Secunderabad Railway Station
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నారా.. ఇవి తెలుసుకోండి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి రీ డెవలప్మెంట్ (redevelopment) పూర్తిచేయాలనే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు. సుమారు రూ.720 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రైల్వేస్టేషన్లో సివిల్ పనులు కొనసాగుతున్నాయి. ఉత్తరం వైపున ఉన్న స్టేషన్ భవనాన్ని కూల్చివేశారు. దానిస్థానంలో కొత్త భవనం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణమధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు...ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు గణేష్ టెంపుల్ (Ganesh Temple) వైపు ఉన్న 2వ గేట్‌ను వినియోగించుకోవాలి. ప్రస్తుతం ఈ గేట్‌ను ప్రయాణికుల రాకపోకల కోసం తెరిచి ఉంచారు. అలాగే జనరల్ బుకింగ్ కౌంటర్లు, విచారణ కేంద్రాలు, సుమారు 750 మంది ప్రయాణికులు వేచి ఉండేందుకు 500 అదనపు సీటింగ్ సామర్థ్యంతో వెయిటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 4వ గేట్ మూసివేశారు. స్వాతిహోటల్ ఎదురుగా ఉన్న 3వ, 3బి నెంబర్ గేట్లను వినియోగించుకోవచ్చు. ఈ గేట్ల వద్ద వద్ద అదనపు ప్రవేశం కల్పించారు.10వ నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు...10వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు బోయిగూడ ప్రవేశద్వారం వైపు 8వ గేట్‌ను తెరిచారు. ప్రయాణికులు ఇక్కడ సాధారణ టిక్కెట్లను కూడా బుక్ చేసుకొనేందుకు కౌంటర్లు ఉన్నాయి.నిర్మాణ పనులు కొనసాగుతున్న దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులను చేసేందుకు 24 గంటల పాటు విధులు నిర్వహించేవిధంగా ప్రత్యేక సిబ్బందిని నియమించారు.చదవండి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆర్చీలు ఇక చరిత్ర పుటల్లోనేఒకటో నెంబర్ నుంచి 10వ నెంబర్ ప్లాట్‌ఫామ్ వరకు ప్రయాణికులు చివరి నిమిషంలో పరుగెత్తవలసిన అవసరం లేకుండా ఏ ట్రైన్ ఏ ప్లాట్‌ఫామ్ పైన ఆగనుందనే సమాచారాన్ని ముందుగానే ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు అన్ని చోట్ల ఆర్పీఎఫ్ (RPF) అదనపు బలగాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. హెల్ప్‌లైన్ 139... పునరాభివృద్ధి పనుల్లో భాగంగా పెద్ద ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నందున ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరారు.ప్రయాణికుల భద్రత, రక్షణ, తక్షణ సహాయ సహకారాల కోసం ఆర్పీఎఫ్ హెల్ప్‌లైన్ – 139ను సంప్రదించాలని సూచించారు. -
‘రైల్వే స్టేషన్’లోకి దారేదీ?
సికింద్రాబాద్ (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad Station) ఆధునీకరణ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. జనరల్ బోగీల్లో ప్రయాణించే వేలాది మంది బండెడు లగేజీ మోసుకుంటూ.. పిల్లల్ని భుజాన వేసుకుని రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించడం, స్టేషన్ నుంచి బయటికి రావడం కోసం నానా అగచాట్లు పడుతున్నారు.ఆధునీకరణ కోసం రెండు ప్రధాన ద్వారాలను బారికేడ్లతో మూసివేసిన రైల్వే అధికారులు.. అందుబాటులో ఉన్న మార్గాలు ఎక్కడి నుంచి ఉన్నాయో చెప్పే ఏర్పాట్లు చేయలేదు. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు తొలగించారు. దీనితో స్టేషన్ లోపలికి వెళ్లడం, బయటికి రావడం కోసం అవస్థల పాలవుతున్నారు. ఇక రైల్వేస్టేషన్ ప్రవేశద్వారాల ముందు బారికేడ్లు ఉండటం, ఉన్న కాస్త స్థలంలో ప్రయాణీకుల కోసం వచ్చే వాహనాలతో ఇబ్బంది ఎదురవుతోంది. కనీ కనిపించకుండా.. : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 2, 4 నంబర్ ప్రవేశద్వారాలను మూసివేసిన అధికారులు.. ప్రయాణీకుల రాకపోకల కోసం 3, 5 నంబర్ ద్వారాలను అందుబాటులో ఉంచారు. ఇందు లో 3వ నంబర్ ద్వారం ఓ మోస్తరు విశాలంగా ఉండగా, పార్శిల్ కార్యాలయం పక్కన ఉన్న 5వ నంబర్ ద్వారం ఇరుకుగా ఉండి ఇబ్బంది రెట్టింపు అవుతోంది. మరోవైపు ప్లాట్ ఫామ్‌లపై సేదతీరే అవకాశం లేక ప్రయాణికులు గంటల తరబడి స్టేషన్‌కు ముందు తాత్కాలిక జనరల్ బుకింగ్ కార్యాలయం వద్ద ఇరుకైన ప్రదేశంలో పడిగాపులు కాస్తున్నారు.ఒకటో నంబర్ ప్లాట్ఫారం వైపే.. : సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే రైళ్లలో రాకపోకలు సాగించే లక్షన్నర మంది ప్రయాణికుల్లో 70శాతం మంది 1వ నంబర్ ప్లాట్‌ఫామ్ మీదుగానే స్టేషన్లోకి, బయటికి వెళ్తుంటారు. పదో నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి రాకపోకలు సాగించే అవకాశమున్నా.. సరిగా రవాణా సదుపాయాలు లేక వెళ్లడం లేదు.ఎలా వెళ్లాలో చెప్పేవారు లేరు.. రైలు వచ్చే కొంత సమయం ముందు మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. జనరల్ బుకింగ్ కార్యాలయం ముందు ఇరుకైన స్థలంలోనే గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. స్టేషన్ ముందు తాగునీరు, టాయిలెట్ల వసతి లేదు. ఎక్కడి నుంచి స్టేషన్ లోనికి వెళ్లాలో సూచించేవారు లేరు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. – సుజన్, ప్రయాణికుడు -
Secunderabad: ఆ భవనం.. ఓ జ్ఞాపకమే
సికింద్రాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది ఒకటి రైల్వేస్టేషన్.. మరొకటి క్లాక్‌టవర్. ఈ రెండూ నగరానికి ‘ఐ’ కాన్లుగా నిలుస్తున్నాయి. ఇందులో ఒకటైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిజాం ఆర్కిటెక్చర్ నిర్మాణాల్లో పేరెన్నికగన్న కట్టడం. కొద్ది రోజుల్లో ఈ కట్టడం మొత్తం కనుమరుగు కానుంది. సైనిక స్థావరాల నుంచి రూపాంతరం చెంది దేశ విదేశాల ప్రయాణికులు గుర్తెరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన భవనం ఇక చరిత్ర పుటల్లో ఓ జ్ఞాపకం కానుంది. ఎందరో ప్రయాణికులకు చక్కని ల్యాండ్ మార్క్‌గా చిరపరిచితమైన నీలిరంగు మేడ కాలగర్భంలో కలిసిపోనుంది. రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా కొత్త భవనాల నిర్మాణాలకు ప్రధాని గతంలోనే శంకుస్థాపన చేసిన నేపథ్యంలో పనులు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన రైల్వేస్టేషన్ నిర్మిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. రైల్వేస్టేషన్ మూడు ఆర్చ్ల్లో ఇప్పటికే రెండింటిని నేలమట్టం చేశారు. మరొకటి ఒకటి రెండు రోజుల్లో కనుమరుగు కానుంది. నిజాం ప్రభుత్వ హయాంలో 1874లో సికింద్రాబాద్‌లో రైల్వేస్టేషన్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో మూడు ప్లాట్‌ఫాంలతో కూడిన రైల్వేస్టేషన్‌కు సాధారణ భవనం ఉండేది. ఇండియన్ రైల్వేస్టేషన్లో భాగంగా మారిన రైల్వేస్టేషన్‌కు 1952లో మరో భవనాన్ని నిర్మించారు. మూడు ఆర్చీలతో కూడిన నిజాం ఆర్కిటెక్చర్ శైలిలో ఇక్కడ రైల్వేస్టేషన్ భవనాన్ని నిర్మించారు. క్రమేణా 10 ప్లాట్‌ఫాంలకు చేరింది. నిత్యం వందకుపైగా రైళ్లు, 1.60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు ఈ రైల్వేస్టేషన్ కేంద్రంగా మారింది. మూడు ఆర్చ్ లు.. ⇒ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేవి మూడు ఆర్చ్ లు. ఈ మూడింటి ప్రవేశ ద్వారాల శిఖరాన మూడు భాషల్లో (తెలుగు, హిందీ, ఆంగ్లం) ఒక్కో దానిపై నిలిపిన సికింద్రాబాద్ అనే అక్షరాలు కిలో మీటర్ దూరం వరకు ప్రయాణికులకు కనిపించేవి. సెల్ఫోన్ల రాకకు ముందు కొత్తగా రైలు ప్రయాణాల ద్వారా నగరానికి చేరుకునే ప్రయాణికులకు రైల్వేస్టేషన్ ఆరీ్చలే కేరాఫ్ అడ్రస్‌లుగా ఉండేవి. ⇒ ఏ భాషలోని ఆర్చీ కింద నిల్చోవాలో ఇక్కడికి కొత్తగా వచ్చే ప్రయాణికులకు వారి బంధువులు చెబుతుండే వారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్ భాషల అక్షరాలు కలిగిన ఆర్చీలు నేలమట్టమయ్యాయి. తెలుగు అక్షరాలు కలిగిన ఆర్చీని రెండు రోజుల్లో కనుమరుగు కానుంది. వేగంగా నిర్మాణం పనులు.. ⇒ ఏడాది కాలంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రూ.720 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఆధునికీకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు కూల్చివేత పనులు చేపడుతున్న అధికారులు, మరోవైపు బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పనులు కొనసాగిస్తున్నారు. ⇒ రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే రెస్టారెంట్లు, మల్టీ లెవల్ పార్కింగ్, ఎంటర్టైన్మెంట్ స్టాళ్లు, ఎస్కలేటర్ల తరహాలో వాకింగ్ ట్రాక్‌లు, లిఫ్ట్‌లు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యాక సందర్శకులకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపింపజేస్తుందని అధికారులు భావిస్తున్నారు. -
బళ్లారి–సికింద్రాబాద్ మధ్యలో హత్య!
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆదివారం హత్యకు గురైన మహిళ కేసుపై గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ‘రైల్వే సీరియల్ కిల్లర్’ రాహుల్‌ను గుజరాత్‌లోని వల్సాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఆ అధికారుల విచారణలోనే ఈ మర్డర్ వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సమాచారం అందుకున్న సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులు నిందితుడిని పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్ రైళ్లల్లో సంచరిస్తూ 35 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఐదు హత్యలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన రమణమ్మ కొన్నేళ్ల కోసం బతుకుతెరువు కోసం భర్త, పిల్లలతో కలిసి కర్ణాటకకు వలసవెళ్లింది. చివరకు రమణమ్మ, గోవిందప్ప దంపతులు బళ్లారి జిల్లాలోని సింపోటు తాలుకా, తోర్నగల్ గ్రామంలో స్థిరపడ్డారు. వీరి పెద్ద కుమార్తె తన భర్త, కుటుంబంతో కలిసి జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉంటోంది. ఆమెను చూసేందుకే రమణమ్మను శనివారం రాత్రి 7 గంటలకు కుమారుడితో కలిసి అక్కడి తోర్నగల్ రైల్వే స్టేషష్ న్కు వచ్చింది. తల్లిని మణుగూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ మహిళల బోగీలో ఎక్కించిన కుమారుడు ఈ విషయాన్ని తన బావ వెంకటేశ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. అదే రైలులోని దివ్యాంగుల బోగీలో ప్రయాణించిన రాహుల్ కన్ను ఈమెపై పడింది. మార్గమధ్యలో బోగీలో ఆమె ఒక్కరే మిగలడంతో అదును చూసుకుని పక్కనే ఉన్న సీట్ కమ్ లగేజ్ ర్యాక్ (ఎస్ఎల్ఆర్) కోచ్‌లోకి లాక్కెళ్లిన అతను బాత్రూమ్లో టవల్‌తో మెడకు ఉరి బిగించి చంపేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగదుతో పాటు సెల్‌ఫోన్ తీసుకుని ఉడాయించాడు. ఆదివారం ఉదయం రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషష్ న్కు చేరుకోవడంతో అత్త కోసం ప్లాట్‌ఫామ్ నెం.9 వద్దకు వచ్చిన వెంకటేశ్ మహిళల బోగీలో వెతికినా రమణమ్మ ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె రైలు దిగి వెళ్లి ఉంటుందని భావించి అతడూ వెళ్లిపోయాడు. రైలు శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది హరికుమార్ బాత్రూమ్లో ఉన్న మృతదేహాన్ని గుర్తించి స్టేషన్ మేనేజర్ ఎన్.నాగరాణి దృష్టికి తీసుకెళ్లాడు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు హతురాలి కుటుంబీకులను రప్పించారు. గాంధీ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. ప్రస్తుతం గుజరాత్‌లోని వల్సాద్ పోలీసుల అదుపులో ఉన్న రాహుల్‌ను పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. న్యాయస్థానం నుంచి ఈ వారెంట్ తీసుకోవడానికి వల్సాద్ పోలీసులకు రాహుల్ ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. దీంతో ఆ అధికారులను సంప్రదించిన జీఆర్పీ పోలీసులు రికార్డులు తీసుకున్నారు. రమణమ్మ హత్య బళ్లారి–సికింద్రాబాద్ మధ్యలో జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే కచ్చితంగా ఎక్కడ అనేది తేలియాలంటే నిందితుడిని తీసుకువచ్చిన తర్వాత కస్టడీలోకి తీసుకోవాల్సి ఉందని, ఆపై క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్లోనే ఇది తేలుతుందని చెబుతున్నారు. దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ‘రాక్షసుడు’
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు భోలో కరమ్‌వీర్ జాట్ అలియాస్ రాహుల్..స్వస్థలం హర్యానాలోని రోహ్తక్లో ఉన్న మోక్రా ఖాస్...గతంలో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల్లో నేరాలు చేశాడు. ఇటీవల ‘రైల్వే’ కిల్లర్‌గా మారాడు. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి ఆదివారం (ఈ నెల 24) మధ్య 35 రోజుల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో సంచరిస్తూ ఐదు రాష్ట్రాల్లో ఐదు మర్డర్లు చేశాడు. వీటిలో కొన్ని సొత్తు కోసమైతే..మరికొన్ని అత్యాచారం, హత్యలు. గుజరాత్‌లోని వల్సాద్ పోలీసులు ఈ నరహంతకుడిని సోమవారం పట్టుకున్నారు. విచారణలో ఆఖరి ఘాతుకాన్ని ఆదివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులకు వల్సాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో పీటీ వారెంట్‌పై కరమ్వీర్ను నగరానికి తీసుకురావడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. వల్సాద్ ఎస్పీ డాక్టర్ కరణ్‌రాజ్ సింగ్ వాఘేలాను మంగళవారం ‘సాక్షి’ ఫోన్ ద్వారా సంప్రదించింది. ఆయన ఈ సీరియల్ కిల్లర్ పూర్వాపరాలు వెల్లడించారు.చిన్ననాటి నుంచి చిత్రమైన ప్రవర్తన..హర్యానాలోని వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాహుల్‌కు ఎడమ కాలికి పోలియో సోకింది. ఫలితంగా చిన్నతనం నుంచి ఆటపాటలకు దూరంగా ఉంటూ ఒంటరిగా ఉండేవాడు. విపరీతమైన భావాలు, చిత్రమైన ప్రవర్తన కలిగి ఉండేవాడటంతో కుటుంబం దూరంగా పెట్టింది. ఐదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పిన రాహుల్ లారీ క్లీనర్‌గా పని చేస్తూ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అయితే పోలియో కారణంగా ఇతడికి ఎవరూ డ్రైవర్‌గా ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో హైవే దాబాలో కారి్మకుడిగా మారిన రాహుల్... అక్కడ పార్క్ చేసి ఉన్న లారీలను తస్కరించడం మొదలెట్టాడు. దీంతో పాటు లూటీలు, కిడ్నాప్‌లకు పాల్పడ్డాడు. ఈ ఆరోపణలపై రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లో 13 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే వరకు రాజస్థాన్‌లోని జోద్పూర్ జైల్లో గడిపిన రాహుల్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అక్కడ నుంచి గుజరాత్‌లోని ఉద్వాడ పట్టణానికి చేరుకుని ఓ హోటల్లో కారి్మకుడిగా చేరాడు. కొన్ని రోజులు పని చేసి వాపి ప్రాంతానికి చేరుకుని ఫుట్‌పాత్స్ పైన గడిపాడు.ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని..వివిధ రైళ్లల్లో దివ్యాంగుల కోసం చివరలో ప్రత్యేక బోగీలు ఉంటాయి. వీటిలో ప్రయాణించే దివ్యాంగులను సాధారణంగా టీసీలు సైతం తనిఖీ చేయరు. పాసులు కలిగి ఉంటారనే ఉద్దేశంలోనే వదిలేస్తుంటారు. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న రాహుల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లోని దివ్యాంగుల బోగీల్లో ఎక్కి దేశం మొత్తం తిరగడం ప్రారంభించాడు. ఈ ఏడాది జూన్ రెండో వారం నుంచి ఇలా దేశ సంచారం చేస్తున్న రాహుల్ అక్టోబర్ 17న తొలి హత్య చేశాడు. ఆ రోజు బెంగళూరు–మురుదేశ్వర్ రైలులో ప్రయాణిస్తుండగా బీడీ కాల్చడంపై తోటి ప్రయాణికుడు అభ్యంతరం చెప్పాడు. దీంతో విచక్షణకోల్పోయిన రాహుల్ గొంతు నులిమి చంపేశాడు. ఆపై అతడి వద్ద ఉన్న సొత్తు, సొమ్ము తీసుకుని రైలు దిగిపోయాడు. దీనిపై మంగుళూరులో ఉన్న ముల్కీ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. వరుసపెట్టి మరో నాలుగు హత్యలు..ఆపై కతిహార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన రాహుల్ పశ్చిమ బెంగాల్ లోని హౌరా స్టేషన్లో మరో వృద్ధుడి గొంతు కోసి చంపి దోపిడీకి పాల్పడ్డాడు. పుణే–కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో మరో మహిళపై అత్యాచారం చేసి, కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. వీటిపై ఆయా ఠాణాలో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 14న ఉద్వాడలో తాను పని చేసిన హోటల్‌కు వెళ్లి జీతం తీసుకోవాలని భావించాడు. అక్కడకు వచ్చిన రాహుల్‌కు స్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌పై ఒంటరిగా సంచరిస్తున్న యువతి కనిపించింది. ఆమెను సమీపంలోని మామిడి తోటలోకి లాక్కెళ్లి, అత్యా చారం చేసి చంపేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న వల్సాద్ పోలీసులు ఘటనాస్థలిలో లభించిన బ్యాగ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వివిధ రైల్వేస్టేషన్లలోని 2500 సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను అధ్యయనం చేసి నిందితుడిని గుర్తించారు. ఉద్వాడ నుంచి రైలులో ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం చేరుకు న్న రాహుల్ అట్నుంచి షిర్డీ, ఆపై బాంద్రా చేరుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మహిళ హత్య..అక్కడ నుంచి సికింద్రాబాద్ వచ్చిన రాహుల్ ఆదివారం తెల్లవారుజామున రైలు దిగాడు. ఆ సమయంలో తొమ్మిదో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై మంగుళూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉంది. దాని సీట్ కమ్ లగేజ్ ర్యాక్ (ఎస్ఎల్ఆర్) కోచ్‌లో ఓ మహిళ ఒంటరిగా ఉండటం గమనించాడు. ఆమెను గొంతునులిమి చంపేసిన రాహుల్ నగదు, సెల్‌ఫోన్ తస్కరించాడు. అక్కడ నుంచి రైలులోనే ఉడాయించాడు. ఈ హత్యపై సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివిధ రైళ్లు మారిన రాహుల్ బాంద్రా–భుజ్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం గుజరాత్‌లోని వాపి చేరుకున్నాడు. అప్పటికే ఇతడి కదలికలు సాంకేతికంగా గమనిస్తున్న వల్సాద్ పోలీసులు అక్కడ వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి సికింద్రాబాద్‌లో చంపిన మహిళ నుంచి తీసుకున్న సెల్‌ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. ఇతడి అరెస్టుపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
గోవా వెళ్లేవారికి గుడ్‌న్యూస్ .. సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ రైలు
గోవా వెళ్లాలనుకునే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేందుకు కొత్తగా రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. సికింద్రాబాద్–వాస్కోడిగామా–సికింద్రాబాద్ మధ్య కొత్తగా బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ని ప్రవేశపెట్టేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ రెలు ఈ నెల 6న ప్రారంభం కానున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 9 నుంచి రెగ్యులర్ సేవలు మొదలవుతున్నాయని పేర్కొంది. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.సికింద్రాబాద్ – వాస్కోడిగామా (17039) రైలు ప్రతి బుధవారం, శుక్రవారాలు అందుబాటులో ఉంటుందని.. వాస్కోడిగామా – సికింద్రాబాద్ (17040) రైలు గురువారం, శనివారాల్లో అందుబాటులో ఉంటుందని చెప్పింది.సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్లే రైలు 17039 నంబర్‌తో బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్‌కు 17040 నంబర్‌తో గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో ఫస్ట్ ఏసీ, 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. 4వ తేదీ నుంచి టికెట్ల బుకింగ్‌కు అనుమతిస్తారు. 6వ తేదీ రైలు మాత్రం ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు చేరుకుంటుంది -
తొలిసారి పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు రూట్లలో ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్, కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు సైతం రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.తాజాగా వందే భారత్ రైళ్లకు తోడు వందే భారత్ మెట్రో రైళ్లు, వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 16వ తేదీన తొలి వందే భారత్ మెట్రో రైలు పట్టాలు ఎక్కనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి భుజ్ మధ్య ప్రయాణించనున్న తొలి వందే భారత్ మెట్రో రైలును..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.ఈ రైలు దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రో రైళ్ల మాదిరిగానే ఉండగా.. వాటి కంటే సుదూర ప్రయాణాలకు ఉపయోగించనున్నారు. అహ్మదాబాద్-భుజ్ మధ్య 334 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 45 నిమిషాల్లోనే ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణించనుంది. భుజ్ రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున 5.50 గంటలకు ప్రారంభమై.. ఉదయం 10.50 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్‌కు చేరుకోనుంది. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అహ్మదాబాద్‌లో ప్రారంభమై.. రాత్రి 11.10 గంటలకు భుజ్ చేరుకోనుంది. వారంలో 6 రోజులు ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణం చేయనుంది. ఇక భుజ్-అహ్మదాబాద్ మార్గంలో ఈ రైలుకు 9 స్టాప్‌లు ఉండగా.. ప్రతీ స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే ఆగుతుందని భారతీయ రైల్వే తెలిపింది.వందే భారత్ మెట్రో అనేది సెమీ-హై-స్పీడ్ రైలు. ఇది గంటకు 100 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. వందే భారత్ రైలు లాగానే ఈ రైలు కూడా పూర్తిగా ఎయిర్ కండీషన్ కలిగి ఉంటుంది. మొదట 12 కోచ్‌లతో ప్రారంభం కానున్న ఈ వందే భారత్ మెట్రో రైలుకు.. ప్రయాణికుల రద్దీ దృష్టా వాటిని 16 కోచ్‌లకు పెంచనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ రైళ్లకు ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్ ఉండనుండగా.. నాలుగు కోచ్‌లు ఒక యూనిట్‌గా ఉంటాయి. ఇందులో మన మెట్రో రైలు లాగా ఆటోమేటిక్ డోర్లు ఉండటం మరో ప్రత్యేకత. ఈ వందే భారత్ మెట్రో రైలును గంటకు 100 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టేలా రూపొందించారు.ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో రైలు డ్రైవర్‌తో నేరుగా కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి కోచ్‌లో మంటలు, పొగ వంటి ప్రమాదాన్ని వెంటనే గుర్తించేలా మొత్తం 14 సెన్సార్లతో కూడిన సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. దివ్యాంగుల కోసం కోచ్‌లలో వీల్‌చైర్ యాక్సెస్ కలిగిన టాయిలెట్లు ఏర్పాటు చేశారు. -
సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ రైలు.. వివరాలివే
భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అమితమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కొత్తగా మరికొన్ని రూట్లలో వందే భారత్ రైళ్లనుప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు వందే భారత్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్- విశాఖ పట్నం, విజయవాడ- చెన్నై, కాచిగూడ- బెంగళూరు మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది.సికింద్రాబాద్‌నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు కొత్తగా వందే భారత్ రైలు నడవనుంది. ఈ రెండు నగరాల మధ్య 578 కి.మీ దూరం ఉండగా.. కేవలం 7 గంటల 20 నిమిషాల్లోనే గమ్య స్థానాలకు చేర్చనుంది. ఈ రైలు ఉదయం 5 గంటలకు నాగ్ పూర్ నుంచి బయలు దేరి.. అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్‌లో బయలు దేరి రాత్రి 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.ఇక ఈ రైలు సేవాగ్రామ్, చంద్రాపూర్, రామగుండం, కాజీపే స్టేషన్లలో మాత్రమే ఆగనుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలును సెప్టెంబర్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే నాగ్‌పూర నుంచి రెండు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా.. ఇప్పుడు నాగ్‌పూర్- సికింద్రాబాద్ రైలుతోపాటు నాగ్‌పూర్- పుణె రైలు కూడా సెప్టెంబర్ 15న ప్రారంభం కానుంది.#Secunderabad - #Nagpur VandeBharat Express will be introduced very soonTentative launch date: 📅 15th September pic.twitter.com/K43a6Eu1an— TechChaitu (@techchaituu) September 9, 2024హైదరాబాద్ నగరం నుంచి ప్రస్తుతం ఏపీలోని తిరుపతి, విశాఖ, కర్ణాటకలోని యశ్వంత్‌పుర (బెంగళూరు) నగరాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖ, తిరుపతి నగరాలకు రైల్లు నడుస్తుండగా.. కాచిగూడ స్టేషన్ నుంచి యశ్వంత్‌పురకు ట్రైన్ పరుగులు పెడుతోంది. దీంతో నాగపూర్ ప్రాంతానికి మరో ట్రైన్ ప్రతిపాదించారు. -
సికింద్రాబాద్: రైల్వే ప్రయాణికులకు ముఖ్యగమనిక, ఇక నుంచి..
వేలాదిమంది ప్రయాణికులు... ఎటువైపు నుంచి వస్తున్నారో, ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. ఒకటి– పది.. ప్లాట్‌ఫామ్స్ వైపు ఉన్న ప్రవేశద్వారాల్లో బ్యాగేజీ చెకింగ్ వ్యవస్థ ఉన్నా.. అది పని చేయదు. పక్కనే భద్రతా సిబ్బంది ఉన్నా పట్టించుకోరు.. వచ్చిపోయే రైళ్లతో ప్రమేయం లేకుండా ఎప్పుడు చూసినా.. ప్లాట్‌ఫామ్‌లు వందల మందితో కిక్కిరిసి కనిపిస్తాయి. కాస్త చీకటి పడితే చాలు.. ప్లాట్‌ఫామ్‌లపై గురకపెట్టి నిద్రలోకి జారుకునే వారెందరో... వెరసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా గందరగోళం. కానీ, ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది.సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా రూపుదిద్దుకొంటున్న సికింద్రాబాద్ స్టేషన్ మరో ఏడాదిన్నరలో సరికొత్త రూపును సంతరించుకోనుంది. రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఆధునిక స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. వెరసి ఈ స్టేషన్‌ను ఎయిర్పోర్ట్ తరహాలో పటిష్టమైన భద్రతతో కూడిన ప్రాంగణంగా మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశంలో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా రూపాంతరం చెందిన ఘనతను సాధించుకున్నది భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్. కానీ, అక్కడ భారీ వ్యయంతో బ్యాగేజీ స్కానింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి మూడేళ్లు గడుస్తున్నా.. అది ఇంకా ఉపయోగంలోకి రాలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ సికింద్రాబాద్ స్టేషన్‌కు అటువంటి పరిస్థితి రాకుండా పక్కాగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.లగేజీ చెకింగ్ తర్వాతే లోనికిసికింద్రాబాద్ స్టేషన్‌కు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు, పదో నెంబర్ ప్లాట్‌ఫామ్ ఉన్న బోయిగూడ వైపు నుంచి ప్రవేశ మార్గాలున్నాయి. ఆధునికీకరణ తర్వాత కూడా ఈ రెండు కొనసాగుతాయి. ఈ రెండు మార్గాల్లో ఒక్కోవైపు రూ.3 కోట్ల వ్యయంతో భారీ బ్యాగేజీ స్క్రీనింగ్ మెషీన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు కచ్చితంగా తమ లగేజీని ఈ స్క్రీనింగ్‌లో చెకింగ్ పూర్తి చేయించుకునే లోనికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం వారు రైలు బయలుదేరే వేళ కంటే కాస్త ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పద్ధతి విమానాశ్రయాల్లోనే ఉంటోంది. విమాన ప్రయాణికులకు లగేజీ చెకింగ్ అనేది నిర్బంధ ప్రక్రియ. అది జరక్కుంటే విమానంలోకి అనుమతి ఉండదు. అదే పద్ధతిని సికింద్రాబాద్ స్టేషన్లో అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.రైలు అనౌన్స్మెంట్ అయ్యాకే ప్లాట్‌ఫామ్ పైకిప్రస్తుతం స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులు నేరుగా ప్లాట్‌పామ్‌లపైకి చేరుకుంటున్నారు. కానీ, ఆధునిక స్టేషన్ అందుబాటులోకి వచ్చాక ఇది కుదరదు. టికెట్ పొందిన తర్వాత ప్రయాణికులు నేరుగా కాంకోర్స్ మీదుగా ప్రయాణికులు వేచి ఉండే హాలులోకి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడే వారు కూర్చోవాలి. లేదా.. షాపింగ్ చేసుకోవచ్చు. వారు వెళ్లాల్సిన రైలు ప్లాట్‌ఫామ్ మీదకు రావటానికి పదిపదిహేను నిమిషాల ముందు అనౌన్స్మెంట్ ఇస్తారు. అప్పుడు మాత్రమే ప్రయాణికులను ప్లాట్‌ఫామ్ మీదకు అనుమతిస్తారు.ఆలస్యంగా వస్తే అంతేసరిగ్గా రైలు బయలుదేరే సమయానికి హడావుడిగా ప్లాట్‌ఫామ్ మీదకు పరుగెత్తుకు రావటం స్టేషన్లలో నిత్యకృత్యం. కానీ, కొత్త స్టేషన్ భవనం అందుబాటులోకి వచ్చాక.. సికింద్రాబాద్ స్టేషన్లో ఇలాంటి వారిని అనుమతించకూడదన్న యోచనలో అధికారులున్నారు. కచ్చితంగా బ్యాగేజీ చెకింగ్ ఉంటున్నందున.. ముందుగానే స్టేషన్‌కు రావాల్సి ఉంటుందన్న నిబంధన విధించనున్నారు. ఆలస్యంగా వచ్చే వారు కూడా లగేజీ చెకింగ్ పూర్తి చేసుకునే ప్లాట్‌ఫామ్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. రైలు ఉంటే ఎక్కుతారు.. లేదంటే వెనుదిరగాల్సిందే.కునుకు కోసం వచ్చే వారికి ఇక నో ఎంట్రీప్రయాణాలతో ప్రమేయం లేకుండా చాలా మంది చీకటిపడగానే స్టేషన్లోకి చేరుకుని ఏ ఖాళీ బెంచీనో చూసుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. ఇక అలాంటి వారికి లోనికి అనుమతి ఉండదు. టికెట్ ఉన్న వారిని మాత్రమే.. రైలు వచ్చే వేళకు ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతిస్తారు. లేని వారికి నో ఎంట్రీ. వెరసి ఇక ప్లాట్‌ఫామ్ ప్రాంతాలు అడ్డదిడ్డంగా పడుకునేవారితో కనిపించవన్నమాట.మిగతావాటి సంగతేంటి..?ప్రపంచస్థాయి స్టేషన్లుగా ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో మూడు స్టేషన్లు మాత్రమే సిద్ధమవుతున్నాయి. ఏపీ పరిధిలో తిరుపతి, నెల్లూరు ఉండగా, తెలంగాణలో ఒక్క సికింద్రాబాద్ మాత్రమే ఉంది. ఇక జోన్ వ్యాప్తంగా మరో 119 స్టేషన్లను రూ. 5 వేల కోట్ల వ్యయంతో అమృత్‌భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తారు. ఇవి ఉన్న భవనాలను మెరుగు పరుస్తారు. సికింద్రాబాద్ తరహాలో మొత్తం భవనాలను తొలగించి కొత్తగా నిర్మించరు. అమృత్‌భారత్ స్టేషన్లలో ఈ పద్ధతులు ఉండాలా వద్దా అన్న విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. అయితే అమృత్‌భారత్ ప్రోగ్రామ్‌లో భాగంగానే అభివృద్ధి చేస్తున్న నగరంలోని కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో మాత్రం సికింద్రాబాద్ తరహా విధానాలను అమలు చేయాలని భావిస్తున్నారు. -
మైనర్ బాలిక చేరదీత
అడ్డగుట్ట: ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన మైనర్ బాలికను ఆర్పీఎఫ్ పోలీసులు చేరదీసి హోంకు తరలించిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన మేరకు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం అనుమానాస్పదంగా కుమారి(16) అనే బాలిక సంచరిస్తోంది. ఈ క్రమంలో ఆరీ్పఎఫ్ పోలీసులు ఆమెను విచారించగా ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు చెప్పింది. దీంతో సదరు బాలికను చేరదీసిన ఆర్పీఎఫ్ పోలీసులు ఆఫ్జల్‌గంజ్‌లోని ఎస్ఆర్డీ హోం కు తరలించారు. -
దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అద్భుత, ఆధునిక రైల్వే స్టేషన్లలో ఒకటిగా రూపుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎయిర్ కాన్కోర్స్ ప్రత్యేకంగా నిలవబోతోంది. రూఫ్ ప్లాజాగా పిలవబోతున్న ఈ కాన్కోర్స్.. స్టేషన్లలో ఉండే ఫుట్ఓవర్ బ్రిడ్జి పాత్ర పోషిస్తుంది. కానీ, ఇది సాధారణ ఫుట్ఓవర్ బ్రిడ్జి కాదు. ఇప్పుడు దేశంలోని రైల్వే స్టేషన్లలో అతిపెద్ద (ఇప్పటి వరకు ప్రతిపాదించిన వాటిల్లో) స్టీల్ ఎయిర్ కాన్కోర్సుగా నిలవబోతోంది. ఇప్పుడు దీని నిర్మాణానికి ఇంజనీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల వ్యయంతో 1.60 లక్షల చ.మీ. వైశాల్యంతో పూర్తి ఆధునిక రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్ స్టేషన్ రూపొందుతున్న విషయం తెలిసిందే. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా, నిత్యం పెద్ద ఎత్తున ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నా.. వారి ప్రయాణాలకు అవాంతరంగా కలగకుండా వేగంగా పనులు కొనసాగిస్తున్నారు. ఇవన్నీ ఓ ఎత్తయితే, ప్లాట్‌ఫామ్ నం.1 – ప్లాట్‌ఫామ్ 10 మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు నిర్మించబోతున్న రూఫ్ప్లాజా మరో ఎత్తుగా ఉండబోతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీన్ని స్టీల్‌తో నిర్మిస్తున్నారు. ప్లాట్‌ఫారాల మధ్య రాకపోకల కోసం ప్రయాణికులు ఫుట్ఓవర్ వంతెనలను వినియోగిస్తారు. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్లో ఇలాంటి వంతెనలు నాలుగున్నాయి. ఇప్పుడు వాటిని తొలగించి వాటి స్థానంలో స్టీల్‌తో భారీ వంతెన నిర్మించనున్నారు. 120 మీటర్ల పొడవుండే ఈ వంతెన ఏకంగా 108 మీటర్ల వెడల్పు వెడల్పు ఉండనుంది. ఇది కేవలం వంతెన పాత్ర పోషించేందుకే పరిమితం కాదని, ఇందులోనే వెయిటింగ్ హాళ్లు, ఫుడ్ కోర్టులు, ఇతర వాణిజ్యపరమైన వ్యవస్థలుంటాయని చెపుతున్నారు. 9 మీటర్ల ఎత్తులో ఉండే మొదటి అంతస్తులో ప్రయాణికుల వెయిటింగ్ హాళ్లు ఉంటాయి. 15 మీటర్ల ఎత్తుండే రెండో అంతస్తులో ఫుడ్ కోర్టులు, ఇతర ఏర్పాట్లు ఉంటాయి. దీనికి అనుసంధానంగా రెండు ట్రావెలేటర్స్ ఉంటాయి. ప్రయాణికులు వాటిపై నుంచుంటే చాలని, అవే ముందుకు తీసుకెళ్తాయని వివరిస్తున్నారు.రైల్వే స్టేషన్లో తొలిసారి ట్రావెలేటర్స్..ఇప్పటివరకు విమానాశ్రయాల్లో కనిపిస్తూ వస్తున్న ట్రావెలేటర్స్ ఇప్పుడు తొలిసారి రైల్వే స్టేషన్లో దర్శనమివ్వనున్నాయని చెపుతున్నారు. కాన్కోర్స్ రెండు అంతస్తుల్లోకి వెక్కి దిగటంతోపాటు, ప్లాట్‌ఫారాల మీదకు రాకపోకలు సాగించేందుకోసం ఈ రూఫ్ప్లాజాకు ఏకంగా 32 ఎస్కలేటర్లు అనుసంధానమై ఉంటాయంటున్నారు. దీని మీదుగానే స్టేషన్‌కు రెండు వైపులా ఉన్న రెండు మెట్రో స్టేషన్లతో అనుసంధానిస్తూ రెండు స్కై వేలుంటాయని, అంతా సిద్ధమయ్యాక ఇది ఓ అద్భుత స్టీల్ కాన్కోర్సుగా నిలవబోతోందని అంటున్నారు. -
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు రద్దు
సాక్షి, సికింద్రాబాద్/ విశాఖపట్నం: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) విజ్ఞప్తి అందించింది. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నేడు రద్దయినట్లు తెలిపింది. విశాఖ పట్నం-సికింద్రాబాద్ వందే భారత్ రైలుతోపాటు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ విశాఖ పట్నం వందే భారత్ రైలు కూడా రద్దు చేసినట్లు పేర్కొంది. రేక్‌ల సమస్య వల్ల రైలును క్యాన్సల్ చేసినట్లు అధికారులువ వెల్లడించారు. అయితే ప్రత్యామ్నాయంగా ప్రయాణికుల సౌకర్యం కోసం అధికారులు ప్రత్యేక రైలును (08134A) ఏర్పాటు చేశారు. ఇది మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుందని, రాత్రి 11.30 గంటలకు విశాఖకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలుకు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. వరంగల్, ఖమ్మంలో ఒక్క నిమిషం.. రాజమండ్రి, సామర్లకోటలో రెండు నిమిషాలు.. విజయవాడ స్టేషన్లో ఐదు నిమిషాలు ఈ రైలు ఆగుతుంది. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు. మరోవైపు ఇలా అనూహత్యం, రైలురద్దయినట్లు ప్రకటించడం సరైనది కాదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర అకస్మాత్తుగా కారులో చెలరేగిన మంటలు
-
ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి 20 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్యే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో పది ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. పండుగ నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైళ్ల సర్వీసులు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 1 వరకు టైమ్‌టేబుల్ వారీగా రాకపోకలు కొనసాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి, హైదరాబాద్-నర్సాపూర్, తిరుపతి-సికింద్రాబాద్, కాకినాడటౌన్-లింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం.. వైద్యులు ఏమన్నారంటే 20 సంక్రాంతి స్పెషల్ రైళ్లు సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ-కాకినాడటౌన్, హైదరాబాద్-తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి రైళ్ల వివరాలు ఎస్సీఆర్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 26వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడు సేఫ్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడిని పోలీసులు రక్షించారు. మాదాపూర్ బ్రిడ్జి కింద బాలుడిని గుర్తించారు. బ్రిడ్జి కింద చిన్నారిని పడుకోబెట్టి బిక్షాటన చేసిన కిడ్నాపర్.. పోలీసులను చూసి పొదల్లోకి వదిలి పారిపోయాడు. ఆరు గంటలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి బాలుడి ఆచూకీ కనుగొన్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బెగ్గింగ్ కోసమే కిడ్నాపన్ చేసినట్లు తేలింది. అసలేం జరిగిందంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో యిదేళ్ల బాలుడు కిడ్నప్‌కు గురైన విషయం తెలిసిందే. కిడ్నాప్ చేసిన వారిని బెగ్గింగ్ మాఫియా ముఠాగా అనుమానిస్తున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయాలపురానికి చెందిన దుర్గేశ్, తన 5 ఏళ్ల కుమారుడి శివ సాయితో కలిసి తిరుమల వెళ్ళాడు. ఈనెల 28న తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. ఆ రోజు ఉదయం 5.30కు సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన దుర్గేశ్.. అలిసిపోయి ఉండటంతో స్టేషన్లోనే పడుకున్నాడు. అనంతరం సాయంత్రం 4.30కు దుర్గేశ్.. తన కుమారుడిని బ్యాగులతో పాటు ప్లాట్ ఫామ్ నెంబర్ 1 వద్ద ఉంచి వాష్‌రూం వెళ్లాడు. వచ్చి చూసేలోపు బాబు కనిపించలేదు. దీంతో స్టేషన్లో ఉన్న జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా గుర్తు తెలియని దంపతులు బాబును కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే తప్పిపోయిన బాలుడు.. మూగ, చెవిటి అని తండ్రి దుర్గేశ్ చెబుతున్నారు. చదవండి: బీజేపీకి సోమారపు రాజీనామా! -
తికమక తెలుగుతో ప్రయాణికుల తకరారు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల సమాచారం తెలిపే ఎల్రక్టానిక్ డిస్ప్లే బోర్డుల్లో వినియోగిస్తున్న సరికొత్త భాష ప్రయాణికులను గందరగోళం, అయోమయానికి గురి చేస్తోంది. సహజంగా ఊరి పేరు డిస్ప్లే చేస్తారు. కానీ ఘనత వహించిన దక్షిణ మధ్య రైల్వేలో మాత్రం ఊళ్ల పేర్లకు అర్ధాలు వెదికీ మరీ ప్రయాణికుల ముందుంచుతున్నారు. అది కూడా గూగుల్‌తో అనుసంధానించి మరీ తర్జుమా చేస్తున్నారు. దాంతో ప్రయాణికులకు సమాచారం ఇవ్వటం అటుంచి.. వారిని మరింత తికమకపెట్టి అయోమయానికి గురి చేస్తున్నారు. ♦ దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ స్టేషన్లో ఈ తికమక తంతు ఎలా ఉందో కళ్లకు కట్టే ఉదాహరణ ఇది. దక్షి ణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్ నిలయానికి అతి సమీపంలో ఉన్న ఈ స్టేషన్లో నిత్యం లక్షల మంది ప్రయాణికులు కళ్లప్పగించి చూసే రైళ్ల వివరాలను తెలిపే ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డు ఇది. ♦ తమిళనాడులోని ఎరోడ్ పట్టణానికి వెళ్లే స్పెషల్ రైలుకు సంబంధించి వివరాలు డిస్ప్లే బోర్డు మీద కనిపిస్తున్నప్పుడు ఇంగ్లీష్, హిందీలో సరిగానే ఉంది. కానీ తెలుగులో ప్రత్యక్షమైనప్పుడు విస్తుపోవటం ప్రయా ణికుల వంతవుతోంది. ‘‘ఎరో డ్ స్పెషల్’’అన్న రెండు పదాలకు తెలుగులో ‘‘క్షీణించు ప్రత్యేక’’అని కనిపిస్తోంది. ఎరోడ్ అన్నది ఊరు పేరు అన్న విషయం కూడా మరిచి, దాన్ని ఆంగ్ల పదంగానే భావిస్తూ తె లుగులోకి తర్జుమా చేసేశారు. ఎరోడ్ అన్న పదానికి క్షీణించటం, చెరిగిపోవటం అన్న అర్ధాలుండటంతో తెలుగులో క్షీణించు అన్న పదాన్ని డిస్ప్లే బోర్డులో పెట్టేశారు. స్పెషల్ అంటే ప్రత్యేక అన్న పదాన్ని జోడించారు. తెలుగులోకి బెంగాలీ పదాలు.. ♦ ఇది స్టేషన్‌లోనికి వెళ్లే ప్లాట్‌ఫామ్ నెం.10 వైపు ప్రధాన మార్గం. ఎదురుగా భారీ ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసి రైళ్ల వివరాలు ప్రద ర్శిస్తారు. అందులో నాగర్సోల్–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు రావటంలో ఆలస్యం జరుగుతోందని పేర్కొంటూ దాని వేళలను మార్చారు. ఆ విష యం ప్రయాణికులకు తెలిపేందుకు డిస్ప్లే బోర్డు లో ఆ వివరాలు ఉంచారు. ఇంగ్లీష్‌లో ఆ రైలు పేరు ఎదురుగా రీషెడ్యూల్ అని రాసి తర్వాత కొత్త సమయాన్ని ఉంచారు. హిందీలో పరివర్తిత్ సమయ్ అని పేర్కొన్నారు. కానీ తెలుగులో ఆ ఎక్స్‌ప్రెస్ పేరు ఎదురుగా బెంగాలీ భాష పదాన్ని ఉంచారు. తెలుగుకు, బెంగాలీకి తేడా తెలియని సిబ్బంది నిర్వాకమిది. ఇంగ్లీష్, హిందీ తెలియని తెలుగు ప్రయాణికులకు ఈ వ్యవహారం మతిపోగొడుతోంది. అర్ధం కాని తికమక వ్యవహారంతో వారికి రైళ్ల సమాచారం సరిగా చేరటం లేదు. ప్రైవేటు సిబ్బంది నిర్వాకం రైళ్ల వివరాలను వాయిస్ అనౌన్స్మెంట్ ద్వారా తెలపటం, ఎల్రక్టానిక్ డిస్ప్లే బోర్డుల ద్వారా తెలిపే పనిని రైల్లే టెండర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. ఆ బాధ్యత చూసే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ గందరగోళం నెలకొంది. సాంకేతికంగా ఏదైనా తప్పు జరిగితే వెంటనే గుర్తించాల్సిన రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ తికమక తెలుగు సమస్య ఇప్పటివరకు పరిష్కారమవ్వలేదు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ దుకాణంలో భారీగా మంటలు చెలరేగాయి. షాట్ సర్కిట్తో మంటలు అంటుకొని దుకాణం నుంచి పెద్ద ఎత్తున పొగ వ్యాపిస్తోంది. సమీప షాప్‌లకు మంటలు విస్తరిస్తున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడుఫైర్ ఇంజిన్స్‌తో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. కాగా సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాళికా బజార్‌లోగల ధమాకా సేల్ రెడీమేడ్ బట్టల షాప్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీని చుట్టుపక్కలు పలు షాపులతోపాటు లాడ్జీలు కూడా ఉన్నాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి తలసాని సికింద్రాబాద్‌లోని బట్టల దుకాణంలో జరిగిన అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని మంత్రి తలసాని పరిశీలించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అగ్నిమాద ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు. సాయంత్రం కల్లా వివరాలన్నీ వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే అగ్ని ప్రమాదాలకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.. చదవండి: రైళ్లలో అరకొరగా ఆన్‌బోర్డు సేవలు -
సికింద్రాబాద్ చేరుకున్న ఫలక్‌నుమా.. ప్రయాణీకులు చెబుతున్నది ఇదే..
సాక్షి, సికింద్రాబాద్: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ చేరుకుంది. ప్లాట్ఫ్లామ్-1పైకి ఫలక్‌నుమా రైలు చేరుకుంది. అగ్నిప్రమాదం అనంతరం.. 11 బోగీలతో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌కు చేరుకుంది. అనంతరం, రైల్వే అధికారులు ప్రయాణీకులు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణీకులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ఛార్జింగ్ పాయింట్ దగ్గర సిగరెట్ తాగడం వల్లే ప్రమాదం జరిగింది. అతి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. రైలులో సిగరెట్లను స్నాక్స్ అమ్ముతున్నట్టుగా అమ్ముతున్నా టీటీ సహా ఎవరూ పట్టించుకోలేదు. సిగరెట్లు, గుట్కాలను రైలు అమ్ముతున్నారు. ఎవరో చైన్ లాగడంతో రైలు ఆగింది. ముందుగా ఎస్4 బోగీలో మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో రైలు నుంచి పరుగులు తీశాం. మా లగేజీ మొత్తం కాలిబూడిదైపోయింది. వస్తువులు, బ్యాగులు, డబ్బులన్నీ కాలిపోయాయి. పగలు ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అదే రాత్రి సమయంలో అయితే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదన్నారు. ఇదిలా ఉండగా.. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఒక బోగిలో మంటలు వ్యాపించిన విషయాన్ని గమనించిన ఓ ప్రయాణీకుడు వెంటనే చైన్ లాగడంతో రైలు ఆగింది. దీంతో, ఆ బోగిలో ఉన్న ప్రయాణికులు వెంటనే కిందకు దిగారు. మిగతా బోగీల ప్రయాణికులను సైతం కిందకు దింపారు. చూస్తుండగానే మంటలు పక్క బోగీలకు అంటుకున్నాయి. చైన్ లాగకుండా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే భయమేస్తుంది అంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, చైన్‌లాగిన వ్యక్తి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మంటలు అంటుకున్నపుడు భయపడి ఆందోళనకు గురయ్యాడో ఏమో మొత్తం మీద అతన్ని రైల్వే సిబ్బంది ఆసుత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చైన్ లాగిన వ్యక్తిది శ్రీకాకుళం జిల్లా పలాస అని తెలుస్తున్నది. ఇది కూడా చదవండి: ఫలక్‌నుమా రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు -
ఎప్పుడూ రద్దీనే.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కి ఆ పేరెలా వచ్చిందంటే..
అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ Falaknuma Express ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఎవరికీ ఏం కాకపోవడంతో అధికారులూ ఊపిరి పీల్చుకున్నారు. జరిగింది ప్రమాదమా? లేదంటే కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో రైలు నేపథ్యం గురించీ కొందరు గూగుల్ తల్లిని ఆరాలు తీస్తున్నారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు Falaknuma Express ఆ పేరు హైదరాబాద్ నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్ పేరు మీద నుంచే వచ్చింది. ఫలక్‌నుమా అనేది పర్షియా పదం. దాని అర్థం గగన ప్రతిబింబం లేదా స్వర్గ ప్రతిబింబం అని. 🚆 ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే ఆధీనంలో నడిచే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. 🚆 1993 అక్టోబర్ 15వ తేదీన ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తొలి సర్వీస్ పట్టాలెక్కింది. 🚆హౌరా జంక్షన్ నుంచి ఉదయం ప్రారంభమయ్యే ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్‌కు చేరుకుంటుంది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ప్రారంభమై.. మరుసటిరోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో చేరుకుంటుంది. 🚆 నిత్యం నడిచే ఈ రైలు.. 1,544 కిలోమీటర్లు (959 మైళ్ల) ప్రయాణిస్తుంది. 🚆 సగటు వేగం.. గంటకు 60కిలోమీటర్లు. గరిష్ట వేగం 110 కిలోమీటర్లుగా ఉంటుంది. 12703 హౌరా టు సికింద్రాబాద్, అలాగే 12704 సికింద్రాబాద్-హౌరా రూట్లోనే ఇదే సగటు వేగంగా.. దాదాపు 26 గంటలకు తన ట్రిప్ ముగిస్తుంది. 🚆 నిత్యం కిక్కిరిసిపోయే ప్రయాణికులతో తీవ్రరద్దీ మధ్య ఈ రైలు పరుగులు పెడుతుంది. అందుకు ప్రధాన కారణం.. తక్కువ స్టేషన్లలో ఈ రైలు ఆగడం. 🚆 సికింద్రాబాద్-హౌరా మధ్యలో 24 స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. ఏసీ ఫస్ట్‌క్లాస్‌తో పాటు ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ అన్రిజర్వ్డ్ కోచ్‌లు ఉంటాయి. క్యాటరింగ్ సౌకర్యమూ ఉంది. 🚆 రైలు సాధారణంగా 24 ప్రామాణిక ICF కోచ్‌లను కలిగి ఉంటుంది. 🚆 నల్లగొండ, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, విశాఖపట్నం, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్ జంక్షన్, భద్రక్, బాలాసోర్(తాజాగా ప్రమాదం జరిగింది ఈ పరిధిలోనే), ఖరగ్‌పూర్ జంక్షన్, హౌరా.. ఇలా ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. 🚆గతంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్(సికింద్రాబాద్-తిరుపతి) రేక్స్(కోచ్‌లను) మార్చుకునేది. ప్రస్తుతం 17063/17064 అజంతా ఎక్స్‌ప్రెస్(సికింద్రాబాద్-మన్మాడ్(మహారాష్ట్ర) రైలుతో పంచుకుంటోంది. 🚆శతాబ్ధి, రాజధాని, దురంతో సూపర్‌ఫాస్ట్ రైళ్ల మాదిరి ఈ రైలును శుభ్రంగా మెయింటెన్ చేస్తుంది భారతీయ రైల్వేస్. అందుకే ప్రయాణికులు ఈ రూట్లో ఈ రైలుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. 🚆🔥 అయితే.. గత కొంతకాలంగా ఈ రైలు నిర్వహణపై విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడి సికింద్రాబాద్ చేరుకున్న ప్రయాణికులు కొందరు.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో సిగరెట్లు, గుట్కాలు అమ్ముతున్నారంటూ ఆరోపించడం గమనార్హం. ఇదీ చదవండి: ఫలక్‌నుమా ప్రమాదం.. రాత్రిపూట జరిగి ఉంటేనా? -
కృష్ణవేణి దొరికింది.. చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఈడబ్ల్యూఎస్ కాలనీకి చెందిన రాజేశ్వరీ, భరత్ దంపతుల కుమార్తె కృష్ణవేణి (4) కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బుధవారం రాత్రి చాక్లెట్ కోసం దుకాణానికి వెళ్లిన చిన్నారి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లితండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. స్థానిక యువకులు అదే ప్రాంతంలోని ఓ సినిమా థియేటర్లో పనిచేస్తున్న మతి స్థిమితం లేని వ్యక్తి సురేష్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సురేష్, చిన్నారి కృష్ణవేణి ఫొటోలను అన్ని పీఎస్‌లు, చైల్డ్వెల్ఫేర్ సంస్థలు, రైల్వే పోలీసులకు పంపారు. మల్కాజ్గిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేశ్‌రెడ్డి, స్థానిక సీఐ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా సురేష్ కృష్ణవేణిని తీసుకెళుతున్నట్లు గుర్తించారు. ఘట్కేసర్ నుంచి గూడ్స్ రైలులో ఖాజీపేట్ వెళ్లిన సురేష్ ఏమి చేయాలో తెలియక మరో రైలెక్కి తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అప్పటికే సమాచారం అందుకున్న రైల్వే రక్షణ పోలీసులు, చైల్డ్ గైడెన్స్ సెంటర్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని చిన్నారిని తమ రక్షణలోకి తీసుకున్నారు. ఘట్కేసర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చిన్నారి ఫొటోను తల్లితండ్రులకు పంపించి సరిచూసుకున్నారు. దీంతో సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్స్ అశోక్ సికింద్రాబాద్ వెళ్లి చిన్నారిని తీసుకు వచ్చారు. అనంతరం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ స్వయంగా చిన్నారిని తల్లితండ్రులకు అప్పగించారు. ఘాట్ కేసర్ కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. కిడ్నాపర్ నుంచి చిన్నారిని పోలీసులు రక్షించారు. సీపీ ఫుటేజ్ ఆధారంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిందితుడు సురేష్, చిన్నారిని గుర్తించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో బుధవారం రాత్రి నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. మేడ్చల్‌లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటూ చిన్నారి కనిపించికుండా పోయింది. బాలిక కృష్ణవేణి రాత్రి షాప్‌కు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఎంత వెతికినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించి, కిడ్నాపర్ నుంచి పాపను కాపాడారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు చిన్నారిని సురక్షితంగా కాపాడారు. చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు! -
విశాఖలో అదృశ్యం.. సికింద్రాబాద్‌లో ప్రత్యక్ష్యం.. పానీపూరి అమ్మేందుకు
సాక్షి, విశాఖపట్నం: గాజువాక శ్రీచైతన్య కళాశాలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభించింది. విశాఖలో కనిపించకుండా పోయిన ముగ్గురు విద్యార్థులు పవన్, దిలిప్, బాలీలను పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గుర్తించారు. వీరు ముగ్గురు చదవుకోవడం ఇష్టం లేక హైదరాబాద్ల్ పానీపూరి అమ్ముకొని జీవించేందుకు నగరానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కాగా గాజువాక శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సవం చదువుతున్న పవన్, దిలీప్, బాబీ ముగ్గురు విద్యార్థులు ఈనెల 24న అదృశ్యమయ్యారు. కాలేజ్‌కు అనిచెప్పి బయల్దేరి అని చెప్పి బయల్దేరి మళ్లీ ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి బుధవారం ముగ్గురిని సికింద్రాబాద్ స్టేషన్లో క్షేమంగా గుర్తించారు. విద్యార్థులను తమ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. -
Secunderabad: పలు రైళ్లు రద్దు.. వివరాలివే!
సాక్షి, హైదరాబాద్: నిర్వహణపరమైన కారణాలు, ఒడిశాలో రైలు ప్రమాద ఘటన దృష్ట్యా ఈ నెల 7 నుంచి 13 వరకు పలు రైళ్లను రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ–నిజామాబాద్ (07596), నిజామాబాద్–కాచిగూడ (07593), నాందేడ్–నిజామాబాద్ (07854), నిజామాబాద్–నాదేడ్ (07853) రైళ్లను ఈ నెల 7 నుంచి 13 వరకు రద్దుచేసినట్టు పేర్కొన్నారు. కాచిగూడ–షాలిమార్–వాస్కోడిగామా (17603/18047), షాలిమార్–హైదరాబాద్ (18045/18046) రైళ్లు ఈ నెల 7న రద్దు కానున్నాయి. వాస్కోడిగామా–షాలిమార్–కాచిగూడ (18048/17604) రైలు 9వ రద్దు కానుంది. దౌండ్–నిజామాబాద్ (11409), నిజామాబాద్–పంఢర్‌పూర్ (01413) రైళ్లను ముద్ఖేడ్–నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దుచేశారు. ప్రత్యేక రైళ్ల పొడిగింపు వేసవి రద్దీ దృష్ట్యా కాచిగూడ–తిరుపతి (070 61 / 07062), కాచిగూడ–కాకినాడ (07417 / 07418), కాచిగూడ–నర్సాపూర్ (07653 / 07654) ప్రత్యేక రైళ్లను ఈ నెల 30 వరకు పొడిగించనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. బెంగళూరు ఎక్స్‌ప్రెస్ చక్రాలకు మంటలు బాలానగర్: కాచిగూడ నుంచి బెంగళూరు వెళ్లే బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ స్టేషన్లో 16 నిమిషాలు ఆగింది. 8.26 గంటలకు బాలానగర్‌కు వచ్చిన రైలు 8.43 గంటలకు తిరిగి బయలుదేరింది. రైల్లో ఎక్కువ మోతాదులో స్పార్క్స్ (మంటలు) రావడంతో ముందు జాగ్రత్తగా రైలును బాలానగర్‌లో నిలిపినట్లు సమాచారం. ట్రైన్ బ్రేకులు వేసిన సమయంలో వీల్స్‌లో స్పార్క్స్ వచ్చాయని, సాధారణంగా చిన్నపాటి స్పార్క్స్ వస్తుంటాయన్నారు. లోకో పైలెట్ 16 నిమిషాలపాటు వాటిని సరిచేసుకుని బయలుదేరి వెళ్లారు. దీంతో కాచిగూడ టు కర్నూలు టౌన్ ట్రైన్‌కు సైతం అరగంట అంతరాయం కలిగినట్లు ప్రయాణికులు చెప్పారు. దీనికితోడు బాలానగర్ రైల్వేస్టేషన్లో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో స్టేషన్లో అంధకారం నెలకొంది. చదవండి: Telangana: కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం తీపికబురు -
పర్యాటకానికి తలమానికం భారత్ గౌరవ్ రైళ్లు
అడ్డగుట్ట (హైదరాబాద్): భారత్ గౌరవ్ రైళ్లు దేశంలో పర్యాటక రంగానికి తలమానికంగా నిలుస్తున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని 10వ ప్లాట్‌ఫాంలో ‘గంగా పుష్కరాల యాత్ర’(పూరీ, కాశీ, అయోధ్య) భారత్ గౌరవ్ ప ర్యాటక రైలును దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జై న్, సికింద్రాబాద్ డీఆర్ఎం అభయ్ గుప్తా, ఐఆర్సీటీసీ జీజీ ఎం రాజ్‌కుమార్‌లతో కలసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, చారిత్రక ప్రదేశాలను, పుణ్య క్షేత్రాలను యా త్రికులు దర్శించడానికి రైల్వే శాఖ 3వ భారత్ గౌరవ్ రైలును ప్రారంభించిందన్నారు. శనివారం బయలుదేరిన భారత్ గౌ రవ్ రైలు కోణార్క సూర్య దేవాలయం, పూరీ, కాశీ, అయో ధ్య తదితర పుణ్యక్షేత్రాల సందర్శన తర్వాత మే 7న తిరిగి సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఈ మార్గంలోని వివిధ పుణ్య క్షేత్రాలకు భక్తులను తీసుకెళ్లి అక్కడ స్థానికంగా అవసరమయ్యే రవాణా, భోజన, వసతి సౌకర్యాలన్నీ భారతీయ రైల్వేనే ఏర్పాటు చేస్తుందన్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలను వెంట తీసుకొని ఈ పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లాలంటే ప్రజలకు భారీ ఖర్చు, ప్రయాసలతో కూడిన పని కాబట్టి మోదీ ప్రభుత్వం గౌరవ్ రైళ్లకు శ్రీకారం చుట్టిందన్నారు. కాగా, జూన్ 10న సికింద్రాబాద్ నుంచి జమ్మూలో ని మాతా వైష్ణోదేవి, హరిద్వార్, రిషికేశ్ తదితర ప్రాంతాల సందర్శనకు మరో భారత్ గౌరవ్ రైలును ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ యాత్రికులకు ఇబ్బందులు లే కుండా సాంస్కృతికంగా ప్రముఖమైన ప్రదేశాలను సందర్శించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తున్నామన్నారు. యాత్రికులకు అల్పాహార ప్యాకెట్లు అందజేసిన మంత్రి భారత్ గౌరవ్ రైలు యాత్రలో భాగంగా యాత్రికులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అల్పాహార ప్యాకెట్లను అందజేశారు. అనంతరం వారితో కొద్దిసేపు ముచ్చటించారు. భారత్ గౌరవ్ రైలు ద్వారా పుణ్యక్షేత్రాల సందర్శన సులభం అయిందంటూ యాత్రికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
రైల్వేబడ్జెట్‌లో తెలంగాణకు రూ.4,400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఈసారి రైల్వేబడ్జెట్‌లో రూ.4,400 కోట్లు కేటాయించామని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ప్రపంచ స్థాయి స్టేషన్‌గా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ, ఏపీలకు రెండు వందే భారత్ రైళ్లను అందించామని చెప్పారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో అశ్వనీ వైష్ణవ్ మాట్లాడారు. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్.. సబ్కా ప్రయాస్’పేరుతో ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైల్వేల అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శ్రీవెంకటేశ్వర స్వామి సులభతర దర్శనం కోసమే వందేభారత్ రైలును ప్రారంభించినట్లు చెప్పారు. తెలంగాణను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు: కిషన్‌రెడ్డి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అని.. మంచి మౌలిక వసతులు కల్పించేందుకే మోదీ హైదరాబాద్‌కు వచ్చారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు. తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశామన్నారు. ఇప్పటివరకు దేశంలో 14 వందే భారత్ రైళ్లను ప్రారంభించామని, అందులో రెండింటిని తెలంగాణకు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారని పేర్కొన్నారు. రూ.714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తుండటం గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొంతకాలం ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఆగిపోయిందని.. బీజేపీ ఎంపీలు వెళ్లి ప్రధానికి విజ్ఞప్తి చేయగా.. కేంద్రం చొరవ తీసుకుని మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్‌ను, 13 కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభిస్తోందని చెప్పారు. తెలంగాణను అన్నిరకాలుగా ఆదుకుంటున్న ప్రధాని మోదీని రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. -
కుటుంబ పాలనకు విముక్తి
..వణికిపోతున్నారు! బంధుప్రీతిని, అవినీతిని పెంచి పోషిస్తున్న వారికి దేశ ప్రయోజనాలు, సమాజ శ్రేయస్సుతో సంబంధం లేదు. పైగా నిజాయతీగా పనిచేసే వారికి సమస్యలు సృష్టిస్తున్నారు. కుటుంబ పాలకులకు మూడు అంశాలు ముఖ్యం. మొదటిది వారి కుటుంబాన్ని ప్రశంసిస్తూనే ఉండాలి, రెండోది అవినీతి సొమ్ము ఆ కుటుంబానికి వస్తూనే ఉండాలి, మూడోది పేదలకు పంపే డబ్బు అవినీతిపరుల చేతికి అందుతూనే ఉండాలి. ఇలా అవినీతికి అసలు మూలమైన కుటుంబ పాలనపై నేడు మోదీ దాడి మొదలుపెట్టాడు. అందుకే వాళ్లు వణికిపోతున్నారు, ఏ పని చేసినా కోపంతోనే చేస్తున్నారు. – ప్రధాని మోదీ సాక్షి, హైదరాబాద్: అవినీతి, కుటుంబ పాలన రెండూ వేర్వేరు కాదని, బంధుప్రీతి ఉన్నప్పుడు అవినీతి వృద్ధి చెందడం మొదలవుతుందని.. దీని నుంచి విముక్తి కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కుటుంబ, వంశవాద పార్టీలు అన్నింటినీ తమ నియంత్రణలోనే ఉంచుకుని, నడిపించాలని అనుకుంటున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేక కేంద్ర ప్రాజెక్టుల పనుల్లో జాప్యం జరుగుతోందని.. దీనితో తెలంగాణ ప్రజలే నష్టపోతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో వివిధ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోపాటు జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రసంగించారు. ఎక్కడా నేరుగా బీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పేర్లను ప్రస్తావించకుండా.. పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. ‘భారత్‌మాతాకీ జై’అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. ‘ప్రియమైన సోదర, సోదరీమణులారా.. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు’అని తెలుగులో మొదటి మాటలు చెప్పారు. తర్వాత హిందీలో కొనసాగించారు. ప్రధాని మోదీ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. శనివారం పరేడ్ గ్రౌండ్స్‌లోని బహిరంగ సభా వేదిక నుంచి వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి. ‘‘దేశం కొందరి తృప్తి (తుష్టికరణ్) నుంచి అందరి సంతృప్తి (సంతుష్టికరణ్) వైపు మళ్లినప్పుడే నిజమైన సామాజిక న్యాయం పుడుతుంది. తెలంగాణ సహా యావత్ దేశం అందరి అభివృద్ధి బాటలో నడవాలి. ఆజాదీకా అమృత్‌కాల్‌లో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి తెలంగాణ త్వరితగతిన అభివృద్ధి చెందడం చాలా ముఖ్యం. అవినీతిపై పోరాటానికి సహకరించండి కుటుంబ పాలన, బంధుప్రీతి ఉన్నప్పుడు అవినీతి వృద్ధి చెందడం మొదలవుతుంది. తండ్రి, కొడుకు, కూతురు అధికారంలో ఉంటారు. ప్రతి ప్రాజెక్టు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిలో వారికి కుటుంబ స్వార్థమే ధ్యేయం. అన్నీ తమ నియంత్రణలోనే ఉంచుకోవాలని భావిస్తుంటారు. ఎవరైనా వారి నియంత్రణను సవాలు చేసినప్పుడు తీవ్రంగా ద్వేషిస్తారు. ఇలాంటి అక్రమాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలా వద్దా? మేం చేస్తున్న అవినీతి వ్యతిరేక పోరాటానికి తెలంగాణ ప్రజలు సహకరించాలి. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో వచ్చే 25 ఏళ్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉమ్మడిగా తెలంగాణ వికాసాన్ని పరిపూర్ణం చేద్దాం. మా అభివృద్ధిని చూసి ఆందోళన 2014లో కేంద్ర ప్రభుత్వం వారసత్వ రాజకీయ సంకెళ్ల నుంచి విముక్తి పొందిన ఫలితాన్ని దేశం కళ్లెదుట కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సాధిస్తున్న పురోగతిని చూసి కొంత మంది చాలా ఆందోళన చెందుతున్నారు. బంధుప్రీతి, అవినీతిని పెంచిపోషిస్తున్న వారికి ప్రతి ప్రాజెక్టులోనూ తమ కుటుంబ ప్రయోజనాలే ప్రధానమన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలి. భాగ్యలక్ష్మి ఆలయ నగరం నుంచి తిరుపతి వెంకన్నకు.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వేగాన్ని పెంచే అవకాశం నాకు వచ్చినందుకు ప్రజలకు కతజ్ఞతలు చెప్తున్నాను. రైల్వేలు, రోడ్డు కనెక్టివిటీ, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి రూ.11,300 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను చేపట్టాం. భక్తి, విశ్వాసం, ఆధునికత, టెక్నాలజీ, పర్యాటకాన్ని అనుసంధానిస్తూ భాగ్యలక్ష్మి దేవాలయ నగరం (హైదరాబాద్)ను వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతితో కలిపే వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించాం. వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. 2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంతోపాటే తెలంగాణ రాష్ట్రం ఉనికి మొదలైంది. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేయాల్సిన బాధ్యత కేంద్రంలోని ప్రభుత్వానిదే. తొమ్మిదేళ్లుగా కేంద్రం రూపొందించిన అభివృద్ధి నమూనాను తెలంగాణ సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారించాం. గత తొమ్మిదేళ్లలో 70 కిలోమీటర్ల మేర మెట్రోరైలు నిర్మించుకున్నాం., ఎంఎంటీఎస్ విస్తరణతో అభివృద్ధి వైపు అడుగులు వేశాం. కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులతో హైదరాబాద్, సికింద్రాబాద్, సమీప జిల్లాల్లోని లక్షలమంది పౌరులకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు కొత్త వ్యాపార కేంద్రాలు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా తెలంగాణకు రూ.600 కోట్లు కేటాయించాం. కోవిడ్, యుద్ధంతో ఆర్థిక వ్యవస్థలు క్షీణించినా.. కరోనా మహమ్మారి, రెండు దేశాల యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనూహ్యంగా క్షీణించాయి. అయినా ఆధునిక మౌలిక సదుపాయాల కోసం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టిన కొన్నిదేశాల్లో భారతదేశం ఒకటి. ఈసారి బడ్జెట్లో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఏకంగా రూ.10 లక్షల కోట్లు కేటాయించాం. రాష్ట్రంలో ఈ మూడింటికీ తోడ్పాటు తెలంగాణలో పరిశ్రమలు, వ్యవసాయం రెండింటి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. నేడు శంకుస్థాపన చేసిన/ప్రారంభించిన ప్రాజెక్టులు సులభ ప్రయాణం (ఈజ్ ఆఫ్ ట్రావెల్), సులభ జీవనం (ఈజ్ ఆఫ్ లివింగ్), సులభ వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)ను పెంచుతాయి. ఇప్పటికే రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాం. 11 లక్షలకుపైగా పేద కుటుంబాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్నాం. రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. తెలంగాణలో తొలిసారి కోటి కుటుంబాలకు జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు తెరిచాం. రెండున్నర లక్షల మంది చిరు వ్యాపారులకు గ్యారెంటీ లేకుండా ముద్ర రుణాలు అందాయి. 40 లక్షల మందికిపైగా చిన్న రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద సుమారు రూ.9 వేల కోట్లు అందాయి..’’అని మోదీ పేర్కొన్నారు. తెలంగాణకు రైల్వేబడ్జెట్ 17 రెట్లు పెంపు గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు రైల్వే బడ్జెట్ పదిహేడు రెట్లు పెరిగింది. కొత్త రైలు మార్గాలు, డబ్లింగ్, విద్యుదీకరణ వంటి పనులు రికార్డు సమయంలో జరిగాయి. సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ లైన్ విద్యుదీకరణ ఇందుకు ప్రధాన ఉదాహరణ. దీనితో హైదరాబాద్– బెంగళూరు మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరిస్తున్నాం. రాష్ట్రంలో హైవే నెట్‌వర్క్‌ను కూడా శరవేగంగా అభివృద్ధి చేస్తున్నాం. రూ.2,300 కోట్లతో నిర్మిస్తున్న అక్కల్కోట్–కర్నూల్ సెక్షన్.. రూ.1,300 కోట్లతో మహబూబ్‌నగర్–చించోలి సెక్షన్, రూ.900 కోట్లతో కల్వకుర్తి–కొల్లాపూర్ సెక్షన్, రూ.2,700 కోట్లతో ఖమ్మం–దేవరపల్లి సెక్షన్ చేపడుతున్నాం. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు జాతీయ రహదారులు 2,500 కిలోమీటర్లలోపే ఉంటే.. ఇప్పుడు 5వేల కిలోమీటర్లకు పెరిగింది. ఇందుకోసం కేంద్రం రూ.35వేల కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్డు సహా రూ.60 వేల కోట్ల విలువైన హైవే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టులు, పనులివీ.. ► తిరుపతి– సికింద్రాబాద్ వందేభారత్ రైలుకు పచ్చజెండా.. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధికి శంకుస్థాపన ► 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసుల ప్రారంభోత్సవం ► సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ రైల్వేలైన్ డబ్లింగ్, విద్యుదీకరణ జాతికి అంకితం ► బీబీనగర్ ఎయిమ్స్ భవనానికి శంకుస్థాపన ► తెలంగాణ, ఏపీల పరిధిలో జాతీయ రహదారులు, అనుసంధాన రోడ్లకు శంకుస్థాపన -
వందే భారత్ రైలు ప్రత్యేకతలు
-
స్టూడెంట్స్ రియాక్షన్...! పీఎం మోదీతో స్టూడెంట్స్...
-
నేడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు మోదీ
-
సికింద్రాబాద్-తిరుపతి ‘వందే భారత్’ రైలు ప్రత్యేకతలు, టికెట్ ధరలివే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్లో శనివారం ఉదయం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య తొలి వందే భారత్ రైలు నడుస్తుండగా.. ఇది రెండోది కానుంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనుంది. మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు సేవలందిస్తుంది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే (20701) రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉదయం 6గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే, తిరుపతి - సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. తాజాగా ఈ మార్గంలో టికెట్ల ధరల వివరాలను ఐఆర్సీటీసీ వెల్లడించింది. సికింద్రాబాద్ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్ రూట్లలో టికెట్ల రేట్లలో స్వల్ప వ్యత్యాసం ఉంది. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు ► నిత్యం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఆరు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ►సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో 12 గంటల ప్రయాణం ►వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల ప్రయాణం ►దేశంలో ఇది 13వ వందే భారత్ ట్రైన్.. ఇందులో 8 కోచ్ లు 530 సీటింగ్ కెపాసిటీ. ►1 ఎగ్జిక్యూటివ్, 7 చైర్ కార్ కోచ్‌లు ►ప్రయాణికుల ఆదరణ దృష్ట్యా కోచ్‌లను పెంచే అవకాశం ►శనివారం ఉదయం 11.30 నుంచి 12.05 లోపు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం ►ఈనెల 9 నుంచి ఉదయం 6 గంటలకు ప్రయాణికులకు అందుబాటులో వందే భారత్ ట్రైన్ ►ఈ వందే భారత్ ట్రైన్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు ►సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1680, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3080 రూపాయలు ►తిరుపతి నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ ఛార్జీ 1625, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3030 రూపాయలు ►వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ రాకపోక సికింద్రాబాద్ నుంచి ఒక్కో స్టేషన్‌కు ఛార్జీలు ఇలా.. ఛైర్ కార్ ►సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.470 ►సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.865 ►సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.1075 ►సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.1270 ►సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.1680 ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ►సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.900 ►సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.1620 ►సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.2045 ►సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.2455, ►సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.3080 చదవండి: ప్రధాని పర్యటనకు కేసీఆర్ వస్తే సన్మానం చేస్తాం: బండి సంజయ్ -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భారీ భద్రత..
-
మోదీ సభలో కేసీఆర్‌కు 7 నిమిషాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ప్రధాని పాల్గొననున్నవి కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు కావడంతో ప్రోటోకాల్ ప్రకారం సీఎం, ఇతర ప్రముఖులకు హోదాల ప్రకారం ఆహ్వానించారు. ఈ మేరకు షెడ్యూల్లోనూ చేర్చారు. ఇందులోభాగంగా సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనే బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం ఏడు నిమిషాలు కేటాయించారు. ఇక ప్రధాని రాష్ట్ర పర్యటన కేవలం రెండు గంటల్లోనే ముగియనుంది. శనివారం ఉదయం 11.30కు హైదరాబాద్‌కు చేరుకోనున్న మోదీ.. 1.30 గంటల సమయంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. కేసీఆర్ హాజరవుతారా? కొంతకాలం నుంచి ప్రధాని మోదీ పాల్గొంటున్న ఏ ప్రభుత్వ, ఇతర కార్యక్రమాల్లోనూ సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. ఇంతకుముందు పలుమార్లు మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినా.. స్వాగతం పలకడానికి సీఎం వెళ్లలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులనే పంపారు. అయితే ఈ నెల 8న పరేడ్‌గ్రౌండ్స్ సభలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా షెడ్యూల్ విడుదల చేశారు. ఇందులో పరేడ్‌గ్రౌండ్స్ సభలో కేసీఆర్ ప్రసంగానికి ఏడు నిమిషాల సమయాన్ని కేటాయించారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాని కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా? లేక గతంలో లాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ మంత్రిని ప్రతినిధిగా పంపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. శనివారం మోదీ షెడ్యూల్ ఇదీ.. ► ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు రాక ► 11.45కు రోడ్డు మార్గాన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ప్రధాని.. ► 11.45 నుంచి 12 గంటల దాకా అక్కడే కార్యక్రమాలు. సికింద్రాబాద్–తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం ► మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకోనున్న మోదీ ► 12.20 నుంచి 12.30 గంటల వరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు ► 12.30 నుంచి 12.37 గంటల దాకా సీఎం కేసీఆర్ ప్రసంగం ► 12.37 నుంచి 12.50 గంటల వరకు ఎంఎంటీఎస్ ఫేజ్–2తోపాటు పలు రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ► మధ్యాహ్నం 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం ► 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్న ప్రధాని. ఎయిమ్స్ వసతులతో తెలంగాణకు లబ్ధి: ప్రధాని సాక్షి, న్యూఢిల్లీ: బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో మౌలిక సదుపాయాలు పెంపొందించడం వల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని సృష్టించే ప్రయత్నాలకు మరింత ఊపునిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 8న బీబీనగర్ ఎయిమ్స్‌లో నూతన అత్యాధునిక సౌకర్యాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయా చేసిన ట్వీట్‌కు.. ప్రధాని మోదీ గురువారం ఈ మేరకు రీట్వీట్ చేశారు. -
అనగనగా లష్కర్.. అదో రైల్వే సైరన్
స్వాతంత్య్రానికి పూర్వం సైనిక బలగాల స్థావరాలతో సికింద్రాబాద్ విరాజిల్లింది. జవాన్లకు స్థావరంగా ఉండడంతో ఈ ప్రాంతానికి లష్కర్ అని కూడా పేరు వచ్చింది. నిజాం పరిపాలనలో సికింద్రాబాద్ నగరంలోని రెజిమెంటల్ బజార్, బోట్స్ క్లబ్, ట్యాంక్‌బండ్, బేగంపేట్ ప్రాంతాలు సైనిక స్థావరాలకు కేంద్రాలుగా ఉండేవి. స్వాతంత్య్రానంతరం ఇక్కడి సైనిక స్థావరాలు శివారు ప్రాంతాలకు తరలి వెళ్లగా ఈ ప్రాంతం జనావాసాలు, వ్యాపార కేంద్రాలకు నిలయంగా మారింది. తొలుత ఒకే ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అందుబాటులో ఉండగా ప్రస్తుతం సికింద్రాబాద్ నగరం రైల్వేస్టేషన్ల సమాహారంగా మారింది. నేడు 21 రైల్వేస్టేషన్లకు నిలయంగా.. ► సికింద్రాబాద్ క్లాట్ టవర్ నుంచి చుట్టూ 10 కిలోమీటర్ల దూరంలో ఒకప్పుడు మొత్తంగా సైనిక స్థావరాలు కొలువుదీరి ఉండేవి. క్రమేణా సైనిక స్థావరాల స్థానంలో రైల్వేస్టేషన్లు వచ్చి చేరాయి. సికింద్రాబాద్ ప్రధాన రైల్వేస్టేషన్‌తో పాటు చుట్టుపక్కల 21 రైల్వేస్టేషన్లు ఏర్పాటయ్యాయి. ► సికింద్రాబాద్‌లోని ఏ రహదారి చూసినా సాధారణ, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్ల స్టేషన్లు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతంలో 2 సాధారణ, 13 మెట్రో, 6 ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అన్ని స్టేషన్ల నుంచి నడుస్తున్న వందలాది రైళ్లలో సగటున 3 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్టు అంచనా. స్టేషన్లు... వంతెనలు ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా 6 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. తార్నాక మొదలుకొని బేగంపేట, జూబ్లీబస్ స్టేషన్ నుంచి ముషీరాబాద్ వరకు 13 మెట్రో రైల్వేస్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ► సికింద్రాబాద్‌లో మెట్రో నిర్మాణాలు ఈ ప్రాంతానికి కొత్తరూపు తెచ్చాయి. ప్రయాణికులకు కనువిందు చేస్తున్నాయి. సికింద్రాబాద్ రేతీఫైల్ బస్‌స్టేషన్ సమీపంలో ఒలిఫెంటా వంతెన కిందినుంచి వాహనాలు, మీదినుంచి సుదూర ప్రాంతాల రైళ్ల రాకపోకలు ఉంటున్నాయి. ఈ వంతెన పై నుంచి మరింత ఎత్తైన మెట్రోరైలు వంతెనను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ వైఎంసీఏ కూడలిలో వాహనాల రాకపోకల కోసం ఫ్లై ఓవర్, సమాంతరంగా జింఖానా మెట్రోస్టే మెట్రో కారిడార్‌ను నిర్మించారు. రెండు సమాంతర వంతెనలు ఉండగానే ఫలక్‌నుమా–జేబీఎస్‌కు మెట్రోరైళ్లు రాకపోకల కోసం రెండు వంతెనల పై నుంచి మరో మెట్రో కారిడార్‌ను నిర్మించారు. కనువిందుగా రైళ్ల పరుగులు.. సికింద్రాబాద్ నగరంలో ఏ రహదారికి వెళ్లినా రైల్వేస్టేషన్లు, వంతెనలు, రైల్వేట్రాక్‌లు దర్శనమిస్తున్నాయి. ఇక్కడి వంతెనలపై మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్ల పరుగులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. మూడు రకాల రైళ్ల రాకపోకలకు ఈ ప్రాంతం నిలయంగా మారింది. సాధారణ, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు లెవల్‌క్రాసింగ్‌లు, వంతెలనపై తీస్తున్న పరుగులు సందర్శకులకు ముచ్చట గొలుపుతున్నాయి. రైల్వే కార్యాలయాల సముదాయం.. రైల్వేస్టేషన్లతో పాటు పలు రైల్వే కార్యాలయాలు సికింద్రాబాద్ నగరంలోనే నెలకొని ఉన్నాయి. రైల్‌నిలయం, సంచాలన్ భవన్, హైదరాబాద్ భవన్ పేరుతో ఏర్పాటు చేసిన ఇక్కడి భారీ భవన సముదాయాల్లో రైల్వేశాఖకు చెందిన పలు దక్షిణమధ్యరైల్వే కేంద్ర కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వర్క్‌షాపు, ప్రింటింగ్ ప్రెస్, రైల్వే ప్రదాన ఆసుపత్రి, జోనల్ ట్రైనింగ్ సెంటర్లు అన్నీ సికింద్రాబాద్ నగరంలోనే నెలకొని ఉండడం గమనార్హం. దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారుల నివాసాలు, ఉద్యోగుల క్వార్టర్లు సికింద్రాబాద్ ప్రాంతంలోనే ఉన్నాయి. రైల్వే కాలనీలు, కార్యాలయాలు లష్కర్లో నెలకొని ఉన్నందున వివిధ రాష్ట్రాలకు చెందిన అన్ని మతాల రైల్వే ఉద్యోగులు ఇక్కడ నివసిస్తుండటంతో సికింద్రాబాద్‌ను భిన్నత్వంలో ఏకత్వం కలిగిన నగరంగా పోల్చుతుండడం గమనార్హం. -
బాంబు బెదిరింపు కాల్ కలకలం
-
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కలకలం.. బాంబు బెదిరింపు కాల్..!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తి బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందని కాల్ చేశాడు. ఆగి ఉన్న రైలులో బాంబు ఉందని బెదిరింపు కాల్ చేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే, జీఆర్పీ పోలీసులు కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. -
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. కొత్త తేదీ ఇదే..
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల (ఫిబ్రవరి) 13న రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమా లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతోపాటు పరే డ్గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాల యం (పీఎంవో) నుంచి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి కార్యాలయానికి సమాచారం అందినట్టు తెలిసింది. 19నాటి పర్యటన వాయిదాతో.. వాస్తవానికి ప్రధాని మోదీ ఈ నెల 19నే రాష్ట్రంలో పర్యటించి.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను, సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆ పర్యటన వాయిదా పడింది. దీంతో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 15న ఢిల్లీ నుంచి వర్చువల్‌గా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో తిరిగి రాష్ట్ర పర్యటనను పీఎం కార్యాలయం ఖరారు చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇంకా దక్షిణ మధ్య రైల్వేకు అధికారికంగా సమాచారం అందలేదని తెలిసింది. సభ ప్రయత్నాల్లో బీజేపీ! పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ సభపై సమాచారం అందిన రాష్ట్ర బీజేపీ నేతలు ఏర్పాట్లలో పడినట్టు తెలిసింది. హైదరాబాద్, పొరుగున ఉన్న జిల్లాలతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి జన సమీకరణతో మోదీ సభను విజయవంతం చేయాలని వారు భావిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి వివిధ రూపాల్లో కేటాయింపులు పెంచుతారని.. వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం ఇస్తున్న నిధులను మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కేంద్రం సరిగా నిధులు ఇవ్వడం లేదంటూ సీఎం కేసీఆర్, మిగతా 8వ పేజీలో u మంత్రులు, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే అవకాశం ఉందని అంటున్నారు. మోదీ పాల్గొనే కార్యక్రమాలివీ! ఇంతకుముందే ఖరారైన పర్యటన ప్రకారం ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. అందులో వందేభారత్ రైలును ఇప్పటికే ప్రారంభించినందున.. మిగతా కార్యక్రమాల షెడ్యూల్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మొత్తంగా రూ.7,076 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపనున్నట్టు సమాచారం. – రూ.1,410 కోట్లతో సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ మధ్య నిర్మించిన డబుల్ లైన్ జాతికి అంకితం – ఐఐటీ హైదరాబాద్‌లో రూ. 2,597 కోట్లతో చేపట్టిన వివిధ నిర్మాణాలను (అడ్మిన్‌బ్లాక్, అకడమిక్ బిల్డింగ్స్, హాస్టళ్లు, క్వార్టర్స్, టెక్నాలజీ రిసెర్చ్ పార్కు, టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్కు, రిసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్, కన్వెన్షన్ సెంటర్, నాలెడ్జ్ సెంటర్, గెస్ట్‌హౌస్, లెక్చర్ హాల్ కాంప్లెక్స్, క్యాంపస్ స్కూల్, లేబోరేటరీ, హెల్త్‌కేర్ ఫెసిలిటీ) జాతికి అంకితం. – రూ.699 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (ఆధునీకరణ) అభివృద్ధి పనులకు భూమిపూజ. – రూ.521 కోట్ల వ్యయంతో కాజీపేటలో నిర్మించనున్న రైల్వే పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌కు శంకుస్థాపన – రూ.1,336 కోట్లతో చేపట్టిన మహబూబ్‌నగర్–చించోలి 2/4 లేన్ల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన – రూ.513 కోట్ల వ్యయంతో నిజాంపేట–నారాయణఖేడ్–బీదర్ సెక్షన్ జాతీయ రహదారి విస్తరణ పనులకు భూమిపూజ – తెలంగాణకు మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు, శంషాబాద్ (ఉందానగర్) వరకు ఎంఎంటీఎస్ సేవలు, మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ సేవల పొడిగింపు, రైళ్ల సంఖ్య పెంపు, కాచిగూడ నుంచి విశాఖపట్నం ట్రైన్ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు వంటి ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. చదవండి: లభించని ఆ ముగ్గురి ఆచూకీ.. డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ -
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు
సికింద్రాబాద్: తిరుపతి నుంచి సికింద్రాబాద్ మీదుగా ఆదిలాబాద్ వెళ్లాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ రూట్లో బాంబు ఉందని ఓ యువకుడు చేసిన ఆకతాయి ఫోన్ సందేశం శుక్రవారం రాత్రి కలకలం సృష్టించింది. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉందని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాక అది పేలుతుందని ఆకతాయి పంపిన మెసేజ్‌తో ఇటు జీఆర్పీ, అటు ఆర్పీఎఫ్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు రాత్రి 8.45 గంటలకు చేరుకోవాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు గంట ఆలస్యంగా నడుస్తుంది. 8 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి రాచకొండ పోలీసులకు ఫోన్ చేసి బాంబు ఉన్నట్లు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికే మౌలాలి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న రైలును అదే స్టేషన్లో నిలిపి సోదాలు నిర్వహించారు. అదే సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న బాంబ్ స్వా్వడ్ బృందాలు తనిఖీల అనంతరం ఆకతాయి పనిగా నిర్థారించారు. రెండు గంటలు ఆలస్యంగా కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఆ మీదట ఆదిలాబాద్‌కు బయలుదేరి వెళ్లింది. రైలులో ప్రయాణిస్తూనే .. మహబూబాబాద్‌కు చెందిన కిరణ్‌కుమార్ అనే యువకుడు అదే రైలులో ప్రయాణిస్తూ పోలీసులకు సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్ చేశాడు. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో అరాచక శక్తులు ప్రయాణిస్తున్నాయని వారు రైలును పేల్చే ప్రయత్నం చేస్తున్నారని మెసేజ్‌లో పేర్కొన్నాడు. ఒక వైపు తనిఖీలు చేస్తూనే మరోవైపు మెస్సేజ్ అందిన ఫోన్ నెంబర్ సిగ్నల్ ఆధారంగా సందేశం పంపిన వ్యక్తి అదే రైలులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ పరీక్షకు హాజరై సెలక్ట్ కాలేదన్న ఆక్రోశంతో మెసేజ్ చేసినట్లే నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ఏపీ, తెలంగాణ మధ్య ఇక వేగవంతమైన ప్రయాణం: ప్రధాని మోదీ
-
తెలుగు ప్రజలకు వందే భారత్ పండుగ కానుక: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఎనిమిదో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ.. పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ కానుకే ఈ వందే భారత్ రైలు. ఏపీ, తెలంగాణ మధ్య ఇక వేగవంతమైన ప్రయాణం కొనసాగుతుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతా ఉత్సాహం నెలకొంది. వందే భారత్‌తో విలువైన సమయం ఆదా అవుతుంది. మారుతున్న దేశ భవిష్యత్తులకు మందే భారత్ రైలు ఒక ఉదాహరణ. దేశీయంగా తయారైన వందే భారత్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. భద్రతతో పాటుగా రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది అని అన్నారు. ఆగి ఆగి నడిచే రైళ్ల నుంచి వేగంగా పరిగెత్తే రైళ్ళను తీసుకువచ్చాం. వందే భారత్ ఆత్మ నిర్భర్ భారత్‌కు ప్రతీక. 2023లో ప్రారంభించిన మొదటి రైలు ఇది. గడిచిన ఎనిమిదేళ్లలో రైల్వే వ్యవస్థను సౌకర్యవంతమైన ప్రయాణంగా మార్చాం. ఇప్పుడు రైల్లు ఆధునిక భారత్‌కు అద్దం పడుతున్నాయి. విస్టా డోమ్ రైలు, కిసాన్ రైలు, హెరిటేజ్ రైలు నడుపుతున్నాం. 24 పట్టణాలలో కొత్తగా మెట్రో రైల్లను ఏర్పాటు చేస్తున్నాము. తక్కువ సమయంలో 7 వందే భారత్ రైళ్లను ప్రారంభించాము. తెలంగాణలో గడిచిన ఎనిమిదేళ్లలో అద్భుతమైన పనులు చేశాము. రైల్వేల కోసం గతంలో 250 కోట్లు కూడా ఖర్చు చేసేవారు కాదు. ఇప్పుడు మేము వేల కోట్లకు ఖర్చు చేశాము అని అన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు తలసాని, మహమూద్ అలీ పాల్గొన్నారు. కాగా, వందే భారత్ రైలు.. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడువనున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి వందే భారత్ రైలు.. ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు పరిమిత స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. వందే భారత్ రైలు.. వరంగల్, విజయవాడ, విశాఖ, హైదరాబాద్‌ను అనుసంధానిస్తూ ప్రయాణం సాగిస్తుంది. -
ఎయిర్పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ఇవీ సదుపాయాలు..
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ హంగులను సంతరించుకుంటున్న నగరంలో మరో అద్భుతమైన కట్టడం ఆవిష్కృతం కానుంది. నిజాం కాలం నాటి చారిత్రక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రపంచస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలతో విమానాశ్రయం తరహాలో అందుబాటులోకి రానుంది. 1870లలో నిర్మించిన రైల్వే స్టేషన్ కళాత్మకతకు ఏ మాత్రం విఘాతం కలగకుండా దీని పునరభివృద్ధికి దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. వాస్తవానికి ఒకటిన్నర దశాబ్దం క్రితమే సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో పునరభివృద్ధికి నిర్మాణ సంస్థలను ఆహా్వనించినప్పటికీ ప్రైవేట్ సంస్థలు నిరాసక్తత వ్యక్తం చేశాయి. దీంతో దక్షిణమధ్య రైల్వే స్వయంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. రానున్న 36 నెలల్లో పునరభివృద్ధి చేసేవిధంగా కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే సికింద్రాబాద్ స్టేషన్ వద్ద భూసార పరీక్షలను సైతం నిర్వహించారు. సుమారు రూ.653 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులకు ఈ నెల 19న ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రయాణికుల సేవలో.. నాన్ సబర్బన్ గ్రేడ్ –1 (ఎన్ఎస్జీ1) కేటగిరీకి చెందిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు 1.8 లక్షల మంది ప్రయాణం చేస్తారు. రోజుకు 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతాయి. పండుగలు, వేసవి సెలవులు, ఇతర ప్రత్యేక రోజుల్లో ప్రయాణికుల రద్దీ 2.3 లక్షల వరకు చేరుకుంటుంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి దక్షిణమధ్య రైల్వేకు ఏటా రూ.500 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. 2008లోనే వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. వరుసగా బడ్జెట్లలో ఈ మేరకు ప్రతిపాదనలు చేసినప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. కానీ ముందుకు సాగలేదు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన స్టేషన్ల పునరభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి కార్యాచరణ మొదలైంది. స్టేషన్ భవనాలను, మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సేవలన్నింటినీ ఆధునికీకరించి ఎయిర్‌పోర్టు తరహాలో ప్రయాణికులకు సీమ్‌లెస్ సర్వీసులను అందజేయడం ఈ సమీకృత స్టేషన్ పునరభివృద్ధిలో భాగం.ఈపీసీ మొడల్‌లో టెండర్లను ఖరారు చేశారు. ఇవీ సదుపాయాలు.. - ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా సాఫీగా ప్రయాణం చేసేలా స్టేషన్ పునరభివృద్ధి చేపట్టనున్నారు. సిటీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో తదితర ప్రజారవాణా మార్గాల్లో ప్రయాణికులు స్టేషన్‌కు రాకపోకలు సాగించేలా కనెక్టివిటీని పెంచడం ప్రధాన లక్ష్యం. పార్కింగ్ ఇబ్బందులను తొలగిస్తారు. - స్టేషన్ పరిసరాల్లో ఎలాంటి రద్దీ లేకుండా నియంత్రించి ఆ స్థలాల్లో షాపింగ్‌మాల్స్,ఇతర వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేస్తారు. కొత్త స్టేషన్ భవనంలో ఉత్తరం వైపు జీ+3 అంతస్థులు, దక్షిణం వైపు జీ+3 అంతస్తుల భవనాలను నిర్మిస్తారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ఉత్తరం వైపు మలి్టలెవల్ పార్కింగ్ సదుపాయం ఉంటుంది, దక్షిణం వైపు అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. - రెండు వైపులా రాకపోకలు సాగించే విధంగా 7.5 మీటర్ల వెడల్పుతో 2 నడక దారులను ఏర్పాటు చేస్తారు. సికింద్రాబాద్ ఈస్ట్, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్లకు చేరుకొనేందుకు స్కైవేలను అందుబాటులోకి తెస్తారు. ప్రస్తుతం స్టేషన్లో ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌లకు పూర్తిగా పైకప్పులు వేస్తారు. స్టేషన్‌కు చేరుకొనేందుకు, తిరిగి వెళ్లేందుకు వేరు వేరు ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. మరోవైపు స్టేషన్లో సుమారు 5000 కిలోవాట్స్ పవర్ సామర్థ్యం కలిగిన సోలార్ పవర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. -
సికింద్రాబాద్ స్టేషన్‌కి కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: ఆధునిక వసతులతో నిర్మించబోతున్న సికింద్రాబాద్ కొత్త స్టేషన్ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న స్టేషన్ భవనాన్ని తొలగించి దాని స్థానంలో ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు, పదో నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు రెండు వేరువేరు భవనాలను నిర్మించనున్నారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన గిర్ధారిలాల్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఇటీవలే కాంట్రాక్టు బాధ్యతను రైల్వే అప్పగించింది. నిర్మాణ సంస్థ వెంటనే పనులు ప్రారంభించేసింది. 36 నెలల్లో, అంటే 2025 అక్టోబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. రూ.699 కోట్లతో చేపట్టే ఈ భవనాలకు సంబంధించి ఐఐటీ ఢిల్లీని ప్రూఫ్ కన్సల్టెంట్‌గా నియమించారు. తాజాగా నిర్మాణానికి సంబంధించి సైట్ టోపోగ్రాఫిక్ సర్వే పూర్తయింది. వివిధ స్థాయిలలో ప్రతిపాదిత ఉపరితలం ఎత్తును గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. బేస్మెంట్, గ్రౌండ్, మిడ్ ఫ్లోర్, మొదటి రెండో అంతస్తులు, ఫుట్ఓవర్ బ్రిడ్జీలు.. తదితరాలకు సంబంధించిన డిజైన్ 3డీ ప్లాట్‌ను రూపొందించేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడుతుంది. స్టేషన్ భవనం ఉత్తర–దక్షిణ టెర్మినల్స్‌లోని వివిధ ప్రదేశాలలో మట్టి నమూనాలను కూడా పరీక్షించారు. కొత్త నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వీలుగా పాత రైల్వే క్వార్టర్స్‌ను కూల్చివేశారు. స్టేషన్ భవనానికి దక్షిణం వైపున సైట్ ఆఫీస్‌తో పాటు సైట్ లేబొరేటరీని ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఆధునిక వస తులతో సౌకర్యవంతమైన ప్రయాణ ప్రాంగణాన్ని అందించటంతోపాటు మెట్రోతో కనెక్టివిటీ కల్పించేందుకు ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించారు. సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని సాక్షితో చెప్పారు. -
విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
సాక్షి, హైదరాబాద్: విమానాశ్రయం తరహా లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసేందుకు త్వరలో పనులు ప్రారంభిస్తున్నట్టు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వచ్చే నాలుగు దశాబ్దాల అవసరాలకు సరిపడా అత్యంత ఆధునికంగా, మెరుగైన మౌలికవసతులతో కొత్త భవన సముదాయాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు. సికింద్రాబాద్ పునరాభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్ ఇతర ఉన్నతాధికారులతో సోమవారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా రీడెవలప్మెంట్ ప్లాన్‌ను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా రీడెవల్మెంట్ మూడు దశల్లో పూర్తి చేయనున్నట్టు చెప్పారు. మొదటి దశ పనులు 16 నెలల్లో, రెండో దశ పనులు 28 నెలల్లో, మూడో దశ 36నెలల్లో పూర్తవుతాయన్నారు. 719 కోట్ల తో చేపట్టే ఈ భవన సముదాయంలో 32 ఎస్కలేటర్లు, 26 లిఫ్టులు, ట్రావెలేటర్లు ఉంటాయని పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణాలవైపు జీప్లస్ 3 అంతస్తులతో రెండు భవనాలు రూపుదిద్దుకుంటాయని, 2 అంతస్తుల స్కై కాన్కోర్సు ఉంటాయన్నారు. వచ్చేవారికి, వెళ్లేవారికి వేర్వేరు మార్గాలుంటాయని, ఒక మల్టీ లెవల్, ఒక అండర్ గ్రౌండ్ పార్కింగ్ యార్డులుంటాయని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఆ దిశగా చర్యలకు నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా యాదాద్రి వరకు పనులు జరగా ల్సి ఉన్నా, రాష్ట్రప్రభుత్వం వాటా నిధులు ఇవ్వటంలో జాప్యం చేస్తుండటం పనుల్లో ఆలస్యానికి కారణమన్నారు. సికింద్రాబాద్ –విజయవాడ మధ్య నడవబోయే వందేభారత్ రైళ్లను తిరుపతి వరకు పొడిగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాజీపేటలో వాగన్ పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు ఏర్పాటుకు టెండర్లు పిలిచామని, భూసేకరణ పనులు జరుగుతున్నాయని, ముందు నిర్ధారించిన 150 ఎకరాలకు మరో మూడునాలుగు ఎకరాలు అవసరమవుతా యని తెలిపారు. కొత్త లైన్ల నిర్మాణానికి భూసేకరణ జరుగుతోందని వెల్లడించారు. -
సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణకు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను పూర్తిస్థాయిలో ఆధునీకరించే ప్రాజెక్టు పట్టాలకెక్కింది. ఇదిగో అదిగో అంటూ ఇంతకాలం ఊరించిన రైల్వే.. ప్రస్తుత భవనాలను కూల్చి వాటి స్థానంలో విమానాశ్రయం తరహా వసతులతో పునర్నిర్మించే ప్రాజెక్టుకు నిర్మాణ సంస్థను ఖరారు చేసింది. రూ.699 కోట్లకు కోట్ చేసిన ఢిల్లీ సంస్థ గిరిధారిలాల్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ టెండర్‌ను దక్కించుకుంది. 36 నెలల్లో పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థతో రైల్వే ఒప్పందం కుదుర్చుకుంటోంది. ప్రయాణికులకు సౌకర్యం కోసం.. దేశవ్యాప్తంగా 123 స్టేషన్లను రూ.50 వేల కోట్లతో ఆధునీకరించాలని రైల్వే నిర్ణయించింది. అందులో భాగంగా నాన్ సబర్బన్ గ్రేడ్–1 పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్ స్టేషన్‌ను అప్‌గ్రెడేషన్ ప్రాజెక్టు కోసం గతంలోనే రైల్వే బోర్డు ఎంపిక చేసింది. రూ.500 కోట్ల వార్షికాదాయం లేదా సంవత్సరానికి 20 మిలియన్ల ప్రయాణికులు ఉపయోగించే స్టేషన్‌ను ఈ గ్రేడ్ కింద గుర్తిస్తారు. సికింద్రాబాద్ స్టేషన్‌ను రోజుకు సగటున 1.8 లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకుంటారు. నిత్యం 200 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేసిన రైల్వేబోర్డు.. ఈ స్టేషన్‌ను పూర్తిగా ఆధునీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం టెండర్లు ఖరారు చేసింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడం చాలా అవసరమని, అందుకే ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్‌కుమార్ జైన్ చెప్పారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థకు సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారీ భవనాలు, పార్కింగ్ సదుపాయాలతో.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రెండు వైపులా మూడంతస్తులతో రెండు భారీ భవన సముదాయాలు ఉంటాయి. రెండు భవనాలను అనుసంధానిస్తూ ట్రావెలేటర్స్ (ఆటోవాకింగ్ వ్యవస్థ) ఏర్పాటు చేస్తారు. ఇక దక్షిణ భాగం వైపు 2వేల వాహనాలను నిలిపేలా మల్టీలెవల్ అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది.. ఉత్తరభాగం వైపు మూడు వేల వాహనాలను నిలిపేలా ఐదు అంతస్తుల పార్కింగ్ టవర్ నిర్మిస్తారు. ప్లాట్ఫామ్లన్నింటినీ ఆధునీకరిస్తారు. అన్నింటినీ కవర్ చేస్తూ పైకప్పు ఉంటుంది. రైల్వేస్టేషన్‌ను మెట్రోరైల్స్టేషన్లకు అనుసంధానిస్తూ స్కైవేలను నిర్మిస్తారు. -
సంక్రాంతికి సొంతూరెళ్లాలంటే కష్టాలే!
సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి పండగకు సొంతూరు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్న నగరవాసులకు వెయిటింగ్ లిస్ట్ నిరాశకు గురి చేస్తోంది. సాధారణంగా రైళ్లలో మూడు నెలల ముందే రిజర్వేషన్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. కానీ.. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే అన్ని ప్రధాన రైళ్లల్లో జనవరి నెలాఖరు వరకు ఇప్పటికే రిజర్వేషన్లు బుక్ అయ్యాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో 150 నుంచి 250 వరకు వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తుండగా, కొన్ని రైళ్లు ‘రిగ్రేట్’ అంటూ చేతులెత్తేస్తున్నాయి. దీంతో సంక్రాంతికి సొంత ఊరుకు వెళ్లేందుకు ఈసారి ఇబ్బందులు తప్పేలాలేవు!. మరోవైపు జనవరి నెలలోనే ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు శబరికి వెళ్లనున్నారు. దీంతో రైళ్ల కొరత సవాల్‌గా మారింది. డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు, ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. భారీగా పెరిగిన ప్రయాణాలు.. కోవిడ్ అనంతరం ప్రయాణాలు భారీగా పెరిగాయి. అన్ని రైళ్లలో పర్యాటకుల రద్దీ గణనీయంగా పెరిగింది. రెండు, మూడేళ్ల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకున్న నగరవాసులు ఈ ఏడాది విరివిగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో సహజంగానే రైళ్లకు డిమాండ్ పెరిగింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి సాధారణ రోజుల్లో సుమారు 2.2 లక్షల మంది రాకపోకలు సాగిస్తే వరుస సెలవులు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో 2.5 లక్షల మందికిపైగా బయలుదేరుతున్నారు. ఏపీతో పాటు ఉత్తరాది రైళ్లకు సైతం డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ప్రతి రోజు 85కుపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. మరో 100 ప్యాసింజర్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్ లిస్ట్ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. ప్రయాణం కష్టమే... సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో జనవరి వరకు అన్ని బెర్తులు బుక్ అయ్యాయి. థర్డ్ ఏసీలో బుకింగ్‌కు అవకాశం కూడా లేకుండా రిగ్రేట్ దర్శనమిస్తోంది. ఈస్ట్‌కోస్ట్, విశాఖ, గోదావరి, కోణార్క్, తదితర అన్ని రైళ్లలోనూ వెయిటింగ్ లిస్ట్ 150పైనే కనిపించడం గమనార్హం. ఉత్తరాది వైపు వెళ్లే దానాపూర్, పట్నా ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ నిరీక్షణ జాబితా వందల్లోకి చేరింది. ఇదీ చదవండి: మునుగోడు.. 10 వేలకు పైగా ఓటరు దరఖాస్తుల తిరస్కరణ -
కిక్కిరిసిన జర్నీ.. అరకొర రైళ్లే.. ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు చార్జీలు వసూలు
సాక్షి, హైదరాబాద్: నగరం పల్లెబాట పట్టింది. సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో గత రెండు రోజులుగా బస్సులు, రైళ్లలో రద్దీ పెరిగింది. పండగకు మరో మూడు రోజులే ఉండడడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో బయలుదేరారు. దీంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర కూడళ్ల వద్ద ప్రయాణికుల రద్దీ కనిపించింది. అలాగే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి కూడా ప్రయాణికులు సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ సంఖ్యలో బయలుదేరారు. ఈ సంవత్సరం ఆర్టీసీ పుణ్యమా అని పండగ ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. ఆర్టీసీ బస్సుల్ని సాధారణ చార్జీలపైనే ప్రత్యేక బస్సులు నడుపుతుండడంతో ప్రయాణికుల ఆదరణ పెరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కడప, కర్నూలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సుల్లో మాత్రం యథావిధిగా దారిదోపిడీ కొనసాగుతోంది. రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. దక్షిణమధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు అరకొరగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. డిమాండ్ మేరకు రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు అదనంగా ప్యాసింజర్ రైళ్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలా వరకు బస్సులపైనే ఆధారపడి ప్రయాణం చేయవలసి వస్తోంది. అరకొర రైళ్లే... ► ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయవలసి ఉండగా, ఈసారి అదనపు రైళ్లను చాలా వరకు తగ్గించారు. ► కొన్ని ప్రాంతాలకు మాత్రమే సుమారు 20 రైళ్లను అదనంగా ఏర్పాటు చేశారు. ► దసరా సందర్భంగా ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించే వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలకు ► అదనపు రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో వెళ్లేందుకు అవకాశం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ► ‘కనీసం జనరల్ బోగీలను కూడా అదనంగా ఏర్పాటు చేయడం లేదు. ఒక్కో బోగీలో వందలకొద్దీ కిక్కిరిసి ప్రయాణం చేయవలసి వస్తుంది’. అని కాగజ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఫణీంద్ర విస్మయం వ్యక్తం చేశారు. ► తెలంగాణ ప్రాంతాలకు రైలు సర్వీసుల విస్తరణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని సికింద్రాబాద్ నుంచి వికారాబాద్‌కు వెళ్తున్న మరో ప్రయాణికుడు శ్రీనివాస్ ఆరోపించారు. దూరప్రాంతాలకు మాత్రమే పరిమితంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు... ► తెలుగు రాష్ట్రాలకు ప్రతి రోజు సుమారు 3500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని 4400కు పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ► విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, కర్నూలు, కడప, తిరుపతి తదితర నగరాలతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ► అక్టోబర్ 1 నుంచి రద్దీ మరింత పెరగనున్న దృష్ట్యా రోజుకు 500 నుంచి 1000 వరకు అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఏ బస్సులు ఎక్కడి నుంచి బయలుదేరుతాయి.. సీబీస్: అనంతపూర్, చిత్తూరు, కడప,కర్నూలు,ఒంగోలు, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్‌రోడ్డు: వరంగల్, హనుమకొండ, జనగామ, యాదగిరిగుట్ట వైపు దిల్సుఖ్నగర్: నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట .. జేబీఎస్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు వెళ్లేవి.. ఎల్బీనగర్: వైజాగ్, విజయవాడ, గుంటూరు వైపు .. ఎంజీబీఎస్: మహబూబ్‌నగర్,వికారాబాద్, తాండూరు, భద్రాచలం, తదితర ప్రాంతాలకు.. సాధారణ చార్జీలే.. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించరాదని, సాధారణ చార్జీలపైనే ఆర్టీసీ బస్సులు అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న దృష్ట్యా సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ నాయక్ కోరారు. ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్లు నమోదు చేసుకోవచ్చునని, నేరుగా ప్రయాణసమయంలోనూ టిక్కెట్లు తీసుకోవచ్చునని తెలిపారు. -
విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
సికింద్రాబాద్: విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దనుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించిందని తెలిపారు. సీతాఫల్ మండి రైల్వేస్టేషన్లో మంగళవారం మూడు లిఫ్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సికింద్రాబాద్ వంటి ప్రయాణికుల సందడి ఎక్కువ కలిగిన రైల్వేస్టేషన్లను విమానాశ్రయాల మాదిరిగా వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఆధునీకరణ పనులు సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యాయని వెల్లడించారు. నగరంలో మొదటి విడత ఎంఎంటీఎస్ అధికంగా ప్రజాదరణ పొందిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ శరత్ చంద్రయాన్, నగర మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెండంతస్తుల్లో చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి రైల్వేస్టేషన్ ఆధునికీకరణపై దక్షిణమధ్య రైల్వే మరో ముందడుగు వేసింది. ఎయిర్‌పోర్టు తరహాలో చర్లపల్లి రైల్వేస్టేషన్ పునర్నిర్మాణానికి తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా విమానాశ్రయం తరహాలో తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్ల పునర్ అభివృద్ధికి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. తిరుపతి స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్‌కు ఒకట్రెండు రోజుల్లో టెండర్లు ఖరారు కానున్నాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్‌లో 4వ టర్మినల్‌గా ఇప్పటికే విస్తరణ పనులు చేపట్టిన చర్లపల్లి స్టేషన్‌ను సైతం ఎయిర్‌పోర్టు తరహాలో అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2023 జూన్ నాటికి చర్లపల్లి స్టేషన్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు పనుల్లో వేగం పెంచినట్లు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వేమేనేజర్ అభయ్‌కుమార్ గుప్తా తెలిపా రు. అన్ని సదుపాయాలతో వినియోగంలోకి రానున్న చర్లపల్లి స్టేషన్ నుంచి కాజీపేట్, విజయవాడ రూట్లో వెళ్లే రైళ్లను నడుపనున్నట్లు పేర్కొన్నారు. సేవలు ఇలా.... చర్లపల్లి స్టేషన్‌ను రెండంతస్తుల్లో పునర్ నిర్మించనున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రయాణికుల విశ్రాంతి గదులు, హోటళ్లు, రైల్వే అధికారుల కార్యాలయాలు తదితర సదుపాయాలు ఉంటాయి. విమానాశ్రయంలో లాగా ప్రయాణికులు ప్రవేశద్వారం నుంచి నేరుగా ప్లాట్‌ఫామ్‌కు చేరుకొనేలా మొదటి అంతస్తు ఉంటుంది. మొదటి విడతలో మొత్తం 8 లైన్లతో ప్లాట్‌ఫాంలను విస్తరిస్తారు. దశలవారీగా ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరగనుంది. అన్ని ప్లాట్‌ఫాంలకు చేరుకొనేలా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. “రైళ్ల నిర్వహణకు పిట్లైన్లు, ఇక్కడి నుంచి రైళ్లను నడిపేందుకు ప్రత్యేక మార్గాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. చర్లపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా అప్రోచ్ రోడ్ల నిర్మాణం కూడా తుది దిశకు వచ్చింది’ అని డీఆర్ఎం వివరించారు. ఎయిర్‌పోర్టు తరహాలో స్టేషన్ పునర్ అభివృద్ధికి ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్ పునర్ అభివృద్ధి కోసం ఒకట్రెండు రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. చర్లపల్లి నుంచే వందేభారత్... సెమీ హైస్పీడ్‌గా పేరొందిన వందేభారత్ రైళ్లను చర్లపల్లి నుంచే నడపనున్నారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చర్లపల్లి నుంచి విశాఖ, ముంబై తదితర మార్గాల్లో వందేభారత్ నడపాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైల్వేలోని అన్ని జోన్లకు దశలవారీగా వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
FSL పరీక్షకు 63 స్మార్ట్ ఫోన్లు
-
సికింద్రాబాద్ ఘటన: సుబ్బారావు తగలబెట్టమన్నాడు.. శివ అమలు చేశాడు!
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల తర్వాత సాక్ష్యాలను తారమారు చేశారని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి విధ్వంసం సృష్టించే విధంగా ప్లాన్ చేశారన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసుల అదుపులో 8 మంది ఉండగా, పరారీలు మరో 8 మంది ఉన్నారు. అగ్నిపథ్ స్కీంతో ఆర్థికంగా నష్టపోతామనే ఆందోళనలకు అకాడమీలను ప్రోత్సహించినట్లు గుర్తించారు. మరొకవైపు పోలీసుల అదుపులో మహబూబ్‌నగర్, కరీంనగర్‌కు చెందిన ఇద్దరు అకాడమీ డైరెక్టర్లు ఉన్నారు. మరో ఇద్దరు మల్లారెడ్డి, శివసాయి డిఫెన్స్ అకాడమీ ఉద్యోగులు, రెడ్డప్ప, హరి సహా మరొకరు ఆందోళనలో ప్రత్యేకంగా పాల్గొన్నట్లు గుర్తించారు. 12 అకాడమీ అభ్యర్థులతో 8 వాట్సాప్ గ్రూప్‌ల ఏర్పాటు చేసి విధ్వంసానికి కుట్ర చేశారు.ఈ 8 వాట్సాప్ గ్రూపుల్లో 2 వేల మంది ఆందోళనకారులు ఉన్నారు. రైల్వే స్టేషన్ అల్లర్ల వెనుక అసలు సూత్రధారి సుబ్బారావును ఏ-64గా రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొనగా, ఏ-65 మల్లారెడ్డి, ఏ-66 శివ కుమార్, ఏ-67 బూరెడ్డిలుగా పేర్కొన్నారు. సుబ్బారావు తగలబెట్టమన్నాడు.. శివ అమలు చేశాడు వీరంతా బోడుప్పల్‌లోని ఎస్వీఎం హోటల్లో అల్లర్లకు ప్లాన్ చేసినట్లు రిపోర్ట్‌లో వెల్లడించగా, శివ కుమార్‌తో కలిసి సుబ్బారావు రూ. 35వేలు ఖర్చు చేసి విద్యార్థులను అల్లర్లకు పురి కొల్పాడు. అదే సమయంలో సీఈఈ సోల్జర్స్ గ్రూపు, సోల్జర్స్ టూ డై పేరుతో వాట్సాప్ గ్రూపులు సృష్టించి విద్యార్థులను అల్లర్లకు ప్రోత్సహించాడు. బిహార్‌లో జరిగినట్లు రైలును తగటబెట్టాలని సుబ్బారావు చెప్పగా, శివ దానిని అమలు చేశాడు. ఆవుల సుబ్బారావుతో నిరంతరం శివ టచ్‌లో ఉన్నాడని, శివ ఆదేశాలతోనే రైలును తగులుబెట్టినట్లు విచారణలో వెల్లడైంది. -
రైల్వే స్టేషన్ ఘటన: సాయి డిఫెన్స్ అకాడమీదే కీలక పాత్ర!
హైదరాబాద్: గత వారం జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ కీలక పాత్ర పోషించింది. మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సాయి డిఫెన్స్ అకాడమీ కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల ఘటనకు ముందు రోజు ఇన్స్టిట్యూట్లోనే మకాం వేసి పథకం రచించారు. ఈ మేరకు కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల విచారణలో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ప్రధాన పాత్ర పోషించాడు.అనుచరులతో విధ్వంసానికి రచన చేసినట్లు గుర్తించారు. శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే నలుగురు అనుచరులతో విద్యార్థులను పురిగొల్పినట్లు, దీనిలో భాగంగా హోటల్ అనుచరులతో కలిసి విధ్వంసానికి ప్లాన్ చేశాడు. గుంటూరు ర్యాలీ నుంచే ఆందోళనకు స్కెచ్ వేశాడు. -
ఐదుగురు అనుచరులతో ‘ఆవుల’ స్కెచ్
సాక్షి,హైదరాబాద్: ఏపీలోని నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు తన అనుచరులతో కలసి ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులను రెచ్చగొట్టడం ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసానికి ప్రేరేపించినట్లు తేలింది. సుబ్బారావుతో పాటు మల్లారెడ్డి, శివ సహా ఐదుగురు కీలక నిందితులను పట్టుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం వారిని సికింద్రాబాద్ గవర్నమెంట్ రైల్వే పోలీసులకు (జీఆర్పీ) అప్పగించారు. వీరిని విచారిస్తున్న అధికారులు శుక్రవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. అగ్నిప«థ్ పథకం ప్రక టనతోనే భారీ ఆందోళనలకు పథకం వేసిన సుబ్బారావు, వీలున్నంత వరకు తన పేరు బయటకు రాకుండా ఉండాలని భావించాడు. దీంతో తన అకాడమీలకు డైరెక్టర్లుగా, ఇన్‌స్ట్రక్ట ర్లుగా ఉన్న ఐదుగురిని రంగంలోకి దింపాడు. వీరిలో మల్లారెడ్డి, శివ కీలకమని పోలీసులు చెప్తున్నారు. వీరి ద్వారానే తమ అకాడమీలతోపాటు ఇతర ఇన్స్టిట్యూట్లలో శిక్షణ తీసుకుంటున్న ఆర్మీ ఉద్యోగార్థులను సంప్రదించడం, రెచ్చగొట్టడం వంటివి చేశాడు. తాను బోడుప్పల్‌లోని అకాడమీలో ఉండి అనేకమందిని హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లోని లాడ్జిల్లో ఉంచాడు. నాగోలు మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో బస చేసిన మల్లారెడ్డి.. విధ్వంసం జరిగిన రోజు అభ్యర్థులకు సహాయసహకారాలు అందించాడు. ఆందోళనలో పాల్గొన్న అభ్యర్థులకు ఫీజులో రాయితీ ఇస్తానం టూ సుబ్బారావు చెప్పాడని.. ఇలా పలువురిని విధ్వంసానికి ప్రేరేపించాడని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసంతో రైల్వే, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు అనేక మంది పాస్‌పోర్టులు, విలువైన పత్రాలు దగ్ధమైనట్లు గుర్తించారు. ఆందోళన జరిగిన రోజు ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రైల్వే మెయిల్ సర్వీస్ కోచ్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అందులో ఉన్న తపాలా శాఖకు చెందిన 400 బ్యాగులు దగ్ధమయ్యాయి. వీటిలో 173 పాస్‌పోర్టులు కూడా ఉన్నాయి. ఆయా వ్యక్తులకు బట్వాడా కావాల్సిన ఎల్ఐసీ బాండ్లు, విద్య, ధ్రువపత్రాలు బుగ్గిపాలయ్యాయి. ఈ క్రమంలో పోస్టల్ అధికారులు.. దీని ప్రభావం సామాన్యులపై లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు. -
సికింద్రాబాద్ విధ్వంసం కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విధ్వంసం రోజున ఆవుల సుబ్బారావు ఉప్పల్ అకాడమీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు, శివ ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. హకీంపేట సోల్జర్స్ గ్రూపులో ఆందోళనకారులకు మద్దతిస్తున్నామని పోస్ట్‌లు పెట్టినట్లు గుర్తించారు. ఆందోళనకు కావాల్సిన లాజిస్టిక్స్ సమాకూర్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు. విధ్వంసం కేసులో కీలక నిందితులతో సుబ్బారావు ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. కేసులో A2గా ఉన్న పృధ్విరాజ్ సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థిగా గుర్తించారు. నరసారావుపేటలో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఆర్మీ కోచింగ్ ఇస్తున్నారు. విధ్వంసంలో పలువురు సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు కీలకంగా వ్యవహరించారు. ఇప్పటివరకు 63 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 55 మందిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. మరో ఎనిమిది మంది.. A7, A8, A9, A10, A11, A12, A62, A63 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. చదవండి: (కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి) -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్యంసం కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు
-
‘సికింద్రాబాద్ విధ్వంసం’ కేసులో నిందితులకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెనువిధ్వంసమే సృష్టించారు ఆందోళనకారులు. అయితే ఈ విధ్వంసం కేసులో.. అల్లర్ల నిందితులకు బుధవారం రిమాండ్ విధించింది కోర్టు. ‘సాయి అకాడమీ’ సుబ్బారావు సహా 15 మందిని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. సుబ్బారావు పాత్రపై కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. ఇక పృథ్వీరాజ్ అనే అదిలాబాద్ వాసి.. విధ్వంసంలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అలాగే పరారైన 25 మంది నిందితుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: అగ్నిపథ్ అల్లర్లు.. భయంతో యువకుడి ఆత్మహత్యాయత్నం -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేసులో పురోగతి
-
అగ్నిపథ్ అల్లర్లు: పోలీసుల భయంతో.. యువకుడి ఆత్మహత్యాయత్నం
సాక్షి, వరంగల్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ ఆందోళనల్లో పాల్గొన్న వరంగల్ యువకుడు గోవింద్ అజయ్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. స్టేషన్ ఘన్పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అజయ్.. ఆందోళనల్లో పాల్గొని ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడాడు. దీంతో, అజయ్ గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారన్న విషయం తెలుసుకున్నాడు. ఈ క్రమంలో తనపై కేసులు పెడతారేమోనని భయపడిన అజయ్.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన అజయ్ పేరెంట్స్.. అతడిని వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అజయ్.. వాట్సాప్ మెసేజ్ రావడం వల్లే తాను అక్కడికి వెళ్లానని చెప్పాడు. తాను వెళ్లిన 10 నిమిషాలకు అక్కడ ఫైరింగ్ జరిగినట్టు తెలిపాడు. ఆర్మీ ఫిజికల్ టెస్టులో పాస్ అయి రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. ఆర్మీకి ప్రిపేర్ కావడంతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా అప్లై చేశానన్నాడు. ఆందోళనల్లో భాగంగా కేసు అయితే ఉద్యోగం రాదనే భయంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు చెప్పుకొచ్చాడు. ఇది కూడా చదవండి: హైదరాబాద్ పోలీసుల అదుపులో ఆవుల సుబ్బారావు -
హైదరాబాద్ పోలీసుల అదుపులో ఆవుల సుబ్బారావు
సాక్షి, గుంటూరు: అగ్నిపథ్‌ను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లరు, విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావు పేట సాయి ఢిపెన్స్ అకాడమీ నుంచి ఆవుల సుబ్బారావుని పోలీసులు హైదరాబాద్ తీసుకెళ్లారు. సికింద్రాబాద్ అటాక్‌లో సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. అల్లర్లలో 10 బ్రాంచ్‌ల విద్యార్థులున్నట్లు పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను రెచ్చగొట్టడంతోపాటు ఉదంతం జరగడానికి ముందు రోజు రాత్రి సికింద్రాబాద్ వచ్చాడని, ఘటన జరిగిన రోజు కొన్ని గంటలు అక్కడే ఉన్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఈ మేరకు సికింద్రాబాద్ అల్లర్ల కేసులో బుధవారం నుంచి సుబ్బారావును హైదరాబాద్ పోలీసులు విచారించనున్నారు. చదవండి: (అగ్నిపథ్ స్కీమ్‌పై ఎంపీ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు) -
సికింద్రాబాద్ అల్లర్ల కేసులో లింగంపేట్ వాసి సూత్రధారిగా అనుమానం
-
అంతా నిరుపేద కుటుంబాల వారే...
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం కేసులో అరెస్టు అయిన 45 మంది నిందితుల్లో దాదాపు అంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారేనని జైలు అధికారులు చెప్తున్నారు. సోమవారం 28 మంది నిందితుల తల్లిదండ్రులు చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చి ములాఖత్ ద్వారా తమ కుమారులను కలిశారు. నిందితుల్లో ఒకరు సింగరేణి ఉద్యోగి కుమారుడు కాగా, మరొకరు ఆర్టీసీ ఉద్యోగి కుమారుడని గుర్తించారు. ఈ ఇద్దరూ మినహా మిగిలిన 26 మంది నిందితులూ బెయిల్ కోసం న్యాయవాదుల ఖర్చులు కూడా భరించలేరని పేద కుటుంబాలకు చెందిన వారని అంటున్నారు. తమ కుమారులు ఇలాంటి ఆందోళన, విధ్వంసం చేయడానికి సికింద్రాబాద్ వెళ్తున్నట్లు తమకు చెప్పలేదని, కోచింగ్ కోసం వెళ్తున్నట్లు చెప్పారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అమాయకులను అరెస్టు చేశారు శుక్రవారం గణేష్ ఎక్కడకు వెళ్లాడో మాకు తెలీదు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. రాత్రి 11 గంటలకు ఎస్సై ఫోన్ చేసి బాబు మా దగ్గర ఉన్నాడని, అతడి ఆధార్ నంబర్ పంపమని చెప్పారు. ఎక్కడ ఉన్నాడని అడిగితే సికింద్రాబాద్ కేసులో పట్టుకున్నామన్నారు. మా బాబు రైల్వేస్టేషన్ గోడ అవతలే ఉన్నాడు. అయినప్పటికీ పోలీసులు పట్టుకున్నారు. అసలు నిందితులు దొరక్కపోవడంతో వాళ్ల ఉద్యోగాల కోసం పోలీసులు అమాయకుల్ని అరెస్టు చేశారు. ములాఖత్‌లో కలిసినప్పుడు మా అబ్బా యి ఇదే చెప్తున్నాడు. మేము స్టేషన్లోకి వెళ్లలేదు... స్టేషన్ గోడ అవతలే పట్టుకుని అరెస్టు చేశారని ఏడుస్తున్నాడు. – అంజయ్య కసారాం, నిందితుడు గణేష్ తండ్రి, సంగారెడ్డి జిల్లా లాయర్ని మాట్లాడుకోవడానికి డబ్బుల్లేవ్ మా పిల్లలు చేయని నేరానికి జైలు పాలయ్యారు. లాయర్ని మాట్లాడుకోవడానికీ డబ్బులు లేవు. దయచేసి మా పిల్లల్ని బెయిల్ మీద బయటకు తీసుకురావాలని చేతులెత్తి మొక్కుతున్నా. మా పిల్లలను కాపాడాలని కేసీఆర్, కేటీఆర్‌లకు విన్నవించుకుంటున్నా. ఇప్పటికే జైలు పాలైన వారి జీవితం నాశనమైంది. మహేందర్ అరెస్టు విషయం తెలిసి మూడు రోజుల క్రితం ఊరి నుంచి రూ.2 వేలు తెచ్చా. ఇప్పుడు ఖర్చులకూ డబ్బుల్లేవు. దీంతో బస్టాండులో పడుకుంటున్నా. ఆర్మీలో చేరాలనేది మా వాడి ఐదేళ్ల కల. ఇప్పుడు అది కలగానే మిగిలిపోయింది. విద్యార్థుల వల్లే వచ్చిన తెలంగాణలో వాళ్లే జైలు పాలవుతారని అనుకోలేదు. మా పిల్లలు ఆర్మీ అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామని చెప్తున్నారు. – సాయప్ప, నిందితుడు మహేందర్ మామ, రాంపూర్ గ్రామం, తాండూరు -
రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో.. ఏ1గా మధుసూదన్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసం కేసులో 45 మందిని అరెస్టు చేసిన పోలీసులు యల్లారెడ్డికి చెందిన స్పోర్ట్స్ పర్సన్ మలవెల్లి మధుసూదన్‌ను ఏ1 గా చూపించారు. ప్రస్తుతానికి ఇతడే ప్రధాన నిందితుడు అయినప్పటికీ.. దర్యాప్తులో వేరే వ్యక్తుల పాత్ర తేలే అవకాశం ఉందని చెపున్నారు. మధుసూదన్‌తో సహా అరెస్ట్‌చేసిన నిందితులను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి.. రిమాండ్ రిపోర్టును దాఖ లు చేశారు. ఇందులో మొత్తం 56 మందిని ఇప్పటివరకు నిందితులుగా గుర్తించినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు పేర్కొన్నారు. 13 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో ఐపీసీ, రైల్వే, ప్రజా ఆస్తుల విధ్వంసక నిరోధక చట్టాల్లోని 15 సెక్షన్ల కింద నిందితులపై ఆరో పణలున మోదుచేశారు. ప్రాథమిక దర్యాప్తులో కుట్రకోణం వెలుగులోకి రావడంతో ఆదివారం నాటి నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో ఆమేరకు ఐపీసీలోని 120బీ సెక్షన్‌ను జోడించారు. కాగా, మధుసూదన్ జాతీయ కబడ్డీ ఆటగాడు. 18 మంది ప్రత్యక్ష సాక్షులు ఈ కేసులో క్షతగాత్రులు సహా 18 మందిని ప్రత్యక్ష సాక్షులుగా చేర్చారు. నిందితులుగా ఉన్న 56 మందీ ఫిజికల్, మెడికల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సా«ధించి ఆర్మీ ఉద్యోగం కోసం ఎదు రుచూస్తున్న వారేనని పోలీసులు పేర్కొన్నా రు. కేంద్రం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ నియా మక పథకానికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూపు లు ఏర్పాటు చేశారని, ఇప్పటివరకు 8 గ్రూపులను గుర్తించామని, బిహార్‌లో జరిగిన అలర్ల వీడియోలను వీటిలో పోస్టు చేశారని రిపోర్టులో పేర్కొన్నారు. ఏడు వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లు పరారీలో ఉండగా.. ‘రైల్వేస్టేషన్ బ్లాక్’అడ్మిన్ రమేశ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ గ్రూప్ ద్వారా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసానికి ప్లాన్ చేశారని, పలు ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిర్వాహకులు, యజమానులు, డైరెక్టర్లు సహకరించారని పొందుపరిచారు. ఆస్తి, ఆత్మ రక్షణ కోసం పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారని బుల్లెట్ తగిలి రాకేష్ మరణించగా... మరో 12 మందికి గాయాలయ్యాయని రాశారు. ఈ రిపోర్ట్‌లో ఎక్కడా ఏపీలోని నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ యజమాని ఆవుల సుబ్బారావు పేరు కనిపించ లేదు. సికింద్రాబాద్ స్టేషన్ మేనేజర్ రాజ నర్సు ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ వెల్లడించింది. విధ్వంసంలోని ప్రతి ఘట్టమూ సెల్ఫోన్లలో రికార్డింగ్ సికింద్రాబాద్ స్టేషన్లో స్వయంగా విధ్వంసం సృష్టించిన వారే సాక్ష్యాధారాలను పరోక్షంగా ఇచ్చారని అధికారులు చెప్తున్నారు. ఈ విధ్వంసంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తాము చేసే చర్యలను తమ ఫోన్లలో ఇతరుల ద్వారా రికార్డు చేయించారు. రైలు ఇంజిన్ పగలకొట్టడం దగ్గర నుంచి బోగీలు కాల్చడం వరకు ప్రతి ఘట్టాన్నీ ఇలా చిత్రీకరించారు. ఓ ఆందోళనకారుడు ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలోకి ఎక్కి, అక్కడ దొరికిన కాగితాలను సీటులో వేసి, మంట అంటిస్తున్నదీ తన సెల్ఫోన్లో రికార్డు చేయించాడు. ఇలాంటి ఫొటోలు, వీడియోలను కొన్నింటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయగా మరికొన్ని గ్యాలరీల్లో సేవ్ అయి ఉన్నాయి. 45 మంది నిందితులను అరెస్టు చేసిన జీఆర్పీ పోలీసులు వారి నుంచి 44 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించి ఈ విధ్వంసానికి పథక రచన చేసిన వారి వివరాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలుసుకున్నారు. ఫోన్లలో ఉన్న వీడియో, ఫొటో సాక్ష్యాలను సేకరిం చారు. న్యాయస్థానం అనుమతితో ఈ ఫోన్ల ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి వీటిని పక్కా ఆధారాలుగా తయారు చేయాలని నిర్ణయిం చారు. మరోపక్క విధ్వంసం కేసును హైదరాబాద్ పోలీసులకు బదిలీ చేశామని రైల్వే ఎస్పీ ఆదివారం రాత్రి ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు ఇవ్వాలని, సోమవారం వరకు అలాంటివి అందలేదని నగర పోలీసులు చెప్తున్నారు. సుబ్బారావుని తెస్తారా? లేదా? ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు చెందిన సా యి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును ఈ కేసులో అరెస్టు చేయడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. విధ్వంసానికి పాల్పడిన నిందితుల్లో 272 మంది నగరంలోని ఇతడి బ్రాంచ్ అభ్యర్థులని పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను రెచ్చగొట్టడంతోపాటు ఉదంతం జరగడానికి ముందు రోజు రాత్రి సికింద్రాబాద్ వచ్చాడని, ఘటన జరిగిన రోజు కొన్ని గంటలు ఉన్నాడని తేల్చారు. అయితే నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్న ఇతడిని తమకు అప్పగించాలంటూ రైల్వే పోలీసులు కోరలేదు. సుబ్బారావును నిందితుడిగా చేర్చడానికి మరికొన్ని ఆధారాలు అవసరమని ఓ అధికారి పేర్కొన్నారు. కీలక నిందితులది కామారెడ్డి జిల్లా సాక్షి, కామారెడ్డి: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేసులో కీలక నిందితులు కామారెడ్డి జిల్లాకు చెందిన వారే ఉన్నారు. కేసులో ఏ1గా ఉన్న మలపెల్లి మధుసూదన్ (20)ది ఎల్లారెడ్డి కాగా.. ఏ5 సంతోష్ (22) గాంధారి మండలం మాతుసంగెంకు చెందిన వాడు, ఏ13 బూక్య పెంట్య (19) మాచారెడ్డి మండలం ఎల్లంపేటకు చెందిన వ్యక్తిగా తేల్చారు. వీరితోపాటు విధ్వంసంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్లకు చెందిన మరో 12 మంది ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం పోలీసులు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
సికింద్రాబాద్ అల్లర్లు: ‘సాక్షి’ చేతిలో రిమాండ్ రిపోర్ట్.. కీలక అంశాలు వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో రైల్వే పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో రూ.20 కోట్ల నష్టం వాటిల్లినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఏ2 నుంచి ఏ12 వరకు నిందితులు తప్పించుకుని తిరుగుతున్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ‘రైల్వే స్టేషన్ బ్లాక్’ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ రమేష్‌గా గుర్తించారు. రమేష్‌ను ఏ3గా రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు. చదవండి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన: మా పిల్లలకు ఏ పాపం తెలియదు..! డిఫెన్స్ కోచింగ్సెంటర్లే అభ్యర్థులను రెచ్చగొట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. రిమాండ్ రిపోర్ట్‌లో సాయి అకాడమీ సుబ్బారావు పేరు కనిపించలేదు. ఈ నెల 17న మధ్యాహ్నం 12:10కి స్టేషన్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ బ్లాక్ వాట్సాప్ గ్రూప్‌లో 500 మంది సభ్యులున్నట్లు గుర్తించారు. రిమాండ్ రిపోర్ట్‌లో మొత్తం 56 మందిని రైల్వే పోలీసులు చేర్చారు. వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టి విధ్వంసానికి కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. -
తమ పిల్లలకు ఏ పాపం తెలియదంటూ కన్నీరుమున్నిరు
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన: మా పిల్లలకు ఏ పాపం తెలియదు..!
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానని వ్యతిరేకిస్తూ భారీ ఆందోళన చేపట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంస సృష్టించిన కేసులో 46 మంది చంచల్గూడా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. వీరిని కలిసేందుకు తల్లి, దండ్రులు జైలు వద్దకు వచ్చారు. సోమవారం ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న నిందితుల తల్లిదండ్రులు.. తమ పిల్లలతో ములాఖత్‌లో కలవడానికి వచ్చారు. నిందితులుగా జైలులో ఉన్న తమ పిల్లలకు ఏమౌతుందోననే ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఏ పాపం తెలియదని జైలు సిబ్బంది వద్ద కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా, అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువత తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ నిర్వహించిన ఆందోళనలు విధ్వంసాన్ని సృష్టించాయి. నిరసనకారుల దాడులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భీతావహంగా మారింది. ఈ హింసాత్మక నిరసనల్లో రూ. ఏడు కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. -
‘బ్లాక్ గ్రూప్’ అగ్గి పెట్టింది!
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనలో కొత్త అంశాలు బయటికి వస్తున్నాయి. అభ్యర్థులను ఆందోళనకు ఉసిగొల్పినది ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు కాగా.. విధ్వంసానికి రెచ్చగొట్టినది కొందరు అభ్యర్థులేనని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్’ పేర ఓ వాట్సాప్ గ్రూపు, దానికి అనుబంధంగా మరో 3 గ్రూపులు ఏర్పాటు చేసుకుని.. తీవ్రస్థాయిలో ఆందోళనకు పక్కాగా పథకం రూపొందించుకుని, అమలు చేసినట్టు తేల్చారు. ఇక విధ్వంసం కేసులో అదుపు లోకి తీసుకున్నవారిలో 45 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. ఇక పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రా ల్లోనూ గాలిస్తున్నాయి. నిందితులను కస్టడీకి ఇవ్వాలని సికింద్రాబాద్ గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) సోమవారం పిటిషన్లు దాఖలు చేయనున్నారు. బిహార్ ఉదంతాలను చూసి ప్లాన్..: కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించాక మొదట్లో బిహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో విధ్వంసం ఘటనలు జరిగాయి. వాటిని చూసిన కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఆర్మీ అభ్యర్థి శ్రీను ఈనెల 15న మధ్యాహ్నం 1.58 గంటలకు ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్’ పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్న అతను.. ఈ వాట్సాప్ గ్రూపునకు ఎనిమిది మంది అభ్యర్థులను అడ్మిన్లుగా చేశాడు. దీనికి అనుబంధంగా మరికొన్ని గ్రూపులు ఏర్పాటయ్యాయి. అడ్మిన్లు ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్’ గ్రూప్‌లోకి దాదాపు 400 మందిని సభ్యులుగా చేర్చారు. తన పేరు బయటికి రాకూడదనే ఉద్దేశంతో శ్రీను ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయాడు. అయితే ఈ గ్రూపులో సభ్యులు బిహార్ మాదిరిగా హల్చల్ చేద్దామని చర్చించుకున్నారు. సికింద్రాబాద్ వచ్చిన అందరూ ఒకచోట ఉండొద్దని, వేర్వేరుగా బస చేయాలని సూచించుకున్నారు. ఆదిలాబాద్ నుంచి వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లోని హాస్టల్లో ఉంటున్న సాబేర్ అనే అభ్యర్థి జెండాలు, కర్రలు, రాళ్లు వంటివి తెచ్చే బాధ్యత తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం అవన్నీ తీసుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్దకు వచ్చి అందరికీ అందించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు శ్రీను, సాబేర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో పది మంది అనుమానితులను కూడా పట్టుకున్నారు. నిప్పుపెట్టిన వాళ్లూ చిక్కారు మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన అభ్యర్థి రాజా సురేంద్ర కుమార్ ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్’ గ్రూపులో సభ్యులందరినీ రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టాడు. ఆందోళనకు వచ్చే వారంతా పాత టైర్లు, వస్త్రాలు, రాడ్లు, పెట్రోల్ తీసుకుని రావాలని.. వాటిని వినియోగించి విధ్వంసం సృష్టిద్దామని సూచించాడు. శుక్రవారం ఉదయం ఆందోళనకారులు రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించే ముందు బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు అద్దాలను, ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రైళ్ల ఏసీ బోగీల అద్దాలను పగలగొట్టింది అతడేనని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా గుర్తించారు. ఇక రైలుబోగీల్లోకి ప్రవేశించి నిప్పుపెట్టిన వారిలో ఆదిలాబాద్‌కు చెందిన పృథ్వీరాజ్, కామారెడ్డికి చెందిన సంతోష్ కీలకంగా వ్యవహరించినట్టు తేల్చారు. ప్రత్యేక బృందాలు ఆదివారం రాత్రి ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నాయి. బస్సు అద్దాల ధ్వంసంపై మరో కేసు ఆర్మీ అభ్యర్థులు శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లోకి ప్రవేశించే ముందు రాజేంద్రనగర్, హయత్‌నగర్ డిపోలకు చెందిన మూడు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను రైల్వే పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపాక.. పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. మొత్తంగా రైల్వే స్టేషన్ ఘటనకు సంబంధించి శనివారం 45 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఆదివారం ఉదయం నాగోల్‌లోని రైల్వే కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఆయన ఆదేశాల మేరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోసం చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిం దితులను ఆదివారం ఉదయం 8.15 గంటలకు జైలులోకి తీసుకున్నామని చంచల్‌గూడ అధికారులు చెప్పారు. ఛాతీలోంచి బుల్లెట్ దూసుకెళ్లి.. ఊపిరితిత్తులు ఛిద్రమై.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబ్బీర్‌పేటకు చెందిన రాకేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు.. రాకేశ్ మరణానికి తుపాకీ బుల్లెట్ కారణమని గుర్తించారు. ఛాతీపై కుడివైపు నుంచి శరీరంలోకి దూసుకెళ్లిన బుల్లెట్ ఊపిరితిత్తుల్ని ఛిద్రం చేస్తూ ఎడమ వైపు నుంచి బయటికి వెళ్లిందని తేల్చారు. ఊపిరితిత్తులు బాగా దెబ్బతినడంతో వెంటనే చనిపోయాడని.. పెల్లెట్ (రబ్బరు/ఇతర పదార్థాలతో కూడిన బుల్లెట్) అయితే ఇలా బయటికి దూసుకెళ్లదని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. మిగతా ఐదుగురు క్షతగాత్రుల నుంచి ఏడు బుల్లెట్లను వెలికితీసి, పోలీసులకు అందజేసినట్టు సమాచారం. నేడు 8 మంది బాధితుల డిశ్చార్జి! రైల్వేస్టేషన్ ఘటనలో గాయపడిన 14 మందిలో ఒకరు మృతి చెందగా.. మిగతా 13 మందికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఇందులో కోలుకున్న ఎనిమిది మందిని సోమవారం డిశ్చార్జి చేసే అవకాశముందని వెల్లడించారు. -
సికింద్రాబాద్ విధ్వంసం.. మూల కారుకులు వారే: ఎస్పీ అనురాధ
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో రైల్వే సంస్థకు తీవ్ర నష్టం జరింది. కాగా, ఈ ఘటనపై రైల్వే ఎస్పీ అనురాధ ఆదివారం స్పందించారు. ఈ సందర్భంగా ఎస్పీ అనురాధ మాట్లాడుతూ.. ఆందోళనకారులు పోలీసులు, ప్రయాణికులపై రాళ్లు రువ్వారు. కోచింగ్ సెంటర్ల వారే ఉద్యోగార్థుల్ని రెచ్చగొట్టారు. దాడులకు కారకులైన కోచింగ్ సెంటర్లను గుర్తించాము. వారంతా వాట్సాప్ గ్రూపుల్లోనే చర్చించుకున్నారు. దాడులకు పాల్పడిన 46 మందిని ఆధారాలతో అరెస్ట్ చేశాము. సీసీ టీవీ ఫుటేజీలు మా దగ్గర ఉన్నాయి. 17వ తేదీన ఉదయం 8 గంటలకు 300 మంది రైల్వే స్టేషన్లో చొరబడ్డారు. వారంతా ఈస్ట్‌కోస్ట్, దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చారు. ఒక కోచ్‌ను పెట్రోల్‌పోసి కాల్చేశారు. ఈ దాడిలో 2వేల మంది అభ్యర్థులు పాల్గొన్నారు. వారికి రైల్వే యాక్ట్ సెక్షన్ 150 కింద యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. వారు ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవు. అరెస్ట్ అయిన ఉద్యోగార్థులందరూ తెలంగాణకు చెందినవారే. రైల్వే స్టేషన్లో దాడిలో మొత్తం 58 రైల్వే కోచ్‌లు ధ్వంసమయ్యాయి. 9 మంది రైల్వే ఉద్యోగులు గాయపడ్డారు. 12 కోట్ల నష్టం జరిగింది’’ అని వివరించారు. ఇది కూడా చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాల్పులకు బాధ్యులు ఎవరు ??
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడిపై ముమ్మర దర్యాప్తు
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన: మా పిల్లల జాడేది?
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనలో పాల్గొని పోలీసులకు చిక్కిన ఆర్మీ ఉద్యోగార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. శుక్రవారం రాత్రి నుంచి వారిని గోపాలపురం, జీఆర్పీ, టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్లలో ఉంచి విచారణ జరుపుతున్నారు. శనివారం రాత్రి వరకు పోలీసులు వారి అరెస్టు చూపించలేదు. టీవీల్లో వార్తలు చూసిన ఆర్మీ అభ్యర్థుల తల్లిదండ్రులు శనివా రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి తమ పిల్లల గురించి ఆరాతీస్తూ కనిపించారు. పోలీసులు అరెస్టు చేశారా, ఎక్కడికైనా వెళ్లిపోయా రా.. వారికి ఏం జరిగిందోనని ఆందోళనకు లోనయ్యారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్, గోపాలపురం పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తమ పిల్లల గురించి ఆరా తీశారు. కానీ పోలీసులు ఏ విషయం చెప్పకపోవడంతో పిల్లల జాడ ఎక్కడ అంటూ విలపించారు. పోలీసులు ఏమీ చెప్పడం లేదు నిన్న టీవీలో సికింద్రాబాద్ ఘటన చూసి చాలా ఆందో ళన చెందాం. మా అక్క కు మారుడు మహేందర్‌కు చా లా సార్లు ఫోన్ చేసినా కలవడం లేదు. దీంతో రాత్రి హైదరాబాద్ వచ్చి గోపాలపురం, సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లలో అడిగాం. కానీ ఎవరూ సమాధానం చెప్పడంలేదు. – సాయప్ప, తాండూరు రాంపూర్ గ్రామం -
సికింద్రాబాద్ కాల్పుల ఘటన: నిరసనకారుల శరీరాల్లో 8 పెల్లెట్లు
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కాల్పుల్లో గాయపడ్డ 13 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరికి మేజర్, ముగ్గురికి మైనర్ ఆపరేషన్లు చేసిన వైద్యులు.. వారి శరీరంలోకి దిగిన ఎనిమిది తుపాకీ పెల్లెట్లను వెలికితీశారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం గుండ్రేటిపల్లికి చెందిన దండు మహేశ్ (21)కు వీపు భాగంలో శస్త్రచికిత్స చేసి రెండు పెల్లెట్లు బయటికి తీశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురానికి చెందిన బానోతు నాగేందర్‌బాబు (21) కాలులోకి దూసుకుపోయిన రెండు పెల్లెట్లను.. కామారెడ్డిజిల్లా నిజాంసాగర్‌కు చెందిన పి.మోహన్ తొడ, నడుము భాగాల్లో దిగిన రెండు పెల్లెట్లను వెలికి తీశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన లక్కం వినయ్ (20)కు ఛాతీపై కుడివైపు.. కర్నూల్ జిల్లా మంత్రాలయానికి చెందిన జగన్నాథ్ రంగస్వామి(20)కి పక్కటెముకల్లో దిగిన ఒక్కో పెల్లెట్‌ను బయటికి తీశారు. వీరంతా ఐసీయూలో కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఇక స్వల్ప గాయాలైన మరో ఎనిమిది మంది కోలుకున్నారని.. కానీ వారు మానసిక ఆందోళనలో ఉండటంతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. వారిని మరో 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాక డిశ్చార్జి చేస్తామన్నారు. (చదవండి👉🏻 ఒకసారి కేసు నమోదైతే మాఫీ ఉండదు!) మానసిక నిపుణులతో కౌన్సెలింగ్.. రైల్వేస్టేషన్ ఘటనతో క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారని.. వారికి ఆస్పత్రి మానసిక నిపుణులు కౌన్సెలింగ్ చేస్తున్నారని వైద్యులు తెలిపారు. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న వీరు ఆత్మహత్యకు యత్నించే అవకాశాలూ ఉన్నాయని.. అందుకే కౌన్సెలింగ్ ఇచ్చి, వారి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని సంబంధిత వైద్యాధికారి వెల్లడించారు. (చదవండి👉🏻 ప్రైవేటు అకాడమీల ‘డేంజర్ గేమ్’! కీలక అంశాలు వెలుగులోకి) -
Secunderabad Railway Station: రైల్వేకు నష్టం రూ.12 కోట్లు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసంలో ప్రత్యక్షంగా రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందని, పరోక్షంగా కూడా కోట్లలో నష్టం ఉంటుందని డివిజన్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా వెల్లడించారు. శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 30 బోగీలు, 5 రైలు ఇంజన్లు దెబ్బతిన్నాయని.. ప్లాట్‌ఫామ్‌లపై సీసీ కెమెరాలు, టీవీలు, దుకాణాలు, పార్శిళ్లకు పూర్తిగా నష్టం వాటిల్లిందని ఏకే గుప్తా చెప్పారు. రైళ్లు రద్దు కావడంతో జరిగే చెల్లింపులు, పార్శిళ్లు, ఇతర పరోక్ష నష్టాలను అంచనా వేస్తున్నామని తెలిపారు. రైల్వే ప్రయాణికుల లగేజీ కూడా నష్టం జరిగిందన్నారు. రైల్వే సిగ్నల్ వ్య వస్థకు ఎలాంటి నష్టం జరగలేదని.. శుక్రవా రం రాత్రి నుంచే రైళ్లను పునరుద్ధరించామని చెప్పారు. రైళ్లన్నీ యథావిధిగా నడుస్తున్నాయన్నారు. అదృష్టవశాత్తు పవర్ కార్కు ఎలాంటి నష్టం జరగలేదని, అందులో 3 వేల లీటర్ల డీజి ల్ ఉండటం వల్ల నిప్పంటుకుంటే నష్టం తీవ్రం గా ఉండేదని తెలిపారు. ఇందులో కుట్ర కోణ మేదైనా ఉందా అన్నదానిని దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు. ఘటనలో 8 మంది రైల్వే సిబ్బందికి స్వల్పగాయాలైనట్టు చెప్పారు. -
Secunderabad Railway Station: సాఫీగా రైలు కూత!
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన విధ్వంసం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా తేరుకుంది. శుక్రవారం రాత్రే రైళ్ల రాకపోకలను పునరుద్ధరించిన అధికారులు.. శనివారం చాలా వరకు రైళ్ల రాకపోకలను యథాతథంగా కొనసాగించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు, లింక్ రైళ్లు నడవకపోవడం వంటి ఇబ్బందులో కొన్ని రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం ప్రయాణికుల రద్దీ సాధారణంగానే కనిపించింది. మరోవైపు ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణ దృష్ట్యా ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఆర్ఏఎఫ్ బలగాలు, పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్ రెండు వైపులా సాయుధ సిబ్బందితో కాపలా ఏర్పాటు చేసి, అందరినీ పూర్తిగా తనిఖీ చేశాకే ప్లాట్‌ఫామ్‌లపైకి అనుమతిస్తున్నారు. మరికొద్ది రోజులు ఇబ్బందులు శుక్రవారం నాటి ఘటనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయిన విషయం తెలిసిందే. సాధారణంగా రైళ్ల నిర్వహణ జతలుగా ఉంటుంది. ఒకవైపు నుంచి మరోవైపు రైలు వెళితేనే మళ్లీ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సర్వీసులు కొనసాగుతాయి. ఒక దగ్గరే నిలిచిపోతే అంతరాయం ఏర్పడుతుంది. శుక్రవారం ఇలా రైళ్లు ఆగిపోవడంతో.. శనివారం కూడా పలు రైళ్లను నడపలేకపోయారు. ఇక విశాఖపట్నం మీదుగా ఉత్తరాదికి వెళ్లే మార్గంలో ఏర్పడ్డ ఆటంకాలతో మరికొన్ని రైళ్లు రద్దయ్యాయి. ఈ కారణాలతో వచ్చే మూడు నాలుగు రోజులపాటు కూడా పలు రైళ్లకు ఆటంకం కొనసాగనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శనివారం రాత్రి ప్రకటన వెలువరించింది. శనివారం 18 సాధారణ రైళ్లు, సిటీలో నడిచే 40 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయగా.. ఆదివారం ఐదు రైళ్లను.. సోమ, మంగళవారాల్లో ఒక్కో రైలు రద్దయినట్టు ప్రకటించింది. రాకపోకలకు ఆటంకాలతో ఏర్పడ్డ రద్దీ నేపథ్యంలో 19న రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. పార్శిళ్లకు నష్ట పరిహారం ఆందోళనకారుల విధ్వంసంలో నష్టపోయిన పార్శిళ్లకు రైల్వే నుంచి నష్టపరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. అయితే పార్శిల్‌ను బుకింగ్ చేసుకునే సమయంలో పేర్కొన్న విలువ మేరకు నష్ట పరిహారం ఇస్తామని వెల్లడించారు. వేగంగా మరమ్మతులు.. ఆందోళనకారుల చేతిలో ధ్వంసమైన పరికరాలు, మౌలిక వసతులకు రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. ట్యూబ్‌లైట్లు, సీసీ కెమెరాలు, ఫ్యాన్లు కొత్తవి బిగిస్తున్నారు. పగిలిన సిమెంటు బెంచీలకు మరమ్మతులు చేయిస్తున్నారు. విధ్వంసంలో దెబ్బతిన్న దుకాణాలను నిర్వాహకులు పునరుద్ధరించుకున్నారు. రద్దయిన, షెడ్యూల్ మారిన రైళ్లు ఇవీ.. ► భువనేశ్వర్–సికింద్రాబాద్, త్రివేండ్రం సెంట్రల్–సికింద్రాబాద్, దర్బంగా–సికింద్రాబాద్, షాలీమార్–సికింద్రాబాద్ తదితర రైళ్లను అధికారులు రద్దు చేశారు. ► ఆదివారం సికింద్రాబాద్–షాలిమార్ (ఉదయం 4.20), కాచిగూడ–నర్సాపూర్ (రాత్రి 11 గంటలకు) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. సికింద్రాబాద్–దానాపూ ర్, సికింద్రాబాద్–రాజ్‌కోట్, సికింద్రాబాద్–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌లను సమయా లను రీషెడ్యూల్ చేసి నడుపుతున్నారు. నేడూ ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో శుక్రవారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం కూడా పలు మార్గాల్లో ఎంఎంటీఎస్‌లను రద్దు చేశారు. ఆదివారం కూడా ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి తదితర రూట్లలో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
ఒకసారి కేసు నమోదైతే మాఫీ ఉండదు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసానికి సంబంధించి ఒకసారి కేసు నమోదైతే, ఇక ఉపసంహరణ ప్రక్రియ ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తీవ్రమైన రైల్వే యాక్ట్‌లోని సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో నేరం నిరూపణ అయితే గరిష్టంగా మరణశిక్ష విధించే ఆస్కారమూ ఉంది. సికింద్రాబాద్ ఘటనలో కొందరే విధ్వంసానికి పాల్పడినప్పటికీ ఆ సమయంలో అక్కడున్న అందరూ నిందితులుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఐపీసీ, రైల్వే యాక్ట్, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం(పీడీపీపీఏ)లోని సెక్షన్లలో నమోదైన ఈ కేసు కారణంగా నిందితులకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావు. హత్యాయత్నం, విధ్వంసం, దాడులుసహా మూడు చట్టాల్లోని 15 సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఏపీలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం తదితరాల్లోనూ విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ, ప్రభుత్వం మారిన తర్వాత ఏపీలోనూ ఆ కేసులను ఉపసంహరించారు. దీన్నే విత్డ్రాల్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా పిలుస్తారు. అయితే రైల్వే యాక్ట్ కింద నమోదైన కేసుల్లో ఈ వెసులుబాటు ఉండదు. వీటి విచారణ సైతం ప్రత్యేక రైల్వే కోర్టులో జరుగుతుంది. ఈ కారణంగానే ఇదివరకు రైల్‌రోకో చేసిన రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇంకా ఆ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కోర్టులో కేసు వీగినా ఇదే పరిస్థితి ఉంటుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క మల్టీ నేషనల్ కంపెనీల సహా అనేక ప్రైవేట్ సంస్థలు సైతం ఇటీవల ఉద్యోగం ఇచ్చే ముందు పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ కచ్చితంగా అడుగుతున్నాయి. ఈ కేసు నేపథ్యంలో నిందితులుగా ఉన్న ఆందోళనకారులకు పోలీసు విభాగం క్లియరెన్స్ సర్టిఫకెట్లు జారీ చేయదని, పాస్‌పోర్టులు జారీ కావని, కొన్ని దేశాలకు ప్రత్యేక వీసాలు కూడా పొందడం కష్టసాధ్యమే అని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాంటి సందర్భంలోనూ ఈ కేసు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఈ కేసులోని సెక్షన్లు, ఆరోపణలు, నిరూపణ అయితే గరిష్ట శిక్షలు ఇలా ► ఐపీసీలోని 143: చట్ట విరుద్ధంగా ఓ ప్రాంతంలో గుమిగూడటం, ఆరు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 147: అల్లర్లు చేయడం, రెండేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 324: మారణాయుధాలతో గాయపరచడం, మూడేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 307: హత్యాయత్నం, పదేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 435: అగ్ని లేదా పేలుడు పదార్థం విని యోగించి విధ్వంసం సృష్టించడం, ఏ డేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 427: రూ.50 అంతకంటే ఎక్కువ విలువైన వస్తువును ధ్వంసం చేయడం, రెండేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 448: అనుమతి లేకుండా ఓ ప్రాంతంలోకి ప్రవేశించడం, ఏడాది జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 336: ఎదుటి వారికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న పని చేయడం, మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 332: విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకుని గాయపరచడం, మూడేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 341: నిర్భంధించడం, నెల రోజుల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 149: గుంపుగా ఆందోళన చేసినప్పుడు అందులోని ప్రతి ఒక్కరూ నేరానికి బాధ్యులే ఇండియన్ రైల్వే యాక్ట్ ►సెక్షన్ 150: తాము చేస్తున్న పని వల్ల ఎదుటి వారి ప్రాణాలకు హాని ఉందని తెలిసీ చేయడం, మరణ శిక్ష లేదా జీవిత ఖైదు ►151: రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం, ఐదేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ►152: రైళ్లపై రాళ్లు విసరడం, కర్రలతో దాడి చేయడం, పదేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు పీడీపీపీ యాక్ట్: ► సెక్షన్ 3: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, 6 నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు లేదా జరిమానా లేదా రెండూ -
కాంగ్రెస్ నేతల అరెస్టుల పర్వం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం, పోలీసు కాల్పుల్లో ఒకరు మృతి చెందిన నేపథ్యంలో శనివారమంతా కాంగ్రెస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగింది. శనివారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డిని పోలీసులు తొలుత అదుపులోనికి తీసుకున్నారు. సికింద్రాబాద్ పోలీసు కాల్పుల్లో చనిపోయిన రాకేశ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వరంగల్ బయలుదేరిన ఆయన్ను ఘట్కేసర్లో పోలీసులు అడ్డుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో తనను అరెస్టు చేయడమేంటని, వరంగల్ ఎందుకు వెళ్లకూడదో చెప్పాలని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. పలువురు నేతలు ఘట్కేసర్కు చేరుకుని రేవంత్‌కు సంఘీభావం ప్రకటించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను నగరంలోని పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని గోల్కొండ పీఎస్‌కు తరలించారు. దీంతో వెంకట్‌ను విడుదల చేయాలంటూ పీఎస్‌కు వెళ్లిన జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని వరంగల్‌లో రాకేశ్ అంత్యక్రియలు పూర్తయ్యాక వదిలివేస్తామని చెప్పారు. సికింద్రాబాద్ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నేతలు అనిల్‌కుమార్ యాదవ్, శివసేనారెడ్డిలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కాగా, రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం ఘట్కేసర్ పీఎస్ నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. గోల్కొండ పీఎస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నందునే ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌పై పోలీసులు ఫోకస్ చేశారని మండిపడ్డారు.అరెస్టులు కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదని, కేసుల సంఖ్య పెరిగే కొద్దీ కేడర్ ఇంకా ఉత్సాహంగా పనిచేస్తుందని జగ్గారెడ్డి చెప్పారు. చావులపై టీఆర్ఎస్ రాజకీయం: రేవంత్ ఘట్కేసర్: చావులను కూడా టీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని రేవంత్ మండిపడ్డారు. రాకేశ్‌ను టీఆర్ఎస్ చంపిందని, బీజేపీ చంపించిందని ఆయన ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన నిరసనలో మృతి చెందిన రాకేశ్ కుంటుంబ సభ్యులను పరామర్శించడానికి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం డబ్బీర్పేటకు బయలుదేరిన రేవంత్‌రెడ్డిని ఘట్‌కేసర ఓఆర్ఆర్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం విడుదలైన అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా తన నియోజకవర్గంలో తిరిగే హక్కులేదా అని ప్రశ్నించారు. 70 ఏళ్లుగా ఆర్మీ జవాన్ల నియామకాలు నిబంధనల మేరకు జరిగాయని, మోదీకి పోయేకాలం రావడంతో కేవలం నాలుగు ఏళ్లు సైన్యంలో పనిచేసే అవకాశం కల్పించారని అన్నారు. నాలుగేళ్ల అనంతరం ఆర్మీ శిక్షణ పొందిన యువతకు ఎక్కడా ఉద్యోగం లభించకపోతే నక్సలైట్లలో కలవాలా అన్ని ప్రశ్నించారు. రాకేశ్ శవయాత్రను టీఆర్ఎస్ పార్టీ జెండాలతో ర్యాలీగా నిర్వహించవచ్చు కాని టీపీసీసీ అధ్యక్షుడిగా తాను వెళతానంటే అడ్డంకులు çసృష్టిస్తారా అని ప్రశ్నించారు. కాగా, రేవంత్‌రెడ్డిని కలవడానికి ఘట్కేసర్ పోలీసుస్టేషన్‌కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే, వరంగల్ వె‹స్ట్ నియోజవర్గ ఇన్చార్జి కొండా సురేఖను పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్‌రెడ్డి ఉన్న గదిలోకి వెళ్లకుండా డోర్ మూసివేశారు. డోర్ తీయని పక్షంలో తన దగ్గర ఉన్న సర్జికల్ బ్లేడుతో చేయి కోసుకుంటానని ఆమె బెదిరించింది. మహిళాపోలీసులు అక్కడి నుంచి ఆమెను దూరంగా తీసుకుపోయే ప్రయత్నం చేశారు. -
ప్రైవేటు అకాడమీల ‘డేంజర్ గేమ్’! కీలక అంశాలు వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: మధ్యలో ఉన్న రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగిపోయిందనే ఆవేదన.. ‘అగ్నిపథ్’తో ఉద్యోగ అవకాశం పోతుందేమోనన్న ఆందోళన.. నిరాశా నిస్పృహల్లో ఉన్న ఆర్మీ అభ్యర్థులను ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు రెచ్చగొట్టారు. గట్టిగా నిరసన తెలిపితే ప్రభుత్వం దిగొస్తుందంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులతో ఉసి గొల్పారు. ఆ మాటలు నమ్మిన ఆర్మీ అభ్యర్థులు ఆవేశంతో ఆందోళనకు దిగారు. కానీ ఎవరూ పట్టిం చుకోవడం లేదన్న భావనతో వారిలో కొందరు విధ్వంసం మొదలుపెట్టారు. మరికొందరూ వారిని అనుసరించారు. చివరికి బోగీలకు నిప్పుపెట్టడం, రైళ్లను ధ్వంసం చేయడం వంటి చర్యలకూ దిగారు.. శుక్రవారం నాటి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనపై పోలీసుల దర్యాప్తులో ఇలాంటి కీలక అంశాలెన్నో బయటపడుతున్నాయి. ఏపీలోని నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీని నడుపుతున్న ఆవుల సుబ్బారావు ఈ వ్యవహారంలో సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ఏపీ పోలీసులు శుక్రవారం రాత్రే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి రైల్వే, హైదరాబాద్ సిటీ పోలీసులు.. మొత్తంగా 150 మందికిపైగా అదుపులోకి తీసుకున్నా, రైల్వేస్టేషన్లో ఎవరెవరు విధ్వంసం సృష్టించారో నిర్ధారించి అరెస్టులు చేస్తున్నారు. అందులో శనివారం 52 మందిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపర్చారు. వైద్య పరీక్షల కోసం నిందితులను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తున్న పోలీసులు ఫీజుల కోసం ప్రైవేట్ అకాడమీలు కుట్రతో, పక్కా పథకం ప్రకారం జరిగిన రైల్వేస్టేషన్ విధ్వంసం వెనుక.. సాయి డిఫెన్స్ అకాడమీ సహా తొమ్మిది ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల పాత్ర ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వీటిలో కొన్ని అభ్యర్థులు ఎంపికయ్యా ఫీజుల చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఎంపిక పరీక్షల్లో ఒక్కోదశ దాటే కొద్దీ అభ్యర్థులు నిర్ణీత మొత్తం ఫీజు చెల్లిస్తుంటారు. ఈ నెల 14న రాజ్‌నాథ్‌సింగ్ ‘అగ్నిపథ్’ ప్రకటన చేయడంతో రిక్రూట్మెంట్లు నిలిచిపోతాయని.. తమకు రావాల్సిన ఫీజులు, భవిష్యత్తులో చేరే అభ్యర్థుల సంఖ్యపై ప్రభావం ఉంటుందని అకాడమీలు భావించాయి. ఈ క్రమంలో నిర్వాహకులు అప్పటికే తమవద్ద శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులతో సృష్టించిన వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వీడియోలు పోస్టు చేశారు. ఈ నెల 17న నిరసన తెలపడానికి సికింద్రాబాద్ రైల్వే జంక్షన్‌కు రావాలని సందేశాలు పెట్టారు. ఇలా పాత గ్రూపులు, కొత్తగా క్రియేట్ చేసిన వాటితో కలిపి మొత్తం 12 గ్రూపుల్లో ఈ సమాచారం సర్క్యులేట్ అయింది. సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావుతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తొమ్మిది ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు, ఏపీకి చెందిన అభ్యర్థులు గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కొందరు లాడ్జిల్లో, మరికొందరు హైదరాబాద్‌లోని డిఫెన్స్ అకాడమీల్లో బస చేశారు. వారికి ప్రైవేటు అకాడమీల నిర్వాహకులే భోజనం, ఇతర వసతులు ఏర్పాటు చేశారు. 17న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు రావాలంటూ వాట్సాప్ మెసేజ్ వచ్చిన తర్వాతే పెట్రోల్ తెచ్చి.. శుక్రవారం ఉదయం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్మీ అభ్యర్థులు కృష్ణ, గోదావరి, గౌతమి, ఇతర రైళ్లలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారు తమ ప్రతి కదలికనూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసుకున్నారు. ఈ క్రమంలో హకీంపేట ఆర్మీ సోల్జర్స్ సహా నాలుగు గ్రూపులను గుర్తించిన పోలీసులు.. వాటిలోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. వాటిలో ఉన్న వాయిస్ మెసేజీల ప్రకారం.. ఆర్మీ అభ్యర్థులు తొలుత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద నిరసన తెలపాలని మాత్రమే భావించారు. కానీ ఈ నిరసన ఆశించిన స్థాయిలో అందరి దృష్టీ ఆకర్షించలేదని, బలగాలు వచ్చి తమను తరిమేసే లోపు అందరి దృష్టి ఆకర్షించేలా విధ్వంసానికి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు నిరసన మొదలయ్యాకే వెళ్లి పెట్రోల్ తెచ్చి.. బోగీలకు నిప్పంటించారని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు స్టేషన్లోకి పోలీసు బలగాలు ప్రవేశించడంతో.. బయట రేతిఫైల్ బస్టాప్ వద్ద బస్సులకూ నిప్పుపెట్టాలని అభ్యర్థులు ప్రయత్నించినట్టు గుర్తించారు. ► హకీంపేట్ వాట్సాప్ గ్రూప్‌లోని వాయిస్ మెసేజీలలో.. ‘‘ఎంతసేపు ఒర్రుతార్రా ఒర్రోర్రి నోర్లు నోస్తయ్. అందుకే గమ్మునపోయి పెట్రోల్ తీసుకువచ్చి తగలబెట్టేసినం అనుకో.. బయటికి పోతాది న్యూస్. అంతేగని ఎంతసేపు ఒర్రినా, ఎంతసేపు బ్యానర్లు చూపించినా ఏమీ అవ్వదు. రెండు గంటలు, ఒక గంటల స్క్వాడ్ వస్తది. అందరినీ వెల్లగొడ్తది. అందుకే పోయి పెట్రోల్ తీసుకొస్తే రెండు నిమిషాల్లో తగలబెట్టొచ్చు’ అంటూ ఒక వాయిస్ మెసేజీ.. ► ‘‘అరే పెట్రోల్ పంప్‌కు పోతున్నా పెట్రోల్ తీస్కరానీకి, ఎవరైనా వస్తే పెట్రోల్ తీస్కరానికి రండి’’ అంటూ మరో వాయిస్ మెసేజీ ఉన్నాయి. ► ఇక మరో వాట్సాప్ గ్రూపులో.. ‘‘బెటాలియన్ ఆగయా.. సబ్ లోగ్ రేతిఫైలి కనే ఆజావ్.. బస్ జలాదేంగే..’’ అంటూ ఇంకో వాయిస్ మెసేజీని పోలీసులు గుర్తించారు. ఈ మూడు సందేశాలను పోస్టు చేసినది ఒకే వ్యక్తి కావడంతో.. అతడే విధ్వంసానికి సూత్రధారి అని అనుమానిస్తున్నారు. అడ్మిన్ల ఫోన్ నంబర్లు.. టవర్ లొకేషన్లతో.. రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు, వాట్సాప్ గ్రూపులు, సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 12 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్టు నిందితుల ద్వారా తెలుసుకున్న అధికారులు.. అందులో నాలుగింటిని గుర్తించారు. వీటిలో అడ్మిన్లు, సభ్యుల ఫోన్ నంబర్లు సేకరించి.. వారి సెల్ టవర్ లోకేషన్లను పరిశీలిస్తున్నారు. తద్వారా విధ్వంసం సమయంలో రైల్వేస్టేషన్లో ఉన్నవారిని గుర్తిస్తున్నారు. కేసు తీవ్రమైనది కావడంతో అనుమానితులను పూర్తిగా పరిశీలించి, ప్రశ్నించాకే అరెస్టు చేస్తున్నారు. పోలీసులు శుక్రవారం రైల్వే స్టేషన్ వద్ద సుమారు 150 మందిని అదుపులోకి తీసుకుని వివిధ ఠాణాలకు తరలించారు. పరిశీలన అనంతరం 52 మందిని నిందితులుగా గుర్తించి శనివారం అరెస్టు చేశారు. వారికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో కీలకమని భావిస్తున్న మరో ఏడుగురిని ప్రశ్నిస్తుండగా.. మిగతా వారిని విడిచిపెట్టారు. మొత్తంగా ఈ కేసులో నిందితులుగా 200 మందిని గుర్తించారు. వారి కోసం సికింద్రాబాద్ జీఆర్పీతోపాటు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, నార్త్‌జోన్ పోలీసులకు చెందిన ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. దర్యాప్తును హైదరాబాద్ అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, డీసీపీ చక్రవర్తి గుమ్మి పర్యవేక్షిస్తున్నారు. పట్టుకున్నాక తెలిసింది పోలీసని.. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం మొదలయ్యాక మీడియాకు ఓ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి దిగారని, రావాలని ఆ ఫోన్ చేసిన వ్యక్తి కోరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి కూడా అభ్యర్థేనని, కీలక వ్యక్తి కావడంతోనే మీడియాను పిలిచి ఉంటాడని భావించారు. ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే అప్రమత్తమై తప్పించుకోవచ్చని భావించి.. సాంకేతిక ఆధారాలు, ముమ్మర గాలింపుతో ఆయనను గుర్తించి పట్టుకున్నారు. కానీ ఆయన జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ అని తెలిసింది. రైల్వేస్టేషన్లో ఆందోళనకు దిగిన అభ్యర్థులను వెళ్లిపోవాలని కోరగా.. మీడియా వస్తే తప్ప వెళ్లబోమని భీష్మించారని, దాంతో మీడియా వస్తే త్వరగా నిరసన ముగుస్తుందనే ఫోన్ చేశానని ఆయన వివరించారు. దీంతో ఆయన్ను అధికారులు విడిచిపెట్టారు. కీలక నిందితుడు.. ఏపీ పోలీసుల అదుపులో.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో అభ్యర్థులను ప్రేరేపించిన నిందితుడు, సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును ఏపీ పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆవుల సుబ్బారావు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని రావిపాడు పంచాయతీ పరిధిలో డిఫెన్స్ అకాడమీని నడుపుతున్నారు. గురువారం అర్ధరాత్రి సికింద్రాబాద్ వెళ్లిన సుబ్బారావు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నరసరావుపేటకు చేరుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడి పాతూరులోని సాయి రెసిడెన్సీ లాడ్జిలో శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు చెందిన డిఫెన్స్ అకాడమీ కార్యాలయంలో తనిఖీలు చేసి.. రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్న సుబ్బారావును ఆదివారం తెలంగాణ పోలీసులకు అప్పగించే అవకాశమున్నట్టు తెలిసింది. అయితే సుబ్బారావు గుంటూరు, విశాఖపట్నంలలోనూ ఆర్మీ అభ్యర్థుల నిరసనలకు ప్రేరేపిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టినట్టు గుర్తించారు. దీనితో అక్కడే కేసులు నమోదు చేసి, అరెస్టు చేయవచ్చే వాదన వినిపిస్తోంది. సుబ్బారావు అప్పగింతపై శనివారం రాత్రి వరకు స్పష్టత రాలేదు. -
సీఎంవో నుంచే విధ్వంస రచన.. బండి సంచలన వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం సీఎం కేసీఆర్ కార్యాలయం నుం చి వచ్చిన పక్కా పథకం ప్రకారమే జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసమే ఆందోళనకారులపై రాష్ట్ర పోలీసులే కాల్పులు జరిపారని ఆరోపించారు. కరీంనగర్లో ఉమ్మ డి జిల్లాకు చెందిన శక్తి కేంద్ర ఇన్‌చార్జీలతో శనివారం బండి సంజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ 30 శాతానికి పడిపోయిందని, ట్రిపుల్ ఐటీ, గౌరవెల్లి నిర్వాసితుల ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ‘అగ్నిపథ్’పేరుతో విధ్వంసానికి కేసీఆర్ కుట్ర చేశారని విమర్శించారు. రైల్వేస్టేషన్ విధ్వంసంపై ఇంటెలిజెన్స్‌కు ముందస్తు సమాచారం ఉందని ఆరోపించారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ అంతిమ యాత్రలో టీఆర్ఎస్ నేతలు విధ్వంసం సృష్టించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తుండటం దుర్మార్గమన్నారు. కేసీఆర్ కుటుంబంలో సీఎం పదవిపై కలహాలు మొదలయ్యాయని, త్వరలోనే ఆ పార్టీ చీలిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. రాజ్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ ముందే హెచ్చరించినా.. వారిని ఆపలేదని, అదే బీజేపీ చిన్న ఆందోళనకు పిలుపునిచ్చినా..హౌస్ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఆందోళనకారుల వెనక ఉన్న దుండగులు పథకం ప్రకారమే రాళ్లు రువ్వి విధ్వంసానికి దిగారని, ఆర్మీ అభ్యర్థులు వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. -
నాకు ఎలాంటి సంబంధం లేదు.. కానీ నాకు అతనితో పరిచయం ఉంది
-
సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. 52 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లరకు సంబంధించి ఇప్పటివరకు 52 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉండి పారిపోయిన మరికొందరి కోసం టాస్క్‌ఫోర్స్, నార్త్‌జోన్, రైల్వే, పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ దాడిలో 200 మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. కుట్రకోణంలో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. అరెస్టయిన నిందితులను మరికాసేపట్లో రిమాండ్‌కు తరలించనున్నారు. ఈ మేరకు నిందితులను రైల్వే కోర్టులో పోలీసులు హాజరు పరచనున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువత తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ నిర్వహించిన ఆందోళనలు విధ్వంసాన్ని సృష్టించాయి. నిరసనకారుల దాడులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భీతావహంగా మారింది. ఈ హింసాత్మక నిరసనల్లో రూ. ఏడు కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. చదవండి: అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్రం దిద్దుబాటు చర్య -
అంతిమ యాత్రకు బయలుదేరిన రేవంత్ రెడ్డికి షాకిచ్చిన పోలీసులు
-
ఆందోళనకారులు నాపై కర్రలు, రాళ్లతో దాడి చేసారు: వెంకట రాములు
-
సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో 22 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో 22 మందిని అరెస్ట్ చేశారు. నరసరావుపేట నుంచి వచ్చిన అభ్యర్థులే దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సాయి ఢిపెన్స్ అకాడమీ అభ్యర్థులే ఎక్కువగా ఆందోళనలో పాల్గొన్నట్లు గుర్తించారు. గుంటూరుతో పాటు మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ అభ్యర్థులు ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన రైలులో సాయి ఢిపెన్స్ అకాడమీకి చెందిన 450 మంది విద్యార్థులను పోలీసులు గుర్తించారు. చదవండి: (సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి వెనక సంచలన విషయాలు) -
ఏపీ పోలీసుల అదుపులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్