న్యూఢిల్లీ: ఏదేనీ రైలు తొలి స్టేషన్ నుంచి చివరి స్టేషన్ వరకు మొత్తంగా రద్దయితే, ఆ రైలుకు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోకే ఆటోమేటిక్‌గా వెనక్కు వస్తాయని ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) స్పష్టంచేసింది. ప్రయాణికులు తమ టికెట్‌ను రద్దుచేసుకుని రీఫండ్ కోసం అభ్యర్థించాల్సిన అవసరం లేదంది.
రైలు పూర్తిగా రద్దయినప్పుడు ఆ రైలు ఎక్కాల్సిన ప్రయాణికులందరి పీఎన్‌ఆర్‌లు ఆటోమేటిక్‌గా రద్దవుతాయంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ప్రయాణికులు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సమయంలో ఏ బ్యాంకు ఖాతాను/కార్డును వాడతారో ఆ ఖాతాలోకే నేరుగా డబ్బులు జమ అవుతాయని తెలిపింది. కాగా, ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేశాక, రైలు బయలుదేరే సమయానికి కూడా బెర్తు/సీటు కన్ఫర్మ్ అవ్వకపోతే కూడా ఆ వెయిట్‌లిస్టింగ్ టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దయ్యి రీఫండ్ నేరుగా బ్యాంకు ఖాతాలోకొస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment