'బుక్ నౌ.. పే లేటర్' విధానాన్ని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఆటో మొబైల్ కంపెనీలు, ఈ కామర్స్ వెబ్‌సైట్‌లు ఈ విధానం అమలు చేస్తున్నాయి. కాగా ఇప్పుడు 'ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్' (ఐఆర్‌సీటీసీ) దీనిని ప్రవేశపెట్టింది. అంటే డబ్బు లేకపోయినా టికెట్ పొందవచ్చు, ఆ తరువాత గడువు లోపల డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన 'ఇప్పుడే బుక్ చేయండి, తర్వాత చెల్లించండి' విధానంలో.. బుకింగ్ ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయాలి. బుక్ చేసుకున్న తరువాత 14 రోజుల్లో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
'బుక్ నౌ.. పే లేటర్'
➤ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
➤బుక్ నౌ ఆప్షన్ ఎంచుకున్న తరువాత.. ప్రయాణం చేయాల్సిన వ్యక్తి వివరాలను ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
➤ఆ తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అవసరమైన వివరాలను ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.
➤ఇవన్నీ పూర్తయిన తరువాత పేమెంట్ పేజీకి వెళ్తారు. అక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, భీమ్ (BHIM) యాప్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేయడానికి ఆప్షన్స్ కనిపిస్తాయి.
➤పే లేటర్ ఫీచర్‌ని ఉపయోగించాలనుకునే కస్టమర్‌లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. 'ఈపేలేటర్' ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
➤ముందుగా ఈపేలేటర్ పేజీలో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే పేమెంట్ ఆప్షన్స్ పేజీలో 'పే లేటర్' ఆప్షన్ కనిపిస్తుంది.
➤ఇలా పే లేటర్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి 14 రోజుల్లో డబ్బు చెల్లించాలి.
➤14 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే.. 3.5 శాతం సర్వీస్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: TRAI: రూ. 20తో.. 120 రోజులు: ఇదే రూల్..
Comments
Please login to add a commentAdd a comment