సాక్షి, సికింద్రాబాద్/ విశాఖపట్నం: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) విజ్ఞప్తి అందించింది. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నేడు రద్దయినట్లు తెలిపింది. విశాఖ పట్నం-సికింద్రాబాద్ వందే భారత్ రైలుతోపాటు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ విశాఖ పట్నం వందే భారత్ రైలు కూడా రద్దు చేసినట్లు పేర్కొంది. రేక్‌ల సమస్య వల్ల రైలును క్యాన్సల్ చేసినట్లు అధికారులువ వెల్లడించారు.
అయితే ప్రత్యామ్నాయంగా ప్రయాణికుల సౌకర్యం కోసం అధికారులు ప్రత్యేక రైలును (08134A) ఏర్పాటు చేశారు. ఇది మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుందని, రాత్రి 11.30 గంటలకు విశాఖకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ రైలుకు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. వరంగల్, ఖమ్మంలో ఒక్క నిమిషం.. రాజమండ్రి, సామర్లకోటలో రెండు నిమిషాలు.. విజయవాడ స్టేషన్‌లో ఐదు నిమిషాలు ఈ రైలు ఆగుతుంది. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు. మరోవైపు ఇలా అనూహత్యం, రైలురద్దయినట్లు ప్రకటించడం సరైనది కాదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment