మొబైల్ యూజర్లలో చాలామంది రెండు సిమ్ కార్డులను ఉపయోగిస్తుంటారు. ఈ రెండూ యాక్టివేట్‌లో ఉండాలంటే తప్పనిసరిగా రీఛార్జ్ చేసుకోవాలి. ఇది యూజర్లకు భారమవుతోంది. దీనిని దృష్టిలో ఉందుకుని ట్రాయ్ కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం కేవలం 20 రూపాయలు రీఛార్జ్ చేసుకుని సిమ్ కార్డును 120 రోజులు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు.
సిమ్ కార్డును కాల్స్, ఎస్ఎమ్ఎస్ లేదా డేటా వంటి వాటి కోసం ఉపయోగించకుండా, ఎటువంటి రీఛార్జ్ చేసుకోకుండా 90 రోజులు పక్కన పెడితే.. అది ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. ఆ తరువాత సిమ్ కార్డును (నెంబర్) టెలికాం ఆపరేటర్లు వేరేవారికి కేటాయిస్తారు. ఆలా జరగకుండా ఉండాలంటే.. రూ. 20తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనల ప్రకారం, మీరు 90 రోజులు సిమ్ కార్డును ఉపయోగించకుండా ఉంటే.. మీ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ నుంచి 20 రూపాయలు కట్ అవుతుంది. మరో 30 రోజులు యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతినెలా ఇలా రీఛార్జ్ చేసుకుంటే నెంబర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ కొత్త రూల్ జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియా (VI) వంటి అన్ని సంస్థలకు వర్తిస్తుంది.
ఇదీ చదవండి: ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్‌లలో మార్పు: వివరాలివిగో..
సమయానికి మీరు 20 రూపాయలతో రీఛార్జ్ చేయనప్పుడు గ్రేస్ పీరియడ్ 15 రోజులు లభిస్తుంది. ఆ తరువాత కూడా రీఛార్జ్ చేయకపోతే టెలికాం కంపెనీ సిమ్ కార్డును డీయాక్టివేట్ చేస్తుంది. ట్రాయ్ ప్రవేశపెట్టిన ఈ రూల్ కొత్తది కాదు. 2013 మార్చిలోనే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నియమాన్ని తీసుకొచ్చింది. కానీ దీనిని టెలికాం ఆపరేటర్లు పెడచెవిన పెట్టారు. కానీ ఇప్పుడు తప్పకుండా అన్ని సంస్థలు ఈ రూల్ పాటించాల్సిందే అంటూ ట్రాయ్ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment