినే నాలుగేళ్ల తర్వాత ఆర్మీలో రెగ్యూలర్ క్యాడర్ తీసుకోనున్నారు. అయితే దీనిని 25 నుంచి 50 శాతంకు పెంచాలనే కేంద్రం తీసుకున్నట్టు సమాచారం. అలాగే, సాంకేతిక నేపథ్యం ఉన్న యువకులను చేర్చుకోవడం, గరిష్ట వయోపరిమితిని 21 నుంచి 23 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. జూన్ 2022లో ప్రారంభించబడిన అగ్నిపథ్ స్కీమ్ కింద 17.5-21 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులను అగ్నివీర్ పోస్టుల కోసం పరిశీలిస్తున్నారు. అయితే, సాంకేతిక నేపథ్యం ఉన్న అభ్యర్థుల విషయంలో గరిష్ట రిక్రూట్మెంట్ వయస్సు 21 ఏళ్లలోపు పరిమితిని సడలించే అవకాశాలు ఉన్నాయని బలగాలు అభిప్రాయపడుతున్నాయి. గరిష్ట వయోపరిమితిని సవరించడం.. దానిని 23 సంవత్సరాలకు పెంచడంపై చర్చ జరుగుతోంది. మరోవైపు.. 2026 నాటికి దాదాపు 1.75 లక్షల మంది యువకులు అగ్నిపథ్ పథకం కింద చేరనున్నారనే అంచనాలు ఉన్నాయి. కాగా, ప్రతీ ఏడాది దాదాపు 60వేల మంది సైనికులు పదవీ విరమణ చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే మూడు సర్వీసుల్లో సైనికుల కొరత తీవ్రంగా ఉంది. కేవలం ఇండియన్ ఆర్మీలోనే 1.18 లక్షల మంది కావాల్సి ఉంది. ఇది కూడా చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. రాజ్యసభ బరిలో ఆయనకు సీటు ఫైనల్ -
మాజీ అగ్నివీర్లకు బీఎస్ఎఫ్ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్
న్యూఢిల్లీ: సైనిక దళాల్లో ఎంపికల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అగ్నిపథ్ పథకం పట్ల యువతను ఆకర్షితులను చేసే దిశగా కేంద్రం ఒక ప్రకటన చేసింది. అగ్నివీర్ ద్వారా ఎంపికై నిబంధనల మేరకు నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని రిటైరైన అభ్యర్థులకు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. అంతేకాదు, గరిష్ట వయోపరిమితిలో కూడా సడలింపులు ఉంటాయని తెలిపింది. ఇందుకు వీలు కల్పిస్తూ బీఎస్ఎఫ్ జనరల్ డ్యూటీ కేడర్(నాన్ గెజిటెడ్) రిక్రూట్మెంట్–2015 నిబంధనల్లో మార్పులు చేపట్టినట్లు వెల్లడించింది. ఇవి మార్చి 9వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయని ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి బ్యాచ్ మాజీ అగ్నివీర్లకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుందని కేంద్ర హోం శాఖ అందులో వివరించింది. ఇతర బ్యాచ్‌ల వారికైతే మూడేళ్ల వరకు సడలింపు ఉంటుంది. మాజీ అగ్నివీర్లకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. -
అగ్నిపథ్‌ను సమర్థించిన హైకోర్టు.. పిటిషన్లు కొట్టివేత
ఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అగ్నిపథ్ పథకాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ క్రమంలో అగ్నిపథ్‌ను సవాల్ చేస్తూ వేసిన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా అగ్నిపథ్ స్కీమ్‌ను ఆపేందుకు ఎలాంటి కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పథకం జాతీయ భద్రత ప్రాతిపదిక కేంద్రం తీసుకున్న విధానమని హైకోర్టు పేర్కొంది. అయితే, 2019 అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో వాదనల అనంతరం.. హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు కోర్టు తెలిపింది. -
Indian Army Day: సెల్యూట్..సైనికుడా..!
తమ బతుకునే ఫణంగా పెట్టి తన కోసం, తన కుటుంబం కోసం కాకుండా దేశం కోసం ఉద్యోగం చేస్తుంటారు కొందరు. పుట్టిన ఊరికి దూరంగా, కన్నవారికి, కట్టుకున్న వారికి కనపడకుండా ఎండా, వానను లెక్క చేయకుండా చలికి వణుకుతూ అనుక్షణం ఎదురయ్యే ప్రమాదాలతో సహజీవనం చేస్తూ దేశసేవకు తమ జీవితాలను అంకితం చేస్తుంటారు. వారే మన భారత సైనికులు. త్యాగానికి నిదర్శనంగా నిలుస్తున్న నిజమైన దేశ భక్తులు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఏటా జనవరి 15వ తేదీన ఆర్మీ డే జరుపుకుంటాం. పోరాటాల పురిటిగడ్డగా పేరొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎందరో యువకులు ఆర్మీలో పనిచేస్తున్నారు. అనేక మంది రిటైర్డ్ అయి సమాజ సేవలో ఉన్నారు. నేడు సైనిక దినోత్సవం సందర్భంగా.. వారిపై ప్రత్యేక కథనం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 1300 మంది వరకు త్రివిధ దళాల్లో పనిచేశారు. వీరిలో ఎయిర్‌ఫోర్స్‌లో 50 మంది, నేవీలో 20 మంది వరకు పని చేశారు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారు దాదాపు 400 మంది వరకు జవాన్ స్థాయి నుంచి కల్నల్ హోదా వరకు సైన్యంలో పనిచేస్తున్నారు. సైనిక సంక్షేమ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 1300 మందిలో కొంతమంది యుద్ధంలో వీరమరణం పొందారు. వివిధ కారణాలతో మరో 350 చనిపోయారు. మన జిల్లాకు చెందిన పలువురు సైనికులు 1965లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో, 1977లో జరిగిన బంగ్లాదేశ్ విభజన సమయంలో, 1999 కార్గిల్ యుద్ధంలో, 2021లో చైనా బలగాలను నిలువరించిన ఘటనలో పాల్గొన్నారు. నల్లగొండ, సూర్యాపేట ప్రాంతానికన్నా భువనగిరి ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో సైన్యంలో చేరుతున్నారు. వలిగొండ మండలం ఎదుళ్లగూడెంలో 15 మంది మాజీ సైనికులు ఉన్నారు. ముగ్గురు ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా.. త్రివిధ దళాల్లో పనిచేసిన పలువురు రిటైర్డ్ అయిన తరువాత ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవలందిస్తున్నారు. కోదాడ, హుజూర్నగర్ ఎమ్మెల్యేగా, ప్రస్తుతం నల్లగొండ ఎంపీగా పనిచేస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భారత వాయుసేనలో మిగ్ యుద్ధవిమానం ఫైలెట్‌గా పనిచేశారు. శాలిగౌరారం మండలం ఇటుకులపహాడ్ సర్పంచ్ సైదులు సైన్యంలో పనిచేసినవాడే. హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సుధాకర్ కూడా సైన్యంలో పనిచేశారు. ఇలా చాలా మంది ఉన్నారు. అల్లి గంగరాజు, అల్లి సైదులు, అల్లి వెంకటేశ్వర్లు దేశసేవకు ఆ కుటుంబం అంకితం ఆర్మీలో ఉద్యోగం అంటేనే బయపడే కాలంలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం మారుమూల గ్రామంలో పుట్టిపెరిగి, ఒకే ఇంటి నుంచి ముగ్గురు అన్నదమ్ములు దేశసేవ కోసం సైన్యంలో చేరి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరిలో ఇద్దరు ఉద్యోగ విరమణ పొందగా మరొకరు దేశమాత సేవలోనే ఉన్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకులపçహాడ్ గ్రామానికి చెందిన అల్లి రామచంద్రయ్య– లక్ష్మి దంపతులకు నలుగురు కుమారులు సైదులు, వెంకటేశ్వర్లు, గంగరాజు, సురేష్ ఉన్నారు. పెద్ద కుమారుడు సైదులు 1998లో తొలిప్రయత్నంలోనే ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. అన్నను స్పూర్తిగా తీసుకొని తమ్ముళ్లు వెంకటేశ్వర్లు 2005లో గంగరాజు 2011లో సైన్యంలో చేరారు. నాలుగవవాడైన సురేష్ అన్ని రకాల పరీక్షలు పాసై ఆర్మీలో చేరుదామనుకొనే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఉద్యోగంలో చేరలేకపోయాడు. అతను ఇంటి వద్ద ఉండి వ్యవసాయం చేసుకుంటున్నాడు. 1998లో ఉద్యోగంలో చేరిన సైదులు 2014లో నాయక్ హోదాలో ఉద్యోగ విరమణ పొందాడు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై సేవలందిస్తున్నాడు. వెంకటేశ్వర్లు 2022లో లాన్స్‌నాయక్ హోదాలో రిటైర్ అయ్యాడు. గ్రామంలోనే ఉండి సైన్యంలో చేరాలనుకుంటున్న వారికి శిక్షణ ఇస్తున్నాడు. గంగరాజు ప్రస్తుతం హవాల్దార్ హోదాలో జమూకశ్మీర్‌లో పనిచేస్తున్నాడు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామానికి చెందిన మరో ఐదుగురు యువకులు సైన్యంలో చేరారు. క్రమశిక్షణ అలవడుతుంది ఆర్మీ ఉద్యోగం అంటేనే క్రమశిక్షణ, నీతి నిజాయితీలకు మారుపేరు. సైన్యంలో చేరిన ప్రతి ఒక్కరూ కఠోర శిక్షణతో పాటు శరీరదారుఢ్యం, మానసికస్థైర్యం, ఆత్మరక్షణలో రాటుదేలుతారు. నేడు సైన్యంలో చేరేందుకు యువత ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. ఇది దేశరక్షణకు మంచి పరిణామంగానే భావించవచ్చు. నాడు సైన్యంలో చేరేందుకు ఒక్క ఉద్యోగానికి 10 మంది పోటీపడితే నేడు సైన్యంలో ఒక్క ఉద్యోగానికి వందల సంఖ్యలో పోటీపడుతున్నారు. – అల్లి సైదులు, మాజీ సైనికుడు, ఇటుకులపహాడ్ సర్పంచ్ సైనిక నియామకాల కోసం ప్రభుత్వం ఇటీవల కొత్తగా ‘అగ్నిపథ్’ విధానాన్ని తీసుకొచ్చింది. దీనిలో చేరడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి దాదాపు 7000 మంది యువకులు ముందుకొచ్చారు. వీరికి ఫిజికల్, మెడికల్ టెస్ట్‌లు పూర్తి కాగా త్వరలో రాత పరీక్ష జరుగుతుంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవాపురానికి చెందిన మాజీ సైనికుడు కల్నల్ డాక్టర్ సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘ది షోల్జర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో వివిధ అంశాలలో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. 2020 సంవత్సరం జూన్‌లో చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు ఆదుకుంటున్నామా.. యుక్త వయస్సులో అన్నీ వదులుకొని దేశసేవ కోసం పనిచేసిన సైనికులు రిటైర్డ్ అయిన తరువాత వారికి అందాల్సిన సౌకర్యాలు సక్రమంగా అందడం లేదనే విమర్శలున్నాయి. మాజీ సైనికుల డిమాండ్లు అపరిష్కృతంగా ఉన్నాయి. చాలా మంది తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మాజీ సైనికుల డిమాండ్స్ ఇవీ.. ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 2 శాతం నుంచి 5 శాతానికి పెంచాలి. మాజీ సైనికులకు కేటాయించిన ఉద్యోగాలు ఒకసారి భర్తీ కాకుంటే వాటిని బ్యాక్లాగ్ చేసి మళ్లీ మాజీ సైనికులకే కేటాయించాలి. మాజీ సైనికుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించాలి. ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించాలి. రాయితీ మీద మాజీ సైనికులకు ఇచ్చే సరుకుల కోసం ఉమ్మడి జిల్లాలో క్యాంటీన్ ఏర్పాటు చేయాలి. సరుకుల కోసం హైదరాబాద్‌కు వెళ్లి రావడం ఇబ్బందిగా ఉంది. ఉమ్మడి జిల్లాలో మాజీ సైనికులకు స్మారక చిహ్నం నిర్మించాలి. మాజీ సైనికులకు జీఓ నంబర్ 69 ప్రకారం సత్వరమే అన్ని సౌకర్యాలు కల్పించాలి. దేశసేవకు మించిన తృప్తి మరొకటి లేదు దేశం కోసం పనిచేయడానికి మించిన తృప్తి దేనిలోనూ ఉండదు. ఇటీవల ఆగ్నిపథ్ నియామకాల కోసం సూర్యాపేట జిల్లా నుంచి నేను ఏర్పాటు చేసిన ‘ది షోల్జర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల సహకారంతో 225 మందికి శిక్షణ ఇవ్వగా తుది రాత పరీక్షకు 167 మంది ఎంపికయ్యారు. ఇది ఆనందించదగ్గ విషయం. యువత ఇంకా ముందుకు రావాలి. – రిటైర్డ్ కల్నల్ సుంకర శ్రీనివాసరావు, విజయరాఘవాపురం, మునగాల దేశం రుణం తీర్చుకున్నా సైన్యంలో పనిచేసి దేశం రుణం తీర్చుకున్న తృప్తి మిగిలింది. నేను చదువుకునే రోజుల్లో సికింద్రాబాద్ వెళ్లాను. అక్కడ మిలటరీ వారిని చూసి నేను కూడా సైన్యంలో చేరాలనుకున్నాను. 20 సంవత్సరాల వయస్సులో 1962లో సైన్యంలో చేరాను. 1965లో పాకిస్తాన్ యుద్ధంలో, 1971లో బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్నా. 1977లో రిటైర్డ్ అయ్యాను. తరువాత ఫైర్ ఆఫీసర్‌గా పనిచేశాను. రెండు యుద్ధాల్లో పాల్గొని దేశం కోసం పనిచేసిన తృప్తి ఎప్పటికీ ఉంటుంది. యువత కూడా దేశం కోసం పనిచేయడానికి ముందుకు రావాలి. – సంధి పాపిరెడ్డి, అయిటిపాముల, కట్టంగూర్ మండలం (చదవండి: టోల్ ప్లాజాకు ‘పండుగ’) -
Roundup 2022: మెరుపులు..మరకలు
ప్రగతి పథంలో సాగుతున్న ‘స్వతంత్ర’ కవాతుకు అమృతోత్సవ సంబరాలు... ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టిన ప్రజాస్వామ్య సొగసులు... ‘ఆత్మ నిర్భర్’ లక్ష్యంతో రక్షణ రంగంలో అగ్ని, ప్రచండ, విక్రాంత్ మెరుపులు... అంతరిక్ష రంగంలో ఇతర దేశాలతో పోటీ పడేలా తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ చిమ్మిన నిప్పులు... బ్రిటన్ను దాటేసి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వడివడిగా పెట్టిన పరుగులు... కంటికి కనిపించని క్రిమిపై పోరాటంలో ప్రపంచ దేశాలకు చూపిన ఆదర్శం... ...ఇవన్నీ ఈ ఏడాది మనం సాధించిన ఘన విజయాల్లో కొన్ని. సైన్యంలో తాత్కాలిక నియామకాలకు తెరలేపిన ‘అగ్ని’పథం, మైనార్టీ మహిళల హిజాబ్ ధారణపై వివాదం ...వంటి కొన్ని మరకలు. ఎంతో ఇష్టం, కొంచెం కష్టంగా సాగిన 2022లో ముఖ్య ఘటనలపై విహంగ వీక్షణం... మెరుపులు ► దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఒక ఆదివాసీ మహిళ అత్యున్నత పదవిని అధిష్టించడం ఒక చరిత్రగా నిలిచింది. సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గి కొత్త చరిత్ర లిఖించారు. దేశ 15వ రాష్ట్రపతిగా సగర్వంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఒడిశాలో మయూర్భంజ్ జిల్లాకు చెందినవారు. ► భారత్ ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకొని యూకేను కూడా దాటేసి ప్రపంచంలోని అతి పెద్ద అయిదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని నవంబర్ 15న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) తన నివేదికలో వెల్లడించింది. ► భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ నవంబర్ 18న శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా దూసుకుపోయింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ రాకెట్ మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకువెళ్లింది. ► దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడానికి, కాగితం కరెన్సీ నిర్వహణకయ్యే ఖర్చుని తగ్గించడం కోసం ఆర్బీఐ డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా డిజిటల్ రుపీని అమల్లోకి తీసుకువచ్చింది. ► ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బాహుబలి యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2న కొచ్చితీరంలో జాతికి అంకితం చేశారు. రూ.20వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ నౌక క్షిపణి దాడుల్ని తట్టుకోగలదు. ఇలాంటి సామర్థ్యం కలిగిన యుద్ధనౌకలున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకొని నిల్చున్నాం. భారత వాయుసేనలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండని అక్టోబర్‌లో ప్రవేశపెట్టారు. ఇక అణు పేలోడ్లను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణిని డిసెంబర్ 15న విజయవంతంగా ప్రయోగించడంతో త్రివిధ బలగాలు బలోపేతమయ్యాయి. మరకలు ► సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది. యువకులకు నాలుగేళ్లు సైన్యంలో పనిచేసే అవకాశం మాత్రమే కల్పించడంతో పాటు పింఛన్ సదుపాయం కూడా లేని ఈ పథకానికి జూన్ 14న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆందోళనలు హింసకు దారితీశాయి. ► కర్ణాటకలో ఉడిపిలో కళాశాలలో జనవరిలో హిజాబ్ ధరించి వచ్చినందుకు కొందరు ముస్లిం అమ్మాయిలను తరగతి గదుల్లోకి రానివ్వకపోవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వీరికి పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ దుస్తులు ధరించి రావడంతో మతఘర్షణలకు దారి తీసింది. కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్‌పై నిషేధం విధిస్తే మార్చి 15న హైకోర్టు దానిని సమర్థిస్తూ తీర్పు చెప్పింది. అక్టోబర్ 13న సుప్రీంకోర్టు భిన్న తీర్పులు వెలువరించడంతో తుది నిర్ణయం భారత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ చేతుల్లోకి వెళ్లింది. ► గుజరాత్‌లోని మోర్బిలో అక్టోబర్ 30 కుప్పకూలిపోయిన కేబుల్ వంతెన దుర్ఘటనలో 138 మంది మరణించారు. మానవ తప్పిదాల కారణంగానే ఈ వంతెన కుప్పకూలిపోయింది. ఒకేసారి వంతెనపైకి వంద మంది వెళ్లడానికి మాత్రమే వీలుంటే, నిర్వాహకులు 500 మందిని పంపడంతో ప్రమాదం జరిగింది. ► ఢిల్లీలో నివాసముంటున్న శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ పూనెవాలె మే 18న గొంతు కోసి హత్య చేయడంతో పాటు ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి చుట్టుపక్కల అడవుల్లో పారేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. మృతదేహం ముక్కల్ని ఫ్రిజ్‌లో ఉంచి రోజుకి కొన్ని పారేసిన వైనం ఒళ్లు జలదరించేలా చేసింది. నవంబర్ 11న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విషాదాలు ► యావత్ భారతావనిని దుఃఖసాగరంలో ముంచేస్తూ భారతరత్న, గానకోకిల లతామంగేష్కర్ (92); పద్మవిభూషణ్, కథక్ దిగ్గజం పండిట్ బిర్జు మహరాజ్ (83) తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ► సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ములాయం సింగ్ యాదవ్ కన్నుమూయడంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉజ్జ్వల శకానికి తెర పడింది. యాత్రలు, విజయాలు, చీలికలు ► కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 150 రోజుల భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఇటీవల వంద రోజులు పూర్తి చేసుకుంది. ► గాంధీ కుటుంబానికి చెందని సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టి రికార్డు సృష్టించారు. ► ఈ ఏడాది మొదట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా; చివర్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా... ఇలా ఐదు రాష్ట్రాల్లో నెగ్గి బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ హిమాచల్‌తో సరిపెట్టుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా పంజాబ్‌లో అఖండ విజయం సాధించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నెగ్గి బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించింది. జాతీయ పార్టీగానూ అవతరించింది! ► బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. ఆగస్టులో ఎన్డీయేకి గుడ్ బైకొట్టి తిరిగి మహాఘట్బంధన్లో చేరి ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ► మహారాష్ట్రలో శివసేన కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంది. పార్టీని ఏక్నాథ్ షిండే రెండు ముక్కలు చేశారు. భారీగా ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. ► నేషనల్ హెరాల్డ్ కేసు గాంధీ కుటుంబాన్ని వెంటాడుతోంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తొలిసారిగా ఈ ఏడాది ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కేంద్ర విచారణ సంస్థలైన ఈడీ, సీబీఐ ఈ ఏడాదంతా బిజీగా గడిపాయి. పలు విపక్ష పార్టీల నేతలను విచారించాయి. పలువురిని అరెస్టు చేశాయి. దీని వెనక రాజకీయ కక్షసాధింపు ఉందంటూ విపక్షాలు మండిపడ్డాయి. చరిత్రాత్మక తీర్పులు... ► అత్యంత వివాదాస్పదమైన దేశద్రోహ చట్టంపై 124ఏ అమలుపై స్టే విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం మే 11న తీర్పు చెప్పింది. 124ఏపై కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన పూర్తయ్యేవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ► మహిళల శరీరంపై వారికే హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరూ 24 వారాలవరకు సురక్షిత గర్భవిచ్ఛిత్తికి అనుమతినిచ్చింది. సెప్టెంబర్ 29న ఈ తీర్పు చెప్పిన సుప్రీం అబార్షన్ చట్టాల ప్రకారం పెళ్లయినవారు, కాని వారు అన్న తేడా ఉండదని స్పష్టం చేసింది. ► భార్య ఇష్టానికి వ్యతిరేకంగా భర్త శృంగారం చేసినా అది అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఎంటీపీ చట్టం ప్రకారం మారిటల్ రేప్‌లు కూడా అత్యాచారం కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ► ఇంటి అల్లుడు ఇంటి నిర్మాణం కోసం డబ్బులు డిమాండ్ చేసినా అది కట్నం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. విశ్వవేదికపై... ► ప్రపంచంలో అత్యంత శక్తిమంతదేశాల కూటమి జీ20కి అధ్యక్ష బాధ్యతల్ని భారత్ స్వీకరించింది. 2023 నవంబర్ 30 దాకా ఈ బాధ్యతల్లో కొనసాగనుంది. 50 నగరాల్లో 200 సన్నాహక భేటీల అనంతరం 2023 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జీ20 సదస్సును నిర్వహించనుంది. ► ఐరాస భద్రతా మండలి అధ్యక్ష హోదాలో కౌంటర్ టెర్రరిజం కమిటీ (సీటీసీ) సదస్సును అక్టోబర్ 28, 29 తేదీల్లో ముంబై, ఢిల్లీల్లో జరిగింది. ► అరుణాచల్‌ప్రదేశ్‌లో తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య డిసెంబర్ 9న ఘర్షణలు జరిగాయి. వాస్తవాధీన రేఖ దాటి చొచ్చుకొచ్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను మన బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. -
హిమాచల్‌లో పోలింగ్.. దృష్టి మాత్రం ‘కాంగ్రా’పైనే
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా పోలింగ్ జరుగుతోన్నా.. అందరి చూపు మాత్రం ఒక్క జిల్లాలో ఏ పార్టీకి ఓట్లు పడుతున్నాయన్నదానిపైనే ఉంది. హిమాచల్ రాజకీయాల్లో ఆ జిల్లా అత్యంత కీలకమని ఇప్పటికి ఎన్నో సార్లు నిరూపితమయింది. అక్కడ పాగా వేస్తే అధికారం దాదాపు ఖరారైనట్టే. మూడు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. అందుకే ఈసారి పార్టీలు అదే రిపీట్ అవుతుందా..? అని వేచి చూస్తున్నాయి. ఈ జిల్లా చుట్టే బీజేపీ డబుల్ డ్రీమ్స్, కాంగ్రెస్ అగ్నిపథ్ స్కీమ్ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాయి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాంగ్రా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అత్యధిక సీట్లున్న జిల్లా కాంగ్రా. 15మంది ఎమ్మెల్యేలు శాసనసభకు నేతృత్వం వహిస్తున్నారు. 1993 నుంచీ కాంగ్రా జిల్లాలో అధిక సీట్లు గెల్చుకుంటున్న పార్టీయే రాష్ట్రంలో పగ్గాలు చేపడుతోంది. 15 సీట్లలో కనీసం 9 వచ్చినవారు హిమాచల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. 2017 ఎన్నికల్లో బీజేపీ 11 సీట్లు గెల్చుకుంది. అగ్నిపథ్ బీజేపీకి అగ్ని పరీక్ష కాంగ్రా జిల్లాలో రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువ. ఓబీసీలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఏదో ఒకపార్టీ వైపు సూటిగా నిలవటం ఈ జిల్లా ప్రత్యేకత. ప్రధాని మోదీపై రాష్ట్రంలో ఆదరణ ఉన్నా.. స్థానిక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా పెరిగిన ధరలు కమలదళాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం కనిపిస్తోంది. సైన్యంలో ప్రవేశాలకు కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కూడా హిమాచల్ ఎన్నికల్లో ప్రధానాంశం అవుతోంది. కాంగ్రాతోపాటు పక్కనున్న హమీర్పుర్, ఉనా, మండి జిల్లాల నుంచి వేల సంఖ్యలో యువత సైన్యంలో చేరుతుంటారు. ఈ నాలుగు జిల్లాలు కలిపి మొత్తం 35 అసెంబ్లీ సీట్లున్నాయి. అగ్నిపథ్ స్కీమ్‌తో సైన్యంలో ప్రవేశం తగ్గిపోతుందనే ఆందోళన హిమాచల్ వాసులకు ఉంది. విపక్షాలకిది బలమైన అస్త్రంగా మారింది. పక్కలో తిరుగుబాటు బళ్లెం కాంగ్రాలోని 15 స్థానాలకు 91 మంది పోటీలో ఉన్నారు. అన్ని పార్టీలకూ ఇక్కడ తిరుగుబాటు అభ్యర్థులు సమస్యగా తయారయ్యారు. ఫతేపుర్, ధర్మశాల, ఇందోరా, కాంగ్రా, దెహ్రా స్థానాల్లో బీజేపీకి తిరుగుబాటు అభ్యర్థులు తలనొప్పిగా మారారు. పార్టీ అధ్యకుడు నడ్డా, అధిష్ఠానం ఎంతగా నచ్చజెప్పినా రెబెల్స్ వెనక్కి తగ్గలేదు. మొత్తానికి 1993 నుంచీ ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీకి అధిక సీట్లు ఇస్తూ వస్తోంది కాంగ్రా జిల్లా. అలాగే రాష్ట్రంలో అధికారం మారుతూ వస్తోంది. మరి ఈసారి కాంగ్రా ఎటువైపు మొగ్గుతుందో అని పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్ పోలింగ్: ఈ పోలింగ్ బూత్ ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకం! 52 మంది ఓటర్లతో ఏకంగా.. -
అది ప్రధాని మోదీ ల్యాబ్‌లో చేసిన కొత్త ప్రయోగం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై మరోమారు ఆరోపణలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ల్యాబ్‌లో చేస్తున్న ఆ కొత్త ప్రయోగం ద్వారా దేశ భద్రత, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడ్డాయన్నారు. ప్రతి ఏడాది 60 వేల మంది సైనికులు పదవీ విరమణ చెందితే.., అందులో కేవలం 3వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘ప్రతి ఏటా 60వేల మంది జవాన్లు రిటైర్ అవుతున్నారు. అందులో 3వేల మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. నాలుగేళ్ల కాంట్రాక్ట్ తర్వాత రిటైర్ అయ్యే వేలాది మంది అగ్నివీర్ల భవిష్యత్తు ఏమిటి? ప్రధానమంత్రి ల్యాబోరేటరీలో చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ద్వారా దేశ భద్రతా, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడ్డాయి.’ అని రాసుకొచ్చారు రాహుల్ గాంధీ. 60,000 सैनिक हर साल रिटायर होते हैं, उनमें से सिर्फ 3000 को सरकारी नौकरी मिल रही है। 4 साल के ठेके पर हज़ारों की संख्या में रिटायर होने वाले अग्निवीरों का भविष्य क्या होगा? प्रधानमंत्री की प्रयोगशाला के इस नए Experiment से देश की सुरक्षा और युवाओं का भविष्य दोनों खतरे में हैं। — Rahul Gandhi (@RahulGandhi) July 24, 2022 అగ్నిపథ్ పథకం ద్వారా త్రివిధ దళాల్లోకి అగ్నివీర్లను నాలుగేళ్ల కాంట్రాక్ట్ పద్ధతిన 17-21 ఏళ్ల అవివాహిత యువతను నియమిస్తామని కొద్ది రోజుల క్రితం కేంద్రం ప్రకటించింది. నాలుగేళ్ల తర్వాత అందులోని 25 శాతం మందిని సైన్యంలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. సికింద్రబాద్ సహా పలు చోట్ల రైళ్లకు నిప్పుపెట్టారు ఆందోళనకారులు. ఈ క్రమంలో వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది కేంద్రం. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటికే వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదీ చదవండి: Agnipath: బంధాలను తెంచుతున్న అగ్నిపథ్ -
Monsoon session: ఆగని వాయిదాల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో వరుసగా ఐదో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ధరల పెరుగుదల, జీఎస్టీపై విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. శుక్రవారం ఉదయం లోక్‌సభ ఆరంభమైన వెంటనే ధరలు, ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెంపు తదితర అంశాలపై ప్లకార్డులతో విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభను 12 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు, ఆ తర్వాత మళ్లీ సోమవారం మధ్యాహ్నానికి స్పీకర్ వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ విపక్ష ఎంపీల ఆందోళనల కారణంగా మొదట 12 గంటలకు, తర్వాత గంట పాటు కొనసాగిన అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు సభ వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ కొనసాగింది. ఇక ఉభయ సభల ప్రారంభానికి ముందు టీఆర్ఎస్ సహా విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. జీఎస్టీ పెంపును వెనక్కి తీసుకోవాలని, ప్రజా సమస్యలపై పార్లమెంట్లో తక్షణమే చర్చించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు కోరారు. ఇండియన్ అంటార్కిటిక్ బిల్లుకు ఆమోదం లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన, నినాదాల మధ్యే ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు–2022 ఆమోదం పొందింది. అంటార్కిటిక్ ప్రాంతంలో భారత్ నెలకొల్పిన పరిశోధనా కేంద్రాల విషయంలో దేశీయ చట్టాలను అమలు చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన మొదటి బిల్లు ఇదే కావడం విశేషం. బిల్లుపై లోక్‌సభలో స్వల్పచర్చ జరిగింది. ‘అగ్నిపథ్’పై మాట్లాడనివ్వడం లేదు డిఫెన్స్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి ప్రతిపక్ష సభ్యులు శుక్రవారం వాకౌట్ చేశారు. అగ్నిపథ్ పథకంపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. అగ్నిపథ్‌పై చర్చించాలని కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు కేసీ వేణుగోపాల్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దానిష్ అలీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జువాల్ ఓరామ్‌ను కోరగా, ఆయన నిరాకరించారు. కేవలం అజెండాలో ఉన్న అంశాలపై చర్చించాలని తేల్చిచెప్పారు. కావాలంటే పార్లమెంట్లో అగ్నిపథ్ అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నిరసనగా వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. -
Agnipath: బంధాలను తెంచుతున్న అగ్నిపథ్
‘చావుకు భయపడటం లేదని ఏ సైనికుడు అయినా అన్నాడంటే, అతడు అబద్ధమాడుతూ ఉండాలి, లేదా గోర్ఖా అయి ఉండాలి’ అని ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్షా చెప్పేవారు. పిరికివాడిగా ఉండటం కంటే చావడం మేలనేది వీరి ఆదర్శం. స్వాతంత్య్ర కాలం నుంచీ వీరు భారత సైన్యంలో విడదీయలేని శక్తిగా ఉంటున్నారు. సాహసానికి పేరొందిన నేపాలీ గోర్ఖాలకు ఇప్పటికీ తొలి ప్రాధాన్యం సైన్యంలో చేరడమే. వీరంతా నేపాల్‌లో బలమైన భారత్ అనుకూల బృందంగా ఉంటున్నారు. 1947లో భారత్, బ్రిటన్, నేపాల్ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందానికి తీవ్ర ప్రభావం కలిగిస్తూ, గోర్ఖా యువత ఆకాంక్షలను దెబ్బ తీయబోతున్న అగ్నిపథ్ పథకం గురించి నేపాల్‌ను భారత్ సంప్రదించలేదు. గోర్ఖా జానీ, గోర్ఖా సాథీ, లహురే... పేరు ఏదైనా కావొచ్చు; కీర్తి, సంపద ఆర్జించడం కోసం వీరు మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలో చేరడానికి అప్పట్లో లాహోర్ వరకు వెళ్లారు. వీరిని నేపాలీ అమ్మాయిలు ఏరికోరి పెళ్లాడేవారు. ఇప్పటికీ చేసుకుంటున్నారు. ‘గోర్ఖాలు మీతో యుద్ధానికి దిగారు’ అనేది వీరి సమర నినాదం. పిరికివాడిగా ఉండటం కంటే చావడం మేలనేది వీరి ఆదర్శం. అలా వీరి పేర్లలో బహదూర్ (సాహసి), జంగ్ (సమరం) అనేవి వచ్చి కలిసేవి. ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్షాకు ‘శామ్ బహదూర్’ అని గుర్తింపు ఉండటం తెలిసిందే. తాను చావుకు భయపడటం లేదని ఏ సైనికుడు అయినా మీతో అన్నాడంటే, అతడు అబద్ధమాడుతూ ఉండాలి, లేదా గోర్ఖా అయివుండాలి అని మానెక్షా చెప్పేవారు. ఇండియన్ మిలిటరీ అకాడెమీలో నన్ను ఇష్టమైన మూడు ఆయుధాలు ఎంచుకొమ్మ న్నప్పుడు... నేను గోర్ఖాలు, గోర్ఖాలు, గోర్ఖాలు అని చెప్పేవాడిని. ఇప్పుడు చరిత్రలో మొదటిసారిగా వారిని అగ్నిపథ్ గోర్ఖాలు అని పిలవనున్నారు. ఈ బిరుదు, లేదా గుర్తింపు వారికి ఏమాత్రం సరిపోనిది అనే చెప్పాలి. ‘కిరాయి’ సైనికులు కాదు దేశ విభజనకు ముందు భారతీయ అధికార్లను గోర్ఖాల్లో చేరడానికి బ్రిటిష్ అధికార్లు అనుమతించేవారు కాదు. 1947 తర్వాత అంటే గోర్ఖా ట్రూప్ కమాండ్‌ను భారతీయ అధికారులు ప్రారంభించిన తర్వాతే బ్రిటిష్, ఇండియన్ ఆర్మీల మధ్య గోర్ఖా రెజిమెంట్లను విభజించారు. 1947లో కుదిరిన త్రైపాక్షిక రిక్రూట్మెంట్ ఒప్పందం... బ్రిటిష్, ఇండియన్, నేపాలీ సైన్యాల్లో నేపాలీ గోర్ఖాలను చేరడానికి అనుమతించింది. అయితే వేతనాలు, పెన్షన్లలో తేడాలు ఉండేవి. గోర్ఖాలను కిరాయి సైనికులు అని పిలవవద్దని నేపాల్ షరతు పెట్టడమే ఈ ఒప్పందంలోని చివరి అంశం. నేపాలీ గోర్ఖాలు ఇప్పుడు ఫ్రెంచ్ ఆర్మీలో చేరుతున్నారు. అనేకమంది రిటైరయిన గోర్ఖాలు ప్రైవేట్ కాంట్రాక్టర్లుగా చేరుతున్నారు. సారాంశంలో, మాతృ బెటాలియన్లతో సాంప్రదాయ వారసత్వ బంధం కారణంగా గోర్ఖాలు ఇప్పటికీ భారతీయ రెజిమెంట్లలో చేరుతున్నారు. మన సైన్యంలోని 1,3,4,5,8 సంఖ్యలు గల గోర్ఖా రెజిమెంట్లు ప్రధానంగా మాగర్లు, గురుంగులతోనూ; 9వ గోర్ఖా రెజిమెంట్ ఛెత్రీలు, ఠాకూర్లతోనూ; 11వ గోర్ఖా రెజిమెంట్ రాయిలు, లింబూలతోనూ ఉంటున్నాయి. వీళ్లందరూ భారతీయ సైన్యంలో భాగంగా ఉంటున్నారు. దివంగత భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ 11వ గోర్ఖా రైఫిల్స్‌కి చెందిన 5వ బెటాలియన్‌కి నాయకత్వం వహించేవారు. బ్రిటిష్ ఆర్మీ నాయకత్వం 1947 తర్వాత 2, 6, 7, 10 రెజిమెంట్లను తమతో తీసుకుపోయింది. వాటిని ఇప్పుడు కేవలం రెండు బెటాలియన్లుగా కుదించారు. గోర్ఖా రెజిమెంట్లలోకి నియామకాలను ప్రారంభంలో భారత్–నేపాల్ సరిహద్దులోని భైర్హవా సమీపంలోని నౌతన్వాలో జరిగేవి. తర్వాత కుంరాఘాట్, గోరఖ్‌పూర్, డార్జిలింగ్ సమీపంలోని ఘూమ్ ప్రాంతాలను శాశ్వత ప్రాంతాలుగా ఎంపిక చేశారు. ఈ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్లకు యువ గోర్ఖాలను తీసుకురావడానికి గల్లా వాలాస్ అని పిలిచే నేపాలీ రిక్రూటర్లను ఉపయోగించుకునే వారు. భారతీయ సైన్యంలో భర్తీ కావడం కోసం వీరు 20 నుంచి 24 రోజులపాటు ట్రెక్కింగ్ చేసి వచ్చేవారు. శారీరక, వైద్య పరీక్షలు అనంతరం ఎంపికైన∙వారిని రెజిమెంటల్ శిక్షణా కేంద్రాలకు పంపించేవారు. వ్యూహాత్మక సంపద తర్వాతి కాలంలో భారతీయ సైన్య నియామక బృందాలు నేపాల్ మారుమూల ప్రాంతాలకు వెళ్లి రాటుదేలిన యువత కోసం ప్రయత్నించడంతో సైనిక రిక్రూట్మెంట్ వ్యవస్థ మారిపోయింది. నేపాల్ పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లోని పోఖ్రా, ధరాన్ తదితర చోట్ల రిక్రూట్మెంట్ ర్యాలీలను నిర్వహించేవారు. నియామక వ్యవస్థ పూర్తి పారదర్శకంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు దానికి రాత పరీక్షను కూడా చేర్చారు. మొదట్లో నేపాల్ నుంచే 100 శాతం చేర్చుకునేవారు. తర్వాత దీన్ని కాస్త మార్చి, నేపాల్ దేశస్థులైన గోర్ఖాల నుంచి 70 శాతం, భారతీయ గోర్ఖాల నుంచి 30 శాతం రిక్రూట్ చేస్తూ వచ్చారు. కోవిడ్ మహమ్మారి రిక్రూట్‌మెంట్‌ను అడ్డుకున్నప్పుడు రిక్రూట్మెంట్ విభాగాలు 60:40 నిష్పత్తిలో చేర్చుకున్నాయి. 2018లో 6/1 గోర్ఖా రైఫిల్స్‌ని పూర్తిగా భారతీయ గోర్ఖాల నుంచే తీసుకున్నారు. సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో నేపాల్‌కు రాజకీయ సందేశాన్ని ఇవ్వడమే దీని ఉద్దేశం. నేపాల్‌లోని కమ్యూనిస్టులు కూడా 1990లో పాలక పక్షానికి విధించిన తమ 40 పాయింట్ల డిమాండ్లలో ఒకటి, భారత సైన్యంలో నేపాలీల చేరికను ఆపడం. కానీ సైనికుడు కావాలన్న కోరిక గోర్ఖాల్లో ఇప్పటికీ అలాగే ఉంది. 1970లలో భారత సైన్యం నుంచి గోర్ఖాలను తొలగించాలంటూ వచ్చిన సంకుచిత ప్రతిపాదనను భారత్ తోసి పుచ్చింది. నాటి ఆర్మీ చీఫ్ జనరల్ గోపాల్ బెవూర్ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి గోర్ఖాలు మనకు వ్యూహాత్మక సంపద అని నొక్కి చెప్పారు. భారత అనుకూల బృందం రెజిమెంటల్ వ్యవస్థను కొనసాగిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే అగ్నిపథ్ పథకం నేపాలీ గోర్ఖాలకు కూడా వర్తిస్తుంది. భారతీయ సైన్యంలో 38 ఇన్ఫాంట్రీ బెటాలియన్లు, రెండు రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్లు, రెండు టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లు, ఆర్టిల్లరీకి చెందిన 64 ఫీల్డ్ రెజిమెంట్లు మొత్తం గోర్ఖాలతో కూడి ఉన్నాయి. అందుకే భారత గోర్ఖా బ్రిగేడ్ అతిపెద్ద రెజిమెంట్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం భారతీయ సైన్యంలో పనిచేస్తున్న, రిటైర్ అయిన గోర్ఖాలు 17 లక్షల మంది ఉన్నారని అంచనా. వీరంతా నేపాల్‌లో బలమైన భారత్ అనుకూల బృందంగా ఉంటున్నారు. చైనా ప్రభావంలో ఉన్న నేపాల్‌తో ప్రత్యేక సంబంధాలు కొనసాగించడానికి, ఆ దేశంతో పూర్వ ప్రాధాన్యతా స్థానం పొందడానికి ఈ బృందం చాలా అవసరం. మాజీ సైనికులు నేపాల్ వ్యాప్తంగా ఇండియన్ రెజిమెంటల్ అసోసియేషన్లను ఏర్పర్చుకున్నారు. బెటాలియన్లలో తాము ఎదిగిన రోజులను తల్చుకుంటూ, యుద్ధ గౌరవాలను అందుకుంటూ ఇండియా సైనికులతో వీరు పరస్పర సంబంధాలు కొనసాగిస్తున్నారు. సైన్యంలో తాత్కాలిక నియామకాలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నేపాల్ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. 1947లో త్రైపాక్షిక ఒప్పందంపై తీవ్ర ప్రభావం కలిగిస్తూ, గోర్ఖా యువత ఆకాంక్షలను దెబ్బ తీయబోతున్న అగ్నిపథ్ పథకం గురించి నేపాల్‌ను భారత్ సంప్రదించలేదు. అగ్నిపథ్ ఒక పెద్ద అసంతృప్తి పథకంగా కనబడుతోంది. నాలుగేళ్లపాటు నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖల వద్ద ప్రాణాలు పణంగా పెట్టి సైన్యంలో పనిచేయటం కంటే, ఏ దుబాయ్‌లోనో మరింతగా సంపాదించగలరు. మొత్తం మీద చూస్తే, ఏదో ఒకరోజున గోర్ఖా వారసత్వానికి ముగింపు పలకాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోంది. 2014లో నేపాల్‌ని తొలిసారిగా సందర్శించినప్పుడు గోర్ఖా సైనికుల త్యాగాలను ఎత్తిపడుతూ తానాడిన మాటల్ని ప్రధాని నరేంద్రమోదీ అప్పుడే మర్చిపోయినట్లు కనబడుతోంది. భారత్‌తో గోర్ఖా బంధాన్ని అగ్నిఫథ్ బలహీనపరుస్తుంది. అశోక్ కె. మెహతా వ్యాసకర్త ఆర్మీ మేజర్ జనరల్ (రిటైర్డ్) (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అగ్నిపథ్ పిటిషన్లన్నీ ఢిల్లీ హైకోర్టుకు
న్యూఢిల్లీ: సైనిక నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ తన ముందు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలన్నింటినీ ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కేరళ, పంజాబ్, హర్యానా, పట్నా, ఉత్తరాఖండ్ హైకోర్టులు కూడా తమ వద్ద దాఖలైన పిల్స్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. విచారణను త్వరగా పూర్తి చేయాలని ఢిల్లీ హైకోర్టుకు సూచించింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిన నేపథ్యంలో అగ్నిపథ్‌పై వివాదం సుప్రీంకోర్టును తాకింది. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల గురించి విచారించడానికి, రైల్వేతో సహా ప్రజా ఆస్తులకు జరిగిన నష్టం గురించి విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఓ పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు.. ఈ పథకంలో జాతీయ భద్రత, సైన్యంపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది ఒకరు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదీ చదవండి: Agnipath Recruitment: అగ్నిపథ్‌లో ‘కుల’కలం? -
Agnipath Recruitment: అగ్నిపథ్‌లో ‘కుల’కలం?
న్యూఢిల్లీ: అగ్నిపథ్ నియామకాలకు సైన్యం కులాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకుంటోందన్న వార్తలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులను సైన్యం కులం, మతం సర్టిఫికెట్ అడుగుతోందని విపక్షాలు మంగళవారం ఆరోపించాయి. అధికార ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) కూడా వాటితో గొంతు కలిపింది. వీటిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఖండించగా, సైన్యం వద్ద ఇలాంటి సమాచారముంటే సైనికుల అంత్యక్రియల వంటి సమయంలో సహాయకారిగా ఉంటుందంటూ అధికార బీజేపీ అధికార ప్రతినిధి సంబిత పాత్రా స్పందించడం విశేషం! అగ్నిపథ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిని కులం, మతం సర్టిఫికెట్లు జతపరచాలని అడుగుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ నేత సంజయ్‌సింగ్‌తో పాటు అధికార ఎన్డీఏ మిత్రపక్షమైన జేడీ(యూ) నేత ఉపేంద్ర కుశ్వాహా కూడా ఆరోపించారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా కులమతాలను అడగాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ట్వీట్ చేశారు. బీసీలు, దళితులు, గిరిజనులు సైన్యంలో చేరేందుకు అనర్హులని ప్రధాని మోదీ భావిస్తున్నారా అని సంజయ్‌సింగ్ ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారం.. ఇదంతా పూర్తిగా తప్పుడు ప్రచారమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. సైన్యంలో స్వాంతంత్య్రానికి ముందునుంచీ వస్తున్న నియామక పద్ధతులే కొనసాగుతున్నాయి తప్ప కొత్తగా ఎలాంటి మార్పులూ చేయలేదని రాజ్యసభలో స్పష్టం చేశారు. సైన్యంపై వివాదాలు పుట్టించే ప్రయత్నాలు విపక్షాలకు పరిపాటేనన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను ఆప్ చీఫ్ కేజ్రివాల్ అనుమానించడాన్ని గుర్తు చేశారు. నియామకాల్లో కులమతాలను ఏ విధంగానూ పరిగణనలోకి తీసుకోవడం జరగదంటూ 2013లో యూపీలో హయాంలో సుప్రీంకోర్టులో సైన్యం అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఇదీ చదవండి: IAF Agnipath Recruitment 2022: భారత వాయుసేనలో ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ షురూ -
Parliament Monsoon Session: తొలి రోజే రగడ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ధరల పెరుగుదల నుంచి అగ్నిపథ్ వరకు కీలక అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో తొలిరోజు ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. లోక్‌సభకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు. సభ ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీలు ఓటు వేయడానికి గాను సభను మధ్యాహ్నం 2 గంటల వరకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. ఎన్నికలంటే ఒక పండగ లాంటిదేనని అన్నారు. ఈ పండగలో పాలుపంచుకోవాలని ఎంపీలకు సూచించారు. లోక్‌సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత వామపక్ష సభ్యులు వెల్‌లోకి ప్రవేశించారు. ద్రవ్యోల్బణంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ సభ్యుడు అధిర్‌రంజన్ చౌదరి మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కుటుంబ న్యాయస్థానాల(సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన ఆగకపోవడంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలోనూ ఉదయం కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు ప్రారంభించారు. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా కొందరు సభ్యులు వచ్చినట్లు కనిపిస్తోందని చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఎంపీలంతా రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడానికి వెళ్లాలని సూచిస్తూ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుగుతున్న వేళ ఈ సమావేశాలను చిరస్మరణీయ సమావేశాలుగా మార్చుకోవాలని సూచించారు. చక్కటి పనితీరు ప్రదర్శించాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల మాదిరిగా కాకుండా ఈసారి వైవిధ్యంగా వ్యవహరించాలన్నారు. జపాన్ దివంగత ప్రధాని షింజో అబె, యూఏఈ మాజీ అధ్యక్షుడు, అబూదాబీ నాయకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, కెన్యా మూడో అధ్యక్షుడు మావై కిబాకీకి, ఇటీవల మరణించిన ఎనిమిది మంది మాజీ ఎంపీలకు ఉభయ సభలు నివాళులర్పించాయి. కొత్త సభ్యుల ప్రమాణం ఎగువ సభకు ఇటీవల ఎన్నికైన సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం, కపిల్ సిబల్, ప్రఫుల్ పటేల్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సూర్జేవాలా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా, వైఎస్సార్సీపీ నేతలు వి.విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నామినేటెడ్ సభ్యుడు, సినీ కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ లోక్‌సభలో శత్రుఘ్న సిన్హా తదితరులు ప్రమాణం చేశారు. ఓపెన్ మైండ్‌తో చర్చిద్దాం ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు లోతైన, వివరణాత్మక చర్చలతో వ్రర్షాకాల సమావేశాలను ఫలవంతం చేయాలని ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంతా కలిసి ఓపెన్ మైండ్‌తో చర్చిద్దామని సూచించారు. సునిశిత విమర్శ, చక్కటి విశ్లేషణల ద్వారా ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల రూపకల్పనలో భాగస్వాములు కావాలని విన్నవించారు. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మీడియాతో మాట్లాడారు. ‘‘సభలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలి. అందరి కృషితోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అందరి సహకారంతోనే సభ సజావుగా నడుస్తుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటుంది. సభ గౌరవాన్ని పెంపొందించేలా మన విధులను నిర్వర్తించాలి. పంద్రాగస్టు సమీపిస్తున్న వేళ... దేశ స్వాతంత్య్రం కోసం జీవితాలను దేశానికి అంకితం చేసి, జైళ్లలో గడిపినవారి త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి. వారి ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని మర్చిపోవద్దు’ అని ప్రధాని పేర్కొన్నారు. పార్లమెంట్‌ను పవిత్ర స్థలంగా భావించాలన్నారు. దేశానికి కొత్త శక్తినివ్వాలి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేళ, మరో పాతికేళ్ల తర్వాత దేశ ప్రయాణం ఎలా ఉండాలనే దానిపై ప్రణాళికలు రూపొందించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మరింత వేగంగా ముందుకు సాగే తీర్మానాలతో జాతికి దిశానిర్దేశం చేయాలన్నారు. ఎంపీలంతా దేశానికి కొత్త శక్తిని సమకూర్చడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు కీలకమన్నారు. -
Parliament Monsoon Session: ఉభయ సభలు మంగళవారానికి వాయిదా
Parliament Monsoon Session 2022 LIVE అప్డేట్స్ ► పార్లమెంటు ఉభయసభలు మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైన రాజ్యసభలో విపక్షాలు ఆందోళనలు కొనసాగించడం వల్ల సభను రేపటికి వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత సభ 2 గంటలకు తిరిగి ప్రారంభమైన వెంటనే మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ► విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభను రేపటికి(మంగళవారం) వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్యనాయుడు. ► జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయద్ అల్ నహన్ మృతి నేపథ్యంలో భారత పార్లమెంట్ నివాళి అర్పించింది. Rajya Sabha observes silence as a mark of respect to the memory of the departed. Chairman Naidu made obituary reference to former Japanese PM Shinzo Abe, ex-UAE President Sheikh Khalifa Bin Zayed Al Nahyan, legendary Hindustani classical musician Pandit Shivkumar Sharma & others pic.twitter.com/GlWBNIVPhc — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్ ఆవరణలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతున్నందునా.. మధ్యాహ్నం రెండు గంటల వరకు లోక్‌సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. Monsoon session of Parliament | Lok Sabha adjourned till 2pm for voting in Presidential election in Parliament premises pic.twitter.com/knnvVEhl22 — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మొత్తం 32 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే తెలంగాణ గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ బిల్లు ప్రస్తావనకు రానుంది. ► కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ కార్యక్రమం జరిగింది. Delhi | Newly elected MPs take oath as Rajya Sabha members as the Monsoon session of Parliament begins pic.twitter.com/tFLspbBm7b — ANI (@ANI) July 18, 2022 BJP MP from Azamgarh (Uttar Pradesh) Dinesh Lal "Nirahua" Yadav, TMC MP from Asansol (West Bengal) Shatrughan Sinha, and BJP MP from Rampur (Uttar Pradesh) Ghanshyam Singh Lodhi take oath as Members of the Lok Sabha.#MonsoonSession pic.twitter.com/AKVAXg2qRQ — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2022 ప్రారంభం అయ్యాయి. ఆగష్టు 12వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. #MonsoonSession of the Parliament commences; visuals from Lok Sabha. pic.twitter.com/UYj92rMHzW — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్ సమావేశాలు: ఓపెన్ మైండ్‌తో చర్చించాలి ఈ కాలం చాలా ముఖ్యమైనది. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలం. ఆగస్ట్ 15 & రాబోయే 25 సంవత్సరాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది - దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించుకోబోయే సమయానికి, మన ప్రయాణాన్ని, కొత్త ఎత్తులను నిర్ణయించడానికి ఒక తీర్మానం చేయాల్సిన సమయం ఇది. పార్లమెంట్లో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరగాలి, అవసరమైతే చర్చ జరగాలి. ఎంపీలందరూ లోతుగా ఆలోచించి చర్చించాలని నేను కోరుతున్నాను. ప్రస్తుతం రాష్ట్రపతి & ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతున్నందున ఈ సెషన్ కూడా ముఖ్యమైనది. ఈరోజు (రాష్ట్రపతి ఎన్నికలకు) ఓటింగ్ జరుగుతోంది. ఈ సమయంలో, కొత్త రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి దేశానికి మార్గనిర్దేశం చేయడం ప్రారంభిస్తారు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు ►రాజ్యసభలో విపక్షాల వాయిదా తీర్మానాలు రాజ్యసభలో విపక్షాల వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అగ్నిపథ్ పథకంపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రూల్ 297 కింద వాయిదా తీర్మానాలు ఇచ్చిన కాంగ్రెస్, సీపీఎం ఎంపీలు. ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం(ఇవాళ్టి) నుంచి ప్రారంభం కానున్నాయి. ► సైనిక దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని విపక్ష నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ధరల పెరుగుదల, దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంట్లో తప్పనిసరిగా చర్చించాలంటున్నారు. 14 రోజుల్లో 32 బిల్లులా? అన్ని పార్టీల సమావేశంలో 13 అంశాలను లేవనెత్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే చెప్పారు. వీటిపై ఉభయ సభల్లో చర్చించాలని అఖిలపక్ష భేటీలో కోరామన్నారు. వర్షకాల సమావేశాల్లో 32 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోందని, కేవలం 14 రోజుల్లో వాటిపై చర్చించి, ఆమోదించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో చెప్పాలన్నారు. అఖిలపక్ష భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కాకపోవడం పట్ల కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ట్విట్టర్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో 32 బిల్లులూ పెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. వీటిపై ఇప్పటికే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు చర్చించాయన్నారు. సభల్లో ప్రజాస్వామ్య యుతంగా వీటిపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి అన్‌పార్లమెంటరీ పదాల జాబితాపై వివాదం అవసరం లేదని బిజూ జనతాదళ్ సీనియర్ నేత పినాకీ మిశ్రా చెప్పారు. శీతాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలన్నారు. ఒడిశాకు శాసన మండలిని ప్రకటించాలని విన్నవించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి ఇదే సరైన సమయమని ఏఐఏడీఎంకే నాయకుడు ఎం.తంబిదురై పేర్కొన్నారు. శ్రీలంకలో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ చొరవ తీసుకోవాలని తంబిదురైతోపాటు డీఎంకే నేత టీఆర్ బాలు కోరారు. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధం అఖిలపక్ష సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ నిబంధనలు, ప్రక్రియ ప్రకారం అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ప్రతిపక్షాలు ప్రతి చిన్న విషయానికి అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నాయని తప్పుపట్టారు. శ్రీలంక సంక్షోభంపై చర్చించడానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్ నేతృత్వంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. -
అగ్నిపథ్‌కు షింజో అబే హత్యకు ముడిపెడుతూ..
కోల్‌కతా: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు.. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ పథకం అగ్నిపథ్‌కు ముడిపెడుతూ ప్రచురితమైన ఓ కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే టైంలో విమర్శలకూ దారి తీసింది. జపాన్ రాజకీయవేత్త షింజో అబేను హతమార్చిన వ్యక్తి పేరు టెత్సుయ యమగామి(41). జపాన్ నావికా దళంలో మూడేళ్లపాటు పని చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం లేకుండా.. పెన్షన్ రాకుండా ఇబ్బంది పడ్డాడు. ఆ కోపంతోనే షింజోను కాల్చి చంపేశాడు అంటూ సదరు కథనం హాట్ హాట్ చర్చకు దారి తీసింది. ఈ కథనాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ ఫ్రంట్‌పేజీ కథనంగా ప్రచురించింది ఇవాళ. అంతేకాదు.. మోదీ ప్రభుత్వం కూడా యువతను రక్షణ దళంలో నాలుగేళ్ల పాటు పని చేయించుకుని.. పెన్షన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా చూడాలని ప్రయత్నిస్తోందని, భవిష్యత్తులో భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చంటూ ఆ కథనంలో కేంద్రంపై విమర్శలు గుప్పించింది. మరోవైపు శుక్రవారం ఘటన జరిగిన కొన్ని గంటలకే.. కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్‌పుత్ కూడా దాదాపు ఇలాంటి అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేశాడు. యమగామి జపాన్ ఎస్డీఎఫ్లో పని చేశాడు. కానీ, ఎలాంటి పెన్షన్ అతను పొందలేకపోయాడు అంటూ ట్వీట్ చేశాడాయన. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత ట్వీట్‌తో పాటు టీఎంసీ అధికార పత్రిక జాగో బంగ్లా కథనంపై బీజేపీ మండిపడింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగానే ఆ పత్రిక కథనాలు ప్రచురిస్తుంది. అసలు అగ్నిపథ్‌కు అబే మరణానికి మృతి పెట్టి కథనం రాసింది ఎవరు?. దేశం మీద గౌరవం, ప్రేమ ఉన్న ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయరు. జాగో బంగ్లా చేసింది ముమ్మాటికీ తప్పే. భారత యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది టీఎంసీ. షింజో అబే మీద గౌరవంతో భారత్ సంతాప దినం పాటిస్తున్న వేళ.. ఇలాంటి కథనం దురదృష్టకరం అని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ విప్ మనోజ్ తిగ్గా ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: షింజో అబేపై కాల్పులకు అసలు కారణం ఇదే.. -
Agnipath Scheme: అగ్నివీరుల్లో 20 శాతం మహిళలే!
న్యూఢిల్లీ: సాయుధ బలగాల్లో నియామకాల కోసం నరేంద్ర మోదీ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కింద ఈ ఏడాది నేవీలో చేపట్టే నియామకాల్లో 20 శాతం మంది మహిళలు ఉండొచ్చని అధికారులు చెప్పారు. నేవీలో ఈసారి మూడువేల మందిని ఎంపికచేస్తారు. అగ్నిపథ్ ద్వారా నేవీ తొలిసారిగా మహిళా నావికులను నౌకాదళంలోకి తీసుకోనుంది. అన్ని విభాగాల అప్లికేషన్లు జూలై 30వ తేదీ దాకా తీసుకుంటారు. ఉద్యోగ నియామకాల కోసం ఇప్పటివరకు 10 వేల మందిపైగా మహిళా అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. కాగా, అగ్నిపథ్ పథకాన్ని రద్దుచేయాలంటూ మంగళవారం సుప్రీంకోర్టులో మాజీ సైనికాధికారి రవీంద్రసింగ్ షెకావత్ పిటిషన్ దాఖలుచేశారు. (క్లిక్: ఉపరాష్ట్రపతి ఎన్నిక.. చాయ్‌వాలా నామినేషన్) -
అగ్నిపథ్ వల్ల ఆర్మీ బలహీన పడుతుంది
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ వల్ల ఆర్మీ బలహీనపడుతుందని, 16 ఏళ్లు పనిచేసే ఆర్మీలో నాలుగేళ్ల విధానమేంటని ఏఐసీసీ అధికార ప్రతినిధి నాజర్ హుస్సేన్ ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీతో కలిసి మీడియాతో మాట్లాడారు. అగ్నిపథ్‌పై యువత నిరసనలు చేపడుతున్నా, ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ విధానం ద్వారా 14 లక్షల ఆర్మీ బలాన్ని 6 లక్షలకు కుదిస్తున్నారని తెలిపారు. పదవీ విరమణ పొందిన 5.70 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 15 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. రేవంత్ మాట్లాడుతూ మోదీ చదువుకోకపోవడం వల్ల ఆర్మీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, ఆర్మీకి, బీఎస్ఎఫ్కు తేడా ఏంటో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. -
అగ్నిపథ్ భేష్! పథకంపై ఇన్ఫోసిస్ కో ఫౌండర్ ప్రశంసల వర్షం!
దేశాన్ని కుదిపేస్తున్న అగ్నిపథ్ అంశంపై కార్పొరేట్ దిగ్గజాలు స్పందిస్తున్నారు. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ అగ్నివీరుల భవిష్యత్‌పై హామీ ఇవ్వగా.. తాజాగా ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేకని అగ్నిపథ్ స్కీంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫోసిస్ 41వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అగ్నివీరులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై ఇన్ఫోసిస్ పరిశీలిస్తుందా అని షేర్ హోల్డర్ అడిగిన ప్రశ్నకు నందన్ నిలేకని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేం నమ్ముతున్నాం. యువతకు అగ్నిపథ్ అనేది గొప్ప అవకాశం. అగ్నిపథ్‌లో చేరి కెరియర్ను ప్రారంభించడమే కాదు, క్రమశిక్షణతో కూడిన వ్యవస్థను నిర్మించుకోవచ్చు. వీటితో పాటు భవిష్యత్ కోసం కావాల్సిన నైపుణ్యాలని మెరుగుపరుచుకోవచ్చు' అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక, ఇన్ఫోసిస్ యువతలో ఉన్న టాలెంట్‌ను ప్రోత్సహిస్తుంది. సంస్థ నిర్దేశించిన సెలక్షన్ క్రైటీరియా మేరకు ఉద్యోగుల్ని నియమించుకుంటామని అన్నారు. -
రాకేశ్ సోదరునికి ఉద్యోగం.. తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనల సమయంలో పోలీసు కాల్పుల్లో మరణించిన దామెర రాకేశ్ సోదరునికి ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియా మకాల కింద మృతుని సోదరునికి ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం తెలిసిందే. ఈ మేరకు రాకేశ్ సోదరుడు దామెర రామ్రాజుకు అతని విద్యార్హతల ఆధారంగా వరంగల్ జిల్లాలో ఉద్యోగం ఇవ్వాలని సీఎస్ సోమేశ్‌కుమార్ వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. (క్లిక్: సుబ్బారావు తగలబెట్టమన్నాడు.. శివ అమలు చేశాడు!)