train cancellation
-
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో జరుగుతున్న నాన్–ఇంటర్ లాక్ పనుల కారణంగా డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రూప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. రద్దయిన రైళ్లు: తెనాలి–విజయవాడ (7630), విజయవాడ–గూడూరు (7500), నర్సాపూర్–విజయవాడ (17270), విజయవాడ–బిట్రగుంట (7978) ఆగస్టు 3 నుంచి 10 వరకు, నర్సాపూర్–గుంటూరు (7281), హుబ్లి–విజయవాడ (17329) ఆగస్టు 4 నుంచి 10 వరకు, గూడూరు–విజయవాడ (7458), విజయవాడ–మాచర్ల (7781), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238) ఆగస్టు 4 నుంచి 11 వరకు, విజయవాడ–భద్రచలం రోడ్డు (7979), భద్రచలం రోడ్డు–విజయవాడ (7278), విజయవాడ–తెనాలి (7295), తెనాలి–విజయవాడ (7575), విజయవాడ–గుంటూరు (7464/7465), విజయవాడ–డోర్నకల్ (7756/7755), విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714), గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202), విశాఖపట్నం–కడప (17488), విజయవాడ–చెన్నై సెంట్రల్ (12711/12712) ఆగస్టు 5 నుంచి 10 వరకు, గుంటూరు–రేపల్లె (7784/7785), గుంటూరు–విజయవాడ (7976), విజయవాడ–నర్సాపూర్ (17269), విజయవాడ–హుబ్లి (17330) ఆగస్టు 5 నుంచి 11 వరకు, మాచర్ల–విజయవాడ (7782), విజయవాడ–తెనాలి (7629), బిట్రగుంట–విజయవాడ (7977), విజయవాడ–నర్సాపూర్ (7862) ఆగస్టు 8 నుంచి 12 వరకు, కడప–విశాఖపట్నం (17487) ఆగస్టు 6 నుంచి 11 వరకు, చెన్నై సెంట్రల్–విజయవాడ (12077/12078) ఆగస్టు 5, 7, 8, 9, 10 తేదీలలో పూర్తిగా రద్దు చేశారు. దారి మళ్లింపు: సికింద్రాబాద్–విశాఖపట్నం (12740) ఆగస్టు 2 నుంచి 10 వరకు, గాం«దీనగర్–విశాఖపట్నం (20804) ఆగస్టు 4న, నిజాముద్దిన్–విశాఖపట్నం (12804) ఆగస్టు 4, 7వ తేదీలలో, ఛత్రపతి శివాజీ టెర్మినస్–భువనేశ్వర్ (11019) ఆగస్టు 2 నుంచి 10 వరకు, యశ్వంత్‌పూర్–టాటా (18112) ఆగస్టు 4న, హైదరాబాద్–షాలీమార్ (18046) ఆగస్టు 3 నుంచి 11 వరకు, షిర్డీ సాయినగర్–కాకినాడ పోర్టు (17205) ఆగస్టు 4, 6, 8 తేదీలలో, షిర్డీ సాయినగర్–విశాఖపట్నం (18504) ఆగస్టు 2, 9 తేదీలలో, న్యూ ఢిల్లీ–విశాఖపట్నం (20806) ఆగస్టు 2 నుంచి 10 వరకు, హైదరాబాద్–విశాఖపట్నం (12728) ఆగస్టు 3 నుంచి 11 వరకు, విశాఖపట్నం–సికింద్రాబాద్ (12739) ఆగస్టు 2 నుంచి 10 వరకు, విశాఖపట్నం–న్యూఢిల్లీ (20805) ఆగస్టు 2 నుంచి 10 వరకు, భువనేశ్వర్–ఛత్రపతి శివాజీ టెర్మినస్ (11020) ఆగస్టు 2 నుంచి 10 వరకు, కాకినాడ పోర్టు–íÙర్డీ సాయినగర్ (17206) ఆగస్టు 3, 5, 7, 10 తేదీలలో, షాలీమార్–హైదరాబాద్ (18045) ఆగస్టు 2 నుంచి 10 వరకు, విశాఖపట్నం–నిజాముద్దిన్ (12803) ఆగస్టు 5, 9 తేదీలలో, విశాఖపట్నం–సాయినగర్ షిర్డీ (18503), టాటా–యశ్వంత్‌పూర్ (18111) ఆగస్టు 8న, విశాఖపట్నం–హైదరాబాద్ (12727) ఆగస్టు 3, 11 తేదీలలో, విశాఖపట్నం–గాందీనగర్ (20803) ఆగస్టు 8న, మచిలీపట్నం–íÙర్డీ సాయినగర్ (17208), నర్సాపూర్–నాగర్సోల్ (12787) ఆగస్టు 3, 5, 6, 7, 8, 10 తేదీలలో, మచిలీపట్నం–బీదర్ (12749) ఆగస్టు 3 నుంచి 11 వరకు, లోకమన్య తిలక్ టెర్మినస్–విశాఖపట్నం (18520) ఆగస్టు 2 నుంచి 10 వరకు, షిర్డీ సాయినగర్–మచిలీపట్నం (17207) ఆగస్టు 7న, నాగర్సోల్–నర్సాపూర్ (12788) ఆగస్టు 2, 4, 6, 7, 8, 9 తేదీలలో, బీదర్–మచిలీపట్నం (12750) ఆగస్టు 8 నుంచి 10 వరకు వయా రాయనపాడు, గుణదల, విజయవాడ బైపాస్ మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. -
విజయవాడ డివిజన్లో రైళ్ల రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం (17219), గుంటూరు–విశాఖపట్నం (22701/22702), ఏప్రిల్ 2 నుంచి 29 వరకు విశాఖపట్నం–మచిలీపట్నం (17220) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. అలాగే ఏప్రిల్ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం – విజయవాడ (07896), విజయవాడ – మచిలీపట్నం (07769), నర్సాపూర్ – విజయవాడ (07863), విజయవాడ – నర్సాపూర్ (07866), మచిలీపట్న – విజయవాడ (07770), విజయవాడ – భీమవరం జంక్షన్ (07283), మచిలీపట్నం – విజయవాడ (07870), విజయవాడ – నర్సాపూర్ (07861) రైళ్లు విజయవాడ – రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దు అయ్యాయి. దారి మళ్లింపు.. ఏప్రిల్ 1, 8, 15, 22 తేదీల్లో ఎర్నాకుళం–పాట్నా (22643), ఏప్రిల్ 6, 13, 20, 27 తేదీల్లో భావ్‌నగర్ – కాకినాడ పోర్టు (12756), ఏప్రిల్ 3, 5, 10, 12, 17, 19, 24, 26 తేదీల్లో బెంగళూరు–గౌహతి (12509), ఏప్రిల్ 1, 3, 5, 6, 8, 10, 12, 13, 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ (11019), ఏప్రిల్ 1 నుంచి 28 వరకు ధనాబాద్ – అలప్పుజ (13351), ఏప్రిల్ 4, 11, 18, 25 తేదీల్లో టాటా–యశ్వంత్‌పూర్ (18111), ఏప్రిల్ 3, 10, 17, 24 తేదీల్లో జసిదిహ్ – తాంబరం (12376), ఏప్రిల్ 1, 8, 15, 22 తేదీల్లో హతియ – ఎర్నాకుళం (22837), ఏప్రిల్ 6, 13, 20, 27 తేదీల్లో హతియ – బెంగళూరు (18637), ఏప్రిల్ 2, 7, 9, 14, 16, 21, 23, 28 తేదీల్లో హతియ – బెంగళూరు (12835), ఏప్రిల్ 5, 12, 19, 26 తేదీల్లో టాటా – బెంగళూరు (12889) రైళ్లు వయా విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. -
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు రద్దు
సాక్షి, సికింద్రాబాద్/ విశాఖపట్నం: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) విజ్ఞప్తి అందించింది. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నేడు రద్దయినట్లు తెలిపింది. విశాఖ పట్నం-సికింద్రాబాద్ వందే భారత్ రైలుతోపాటు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ విశాఖ పట్నం వందే భారత్ రైలు కూడా రద్దు చేసినట్లు పేర్కొంది. రేక్‌ల సమస్య వల్ల రైలును క్యాన్సల్ చేసినట్లు అధికారులువ వెల్లడించారు. అయితే ప్రత్యామ్నాయంగా ప్రయాణికుల సౌకర్యం కోసం అధికారులు ప్రత్యేక రైలును (08134A) ఏర్పాటు చేశారు. ఇది మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుందని, రాత్రి 11.30 గంటలకు విశాఖకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలుకు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. వరంగల్, ఖమ్మంలో ఒక్క నిమిషం.. రాజమండ్రి, సామర్లకోటలో రెండు నిమిషాలు.. విజయవాడ స్టేషన్లో ఐదు నిమిషాలు ఈ రైలు ఆగుతుంది. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు. మరోవైపు ఇలా అనూహత్యం, రైలురద్దయినట్లు ప్రకటించడం సరైనది కాదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
హైదరాబాద్: 34 ఎమ్ఎమ్టీఎస్ రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ సమస్యల కారణంగా ఆదివారం 34 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్లో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి రూట్లో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్లో 7, లింగంపల్లి ఫలక్‌నుమా రూట్ 7, సికింద్రాబాద్-లింగంపల్లి రూట్లో ఒక్క సర్వీస్, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్లో ఒక్క సర్వీసు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
నేడు తీరం దాటనున్న 'యాస్'
సాక్షి, విశాఖపట్నం/పూసపాటిరేగ (విజయ నగరం)/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న యాస్ తుపాను మరింత బలపడింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ అతి తీవ్ర తుపానుగా మారింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 200 కిలోమీటర్లు, బాలాసోర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 290, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది బుధవారం మధ్యాహ్నం ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాల్లోని పారాదీప్, సాగర్ ఐలాండ్స్ మధ్య బాలాసోర్‌కు దక్షిణ దిశలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం దాటిన తర్వాత 12 గంటల పాటు అతి తీవ్ర తుపానుగానే కొనసాగుతూ 27వ తేదీ ఉదయానికి క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. రాష్ట్రంలో యాస్ తుపాను ప్రభావంపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస తీరంలో సముద్రం 10 మీటర్ల ముందుకు వచ్చింది. సముద్రంలో బలంగా గాలులు వీయడం వల్లే సముద్రం ముందుకు వచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. తీరానికి అనుకుని ఉన్న ఈ గ్రామస్తులు అధికారుల హెచ్చరికలతో సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వానలు ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రెండురోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి వానలు పడతాయని చెప్పారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో బుధవారం గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టులో సెక్షన్ సిగ్నల్ నంబర్–1, 2, 3తో పాటు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేయగా, కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు అప్రమత్తత సమాచారం అందించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కెరటాల ఉద్ధృతి పెరుగుతుందని తెలిపారు. రెండురోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. పలు జిల్లాల్లో వర్షాలు గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విశాఖపట్నం జిల్లా అంతటా ఆకాశం మేఘావృతమైంది. తుఫాన్ కారణంగా రాజస్థాన్ నుంచి పొడిగాలులు రాష్ట్రం వైపుగా వీస్తుండటంతో ఎండలు కూడా పెరుగుతున్నాయి. మాచర్ల, చీమకుర్తి, దొనకొండలో అత్యధికంగా 42 డిగ్రీలు, అవుకు, ఒంగోలు, కలిగిరిల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మాల్దీవులు, కొమరిన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. 48 గంటల్లో మాల్దీవులతోపాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. అప్రమత్తమైన ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్... ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో యాస్ తుపాను ప్రభావం తీవ్రంగాను, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రపై స్వల్పంగా ఉండటంతో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే వంతెనలు, నదుల సమీపంలోని రైల్వే ట్రాక్స్, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. వరద ఉధృతికి కాలువలు పొంగి ట్రాక్‌లు దెబ్బతినకుండా ముందస్తు చర్యలుగా పూడికతీత పనులు ప్రారంభించారు. వాల్తేరు డివిజన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 24 గంటలూ తుపాను పరిస్థితిని పసిగట్టేందుకు విశాఖ డివిజన్‌తో పాటు భువనేశ్వర్‌లోని హెడ్‌క్వార్టర్స్, ఖుర్దారోడ్, సంబల్పూర్లలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్స్ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. తుపాను కారణంగా మరో మూడు ప్రత్యేక రైళ్లను రద్దుచేస్తున్నట్లు రైల్వేశాఖ మంగళవారం ప్రకటించింది. ఈ నెల 28న యశ్వంత్‌పూర్–గౌహతి (06577), చెన్నైసెంట్రల్–భువనేశ్వర్ (02840), 30న పూరి–చెన్నైసెంట్రల్ (02859) రైళ్లను రద్దుచేసింది. -
రైలు రద్దయితే నేరుగా ఖాతాలోకే రీఫండ్
న్యూఢిల్లీ: ఏదేనీ రైలు తొలి స్టేషన్ నుంచి చివరి స్టేషన్ వరకు మొత్తంగా రద్దయితే, ఆ రైలుకు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోకే ఆటోమేటిక్‌గా వెనక్కు వస్తాయని ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) స్పష్టంచేసింది. ప్రయాణికులు తమ టికెట్‌ను రద్దుచేసుకుని రీఫండ్ కోసం అభ్యర్థించాల్సిన అవసరం లేదంది. రైలు పూర్తిగా రద్దయినప్పుడు ఆ రైలు ఎక్కాల్సిన ప్రయాణికులందరి పీఎన్ఆర్లు ఆటోమేటిక్‌గా రద్దవుతాయంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ప్రయాణికులు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సమయంలో ఏ బ్యాంకు ఖాతాను/కార్డును వాడతారో ఆ ఖాతాలోకే నేరుగా డబ్బులు జమ అవుతాయని తెలిపింది. కాగా, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేశాక, రైలు బయలుదేరే సమయానికి కూడా బెర్తు/సీటు కన్ఫర్మ్ అవ్వకపోతే కూడా ఆ వెయిట్‌లిస్టింగ్ టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దయ్యి రీఫండ్ నేరుగా బ్యాంకు ఖాతాలోకొస్తాయి. -
వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలను అంతరాయం
భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. రైలు నెంబర్ 02728: సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే స్పెషల్ ట్రైన్‌ను రద్దు చేసినట్లు తెలిపింది. సికింద్రాబాద్-భువనేశ్వర్ నగరాల మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్ రాత్రి తొమ్మిది గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరనుందని, అలాగే సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఈ రోజు రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుందని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది.