Rule
-
సంబురాలు.. నిరసనలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. ఓవైపు అధికార కాంగ్రెస్ అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నిరసనలు, బీజేపీ చార్జిషీట్లతో వారం రోజులుగా హడావుడి పెరిగిపోయింది. కాంగ్రెస్ సర్కారు రైతు పండుగ పేరుతో గత నెల 30న ప్రారంభించిన ప్రజాపాలన విజయోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రజాపాలన విజయోత్సవాలకు కౌంటర్‌గా బీజేపీ, బీఆర్ఎస్ల చార్జిషిట్లు, నిరసనలు, బీఆర్ఎస్ నేతల నిర్బంధం వంటివి రాజకీయంగా సెగ పెంచుతున్నాయి. రైతు పండుగ నుంచి..గత నెల 30న రైతు పండుగ పేరుతో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన భారీ సభతో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలను ప్రారంభించింది. రైతు రుణమాఫీకి సంబంధించి నాలుగో విడతగా రూ.2,700 కోట్లను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేశారు. తర్వాతి రోజున మీడియాతో మాట్లాడిన సీఎం... రైతుల సంక్షేమం కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందజేస్తామని ప్రకటించారు. తర్వాతి రోజున ఆరోగ్య ఉత్సవాల్లో పాల్గొనడంతోపాటు సిద్దిపేట జిల్లాలో కోకాకోలా ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలతో ‘హైదరాబాద్ రైజింగ్’పేరిట కార్యక్రమం నిర్వహించారు.తర్వాతి రోజున పెద్దపల్లిలో యువ వికాసం సభలో డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులతో కలసి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. మరుసటి రోజున ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభించారు. శుక్రవారం హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవాలకు హాజరైన సీఎం రేవంత్.. హోంగార్డులపై వరాల జల్లు కురిపించారు. ఇక 7, 8, 9 తేదీల్లో ఘనంగా విజయోత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 9న సచివాలయంలో ‘తెలంగాణ తల్లి’విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక వివిధ ప్రభుత్వ శాఖలు గత ఏడాది కాలంలో సాధించిన పురోగతిపై ప్రోగ్రెస్ రిపోర్టులను కూడా విడుదల చేయడం గమనార్హం. చార్జిషిట్లతో ప్రజల్లోకి బీజేపీ.. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ కొంత దూకుడుగా వెళుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు మేరకు ఈనెల 1 నుంచి 5వ తేదీ వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిలలో చార్జిషిట్లు, ఐదు రోజుల పాటు బైక్‌ర్యాలీల నిర్వహణ, కరపత్రాల పంపిణీ ద్వారా... ప్రభుత్వ వైఫల్యాలను 6 అబద్ధాలు– 66 మోసాల పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.ఇక 7న సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా హాజరుకానున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఎలాంటి విమర్శలు గుప్పిస్తుందన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు కేంద్రంలోని గత పదేళ్ల బీజేపీ పాలన, ఇక్కడి ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు రావాలంటూ టీపీసీసీ నేతలు సవాల్ విసరడంతో బీజేపీ చార్జిషిట్ల ఎపిసోడ్ రక్తి కట్టింది. నిర్బంధాల నడుమ కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ కూడా గట్టిగానే పోరాడుతోంది. రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్‌గాం«దీ, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. చాలా అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో గత కొన్నిరోజుల్లోనే కేటీఆర్, హరీశ్‌రావులపై 10కిపైగా కేసులు నమోదయ్యాయి. ఇక మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఫోన్‌ట్యాపింగ్ కేసు నమోదడంతో ప్రధాన ప్రతిపక్షం కొంత అప్రమత్తమైంది.ఇందుకు ప్రతిగా ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన ఫోన్ ట్యాప్ అవుతోందని.. కేసు నమోదు చేయాలంటూ చేసిన హడావుడి రాజకీయ రచ్చకు దారితీసింది. పోలీసులు ఎమ్మెల్యేపైనే కేసుపెట్టి, అదుపులోకి తీసుకోవడం, పరామర్శించేందుకు వెళ్లిన హరీశ్‌రావును కూడా అదుపులోకి తీసుకుని 10 గంటల తర్వాత విడుదల చేయడం చర్చజరిగింది. మరోవైపు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచి్చంది. దీంతో శుక్రవారం ఉదయం నుంచే హరీశ్‌రావు, కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్ఎస్ నేతలను పోలీసులు నిర్బంధించారు. ఇక ఈ నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అందుకోసం అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీనితో ఈ రాజకీయ వేడి మరికొంతకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. -
దక్షిణ కొరియాలో సైనిక పాలన విధింపు
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దేశంలో సైనిక పాలన విధిస్తూ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. టీవీ చానెల్ ద్వారా ఈ ప్రకటన చేసిన యూన్.. ఉత్తర కొరియా దాడుల భయం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.‘‘ప్రతిపక్షాలు దేశానికి ద్రోహం చేశాయి. ఉత్తర కొరియాతో అవి చేతులు కలిపాయి. ఆ దేశం కోసమే పని చేస్తున్నాయవి. గత కొంతకాలంగా పార్లమెంట్‌ను విపక్షాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తమ కుట్రలో భాగంగానే ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. వాటిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశ భద్రత కోసమే అత్యవసర సైనిక పాలన నిర్ణయం’’ అని యూన్ సుక్ యోల్ ప్రకటించారు.BREAKING NEWS:🇰🇷 Korea's President Yoon Suk Yeol declared martial law amid escalating political tensions, citing opposition parties' actions as a threat to national stability.#SouthKorea #MartialLaw #YoonSukYeol #Politics #Democracy #AsiaNews pic.twitter.com/uDysiGBeyd— Shahadat Hossain (@shsajib) December 3, 2024అయితే యూన్ ప్రకటనను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించుకుంది. పార్లమెంట్ వద్ద ఉద్రిక్తతసైనిక పాలన విధింపు ప్రకటనను వ్యతిరేకిస్తూ చట్ట సభ్యులు, భారీ ఎత్తున జనం పార్లమెంట్ వద్ద గుమిగూడారు. వాళ్లను లోపలికి వెళ్లనివ్వకుండా భద్రతా బలగాలు అడ్డుకుంటున్నాయి.South Korean lawmakers and citizens have been barred from entering the parliament building following President Yoon Suk Yeol's declaration of martial law. #SouthKorea pic.twitter.com/NWok44FNfG— Geo View (@theGeoView) December 3, 20242022లో పీపుల్ పవర్ పార్టీ తరఫున యూన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్షాల వైఖరితో ఆయన ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది కోసం బడ్జెట్ రూపకల్పన విషయంలో ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీని ఏకతాటిపైకి తెచ్చుకోలేకపోతున్నారు. ఇంకోవైపు.. అధ్యక్షుడి భార్య, ఆయన పేషీలో ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణకు ప్రతిపక్షాలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. -
ఉద్యోగంలోంచి తీసేస్తే..గ్రాట్యుటీ వస్తుందా? రాదా? ఏం చేయాలి?
నేను ఒక చిన్న కంపెనీలో ఆరేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను. ఒక నెల నోటీసు ఇచ్చి నిన్ను ఫైర్ చేస్తున్నాం, వెళ్ళిపొమ్మన్నారు. నేను గ్రాట్యుటీ పొందడానికి అర్హుడినా? – శ్రీకాంత్, విశాఖపట్నంపీ.ఎఫ్., గ్రాట్యుటీ, ఈ.ఎస్.ఐ. వంటివి సాంఘిక సంక్షేమ పథకాలు. వాటిద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలను ఎవరూ కాదనలేరు. అలా చేస్తే చట్టం అంగీకరించదు. గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 ప్రకారం, ఐదు సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగికీ గ్రాట్యుటీ లభిస్తుంది. కొన్ని హై కోర్టులు ఇచ్చిన తీర్పులలో 4 సంవత్సరాల 7 నెలలు పూర్తి అయినా ఐదేళ్ళగా పరిగణించి గ్రాట్యుటీ ఇవ్వాలి అని పేర్కొనటం జరిగింది. ఒక సంవత్సరం వ్యవధిలో కనీసం 10 మంది పనిచేసిన సంస్థ లేదా షాపులకి కూడా గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది. యాజమాన్యం మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేసి, గ్రాట్యుటీ ఇవ్వను పొమ్మంటే, మీరు లేబర్ కమిషనర్ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు. సదరు అధికారి మీ దరఖాస్తును పరిశీలించి, యాజమాన్య పక్షం వాదనలు కూడా విని తీర్పుని ఇస్తారు. సాధారణంగా పోస్టల్ డిపార్ట్మెంట్లోని పోస్ట్మాన్లకు వారి పదవీ విరమణ సమయంలో కొద్దిమొత్తం డబ్బులు ఇస్తారు. ఒక ΄ోస్ట్మాన్ వేసిన కేసులో వీరికి కూడా గ్రాట్యుటీ వర్తించాలి అని పూణేలోని లేబర్ కమిషనర్ ఆదేశించారు. గ్రాట్యుటీకి సంబంధించి ఒక కాలిక్యులేషన్ ఉంటుంది. అది 15 గీ బేసిక్ + డీఏగీ పనిచేసిన సంవత్సరాలు / 26. ఉదాహరణకి మీ బేసిక్ + డీ.ఏ నెలకి 50 వేలు, 10 సంవత్సరాలు పనిచేశారు అనుకోండి, అప్పుడు 15 గీ 50,000 గీ 10/26 = 2,88,461/– గ్రాట్యుటీ వస్తుంది.అలాగే, కనీసం 20 మంది పనిచేస్తున్న సంస్థ లేదా షాపులకి కూడా ్ర΄ావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్.) చట్టం వర్తిస్తుంది. ఒకవేళ మీ యాజమాన్యం పీ.ఎఫ్. మీ అకౌంట్లలోకి జమ చేయని పక్షంలో, పీ.ఎఫ్. కమిషనర్ ముందు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలా చేస్తే, పూర్వబకాయిలు సైతం కట్టించి మీకు ఇప్పిస్తారు. పీ.ఎఫ్. అలాగే గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలకి సగటు ఉద్యోగి లేబర్ పరిధిలోకి రానవసరం లేదు. అలాగే, కొన్ని సందర్భాలలో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగస్తులకు సైతం లేబర్ చట్టాలు వర్తిస్తాయి. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగించినప్పుడు, హైదరాబాద్ లోని లేబర్ కోర్టు సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా లేబర్ చట్టం పరిధిలోకి వస్తారు అని తీర్పు ఇస్తూ, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకోవాలి లేదా వారు కోల్పోయిన సమయానికి సరైన పరిహారం ఇవ్వాల్సిందే అని తీర్పునిచ్చింది. అయితే అందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేబర్ చట్టం కిందకి రాకపోవచ్చు. ఒకసారి లాయర్ సలహా పొందండి. – శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది -
చంద్రబాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అనైతిక ప్రభుత్వం అని, అన్యాయ పాలన చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ఉదాహరణలు గమనించదగిన అంశాలే. గత రెండున్నర నెలల తన పాలనపై వస్తున్న విమర్శలకు చంద్రబాబు సూటిగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. మరో వైపు ఎంత సేపు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు.ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అన్న అనుమానం కలిగేలా పరిస్థితి ఏర్పడడం అత్యంత శోచనీయం. చంద్రబాబు పాలన ఏ ఏ రకాలుగా అనైతికంగా ఉందన్నది పరిశీలిస్తే పలు విషయాలు బోధపడతాయి. తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాని, ఎన్నికల ప్రణాళికలోని ఇతర వాగ్దానాల గురించి కాని ప్రస్తావించలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు, ఆయన పార్టనర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉన్నారు. తమ వాగ్దానాలు తమనే భయపెడుతున్నాయని చంద్రబాబు అంటున్నారు. అదేమంటే గత ప్రభుత్వం చేసిన పాలన అని ప్రచారం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఇప్పుడు కొత్తగా ఆరోపణలు చేయడం లేదు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే విమర్శలు చేశారో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే అభియోగాలు కొనసాగిస్తున్నారు. దానిని బట్టే చంద్రబాబు అనైతిక పాలన సాగిస్తున్నారన్న విషయం అర్ధం అవుతుంది. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించేవారు. అది పచ్చి అబద్దం. అంత అప్పు నిజంగా ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏమి చేయాలి. దానికి తగ్గటుగా చేయగలిగిన హామీలనే ఇవ్వాలి. అలాకాకుండా టీడీపీ, జనసేనలు ఆకాశమే హద్దుగా ఎన్నికల వరాలు కురిపించాయి. అదేమని అడిగితే, తాము సంపద సృష్టిస్తామని, తద్వారా హామీలు నెరవేర్చుతామని బడాయి కబుర్లు చెప్పేవారు. ఎలాగైతేనేం అధికారంలోకి వచ్చారు. అది ఈవిఎమ్‌ల మహిమా? లేక ప్రజలు నిజంగా ఈ వాగ్దానాలకు ఆకర్షితులయ్యారా అన్నది వేరే సంగతి.. పవర్ చేతికి రాగానే చంద్రబాబు, పవన్‌లు స్వరం మార్చేశారు.హామీలు అమలు చేయాలని ఉంది కాని, డబ్బులు లేవని చెప్పడం ఆరంభించారు. అలాంటప్పుడు చంద్రబాబుది అనైతిక పాలన కాక ఏమవుతుంది? జగన్ చేసిన ఆరోపణ వాస్తవికంగానే ఉందని అనుకోవల్సిందే కదా! టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో హింస, రాజకీయ ప్రత్యర్ధులపై దమనకాండ, హత్యలు గతంలో ఎన్నడూ చూడనివి. ఈ హింసాకాండను చంద్రబాబు నేరుగా ఇంతవరకు ఖండించలేదు. తన కుమారుడి రెడ్‌బుక్ రాజ్యాంగం గురించి ఆయనే మాట్లాడలేకపోతున్నారు. పైగా పోలీసు అధికారుల సమావేశంలో మాత్రం నేరం చేయాలంటే ఎవరైనా సరే భయపడాల్సిందేనని చంద్రబాబు అన్నారట.తెలుగుదేశం అధికార పత్రిక ఈనాడు ఈ హెడింగ్ పెట్టి ఆనందపడింది. చంద్రబాబు వాస్తవంగా అలాంటి ఉద్దేశంతో ఉంటే ఏమి చేయాలి! టీడీపీ కార్యకర్తలు ఎవరూ హింసాకాండకు దిగరాదని పిలుపు ఇవ్వాలి. టీడీపీ వాళ్లు తప్పు చేసినా చర్య తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వాలి. విశేషం ఏమిటంటే ఆయన ఈ కబుర్లు చెప్పిన ముందు రోజే తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలు దారుణమైన హింసకు తెగబడ్డారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వబోమంటూ నానా రచ్చ చేశారు. మాజీ ఎమ్మెల్యేనే ఆయన ఇంటికి ఆయన వెళ్లలేని పరిస్థితి ఉంటే సామాన్యుల గతి ఏమిటి? కేవలం తన అనుకూల మీడియాలో ప్రచారం చేసుకోవడానికి డైలాగులు చెబుతూ, లోపల మాత్రం హింస, దౌర్జన్యాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరించడం అనైతికం కాదా! అందువల్ల జగన్ చెప్పినట్లు చంద్రబాబు పాలన అనైతికమే అవుతుంది.గతంలో చంద్రబాబు అనపర్తి వద్ద టూర్‌కు వెళ్లారు. అక్కడి శాంతిభద్రతల రీత్యా పోలీసు అధికారులు ఆయనను వద్దని సూచించారు. కాని చంద్రబాబు వినకుండా, తాను నడిచి వెళతానని అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ వెళ్లారు. పోలీసులు ఆయన భద్రత కల్పించారు తప్ప, అడ్డుకోలేదు. కుప్పం నియోజకవర్గంలో కూడా ఒకసారి ఇలాంటి సమస్య వస్తే పోలీసుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా చంద్రబాబు వ్యవహరించారు. అప్పుడు కూడా పోలీసులు ఆయనకు రక్షణ కల్పించారు. మరి ఇప్పుడేమో మాజీ ఎమ్మెల్యే తన ఇంటికి వెళ్లడానికి వీలు లేదని టీడీపీ వారు అరాచకంగా వ్యవహరించడం, పోలీసులు ఆయనను అక్కడ నుంచి అనంతపురం తరలించడం చేశారు.అల్లర్లు చేసేవారిని కట్టడి చేయడంలో పోలీసులు విఫలం అయ్యారు. అందువల్ల చంద్రబాబుది అనైతిక పాలనే అవుతుంది కదా! సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్టు చూడడం జరిగింది. అందులో పలు విషయాలు గుర్తు చేశారు..'ఈ ఏడాది తల్లికి వందనం ఇవ్వలేం అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ఖజానాలో డబ్బు లేదు.. అమరావతి కట్టలేం.. మంత్రి నారాయణ, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు - మంత్రి నాదెండ్ల మనోహర్, ఆరోగ్యశ్రీ ఇవ్వలేం.. ఆయుష్మాన్ భారత్ కార్డు తెచ్చుకోండి.. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తమ వద్ద మంత్ర దండం లేదు.. పవన్ కల్యాణ్, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూస్తేనే భయం వేస్తోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు .. ఇలా ఆయా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే ఏపీలో సాగుతున్నది అనైతిక పాలనే అన్న భావన కలుగుతుంది.ఇక ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీ ఊసే లేదు. ఏపీలో ఇటీవలికాలంలో అనేక హత్యలు, అత్యాచారాలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. జగన్ ప్రభుత్వం చేపట్టిన ఓడరేవుల నిర్మాణం ఎలా సాగుతుందో తెలియదు. మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది. పైగా వాటిని ప్రైవేటు పరం చేయాలని తలపెట్టారు. గతంలో కొన్ని మెడికల్ సీట్లనే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుగా మార్చాలని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తే విరుచుకుపడ్డ చంద్రబాబు, లోకేష్‌లు ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీలనే ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల ప్రణాళికలో ఏమి చెప్పారు? ఇప్పుడు ఏమి చేస్తున్నారు? పదివేల రూపాయల గౌరవ వేతనం హుష కాకి అయింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలు గందరగోళంలో పడ్డాయి. ఇళ్ల వద్దకు పౌర సేవలను జగన్ ప్రభుత్వం అందిస్తే, ఇప్పుడు మళ్లీ యధాప్రకారం ఆఫీస్‌ల చుట్టూ తిరిగే వాతావరణాన్ని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించింది.గతంలో రేషన్ సరుకులను కూడా ఇళ్లకే చేర్చితే, ఆ వాహనాలన్నిటిని తొలగించారు. భారీ ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు, అదికారంలోకి వచ్చిన తర్వాత లక్షల మంది వలంటీర్లు, రేషన్ వాహనాల యజమానులు, కొన్ని శాఖలలోని చిరుద్యోగులు మొదలైనవారందరిని వీధుల పాలు చేశారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని హోరెత్తించిన కూటమి నేతలు, ఇప్పుడు ఆ ప్రస్తావనే తేకుండా గడుపుతున్నారు. పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం, అన్నా క్యాంటిన్లు మినహా ఒక్క హామీ అమలు చేయని ప్రభుత్వం అనైతిక ప్రభుత్వం కాక మరేమి అవుతుంది.అన్ని హామీలు ఒక్కసారే అమలు చేయలేకపోవచ్చు. కాని ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా మాట్లాడడం అనైతికమే. కనీసం ఏ హామీ ఎప్పుడు అమలు చేస్తామో చెప్పకపోగా, వాటిని చూస్తేనే భయం వేస్తోందని, గత ప్రభుత్వ వైఫల్యం అంటూ వైఎస్సార్సీపీపై తమ తప్పులను నెట్టివేయడం చూస్తే ఇదేనా చంద్రబాబు అనుభవం అన్నప్రశ్న వస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా అమరావతి నిర్మిస్తామని, సంపద సృష్టించి సూపర్ సిక్స్ అమలు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాదించిన చంద్రబాబు ప్రస్తుతం అమరావతి పేరుతో ఏకంగా పదిహేనువేల కోట్ల రూపాయల అప్పు తీసుకురాబోతుండడం అనైతికమా? కాదా? మొత్తం అంత డబ్బు మళ్లీ ఒకే చోట ఖర్చు చేసి, ప్రాంతీయ అసమానలతకు బీజం వేయడం కూడా విమర్శలకు దారి తీస్తోంది.జగన్ 2019లో తాను ఇచ్చిన హామీలకు ఒక ప్రణాళిక రూపొందించి వాటిని అమలు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అసలు వాగ్దానాలను పట్టించుకోవడం లేదు. పైగా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఈ వాగ్దానాలను నెరవేర్చవలసిన అవసరం లేదని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ వాగ్దానాలను అమలు చేయకపోయినా, నిత్యం వచ్చే ఆదాయం ఏమవుతోందో తెలియదు కాని, అప్పులు మాత్రం వేల కోట్లు చేస్తున్నారు. ఇవన్ని గమనిస్తే, జగన్ చెప్పినట్లు చంద్రబాబుది అనైతిక పాలనే అన్న భావన ప్రజలలో కూడా ఏర్పడుతోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఎన్నికల విధుల్లో ఎవరుంటారు? మినహాయింపు ఎవరికి?
దేశంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు వివిధ బాధ్యతలను అప్పగిస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, జాతీయ బ్యాంకులు, ఎల్ఐసీతో సహా వివిధ సంస్థల ఉద్యోగులు ఎన్నికల విధులలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ పోలింగ్ బృందాలలో ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, సెక్టార్, జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, సహాయ వ్యయ పరిశీలకులు, డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లు మొదలైనవారు ఉంటారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల బాధ్యత రాష్ట్ర పోలీసులు, సెక్టార్, జోనల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులపై ఉంటుంది. వీరు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని జిల్లాలలో ఎన్నికల నిర్వహణలో భాగస్వాములవుతారు. ఎన్నికల విధులలో నియమితులైనవారు గైర్హాజరయ్యేందుకు అవకాశం ఉండడు. విధులకు హాజరుకానివారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. కేంద్రం లేదా రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగులుగా ఉన్నవారిని మాత్రమే ఎన్నికల విధులలో నియమిస్తారు. అవసరమైతే పదవీ విరమణ తర్వాత డిప్యూటేషన్‌లో ఉన్న ఉద్యోగులను కూడా ఎన్నికల విధులలో నియమిస్తారు. కాంట్రాక్టు లేదా రోజువారీ ఉద్యోగులను ఎన్నికల డ్యూటీలో నియమించరు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో భార్యాభర్తలిద్దరికీ విధులు అప్పగించరు. దంపతుల్లో ఒకరు పిల్లలను లేదా వారి వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడానికి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగి అప్పటికే విదేశాలకు వెళ్లే ప్లాన్‌లో ఉంటే, అతను ఎన్నికల డ్యూటీ నుంచి మినహాయింపును కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇందు కోసం ముందుగా ప్రయాణాన్ని బుక్ చేసుకోవాలి. దరఖాస్తులో ప్రయాణ రుజువుగా సంబంధిత టికెట్, వీసాను జత చేయాలి. ఇదేవిధంగా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నికల విధుల నుంచి మినహాయింపును కోరవచ్చు. అయితే ఇటువంటి సందర్భంలో సంబంధిత ఉద్యోగి అవసరమైన అన్ని వైద్య ధృవపత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలి. -
వింత హోలీ వేడుకలు.. పురుషులు కనిపిస్తే ‘బాదుడే’!
దేశంలో పలు పండుగలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయ రీతిలో జరుగుతుంటాయి. హోలీ విషయంలోనూ ఇదేవిధంగా కనిపిస్తుంటుంది. సాధారణంగా మహిళల కన్నా పురుషులు హోలీ వేడుకల్లో అత్యంత ఉత్సాహాన్ని కనబరచడం చూస్తుంటాం. కానీ యూపీలోని ఒక ప్రాంతంలో దీనికి భిన్నంగా జరుగుతుంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో హోలీ మర్నాడు స్త్రీలు తమ ప్రత్యేక హోలీని జరుపుకుంటారు. ఆరోజు అక్కడ మహిళలదే రాజ్యం. పురుషులెవరూ గ్రామంలో కనిపించరు. పిలిభిత్ నగరంలోని మధోతండా ప్రాంతంలో ఈ ప్రత్యేక సంప్రదాయం కనిపిస్తుంది. హోలీ మర్నాడు ఈ ప్రాంతంలోని మహిళలంతా గుంపులు గుంపులుగా తిరుగుతూ హోలీ వేడుకలు చేసుకుంటారు. ఆ రోజున స్థానిక మహిళలు హోలీ సంప్రదాయ పాటలు పాడుతూ రోడ్లపై తిరుగుతారు. పాదచారులు, వాహనదారుల నుంచి చందాలు సేకరిస్తారు. ఆ రోజున గ్రామంలోని పురుషులంతా తమ ఇళ్లలో దాక్కుంటారు. లేదా ఊరి బయట ఎక్కడైనా తలదాచుకుంటారు. పిలిభిత్ నగర చరిత్రపై పరిశోధనలు సాగిస్తున్న సీనియర్ జర్నలిస్టు డాక్టర్ అమితాబ్ అగ్నిహోత్రి మీడియాతో మాట్లాడుతూ మధోతండాలో మహిళలు జరుపుకునే హోలీకి శతాబ్దాల చరిత్ర ఉందన్నారు. మాధోతండా అనేది అడవి అంచున ఉన్న ప్రాంతం. పూర్వం రోజుల్లో హోలీ మరుసటి రోజున పురుషులు వేటకు వెళ్లేవారు. ఈ రోజున మహిళలు ఒకచోట చేరి హోలీ ఆడుకునేవారు. క్రమేణా ఈ హోలీ సంప్రదాయ రూపాన్ని సంతరించుకుంది. ఇప్పుడు వేటతో పాటు అడవిలోకి వెళ్లడాన్ని నిషేధించినందున స్థానికంగా ఉన్న మగవారు ఆ రోజున గ్రామాన్ని విడిచిపెట్టి బయటకు వెళతారు. తండాలో మహిళలు హోలీ ఆడే సమయంలో వారికి పురుషులెవరైనా ఎదురైతే వారి నుండి భారీగా చందా వసూలు చేస్తారు. -
విప్రోలో మానేస్తే ఇంట్లో కూర్చోవాల్సిందే! చుక్కలు చూపిస్తున్న కఠిన నిబంధన
అన్ని పరిశ్రమలలోనూ కంపెనీల మధ్య పోటీ అనేది సర్వ సాధారణం. అయితే ఇది ఐటీ కంపెనీల తారస్థాయికి చేరింది. కంపెనీల్లో కీలకంగా వ్యవహరించే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రత్యర్థి కంపెనీల్లోకి జంప్ అవుతుండటంతో భారతీయ ఐటీ కంపెనీ విప్రో కఠిన నిబంధన అమలు చేస్తోంది. ఈ నిబంధన కంపెనీ మారిన ఉన్నత ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. విప్రో నుంచి వైదొలిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీలో వారి చివరి రోజు నుంచి ఒక సంవత్సరం పాటు 10 ప్రత్యర్థి సంస్థలలో చేరలేరు. ఈ సాఫ్ట్వేర్ సంస్థ నుంచి నిష్క్రమించిన వెంటనే ఈ కంపెనీలలో దేనిలోనూ చేరకుండా వారిని నిరోధించే వారి కాంట్రాక్ట్‌లోని నాన్-కాంపిటేట్ నిబంధన దీనికి కారణం. ఈ నిబంధన ఆధారంగా ప్రత్యర్థి కంపెనీ కాగ్నిజెంట్‌లో చేరిన తమ మాజీ సీఎఫ్‌వో జతిన్ దలాల్‌ను విప్రో ముప్పుతిప్పలు పెడుతోంది. నిబంధన ఉల్లంఘించి ప్రత్యర్థి కంపెనీలో చేరినందుకు గానూ నష్టపరిహారం కింద వడ్డీతో సహా రూ. 25.15 కోట్లు కట్టాలని కోర్టులో దావా వేసింది. విప్రో ప్రత్యర్థి కంపెనీలు ఇవే.. విప్రో ఎగ్జిక్యూటివ్‌ల కాంట్రాక్ట్‌లో పది ప్రత్యర్థి కంపెనీల పేర్లను పేర్కొంది. నాన్-కాంపిటేట్ నిబంధన కింద వారు విప్రోలో మానేసిన తర్వాత సంవత్సరం పాటు ఈ కంపెనీలలో చేరేందుకు వీలు లేదు. ఆ కంపెనీలు ఇవే.. యాక్సెంచర్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్, డెలాయిట్, డీఎక్స్‌సీ టెక్నాలజీ, హెచ్‌సీఎల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా. ఈ పేర్లలో ప్రతి ఒక్కటి దలాల్ కాంట్రాక్ట్‌లో పేర్కొన్నట్లు విప్రో తెలిపింది. అయినప్పటికీ ఆయన ప్రత్యక్ష పోటీదారు కంపెనీలో చేరాడని విప్రో వాదిస్తోంది. -
స్కూళ్లలో సంఘాలకు నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఇకపై ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలోకి కూడా విద్యార్థి సంఘాలు అడుగుపెట్టడం కష్టమే. ఏ విద్యార్థి సంఘాన్ని అనుమతించవద్దంటూ డీఈఓలకు పాఠశాల విద్య డైరెక్టర్ సర్క్యులర్ జారీ చేశారు. ఏదైనా పాఠశాలలోకి ఏ విద్యార్థి సంఘం నాయకుడైనా వచ్చినట్టు రుజువైతే దానికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. ఒకవేళ విద్యారి్థసంఘం నేతలు స్కూలుకు వస్తే హెచ్ఎంపై కఠినచర్యలూ తప్పవని హెచ్చరించింది. ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులతో పాఠశాలవిద్య డైరెక్టర్ దేవసేన ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థి సంఘాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ కాన్ఫరెన్స్ జరిగినట్టు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విద్యాసంస్థలు కేంద్రంగా ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూడాలని ప్రభుత్వం ఇచి్చన ఆదేశాల మేరకే పాఠశాలవిద్య డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఆమె తెలిపినట్టు డీఈఓలు చెబుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, పార్టీలు, సంఘాలు, వ్యక్తులు, విద్యా సంఘాలు ఎవరైనా సరే ముందుగా డీఈఓ అనుమతి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది అప్రజాస్వామికమని, విద్యార్థి సమస్యలపై నినదించే హక్కు తీసివేయడం తగదంటున్నాయి. హెచ్‌ఎంలలో ఆందోళన విద్యార్థి సంఘాలను అడ్డుకోవడం ఎలా సాధ్యమని హెచ్ఎంలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు నిర్బంధం విధిస్తే వారినుంచి ప్రతిఘటన వస్తుందని, ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుంటే ప్రశాంతమైన పాఠశాల ప్రాంగణంలో అశాంతి నెలకొంటుందంటున్నారు. -
గ్రామ సర్పంచ్ వింత నిబంధన.. అతిక్రమిస్తే ఐదు చెప్పు దెబ్బలు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ గ్రామ సర్పంచ్ వింత నిబంధన వివాదాస్పదంగా మారింది. గ్రామంలో పశువులు యధేచ్చగా సంచరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపాడు. ఆయా పశువుల యజమానికి ఐదు చెప్పు దెబ్బల దండన విధిస్తామని హెచ్చరించాడు. అంతే కాకుండా రూ.500 జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించాడు. ఈ నిబంధనపై గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. షాహదోల్ జిల్లా నగ్నాదుయ్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో రోడ్లపై పశువులను యధేచ్చగా వదిలేస్తున్నారని గమనించిన సర్పంచ్.. వాటి యజమానుల బాధ్యతారాహిత్యంపై మండిపడ్డాడు. పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో ఇక చెప్పు దెబ్బలతో దండన విధిస్తామని దండోరా వేయించాడు. గ్రామ పంచాయతీ అధికారులు ఇంటింటికీ వెళ్లి నిబంధనలను వివరించారు. ఈ వీడియోను గ్రామస్థులు అధికారులకు చూపించి, ఫిర్యాదు చేశారు. ఇదేం వింత నిబంధన, వెంటనే తొలగించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ఉచితంగా టమాటాలు.. ఆటోవాలా సరికొత్త ఆఫర్.. కానీ.. -
సీఎం జగన్ ఏం సాధించారు?.. ఎల్లో బ్యాచ్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇదే..
నాలుగేళ్లలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏమి సాధించారు? ఆయన కేంద్రంపై పోరాడలేకపోతున్నారు.. అంటూ తెగ రాసిన ఎల్లో మీడియాకు మాడు పగిలేలా సమాధానం వచ్చింది. జగన్ సైలెంట్‌గా కేంద్రం నుంచి 10461 కోట్ల నిధులను సాధించుకురావడంతో తెలుగుదేశం నేతలకు, ఆ పార్టీని నెత్తిన పెట్టుకునే మోసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలకు దిమ్మదిరిగినట్లయింది. ఇది నిజమా! అని వారే నిర్థారించుకుని ఏడుస్తూనే వార్త ఇవ్వవలసి వచ్చింది. తెలుగుదేశం కోసం బట్టలూడదీసుకుని తిరిగే ఒక మీడియా మాత్రం ఈ విషయాన్ని ప్రస్తావించకుండా కనుమరుగు చేయాలని యత్నించినట్లు అనిపించింది. తదుపరి ఈ డబ్బు తీసుకుంటే కేంద్రం నుంచి ఇంకేమీ రావని చెబుతూ తప్పుడు ప్రచారం ఆరంభించింది. ఏకంగా లక్ష కోట్ల నష్టం వస్తుందని అబద్దపు లెక్కవేసింది. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్న అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష. pic.twitter.com/ln8H9EgerD — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 23, 2023 రెవెన్యూ లోటుకు, కేంద్రం వివిధ పథకాలకు ఇచ్చే నిదులకు సంబంధం అంటూ మోకాలికి, బోడిగుండుకు లింకు పెట్టే యత్నం చేసింది. ఒక్కసారిగా ఎపి ప్రభుత్వానికి ఇంత డబ్బు వచ్చిందా అన్న ఏడుపు అన్నమాట. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 16 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉందని అంచనా వేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం తరచుగా కేంద్రానికి లేఖలు రాసేది. ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో చంద్రబాబు నాయుడు తమకు ఈ రెవెన్యూలోటు ఇవ్వాలని మీడియా ముందు కోరుతుండేవారు. కాని కేంద్రం కేవలం నాలుగువేల కోట్లే ఇచ్చి సరిపెట్టుకుంది. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలలో టీడీపీ, బీజేపీలు భాగస్వాములు అయినా వారు అడిగిన రెవెన్యూలోటు మొత్తం మంజూరు కాలేదు. దానికి కారణం అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని కలిసినా, ఆర్దిక మంత్రిని కలిసినా, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కాకుండా, రాజకీయ విషయాలకే ప్రాధాన్యం ఇవ్వడమేనని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తుండేవారు. ఆనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్వయంగా పలుమార్లు ఈ మాట చెప్పేవారు. అప్పటి ప్రతిపక్షనేత జగన్‌ను ఎలాగొలా ఇబ్బంది పాలు చేయాలని కేంద్రంలోని పెద్దలను చంద్రబాబు కోరుతుండేవారని ఆయన పేర్కొనేవారు. అఫ్ కోర్స్.. కన్నా ఇప్పుడు ఆ మాటలు చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఆయనే తెలుగుదేశం పార్టీలో చేరారు కనుక. అయినా వాస్తవం దాచేస్తే దాగదు కదా! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదిన్నరవేల కోట్ల రూపాయలను జగన్ ఎలా సాధించగలిగారన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. ఈ విషయంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా అభినందించాలి. జగన్ సూచనల మేరకు ఆయన ఢిల్లీ వెళ్లి ఈ విషయాలపై పాలోఅప్ చేస్తుంటారు. అది ఫలించి ఇప్పుడు ఈ సాయం అందిందని అనుకోవచ్చు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీని, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా అభినందనలు తెలియచేయాలి. RT FinMinIndia: RT @nsitharamanoffc: Shri Buggana Rajendranath, Minister for Finance, Planning and Legislative Affairs - Government of Andhra Pradesh, calls on Smt @nsitharaman. pic.twitter.com/5c94g8ist6 — Apte and Co (@aptenco) May 17, 2023 జగన్ ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలనే అధికంగా ప్రస్తావిస్తుండడం, ఆయనలోని చిత్తశుద్దిని గుర్తించడం, రాష్ట్రంలో అమలు అవుతున్న వివిధ స్కీముల తీరు మొదలైనవాటిని పరిశీలించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అయితే ఇదంతా ఏదో డబ్బుల వాన మాదిరిగా చిత్రించాలని ఈనాడు మీడియా ప్రయత్నించింది. ఒకవైపు రోదన, మరో వైపు ఈ విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా బదనాం చేయాలన్న తాపత్రయంతో ఆ కధనం రాసినట్లు అర్దం అవుతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోతూ రోజు గడవడమే కష్టంగా ఉన్న ఆంద్రప్రదేశ్ పై కేంద్రం కరుణ కురిపించిందని రాశారు కాని, ఎపికి న్యాయం చేశారని రాయడానికి వారికి చేతులు రాలేదు. ఇది ముఖ్యమంత్రి జగన్ సాధించిన ఘనత అని చెప్పలేదు. చంద్రబాబు టైమ్ లో అసలు అప్పులే చేయనట్లుగా ఈనాడు మీడియా చిత్రీకరించాలని చూస్తోంది. చదవండి: రామోజీ మంటకు ‘మందు’ ఉందా? అప్పుడు చంద్రబాబు, ఆర్దిక మంత్రి గా ఉన్న యనమల రామకృష్ణుడు కాని పలుమార్లు బీద అరుపులు అరిచినా, అప్పులమీదే కాలం గడుపుతున్నామని చెప్పినా, ఇదే ఈనాడు మీడియాకు ఆనంద భైరవి రాగంలా అనిపించేది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు ప్రచారం చేస్తున్నారు.కేంద్ర నిబంధనల ప్రకారమే అప్పులు చేస్తున్నా వీరికి అజీర్ణమే. టిడిపి మీడియాకు చెందిన ఒక పత్రిక ఎంతగా వాపోయిందంటే ఆర్దికశాఖలో ఒక అధికారి ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని, అందువల్లే అప్పులు పుడుతున్నాయని ఏడ్చేసింది. కేంద్రంపై జగన్ పోరాడడం లేదని ప్రచారం చేయడానికి ఈనాడు మీడియా పలుమార్లు పోలవరం ప్రాజెక్టు వ్యయ అంచనాలపై కదనాలు ఇస్తుంటుంది. 🔹Andhra Pradesh Witnessing A New Era In Infra Transformation 💥 🔸Andhra Pradesh Awarded Highest Length Of National Highways Among All The States In India 🛣️ #AndhraPradesh #Highways #APNewHighWays #APInfraStory pic.twitter.com/2YVWKXZAGV — Andhra Pradesh Infra Story (@APInfraStory) May 25, 2023 అవసరమైన నిధులు రాబట్టలేకపోతోందని చెప్పేది. తెలుగుదేశం నేతలైతే జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా, ఏవో కేసుల గురించే అని తప్పుడు ప్రచారం చేసేది. వారికి ఎల్లో మీడియా తానా తందానా అనేది. తీరా జగన్ ఇప్పుడు ఇంత విజయం సాధిస్తే మాత్రం దానిపై కూడా ఏడుపుగొట్టు తీరులో వార్తలు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ టైమ్‌లో కనుక ఇలా కేంద్రం డబ్బు మంజూరు చేసి ఉంటే చంద్రబాబు అంత ఘనాపాటి.. ఇంత ఘనపాటి.. ప్రధాని మోదీ సైతం చంద్రబాబు దెబ్బకు దిగివచ్చారు.. అన్న చందంగా కదనాలు ఇచ్చి ఉండేవి. ఇప్పుడు మరో ప్రయత్నం జరగవచ్చు. చదవండి: YSRCP: చారిత్రక విజయానికి నాలుగేళ్లు.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆర్థిక సాయం అంతా చంద్రబాబు కృషివల్లే అని ప్రచారం చేసినా ఆశ్చర్యం ఉండదు. ఈ మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం ఏమి చేపట్టినా, అదంతా చంద్రబాబు ఎప్పుడో చేసేశారు.. అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కేంద్రం ఇచ్చిన ఒకే ధపా కేంద్ర నిధులు పదిన్నరవేల కోట్లు విడుదల అయితే ప్రభుత్వానికి మంచి వెసులుబాటే అవుతుంది. ఇక టీడీపీ కాని, ఎల్లో మీడియా కాని ప్రతిదానికి ఈ నిధులకు లింక్ పెట్టి వివిద వర్గాలను, ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేయవచ్చు. అందువల్ల ఈ ఆర్దిక సాయం తీరుతెన్నులపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి ప్రజలందరికి అర్దం అయ్యే రీతిలో వివరణ ఇస్తే మంచిది. ఏ ఏ అంశాలకు ఈ డబ్బు వాడుకోవచ్చు? ఇందులో కండిషన్లు ఏమైనా ఉంటాయా? తదతర వివరాలు తెలియచేస్తే మంచిది. ఏది ఏమైనా ఒకేసారి కేంద్రం ఏపీకి పదిన్నర వేల కోట్ల రూపాయలు మంజూరు చేయడం గొప్ప విషయమే. అది రాష్ట్రానికి రావల్సి ఉన్న డబ్బే తప్ప, కేంద్రం డబ్బులవాన కురిపించినట్లు కాదన్న సంగతి ముందుగా అంతా తెలుసుకోవాలి. అలా నిధులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పవచ్చు. అలాగే వాటిని సాధించడంలో జగన్ సహనంతో చూపిన చొరవను అభినందించవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
నాలుగేళ్ల పాలనపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అఖండ మెజార్టీతో విజయం సాధించి.. సంక్షేమ పాలనతో నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. 50 శాతానికి పైగా ఓట్లు.. 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. దేశంలో ఒంటరిగా పోటీచేసిన ఒక పార్టీ ఇంత భారీ విజయం సాధించడం అదే ప్రథమం. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు సమాధి కడుతూ సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు చారిత్రక తీర్పు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు.. ప్రజాసంకల్ప పాదయాత్రలో భవితపై భరోసా కల్పించిన సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టి.. నవశకాన్ని ఆవిష్కరించి నేటికి నాలుగేళ్లు. ఈ సందర్భంగా నాలుగేళ్ల పాలనపై సీఎం ట్వీట్ చేశారు. ‘‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో నాలుగేళ్ల క్రితం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు అప్పగించిన బాధ్యతను మీకు సేవ చేసే అవకాశంగా భావించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మన ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేశాం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం లభించేందుకు వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో గెలుపొందేలా అడుగులు వేస్తున్నాం’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో నాలుగేళ్ళ క్రితం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు అప్పగించిన బాధ్యతను మీకు సేవ చేసే అవకాశంగా భావించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మన ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేశాం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం లభించేందుకు వ… — YS Jagan Mohan Reddy (@ysjagan) May 23, 2023 -
చంద్రబాబు హయాంలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువ: కేంద్రం లిఖిత పూర్వక సమాధానం
సాక్షి, ఢిల్లీ: రైతు ఆత్మహత్యలపై రాజ్యసభలో కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా రైతు ఆత్మహత్యలు జరిగాయని నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. చంద్రబాబు హయాంలో 2018-19లో 628 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, 2019 తర్వాత క్రమంగా ఏపీలో రైతు ఆత్మహత్యలు తగ్గుతూ వస్తున్నాయి. 2019-20లో 564 మంది, 2020-21లో 481 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేంద్రమంత్రి వివరించారు. చదవండి: గుజరాత్ ఎన్నికలు.. గెలిచిన, ఓడిన ప్రముఖులు వీరే! -
కొత్త డ్రగ్ రూల్ తో నకిలీ మందులకు చెక్
-
ఐపీవో నిబంధనలు కఠినతరం
ముంబై: ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) నిబంధనలను కఠినతరం చేస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకుంది. ఏ అంశాల ప్రాతిపదికన ఆఫర్ ధరను నిర్ణయించారన్న వివరాలను ఆఫర్ డాక్యుమెంట్, ప్రైస్ బ్యాండ్ ప్రకటనల్లో ’ఇష్యూ ధరకు ప్రాతిపదిక’ సెక్షన్ కింద వెల్లడించడాన్ని తప్పనిసరి చేసింది. ఇష్యూయర్లు ఇందుకోసం గతంలో జరిపిన నిధుల సమీకరణ, లావాదేవీలను ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి వాటితో పాటు కీలక పనితీరు సూచికలను (కేపీఐ) ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో వివిధ సెక్షన్ల కింద ఇస్తున్నా.. ఆఫర్ డాక్యుమెంట్లలోని ఆర్థిక వివరాల సెక్షన్లలో ఉండటం లేదు. ఎటువంటి ట్రాక్ రికార్డు లేని కొత్త తరం కంపెనీలు పెద్ద యెత్తున ఐపీవోలకు వస్తుండటం, ఇన్వెస్టర్లు నష్టపోతుండటం జరుగుతున్న నేపథ్యంలో సెబీ శుక్రవారం బోర్డు సమావేశం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల విషయంలో తగు నిర్ణయాలు తీసుకునేందుకు ఇది దోహదపడగలదని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ పేర్కొన్నారు. అలాగే ఐపీవో యోచనలో ఉన్న కంపెనీలు ఆఫర్ డాక్యుమెంట్లను ’ప్రీ–ఫైలింగ్’ చేసే ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రవేశపెట్టే ప్రతిపాదనకూ సెబీ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఇష్యూకి వచ్చే సంస్థలు తమ ఆఫర్ పత్రాలను బహిరంగ పర్చకుండా, ప్రాథమిక సమీక్ష కోసం సెబీ, స్టాక్ ఎక్సే్చంజీలకు అందించాల్సి ఉంటుంది. ప్రీ–ఫైలింగ్‌తో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాసెసింగ్ విధానం కూడా ఇకపైనా కొనసాగుతుంది. మరిన్ని నిర్ణయాలు.. ► మ్యుచువల్ ఫండ్ యూనిట్ల కొనుగోలు, విక్రయాలను ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనకు ఆమోదం. ప్రస్తుతం ఈ నిబంధనలు లిస్టెడ్ కంపెనీలు లేదా లిస్ట్ కాబోతున్న సంస్థలకు మాత్రమే వర్తిస్తున్నాయి. ► మ్యుచువల్ ఫండ్ సబ్స్క్రిప్షన్ లావాదేవీలకు కూడా రెండంచెల ధృవీకరణను సెబీ తప్పనిస రి చేసింది. ఇది 2023 ఏప్రిల్ 1 నుంచి అమ ల్లోకి వస్తుంది. ప్రస్తుతం యూనిట్ల విక్రయ సమయంలో ఆన్లైన్ లావాదేవీలకు టూ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను, ఆఫ్‌లైన్ లావాదేవీలకు సంతకం విధానాన్ని అనుసరిస్తున్నారు. ► ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విషయంలో నాన్–ప్రమోటర్ షేర్హోల్డర్లకు సంబంధించి కనీస షేర్‌హోల్డింగ్ నిబంధనను తొలగించింది. ప్రస్తుతం కనీసం 10 శాతం వాటా, కనిష్టంగా రూ. 25 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్న పక్షంలోనే నాన్–ప్రమోటర్ షేర్హోల్డర్లకు ఓఎఫ్ఎస్లో పాల్గొనే వీలుంటోంది. ► పోర్ట్‌ఫోలియో మేనేజర్లు తమ క్లయింట్ల నిధులు, షేర్ల నిర్వహణకు సంబంధించి వివిధ టీమ్‌లు పోషించే పాత్రలు, బాధ్యతలు అలాగే రిస్కు నిర్వహణ విధానాలు మొదలైనవి రాతపూర్వకంగా ఉంచాలి. ► స్వతంత్ర డైరెక్టర్ల నియామకాలు, తొలగింపునకు కొత్త నిబంధనలను సెబీ ఆమోదించింది. వీటి ప్రకారం నియామకం లేదా తొలగింపునకు సాధారణ తీర్మానం, మైనారిటీ షేర్‌హోల్డర్ల మెజారిటీ తీర్మానం అంటూ రెండు పరామితులు ఉంటాయి. ► ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) డిజిన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి ఓపెన్ ఆఫర్ ధర లెక్కింపు విధానంలో మార్పులు చేశారు. వీటి ప్రకారం రేటును లెక్కించేందుకు గత 60 ట్రేడింగ్ రోజుల వాల్యూమ్ వెయిటెడ్ సగటు మార్కెట్ రేటు (వీడబ్ల్యూఏఎంపీ)ను ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిబంధనను తొలగించారు. ► క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు.. పరిశ్రమల వర్గీకరణ కోసం ప్రామాణిక విధానాన్ని పాటించాలన్న ఆదేశాల అమలుకు డెడ్‌లైన్‌ను సెబీ రెండు నెలల పాటు నవంబర్ 30 వరకూ వాయిదా వేసింది. -
లోదుస్తులు కంపల్సరీ.. పాక్ ఎయిర్‌లైన్స్ పరువుపాయే!
ఇస్లామాబాద్: సొంత దేశంలోనే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ పరువు పోయింది. విమాన సిబ్బందికి డ్రెస్ కోడ్‌లో భాగంగా లోదుస్తులు తప్పనిసరి అంటూ ఆదేశాలు ఇవ్వడమే అందుకు కారణం. ఈ తరుణంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తగా.. ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది ఎయిర్‌లైన్స్. గురువారం పీఐఏ.. క్యాబిన్ సిబ్బంది కోసం ఒక ఆదేశం జారీ చేసింది. యూనిఫాం కింద లోదుస్తులు ధరించడం తప్పనిసరి అని అందులో పేర్కొంది. అంతేకాదు.. అలా వేసుకోకపోవడం వల్ల ఎయిర్‌లైన్స్ సేవలపై పేలవమైన ముద్ర పడిపోతుందని, తద్వారా గడ్డుపరిస్థితి ఎదురుకావొచ్చని ఎయిర్‌లైన్స్ ఆ ఆదేశాల్లో అభిప్రాయపడింది. లోదుస్తులు వేసుకుంటేనే డిగ్నిటీగా ఉంటుందని పేర్కొంది. ఇంకేం.. అక్కడి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎయిర్‌లైన్స్ ఇచ్చింది అసలు అవసరం లేని ఆదేశాలన్నారు చాలామంది. ఎయిర్‌లైన్స్‌పై సొంత దేశంలోనే ట్రోలింగ్ కూడా జరిగింది. దీంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసేసుకుంది ఎయిర్‌లైన్స్. అయితే ఆ విమర్శలు మామూలుగా రాలేదు. అందుకే ఆ ఆదేశాలపై కచ్చితంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది పీఐఏ. How do undergarments potray positive image of PIA (Pakistan International Airlines)?#Pakistan #PIA #Undergarments pic.twitter.com/gPEmyDc2O9 — lyfmail.com (@lyfmailcom) September 30, 2022 @nailainayat @Arzookazmi30 Its Very important news coming from Pakistan. This decison by #PIA will be helpful in revenue generation. 🤣🤣🤣🤣🤣 Kuch Bhi, kya akal andhe baithe hai bhai #PIA me 🤣🤣 — मौलाना काण्डकारी अल हरामी مولانا کندکاری الحرامی۔ (@Maulanakandkari) September 30, 2022 డ్రెస్ కోడ్‌కు సంబంధించిన ఆదేశాల్లో చిన్న తప్పిదం జరిగిందని, అనవసరమైన పదాల చేరికతోనే ఇలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని పీఐఏ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ రాతపూర్వక వివరణ ఇచ్చుకున్నారు. ఇక.. జరిగిన ఘటనకు వ్యక్తిగతంగా పశ్చాత్తాపం తెలియజేశారాయన. పీఐఏ పాక్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్. రోజూ వందకు పైగా విమానాలు నడిపిస్తోంది. అందులో 18 దేశీయ సర్వీసులు కాగా, 25 అంతర్జాతీయ సర్వీసులు ఉన్నాయి. ఇదీ చదవండి: రూ. 8 కోట్ల కారు.. నీటిపాలు -
‘మొత్తం ప్రతిపక్షాన్ని క్లీన్‌స్వీప్ చేయాలని ఇమ్రాన్ చూస్తున్నారు’
Imran Khan wanted to clean sweep the entire opposition leadership: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాక్ విద్యుత్ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఖాన్ 15 ఏళ్లు తానే పాలన సాగించేలా ఫాసిస్ట్ ప్లాన్లు వేస్తున్నారని పాక్ విద్యుత్ శాఖ మంత్రి ఖుర్రం దస్తగిరి ఆరోపణలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికల్లా ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, అహ్సాన్ ఇక్బాల్, పాకిస్థాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసీతో సహా మొత్తం ప్రతిపక్ష నాయకత్వాన్నే ఇమ్రాన్ ఖాన్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నట్లు తనకు ముందస్తు సమాచారం ఉందని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఇమ్రాన్ ఖాన్ కూడా తన రాజకీయ ప్రత్యర్థులపై కేసులను వేగవంతం చేసేందకు సుమారు 100 మంది న్యాయమూర్తి నియమిస్తానని బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇమ్రాన్‌ఖాన్ దేశం పై దాడి చేసేలా ఫాసిస్ట్ ప్లాన్లు కలిగి ఉన్నందునే సంకీర్ణం ఏర్పడిందంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు పాక్ మాజీ మంత్రి అలీ హైదర్ జైదీ స్పందిస్తూ...రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కుట్ర ద్వారా తొలగించినట్లు ఖుర్రం దస్తగిర్ బహిరంగంగానే అంగీకరించాడని చెప్పారు. అవినీతి కేసుల నుంచి ప్రతిపక్షాలను కాపాడేందుకు ఇలా చేశారు. ఈ దుండగులు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నభిన్నం చేయాలని చూస్తుండటం బాధాకరం అన్నారు. అంతేకాదు ఖాన్ కూడా రష్యా, చైనా మరియు అఫ్గనిస్తాన్‌ల స్వతంత్ర విదేశాంగ విధాన నిర్ణయాల కారణంగా తాను ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానంలో ఓటమిని ఎదుర్కొన్నానని అన్నారు. పైగా ఖాన్ ఇది యూఎస్ కుట్రలో భాగమని కూడా ఆరోపించారు. ప్రస్తుత ప్రధాని షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దిగుమతి చేసుకున్నదని, పాకిస్తాన్‌కి ఆయన నిజమైన ప్రతినిధి కాదంటూ ఇమ్రాన్‌ఖాన్ తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. (చదవండి: ఆకాశమంత దట్టమైన పోగ...కెమికల్ ప్లాంట్ భారీ పేలుడు...ఒకరు మృతి) -
నిబంధనలు ఉల్లంఘిస్తే విమానం నుంచి దింపేయండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికులు మాస్క్‌లను కచ్చితంగా ధరించేలా నిబంధనలను అమలు చేయాలని ఢిల్లీ ధర్మాసనం ఆదేశించింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటించకుంటే విమానం నుంచి దింపేయాలని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో విమాన ప్రయాణంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడంపై పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధర్మాసనం కోవిడ్ నిబంధనలు అమలు చేయడమే కాకుండా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోమని పేర్కొంది. కరోనా కట్టడి చేసే దిశగా ప్రజల ఆరోగ్య దృష్ట్యా మాస్క్ ధరించడం, హ్యండ్ శానిటైజేషన్ వంటి నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ఉల్లంఘించే ప్రయాణికుల పై కఠిన చర్యలు తీసుకునేలా విమానాశ్రయాలు, విమానాల సిబ్బందికి పూర్తి అధికారాలు ఇస్తూ కరోనాకి సంబంధించిన ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయమని డీజీసీఏని ఆదేశించింది. పైగా నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులపై జరిమానా విధించడం తోపాటు సదరు వ్యక్తుల పేర్లను కూడా నో ఫ్లై లిస్ట్‌లో ఉంచాలని ఆదేశించింది. ఐతే ధర్మాసనం తినేటప్పుడు లేదా తాగేటప్పుడు మాస్క్‌ని తొలగించేలా చిన్న వెసుల బాటు కల్పించింది. (చదవండి: కరోనా కేసులు పైపైకి.. అక్కడ మళ్లీ మాస్క్ సంకేతాలు!) -
రహదారి భద్రత పై అవగాహాన పాఠాలు...లక్షల్లో ఫాలోవర్స్
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనే అసలైన మందు. ఇందుకోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. ఐటీ కంపెనీలు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ విధానం ప్రజలకు ఎంతో ఉపయుక్తకంగా మారింది. రోడ్డు ప్రమాదాల నివారణ, నిబంధనలపై యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలో పోస్ట్‌లు పెడుతూ.. అవగాహన కల్పిస్తున్నారు. రహదారి భద్రతపై హిట్ సినిమాల్లోని పాత్రలతో పోస్ట్‌లు, షార్ట్ వీడియోలు చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారు. లక్షల్లో ఫాలోవర్స్.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు సోషల్ మీడియాలకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. 1.2 లక్షలకు పైగా సబ్స్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానల్‌కు ఇటీవలే యూట్యూబ్ నిర్వాహకుల నుంచి సిల్వర్ ప్లే బటన్ అవార్డ్ కూడా దక్కింది. రహదారి భద్రత, వాహనదారుల నిబంధనలపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు అందించే సలహాలు, సూచనలతో కూడిన వీడియోలను యూట్యూబ్‌లో పెడుతున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన రహదారి ప్రమాదాలను వీడియో ప్రదర్శిస్తూ.. అందుకు దారి తీసిన కారణాలు, వాహనదారుల తప్పిదాలను వివరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదాల బారినపడి కోలుకున్న బాధితుల అనుభవాలు, గాయపడిన వ్యక్తులకు వైద్య సేవలు అందించిన వైద్యులు పంచుకున్న అంశాలను యూట్యూబ్ ద్వారా సబ్స్క్రైబర్లకు చేరవేస్తున్నారు. 15 రోజులకొకసారి సమీక్ష.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 15 రోజులకు ఒకసారి ట్రాఫిక్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. సైబరాబాద్‌లో కొత్తగా నిర్మించిన రహదారులు, ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లను ప్రజలు వినియోగించుకోవాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ, ట్రాఫిక్ రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సమయంలో ఎక్కడ ఎంత ట్రాఫిక్ రద్దీ ఉందో ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాలలో అప్డేట్ చేస్తున్నారు. వార్తా పత్రికలలో వచ్చిన కథనాలను, సృజనాత్మక చిత్రాలను రూపొందించి ప్రతి రోజు 4–5 వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అఖండ, పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ వంటి కొత్త సినిమాలలోని డైలాగ్‌ను తీసుకొని వాటికి హెల్మెట్, డ్రంకన్ డ్రైవింగ్, అతివేగం, సీట్ బెల్ట్ ధరించడం తదితర అంశాలను సినిమా పాత్రల ద్వారా పోస్ట్‌లు రూపొందించి సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. అవగాహనతోనే ప్రమాదాల నివారణ రోడ్డు ప్రమాదాల నివారణకు అసలైన మందు అవగాహనే. ప్రమాదాలను నివారించేందుకు సిబ్బంది, నిబంధనల అమలుతో పాటు అవగాహన అత్యంత ముఖ్యం. ఇందుకోసం భౌతికంగా, ఆన్లైన్ వేదికగా కూడా సెషన్స్ నిర్వహిస్తున్నాం. మనసుకు హత్తుకునేలా, సులువుగా అర్థమయ్యేలా స్కిట్స్ రూపంలో రోడ్డు భద్రతా నిబంధనలను వివరిస్తున్నాం. – పీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు డీసీపీ, సైబరాబాద్ ట్రాఫిక్ (చదవండి: అసలే అక్రమం... ఆపై అనైతికం!) -
నాలుగు సెక్షన్లతో పాలన
శ్రీకాకుళం పాతబస్టాండ్: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉన్నతాధికారులను ప్రజలకు దగ్గర చేసే పనిని ప్రభుత్వం మొదలుపెట్టింది. నూతనంగా ఏర్పడిన జిల్లాలో జనాభా, విస్తీర్ణం తగ్గడంతో కలెక్టరేట్లో పాలన కోసం ఏర్పాటు చేసే సెక్షన్లను కుదించారు. ఇప్పటివరకు 8 సెక్షన్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 4కు తగ్గింది. ఈ మేరకు జీఓ కూడా విడుదలైంది. కలెక్టరేటే కీలకం.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం, పనులు త్వరగా జరిగేలా చూడడంలో కలెక్టరేట్ కీలక పాత్ర పోషిస్తుంది. కలెక్టర్ కార్యాలయంలో ఇదివరకు ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్ అనే 8 సెక్షన్లు ఉండేవి. వీటికి తోడుగా మీ సేవ, లీగల్ సెక్షన్లు కూడా సేవలు అందించేవి. పథకాలు, సేవలపై ప్రజలు కలెక్టర్‌కి విన్నవించినా, వాటిని కలెక్టర్ ఈ సెక్షన్లలోని అధికారుల ద్వారా పరిష్కరించేవారు. సెక్షన్ –1: ఇప్పటి వరకు ఉన్న ఎ, బి సెక్షన్లను కలిపి సెక్షన్–1గా మార్చారు. ఎ–సెక్షన్లో ఉన్న ఎస్టాబ్లిష్మెంటు (పరిపాలన), ఆఫీస్ ప్రొసీడ్స్, ఎస్టాబ్లిష్మెంటు అండ్ సర్వీస్ మేటర్లు, డిసిప్లనరీ మేటర్లు అన్నీ క్యాడర్లకు సంబంధించినవి ఉంటాయి. బి–సెక్షన్లో అకౌంట్సు, ఆడిటింగ్, జీ తాలు, కోనుగోళ్లు, రికార్డుల నిర్వహణ ఉంటాయి. ఈ రెండు సెక్షన్లు ఒకటి చేశారు. సెక్షన్–2 : ఈ, జి, ఎఫ్ లను కలిసి ఒక సెక్షన్ చేశా రు. ఈ సెక్షన్లో ల్యాండ్ మేటర్లు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ ఎలిసేషన్, అసైన్మెంటు, హౌస్ సైట్స్, ప్రోహిబిటెడ్ ప్రోపర్టీ నిర్వహణ 22ఎ, ఫిషరీస్ అండ్ అదర్ ల్యాండ్ రికారŠుడ్స ఉంటాయి. జి సెక్షన్లో సెటిల్మెంట్లు, ఎస్టేట్ ఎ బోల్స్ యాక్టు, ఇనాం భూములు, కోర్టు సంబంధిత, ఫారెస్టు ల్యాండ్ వంటి అంశాలు ఉంటాయి. ఎఫ్‌లో భూ సేకరణ, ఆర్అండ్ఆర్ తదితర అంశాలు ఉంటాయి. ఈ మూడింటిని ఒక్కటి చేశారు. సెక్షన్–3 : సి, హెచ్ సెక్షన్లు కలిపారు. మెజిస్టీరియల్ సెక్షన్, కుల వెరిఫికేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ, ఎలక్షన్ అంశాలు, లా అండ్ ఆర్డర్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఇతర అనుబంధ అంశాలు ఉంటాయి. హెచ్ సెక్షన్లో ప్రోటోకాల్, గ్రీవెన్సు, ఇతర రిలేటెడ్ అంశాలు ఉంటాయి. సెక్షన్–4 : ఇందులో డి సెక్షన్ ఉంటుంది. ఇందులో డిజాస్టర్ మేనేజ్మెంటు, విపత్తులు ఇతర అంశాలు ఉంటాయి. పై సెక్షన్లకు సూపరింటెండెంట్లను కూడా నియమించారు. ఇవి కాకుండా ఎప్పటిలాగానే లీగల్ సెక్షన్, మీ సేవ సెక్షన్లు నడుస్తున్నాయి. వీటికి సీనియర్ సూ పరింటెండెంట్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్ప టి వరకు ఉన్న సిబ్బందిని కుదించారు. కలెక్టరేట్ నుంచి సిబ్బంది విజయనగరం, మన్యం జిల్లాలకు వెళ్లారు. సమస్యలు లేవు.. జిల్లాల విభజన తర్వాత సెక్షన్లను కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ మేరకు సెక్షన్లను కుదించాం. సమస్యలేవీ లేవు. తగినంత మంది సిబ్బందిని సమకూరుస్తున్నాం. – ఎం.రాజ్యలక్ష్మి, డీఆర్ఓ -
2023లో అధికారంలోకి రావడమే మా లక్ష్యం!
హైదరాబాద్: రాష్ట్రంలో 2023లో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు యువ మోర్చా కార్యకర్తలు పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో జరిగింది. ఎందరో ప్రాణ త్యాగాలు చేస్తే బీజేపీ ఈ స్థాయికి వచ్చిందని, వారి లక్ష్య సాధనకు ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. గోల్కొండ కోటపై కాషాయ జెండానే మనకు కన్పించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం జల్సా చేస్తోందని మండిపడ్డారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం చేరి.. దోచుకుంటోందని ఆరోపించారు. రాక్షస పాలన నుంచి రాష్ట్ర విముక్తి కోసం యువమోర్చా పోరాటం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. కొందరు టీఆర్ఎస్తో పొత్తు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయంటేనే ఈ ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. యువ మోర్చా ఉద్యమంతో కేసీఆర్‌కు వణుకు పుట్టాలన్నారు. యువ మోర్చా కార్యకర్తలకు క్రమశిక్షణ, ఓపిక ముఖ్యమన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు న్యాయం జరగాలంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందన్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు నాగార్జునసాగర్‌లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇచ్చామన్నారు. పోలీసులకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, భైంసాలో రిపోర్టర్లపై హిందూ వాహిని కార్యకర్తలు దాడి చేశారా అనేది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన పోలీస్ అధికారి చెప్పాలని పేర్కొన్నారు. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని, ప్రైవేటు టీచర్లకు గౌరవవేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్, యువమోర్చా ఇన్చార్జి ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆలోచన ముఖ్యం
శివ, సోనా పటేల్ జంటగా పైడి రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూల్’ (ది పవర్ ఆఫ్ పీపుల్). శ్రీ సుదర్శన చక్ర క్రియేషన్స్ పతాకంపై పైడి సూర్యనారాయణ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 9న విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో బిగ్ సీడీని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల విడుదల చేశారు. దర్శకులు కె.రాఘవేంద్రరావు మోషన్ పోస్టర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫస్ట్ లుక్, నిర్మాత అశ్వినీదత్ టీజర్, డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసారు. సినిమా విజయం సాధించాలని వీరందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పైడి రమేశ్ మాట్లాడుతూ– ‘‘హీరో ఒక యువజన నాయకుడు. తన కుటుంబంతో పాటు ఎన్నో నిరుపేద కుటుంబాలకు అన్యాయం జరగకుండా ఎలా ఆదర్శవంతుడిగా నిలిచాడన్నది ఈ చిత్రం కథాంశం. ఈ చిత్రంతో రమణ సాయి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్, వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం’’ అన్నారు. ‘‘ఆవేశం కంటే ఆలోచనలు ముఖ్యం. మనీ కంటే మనుషుల విలువలు ముఖ్యం అని తెలియజేసే మంచి సందేశం ఉన్న చిత్రం ఇది. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు పైడి సూర్యనారాయణ . ఈ చిత్రానికి కెమెరా: బాల, సహ నిర్మాత: పాంగ కోదండరావు. -
కశ్మీర్లో సంబరాలు
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు రావడంతో స్థానిక ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పీడీపీ నుంచి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం బీజేపీ ప్రకటించగా, మెహబూబా ముఫ్తీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై కశ్మీర్ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీనగర్, కుప్వారా, పహల్గాం జిల్లాలో ప్రజలు రోడ్డ మీదకు వచ్చి టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘పీడీపీ-బీజేపీ కూటమి అపవిత్రమైనది. పీడీపీ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాకు ఇష్టంలేదు. ఇప్పటికైన వారి కూటమి విడిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని స్థానికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కశ్మీర్ ప్రముఖ వ్యాపారవేత్త నసీర్ మాట్లాడుతూ.. ‘పీడీపీ-బీజేపీ కూటమి ఉత్తర, దక్షిణ ధ్రువాలు వంటి పార్టీలు. రెండు పార్టీల సిద్ధాంతాలు పూర్తిగా వ్యతిరేకమైనవి. బీజేపీకి కశ్మీర్ ప్రజల పట్ల ప్రేమ లేదు. వారి కూటమి వల్ల కశ్మీర్ చాలా నష్టపోయింద’ని అన్నారు. కొంత మంది ప్రజలు మాత్రం గవర్నర్ పాలనలో అవినీతి విపరీతంగా ఉంటుందని, రాష్ట్రంలో పరిస్థితి మరింతగా క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మా ఊళ్లో మా రాజ్యం
సాక్షి, హైదరాబాద్/ఆదిలాబాద్ : మావ నాటే.. మావ రాజ్ (మా ఊళ్లో మా రాజ్యం) అనే నినాదంతో ఆదివాసీలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. శుక్రవారం నుంచి గూడేల్లో స్వయం పాలనను ప్రకటించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్‌తో ముందుకు కదులుతున్నారు. స్వయంపాలనలో భాగంగా లంబాడా అధికారులను గూడేల్లోకి రానివ్వబోమని హెచ్చరిస్తున్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషితో ఆదివాసీ పోరాట సమితి అధ్యక్షుడు సోయం బాపురావు ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు సచివాలయంలో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆదివాసీ నేతలు స్వయం పాలనకు పిలుపునిచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గత ఏడాది డిసెంబర్లో ఆదివాసీలు చేపట్టిన ఉద్యమం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ ఉద్యమం సాగింది. గత డిసెంబర్ 15న ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఘర్షణల తర్వాత ప్రభుత్వం ఇరు వర్గాలను చర్చలకు ఆహ్వానించింది. అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్పీ సింగ్‌తోపాటు డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లాలో పర్యటించి ఆదివాసీలు, లంబాడాలతో వేర్వేరుగా చర్చలు జరిపారు. చర్చల్లో భాగంగా జనవరి 4న ఆదివాసీలు ప్రభుత్వానికి మెమొరాండం అందజేశారు. డిమాండ్లను నెరవేర్చని పక్షంలో జూన్ 1 నుంచి స్వయంపాలనకు వెళ్తామని హెచ్చరించారు. డిసెంబర్ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘర్షణలు సద్దుమణిగినప్పటికీ ఆదివాసీలు ఉద్యమాన్ని శాంతియుతంగానే నిర్వహిస్తూ వచ్చారు. తుడుందెబ్బ నాయకులు చెప్పినట్లు శుక్రవారం నుంచి ఆదివాసీ గూడేల్లో స్వయం పాలన ప్రారంభించాల్సి ఉండగా, ఒకరోజు ముందు గురువారం ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం.. శైలేంద్రకుమార్ జోషితో చర్చల సందర్భంగా సమితి ప్రతినిధులు తమ డిమాండ్లను సీఎస్ ముందుంచారు. ఎస్టీ(షెడ్యూల్డ్ తెగలు) జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని స్పష్టం చేశారు. ఆర్టికల్ 342 ప్రకారం 9 తెగలను మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చారని, కానీ 1976 తర్వాత వలస మార్గంలో వచ్చిన లంబాడీలు అక్రమంగా ఎస్టీల్లో చేరారన్నారు. ఎలాంటి కమిషన్ వేయకుండా వారిని ఎస్టీ జాబితాలో చేర్చడంతో ఆదివాసీలు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. అలాగే ఏజెన్సీ ధ్రువీకరణ పొందిన వేలాది లంబాడా యువత ఆదివాసీల ఉద్యోగాలను తన్నుకుపోయినట్లు స్పష్టంచేశారు. వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తేనే న్యాయం జరుగుతుందని సీఎస్‌కు ఏకరువు పెట్టారు. దీనిపై జోషి స్పందిస్తూ.. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించడం తమ పరిధిలో లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆదివాసీ హక్కుల పోరాట సమితి డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరిస్తానని సమితి ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అయితే ప్రధాన డిమాండ్‌పై స్పష్టత రాకపోవడంతో చర్చల ప్రసక్తే లేదంటూ సమితి ప్రతినిధులు సీఎస్ చాంబర్ నుంచి అర్ధంతరంగా బయటకు వచ్చేశారు. ఇక స్వయం పాలనే: సోయం బాపురావు ప్రభుత్వంతో చర్చల అనంతరం బాపురావు మీడియాతో మాట్లాడారు. చర్చలు సఫలీకృతం కానందున తమ కార్యచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్వయం పాలనకు పిలుపునిచ్చారు. మా ఊరు– మా రాజ్యం పేరుతో ముందుకెళ్తామన్నారు. రాష్ట్రానికి వలసలుగా వచ్చి ఇక్కడ ఎస్టీ జాబితాలో దొడ్డిదారిన చేరిన లంబాడీలు ఆదివాసీల హక్కులను పూర్తిగా హరించారన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేదాక ఉద్యమం ఆపేదిలేదన్నారు. జూన్ 2న నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న లంబాడా అధికారుల విధులను అడ్డుకుంటామన్నారు. మహారాష్ట్రలో బీసీలుగా ఉన్న లంబాడీలు మధ్యప్రదేశ్‌లో ఓసీ కేటగిరీలో ఉన్నట్లు చెప్పారు. అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్సీలుగా, రాజస్థాన్ ఓసీలుగా చలామణి అవుతున్నారని, కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎస్టీలుగా ఉన్నట్లు వివరించారు. -
చిదంబరం చుట్టూ చోక్సీ ఉచ్చు
సాక్షి, ముంబై: ఐఎన్ఎక్స్ మీడియా వివాదంలో ఇప్పటికే చిక్కుల్లో పడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత , కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం చుట్టూ మరింత ఉచ్చు బిగించేందుకు బీజేపీ సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీ భారీ అక్రమాలకు, కుంభకోణానికి యూపీయే ఆధ్వర్యంలోని బంగారం దిగుమతి పథకం ఊతమిచ్చిందని ఆరోపిస్తోంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చిదంబరంపై సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం చిదంబరం ఆశీర్వాదంతోనే గీతాంజలి గ్రూపు మెహల్ చోక్సి సహా మిగిలిన ఏడు కంపెనీలు అక్రమాలకు పాల్పడ్డాయంటూ తీవ్ర ఆరోపణలకు దిగారు. వివాదాస్పదమైన ఈ నిబంధనను 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని కేంద్రమంత్రి దుయ్యబట్టారు. దిగుమతి చేసుకున్న బంగారంలో 20శాతం ఎగుమతి చేసిన తరువాత మాత్రమే బంగారం దిగుమతులకు ట్రేడర్లకు అనుమతి లభించేలా 80:20 నియమాన్ని తెచ్చారన్నారు. తత్ఫలితంగానే ఏడు ప్రయివేటు కంపెనీలు భారీ అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఈ పథకానికి ఎందుకు అనుమతినిచ్చారో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, చిదంబరం ఇపుడు సమాధానం చెప్పాలని రవిశంకర ప్రసాద్ డిమాండ్ చేశారు. అయితే ఎన్డీఐ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నవంబర్‌లో ఈ నిబంధనను తాము రద్దు చేశామన్నారు. ఇది ఇలా ఉంటే 80:20 బంగారు దిగుమతి పథకానికి సంబంధించి అన్ని వివరాలను ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు ఉంచనున్నారని పీటీఐ నివేదించింది. రానున్న పదిరోజుల్లో ఈ వివరాలను అందించనున్నారని తెలిపింది. కాగా ఐఎన్ఎక్స్ కేసు లో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు ఈ కేసు విచారణలో మరో కీలక నిందితురాలు, ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్ ఇంద్రాణి ముఖర్జీ వాంగ్మూలం ఆసక్తికరంగామారింది. కార్తి చిదంబరానికి సాయం చేయాలని స్వయంగా అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం తనను కోరారని సీబీఐ విచారణలో ఆమె చెప్పింది. దీంతో మాజీ ఆర్థికమంత్రి మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే చిదంబరాన్ని కూడా సీబీఐ ప్రశ్నించనుందని భావిస్తున్నారు. -
ఆలయంలో దేవునికి ఎదురుగా నిలబడకూడదా?
ప్రాణప్రతిష్ఠ చేసే క్రమంలో ఎన్నో శక్తుల్ని స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తారు. ఆ శక్తిని మనం తట్టుకోలేం. కనుక ఎదురుగా నిలబడకూడదన్న నియమం ఏర్పడింది. దేవాలయంలో అద్వితీయమైన శక్తి ఉంటుంది. ప్రధానంగా మూలవిరాట్‌ను ప్రతిష్టించే సమయంలో వేదమంత్రాలను పఠిస్తారు. గర్భగుడిలో మహాశక్తులను నిక్షిప్తం చేస్తారు. మందిరంలో యంత్రబలంతో పాటు మంత్రబలం ఉంటాయి. పరమేశ్వరుడు, కాళీమాత ఆలయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలని పురాణగ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా కొన్ని ఆలయాల్లో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి. మనం అడ్డంగా నిలిస్తే కిరణాలు మూలవిరాట్ దగ్గరకు వెళ్లలేవు. అంతేకాదు, స్వామివారికి ఎదురుగా ఉండే ఆయన వాహనానికి మధ్యలో కూడా నిలబడకూడదు. ఒకపక్కగా నిలబడి నమస్కరించుకోవాలి.