దేశంలో ఎక్కడ చూసినా లోక్‌సభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపధ్యంలో యూపీలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఎన్నికల విధుల కోసం యూపీలోని కాన్పూర్ నుంచి నోయిడాకు వెళ్లిన 115 మంది పోలీసులు అదృశ్యమైన ఉదంతం వెలుగు చూసింది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం గ్రేటర్ నోయిడా పోలీస్ డిప్యూటీ కమిషనర్ తనిఖీలో, కాన్పూర్ నుండి వచ్చిన 138 మంది పోలీసులలో 115 మంది అదృశ్యమైనట్లు తేలింది. ఈ పోలీసులకు దాద్రీలోని అన్షు పబ్లిక్ స్కూల్‌లో వసతి సౌకర్యం కల్పించారు. నోయిడా పోలీసులు ఈ గైర్హాజరైన పోలీసులపై కేసు నమోదు చేశారు.
అలాగే ఈ విషయాన్ని డీజీపీ హెడ్‌క్వార్టర్‌లోని ఉన్నతాధికారులకు తెలియజేశారు. కాగా ఇలాంటి పలు ఘటనలు వెలుగులోకి రావడంతో, ఎన్నికల విధులకు హాజరైన పోలీసులను రోజువారీగా లెక్కించాలని అన్ని జిల్లాల పోలీసు కమిషనర్లకు లా అండ్ ఆర్డర్ ఏడీజీ అమితాబ్ యష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అదృశ్యమైన పోలీసులు ఎన్నికల విధులకు గైర్హాజరై, వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment