Election News
-
VCK నిర్ణయంపై స్టాలిన్ ఆగ్రహం
-
అలా చేశాడంటే.. విజయ్ పతనం ఖాయం..!
సినిమాలు వేరు.. రాజకీయం వేరు.. అవును ఇది ముమ్మాటికీ నిజమే. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రూవ్ అయింది కూడా. సినీ గ్లామర్‌తో పాలిటిక్స్‌లో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అధికారం చేపట్టలేకపోయారు. తమిళనాడులోనూ కమల్ హాసన్, విజయ్ కాంత్ లాంటి వాళ్లు కూడా నెగ్గలేకపోయారు. కానీ ఊహించని విధంగా దళపతి విజయ్ మాత్రం సక్సెస్ అయ్యాడు. అధికారం కోసం మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా అత్యధిక సీట్లు గెలిచాడు. దీంతో ఒక్కసారిగా విజయ్ పేరు మార్మోగిపోతోంది.ఈ నేపథ్యంలో త్రిష పేరు కూడా హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికల ముందే వీరిద్దరిపై రూమర్స్ వచ్చాయి. విజయ్ భార్య సంగీత సైతం విడాకుల పిటిషన్ వేయడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని టాక్ వినిపించింది. విజయ్-త్రిష కలిసి పెళ్లికి హాజరు రావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా విజయ్ గెలిచాక త్రిష నేరుగా ఇంటికెళ్లి మరి అభినందనలు తెలిపింది. దీంతో త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. విజయ్ పోటీ చేసిన ఓ స్థానంలో నిలబడుతుందని తమిళనాట హల్చల్ చేస్తోంది. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పాలిటిక్స్‌లోకి త్రిష ఎంట్రీ ఇస్తే విజయ్ పతన ఖాయమని అంటున్నారు. అదేలాగో తెలుసుకుందాం.త్రిష ఎంట్రీతో విజయ్‌కి దెబ్బ..రాజకీయాల్లో సీఎం కుర్చీ అనేది అంత ఈజీ కాదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. పాలిటిక్స్‌లో వ్యక్తిగత విషయాలను తీసుకురాకపోవడమే మంచింది. త్రిషతో రిలేషన్ ఉన్నంత మాత్రాన ఆమెను రాజకీయాల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ అదే జరిగితే విజయ్‌పై చెడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. ఎందుకంటే విజయ్‌కు మాత్రమే తమిళ ప్రజలు ఓటేశారు. అంతేకానీ త్రిషను చూసి కాదు. ఆమెను తీసుకొస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ఇదంతా పాలన ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో బీజేపీ నేత నాగేంద్రన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. అప్పట్లో త్రిషకు మద్దతు లభించినా.. ఆమెను విజయ్ రాజకీయంగా ప్రమోట్ చేస్తే మాత్రం ప్రజా వ్యతిరేకతకు కారణమవుతుంది. ఈ విషయంలో విజయ్ చాలా అప్రమత్తంగా ఉండాలి.వ్యక్తిగతం వేరు.. రాజకీయ జీవితం వేరుతిరుచ్చి ఈస్ట్ స్థానానికి విజయ్ రాజీనామా చేయాల్సిందే. ఆ నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యం ఉన్న ప్రాంతం కావడం విశేషం. అక్కడ విజయ్ను చూసి మాత్రమే ఓటేశారు. అదే స్థానంలో త్రిషను నిలబెడితే ఆదిలోనే విజయ్‌కు దెబ్బపడే అవకాశముంది. అధికారం చేపట్టిన పార్టీ తొలి ఉపఎన్నికలోనే ఓడిపోతే ఆ ప్రభావం పాలనపై పడుతుంది. ఈ ప్రయోగం విఫలమైతే.. అది కేవలం ఒక సీటు ఓటమి మాత్రమే కాదు.. విజయ్ రాజకీయ పతనానికి సంకేతంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ద్రవిడ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని విజయ్ ముందుకెళ్లాలి. రాజకీయాలతో పర్సనల్ లైఫ్‌ను ముడిపెట్టకుండా పాలన సాగిస్తే విజయ్‌కే మంచిదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
పలు కీలక అంశాలపై గవర్నర్ తో టీవీకే భేటీ
-
కాంగ్రెస్ మద్దతు కోరిన టీవీకే..! స్పందించిన KC వేణుగోపాల్
-
MAGAZINE STORY: ఫలితాలు చెప్పిన పాఠాలు
-
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు
-
విజయ్ గెలుపు.. బుట్టబొమ్మకు ముందే తెలుసా?
తమిళనాట ఎన్నికలకు ముందు దళపతి విజయ్ నటించిన చివరి మూవీ జన నాయగన్. అయితే ఈ సినిమా సెన్సార్ వివాదాలతో వాయిదా పడింది. ఎలక్షన్ ముందు అడ్డంకులు రావడంతో జన నాయగన్ వివాదం కోర్టుకు చేరింది. ఎన్నికల ముందు రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ మూవీలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ నటించింది. ఇందులో నటి మమితాబైజు, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.ఈ సినిమా సంగతి పక్కన పెడితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు బుట్టబొమ్మ.. విజయ్ను చూపిస్తూ కనిపించింది. ఈ వీడియో జన నాయగన్ మూవీ షూటింగ్ టైమ్‌లో చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో విజయ్ సిగ్గుపడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ గెలుస్తాడని బుట్టబొమ్మకు ముందే తెలుసా అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరు పూజా హెగ్డే కాన్ఫిడెన్స్ సూపర్ అంటూ కొనియాడుతున్నారు. BREAKING: Pooja Hegde points at Thalapathy Vijay as the election winner and he responds with a shy blush. pic.twitter.com/aUdvjB7Odx— Actor Vijay Team (@ActorVijayTeam) May 5, 2026 -
ఒకే ఒక్క ఓటు.. DMK మంత్రినే ఓడించిన TVK
-
జగన్ ను ఫాలో అయ్యి, TVK విజయ్ సక్సెస్ స్టోరీ
-
ఫ్యామిలీతో విజయ్ సెలబ్రేషన్స్
-
ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం..
-
తమిళ రాజకీయాల్లో కొత్త శక్తి..!
-
10 సీట్లు కోసం.. ఆ పార్టీతో TVK పొత్తు..?
-
విజయ్ పై తల్లి, ఫ్యామిలీ అద్భుతమైన పాట
-
విజయ్ సీఎం అవుతాడని ముందే చెప్పా... కేఏ పాల్ సంచలన కామెంట్స్
-
విజయ్ కి ఇదే.. కలిసొచ్చింది..!
-
కాంగ్రెస్ తో విజయ్ పొత్తు? TVK MLAలతో భేటీ..
-
ఎమ్మెల్యేగా గెలిచిన విజయ్ డ్రైవర్ కొడుకు
-
TVK ప్రధాన కార్యాలయానికి విజయ్
-
పవన్ తలదించుకో విజయ్ ని చూసి నేర్చుకో..
-
CMనే ఓడించిన... ఈ బాబు ఎవరు?
-
TVK సెంచరీ విజయ్ ఇంటి వద్ద సంబరాలు
-
బెంగాల్ లో TMCకి గట్టి ఎదురుదెబ్బ
-
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సునామీ.. కుప్పకూలిన 50 ఏళ్ల పార్టీలు..
-
పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఓటమి
-
TVK ఘన విజయం విజయ్ ఇంటికి పోటెత్తిన అభిమానులు
-
విజయ్ ప్రచారంలో జగన్ ఫోటో, జగన్ బాటలోనే విజయ్..
-
ఎన్నికల ఫలితాలపై ప్రొ. K నాగేశ్వర్ విశ్లేషణ
-
అందరి నోర్లు మూయించిన విజయ్
-
BIG QUESTION: బెంగాలీ గడ్డపై కాషాయ జెండా పెద్దోళ్ళకు షాకిచ్చిన విజయ్
-
'ఆ దారుణాన్ని మర్చిపోలేదు.. ఎన్నికల్లో సరైన బుద్ది చెప్పారు..' హీరో నిఖిల్
పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంపై టాలీవుడ్ హీరో నిఖిల్ ట్వీట్ చేశారు. బెంగాల్లో మమతా బెనర్జీ దారుణాలను ప్రజలు ఇంకా మరిచిలేదు.. క్షమించనూ లేదన్నారు. అందుకే మమతా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని రాసుకొచ్చారు. సామాన్యుడిని పట్టించుకోని ప్రభుత్వానికి ఇలాంటి గతే పడుతుందన్నారు. ఆర్జీ కర్ వైద్య కళాశాల బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఆకాంక్షించారు. గతంలో ఈ దారుణంపై తాను మాట్లాడిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.కాగా.. ఇవాళ వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వాన్ని కూలగొట్టింది. ఇప్పటికే మూడుసార్లు సీఎంగా పనిచేసిన మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఓటమిపాలైంది. ఆమె ప్రభుత్వంలోనే ఆర్జీకర్ వైద్య కళాశాలలో ఓ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. The People of West Bengal did not forget or forgive . They Taught a lesson to the Govt which did not care for the Common Person . Justice for RG KAR Medical college Horror . #RGKAR #Kolkata https://t.co/ydOioIZBdH— Nikhil Siddhartha (@actor_Nikhil) May 4, 2026 -
చెన్నైలోని తల్లిదండ్రుల నివాసంలో TVK విజయ్ దృశ్యాలు
-
Axis My India చెప్పిందే నిజమైంది.. విజయ్ విజయ దుందుభి
-
విజయ్ విన్.. మెగాస్టార్, మహేశ్ బాబు ప్రశంసలు
విజయ్ గెలుపుతో కోలీవుడ్‌లో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ విజయాన్ని కోలీవుడ్ నటీనటులు చాలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నటుడు జీవా విజిల్స్ వేస్తూ కనిపించారు. ఆయనతో మరో కమెడియన్ సైతం విజిల్స్‌తో సందడి చేశారు. తమిళనాడు వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు విజయ్‌కు అభినందనలు చెబుతున్నారు. అంతేకాకుండా తమిళ హీరో, నిర్మాత విశాల్, నటి ఖుష్బు సుందర్, కమల్ హాసన్, జీవీ ప్రకాశ్ కుమార్ విజయ్ను అభినందించారు. టాలీవుడ్ హీరోల ప్రశంసలు..దళపతి విజయ్‌కు టాలీవుడ్ స్టార్స్ సైతం అభినందనలు చెబుతున్నారు. విజయ్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మొదటి ఎన్నికలోనే అద్భుతమైన విజయం సాధించారని కొనియాడారు. మీ లక్ష్యం, నాయకత్వంతో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.తమిళనాడు ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. ప్రజలు మీపై ఉంచిన అపారమైన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని ప్రశంసించారు. ఈ పాలనలో తమిళనాడు మరింత పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహేశ్‌బాబుతో పాటు టాలీవుడ్ హీరోలు రవితేజ, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాని, శర్వానంద్, సాయితేజ్, శ్రీవిష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం విజయ్ విజయంపై ట్వీట్ చేశారు.కాజల్ అగర్వాల్ ట్వీట్..తమిళనాడులో విజయ్ గెలుపుపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ అద్భుతమైన విజయంపై హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేసింది. మీ దార్శనికతకు, మీ పట్టుదలకు, మీపై ప్రజలకు ఉన్న అచంచలమైన ప్రేమకు నిజమైన నిదర్శనమని కొనియాడింది. తమిళనాడు ప్రజలు తమ తీర్పునుస్పష్టంగా చెప్పారని ప్రశంసించింది. ఇది కేవలం ఒక విజయం కాదు.. లక్షలాది మందితో అనుబంధానికి జరుపుకునే వేడుకని అభినందించారు. కాగా.. తుపాకీ, మెర్సల్, జిల్లా చిత్రాల్లో విజయ్ సరసన కాజల్ నటించారు. தங்களுடைய முதல் தேர்தலிலேயே மக்களுடைய நம்பிக்கையைப் பெற்று பெருவெற்றி பெற்றிருக்கும் தமிழக வெற்றிக் கழகத்தின் தலைவர் திரு. விஜய் @TVKVijayHQ அவர்களுக்கும், அவரது கட்சியினருக்கும் என்னுடைய பாராட்டுகள். மக்கள் பணி சிறக்க என்னுடைய வாழ்த்துகள்.— Kamal Haasan (@ikamalhaasan) May 4, 2026 Heartiest congratulations to @actorvijay on this spectacular and resounding victory! This moment is a true testament to your vision, your perseverance, and the unwavering love people have for you.The people of Tamil Nadu have spoken—loud, clear, and with immense pride. This… pic.twitter.com/XVhg0aYt1r— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 4, 2026 Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2026 Dear @actorvijay,Hearty congratulations on this outstanding and well-deserved victory in your first election 💐💐💐May you continue to inspire, lead, and serve with unwavering passion and purpose. My best wishes to you for your public service to the state of Tamil Nadu and…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2026 -
సినిమా నుంచి CM వరకు.. విజయ్ ప్రస్థానం
-
రియల్ జన నాయగన్, పార్టీ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు..
-
విజయ్ విజయం.. పవన్ కల్యాణ్‌కు కొత్త చిక్కులు..!
విజయ్.. విజిల్.. విజయం.. ఇప్పడంతా ఎక్కడ చూసినా ఈ మూడు పదాలే వినిపిస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి సారే సెంచరీ కొట్టిన హీరో విజయ్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్‌కు అభినందనలు తెలిపారు. మొదటిసారి పోటీ చేసిన విజయ్ ఏకంగా సీఎం రేసులో దూసుకెళ్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించనుంది.అయితే తమిళనాడులో విజయ్ విజయాన్ని ఏపీ రాజకీయాలతో ముడిపెడుతున్నారు. విజయ్ గెలుపుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. తొలిసారి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో(పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) గెలుపొందారు. అంతేకాకుండా మొదటిసారే సీఎం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో జనసేనానిపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.ఏపీలో వచ్చే ఎన్నికల్లోనైనా సింగిల్‌గా పోటీ చేయాలని పవన్ కల్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు. విజయ్‌లాగే సింగిల్‌గా బరిలోకి దిగాలన్న డిమాండ్ పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ గెలుపు కాస్తా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలోనూ ఎవరితోనూ పొత్తులు లేకుండా బరిలోకి దిగాలనే డిమాండ్ వస్తే జనసేనాని ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. సింగిల్‌గా పోటీ చేస్తేనే గుర్తింపు ఉంటుందని సగటు అభిమానులు, జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. -
LIVE : విజయ్ గెలుపు జగన్ రియాక్షన్
-
LIVE : దూసుకుపోతున్న విజయ్
-
తమిళనాడులో విజయ్ తుఫాన్, దళపతికి పట్టం కట్టిన ZenG
-
విజయ్ విజయం త్రిష సంచలన కామెంట్స్
-
DMK ఓటమికి కారణం ఇదే..
-
విజయంపై విజయ్ తల్లి ఫస్ట్ రియాక్షన్
-
విజయ్ సీఎం.. డిప్యూటీ సీఎంగా త్రిష..!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తొలిసారి సింగిల్‌గా బరిలోకి దిగి మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తున్నారు. ఊహించని విధంగా అధికార డీఎంకేతో పాటు ఏఐడీఎంకే పార్టీలకు గట్టి షాకిచ్చాడు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి చూపు తమిళనాడుపై పడింది. ద్రవిడ రాజకీయాల్లో పోటీ చేసిన తొలిసారే సంచలనం సృష్టించిన విజయ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్‌కు అభినందనలు చెబుతున్నారు. హీరోయిన్ త్రిష సైతం ఇంటికి వెళ్లి విజయ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే త్రిష గురించి నెట్టింట చర్చ మొదలైంది. త్రిష సైతం రాజకీయాల్లో అడుగుపెట్టనుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం కానుందని మరో టాక్ వైరలవుతోంది. విజయ్ పోటీచేసిన రెండు స్థానాల్లో గెలిస్తే.. ఒక్కచోట రాజీనామా చేయాల్సిందే. అదే సమయంలో విజయ్ రాజీనామా చేసిన స్థానంలో త్రిష పోటీ చేస్తారని లేటేస్ట్ టాక్. అలా ఎన్నికల్లో గెలిచి హీరోయిన్ త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం అవుతారని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. హీరో విజయ్ తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్‌లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు ఎన్నికల ముందు త్రిష- విజయ్‌పై రూమర్స్ పెద్దఎత్తున వైరలయ్యాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. విజయ్- త్రిష ఓ పెళ్లికి హాజరు కావడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఏదేమైనా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపుతో ఒక్కసారిగా అందరి దృష్టి త్రిషపై పడింది. తమిళనాట త్రిష ప్రయాణం ఎలా ఉండనుందో మరికొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.ఇక త్రిష సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంభరలో కనిపించనుంది. -
పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంపై NV. సుభాష్
-
విజయ్ గెలుపుపై తండ్రి ఫస్ట్ రియాక్షన్
-
TVK విజయ్ విక్టరీ సీక్రెట్ ఇదే
-
West Bengal Results: బెంగాల్లో బీజేపీ విజయం
-
ఏం చేస్తాడులే అన్నారు... ఇప్పుడు చరిత్రను తిరగరాశాడు
-
ఊహించని మలుపు తమిళనాడు 'కింగ్'గా విజయ్..
-
బెంగాల్ లో కమల వికాసం
-
గెలిచిన ఆనందం... TVK విజయ్ ఇంట్లో సంబరాలు..
-
విజయ్ గెలుపు వెనుక రహస్యం? టీవీకే సక్సెస్ పై అనలిస్ట్ కామెంట్స్
-
విజయ్ నిర్ణయం కీలకం? బీజేపీ జీవీఎల్ స్పందన
-
చరిత్రను తిరగరాశాడు... సీఎంగా విజయ్...
-
దూసుకుపోతున్న విజయ్
-
విజయ్ విజిల్ మోత తమిళనాడు అదుర్స్
-
DMK పార్టీ ఆఫీస్ వద్ద టెంట్లు పీకేస్తున్న కార్యకర్తలు
-
విజయ్ అనే నేను!
-
ట్రెండ్ సృష్టిస్తున్న టీవీకే
-
విజయ్ ఇంట్లో సంబరాలు
-
TMCకి ఓట్లేసినా వేయలేదంటూ దాడులు రోడ్డెక్కిన ఓటర్లు
-
మమతా బెనెర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్
-
విజయ్ దే గెలుపు.. 120 సీట్ల విజయం ఖాయం!
-
విజయ్.. మరో MGR! TVKకి పట్టం కట్టిన యువ ఓటర్లు
-
విజయ్ కింగ్ మేకర్! ఫలితాలపై పీపుల్స్ పల్స్ డైరెక్టర్ రియాక్షన్
-
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ లో ఊహించని ట్విస్ట్
-
రికార్డులు బద్దల్.. బెంగాల్లో 90% పోలింగ్
-
పోలింగ్ బూత్ వద్ద మమతా ఆవేదన కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్
-
బెంగాల్లో బీజేపీ సునామీ! గెలుపు పై అమిత్ షా ధీమా
-
హింసాత్మక ఘటనల మద్యం బెంగాల్ లో భారీగా పోలింగ్
-
తొలి గంటలోనే ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
11 గంటల వరకు 37.5% ఓటింగ్
-
నటి త్రిష తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
పరువు పోగొట్టుకున్న డ్రగ్స్ ఎంపీకి ఘన స్వాగతం.. సోషల్ మీడియాలో ట్రోల్స్
-
పోలింగ్ కేంద్రం వద్ద తమిళనాడు సీఎం స్టాలిన్
-
బెంగాల్ లో హై ఓల్టేజ్ ఫైట్ పోలింగ్ పై BJP సువెందు రియాక్షన్
-
మీకు చేతులెత్తి మొక్కుతున్న... స్టాలిన్ నుంచి కాపాడండి
-
తమిళ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ గా విజయ్, విజయ్ సీఎం అవుతాడా?
-
హంగేరీ కొత్త ’హీరో’ పీటర్ మాగ్యార్ ఎవరు?
బుడాపెస్ట్: యూరప్ రాజకీయాల్లో అగ్రదేశమైన హంగేరీలో ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా తిరుగులేని నేతగా ఏకఛత్రాధిపత్యం వహించిన ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్కు అక్కడి ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ నేత, 45 ఏళ్ల పీటర్ మాగ్యార్ నేతృత్వంలోని ‘తిస్సా’ పార్టీ ప్రభంజనం సృష్టించింది. దీంతో హంగేరీ నూతన ప్రధానిగా పీటర్ మాగ్యార్ ఎన్నికయ్యారు.న్యాయశాస్త్రం అభ్యసించిన పీటర్ మాగ్యార్ ఒకప్పుడు ఓర్బన్ కు చెందిన ‘ఫిడెస్జ్’ పార్టీలోనే సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. బ్రస్సెల్స్‌లో దౌత్యవేత్తగా, ప్రభుత్వ సంస్థల్లో ఉన్నత పదవులు చేపట్టారు. అయితే గతంలో జరిగిన లైంగిక వేధింపుల కేసును కప్పిపుచ్చిన వ్యక్తికి ఓర్బన్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పీటర్ 2024లో ఆయనతో తెగతెంపులు చేసుకున్నారు. అదే ఏడాది ‘తిస్సా’ అనే కొత్త రాజకీయ ఉద్యమాన్ని స్థాపించి, యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో 30 శాతం ఓట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.హంగేరీ ఎన్నికల ఫలితాలు కేవలం ఈ దేశంలోనే కాకుండా అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొత్తం 199 స్థానాలున్న హంగేరీ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 77 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి అద్దం పట్టింది. కమ్యూనిస్ట్ పాలన అంతమైన తర్వాత ఇంతటి పోలింగ్ జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు లెక్కించిన 97.35 శాతం ఓట్లలో, టిస్జా పార్టీ ఏకంగా 53.6 శాతం ఓట్లతో 138 సీట్లను కైవసం చేసుకుని, మూడింట రెండొంతుల మెజారిటీ దిశగా దూసుకెళ్లింది.మరోవైపు జాతీయవాద నేత ఓర్బన్కు చెందిన ‘ఫిడెజ్’ పార్టీ కేవలం 37.8 శాతం ఓట్లతో 55 సీట్లకే పరిమితమై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. తన ఓటమి అత్యంత బాధాకరమైనప్పటికీ స్పష్టమైనదని అంగీకరించిన ఓర్బన్.. పీటర్ మాగ్యార్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బుడాపెస్ట్‌లోని డాన్యూబ్ నది తీరాన వేలాది మంది మద్దతుదారుల మధ్య పీటర్ మాగ్యార్ ఉద్వేగభరితంగా ప్రసంగిస్తూ, ఈ రాత్రి అబద్ధాలపై నిజం గెలిచిందని వ్యాఖ్యానించారు. దేశంలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేసి, న్యాయవ్యవస్థకు, ఇతర సంస్థలకు పూర్తి స్వతంత్రతను తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ ఎన్నికల ఫలితం హంగేరీకే కాకుండా యూరోపియన్ యూనియన్, యుక్రెయిన్ భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాన మిత్రుడిగా ఉన్న ఓర్బన్ ఓటమితో, పాశ్చాత్య దేశాలకు మరింత బలం చేకూరింది. ఓర్బన్ అడ్డుకుంటూ వస్తున్న, యుక్రెయిన్ కు ఇవ్వాల్సిన 90 బిలియన్ యూరోల రుణానికి ఇప్పుడు మార్గం సుగమం కానుంది. అలాగే, ప్రజాస్వామ్య విలువల ఉల్లంఘన కారణంగా హంగేరీకి యూరోపియన్ యూనియన్ నిలిపివేసిన నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అమెరికాకు చెందిన జేడీ వాన్స్ స్వయంగా వచ్చి ప్రచారం చేసినా, డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక మద్దతు ఇస్తామని ప్రకటించినా ఓర్బన్‌ను ప్రజలు గెలిపించకపోవడం గమనార్హం.ఇది కూడా చదవండి: ఇరాన్ యుద్ధం: ‘ఐఎంఎఫ్’ తీవ్ర హెచ్చరిక -
రాజకీయ సంచలనం.. ట్రంప్, పుతిన్ సన్నిహితుడు ఓటమి
Viktor Orban.. హంగేరీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హంగేరీలో దశాబ్ద కాలానికి పైగా సాగిన విక్టర్ ఓర్బన్ శకానికి తెరపడింది. హంగేరీ సార్వత్రిక ఎన్నికల్లో విక్టర్ ఓర్బన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. యువ నాయకుడు పీటర్ మాగ్యార్ ఘటన విజయం అందుకున్నారు. అయితే, విక్టర్‌కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పుతిన్ సన్నిహితుడిగా పేరుంది.తాజాగా జరిగిన హంగేరీ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. అక్కడి 199 స్థానాలు గల శాసనసభలో ‘టిస్జా’ పార్టీకి చెందిన పీటర్ మాగ్యార్ ఘన విజయం అందుకున్నారు. ఓట్ల లెక్కింపు తుది దశకు వచ్చేసరికి టిస్జా పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఏకంగా 138 స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. బుడాపెస్ట్‌లోని డాన్యూబ్ నది ఒడ్డున చేరిన వేలాది మంది మద్దతుదారుల మధ్య మాగ్యార్ తన విజయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. తాము విజయం సాధించినట్టు నినాదాలు చేస్తున్నారు. కాగా, పీటర్ మాగ్యార్ ప్రభంజనంతో హంగేరీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పీటర్ మాగ్యార్ ఈ ఎన్నికల్లో విజయ కేతనంతో హంగేరీ రాజకీయాలను మలుపు తిప్పారు.భావోద్వేగ ప్రకటన..ఇక, హంగేరీలో గత 16 ఏళ్లుగా తిరుగులేని నాయకుడిగా విక్టర్ ఓర్బన్కు పేరుంది. అయితే, దేశంలో పెరుగుతున్న ఆర్థిక మందగమనం ప్రజల్లో ఆయన పట్ల అసంతృప్తిని పెంచింది. ఓర్బన్ విధానాల వల్ల హంగేరీ అంతర్జాతీయంగా ఒంటరి అయిందనే భావన హంగేరీ ప్రజల్లో నెలకొంది. ఈ క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా మాగ్యార్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడటం, ప్రజాస్వామ్య సంస్కరణల దిశగా అడుగులు వేస్తానని హామీ ఇవ్వడంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఓటమి అనంతరం, ఓర్బన్ భావోద్వేగ ప్రకటన చేశారు. ఈ ఫలితాలు మాకు చాలా బాధాకరమైనవి, కానీ ప్రజల తీర్పు స్పష్టంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు.పుతిన్ సన్నిహితుడిగా.. ఇదిలా ఉండగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు విక్టర్ ఓర్బన్ సన్నిహితుడిగా పేరుంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్ను శత్రువుగా చూపించారు. అంతకుముందు కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల్లో ఆయన మార్క్ కనిపించింది. గతంలో ఉక్రెయిన్‌కు అందాల్సిన 90 బిలియన్ యూరోల ($105 బిలియన్) రుణాన్ని ఓర్బన్ అడ్డుకున్నారు. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్‌లో ప్రతికూల వైఖరి అనుసరించారు. తాజాగా పీటర్ మాగ్యార్ విజయంతో ఈయూలో హంగేరీ వ్యవహరిస్తున్న వైఖరికి తెరపడనుంది. దీంతో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. -
ఎన్నికల సంఘం-TMC ఎంపిల సమావేశంలో రసాభాస
-
రాజకీయాల్లోకి తమిళ్ రౌడీ.. ఆకులు నములుతూ వింత ప్రచారం
-
2024 పోలింగ్ వద్ద టీడీపీ ఫ్రాడ్, POINT TO POINT నాగార్జున యాదవ్ షాకింగ్ నిజాలు
-
తమిళనాడులో ఎన్నికల జోరు
-
నిమిషానికి 3 ఓట్లు , క్లియర్ కట్ APలో ఈవీఎం ట్యాంపరింగ్
-
ఇటలీ ప్రధాని మెలోనీకి బిగ్ షాక్
రోమ్: పార్లమెంట్ ఎన్నికలు మరో ఏడాదిలో జరగనుండగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో న్యాయ వ్యవస్థ సంస్కరణలపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆమెకు నిరాశ ఎదురైంది. రెండు రోజులపాటు జరిగిన ఓటింగ్ ఊహించని రీతిలో ప్రజలు స్పందించారు.కనీసం 54 శాతం మంది సంస్కరణలను తిరస్కరించగా, 46 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. అధికార పక్షంలో లుకలుకలు ప్రస్ఫుటం కాగా, ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరించి, ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టింది. ఈ ఫలితంతో మెలోనీ నాయకత్వం దేశంతోపాటు అంతర్జాతీయంగానూ బలహీనమైనట్లేనని పరిశీలకులు అంటున్నారు. లాయర్లు, జడ్జీలు తరచూ తమ వృత్తులను మార్చుకోకుండా నిరోధించడం, ఎన్నికకు బదులుగా లాటరీ విధానంలో ఉన్నతస్థాయి నియామకాలు చేపట్టడం వంటివి మెలోనీ తలపెట్టిన న్యాయ సంస్కరణల్లో ఉన్నాయి. మెలోనీ స్పందన.. అయితే, ఈ తీర్పుపై తాజాగా ప్రధాని మెలోనీ స్పందించారు. ఇటలీ ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు ఈ సందర్బంగా మెలోనీ ఈ ఓటమిని “ఇటలీని ఆధునీకరించడానికి కోల్పోయిన అవకాశం” గా పేర్కొన్నారు. అయితే, తాను పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. మరోవైపు.. ప్రతిపక్షం ఈ సంస్కరణలు న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తాయని ఆరోపించింది. కాగా, ఈ ఓటమి మెలోనీ నేతృత్వంలోని రైట్-వింగ్ కూటమికి పెద్ద దెబ్బగా పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా ఓటమి.. 2027 సాధారణ ఎన్నికలకు ముందు ఇది మెలోనీ ప్రజాదరణను తగ్గించే అవకాశం ఉంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణను మెలోనీ నాయకత్వానికి పెద్ద పరీక్షగా విశ్లేషకులు పేర్కొన్నారు.Gli italiani hanno deciso. E noi rispettiamo questa decisione.Andremo avanti, come abbiamo sempre fatto, con responsabilità, determinazione e rispetto verso il popolo italiano e verso l’Italia. pic.twitter.com/KCBf19hO8d— Giorgia Meloni (@GiorgiaMeloni) March 23, 2026 -
ఎన్నికల విధుల ఒత్తిడి.. నదిలో దూకిన ఉపాధ్యాయుడు
కాసరగోడ్: త్వరలో ఎన్నికలు జరగనున్న కేరళలో విషాదం చోటుచేసుకుంది. కాసరగోడ్‌లో ఎన్నికల విధుల ఒత్తిడిని తట్టుకోలేక ఒక ఉపాధ్యాయుడు నదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్నాయి.అసలేం జరిగింది?మొగ్రాల్ పుత్తూరుకు చెందిన బి. మహమ్మద్ సవాద్ (32) చెర్కల సెంట్రల్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో అరబిక్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయన కుడ్లు విలేజ్ పరిధిలో బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం మొగ్రాల్ వంతెన వద్ద సవాద్ స్కూటర్ కనిపించడంతో అనుమానం వచ్చిన స్థానికులు నదిలో గాలించారు. రెండు పడవల మధ్య అపస్మారక స్థితిలో పడి ఉన్న సవాద్ను గుర్తించి వెంటనే వారు కాసరగోడ్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స పొందుతూనే కన్నుమూశారు.పని ఒత్తిడే కారణమా?సవాద్ మృతికి మితిమీరిన పని ఒత్తిడే కారణమని ఆయన సహోద్యోగులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ పనులను మార్చి 21లోపు పూర్తి చేయాలని అధికారులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని వారు చెబుతున్నారు. ‘ఈద్ పండుగ దృష్ట్యా గడువు పెంచాలని ఆయన అధికారులను కోరారు, కానీ అందుకు నిరాకరించారు’ అని తోటి ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా ఆస్పత్రి వద్ద పలువురు ఆందోళనకు దిగారు.పోలీసుల వాదన వేరేలా ఉంది..మరోవైపు సవాద్ వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ కూడా లభ్యమైందని వారు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్డీవో బిను జోసెఫ్, ఏఎస్పీ అచ్యుత్ అశోక్ రంగంలోకి దిగి, పూర్తిస్థాయి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. మహమ్మద్ సవాద్కు తండ్రి షఫీ, తల్లి ఫౌసియా, నలుగురు తోబుట్టువులు ఉన్నారు. ఎన్నికల వేళ ఒక అధికారి ఇలా మరణించడం జిల్లాలో విషాద ఛాయలు నింపింది.ఇది కూడా చదవండి: ‘మన గ్యాస్‌ని ఎవర్రా ఆపేది?’.. భారత్‌కు అమెరికా గ్యాస్! -
పాంచ్ పటాకా.. ఐదు రాష్ట్రాల్లో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కీలకమైన పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీతో కలిసి ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29ల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. కేరళ (140), అస్సాం (126), పుదుచ్చేరి (30) అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు జ్ఞానేశ్ తెలిపారు. అన్నిచోట్లా మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. ఇప్పటికే పార్టీల నేతలు, రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమై సలహాలు స్వీకరించామని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా రాష్ట్రాల్లో ప్రవర్తన నియామవళి అమల్లోకి వచ్చింది. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలు, 17.4 కోట్ల మంది ఓటర్లున్నట్టు సీఈసీ తెలిపారు. ‘‘మొత్తం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 750 నుంచి 900 మంది ఓటర్లున్నారు. సుమారు 25 లక్షల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని తెలియజేశారు. యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని, గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఈసీ పదవి నుంచి తనను తొలగించడానికి పార్లమెంటులో ప్రతిపక్షాలు నోటీసివ్వడంపై స్పందించేందుకు నిరాకరించారు.8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలుదేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో రెండేసి, గోవా, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో ఒక్కో స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గోవా, కర్నాటక, నాగాలాండ్, త్రిపురల్లో ఏప్రిల్ 9న, గుజరాత్, మహారాష్ట్రలో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. -
ఎన్నికలకు సిద్ధమవుతున్న డేరా బాబా?
చండీగఢ్: హరియాణా, పంజాబ్‌లలో ప్రస్తుతం ‘డేరా’ రాజకీయ చర్చలే వినిపిస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను పంజాబ్-హరియాణా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. హరియాణాలో స్థానిక సంస్థల ఎన్నికలు, పంజాబ్‌లో ముంచుకొస్తున్న అసెంబ్లీ సమరానికి ముందు వెలువడిన ఈ తీర్పు రెండు రాష్ట్రాల్లోని ఓటు బ్యాంకు సమీకరణలను పూర్తిగా మార్చేయబోతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.డేరా సచ్చా సౌధాకు ఉన్న కోట్లాది మంది అనుచరులు కేవలం భక్తులు మాత్రమే కాదు.. వారు ఎన్నికల ఫలితాలను నిర్ణయించగల బలమైన శక్తిగా ఉన్నారు. ముఖ్యంగా సిర్సా, హిసార్, అంబాలా, మాల్వా ప్రాంతాల్లో డేరా ఇచ్చే ఒక్క పిలుపు లక్షలాది ఓట్లను ప్రభావితం చేస్తుంది. గతంలో ఈ ఓట్లు బీజేపీ వైపు మొగ్గు చూపగా, ఇప్పుడు రామ్ రహీమ్ నిర్దోషిగా బయటపడటం ఆ పార్టీకి రాజకీయంగా కలసివచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ తీర్పుతో బాబా అనుచరుల్లో పెరిగిన నూతనోత్సాహాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాన పార్టీలు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయని సమచారం.అయితే ఈ పరిణామంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందే రామ్ రహీమ్ పదేపదే పరోల్ పొందడం, ఇప్పుడు హత్య కేసులో నిర్దోషిగా విడుదల కావడం వెనుక అధికార పార్టీల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని కాంగ్రెస్ తదితర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ రహీమ్ మరో కేసులో జైలు గోడల మధ్యే ఉన్నప్పటికీ, ఆయన చుట్టూ అల్లుకున్న ఈ పరిణామాలు ఓటర్ల నాడిని శాసించే స్థాయికి చేరాయంటున్నారు.ఇది కూడా చదవండి: ‘ఆందోళన వద్దు.. నేను చూసుకుంటా’: విజయ్ సంచలన వ్యాఖ్యలు -
Nepal: ‘ఆర్ఎస్పీ’ ప్రభంజనం.. ప్రధానిగా ‘బాలెన్’?
ఖాట్మండు : హిమాలయ దేశం నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకోనుంది. దశాబ్దాలుగా ఆ దేశాన్ని శాసిస్తున్న హేమాహేమీలను కాదని, ప్రజలు నవతరం వైపు మొగ్గు చూపుతున్నారు. 275 స్థానాలు కలిగిన నేపాల్ ప్రతినిధుల సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో మాజీ మేయర్, మాజీ రాపర్ బాలేంద్ర షా (బాలెన్) నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. తాజా ఫలితాల సరళిని చూస్తే బాలెన్ షా నేపాల్ తదుపరి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.గత ఏడాది సెప్టెంబరులో ‘జెన్-జీ’ (Gen Z) యువత చేపట్టిన భారీ ఆందోళనల నేపథ్యంలో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయగా, పార్లమెంటు రద్దయిన విషయం తెలిసిందే. ఆ అల్లకల్లోలం తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంప్రదాయ రాజకీయ పక్షాలైన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్, మావోయిస్టు సెంటర్లపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆర్ఎస్పీకి వరంగా మారింది. ముఖ్యంగా రాజధాని ఖాట్మండులో ఆర్ఎస్పీ మద్దతుదారులు ‘గంట (పార్టీ గుర్తు) మోగిస్తూ సంబరాల్లో మునిగితేలుతున్నారు.మొత్తం 165 ప్రత్యక్ష ఎన్నికల స్థానాల్లో ఆర్ఎస్పీ ఇప్పటికే 20 స్థానాలను కైవసం చేసుకోగా, మరో 98 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. స్వయంగా బాలేంద్ర షా తన ప్రత్యర్థి, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై ఆయన సొంత గడ్డ అయిన ఝాపా-5 నియోజకవర్గంలో 15 వేల ఓట్ల భారీ ఆధిక్యంలో ఉండటం విశేషం. మరోవైపు, ఆర్ఎస్పీ అధ్యక్షుడు రబీ లామిచానే చిత్వాన్-2 స్థానం నుంచి 54,402 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు.నేపాల్‌లో మారుతున్న రాజకీయ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. సరిహద్దు దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని భారత్ ఆకాంక్షిస్తోంది. న్యూఢిల్లీలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. నేపాల్‌లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు.నేపాల్ ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 9వ తేదీ నాటికి ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. 165 ప్రత్యక్ష ఎన్నికల స్థానాలతో పాటు, మిగిలిన 110 స్థానాలను దామాషా పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అవినీతి, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న నేపాల్‌లో బాలెన్ షా రాకతో ఒక కొత్త శకం మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన పాటలతో వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిన బాలెన్, ఇప్పుడు దేశ గమనాన్ని ఎలా మారుస్తారనేది వేచి చూడాలి.ఇది కూడా చదవండి: యువకుని హత్యతో రణరంగం.. వాహనాల దహనం, రాస్తారోకో -
బాబుకు అంగన్వాడీలు వార్నింగ్.. వాష్ రూమ్ కి వెళ్తామన్నా విడిచిపెట్టకుండా..
-
తిరుచెందూర్ రేసులో కనిమొళి.. డీఎంకే కొత్త స్కెచ్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. ముఖ్యంగా అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తన వ్యూహాలకు పదును పెడుతూ, దక్షిణ తమిళనాడులో పార్టీ పట్టును మరింత సుస్థిరం చేసుకునే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుకుడి ఎంపీ కనిమొళి కరుణానిధిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నదని సమాచారం. ఎంపీ కనిమొళిని తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపేందుకు పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తిరుచెందూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ స్థానంలో కనిమొళిని బరిలోకి దింపేలా అంతర్గత చర్చలు సాగుతున్నాయని సమాచారం. అనారోగ్య కారణాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు రాధాకృష్ణన్ ఇప్పటికే పార్టీ అగ్రనాయకత్వానికి తెలియజేశారని సమాచారం.ఇటీవల జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఈ మార్పును బలపరుస్తున్నాయి. పార్టీ అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా, భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇది కనిమొళి రాకకు సంకేతమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సోదరి అయిన కనిమొళి ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో డీఎంకే తరఫున చురుకుగా కనిపిస్తున్నారు.ఇటీవల మీడియా ప్రతినిధులు తిరుచెందూర్ నుంచి పోటీ చేసే విషయంపై ప్రశ్నించగా, ఆమె ఆ అవకాశాన్ని కొట్టిపారేయకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దక్షిణ తమిళనాడు జిల్లాల్లో డీఎంకే ప్రాబల్యాన్ని పెంచడానికి కనిమొళి లాంటి అగ్రశ్రేణి నాయకురాలు అసెంబ్లీ బరిలో ఉండటం వ్యూహాత్మకంగా కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనిమొళి రంగ ప్రవేశం ఖాయమన్న వార్తలు తమిళ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చాయి.ఇది కూడా చదవండి: ‘బాబా వంగ’ భవిష్యవాణిపై ఊపందుకున్న చర్చలు -
ఐదు రాష్ట్రాల పోలింగ్: ఎన్నికల నగారాకు సన్నాహాలు
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల కోలాహలం మొదలుకానుంది. కేరళ సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మార్చి మూడో వారంలో వెలువడనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం ఇప్పటికే క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించింది. కమిషనర్లు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిలతో కూడిన ఈ బృందం తమిళనాడు పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకుంది.ఈ క్రమంలో ఎన్నికల సంఘం తన తదుపరి పర్యటనను మార్చి 5, 6 తేదీల్లో కేరళలో కొనసాగించనుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో చోటుచేసుకున్న సందిగ్ధత కారణంగా, తుది ఓటర్ల జాబితాను నేడు (శనివారం) ప్రచురించాలని అధికారులు నిర్ణయించారు. బెంగాల్ పర్యటన తేదీలను కమిషన్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. కాగా ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.మార్చి 6న జరగాల్సిన ప్రధాని కేరళ పర్యటన ఇప్పుడు మార్చి 11కి వాయిదా పడింది. ఈ పర్యటన ముగిసిన తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కేరళ పర్యటనలో భాగంగా ఎర్నాకులం కలుర్ స్టేడియంలో ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టోను ప్రధాని విడుదల చేయనుంది. దీంతో పాటు మెరైన్ డ్రైవ్‌లో ధీవర సభ నిర్వహించే కార్యక్రమంలోనూ ప్రధాని పాల్గొంటారు. రైల్వే శాఖకు సంబంధించిన ప్రాజెక్టులతో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై ఈ పర్యటనలో అధికారిక ప్రకటన వెలువడనుంది. మార్చి 14న అస్సాంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించేందుకు ప్రధాని వెళ్లనున్నారు.ఎన్నికల ప్రక్రియను వీలైనంత తక్కువ సమయంలో, సమర్థవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. గతంలో 2021లో ఎనిమిది విడతలుగా సుదీర్ఘంగా జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ఈసారి కేవలం మూడు లేదా నాలుగు విడతల్లోనే ముగించాలని కమిషన్ యోచిస్తోంది. అయితే కేరళలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని పర్యటనలు, పరిపాలనాపరమైన లాంఛనాలు పూర్తికాగానే మార్చి 15 తర్వాత ఏ క్షణమైనా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: ఆవిష్కరణల స్ఫూర్తికి నీరాజనం: ప్రధాని మోదీ -
పార్టీలకు బిగ్ షాక్ సుప్రీంకోర్టు సీరియస్
-
‘అదంతా ఫేక్ న్యూస్’.. కీలక విషయం చెప్పిన మాయావతి
లక్నో: రాబోయే 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోతోందంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఖండించారు. బుధవారం లక్నోలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ పార్టీ ఏ ఇతర పార్టీతోనూ జతకట్టదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. పొత్తులపై వస్తున్న కథనాలన్నీ కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే అని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇటువంటి వదంతులను పుట్టిస్తున్నారని ఆరోపించారు. ఓటర్లను గందరగోళానికి గురిచేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారని మాయావతి ఆరోపించారు. 2025, అక్టోబర్ 9న కాన్షీరాం వర్ధంతి సందర్భంగా లక్నోలో నిర్వహించిన భారీ ర్యాలీలోనే తాను ఈ విషయాన్ని స్పష్టం చేశానని ఆమె గుర్తుచేశారు. ఆ ప్రకటన తర్వాత కూడా కొందరు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని, ఇది బీఎస్పీకి వ్యతిరేకంగా సాగుతున్న కుట్ర అని ఆమె విమర్శించారు.కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, భారతీయ జనతా పార్టీలు సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తున్నాయని, అవి డాక్టర్ అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకమని మాయావతి ధ్వజమెత్తారు. గతంలో ఇతర పార్టీలతో పొత్తుల వల్ల బీఎస్పీకి నష్టం తప్ప లాభం చేకూరలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయా పార్టీలు తమ రాజకీయ స్వార్థం కోసమే పొత్తుల గురించి మాట్లాడుతున్నాయని, వాటి ట్రాప్‌లో పడవద్దని పార్టీ శ్రేణులకు మాయావతి పిలుపునిచ్చారు. 2027 ఎన్నికల్లో పూర్తి అంకితభావంతో ఒంటరిగా పోరాడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.2007 తరహాలో ఉత్తరప్రదేశ్‌లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని మాయావతి పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఢిల్లీలో తనకు కేటాయించిన టైప్-8 బంగ్లాపై జరుగుతున్న వివాదాన్ని ఆమె తోసిపుచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి అనవసర వివాదాలు సృష్టించి బీఎస్పీని అధికారం నుండి దూరం చేయాలని చూస్తున్నారని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఎన్నికల సన్నద్ధతపై దృష్టి సారించాలని మాయావతి కోరారు.ఇది కూడా చదవండి:సంతానోత్సత్తి రేటుపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు -
Balamani: లాటరీ విధానంలో కాంగ్రెస్‌కు దక్కిన అదృష్టం
-
చైర్మన్ పదవుల కోసం బీజేపీ-కాంగ్రెస్ అక్రమపొత్తులు: హరీష్
-
క్యాతనపల్లి లో ఉద్రిక్తత.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
-
కమల్ హాసన్‌కు ‘టార్చ్ లైట్’.. ‘ఎంఎన్ఎం’లో ఉత్సాహం ఉరకలు
న్యూఢిల్లీ: నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం 'టార్చ్ లైట్' చిహ్నాన్ని కేటాయించింది. రాబోయే పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ గుర్తు కేటాయించారు. ఈ గుర్తుపైనే ఎంఎన్ఎం అభ్యర్థులు పోటీ చేస్తారని ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని పార్టీ మీడియా విభాగం తెలియజేసింది.త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం మక్కల్ నీధి మయ్యం ఇప్పటికే తన సన్నాహాలను వేగవంతం చేసింది. ఇటీవల చెన్నైలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఇందులో భాగంగా ఎన్నికల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమాఖ్య వ్యవస్థ, గ్రామీణ ఉపాధి సంస్కరణలు తదితర కీలక అంశాలపై పార్టీ తన విధానాలను స్పష్టం చేసింది.2026 ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని పార్టీ కార్యవర్గ కమిటీ ప్రకటించింది. అభ్యర్థుల నామినేషన్ రుసుమును రూ. 50,000గా నిర్ణయించారు. ముందస్తుగా అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా నియోజకవర్గాల్లో పార్టీ పట్టు సాధించే అవకాశం ఉంటుందని నేతలు భావిస్తున్నారు.కమల్ హాసన్ 2018, ఫిబ్రవరి 21న మధురై వేదికగా అవినీతి నిర్మూలన, మతతత్వ వ్యతిరేక ఎజెండాతో మక్కల్ నీధి మయ్యం పార్టీని స్థాపించారు. ఎంఎన్ఎం పార్టీ ప్రస్తుతం డిఎంకె నేతృత్వంలోని కూటమిలో భాగంగా ఉంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కమల్ హాసన్ పార్లమెంటులో తన గళాన్ని వినిపిస్తూనే, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం.ఇది కూడా చదవండి: ‘7 సిస్టర్స్’పై యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు -
KSR Live: ఏపీ 2024 ఎలక్షన్ హిస్టరీ కాదు మిస్టరీ..
-
KSR: ఏపీలో అర్ధరాత్రి ఓట్లు.. ఈసీ స్పందించాలని డిమాండ్
-
ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నిక పూర్తి వివరాలు ఇవే..!
-
నేనే రాజు.. నేనే మంత్రి.. శృతిమించిన స్వాతిశయం
-
కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయి.. కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్
-
Mahabubabad: మూడు చోట్ల హంగ్ ఇండిపెండెంట్ల మధ్య ఘర్షణ
-
సిరిసిల్లలో కారు జోరు BRS లో ఫుల్ జోష్
-
ఎన్నికల ఫలితాల్లో ట్విస్ట్.. పలు చోట్ల హంగ్
-
మాజీ ప్రధాని హసీనా మరణ శిక్షపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)అధికారంలోకి రానుండటంతో, భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా భవితవ్యం చర్చనీయాంశంగా మారింది. 2024 జూలై నాటి విద్యార్థి ఉద్యమంపై ఉక్కుపాదం మోపినందుకు.. 2025 నవంబర్‌లో బంగ్లాదేశ్‌లోని ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ హసీనాకు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో బీఎన్పీ ఇటీవలి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం న్యూఢిల్లీలో ప్రవాస జీవితం గడుపుతున్న షేక్ హసీనా.. బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికలను ఒక ప్రహసనంగా అభివర్ణించారు. జనవరి 2026లో ఆమె ఢిల్లీ నుండి చేసిన ఒక ఒక ప్రసంగంలో.. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చి, బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. కాగా మానవత్వానికి వ్యతిరేకంగా హసీనా నేరాలకు పాల్పడినట్లు రుజువైనందున, ఆమెను ‘భారత్-బంగ్లాదేశ్ అప్పగింత ఒప్పందం’ కింద తిరిగి తమ దేశానికి పంపాలని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఇప్పటికే భారత్‌ను కోరింది.మరణశిక్ష పడిన వ్యక్తికి ఆశ్రయం కల్పించడం న్యాయవ్యవస్థను అవమానించడమేనని బంగ్లాదేశ్ నేతలు అంటున్నారు. ఈ సున్నిత అంశంపై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్ 2025లో ఆయన మాట్లాడుతూ, హసీనా ‘కొన్ని విలక్షణమైన పరిస్థితులలో’ భారత్‌కు వచ్చారని, ఆమె భవిష్యత్తు గురించి తుది నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. ట్రిబ్యునల్ తీర్పును భారత్ గమనించిందని చెబుతూనే, హసీనా అప్పగింత విషయంలో భారత్ ఆచి తూచి అడుగులు వేస్తున్నదన్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం -
‘బంగ్లా’ ఎన్నికల్లో హిందూ అభ్యర్థి ఘన విజయం
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో హిందువులకు సంతోషాన్ని పంచే పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)కి చెందిన హిందూ అభ్యర్థి గయేష్వర్ చంద్ర రాయ్ ఢాకా-3 నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయన తన సమీప ప్రత్యర్థి, జమాతే ఇస్లామీ నేత మహమ్మద్ షాహినూర్ ఇస్లాంను ఓడించారు. గయేష్వర్ చంద్ర రాయ్‌కు మొత్తం 98,785 ఓట్లు రాగా, జమాత్ అభ్యర్థికి 82,232 ఓట్లు మాత్రమే లభించాయి. రాయ్ సాధించిన ఈ విజయం బంగ్లాదేశ్ పార్లమెంటులో హిందువుల గళాన్ని వినిపిండానికి దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.గయేష్వర్ చంద్ర రాయ్ 1951, నవంబర్ ఒకటిన ఢాకాలోని కెరానిగంజ్‌లో జ్ఞానేంద్ర చంద్ర రాయ్, సుమతి రాయ్ దంపతులకు జన్మించారు. 1990వ దశకంలో బీఎన్పీ నేతృత్వంలోని ప్రభుత్వాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు. పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రిగా, మత్స్య , పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించారు. రాజకీయాలతో పాటు ఆయన కుటుంబానికి బీఎన్పీ అగ్రనాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాయ్ కుమారుడు అమితాబ్ రాయ్, బీఎన్పీ నేత నితాయ్ రాయ్ చౌదరి కుమార్తె నిపున్ రాయ్ చౌదరిని వివాహం చేసుకున్నారు.ఈ ఎన్నికల ఫలితాలలో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 200 కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకున్న బీఎన్పీ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ ఫలితాలతో జమాతే ఇస్లామీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో గత 18 నెలలుగా కొనసాగుతున్న ముహమ్మద్ యూనస్ తాత్కాలిక పాలనకు ముగింపు పలికేలా ఈ ఎన్నికల తీర్పు వెలువడింది.బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం తుది ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, బీఎన్పీ విజయం దాదాపు ఖాయమైంది. ఆగస్టు 2024లో అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పడిన ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం స్థానంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఈ పోలింగ్ జరిగింది. మొత్తం 12.7 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉండగా, అందులో సగం మంది 18-37 ఏళ్ల మధ్య వయస్సు గల యువతే కావడం గమనార్హం. 299 నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 59 పార్టీల నుంచి 1,700 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడగా, బీఎన్పీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. -
బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం
ఢాకా: ఉవ్వెత్తున ఎగసిన విద్యార్థుల ఉద్యమం(2024) మధ్య బంగ్లాదేశ్ శాంతి స్థాపన కోసం నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. మాజీ ప్రధాని హసీనా పదవీచ్యుతురాలై దేశం విడిచిన తర్వాత, దేశ వ్యవస్థను చక్కదిద్దడంలో యూనస్ కీలక పాత్ర పోషించారు. అయితే తన పాత్ర కేవలం ఎన్నికల వరకు మాత్రమేనని, ఆ తర్వాత రాజకీయాల్లో కొనసాగే ఉద్దేశం తనకు లేదని యూనస్ గతంలోనే స్పష్టం చేశారు.ముహమ్మద్ యూనస్ 2006లో గ్రామీణ బ్యాంక్ ద్వారా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చేసిన కృషికి గాను నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. 1983లో ఆయన స్థాపించిన ఈ బ్యాంక్, పేదలకు అతి తక్కువ వడ్డీకే మైక్రో క్రెడిట్ రుణాలు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 1974లో బంగ్లాదేశ్‌లో సంభవించిన కరువు సమయంలో ఆయన పేదల కోసం దీర్ఘకాలిక రుణాలను ప్రవేశపెట్టి వారి సాధికారతకు కృషి చేశారు. పేదరికాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించే యూనస్, ఇప్పుడు అదే చిత్తశుద్ధితో దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే బాధ్యతను నెరవేర్చారు.ఈ ఎన్నికలు బంగ్లాదేశ్ చరిత్రలో కీలకమైనవిగా నిలిచాయి. ఒకప్పుడు దేశ రాజకీయాలను నడిపిన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్, అల్లర్ల సమయంలో జరిగిన హింస, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో పోటీకి దూరమైంది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) హసీనాకు మరణశిక్ష విధించగా, ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) జమాత్-ఏ-ఇస్లామీ ప్రధాన పార్టీలుగా అవతరించాయి. మైనారిటీలపై దాడులు, మతపరమైన ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంలో పట్టుదలతో వ్యవహరించింది. తాజాగా యూనస్ తాను ఇకపై రాజకీయాల్లో కొనసాగబోననని మరోమారు స్పష్టం చేసినట్లు సమాచారం.ఫిబ్రవరి 12న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్పీ (బీఎన్పీ) భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రాథమిక గణాంకాల ప్రకారం 300 స్థానాలకు గాను బీఎన్పీ ఇప్పటికే 150 మార్కును దాటి మెజారిటీని దక్కించుకుంది. 17 ఏళ్ల ప్రవాసం తర్వాత తిరిగి వచ్చిన తారిఖ్ రెహ్మాన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ రెహ్మాన్‌కు అభినందనలు తెలిపారు.ఇది కూడా చదవండి: షట్‌డౌన్ చేస్తే చంపేస్తా’.. ఇంజినీర్‌కు ‘ఏఐ’ హెచ్చరిక! -
Bangladesh: ఉత్కంఠ మధ్య కొనసాగుతున్న పోలింగ్
ఢాకా: బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య ప్రారంభమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడం, విపక్ష నేత ఖలీదా జియా మృతి తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా 299 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. నోబెల్ విజేత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. దాదాపు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల కోసం వివిధ ప్రాంతాల్లో మోహరించారు.ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)తరఫున ప్రధాని రేసులో ముందున్న తారిఖ్ రెహమాన్ ఢాకాలోని గుల్షన్ మోడల్ స్కూల్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 17 ఏళ్ల సుదీర్ఘ ప్రవాసం తర్వాత గత ఏడాది డిసెంబర్లో స్వదేశానికి తిరిగొచ్చిన ఆయన, ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతమే తమ లక్ష్యమని అన్నారు. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పోటీకి దూరంగా ఉన్న నేపథ్యంలో, బీఎన్పీకి భారీ విజయావకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇస్లామిక్ జమాతే ఇస్లామీ నేతృత్వంలోని కూటమి నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవుతోంది.ఈ ఎన్నికలను ప్రపంచంలోనే మొట్టమొదటి ‘జెన్-జీ’ ప్రేరిత ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు. 2024లో షేక్ హసీనా పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థి నాయకులు ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తం ఓటర్లలో నాలుగో వంతు మంది యువత ఉండటం విశేషం. ముఖ్యంగా ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ పేరుతో విద్యార్థి నాయకులు జమాతే ఇస్లామీతో చేతులు కలిపి ఎన్నికల బరిలోకి దిగారు. దేశంలో అవినీతి నిర్మూలన, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం యువత పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు ఉత్నాహం చూపిస్తున్నారు. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ఈ ఎన్నికల ప్రక్రియను తీవ్రంగా విమర్శించారు. తన పార్టీని అనుమతించకుండా జరుగుతున్న ఈ ఎన్నికలు దేశంలో అస్థిరతకు దారితీస్తాయని ఆమె అన్నారు. హసీనాకు కంచుకోటగా భావించే గోపాల్‌గంజ్ తదితర ప్రాంతాల్లో ఓటర్ల రాక చాలా తక్కువగా కనిపిస్తోంది. VIDEO | Bangladesh Elections 2026: A woman voter is overwhelmed after casting her vote at a polling booth in Dhaka. The Election Commission has made elaborate security arrangements, deploying nearly 1 million security personnel -- the largest-ever in the country's electoral… pic.twitter.com/rWii0EGv6x— Press Trust of India (@PTI_News) February 12, 2026 -
మున్సిపాలిటీ వార్డులో ఉద్రిక్తత
-
మహాదేవప్ప మృతికి .. .. మంత్రి శ్రీహరి కారణం..!
-
డబ్బులు పంచుతూ పట్టుబడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే..!
-
మమతతో కట్.. లెఫ్ట్‌తో బ్రేక్: కాంగ్రెస్ సరికొత్త గేమ్!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా సాగుతున్న పొత్తుల సస్పెన్స్‌కు తెరదించుతూ, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ సంచలన ప్రకటన చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇకపై కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేసిన రెండు రోజులకే కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితర అగ్రనేతలతో రాష్ట్ర నాయకులు చర్చించిన అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది.సీట్ల సర్దుబాటుపై పేచీఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో తలెత్తిన విభేదాలే కాంగ్రెస్-టీఎంసీలు విడిపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. బెంగాల్లో కాంగ్రెస్‌కు కేవలం రెండు సీట్లు మాత్రమే ఇస్తామన్న టీఎంసీ ప్రతిపాదనను రాష్ట్ర నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రెండు స్థానాల కోసం పొత్తు పెట్టుకోవడం కంటే, అన్ని స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేయడమే పార్టీకి శ్రేయస్కరమని ఏఐసీసీ ఇన్చార్జ్ గులాం అహ్మద్ మీర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.గత అనుభవాల మేరకు..గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ సాహసోపేత నిర్ణయానికి వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2016లో వామపక్షాలతో కలిసి పోటీ చేసినప్పుడు 44 స్థానాల్లో విజయం సాధించి 12.25 శాతం ఓట్ల వాటాను పొందిన కాంగ్రెస్, 2021 నాటికి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోవడమే కాకుండా, ఓట్ల శాతం 3 శాతానికి పడిపోవడం పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టివేసింది. పొత్తుల కారణంగా సొంత బలాన్ని కోల్పోతున్నామనే భావన కాంగ్రెస్ నేతల్లో బలంగా నాటుకుపోయింది.వామపక్షాలతోనూ..మరోవైపు, ఇన్నాళ్లు మిత్రపక్షంగా ఉన్న వామపక్షాలతో కూడా కాంగ్రెస్ బంధాన్ని తెంచుకుంది. గత వైఫల్యాలను అంగీకరిస్తూ, భవిష్యత్తులో పార్టీ మనుగడ సాగించాలంటే సొంతంగా ఎదగడం తప్ప మరో మార్గం లేదని పరిశీలకుడు సుదీప్ రాయ్ బర్మన్ పేర్కొన్నారు. బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ కూడా తాము దీర్ఘకాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఇప్పుడే ప్రకటించకుండా, ఎన్నికల ఫలితాల తర్వాతే తేల్చాలని పార్టీ నిర్ణయించింది.ఓటు బ్యాంకు లేదని..కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంపై వామపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెంగాల్లో కాంగ్రెస్ ఒక భారం అని, దానికి క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు లేదని సీపీఐ(ఎం) ఎద్దేవా చేసింది. బీజేపీ, టీఎంసీ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని, తెర వెనుక మమతా బెనర్జీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటోందని మహ్మద్ సలీం ఆరోపించారు. ఈ విమర్శలతో విపక్షాల మధ్య ఉన్న వైరం ఇప్పుడు బహిర్గతమయ్యింది.చివరికి ఎవరికి లబ్ధి?మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ఒంటరి పోరుతో బెంగాల్ ఎన్నికల క్షేత్రం ఆసక్తికరంగా మారింది. ఇటు అధికార టీఎంసీ, అటు ప్రధాన ప్రతిపక్షం బీజేపీతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు విడివిడిగా బరిలోకి దిగుతుండటంతో చతుర్ముఖ పోటీ ఖాయమైంది. ఈ ఓట్ల చీలిక ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుంది? మమతా బెనర్జీ తన కోటను కాపాడుకుంటారా? లేక కాంగ్రెస్ తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటుందా? అనేది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఇది కూడా చదవండి: పుతిన్‌తో భేటీకి ఎప్స్టీన్ తహతహ? షాకిస్తున్న తాజా పత్రాలు.. -
Bangladesh: కీలక నేత కన్నుమూత.. ఎన్నికల ముందు విషాదం
ఢాకా: కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న బంగ్లాదేశ్‌లో విషాదం అలముకుంది. సీనియర్ నేత, అవామీ లీగ్ మాజీ మంత్రి రమేష్ చంద్ర సేన్ (86) కన్నుమూశారు. దినాజ్‌పూర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురికాగా, జైలు అధికారులు ఆయనను దినాజ్‌పూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు.ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో రమేష్ చంద్ర సేన్ మృతి ప్రాధాన్యత సంతరించుకుంది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌లో కీలక నేతగా ఉన్న రమేష్ చంద్ర సేన్, గతంలో నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 17న ఆయనను అదుపులోకి తీసుకున్నప్పటి నుండి దినాజ్‌పూర్ జైలులో ‘డివిజన్ ప్రిజనర్’గా ఉంచారు. జైలుకు తరలించక ముందు నుంచే ఆయన అనారోగ్యంతో ఉన్నారని, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారని జైలు సూపరింటెండెంట్ ఫర్హాద్ సర్కార్ పేర్కొన్నారు.1940 ఏప్రిల్ 30న ఠాకూర్ గావ్ జిల్లాలో జన్మించిన రమేష్ చంద్ర సేన్, అవామీ లీగ్ పార్టీలో అనుభవజ్ఞుడైన నేతగా పేరుపొందారు. మొత్తం ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1997లో ఉపఎన్నిక ద్వారా తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 2008, 2014, 2018, 2024 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. షేక్ హసీనా ప్రభుత్వంలో 2009 నుండి 2014 వరకు మంత్రిగా సేవలు అందించడమే కాకుండా, పార్టీ సలహాదారుగా కూడా వ్యవహరించారు.బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత జరుగుతున్న ఈ సాధారణ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పర్యవేక్షణలో ఫిబ్రవరి 12న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే వెలువడిన పలు సర్వేల ప్రకారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో అవామీ లీగ్ సీనియర్ నేత మృతిచెందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.ఇది కూడా చదవండి: ‘ఎప్స్టీన్’ ఆరోపణలు.. దలైలామా ఏమన్నారంటే.. -
ముంబై మేయర్ పీఠం: ‘మహాయుతి’లో ముదిరిన పేచీ
ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో అధికార పంపిణీకి సంబంధించి బీజేపీ- ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య ఒక ప్రాథమిక ఒప్పందం కుదిరింది. రెండు పార్టీలు వేర్వేరు బృందాలుగా దీనిపై రిజిస్టర్ చేసుకున్నప్పటికీ, పదవుల కేటాయింపుపై తెర వెనుక బేరసారాలు జరుగుతున్నాయని సమాచారం. కాగా అత్యంత ప్రతిష్టాత్మకమైన మేయర్ పీఠంపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం దేశంలోనే అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్ అయిన బీఎంసీ మేయర్ పదవిని బీజేపీ దక్కించుకోనుంది. దీనికి ప్రతిగా షిండే నేతృత్వంలోని శివసేనకు డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించేందుకు ఇరు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉన్నా, ఈ పదవుల పంపకంపై మహాయుతి కూటమిలో ఇప్పటికే ఒక ఫ్రేమ్‌వర్క్ సిద్ధమైనట్లు సమాచారం.అయితే ఇప్పుడు అసలైన పేచీ ‘స్టాండింగ్ కమిటీ’ చైర్మన్ పదవి వద్ద మొదలైంది. మున్సిపల్ నిధులు, కీలక ప్రాజెక్టుల నిర్ణయాలను నియంత్రించే ఈ కమిటీ పీఠాన్ని వదులుకునేందుకు బీజేపీ ససేమిరా అంటోంది. ఆర్థిక పరమైన అధికారాలు కలిగి ఉండే ఈ పదవిని తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ పట్టుబడుతుండగా, షిండే సేన కూడా దీని కోసం గట్టిగానే ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: దగ్గు మందు కలకలం: నాలుగేళ్ల బాలుడు మృతి -
Mumbai: మేయర్ పీఠంపై వీడని సస్పెన్స్
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కొత్త మేయర్‌ను ఎప్పుడు ఎన్నుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా షెడ్యూల్ ఇంకా వెలువడనప్పటికీ, వచ్చే నెల ప్రారంభంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.ఇటీవలి పౌర ఎన్నికల్లో బీజేపీ- ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్రలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పటికే తమ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినప్పటికీ, ముంబైలో మాత్రం జాప్యం కొనసాగుతోంది. ఈ జాప్యానికి ప్రధాన కారణం అధికార బీజేపీ- ఏక్నాథ్ షిండే శివసేన వర్గాలు కొంకణ్ డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో తమ గ్రూపు రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయకపోవడమేనని సమాచారం.ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ముంబై మున్సిపల్ సెక్రటేరియట్లో తదుపరి చర్యలు చేపడతారు. నిబంధనల ప్రకారం, గ్రూపు రిజిస్ట్రేషన్ పూర్తయిన ఏడు రోజుల్లోపు మేయర్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. గ్రూపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన వెంటనే, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సెక్రటరీ సమావేశమై ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. ఈ భేటీ అనంతరం మేయర్ పదవులకు నామినేషన్లను ఆహ్వానిస్తూ, పౌర యంత్రాంగం అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి మూడు రోజుల సమయం ఇస్తారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు నామినేషన్ పత్రాలను పరిశీలించి, తుది జాబితాను ప్రకటిస్తారు. అనంతరం ఓటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు.ఇటీవల నిర్వహించిన లాటరీ ప్రక్రియ ప్రకారం, ఈసారి ముంబై మేయర్ పదవి జనరల్ కేటగిరీకి చెందిన మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో మేయర్ రేసులో నిలిచే అభ్యర్థులపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార కూటమి నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. రిజర్వేషన్ ఖరారు కావడంతో మహిళా కార్పొరేటర్లు మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.ఇది కూడా చదవండి: రైల్వేకు షాక్.. విద్యార్ధినికి రూ. 9 లక్షల పరిహారం -
ముంబై మేయర్ ఎన్నికపై మరింత ఉత్కంఠ
ముంబై: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. జనవరి 31న జరగాల్సిన ఈ ఎన్నిక, గ్రూప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక కారణాలతో ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా పడింది. బీజేపీ - ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాలు తమ కార్పొరేటర్ల గ్రూప్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడంలో విఫలం కావడంతోనే ఈ ఆకస్మిక వాయిదా అని సమాచారం. రిజర్వేషన్లు ఖరారైనప్పటికీ, ధ్రువీకరణ పత్రాలను మున్సిపల్ కార్యదర్శికి సమర్పించడంలో జాప్యం కారణంగా ఎన్నికల ప్రక్రియ స్తంభించిపోయింది.మేయర్ ఎన్నిక కోసం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) తమ వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు తమ 65 మంది కార్పొరేటర్ల గ్రూప్ రిజిస్ట్రేషన్‌ను శరవేగంగా పూర్తి చేసి, అధికార కూటమి కంటే ఒక అడుగు ముందే ఉన్నాయి. మరోవైపు, బీజేపీ, షిండే వర్గం ఉమ్మడి గ్రూపుగా ఏర్పడతాయా లేక వేర్వేరుగా పోటీ చేస్తాయా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.ఈ అనిశ్చితి 227 మంది సభ్యులున్న సభలో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రూ. 60,000 కోట్ల బడ్జెట్ కలిగిన బీఎంసీపై పట్టు సాధించేందుకు జరుగుతున్న ఈ పోరులో ప్రతి నిమిషం కీలకంగా మారింది. ఎన్నికల వేడి ఇలా ఉంటే ఉద్ధవ్ థాకరే బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన తండ్రి బాలసాహెబ్ థాకరే శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ‘శివసేన కేవలం ఒక పార్టీ కాదని, అదొక సిద్ధాంతమని, ముంబై మట్టి బిడ్డల ఆత్మగౌరవమని ఉద్ఘాటించారు. శివసేనను అంతం చేయాలని బీజేపీ కలలు కంటోందని, కానీ అది అసాధ్యం. అణగారిన వర్గాల గుండెల్లో రగిలే జ్వాల శివసేన. ఆ జ్వాలను ఆర్పడం ఎవరివల్లా కాదు’ అని అన్నారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-షిండే సేన కూటమి (మహాయుతి) ఘన విజయం సాధించి, బీఎంసీపై పట్టు సాధించింది. 227 సీట్లలో మెజారిటీకి కావాల్సిన 114 సీట్లను దాటి, ఈ కూటమి 118 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, షిండే సేన 29 సీట్లు గెలుచుకుంది. దీంతో బీఎంసీపై మూడు దశాబ్దాల పాటు సాగిన థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. -
విజయ్ కి గుడ్ న్యూస్ TVK పార్టీ గుర్తు ఇదే..
-
Bangladesh: మోగిన ఎన్నికల నగారా.. ఫిబ్రవరి 12న పోలింగ్
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. 2024 ఆగస్టులో విద్యార్థుల సారధ్యంలో జరిగిన హింసాత్మక ఆందోళనల కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఎన్నికల్లో అత్యధికంగా 288 మంది అభ్యర్థులను బరిలోకి దించి, సత్తా చాటాలని నిర్ణయించింది. ఇతర ప్రధాన పార్టీలైన జమాత్-ఎ-ఇస్లామీ 224 మందిని, జాతీయ పార్టీ 192 మందిని, ఇస్లామిక్ ఆందోళన్ బంగ్లాదేశ్ పార్టీ 253 మందిని పోటీకి నిలిపాయి. మరోవైపు 249 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండటంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. జమాత్-ఎ-ఇస్లామీతో పొత్తు పెట్టుకున్న నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్సీపీ)32 మంది అభ్యర్థులను ప్రకటించింది.జనవరి 22 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 10 ఉదయం 7:30 గంటల వరకు ప్రచారం కొనసాగుతుందని, ఫిబ్రవరి 12న ఉదయం 7:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా 8 లక్షల మందికి పైగా ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎన్నికల శిక్షణ సంస్థ డైరెక్టర్ జనరల్ ముహమ్మద్ హసనుజ్జమాన్ వెల్లడించారు.ఎన్నికల తేదీపై వస్తున్న వదంతులను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ ఖండించారు. అమెరికా మాజీ దౌత్యవేత్తలతో జరిగిన భేటీలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ముందుగా నిర్ణయించినట్లుగా ఫిబ్రవరి 12నే జరుగుతాయి.. ఒక్క రోజు ముందు కాదు, వెనుక కాదని స్పష్టం చేశారు. ఎన్నికల చుట్టూ గందరగోళం సృష్టించేందుకు ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతోందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారం అప్పగించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. -
లక్షల్లో ‘బిహారీ’ బందీలు.. 50 ఏళ్లుగా..
బంగ్లాదేశ్ 2026 సాధారణ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో మరోమారు ఒక కీలక అంశం తెరపైకి వచ్చింది. గత 50 ఏళ్లుగా ఆ దేశంలో అనామకులుగా మిగిలిపోయిన ‘బిహారీ’ల ప్రస్తావన ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం లభించి ఇన్లేళ్లు గడిచినా, వారి జీవితాల్లో ఇసుమంత వెలుగు కూడా కానరాలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి వెతలు తీరలేదు. ఇంతకీ ‘బంగ్లా’లో మగ్గిపోతున్న ‘బిహారీ’లు ఎవరు? వారి సమస్య ఏమిటి? పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది?బంగ్లాదేశ్‌లో అనామక పౌరులు1971 యుద్ధానంతరం బంగ్లాదేశ్‌లోనే ఉండిపోయిన ఉర్దూ మాట్లాడే ముస్లింలు లేదా ‘బీహారీ’ (పాక్ అనుకూల వర్గాలు)ల దుస్థితి మరోమారు అందరి నోళ్లలో నానుతోంది. 1971 డిసెంబర్ 16న దేశం విడిపోయిన నాటి నుంచి వారు బంగ్లాదేశ్‌లో అనామక పౌరులుగా మిగిలిపోయారు. వీరికి ఫలానా దేశానికి చెందినవారనే గుర్తింపు కూడా లేదు. నాడు పాకిస్థాన్ కు సహకరించారన్న ఆరోపణలతో వీరిని తాత్కాలిక శిబిరాల్లో బంధించారు. నేటికీ ఆ శిబిరాలే వారికి శాశ్వత నివాసాలుగా మారాయి. పాకిస్తాన్ తమను తిరిగి తీసుకువెళుతుందని వీరంతా ఆశించినా, కేవలం 1.70 లక్షల మందిని మాత్రమే ఆ దేశం వెనక్కి తీసుకుంది. మిగిలిన లక్షలాది మంది బంగ్లాదేశ్‌లో పూర్తిగా కలవలేక, పాకిస్తాన్ కు తిరిగి వెళ్లలేక నిరంతర అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు.గడచిన ఐదు దశాబ్దాల్లో..వీరి సమస్యకు పరిష్కారంగా 2003, 2008లో వచ్చిన కోర్టు తీర్పులు కొంతమందికి పౌరసత్వం కల్పించినా, 1971 నాటికి వయోజనులుగా ఉన్నవారికి ఇంకా ఓటు హక్కు గానీ, పూర్తి పౌరసత్వం గానీ దక్కలేదు. గడచిన ఐదు దశాబ్దాల్లో బంగ్లాదేశ్ లో అనేక ప్రభుత్వాలు మారాయి. సైనిక పాలనలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఇలా సుమారు 15 రకాల పాలనా యంత్రాంగాలు మారినప్పటికీ, ‘బీహారీ’ల తలరాత ఏమాత్రం మారలేదు. వారికి పౌరసత్వం అనేది ఒక కలగానే మిగిలిపోయింది తప్ప, నిజ జీవితంలో సమాన హక్కులు దక్కలేదు.మరోమారు వంచన, దోపిడీ?ఇప్పుడు 2026 ఎన్నికల్లో కూడా వీరు మరోమారు రాజకీయ వంచనకు, దోపిడీకి గురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇందుకు రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది.. వీరి విషయంలో పాకిస్తాన్ తన బాధ్యతను విస్మరించడం. పాక్ ప్రభుత్వం అప్పుడప్పుడు ఈ అంశంపై ప్రకటనలు చేస్తున్నప్పటికీ, వీరిని వెనక్కి రప్పించేందుకు ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టడం లేదు. రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు, సంబంధాలు మెరుగుపడినప్పటికీ, స్వదేశానికి రావాలనుకునే వారిని అనుమతించడంలో పాక్ జాప్యం చేస్తోంది. ఇక రెండోది.. బంగ్లాదేశ్‌లోని రాజకీయాలు చరిత్రను తమకు అనుకూలంగా మలచుకున్నాయి. ఖలీదా జియా వంటి నేతలు సైతం దేశ గత చరిత్రలోని వివాదాలను విస్మరిస్తున్నారు. ఈ రాజకీయ క్రీడలో, నాడు పాకిస్తాన్‌కు విధేయులుగా ఉండిపోయిన సామాన్యుల వెతలు ఎవరికీ పట్టడం లేదు.నమ్మకద్రోహాలు, సామూహిక శిక్షలుఇరు దేశాలు దౌత్య సంబంధాల సాధారణీకరణ పేరుతో చరిత్రను తారుమారు చేయడం లేదా మౌనం వహించడం చేయడం కారణంగా ఈ వర్గాల ప్రజల హక్కులకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు రెండూ గతంలో చోటుచేసుకున్న నమ్మకద్రోహాలు, సామూహిక శిక్షలు, వ్యవస్థాగత నిర్లక్ష్యాలను నిరంతరం కప్పిపుచ్చుతున్నాయి. పాక్‌లోని ఇస్లామిక్ పార్టీలు సైతం ఈ అభాగ్యుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. దాదాపు 3.24 లక్షల మంది పాకిస్తానీ పౌరులు 54 ఏళ్లుగా విదేశీ గడ్డపై దిక్కులేకుండా పడి ఉంటే, ఇస్లామిక్ ఐడియాలజీ కౌన్సిల్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.దుర్భర స్థితిలో మూడో తరం ‘బీహారీ’ యువతప్రస్తుతం పాక్, ‘బంగ్లా’ మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం, క్రికెట్, సైనిక సహకారం మొదలైవాటి చుట్టూనే తిరుగుతున్నాయి. 2026 ఎన్నికలు బంగ్లాదేశ్‌కు ఒక నైతిక పరీక్ష లాంటివి. 1971 నాటి ద్వేషాన్ని, చరిత్రను పక్కనపెట్టి, బంగ్లాదేశ్ తన గొప్పతనాన్ని చాటుకోవాల్సిన తరుణం ఇప్పుడు ఆసన్నమయ్యింది. మురికివాడల్లో మగ్గుతున్న మూడో తరం ‘బీహారీ’ యువతను తమ దేశ పౌరులుగా ఆదరించాలి. వచ్చే ఎన్నికల్లో వీరిని కేవలం ఓటర్లుగా లెక్కించడమే కాకుండా, దేశంలో భాగస్వామ్యం చేయాలని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్? -
కాంగ్రెస్ ఘోర పరాభవం వెనుక..
వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నికల్లో వరుస ఓటములను చవిచూస్తోంది. దీనికి నాయకత్వ లేమి ప్రధాన కారణమని కొందరు అంటుండగా, పార్టీలో ఐక్యత లోపించిందని మరికొందరు చెబుతారు. ఇప్పుడు మరోమారు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత దారుణమైన పనితీరును కనబరిచింది. మొత్తం 227 సీట్లకు గాను కేవలం 22 సీట్లకే పరిమితమయ్యింది. దీంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది.సరైన వ్యూహం లేకుండా..బీఎంసీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి భారీ ర్యాలీలు, రోడ్‌షోలు గానీ, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు గానీ నిర్వహించలేదు. కనీస ప్రణాళిక, సరైన వ్యూహం లేకుండానే బరిలోకి దిగినట్లు స్పష్టంగా కనిపించింది. 1885లో ఇదే నగరంలో పుట్టి, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ, నేడు తన ఉనికిని కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ ఈ పరాజయానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె నాయకత్వ సామర్థ్యంపై పలు ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.అంతకంతకూ దిగజారుతూ..గత మూడు పర్యాయాల బీఎంసీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, ముంబైలో పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది. 2007లో 71 సీట్లు గెలుచుకున్న పార్టీ, 2012 నాటికి 51కి, 2017లో 31కి పడిపోయింది. ఒకప్పుడు 26 శాతానికి పైగా ఉన్న ఓటు బ్యాంకు, నేడు సింగిల్ డిజిట్‌కు పడిపోయే ప్రమాదం ఉంది. ఉత్తరాది ఓటర్లు, దక్షిణాది వారు, గుజరాత్, జైన్, మార్వాడీ వర్గాల మద్దతును తిరిగి పొందడంలో పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలమైందని పార్టీ సీనియర్ నేతలే అంటున్నారు.పొత్తుల గందరగోళం ముస్లిం, దళిత ఓట్లను ఏకం చేయాలనే లక్ష్యంతో ప్రకాష్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ), రాష్ట్రీయ సమాజ్ పక్ష (ఆర్ఎస్పీ)తదితర పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. అయితే ఈ కూటమి క్షేత్రస్థాయిలో కూడా సరైన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ప్రచారంలో మిత్రపక్షాలను కలుపుకుపోవడంలో కాంగ్రెస్ విఫలమైందనే విమర్శలు వినిపించాయి. కేవలం తమ అభ్యర్థులకే ఓట్లు అడగడంపై వీబీఏ నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు వర్షా గైక్వాడ్ కేవలం అమీన్ పటేల్, అస్లాం షేక్ వంటి ఇద్దరు ముగ్గురు నేతల మాటలకే ప్రాధాన్యతనిచ్చారని, ఇతర సీనియర్లను, క్షేత్రస్థాయి కార్యకర్తలను విస్మరించారని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తూవస్తోంది. సమిష్టి నిర్ణయాలు లేకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.టికెట్ల పంపిణీలో పక్షపాతం టికెట్ల కేటాయింపు వ్యవహారం పార్టీలో తీవ్ర అసంతృప్తిని రగిలించింది. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న నిజమైన కార్యకర్తలను పక్కనపెట్టి, ముఖ్య నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉదాహరణకు.. అంధేరీలో సీనియర్ నేత అస్లాం షేక్ తన కుమారుడు, సోదరి, అల్లుడికి టికెట్లు ఇప్పించుకున్నారు. ఇందుకోసం ఆయన గతంలో గెలిచిన మాజీ కార్పొరేటర్లను కూడా పక్కనపెట్టడంతో, వారు శివసేన (యూబీటీ) గూటికి చేరి, కాంగ్రెస్‌పైనే పోటీకి దిగారు. అలాగే వర్షా గైక్వాడ్ తన అనుచరుల కుటుంబాలకు టికెట్లు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే అశోక్ జాదవ్ తదితరులు తమ వారసులకు టికెట్ దక్కలేదన్న కోపంతో పార్టీని వీడారు. ఇలాంటి స్వయంకృతాపరాధాలు, అవకాశవాద రాజకీయాలే ముంబైలో కాంగ్రెస్ పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పుడుతూనే మధుమేహం.. -
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం
-
ఈనెల 19న మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ
-
‘వంద మంది పోలీసులు మావాళ్లని కుమ్మేశారు’
ముంబై: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కౌంటింగ్ కేంద్రంలోకి వస్తున్న తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని మహారాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సత్ సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 100 మంది పోలీసులు తమ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి, తీవ్రంగా గాయపరిచారని ఆయన ఆరోపించారు.‘పోలీసులు తమ ప్రతాపం నేరస్తుల మీద చూపించాలి కానీ.. కార్యకర్తల మీద కాదు.. ఇది అధికార దుర్వినియోగమే. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. మేము దీనిపై మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)నమోదు చేస్తున్నాం" అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్రపతి శంభాజీనగర్ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎల్ఎంసీ)ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన సమయంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఇక్కడ మొత్తం 18 వార్డుల్లోని 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. మేజిక్ ఫిగర్ సాధించడానికి 36 స్థానాలు అవసరం కాగా, జనవరి 15న జరిగిన పోలింగ్‌లో నగరంలో 60.07 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ , భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) మధ్య నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే ఈ లాఠీఛార్జ్ ఘటన జరగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. #WATCH | Chhatrapati Sambhajinagar | Maharashtra Minister Sanjay Shirsat says, "Today is the counting of the votes, and on such a day. When our workers were coming into the centre, nearly 100 policemen opened lathi charge on them and wounded them severely... Action should be… pic.twitter.com/rq9E3T0WBV— ANI (@ANI) January 16, 2026రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. నాలుగేళ్ల ఆలస్యం తర్వాత, శివసేనలో చీలిక వచ్చి షిండే ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరుగుతున్న తొలి బీఎంసీ ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గురువారం జరిగిన పోలింగ్‌లో ముంబైలో 52.94 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 2017లో నమోదైన 55.53 శాతంతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. ఇది కూడా చదవండి: ‘బీఎంసీ’ ఓట్ల లెక్కింపు వేళ.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు -
‘బీఎంసీ’ ఓట్ల లెక్కింపు వేళ.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఇటువంటి తరుణంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం (ఈసీ) తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరులను తప్పుదోవ పట్టిస్తూ (గ్యాస్‌లైటింగ్), ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కారణంగానే మన ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని రాహుల్ ఆరోపించారు.‘ఓటు చోరీ అనేది ముమ్మాటికీ దేశద్రోహ చర్యే’ అంటూ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహారాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతున్న వేళ, ప్రజాస్వామ్య విలువల పతనంపై రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. కాగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ-శివసేన (మహాయుతి) కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, మహాయుతి కూటమి దాదాపు 52 వార్డుల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ 35 స్థానాల్లో, ఏక్నాథ్ షిండే వర్గపు శివసేన 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 22 స్థానాల్లో, రాజ్ థాకరేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే ఆధిక్యాన్ని కనబరుస్తూ వెనుకబడిపోయింది. అయితే అధికారిక ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా వెల్లడించాల్సి ఉంది. కాగా ముంబై నగరానికి అత్యంత కీలకమైన ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సుదీర్ఘ విరామం తర్వాత జరిగాయి. చివరిసారిగా 2017లో బీఎంసీ ఎన్నికలు జరగగా, అప్పుడు ఎన్నికైన మేయర్ కిషోరి పెడ్నేకర్ పదవీకాలం 2022 మార్చితోనే ముగిసింది. ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఎన్నికలు జరగడం, నాలుగేళ్ల తర్వాత ముంబై నగరానికి కొత్త మేయర్ రాబోతుండటంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
BMC Election: 25 చోట్ల బీజేపీ ఆధిక్యం
ముంబై: మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు(శుక్రవారం) జరుగుతోంది. తొలి ట్రెండ్ల ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ 68 స్థానాలతో ముందంజలో ఉండగా, శివసేన (యూబీటీ), ఎంఎన్ఎస్ కూటమి 42 స్థానాలతో, కాంగ్రెస్ 11 స్థానాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆర్థిక రాజధాని ముంబై (బీఎంసీ)తో పాటు పుణె, నాగ్‌పూర్ తదితర నగరాల్లో బీజేపీ ముందంజలో ఉంది. అయితే, సాంగ్లీ, కొల్హాపూర్, వసాయ్-విరార్, మాలెగావ్ వంటి నాలుగు కార్పొరేషన్లలో మాత్రం బీజేపీకి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ ప్రాంతాల్లో బీజేపీ వెనుకంజలో ఉండగా, కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది.బీజేపీ ముందంజ: ముంబైలో 227 వార్డులకు గాను ఇప్పటివరకు 98 వార్డుల ట్రెండ్స్ వెలువడగా, బీజేపీ 42 వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.సేన (UBT) గట్టి పోటీ: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) 32 స్థానాల్లో ఆధిక్యంతో రెండో స్థానంలో ఉంది.షిండే వర్గం: ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ప్రస్తుతం 15 వార్డుల్లో ముందంజలో ఉంది.ధారావిలో కాంగ్రెస్ బోణీ: ధారావిలోని 183వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆశా కాలే ఘనవిజయం సాధించారు. ఆమె షిండే సేన అభ్యర్థి వైశాలి షెవాలే, MNS అభ్యర్థి పారుబాయి కట్కేలపై 1,450 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.మాజీ మేయర్ విజయం: వార్డు 182లో శివసేన (UBT) అభ్యర్థి, 7 సార్లు కార్పొరేటర్‌గా పనిచేసిన మాజీ మేయర్ మిలింద్ వైద్య విజయం సాధించారు.గోరేగావ్‌లో బీజేపీ సత్తా: గోరేగావ్‌లోని బంగూర్ నగర్ (వార్డు 50)లో బీజేపీ అభ్యర్థి తేజస్వి ఘోసల్కర్ విజయం సాధించారు. ఆమె సేన (UBT)కి చెందిన యువ అభ్యర్థి తన్వీ దినేష్ రావును ఓడించి బీజేపీకి కీలక విజయాన్ని అందించారు.మీరా-భయందర్‌లో క్లీన్ స్వీప్: మీరా-భయందర్ ప్రాంతంలో షిండే సేనతో జరిగిన పోరులో బీజేపీ ఇప్పటికే 8 స్థానాలను కైవసం చేసుకున్నట్లు సమాచారం.ముస్లిం ప్రాబల్య ప్రాంతంలో బీజేపీ జెండా: ముస్లింలు అధికంగా ఉండే మాన్‌ఖుర్డ్ (వార్డు 135)లో బీజేపీ అభ్యర్థి నవనాథ్ బాన్ విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. VIDEO | Maharashtra civic polls results: BJP candidate and Maharashtra BJP media in-charge Navnath Ban celebrates his victory in the BMC polls.In early trends, the BJP–Shiv Sena-led Mahayuti appears to be ahead across multiple municipal corporations.#BMCElections2026… pic.twitter.com/1fqyFYMSN3— Press Trust of India (@PTI_News) January 16, 2026 ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్.. అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధించవచ్చనే అంచనా వేశాయి. అయితే.. విపక్ష కూటమి మాత్రం తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తోంది. మహారాష్టలోని ముంబై, పూణేలతో పాటు పింప్రి-చించ్వాడ్, కొల్హాపూర్, వసాయ్-విరార్, కళ్యాణ్-డోంబివిలి, నాగ్‌పూర్, సోలాపూర్, అమరావతి, థానే, పర్బానీ తదితర మున్సిపాలిటీలకు గురువారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 893 వార్డుల్లోని 2,869 సీట్ల కోసం ఈ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల బరిలో మొత్తం 15,931 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో ముంబై నుంచి 1,700 మంది, పూణే నుంచి 1,166 మంది అభ్యర్థులు ఉన్నారు. గురువారం జరిగిన పోలింగ్‌లో దాదాపు 1.03 కోట్ల మంది ఓటర్లు 1,700 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. దక్షిణ ముంబైలో ఓటింగ్ శాతం నిరాశాజనకంగా నమోదైంది. ముఖ్యంగా కులాబా ప్రాంతం (వార్డు 227)లో మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి కేవలం 15.73 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇది ముంబై సగటు పోలింగ్ శాతం 41.08 కన్నా చాలా తక్కువ. 2017 ఎన్నికల్లోనూ ఇక్కడ తక్కువ పోలింగ్ నమోదు కాగా, ఈసారి కూడా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు రావడానికి ఆసక్తి చూపలేదు. హౌసింగ్ సొసైటీల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని అధికారులు తెలిపారు.‘యాక్సిస్ మై ఇండియా’ అంచనాల ప్రకారం.. మొత్తం 227 వార్డులకు గాను బీజేపీ-శివసేన కూటమి 42 శాతం ఓటు షేర్‌తో 131 నుంచి 151 సీట్లు గెలుచుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరేలు చేతులు కలిపినప్పటికీ, మహా వికాస్ అఘాడి (శివసేన యూబీటీ-ఎంఎన్ఎస్- ఎన్సీపీ(ఎస్పీ)కూటమి 58-68 సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమి కేవలం 12-16 సీట్లతో సరిపెట్టుకోవాల్సి రావచ్చని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.బీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు (జనవరి 16) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 కౌంటింగ్ కేంద్రాల్లో దాదాపు 2,299 మంది అధికారులు తమ విధులను నిర్వహించనున్నారు. విక్రోలి, కాందివలిలోని స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ఉదయం 11 గంటల కల్లా ఫలితాల సరళిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని, సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.బీఎంసీలో మ్యాజిక్ ఫిగర్ 114 కాగా, ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం మహాయుతి ఈ మార్కును సులభంగా దాటేస్తుందని భావిస్తున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన చీలిన తర్వాత జరుగుతున్న తొలి బీఎంసీ ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ పోరులో ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే వర్గాల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. తమ కూటమి 150 సీట్లకు పైగా గెలుచుకుంటుందని, మేయర్ పీఠంపై మరాఠీ హిందువే కూర్చుంటారని శివసేన నేత రాజు వాఘ్మారే ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు మహారాష్ట్ర భవిష్యత్ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావం చూపనున్నాయి. -
ఎన్నికల నిర్వహణ ప్రక్రియ.. బెల్జియంకు తెలంగాణ సీఈఓ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ఎన్నికల నిర్వహణలో అనుభవాల మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం లక్ష్యంగా మూడు రోజుల అధికారిక పర్యటనకు బెల్జియంకు బయలుదేరారు. బెల్జియన్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ – ఇంటీరియర్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది.ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియల్లో పారదర్శకత, సమగ్రత, సామర్థ్యాన్ని మెరుగుపర్చే అంశాలపై రెండు దేశాల అధికారుల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. సీఈఓ సుధర్శన్ రెడ్డి నేతృత్వంలోని బృందంలో ఖమ్మం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి, సీఈఓ కార్యాలయ రాష్ట్ర శిక్షణ నోడల్ అధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బోయపాటి చెన్నయ్య, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఈఆర్వో కంకనాల అనంత రెడ్డి, నాంపల్లి నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ నం.97 బూత్ స్థాయి అధికారి వేముల ధ్రువ కుమార్ రెడ్డి ఉన్నారు.పర్యటనలో భాగంగా బెల్జియన్ ఎఫ్‌పీఎస్ – ఇంటీరియర్, ఎఫ్‌పీఎస్ – ఫారిన్ అఫైర్స్ ఉన్నతాధికారులతో సమావేశాలు, కేయూ లూవెన్ యూనివర్సిటీ నిపుణులతో చర్చలు, బ్రస్సెల్స్‌లోని భారతీయ రాయబార కార్యాలయంలో సేవా ఓటర్లతో పరస్పర చర్యలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ (IIIDEM) ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ అవుట్‌రీచ్ కార్యక్రమంలో భాగమని అధికారులు తెలిపారు. -
పూణే: రోబో శునకాలతో ఓట్ల వేట.. భారీ కానుకల వెల్లువ
పూణే: మహారాష్ట్రలోని పూణే, పింప్రి-చించ్వాడ్ సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు మునుపెన్నడూ లేని విధంగా అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. ముఖ్యంగా ఓట్లు అడుగుతూ వీధుల్లో తిరుగుతున్న ‘రోబోటిక్ డాగ్స్’ అందరినీ ఆకర్షిస్తున్నాయి.ఈ రోబో శునకాలకు పోస్టర్లను కట్టి కొందరు ప్రచారం నిర్వహిస్తుండగా, మరికొందరు కార్యకర్తలు ఎల్ఈడీ (ఎల్ఈడీ) స్క్రీన్లను బ్యాక్‌ప్యాక్‌ల మాదిరిగా తగిలించుకుని అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. జనవరి 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ హైటెక్ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా రీల్స్, వీడియోలు, కంటెంట్ సృష్టించడానికి ఏఐని వాడుతున్నారు. ఇది ఖర్చును తగ్గించడమే కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరువయ్యేలా చేస్తోంది. Pune & Pimpri-Chinchwad Election Campaigns Turn Hi-Tech With Robotic Dogs, Backpack LED Screens & More pic.twitter.com/9Do0Ea5HIf— Pune First (@Pune_First) January 9, 2026ఓటర్ల నాడిని విశ్లేషించేందుకు, ప్రజలతో సంభాషించేందుకు చాట్బాట్లను రంగంలోకి దించారు. లోహెగావ్, విమాన్ నగర్ వంటి ప్రాంతాల్లో అభ్యర్థులు డేటా ఆధారిత ప్రెజెంటేషన్లు ఇస్తూ, ప్రతి ఆరు నెలలకోసారి తమ ప్రగతి నివేదికను సమర్పిస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఓట్ల వేటలో అభ్యర్థులు వినూత్న హామీలతో పాటు భారీ బహుమతులను ఎరగా వేస్తున్నారు. కొందరు అభ్యర్థులు లక్కీ డ్రా ద్వారా ఎస్యూవీ (ఎస్యూవీ)కార్లు, బంగారు ఆభరణాలు ఇస్తామని ప్రకటిస్తుండగా, విమాన్ నగర్ అభ్యర్థి ఏకంగా ఐదు రోజుల థాయిలాండ్ లగ్జరీ టూర్ ఆఫర్ చేశారు.లోహెగావ్-ధనోరి వార్డులో ఒక అభ్యర్థి 1,100 చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేశారు. కొందరు అభ్యర్థులు.. గృహిణులకు పైతాని చీరలు, నగలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి పింప్రి-చించ్వాడ్ (పీసీఎంసీ) ఎన్నికల బరిలో ఏడుగురు మాజీ మేయర్లు నిలవడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఎన్సీపీ (ఎన్సీపీ) నుంచి వైశాలి ఘోడేకర్, యోగేష్ బెహల్.. బీజేపీ నుంచి మాయ్ ధోరే, శకుంతల దరడే సహా పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. అయితే పుణే ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల నేపథ్యం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు పరిశీలించిన 2,650 దరఖాస్తులలో 1,560 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, 60 మందిపై అత్యంత తీవ్రమైన నేరాలు నమోదై ఉన్నాయి. జనవరి 15న ఉదయం 7:30 నుండి సాయంత్రం 5:30 వరకు పోలింగ్ జరగనుంది. ఇది కూడా చదవండి: చలికి గడ్డకట్టిన ఢిల్లీ.. స్థంభించిన జనజీవనం -
టీడీపీ నేతల దాడులు.. బెదిరింపులు మెట్టు గోవింద రెడ్డి ఫైర్
-
Bangladesh: హిందువుల సంచలన నిర్ణయం.. ఎన్నికలపై పిడుగుపాటు
ఢాకా: బంగ్లాదేశ్‌లో 2026, ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందుగా అక్కడి హిందూ మైనారిటీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని హిందువులపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపధ్యంలో వారి నుంచి ఈ నిర్ణయం వెలువడింది. బంగ్లాదేశ్‌లోని శరీరత్‌పూర్‌కు చెందిన ఔషధ దుకాణదారుడు ఖోకాన్ చంద్ర దాస్ ఉదంతం అక్కడి హిందువుల దుస్థితికి అద్దం పడుతోంది. డిసెంబర్ 31 రాత్రి దుండగులు ఖోకాన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించగా, ఆ మంటల్లో కాలిపోతున్న వ్యక్తి తన తండ్రే అని తెలియక అతని 13 ఏళ్ల కుమారుడు మొబైల్లో చిత్రీకరించడం అందరినీ కలచివేసింది. తీవ్ర గాయాలతో ఢాకా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ, జనవరి 3న ఆయన మృతిచెందాడు. ఈ ఘటన అక్కడి హిందువులలో తీవ్ర భయాందోళనలను నింపింది.1971 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా సుమారు 30 శాతంగా ఉండేది. కానీ నేడు అది కేవలం 9 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇటీవలే దీపు చంద్ర దాస్, అమృత్ మండల్ తదితర హిందువులు మూక దాడులకు బలయ్యారు. ‘గతంలో దాడులు జరిగేవి.. కానీ మనుషులను సజీవ దహనం చేయడం అనేది ఇప్పుడు కనిపిస్తున్న భయంకరమైన కొత్త పోకడ’ అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ కరువైన తరుణంలో పలు మైనారిటీ సంస్థలు రాబోయే ఎన్నికలను బహిష్కరించి, ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని యోచిస్తున్నాయి.కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), జమాత్-ఏ-ఇస్లామీ తదితర పార్టీలు తమ లౌకిక ముద్రను చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఢాకా-7 నుంచి పోటీకి దిగిన బీఎన్పీ అభ్యర్థి హమీదుర్ రెహమాన్ హమీద్ ఇటీవల ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించి, సంతాప సభ నిర్వహించారు. అయితే, హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. కాగా ఓటింగ్‌కు రోజులు దగ్గరపడుతుండటంతో హిందూ సంఘాలు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నాయి. న్యాయమైన రీతిలో ఎన్నికలు జరగాలని కోరుతూ పలు సంఘాలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం మైనారిటీలపై వివక్ష చూపుతున్నదనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తమ గోడును ప్రపంచానికి చాటిచెప్పడానికి పోలింగ్ బహిష్కరణే ఏకైక మార్గమని బంగ్లాదేశ్‌లోని పలు హిందూ సంఘాలు చెబతున్నాయి. ఇది కూడా చదవండి: ప్రియాంకపై కాంగ్రెస్ గంపెడాశలు.. ’అస్సాం’ అప్పగిస్తూ.. -
ఒక్క ఓటూ వేయకుండానే విజయం.. ‘మహాయతి’ సంబరాలు
ముంబై: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే సంచలనం నమోదైంది. ఒక్క ఓటు కూడా వేయకముందే అధికార ‘మహాయుతి’ కూటమి ఘనవిజయం సాధించింది. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో, వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో బీజేపీ-శివసేన (షిండే వర్గం) కూటమికి చెందిన 66 మంది అభ్యర్థులు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు..మొత్తంగా 68 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)పరిధిలోని అత్యంత కీలకమైన కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్లో అధికార కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఇక్కడ ఏకంగా 21 మంది మహాయుతి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఇందులో 15 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. ఆరు స్థానాల్లో శివసేన అభ్యర్థులు విజయం సాధించారు. ఉత్తర మహారాష్ట్రలోని జలగావ్, పన్వెల్, భివాండీ తదితర ప్రాంతాల్లో కూడా బీజేపీ తన పట్టును నిరూపించుకుంటూ, ఏకగ్రీవ విజయాలను నమోదు చేసింది.కాగా ఈ ఏకగ్రీవ విజయాలపై ప్రతిపక్ష పార్టీలైన శివసేన (యుబిటి), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పక్షం డబ్బు ఎరవేసి, బెదిరింపులకు గురిచేసి, తమ అభ్యర్థులతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేసిందని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ, ఈ ఉపసంహరణలు స్వచ్ఛందంగా జరిగాయా లేక ఒత్తిడి కారణంగా జరిగాయా అన్న కోణంలో విచారణకు ఆదేశించింది. ఈ మధ్యనే జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మహాయుతికి, తాజా ఏకగ్రీవ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఏకనాథ్ షిండే సొంత ఇలాకా అయిన థానేలో కూడా శివసేన ఆరు స్థానాలను కైవసం చేసుకోగా, అజిత్ పవార్ ఎన్సీపీ.. అహల్య నగర్లో రెండు చోట్ల విజయం సాధించింది. ఇది కూడా చదవండి: మాఘ మేళా షురూ.. కుంభమేళాను తలపిస్తున్న జనం -
చొరబాట్లకు మమత మద్దతు: అమిత్ షా
కోల్‌కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన విమర్శలతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. కోల్‌కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీ నేతృత్వంలోని గత 15 ఏళ్ల పాలనలో రాష్ట్రం అవినీతి, భయం, చొరబాట్లతో నిండిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర భద్రతకు ఈ అంశాలు తీవ్ర ముప్పుగా పరిణమించాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తుకు అత్యంత కీలకమని అమిత్‌షా అన్నారు.బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా జరుగుతున్న చొరబాట్లపై షా ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇది కేవలం రాష్ట్రానికే కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని అన్నారు. మమతా బెనర్జీ తన రాజకీయ ప్రయోజనాల కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని, సరిహద్దుల వద్ద కంచె వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అమిత్ షా పేర్కొన్నారు. కేవలం దేశభక్తి గల బీజేపీ ప్రభుత్వం మాత్రమే సరిహద్దులను కాపాడి, చొరబాటుదారులను బయటకు తరిమికొడుతుందని ఆయన అన్నారు.రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇక్కడి ‘టోల్ సిండికేట్’,అవినీతి కారణంగా ప్రజలకు చేరడం లేదని అమిత్ షా మండిపడ్డారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, భయం, దుర్పరిపాలన నుండి విముక్తి పొంది అభివృద్ధి దిశగా సాగాలని నిశ్చయించుకున్నారని అమిత్ షా అన్నారు. 2026, ఏప్రిల్‌లో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు తృణమూల్ ప్రభుత్వానికి చరమగీతం పాడనున్నారని ఆయన జోస్యం చెప్పారు.వచ్చే ఏడాది ఏప్రిల్ 15 నాటికి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ తర్వాత బెంగాల్ కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ తదితర మహనీయులు కలలుగన్న బెంగాల్‌ను నిర్మిస్తామని, రాష్ట్ర సంస్కృతిని, పునరుజ్జీవనాన్ని కాపాడటానికి కృషి చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: డిజిటల్ హోరులో 'ప్రింట్' జోరు.. యూపీ ముందడుగు -
Myanmar Elections: ప్రజాస్వామ్యంపై ‘జుంటా’ బరితెగింపు..
మయన్మార్.. ఒకనాడు శాంతికి, ఆధ్యాత్మికతకు నిలయం. అయితే ఇప్పుడు ఈ దేశం హింసాయుత ఘటనల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడి అందమైన పగోడాల(బౌద్ధ ఆరామాలు) నీడన అమాయక ప్రజల ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న సైనిక అణచివేత, ఇప్పుడు ఎన్నికల పేరుతో మరింత శక్తిని పొందేందుకు సిద్ధమవుతోంది. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ పేరుతో జరుగుతున్న ఈ తతంగం వెనుక దాగిన వాస్తవాలను తెలియజెప్పడమే ఈ కథనం ఉద్దేశం.అంతులేని ‘జుంటా’ అరాచకాలుమయన్మార్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికీ సైనిక నియంతృత్వానికీ మధ్య యుద్ధం కొన్ని తరాలుగా సాగుతూ వస్తోంది. 2021 ఫిబ్రవరిలో జరిగిన సైనిక తిరుగుబాటు ఆ దేశ ప్రజల ప్రజాస్వామ్య ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లింది. నాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ ‘జుంటా’ దేశంలో నిరంతరం తన ప్రతాపాన్ని చూపుతూ వస్తోంది. ‘జుంటా’ అరాచకాలకు వేలాది మంది ప్రజలు మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే స్వేచ్ఛ కోసం వారి పోరాటం కొనసాగుతూనే ఉంది.40కి పైగా పార్టీలను నిషేధించి..ఇప్పుడు జరగబోతున్న ఈ ఎన్నికలు, క్రూరమైన ‘జుంటా’ సైనిక పాలనకు చట్టబద్ధత కల్పించే ఒక ప్రయత్నంగా కనిపిస్తున్నాయని ‘ది గార్డియన్’ తన కథనంలో పేర్కొంది. మయన్మార్‌లో ప్రస్తుతం మూడు దశలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్ 2025, డిసెంబర్ 28న, రెండవ దశ 2026, జనవరి 11న, చివరి దశ పోలింగ్ జనవరి 25న జరగనుంది. అంగ్ సాన్ సూకీ తదితర నేతలు ఇంకా జైలులోనే మగ్గుతుండగా, ‘జుంటా’ 40కి పైగా రాజకీయ పార్టీలను నిషేధించి, కేవలం తమకు అనుకూలంగా ఉండే వారితోనే ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేననే వాదన వినిపిస్తోంది. ఇది కేవలం ప్రపంచ దేశాల కళ్లకు గంతలు కట్టడానికి వేస్తున్న ఒక నాటకం తప్ప, ప్రజల అభీష్టాన్ని గౌరవించే ప్రక్రియ కాదని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.‘జుంటా’ సైన్యానికి ఎదురు దెబ్బలుఈ ఎన్నికల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటినే విషయానికొస్తే.. దేశంలోని సగం కంటే ఎక్కువ భూభాగం ప్రస్తుతం సైనిక నియంతృత్వం చేతుల్లో లేదు. వివిధ జాతుల సాయుధ బలగాలు, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్.. జుంటా సైన్యాన్ని ముప్పు తిప్పులు పెడుతున్నాయి. దేశం అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. ఇటువంటి సమయంలో పోలింగ్ పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు సవ్యంగా సానేగా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో సగానికిపైగా ప్రాంతాల్లో ఓటర్ల జాబితా కూడా సిద్ధం కాకుండానే సైన్యం అన్నీ బాగున్నాయని చెబుతూ ప్రపంచాన్ని భ్రమ పరుస్తూ, ఎన్నికల దిశగా ముందుకు వెళుతోందనే మాట వినిపిస్తోంది. మయన్మార్ సైన్యాన్ని జుంటా అని పిలవడానికి ప్రత్యేక కారణముంది. దేశాన్ని సైనిక నేతల కమిటీ పాలిస్తున్నందున దీనికి ‘జుంటా’ అనే పేరు వచ్చింది. జుంటా అంటే ‘కమిటీ’ లేదా ‘సమావేశం’ అని అర్థం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు ‘జుంటా’ అనే పదాన్ని ఉపయోగిస్తారు. 2021లో మయన్మార్ సైన్యం.. అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని తప్పించి, అధికారం చేపట్టినప్పటి నుండి ‘జుంటా’ సైన్యం పాలన అని అంటున్నారు.కత్తి పెట్టి ఓటు అడుగుతారా?ఇటువంటి తరుణంలో సైన్యం విడుదల చేసిన కొత్త ఎన్నికల నిబంధనలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఏదైనా పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీ మొత్తంలో నగదు డిపాజిట్ చేయాలి. వేల సంఖ్యలో సభ్యులను కలిగి ఉండాలి. ఈ నిబంధన చిన్న రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులపై నీళ్లు చల్లేదిగా మారింది. దీనివల్ల రేపు ఎన్నికల్లో గెలిచేది ఎవరో ముందే అంచనా వేయవచ్చంటున్నారు. ఈ పరిస్థితుల్లో మయన్మార్ సామాన్య ప్రజల వేదన వర్ణనాతీతంగా ఉంది. ‘మాకు ఓటు వేసే హక్కు కావాలి.. అయితే అది మా గొంతు మీద కత్తి పెట్టి అడిగేదిగా కాకూడదు’ అని వారంటున్నారు. భయం నీడన జరిగే ఏ ఎన్నికలైనా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించలేవు. ఈ ఎన్నికల తంతు పూర్తయ్యాక దేశంలో హింస మరింతగా పెరుగుతుందని, సాయుధ తిరుగుబాటుదారుల పోరాటం ఉధృతం అవుతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు.చైనా మద్దతు వెనుక ఏముంది?మయన్మార్ ‘జుంటా’ నిర్వహించిన జనాభా గణన ప్రకారం దేశంలోని 5.1 కోట్ల జనాభాలో దాదాపు 1.9 కోట్ల మంది వివరాలు సేకరించడం సాధ్యపడలేదు. భద్రతా కారణాల రీత్యా దేశంలోని పలు ప్రాంతాలకు అధికారులు వెళ్లలేకపోయారు. దీంతో ఏ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే చైనా వంటి దేశాలు ఈ ఎన్నికలకు మద్దతు ఇవ్వడం వెనుక వారి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే మయన్మార్ ప్రజలు ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామ్య ముసుగులో నిరంకుశ సైనిక పాలన కొనసాగుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం వారు ప్రపంచదేశాల సాయం వైపు చూస్తున్నారు. ఇది కూడా చదవండి: విష్ణు విగ్రహం కూల్చివేత.. థాయ్ వివరణ -
మరో రెండేళ్లు ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే: కేటీఆర్
-
Paka Suresh: కడపలో YSRCP ఏకఛత్రాధిపత్యం TDPని చిత్తు చేసి గెలిచాం..
-
కడప మేయర్ ఎన్నిక ప్రారంభం
-
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ కుట్ర రాజకీయాలు
-
‘మా ఆయన సీఎం కావాలి’: సిద్ధూ భార్య
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ మహిళా నేత నవజ్యోత్ కౌర్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2027లో పంజాబ్ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యల దరిమిలా రాజకీయ సమీకరణల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ భారత మాజీ క్రికెటర్, రాజకీయ నేత నవజ్యోత్ సింగ్ భార్య నవజ్యోత్ కౌర్ ఏమన్నారు?తన భర్త నవజ్యోత్ సిద్ధూను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే, ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని నవజ్యోత్ కౌర్ వ్యాఖ్యానించారు. సిద్ధూకు తగిన అవకాశం లభిస్తే రాష్ట్రానికి సేవ చేసేందుకు తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెడతారని ఆమె స్పష్టం చేశారు. అయితే పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తీవ్రంగా ఉన్నాయని, ఐదుగురు నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని, వారు సిద్ధూ పురోగతిని అడ్డుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉందని నవజ్యోత్ కౌర్ ఆరోపించారు. హైకమాండ్ దీనిని అర్థం చేసుకోవాలని ఆమె కోరారు.సిద్ధూ దృష్టి పంజాబ్ అభివృద్ధిపైనే ఉందని, ఏ పార్టీకి ఇవ్వడానికి మా దగ్గర డబ్బు లేదని, అయితే తాము మంచి ఫలితాలు ఇస్తామని, పంజాబ్‌ను బంగారు రాష్ట్రంగా మారుస్తామన్నారు. రూ. 500 కోట్ల సూట్‌కేస్ ఇచ్చేవాడు ముఖ్యమంత్రి అవుతాడనేది మా విధానం కాదని అన్నారు. పంజాబ్ రాజకీయాల్లో డబ్బు పాత్రపై ఆమె పరోక్షంగా విమర్శలు చేశారు. అభివృద్ధి ఆధారిత రాజకీయాలకు సిద్ధూ కట్టుబడి ఉంటారని ఆమె అన్నారు.క్రియాశీల రాజకీయాల నుండి వైదొలిగినప్పటికీ, నవజ్యోత్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీతోనూ, పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రాతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారని నవజ్యోత్ కౌర్ తెలిపారు. కాగా గత కొంతకాలంగా సిద్ధూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ప్రచారం చేయలేదు. రాజకీయాల నుండి దూరమైన తర్వాత, సిద్ధూ ఐపీఎల్ క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే తన అనుభవాలు ప్రేరణాత్మక చర్చలు, జీవనశైలి తదితర విషయాలను తెలియజేస్తూ ఆయన ‘నవ్‌జోత్ సిద్ధూ అఫీషియల్’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. నవజ్యోత్ కౌర్ చేసిన తాజా ప్రకటన దరిమిలా నవజ్యోత్ సిద్ధూ క్రియాశీల రాజకీయాలకు తిరిగి రావచ్చనే ఊహాగానాలకు బలం చేకూర్చాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటించడం ద్వారా పంజాబ్‌లో పార్టీ పరిస్థితిని మెరుగుపర్చాలని ఆమె కాంగ్రెస్ హైకమాండ్‌కు సంకేతాలు పంపారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే తదుపరి నిర్ణయంపై సిద్ధూ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.సిద్ధూ రాజకీయ ప్రయాణం ఇలా..నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షడిగా సేవలందించారు. 2004లో బీజేపీ తరఫున అమృత్సర్ నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2016లో బీజేపీకి రాజీనామా చేసి, 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2021, జూలై నెలలో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PPCC) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2022 మార్చి వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు.ఇది కూడా చదవండి: నెలాఖరుకు ‘వందేభారత్ స్లీపర్’.. విశేషాలివే! -
Telangana Panchayat: నామినేషన్ల ప్రక్రియ వేగవంతం...!
-
Bihar: బీఎల్ఓల మరణాలకు‘సర్’ కారణమా?
పట్నా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా, అంతకుముందు జరిగిన సమ్మరీ రివిజన్ (సర్) ప్రక్రియ వివాదాలు మరో రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. రాబోయే పంచాయతీ ఎన్నికలకు రాష్ట్రం సన్నద్ధమవుతున్న తరుణంలో ఇవి ఆటంకాలు సృష్టిస్తున్నాయి. ‘రివిజన్’ప్రక్రయ సమయంలో బిహార్ వ్యాప్తంగా 16 మంది బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్ఓ) వరుస మరణాలు ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.గతంలో రాష్ట్రంలో జరిగిన సమ్మరీ రివిజన్ (సర్) ప్రక్రియ సమయంలో అధిక పనిభారం, ఒత్తిడి కారణంగానే పలువురు బీఎల్ఓలు మరణించారని మృతుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషాద ఘటనలు అట్టడుగు స్థాయిలో పనిచేసే పోల్ సిబ్బంది భద్రత, పని పరిస్థితులపై తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. దీంతో పలువురు ఎన్నికల కమిషన్, పాలక యంత్రాంగాల జవాబుదారీతనంపై ప్రశ్నలను లేవదీస్తున్నారు.ఈ మరణాలపై ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తూ, ఇవి వ్యవస్థాగత వైఫల్యానికి చిహ్నాలుగా అభివర్ణించాయి. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ), పాలక యంత్రాంగాల నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం జరిగిందని ఆరోపించాయి. కాంగ్రెస్ నేతలు ఇందుకు బాధ్యులైనవారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశం న్యాయవ్యవస్థకు కూడా చేరింది. హైకోర్టు ఈ సమస్యపై స్పందిస్తూ ఇది పరిపాలనా అధికార పరిధికి సంబంధించినదని పేర్కొంటూ దీనిలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఈ ఉదంతం సుప్రీంకోర్టు ముందుకు చేరింది. కాగా ఎన్నికల సందర్భంలో బీఎల్ఓల పాత్ర అత్యంత కీలకం. అర్హత కలిగిన ప్రతి గ్రామస్థుడిని లెక్కించేలా ఓటరు నమోదు, ఓటర్ల జాబితాల తయారీకి వారు వెన్నెముకగా నిలుస్తారు. ఈ నేపధ్యంలో వారి మరణాలు పోల్ సిబ్బందిలో నైతికత తగ్గుతుందనే భయాలను రేకెత్తిస్తున్నాయి. అట్టడుగు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పంచాయతీ ఎన్నికలపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపనుందనే మాట వినిపిస్తోంది.ఈ అంశంపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) స్పందించింది. బీఎల్ఓ మరణాలను పని ఒత్తిడితో ముడిపెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, దీనిపై పూర్తి వివరాలు కోరుతూ అన్ని రాష్ట్రాలలోని ముఖ్య ఎన్నికల అధికారుల (సీఈఓ) నుండి నివేదికలను అత్యవసరంగా కోరింది. బిహార్‌లో ‘సర్’ ప్రక్రియ తక్కువ సమయంలో పూర్తయినప్పటికీ, పని ఒత్తిడిపై ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని ఈసీ అధికారులు పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ వివాదంపై దర్యాప్తు పూర్తయిన తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని ఈసీ సీనియర్ అధికారులు హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి: 360 డిగ్రీల్లో శబరిమల దర్శనం.. చూసి తీరాల్సిందే! -
బీహార్ ఎగ్జిట్ పోల్స్ లో ఊహించని ట్విస్ట్
-
ముగిసిన జూబ్లీ పోలింగ్
-
20 ఏళ్లలో తొలిసారి.. బిహార్ లో రికార్డు స్థాయిలో పోలింగ్
-
Jubilee By Poll: కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ ఫిర్యాదు
-
Jubilee Hills: సాయంత్రం 6 వరకు కొనసాగనున్న పోలింగ్
-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)


