సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో రైల్వే సంస్థకు తీవ్ర నష్టం జరింది. కాగా, ఈ ఘటనపై రైల్వే ఎస్పీ అనురాధ ఆదివారం స్పందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అనురాధ మాట్లాడుతూ.. ఆందోళనకారులు పోలీసులు, ప్రయాణికులపై రాళ్లు రువ్వారు. కోచింగ్ సెంటర్ల వారే ఉద్యోగార్థుల్ని రెచ్చగొట్టారు. దాడులకు కారకులైన కోచింగ్ సెంటర్లను గుర్తించాము. వారంతా వాట్సాప్ గ్రూపుల్లోనే చర్చించుకున్నారు. దాడులకు పాల్పడిన 46 మందిని ఆధారాలతో అరెస్ట్ చేశాము. సీసీ టీవీ ఫుటేజీలు మా దగ్గర ఉన్నాయి. 17వ తేదీన ఉదయం 8 గంటలకు 300 మంది రైల్వే స్టేషన్‌లో చొరబడ్డారు. వారంతా ఈస్ట్‌కోస్ట్, దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చారు. ఒక కోచ్‌ను పెట్రోల్‌పోసి కాల్చేశారు.
ఈ దాడిలో 2వేల మంది అభ్యర్థులు పాల్గొన్నారు. వారికి రైల్వే యాక్ట్ సెక్షన్ 150 కింద యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. వారు ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవు. అరెస్ట్ అయిన ఉద్యోగార్థులందరూ తెలంగాణకు చెందినవారే. రైల్వే స్టేషన్‌లో దాడిలో మొత్తం 58 రైల్వే కోచ్‌లు ధ్వంసమయ్యాయి. 9 మంది రైల్వే ఉద్యోగులు గాయపడ్డారు. 12 కోట్ల నష్టం జరిగింది’’ అని వివరించారు.
ఇది కూడా చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment