Reserved seats
-
Jammu and Kashmir: కింగ్‌మేకర్‌గా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు
జమ్ముకశ్మీర్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వు చేసిన 16 స్థానాలు కింగ్‌మేకర్ పాత్రను పోషించనున్నాయి. వీటిలో షెడ్యూల్డ్ కులానికి చెందిన ఏడు సీట్లు, షెడ్యూల్డ్ తెగకు చెందిన తొమ్మిది సీట్లు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌పై ఈ వర్గానికి చెందిన ఓటర్లలో ఉత్సాహం నెలకొంది.జమ్ముకశ్మీర్‌లోని ఈ 16 స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెండుగా అవకాశాలుంటాని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, బీజేపీ ఖాతాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎన్సీ ఖాతాలో ఏడు, కాంగ్రెస్ ఖాతాలో రెండు, అప్నీ పార్టీ ఖాతాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాయి. 16 రిజర్వ్డ్ సీట్లలో 13 జమ్మూ డివిజన్లో ఉండగా, మూడు కాశ్మీర్లో ఉన్నాయి. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆరింటిలో, కాంగ్రెస్‌కు ఒక చోట ఆధిక్యం లభించింది. ఎస్టీలకు రిజర్వ్ చేసిన తొమ్మిది స్థానాల్లో, బీజేపీ అభ్యర్థులు ఏడు స్థానాల్లో, ఎన్సీ ఒకదానిలో, కాంగ్రెస్ ఒకదానిలో ఆధిక్యం దక్కించుకుంది.తొలిసారిగా ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన కారణంగా ముఖ్యంగా రాజోరి-పూంచ్ జిల్లాలో ఇప్పుడున్న సమీకరణలు మారిపోయాయి. దీంతో ఈ ప్రాంతంలో పహారీ, గుజ్జర్ వర్గాల వారికి అధికారం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీర్లో కూడా మూడు సీట్లు ఎస్టీకి రిజర్వ్ చేశారు. ఇక్కడ పహారీ, గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు స్థానాలనూ ఎన్సీ కైవసం చేసుకుంది. -
కన్ఫర్మ్ కాని టికెట్‌తో రైలెక్కితే దించేస్తారు
సాక్షి, హైదరాబాద్: కన్ఫర్మ్ కాని వెయిటింగ్ జాబితాలో ఉన్న రైలు టికెట్‌తో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణిస్తే టీసీలు ఇక రైలు నుంచి దింపేస్తారు. వారు జనరల్ క్లాస్ టికెట్ ధర చెల్లించి అప్పటికప్పుడు ఆ కోచ్‌లోకి మారాల్సి ఉంటుంది. లేని పక్షంలో రైలు దిగిపోవాల్సిందే. ఈమేరకు రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు.. రిజర్వేషన్ క్లాస్‌కు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో అదే క్లాసులో పెనాల్టీ చెల్లించి ప్రయాణించేందుకు కొనసాగుతున్న ’అనధికార’ వెసులుబాటుకు అవకాశం లేకుండా రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.ఇక ఆ టికెట్‌తో వెళ్లడం కుదరదు..రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణం చేసేందుకు ఆన్లైన్లో టికెట్ కొన్నప్పుడు.. కన్ఫర్మ్ అయితే సంబంధిత కోచ్‌లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చు. కానీ, ప్రయాణ సమయం నాటికి కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రద్దయి, టికెట్ రుసుము మొత్తం సంబంధీకుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. టికెటే రద్దయినందున, ఆ టికెట్ ప్రయాణానికి వీలుండదు.కానీ, రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లో కొనుగోలు చేసిన రిజర్వ్డ్ క్లాస్ టికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రుసుము కోసం మళ్లీ స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి రద్దు ఫామ్ పూరించి టికెట్‌తో కలిపి అందజేస్తే గానీ ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. కానీ, చాలామంది ఆ కన్ఫర్మ్ కాని టికెట్‌ను రద్దు చేసుకోకుండా, సంబంధిత కోచ్ లో ప్రయాణిస్తారు. టీసీ వచ్చినప్పుడు ఫైన్ చెల్లించటం లేదా, ఎంతో కొంత ము ట్టచెప్పటం ద్వారానో ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, కొన్ని టికెట్లు కన్ఫర్మ్ అయి, కొన్ని వెయిటింగ్ జాబితాలోనే ఉండిపోతే, అలాగే సర్దుకుని వెళ్తుంటారు. కానీ, ఇక నుంచి అలాంటి అవకాశం లేకుండా రైల్వే బోర్డు కఠినతరం చేసింది.అలా పట్టుబడితే పెనాల్టీనేటికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో దాన్ని రద్దు చే సుకోవాల్సిందే. ఒక వేళ ఆ టికెట్‌తో రిజర్వ్ డ్ కోచ్‌లో ప్రయాణిస్తూ పట్టుబడితే, వారి నుంచి రూ.250 నుంచి రూ.440 వరకు పెనాల్టీ వ సూలు చేసి, వారిని తదు పరి స్టేషన్లో దింపి, జనర ల్ క్లాస్ టికెట్ రుసుము తీ సుకుని అందులోకి మార్పి స్తారు. జనరల్ క్లాస్‌లో అవకాశం లేనప్పుడు స్టేషన్లో దించేస్తారు. ఈమేరకు జోన్లకు రైల్వేబోర్డు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.వేలల్లో ఫిర్యాదులు.. అలా చేస్తే టీసీలపైనా చర్యలుకన్ఫర్మ్ కాని టికెట్‌తో ప్రయాణించటం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా వాటితో రిజర్వ్డ్ కోచ్‌లలో.. టీసీల సహకారంతో ప్రయాణించే పద్ధతి అనధికారికంగా అమలులో ఉంది. ఇలా క్రమంగా రిజర్వ్డ్ కోచ్‌లలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూండటంతో.. రిజర్వేషన్ టికెట్‌తో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కొంతమంది వారిని దబాయించి మరీ సీటులో జాగా కల్పించుకుని ప్రయాణిస్తున్నారు. మరికొందరు సీట్లలో ఏదో ఓ వైపు కూర్చుని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ఇలాంటి వాటిపై ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రైల్వే బోర్డుకు 8 వేల వరకు ఫిర్యాదులందినట్టు తెలిసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు, నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని, రిజర్వ్డ్ కన్ఫర్మ్ టికెట్ లేని వారు ఎట్టి పరిస్థితిలో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించకుండా చూడాలని, ఒకవేళ టీసీలు వారికి వీలు కల్పించినట్టు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా, కన్ఫర్మ్ కాని టికెట్ ఉన్న వారిని జనరల్ కోచ్‌లకు తరలిస్తే, వాటిపై మరింత భారం పెరుగుతుందనీ,. ఈ నేపథ్యంలో రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. -
రిజర్వ్డ్ స్థానాల్లో గెలిస్తేనే.. ‘రాజ’స్థానం
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు శనివారం పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 200 నియోజకవర్గాలకు గానూ 199 స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రజలు తమ తీర్పును ఓట్ల రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏ పార్టీకీ రెండోసారి అధికారం ఇచ్చే అలవాటు లేని రాజస్థానీయులు ఈసారి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. రాజస్థాన్‌లో 1998 నుంచి ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 30 శాతం రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. మొత్తం 59 రిజర్వ్డ్ నియోజకవర్గాలలో 34 ఎస్సీ స్థానాలు కాగా, 25 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్నపార్టీనే అధికార పీఠం అధిరోహిస్తోంది. గత మూడు అసెంబ్లీ ఎన్నికలలో రెండింటిలో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మధ్య ఉన్న గెలుపు తేడా మొత్తం ఈ రిజర్వ్డ్ సీట్ల సంఖ్యలో సగం కూడా లేదు. 2008 డీలిమిటేషన్ తర్వాత లోక్‌సభ ఎన్నికలతో సహా రాజస్థాన్‌లో ఆరు ఎన్నికలు జరిగాయి. ఈ ఆరు ఎన్నికలలో అత్యధిక రిజర్వు స్థానాలను గెలుపొందిన పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించినట్లు చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. బీజేపీదే ఆధిక్యం రాజస్థాన్‌లో 2013 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ సహా మూడు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక రిజర్వ్డ్ స్థానాల్లో ఆధిక్యత కనబర్చింది. కాంగ్రెస్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే ఎక్కువ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో గెలుపొందింది. 2013 అసెంబ్లీ ఎన్నికలు, 2014 లోక్‌సభ ఎన్నికల్లో అయితే ఒక్క ఎస్సీ రిజర్వ్డ్ సీటును కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. మొత్తం 34 ఎస్సీ స్థానాల్లో బీజేపీ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాలు గెలుచుకోగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 33 స్థానాల్లో అత్యధిక ఓట్లు సాధించింది. ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా 34 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో 32, 25 ఎస్టీ సీట్లలో 19 చోట్ల బీజేపీదే ఆధిపత్యం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఒక ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో, ఐదు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 2018లో కాంగ్రెస్ జోరు రాజస్థాన్‌లో జరిగిన గత నాలుగు ఎన్నికలలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ దూసుకెళ్లింది. ఈ ఎన్నికల్లో ఎక్కువ రిజర్వ్డ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగలిగినప్పటికీ, దాని విజయం ఇంతకుముందు మూడు ఎన్నికలలో బీజేపీ సాధించినంత ప్రబలంగా లేదు. 2018లో కాంగ్రెస్ 19 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు, 12 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలను గెలుచుకుంది. బీజేపీకి 12 ఎస్సీ స్థానాలు, 9 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు దక్కాయి. అయితే ఈ ఆధిక్యాన్ని కాంగ్రెస్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయింది. ప్రస్తుతం జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి రిజర్వ్డ్ సీట్లలో ఆధిక్యం దక్కుతుందన్నది డిసెంబర్ 3న జరిగే ఓట్ల లెక్కింపులో తెలియనుంది. -
ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో పాగాకు బీజేపీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రిజర్వ్డ్ సీట్లపై కన్నేసిన కమలం పార్టీ వచ్చే ఎన్నికల్లో వాటిని కైవసం చేసుకునేదిశగా కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులను ముందే గుర్తించాలని నిర్ణయించింది. ఈ సీట్లలో పార్టీ పరిస్థితి, ప్రజాసమస్యలు, ఇతర అంశాలపై ‘గ్రౌండ్ రిపోర్ట్’కోసం త్వరలోనే బృందాలను పంపించనుంది. ఒక వర్కింగ్ పేపర్ ద్వారా పోలింగ్ బూత్‌స్థాయిలోనే క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి, పార్టీపరంగా ఇద్దరేసి బలమైన అభ్యర్థులను (ముఖ్యనేతలు ప్రాతినిధ్యం వహించే స్థానాలు మినహాయించి) గుర్తించనుంది. దీంతోపాటు అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో ‘కేసీఆర్‌పై దళిత అదాలత్’లు నిర్వహించాలని నిర్ణయించింది. గత ఏడేళ్లలో దళితులకు సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలు, వాటిల్లో ఎన్ని అమలయ్యాయి, సమస్యలు ఏ మేరకు పరిష్కారమయ్యాయనే అనే అంశాలపై సర్కారును నిలదీయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేయనుంది. ఎక్కడికక్కడ ప్రజలు స్పందించేలా చూడాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 19 ఎస్సీ స్థానాల పరిస్థితిపై చర్చించేందుకు ఈ వర్గ ముఖ్యనేతలతో వర్క్‌షాపు నిర్వహించిన విషయం తెలిసిందే. అదేవిధంగానే 12 ఎస్టీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనకు త్వరలోనే ఈ వర్గ ముఖ్యనేతలతో వర్క్‌షాపు ఏర్పాటు చేసి, ఆ తర్వాత కార్యాచరణ అమలు చేయనుంది. ‘మిషన్–19’కు నాయకత్వం అభినందనలు ఎస్సీ సీట్లపై ‘మిషన్–19’వర్క్‌షాపు నిర్వహించడంపై బీజేపీ జాతీయ నాయకత్వం అభినందించింది. ఇందులో పార్టీనేతలు ఇచ్చిన సలహాలు, సూచనల గురించి జాతీయ నాయకత్వానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివరించారు. ఎస్సీ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టడాన్ని అధిష్ఠానం అభినందిస్తూనే దీనికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని భరోసానిచ్చింది. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేయడంతోపాటు ఆరేడుమంది సభ్యులతో సమన్వయకమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. రెండేళ్ల పూర్తి సమయం పార్టీకి కేటాయించేవారికి, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉన్నవాళ్లకు సమన్వయ కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, మొత్తంగా పాత–కొత్తల కలయికగా ఉండాలని సంజయ్‌కు నాయకత్వం సూచించినట్టు పార్టీవర్గాల సమాచారం. జనవరి మొదటివారంలో ఈ కమిటీసభ్యులతోపాటు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో సంజయ్ సమావేశం కానున్నారు. జనవరి 5, 6 తేదీల నుంచి 19 ఎస్సీ నియోజకవర్గాల్లో ఈ కమిటీ పర్యటించనున్నట్టు తెలిసింది. ఈ సమన్వయ కమిటీ తొలుత తన కరీంనగర్ ఎంపీ సీటు పరిధిలోని మానకొండూరు, చొప్పదండిలలో పర్యటించి ఆయా అంశాలను సమీ„ìక్షించాలనే యోచనలో సంజయ్ ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఇమ్రాన్ పార్టీకి మరో 33 సీట్లు
ఇస్లామాబాద్: ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ టెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి ఎన్నికల సంఘం 33 రిజర్వుడ్ సీట్లను కేటాయించింది. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన సీట్ల ఆధారంగా పార్టీలకు రిజర్వుడ్ సీట్లను ఈసీ కేటాయించింది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తంగా 60 సీట్లు మహిళలకు, 10 సీట్లు మైనారిటీలకు రిజర్వు చేశారు. ఇందులో పీటీఐకి 28 మంది మహిళలు, ఐదుగురు ముస్లిమేతరుల సీట్లను ఈసీ కేటాయించింది. దీంతో పీటీఐ నేషనల్ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 158కి చేరింది. ఇటీవలి ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. దీంతోపాటు 9 మంది ఇండిపెండెంట్లు మద్దతు ఇవ్వడంతో ఇమ్రాన్ బలం 125 సీట్లకు చేరింది. తాజాగా 33 రిజర్వుడ్ సీట్లు కేటాయించిన నేపథ్యంలో.. సాధారణ మెజారిటీకి 14 సీట్ల దూరంలో పీటీఐ నిలిచింది. సభ మొత్తం సభ్యుల సంఖ్య 342 కాగా.. సాధారణ మెజారిటీ సాధించాలంటే 172 సీట్లు ఉండాలి. ఈసీ కేటాయించిన రిజర్వుడ్ సీట్లలో కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి పంజాబ్ నుంచి 16 మంది మహిళలు, సింధ్ నుంచి నలుగురు, ఖైబర్ పఖ్తున్ఖ్వా నుంచి ఏడుగురు, బెలూచిస్తాన్ నుంచి ఒకరిని ఈసీ కేటాయించింది. ఇక మైనారిటీ కోటాలో ఐదు సీట్లు పీటీఐకి పోగా... పీఎంఎల్–ఎన్‌కు 2 సీట్లు, పీపీపీకి రెండు సీట్లు, ఎంఎంఏ పార్టీకి ఒక సీటును ఈసీ కేటాయించింది. పాక్ కొత్త పార్లమెంటు సోమవారం కొలువుదీరనుంది. -
ప్రిలిమినరీ పరీక్షపై స్టేకు నో
1,291 ఖాళీల్లో అంధులకు రెండే పోస్టులా? కేంద్రంపై మండిపడిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ: సివిల్‌సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై స్టే విధించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే, అంధులైన అభ్యర్థులకు రెండేరెండు సీట్లు రిజర్వు చేయడం పట్ల యూపీఎస్సీపై, ఇతర కేంద్రప్రభుత్వ విభాగాలపై మండిపడింది. అంధులకు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రెండు సీట్లు మాత్రమే కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లాలు విచారించారు. పిటిషనర్ అభ్యర్థనలో న్యాయముందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అయితే, దీనికారణంగా ప్రిలిమినరీ పరీక్ష ఆపడానికి నిరాకరించింది. అంధులకు రెండుసీట్లు రిజర్వు అయ్యాయనే నెపంతో పరీక్ష రాసిన అంధ అభ్యర్థులనెవరినీ అనర్హులుగా ప్రకటించవద్దని యూపీఎస్సీని ఆదేశించింది. అంతేకాక మెయిన్స్ పరీక్షలు జరిగేలోగా వికలాంగుల కోటాను సరిదిద్దాలని ఆదేశించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 1,291సివిల్‌సర్వీసెస్ పోస్టుల్లో వికలాంగులకు 26 పోస్టులు కేటాయించగా, అంధులకు రెండు సీట్లే కేటాయించారని పిటిషనర్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. బధిరులకు, ఇతర వికలాంగులకు మాత్రం చెరి 12 పోస్టుల చొప్పున కేటాయించారని పిటిషన్లో తెలిపారు. కాగా, వికలాంగుల చట్టం సెక్షన్ 33 ప్రకారం మొత్తం ఖాళీల్లో మూడు శాతం పోస్టులు వికలాంగులకు కేటాయించాలని, అందులో ఒకశాతం అంధులకు రిజర్వు చేయాలనే నిబంధన ఉందని‘సంభావన’ పేర్కొంది. అయితే, యూపీఎస్సీ మాత్రం దీనిని పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసింది. దీనిని న్యాయమూర్తులు తీవ్రంగా పరిగణించారు. దీనిపై రెండువారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేసును వచ్చేనెల మూడుకు వాయిదా వేసింది. అప్పటిలోగా పూర్తివివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.షెడ్యూల్ ప్రకారం ప్రిలిమ్స్ నిర్వహించుకోవచ్చునని పేర్కొంది.