ఎన్నికల విధుల్లో ఎవరుంటారు? మినహాయింపు ఎవరికి? | Who Are Required To Perform Duty In Elections? | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: ఎన్నికల విధుల్లో ఎవరుంటారు? మినహాయింపు ఎవరికి?

Published Sat, Mar 30 2024 12:33 PM | Last Updated on Sat, Mar 30 2024 12:39 PM

Who are Required to Perform Duty in Elections - Sakshi

దేశంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు వివిధ బాధ్యతలను అప్పగిస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, జాతీయ బ్యాంకులు, ఎల్‌ఐసీతో సహా వివిధ సంస్థల ఉద్యోగులు  ఎన్నికల విధులలో పాల్గొనాల్సి ఉంటుంది. 

ఈ పోలింగ్ బృందాలలో ప్రిసైడింగ్ అధికారులు,  పోలింగ్ అధికారులు, సెక్టార్, జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, సహాయ వ్యయ పరిశీలకులు, డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లు మొదలైనవారు ఉంటారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల బాధ్యత రాష్ట్ర పోలీసులు, సెక్టార్, జోనల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులపై ఉంటుంది. వీరు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని జిల్లాలలో ఎన్నికల నిర్వహణలో భాగస్వాములవుతారు.

ఎన్నికల విధులలో నియమితులైనవారు  గైర్హాజరయ్యేందుకు అవకాశం  ఉండడు. విధులకు హాజరుకానివారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. కేంద్రం లేదా రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగులుగా ఉన్నవారిని మాత్రమే ఎన్నికల విధులలో నియమిస్తారు. అవసరమైతే పదవీ విరమణ తర్వాత డిప్యూటేషన్‌లో ఉన్న ఉద్యోగులను కూడా ఎన్నికల విధులలో నియమిస్తారు. కాంట్రాక్టు లేదా రోజువారీ ఉద్యోగులను ఎన్నికల డ్యూటీలో నియమించరు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో భార్యాభర్తలిద్దరికీ విధులు అప్పగించరు. దంపతుల్లో ఒకరు పిల్లలను లేదా వారి వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడానికి  మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎవరైనా ‍ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగి అప్పటికే విదేశాలకు వెళ్లే ప్లాన్‌లో ఉంటే, అతను ఎన్నికల డ్యూటీ నుంచి మినహాయింపును కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇందు కోసం ముందుగా ప్రయాణాన్ని బుక్ చేసుకోవాలి. దరఖాస్తులో ప్రయాణ రుజువుగా సంబంధిత టికెట్, వీసాను జత చేయాలి. ఇదేవిధంగా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నికల విధుల నుంచి మినహాయింపును కోరవచ్చు. అయితే ఇటువంటి సందర్భంలో సంబంధిత ఉద్యోగి అవసరమైన అన్ని వైద్య ధృవపత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement