జమ్ముకశ్మీర్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వు చేసిన 16 స్థానాలు కింగ్‌మేకర్ పాత్రను పోషించనున్నాయి. వీటిలో షెడ్యూల్డ్ కులానికి చెందిన ఏడు సీట్లు, షెడ్యూల్డ్ తెగకు చెందిన తొమ్మిది సీట్లు ఉన్నాయి. ఎస్‌సీ, ఎస్టీ రిజర్వేషన్‌పై ఈ వర్గానికి చెందిన ఓటర్లలో ఉత్సాహం నెలకొంది.
జమ్ముకశ్మీర్‌లోని ఈ 16 స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెండుగా అవకాశాలుంటాని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, బీజేపీ ఖాతాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎన్‌సీ ఖాతాలో ఏడు, కాంగ్రెస్ ఖాతాలో రెండు, అప్నీ పార్టీ ఖాతాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాయి. 16 రిజర్వ్‌డ్ సీట్లలో 13 జమ్మూ డివిజన్‌లో ఉండగా, మూడు కాశ్మీర్‌లో ఉన్నాయి. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆరింటిలో, కాంగ్రెస్‌కు ఒక చోట ఆధిక్యం లభించింది. ఎస్టీలకు రిజర్వ్ చేసిన తొమ్మిది స్థానాల్లో, బీజేపీ అభ్యర్థులు ఏడు స్థానాల్లో, ఎన్‌సీ ఒకదానిలో, కాంగ్రెస్ ఒకదానిలో ఆధిక్యం దక్కించుకుంది.
తొలిసారిగా ఎస్‌సీ,ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన కారణంగా ముఖ్యంగా రాజోరి-పూంచ్ జిల్లాలో ఇప్పుడున్న సమీకరణలు మారిపోయాయి. దీంతో ఈ ప్రాంతంలో పహారీ, గుజ్జర్ వర్గాల వారికి అధికారం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీర్‌లో కూడా మూడు సీట్లు ఎస్టీకి రిజర్వ్ చేశారు. ఇక్కడ పహారీ, గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు స్థానాలనూ ఎన్‌సీ కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment