voters
-
Delhi Election 2025: 14 బహిరంగ సభలకు సీఎం యోగి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఒకే దశలో ఫిబ్రవరి 5న ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ముమ్మర ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల నేతలు ప్రచారపర్వంలో మునిగితేలుతున్నారు. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తన హవా చాటనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సీఎం యోగి షెడ్యూల్‌ను కూడా బీజేపీ వర్గాలు కూడా వెల్లడించాయి. సీఎం యోగి పాల్గొనబోయే సమావేశాలకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి.సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో 14 బహిరంగ సభలలో ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 23న మూడు సమావేశాలు, జనవరి 28న నాలుగు సమావేశాలు, జనవరి 30న నాలుగు సమావేశాలు, ఫిబ్రవరి ఒకటిన మూడు సమావేశాల్లో సీఎం యోగి పాల్గొననున్నారు.యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలోని తూర్పు, ఈశాన్య ఢిల్లీ ప్రాంతాలలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. బీజేపీ అభ్యర్థులు అజయ్ మహాబల్, పవన్ శర్మ, ఆశిష్ సూద్, రవీంద్ర సింగ్, ఉమాంగ్ బజాజ్, ప్రద్యుమాన్ రాజ్‌పుత్ (ద్వారక), కర్తార్ సింగ్ తన్వర్, గజేంద్ర యాదవ్ (మెహ్రౌలి), బజరంగ్ శుక్లా, సంజయ్ గోయెల్, మోహన్ సింగ్ బిష్ట్, కైలాష్ గెహ్లాట్ మొదలైనవారు పోటీచేస్తున్న ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో యోగి పాల్గొననున్నారు.ఇది కూడా చదవండి: బీహార్ బాలికకు ప్రధాని మోదీని ప్రశ్నించే ఛాన్స్! -
రాష్ట్ర ఓటర్లు 4,14,40,447
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,40,447 అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రకటించారు. ముసాయిదా ఓటర్ల జాబితాకు సవరణ అనంతరం తుది జాబితాను ఆయన సోమవారం విడుదల చేశారు. రాష్ట్రంలో పురుషులకన్నామహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. సర్విసు ఓటర్లతో కలిపి పురుష ఓటర్లు 2,03,52,816 మంది ఉండగా మహిళా ఓటర్లు 2,10,84,231 మంది ఉన్నారు.3,400 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఓటర్ల సంఖ్య 4,86,226 కాగా, తుది జాబితాలో 5,14,646కు పెరిగింది. దివ్యాంగ ఓటర్లు 5,18,383 మంది ఉన్నారు. ఓటర్లు, జనాభా నిష్పత్తి 719గా ఉంది. లింగ నిష్పత్తి 1039గా ఉంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,64,184 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,73,388 మంది ఓటర్లు ఉన్నారు. సర్విసు ఓటర్లు ముసాయిదా జాబితాలో 67,143 ఉండగా తుది జాబితాలో 66,690 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 46,397. -
ఒక్కో ఈవీఎంలో 1,500 ఓట్లా?... దానికి అంత సామర్థ్యముందా?: సుప్రీంకోర్టు అనుమానాలు
న్యూఢిల్లీ: ఒక్కో పోలింగ్ స్టేషన్లో పోలయ్యే గరిష్ట ఓట్ల సంఖ్యను 1,200 నుంచి 1,500కు పెంచుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో హేతుబద్ధతపై సుప్రీంకోర్టు అనుమానాలు లేవనెత్తింది. ‘‘ఒక్క ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం) పోలింగ్ గడువులోగా అన్ని ఓట్లను నమోదు చేయగలదా? దానికి అంత సామర్థ్యముందా? 1,500 కంటే ఎక్కువ మంది ఓటర్లు నమోదయ్యే పోలింగ్ స్టేషన్ల విషయంలో ఏం చేస్తారు? ఒక్కో ఈవీఎం ద్వారా గంటకు సగటున 45కు ఓట్లకు మించి పోల్ కావన్న పిటిషనర్ వాదన నిజమైతే హెచ్చు పోలింగ్ శాతం నమోదయ్యే సందర్భాల్లో ఓటర్ల తాకిడిని తట్టుకోవడం ఎలా సాధ్యం? నిర్దేశిత గడువులోపు అందరూ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి తలెత్తదా?’’ అంటూ ఈసీకి ప్రశ్నలు వేసింది.ఇందుప్రకాశ్ సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్‌కుమార్ ధర్మాసనం సోమవారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ లేవనెత్తిన పలు అంశాలపై తాము ఆందోళన చెందుతున్నట్టు స్పష్టం చేసింది. ఏ కారణంతోనైనా సరే, ఒక్క ఓటర్ కూడా ఓటింగ్‌కు దూరంగా ఉండే పరిస్థితి రాకూడదని పేర్కొంది. ఈవీఎంల సంఖ్యాపరమైన సామర్థ్యంతో పాటు తాము లేవనెత్తిన సందేహాలన్నింటికీ సమగ్రంగా వివరణ ఇస్తూ ఈసీ మూడు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. 1,200కు తగ్గించాలి: పిటిషనర్ ఒక్కో పోలింగ్ స్టేషన్ సామర్థ్యాన్ని 1957 నుంచి 2016 దాకా అమల్లో ఉన్న మేరకు 1,200 ఓటర్లకు తగ్గించాలని పిటిషనర్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వీ డిమాండ్ చేశారు. ‘‘పోలింగ్ స్టేషన్ సామర్థ్యాన్ని 1,500 మంది ఓటర్లకు పెంచడం వారిని తీవ్ర అసౌకర్యానికి గురి చేయడమే. దీనివల్ల బూత్‌ల వద్ద రద్దీ పెరిగి ఓటేసేందుకు చాలా సమయం పడుతుంది. అంతసేపు వేచి చూడలేక ఓటర్లు ఓటేయకుండానే వెనుదిరిగే ప్రమాదముంది. ఎందుకంటే సగటున 11 గంటలపాటు పోలింగ్ జరుగుతుంది. ఈవీఎంల ద్వారా ఒక్కో ఓటు వేసేందుకు 60 నుంచి 90 సెకన్ల దాకా పడుతుంది. ఆ లెక్కన రోజంతా కలిపినా ఒక్కో ఈవీఎంలో 490 నుంచి 660 ఓట్ల కంటే పోలయ్యే అవకాశం లేదు’’ అన్నారు.ఈ వాదనను ఈసీ తరఫు న్యాయవాది మణీందర్‌సింగ్ తోసిపుచ్చారు. ‘‘ఈవీఎంల సామర్థ్యంపై అనుమానాలే అవసరం లేదు. ఒక్కో పోలింగ్ స్టేషన్లలో గరిష్టంగా 1,200కు బదులు 1,500 ఓట్లు పోలయ్యే విధానం 2019 నుంచీ అమల్లో ఉంది. పార్టీలన్నింటికీ ముందుగా వివరించాకే ఈసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదులూ రాలేదు. పైగా పోలింగ్ నాడు సాధారణంగా ఉదయపు వేళల్లో పెద్దగా రద్దీ ఉండదు. ఓటర్లంతా ఒకేసారి ఓటేసేందుకు వస్తే మధ్యాహ్నం తర్వాత కాస్త క్యూలు పెరుగుతాయేమో. అలాంటివారు పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా ఓటేసేందుకు ఈసీ అనుమతిస్తూనే ఉంది.అవసరమైన చోట్ల పోలింగ్ బూత్‌ల సంఖ్యను పెంచడం వంటి చర్యలూ ఉంటాయి’’ అన్నారు. ఈవీఎంలపై ఏదో రకమైన ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, అది ధర్మాసనానికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఓటింగ్ శాతం పెరగాలని, తద్వారా ఎన్నికల ప్రక్రియలో ప్రజలు వీలైనంత ఎక్కువగా పాల్గొనాలని ధర్మాసనం అభిప్రాయపడింది. బ్యాలెట్ పేపర్‌కు బదులు ఈవీఎంలు తేవడంలో ఉద్దేశమూ అదేనని గుర్తు చేసింది. ఇరు వర్గాల వాదనల అనంతరం విచారణను జనవరి 25కు వాయిదా వేసింది. -
యూపీ ఉప ఎన్నికలు.. ఈసీ వార్నింగ్, ఏడుగురి పోలీసుల సస్పెండ్
మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వీటితోపాటు దేశ వ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నేడు జరుగుతున్నాయి.అయితే ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్‌లో పోలీసులు బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేయడంపై వివాదం చేలరేగింది. దీనిపై తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. నిష్పక్షపాతంగా ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని భారత ఎన్నికల సంఘం బుధవారం అధికారులను కోరింది. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఈసీ సస్పెండ్ చేసింది.అర్హత ఉన్న ఓటరు ఓటు వేయకుండా అడ్డుకోరాదని తెలిపింది. ఓటింగ్ సమయంలో ఎలాంటి పక్షపాత వైఖరిని సహించబోమని స్పష్టం చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరుపుతామని, ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపింది.కాగా ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక కొనసాగుతుండగా.. బురఖా ధరించిన ఓటర్ల గుర్తింపును సరిగ్గా తనిఖీ చేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు బీజేపీ నేత అఖిలేష్ కుమార్ అవస్తీ లేఖ రాసింది. ముసుగులు ధరించిన మహిళలు చాలాసార్లు ఓటు వేయడానికి ప్రయత్నించిన కేసులు గతంలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అంతేకగాక కొంతమంది పురుషులు కూడా బురఖా ధరించి ఓటు వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అయితే వీరిని ఈసీ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. బురఖా ధరించిన మహిళల గుర్తింపును తనిఖీ చేయకపోతే, నకిలీ ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. సరైన తనిఖీ మాత్రమే న్యాయమైన, పారదర్శకమైన ఓటింగ్‌కు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బురఖా ధరించిన మహిళలను తనిఖీ చేసేందుకు తగిన సంఖ్యలో మహిళా పోలీసులను పోలింగ్ కేంద్రాల వద్ద తప్పనిసరిగా మోహరించాలని ఆయన అన్నారు. ఓటరు ఐడీ కార్డులను తనిఖీ చేస్తున్న పోలీసులపై ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ చీఫ్, లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఇద్దరు పోలీసులు ఓటర్ల గుర్తింపు కార్డులు అడిగే వీడియోను షేర్ చేస్తూ.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ జోక్యాన్ని కోరారు."ఎన్నికల సంఘం యాక్టివ్‌గా ఉంటే.. పోలీసులు ఓటర్ల ఐడీలను తనిఖీ చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. రోడ్లు మూసివేయకుండా, ఐడీలను స్వాధీనం చేసుకోకుండా, ఓటర్లను బెదిరించకుండా, ఓటింగ్ వేగం మందగించకుండా, సమయం వృధా కాకుండా చూసుకోవాలని అన్నారు. అధికార పార్టీకి ప్రతినిధిగా ఉండకుండా పరిపాలనను చూసుకోవాలని తెలిపారు. అయితే అఖిలేష్ యాదవ్ పోస్టుపై కాన్పూర్ పోలీసులు సైతం స్పందించారు. ఓటర్లను తనిఖీ చేసిన సంబంధిత అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.. ఎన్నికల సమయంలో రాష్ట్ర పోలీసులు ఎన్నికల సంఘం ఆధీనంలోకి వస్తారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
Jharkhand Polls: ఐదుగురు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్న ఒక బ్లాక్ ఓటర్లు
హజారీబాగ్: జార్ఖండ్‌లోని దారు బ్లాక్‌లోని ఓటర్లు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీరు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో ఓటు వేస్తుంటారు. 2008లో బ్లాక్ ఏర్పడినప్పటి నుంచి ఈ అసాధారణ పరిస్థితి ఏర్పడింది. ఈ బ్లాక్‌లో మూడు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు హజారీబాగ్, బర్కతా, మండు గ్రామాలున్నాయి. దీంతో దారు బ్లాక్‌లోని 42,281 మంది ఓటర్లు ఐదుగురు ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు.హజారీబాగ్ జిల్లాలోని దారు బ్లాక్‌లో తొమ్మిది పంచాయతీలు, 56 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ బ్లాక్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉంది. ఈ కారణంగా ఇక్కడ ఈ ప్రత్యేకమైన ఎన్నికల పరిస్థితి ఏర్పడింది. దారూలోని ఓటర్లు హజారీబాగ్, బర్కథా, మండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. ఇంతేకాదు వీరు హజారీబాగ్, కోడెర్మా లోక్‌సభ నియోజకవర్గాల ఎంపీలను కూడా ఎన్నుకుంటారు.దారు బ్లాక్‌లోని 42,281 మంది ఓటర్లలో 21,398 మంది పురుషులు, 20,888 మంది మహిళలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా 1,272 మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొమ్మిది పంచాయతీలను కలిసి దారు బ్లాక్‌ను రూపొందించినప్పటి నుంచి ఈ విచిత్ర పరిస్థితి ఏర్పడింది. నవంబరు 13న జరిగే పోలింగ్‌కు దారు బ్లాక్‌లోని అన్ని పోలింగ్ స్టేషన్లలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.ఇది కూడా చదవండి: Jharkhand Polls: మెదటి దశలో జేఎంఎం, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు బరిలో 53 పార్టీలు! -
Maharashtra: తొలిసారి ఆ గ్రామంలో ఎన్నికల పండుగ
నాందేడ్: మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు దాటినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా వెనుకబాటుతనం కనిపిస్తుంది. ఈ కోవలోకే వస్తుంది మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలూకాలోని వాగ్దారి గ్రామం. ఈ గ్రామంలో 300 జనాభా ఉంది. భూ రెవెన్యూ మ్యాప్‌లో ఈ గ్రామం పేరు కూడా లేకపోవడంతో ఇన్నాళ్లూ ఈ గ్రామానికి చెందిన వారు తమ గ్రామంలో ఓటు వేయలేకపోయారు.తాజాగా ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. దీంతో గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు కానుంది. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గ్రామ ప్రజలు తొలిసారిగా తమ గ్రామంలో ఓటు వేయనున్నారు. ఇప్పటి వరకు ఈ గ్రామంలోని ఓటర్లు సమీపంలోని పోలింగ్ కేంద్రమైన జలధారకు వెళ్లేవారు. వీరు ఇక్కడికి చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టేది. అయితే అడవి గుండా వెళ్లాల్సిన రావడంతో క్రూర మృగాల భయం వారిని వెంటాడేది. తాజాగాకిన్వాట్ నియోజకవర్గం పరిధిలోని వాగ్దారీలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ గ్రామంలోని 190 మంది ఓటర్లు స్థానికంగానే ఓటు వేయనున్నారు. గ్రామానికి పోలింగ్ బూత్ రావడంతో త్వరలో ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పడతాయని గ్రామస్తులు భావిస్తున్నారు.ఈ ప్రాంతంలోని చారిత్రక సరిహద్దులను దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని భూమికి కొలతలు నిర్వహించి, పూణేలోని అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో రాబోయే కొద్ది నెలల్లో గ్రామస్తులకు భూమి యాజమాన్యపు రుజువు లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రం గ్రామస్తుల్లో కొత్త ఆశను నింపింది. ఎన్నికల్లో తమ గళం వినిపించాలని, అప్పుడే ప్రభుత్వం తమ కనీస అవసరాలను తీరుస్తుందని గ్రామస్తులు అంటున్నారు. ఇది కూడా చదవండి: మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని.. -
అమెరికాలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు)
-
భారతీయ అమెరికన్ ఓటర్లు ఎటువైపు?
నవంబర్ 5వ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలు స్తారనే ఉత్కంఠతో ప్రపంచ రాజకీయ విశ్లేషకులు తర్జన భర్జనలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ తరఫున, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేశారు. భారతీయ అమెరికన్ ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారనే విషయంపైననే జయాపజయాలు ఉంటాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవంగా ఎన్నికల సర్వేలన్నీ కమలా హ్యారిస్ ముందంజలో ఉన్నట్లు అక్టోబర్ చివరి వరకు తెలియ జేశాయి. విశ్లేష ణాత్మకంగా చూస్తే– ఓటు హక్కును వినియోగించుకోవడంలో రిపబ్లికన్ ఓటర్లు ముందు ఉంటా రని, డెమోక్రాటిక్ పార్టీ ఓటర్లు వెనుకంచెలో ఉంటారని ఒక అపవాదు ఉంది. ఈ అపవాదు నిజమైతే, ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు సులభమే.అరబ్ అమెరికన్ ఓటర్లు సహజంగా డెమో క్రటిక్ పార్టీ వైపు ఉంటారు. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, పాలస్తీ నాలో జరుగుతున్న ముస్లింల నరమేధాన్ని డెమోక్రాట్లు ఆపలేకపోయారనీ, పైగా దీనికి కారణమైన ఇజ్రా యెల్‌ను బహిరంగంగా బైడెన్ ప్రభుత్వం సమర్థించిందనీ, ఆర్థిక సైనిక సహకారం అందించిందనీ, అరబ్ అమెరికన్ ఓటర్లు ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము డెమోక్రాట్లను నమ్ముకున్నందుకు నట్టేట మునిగి పోయామని అరబ్ అమెరికన్ హక్కుల లీగ్ చైర్మన్ నహబ్ అయద్ పత్రికల ముందు వాపోవడం ఇక్కడ గమనార్హం. డెమో క్రటిక్ పార్టీ తరపున ఎన్నికైన కొందరు ముస్లిం మేయర్లు ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడం కూడా ఇక్కడ గమనార్హం. పైగా కమలా హ్యారిస్ భారతీయ (హిందూ) మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆమెకు ముస్లింలు ఓట్లు వేయరాదని కొన్ని ముస్లిం మతోన్మాద సంస్థలు పిలుపునివ్వడం డెమోక్రాట్లకు కొంత నష్టమే. వాస్తవంగా కమలా హ్యారిస్‌కు, ఆమె తల్లి శ్యామలా గోపాలన్‌కు భారతీయ ఆధ్యాత్మిక విషయాలపై, భారతీయ సంస్కృతిపై, భారతీయ మేథో సంపత్తిపై సదభి ప్రాయం లేదంటారు. ఈ విషయం భారతీయ అమెరికన్ ఓటర్లకు బాగా తెలుసు. ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిపిన అమానుష దాడులను బహిరంగంగా ఖండించడం, భారతీ యులు తనకు అత్యంత ప్రియ మిత్రులని గతంలో అనేకమార్లు ఆయన ప్రకటించడం, అమె రికాలోని హిందూ ఓటర్ల మనోభావాలను ప్రభా వితం చేస్తుందని చెప్పవచ్చు. అక్రమ వలసలను కట్టడి చేసి, అమెరికా ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి కమలా హ్యారిస్ కంటే ట్రంప్ ముందు ఉంటాడని మెజారిటీ అమెరికన్ల అభిప్రాయం. ఇదే సందర్భంలో హెచ్ వన్ వీసాల విడుదలలో నియమాలు కఠినతరం చేస్తే, కొంత మంది భారతీయులు ఇబ్బంది పడతారనీ, ఈ విషయంలో కమలా హ్యారిస్ ఆలోచన ధోరణి తమకు ప్రయోజనకరంగా ఉంటుందని కొంతమంది భారతీయ అమెరికన్ ఓటర్లు ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఓటర్లను గోడమీద పిల్లులు అని అంటారు. చివరి నిమిషంలో వీరి ఆలోచన మారితే జయాపజ యాలు తారుమారయ్యే పరిస్థితి కూడా ఉంది.ఇక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య ఉష తెలుగింటి ఆడపడుచు కావడం, అమెరికాలోని ముఖ్యమైన అధికా రులతో ఆమె సత్సంబంధాలు కలిగి ఉండడం, భారతీయ అమెరికన్ ఓటర్లతో ఆమె అనేక సమా వేశాలు నిర్వహించడం, ట్రంప్ విజయానికి కొంత కలిసి వచ్చే విషయమే. ఇక ఆఫ్రికన్ యూరోపి యన్ ఓటర్లు ఇరుపార్టీలకూ సమంగా ఉన్నట్లు రిపోర్టులు తెలియజేస్తున్నాయి.ఉల్లి బాలరంగయ్య వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే
అమెరికా నుంచి సాక్షి టీవీ ప్రతినిధి ఇస్మాయిల్అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అటు డెమొక్రాట్లు ఇటు రిపబ్లికన్లు పూర్తిగా విడిపోయిన నేపథ్యంలో ఒక వర్గం మాత్రం మౌనం వహిస్తోంది. అటు హారిస్‌కు కానీ ఇటు ట్రంప్‌కు గానీ మద్దతు ఇవ్వడంపై వీరు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించడం లేదు. వారే స్వతంత్ర ఓటర్లు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే. నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న అమెరికా ఎన్నికల్లో ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లో విస్తరించి ఉన్న స్వతంత్ర ఓటర్లే నిర్ణాయకం కాబోతున్నారు. పెరుగుతున్న స్వతంత్ర ఓటర్ల సంఖ్యప్రముఖ శాంపిల్ సర్వే గాలప్ పోల్ డేటా ప్రకారం 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో 43 శాతం తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 27% మంది రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులుగా, మరో 27 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ప్రకటించుకున్నారు. 1990లో కేవలం 32 శాతం మంది ఓటర్లు మాత్రమే తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించుకున్నారు. కాలంతో పాటు ఇండిపెండెంట్ ఓటర్ల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.7 రాష్ట్రాల్లో కీలకం⇒ అమెరికాలో పార్టీతో అనుబంధం అనేది చాలా సాధారణ మైన అంశం. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రైమ రీస్‌లో ఓటు వేసేందుకు చాలామంది పార్టీ ఓటర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ప్రైమరీస్ అంటే ఒక పార్టీ నుంచి ఎవరు అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయాలనే విషయంపై జరిగే పోలింగ్. సాధారణ ఓటర్లు ఈ పోలింగ్‌లో పాల్గొంటారు. వీరు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలంటే చాలా రాష్ట్రాల్లో కచ్చితంగా ఏదో ఒక పార్టీ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఈ డేటా ప్రకారమే చాలామందిని అమెరి కాలో డెమొక్రాట్ ఓటర్లు, రిపబ్లికన్ ఓటర్లుగా పిలుస్తారు.అమెరికాలో సర్వే సంస్థలు తాము చేసే సర్వేల ఆధారంగా పార్టీ ఓటర్ల సంఖ్యను లెక్కగడుతోంది. దీని ఆధారంగానే ఏ పార్టీకి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనే విషయం తేలుతుంది. ఈ గణాంకాల ఆధారంగానే చాలా రాష్ట్రాలను బ్లూస్టేట్స్, రెడ్ స్టేట్స్‌గా తేలుస్తారు. డెమొక్రాట్ ఓటర్లు ఎక్కువగా ఉంటే అది బ్లూ స్టేట్ అని రిపబ్లికన్ ఓటర్లు ఎక్కువగా ఉంటే రెడ్ స్టేట్ అని తేలిపోతుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు దాదాపు ఊహించిన దానికి అనుకూలంగానే ఉంటాయి. ఎక్కడైతే రెండుపార్టీల మద్దతు దారుల మధ్య తేడా మూడు శాతం కంటే తక్కువగా ఉంటుందో దానిని బ్యాటిల్ స్టేట్ లేదా పర్పుల్ స్టేట్‌గా పిలుస్తారు. ఇప్పుడు ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ ఉన్నాయని భావిస్తుండగా..వీటిల్లో ఈ ఇండిపెండెంట్ ఓటర్లే నిర్ణాయక శక్తిగా మారారు.కొత్త తరం ఓటర్లే ఎక్కువ..అమెరికాలోని కొత్త తరం ఎక్కువగా స్వతంత్ర భావాలు కలిగి ఉంది. ముఖ్యంగా మిలేనియల్స్ లేదా జనరేషన్ వై ఎక్కువగా ఇండిపెండెంట్ ఓటర్లుగా ఉన్నారని పరిశోధనలో తేలింది. స్వతంత్ర ఓటర్లలో 1981–96 మధ్యలో జన్మించిన జనరేషన్ వైకి చెందిన వారే 36% మంది ఉన్నారు. ఇక తరువాతి తరం అంటే 1997– 2012 మధ్య జన్మించిన జెన్‌జీ స్వతంత్ర ఓటర్లలో 26% ఉన్నారు. అంటే స్వతంత్ర ఓటర్లలో 52% మంది వై, జీ తరంవారే.ఇక ఓటర్ల మూలాలను పరిశీలిస్తే 31% మంది నల్ల జాతీయులు, 52% మంది లాటినోస్, 43% మంది ఏషియన్ అమెరికన్లు తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించు కున్నారు. మాజీ సైనికులు సైతం పెద్ద ఎత్తున తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 18–49 సంవత్సరాల మద్య ఉన్న దాదాపు 59% మంది మాజీ సైనికులు తమను తాము స్వతంత్ర ఓటర్లుగా చెప్పుకుంటున్నారు.పేరుకే స్వతంత్ర ఓటర్లు⇒ అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేసే ఈ స్వతంత్ర ఓటర్లపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సర్వేల్లో తమను తాము స్వతంత్ర ఓట ర్లుగా చెప్పుకునే వీరంతా నిజంగానే స్వతంత్ర ఓటర్లా? అన్న విషయంపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మీరు ఏ పార్టీ భావ జాలాన్నినమ్ముతున్నారన్నప్పుడు వీరిలో చాలామంది రిపబ్లికన్ లేదా డెమొక్రాట్ పార్టీకి మద్దుతుదారు లుగా తేలిందని కీత్ అనే అమెరికన్ పొలిటికల్ అనలిస్ట్ ‘ది మిత్ ఆఫ్ ఇండిపెండెంట్ ఓటర్’పుస్తకంలో వివరించడం గమనార్హం. చాలామంది తమను తాము ఇండిపెండెంట్ ఓటర్‌గా చెప్పుకున్నప్పటికీ ఏదో ఒక స్థాయిలో రాజకీయ పార్టీలతో అనుబంధం కలిగి ఉన్నారని పరిశోధనల్లో బయటపడింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో 10 శాతానికి మించి నిజమైన స్వతంత్ర ఓటర్లు లేరని అక్కడి రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.కొత్త అభ్యర్థుల వైపే వీరి మొగ్గుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త అభ్యర్థుల వైపే ఇండిపెండెంట్ ఓటర్లు ఎక్కు వగా మక్కువ చూపుతున్నా రని గణాంకాలు చెబుతు న్నాయి. 2008లో బరాక్ ఒబామా పోటీ చేసిన సందర్భంగా దాదాపు 54% స్వతంత్ర ఓటర్లు ఆయనకు ఓటువేశారు. 2016లో ట్రంప్‌కు 52% మంది ఇండిపెండెంట్ ఓటర్లు మద్దతు పలికారు. ఇక 2020లో జో బైడెన్‌కు అత్యధికంగా 56.5 శాతం మంది మద్దతు తెలిపారు.⇒ ఇండిపెండెంట్ ఓటర్లలో 75శాతం మంది ఓటర్లు తమ వ్యక్తిగతమైన ఆర్థిక స్థితిని ప్రభావితం చేయగల అంశాలే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. ⇒ 73 శాతం మంది నేరాలను అదుపు చేసేవారికే తమ ఓటు అని చెబుతున్నారు. ⇒ 63 శాతం మంది అమెరికా తన మిత్రదేశాల కోసం అత్యధికంగా ఖర్చు చేయడం సరికాదంటున్నారు. ⇒ 57 శాతం అబార్షన్ హక్కులే తమ ప్రాధాన్యత అంటున్నారు⇒ 56 శాతం జాత్యహంకారం తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నారు. -
US Elections: ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేవారికే పట్టం
అమెరికాలో అధ్యక్ష పోరు మరింత రసవత్తరంగా మారింది. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తమ హోరాహోరీ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఓటర్లను తమ వైపునకు మళ్లించుకునేందుకు అన్ని చేస్తున్నారు. అయితే ఇంతలో మరో పరిణామం వెలుగు చూసింది.ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులకు స్పష్టమైన మెజారిటీ కనిపించడంలేదు. ఇది ‘అసోసియేటెడ్ ప్రెస్- ఎన్ఓఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్’ సర్వేలో వెల్లడయ్యింది. ఈ సంస్థ చేసిన సర్వే ప్రకారం, 10మంది ఓటర్లలో నలుగురు, డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించగలడన్నారు. మరోవైపు కమలా హారిస్ కూడా మెరుగ్గానే ఎకానమీని సరిదిద్దగలరని అంతే మంది తమ అభిప్రాయం తెలిపారు. ఈ సర్వేలో కొందరు అటు ట్రంప్, ఇటు కమలా ఇద్దరికీ మద్దతు పలకడం గమనార్హం.ఈ సర్వేలో వెల్లడైన అభిప్రాయాల ప్రకారం 10మంది ఓటర్లలో 8మంది ఓటర్లు, ఆరోగ్య సంరక్షణ, నేరాలు కన్నా ఎకానమీనే ప్రధాన సమస్యగా పరిగణిస్తున్నామని, వీటి పరిష్కారంలో ఉత్తమంగా ఉన్న అభ్యర్థలకే మద్దతిస్తామన్నారు. మూడింట ఒక వంతు మంది మాత్రమే జాతీయ ఆర్థిక వ్యవస్థ కొంతమేరకు బాగుందని అభిప్రాయడ్డారు. సర్వేలో పాల్గొన్న ఓటర్లలో సగం మందికిపైగా ఆరోగ్య సంరక్షణ తమ ప్రధాన ప్రయారిటీగా పేర్కొన్నారు. మరికొందరు దేశంలో పెరుగుతున్న నేరాలు, ఇమ్మిగ్రేషన్, అబార్షన్ పాలసీ, గన్ పాలసీలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకొందరు వాతావరణ మార్పు, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ఓటర్లను ప్రభావితం చేస్తాయన్నారు. గాజాలో యుద్ధాన్ని ఎవరు సమర్థంగా నియంత్రిచగలుగుతారనే ప్రశ్నకు ఇద్దరికీ సమాన ఓట్లు రావడం విశేషం. ఇమ్మిగ్రేషన్ సమస్యను హారిస్ కంటే ట్రంప్ మెరుగ్గా నిర్వహిస్తారని కొందరు తెలిపారు.అమెరికాలో ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్ఠానికి చేరింది. ప్రజలు తమ నిత్యావసరాల ఖర్చులపై ఆందోళన చెందుతున్నారు. స్టాక్ మార్కెట్ లాభాల కన్నా ద్రవ్యోల్బణం విషయాన్నే ప్రజలు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రధాన అభ్యర్థులు కమల, ట్రంప్‌లకు దేశ ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దడంపై విభిన్న ఆలోచనలు ఉన్నాయి. కమలా హారిస్ తమ ప్రణాళికలన్నింటికీ పూర్తిగా బడ్జెట్ నుంచే నిధులు సమకూరుస్తామని చెబుతున్నారు. అయితే ట్రంప్ తమ ప్రణాళికల కోసం అవసరమైతే అప్పు చేసైనా ఆ ఖర్చును భర్తీ చేస్తామని చెబుతున్నారు. సంపన్నులకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా అభివృద్ధి జరుగుతుందని ట్రంప్ అంటున్నారు. దీంతో వారు మరిన్ని పెట్టుబడులు పెడతారని చెబుతున్నారు. నవంబర్ 5న జరగనున్నాయి.ఇది కూడా చదవండి: తైవాన్ విషయంలో చైనాపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు -
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి?
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 నవంబర్‌లో జరగనున్నాయి. తదుపరి ప్రెసిడెంట్‌ను ఎన్నుకునేందుకు అమెరికన్లు సిద్ధమవుతున్నారు. అమెరికా ఎన్నికలను ప్రపంచమంతా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపధ్యంలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? వారి పదవీకాలం ఎంత? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష బరి నుంచి జో బైడెన్ తప్పుకున్న నేపధ్యంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభ్యర్థిత్వం పార్టీ ముందుకు వచ్చింది. ఆమెకు డెమొక్రాట్లలో ఎవరూ పోటీగా నిలవలేదు. దీంతో ఆమె డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. కాగా అధ్యక్ష పదవికి మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. వీరిలో మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ కుటుంబానికి చెందిన రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ కూడా ప్రధానంగా నిలిచారు. అయితే ఆయన ఆగస్టు చివరిలో తన ప్రచారాన్ని విరమించి, ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. డెమొక్రటిక్ పార్టీ అనేది ఉదారవాద రాజకీయ పార్టీ. పౌరహక్కుల పరిరక్షణ, విస్తృత సామాజిక భద్రత, వాతావరణ మార్పులు తదితర అంశాలు ఈ పార్టీ అజెండాలో ఉన్నాయి.రిపబ్లికన్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 నవంబర్ 5 న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించినవారు 2025 జనవరి నుండి నాలుగు సంవత్సరాలు అమెరికాను పరిపాలించనున్నారు. రాష్ట్ర ప్రైమరీలు, కాకస్ అని పిలిచే ఓటింగ్ విధానం ద్వారా రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను నామినేట్ చేస్తాయి. ఎన్నికలలో పార్టీకి నాయకత్వం వహించాలనుకునే అభ్యర్థులను పార్టీ సభ్యులు ఎన్నుకుంటారు. రిపబ్లికన్ పార్టీలో మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంతో దీనిలో విజయం సాధించారు. విస్కాన్సిన్లోని మిల్వాకీలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన అధికారిక రిపబ్లికన్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ పార్టీ అనేది కన్జర్వేటివ్ రాజకీయ పార్టీ. దీనిని జీఓపీ అంటే గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని పిలుస్తారు. స్వల్ప పన్నులు, ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించడం, తుపాకీ హక్కులు, వలసలు, అబార్షన్లపై ఆంక్షలు మొదలైన అంశాలు ఈ పార్టీ అజెండాలో ఉన్నాయి.విజేతల ఎంపిక ఇలా..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన వారు విజేతలు కాలేరు. దీనికి బదులుగా అభ్యర్థులు మొత్తం 50 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు పోటీ పడాల్సి ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో జనాభా ఆధారంగా నిర్దిష్ట సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉంటాయి. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో కనీసం 270 లేదా అంతకుమించి సాధించినవారు విజేతలుగా నిలుస్తారు. రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థికి ఆ రాష్ట్ర ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లన్నీ లభిస్తాయి. చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఎటు మొగ్గు చూపుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. అక్కడ ఇరు పార్టీలకు ఓట్లు వేయవచ్చు. వీటిని స్వింగ్ రాష్ట్రాలని పిలుస్తారు. అభ్యర్థులు ఈ రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టిసారిస్తారు. ఒక అభ్యర్థి ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో మెజార్టీ సాధించడంలో విఫలమై, మొత్తంగా ఎక్కువ ఓట్లు సాధించినా (2016లో హిల్లరీ క్లింటన్‌లా) ఎన్నికలలో గెలవలేరు. అంటే ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో మెజార్టీ సాధించడమే కీలకమనేది ఇక్కడ గుర్తించాలి.అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలి ప్రత్యేక అధికారాలుసాధారణంగా ఎన్నికలు జరిగిన రోజు రాత్రే విజేతను ప్రకటిస్తారు. కానీ 2020లో మొత్తం ఓట్లను లెక్కించడానికి కొన్నిరోజుల సమయం పట్టింది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జనవరిలో వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనం మెట్లపై జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కొన్ని చట్టాలను సొంతంగా ఆమోదించే అధికారం అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలికి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రపంచ వేదికపై అమెరికాకు ప్రాతినిధ్యం వహించేందుకు, విదేశాంగ విధానాన్ని అమలు చేసేందుకు ప్రెసిడెంట్‌కు గణనీయమైన స్వేచ్ఛ ఉంటుంది.ఇంకెవరు ఎన్నికవుతారు?ఓటర్లు అమెరికా అధ్యక్షనితో పాటు దేశం కోసం చట్టాలను రూపొందించే కాంగ్రెస్ కొత్త సభ్యులను కూడా తమ ఓటు ద్వారా ఎన్నుకుంటారు. కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభ, సెనేట్ అనే రెండు సభలు ఉంటాయి. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులుంటారు. ప్రస్తుతం రిపబ్లికన్లు సభను నియంత్రిస్తున్నారు. ఇది వ్యయ ప్రణాళికలను నిర్వహిస్తుంది. ప్రభుత్వంలో కీలక నియామకాలపై ఓటు వేసే సెనేట్‌లో డెమొక్రాట్లు ఇన్చార్జ్గా ఉన్నారు. ఈ రెండు సభలు చట్టాలను ఆమోదిస్తాయి. రెండు సభలలో నియంత్రణ పక్షం ప్రెసిడెంట్‌తో విభేదిస్తే వైట్‌హౌస్ ప్రణాళికలను అడ్డుకోవచ్చు. అమెరికా పౌరులై ఉండి, 18 ఏళ్లు నిండిన వారు అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు. ఇది కూడా చదవండి: యూఎస్ పౌరులను చంపిన వలసదారులకు మరణ శిక్ష: ట్రంప్ -
‘టారిఫ్’పై ట్రంప్‌కే ఓటు
వాషింగ్టన్: అగ్రరాజ్యాన్నీ అప్పుల భారం వెన్నాడుతోంది. దాంతో దేశ అప్పుల భారాన్ని తగ్గించే నేతకు అమెరికా ఓటర్లు జై కొడుతున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌తో పోలిస్తే విదేశీ వస్తువులపై అధిక పన్నులు వేసి అమెరికా రుణ భారాన్ని తగ్గిస్తానన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఎక్కువ మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నట్లు తాజాగా రాయిటర్స్/ఇప్సోస్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఇప్పటికే దేశ అప్పు ఏకంగా 35 లక్షల కోట్ల డాలర్లు దాటిపోయింది. పన్నులు పెంచుకుంటే ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పాత అప్పులను తీర్చుతుందనే భావనతో ఓటర్లు ట్రంప్ వైపు మొగ్గుచూపుతన్నారని సర్వే పేర్కొంది. ‘‘ఎగుమతులపై 10 శాతం పన్నులు విధిస్తానని, చైనా ఉత్పత్తులపై 60 శాతం దిగుమతి పన్ను విధిస్తానని హామీ ఇచి్చన ట్రంప్‌కు 56 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. ఈ విషయంలో హారిస్ వైపు నిల్చున్న ఓటర్లు కేవలం 41 శాతం’’ అని సర్వే పేర్కొంది. పలు సర్వేల్లో హారిస్ ఆధిక్యతలో ఉన్నా ఏడు స్వింగ్ రాష్ట్రాలే విజేతను నిర్ణయిస్తాయని సర్వే అభిప్రాయపడింది. -
Jammu and Kashmir: కింగ్‌మేకర్‌గా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు
జమ్ముకశ్మీర్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వు చేసిన 16 స్థానాలు కింగ్‌మేకర్ పాత్రను పోషించనున్నాయి. వీటిలో షెడ్యూల్డ్ కులానికి చెందిన ఏడు సీట్లు, షెడ్యూల్డ్ తెగకు చెందిన తొమ్మిది సీట్లు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌పై ఈ వర్గానికి చెందిన ఓటర్లలో ఉత్సాహం నెలకొంది.జమ్ముకశ్మీర్‌లోని ఈ 16 స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెండుగా అవకాశాలుంటాని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, బీజేపీ ఖాతాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎన్సీ ఖాతాలో ఏడు, కాంగ్రెస్ ఖాతాలో రెండు, అప్నీ పార్టీ ఖాతాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాయి. 16 రిజర్వ్డ్ సీట్లలో 13 జమ్మూ డివిజన్లో ఉండగా, మూడు కాశ్మీర్లో ఉన్నాయి. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆరింటిలో, కాంగ్రెస్‌కు ఒక చోట ఆధిక్యం లభించింది. ఎస్టీలకు రిజర్వ్ చేసిన తొమ్మిది స్థానాల్లో, బీజేపీ అభ్యర్థులు ఏడు స్థానాల్లో, ఎన్సీ ఒకదానిలో, కాంగ్రెస్ ఒకదానిలో ఆధిక్యం దక్కించుకుంది.తొలిసారిగా ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన కారణంగా ముఖ్యంగా రాజోరి-పూంచ్ జిల్లాలో ఇప్పుడున్న సమీకరణలు మారిపోయాయి. దీంతో ఈ ప్రాంతంలో పహారీ, గుజ్జర్ వర్గాల వారికి అధికారం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీర్లో కూడా మూడు సీట్లు ఎస్టీకి రిజర్వ్ చేశారు. ఇక్కడ పహారీ, గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు స్థానాలనూ ఎన్సీ కైవసం చేసుకుంది. -
ఓటర్లపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనుచిత వ్యాఖ్యలు.. బాబు వెకిలి నవ్వులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్‌రాజు.. పొంతన లేని వ్యాఖ్యలతో ఇటు సొంత పార్టీలోనూ, అటు ఇతర పార్టీల్లోనూ తరచూ నానుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని పొగడుతారో? ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో? ఆయనకే తెలియదన్న పేరు గడించారు. వివాదాస్పద ప్రకటనలతో పార్టీలోనూ గందరగోళం సృష్టిస్తుంటారు. తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రసంగిస్తూ ఏపీ ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఓటర్లను అవమానించారు. వైఎస్సార్సీపీకి ఓటేసిన వాళ్లు అన్నం తినేవాళ్లేనా? అంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రజలను కించపరిచేలా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతున్నా..సభా నాయకుడిగా చంద్రబాబు స్పందించకపోగా వెకిలి నవ్వు నవ్వడంపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రపంచంలోనే ఎత్తయిన పోలింగ్ స్టేషన్లో ఓట్ల పండుగ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పోలింగ్ స్టేషన్ హిమాలయాల శిఖరాలపై 15,256 అడుగుల ఎత్తులోని తాషిగ్యాంగ్ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ప్రాంతంలో మొబైల్ కనెక్టివిటీ కూడా లేదు. అయినా ఇక్కడ ఎన్నికలను నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.భారత్-చైనా సరిహద్దుకు సమీపంలోని స్పితి వ్యాలీ.. హిమాచల్‌లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది మండీ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై బీజేపీ నుంచి నటి కంగనా రనౌత్ పోటీకి దిగారు.తాషిగ్యాంగ్‌లో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ బూత్‌లో 62 మంది ఓటు వేయనున్నారు. తాషిగ్యాంగ్‌లో పోలింగ్ నిర్వహించడం ఇది నాలుగోసారి. అదనపు జిల్లా కమిషనర్ జైన్ మాట్లాడుతూ 2022లో విపరీతమైన చలి ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి చెందిన అర్హులైన ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. -
ఓటెత్తిన చైతన్యం.. గడచిన 4 దశల్లో 2019 కన్నా అత్యధికంగా పోలైన ఓట్లు
దేశంలో ఇప్పటివరకూ లోక్‌సభకు జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం వెల్లువెత్తింది. 2019లో జరిగిన నాలుగు దశల ఎన్నికలతో పోలిస్తే ఈ సారి(పోస్టల్ బ్యాలెట్లు మినహాయించి) 1.9 కోట్ల మంది ఓటర్లు పెరిగినట్టు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది. సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 2019 నాలుగు దశల్లో 42.6 కోట్ల మంది ఓటేస్తే ఈసారి నాలుగు దశల్లో 45.1 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 2.5 కోట్ల మంది ఓటర్లు పెరిగినట్లు ఎస్బీఐ స్పష్టం చేసింది. 4 దశల్లో పెరిగిన ఓటర్లలో మహిళా ఓటర్లే 93.6 లక్షల మంది ఉండగా పురుష ఓటర్లు 84.7 లక్షల మంది ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. 2019 కంటే 2024లో అత్యధికంగా ఓట్లు వేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 19.5 లక్షల ఓట్లతో నాలుగో స్థానంలో ఉంది. కర్నాటకలో అత్యధికంగా 35.5 లక్షల ఓటర్లతో తొలి స్థానంలో, తెలంగాణలో 31.9 లక్షల ఓటర్లతో రెండో స్థానంలోనూ, మహారాష్ట్ర 20 లక్షల ఓటర్లతో మూడో స్థానంలో ఉన్నట్లు నివేదికలో వివరించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసిన వారి కన్నా 2024లో కేరళలో 5.3 లక్షల ఓటర్లు తగ్గారని, మణిపూర్‌లో 3.4 లక్షల ఓటర్లు తగ్గినట్టు ఎస్బీఐ నివేదిక తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలే మహిళా ఓటింగ్ పెరగడానికి దోహదపడిందని వివరించింది. ఏపీలో 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఈ సారి ఎన్నికల్లో 8.4 లక్షల మహిళా ఓటర్లు అధికంగా ఓటు వేసినట్టు తెలిపింది. -
మోదీ గ్యారంటీలా? కేజ్రీ పథకాలా?.. ఢిల్లీ జనం మదిలో ఏముంది?
ఢిల్లీ ఎన్నికల పోరు ఎంతో ఆసక్తికరంగా మారింది. ఒకవైపు బీజేపీ తరపున ప్రధాని మోదీ గ్యారంటీల హామీలనిస్తుండగా, మరోవైపు సీఎం కేజ్రీవాల్ పలు పథకాల అమలుకు హామీలు గుప్పిస్తున్నారు. ప్రజా సంక్షేమం, దేశ ప్రయోజనాలతో కూడిన ఈ హామీలతో వారు ఓటర్ల మనసు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.గత ఏడాది జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లపై మోదీ గ్యారంటీ హామీల ప్రభావం కనిపించింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరపున ప్రధాని మోదీ చేస్తున్న హామీలు ప్రజలకు ఆకట్టుకునేలా ఉన్నాయి.న్యూఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె తన ప్రచారంలో మోదీ హామీలను అధికంగా ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు తనను ప్రజా ప్రతినిధిగా ఎన్నుకుంటే మోదీ హామీలను నెరవేరుస్తారని చెబుతున్నారు. ఇక గతంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హామీ పథకాలు ఆ పార్టీకి అసెంబ్లీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ సాధించిపెట్టాయి. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ కేజ్రీవాల్ హామీలను ఢిల్లీ ఓటర్లు విశ్వసిస్తారనే నమ్మకంలో ఆ పార్టీ ఉంది.ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై జైలు నుండి బయటకు వచ్చాక నిర్వహిస్తున్న బహిరంగ సభలు, రోడ్ షోలలో తాము అమలు చేస్తున్న ఉచిత పథకాలను పదేపదే ప్రస్తావిస్తున్నారు. తాను అధికారంలో ఉన్నంత వరకు ఉచిత విద్యుత్, మంచినీరు, ఆరోగ్య సౌకర్యాల హామీని కొనసాగిస్తానని చెబుతున్నారు.ఆ మధ్య ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన భారత కూటమి ర్యాలీలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తన ప్రసంగంలో సీఎం తెలిపిన ఆరు హామీలను ప్రస్తావించారు. దాదాపు 50 రోజుల పాటు జైలులో ఉండి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఢిల్లీవాసులకు పది హామీలు ఇచ్చారు. వీటిలో ఉచిత విద్యుత్, ఆరోగ్య పథకాలతో పాటు చైనా ఆక్రమించిన భారత భూ భాగాన్ని స్వాధీనం చేసుకోవడంపై కూడా హామీనిచ్చారు. గతంలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కూడా బీహార్‌లో ఇటువంటి హామీలతోనే విజయం సాధించారు. మరి ఇప్పుడు జరుగుతున్న ఢిల్లీ పోరులో అక్కడి జనం అటు మోడీ గ్యారంటీలను నమ్ముతారో లేక ఇటు కేజ్రీవాల్ పథకాలను విశ్వస్తారో మే 25న జరిగే ఎన్నికల్లో నిర్ణయించనున్నారు. -
అయోధ్య ముస్లిం ఓటర్లు ఎటువైపు?
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈ రోజు (సోమవారం) లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఇటీవలే ఇక్కడే నూతన రామాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ముస్లిం ఓటర్లు వివిధ పార్టీలు, నేతలపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. తమది ‘మందిరం-మసీదు’ సమస్య కాదని, ఉపాధి- అభివృద్ధికే తమ మొదటి ప్రాధాన్యత అని వారు చెబుతున్నారు.రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో కీలక ప్రాత్ర పోషించిన ఇక్బాల్ అన్సారీతో సహా కొంతమంది ముస్లింలు అయోధ్య అభివృద్ధి క్రెడిట్‌ను బీజేపీకి ఇచ్చారు. అన్సారీ మీడియాతో మాట్లాడుతూ ‘ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ నేతలు దేవుడిని స్మరించుకుంటారు. కానీ ప్రజలు మాత్రం ఆరోగ్యం, విద్యా సౌకర్యాలు, భద్రతను కోరుకుంటారు. అయోధ్యలో బీజేపీ అభివృద్ధి పనులు చేసింది. అందుకే బీజేపీకి ప్రజాదరణ దక్కింది. పోలింగ్ రోజున తప్పకుండా ఓటు వేస్తాను’ అని ఆయన తెలిపారు.ముస్లిం మహిళలు బీజేపీ వెంటే ఉన్నారని బీజేపీ నేత అష్ఫాక్ హుస్సేన్ పేర్కొన్నారు. స్థానికుడు బబ్లూ ఖాన్ మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలకు బీజేపీ మంచి పరిష్కారం చూపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలోనూ బీజేపీ సమర్ధవంతంగా వ్యవహరించింది. ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలోని రుదౌలీ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పెద్ద సంఖ్యలో ముస్లింలకు ఇళ్ల కేటాయింపు జరిగింది. అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధిపై స్థానికులు సంతృప్తిగా ఉన్నారు. ఫైజాబాద్‌కు చెందిన ప్రస్తుత బీజేపీ ఎంపి లల్లూ సింగ్ మూడవసారి గెలుస్తారని బబ్లూ ఖాన్ పేర్కొన్నారు.మందిరం-మసీదులపై ప్రజలకు ఆసక్తి లేదని, యువతకు ఉద్యోగాలు కావాలని స్థానికుడు మహ్మద్ అమీర్ పేర్కొన్నారు. మాకు ఉద్యోగం కావాలి. మందిరం-మసీదు అనేవి మా ఇంటికి ఉపయోగపడవు. తాను ముస్లింను అయినందున ఇలా అనడం లేదని, ఒక నిరుద్యోగిగా తన ఆవేదన చెబుతున్నానని అన్నారు. ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీకే ఓటేస్తానని అమీర్ తెలిపారు. -
సంక్షేమం వైపే కడప ఓటరు..
అవసరానికోపార్టీ.. అధికారం కోసం మరో పార్టీ ఇలా విలువల్లేని రాజకీయనేతలకు ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? ప్రజలు కమిట్మెంట్తో పనిచేసిన నేతలకి కమిట్ అయ్యారా? కండువాలు మార్చిన కూటమితో కలిశారా? కడపజిల్లాలో ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోంది ?తొలి నుంచి వైఎస్ కుటుంబానికి అడ్డాగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో ఈసారి మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని చంద్రబాబు కూటమి భావించింది. అందుకు తగ్గట్టే కుట్రలు, ఎత్తులు వేసింది. అప్పటికప్పుడు కండువాలు మార్చిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో పది స్దానాల్లో కూటమి అభ్యర్థులు బరిలో నిలవగా, అందులో ఒక స్దానంలో జనసేన, రెండు స్దానాల్లో బీజేపీ అభ్యర్దులు, మిగిలిన ఏడు చోట్ల టీడీపీ అభ్యర్దులు పోటీలో నిలిచారు. అయితే జనసేన, బీజేపీకి జిల్లాలో కనీస క్యాడర్ కూడా లేదు. టీడీపీ క్యాడర్‌ను నమ్ముకుని అభ్యర్థులకు కండువాలు మార్చి పోటీలో నిలబెట్టారు. బద్వేలులో మాజీ ఇరిగేషన్ అధికారి రోషన్న ముందుగా టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాటకీయ పరిణామాల వల్ల ఆయన బీజేపీ కండువా కప్పుకొని పోటీ చేశారు. ఆఖరి నిమిషంలో జరిగిన ఈ మార్పులు ఆయనకు శాపంగా మారాయి.ఇటు టీడీపీ అటు బీజేపీ శ్రేణులు ఎవరికి వారు రోషన్నకు సహకరించకపోవడం మైనస్‌గా మారింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్ది డాక్టర్ సుధకు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు బీజేపీ అభ్యర్థి రోషన్న. దీంతో బద్వేలులో ఓటమి ఖాయమని కూటమి కూడా డిసైడైపోయింది. ఇక ఫ్యాక్షన్ నియోజకవర్గమైన జమ్మలమడుగులో ఆది నారాయణరెడ్డి ఫ్యామిలీలోని విభేదాలు కూడా కూటమికి చేటు తెచ్చాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. జమ్మలమడుగు టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న భూపేష్ రెడ్డికి అసెంబ్లీ టిక్కెట్ కేటాయించారు చంద్రబాబు. అయితే బీజేపీ తరపున ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఆదినారాయణరెడ్డి పట్టుబట్టడంతో బాబు కాదనలేకపోయారు. దీంతో కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అబ్బాయి భూపేష్‌కి ఎంపీ టిక్కెట్ ఇచ్చి బుజ్జగించారు. అయితే ఆదినారాయణ రెడ్డికి ఆశించినస్థాయిలో అబ్బాయి నుంచి కానీ టీడీపీ శ్రేణుల నుంచి సహకారం రాకపోవడంతో జమ్మలమడుగులో కూడా కూటమి ఆశలు గల్లంతేనన్న టాక్ వినిపిస్తోంది.ఉమ్మడి కడపజిల్లాలో మరో కీలక నియోజకవర్గం రైల్వే కోడూరు. జనసేన తొలుత ఇక్కడ యనమల భాస్కరరావు పేరుని ప్రకటించింది. అయితే అనూహ్యంగా తెరపైకి అరవ శ్రీధర్ పేరు వచ్చింది. టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన అరవ శ్రీధర్‌కు మాత్రమే కాదు అసలు ఇక్కడ జనసేనకు సరైన క్యాడరే లేదు. దీంతో ఈ నియోజకవర్గంలోనూ మరోసారి వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి.కేంద్రంలో బీజేపీ మద్దతు, వైఎస్ఆర్సీపీకి మించిన సంక్షేమపథకాలనిస్తామని చేసిన హామీలతో ఈసారి గెలుపు ఖాయమని అటు చంద్రబాబు ఇటు పవన్ కల్యాణ్ ఎగిరెగిరి పడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అంతకుమించి సీఎం వైఎస్ జగన్‌పై తప్పుడు ప్రచారాలతో ఎన్నికల్లో హంగామా చేశారు. ఈ స్టంట్లు చూసి వినోదం అందుకున్న ప్రజలు మాత్రం విజ్ఞానంతో ఆలోచించి మరోసారి సీఎం జగన్‌కే మద్దతుగా నిలిచారని పోలింగ్ సరళిని చూసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారీ ఓటింగ్‌తో సంక్షేమపాలన కొనసాగాలని ప్రజలు కోరుకున్నారని వారు చెబుతున్నారు. -
ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
సాలూరు: ఈ సారి ఎన్నికల్లో కొటియా గ్రూప్ గ్రామాల ఓటర్లు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓటేయగలిగారు. అధికారుల దౌత్యం ఫలించడంతో ఆంధ్రా, ఒడిశా వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల ప్రజలు పోలింగ్‌కు ఓటెత్తారు. ఆంధ్రా, ఒడిశా వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల ప్రజలకు ఇటు ఆంధ్రా, అటు ఒడిశా రాష్ట్రాల్లో రెండు చోట్లా ఓటు హక్కు ఉంది. గత ఎన్నికల్లో వారిని ఒడిశా అధికారులు, పోలీసులు అడ్డుకుని తమ రాష్ట్రంలోనే అధికంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చేశారు. ఈ క్రమంలో ఈ గ్రామాల ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆంధ్రా వైపు రాకుండా బారికేడ్లు వేసి మరీ ఒడిశాలోనే ఓట్లు వేయించేలా అధికారులు అప్పట్లో ప్రయత్నాలు చేశారు. ఇప్పటి సార్వత్రిక ఎన్నికల్లోనూ దాదాపు అటువంటి పరిస్థితులే పునరావృతమయ్యే అవకాశాలు కనిపించాయి. ఫలించిన అధికారుల ముందుచూపు... కొటియా గ్రూప్ గ్రామాల ఓటర్లు ఆంధ్రాలో ఓటు వేసేందుకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిం చాలని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతంలో ఆంధ్రా, ఒడిశాలకు సమాన హక్కులు ఉన్నాయని, ఒడిశా అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారని ఆయన పేర్కొంటూ... ఆంధ్రా అధికారులను అడ్డుకుంటున్నారన్న విషయాలను, ఆయా గ్రామాల పరిస్థితులను వివరిస్తూ ఎన్నికల కమిషన్‌కు, ఎన్నికల అధికారులకు లిఖిత పూర్వకంగా లేఖ రాశారు. ఈ ఓటర్లు ప్రశాంతంగా ఓట్లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎన్నికల అధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారుల దృష్టికి తీçÜుకువెళ్లారు. ఈ క్రమంలో కొటియా గ్రూప్ గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించారు. అటు ఒడిశా, ఇటు ఆంధ్రా అధికారులు ఈ గ్రామాలపై చర్చించి ఇరు రాష్ట్రాల్లోను కొటియా గ్రూప్ గ్రామాల ఓటర్లు ఓట్లు వేసే వెసులుబాటు కల్పిం చేలా నిర్ణయం తీసుకున్నారు. ఎవరికి ఏ రాçÙ్ట్రం నుంచీ ఇబ్బందులు కలిగించకుండా చర్యలు తీసుకున్నారు. పోటెత్తిన ఓటర్లు.. గంజాయిభద్ర, పట్టుచెన్నేరు, పగులుచిన్నేరు, సారిక, కురుకూటి పంచాయతీల్లో 21 కొటియా గ్రూప్ గ్రామాల్లో సుమారు 3,600 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో సుమారు 2,200 మంది ఆంధ్రాకు చెందిన నేరెళ్లవలస, శిఖపరువు, సారిక, తోణాం తదితర పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆంధ్రాలో ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత ఒడిశాలోనూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పలువురు ఓటర్లు ఆ రాష్ట్రానికి వెళ్లారు. -
నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
ఎన్టీఆర్, సాక్షి: సొంత ఊళ్లకు వెళ్లి ఓట్లేసిన ఏపీ ఓటర్లు.. తిరిగి తెలంగాణ బాట పట్టారు. దీంతో హైదరాబాద్ వచ్చే రహదారుల్లో వాహనాల రద్దీ నెలకొంది. సోమవారం సాయంత్రం ఉదయం నుంచే ఇది మొదలుకాగా.. మంగళవారం ఉదయానికి అది మరింతగా పెరిగింది.ఆంధ్రా నుంచి పెద్ద ఎత్తున్న ఓటర్లు తిరిగి తెలంగాణకు వస్తున్నారు. కార్లు, బస్సులు.. ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు. పతంగి టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చినట్లు ఒక అంచనా. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్గేట్ వద్ద సాధారణంగా 24 గంటల వ్యవధిలో 20 వేలకు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తుంటాయి. అయితే.. సోమవారం మాత్రం సాయంత్రం 6.30 గంటలకు వీటి సంఖ్య 35 వేలకు పైగా చేరింది. ఈ ఉదయం ఆ రద్దీ అంతకంతకు పెరుగుతోంది.ఇక.. ఏపీలో పోలింగ్ కోసం ఓటర్లు పోటెత్తారు. సోమవారం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఓటేశారు. సాయంత్రం సైతం క్యూ లైన్లలో చాలామంది వేచి ఉండడం గమనార్హం. ఏపీలో భారీగా పోలింగ్ జరిగిందని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించగా, కడపటి వార్తలు అందేసరికి అది 78.36 శాతంగా నమోదు అయినట్లు తెలుస్తోంది. పోలింగ్ శాతం ఇంకా ఎక్కువే నమోదు కావొచ్చని సీఈవో ఎంకే మీనా ఆశాభావం వ్యక్తం చేశారు. -
పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
నల్లజర్ల/మండపేట/ఆవులవారిపాలెం(క్రోసూరు): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలోని పలు పోలింగ్ బూత్‌లలో సిబ్బంది తమ ఇష్టానుసారం వ్యవహరించారు. ఈవీఎంల ద్వారా ఓటు వేయడంపై అవగాహనలేని ఓటర్లకు సహకారం అందించేందుకు వెళ్లి ఓటర్లు చెప్పినవారికి కాకుండా తమకు నచ్చినవారికి ఓట్లు వేశారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం సుభద్రపాలెంలోని 127వ నంబర్ పోలింగ్ బూత్‌లో దివ్యాంగురాలు బిరుదుగడ్డ నందెమ్మ ఓటు వేసేందుకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్ సహాయం కోరారు. తాను చెప్పిన పార్టీకి ఓటు వేయకుండా అంగన్వాడీ టీచర్ సైకిల్, కమలం గుర్తులకు ఓటు వేసినట్లు నందెమ్మ గుర్తించి, బయటకు వచ్చి అధికారులకు తెలియజేశారు. అంగన్వాడీ టీచర్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తంచేసి ఆమెను విధులు నిర్వర్తించకుండా బయట కూర్చోబెట్టారు. ఇదేవిధంగా తెలికిచెర్ల గ్రామంలోని 166వ నంబర్ పోలింగ్ బూత్‌లో పీవోగా విధులు నిర్వర్తిస్తున్న జానకి కూడా పలువురికి సహాయంగా వెళ్లి సైకిల్, కమలం గుర్తులకు ఓట్లు వేశారు. ఈ బూత్‌లో పదిలం సరోజ, గోపిశెట్టి సూర్యకుమారి, తుమ్మల భాగ్యవతి తదితరులు ఓటు వేయడానికి పీవో సహాయం కోరారు. వారు చెప్పినట్లు కాకుండా ఆమె టీడీపీకి, బీజేపీకి ఓట్లు వేసినట్లు ఆ ఓటర్లతోపాటు ఏజెంట్లు గమనించారు. ఈ విషయాన్ని వారు బయటకు వచ్చి స్థానికులకు వివరించడంతో పీవో జానకిని నిలదీశారు. దీంతో తప్పయిపోయిందని ఒప్పుకున్న ఆమె... నాయకులను పక్కకు పిలిచి ‘పోయిన ఓట్లు భర్తీ చేసే విధంగా మీకు ఓట్లు వేయిస్తా’ అని నమ్మబలికారు. వారు ఒప్పుకోకపోవడంతో ప్లేటు ఫిరాయించి తనను ఒత్తిడి చేయడం వల్లే ఆవిధంగా ఒప్పుకున్నానని చెప్పారు. దీనిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఆమె స్థానంలో సెక్టోరియల్ అధికారి వై.సత్యనారాయణను అక్కడ పీవో విధులకు నియమించారు. పీవో జానకిని పోలీసులు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఉదయం నుంచి పీవో జానకి ఇదేవిధంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రిసైడింగ్ అధికారిపై కలెక్టర్‌కు వృద్ధుడు ఫిర్యాదు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని రావులపేట రావులచెరువు గట్టు వద్ద తొమ్మిదో నంబర్ సచివాలయంలో ఉన్న పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ అధికారిపై ఓ వృద్ధుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ బూత్‌లో ఓటు వేసేందుకు గోకరకొండ సత్యనారాయణ(70) తన మనవడి సాయంతో వెళ్లారు. ప్రిసైడింగ్ అధికారి పీఎన్‌వీవీ సత్తిబాబు జోక్యం చేసుకుని సత్యనాయణ మనవడిని బయటకు పంపించారు. అనంతరం సత్యనారాయణ వేలితోనే రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై సత్తిబాబు నొక్కించారు. తాను ఫ్యాన్ గుర్తుకు వేయమంటే సైకిల్‌కు ఎందుకు మీట నొక్కించారని సత్యనారాయణ ప్రశ్నించగా, ఆయన్ను బలవంతంగా బయటకు పంపివేశారు. ఈ విషయాన్ని ఆయన తన కుమారుడు గోకరకొండ ప్రసాద్‌కు తెలియజేయగా, రిటర్నింగ్ అధికారి ఎల్లారావుకు, జాయింట్ కలెక్టర్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.ఫ్యానుకు ఓటు వేయాలని చెబితే సైకిల్‌కు వేసిన ఓపీఓపల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఆవులవారిపాలెం పోలింగ్ బూత్‌లో వృద్ధుడు చిన్న అల్లీసా తన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాలని వోపీవో వెంకటరమణను కోరగా, ఆమె సైకిల్ గుర్తుపై వేశారు. వీవీ ప్యాట్‌లో సైకిల్ గుర్తు చూసిన వృద్ధుడు తీవ్ర ఆగ్రహానికి గురై వోపీవోపై తిరగబడ్డాడు. దాదాపుగా కర్రతో కొట్టేంత పనిచేశాడు. వైఎస్సార్సీపీ నాయకులు వచ్చి ఆమె చేసిన తప్పిదాన్ని సరిచేయాలని కొద్దిసేపు ఆందోళన చేశారు. ఆర్వోకు, ఏఆర్వోలకు ఫిర్యాదు చేశారు. అధికారులు మాత్రం స్పందించలేదు. -
TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్‌సభ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)లో నిక్షిప్తమైంది. రాత్రి 12 గంటల వరకు వేసిన అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 64.93 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచే వడివడిగా..: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. 13 మావోయిస్టు ప్రభావిత అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా అన్నిచోట్లా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. గడువు ముగిసే సమయానికల్లా పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. దీనితో సాయంత్రం 7 గంటల తర్వాత కూడా సుమారు 1,400 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగిందని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తలేదని వికాస్‌రాజ్ వివరించారు. 115 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో సమస్యలు వస్తే.. వాటిని మార్చామని తెలిపారు. కచ్చితమైన పోలింగ్ శాతంపై మంగళవారం స్పష్టత వస్తుందన్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడలేదన్నారు. వాతావరణం సహకరించడంతో.. రాష్ట్రంలో రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలతో వాతావరణం చల్లబడింది. దీనితో రోజంతా పోలింగ్ కొనసాగింది. ఉదయమే వడివడిగా ప్రారంభమై రోజంతా స్థిరంగా కొనసాగింది. ఉదయం 9 గంటల కల్లా 9.4 శాతం, 11 గంటలకు 24.31 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 40.38 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 52.34 శాతం, సాయంత్రం 5 గంటలకల్లా 61.16 శాతానికి, రాత్రి 12 గంటలకల్లా 64.93 శాతానికి పోలింగ్ పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 62.69 శాతం పోలింగ్ నమోదైంది, నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 71.97 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి గత లోక్‌సభ ఎన్నికలన్నా ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. వందల కొద్దీ ఫిర్యాదులు పోలింగ్ రోజైన సోమవారం నేషనల్ గ్రీవెన్స్ పోర్టల్‌కు 415, టోల్ ఫ్రీ నంబర్‌కు 21, సీ–విజిల్ యాప్ ద్వారా 225 ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నామని సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ రోజు జరిగిన వేర్వేరు ఘటనలకు సంబంధించి 38 కేసులు నమోదు చేశామన్నారు. ఇంకా కొన్ని ఫిర్యాదులపై పరిశీలన జరుగుతోందని, కేసుల సంఖ్య పెరగవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్ల గుర్తింపును తనిఖీ చేసే అధికారం అభ్యర్థులకు ఉండదని.. ఈ క్రమంలో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల గుర్తింపును తనిఖీ చేసిన ఓ అభ్యర్థి (బీజేపీ అభ్యర్థి మాధవీలత)పై కేసు నమోదు చేశామని చెప్పారు. జహీరాబాద్, నిజామాబాద్‌లలో జరిగిన ఘటనపై సైతం కేసులు పెట్టామన్నారు. ఎన్నికలకు సంబంధించి మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.330 కోట్ల నగదు, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నామని వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సాయుధ బలగాలతో తొలి అంచె, రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలతో రెండో అంచె, స్థానిక పోలీసులతో మూడో అంచె బందోబస్తు నిర్వహిస్తారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కాపలాగా పెట్టాలనుకుంటే.. వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ముగిసిన తర్వాత 45 రోజుల వరకు ఈ భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వాటిని సవాల్ చేస్తూ 45రోజుల్లోగా కోర్టులో ఎలక్షన్ పిటిషన్లు వేయడానికి అవకాశం ఉండటమే దీనికి కారణం. మళ్లీ బద్ధకించిన హైదరాబాదీలు! ఓటేసేందుకు హైదరాబాద్–సికింద్రాబాద్ జంటనగరాల ప్రజలు మళ్లీ బద్ధకించారు. రాత్రి 12 గంటలకు ప్రకటించిన పోలింగ్ శాతం అంచనాల మేరకు.. రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్ స్థానం పరిధిలో 46.08 శాతం పోలింగ్ నమోదైంది. తర్వాత సికింద్రాబాద్ పరిధిలో 48.11 శాతం, మల్కాజ్గిరి పరిధిలో 50.12 శాతం, చేవెళ్ల పరిధిలో 55.45 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అత్యధికంగా భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో 76.47 శాతం, జహీరాబాద్ పరిధిలో 74.54 శాతం పోలింగ్ నమోదయ్యాయి. అయితే హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారని.. దీనికితోడు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం పెంచడంతో.. ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని సీఈవో వికాస్‌రాజ్ పేర్కొన్నారు. నేడు ‘పరిశీలకుల’ఆధ్వర్యంలో ఈవీఎంల తనిఖీలు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్ అధికారులు ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని సంబంధిత రిసెప్షన్ కేంద్రంలో అందజేస్తారు. అక్కడ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రికి ప్రాథమిక పరిశీలన నిర్వహిస్తారు. ఫారం–17సీ, ఈవీఎం, వీవీ ప్యాట్స్‌ను పరిశీలించి చూస్తారు. మొత్తం ఓట్లు, పోలైన ఓట్లను సరిచూసుకుంటారు. అన్నీ సవ్యంగా ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాత ఎన్నికల పరిశీలకుడు ఈ అంశాలను ధ్రువీకరిస్తూ సంతకం చేస్తారు. తర్వాత ప్రిసైడింగ్ అధికారులను పంపించివేస్తారు. ఈవీఎంలను సంబంధిత నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తారు. కొన్నిచోట్లలోని రిసెప్షన్ కేంద్రాల్లోనే స్ట్రాంగ్ రూమ్‌లు ఉండగా.. మరికొన్ని చోట్ల వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. అలా ఉన్న చోట కేంద్ర బలగాల భద్రత నడుమ జీపీఎస్ సదుపాయమున్న వాహనాల్లో ఈవీఎంలను తరలించి భద్రపరుస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పోలింగ్ బృందాలు.. రిసెప్షన్ సెంటర్‌కు వచ్చి, అప్పగింత ప్రక్రియ పూర్తి చేసే సరికి.. మంగళవారం తెల్లవారుజాము 5 గంటల వరకు పట్టే అవకాశం ఉందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. తర్వాత మంగళవారం ఉదయం 11 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సాధారణ పరిశీలకులు ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి, ప్రిసైడింగ్ అధికారుల నుంచి వచ్చిన రిపోర్టులు, డైరీలను తనిఖీ చేసి అంతా సవ్యంగా ఉన్నట్టు నిర్ధారిస్తారని వివరించారు. ఏదైనా ప్రాంతంలో రిపోలింగ్ అవసరం ఉంటే.. అప్పుడే నిర్ణయం తీసుకుంటారని, ఇప్పటివరకు అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదని వెల్లడించారు. -
పోటెత్తిన ఓటర్లు: ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం పోటెత్తింది. ఉదయం ఆరు గంటల నుంచే వారు భారీ క్యూలైన్లలో వేచిఉండి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపించారు. గతంలో ఎన్నడూలేని విధంగా సంక్షేమ పథకాల కొనసాగింపునకు మద్దతుగా మహిళలు, వృద్ధులు పెద్దఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురుమదురు సంఘటనలు తప్ప రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని, ఎక్కడా రీపోలింగ్ అవసరం ఏర్పడలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా సోమవారం సాయంత్రం ప్రకటించారు.తొలిసారి ఓటర్లు, వృద్ధులు పెద్దఎత్తున పోలింగ్‌లో పాల్గొన్నారని, దీంతో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. సా.6 గంటల దాటిన తర్వాత కూడా 3,500 పోలింగ్ స్టేషన్లలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, రాత్రి 8.30 గంటలకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగిసిందని మీనా తెలిపారు. మరో 360 పోలింగ్ స్టేషన్లలో రాత్రి 10.30 గంటల వరకు పోలింగ్ కొనసాగిందన్నారు. దీంతో తుది పోలింగ్ శాతం మంగళవారం ప్రకటిస్తామని, సాయంత్రం ఐదు గంటలకు 68.04 శాతం నమోదైందని మీనా తెలిపారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, గాలివాన బీభత్సాలతో పోలింగ్ మందకొడిగా సాగిందన్నారు.చెదురుమదురు సంఘటనలుఇక రాష్ట్రంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు, రీపోలింగ్ లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం గత కొన్ని నెలలుగా చేసిన కసరత్తు సత్ఫలితాలిచి్చందని మీనా చెప్పారు. పల్నాడు, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతాయన్న భావనతో ముందస్తు భద్రత ఏర్పాట్లు చేశామని.. దీంతో సంఘటన జరిగిన వెంటనే స్పందించి వాటిని అదుపులోకి తెచ్చామన్నారు. ఈ సంఘటనలకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారన్నారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 11 ఈవీఎంలను ధ్వంసం చేయగా వాటిని భెల్ అధికారులు పరిశీలించి అందులోని డేటా సురక్షితంగా ఉందని నిర్థారించడంతో రీపోలింగ్ అవసరంలేకుండా కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ను కొనసాగించినట్లు తెలిపారు.కౌంటింగ్ సమయంలో ఈ రెండు ఈవీఎంల డేటాను పరిగణనలోకి తీసుకుంటారని మీనా స్పష్టంచేశారు. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 12 హింసాత్మక సంఘటనలు జరిగాయన్నారు. తెనాలి, నరసరావుపేటల్లో ఎమ్మెల్యేలను.. అనంతపురంలో ఇరుపార్టీల అభ్యర్థులను గృహనిర్భందం చేయడం ద్వారా ఉద్రిక్త వాతావరణాన్ని నియంత్రించినట్లు ఆయన తెలిపారు. ఇక పుంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను వదిలేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. పీలేరులో ఏజెంట్ల కిడ్నాప్ విషయం దృష్టికి రాగానే పోలీసులు రంగం ప్రవేశంచేసి వారిని తీసుకొచ్చి పోలింగ్ కొనసాగించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. మంగళవారం పోలింగ్ పరిశీలకులు, రాజకీయ పార్టీలతో 17ఏ స్రూ్కటినీ పూర్తయిన తర్వాత రీ–పోలింగ్‌పై ఒక స్పష్టత వస్తుందని మీనా చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్న ఈవీఎంలుఇక ఎన్నికల ప్రక్రియ పూర్తియిన చోట్ల ఈవీఎం మిషన్లను పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చినట్లు మీనా తెలిపారు. కొన్నిచోట్ల 10.30 వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉండటంతో అక్కడ అర్థరాత్రి దాటిన తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకుంటాయన్నారు. ఈవీఎంలను రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చి ఆ తాళాలను సీఆర్పీఎఫ్ వారికి అందిస్తారన్నారు. 24 గంటలూ కెమెరాల పర్యవేక్షణలో స్ట్రాంగ్‌రూమ్‌లు ఉంటాయని, రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా అక్కడ 24 గంటలు కాపలాగా ఉండటానికి అనుమతిస్తామన్నారు.ఓటు హక్కు వినియోగించుకున్న మీనారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా సోమవారం ఉ.7.30కు తన ఓటు హక్కును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని రైల్వే ఫంక్షన్ హాల్లో వినియోగించుకున్నారు. -
Election 2024 Voters Selfie Photos: ఓటు హక్కు వజ్రాయుధం (ఫొటోలు)
-
Election 2024 Voters Selfie Photos: మన ఓటే మన భవిత.. కదలండి (ఫొటోలు)
-
ఓటర్లకు అల్పాహారం, ఐస్‌క్రీమ్
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్థానిక దుకాణదారులు వినూత్న ప్రయత్నం చేశారు. '56 దుకాణ్' దుకాణదారుల సంఘం ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లకు ఉచిత అల్పాహారం, ఐస్‌క్రీమ్‌లు అందించారు.నగరంలోని 56 దుకాణ్ మార్కెట్లోని దుకాణాల వద్ద అల్పాహారం తీసుకునేందుకు ఓటర్లు బారులు తీరి కనిపించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, దేవాస్, ఉజ్జయిని, మందసౌర్, రత్లాం, ధార్, ఖర్గోన్, ఖాండ్వాతో సహా ఎనిమిది పార్లమెంటు స్థానాలలో నాలుగో దశలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది."ఇండోర్ ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఓటింగ్‌లో కూడా మేము ప్రత్యేకంగా నిలుస్తాం. ఓటర్లకు ఉచితంగా అల్పాహారం అందించాం. తద్వారా వారు త్వరగా బయటకు వచ్చి ఓటు వేయవచ్చు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఇక్కడి ఓటర్లందరికీ పోహా, జిలేబీ వంటి ఇష్టమైన అల్పాహారాన్ని అందిస్తున్నాం" అని 56 దుకాణ్లోని షాప్ యజమాని శ్యామ్‌లాల్ శర్మ చెప్పారు. ఓటర్లలో అవగాహన పెంచి ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని ఆయన అన్నారు. -
ఓటేసి మా బాధ్యత పూర్తి చేశాం(ఫొటోలు)
-
మహిళలు ఓటు వేస్తున్నారా..! ఈ ఎన్నికల్లో మీదే కీలక తీర్పు..!
మహిళలే కదా అని తీసిపడేయకండి. వాళ్లకేం తెలుసు రాజకీయాలు అనే పరిస్థితి పోయింది. అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తూ తామేంటో ప్రూవ్ చేస్తున్నారు. ఇంతకమునుపు ఎన్నికల్లో మహిళలు ఓటు వేసింది తక్కువే. అంత అవగాహన, చదువు లేకపోవడం వంటి కారణాలతో ఓటు హక్కు వినియోగించలేకపోయేవారు చాలామంది. కానీ ఇటీవల జరిగిన తెలంగాణ, కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో మహిళా ఓటర్లే కీలకమని నివేదికలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో కీలక తీర్పే ఇచ్చేది 'ఆమె' అని తేలింది కూడా. ఎందుకంటే మహిళ ఓటర్లే అధికంగా ఉన్నట్లు సర్వేలు కూడా చెబుతున్నాయి. మరీ మహిళలు మీ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారా..!. ఈ రోజు సెలవురోజు అని సెల్ఫోన్లకు, టీవికి అతుక్కుపోవద్దు. ఓటు వేసి కుర్చీ ఎవరికి ఇవ్వాలన్నది నిర్ణయించండి. మహిళలంటే కేవలం ఇంటి భాద్యతలోనే కాదు అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాధికారంలోనూ భాగం అని నిరూపిద్దాం. మార్పులో భాగం అయ్యి, బంగారు భవిష్యత్తుకు బాటలు పరుద్దాం. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లో మహిళలు ఓటు హక్కు వినియోగించుకోమని చెబుతూ ఎలా అవగాహన కల్పించారో సవివరంగా చూ ద్దామా!. ఇటీవల కోయంబత్తూరులో వందమందికి పైగా మహిళలు కలిసి బ్రూక్‌ఫీల్డ్స్ మాల్ దగ్గర ఓటు ప్రాధాన్యతను చాటిచెప్పేలా ముగ్గులు వేశారు. అలానే చత్తీస్‌గఢ్‌లోని బాల్రామ్పుర్ జిల్లాలో స్వయం సహాయక మహిళా బృందాలు వినూత్న ప్రచారానికి నాంది పలికారు. ఏకంగా రావి ఆకుల తోపాటు పసుపు కలిపిన బియ్యాన్ని ఇంటింటికీ తిరిగి మరీ పంచిపెట్టి మరీ ఓటు హక్కును వినియోగించుకోమని అభ్యర్థించారు. తాజాగా కర్ణాటకలో మహిళా ఆఫీసర్లు సైతం ఓటింగ్ శాతం పెంచడం కోసం ‘చునావనా పర్వా- దేశదా గర్వ’ అంటే (ఎలక్షన్ పండుగ దేశానికే గర్వం) అని రాసి ఉన్న చీరలను ధరించి మహిళా ఓటర్లలో స్ఫూర్తి నింపారు. మహిళలే కదా వాళ్ల ఓటు హక్కు పడకపోతే ఈ సమాజానికి ఏముందిలే నష్టం అని తీసిపరేయకండి. ఎందుకంటే తాజాగా జరిగిన కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో మహిళా ఓటర్ల తీర్పే కీలమని తేలింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ సగానికి పైగా ఉంది మహిళా ఓటర్లే. అందువల్ల మహిళలు ప్రజాస్వామ్య అతిపెద్ద వేడుకలో భాగమయ్యి..ఒక్క సిరా గీతతో భవిష్యత్తుకు బంగారు బాటలు పరవండి. (చదవండి: హాట్‌టాపిక్‌గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!) -
AP People Casting Votes Photos: ఏపీ కోసం మేము సైతం అంటూ.. ఓటు వేసిన వృద్దులు, దివ్యాంగులు (ఫొటోలు)
-
తెలంగాణలో బారులు తీరిన ఓటర్లు (ఫొటోలు)
-
ఏపీలో పోటెత్తిన ఓటర్ (ఫొటోలు)
-
‘వుయ్ యాప్’పై కఠిన చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: టీడీపీకి చెందిన ‘వుయ్ యాప్’పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. ఈ యాప్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందన్నారు. డేటా చౌర్యంతో ఓటర్ల భద్రతకు ముప్పు కలిగిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం ‘వుయ్ యాప్’పై ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకే టీడీపీ ప్రత్యేకంగా ‘వుయ్ యాప్’ను రూపొందించిందన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ అభ్యర్థులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఇప్పటికే టీడీపీ వుయ్ యాప్ ద్వారా అక్రమాలకు పాల్పడుతోందని ఎన్నికల సంఘం, డీజీపీలకు వైఎస్సార్సీపీ ఈ–మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయినా సరే ఆ యాప్ పేరిట టీడీపీ అక్రమాలు కొనసాగుతుండటంతో ఒంగోలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకాశం జిల్లా ఎస్పీకి, బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేశ్ బాపట్ల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.. ⇒ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టం, ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా టీడీపీ ‘వుయ్ యాప్’ను రూపొందించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోంది. ⇒ నియోజకవర్గాలవారీగా ఓటర్ల పేర్లు, వయసు, చిరునామా, కులం, మతం, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలను నిబంధనలకు విరుద్ధంగా ఆ యాప్‌లో పొందుపరిచింది. తద్వారా ఓటర్ల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తోంది. ⇒ ఓటర్ల కదలికలను నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్ చేస్తూ వారి భద్రతకు ముప్పు తెస్తోంది. ⇒ ప్రత్యేకంగా బార్ కోడ్లను ముద్రించిన ఓటరు స్లిప్పులు, కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేస్తోంది. అనంతరం నేరుగా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెడుతోంది. ఫోన్ పే, గూగుల్ పే, ఇతర మార్గాల్లో డిజిటల్ చెల్లింపులు చేస్తూ అక్రమాలకు పాల్పడుతోంది. -
లోక్‌సభ పోరు నేడే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావమున్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మాత్రం సాయంత్రం 4 గంటలకే ముగించనున్నారు. ఈ మేరకు పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. బరిలో 525 మంది..: లోక్‌సభ ఎన్నికల్లో 1,65,28,366 మంది పురుష ఓటర్లు, 1,67,01,192 మంది మహిళా ఓటర్లు, 2,760 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 3,32,32,318 మంది ఓటేయనున్నారు. 17 లోక్‌సభ స్థానాల నుంచి మొత్తం 525 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. ఇందులో 50 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈవీఎంలతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ ముగిశాక ఎన్నికల సిబ్బంది సంబంధిత లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన రిసెప్షన్ సెంటర్‌కు తీసుకెళ్లి ఈవీఎంలను అప్పగిస్తారు. అక్కడ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారు. మరోవైపు ఏపీ అసెంబ్లీకి కూడా సోమవారమే ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి 25 ఎంపీ సీట్లకు, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. గందరగోళ పడకుండా ఓటేయండి..: సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో అత్యధికంగా 45 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది బరిలో ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో 7 లోక్‌సభ స్థానాల పరిధిలో మూడు బ్యాలెట్ యూనిట్లతో, 9 లోక్‌సభ స్థానాల పరిధిలో రెండు బ్యాలెట్ యూనిట్లతో, ఒక లోక్‌సభ స్థానంలో ఒక బ్యాలెట్ యూనిట్‌తో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటర్లు గందరగోళానికి గురికాకుండా.. ఈవీఎంలో అభ్యర్థుల క్రమాన్ని పోలింగ్ బూత్‌ల బయట ప్రదర్శనకు పెట్టనున్నట్టు సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. ఇక దివ్యాంగ ఓటర్లు సులువుగా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ట్రైసైకిళ్లు, ర్యాంపులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్.. రాష్ట్రంలో మొత్తంగా 35,809 పోలింగ్ కేంద్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 9,900 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించనుంది. మిగతా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియోగ్రాఫర్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌ట్యాప్‌లతో విద్యార్థులు పోలింగ్ ప్రక్రియను రికార్డు చేయనున్నారు. ఆ డేటాను ప్రిసైడింగ్ అధికారులు సంబంధిత నియోజకవర్గ రిటరి్నంగ్ అధికారికి అప్పగిస్తారు. గడువు ముగిసే సరికి.. క్యూలో ఉంటే ఓటేయవచ్చు.. పోలింగ్ సమయం ముగిసే సరికి క్యూలో ఉన్న ఓటర్లందరికీ ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. అలా క్యూలో ఉన్నవారికి పోలింగ్ అధికారులు టోకెన్లు ఇస్తారు. సమయం ముగిశాక పోలింగ్ కేంద్రానికి చేరుకునేవారికి ఓటేసేందుకు అవకాశం ఉండదు. ఎండ పెరగక ముందే ఉదయమే ఓటేస్తే మంచిదని.. వానలతో ఉష్ణోగ్రతలు కొంత తగ్గడం ఊరట కల్పించే అంశమని అధికారులు చెప్తున్నారు. ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్.. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రిని ఆదివారం రాత్రే తరలించామని అధికారులు వివరించారు. సోమవారం ఉదయం 5.30 గంటలకే అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించడం ద్వారా పోలింగ్ ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారులు ప్రారంభించనున్నారు. 10 మంది ఓటర్లకే పోలింగ్ కేంద్రం ఈసారి అత్యల్ప సంఖ్యలో ఓటర్లున్న ప్రాంతాల్లో సైతం పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల్లోని ఈ ఓటర్లు దూర ప్రాంతాలకు వెళ్లి ఓటేయాల్సిన అవసరం లేకుండా చేసింది. అత్యల్పంగా 10 మంది, 12 మంది, 14 మంది ఓటర్లున్న మూడు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 25మందిలోపు ఓటర్లున్నవి 11, 50 మందిలోపు ఉన్నవి 22, 100 మంది లోపు ఉన్నవి 54 పోలింగ్ కేంద్రాలు ఉండటం గమనార్హం. హోరాహోరీగా పోరు! ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, గట్టిగా పోరాడినా అధికారం పోగొట్టుకున్న బీఆర్ఎస్, కేంద్రంలో రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీ.. ఇలా మూడు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. 16 లోక్‌సభ స్థానాల్లో మూడు పార్టీలు హోరాహోరీగా పోరాడనుండగా.. హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టి పోటీ ఇస్తున్నారు. గత నెల రోజులుగా మూడు ప్రధాన పార్టీల అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో.. ఎక్కువ స్థానాల్లో గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. -
నేడే పోలింగ్.. ప్రజాతీర్పునకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీకి, లోక్‌సభకు పోటీచేస్తున్న 2,841 మంది అభ్యర్థుల భవిష్యత్తు మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అసెంబ్లీకి పోటీచేస్తున్న 2,387 మంది, లోక్‌సభకు పోటీచేస్తున్న 454 మంది భవిష్యత్తును నిర్ణయించడానికి 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రశాంత వాతావరణంలో ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్ స్టేషన్లలో ఉ.7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండడంతో అధికారులంతా ఆదివారం రాత్రికే ఎక్కడికక్కడ చేరుకున్నారు. కానీ, దానికి రెండు గంటల ముందు అంటే ఉ.5 గంటల నుంచే అధికారులు ఏర్పాట్లు మొదలుపెడతారని.. ఏజెంట్లు ఉ.5.30కల్లా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటే 90 నిమిషాల పాటు మాక్ పోలింగ్ నిర్వహించి ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ఆదివారం తెలిపారు. సమస్యాత్మకంగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాల్లో మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలకుగాను 31,385 చోట్ల అంటే 75 శాతం కేంద్రాలను లోపలా, బయట పూర్తిస్థాయిలో వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిరంతరాయంగా పర్యవేక్షించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని మీనా చెప్పారు. ఇందుకోసం సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 26 జిల్లాలకు సంబంధించి 26 టీవీ మానిటర్ల ద్వారా ఆయా జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఓటింగ్ సరళిని పోలింగ్ కేంద్రం లోపల, బయటా కూడా పర్యవేక్షిస్తారని ఆయన చెప్పారు. ఇందుకు దాదాపు 150 మంది అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకొకసారి జరిగే ఓట్ల పండుగలో ప్రతిఒక్క ఓటరూ పాల్గొని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని ముఖేష్‌కుమార్ మీనా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, దృఢమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా జరిగే ఎన్నికలు ఎంతో కీలకమని.. అటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలోని ఓటర్లంతా పాల్గొని ప్రజాస్యామ్యవ్యవస్థను పరిరక్షించుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. 83శాతం ఓటింగ్ లక్ష్యంగా.. ఇక గత ఎన్నికల్లో రాష్ట్రంలో 79.84 శాతం ఓటింగ్ నమోదైందని, ఈ ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్ లక్ష్యంగా విస్తృతస్థాయిలో ఓటర్లను చైతన్యపర్చేలా పలు కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించామన్నారు. ఓటర్లను ఆకర్షించడానికి వయో వృద్ధులు, మహిళలు, యువత, పర్యావరణం పేరుతో మోడల్ పోలింగ్స్టేషన్లను ఏర్పాటుచేసి సుందరంగా అలంకరించారు. అదే విధంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస వసతులైన తాగునీరు, వీల్చైర్లు, ర్యాంపులు, ప్రథమ చికిత్స సేవలు అందుబాటులో ఉంచామని ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటుచేయడమే కాకుండా అవసరాన్ని బట్టి వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుచేయనున్నట్లు మీనా తెలిపారు. 1.60 లక్షల ఈవీఎంలను ఉపయోగిస్తున్నాం.. రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 1.60 లక్షల కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటికి అదనంగా మరో 20 శాతం కొత్త ఈవీఎంలను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. నిజానికి.. మొదట్లో ప్రతిపాదించినట్లుగా 46,165 పోలింగ్ కేంద్రాలకు 1.45 లక్షల ఈవీఎంలు సరిపోతాయని, అయితే.. అదనంగా ప్రతిపాదించిన 224 ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాలకు మరో 15 వేల ఈవీఎంలు సమకూర్చుకున్నామన్నారు. మొత్తమ్మీద 46,389 పోలింగ్ కేంద్రాలలో 1.60 లక్షల కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నామని ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. ప్రశాంత పోలింగ్‌కు పటిష్ట భద్రత డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు పూర్తి భద్రతా ఏర్పాట్లుచేశామని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్ర పోలీసు బలగాలకు అదనంగా సీఆర్పీఎఫ్, తమిళనాడు, కర్ణాటక పోలీసు బలగాలను మోహరించామన్నారు. వారితోపాటు మాజీ సైనికులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన చెప్పారు. పోలింగ్ విధుల కోసం వినియోగిస్తున్న బలగాల వివరాలు.. -
ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించి ఓటు వేయండి
సాక్షి, అమరావతి: ‘అధికారంలో ఎవరుంటే మీకు మంచి జరిగిందో.. ఎవరుంటే ఈ మంచి కొనసాగుతుందో అనే విషయాన్ని ఆలోచించి.. కుటుంబసభ్యులందరితో కలిసి మాట్లాడుకొని ఓటు వేయండి’ అని ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో ఒక వీడియో పోస్టు చేశారు. ‘ఓటర్లకు ఒక్కటే ఒకటి అప్పీల్ చేస్తున్నా.గతంలో నాకు ఓటు వేయని వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఓటు వేయకపోవటానికి వారికి రకరకాల కారణాలు ఉండవచ్చు. కులం కావచ్చు.. వాళ్లకున్న పారీ్టల అఫిలియేషన్ కావచ్చు. ఏమైనా కారణాలు కావచ్చు. వాళ్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే. ఒక్కసారి ఇంటికి వెళ్లి మీ భార్యతో మాట్లాడండి. మీ ఇంట్లో ఉండే అవ్వాతాతలతో మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్న పిల్లలు కదా.. ఓటు లేదు కదా.. అని వారిని పక్కన పెట్టొద్దు. వాళ్ల అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఇంట్లో ఉన్న ఆడపడుచులతో కూడా మాట్లాడండి. అందరితో మాట్లాడి.. ఎవ్వరి వల్ల మీకు మంచి జరిగింది? ఎవ్వరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది? అనే ఒకే ఒక్క అంశం మీ ఓటును గైడ్ చేసేదిగా ఆలోచన చేసి ఓటు వేయండి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు.ప్రలోభాలకు లొంగకండి⇒ టీడీపీ కూటమి డబ్బులిచ్చినా.. ఓటు మాత్రం మనకే వేయండి⇒ ప్రతి ఓటూ ముఖ్యమే... రెండు బటన్లూ ఫ్యాన్ గుర్తుపైనే నొక్కండి⇒ ఓటర్లకు వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ వినతి సాక్షి, అమరావతి: ‘టీడీపీ కూటమి ప్రలోభాలకు లొంగకండి.. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి జరిగిన మంచిని కొలమానంగా తీసుకోండి. తెలుగుదేశం కూటమి మిమ్మల్ని రకరకాల ప్రలోభాలకు గురిచేస్తుంది. డబ్బులూ ఇస్తారు. డబ్బులు తీసుకున్నా... ఓటు మాత్రం మీకు మంచి చేసిన మీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే వేసి మీ బిడ్డ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ‘ఫ్యాన్’ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓట్లు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజారీ్టతో గెలిపించండి అని ఓటర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యరి్థంచారు.రాష్ట్రంలో 2014–19 మధ్య టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఖజానా నుంచి దోచేసిన డబ్బులు మనవేనని.. ప్రలోభపెట్టేందుకు ఆ నోట్ల కట్టలిస్తారని చెప్పారు. తీసుకున్నా... ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి.. మంచి చేసిన మీ బిడ్డ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ‘ఫ్యాన్’ గుర్తుపై రెండు బటన్లు నొక్కి వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజారీ్టతో గెలిపించాలని పిలుపునిచ్చారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ.. సొంతూళ్లకు ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ మొదలైంది. ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రా ఓటర్లు భారీగా తరలివెళ్తున్నారు. చౌటుప్పల్ పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ఎల్లుండి పోలింగ్ సందర్భంగా సొంతూళ్లకు ఓటర్లు పయనమవడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది.పోలింగ్‌కు కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో శనివారం వేకువజాము నుంచే హైవేపై భారీ రద్దీ నెలకొంది. ఆయా వాహనాలు విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపైకి చేరుకోవడంతో పలుచోట్ల నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీకి 508 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. బెంగుళూరు నుంచి ఏపీకి 592 స్పెషల్ సర్వీసులు నడుపుతోంది. సాధారణ ఛార్జీలతోనే స్పెషల్ బస్సులు నడపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ వెల్లడించారు. -
HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగకు సమయం సమీపించింది. మే 13న జరిగే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నగర వాసులు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా స్వస్థలాలకు తరలి వెళ్లడంతో శనివారం ఉదయం నుంచే రోడ్లన్నీ రద్దీగా మారాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో(శనివారం, ఆదివారం సోమవారం పోలింగ్) ఊర్లకు వెళ్లేవారితో పలు టోల్గేట్ల వద్ద ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతోంది.హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్న వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి చేరుకోవడంతో హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ శివారు హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. మరోవైపు నల్లగొండ జిల్లా కొర్లపాడు టోల్ గేట్ వద్ద వాహనాలు బారులుతీరాయి. ఎన్టీఆర్ జిల్లాజగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పెరిగిన వాహనాల రద్దీ.ఏపీలో ఎన్నికల సందర్భంగా తెలంగాణ నుండి ఆంధ్రకు భారీగా తరలిస్తున్న ఓటర్లు.వాహనాల రద్దీతో పెంచిన కౌంటర్లు.పంతంగి టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.హైదరాబాద్ నుంచి భారీగా తరలి వెళ్తున్న ఆంధ్ర ఓటర్లు.పంతంగి నుంచి చౌటుప్పల్ హయత్ నగర్ వరకు భారీగా వాహనాలు.ఉదయం నుంచి గంటలకు నిలిచిపోయిన వాహనాలు.నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్న వాహనాల రద్దీ.హైదరాబాద్‌లో స్థిర పడ్డ ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి..పోలింగ్‌కు ముందే తమ గ్రామాలకు చేరుకునేలా హైదరాబాద్ నుంిచి పయనం. ప్రయాణీకుల రద్దీతో బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట లాడుతున్నాయి.రైలు టిక్కెట్లు కొన్నప్పటికీ రైలు ఫుల్ కావడంతో బస్సులలో వెళ్లడానికి ఆరంఘర్ చౌరస్తాకు చేరుకుంటున్న ప్రయాణీకులు.సంక్రాంతి, దసరాకు కనిపించినంత రద్దీ కనబడుతుంది.గత నెల రోజుల క్రితమే రైళ్లు, బస్సుల రిజిస్ట్రేషన్ చేసుకున్న ఓటర్లు. -
బాబు బార్ కోడ్ కుట్ర
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల్లో ప్రజా నిర్ణయం వ్యతిరేకంగా ఉందని, టీడీపీ కూటమికి ఓటమి తప్పదని స్పష్టం కావడంతో చంద్రబాబు తన వికృత రాజకీయానికి తెరతీశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి, ఆ డేటా ద్వారా వేల కోట్లు వెదజల్లి ఓట్లు కోనేందుకు హైదరాబాద్ కేంద్రంగా పక్కా భారీ కుట్ర పన్నారు. కేవలం ఓట్ల కొనుగోలుకే ఏకంగా రూ. వేల కోట్లు వెదజల్లుతూ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మార్చేస్తున్నారు. అందుకోసం ‘వుయ్’ అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. దీనిద్వారా పకడ్బందీగా కుట్రను అమలు చేస్తున్నారు.ఓటర్లకు ఓటర్ స్లిప్పులతో పాటు ప్రత్యేక బార్ కోడ్ ఉన్న కరపత్రాలను పంపిణీ చేస్తూ.. హైదరాబాద్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నారు. అందుకోసం ఐటీ చట్టాన్ని ఉల్లంఘించి, డేటా చౌర్యానికి పాల్పడి, ఓటర్ల వివరాలను వుయ్ యాప్‌లో పొందుపరిచారు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని, ఎన్నికల కమిషన్ (ఈసీ) మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా ఓట్ల కొనుగోలుకు బరితెగించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా దొరక్కుండా ఎన్నికల కమిషన్‌ను బోల్తా కొట్టిస్తున్నారు.‘వుయ్’ యాప్ ఇలా..గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సాధికార సర్వే పేరుతో సేకరించిన ఓటర్ల సమాచారాన్ని సేకరించి, అప్పట్లోనే డేటా చౌర్యానికి పాల్పడి టీడీపీ సేవా మిత్ర యాప్‌లో పొందుపరిచిన విషయం తెలిసిందే. దానికి అప్డేటెడ్ వెర్షన్ కింద ఇప్పుడు ‘వుయ్’ యాప్ తెచ్చారు. ఇందులో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఆధార్, ఫోన్ నంబర్లు, ఓటరు ఐడీ నంబర్లు, వృత్తి తదితర వ్యక్తిగత వివరాలన్నీ పొందుపరిచారు. వారు ఏ పార్టీ సానుభూతిపరులో కూడా ఇందులో ఉంది. ఇది ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు పూర్తి విరుద్ధం.మూడంచెల వ్యవస్థతో..ఈ యాప్ ద్వారా ఎన్నికల అక్రమాల కోసం చంద్రబాబు మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల ద్వారా స్లిప్పుల పంపిణీ, వీటిని పర్యవేక్షించి, స్కాన్ చేసేందుకు మరో ప్రత్యేక బృందం, ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. యాప్‌లో ఉన్న వివరాల ఆధారంగా బూత్ కమిటీ సభ్యులు ఓటర్ల వద్దకు వెళ్లి, ఓటరు స్లిప్పులు, బార్కోడ్ ఉన్న కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఈ బార్ కోడ్‌ను ప్రతి ఓటరుకు ప్రత్యేకంగా (యూనిక్)గా కేటాయించారు. స్లిప్పుల పంపిణీ అయిన తరువాత రెండో బృందం ఓటర్ల ఇళ్లకు వెళ్లి స్లిప్పులపై ఉన్న బార్ కోడ్‌ను స్కాన్ చేస్తుంది. ఆ వెంటనే హైదరాబాద్ నుంచి ఫోన్ పే, గూగుల్ పే తదితర డిజిటల్ చెల్లింపుల ద్వారా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఒక్కో ఓటుకు సగటున రూ.5 వేల వరకు చెల్లిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే చేస్తున్నారు. డబ్బులు హైదరాబాద్ నుంచి ఓటర్ల ఖాతాల్లో జమ అవుతున్నందున.. పోలీసులు, ఫ్లయింగ్ స్వా్కడ్లు తనిఖీ చేసినా బూత్ కమిటీలు, పర్యవేక్షక బృందాల వద్ద డబ్బు దొరకదు.నియోజకవర్గానికి రూ.87.50 కోట్లువుయ్ యాప్ ద్వారా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 1.75 లక్షల ఓట్లు కొంటున్నారు. ఓటుకు రూ.5 వేలు రేటు కట్టినట్టు సమాచారం. ఆ ప్రకారం నియోజకవర్గానికి రూ.87.50 కోట్లు చొప్పున అన్ని నియోజకవర్గాలకు కలిపి మొత్తం రూ.15,312 కోట్లు వెచ్చిస్తున్నారు. నేరుగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసి ప్రలోభాలకు గురి చేసేది దీనికి అదనం. బార్ కోడ్ స్లిప్పులను సక్రమంగా పంపిణీ చేసిన బూత్ కమిటీలకు ఒక్కో దానికి రూ. 5 లక్షలు, పర్యవేక్షక బృందానికి రూ.5 లక్షల చొప్పున ప్రత్యేక ప్రోత్సాహకాలు చెల్లిస్తునట్టు తెలుస్తోంది. ఇందుకోసం మరో రూ.2,500 కోట్ల వరకు చంద్రబాబు ప్రకటించినట్టు సమాచారం. వుయ్ యాప్‌ను రూపొందించి హైదరాబాద్ కేంద్రంగా కుట్రను అమలు చేస్తున్న బృందానికి మరో రూ.2 వేల కోట్లకు పైగా ప్యాకేజీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ ప్రకారం రూ. 20 వేల కోట్లతో చంద్రబాబు ఓట్ల కొనుగోలుకు భారీ కుట్ర అమలు చేస్తున్నారన్నది సుస్పష్టమైంది. దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికల అక్రమానికి చంద్రబాబు తెగించారన్నది బహిర్గతమైంది. కుట్ర ఇలా బట్టబయలు..రెండు రోజుల క్రితం మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ పంపిణీ చేసిన బార్ కోడ్ ఓటరు స్లిప్పులు బయటపడ్డాయి. తర్వాత మైలవరంలో, తాజాగా ఒంగోలులోనూ ఈ బార్ కోడ్ స్లిప్పుల బాగోతం బట్టబయలైంది. ఆ నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థుల ఫొటోలు ముద్రించిన కరపత్రాలు, బార్ కోడ్ ఉన్న ఓటరు స్లిప్పులు లభించాయి. బార్ కోడ్‌ను పరిశీలించగా వాటిపై ‘ వుయ్ యాప్’కు అవి అనుసంధానించి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు టీడీపీ శ్రేణుల కోసం గూగుల్‌లో అందుబాటులో ఉంచిన ‘వుయ్ యాప్’ను పరిశీలించగా మొత్తం ఎన్నికల అక్రమాల గుట్టు బట్టబయలైంది.ఎన్నికల నియామవళి ఉల్లంఘనేప్రస్తుత లోక్‌సభ, రాష్ట్ర శాసన సభ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(1) ప్రకారం స్పష్టమైన విధి విధానాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళిని వెల్లడించింది. దాంతోపాటు ఓటర్ల నమోదు, సర్వే పేర్లతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని, పథకాలను ప్రకటించవద్దని, అవినీతి కార్యకలపాలకు పాల్పడవద్దని స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. కానీ చంద్రబాబు ఈసీ మార్గదర్శకాలు, ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ వుయ్ యాప్ ముసుగులో ఎన్నికల అక్రమాలకు బరితెగించారు. ఇది ఎన్నికల నియామావళి ఉల్లంఘనే కాకుండా డేటా చౌర్యం కూడా. దాంతోపాటు ఐటీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారు. ఈసీ, డీజీపీలకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు వుయ్ యాప్ పేరుతో టీడీపీ పాల్పడుతున్న ఎన్నికల అక్రమాలపై ఎన్నికల కమిషన్(ఈసీ), రాష్ట్ర డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత కె. శ్రీనివాసరెడ్డి ఈసీకి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. మాచర్ల, ఒంగోలులో టీడీపీ వారి నుంచి స్వాధీనం చేసుకున్న బార్ కోడ్ ఉన్న ఓటరు స్లిప్పులు, డౌన్లోడ్ చేసిన వుయ్ యాప్, ఇతర వీడియో ఆధారాలను కూడా సమర్పించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ మేరకు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, దర్యాప్తు అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ కార్యాలయాల్లో తనిఖీలు చేసి వుయ్ యాప్‌కు సంబంధించిన ఆధారాలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధంఈసీకి, డీజీపికి ఫిర్యాదు అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. వుయ్ యాప్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం ఉందని చెప్పారు. ప్రజల ఓటర్ ఐడీలు, వారి సచివాలయ పరిధి, ఓటర్ నంబరు, ఏ పార్టీ సానుభూతిపరులు తదితర వివరాలన్నీ ఉన్నాయన్నారు. వాటితో టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ స్లిప్‌తో పాటు బార్ కోడ్ కలిగిన స్లిప్‌ను, మేనిఫెస్టోను ఇస్తున్నారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని తెలిపారు. బార్ కోడ్ స్లిప్ స్కాన్ చేసిన అనంతరం వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపారు. -
పార్టీలు మారుతున్న అభ్యర్థులు.. ఎంపీలను మార్చేస్తున్న ఓటర్లు!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతున్నాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్‌లు 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ తొమ్మిది స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈసారి అన్ని రాజకీయ పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీకి దిగడంతో పోరు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పంజాబ్‌లోని హోషియార్పూర్ స్థానంలో పోటీపై ఎక్కడాలేని ఆసక్తి నెలకొంది. ఇక్కడ కూడా అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపాయి.హోషియార్పూర్ సిట్టింగ్ ఎంపీ సోమ్‌ప్రకాష్ భార్య అనితా ప్రకాష్‌ను భారతీయ జనతా పార్టీ ఎన్నికల పోరులో నిలిపింది. కాంగ్రెస్‌ను వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన డాక్టర్ రాజ్‌కుమార్ చబ్బేవాల్‌ను ఆ పార్టీ రంగంలోకి దింపింది. శిరోమణి అకాలీదళ్ మాజీ మంత్రి సోహన్ సింగ్ తాండల్‌ను, కాంగ్రెస్ పార్టీ యామినీ గోమర్‌ను తమ అభ్యర్థులుగా నిలబెట్టాయి.ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గత ఏడు ఎన్నికల్లో హోషియార్పూర్ ఓటర్లు ప్రతీసారి ఎంపీని మారుస్తూనే ఉన్నారు. ఒక్క కమల్ చౌదరి మాత్రమే నాలుగుసార్లు ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్థులు కూడా కొత్తవారే కావడం విశేషం.గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ చబ్బెవాల్ ఈసారి ఆప్ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. 2014లో ఇదే స్థానంలో ఆప్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన యామినీ గోమర్‌ను ఈసారి కాంగ్రెస్ తన అభ్యర్థిగా నిలబెట్టింది. గత లోక్‌సభ ఎన్నికల్లో హోషియార్పూర్ స్థానంలో బీజేపీకి చెందిన సోమ్‌ప్రకాష్ 48,530 ఓట్ల తేడాతో డాక్టర్ చబ్బెవాల్పై విజయం సాధించారు. సోమ్‌ప్రకాష్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం అతని భార్య అనితా సోమ్‌ప్రకాష్ బీజేపీ నుండి ఎన్నికల బరిలోకి దిగారు. హోషియార్‌పూర్‌లో అభ్యర్థులు పార్టీలను మార్చేస్తున్నట్లుగానే.. ఓటర్లు కూడా ప్రతీ ఎన్నికల్లోనూ ఎంపీలను మార్చేస్తుండటం విశేషం. -
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
దేశంలో ఈరోజు(మంగళవారం) లోక్‌సభ ఎన్నికల్లోని మూడో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో కొన్ని చోట్ల అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్లోని అరా పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలుచున్న ఓటర్లపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో గాయపడిన ఎనిమిదిమంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని ఆసుపత్రిలో జష్పూర్ ఎమ్మెల్యే పరామర్శించారు.ఈరోజు ఉదయం 7 గంటలకు జష్ఫూర్ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. తొలుత 85 ఏళ్ల విద్యావతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. పెట్రోలింగ్ బృందాన్ని నియమించారు. ఎండ వేడిని దృష్టిలో ఉంచుకుని ఓటర్లకు నీడ కల్పించే ఏర్పాట్లు చేశారు. జష్పూర్ జిల్లా పరిధిలో 878 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ బూత్‌లో నలుగురు ఉద్యోగుల బృందం విధులు నిర్వహిస్తుంది. -
ఓటుకు సిద్ధం.. 100 ఏళ్లు దాటిన 2,000 మంది ఓటర్లు!
ఛత్తీస్‌గఢ్‌లో నేడు (మంగళవారం) లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఒక కోటీ 39 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనుండగా, వారిలో 2,174 మంది 100 ఏళ్లు దాటిన వారే కావడం విశేషం. రాష్ట్రంలో మొదటి సారి ఓటు వేయబోయేవారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలు. రాష్ట్రంలోని సుర్గుజా, రాయ్‌గఢ్, జాంజ్‌గిర్-చంపా, కోర్బా, బిలాస్పూర్, దుర్గ్, రాయ్‌పూర్‌లలో ఓటింగ్ జరగనుంది. ఈ ఏడు స్థానాల్లో మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో మహిళా అభ్యర్థుల సంఖ్య 26.పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద డ్రింకింగ్ వాటర్, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. క్యూలో నిలుచునే ఓటర్లకు నీడను కల్పించారు. వెయిటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన మందులతో పాటు మెడికల్ కిట్ కూడా అందుబాటులో ఉంచారు.రాష్టంలోని ఏడు స్థానాలకు నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మూడో దశలో 26 మంది మహిళలతో సహా మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. రాయ్‌పూర్‌లో అత్యధికంగా 38 మంది, బిలాస్పూర్లో 37 మంది, కోర్బాలో 27 మంది, దుర్గ్‌లో 25 మంది, జాంజ్‌గిర్-చంపాలో 18 మంది, రాయ్‌గఢ్‌లో 13 మంది, సుర్గుజాలో 10 మంది అభ్యర్థులు ఉన్నారని ఆయన చెప్పారు. ఏడు నియోజకవర్గాల్లో 15,701 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 25 పోలింగ్ కేంద్రాలను హైపర్ సెన్సిటివ్‌గా, 1072 పోలింగ్ కేంద్రాలను సెన్సిటివ్‌గా వర్గీకరించారు. -
ఇంటింటికీ చికెన్ పంపిణీ.. అడ్డంగా దొరికిపోయిన టీడీపీ
-
నవతరం కదలాలి.. పోలింగ్ పెరగాలి...
యువతరమే ముందు యుగం దూతలు..పావన నవజీవన, బృందావన నిర్మాతలు... అని శ్రీశ్రీ ఒక పాటలో అభివర్మించారు.. వారు తల్చుకుంటే సమాజాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లగలరని కొనియాడారు. అది నూరు శాతం వాస్తవం. ముఖ్యంగా ఎన్నికల్లో వారి పాత్ర కీలకం... యువత ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి రావాలే కానీ రాజకీయ తీరుతెన్నులే మారిపోతాయి. సంక్షేమానికి పట్టం కడుతున్నదెవరో, ఓట్ల కోసం మేనిఫెస్టోలనే బుట్టదాఖలు చేస్తున్నదెవరో యువత ఇట్టే గ్రహిస్తుంది.అణగారిన వర్గాలను ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలనే తపన పడేదెవరో– ఆ వర్గాల వంచకులెవరో గుర్తించే శక్తియుక్తులు వారికే ఉన్నాయి...దేశంలో ఈ సారి తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకోబోతున్న యువత 1.85 కోట్ల మంది. ఆంధ్రప్రదేశ్నే తీసుకుంటే మొత్తం ఓటర్లలో 20 శాతం 30 ఏళ్లలోపు యువతే ఉంది...ఎన్నికల సంఘం ఈ యువతను పోలింగ్ కేంద్రాలకు రప్పించే దిశగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను యువ ఓటర్లు దిశా నిర్దేశం చేయనున్నారు. దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో 30 ఏళ్లలోపు ఓటర్ల సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందులో 18 నుంచి 19 ఏళ్లు ఉండి తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య 1.85 కోట్లు. దీంతో ఈ సారి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ యువ ఓటర్లను ఆకర్షించే దిశగా అడుగులు ముందుకేస్తున్నాయి. మన రాష్ట్ర విషయానికి వస్తే మొత్తం 4.10 కోట్ల ఓటర్లలో సుమారు 20 శాతం మంది 30 ఏళ్లలోపే ఉన్నారు.18 నుంచి 30 ఏళ్లలోపు మొత్తం 79.03 లక్షల మంది ఉంటే అందులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న 18–19 ఏళ్ల వారు 8.25 లక్షల మంది ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో యువ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో వీరంతా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను తెలియచేసే విధంగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పారి్టసిపేషన్ (స్వీప్) పేరిట కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సెలబ్రెటీలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వయోవృద్ధులకు ఇంటి వద్దే.. రాష్ట్రంలో తొలిసారిగా 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు పోలింగ్ బూతులకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేమనుకున్న వారు ముందుగా నమోదు చేసుకుంటే అధికారులు ఇంటి వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్రంలో 2.12 లక్షల మంది ఓటర్లు 85 ఏళ్లు దాటిన వారు ఉన్నారని, వీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘ అధికారులు వెల్లడిస్తున్నారు.దివ్యాంగులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 5.17లక్షల దివ్యాంగ ఓటర్లు ఉండటంతో వారు ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 79.77 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఇప్పుడు ఈ మొత్తాన్ని 83 శాతం దాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
మండుతున్న ఎండలు.. కేరళలో నలుగురు ఓటర్లు మృతి
లోక్‌సభ ఎన్నికలకు రెండో విడత పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది. 13 రాష్ట్రాలలో 88 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కేరళ 20, కర్ణాటక 14, రాజస్థాన్ 13 , ఉత్తర్ ప్రదేశ్ 8,మహారాష్ట్ర 8,మధ్యప్రదేశ్ 7, అస్సాం 5, బీహార్ 5, వెస్ట్ బెంగాల్ 3, ఛత్తీస్ ఘడ్ 3, జమ్మూకశ్మీర్ 1,మణిపూర్ 1,త్రిపుర 1 లోక్ సభ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే నిప్పుల కుంపటిని తలపిస్తోంది. మండే ఎండను లెక్కచేయని ఓటర్లు క్యూలో నిల్చోని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో కేరళలో పోలింగ్ ప్రారంభమైన తర్వాత నలుగురు వ్యక్తులు కుప్పకూలి ప్రాణాలు విడిచారు. మరణించిన వారిలో ముగ్గురు ఓటర్లు కాగా.. ఒకరు పోలింగ్ ఏజెంట్ ఉన్నారు. పాలక్కాడ్‌లోని ఒట్టపాలెంలో 68 ఏళ్ల ఓటరు ఓటు వేసిన తర్వాత కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఒట్టపాలెంలో శుక్రవారం 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. కోజికోడ్ టౌన్ బూత్ నంబర్ 16లో ఓ పార్టీ పోలింగ్ ఏజెంట్ అనీస్ అహ్మద్ (66) కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందాడు. కోజికోడ్‌లో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది.మలప్పురం జిల్లా తిరూర్‌లో,63 ఏళ్ల మదర్సా ఉపాధ్యాయుడు ఓటు వేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. శుక్రవారం తిరుర్‌లో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా అలప్పుజా జిల్లా అంబలప్పుజాలో 76 ఏళ్ల వృద్ధుడు ఓటేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మరణించాడు. అంబలప్పుజలో శుక్రవారం 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.మరోవైపు రెండో విడత ముమ్మరంగా సాగుతోంది. 13 రాష్ట్రాలలో 88 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్నం 1గంటల వరకు సుమారు 35 శాతం పోలింగ్ నమోదైంది. -
ఓటు వేస్తే టిఫిన్, తొలిసారైతే ఐస్‌క్రీమ్ కూడా..
దేశంలో ఎన్నికల పండుగ జరుగుతోంది. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ఓటు కోసం ఓటరు దేవుళ్లను వేడుకుంటున్నారు. అదేసమయంలో ఎన్నికల సంఘంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఓటు విలువపై అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్థానిక స్వచ్ఛంద సంస్థలు, దుకాణాలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి. మే 13న ఇండోర్‌లో ఓటింగ్ జరగనుంది. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహం అందించేందుకు స్థానిక ఫుడ్ మార్కెట్లలో ప్రత్యేక రాయితీలు అందిస్తున్నారు. మరోవైపు వేసవిని దృష్టిలో ఉంచుకుని ఓటర్లకు ఉపశమనం కలిగించేలా ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు. ఓటింగ్ జరిగే రోజున ఓటర్లకు ఉచితంగా ఐస్ క్రీం, పోహా, జలేబీ, శీతల పానీయాలు, ఇతర తినుబండారాలు అందించనున్నారు. ఈ ఆఫర్లలో వివిధ కేటగిరీలు, ఎంపికలు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం వివిధ దుకాణాలకు ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. అయితే ఓటర్లు ఈ విధమైన ప్రయోజనం పొందేందుకు తమ ఓటరు కార్డుతో పాటు వారి వేలిపై ఇంక్ గుర్తును చూపించాల్సి ఉంటుంది.అంతే కాదు తొలిసారి ఓటు వేయబోతున్న యువతకు ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించారు. పోలింగ్ జరిగే రోజున ఉదయం 9 గంటలలోపు ఓటు వేసే యువత, సీనియర్ సిటిజన్లకు పోహా, జిలేబీ, ఐస్ క్రీంలను ఉచితంగా అందించనున్నారు. అలాగే మంచూరియా, నూడుల్స్ కూడా ఉచితంగా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఇండోర్‌లోని కొన్ని షాపింగ్ మాల్స్‌లో పోలింగ్ జరిగే రోజున పలు వస్తువులపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. -
బీహార్ ఎవరిది? ఎన్డీఏ- మహాఘటబంధన్ హోరాహోరీ?
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు పరిస్థితి ఇదేవిధంగా కొనసాగనుంది. అయితే అటు ప్రధాని మోదీ- నితీష్, ఇటు ఆర్జేడీ నేత తేజస్వి - రాహుల్(కాంగ్రెస్)కు ప్రతిష్టాత్మకంగా మారిన బీహార్ రాజకీయాలపైనే అందరి దృష్టి నిలిచింది. బీహార్‌లో మోదీ-నితీష్ జోడీ గెలుపు గ్యారెంటీనా? రాష్ట్ర ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు? నితీష్ ఫ్యాక్టర్ ఎన్డీఏకు విజయాన్ని అందిస్తుందా? మహాఘటబంధన్ తన సత్తా చాటగలదా? ఇలాంటి ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉన్నారు. 2019లో ఎన్డీఏకి 53.20 శాతం ఓట్లు రాగా, మహాఘటబంధన్‌కు 31.90శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్డీఏలోని బీజేపీకి 23.6 శాతం ఓట్లు వచ్చాయి. జేడీయూకి 21.8శాతం, ఇతరులకు 7.9శాతం ఓట్లు దక్కాయి. మహాఘటబంధన్‌కు వచ్చిన 31.90 శాతం ఓట్లలో ఆర్జేడీకి 15.4శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 7.7 శాతం ఓట్లు, ఇతరులకు 8.8 శాతం ఓట్లు వచ్చాయి. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ సారధ్యంలోని అధికార కూటమి విజయం సాధించింది.2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ, నితీష్‌లు విడివిడిగా పోటీ చేసినప్పుడు ఎన్డీఏకు 31 సీట్లు లభించగా, 2019లో వీరిరువురూ కలిసి పోటీ చేసినప్పుడు 39 సీట్లు దక్కించుకున్నారు. ఈసారి బీహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీఏ, మహాకూటమి మధ్యే పోటీ నెలకొంది. ఈసారి బీజేపీ 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో 9 స్థానాల్లో ఆర్జేడీతో పోటీ పోటీ ఏర్పడనుంది. 5 స్థానాల్లో కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోటీ ఏర్పడనున్నదని సమాచారం. అదేవిధంగా జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో ఆర్జేడీతో కలిసి 10 స్థానాల్లో పోటీ చేయనుంది. మూడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ ఏర్పడనున్నదని సమాచారం. మహాకూటమిలోని ఇతర పార్టీల నుండి మూడు స్థానాల్లో మాత్రమే పోటీ ఉండనుంది. ఎన్డీఏలోని ఇతర పార్టీలకు బీజేపీ ఏడు సీట్లు ఇచ్చింది. ఈ స్థానాల్లో బీజేపీకి నాలుగు స్థానాల్లో ఆర్జేడీతో, ఒక స్థానంలో కాంగ్రెస్‌తో, రెండు స్థానాల్లో మహాకూటమికి చెందిన ఇతర పార్టీలతో పోటీ ఏర్పడనుంది. బీహార్‌లోని 23 లోక్‌సభ స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో, మహాకూటమికి చెందిన ఇతర పార్టీలు మొత్తం 8 స్థానాల్లో ఎన్నికల బరిలోకి దిగాయి. -
వలంటీర్ చెప్పినవారికి ఓటేసేంత బలహీనంగా ఓటర్లు లేరు
సాక్షి, అమరావతి: వలంటీర్ల మాటలు విని.. వారు చెప్పినవారికి ఓటు వేసేంత బలహీనంగా ఓటర్లు లేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. వలంటీర్, లబ్దిదారు మధ్య ఉన్న అనుబంధం వలంటీర్ రాజీనామాతో తెగిపోతుందని స్పష్టం చేసింది. అలాంటప్పుడు వలంటీర్ చెప్పినట్టు ఓటరు ఎందుకు చేస్తారని ప్రశ్నిం చింది. వలంటీర్లు తమ జేబులో నుంచి తీసి డబ్బేమీ ఇవ్వడం లేదని, అలాంటప్పుడు వారి మాటలను ఓటరు ఎందుకు వింటారని పిటిషనర్‌ను నిలదీసింది. ఎవరైనా కూడా ఓటరును పోలింగ్ బూత్ వద్దకు వెళ్లేంత వరకే ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. పోలింగ్ బూత్‌లోకి వెళ్లాక ఓటరు తనకు నచ్చినవారికే ఓటు వేస్తారని తెలిపింది. రాజీనామా చేశాక ఎవరైన వలంటీర్ ఏదైనా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిం చింది. మొత్తం వలంటీర్లు ఎందరు? ఎంతమంది పనిచేస్తున్నారు? రాజీనామా చేసినవారెందరు? తదితర వివరాలను తమ ముందుంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. రాజీనామా చేశాక మేమేం చేయలేం.. కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది శివదర్శన్ వాదనలు వినిపిస్తూ.. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారన్నారు. ఎన్నికల్లో విధుల్లో పాల్గొనకుండా, పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా వలంటీర్లను నియంత్రిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఒకవేళ వలంటీర్ రాజీనామా చేస్తే వారిపై ఎన్నికల సంఘానికి ఎలాంటి నియంత్రణ ఉండదన్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. వారికి సైతం ప్రాథమిక హక్కులున్నాయని.. ఇష్టానుసారం రాజీనామా చేసే హక్కు వారికి సైతం ఉందన్నారు. వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు పిటిషనర్ ఎలాంటి ఉదంతాలను పొందుపరచలేదని చెప్పారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ప్రత్యక్ష పరిచయాలతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు.. పిటిషనర్ రామచంద్ర యాదవ్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేష్ వాదనలు వినిపిస్తూ.. అధికార పార్టీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలతో వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఆ ఆదేశాల నుంచి తప్పించుకునేందుకు వలంటీర్లు ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారులతో వలంటీర్లు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేసి ఎన్నికల్లో లబ్దిదారులను అధికార పార్టీ వైపు తిప్పడానికి వారిని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల వలంటీర్ల రాజీనామాల విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. మరి సెలబ్రిటీలు కూడా ప్రచారం చేస్తున్నారుగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేసి, ఆయా పార్టీల అభ్యర్థుల అవకాశాలను ప్రభావితం చేయడం సాధ్యమా? అని ప్రశ్నిం చారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒకరు పెద్ద ధనవంతుడు, మరొకరు పేద వ్యక్తి అయి ఉంటే, ఆ పేద వ్యక్తి.. తాను ఎన్నికల్లో తలపడేందుకు సమాన అవకాశాలు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరగలడా? అని నిలదీశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు సెలబ్రిటీలు కూడా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఊహల ఆధారంగా పిటిషనర్ ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. రాజీనామాలు చేశాక వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఎక్కడా కూడా పిటిషన్లో పేర్కొనలేదన్నారు. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని, వరుసగా వారు మూడు రోజుల పాటు విధులకు హాజరు కాకుంటే వారిని విధుల నుంచి తొలగించవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేసేందుకే వలంటీర్లను నియమించామని చెప్పారు. వారు కేవలం గౌరవ వేతనం మాత్రమే అందుకుంటున్నారని గుర్తు చేశారు. కొందరు తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతామంటూ ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ రోజుల్లో ఐఏఎస్ అధికారులు కూడా తమ ఉద్యోగానికి రాజీనామా చేసి, నచ్చిన పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. కాబట్టి రాజీనామా చేశాక ఎవరినీ నియంత్రించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
ఆమే కీలకం
సాక్షి,అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా అవతరించనున్నారని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, గోవా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లో కూడా మహిళలదే ప్రధాన భూమిక అని నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంగా మహిళా ఓటర్లు ఎలా నిర్ణయాత్మకంగా మారుతున్నారనే అంశంపై ఎస్బీఐ పరిశోధన నివేదికను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుత సాధారణ ఎన్నికలతో పాటు రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఎన్నికల్లో కేరళ, గోవా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని, భవిష్యత్ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఇంకా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. భవిష్యత్ ఎన్నికల్లో తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, సిక్కిం రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య పెరిగి ఫలితాలను నిర్ణయిస్తారని నివేదిక పేర్కొంది. మహిళా ఓటర్లలో చైతన్యం ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో 83 లక్షల మంది మహిళలు పోలింగ్ కేంద్రాలకు రాలేదని, 2019 ఎన్నికల్లో మాత్రం పోలింగ్ కేంద్రాలకు రాని మహిళా ఓటర్ల సంఖ్య ఏకంగా 41 లక్షలకు తగ్గిపోయిందని, మహిళలు ఓటింగ్‌లో ఎక్కువ మంది పాల్గొంటున్నారనడానికి ఇదే సంకేతమని స్పష్టం చేసింది. గతంలో కంటే ప్రస్తుత ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొంటారని, తద్వారా ఫలితాలు గణనీయంగా మారిపోతాయని అంచనా వేసింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జెండర్ రేషియో పెరుగుతోందని, లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర గణనీయంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ఎన్నికల్లో పురుష, మహిళ ఓటర్ల రేషియో 1:1.02 ఉండగా భవిష్యత్‌లో 1:1.06కు పెరుగుతుందని వెల్లడించింది. గత ఓటింగ్ శాతాలు, మార్పులను విశ్లేíÙంచడం ద్వారా 2024లో పోలింగ్ 68 కోట్లకు చేరుతుందని, ఇందులో 33 కోట్లు మహిళా ఓటర్లే ఉంటారని, ఇది 49 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత పోలింగ్ రేటు ప్రకారం 2029 నాటికి పోలింగ్ 73 కోట్లకు చేరుతుందని, ఇందులో 37 కోట్లు మహిళా ఓటర్లు ఉంటారని అంచనా వేసింది. 2047 నాటికి దేశంలో 115 కోట్ల మంది ఓటర్లుగా నమోదు కావచ్చని, ఓటింగ్‌లో 92 కోట్ల మంది పాల్గొంటారని నివేదిక తెలిపింది. 2047లో అత్యధికంగా మహిళా ఓటర్లు 50.6 కోట్ల మంది పాల్గొననుండగా పురుష ఓటర్లు 41.1 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పురుష ఓటర్ల పోలింగ్ 67.01 శాతం ఉండగా మహిళా ఓటర్ల పోలింగ్ 67.18 శాతం ఉందని పేర్కొంది. గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే 2024 ఎన్నికల్లో అదనంగా 13 కోట్ల మంది మహిళలు ఓటు వేయవచ్చని, ఇది గేమ్ చేంజర్‌గా మారవచ్చని వ్యాఖ్యానించింది. -
మహిళా ఓటర్లు తలచుకుంటే.. గత ఐదేళ్లలో జరిగిందిదే!
దేశంలోని మహిళలు ఓటు వేసేందుకు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. గత ఐదేళ్లలోని గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని పలు నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదికలోని వివరాల ప్రకారం గత ఐదేళ్లలో ఎన్నికలు జరిగిన 23 రాష్ట్రాల్లోని 18 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తేలింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. ఈ 18 రాష్ట్రాల్లోని 10 రాష్ట్రాల్లో తిరిగి అదే ప్రభుత్వం ఏర్పడటం విశేషం. దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్‌గా మారుతున్న మహిళా ఓటర్లు 2029 ఎన్నికల్లో పురుషుల కంటే అధికంగా ఉండనున్నారు. 17వ లోక్‌సభలో మొత్తం ఎంపీల్లో 15 శాతం మంది మహిళలు ఉన్నారు. మొదటి లోక్‌సభలో ఈ సంఖ్య ఐదు శాతంగా ఉంది. నివేదిక ప్రకారం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు. వీరిలో 68 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారనే అంచనాలున్నాయి. వీరిలో 33 కోట్ల మంది అంటే 49 శాతం మంది మహిళా ఓటర్లు ఉండనున్నారు. 85.3 లక్షల మంది మహిళలు తొలిసారిగా ఓటు వేయనున్నారు. 2047 నాటికి (2049లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది) మహిళా ఓటర్ల సంఖ్య 55 శాతానికి (50.6 కోట్లు) పెరుగుతుందని, పురుషుల సంఖ్య 45 శాతానికి (41.4 కోట్లు) తగ్గనుందని నివేదిక పేర్కొంది. 2047 నాటికి 115 కోట్ల మంది ఓటర్లు ఉంటారని, వీరిలో 80 శాతం మంది అంటే 92 కోట్ల మంది ఓటు వేస్తారని నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో మహిళా లబ్ధిదారులు ముందంజలో ఉన్నారు. స్టాండప్ ఇండియాలో వారి వాటా 81 శాతం. ముద్రా లోన్‌లో మహిళలకు 68 శాతం, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో 37 శాతం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 శాతం వాటా ఉంది. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణలలో మహిళా ఓటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని నివేదిక చెబుతోంది. -
అండమాన్- నికోబార్‌లో ఓటర్లెందరు? ఏ పార్టీకి కంచుకోట?
అండమాన్- నికోబార్ దీవులలోని ఓటర్ల సంఖ్యను ఇటీవల ఎన్నికల సంఘం వెల్లడించింది. భారతదేశంలోని ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 3,15,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 52 శాతం పురుషులు, 48 శాతం మహిళలు. అండమాన్- నికోబార్ దీవుల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బిఎస్ జగ్లాన్ తెలిపిన వివరాల ప్రకారం 18-19 ఏళ్ల మధ్య వయస్సు గల 5300 మంది ఓటర్లు మొదటిసారి ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేయించుకున్నారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశం మొత్తం మీద ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు. వీరిలో 49.7 కోట్ల మంది పురుషులు కాగా, 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు . 2019తో పోలిస్తే ఓటర్ల సంఖ్య 6 శాతం మేరకు పెరిగింది. ఏప్రిల్ 19న అండమాన్ నికోబార్ దీవుల్లో తొలి దశలో ఓటింగ్ జరగనుంది. బిష్ణు పద్ రేకు ఎన్డిఏ కూటమి టికెట్ ఇవ్వగా, ఇండియా కూటమి నుంచి కుల్దీప్ రాయ్ శర్మను అభ్యర్థిగా నిలిపారు. ఇక్కడి నుంచి ప్రస్తుత ఎంపీ కుల్దీప్. 2014లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి బిష్ణు పద్ రే ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో బీజేపీ విశాల్ జాలీకి టిక్కెట్ కేటాయించింది. నాడు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కుల్దీప్కు 95,308 ఓట్లు రాగా, విశాల్‌కు 93,901 ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అండమాన్ నికోబార్ లోక్ సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ 1967లో తొలిసారిగా ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ గణేష్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మంత్రివర్గంలో కూడా చేరారు. ఆయన 1971లో కూడా గెలిచారు. 1977 నుంచి 1999 వరకు కాంగ్రెస్‌కు చెందిన మనోరంజన్ భక్త్ వరుసగా ఎనిమిది సార్లు గెలిచారు. 1999లో బీజేపీకి చెందిన బిష్ణు పద్ రే తొలిసారిగా ఇక్కడి నుంచి ఎంపీ అయ్యారు. 2004లో మనోరంజన్ భక్త్ తిరిగి గెలిచారు. బిష్ణు పద్ రే 2009, 2014లో ఎంపీగా ఉన్నారు. కులదీప్ రాయ్ శర్మ 2019లో ఎంపీగా ఎన్నికయ్యారు. -
ఇంటింటికీ బీజేపీ.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. దేశంలో మూడో విడత పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ నెల 18న ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ వెలువడేలోగా రాష్ట్రంలో తొలివిడత ‘ఓటర్స్ ఔట్ రీచ్’పూర్తిచేయాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం కింద ఈ నెల 14 నుంచి ‘ఇంటింటికీ బీజేపీ’పేరిట ఓటర్లను వారి ఇళ్ల వద్దే పార్టీ కార్యకర్తలు కలుసుకోనున్నారు. 17వ తేదీలోగా రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలోని ప్రతి పోలింగ్ బూత్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసే (మే 11)లోగా ప్రతి కుటుంబాన్ని మొత్తంగా మూడుసార్లు కలిసి మద్దతు కోరాలని బీజేపీ భావిస్తోంది. ప్రతి ఇంటి తలుపు తట్టేలా.. తొలి విడత లక్ష్యంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్ కేంద్రాల్లో విస్తృత స్థాయి ప్రచారాన్ని బీజేపీ చేపట్టనుంది. ప్రతి ఇంటి తలుపు తట్టి, ఆ కుటుంబ సభ్యులను కలుసుకుని ఈసారి బీజేపీకి ఓటేయాలని కోరనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం, ప్రచారానికి సంబంధించిన స్టిక్కర్, పార్టీ జెండా, ఓటర్లకు ఎంపీ అభ్యర్థి విజ్ఞప్తి పత్రం (అప్పీల్) వంటివి వారికి అందించనున్నారు. ఈ ప్రచార ప్రక్రియకు సంబంధించిన మొత్తం మెటీరియల్ ఇప్పటికే సిద్ధమై పార్టీ యంత్రాంగానికి అందుబాటులోకి తెచ్చినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. మూడురోజులు సన్నాహక సమావేశాలు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లడానికి ముందు ఈ నెల 11, 12, 13 తేదీల్లో మండల స్థాయిలో దీనికి సంబంధించిన సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. వీటికి సమాంతరంగా ఈ నెల 15వ తేదీలోగా 17 ఎంపీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ సమ్మేళనాలు పూర్తి చేయనున్నారు. వీటిల్లో పోలింగ్ బూత్‌ల కోఆర్డినేటర్లు మొదలు రాష్ట్రస్థాయి వరకు నాయకులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చేవెళ్ల, తదితర చోట్ల ఈ సమ్మేళనాలు పూర్తికాగా, 15 వరకు మిగతా పార్లమెంట్ సీట్ల పరిధిలో నిర్వహించనున్నారు. ప్రత్యేక ‘కాస్ట్ ఔట్ రీచ్’ప్రోగ్రామ్ వివిధ సామాజిక వర్గాలను కలుసుకునేందుకు ప్రత్యేకంగా ‘కాస్ట్ ఔట్ రీచ్’కార్యక్రమాన్ని కూడా బీజేపీ చేపట్టనుంది. జిల్లాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీల స్థాయిల్లో వివిధ కుల సంఘాలతో సమ్మేళనాలు, యువత, మహిళ, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా వివిధ వర్గాల వారితో ఎక్కడికక్కడ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించింది. నామినేషన్ల సమయంలో ర్యాలీలు ఈ నెల 25న రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోగా వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాల వేగం పెంచనున్నారు. 18వ తేదీ తర్వాత లోక్‌సభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ నెల 25వ తేదీ తర్వాత మే 13వ తేదీ పోలింగ్ వరకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా వంటి అగ్రనేతల పర్యటనల సందర్భంగా మాత్రమే పెద్ద బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. మిగతా ఎన్నికల ప్రచారమంతా ఇంటింటికీ వెళ్లడం, కార్నర్ మీటింగ్‌లు లాంటి స్వయంగా ఓటర్లను కలుసుకునే ‘ఓటర్ ఔటర్ రీచ్’కార్యక్రమాలకే నాయకత్వం ప్రాధాన్యతనివ్వనుంది. -
ఆ అనుమానాలు పోవాలంటే...
ఈవీఎంలతో అక్రమాలకు పాల్పడటం అసాధ్యమని భారత ఎన్నికల కమిషన్ చెబుతోంది. కానీ వీటిపై వస్తున్న సందేహాలను నివృత్తి చేయడంలో విఫలమవుతోంది. ఎన్నికలు అక్రమాలకు తావు లేకుండా జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలి కూడా! ఎన్నికలు పారదర్శకంగా జరిగాయా లేదా అన్నది తెలుసుకునేందు సులువైన పరిష్కారం, వీవీప్యాట్ స్లిప్‌లను అందివ్వడం!! స్పష్టంగా చెప్పాలంటే... ఓటర్లు ఓ బటన్ ను నొక్కడం ద్వారా ఓటేస్తారు. నొక్కినదానికే పడిందని నిర్ధారించే వీవీప్యాట్ స్లిప్ వీరికి భౌతికంగా అందుతుంది. ఓటరు ఈ స్లిప్‌ను సరి చూసుకుని మళ్లీ వీవీప్యాట్ బాక్స్‌లో వేయాలి. దీనివల్ల ఓట్లు రెండింటిలోనూ రికార్డు అవుతాయి. రెండింటినీ లెక్కించి, సరి చూసిన తరువాత ఫలితాలు ప్రకటించాలి. దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ప్రకటన చేస్తూ (మార్చి 16, 2024) భారత ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) రాజీవ్ కుమార్ చాలా ధీమాగా ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లతో అక్రమాలకు పాల్పడటం అసాధ్యమని స్పష్టం చేశారు. ఈవీఎంలన్నీ ఎన్నికల ప్రక్రియ, నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసి తయారు చేసినవని వివరించారు. ఈవీఎం వ్యవస్థలో బ్యాలెట్ యూనిట్,కంట్రోల్ యూనిట్‌తో పాటు, వోటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీప్యాట్) అనే మూడు భాగాలు ఉంటాయన్నది మనకు తెలుసు. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయా లేదా అన్నది తెలుసు కునేందుకూ, ఈవీఎంలపై వస్తున్న అనుమానాల నివృత్తికీ వీవీ ప్యాట్లు కీలకమవుతాయి. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం ఈవీఎంల పనితీరుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని బల్లగుద్ది మరీ చెబుతోంది. ఇంకోలా చెప్పాలంటే వీటిపై అనుమానాలు రేకెత్త డమే తప్పన్న చందంగా మాట్లాడుతోంది. ఈవీఎంల వల్ల ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా జరుగుతుందని, వీవీప్యాట్ స్లిప్పు లపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నది ఎన్నికల కమిషన్ వాదనగా ఉంది. నమ్మమంటే నమ్మాల్సిందేనా? ఈవీఎంల దుర్వినియోగం అసాధ్యమని సీఈసీ చెబుతున్నా ఓటర్లలో చాలామందికి ఆ నమ్మకమైతే లేదు. ఈవీఎంలపై సందేహాలు వద్దు అని చెప్పేందుకు సీఈసీ తానే రాసిన ఓ ఉర్దూ ద్విపదను ఉటంకించారు. ఆరోపణలపై ఈవీఎంలే స్వయంగా స్పందిస్తే ఎలా ఉంటుందో వివరించారు. ‘‘తీరని కోరికలకు అన్ని వేళల్లో అందరిపై దూషించడం సరికాదు. మీరేంటో మీరే నిరూపించుకోలేనప్పుడే ఈవీఎంలపై తప్పు మోపుతారు’’ అన్నారు. ఈవీఎంల దుర్వినియోగం ఆరోపణలను నిర్ద్వంద్వంగా తిరస్కరించడం, ‘తీరని కోరికలు’గా అభివర్ణించడంతోనే ఈవీఎంలు విశ్వసనీయ మైనవి అయిపోవు. ఎన్నికలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ బాధ్యత పూర్తయినట్టూ కాదు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలని కోరుతున్నది ప్రజాస్వామ్య వాదులు, రాజకీయ పార్టీలు, ఈవీఎం నిపుణులు. ఈవీఎంల విషయంలో పారదర్శకత లేదనీ, వాటిని నమ్మలేమనీ వీరందరూ పలు సందర్భాల్లో ముక్తకంఠంతో స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం ఇప్పటివరకూ చేయలేదు. ఈ ధోరణి అనుమానాలు మరిన్ని రెకెత్తేలా చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతోంది. దేశంలో పేదరికం తగ్గిపోయిందంటూ నీతి ఆయోగ్ విడుదల చేసిన సంఖ్యలను అస్సలు ప్రశ్నించకూడ దన్నట్టుగా ఉంది ఎన్నికల కమిషన్ ధోరణి. దేశ జనాభాలో 11 శాతం మంది మాత్రమే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారనీ, గడచిన తొమ్మిదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం కోరల నుంచి బయటపడ్డారనీ నీతి ఆయోగ్ చెబుతోంది. పారదర్శకత ఏమాత్రం లేని నేపథ్యంలో ఎవరైనా సరే ఎన్నికల కమిషన్ ఈవీఎంలపై చేస్తున్న ప్రకటనలను, ఇస్తున్న భరోసాలను ఎలా నమ్మగలరు? ఎన్నికలు అందరి వ్యవహారం... ఓటర్లు వేసిన ఓటును మార్చి చూపే అవకాశం కానీ, ఈవీఎంలు తప్పులు చేయడం కానీ అసాధ్యమని ఎన్నికల కమిషన్(ఈసీ) చెబు తోంది. కానీ చాలా కారణాల వల్ల అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు ఈవీఎంలో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు సంబంధించి 2019 సాధారణ ఎన్నికల్లో సుమారు 373 నియో జకవర్గాల గణాంకాల్లో తీవ్రమైన తేడాలున్నట్లు ‘ద క్వింట్’ వెబ్సైట్ గుర్తించింది. ఈ విషయంపై సీఈసీ, ఈసీ స్పందన నాస్తి. ఎన్నికల తరువాత ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే, ఆరోపణలు చేస్తే వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే. తద్వారా మాత్రమే అది ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందన్న భరోసా సామాన్యుడికి ఇవ్వగలదు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు మాత్రమే ఈవీఎంల విశ్వసనీ యతపై సందేహాలు లేవనెత్తుతారు అని సీఈసీ చేసిన వ్యాఖ్య రెండు విషయాలను సూచిస్తుంది. మొదటిది... ఎన్నికల్లో గెలిచేందుకు తమ వంతు శ్రమ చేయని వారు చెప్పే కుంటిసాకు అని చెప్పే ప్రయత్నం. రెండోది... ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు మాత్రమే పరిమితమని చెప్పడం. రెండూ తప్పే. ప్రజాస్వామ్యంలో సర్వాధికారి పౌరుడే. ఈ ప్రజాస్వామ్య సర్వాధికారి సార్వభౌమత్వాన్ని తనకు నచ్చిన వ్యక్తికి దఖలు పరచడమే ఓటింగ్. ఈ పని జరగాలంటే ఎన్నికలు, ఓటింగ్ వ్యవస్థ ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు లోబడి ఉండాలి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, అక్రమాలకు తావు లేకుండా జరగడమే కాదు... అలా జరిగినట్లు కనిపించాలి కూడా. అంతేకాదు... తాము వేసిన ఓటు సక్రమంగా పడిందా లేదా ఓటరుకు స్పష్టంగా తెలిసేలా ఉండాలి. ఓటింగ్, లెక్కింపు వ్యవస్థలు రెండూ కూడా ఓటరు ఎవరికి ఓటేశారో వారికే ఓటు పడిందని ధ్రువీకరించేలా పనిచేయాలి. వేసిన వెంటనే రికార్డు కావాలి. రికార్డు అయిన విధంగానే లెక్క కూడా తేలాలి. ఈవీఎం యంత్రాలపై ఈసీ నిఘా అనేది రెండు కారణాల వల్ల అంత నమ్మదగ్గదిగా అనిపించదు. మొదటిది ఈవీఎం యంత్రాలను ప్రభావితం చేయగలమని, లేదా అవసరాలకు తగ్గట్టుగా పనిచేసేలా చేయగలమన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈసీ తగినంతగా ప్రయత్నించకపోవడం;ఓటర్లు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల్లో ఈసీ విశ్వసనీయత అనేది అతి నిమ్న స్థాయికి చేరడం. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వివక్ష లేకుండా ఎన్నికల కోడ్‌ను అమలు చేయలేకపోవడం వాటిల్లో ఒకటి మాత్రమే. ఈవీఎంలు సక్రమంగా పనిచేయవు అనేందుకూ, నిర్దిష్ట పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించుకోవచ్చు అనేందుకూ ఆధారాలు లేవు. అక్రమాలు జరిగే అవకాశం ఉన్నంతమాత్రాన జరిగినట్టూ కాదు. కానీ సాక్ష్యం లేకపోవడం అన్నది సంఘటనే జరగకపోవడం కాదు. వీవీప్యాట్ స్లిప్ ఇవ్వాలి! ఎన్నికల సమయంలో వ్యవస్థలు, వనరులన్నింటిపై పెత్తనం, అధికారం ఒక పార్టీదిగా ఉంటుంది. అందుకే ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా అనుమానాలు, ఆరోపణలు వస్తూంటాయి. ఈవీఎంల విషయంలో ఓటర్లు, ప్రతిపక్ష పార్టీల అతిపెద్ద ఆందోళన ఏమిటంటే... తమ ఓటు రికార్డు అయ్యిందా, లేదా అన్నది. ఈ ఆందోళనకు సులువైన పరిష్కారం ఉంది. ఓటర్లకు వీవీప్యాట్ స్లిప్‌లను అందివ్వడం. ఓటరు తాను అనుకున్న పార్టీకే ఓటు పడిందని నిర్ధారించుకుంటే ఆ స్లిప్‌ను బాక్స్‌లో మళ్లీ వేస్తాడు. స్పష్టంగా చెప్పాలంటే... ఓటర్లు ఓ బటన్ ను నొక్కడం ద్వారా ఓటేస్తారు. ఆ తరువాత వీరికి భౌతికంగా వీవీప్యాట్ స్లిప్ అందుతుంది. ఓటరు ఈ స్లిప్‌ను సరి చూసుకుని మళ్లీ వీవీప్యాట్ బాక్స్‌లో వేయాలి. దీనివల్ల ఓట్లు రెండింటిలోనూ రికార్డు అవుతాయి. రెండింటినీ లెక్కించి సరి చూసిన తరువాత ఫలితాలు ప్రకటించాలి. గత ఏడాది డిసెంబరులో ఇండియా కూటమి కూడా ఇదే సూచన చేసింది. సుప్రీంకోర్టు విచా రణలోని అంశాల్లోనూ ఇది ఉంది. వీవీప్యాట్ స్లిప్స్‌ను లెక్కించి ఫలితాలను ప్రకటించడం వల్ల ఫలితాల వెల్లడిలో కొంత జాప్యం జరగవచ్చు కానీ... ఏడు దశల్లో నెలన్నర పాటు ఎన్నికలు జరగ్గా కానీ జాప్యం ఒకట్రెండు రోజులు ఫలితాలు వెల్లడించేందుకు అయితే నష్టమేమీ ఉండదు. ఎ ఎల్ ఐ చౌగులే వ్యాసకర్త ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వతంత్ర జర్నలిస్టు (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన ఓటర్లు
సాక్షి, అమరావతి: ఎప్పుడూ లేని విధంగా ఈసారి సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంపై యువత ఆసక్తిని చూపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఈ నెల రెండో తేదీ నాటికి రాష్ట్రంలో కొత్తగా 1,26,549 మంది ఓటర్లు నమోదు అయినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకటించిన రోజుకి రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య 2,08,49,730 గా ఉంటే ఏప్రిల్ 2కి 2,09,16,389కు పెరిగినట్లు తెలిపింది. పురుష ఓటర్ల సంఖ్య 2,00,84,276 నుంచి 2,01,44,166కు పెరిగినట్లు పేర్కొంది. నామినేషన్లు దాఖలు చివరి రోజు వరకు కొత్త ఓటర్లను చేర్చుకొనే అవకాశం ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. జనవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల సవరణ జాబితాతో పోలిస్తే ఈ రెండున్నర నెలల్లో 2,56,781 మంది ఓటర్లు పెరిగారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు, కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోందని, దీంతో ఈసారి పెద్ద ఎత్తున యువ ఓటర్లు నమోదవుతున్నారని అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య రికార్డు స్థాయిలో 10 లక్షలు దాటుతోందంటున్నారు. 2019 తర్వాత పెరిగిన ఓటర్లు 41.31 లక్షలు 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పురుష, మహిళా ఓటర్ల సంఖ్య 3,69,29,330 (సర్విస్, థర్డ్ జెండర్ ఓట్లు కాకుండా)గా ఉంటే అది ఇప్పుడు 4,10,60,555కు పెరిగింది. అంటే 41,31,225 మంది కొత్తగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2019లో పురుష ఓటర్లు 1,83,24,588 మంది ఉండగా ఇప్పుడు 2,01,44,166కు, మహిళా ఓటర్లు 1,86,04742 నుంచి 2,09,16,389కు పెరిగారు. సర్విసు, ఎన్నారై, థర్డ్ జెండర్ ఓటర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే 4.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు పెరుగుతున్న ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. -
ఈ లోక్‌సభ నియోజక వర్గాలు.. దేశ రాజకీయాల్లో కీలకం!
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు జోరుగా సన్నాహాలు సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. అయితే దేశంలోని కొన్ని లోక్‌సభ నియోజకవర్గాలు దేశరాజకీయాలను అమితంగా ప్రభావితం చేస్తుంటాయి. అత్యధిక ఓటర్లతో పాటు వివిధ అంశాలు ఆయా నియోజకవర్గాలను అగ్రస్థానంలో నిలిపివుంచుతున్నాయి. ఈ జాబితాలోని ప్రముఖ నియోజకవర్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మల్కాజిగిరి, తెలంగాణ ఓటర్ల సంఖ్య: సుమారు 31,50,303. తెలంగాణలోని మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గంలో గణనీయమైన సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. ఓటరు జనాభా పరంగా అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం మల్కాజ్గిరి. తెలంగాణలో జనాభా వైవిధ్యానికి ఈ ప్రాంతం నిలయంగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రాముఖ్యతను ఈ నియోజకవర్గం ప్రతిబింబిస్తుంది. నేతలందరూ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. గత ఎన్నికల్లో మాల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి. అవుటర్ ఢిల్లీ, ఢిల్లీ ఓటర్ల సంఖ్య: సుమారు 25 లక్షలు. ఔటర్ ఢిల్లీ.. జనాభా పరంగా అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ద్వారక, నజఫ్‌గఢ్, ముండ్కా తదితర ప్రాంతాలు దీనిలో ఉన్నాయి. పట్టణ, గ్రామీణ జనాభా కలయికతో ఈ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల సమయంలో అధిక ఓటింగ్ శాతాన్ని స్థిరంగా నమోదు చేస్తూ వస్తోంది. ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్ ఓటర్ల సంఖ్య: సుమారు 23 లక్షలు. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో ఉన్న ఘజియాబాద్, వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామిక వృద్ధికి ఉదాహరణగా నిలిచింది. ఇది ఓటర్ల సంఖ్య పెరిగేందుకు దారితీసింది. పట్టణ, గ్రామీణ జనాభా ఇక్కడ అత్యధికం. దేశ రాజకీయాలకు కీలక నియోజకవర్గంగా ఘజియాబాద్ అవతరించింది. బెంగళూరు సౌత్, కర్ణాటక ఓటర్ల సంఖ్య: సుమారు 20 లక్షలు. భారతదేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులోని సౌత్ బెంగళూరులో జయనగర్, బసవనగుడి, ఎలక్ట్రానిక్ సిటీలాంటి ప్రధాన ప్రాంతాలు ఉన్నాయి. గణనీయమైన సంఖ్యలో ఇక్కడ ఓటర్లు ఉన్నారు. కర్ణాటక రాజకీయాలకు ఈ నియోజనవర్గం కేంద్ర బిందువుగా ఉంది. అలాగే దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుంటుంది. ముంబయి నార్త్, మహారాష్ట్ర ఓటర్ల సంఖ్య: సుమారు 18 లక్షలు. ముంబై నార్త్ 18 లక్షల జనాభా కలిగిన లోక్‌సభ నియోజకవర్గం. మలాడ్, కండివాలి, బోరివలి తదితర ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఉన్నత వర్గాల నుండి అట్టడుగు వర్గాల ప్రజలకు నిలయంగా ఈ నియోజకవర్గం ఉంది. భారతదేశ ఆర్థిక చిత్రాన్ని చూపించే ఈ నియోజనవర్గం దేశరాజకీయాల్లో కీలకంగా కనిపిస్తుంది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఢిల్లీ ఓటర్ల సంఖ్య: సుమారు 17 లక్షలు. ఈశాన్య ఢిల్లీలో షహదారా, సీలంపూర్, యమునా విహార్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఇది జాతీయ రాజధానిలో సామాజిక,ఆర్థిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. వివిధ నేపథ్యాలు కలిగిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఇక్కడున్నారు. చాందినీ చౌక్, ఢిల్లీ ఓటర్ల సంఖ్య: సుమారు 16 లక్షలు. చాందినీ చౌక్.. ఇది చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. సందడిగా ఉండే మార్కెట్లు ఇక్కడ కనిపిస్తాయి. ఢిల్లీలో ఇది ఒక ప్రధాన లోక్‌సభ నియోజకవర్గం. ఇక్కడ పాత ఢిల్లీ, దర్యాగంజ్, చాందినీ చౌక్ తదితర ప్రాంతాలున్నాయి. విభిన్న సామాజిక, ఆర్థిక వర్గాల ఓటర్లు ఇక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తుంటారు. నార్త్ వెస్ట్ ఢిల్లీ, ఢిల్లీ ఓటర్ల సంఖ్య: 15 లక్షలు. వాయువ్య ఢిల్లీలో రోహిణి, నరేలా, కిరారి తదితర ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఒకవైపు విశాలమైన పట్టణ ప్రాంతం, మరోవైపు గ్రామీణ ప్రాంతం ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఢిల్లీ ఓటర్లలో అత్యధికులు ఈ ప్రాంతంలోనే కనిపిస్తారు. ఇది దేశ రాజధానిలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంది. తిరువనంతపురం, కేరళ ఓటర్ల సంఖ్య: సుమారు 14 లక్షలు. కేరళ రాజధాని తిరువనంతపురం రాజకీయంగా అవగాహన కలిగిన జనాభాకు నిలయంగా ఉంది. ఇక్కడి ఓటర్లు ఎన్నికల్లో చురుకుగా పాల్గొనడం కనిపిస్తుంది. ఇది రాష్ట్ర సాంస్కృతిక కేంద్రంగా గుర్తింపు పొందింది. గణనీయసంఖ్యలో ఇక్కడున్న ఓటర్లు రాష్ట్ర రాజకీయాలను అమితంగా ప్రభావితం చేస్తుంటారు. పుణె, మహారాష్ట్ర ఓటర్ల సంఖ్య: 13 లక్షలు. పూణే ప్రాంతం విద్యా సంస్థలతో పాటు సాంస్కృతిక కేంద్రాలకు నిలయంగా ఉంది. శివాజీనగర్, కోత్రుడ్, హడప్సర్ తదితర పేరొందిన ప్రాంతాలు ఇక్కడ కనిపిస్తాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనే యువకులు, విద్యావంతులైన ఓటర్లు ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్నారు. లక్నో, ఉత్తరప్రదేశ్ ఓటర్ల సంఖ్య: దాదాపు 12 లక్షలు లక్నో.. ఇది ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం. దేశంలో రాజకీయ ప్రాముఖ్యతను కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఎన్నికల సమయంలో గణనీయమైన ఓటింగ్ నమోదవుతుంటుంది. హజ్రత్‌గంజ్, అలంబాగ్, గోమతి నగర్ తదితర ప్రాంతాలు ఇక్కడున్నాయి. సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓటర్లు ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్నారు. దేశంలోని ఈ లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేయడంలో కీలకంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలు క్రియాశీల రాజకీయ భాగస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తున్నాయి. -
ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
సాక్షి, అమరావతి: ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత, హింసారహిత ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఇందుకోసం గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, కేంద్ర ఏజెన్సీ అధికారులను ఆదేశించింది. ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాలు ఉండాలని సూచించింది. ఎన్నికల తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని పార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలు ఇవ్వాలని సూచించింది. సాధారణ ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు జ్ఞానేష్‌కుమార్, సుఖ్బీర్సింగ్ సంధు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, కేంద్ర ఏజెన్సీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరగనున్న ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైనవారందరూ సమన్వయంతో చర్యలు తీసుకోవడంపై దిశానిర్దేశం చేశారు. మద్యం, నగదు, మత్తుపదార్థాలు, ఆయుధాల అక్రమ రవాణా, తాయిలాల పంపిణీపై కఠినమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. భద్రతా దళాల తరలింపు, సున్నిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రాల సరిహద్దుల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలిచ్చారు. పోలింగ్ రోజున అంతర్రాష్ట్ర సరిహద్దుల్ని మూసేయాలని సూచించారు. నేరస్తులు, సంఘవిద్రోహ శక్తులపై నిఘా ఉంచాలని చెప్పారు. లైసెన్స్డ్ ఆయుధాలను సకాలంలో డిపాజిట్ చేయించుకోవాలని, నాన్‌బెయిలబుల్ వారెంట్లను వెంటనే అమలు చేయాలని సూచించారు. ముప్పు ఎదుర్కొంటున్న నేతలు, అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని నిర్దేశించారు. వ్యయ పర్యవేక్షణ కట్టుదిట్టంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ ఎక్కడా రీ పోలింగ్‌కు అవకాశం లేని విధంగా ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పోలింగ్‌కు 48 గంటల ముందు (సైలెంట్ పీరియడ్) ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం వంటి తాయిలాల పంపిణీకి ప్రయత్నాలు జరుగుతాయని, వాటిని సమర్థంగా అడ్డుకోవాలని చెప్పారు. కట్టుదిట్టంగా కోడ్ అమలు: సీఎస్ జవహర్‌రెడ్డి ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు రూ.258 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులను స్వా«దీనం చేసుకున్నట్టు వివరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో 150 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 132 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు, 632 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. పటిష్ట భద్రత: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి మావోయిస్టుల సమస్య ఉండే 91 పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల మహారాష్ట్రకు పంపిన 10 కంపెనీల పోలీసు బలగాలను తిప్పి పంపడమేగాక అదనపు బలగాలను పంపాలని ఆయన కోరారు. ఏపీసీఈవో ముఖేశ్‌కుమార్ మీనా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్‌కుమార్‌ప్రసాద్, రజత్‌భార్గవ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్త, అదనపు డీజీపీ బాగ్చి, పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్, ఎక్సైజ్ కమిషనర్ వివేక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బుందేల్‌ఖండ్‌లో బందిపోటు రాజకీయాలు!
ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఒకప్పుడు బందిపోటు దొంగల కనుసన్నల్లోనే రాజకీయాలన్నీ నడిచేవి. దశాబ్దాల తరబడి రాజకీయాలపై వారి ఆధిపత్యం కొనసాగింది. ఈ బందిపోటు దొంగలు ఎవరికి మద్దతిస్తే వారే ఎన్నికల్లో గెలిచేవారు. ఓట్ల కోసం ఆ బందిపోటు దొంగలు ఓటర్లను బెదిరించేవారు. ఎన్నికల రాజకీయాలను వారు తమ గుప్పిట్లో పెట్టుకునేవారు. 80వ దశకంలో యూపీలో భాగమైన బుందేల్‌ఖండ్‌లోని ఏడు జిల్లాలలోని ఆరింటిలో బందిపోట్లు తమ ఆధిపత్యం చెలాయించారు. ఝాన్సీ, జలౌన్, బందా, మహోబా, హమీర్పూర్, చిత్రకూట్‌లో వారి ఆటలు సాగేవి. దాదువా, నిర్భయ్ సింగ్ గుర్జార్, థోకియా తదిర బందిపోట్లు తాము ఈ ప్రాంతానికి రాజులుగా ప్రకటించుకున్నారు. తరువాతి కాలంలో వీరు రాజకీయ నేతలుగా, రాజకీయాలను శాసించేవారుగా మారారు. నేతలుగా మారిన దోపిడీ దొంగల జాబితాలో ముందుగా దాదువా పేరు వినిపిస్తుంది. దాదువా తన కుమారుడు వీర్ సింగ్‌ను జిల్లా పంచాయతీ అధ్యక్షునిగా చేయడంలో విజయం సాధించాడు. దాదువా 2007లో ఎన్కౌంటర్లో మృతిచెందాడు. అయితే అప్పటికే అతని కుటుంబ సభ్యులు రాజకీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీర్ సింగ్ చిత్రకూట్ నుంచి ఎస్పీ టికెట్ పై ఎమ్మెల్యేగా, అతని సోదరుడు బాల్ కుమార్ పటేల్ మీర్జాపూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మేనల్లుడు రామ్ సింగ్ కూడా ఎస్పీ టిక్కెట్‌పై ప్రతాప్‌గఢ్‌లోని పట్టి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందాడు.దాదువా మాదిరిగానే అంబికా పటేల్ అలియాస్ థోకియా కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో తమ హవా చాటుకున్నారు. 2005లో థోకియా అత్త సరిత బందాలోని కార్వీ బ్లాక్‌కు అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో అత్త సవిత జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2007లో తల్లి పిపారియా దేవి రాష్ట్రీయ లోక్‌దళ్ టిక్కెట్‌పై బందాలోని నారైని అసెంబ్లీ నుండి ఎన్నికలలో పోటీ చేశారు. ఆమె థోకియా పేరుతో 27 వేల ఓట్లను పొందగలిగారు. నిర్భయ్ సింగ్ గుర్జార్ కూడా ఎన్నికల్లో కాలు మోపారు. ఝాన్సీలోని గరౌత, జలౌన్, భోగానిపూర్‌లలోని రాజకీయాలన్నీ అతని కనుసన్నల్లో నడిచాయి. నిర్భయ్ సింగ్ గుర్జార్ అండతో నేతలు ఎన్నికల రేసులో దూసుకెళ్లేవారు. ఫూలన్ దేవి ఝాన్సీ డివిజన్లోని జలౌన్ జిల్లాలోని గోర్హా అనే చిన్న గ్రామానికి చెందిన బందిపోటు రాణిగా పేరొందింది. 1981 ఫిబ్రవరి 14న బెహ్మాయి ఊచకోత ఘటనతో ఫూలన్ దేవి దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. జైలు నుంచి విడుదలైన రెండేళ్ల తర్వాత 1996లో సమాజ్‌వాదీ పార్టీ ఆమెకు లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. ఫూలన్ తన తొలి ఎన్నికల్లోనే మీర్జాపూర్ ఎంపీగా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఆమె హత్యకు గురయ్యింది. -
వందేళ్లు దాటిన ఓటర్లు.. ఇక్కడ 5 వేల మందికి పైనే..
దేశ చరిత్రలో తొలిసారిగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. భారత ఎన్నికల సంఘం ప్రకారం.. 85 ఏళ్లు పైడిన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చే పని లేకుండా ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. 5 వేల మందికి పైగా శతాధికులు పంజాబ్‌లో ఇంటి నుంచి ఓటు వేసేందుకు అర్హులైన వారిలో 100 నుంచి 119 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు ఐదు వేల మందికి పైగా ఉన్నారు. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సిబిన్ ప్రకారం.. ఈ రాష్ట్రంలో మొత్తం 205 మంది 120 ఏళ్లు పైబడిన ఓటర్లు ఉన్నారు. ఇందులో 122 మంది పురుషులు, 83 మంది మహిళలు ఉన్నారు. ఇక 100 నుంచి 119 ఏళ్ల మధ్య వయసువారు మొత్తం 5,004 మంది ఉన్నారు. 100 నుండి 109 సంవత్సరాల వయసువారిలో 1,917 మంది పురుషులు, 2,928 మంది మహిళలు ఉన్నారు. అలాగే 110 నుండి 119 ఏళ్ల ఓటర్ల విషయానికి వస్తే పురుషులు 59 మంది, మహిళలు 100 మంది ఉన్నారు. మొదటిసారి ఓటర్లు పంజాబ్‌లో మొత్తం 2,12,71,246 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,11,92,959 మంది పురుషులు, 1,00,77,543 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 4,89,631 మంది 18-19 ఏళ్లలోపువారు అంటే మొదటి సారి ఓటర్లు. పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న ఏడవ దశలో పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో ఓటింగ్ శాతం 65.96 శాతం నమోదైంది. ఈసారి 70 శాతానికి పైగా ఓటింగ్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. -
ఈలేస్తే.. క్లోజ్! .. గంట వ్యవధిలోనే ఘటనాస్థలికి ఫ్లయింగ్ స్క్వాడ్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో రాజకీయ పార్టీల హోర్డింగులు సోమవారం ఉదయం వరకూ ఉన్నాయి. వీటిని సీ–విజిల్ ద్వారా ఫొటోలు తీసి ఎవరో అప్లోడ్ చేశారు. అంతే.. నిమిషాల వ్యవధిలో అక్కడకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని, యుద్ధ ప్రాతిపదికన హోర్డింగులను తొలగించింది. ఈ యాప్ ఎంత వేగంగా పని చేస్తుందనేందుకు ఈ చర్యలే సాక్ష్యం. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సర్వ సన్నద్ధమయింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలు.. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం.. ఎన్నికల్లో పార్టీల ప్రలోభాలు, కోడ్ ఉల్లంఘనలపైనా దృష్టి సారించింది. ఉల్లంఘనులపై చర్యలకు ‘సీ విజిల్’ యాప్‌ను సిద్ధం చేసింది. – ప్రత్తిపాడు ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తే చాలు.. సాధారణ ఎన్నికల్లో ఎవరైనా ప్రవర్తనా నియమావళిని (ఎన్నికలకోడ్) ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, మద్యం, డబ్బు, వస్తు సామగ్రి పంపిణీ వంటి వాటికి పాల్పడినా, అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ఓటర్లకు కానుకలు అందజేసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే నేరుగా ఎన్నికల సంఘానికి చేరిపోతాయి. కులమత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలనూ ఆడియో ద్వారా రికార్డు చేసి అప్లోడ్ చేయవచ్చు. అత్యంత వేగంగా స్పందన సీ విజిల్ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులపై అత్యంత వేగంగా స్పందన ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా సంబంధిత ప్రదేశం నుంచే ఫొటోలు, వీడియోలు, ఆడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. అప్లోడ్ చేసిన గంటలోపు అక్కడకు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంటుంది. ఘటనపై 90 నిమిషాల్లో ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారు. ఎన్నికల కమిషన్ అందుబాటులోనికి తీసుకువచి్చన ఈ యాప్‌ను ఓటర్లు వినియోగించుకోవాలి. – ఎం.పద్మజ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ప్రత్తిపాడు గంట వ్యవధిలోనే.. ► ఎవరైనా, ఎక్కడి నుంచైనా యాప్‌లో అప్లోడ్ చేసిన ఐదు నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారికి వెళుతుంది. ఆయన దీని పరిశీలనకు ఫీల్డ్‌లో ఉన్న టీముకు పంపిస్తారు. ►15 నిమిషాల్లో ఫీల్డ్‌లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుతుంది. ► 30 నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చర్యలు మొదలుపెట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతుంది. ►యాభై నిమిషాల్లో రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదును క్లోజ్ చేస్తారు. ►ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాల్లో ప్రతిస్పందన ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. ►యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ► ఇన్స్టాల్ చేసుకునే సమయంలో రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ► ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలనుకున్న సమయంలో మొబైల్లోని జీపీఎస్ ఆన్‌లో ఉంచాలి. దాని ఆధారంగానే అధికారులు సంబంధిత ప్రాంతానికి నేరుగా చేరుకోగలుగుతారు. ► యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో వచ్చిన ఓటీపీ ద్వారా యాప్ యాక్టివేట్ అవుతుంది. ► ఆ తర్వాత వీడియోలు, ఫొటోలు అప్ లోడ్ చేసి నేరుగా యాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపవచ్చు. -
రాహుల్ కాదు వరుణ్.. అమేథీ ఓటర్ల యూటర్న్?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమేథీ(యూపీ) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపడంతో, గాంధీ కుటుంబానికి పట్టంకట్టే స్థానికులు ఇప్పుడు వరుణ్ గాంధీవైపు చూస్తున్నారు. రాహుల్ 2019లో అమేథీ నుండి బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయినప్పటి నుంచి తన ‘కుటుంబ నియోజకవర్గాన్ని’ తిరిగి దక్కించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. రాహుల్ ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. అలాగే రాహుల్ తిరిగి వయనాడ్ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే.. రాయ్‌బరేలీని ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల సోనియా గాంధీ అమేథీ నియోజకవర్గ ప్రజలకు రాసిన లేఖలో భవిష్యత్తులో ఇక్కడి ప్రజలు తన కుటుంబానికి మద్దతు ఇస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా దివంగత సంజయ్ గాంధీతోపాటు తన రాజకీయ అరంగేట్రం చేసిన ప్రముఖ కాంగ్రెస్ నేత రామ్ కరణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. 1980లో సంజయ్ గాంధీ అమేథీ సీటును గెలుచుకోవడంతో గాంధీ కుటుంబానికి అమేథీతో అనుబంధం ఏర్పడిందని అన్నారు. రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అంగీకరించకపోతే వరుణ్ గాంధీ అమేథీ నుండి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఇదేగానీ జరిగితే, తామంతా వరుణ్‌కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. అయితే పార్టీ విధానాలను తీవ్రంగా విమర్శించే వరుణ్ గాంధీకి బీజేపీ టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో వరుణ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ అతనికి మద్దతు ఇచ్చే అవకాశాలున్నయనే వార్తలు వినిపిస్తున్నాయి. -
హామీలపై సమాచారం.. ఓటర్ల హక్కు: సీఈసీ
చెన్నై: ఎన్నికల సమయంలో రాజకీయ పారీ్టలు ఇచ్చే హామీలు ఆచరణ సాధ్యమేనా? అనేది తెలుసుకొనే హక్కు ఓటర్లకు ఉందని ముఖ్య ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. అయితే, ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని గుర్తుచేశారు. మేనిఫెస్టోలో హామీలను పొందుపర్చే హక్కు రాజకీయ పారీ్టలకు ఉన్నట్లే.. ఆయా హామీల్లో నిజమెంత? వాటిని అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి ఎలా సేకరిస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లు ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై న్యాయస్థానం విచారణ కొనసాగిస్తోందని వెల్లడించారు. రాజీవ్ కుమార్ శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలు, వాటిని అమలు చేసే విధానం, నిధుల సేకరణ మార్గాలను రాజకీయ పారీ్టలు తప్పనిసరిగా వెల్లడించేలా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఒక ‘ప్రొఫార్మా’ సిద్ధం చేశామని తెలిపారు. -
ఆ రాష్ట్రంలో వందేళ్లు దాటిన ఓటర్లు.. వేలల్లో!
బీహార్‌లో లోక్‌సభ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికల సన్నాహాల పరిశీలనకు బీహార్‌కు వచ్చిన ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం ఇక్కడి ఏర్పాట్లను సమీక్షించింది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల అధికారులు సమావేశమయ్యారు. బీహార్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.64 కోట్లని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా ఈసారి 9.26 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారని వెల్లడించారు. బీహార్‌లో 100 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 21 వేలకు పైగా ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా చూసేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందన్నారు. ఈసారి అభ్యర్థులకు ప్రచారానికి ఐదు వాహనాలకు బదులు 14 వాహనాల వినియోగానికి అనుమతిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. దేశంలో 18వ లోక్‌సభకు ఎంపీలను ఎన్నుకునేందుకు మరికొద్ది వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించింది. Live from 2 pm today : Press Conference at Patna by Election Commission after Review of Poll-preparedness of #Bihar & #Jharkhand for #GeneralElection2024 https://t.co/G33lHSAJxg — Spokesperson ECI (@SpokespersonECI) February 21, 2024 -
సాధారణ ఎన్నికల్లో ఓటర్లు ఎంతమందంటే..!
ప్రజాప్రతినిధులను ఎన్నుకోని తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వివిధ స్థాయిల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటారు. ఈసారి దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌లోనే జరగనున్నాయి. అలాగే ఎన్నికల ముఖ్య అధికారి సాధారణ ఎన్నికల జరిగే అవకాశం ఉన్న తాత్కాలిక తేదీని కూడా జారీ చేశారు. ఆ తేదీకి అటు ఇటుగా పలు దశల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో ఈ సారి ఓటర్లు ఎంతమంది? వారిలో మహిళా ఓటర్లు ఎంతమందంటే..? ఈసారి దేశంలో జరగబోయే సాధారణ ఎన్నికల కోసం ప్రంపచంలోనే అత్యధిక మంది ఓటర్లు నమోదయ్యారని ఎన్నికల సంఘం పేర్కొంది. అందుకోసం ఇంటెన్సివ్ స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 పేరుతో జరిపిన సర్వేలో ఈ విషయంలో వెల్లడయ్యింది. అంతేగాదు జనవరి 1,2024ని అర్హత తేదీగా సూచిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/స్వయం ప్రతిపత్తి ప్రాంతాల వారిగా ఓటర్ల జాబితాలను కూడా ప్రచురించింది. అలాగే నియోజక వర్గాల విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్, అస్సాం వంటి రాష్ట్రాల్లో విజయవంతంగా ఓటర్ల జాబితాల సవరణ పూర్తయ్యింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏకంగా 96.88 మంది అత్యధిక ఓటర్లు నమోదయ్యారు. ఈ ఓటర్ల జాబితాలో లింగ సమానత్వం హైలెట్‌గా నిలిచింది. ఈసారి కనివినీ ఎరుగని రీతీలో మహిళా ఓటర్ల నమోదులో పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది కొత్తగా 2.63 కోట్ల మంది ఓటర్లు నమోదవ్వగా, వారిలో మహిళా ఓటర్ల జాబితా ఏకంగా 1.41 కోట్ల మంది నమోదు చేసుకోవడం విశేషం. ఓటు హక్కు వినియోగంలో పురుష ఓటర్ల కంటే సుమారు 15% పెరిగింది. అంతేగాదు లింగ నిష్పత్తి 2019లో 940 ఉండగా అది కాస్తా 2024కి 948కి పెరిగడం విశేషం. అలాగే ఈసారి 2 కోట్ల మంది యువ ఓటర్లు నమోదు చేసుకున్నారు. దీంతోపాటుగా వికలాంగులకు కూడా ఓటింగ్‌లో అన్ని రకాల వెసులబాటు కల్పించడంతో వారి నమోదు కూడా కాస్త పెరిగింది. ఎన్నికల సంఘం అధికారుల చేత ఇంటింటికి సమగ్ర సర్వే చేయించి మరీ ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. ఆ జాబితాలో 1,65,76,654 మంది చనిపోయినవారు, డూప్లికేట్ ఓటర్లు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినవారు ఉన్నారు. ఇందులో 67,82,642 మంది చనిపోయిన ఓటర్లు, 75,11,128 మంది శాశ్వతంగా మారిన/గైర్హాజరైన ఓటర్లు ఉండగా, 22,05,685 నకిలీ ఓటర్లు ఉన్నారు. అలాగే ఈసారి ఓటర్లగా నమోదు చేసుకునే దరఖాస్తులు ఏకంగా 10.64 లక్షలకు పైగా వచ్చినట్లు ఎన్నికల సంఘం పేర్కొది. .ఈ సారిగా ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినయోగించుకునేలా ముఖ్యంగా బలహీన గిరిజన వర్గాలపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఇంత భారీ స్థాయిలో ఓటర్లు నమోదవ్వడం అనేది భారతదేశం స్థితిస్థాపకత, ప్రజలకు ప్రజాస్వామ్య విధానం పట్ల ఉన్న నిబద్ధతను నొక్కి చెబుతోంది. ఎన్నికల సంఘం దృష్టి సారించిన అంశాలు.. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్‌ను ఎక్కువ మంది ఓటర్లు నమోదయ్యేలా ఈ కింది అంశాలపై ప్రత్యేక దృష్టి సారించేలా అధికారులు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అవేంటంటే.. పారదర్శకత స్వచ్ఛత లింగ నిష్పత్తి చేరిక పారదర్శకత చర్యలు వివిధ రాజకీయ పార్టీలతో తరచుగా జిల్లాఎన్నికల అధికారులు,ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు సాధారణ సమావేశం అవ్వడం. స్పెషల్ సమ్మరీ రివిజన్తో డేటా సేకరించడం. ఓటర్ల జాబితా కాపీలను రాజకీయ నాయకులతో కలిసి షేర్ చేసుకోవడం. వారి అభ్యంతరాలను నోటీసు చేయండం. గడవు ముగిసేలోపు చేయాల్సిన ధృవీకరణ, ఫీల్డ వెరిఫికేషన్ స్వచ్ఛత డూప్లికేట్/బహుళ ఎంట్రీల తొలగింపు. చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపు. ఓటర్ల ఫోటోల్లో వ్యత్యాసాలను తొలగించడం అలాగే ఓటర్ల ఫోటోల చిత్ర నాణ్యతను మెరుగుపరచడం. అంతరాలు లేకుండా.. ఓటర్లు/జనాభా నిష్పత్తితో అంతరాలు తగ్గించడం లింగ నిష్పత్తి వయస్సు వారీగా జాబితా తీసుకోవడం (ప్రత్యేకంగా 18 నుంచి 19, 19 నుంచి 20 ఏళ్లు వారీగా ) చేరిక: దివ్యాంగులు సులభంగా ఓటు వేసేలా ఎన్నికల డేటాబేస్‌లో గుర్తింపు ముఖ్యంగా చదువుకున్న యువత నమోదుపై దృష్టిసారించేలా చేయటం మహిళా ఓటర్లను పెంచేలా డ్రైవ్‌లు అలాగే థర్డ్ జెండర్‌లో పెరుగుతున్న నమోదు కోసం కేంద్రీకృత వ్యూహం ముఖ్యంగ బలహీన గిరిజనలు నూటికి నూరు శాతం నమోదు చేసుకునేలా ప్రత్యేక ప్రయత్నాలు. ఇంతలా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భారీగా నమోదు రాజకీయ పార్టీలు, పౌరులు అందించిన సహకారం వల్లే సాధ్యమయ్యిందని ఎన్నికల కమిషన్ పేర్కోంది. అలాగే ఎలక్టోరల్ జాబితా సవరణ 2024లో ఇంకా ఎన్రోల్ చేయించుకోని అర్హులైన పౌరులు ఇప్పటికైనా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎన్నికల నామినేషన్ లోపు ఓటర్లు అప్డేట్ చేయించుకునే వెసులుబాటు ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. (చదవండి: 'మిలియనీర్లుగా బిచ్చగాళ్లు'..జస్ట్ 45 రోజుల్లో ఏకంగా రూ. 2.5 లక్షలు..!) -
ప్రపంచంలో అత్యధిక 'ఓటర్లు' మనకే!
ఢిల్లీ, సాక్షి: అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. ప్రపంచంలో అత్యధిక ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల కోసం దాదాపుగా 97 కోట్ల మంది ఓటు నమోదు చేయించుకున్నారని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు విడుదల చేసింది. తద్వారా గత లోక్‌సభ ఎన్నికల ఓటర్ల కంటే.. ఆరుశాతం ఎక్కువ ఓటు రిజిస్ట్రేషన్ నమోదైందని ఈసీ స్పష్టం చేసింది. పుణేలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో ఈ వివరాల్ని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఓటర్లు 96.88 కోట్ల మంది .. భారతదేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు అని సీఈసీ తెలిపారు. ఇక.. ఇందులో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి.. పురుషుల కంటే మహిళలు అత్యధికంగా ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని ఈసీ ప్రముఖంగా పేర్కొంది. మహిళలతో పాటు ఈసారి యువత సైతం ఓటు కోసం నమోదు భారీ సంఖ్యలోనే చేసుకుంది. ఇక లింగ నిష్పత్తి చూస్తే(1000:..) 2023లో 928 ఉండగా.. 2024 నాటికి(డ్రాఫ్ట్ కంటే అధికంగా నమోదు) అది 948కి చేరింది. ఇక.. ఈసారి దేశ యువతలో(18-29 మధ్య వయసువాళ్లు) రెండు కోట్ల మంది ఓటర్ల జాబితాలో చేరారు. మొత్తం 2.63 కోట్ల కొత్త ఓటర్లలో .. 1.41 కోట్లు మహిళలు కావడం గమనార్హం. అంటే.. మిగిలిన 1.22 కోట్ల పురుష ఓటర్ల కంటే అధికమన్నమాట. -
మనం ఎందుకు పట్టించుకోం?
భారత రాజకీయాల గురించి ఒక శోచనీయమైన, దురదృష్టకరమైన నిజానికి నితీశ్ కుమార్ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచారా? ఈ విధమైన అవకాశవాదం, పదేపదే మిత్రపక్షాలను మార్చటం ఏ పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశంలోనూ ఆమోదయోగ్యమైనది కాదు. అది ఆ నాయకుడి విశ్వసనీయతను, పార్టీ ప్రతిష్ఠను నాశనం చేస్తుంది. నితీశ్ కుమార్ పిల్లిమొగ్గలతో పోల్చలేం కానీ, 2010లో యూకేలో కన్జర్వేటివ్‌లతో లిబరల్స్ పొత్తు పెట్టుకున్నప్పుడు అదొక నీతిమాలిన చర్యగా పరిగణన పొందింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో లిబరల్ పార్టీ కుప్పకూలింది. మరి ఈ ‘దుముకుళ్లను’ మన ఓటర్లు ఎందుకు సమ్మతిస్తారు? తమను గెలిపించిన వారికి ద్రోహం చేసి వెళ్లిన రాజకీయ నాయకులకు మన ఓటర్లు ఎందుకు శిక్ష విధించరు? నాయకులు పార్టీని వదిలి వెళ్లడం, వేరే పార్టీలో చేరడం మన అందరికీ బాగా తెలి సిన విషయమే. మనం ఆశించినంతగా ఏమీ వారు అసాధారణమైన వ్యక్తులు కారు. కానీ నితీశ్ కుమార్ అంత బుద్ధిహీనమైన పని చేసిఉండాల్సింది కాదని మీరు అంగీకరిస్తారా? ఆయన అలా చేయకుండా ఉండలేరని అందరూ ఊహిస్తున్నదే అయినప్పటికీ ఆయన ప్రవర్తన నాకు నిజంగా చాలా దిగ్భ్రాంతిని కలుగజేసింది. ఆత్మగౌరవం గల ఒక మనిషి – రాజకీయ నాయకుడే అయినా – తన సొంత రాజకీయ మనుగడ కోసం తను కట్టుబడి ఉండవలసిన విలువల్ని, సిద్ధాంతా లను వెనక్కు నెట్టేయగలిగినంతగా దిగజార గలడని నేను నమ్మ లేకపోయాను. 2013 నుండి, నితీశ్ తన వ్యక్తిగత రాజకీయ జీవితాన్నిముందుకు తీసుకెళ్లడానికి హఠాత్తుగా కూటములను మార్చేయటం ఇది ఐదోసారి. అయితే నా సహోద్యోగి అశోక్ ఉపాధ్యాయ అనటం ఏమిటంటే – మీరు కనుక నితీశ్ 1994లో సమతా పార్టీని స్థాపించడం కోసం లాలూ ప్రసాద్ యాదవ్‌తో, జనతాదళ్‌తో తెగతెంపులు చేసు కోవటాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఆయన అలా చేయడం ఆరో సారి అవుతుందని! నేను అంతగా ఎందుకు ఆశ్చర్యపోయానని మీరు నన్ను అడగ వచ్చు. రెండు కారణాలు. నితీశ్ మళ్లీ అలాంటి పని చేస్తాడని నేను ఊహించలేదు. అలా చేస్తే కనుక విశ్వసనీయత ప్రమాదంలో పడి పోయే స్థాయికి ఆయన ఇప్పటికే చేరుకుని ఉన్నారని నా భావన. ఆయన అలా చేస్తాడని నేను అనుకోకపోవటానికి రెండో కారణం మరింతగా నిస్సందేహమైనది. బీజేపీతో తిరిగి కలిసే అవకాశంపై ఆయన, ఆయన్ని తిరిగి రెండోసారి కూటమిలోకి చేర్చుకునే విషయమై బీజేపీ... ‘అసలు అలాంటి ఆలోచనే లేదన్నట్లు’గా స్పష్టం చెయ్యటం జరిగింది. ఏడాది క్రితమే 2023 జనవరి 30న, ‘‘ఏదో ఒక రోజు మీరు బీజే పీలో తిరిగి కలుస్తారా?’’ అని అడిగినప్పుడు నితీశ్ ఇలా అన్నారు: ‘‘మర్ జానా కబూల్ హై, ఉన్ కే సాథ్ జానా హమ్కో కభీ కబూల్ నహీ హై. యే అచ్ఛీ తరహ్ జాన్ లీజియేగా.’’ (చావనైనా చస్తాను కానీ, వాళ్లతో వెళ్లి కలిసేది లేదు. దీనిని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి.)తర్వాత కొన్ని వారాలకు 2023 ఫిబ్రవరి 25న ఇదే ప్రశ్న హోంమంత్రి అమిత్ షాకు ఎదురైంది. బీజేపీ నితీశ్‌ను మరొకసారి అక్కున చేర్చుకోటానికి సుముఖంగా ఉందా? ‘ది హిందూ’లో వచ్చిన దానిని బట్టి అమిత్ షా ఈ విధంగా సమాధానం చెప్పారు: ‘‘ఆయా రామ్, గయా రామ్‌లు ఇక చాలు. నితీశ్ కుమార్‌కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూతపడ్డాయి.’’ సరే, నితీశ్ కుమార్ ఏడాది క్రితం స్పష్టంగా మరణం కంటే అధ్వాన్నం అని భావించిన దానినే ఇప్పుడు కోరుకున్నారు. ఇక ‘ఎప్పటికీ’ అనేది అమిత్ షా ఉద్దేశంలో కేవలం తాత్కాలికం అని మాత్రమే కాదు, హాస్యాస్పదంగా అది ఎంతో స్వల్పకాలిక వ్యవధి అని కూడా!ఈ వైఖరులపై అవమానకరమైన మాటలు వచ్చి పడటంలోవింతేమీ లేదు. నితీశ్‌ని పల్టూరామ్, పల్టూమార్, పల్టూపుత్ర అంటు న్నారు. శశి థరూర్ అయితే సహజంగానే ఇప్పుడంతగా వాడుకలో లేని ఆంగ్ల పదాన్ని నితీశ్‌కు అన్వయించడం కోసం తవ్వి తీశారు. ‘స్నోలీగోస్టర్’ అనే మాట అది. ‘తెలివైన, కానీ విలువల్లేని వ్యక్తి’ అని ఆ మాటకు అర్థం. ఏమైనా ఈ పరిణామంపై నా ఆందోళన ఇక్కడితో ఆగటం లేదు. భారతదేశ రాజకీయాల గురించి విచారం వ్యక్తం చేయదగిన, దురదృష్టకరమైన ఒక నిజానికి నితీశ్ కుమార్ సాక్ష్యంగా నిలిచారా? ఈ విధమైన అవకాశవాదం, పదేపదే మిత్రపక్షాలను మార్చటం అనేది ఏ ప్రధాన పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశంలోనూ ఆమోదయోగ్యమైనది కాదు. పైగా ఖండించదగినది. అది ఆ నాయకుడి విశ్వసనీయతను, పార్టీ ప్రతిష్ఠను నాశనం చేస్తుంది. నితీశ్ కుమార్ పిల్లి మొగ్గలతో పోల్చలేం కానీ, 2010లో బ్రిటన్‌లో లిబరల్స్ అనేవాళ్లు కన్జర్వేటివ్ లతో పొత్తు పెట్టుకున్నప్పుడు అదొక నీతి మాలిన చర్యగా పరిగణన పొందింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓట్లు రాబట్టలేక లిబరల్ పార్టీ కుప్పకూలింది... ఇండియాలో జరగని విధంగా! మన భారతీయులం భిన్నంగా ఎలా ఆలోచి స్తామో, భిన్నంగా ఎలా స్పందిస్తామో చూపించటానికి అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ కొన్ని ఉదాహ రణలు మాత్రమే. మధ్యప్రదేశ్‌లో ప్రతి పక్షంలో ఉన్న బీజేపీని అధికారంలోకి తీసుకు రావటానికి కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలో చేరినవారు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ గత ఏడాది డిసెంబర్ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీని సాధించారు. ఈ దుముకుళ్లను మన ఓటర్లు ఎందుకు సమ్మ తిస్తారు? తమను గెలిపించిన వారికి ద్రోహం చేసి వెళ్లిన రాజకీయ నాయకులకు మన ఓటర్లు ఎందుకు శిక్ష విధించరు? ప్రజాసేవ కంటే, నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధత కంటే తమ ప్రయోజనాలకు, సంపాదనకు ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా ఎందుకు మన ఓటర్లు పట్టించుకోరు?ఎందుకు అన్నదానిపై అనేక విధాలైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా కూడా నా దగ్గర సమాధానమైతే లేదు. వాటిల్లో ఒక అభిప్రాయం... అలాంటి రాజకీయ నాయకులు తమ నియోజక వర్గాలకు కావలసినవన్నీ చేసిపెడుతుంటారని; అలాగే వారి నేర్పరి తనం, రాజకీయ చలనశీలత వారిపై వ్యతిరేకతను కాక, ప్రజల మన్ననను పొందేలా చేస్తోందని! కానీ ఆ అభిప్రాయాలు సరైనవని అనిపించేవి కావు. సాకులు లేదా, అనుకూల వాదనలు. లేదంటే నిలబడని సమర్థింపులు. చివరికి చెప్పొచ్చేదేమంటే, లోపం మనలో ఉన్నదే కానీ, మన తలరాతలో ఉన్నది కాదు. తెలిసే మనం ఇలాంటి నాయకులకు, తమ స్వార్థం కోసమే తప్ప మరింత గొప్ప లక్ష్యాలకు, గొప్ప ప్రజా ప్రయో జనాలకు కట్టుబడి ఉండని వారికి – వాళ్లెప్పుడైనా ప్రజలకు కొంత మేలు చేస్తే చేసి ఉండొచ్చుగాక – ఓటు వేస్తాం. అది కొనసాగినంత కాలం భారతదేశ నితీశ్‌కుమార్‌లు మన రాజకీయాలను స్వేచ్ఛగా నడిపిస్తూనే ఉంటారు. మన భవిష్యత్తును కూడా! - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ - కరణ్ థాపర్ -
2024 Lok Sabha Polls: దేశంలో ఓటర్ల సంఖ్య @96 కోట్లు
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో ఓటర్లకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని పేర్కొంది. 2019 నాటికి ఈ సంఖ్య 91.20 కోట్లుగా ఉన్నట్టు ఈసీ వివరాల్లో తెలిపింది. కాగా, దేశంలో ఓటర్లకు సంబంధించి ఈసీ వివరాలను వెల్లడించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని తెలిపింది. వీరిలో మహిళలు 47 కోట్ల మంది ఉన్నారని ఈసీ స్పష్టంచేసింది. అదేవిధంగా మొత్తం ఓటర్లలో 1.73 కోట్ల మందికి పైగా 18-19 ఏండ్ల వయసు ఉన్నవారేనని తెలిపింది. ఇక, ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, దాదాపు 1.5 కోట్ల మంది పోలింగ్ సిబ్బందిని నియమించనున్నట్లు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం పంపిన ఓ లేఖ ప్రకారం.. దేశంలో 1951లో 17.32 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉండగా.. 2019 నాటికి ఈ సంఖ్య 91.20 కోట్లకు చేరింది. తొలి లోక్‌సభ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ నమోదు కాగా.. గత పార్లమెంటు ఎన్నికల్లో 67 శాతంగా ఉంది. -
Andhra Pradesh: ఏపీ ఓటర్లు 4.08 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,08,07,256కు చేరుకుంది. వీరిలో పురుష ఓటర్లు 2,00,74,322 మంది కాగా మహిళా ఓటర్లు 2,07,29,452, థర్డ్ జెండర్ 3,482 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. 2024 ఓటర్ల తుది జాబితాను సోమవారం ఆయన విడుదల చేశారు. గతేడాది అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను జనవరి 11 వరకు స్వీకరించి ఇంటింటి సర్వే చేసి అనంతరం పూర్తి పారదర్శకంగా తుది జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రతి 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఉండేలా చర్యలు చేపట్టడంతో పోలింగ్ స్టేషన్లు మరో 214 పెరిగాయన్నారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్య 46,165కి చేరింది. తాజాగా విడుదల చేసిన తుది జాబితాపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసేందుకు జనవరి 23 నుంచి సీఈవో కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఓటర్ల జాబితాను https://electoralsearch.eci.gov.in/లో చూడొచ్చన్నారు. ఫారం 6 పూర్తి చేసి ఓటరుగా నమోదు చేసుకోవడానికి నామినేషన్ల చివరి రోజు వరకు అనుమతిస్తామని చెప్పారు. ముసాయిదాతో పోలిస్తే పెరుగుదల అక్టోబర్‌లో విడుదలైన ముసాయిదాతో పోలిస్తే తుది జాబితాలో నికరంగా 5,86,530 ఓటర్లు పెరిగారు. ముసాయిదాలో 4.02 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య కొత్త ఓటర్ల చేరిక, తొలగింపుల తర్వాత 4.08 కోట్లకు చేరింది. సవరణ సందర్భంగా 22,38,952 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. ముసాయిదా జాబితా సమయంలో 18–19 ఏళ్ల ఓటర్ల సంఖ్య 2,88,155గా ఉంటే తుది జాబితా వచ్చే సరికి ఈ సంఖ్య 8,13,544కు చేరింది. అంటే అదనంగా 5,25,389 మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు. ఇంటింటి సర్వే చేసి మరణించిన వారు, ఒక చోట కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించడం ద్వారా 16,52,422 మంది ఓటర్లను తొలగించారు. 2019లో 3.93 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో అదనంగా 15 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 6.55 లక్షల మంది మహిళా ఓటర్లు అదనం రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6,55,130 మంది అదనంగా ఉన్నారు. పురుష ఓటర్ల సంఖ్య 2,00,74,322 కాగా మహిళా ఓటర్లు 2,07,29,452 మంది ఉన్నారు. ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,036 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శ్రీకాకుళం మినహా మిగిలిన 25 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య 9,37,988 కాగా దానికంటే కొద్దిగా తక్కువగా 9,37,883 మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,16,396 మంది ఓటర్లు ఉంటే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,61,538 మంది ఓటర్లు ఉన్నారు. పూర్తి పారదర్శకంగా జాబితా జనవరి 2022 నుంచి తొలగించిన ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా పరిశీలించి వంద శాతం ఆధారాలను సేకరించిన తరువాతే సవరణ చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ సమయంలో 21,18,940 ఓటర్లను తొలగించగా కేవలం 13,061 కేసుల్లో మాత్రమే నిబంధనలు పాటించలేదని, వాటిని నిబంధనలకు అనుగుణంగా సవరించామని పేర్కొంది. సున్నా ఇంటి నెంబర్‌పై 2,51,767 ఇళ్లు, ఒకే ఇంటి నెంబర్‌పై పది కంటే ఎక్కువ ఓట్లు ఉన్న 1,57,939 ఇళ్లను గుర్తించి ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సవరణ చేసినట్లు తెలిపింది. జీరో నెంబర్ ఇంటి కేసులను 97 శాతం సవరణ చేయగా పది కంటే ఎక్కువ ఓట్లున్న ఇళ్ల సంఖ్యలో 98 శాతం పరిష్కరించినట్లు తెలిపింది. ఓట్ల తొలగింపు, డూప్లికేటు ఓట్లు, మరణాలు, చిరునామా మార్పు లాంటి వాటిపై రాజకీయ పార్టీల నుంచి 14,48,516 ఫిర్యాదులు రాగా అందులో 5,64,497 కేసులు అర్హత ఉన్నవిగా గుర్తించి వాటిని తొలగించినట్లు పేర్కొంది. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కరే పెద్ద మొత్తంలో ఓట్ల తొలగింపు, చేర్పులకు దరఖాస్తు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఇలా బల్క్‌గా దరఖాస్తులు సమర్పించిన 70 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు స్పష్టం చేసింది. ఒకే కుటుంబంలోని ఓట్లు వేరువేరు చోట్ల నమోదైన కేసులను గుర్తించి వాటిని సవరించామని, ఈ విధంగా విశాఖలో 26,000 ఓట్లను సవరణ చేయగా, ఎన్టీఆర్ జిల్లాలో 2,27,906 ఓటర్లను సవరించినట్లు తెలిపింది. నెల్లూరు, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో కూడా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. వారికి ఇంటివద్దే ఓటు హక్కు 80 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులు, కోవిడ్ సోకిన వారు ఈ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న వారిలో 80 ఏళ్లు దాటిన వారు 5,76,791 మంది ఉండగా, దివ్యాంగులు 4,87,594 మంది ఉన్నారు. ఇటీవలే పొరుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుని ఇప్పుడు ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకునే ఓటర్ల విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడే నివాసం ఉంటున్నట్లు (ఆర్డినరీ రెసిడెన్స్) ధృవపత్రం ఇచ్చిన వారు మాత్రమే ఓటరుగా చేరడానికి అర్హులని, తప్పుడు ధృవపత్రాలు ఇచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పది రోజులు ముందు దాకా.. ఎన్నికల వరకు ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ చేపడుతూనే ఉంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఎన్నికల తేదీకి పది రోజుల ముందు వరకు అందిన వివరాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఓటర్ల తుది జాబితా ప్రకటించిన నేపథ్యంలో సోమవారం గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాలో సందేహాలు, ఉంటే అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. -
Narendra Modi: ఓటర్ల మనసులు గెల్చుకోవాలి
కొచ్చి/త్రిసూర్: కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలో నిర్దేశించే శక్తి కేరళకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాష్ట్రంలో ఓటర్ల మనసులు గెల్చుకోవాలని బీజేపీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. కేరళ అసెంబ్లీలో పాగా వేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన మంగళవారం సాయంత్రం కేరళకు చేరుకున్నారు. రెండు రోజు బుధవారం కొచ్చీ నగరంలో బీజేపీ ‘శక్తి కేంద్రాల’ ఇన్‌చార్జీలతో మోదీ సమావేశమయ్యారు. రెండు నుంచి మూడు పోలింగ్ బూత్‌లను కలిసి ఒక్కో శక్తి కేంద్రంగా పరిగణిస్తారు. మోదీతో భేటీకి దాదాపు 6,000 మంది ఇన్చార్జీలు హాజరయ్యారు. బూత్ స్థాయిలో విజయం సాధిస్తే కేరళలో గెలుపు మనదేనని నిర్దేశించారు. ఎవరి బూత్‌ల్లో వారు గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని చెప్పారు. ఇళ్లలో ‘రామజ్యోతి’ వెలిగించండి దేశంలో వేగవంతమైన అభివృద్ధి, భవిష్యత్తు పట్ల స్పష్టమైన విజన్ ఉన్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ విషయం ఇప్పటికే నిరూపితమైందని అన్నారు. బీజేపీ వైపు యువతను ఆకర్శించాలని, ఇందుకోసం ‘మై భారత్’ కార్యక్రమం, నమో యాప్‌తోపాటు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రచారం కల్పించాలన్నారు. పార్టీ పట్ల సానుకూలతను వ్యాప్తి చేయాలన్నారు. ఈ నెల 22న అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఆలయాలను శుభ్రం చేయాలని బీజేపీ శ్రేణులను నరేంద్ర మోదీ కోరారు. 22న సాయంత్రం ఇళ్లల్లో ‘రామజ్యోతి’ వెలిగించాలని, ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. గురువాయూర్ ఆలయంలో మోదీ పూజలు కేరళలో ప్రసిద్ధి చెందిన గురువాయూర్ శ్రీకృష్ణ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ ముండు(ధోతీ), తెల్లరంగు శాలువా ధరించి, స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి భారతీయుడు సంతోషంగా ఉండాలని, సౌభాగ్యంతో విలసిల్లాలని గురువాయుర్ శ్రీకృష్ణుడిని ప్రారి్థంచానని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆలయ సందర్శన ఫొటోను ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అనంతరం గురువాయూర్ ఆలయంలో ప్రముఖ మలయాళ సినీ నటుడు, బీజేపీ నేత సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి మోదీ హాజరయ్యారు. నూతన దంపతులకు మోదీ స్వయంగా పూల మాలలు అందించారు. వారిద్దరి చేతులను కలిపి ఆశీర్వదించారు. కొత్త దంపతులు మోదీకి పాదాభివందనం చేశారు. ఈ పెళ్లి వేడుకకు హాజరైన సినీ నటులు మమ్ముట్టీ, మోహన్‌లాల్, జయరాం, దిలీప్, ఖుష్బూతో మోదీ విడివిడిగా మాట్లాడారు. ఇదే ఆలయంలో వివాహం చేసుకున్న జంటలను సైతం మోదీ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారికి మిఠాయిలు బహూకరించారు. ఆ తర్వాత త్రిసూర్ జిల్లాలోని త్రిప్రయార్‌లో శ్రీరామస్వామి ఆలయంలో ప్రధానమంత్రి పూజలు చేశారు. అనంతరం కొచ్చికి బయలుదేరి వెళ్లారు. కొచ్చీ సిటీలో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. రూ.4,000 కోట్ల ప్రాజెక్టులు అంకితం అంతర్జాతీయ వాణిజ్యంలో భారతదేశ శక్తిసామర్థ్యాలను, స్థానాన్ని ప్రపంచ దేశాలు గుర్తించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తక్కువ సమయంలో నౌకల రాకపోకల విషయంలో పలు అభివృద్ధి చెందిన దేశాలను సైతం మనం అధిగమించామని చెప్పా రు. బుధవారం కేరళలోని కొచ్చీ సిటీలో రూ.4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేశారు. వీటిలో ప్రతిష్టాత్మకమైన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కూడా ఉంది. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా స్వేచ్ఛాయుత, పారదర్శక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల్లో అన్ని రాజకీయపార్టీలకు సమప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛ ఓటర్ల జాబితాతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య హక్కును కాపాడాలని, పోలింగ్‌లో పెద్దఎత్తున పాల్గొనాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. రానున్న లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ 2024 ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌లతో కలిసి విజయవాడలో రాజీవ్ కుమార్ రెండు రోజుల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష వివరాలను బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా 2024లో తొలి సమీక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మొదలు పెట్టినట్లు తెలిపారు. ఎన్నికల సన్నద్ధతపై స్టేక్ హోల్డర్స్ అందరితో సమావేశాలు నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 1.99 కోట్లు, మహిళలు 2.07 కోట్లు ఉన్నారని వివరించారు. రాష్ట్రంలో 159 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉండటం శుభపరిమాణమన్నారు. 2014లో 1013గా ఉన్న పురుష, మహిళా ఓటర్ల నిష్పత్తి ఇప్పుడు 1036కు పెరిగిందన్నారు. అలాగే రాష్ట్రంలో 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 5.8 లక్షల మంది ఉన్నారని, వారు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్ కాకుండా ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకున్న వారు ఫాం12డీ పూర్తి చేయడం ద్వారా అవకాశం పొందవచ్చన్నారు. వచ్చే ఎన్నికల్లో 18–19 ఏళ్లు ఉన్న 7.88 లక్షల మంది తొలిసారి ఓటు హక్కును వినియోగంచుకోనున్నట్లు తెలిపారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 22న విడుదల చేయనున్నట్లు చెప్పారు. ధన ప్రవాహం తగ్గించే విధంగా చర్యలు ఎన్నికల్లో ధన ప్రవాహంతగ్గించే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద వివిధ శాఖలకు చెందిన 139 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. మద్యం, నగదు పంపిణీ, బహుమతుల పంపిణీ వంటి వాటి ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టడి చేసేందుకు కేంద్రరాష్ట్రాలకు చెందిన 20 టాస్క్‌ఫోర్స్‌లు సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. గత రెండేళ్లుగా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో పెద్దఎత్తున నగదు జప్తు చేశామన్నారు. 2018–19లో రూ. 366 కోట్ల నగదును సీజ్ చేస్తే 2022–23లో ఆ మొత్తం విలువ రూ. 3,247 కోట్లకు చేరిందన్నారు. అందుబాటులోకి సీవిజిల్ యాప్ నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని ఓటర్లకు పలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇందుకోసం సీవిజిల్ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. సీవిజిల్ యాప్ ద్వారా ఏదైనా ఫిర్యాదు వస్తే 100 నిమిషాల్లోనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటర్లకు సంబంధించిన అన్ని సేవలను అందిస్తున్నామని, అలాగే అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా సమర్పించే అఫిడవిట్లు, ర్యాలీల అనుమతి కోసం సువిధ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. మొదట ఏ పార్టీ దరఖాస్తు చేస్తే ఆపార్టీకే అనుమతివ్వాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల నేర చరిత్ర తెలుసుకునే విధంగా కేవైసీ (నో యువర్ కాండిటేట్) యాప్‌ను తీసుకురావడంతో పాటు అభ్యర్థి నేరచరిత్రను తప్పనిసరిగా మూడుసార్లు దినపత్రికలు, టీవీ ఛానల్స్‌లో ప్రచురించాల్సిందిగా కోరారు. దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా పోలింగ్ కేంద్రాల వద్ద అని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్‌గోయల్, రాష్ట్ర ఎన్నికలప్రధాన అధికారి ముఖేష్ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Bangladesh Elections: ప్రారంభమైన పోలింగ్
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆదివారం(జనవరి 7) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ బహిష్కరించింది. అధికార అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో ఉద్దేశపూర్వకంగా డమ్మీ ఇండిపెండెంట్ క్యాండిడేట్లను బరిలో నిలిపిందని బీఎన్పీ ఆరోపిస్తోంది. పోలింగ్ ప్రారంభం కాగానే ఢాకాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ప్రధాని షేక్ హసీనా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భారత మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్ తమకు నమ్మకమైన మిత్ర దేశమని చెప్పారు. 1971 లిబరేషన్ సందర్భంగా, 1975లో బంగ్లాదేశ్‌కు భారత్ సహకారం మరవలేనిదన్నారు. దేశంలో మొత్తం 11 కోట్ల 90 లక్షల మంది ఓటర్లున్నారు. మొత్తం 300 యోజకవర్గాలకుగాను 299 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ జరుగుతోంది. కొన్ని కారణాల వల్ల ఒక్క నియోజకవర్గానికి తర్వాత ఎన్నిక నిర్వహించనున్నారు. మొత్తం 27 రాజకీయ పార్టీల నుంచి 1500 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 436 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారం చేజిక్కించుకోనుందని అంచనాలున్నాయి. ఈసారి గెలిస్తే అవామీ లీగ్‌కు దేశంలో ఐదోసారి అధికారం దక్కినట్లవుతుంది. #WATCH | Dhaka: In her message to India, Bangladesh Prime Minister Sheikh Hasina says, ''You are most welcome. We are very lucky...India is our trusted friend. During our liberation war, they supported us...After 1975, when we lost our whole family...they gave us shelter. So our… pic.twitter.com/3Z0NC5BVeD — ANI (@ANI) January 7, 2024 ఇదీచదవండి...లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ -
భారత్, యూఎస్.. ఓటర్ల శక్తిని పెంచే కొత్త సంవత్సరం 2024
ప్రపంచంలో అతిపెద్ద జనతంత్ర రాజ్యం ఇండియాలో, అత్యంత ఉత్కృష్ట ప్రజాస్వామ్య దేశంగా పరిగణించే అమెరికాలో 2024లో కేంద్ర ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ఓటర్లు అప్పుడే సిద్ధమౌతున్నారు. ఈ జాతీయ ఎన్నికల్లో ఏయే అంశాల ఆధారంగా తాము ఓటేయాలో ఆలోచించడం మొదలుబెట్టారు. ఎన్నెన్నో వ్యత్యాసాలున్న ఈ రెండు విశాల దేశాలనూ కలిపే అంశం ఎన్నికల ద్వారా నడిచే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే. నిజానికి అమెరికా జనాభా 33 కోట్ల 49 లక్షలని, భారతదేశం జనసంఖ్య 142 కోట్లు దాటిందని ఈ ఏడాది తెలిసింది. ఇక భూభాగం విషయానికి వస్తే–ఇండియా కన్నా అమెరికా వైశాల్యం మూడు రెడ్లు ఎక్కువ. ఇతర దేశాల ప్రజలు లక్షల సంఖ్యలో వలసొచ్చి అమెరికాలో స్థిరపడడానికి అవసరమైన చోటు, టెక్నాలజీ, ఉపాధి అవకాశాలు, ఇతర వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో ఓటర్ల సంఖ్య విషయంలో ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. అన్ని పార్లమెంట్లకు మాతృక అని వర్ణించే బ్రిటిష్ పార్లమెంటు ఉన్న యునైటెడ్ కింగ్డమ్ తర్వాత ఆ దేశ సంపర్కంతో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకుంది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో. ‘కొత్త ప్రపంచం’గా అభివర్ణించే అట్లాంటిక్ మహాసముద్రం ఆవల ఉన్న ఈ సువిశాల అమెరికాలో ఎన్నికల ప్రజాస్వామ్యం ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 12 సంవత్సరాలకు ఆరంభమైంది. అక్కడ మొదటి అధ్యక్ష ఎన్నికలు 1788 డిసెంబర్ 15న మొదలై 1789 జనవరి 7న ముగిశాయి. ప్రథమ అధ్యక్షుడిగా స్వాతంత్య్ర సేనాని జార్జి వాషింగ్టన్ ఎన్నికయ్యారు. అప్పటి నుంచీ 2020 ఎన్నికల వరకూ ఈ అత్యంత సంపన్న దేశంలో (ప్రతి నాలుగేళ్లకూ) 59 సార్లు జరిగాయి. వచ్చే ఏడాది నవంబర్ 5న 60వ అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. ఇండియాతో పోల్చితే 163 ఏళ్ల ముందే ఎన్నికల ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చిన కారణంగా మనకు వింతగా కనిపించే ప్రజాస్వామ్య సాంప్రదాయాలు అమెరికాలో కనిపిస్తాయి. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ తేదీ కూడా ఇలాంటిదే. 18వ శతాబ్దం చివరిలో అమెరికాలోని వ్యవసాయ పనులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నవంబర్ మాసంలో తొలి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారంనాడు ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకే ప్రతిసారీ నవంబర్ 7 లోపే అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగడం చూస్తున్నాం. ఇండియాలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రెండేళ్లకే ఎన్నిక ప్రజాస్వామ్యం.. అమెరికాలో రాజ్యాంగ రచన పూర్తయి, మొదటి సాధారణ ఎన్నికలు జరిపించడానికి పుష్కర కాలం పట్టింది. కానీ, ఇండియాలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన (1950 జనవరి) నాటి నుంచి రెండేళ్లలోపే అంటే 1951 అక్టోబర్ 25న తొలి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 1952 ఫిబ్రవరి 21న ముగిసింది. నాటి పరిస్థితులు, విస్తృతమైన ఎన్నికల నిర్వహణ అనుభవం లేకపోవడంతో ప్రథమ సాధారణ ఎన్నికలకు దాదాపు నాలుగు నెలల కాలం అవసరమైంది. ఇప్పుడేమో ఎన్నికలు ప్రశాంతంగా, సాఫీగా జరగడం కోసం నెల రోజుల సమయం పడుతోంది. 2019 పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయడానికి నెలపైన వారం రోజుల సమయం అవసరమైంది. ఈ రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం విషయం ఓటర్ల నమోదు ప్రక్రియ. ఇండియాతో పోల్చితే పోలింగ్ శాతం బాగా తక్కువ ఉండే అమెరికాలో పోలింగ్ రోజు కూడా పొద్దున్నే ఓటరుగా నమోదు చేయించుకుని, తర్వాత ఓటు వేసే వెసులుబాటు అక్కడి పౌరులకు కల్పించారు. భారత్‌లో నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు చేయించుకోవాల్సిన పరిస్థితి. అలాగే, అమెరికాను దాదాపు 525 ఏళ్ల క్రితం క్రిస్టఫర్ కొలంబస్ కనిపెట్టినప్పటి నుంచీ అక్కడికి ఏటా లక్షలాది ప్రపంచదేశాల ప్రజలు వచ్చి స్థిరపడుతూనే ఉన్నారు. ఇలా ఉన్నత విద్య, ఉపాధి కోసం వచ్చిన వారందరికీ వెంటనే పౌరసత్వం రాదు. కోరుకోకపోతే కొందరికి ఎప్పటికీ రాకపోవచ్చు కూడా. ప్రధానంగా పని, నివాసం, ఇతర అంశాల వల్ల పౌరసత్వం వచ్చిన (నేచురలైజేషన్) వ్యక్తులు మొదట చేసే పని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడం. ఎన్నికల్లో ఓటు వేయడాన్ని– తమ కృషిని గుర్తించి తమకు పౌరసత్వం ఇచ్చిన అమెరికా రుణం తీర్చుకోవడంలో భాగంగా ఈ పూర్వ వలసదారులు భావిస్తారు. ఇతర దేశాల నుంచి వలసవచ్చిన వారికి అత్యధిక సంఖ్యలో 2022లో అమెరికా పౌరసత్వం లభించిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కిందటేడాది నేచురలైజేషన్ ప్రక్రియ ద్వారా రికార్డు స్థాయిలో దాదాపు పది లక్షల మంది అమెరికా పౌరసత్వం పొందారు. ఈ నూతన పౌరులందరికీ 2024 నవంబర్ 5 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లభించింది. ఓటు వేయడాన్ని తమ శక్తిగా, దేశం రుణం తీర్చుకునే క్రియలో భాగంగా పరిగణించడం నిజంగా మంచి భావనే. ఈ సూత్రం ఇండియాకు కూడా వర్తిస్తుంది. వెస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి -
జయాపజయాలు
మినీ జనరల్ ఎన్నికలుగా భావించిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్లు వెలువరించిన విస్పష్టమైన తీర్పు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న ‘ఇండియా’ కూటమి, దాని ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ తలరాతలను తలకిందులు చేసింది. తెలంగాణలో దక్కిన బొటాబొటీ విజయం ఒక్కటే కాంగ్రెస్‌కు ఊరటనిచ్చింది. ప్రధాన రాష్ట్రాలైన రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లతోపాటు ఛత్తీస్‌గఢ్‌ను కూడా గెల్చుకుని మరో ఆర్నెల్లల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమే ముచ్చటగా మూడో సారి కూడా అధికారంలోకొస్తుందని బీజేపీ చాటింది. ఈ మూడుచోట్లనుంచీ 65 లోక్‌సభ స్థానాలున్నాయి. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో 36 యేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)– కాంగ్రెస్ కూటమి కొత్తగా ఆవిర్భవించిన జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్ (జడ్పీఎం) చేతుల్లో మట్టికరిచింది. అక్కడ ముఖ్యమంత్రి – ఎంఎన్ఎఫ్ సారథి జోరంతంగాతో పాటు 11 మంది మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. ఒకటి రెండు రోజుల్లో ఈ అయిదు రాష్ట్రాల్లోనూ కొత్త సారథులు కొలువుదీరబోతున్నారు. మూడు రాష్ట్రాలు గెలుచుకున్న బీజేపీ గానీ, తెలంగాణ గెల్చుకున్న కాంగ్రెస్ గానీ తమ సీఎం అభ్యర్థులను ప్రకటించాల్సివుంది. ఈలోగా ఊహాగానాలే షికారు చేస్తాయి. ఒక్క మిజోరంలో మాత్రం జడ్పీఎం చీఫ్ లాల్దుహోమా ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ ముందే ప్రకటించింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే ‘ఇండియా’ కూటమిలో రుసరుసలు వినిపించాయి. హిందీ బెల్ట్‌లో బీజేపీ ప్రభంజనానికి కాంగ్రెస్ చేతగానితనమే కారణమని తృణమూల్ కాంగ్రెస్ అనటం, తమ పార్టీ అధినేత మమతాబెనర్జీని, కూటమిలోని ఇతర నేతలనూ కలుపుకొని వెళ్లటంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించటం... జేడీ(యూ), ఆర్జేడీలు సైతం అదే తరహాలో మాట్లాడటం త్వరలో జరగబోయే కూటమి సమావేశం ఎలా ఉంటుందో చెబుతున్నాయి. మొన్న మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచీ ఊహలపల్లకీలో ఊరేగుతున్న కాంగ్రెస్‌ను తాజా ఫలితాలు కిందకు దించాయి. ఈ పంచతంత్రం గట్టెక్కటం ఎలాగోనని సంశయిస్తూ బరిలోకి దిగిన బీజేపీ... తమ నేతలంతా ఒక్కతాటిపై నిలిచారన్న అభిప్రాయాన్ని కలిగించటంలో విజయం సాధించింది. రణరంగానికి తరలే శ్రేణులపై సైన్యాధిపతికి పట్టుండాలి. అతని ఆదేశాలకు అనుగుణంగా ముందుకురికేందుకు చతురంగ బలాలు సర్వసన్నద్ధంగా వుండాలి. విజయమో, వీరస్వర్గమో అన్నంతగా చెలరేగిపోవాలి. కాంగ్రెస్‌కు సంబంధించి జరిగిందంతా అందుకు విరుద్ధం. అధిష్ఠానం సూచనలు పాటించటానికి రాజస్తాన్‌లో గహ్లోత్, మధ్యప్రదేశ్‌లో కమలనాథ్ ససేమిరా అన్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో ఈడీ దాడులతో ఎజెండాలోకొచ్చిన మహదేవ్ యాప్ కొంపముంచింది. కనుకనే ఈ మూడుచోట్లా పార్టీ ఆశలు ఆడియాసలయ్యాయి. ‘ఇండియా’ కూటమిలో దాని స్థానాన్ని మరింత బలహీనపరిచాయి. అధికారంలో ఉన్నవారిని సాగనంపే సంప్రదాయం వున్న రాజస్తాన్‌పై కాంగ్రెస్‌కు ఎటూ పెద్దగా ఆశలు లేవు. అయినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ గత ఏడాదిగా ప్రకటిస్తున్న జనాకర్షక పథకాలు ఈ సరళిని మారుస్తాయేమోనన్న భయం బీజేపీలో లేకపోలేదు. కానీ మధ్యప్రదేశ్‌లో అలా కాదు. అక్కడ కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నంతగా ప్రచారం జరిగింది. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించి అత్తెసరు మెజారిటీతో పాలన ప్రారంభించిన కాంగ్రెస్‌కు రెండేళ్లు తిరగకుండానే పొగబెట్టి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. సగటు ఓటరుకు ఆ విషయంలో సానుభూతి ఉన్నదని అందరూ అంటూ వచ్చారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంక్షేమ పథకాల జోరు కనబడుతున్నా బీజేపీ సంశయిస్తూనే అడుగులు వేసింది. జాగ్రత్తగా పావులు కదిపింది. సునాయాసంగా అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెసే మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమని అందరూ అనుకున్న ఛత్తీస్‌గఢ్‌లో సైతం ఆ పార్టీకి పరాజయం తప్పలేదు. రాజస్తాన్‌లో గహ్లోత్, యువ నాయకుడు సచిన్ పైలెట్ల మధ్య నాలుగేళ్లుగా హోరాహోరీ పోరు సాగుతోంది. వారిద్దరిలో ఎవరు నిష్క్రమిస్తే పార్టీకి ఎక్కువ నష్టమో అధిష్ఠానం తేల్చుకోలేక, ఇద్దరి మధ్యా సంధి కుదిర్చేందుకు తంటాలూ పడింది. ఈ అంతర్గత పోరు ఎంత నష్టపరిచిందంటే స్వతంత్రంగా ఉంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకునే గిగ్ వర్కర్స్ సంక్షేమానికి దేశంలోనే తొలిసారి చట్టం తెచ్చిన ఘనతను సైతం ప్రచారం చేసుకోలేకపోయింది. ఇతర సంక్షేమ పథకాలు సరేసరి. ఇక మధ్యప్రదేశ్‌లో దాదాపు 30 స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని ఎందరు మొత్తుకున్నా కమలనాథ్ ససేమిరా అన్నారు. పైగా తాను ఓ వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతిని మరిచి ‘జై జై కమలనాథ్’ నినాదాన్ని రుద్దారు. ఛత్తీస్‌గఢ్‌లో మహదేవ్ యాప్ కుంభకోణం తర్వాత సీఎం బఘేల్‌తో వేదిక పంచుకోవటానికి రాహుల్, ప్రియాంక సిద్ధపడలేదు. సంక్షేమ పథకాలతో ఊదరగొడితే చాలదు... నాయకత్వ పటిమపై విశ్వసనీయత కలిగించాలి. ఆ విషయంలో వైఫల్యమే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ముంచింది. అటు బీజేపీలో మూడు రాష్ట్రాల్లోనూ స్థానిక నేతలనూ పక్కనబెట్టి అభ్యర్థుల నిర్ణయంలోనూ, ప్రచారవ్యూహంలోనూ అగ్ర నాయకత్వం తనదే పైచేయి అన్నట్టు వ్యవహరించింది. మోదీ సర్వం తానైనట్టు వ్యవహరించారు. అది విజయానికి దోహద పడింది. దాంతోపాటు కాంగ్రెస్ వైఫల్యాలు కూడా బీజేపీకి కలిసొచ్చాయి. జనం భావోద్వేగాలపైకాక సంక్షేమం, అభివృద్ధి అంశాలపై దృష్టి సారించటం కూడా ఆ పార్టీకి పనికొచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తోడ్పడుతుందని భావిస్తే అది బీజేపీకే మేలు. -
పెరగని పోలింగ్.. ఈసారి 41,631 మంది ఓటుకు దూరం
అలంపూర్: అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. ప్రతి సారి ఓటర్లు పెరుగుతున్నారు. అందుకు అనువుగా పోలింగ్ శాతం పెరుగుతోంది. పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం జోరు ప్రచారాలతో ఓటర్లలలో అవగాహన కల్పిస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు చైతన్యంతో ముందుకు వస్తున్నారు. కానీ పోలింగ్ మాత్రం వంద శాతానికి దూరంగా ఉంటుంది. దీంతో గెలుపోటములపై తీవ్ర ప్రభా వం చూపే అవకాశం ఉంటుంది. 2009 సార్వత్రిక ఎన్నికల 1,88,678 మంది ఓటర్లు ఉండగా 1,29282 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 2,10,047 మంది ఓటర్లు ఉండగా 1,58,069 మంది ఓటు హక్కు వినియోగించకోవడం జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,17, 157 మంది ఓటర్లు ఉండగా 1,79,683 మంది, 2023 ఎన్నికల్లో 2,37,938 మంది ఓటర్లు ఉండగా 1,96,307 మంది తమ ఓటు హక్కును వి నియోగించుకున్నారు. ఇదిలాఉండగా, 2009లో 59,396 మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. అలాగే, 2014లో 51,978 మంది, 2018లో 37,474 మంది, 2023 ఎన్నికల్లో 41,631 మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ప్రతి సారి జరిగే ఎన్నికల్లో దాదాపు 15 నుంచి 20 శా తం మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సంఘం ప్రచారం మరింత విస్తృత పర్చాల్సిన అవసరం ఉంది. ఇది చదవండి: జిల్లాలో 06 నియోజక వర్గాలు.. తొలి ఫలితం మిర్యాలగూడదే! -
సాక్షి కార్టూన్ 01-12-2023
-
అధికారం శాశ్వతమని కేసీఆర్ నమ్మారు: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ఓటు వేశారని స్పష్టం చేశారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడగొడుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందని తేలిపోయిందని అన్నారు. అధికారం శాశ్వతమని కేసీఆర్ నమ్మారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ 3నే శ్రీకాంతాచారి తుదిశ్వాస విడిచారు.. అదే రోజున ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని రేవంత్ పేర్కొన్నారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగానికి ఎన్నికల ఫలితాలకు ఓ లింక్ ఉందని చెప్పారు. నేడు తెలంగాణ ఎన్నికల పోలింగ్ పూర్తైంది. ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు మెజారిటీని కట్టబెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ రబ్బిస్ అని కేటీఆర్ పేర్కొన్న వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. అవి నిజమైతే కేటీఆర్ క్షమాపణలు చెబుతారా? అని రేవంత్ ప్రశ్నించారు. -
ఎర్రబెల్లికి నిరసన సెగ
-
పడిపోయిన ఓటింగ్ శాతం
-
సాక్షి కార్టూన్ 30-11-2023
-
TS Assembly Elections 2023: ఓటుతో మా బాధ్యత పూర్తి చేశాం
-
‘మాకేం చేసిండ్రు.. ఛల్ మేం ఓటేయం!’
సాక్షి, హైదరాబాద్: అక్కడక్కడ పార్టీల కార్యకర్తల ఘర్షణ మినహాయించి.. దాదాపుగా తెలంగాణ అంతటా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాజధాని హైదరాబాద్‌లో మాత్రం మందకొడిగా పోలింగ్ నమోదు అవుతోంది. అయితే కొన్ని చోట్ల ఓటర్లు ఓటేయమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఇదే సరైన సమయం అనుకున్నారో ఏమో.. తమకు అభివృద్ధి పనులు కావాలని కోరుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలింగ్ బహిష్కరణ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామంలో ఓటు వేయకుండా పోలింగ్ ను బహిష్కరించారు గిరిజన గ్రామస్తులు. తమ గ్రామం లో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఓటును భహిష్కరించిన గిరిజన గ్రామస్తులు.. అలాగే.. వైరా నియోజకవర్గంలోని రెండు చోట్ల గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు. ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామంలో రహదారులు ,త్రాగునీటి సౌకర్యం, మౌలిక వసతులు 20 ఏళ్లుగా ఏర్పాటు చేయలేదని గిరిజనులు నిరసన తెలుపుతున్నారు. తమ సమస్య పరిష్కరించేంతవరకు ఓటు వేయమని వాళ్లు అంటుడగా.. అధికారులు మాత్రం వాళ్లను బతిమాలుతున్నారు. ఏన్కూరు మండలం రాజుల పాలెం గ్రామంలోనూ ఇదే సీన్ కనిపించింది. రాజుల పాలెం గ్రామం నుండి శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మించాలనే డిమాండ్ నెరవేరకపోవడంతో ఓటేయమని గ్రామస్తులు తీర్మానించుకున్నారు. డబ్బిస్తేనే ఓటేస్తాం! మహబూబాబాద్ జిల్లాలో డబ్బుల కోసం ఓటర్లు డిమాండ్ చేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. బయ్యారం మండలం సంతులాల్ పోడు గ్రామపంచాయతీ పరిధిలోని సంతులాల్ పోడు ఎస్సీ కాలనీ ఓటర్లు ‘డబ్బులు ఇస్తేనే.. ఓటు వేస్తాం’ అంటూ తేల్చిశారు ఓటర్లు. దీంతో ఓటేయాలంటూ అధికారులు బతిమాలుతున్నారు. ఇప్పటి వరకు అక్కడ ఒక్క ఓటు పోల్ కాలేదు. రోడ్డు కావలెను అదిలాబాద్ బజార్ హత్నుర్ మండలంలోని కొత్తపల్లిలో ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించేంత వరకు ఓట్లు వేయమని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకుని గ్రామానికి బయలుదేరిన అధికారులు, వాళ్లతో చర్చలు జరుపుతున్నారు. ఓటర్లు లేక వెలవెల తమ గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం వరిపేట గ్రామానికి చెందిన ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఉదయం 11గంటల వరకూ కేవలం 20 మంది ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు. -
యూపీఐతో ‘చెల్లింపు’.. ప్రత్యేక వాహనాల్లో తరలింపు!
‘‘హలో.. మన నియోజకవర్గ ఓటర్ల కోసం బస్సులు, జీపులు సిద్ధం చేశాం. ఆరాంఘర్ కూడలికి వస్తే రెడీగా ఉంటాయి. వచ్చేయండి, అక్కడే మీకు ఓటు డబ్బులు చెల్లిస్తాం!’’.. ‘‘మీ ఎకౌంట్‌కు గూగుల్ పే నుంచి డబ్బులు పంపాం. ముట్టినయా చూసి ఓకే మెసేజ్ పెట్టండి..’’ సాక్షి, హైదరాబాద్: మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం రాత్రిదాకా ఇదే తీరు. హైదరాబాద్‌లో, వివిధ పట్టణాల్లో ఉంటున్న తమ నియోజకవర్గ ఓటర్లను తరలించేందుకు ఆయా పార్టీ ల అభ్యర్థులు ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు ఇవి. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన లక్షల మంది ఓటర్లు గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ కనిపిస్తుండటంతో అభ్యర్థులు ఈ ఓటర్లపై దృష్టిపెట్టారు. తమ నియోజకవర్గ ఓటర్లందరినీ రప్పించుకుని, తమకే ఓటు వేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఓట్ల కోసం యూపీఐ ద్వారా డబ్బులు జమ చేయడంతోపాటు స్వస్థలాలకు రవాణా సదుపాయాన్నీ ఏర్పాటు చేశారు. కొందరు అభ్యర్థులు మొత్తం సొమ్ము ముందే ట్రాన్స్ఫర్ చేయగా, మరికొందరు కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చి, ఓటు వేయటానికి వచ్చి నప్పుడు మిగతా సొమ్ము ఇస్తామని చెప్తున్నట్టు తెలిసింది. అభ్యర్థుల అనుచరులు, స్థానిక నేతలు దీనంతటినీ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఓటర్లను తరలించుకుపోయేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేశారు. కొందరు ఆర్టీ సీ, ప్రైవేటు బస్సులనూ బుక్ చేసినట్టు తెలిసింది. చాలా వరకు మినీ వ్యాన్లు, కార్లను సిద్ధం చేశారు. దావత్ ఇచ్చి.. స్లిప్పులు పంచి..! కొందరు అభ్యర్థులు హైదరాబాద్ నుంచి తమ ఓటర్లను తరలించడానికి ముందు మంగళవారం రాత్రే శివారు ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లలో దావత్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఓటర్లను దావత్‌కు రప్పించి.. లిక్కర్, మాంసాహార భోజనం పెట్టారని సమాచారం. ఈ సమయంలో కొందరు నేరుగా ఓటర్లకే డబ్బులు ఇవ్వగా, మరికొందరు స్లిప్పులు రాసిచ్చి , సొంతూరికి వెళ్లాక ఓటేసే ముందు అది ఇచ్చి డబ్బులు తీసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. బస్టాండ్లలో విపరీతమైన రద్దీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నగరం నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ సొంతూర్లకు తరలివెళ్లారు. దీంతో బస్టాండ్లు, ఎల్బీనగర్, ఉప్పల్ కూడలి, ఆరాంఘర్ వంటి ప్రాంతాలు కిటకిటలాడాయి. దీనితో ఆర్టీసీ సుమారు 1,500కుపైగా అదనపు బస్సులను సిద్ధం చేసి ఆయా రూట్లకు నడిపింది. మరోవైపు భారీ సంఖ్యలో ప్రైవేటు వాహనాలు కూడా ప్రయాణికులను తరలించాయి. -
తెలంగాణలో నేడు ఓట్ల పండుగ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇచ్చే రోజు వచ్చేసింది. గురువారం ఉదయం నుంచే పోలింగ్ మొదలుకానుంది. ఈ మేరకు సర్వం సిద్ధం చేసినట్టు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావమున్న 13 స్థానాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. మిగతా 106 చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తారు. మిగతా ప్రక్రియల పూర్తి అనంతరం డిసెంబర్ 5తో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. మూడు కోట్లకుపైగా ఓటర్లు రాష్ట్రంలో 1,63,01,705 మంది మహిళలు, 1,62,98,418 మంది పురుషులు, 2,676 మంది మూడో జెండర్ ఓటర్లు కలిపి మొత్తంగా 3,26,18,205 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో కలిపి 2,067 మంది పురుష అభ్యర్థులు, 222 మంది మహిళా అభ్యర్థులు, మూడో జెండర్ అభ్యర్థి ఒకరు కలిపి మొత్తం 2,290 మంది ఎన్నికల్లో పోటీపడుతున్నారు. ఏ పార్టీల నుంచి ఎంత మంది అభ్యర్థులు? రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పోటీచేస్తోంది. కాంగ్రెస్ 118 సీట్లలో, ఆ పార్టీ పొత్తుతో సీపీఐ ఒకచోట బరిలో ఉన్నాయి. మరో కూటమిలో భాగంగా బీజేపీ 111, జనసేన 8 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 107 చోట్ల, ఎంఐఎం 9 చోట్ల, సీపీఎం 19 చోట్ల, సీపీఐఎల్(న్యూడెమోక్రసీ) ఒకచోట తలపడుతున్నాయి. – ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 41 మంది, ధర్మసమాజ్ పార్టీ నుంచి 101 మంది, జైమహాభారత్ పార్టీ నుంచి 13 మంది, రాష్ట్రీయ సామాన్య ప్రజాపార్టీ నుంచి నలుగురు, ఇతర పార్టీల నుంచి మరో 659 మంది, స్వతంత్రులు 989 మంది ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. – నియోజకవర్గాల వారీగా చూస్తే.. అత్యధికంగా ఎల్బీనగర్ నుంచి 48 మంది, గజ్వేల్ నుంచి 44 మంది, కామారెడ్డి, మునుగోడుల నుంచి 39 మంది చొప్పున పోటీపడుతుండగా.. అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడల్లో ఏడుగురు చొప్పున, బాల్కొండలో 8 మంది బరిలో ఉన్నారు. 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు రాష్ట్రంలో 299 అనుబంధ పోలింగ్ కేంద్రాలు సహా మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 27,094 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న 7,571 ప్రాంతాల్లో బయటి పరిసరాలను సైతం వెబ్‌కాస్టింగ్ చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలు, వీడియోగ్రాఫర్లు, ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్‌ట్యాప్‌లతో విద్యార్థులు పోలింగ్ ప్రక్రియను రికార్డు చేయనున్నారు. రికార్డు చేసిన డేటాను ప్రిసైడింగ్ అధికారులు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అప్పగిస్తారు. పటిష్టంగా బందోబస్తు పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 45వేల మంది రాష్ట్ర పోలీసులు, మరో 3వేల మంది అటవీ/ఆబ్కారీ సిబ్బంది, 50 కంపెనీల టీఎస్ఎస్పీ, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వచ్చిన 23,500 మంది హోంగార్డులు కూడా బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు దివ్యాంగ ఓటర్లు సులువుగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బ్రెయిలీ లిపిలో 76,532 ఓటరు స్లిప్పులు, 40 వేల ఓటర్ గైడ్స్, 40 వేల డమ్మీ బ్యాలెట్ పేపర్లను ముద్రించి అంధ ఓటర్లకు పంపిణీ చేశారు. శారీరక వికలాంగులను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తరలించడానికి ఆటోలను ఏర్పాటు చేయనున్నారు. వారికోసం పోలింగ్ కేంద్రాల వద్ద 21,686 ట్రై సైకిళ్లను అందుబాటులో ఉంచారు. ర్యాంపులను ఏర్పాటు చేశారు. ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ నేతృత్వంలో దాదాపు ఏడాది నుంచీ ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ, ఈవీఎంలను సంసిద్ధం చేయడం, ఎన్నికలు/ పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకం/శిక్షణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్లకు సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తిచేసింది. మొత్తం 2,00,433 మంది అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అన్నిజిల్లాల్లో పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని సీఈఓ కార్యాలయం బుధవారం అర్ధరాత్రి ప్రకటించింది. వారంతా రాత్రి పోలింగ్ కేంద్రాల్లోనే బస చేస్తారు. ప్రిసైడింగ్ అధికారులు గురువారం ఉదయం 5.30 గంటలకు పోల్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. తర్వాత కంట్రోల్ యూనిట్‌లోని మెమరీ డిలీట్ చేసి, వీవీ ప్యాట్ కంటైనర్ బాక్స్ నుంచి మాక్ ఓటింగ్ స్లిప్పులను తొలగిస్తారు. పోలింగ్ శాతం మళ్లీ పెరగాలి గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లకు గాను 2,05,80,470 (73.2 %) మంది ఓటేశారు. 1,41,56,182 మంది మొత్తం పురుష ఓటర్లకు గాను 1,03,17,064 (72.54%) మంది, 1,39,05,811 మంది మొత్తం మహిళా ఓటర్లకు గాను 1,02,63,214(73.88%) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2691 మంది మూడో జెండర్ ఓటర్లలో కేవలం 192 (8.99%) మంది మాత్రమే ఓటేశారు. 2014 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కేవలం 69.5శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2018 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా పోలింగ్ శాతం మరింతగా పెంచేందుకు ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేయాలని ఎన్నికల యంత్రాంగం పిలుపునిచ్చింది. -
ఆగం కావొద్దు.. జాగ్రత్తగా ఓటెయ్యాలె!
ఎన్నికలు.. ఓటు అనే వజ్రాయుధంతో సామాన్యుడు మాత్రమే పాల్గొనే నిశబ్ధ యుద్ధం. ప్రజాస్వామ్య పరిరక్షణలో అర్హత లేని నేతల్ని ఓడించేందుకు.. అర్హత ఉంటే మళ్లీ ఎన్నుకునేందుకు అదికూడా ఐదేళ్లకొకసారి దొరికే అవకాశం ఎలక్షన్స్. అందుకే ఆ అవకాశం వదులుకోకుండా ఓటేసి బాధ్యత నెరవేర్చుకోవాల్సిన అవసరం ప్రతీ పౌరుడికీ ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసారి భారీగా కొత్త ఓటర్లు నమోదు అయ్యారు. అందులో 18 ఏళ్లు నిండి తొలిసారి ఓటేసేందుకు సిద్ధమైన వాళ్లు దాదాపు 10 లక్షలుకాగా.. మిగతా వాళ్లు మరో ఏడు లక్షలు ఉన్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ కోసం సర్వం సిద్ధమైన వేళ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఈవీఎంలపై ఓటు ఎలా వేయాలి? సరైన ఓటు వేశామా? లేదా? అనేది ఎలా నిర్ధారించుకోవాలి.. ఒకవేళ పొరపాటు జరిగితే ఏం చేయాలి.. ఆ విషయాలన్నీ ఈ కథనంలో.. ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు.. పోలింగ్ కేంద్రాల వద్ద తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాలి. పార్టీల గుర్తులు, పార్టీలను ప్రతిబింబించే రంగుల దుస్తులు.. కండువాలు.. టోపీలు ధరించొద్దు. అలాగే పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ఓటేసేందుకు లోనికి వెళ్లాక.. బూత్ లోపలికి సెల్ఫోన్లు, ఇతర డివైజ్‌లు(పరికరాలు) తీసుకెళ్లకూడదు. అలాగే.. అక్కడుండే భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలి. ఓటు హక్కు ఉండి ఓటర్ కార్డు లేకున్నా.. కింద ఉన్నవాటిల్లో ఏదో ఒక కార్డుతో వెళ్లి ఓటేయొచ్చు ఆధార్‌కార్డు బ్యాంక్ పాస్‌బుక్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు పాస్‌పోర్ట్ పెన్షన్ కార్డు(ఫొటో తప్పనిసరి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే సర్వీస్ ఐడీ కార్డులు ఓటు వేసేందుకు లోపలికి వెళ్లినప్పుడు ముగ్గురు అధికారులు ఉంటారు. ఓటర్ లిస్ట్‌లో ఉన్న పేరు, గుర్తింపు కార్డు చూసి అధికారులు పోలింగ్ బూత్‌లోకి పంపుతారు. అక్కడ ఎడమచేతి చూపుడు వేలు చెక్ చేసి దానికి సిరా వేస్తారు. ఆ తర్వాత రిజిస్టర్లో ఓటరు వివరాలు నమోదు చేసి స్లిప్ రాసి ఓటు వేసేందుకు లోపలికి పంపిస్తారు. ఆ తర్వాతే ఓటరు.. పోల్ చీటీ తీసుకుని కంట్రోల్ యూనిట్ (సీయూ)లోపలికి వెళ్లి ఓటు వేయాలి. అక్కడ ఈవీఎంలపై ఉన్న పార్టీ గుర్తును ప్రెస్ చేస్తే ఓటేసినట్లు లెక్క. ఇంతకీ మనం వేసిన ఓటు పడిందా? లేదా? పడితే మనం వేయాలనుకున్న అభ్యర్థికే పడిందా? ఎలా తెలుసుకోవడం.. ఇందుకోసమే ఈవీఎంకు అనుసంధానంగా వీవీ ప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) ఉంటుంది. ఓటర్ ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత.. ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. అలా ఓటుని నిర్ధారించుకోవచ్చు. ఆ తర్వాత బయటకు వచ్చేయడంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ ఓటేసే టైంలో.. సెల్ ఫోన్ లో చిత్రీకరించడం, దానిని బహిర్గతం చేయడం నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే ఓటు రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవు. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేసింది. ఆ తర్వాత దశలవారీగా వీవీ ప్యాట్ విధానాన్ని అమలు చేస్తూ వస్తోంది. తెలంగాణలో వీవీ ప్యాట్ విధానం అమలు చేయడంతో ఇది రెండోసారి. ఫిర్యాదులు కూడా.. ఓటు వేయడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా.. ఓటరు ఒకరికి ఓటు వేస్తే మరొక అభ్యర్ధికి ఓటేసినట్టుగా రికార్డు అయినా.. బ్యాలెట్ పత్రంపై ఉన్న అభ్యర్థి/ పార్టీ గుర్తును తప్పుగా చూపితే.. లేదంటే ఓటు ఒకరికి బదులు మరొకరు వేసినా.. వెంటనే పోలింగ్ కేంద్రంలో ఉండే ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఎన్నికల కమిషన్ రూల్స్ 1961.. 49 ఎంఏ ప్రకారం ప్రిసైడింగ్ అధికారికి ఓటరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. లేదంటే టోల్‌ఫ్రీ నెంబర్లు 1950, సీ-విజిల్ యాప్ లేదంటే ఎన్నికల సంఘానికి సంబంధించిన ఫిర్యాదుల విభాగానికి ఫిర్యాదు చేయొచ్చు. ఓటు విషయంలో నష్టం జరిగిందని భావిస్తే.. న్యాయస్థానాల్ని కూడా ఆశ్రయించొచ్చు. ఇలా జరుగుతుంది.. ఈ విషయమై టెస్ట్ ఓటు వేసేందుకు ఓటరును అనుమతిస్తారు. ఒకవేళ ఓటరు చెప్పేది తప్పుడు సమాచారమని తేలితే దాని పరిణామాల గురించి కూడా వివరిస్తారు. ఓటరు చెప్పిన సమాచారం వాస్తవమని నిరూపించేందుకు టెస్ట్ ఓటు నిర్వహిస్తారు. ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ ఏజంట్ల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఓటరు చెప్పినట్టుగా ఒక సింబల్ బటన్ నొక్కితే మరో సింబల్ గా రికార్డైతే వెంటనే రిటర్నింగ్ అధికారికి ఈ సమాచారాన్ని సంబంధిత పోలింగ్ స్టేషన్ అధికారి నివేదిస్తారు. ఈ సమయంలో పోలింగ్ ను నిలిపివేస్తారు. ఆపై రిటర్నింగ్ అధికారి నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఈ ఆరోపణ తప్పని తేలితే ప్రిసైడింగ్ అధికారి ఫారం 17 ఏలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తారు. -
TS Elections: పోలింగ్ శాతం పైకా? కిందకా?
రేపే తెలంగాణలో పోలింగ్. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత చూసుకుంటే మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి (సాంకేతికంగా రెండోసారే). పైగా రెండు దఫాలుగా అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా? లేదంటే ప్రజా తీర్పు మరోలా ఉండనుందా? అనే చర్చా రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్లు ఏమేర పోటెత్తుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తెలంగాణ ఏర్పాటు కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో 1983 నుంచి జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. సగటున 67.57% పోలింగ్ నమోదైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంతో 2014లో జరిగిన ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. పైగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలతో కలిపే జరిగాయి. అయితే పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రాంతంలో అప్పటికి 2.81 కోట్ల ఓటర్లు ఉండగా.. దాదాపు 74 శాతం నమోదు అయ్యిందని అప్పటి ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. సొంత రాష్ట్ర కల నెరవేరిన జోష్‌లో ఓటు హక్కు అత్యధికంగా సంఖ్యలో వినియోగించుకున్నారనే విశ్లేషణలు నడిచాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికల కోసం కేవలం 69.5 శాతమే ఓటింగ్ నమోదు అయ్యిందని ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. మరోవైపు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ వివరాల్ని వెల్లడించిన అప్పటి ఎన్నికల అధికారి రజత్‌కుమార్ 73.20 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని ప్రకటించారు. ఆ సమయంలో గ్రామీణ ఓటింగ్ ఎక్కువగా నమోదు అయ్యింది. అర్బన్ ఓటర్లు చాలావరకు ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడు 2023 ఎన్నికల విషయానికొస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన గతంలో కంటే మెరుగ్గా జరిపినట్లు .. అలాగే ఓటు హక్కు వినియోగంపైనా అవగాహన కల్పించినట్లు చెబుతోంది. మరోవైపు దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వారికి ఓట్ ఫ్రమ్ ఓటు ద్వారా ఇంటి వద్దనే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా 28 వేల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు కూడా. అన్నింటికి మించి 10 లక్షల కొత్త ఓటర్లు ఈసారి ఓటేయబోతున్నారు. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనివిధంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడా పోలింగ్ శాతం పెంపుదలపై దృష్టి సారించడం గమనార్హం. ఇలా ఎలా చూసుకున్నా.. ఈసారి అత్యధిక ఓటింగ్ నమోదు కావొచ్చని.. అందునా అర్బన్ ఓటింగ్ శాతం పెరుగుతుందని ఈసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. -
ఇదేమి పని ‘నారాయణా’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీడీపీ ఎన్నికల ఉచ్చులో ఇరుక్కున్నారు. తమ విద్యాసంస్థల అధినేత, టీడీపీకి చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ రాజకీయంలో సమిధలైపోతున్నారు. వారి చేత నారాయణ ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇలా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న నారాయణ సిబ్బంది, ఉపాధ్యాయులకు ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగిస్తున్నారు. మూడురోజుల క్రితమే నెల్లూరు నగరం మూలాపేట డివిజన్లో ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న నారాయణ సంస్థ ఉద్యోగినికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తాజాగా మంగళవారం నగరంలోనే 42వ డివిజన్ మన్సూర్‌నగర్‌లో ఇదే తరహాలో నారాయణ విద్యా సంస్థల ఉపాధ్యాయుడు ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరిస్తుండగా స్థానికులు ఆగ్రహించి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఎన్ టీంగా ఏర్పాటు నారాయణ టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆయన 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి మరోసారి బరిలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు నెల్లూరుకు ముఖం చాటేసిన ఆయనపై టీడీపీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆయన కోసం పనిచేయడానికి టీడీపీ నేతలెవరూ ముందుకు రావడంలేదు. దీంతో తన విద్యా సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రంగంలోకి దింపుతున్నారు. దాదాపు 150 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులతో నారాయణ టీం (ఎన్ టీం)గా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆ బృందంలోని వారితో నెల్లూరు నగరంలో ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకుంటున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా సమాచారం, వారి మొబైల్‌కు వచ్చే ఓటీపీని కూడా అడుగుతుండడంతో స్థానికుల్లో ఆందోళన ఏర్పడింది. తమ ఓట్లు తొలగిస్తారని స్థానికులు వారిని అడ్డుకుంటున్నారు. నెల్లూరు నగరంలో మూడు రోజుల్లోనే ఇద్దరు ఉపాధ్యాయులు దేహశుద్ధి చేయించుకొన్నారు. ఇదేం ఖర్మ నారాయణా.. అంటున్న ఉద్యోగులు నారాయణ విద్యా సంస్థల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులుగా అనేక మంది పనిచేస్తున్నారు. 2014 ఎన్నికల వరకు నారాయణ టీడీపీకి ఆర్థికంగా తోడ్పాటు అందిçస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు బినామీగా వ్యవహరించేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో నారాయణను చంద్రబాబు ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి నారాయణ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రాజకీయ ఉచ్చులోకి దింపుతున్నారు. ఒకవేళ ఎవరైనా నిరాకరిస్తే ఏదో ఒక సాకుతో ఉద్యోగం నుంచి తొలగించడం.. లేదా దూర ప్రాంతాలకు బదిలీ చేయడం చేస్తున్నట్లు ఓ ఉద్యోగి వెల్లడించారు. ఇప్పుడు ఉద్యోగులు ప్రజల చేతిలో తన్నులు తింటున్నారు. మాకు ఇదేం ఖర్మ అంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సింగరేణి సెగ ఎవరికి?
ప్రతి ఎన్నికల్లో విలక్షణ తీర్పు ఇచ్చే సింగరేణి ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారోనని రాజకీయపక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రంలో గోదావరి లోయ పరిధిలో 6 జిల్లాలు, 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించిన సింగరేణిలో మొత్తంగా 11 డివిజన్లలో 70వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 42 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు కాగా, మరో 28వేల మంది కాంట్రాక్టు కార్మికులు. వీరి కుటుంబసభ్యులతో సహా మూడున్నర లక్షల మంది వరకు ఓటర్లు ఉంటారు. ఈ 11 నియోజకవర్గాల్లో సింగరేణి ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతే ఫలితం అటు వైపే అన్న విషయం గత అనుభవాల నేపథ్యంలో అన్ని పక్షాలకు తెలుసు. దీంతో సింగరేణి కార్మికులను మచ్చిక చేసుకునేందుకు అన్ని పార్టీలు ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. సింగరేణి బొగ్గు గనుల వద్ద కార్నర్ మీటింగ్‌లు, దావత్‌లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సింగరేణి పరి ధిలోని పలు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాదసభలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క వంటి నాయకులు సింగరేణి బెల్ట్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలుగా ఉన్న టీబీజీకేఎస్ (బీఆర్ఎస్), ఐఎన్టీయూసీ (కాంగ్రెస్), ఏఐటీయూసీ (సీపీఐ)ల బలం కూడా ఈసారి ఎన్నికల్లో కీలకం కానుంది. 2018లో విలక్షణ తీర్పు గత శాసనసభా ఎన్నికల్లో సింగరేణి ఓటర్లు విలక్షణ తీర్పును ఇచ్చారు. 11 శాసనసభా నియోజకవర్గాలకుగాను టీఆర్ఎస్కు కేవలం మూడు సీట్లు మాత్రమే కట్టబెట్టారు. బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాలల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలుపొందగా, రామగుండంలో బీఆర్ఎస్ రెబెల్ కోరుకంటి చందర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ మీద పోటీ చేసి విజయం సాధించారు. సత్తుపల్లిలో టీడీపీ గెలుపొందగా, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, పినపాకల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన వారితో పాటు భూపాలపల్లి , ఆసిఫాబాద్ నుంచి గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి , ఆత్రం సక్కు కూడా తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు వారిలో ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఆత్రం సక్కు మినహా మిగతా వారంతా బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచారు. ఆసిఫాబాద్‌లో టీఆర్ఎస్ నుంచి గతంలో ఓడిపోయిన కోవా లక్ష్మికే మరోసారి బీఆర్ఎస్ టికెట్ దక్కింది. ఈసారి సింగరేణి కార్మికులు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మద్దతు పలుకుతారా? కొత్త వారికి అవకాశం కల్పిస్తారా? అనేది చూడాలి. కాగా, మంథని, రామగుండం, మంచిర్యాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లోనే బీజేపీ ప్రభావం కనిపిస్తోంది మిగిలిన చోట్ల ఆ పార్టీ పోటీ నామమాత్రంగానే ఉంది. మిగతా హామీల సంగతేంటంటున్న కాంగ్రెస్, సీపీఐ గత సింగరేణి ఎన్నికల్లో వారసత్వ ఉద్యోగాలతో పాటు కార్మికులు రాష్ట్రంలో ఎక్కడైనా సొంతిల్లు నిర్మించుకునేందుకు రూ.10లక్షల వడ్డీ లేని రుణం మంజూరు చేయిస్తామని బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చా రు. కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు హామీని కూడా అమలు చేయిస్తామని చెప్పారు. గనుల్లో చనిపోయిన కార్మికులకు నష్ట పరిహారం రూ. 20 లక్షలకు పెంపు హామీ ఇంకా నెరవేరలేదు. భూగర్భ బొగ్గు గనులను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చడం, కొత్త గనులు తెరవకపోవడం, సింగరేణికి ప్రభుత్వ సంస్థలు రూ. వేల కోట్లు బాకీపడడం, సింగ రేణిలో పెరిగిన రాజకీయ జో క్యం, ప్రైవేటీకరణ వంటి అంశాలను కాంగ్రెస్, సీపీఐ తప్పు పడుతున్నాయి. వారసత్వ ఉద్యోగాలపై బీఆర్ఎస్ ఆశలు 2017లో జరిగిన సింగరేణి ఎన్నికల్లో తమ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే వారసత్వ ఉద్యోగాల కల్పనతో పాటు పలు హామీలు నెరవేరుస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో గెలిచిన వెంటనే తదనుగుణంగా పావులు కదిపి సింగరేణి కారుణ్య నియామకాల ఉత్తర్వులు తీసుకొచ్చింది. ఈ మేరకు ఇప్పటి వరకు 18వేల మందికి వారసత్వ ఉద్యోగాలు ఇప్పించినట్లు బీఆర్ఎస్ చెబుతోంది. ఎప్పుడో చంద్రబాబు హయాంలో 1998లో రద్దయిన వారసత్వ ఉద్యోగాల ప్రక్రియను పునః ప్రారంభించి, సింగరేణి కార్మికుల కలలను నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ అని ఆపార్టీ ఎమ్మెల్యేలు చెపుతున్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చే క్వార్టర్స్ విషయంలో నిబంధనల సడలింపు, కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన జీతాలు, మరమ్మతుల కల్పన, క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కల్పన వంటివి అందించడంతో బీఆర్ఎస్ పట్ల సానుకూలత ఉందని తెలుస్తోంది. లాభాల వాటాను 16 శాతం నుంచి 23 శాతానికి పెంచుతామన్న హామీ నెరవేర్చడం, దసరా, దీపావళి పేరిట కార్మికులకు ఇచ్చే బోనస్, అడ్వాన్స్ పెంపు కూడా తమ విజయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ వెంట నడుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -పోలంపల్లి ఆంజనేయులు -
భవిష్యత్ గ్యారంటీ కార్డు పేరిట టీడీపీ సమాచార సేకరణ
-
మాస్టార్ తిప్పండి
వనం దుర్గాప్రసాద్ : ఉపాధ్యాయ ఓటర్లను సానుకూలంగా మార్చుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. అన్ని పార్టీలూ ఆయా అనుబంధ సంఘాలతో సంప్రదింపులు చేస్తున్నాయి. పరోక్ష సహకారం అందించాలని కోరుతున్నాయి. ఇటీవల ఓ పార్టీ నేత హైదరాబాద్‌లో ఓ ఉపాధ్యాయ సంఘం నేతలకు పెద్దఎత్తున విందు ఏర్పాటు చేయడం వివాదమైంది. ఈ విందు సందర్భంగా జిల్లాలవారీగా సంఘ నేతలను పరోక్ష ప్రచారంలోకి దించాలని నిర్ణయించినట్టు చర్చ జరుగుతోంది. ఇదే మాదిరి ఇప్పుడు ఇతర పార్టీలూ తమ అనుబంధ సంఘాల నేతలతో భేటీలు నిర్వహిస్తున్నాయి. ఉపాధ్యాయ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఏయే హామీలివ్వాలనే దిశగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. ఇందులో 80 వేల మంది వరకూ ఎన్నికల విధుల్లో ఉంటారు. వీళ్లంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగిస్తారు. ఉపాధ్యాయ కుటుంబాల నుంచి దాదాపు 4 లక్షల ఓట్లు ఉంటాయి. దీంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలున్నాయి. ఓడీల తాయిలం... ఉపాధ్యాయ సంఘాలు కొన్నేళ్లుగా ఆన్ డ్యూటీ కోసం పోరాడుతున్నాయి. గత ఏడాది ఏకంగా 14 సంఘాలకు ప్రభుత్వం ఓడీ ఇచ్చింది. కానీ గత ఏడాది డిసెంబర్‌తో పూర్తయ్యింది. అప్పట్నుంచీ దీన్ని పొడిగించకపోవడంతో పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎన్నికల సందర్భంగా నేతల వద్ద కూడా ఇదే అంశాన్ని ఉపాధ్యాయులు ప్రస్తావిస్తున్నారు. సంఘాల నేతలకు ఓడీ ఇస్తామన్న భరోసా ఉండాలని అన్ని సంఘాలు పార్టీలను కోరుతున్నాయి. ఓడీ ఇవ్వడం ద్వారా టీచర్ల సంఘ నేతలు విధులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎన్నికల ముందు కేవలం ఒకేఒక సంఘానికి ఓడీ లభించడం కూడా ఉపాధ్యాయ సంఘాల మధ్య భిన్న ధోరణికి కారణమైంది. ఓడీ ఇచ్చిన సంఘానికి వ్యతిరేకంగా ఓడీ రాని సంఘాలు ఏకమవ్వడాన్ని వివిధ పార్టీలు గుర్తిస్తున్నాయి. వీరిని సమన్వయం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బదిలీలు, పదోన్నతులూ కీలకమే.. దీర్ఘకాలంగా బదిలీలు, పదోన్నతులపై టీచర్లు ఆశలు పెట్టుకున్నారు. కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులో భాగంగా 317 జీఓ అమలు చేశారు. ఇది కూడా కొంతమంది ఉపాధ్యాయుల్లో అసంతృప్తి కలిగించింది. సాధారణ బదిలీల్లో కొన్ని మార్పులుంటాయని టీచర్లు ఆశించారు. కానీ 2022లో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం భావించినా, కోర్టు స్టే ఇవ్వడంతో ఆగిపోయింది. ఈలోగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. దీంతో బదిలీలు, పదోన్నతులపై పార్టీలు స్పష్టత ఇవ్వాలని మెజారిటీ టీచర్లు కోరుతున్నారు. దీన్ని గుర్తించిన పార్టీలు ఆ దిశగా అడుగులేసేందుకు సిద్ధపడుతున్నాయి. వీలైతే ఎన్నికల ప్రచారంలో ఎక్కడో చోట దీన్ని ప్రస్తావించి, టీచర్ ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. దీంతో పాటు ఖాళీల భర్తీ, కొత్త పోస్టుల నియామకంపై కూడా ఎన్నికల ప్రచారంలో ప్రస్తావన వచ్చే అవకాశముంది. విందు, వినోద రాజకీయాలు మాతో వద్దు టీచర్లకయినా వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి. ఇదేమీ తప్పుకాదు. కానీ విధి నిర్వహణపై ప్రభావం చూపకూడదు. ఎన్నికలవేళ రాజకీయ పార్టీల విందులు, వినోదాలకు వెళ్లే చిల్లర రాజకీయాలు ఆమోదయోగ్యం కాదు. నాయకులే కాదు..ఓటర్లనూ ఇది ప్రలోభ పెట్టే చర్యగానే చూడాలి. ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడి పవిత్రతను అందరూ కాపాడాలి. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వృత్తి గౌరవమే ముఖ్యం ఉపాధ్యాయుడు బాధ్యతాయుతమైన వ్యక్తి. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘ నేతలూ గుర్తించాలి. ఓట్ల ప్రలోభాలకు టీచర్లను లక్ష్యంగా చేయొద్దు. ఉపాధ్యాయూలూ దీనికి దూరంగా ఉండాలి. వృత్తి గౌరవాన్ని భంగపరిచే చర్యలకు పాల్పడొద్దు. విందులు, వినోదాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యత సంఘ నేతలకు ఉంది. –సయ్యద్ షౌకత్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
మొత్తం ఓటర్లు 3.26 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. గతనెల 5న ప్రకటించిన జాబితాతో పోలిస్తే.. ఐదో తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు కొత్తగా 8,70,072 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విడుదల చేసిన జాబితా ప్రకారం అందులో 3,26,02,799 ఓటర్లు ఉన్నారు. వయసు వారీగా కూడా ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. కొత్తగా చేరిన ఓటర్ల జాబితాను అక్టోబర్‌లో ప్రకటించిన ఓటర్ల జాబితాకు అనుబంధంగా జత చేయనున్నారు. 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య కోటీ 67 లక్షల 394 మంది ఉండగా, 40 ఏళ్ల పైబడిన వారు 1,58,73,405 మంది ఉన్నట్లు తేలింది. ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేలా రాజకీయ పార్టీలతోపాటు ఎన్నికల సంఘం కూడా ఓటు విలువను తెలియ చెప్పేలా కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. -
వలస ఓటర్లూ ప్లీజ్ రండి..
-
Telangana: వలస ఓటర్ల వేట
సాక్షి, హైదరాబాద్ : బతుకు దెరువు కోసం వలస వెళ్లిన ఓటర్లే ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని మారుస్తారని బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు భావిస్తున్నారు. వారి ప్రసన్నం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వలస వెళ్లిన ఓటర్లు పదివేల మందికిపైనే ఉంటారు. వీరి ఓటింగ్ అభ్యర్థి గెలుపోటములను ప్రభా వితం చేసే వీలుంది. దీంతో పోటాపోటీ ఎన్నికలు జరిగే స్థానాల్లో ఏ ఒక్క ఓటును తేలికగా విడిచిపెట్టకూడదని అభ్యర్థులు నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో దూర ప్రాంతాల నుంచి వారిని రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ పది మందికి ఓ సమన్వయకర్తను నియమిస్తున్నారు. సంబంధిత గ్రామాల్లో కార్యకర్తలకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఏయే నియోజకవర్గాల్లో ఎక్కువంటే.. ♦ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, భువ నగిరి, ఆలేరు, తుంగతుర్తి, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోనే 2 లక్షల మంది ఓటర్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించారు. ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే 40 వేలమందికి పైగా వలస ఓటర్లున్నట్టు లెక్కగట్టారు. వీళ్లంతా హైదరాబాద్, భీవండి, ముంబై, సూరత్, షోలాపూర్ ప్రాంతాల్లో వివిధ పనులు చేసుకుంటున్నారు. ♦ దేవరకొండ నియోజకవర్గంలో 25 వేల మంది వరకూ వలస ఓటర్లున్నట్టు తెలుసుకున్నారు. వీళ్లు హైదరాబాద్, మాచర్ల, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లారు. భువనగిరి, ఆలేరుల్లో దాదాపు 20 వేల మంది, తుంగతుర్తి, సాగర్, సూర్యాపేటల్లో పదివేలకు తక్కువ కాకుండా వలస ఓటర్లు ఉంటారని ప్రధాన పార్టీలు లెక్కలేశాయి. ♦ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకునే ఓ నియోజకవర్గంలో 18 వేల వలస ఓటర్లు ఉంటాయని ఓ ప్రధాన పార్టీ లెక్కలేసింది. ముంబై, సోలాపూర్, పుణేలో వివిధ పనులు చేసు కునే వీళ్ల కోసం ఆయా సామాజిక వర్గం నుంచే కొంతమందిని బృందంగా ఏర్పాటు చేసి, పోలింగ్‌కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పాలమూరు నియోజకవర్గంలోని రెండు మండలాల పరిధిలో 6 వేలమంది వలస ఓటర్లున్నారు. అక్కడ ఈ ఓట్లే కీలకంగా భావిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. వారిని రప్పించేందుకు రేషన్ డీలర్ల సాయం కూడా తీసుకుంటున్నారు. ♦నారాయణపేట, కొడంగల్, వనపర్తి నియోజకవర్గాల్లో వలస ఓటర్లు 15 వేలకు పైగానే ఉంటారు. మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, అచ్చంపేట, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లోనూ 10 వేల ఓట్లరు ఉంటారని అంచనా. నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేట, ధన్వాడ, కోయిల కొండ ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి, బొంరాస్‌పేట మండలాల ప్రజలు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని గండీడ్, మహ్మదాబాద్, హన్వాడ మండలాలకు చెందిన తండాలకు చెందిన వలస కార్మికులు భారీగా ఉన్నారు. వీరిని రప్పించేందకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రంగంలోకి ప్రత్యేక బృందాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఏదో ఒక ఉద్యోగం కోసమో, పిల్లల చదువుల కోసమో హైదరాబాద్ వచ్చిన వాళ్ళున్నారు. వీళ్ళకు ఇప్పటికీ ఓట్లు, రేషన్ కార్డులు వారి సొంత గ్రామాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వలస ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి చిరునామా, ఫోన్ నంబరుతో ఓ డేటాబేస్ రూపొందించడానికి సాంకేతిక నిపుణులూ ఇందులో ఉంటున్నారు. వివిధ పార్టీల నుంచి అందిన సమాచారాన్ని బట్టి ప్రతీ రెండు గ్రామాలకు ఒక్కో బృందం పనిచేస్తోంది. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులుంటున్నారు. నియోజకవర్గం వారీగా వలస ఓటర్ల వివరాలను కంప్యూటరీకరణ చేసేందుకు మరో పది మంది డేటా ఆపరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరితో మాట్లాడటం, వారికి ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపే యంత్రాంగం కూడా ప్రత్యేకంగా ఉంటోంది. ఓటరు కచ్చితంగా ఏ పార్టీకి ఓటు వేస్తాడనే అంచనాలను ఆయా ప్రాంతాల్లోని నాయకుల ద్వారా సేకరిస్తున్నారు. ఇక పూణే, షోలాపూర్, సూరత్ వంటి ప్రాంతాలకు అభ్యర్థుల ప్రతినిధులు స్వయంగా వెళ్ళి వలస ఓటర్లను కలుస్తున్నారు. ఎన్నికలకు కనీసం రెండు రోజుల ముందే గ్రామాలకు రప్పించాలని నేతలు భావిస్తున్నారు. -
నన్ను గెలిపించండి పనిచేయకపోతే ఈ చెప్పుతో కొట్టండి
-
5 అంత వీజీ కాదు!
రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున ఓటర్ల సంఖ్య 2.5లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. ఆ మేరకు ఓటర్లున్న చోట గెలిచేందుకు అభ్యర్థులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ రాష్ట్రంలోని ఓ ఐదు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులు అందరికన్నా ఎక్కువగా తంటాలు పడక తప్పని పరిస్థితి. ఎందుకంటే అవి రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఓటర్లున్న సెగ్మెంట్లు. వీటిలో ఓటర్ల సంఖ్య 5 లక్షలపైనే. ఇందులోనూ రెండింటిలో అయితే ఆరు లక్షలపైనే ఓటర్లు ఉన్నారు. అంటే రెండు, మూడు సాధారణ నియోజకవర్గాలతో సమానం అన్నమాట. ఇవన్నీ హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నవే. వీటిలో శేరిలింగంపల్లి (6.98 లక్షలు), కుత్బుల్లాపూర్ (6.69 లక్షలు), ఎల్బీనగర్ (5.66 లక్షలు), రాజేంద్రనగర్ (5.52 లక్షలు), మహేశ్వరం (5.17 లక్షలు) ఉన్నాయి. ఇవన్నీ నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో కొత్తగా ఏర్పడినవే కావడం గమనార్హం. ఎక్కువ మంది ఓటర్లేకాదు.. బస్తీల నుంచి గేటెడ్ కమ్యూనిటీల దాకా, అత్యంత సంపన్నుల నుంచి కూలీపని చేసుకునేవారి దాకా విభిన్న వర్గాలు, కులాలు, వివిధ మతాల ప్రజలు వీటిలో ఉన్నారు. వీరందరినీ ఆకట్టుకుని ఓట్లుగా మలచుకోవడం ఆషామాషీ కాదు. ఖర్చు కూడా ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితి. ఈ నియోజకవర్గాల గురించి ఒక్కసారి తెలుసుకుందామా.. శేరిలింగంపల్లి టాప్ రాష్ట్రంలో ఎక్కువ ఓటర్లున్న నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఇక్కడ 6,98,133 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 2009లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బీసీ నేత భిక్షపతియాదవ్.. టీడీపీ అభ్యర్థి మొవ్వ సత్యనారాయణపై 1,327 ఓట్ల తేడాతో గెలిచారు. 2014లో టీడీపీ, బీజేపీ కూటమి తరఫున కమ్మ సామాజికవర్గ నేత అరికపూడి గాందీ.. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌గౌడ్‌పై 75,904 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018 ఎన్నికల్లో అరికపూడి గాంధీ బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థిపై భవ్య ఆనంద్‌పై 44,194 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కుత్బుల్లాపూర్ బీసీ నేతలదే.. ఓటర్ల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6,69,361 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జనం తొలి నుంచీ బీసీ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. 2009లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్‌పై స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసిన కూన శ్రీశైలంగౌడ్ 23,219 ఓట్లతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ నేత కె.హన్మంతరెడ్డిపై టీడీపీ తరఫున బరిలోకి దిగిన కేపీ వివేకానందగౌడ్ 39,021 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరిన వివేకానంద.. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై 41,500 ఓట్ల తేడాతో గెలిచారు. ఎల్బీనగర్లో ఖాతా తెరవని బీఆర్ఎస్ ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గాల్లో మూడోదైన ఎల్బీనగర్లో 5,66,866 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో టీడీపీ అభ్యర్థి ఎన్వీ కృష్ణప్రసాద్‌పై కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి 13,142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్‌పై టీడీపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య 12,525 ఓట్లతో విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌పై కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 17,251 ఓట్లతో గెలిచారు. తర్వాత కొద్దిరోజులకే ఆయన బీఆర్ఎస్లో చేరారు. బీసీలకే రాజేంద్రనగర్ మద్దతు ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలో నాలుగో స్థానంలోని రాజేంద్రనగర్‌లో 5,52,455 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో ఏర్పాటైనప్పటి నుంచీ బీసీ నేత ప్రకాశ్‌గౌడ్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రకాశ్‌గౌడ్.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జ్ఞానేశ్వర్‌పై విజయం సాధించారు. తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ప్రకాశ్‌గౌడ్.. టీడీపీ అభ్యర్థి గణేశ్‌పై 57,331 ఓట్లతో భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్‌కు 46 వేలకుపైగా ఓట్లు రావడం గమనార్హం. ఐదో స్థానంలోని మహేశ్వరంలో.. మహేశ్వరం నియోజకవర్గం ఎక్కువ ఓటర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. 2009లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పి.సబితా ఇంద్రారెడ్డి 7,833 ఓట్లతో గెలిచారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో తొలి మహిళా హోంమంత్రిగా వైఎస్సార్ కేబినెట్లో బాధ్యతలు చేపట్టారు. ఇక 2014లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎం.రంగారెడ్డిపై టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 30,784 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరిన కృష్ణారెడ్డి 2018లో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగగా.. ఆయనపై కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి 9,227 ఓట్లతో గెలిచారు. తర్వాత ఆమె బీఆర్ఎస్లో చేరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -గౌటే దేవేందర్ -
ఎన్నికలవే.. ఎరలవే!
‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా..’ అనే సినిమా డైలాగ్ తరహాలో ఎలాంటి హామీలిచ్చామన్నది కాదు.. తమకు అనుకూలంగా బ్యాలెట్ బాక్సులు నిండాయా..లేదా? అధికారం చేపడతామా..లేదా?.. ఎన్నికలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా రాజకీయ పార్టీల టార్గెట్ ఇదే. నగదుతో పాటు చీరలు, సెల్ఫోన్లు, కుక్కర్ల లాంటి వస్తువుల పంపిణీతో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించడం.. ముఖ్యంగా అధికారంలోకి వస్తే అది చేస్తాం..ఇది చేస్తాం..అంటూ హామీలు గుప్పించడం. ప్రపంచవ్యాప్తంగా పార్టీలది ఇదే బాట. తెలంగాణ అయినా, భారత్‌లో అయినా, పర్యాటక ప్రేమికుల స్వర్గధామం థాయిలాండ్ అయినా, భూకంపాల పుట్టినిల్లు టర్కీ అయినా.. ఎక్కడైనా ఓటర్ల కోసం తాయిలాలే. మన దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా పార్టీలు ఇస్తున్న హామీల తరహాలోనే.. గతంలో ప్రపంచంలోని పలు దేశాల ఎన్నికల్లోనూ పార్టీలు అనేక రకాల హామీలను గుప్పించి ఓట్లు సంపాదించే ప్రయత్నం చేయడం గమనార్హం. అయితే కొన్ని దేశాల్లో ప్రజాకర్షక హామీలతో పాటు పలు ఆర్థిక, సామాజిక, రక్షణ రంగాలకు సంబంధించిన అంశాలు కూడా అక్కడి ఓటర్లను ప్రభావితం చేయడం ఆసక్తి కలిగించే అంశం. కాగా, ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎన్నికలు జరిగిన టర్కీ, అర్జెంటీనా, పోలండ్, థాయ్‌లాండ్ దేశాల్లో స్థానిక ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు ఎలాంటి తాయిలాలు ప్రకటించాయో ఓసారి చూద్దాం. పోలండ్‌లో హక్కుల అంశాలు! 1989లో కమ్యూనిస్టు పాలన ముగిసిన తర్వాత పోలండ్‌లో మొదటిసారి ఈ ఏడాది అక్టోబర్‌లో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అధికార లా అండ్ జస్టిస్ పార్టీ (పీఐఎస్) మిత్రపక్షాలు, సెంటర్ రైట్ సివిక్ ప్లాట్‌ఫామ్ (పీవో)లు హోరాహోరీ తలపడ్డాయి. ఇక్కడి ఎన్నికలు రక్షణ రంగం, వలసలు, యూరోపియన్ యూనియన్ పాత్ర, మహిళలు, స్వలింగ సంపర్కుల హక్కులు, ద్రవ్యోల్బణం లాంటి అంశాలపై జరిగాయి. చిన్నారులు, వృద్ధులకు ఉచితంగా ఔషధాలను ఇస్తామని, 1989 కంటే ముందు కట్టిన అపార్ట్మెంట్లను ఆధునీకరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలను పెంచుతామని, కనీస వేతనాన్ని 6,450 జ్లోటీలకు పెంచుతామనే హామీలనిచ్చాయి. ఆర్థిక వ్యవస్థ పటిష్టతపై అర్జెంటీనా అర్జెంటీనాలో అధ్యక్షుడితో పాటు 22 ప్రావిన్సుల గవర్నర్లు, 130 డిప్యూటీ గవర్నర్లు, 24 సెనేటర్ స్థానాలకు ఈ ఏడాది అక్టోబర్ 22న ఎన్నికలు జరిగాయి. ఈ దేశంలో బహుళ పార్టీ వ్యవస్థ ఉన్నా.. ది యూనియన్ పోర్లా పాట్రియా (యూపీ), జుంటోస్ పార్ కాంబియో (జేఎక్స్సీ), లా లిబరా్టడ్ అవాంజా (ఎల్‌ఎల్‌ఏ) కూటముల మధ్య పోటీ జరిగింది. దేశంలో జరుగుతున్న నేరాలు, డ్రగ్ ట్రాఫికింగ్లను అరికట్టేందుకు భద్రత పెంపు, పన్నుల తగ్గింపు, రాష్ట్రాల పరిధుల తగ్గింపు (మన రాష్ట్రంలో జరిగిన జిల్లాల పునర్విభజన తరహాలో), నిరుద్యోగ బీమా, ప్రభుత్వ కంపెనీల ప్రైవేటీకరణ, సామాజిక అంశాలపై ఖర్చు తగ్గింపు, వాణిజ్య రంగంలో నిబంధనల సరళీకరణ, చైనాతో సంబంధాల కటీఫ్, అమెరికన్ డాలర్‌తో పోటీ పడేలా ఆర్థిక వ్యవస్థ రూపకల్పన లాంటి అంశాలు ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ప్రచారా్రస్తాలుగా ఉపయోగపడ్డాయి. టర్కీలో ‘టెర్రర్’ తీవ్రవాదంతో కునారిల్లుతోన్న టర్కీలో జరిగిన ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలు ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. దేశ ఆర్థిక వ్యవస్థ, ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో సంభవించిన భూకంపాల కేంద్రంగానే ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఇక్కడి ప్రధాన పార్టీలు సిరియా శరణార్ధులను కూడా ఎన్నికల బూచిగా వాడుకున్నారు. రష్యా మధ్యవర్తిత్వంతో సిరియాతో చర్చలు జరుపుతామని ప్రస్తుత అధ్యక్షుడు ఎర్డోగాన్ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. భూకంపాల నుంచి ఉపశమనం పొందేందుకు గాను ఈశాన్య టర్కిలోని ప్రజలకు 20 ఏళ్ల కాలపరిమితితో ఇంటి రుణాలు ఇప్పిస్తామని, రెండేళ్ల తర్వాత ఈ రుణాలు చెల్లించేలా చేస్తామని చెప్పాయి. మొత్తం ఆరున్నర లక్షల ఇళ్లను ప్రభుత్వమే కట్టి ఇస్తుందని, ఇందులో 3.19 లక్షలను ఏడాదిలోగా పూర్తి చేస్తామని పార్టీలు హామీలిచ్చాయి. థాయ్‌లాండ్‌లో ఆర్థిక లబ్ధిపై దృష్టి! ప్రపంచ పర్యాటక కేంద్రమైన థాయ్‌లాండ్‌లో ఈ ఏడాది మేలో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఇక్కడి ప్రధాన రాజకీయ పార్టీలయిన ప్యూ థాయ్ పార్టీ, మూవ్ ఫార్వార్డ్ పార్టీ, యునైటెడ్ థాయ్ నేషన్ పార్టీ, పలాంగ్ ప్రచారత్ పార్టీ, భుంజయ్థాయ్ పార్టీ, డెమొక్రాట్ పార్టీలు ఓట్ల వేటలో భాగంగా పలు హామీలు అక్కడి ప్రజలకు ఇచ్చాయి. ఎక్కువగా ఆర్థిక లబ్ధి చేకూర్చే కార్యక్రమాలపైనే దృష్టి పెట్టాయి. డిజిటల్ వ్యాలెట్ల ద్వారా 16 ఏళ్లు నిండిన వారికి రూ.10వేల బాత్‌లను ఇస్తామని, దినసరి కనీస వేతనాలను 337 బాత్‌ల నుంచి 600 బాత్‌లకు పెంచుతామని, రుణాలపై మూడేళ్ల మారటోరియం ప్రకటిస్తామని, ప్రతి ఉపాధ్యాయునికి, విద్యార్థి కి టాబ్లెట్ కంప్యూటర్ ఇస్తామని, వృద్ధాప్య భృతి నెలకు 3వేల బాత్‌లు చేస్తామని, విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని, 1జీబీ ఇంటర్నెట్ ఉచితంగా ఇస్తామని, వ్యవసాయ కుటుంబాలకు 30వేల బాత్‌లు సాయం చేస్తామని, వరి పండించే రైతాంగానికి రయ్ (అర ఎకరానికి కొంచెం ఎక్కువ)కి 2వేల బాత్ ఇస్తామని ప్రకటించాయి. -మేకల కళ్యాణ్ చక్రవర్తి -
వినిపిస్తోందా.. మూడో స్వరం
ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభలో మూడో స్వరం వినిపించేందుకు ట్రాన్స్జెండర్లు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వరంగల్ తూర్పు సెగ్మెంట్ నుంచి బీఎస్పీ అభ్యర్థి గా పోటీ చేసేందుకు రామన్నపేటకు చెందిన చిత్రపు పుష్పిత లయకు తాజాగా అవకాశం లభించగా, గత ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థి గా పోటీ చేసిన చంద్రముఖి కూడా ఈసారి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక ట్రాన్స్జెండర్లతో పాటు ప్రజల్లో ఓటు అవగాహనకు రాష్ట్ర ఎన్నికల ప్రచార కర్తగా వరంగల్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ లైలాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించింది. ఆమె తమ కమ్యూనిటీ వారు ఓటు నమోదు చేసుకునేందుకు అవగాహన కలిగిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, వరంగల్/హైదరాబాద్ రాష్ట్రంలో సుమారు 50 వేల మందికి పైగా ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు స్వచ్చంద సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ ఓటర్లుగా నమోదైన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ట్రాన్స్జెండర్ల పట్ల సమాజం నుంచి ఎదురయ్యే వివక్ష, అవమానాలు, వేధింపుల కారణంగానే చాలామంది ‘మగవారు’గానే మనుగడ కొనసాగిస్తున్నట్టు ఆయా సంస్థలు చెబుతున్నాయి. అన్ని జీవన సమూహాల్లాగే ట్రాన్స్జెండర్లు కూడా స్వేచ్ఛా యుతమైన జీవనాన్ని కొనసాగించే హక్కును కలిగి ఉన్నట్లు గతంలో వెలువరించిన సుప్రీంకోర్టు తీర్పు వారికి గొప్ప ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. మరోవైపు వివిధ స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలు, హక్కులసంఘాల నుంచి వారికి సంపూర్ణమైన మద్దతు, అండదండలు లభించాయి. దీంతో ట్రాన్స్ జెండర్లు సంఘటితమయ్యారు. తమ ఉనికిని బలంగా చాటుకొనేందుకు ఎన్నికలను ఒక అస్త్రంగా మలుచుకున్నారు. తీవ్రమైన వివక్ష, అణచివేతకు గురవుతున్న ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని చాటుకొనేందుకు, ఆకాంక్షలనువెల్లడించేందుకు చట్టసభలను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నట్లు చిత్రపు పుషి్పత లయ, చంద్రముఖి చెబుతున్నారు. బీఎస్పీ కార్యకర్త నుంచి అభ్యర్థిగా చిత్రపు పుష్పిత లయ ప్రస్థానం వరంగల్ రామన్నపేటకు చెందిన చిత్రపు పుష్పిత లయ బీఎస్పీ పార్టీ కార్యకర్తగా ఢిల్లీలో ఐదేళ్లు పనిచేశారు. ఆ తర్వాత డాక్టర్ అంబేడ్కర్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. రెండేళ్ల నుంచి వరంగల్ తూర్పు బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ట్రాన్స్జెండర్ల తరఫున తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థి గా చంద్రముఖి ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని చాటుకొనేందుకు మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు మువ్వల చంద్రముఖి వెల్లడించారు. భరతనాట్య కళాకారిణి. వ్యాఖ్యాత, సినీనటి అయిన చంద్రముఖి దశాబ్దకాలంగా ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రజాస్వామ్య సౌధంలో మూడోస్వరాన్ని వినిపించేందుకే 2018లో ట్రాన్స్జెండర్ల ప్రతినిధిగా, బీఎల్ఎఫ్ అభ్యర్థి గా గోషామహల్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 1125 ఓట్లు లభించాయి. ఈ సారి మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలనుకుంటున్నట్లు చెప్పారు. ఏ నియోజకవర్గం నుంచి అనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఎన్నికల ప్రచారకర్తగా లైలా.. మహబూబాబాద్ జిల్లాలోని అన్నారం గ్రామానికి చెందిన లైలా అలియాస్ ఓరుగంటి లక్ష్మణ్ డిగ్రీ చదువుకునే రోజుల్లో హిజ్రావైపు మళ్లారు. పూర్తిస్థాయి ట్రాన్స్‌జెండర్‌గా మారి డబుల్ పీజీ కూడా చేశారు. 20 ఏళ్ల నుంచి మ్యారీ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవీ ప్రాజెక్ట్‌లో హెల్త్ వర్కర్‌గా పనిచేస్తూ వరంగల్‌లో ఉంటున్నారు. రాష్ట్ర హిజ్రాల వెల్ఫేర్ సంఘం సభ్యురాలుగా కూడా ఎన్నికయ్యారు. వారి కమ్యూనిటీ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఈమె సేవలను గుర్తించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది సెపె్టంబర్ 19వ తేదీన ఎన్నికల ప్రచారకర్త (అంబాసిడర్)గా నియమించడం విశేషం. -
ఆ 33 సెగ్మెంట్లలో మారుతున్న పార్టీల రాతలు
ప్రతిసారీ ఎన్నికలు జరుగుతాయి..ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేసిన వారిలో ఒక్కరు గెలిస్తే, మిగిలిన వారంతా ఓడిపోతారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా జరిగేది ఇదే. కానీ, కొన్ని నియోజకవర్గాల్లోని ప్రజలు ఈ విజేతలు, పరాజితులను నిర్ణయించే క్రమంలో విలక్షణంగా వ్యవహరిస్తుంటారు. అక్కడి పరిస్థితులను బట్టి కొన్ని నియోజకవర్గాల ప్రజలు తమ మూడ్‌ను ఎప్పటికప్పుడు మార్చేస్తుంటారు. కొన్నిచోట్ల ఒక్కసారి గెలిచిన పార్టీకి మరోమారు పట్టం కట్టరు. మరికొన్ని చోట్ల వరుసగా ఒక్కో పార్టీని గెలిపిస్తుంటారు. అలాంటి విలక్షణ తీర్పునిచ్చే నియోజకవర్గాలు తక్కువేం లేవు. రాష్ట్రంలోని నాలుగో వంతుకుపైగా నియోజకవర్గాల్లో విభిన్న తీర్పులిస్తున్నారు ప్రజలు. ఆ నియోజకవర్గాలేంటి... ఈ ప్రజల ‘మూడ్’ కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం. ♦ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎనిమిది ఎన్నికల్లో ఒక్కసారి మినహా ఏడుసార్లు విభిన్న తీర్పునిచ్చారు. ఒకసారి గెలిచిన పార్టీని మళ్లీ అక్కడి ప్రజలు ఆదరించలేదు(2004లో మినహా). 2018లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే 2014లో టీఆర్ఎస్, 2009లో కాంగ్రెస్ గెలిచాయి. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా ఉన్నప్పుడు 2004లో టీడీపీ, 1999లో టీడీపీ, 1994లో సీపీఐ, 1989లో కాంగ్రెస్, 1985లో సీపీఐ గెలిచాయి. అంటే (2004లో మినహా) ఒక్కసారి గెలిచిన పార్టీ మళ్లీ గెలవని సంప్రదాయం 40 ఏళ్లుగా కొనసాగుతోందన్నమాట. ♦ ఖానాపూర్‌లో ఒక్కసారి మినహా గత ఆరు ఎన్నికల్లో ఏ పార్టీనయినా ప్రజలు వరుసగా రెండుసార్లు గెలిపిస్తున్నారు. 1994, 1999ల్లో టీడీపీ, 2004లో టీఆర్ఎస్, 2008, 2009లో మళ్లీ టీడీపీ, 2014, 18 ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించారు. ♦ ఆదిలాబాద్‌లో 1978 నుంచి మూడుసార్లు వరుసగా ఇండిపెండెంట్లు గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచింది. మళ్లీ రెండుసార్లు టీడీపీ గెలిచింది. మరోసారి కాంగ్రెస్ గెలిచింది. మళ్లీ టీడీపీ గెలిచింది. తాజాగా జరిగిన మూడు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలిచింది. ♦ నిర్మల్‌లో నాలుగు ఎన్నికల్లోనూ నాలుగు పార్టీలు గెలిచాయి. 2004లో కాంగ్రెస్, 2009లో పీఆర్పీ, 2014లో బీఎస్పీ, 2018లో టీఆర్ఎస్ ఇక్కడ గెలుపొందాయి. ♦ ముథోల్‌లో 1983లో కాంగ్రెస్ గెలవగా, ఆ తర్వాత వరుసగా టీడీపీ, కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ గెలిచాయి. అంటే 40 ఏళ్లుగా ఇక్కడ ఒకసారి గెలిచిన పార్టీ మళ్లీ గెలవలేదు. ♦ ఆర్మూరులో 1983లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, ఆ తర్వాత వరుసగా టీడీపీ, కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ గెలిచాయి. గత రెండు ఎన్నికల్లో మాత్రమే టీఆర్ఎస్ వరుసగా గెలిచింది. ♦ జగిత్యాలో 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 2014లో కాంగ్రెస్, 2018లో టీఆర్ఎస్ గెలిచాయి. ♦ పెద్దపల్లిలో 1978లో కాంగ్రెస్, 83లో టీడీపీ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, 85లో టీడీపీ, 89లో కాంగ్రెస్, 94లో టీడీపీ, 99లో బీజేపీ, 2004లో టీఆర్ఎస్, 2009లో టీడీపీ, 2014లో టీఆర్ఎస్ గెలిచాయి. ఇలా వరుసగా 45 ఏళ్ల సంప్రదాయానికి గండికొడుతూ 2018లో కూడా టీఆర్ఎస్ ఇక్కడ గెలిచింది. ♦ హుజూరాబాద్‌లో1962 నుంచి వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్ గెలిస్తే, ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు టీడీపీ గెలిచింది. టీఆర్ఎస్ ఏర్పాటైన తర్వాత 6సార్లు ఆ పార్టీనే గెలిచింది. గత ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలిచింది. ♦ శేరిలింగంపల్లి ఏర్పాటైన తర్వాత మూడుసార్లు మూడు పార్టీలను అక్కడిప్రజలు గెలిపించారు. 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2018లో టీఆర్ఎస్లు ఇక్కడి నుంచి గెలిచాయి. ♦ సంగారెడ్డిలో 1989 నుంచి గెలిపించిన పార్టీ మళ్లీ ప్రజలు గెలిపించడం లేదు. 1989లో కాంగ్రెస్, 94లో టీడీపీ, 99లో బీజేపీ, 2004లో టీఆర్ఎస్, 09లో కాంగ్రెస్, 14లో టీఆర్ఎస్, 18లో కాంగ్రెస్‌ను అక్కడి ప్రజలు గెలిపించారు. ♦ ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలు ఏ పార్టీనయినా రెండుసార్లు ఆదరిస్తున్నారు. 1994, 99లో టీడీపీ అభ్యర్థులు అక్కడ గెలిస్తే, 2004, 09లో కాంగ్రెస్, 2014, 18లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ♦ చేవెళ్లలో 2004లో కాంగ్రెస్, 09లో టీడీపీ, 14లో కాంగ్రెస్, 8లో టీఆర్ఎస్ గెలుపొందాయి. ♦ తాండూరులో 1999లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 2014లో టీఆర్ఎస్, 2018లో కాంగ్రెస్ గెలిచాయి. ఐదు ఎన్నికల్లో ఒకసారి గెలిచిన పార్టీని ప్రజలు మరోసారి ఆదరించలేదు. ♦ ముషీరాబాద్‌లో 1989, 94లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత ఒసారి బీజేపీ, మరోమారు టీఆర్ఎస్ గెలిచింది. అక్కడ మళ్లీ రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత ఒకసారి బీజేపీ, మరోసారి టీఆర్ఎస్ గెలిచాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ♦ జూబ్లీహిల్స్ ఏర్పాటయిన తర్వాత మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ విజయం సాధించాయి. ♦ గోషామహల్లో ప్రజలు డబుల్ ధమాకా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ 1972, 78లో కాంగ్రెస్ గెలిస్తే, 83, 85లో టీడీపీ గెలిచింది. 94, 99 ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, 2004, 09 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత 2014, 18 ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. కానీ, 1989లో మాత్రం ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ♦ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాలుగు ఎన్నికల్లో నాలుగు పార్టీలు గెలిచాయి. 2004లో టీడీపీ, 09లో కాంగ్రెస్, 14లో టీడీపీ, 18లో టీఆర్ఎస్ గెలిచాయి. మరి ఈసారి ఎవరు గెలుస్తారో? ♦ కొడంగల్‌లో కూడా రెండుసార్లు గెలిచే సంప్రదాయం కొనసాగుతోంది. 1994,96లో టీడీపీ, 1999,2004లోకాంగ్రెస్, 2009,14లో టీడీపీ గెలిచాయి. 18లో టీఆర్ఎస్ గెలవగా, 23లో ఎవరుగెలుస్తారో వేచి చూడాలి. ♦ మక్తల్‌లో 2005 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే 2009లో టీడీపీ, 14లో కాంగ్రెస్, 18లో టీఆర్ఎస్ గెలిచాయి. ♦ వనపర్తిలో గత నాలుగు ఎన్నికల్లో నాలుగు పార్టీలు గెలిచాయి. ఇక్కడ 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 2014లో కాంగ్రెస్, 2018లో టీఆర్ఎస్ గెలిచాయి. ♦ కల్వకుర్తిలో 1989 నుంచి గెలిచిన పార్టీ మళ్లీ గెలవడం లేదు. 1989లో కాంగ్రెస్, 94లో ఇండింపెండెంట్, 99లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 2014లో కాంగ్రెస్, 2018లో టీఆర్ఎస్ గెలవడం గమనార్హం. ♦ దేవరకొండలోనూ గెలిచిన పార్టీ మళ్లీ గెలవడం లేదని గత ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఇక్కడ 1994లో సీపీఐ గెలిస్తే 99లో కాంగ్రెస్, 2004లో సీపీఐ, 2009లో కాంగ్రెస్, 14లో సీపీఐ, 18లో టీఆర్ఎస్ గెలిచాయి. ♦ కోదాడలోనూ గత నాలుగు పర్యాయాలుగా ఓసారి గెలిచిన పార్టీ మరోమారు గెలవడం లేదు. ఇక్కడ 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 14లో కాంగ్రెస్, 18లో టీఆర్ఎస్ గెలిచాయి. ♦ తుంగుతుర్తిలో 1989లో కాంగ్రెస్ విజయం సాధించగా, 94లో ఇండిపెండెంట్, 99లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 14లో టీఆర్ఎస్ గెలిచాయి. వరుసగా రెండోసారి 2018లో మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. ♦ నర్సంపేటలో ఐదు పర్యాయాలుగా గెలిచిన పార్టీ గెలవడంలేదు. 1999లో ఇక్కడ టీడీపీ గెలిస్తే, 2004లో టీఆర్ఎస్, 2009లో టీడీపీ, 2014లో ఇండిపెండెంట్, 2018లో టీఆర్ఎస్ పార్టీలు గెలుపొందాయి. ♦ పరకాలలో 1989లో బీజేపీ గెలిస్తే, 94లో సీపీఐ, 99లో టీడీపీ, 2004లో టీఆర్ఎస్, 09లో కాంగ్రెస్, 12లో టీఆర్ఎస్, 14లో టీడీపీ, 18లో టీఆర్ఎస్ పార్టీలు గెలిచాయి. గత 8 ఎన్నికల్లోనూ అక్కడ ఒకసారి గెలిచిన పార్టీ మరోమారు గెలవడం లేదు. ♦ ములుగులోనూ నాలుగు పర్యాయాలుగా గెలుపు గుర్రాలు మారుతూనే ఉన్నాయి. 2004లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే 09లో టీడీపీ, 14లో టీఆర్ఎస్, 18లో కాంగ్రెస్ పార్టీలు విజయం సాధించాయి. ♦ ఖమ్మం నియోజకవర్గంలో 1994 నుంచి గెలిచిన పార్టీ మళ్లీ గెలవడం లేదు. ఇక్కడ 1994లో సీపీఐ, 1999లో కాంగ్రెస్, 2004లో సీపీఎం, 2009లో టీడీపీ, 2014లో కాంగ్రెస్, 2018లో టీఆర్ఎస్ గెలిచాయి. ♦ కొత్తగూడెంలోనూ నాలుగు దఫాలుగా విజయం వేర్వేరు పార్టీలను వరిస్తోంది. 2004లో అక్కడ కాంగ్రెస్ గెలిస్తే, 2009లో సీపీఐ, 14లో టీఆర్ఎస్, 18లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ♦ ఇక, అశ్వారావు పేట ఏర్పడిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ మూడు పార్టీలు గెలిచాయి. ఇక్కడ 2009లో కాంగ్రెస్, 2014లో వైఎస్సార్సీపీ, 2018లో టీడీపీ గెలిచాయి. ♦ నకిరేకల్‌లోనూ నాలుగు దఫాలుగా ఇవే ఫలితాలొస్తున్నాయి. ఇక్కడ 2004లో సీపీఎం గెలిస్తే 2009లో కాంగ్రెస్, 2014లో టీఆర్ఎస్, 2018లో కాంగ్రెస్ పార్టీలు గెలిచాయి. ♦ డోర్నకల్‌లోనూ ఓటర్లు ప్రతీఎన్నికల్లో తమ తీర్పు మారుస్తున్నారు. 2004లో కాంగ్రెస్‌ను గెలిపించిన అక్కడి ప్రజలు 09లో టీడీపీనీ, 14లో కాంగ్రెస్‌ను, 18లో టీఆర్ఎస్ను గెలిపించారు. -మేకల కళ్యాణ్ చక్రవర్తి -
మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకున్నారా? సందేహాలున్నాయా? చెక్ చేసుకోండిలా!
తెలంగాణ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది…పార్టీలు ప్రచారాల్లో మునిగితేలుతూంటే… ఓటరు మహాశయుడూ నవంబరు 30వ తేదీ కోసం ఎదురు చూస్తున్నాడు. తొలిసారి ఓటేస్తున్నామన్న ఉత్సాహం యువ ఓటర్లది.... నచ్చని నేతలను వదిలించుకోవాలని ఇతరులు ఎదురు చూస్తున్నారు. మరి… ఓటరు జాబితాలో మీ పేరుందో? లేదో చూసుకున్నారా? దాంట్లో తప్పులేమీ లేవు కదా? ఉంటే సరిచేసుకోవడం ఎలా అన్న అనుమానం వెంటాడుతోందా? ఏం ఫర్వాలేదు… సాక్షి.కాం మీతోనే ఉంది. ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా మీ ఓటరు కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? పేరెలా పరిశీలించాలి? మొబైల్‌ఫోన్‌కు ఆధార్ నెంబరును లింక్ చేసుకోవడమెలా వంటి అనేక సందేహాలకు సమాధానాలు అందిస్తోంది. ఆలస్యం ఎందుకు…. చదివేయండి. మీ సందేహాలు తీర్చుకోండి. ఇంకా ఏవైనా మిగిలిన ఉంటే ఎన్నికల కమిషన్ అధికారులతోనే మీ డౌట్స్ క్లియర్ చేసేందుకూ ప్రయత్నిస్తాం. మీరు చేయాల్సిందల్లా… మీ సందేహం/సమస్యను vote@sakshi.com ఐడీకి మెయిల్ చేయడమే!! ఓటర్ల సమాచారాన్ని ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఓటర్లకు సంబంధించిన అన్ని సేవలను, సమాచారాన్ని ఒక దగ్గరకు చేర్చి https://voterportal.eci.gov.in ను రూపొందించింది. ఓటరుగా నమోదు చేసుకోవడం మొదలుకొని జాబితాలో పేరును చెక్ చేసుకోవడం వరకూ అన్ని సేవలూ ఇక్కడే లభిస్తాయి. జాబితాలో మీ పేరు చూసుకోండిలా… ఈ వెబ్సైట్లోకి ప్రవేశించగానే… కుడివైపున సర్వీసెస్ అన్న భాగంలో ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అని ఒక చిన్న ట్యాబ్‌ను గమనించండి. దాన్ని క్లిక్ చేస్తే ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకునే పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీ ఇలా ఉంటుంది…. ఇందులో మూడు రకాలుగా మీ పేరును చెక్ చేసుకోవచ్చు. మొదటది మీ వివరాలను అందించడం. రెండోది మీ ఓటర్ ఐడీ సంఖ్య ద్వారా… మూడోది మొబైల్ నెంబరు ద్వారా (ఓటరు ఐడీకి మొబైల్ ఫోన్ నెంబరు అనుసంధానం చేసి ఉంటేనే) వివరాలిచ్చి ఇలా…. ఓటర్ ఐడీలో ఉన్నట్టుగానే మీ పేరును టైప్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇంటిపేరైనా ఇవ్వవచ్చు. లేదంటే… ఓటరు ఐడీలో మీరు ఇచ్చి తల్లి/తండ్రి లేదా ఇతర బంధువు పేరు వివరాలు ఇచ్చి కూడా వెతకవచ్చు. నమోదు చేసుకున్న పుట్టినరోజు లేదా మీ వయసు వివరాలు ఇచ్చి కూడా జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. ఇవేవీ లేకుంటే స్త్రీ, పురుషుడు లేదా థర్డ్ జెండర్ అన్న వివరాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు కానీ… కొంచెం వ్యయ ప్రయాసతో కూడుకున్న పని. చివరగా.. మీ జిల్లా, మీ నియోజకవర్గం వివరాలు ఇవ్వడం ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. పేజీ చివర ఉన్న Captcha Code బాక్స్లోఉన్న అక్షరాలు లేదా అంకెలను రాసి సెర్చ్ బటన్ నొక్కితే మీ వివరాలు కనిపిస్తాయి. నోట్: పేర్లు, ఇతర వివరాలు టైప్ చేసేటప్పుడు పెద్ద, చిన్న అక్షరాలు, పదాల మధ్య ఖాళీలు సరిగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. పేజీ పై భాగంలోనే మీ రాష్ట్రాన్ని ఎంపిక చేయడం మరచిపోవద్దు. అలాగే తెలుగుతోపాటు దాదాపు 11 భారతీయ భాషల్లో సమాచారాన్ని వెతకవచ్చునని గుర్తించండి. ఓటర్ ఐడీ ద్వారా… మీ ఓటర్ ఐడీలోని సంఖ్య ద్వారా జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవడం చాలా సులువు. పైన కనిపిస్తున్న మాదిరిగా ఉంటుంది వెబ్‌సైట్‌లోని స్క్రీన్. ఒక పక్కన ఓటర్ ఐడీ సంఖ్యను ఎంటర్ చేయాలి. రెండోవైపున ఉన్న కాలమ్ నుంచి మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. ఆ తరువాత Captcha Code ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే సరి. మొబైల్ ఫోన్ ద్వారా… రాష్ట్రం, భాషలను ఎంచుకున్న తరువాత స్క్రీన్ మధ్యలో ఉన్న కాలమ్‌లో ఓటర్ ఐడీకి అనుసంధానమైన మొబైల్ ఫోన్ నెంబరును ఎంటర్ చేయాలి. ఎన్నికల కమిషన్ పంపే ఓటీపీని దిగువనే ఉన్న కాలమ్‌లో టైప్ చేసి Captcha Code కూడా ఎంటర్ చేయాలి. దీని తరువాత సెర్చ్ కొడితే మీ వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఓటర్ ఐడీ డౌన్లోడ్ చేసుకోవాలంటే… ముందుగా https://voterportal.eci.gov.in కు వెళ్లండి. సర్వీసెస్ భాగంలో దిగువన ‘ఈ-ఎపిక్ డౌన్లోడ్’ అని ఉన్న కాలమ్పై క్లిక్ చేయండి. ఇలా ఒక స్క్రీన్ ప్రత్యక్షమవుతుంది. భారతీయ ఓటరు లేదా విదేశాల్లో ఉన్న ఓటర్లు తమకు సంబంధించిన కాలమ్స్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. రిజస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపిని ఎంటర్ చేసి ఓటర్ ఐడీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు వేయాలో తెలుసుకోవాలంటే… హోమ్ పేజీలో సర్వీసెస్ భాగంలో ‘నో యువర్ పోలింగ్ స్టేషన్ అండ్ ఆఫీసర్’ అన్న కాలమ్‌ను క్లిక్ చేయండి. ఓటర్ ఐడీ సంఖ్య, Captcha Code లు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఆ వివరాలు ప్రత్యక్షమవుతాయి. చివరగా… ఓటర్ ఐడీలో మీ వివరాలు మార్చుకోవాలనుకుంటే https://voterportal.eci.gov.in హోమ్ పేజీలోనే ఫామ్స్ అన్న భాగంలో అవసరమైన పత్రాలు ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి మార్పులు చేర్పులు, అభ్యంతరాలు, తొలగింపుల వంటివి చేయవచ్చు. -
రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మహిళలే నిర్ణేతలు కానున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్లలో పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా ఉన్నారు. 2024 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం.. రాష్ట్రంలో సాధారణ ఓటర్లు, ఓవర్సీస్, సర్విసు ఓటర్లతో కలిపి మొత్తం 4,02,21,450 ఓటర్లున్నారు. ఇందులో అత్యధికంగా 2,03,85,851 మంది మహిళా ఓటర్లుండగా 1,98,31,791 మంది పురుష ఓటర్లున్నారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 5,54,060 మంది అధికంగా ఉన్నారు. సర్విసు ఓటర్లు 68,158 ఉండగా థర్డ్ జెండర్ ఓటర్లు 3,808 మంది ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితా–2024ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా శుక్రవారం ప్రకటించారు. ఈ జాబితాను ఆన్లైన్లో ఉంచారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ఓటర్ల జాబితాను అందజేశారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి అర్హులైన ఓటర్లందరినీ నమోదు చేసేందుకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టారు. శుక్రవారం నుంచి డిసెంబర్ 9 వరకు ఓటర్ల నమోదుకు, అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిసెంబర్ 26లోగా అభ్యంతరాలను, నమోదు దరఖాస్తులను పరిష్కరిస్తారు. వచ్చే ఏడాది జనవరి 5న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. మూడు జిల్లాలు మినహా.. రాష్ట్రంలో ప్రకాశం, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం మినహా మిగతా 23 జిల్లాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే అత్యధికం. పురుష, మహిళా ఓటర్లు కలిపి అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 ఓటర్లుండగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,40,857 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల ఓటర్లు 2,88,155 మంది ఉన్నారు. 2023 తుది ఓటర్ల జాబితాతో పోల్చితే తొలగింపులు, నమోదుల అనంతరం ముసాయిదా జాబితా–2024లో 2,36,586 మంది ఓటర్లు పెరిగారు. నవంబర్ 4, 5, డిసెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు వచ్చే ఏడాది ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1కి 18 ఏళ్లు నిండేవారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవల్ ఆఫీసర్, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లతో నవంబర్ 4, 5 తేదీలు, డిసెంబర్ 2, 3 తేదీల్లో (శని, ఆదివారాలు) ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాతో ఆ తేదీల్లో వారు అందుబాటులో ఉంటారు. ఆయా పరిధిలోని ఓటర్లు తమ పేర్లు ఉన్నాయా, లేవా అనే విషయాన్ని పరిశీలించుకుని, లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తుకు కూడా అవకాశం ఉంది. క్షేత్రస్థాయి డాక్యుమెంట్లతో తనిఖీల ద్వారా ఓటర్ల జాబితాలో 21.18 లక్షల ఓటర్లను తొలగించారు. 99.9 శాతం తనిఖీలు పూర్తయ్యాయి. వెయ్యి మంది జనాభాకు ఓటర్ల నిష్పత్తి 729, జెండర్ రేషియో 1,031గా ఉంది. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 46,165 ఉన్నాయి. -
ఎన్నికల బరిలో ‘మిజోరం’ కోటీశ్వరులు
మిజోరంలో 2023, నవంబరు 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎన్నికల బరిలోకి దిగిన మొత్తం 174 మందిలో 112 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. అభ్యర్థుల అఫిడవిట్ల ప్రకారం 64.4 శాతం మంది అభ్యర్థులు రూ. కోటి లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. సంపన్న అభ్యర్థులలో ముందుగా వినిపించే పేరు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్రూ లాల్రెంకిమా పచువా. ఆయన రూ.69 కోట్లు విలువ చేసే ఆస్తులు కలిగివున్నారు. ఆయన ఐజ్వాల్ నార్త్-III నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇతని తరువాత సెర్చిప్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌కు చెందిన ఆర్ వన్లాలత్లుంగా రూ.55.6 కోట్ల ఆస్తులు కలిగివున్నారు. చంపై నార్త్ నుంచి పోటీ చేస్తున్న జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌కు చెందిన హెచ్ గింజలాలా రూ.36.9 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. అఫిడవిట్ ప్రకారం సెర్చిప్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థి రామ్‌లున్-ఎడెనా అత్యంత పేద అభ్యర్థి. ఇతని దగ్గర 1500 విలువైన చరాస్తులున్నాయి. టుయిచాంగ్ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి తవాన్‌పుయ్ అభ్యర్థులలో అత్యధిక వయసు కలిగిన వ్యక్తి. ఆయనకు 80 ఏళ్లు. బీజేపీ అభ్యర్థి ఎఫ్ వాన్‌హమింగ్‌తంగా(31) ఎన్నికల బరిలోకి దిగిన అతి పిన్న వయస్కురాలు. ఇది కూడా చదవండి: అత్యాచార బాధితురాలిని పట్టించుకోని శివరాజ్ సర్కార్! -
ఓటర్ కార్డు లేకున్నా ఓటేయొచ్చు..!
సాక్షి, హైదరాబాద్: ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్)లోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్ధారణ అయిన పక్షంలో ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును ఆధారంగా చూపి, మరో నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటును వినియోగించుకోవడానికి వచ్చే వారికి (ఆ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరున్న వారికి) సైతం ఓటు హక్కు కల్పించాలని సూచించింది. ఓటరు గుర్తింపు కార్డు లేనిపక్షంలో, ఒకవేళ ఉన్నా గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానిపక్షంలో పోలింగ్ రోజు ప్రత్యామ్నాయ ఫొటో ధ్రువీకరణ పత్రాలను తీసుకువస్తే ఓటు హక్కు కల్పించాలని ఆదేశించింది. తెలంగాణ సహా మరో 4 రాష్ట్రాల్లో శాసనసభ సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటరు గుర్తింపు నిర్థారణ విషయంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ సీఈసీ ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు (సీఈఓలకు) లేఖ రాసింది. ఇలాంటి పరిస్థితుల్లో గుర్తింపు తప్పనిసరి.. ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారు కావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు పత్రాల్లో (కింద జాబితాలో చూడవచ్చు) ఏదో ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ప్రవాస భారత ఓటర్లు తమ పాస్‌పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది. పోలింగ్‌కు కనీసం 5 రోజుల ముందు పోలింగ్ కేంద్రం పేరు, తేదీ, సమయం, ఇతర వివరాలతో ఓటర్లకు పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేయాలని ఆదేశించింది. అయితే వీటిని ఓటరు గుర్తింపుగా పరిగణించరాదని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ ఫోటో ధ్రువీకరణ పత్రాలివే.. – ఆధార్‌కార్డు – ఉపాధి హామీ జాబ్ కార్డు – బ్యాంకు/తపాల కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్ – కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు – డ్రైవింగ్ లైసెన్స్ – పాన్‌కార్డు – రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా (ఆర్జీఐ).. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎనీ్పఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు – భారతీయ పాస్‌పోర్టు – ఫోటో గల పెన్షన్ పత్రాలు – కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు – ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు – కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు (యూడీఐడీ) -
TS Election 2023: ఎనిమిది సెగ్మెంట్లలో ఆమే.. నిర్ణేత..!
నల్గొండ: ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళల ఓట్లే అధికంగా ఉన్నాయి. నాలుగునియోజకవర్గాల్లో మాత్రం పురుషుల ఓట్ల సంఖ్య కొద్దిగా ఎక్కువ ఉంది. ఎన్నికల్లో గెలుపోటములను, పార్టీల భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తి మహిళలకే ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు వారి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో మొత్తం 28,29,357 మంది ఓటర్లలో పురుషులు 14,04,111 మంది, మహిళా ఓటర్లు 14,25,071 మంది ఉన్నారు. ఇక ట్రాన్స్జెండర్లు 195 మంది ఉన్నారు. ఇంట్లో ఓట్లను కూడా మహిళలు ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. మహిళా ఓటర్లలో సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ఉండనుండటంతో వారిని ఆకట్టుకునేలా ప్రసంగాలు, ప్రచార ఏర్పాట్లతో అభ్యర్థులు సిద్ధమయ్యారు. అత్యధికంగా 5,366 మంది పురుషుల కంటే మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న 8 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 421 నుంచి మొదలుకొని 5,366 మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే ఆ నియోజకవర్గాల్లో 26,477 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రత్యేకించి ఆ ఎనిమిది సెగ్మెంట్లలో మొత్తం ఓటర్లు 18,63,122 ఉంటే అందులో 9,18,253 మంది పురుషులు, 9,44,730 మంది మహిళలు ఉన్నారు. అత్యధికంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు 5366 మంది ఎక్కువ ఉన్నారు. నల్లగొండలో 4,839 మంది, నకిరేకల్‌లో 421 మంది, నాగార్జునసాగర్‌లో 3,334 మంది, మిర్యాలగూడలో 3,265, సూర్యాపేటలో 3,938, కోదాడలో 4,760, భువనగిరిలో 554 మంది మహిళా ఓటర్లు పురుషులకంటే ఎక్కువగా ఉన్నారు. సభలకు వచ్చేలా ప్రణాళికలు.. ఇప్పటికే ప్రచారంలోకి దిగిన నేతలు తమ వెంట ఎక్కువగా మహిళలు ఉండేలా చూసుకుంటున్నారు. సభలు, సమావేశాలకు ఎక్కువ మంది మహిళలు వచ్చేలా ప్రణాళికలు రూపొందించకుంటున్నారు. ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులను రంగంలోకి దింపుతున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో చెప్పించడం ద్వారా మహిళా ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మహిళలూ.. మీకు వందనం అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలు మహిళల ఓట్లను రాబట్టుకునే విషయంలో లెక్కలు వేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పటికే మహిళల కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలకు పెన్షన్, గృహలక్ష్మి వంటి పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలతో మండలాలు, గ్రామాల వారీగా కరపత్రాలను ముద్రించి ప్రచారంలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగా తమ ఆరు గ్యారంటీలతో ప్రచారం మొదలుపెట్టింది. అతివలే లక్ష్యంగా మేనిఫెస్టోలు ఈ ఎన్నికల్లో అతివలే లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించాయి. వారిని ఆకట్టుకునేలా మేనిఫెస్టోలలో హామీలను పొందుపరిచాయి. తాము మళ్లీ అధికారంలోకి వస్తే అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.3 వేల జీవనభృతి, రూ.400కే గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాల సమాఖ్యలన్నింటికి సొంత భవనాల నిర్మాణం వంటి హామీలను బీఆర్ఎస్ ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మొదటగా మహాలక్ష్మిని పేర్కొంది. ఈ పథకం కింద ప్రతి నెలా రూ. 2,500 ఇస్తామని ప్రకటించింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటివి ప్రకటించింది. -
ఓటర్లకు ఉచితంగా పోహా, జిలేబీ
ఇండోర్: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల వేళ ఇండోర్ ఓటర్లకు స్థానిక దుకాణాదారులు ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించారు. సాధారణంగా రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పారీ్టలు ఉచితాలు ప్రకటించడం అందరికీ తెలిసిందే. కానీ మధ్యప్రదేశ్‌లో పారీ్టలకు బదులు దుకాణాదారుల సంఘం ఉచితం ఆఫర్‌తో ముందుకొచి్చంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం ముందుగా ఓటేసే అభ్యర్థులకు ఉచితంగా పోహా, జిలేబీ అందిస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే తమ ఆఫర్లోని అంతరార్థమని ఆ సంఘం అసలు విషయం బయటపెట్టింది. 230 ఎమ్మెల్యే నియోజకవర్గాలున్న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఒకేదఫాలో నవంబర్ 17వ తేదీన జరగనున్నాయి. పోహా, జిలేబీ ఆఫర్‌పై ‘56 దుకాణ్ ట్రేడర్స్’ అసోసియేషన్ అధ్యక్షుడు గుంజాన్ శర్మ పీటీఐతో మాట్లాడారు. ‘ నగర స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఇండోర్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఓటింగ్ శాతంలోనూ తొలిస్థానంలో నిలవాలన్నది మా ఆకాంక్ష. అందుకే ఓటర్లను ఉచిత పోహా, జిలేబీతో ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. నవంబర్ 17వ తేదీన ఉదయం తొమ్మిది గంటల్లోపు ఎవరైతే ఓటు వేసి వేలికి సిరా గుర్తు చూపిస్తారో వారికే పోహా, జిలేబీ ఉచితంగా ఇస్తాం. ఉదయం తొమ్మిది తర్వాత సిరా గుర్తు చూపిస్తే పది శాతం డిస్కౌంట్ ఇస్తాం’ అని శర్మ వివరించారు. ఇండోర్ నగరంలో ఉన్న ఈ ‘56 దుకాణ్’కు స్వచ్ఛమైన వీధి ఆహార హబ్ గుర్తింపునిస్తూ ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్టిఫికెట్ జారీచేసింది. ఇండోర్ అర్బన్ పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో మొత్తంగా ఇక్కడ 14.72 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 67 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 15.55 లక్షలకు పెరిగింది. జిలేబీ ఆఫర్‌ను ఇక్కడి ఓటర్లు ఏ మేరకు సది్వనియోగం చేసుకుంటారో వేచి చూడాల్సిందే. -
ఈ ఎన్నికల్లో అభ్యర్ధుల తలరాతలు మార్చబోయేది వీరే..!
యాదాద్రి: అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కాబోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం ఓటర్లలో 18 ఏళ్ల నుంచి 39 వారే సగానికంటే ఎక్కువమంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల భవిత ఈ యువ ఓటర్లపైనే ఆధారపడి ఉంది. దీంతో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారి నుంచి మొదలుకొని 39 ఏళ్లలోపు ఉన్న వారిపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను వారే ప్రభావితం చేయనుండడంతో వారిని ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. 40 ఏళ్ల పైబడిన వారు ఎలాగూ ఓ కచ్చితమైన అభిప్రాయంతో ఉంటారనే అంచనాతో 40 ఏళ్లకంటే తక్కువ వయస్సు ఉన్న వారిపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. జిల్లాల వారీగా యూత్ ఓట్లు ఇలా.. నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మొత్తం 14,26,480 మంది ఓటర్లు ఉన్నారు. అందులో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న 18–19 ఏళ్ల వారు 48,909 మంది ఉండగా, 20 నుంచి 29 ఏళ్ల వారు 2,91,768 మంది ఉన్నారు. అంటే 29 ఏళ్లలోపు ఉన్న ఓటర్లే జిల్లాలో 3,40,677 మంది (23.89 శాతం) ఉన్నారు. ఇక 30 నుంచి 39 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 4,10,842 మంది ఉన్నారు. ఈ రెండు కేటగిరీలు కలిపితే 7,51,519 మంది (52.69 శాతం) ఓటర్లు వీరే ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 9,63,701 మంది ఓటర్లు ఉండగా.. 18 నుంచి 39 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్లు 4,89,118 మంది ఉన్నారు. జిల్లా ఓటర్లలో 50.75 శాతం వీరే ఉన్నారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 4,39,100 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18 నుంచి 29 ఏళ్ల లోపు ఓటర్లు 1,02,159 మంది ఉన్నారు. వీరిలో కొత్త ఓటర్లు 14,512 మంది ఉన్నారు. 30 నుంచి 39 ఏళ్లలోపు వారు 1,22,738 మంది ఉన్నారు. జిల్లాలో 39 ఏళ్లలోపు వారు మొత్తం 2,24,897 (51.21 శాతం) మంది ఉన్నారు. బీఆర్ఎస్.. వంద మందికి ఒక ఇన్చార్జి క్షేత్రస్థాయిలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నిత్యం వారికి అందుబాటులో ఉండేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని క్షేత్రస్థాయిలోకి పంపించింది. ముఖ్యంగా వారు కొత్త ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించి తమవైపు తిప్పుకునే కార్యాచరణను అమలు చేస్తున్నారు. నిరుద్యోగులను ఆకర్షించేలా.. ఉద్యోగాలు రాక, వచ్చినా నోటిఫికేషన్లు వాయిదా పడి తీవ్ర నిరాశలో ఉన్న నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ అడుగులు వేస్తున్నాయి. నియోజవర్గాల్లో తమ టికెట్ కన్ఫర్మ్ అనుకున్న అభ్యర్థులు వారిపై ప్రత్యేక దృష్టి సారించేలా తమ బృందాలను రంగంలోకి దింపారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. -
చూపుడు వేలుపై...చుక్కాని
ముహమ్మద్ ఫసియొద్దీన్ : రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల్లో యువ ఓటర్లు నిర్ణయాత్మకంగా మారబోతున్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించబోతున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే యువ ఓటర్ల నాడి పట్టి వారి మనస్సులను గెలుచుకోకతప్పని పరిస్థితి నెలకొంది. నాణ్యమైన ఉన్నత విద్యావకాశాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సర్కారీ కొలువుల భర్తీ, నిరుద్యోగ సమస్యలు ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలుగా మారబోతున్నాయి. అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ప్రత్యేక హామీలు ఇవ్వక తప్పని స్థితి. యువతే కదా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే, నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో ఓటేయబోతున్న వారిలో ఏకంగా 50.44 శాతం మంది 18–39 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన నవ యువ ఓటర్లు, యువ ఓటర్లు, ఇప్పుడిప్పుడే మధ్య వయస్సులోకి అడుగిడుతున్న ఓటర్లుండడం గమనార్హం. ఓటర్లలో సగభాగం యువతే శాసనసభ సాధారణ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ నెల 4న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,17,389కు పెరగగా, అందులో 1,59,98,116 (50.44%) మంది 19–39 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లే ఉన్నారు. అందులోనూ 91,46,484 (28.84%) మంది మధ్య వయస్సులో అడుగుపెట్టిన 30–39 ఏళ్ల ఓటర్లే కావడం గమనార్హం. తొలిసారిగా ఓటు పొందిన 18–19 ఏళ్ల నవ యువ ఓటర్లు 8,11,640 (2.56%) ఉండగా, 20–29 ఏళ్ల నిడివి గల ఓటర్లు గణనీయంగా 60,39,992 (19.04%) మంది ఉన్నారు. గతంతో పోలిస్తే 5% తగ్గిన యువ ఓటర్లు... 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18–39 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు 55.4 శాతం ఉండగా, తాజా జరగనున్న ఎన్నికల్లో 50.44 శాతం ఉన్నారు. అప్పట్లో 20–29 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు 24.84శాతం ఉండగా, ఇప్పుడు 19.04 శాతానికి తగ్గడమే ఇందుకు కారణం. స్థూలంగా చూస్తే గత శాసనసభ ఎన్నికలతో పోల్చితే ఈ సారి యువ ఓటర్లు 5శాతం తగ్గినా .. ఫలితాల్లో మాత్రం నిర్ణయాత్మక పాత్ర పోషించే స్థితిలోనే ఉండడం గమనార్హం. 2018లో 50–59 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు 12.73 శాతం ఉండగా, ఇప్పుడు 14.24 శాతానికి పెరిగారు. నాటితో పోల్చితే ఇప్పటి ఓటర్ల జాబితాలో మిగిలిన ఏజ్ గ్రూపుల ఓటర్ల శాతాల్లో స్వల్ప తేడాలే ఉన్నాయి. ఇక రాష్ట్రంలో 60 ఏళ్లుకు పైబడిన ఓటర్లు 45,96,051 (14.5శాతం) మంది ఉండగా, 40–50 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు 20.83 శాతం ఉన్నారు. -
ప్రజలకు ఏం కావాలో గ్రహించలేదా?
తెలంగాణకు ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. పార్టీలు సైతం విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నెల 15న మేనిఫెస్టోను విడుదల చేస్తామని అధికార బీఆర్ఎస్ ప్రకటించింది. ఇంకా కసరత్తు జరుగుతున్నదని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నామని బీజేపీ పేర్కొంటున్నది. దీంతో ప్రజలకు ఏం కావాలో ప్రధాన పార్టీలు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాయా అనే అనుమానం వ్యక్తమవుతున్నది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తీవ్ర జాప్య మున్నా ఎన్నికల కదన రంగంలో మాత్రం కాంగ్రెస్ ముందుగానే దూకిందని చెప్పాలి. గత మేలో వరంగల్‌లో రాహుల్ గాంధీతో సభ నిర్వహించి ‘రైతు డిక్లరేషన్’ను ‘హస్తం’ పార్టీ ప్రకటించింది. అధికా రంలోకి వస్తే రైతులకు ఏమేం చేసేదీ దాంట్లో పేర్కొన్నది. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, యూత్ డిక్లరేషన్లను ప్రకటించింది. దీంతోపాటు మహిళలు, బీసీలు తదితరులపై డిక్లరేషన్లను ప్రకటించడానికి సిద్ధమవుతున్నది. మరోవైపు ‘ఆరు గ్యారెంటీ’ల పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు విస్తృతంగా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి. అయితే మేనిఫెస్టోను ఇప్పటికీ ఎందుకు ఫైనల్ చేయడం లేదనే ప్రశ్న ఉత్పన్న మవుతున్నది. శ్రీధర్ బాబు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇంకెంత కాలం అభిప్రాయాలను సేకరిస్తుందోననే అనుమానం కాంగ్రెస్ కార్యకర్తల్లోనే ఉంది. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న బీఆర్ఎస్ ఇప్పటికీ తన మేనిఫెస్టోను విడుదల చేయలేదు. అయితే అక్టోబర్ 15న రిలీజ్ చేస్తామని ఇటీవల తేదీని నిర్ణయించింది. గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయింది. దీంతో ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేస్తే బడ్జెట్ సెట్ చేయడం కష్టమేనని బీఆర్ఎస్కు అనుభవ పూర్వకంగా తెలిసొచ్చిందనిపిస్తోంది. ‘గృహలక్ష్మి’, బీసీ, మైనార్టీలకు ‘చేయూత’ లాంటి స్కీమ్స్‌ను లేటుగా అయినా ప్రవేశపెట్టి అమలు ప్రారంభించి తాము ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్నామనే సంకేతాన్ని పంపడానికి ప్రయత్నించింది. అయితే తూతూమంత్రంగా అమలు చేయడంతో వీటి వల్ల ప్రజల్లో పార్టీ పట్ల పాజిటివిటీ రాలేదు. మరోవైపు కాంగ్రెస్ హామీల వర్షం కురిపిస్తుండడంతో తప్పని సరిగా మేనిఫెస్టోలో పలు హామీలను చేర్చేందుకు బీఆర్ఎస్ రెడీ అయినట్లు తెలుస్తున్నది. మహిళల కోసం బీఆర్ఎస్ తెచ్చే స్కీమ్ ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ చేస్తుందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించడం కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రభావంతోనే అని అర్థమవుతోంది. కర్ణాటక ఎలక్షన్స్ కంటే ముందు తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే. అయితే కన్నడ ఓటర్లు బీజేపీని తిరస్కరించడంతో తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. మరోవైపు బండి సంజయ్‌ను స్టేట్ చీఫ్ పదవి నుంచి తొలగించడంతో బీజేపీ పతనం మొదలైంది. మేనిఫెస్టో తయారీని కూడా ఆ పార్టీ లైట్ తీసుకుంటున్నట్లు అర్థమవుతున్నది. తాము ఉచితాలకు వ్యతిరేకమని ఇప్పటికే పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. సంక్షేమమే తమ ధ్యేయ మనేది వారి మాట. దీంతో బీజేపీ మేనిఫెస్టో పట్ల ప్రజల్లోనూ ఆసక్తి కనిపించడం లేదు. షెడ్యూల్ రావడానికి ఐదు రోజుల ముందు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో ‘మేనిఫెస్టో కమిటీ’ని ఆ పార్టీ ఏర్పాటు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందజేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. ఇది నోటిమాటగానే తప్ప దీన్ని ఎలా అమలు చేస్తారో క్లారిటీ ఇవ్వలేదు. దశా బ్దాలుగా ప్రజలను పాలించిన, పాలిస్తున్న పార్టీలు ప్రజలకు ఏం కావాలో ఇప్పటికీ గ్రహింపు లేక పోవడం విడ్డూరంగానే ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఫిరోజ్ ఖాన్ వ్యాసకర్త సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మొబైల్: 96404 66464 -
జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా ఓటర్లు పెరగలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఓటర్ల పెరుగుదల నమోదు కాలేదని.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పేర్ని నాని సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాను గురువారం కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో 2014 నుండి 2019 వరకు, 2019 నుండి 2023 వరకు రాష్ట్రంలో నమోదైన ఓటర్ల సంఖ్య హెచ్చుతగ్గులకు సంబంధించిన వివరాలను ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకూ ఓటర్ల జాబితాలో 30,08,032 ఓట్లు పెరిగాయని.. కానీ, 2019 నుంచి 2023 కాలంలో 38 వేల ఓట్లు తగ్గాయని వివరించారు. అదే విధంగా.. ఓటర్ల వృద్ధి చూసినట్లయితే 2014–19 మధ్య కాలంలో 8.1 శాతం మేర వృద్ధి నమోదైందని.. 2019 నుంచి 2023 మధ్య 0.09 శాతం క్షీణత నమోదైందని తెలిపారు. గతేడాది కంటే 2023లో నికర ఓట్ల సంఖ్య తగ్గిందని, దీనిని బట్టి నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టమవుతోందన్నారు. 2019 ఓటర్ల జాబితా నుండి నకిలీ ఓట్లను తొలగించే అంశాన్ని పరిశీలించి, నకిలీ ఓట్ల విషయంపై సమగ్ర విచారణ జరపాలని పేర్ని నాని కోరారు. అలాగే, 2014–2023 మధ్య జనాభా వృద్ధి రేటు 1.1 శాతం వుందని, ఈ విధంగా చూస్తే నికర ఓటర్ల సంఖ్య పెరగాలి కానీ తగ్గడంపై తమకు అనుమానాలున్నాయన్నారు. దీనికి కారణం 2014–19 సమయంలో తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున దొంగ ఓట్లను చేర్చడమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,06,42,333
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333కు చేరింది. అందులో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళలు, 2,133 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలను సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు/ కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 19 వరకు గడువు ఉందని తెలిపారు. సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులను పరిష్కరించి అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ ఓటర్ల జాబితానే వినియోగించనున్నారు. ఇక రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలుండగా, ముసాయిదా జాబితాలో 3,06,26,996 మంది సాధారణ ఓటర్లతో పాటు మరో 2,742 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 15,337 మంది సరీ్వసు ఓటర్లున్నారు. 18–19 వయస్సు కలిగిన యువ ఓటర్ల సంఖ్య 4,76,597. కొత్త ఓటర్లు 8,31,520 మంది ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2023లో భాగంగా గత జనవరి 5న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో మొత్తం 2,99,77,659 మంది ఓటర్లు ఉండగా, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 8,31,520 మంది ఓటర్లను నమోదు చేశారు. 1,82,183 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఓటు తొలగిస్తే 15 రోజుల్లోగా అప్పీల్ చేయాలి ముసాయిదా జాబితాలో ఎవరిదైన పేరును తప్పుగా తొలగిస్తే బాధిత ఓటర్లు 15 రోజుల గడువులోగా జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోవాలని సూచించారు. లేకుంటే మళ్లీ కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం–6 దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ‘ఓటర్ల’ అధికారుల బదిలీలపై నిషేధం సీఈఓ వికాస్‌రాజ్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా రూ పకల్పనలో పాలుపంచుకుంటున్న అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఓటర్ల జాబితా సవరణలో కీలకమైన జిల్లా ఎన్నికల అధికారులు, ఉప జిల్లా ఎన్నికల అధికారులు, ఓటర్ల నమోదు అధికారులు, సహాయ ఓటర్ల నమోదు అధికారులు తదితర స్థాయి అధికారుల బదిలీలపై ఈ నెల 21 నుంచి అక్టోబర్ 4 వరకు నిషేధం అమల్లోకి ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ సోమవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల జాబితా తయారీ బాధ్యతల్లోని అధికారులను బదిలీ చేస్తే జాబితా నాణ్యతపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ అత్యవసరంగా ఎవరైనా అధికారిని బదిలీ చేయాల్సివస్తే స్పష్టమైన వివరాలు అందజేసి ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి నుంచి బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ) వరకు బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో ఈ నిబంధన లు వర్తిస్తాయన్నారు. దీర్ఘకాలిక సెలవు ల్లో వెళ్లడానికి ముందు ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని అధికారులను సూచించారు. -
మీ పేరుందా.. లేదా?
హైదరాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అర్హులైన ఓటర్లు తమ పేరును జాబితాలో ఉందో లేదో చూసుకోవాల్సిందిగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సూచించారు. తప్పులు, పొరపాట్లకు తావు లేకుండా ఓటరు జాబితా సరిగా ఉండేందుకు నగరవాసులు సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని పనులూ చేస్తున్నప్పటికీ, ఓటర్ల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. జాబితాలో పేరు లేని వారు నమోదు చేసుకోవాలని, పేరు ఉన్నప్పటికీ ఏవైనా పొరపాట్లుంటే వాటిని సవరించుకునే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్ ద్వారా వెసులుబాటు కల్పించిందని తెలిపారు. సంబంధిత ఫారాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రోనాల్డ్ రాస్ కోరారు. దేని కోసం.. ఏ ఫారం ఓటరు పేరులోని అక్షరాల్లో (స్పెల్లింగ్స్) ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉంటే.. పేరు తప్పుగా ఉన్నా, కుటుంబ సభ్యుల పేర్లు, రిలేషన్, జెండర్లకు సంబంధించి పొరపాట్లు ఉన్నా.. పుట్టిన తేదీ, చిరునామా తప్పుగా ఉంటే.. ఒకే కుటుంబంలోని వారి పేర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉంటే.. ఫోన్‌నంబర్ మార్చుకోవాలనుకుంటే.. ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇదివరకు ఓటరు జాబితాలో పేరు ఉండి గతంలో ఓటేసి ఉన్నప్పటికీ, ఇప్పుడు జాబితాలో పేరు లేకపోయినా, తమ ఫొటో బదులు వేరే ఫొటో ఉన్నా, ఇప్పటి వరకు అసలు నమోదు చేసుకోకపోయినా ఫారం– 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పాత ఎపిక్ (ఓటరు గుర్తింపు కార్డు) ఉన్నప్పటికీ ఇప్పుడు జాబితాలో పేరు లేనివారు ఓటు వేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అలాంటి వారు సైతం ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.voters.eci.gov.in లేదా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా సంబంధిత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నమోదు సందర్భంగా అవసరమైన సహాయం కోసం ఓటర్ హెల్ప్‌లైన్ నంబర్ 1950ను కార్యాలయ పని వేళల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సంప్రదించవచ్చని రోనాల్డ్ రాస్ సూచించారు. -
వర్షంలోనూ బారులు తీరిన ఓటర్లు.. మరోవైపు ఓటింగ్ సామాగ్రి ధ్వంసం..
కలకత్తా: పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేడు జరుగుతోంది. ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. 24 దక్షిణ పరగణా జిల్లాల్లో వర్షం పడుతున్నా జనం లెక్కచేయకుండా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. గొడుగుల సహాయంతో క్యూ లైన్లలో నిలబడ్డారు. అటు.. గవర్నర్ సీవీ ఆనంద్ ఓటింగ్‌లో పాల్గొనేందుకు బసుదేబ్‌పూర్ బూత్‌కు వెళుతున్న క్రమంలో సీపీఐఎమ్ అభ్యర్థులు ఆయన్ను అడ్డగించారు. #WATCH | West Bengal #PanchayatElection23 | Voters queue up at a polling station in Basanti of South 24 Parganas district amid rainfall as they await their turn to cast a vote. pic.twitter.com/Iq7xBpbpft — ANI (@ANI) July 8, 2023 బ్యాలెట్ పేపర్లకు నిప్పింటించి.. కాగా.. పలు ప్రాంతాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల మాత్రం హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. కూచ్‌బిహార్ జిల్లాలోని సిటాయ్ ప్రాతంలో ఓ ప్రైమరీ పాఠశాలలో పోలింగ్‌కు ఏర్పాట్లు చేయగా.. దుండగులు పోలింగ్ సామాగ్రిని ధ్వంసం చేశారు. బ్యాలెట్ పేపర్లకు నిప్పింటించారు. #WATCH | Polling booth at Baravita Primary School in Sitai, Coochbehar vandalised and ballot papers set on fire. Details awaited. Voting for Panchayat elections in West Bengal began at 7 am today. pic.twitter.com/m8ws7rX5uG — ANI (@ANI) July 8, 2023 63,229 సీట్లకు పోలింగ్.. పశ్చిమ బెంగాల్లో 63,229 గ్రామ పంచాయతీ సీట్లకు నేడు ఎన్నికలు జరగుతున్నాయి. 9,730 పంచాయతీ సమితీలకు, 928 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలీంగ్ నిర్వహిస్తున్నారు. కాగా.. జులై 11న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. ఇదీ చదవండి: అవినీతే కాంగ్రెస్ ఊపిరి -
బతికున్నవారు మరణించారంటూ టీడీపీ బోగస్ ఫిర్యాదులు
-
గొల్ల, కుర్మ సొసైటీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక ఎప్పుడో..?
కైలాస్‌నగర్: పశుసంవర్ధకశాఖ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొల్ల, కుర్మలకు అందించే పథకాలు, రాయితీ యూనిట్లు, గొర్రెలు, బర్రెలు, పశువులు వంటి ప్రయోజనాలు పొందాలంటే ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘ సభ్యులై ఉండాలి. ఈ సంఘాల్లో సభ్యులైన వారికే ప్రభుత్వపరంగా అందించే ప్రయోజనాల్లో ప్రాధాన్యత దక్కుతుంది. ఇంతటి కీలకమైన ఈ సంఘాల జిల్లా అధ్యక్ష ఎన్నికలు ఐదేళ్లుగా పత్తాలేకుండా పోయాయి. మండల సంఘాల ఎన్నికలు సకాలంలో జరగకపోవడం, వాటిి నిర్వహణపై జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా క్షేత్రస్థాయిలో సరైన ప్రచారం జరగక గొల్ల, కుర్మలకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఐదేళ్లుగా పత్తాలేని అధ్యక్ష ఎన్నికలు జిల్లా ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘ అధ్యక్ష ఎన్నికలు ఐదేళ్లుగా పత్తా లేకుండాపోయాయి. జిల్లా పునర్విభజనకు ముందు ఉమ్మడి జిల్లా సహకార సంఘం అధ్యక్షుడిగా మంచిర్యాల జిల్లాకు చెందిన రెంకల హన్మండ్లు యాదవ్ పనిచేశారు. ఆ తర్వాత 2018 నుంచి ఈ పదవికి ఎన్నికలు నిర్వహించ లేదు. నిబంధనల ప్రకారం 70సొసైటీల మండల అధ్యక్షులు ఎన్నికై తే జిల్లా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించవచ్చనేది అధికారులే చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా కసరత్తు చేయడం లేదు. జిల్లాలో 97 సొసైటీలకు అధ్యక్షులు ఎన్నికయ్యారు. వీరి పదవీకాలం ఇప్పటికే సగం గడిచిపోయింది. అయితే జిల్లా అధ్యక్షుడి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేకపోవడం గమనార్హం. అధ్యక్షుడు ఉన్నట్లేతే గొల్ల, కుర్మల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి మార్గం చూపే అవకాశముంటుందని కులస్తులు చెబుతున్నారు. ఎన్నికలు వెంటనే నిర్వహించాలి మండల సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికై రెండేళ్లు గడుస్తు న్నా ఇంకా జిల్లా ఎన్నికలు నిర్వహించడం లేదు. ఓ వైపు పదవీ కాలం ముగిసేదశకు వస్తున్నా ఎ ప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేదు. గొ ల్ల, కుర్మలు ఏవైనా సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరిని కలువాలో తెలియడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే జిల్లా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. – మేకల రవికాంత్, తలమడుగు సొసైటీ అధ్యక్షుడు మండలస్థాయి ఎన్నికలు పూర్తికాలేదు అన్ని మండలాల్లో ఈ సొసైటీ అధ్యక్ష ఎన్నికలు ఇంకా పూర్తికాలేదు. జిల్లాలో 97 మాత్రమే పూర్తయ్యాయి. ఓటరు జాబితా తయారీ కోసం మిగతా సంఘాల సభ్యుల ఆధార్ వివరాలు కో రుతున్నాం. కానీ వారు స్పందించట్లేదు. పూర్తి వివరాలు అందిన వెంటనే ఓటరు జాబితా సిద్ధం చేసి రాష్ట్ర సహకార శాఖకు పంపిస్తాం. – కిషన్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి -
ఒకే ఇంటి నంబరుపై అధిక ఓటర్లు తక్కువే.. డూప్లికేట్లను తొలగిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్లతో పోలిస్తే ఒకే ఇంటి నంబర్‌పై అధిక ఓటర్లు నమోదైన సంఖ్య చాలా తక్కువని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఒకే ఇంట్లో 500 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఆరు ఇంటి నంబర్లను గుర్తించామన్నారు. 2018కు ముందు నుంచే ఇలా ఉందని చెప్పారు. పట్టణాల్లో అపార్ట్మెంట్లలో నివసించేవారు ఒకటే ఇంటి నంబరు, కొన్నిచోట్ల ఒకటే వీధి పేరు మీద ఓటర్‌గా నమోదు చేసుకోవడం వల్ల ఇలాంటి తప్పులు దొర్లాయని వెల్లడించారు. 50 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్లు 2,100 ఉన్నాయని తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.98 కోట్ల ఓటర్లకుగానూ ఒకే రకమైన ఇంటి నంబర్లు కలిగినవారు 1.62 లక్షల మంది ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీటిని ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ–2024 (ఎస్ఎస్ఆర్–2024) కార్యక్రమంలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సోమవారం సచివాలయంలో మీనా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్–2024 షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆధార్‌తో అనుసంధానించలేదు.. అలాగే రెండు, మూడు చోట్ల ఒకరే ఓటర్లుగా ఉన్నవారిని గుర్తించామని మీనా తెలిపారు. వారు కోరుకున్న చోట ఓటు ఉంచి మిగిలిన చోట్ల రద్దు చేశామన్నారు. ఒకే ఫొటోతో రెండు, మూడు కార్డులున్న 15 లక్షల మంది ఓటర్లను గుర్తించి.. అందులో 10.20 లక్షల నకిలీ ఓటర్లను తొలగించామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్ నంబర్‌ను లింక్ చేయలేదన్నారు. 80 శాతం మంది ఓటర్ల నుంచి ఆధార్ సమాచారం తీసుకున్నామే కానీ వాటిని ఇంకా అనుసంధానించలేదని స్పష్టం చేశారు. యువ ఓటర్ల నమోదుపై దృష్టి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో యువ ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని ముకేశ్ కుమార్ మీనా చెప్పారు. వీరిని ఓటర్లుగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించామన్నారు. 18–19 ఏళ్ల వయసు ఉన్నవారు.. దేశ సగటు ప్రకారం చూస్తే రాష్ట్ర ఓటర్ల సంఖ్య ప్రకారం కనీసం 12 లక్షలు ఉండాలన్నారు. కానీ అది మన రాష్ట్రంలో 3.5 లక్షలకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. జనవరి 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండే వాళ్లు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులన్నారు. ఇందుకు ఎస్ఎస్ఆర్–2024ను వినియోగించుకోవాలని సూచించారు. ఎస్ఎస్ఆర్ కోసం జూలై 20 వరకు ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలకు శిక్షణ ఇస్తామన్నారు. బీఎల్వోలు ఇంటింటా సర్వే చేశాక అక్టోబర్ 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి అన్ని రాజకీయపార్టీలకు అందిస్తామన్నారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలను నవంబర్ 30 వరకు స్వీకరిస్తామని వెల్లడించారు. ఇందుకోసం అక్టోబర్ 28, 29, నవంబర్ 18, 19 తేదీల్లో ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. వచ్చినఅభ్యంతరాలను డిసెంబర్ 26లోగా పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని వివరించారు. రాజకీయ పార్టీలు సర్వేలో పాల్గొనాలి.. కాగా విజయవాడలో ఒకే ఇంటి నంబరుపై అధిక ఓటర్లు ఉన్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారణ చేస్తున్నామని మీనా తెలిపారు. ఇలా 2018 నుంచి ఒకటే ఇంటి పేరు మీద అధిక ఓటర్లు ఉన్నట్లు తేలిందన్నారు. 2018లో 674 మంది ఓటర్లు ఉంటే 2019లో 675 మంది.. ఇప్పుడు 516 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వీటిని పరిశీలించాక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తారని చెప్పారు. ఈ క్రమంలో ఓటర్ల సవరణ చేస్తారన్నారు. ఈ సమయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బీఎల్ఏలను నియమించుకొని బీఎల్వోలతో కలిసి సర్వేలో పాల్గొనాలని కోరారు. -
నల్గొండ జిల్లాలో 19 నుంచి ఈవీఎంల మొదటి లెవల్ తనిఖీలు ప్రారంభం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అందుకు అవసరమైన ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈవీఎంల పరిశీలన ఈనెల 19వ తేదీన నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఓటరు జాబితా ముసాయిదా సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఇక ఇప్పటికే ఎన్నికల నియమావళి మేరకు అధికారులను కూడా బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. జూలై 31వ తేదీలోగా బదిలీలు చేయాల్సి ఉంది. దీంతో యంత్రాంగం బదిలీల కార్యాచరణపై కూడా కసరత్తు మొదలుపెట్టింది. వేగంగా ఓటరు జాబితా రివిజన్ ఓటరు జాబితా స్పెషల్ సమ్మర్ రివిజన్ కార్యక్రమం జిల్లాలో వేగంగా సాగుతోంది. 2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించనుంది. మరోవైపు ఓటును ఒకచోటనుంచి మరో చోటికి బదిలీ చేసుకోవడంతోపాటు రెండు ఓట్లు ఉన్నవాటిని తొలగించడం, చనిపోయిన వారి ఓట్లు కూడా తొలగించే కార్యక్రమం నిర్వహిస్తోంది. వాటిపై వచ్చిన ఫిర్యాదులను కూడా పరిష్కరించి అక్టోబర్ నాలుగో తేదీన తుది ఓటరు జాబితాను ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాబితా ఆధారంగానే ఎన్నికలు జరగనున్నాయి. 19 నుంచి పరిశీలన ఈనెల 19వ తేదీ నుంచి ఈవీఎంల పరిశీలన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈసీఐఎల్ కంపెనీ నుంచి ఈవీఎంలు జిల్లాకు వచ్చాయి. అందులో 3,158 బ్యాలెట్ యూనిట్లు, 2,466 కంట్రోల్ యూనిట్లు 2,667 వీవీ ప్యాట్లు ఉన్నాయి. వాటన్నింటికి ఈనెల 19 నుంచి జూన్ 7వ తేదీ వరకు మొదటి లెవల్ చెకింగ్ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఈసీఐఎల్ కంపెనీకి చెందిన 15 మంది ఇంజనీర్లు రానున్నారు. గతంలో వాడిన యంత్రాలు మహారాష్ట్రకు.. జిల్లాలో గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో వాడిన బీహెచ్ఈఎల్ కంపెనీకి చెందిన ఓటింగ్ యంత్రాలను మహారాష్ట్రలోని చంద్రపురి జిల్లాకు పంపుతున్నారు. ఇందులో 1,940 బ్యాలెట్ యూనిట్లు, 644 కంట్రోల్ యూనిట్లు, 677 వీవీ ప్యాట్లు ఉన్నాయి. వాటన్నింటిని కొన్ని బీహెచ్ఈఎల్ కంపెనీకి పంపగా మిగిలిన వాటిని మహారాష్ట్రకు పంపుతున్నారు. జూలై 31లోగా బదిలీలు పూర్తి చేసేలా.. ఎన్నికల సంఘం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మూడేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులను బదిలీ చేయాలని ఆదేశించింది. అదేవిధంగా సొంత జిల్లాలో పనిచేసే అధికారులను బదిలీ చేయనున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పనిచేసి సస్పెండ్‌కు గురైన వారికి వచ్చే ఎన్నికల్లో విధులను అప్పగించరాదని ఆదేశించింది. వాటన్నింటిని దృష్టిలో ఉంచుకొని జూలై 31లోగా బదిలీ ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది. -
ఎన్నికల అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
సుభాష్‌నగర్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఎన్నికల నిర్వహణ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీ కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరు తొలగించారని అర్హులైన ఏ ఒక్క ఓటరు నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని, జాబితా పూర్తి పారదర్శకంగా ఉండేలా పరిశీలించాలన్నారు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఎన్నికల ఏడాది కావడంతో ఓటరు జాబితా పునఃపరిశీలించుకుని లోటుపాట్లు ఉంటే వెంటనే సరి చేసుకోవాలని తెలిపారు. 2018, 2019 ఎన్నికల సమయంలో ఓటరు జాబితాతో పోలిస్తే, ఓటర్ల సంఖ్య తగ్గినట్లయితే అందుకు గల కారణాలు పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇంటింటికీ తిరిగి పరిశీలన జరిపే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఓటర్ల మార్పులు–చేర్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, ఈనెల 23 నాటికి ఇంటింటి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి పోస్టల్ శాఖ ద్వారా ఓటరు గుర్తింపు కార్డు అందించే ప్రక్రియ కొనసాగించాలన్నారు. ఇప్పటికే ఈవీఎంల ప్రాథమిక పరిశీలన ప్రక్రియ ఆయా జిల్లాల్లో ప్రారంభమైందని గుర్తుచేశారు. జూలై 01 నాటికి పరిశీలన ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. పోలింగ్ స్టేషన్లు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని, తప్పనిసరిగా ర్యాంపులు ఏర్పాటు చేయించాలన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ పోలింగ్ నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఎన్నికల నియమావళి తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలని, భద్రతాపరమైన ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరించాలని డీజీపీ అంజనీకుమార్ యాదవ్ పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు సూచించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఇన్చార్జి సీపీ ప్రవీణ్ కుమార్, ట్రెయినీ అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, నియోజకవర్గాల ఎన్నికల అధికారులు డీఆర్డీవో చందర్, జెడ్పీ సీఈవో గోవింద్, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం స్పీడ్ బాబోయ్.. కేవలం 30 సెకన్లలో ముగిసిన స్థానిక ఎన్నికలు!
స్పెయిన్‌లోని ఓ గ్రామంలో స్థానిక ఎన్నికలు పూర్తవడానికి 30 సెకన్ల సమయం కూడా పట్టలేదట. అదేంటి ఎన్నికలంటే పెద్ద తతంగం. రోజంతా ఓటింగ్ జరిగినా 60 నుంచి 80 శాతం పోలింగ్ కావడం కూడా కష్టమే. పోలింగ్ సమయంలో ఏ చిన్న తప్పు జరిగినా అది సరిచేసేందుకు గంటల తరబడి సాగే వ్యవహారం. ఒక్కోసారి అర్థరాత్రి వరకు పోలింగ్ జరిగిన ఘటనలు కూడా చేసే ఉంటాం. అలాంటి ఆ గ్రామంలో అర నిమిషంలో స్థానిక ఎన్నికలు పూర్తయ్యాయి. వినడానికి విడ్దూరంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవమే. ఇంతకు తక్కువ సమయంలో ఓటింగ్ పూర్తవడానికి కారణమేమంటే... లా రియోజా ప్రావిన్స్‌లోని విల్లారోయా అనే గ్రామంలో ఓటు హక్కు ఏడు మందికి మాత్రమే ఉంది. దీంతో అతి తక్కువ సమయంలో ఎన్నికల అధికారులు ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేయగలుగుతున్నారు. ఈ ఏడాది గ్రామస్థులు తమ ఓటు హక్కును కేవలం 29 సెకన్లలో వినియోగించుకున్నారు. గతంలో ఉన్న 32 సెకన్ల రికార్డును ఈ సారి బద్దలు కొట్టగలిగారు. ఈ ఎన్నికలపై స్థానిక మేయర్ సాల్వడార్ పెరెజ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రామస్థులు ఓట్లు ఎవరికి వేశారో తెలియదు గానీ తన గెలుపుపై ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. తమ గ్రామంలో ఓటర్లకి ఓటు ఎలా వేయాలనేదానిపై శిక్షణ పొందారని అందుకే పోలింగ్ ప్రక్రియ అంత వేగంగా ముగుస్తోందని చెప్పారు. కాగా, ఆయన 1973 నుంచి ఆ గ్రామానికి మేయర్‌గా ఎన్నికవుతూ ఉన్నారు. ఇటీవల జరిగిన స్పెయిన్ స్థానిక ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తారు. చదవండి: ప్రపంచంలోని దోమలన్నింటినీ అంతం చేస్తే ఏమవుతుంది?... శాస్త్రవేత్తల సమాధానం ఇదే.. -
దశాబ్దాల కులవోటు సాంప్రదాయం తారుమారు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయ ఓటింగ్ ధోరణి ఈసారి రూటు మార్చుకుంది. ముఖ్యంగా కులాల వారీ ఓటు బ్యాంకు తారుమారైంది. మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి దూరమై బీజేపీకి అండదండగా నిలుస్తూ వచ్చిన లింగాయత్‌లు మనసు మార్చుకున్నారు. ఓట్లపరంగా అత్యంత ప్రాబల్యమున్న సామాజిక వర్గమైన లింగాయత్‌లలో బాహుబలి నేత యడియూరప్పను పక్కన పెట్టినందుకు బీజేపీ భారీ మూల్యమే చెల్లించింది. ఆ పార్టీకి దశాబ్దాలుగా పెట్టని కోటలా ఉంటూ వచ్చిన లింగాయత్‌లు ఆగ్రహించి దూరమయ్యారు. 1990లో లింగాయత్ నాయకుడైన నాటి ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ అవమానకరంగా సీఎం పదవి నుంచి తప్పించడంతో ఆ పార్టీ లింగాయత్‌ల ఆగ్రహ జ్వాలలకు గురైంది. నెమ్మదిగా లింగాయత్ ఓటుబ్యాంకు బీజేపీకి మళ్లింది. 30 ఏళ్ల తర్వాత సరిగ్గా మళ్లీ అదే సీన్ రిపీటైంది. ఈసారి బీజేపీ వంతు వచ్చింది. యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించడమే గాక అభ్యర్థల ఎంపిక మొదలుకుని ప్రచారం దాకా పెద్దగా ప్రాధాన్యమివ్వని ప్రభావం ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. లింగాయత్‌లు, వొక్కలిగలు, ఎస్సీల్లో ఐదేసి శాతం మంది కాంగ్రెస్ వైపు మళ్లడంతో ఆ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించగలిగింది. కేంద్ర ఎన్నికల సంఘం, సీ –ఓటరు వెల్లడించిన పార్టీలవారీ ఓట్లు, సీట్ల సరళిని పరిశీలిస్తే కులాల ఓటుబ్యాంకుల్లో మార్పు స్పష్టంగా తెలుస్తోంది... వొక్కలిగలు: జేడీ(ఎస్)కు షాక్ జేడీ(ఎస్)కు అండగా ఉంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడను తమ పితగా కొలిచే వొక్కలిగలు కూడా షాకిచ్చే నిర్ణయాలే తీసుకున్నారు. దేవెగౌడ కుటుంబ పెత్తనంపై ఓటర్లలో ఓ రకమైన కసి కనిపించింది. 2018 ఎన్నికల్లో వొక్కలిగ ప్రాబల్యమున్న మొత్తం 51 స్థానాల్లో జేడీ(ఎస్) 23 గెలుచుకుంటే ఈసారి కేవలం 12 సీట్లకు పరిమితమవ్వాల్సి వచ్చింది. పీసీసీ డీకే శివకుమార్ వొక్కలిగ నేత కావడంతో వారికి ప్రత్యామ్నాయం కనిపించింది. కాంగ్రెస్ ఓల్డ్ మైసూర్ గ్రామీణ ప్రాంతంలో ఏకంగా 36 స్థానాల్లో విజయం సాధించింది. శివకుమార్ కనకపురలో లక్షా 20 ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలిచారంటేనే దేవెగౌడ గుప్పిట్లోంచి వొక్కలిగలు జారిపోతున్నట్టేనని భావిస్తున్నారు. లింగాయత్‌లు: బీజేపీకి షాక్ లింగాయత్‌లు బీజేపీకి దూరం కావడం ఇది తొలిసారేం కాదు. బీజేపీ యడియూరప్పను దూరం పెట్టినప్పుడు ఆయన బీజేపీకి గుడ్‌బై కొట్టి 2012లో కర్ణాటక జనతా పక్ష పేరుతో వేరు కుంపటి పెట్టారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేతుల కాలాయి. అప్పుడే ఆ పార్టీకి యడియూ రప్ప, లింగాయత్‌ల ఓట్ల ప్రాధాన్యం ఏమిటో తెలిసింది. ఆ తర్వాత యడియూరప్పను అక్కున చేర్చుకున్నప్పటికీ, మళ్లీ తాజాగా ఎన్నికల ముందు యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించి అదే తప్పు చేసింది. 2018 ఎన్నికల్లో లింగాయత్ ప్రాబల్యం ఉన్న స్థానాల్లో 41.8% ఓటు షేర్ బీజేపీకి వస్తే, ఈసారి కాస్త స్వల్పంగా 39.5 శాతానికి తగ్గింది. కానీ సీట్లు మాత్రం ఏకంగా 20 స్థానాలను కోల్పోవలసి వచ్చింది. జేడీ(ఎస్)కు వచ్చిన ఓట్ల శాతంలో పెద్దగా మార్పు లేదు. కాంగ్రెస్‌కు ఓట్లు 5 శాతమే పెరిగినా సీట్లు మాత్రం రెట్టింపు పెరిగాయి. చెయ్యెత్తి జై కొట్టిన ఎస్సీలు ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయంలో ఎస్సీలు అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఎస్సీ ప్రాబల్య అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గత ఎన్నికలతో పోల్చి చూస్తే అదనంగా 5.5శాతం ఓట్లు, 10 సీట్లు సంపాదించింది. దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టడం ఈసారి ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. సాధారణంగా దళితులు ఏ ఒక్క పార్టీ వైపు ఉండరు. కానీ ఈసారి ఖర్గే దళిత బ్యాంకుపై ప్రత్యేకంగా దృష్టి సారించి 40 ర్యాలీల్లో పాల్గొనడంతో ఎస్సీ ప్రాబల్య స్థానాల్లో సగానికి పైగా కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మొత్తమ్మీద కేవలం ఐదు శాతం ఓట్ల తేడాతోనే ఫలితాల్లో భారీగా మార్పులు కనిపించడమే మన ప్రజాస్వామ్యంలో వైచిత్రిగా ఎన్నికల విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రజాతీర్పుకు పట్టం కట్టాలి!
అణిచివేత ఎక్కువైనప్పుడు ఆగ్రహం వస్తుంది. ఎన్నికలు జరిగినప్పుడు మార్పును కోరుతూ ప్రజా సందేశాన్ని మోసుకొస్తుంది. ఆదివారం థాయిలాండ్‌లో జరిగిన ఎన్నికల ఓటింగ్ సరళి అందుకు తాజా ఉదాహరణ. సైన్యం కనుసన్నల్లో నడుస్తున్న, మరోమాటలో సైన్యమే తొమ్మిదేళ్ళుగా నడుపుతున్న ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి, ఆగ్రహం స్పష్టంగా బయటపడింది. మార్పు కోరుతూ థాయిలాండ్ ఓటర్లు తీర్పునిచ్చారు. అలా 2020లో విద్యార్థుల నేతృత్వంలో సాగిన ప్రజాస్వామ్య అను కూల భారీ నిరసన ఉద్యమాల తర్వాత జరిగిన తొలి జనరల్ ఎలక్షన్ ఫలితం అపూర్వం. దేశ రాజకీయాల్లో మిలటరీ, రాయల్టీ ప్రాబల్యాన్ని సామాన్యులు నిరసించడం అక్కడి ప్రజాస్వామ్యవాద శక్తులకు సంతోషకరమే. ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ పాలకులందరికీ గుణపాఠమే. 6.5 కోట్ల జనాభా గల థాయిలాండ్‌లో 5.2 కోట్ల మందికి ఓటు హక్కుంది. రానున్న నాలుగేళ్ళ కాలానికి 500 స్థానాల ప్రజా ప్రతినిధుల సభకు సభ్యులను ఎన్నుకొనేందుకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. సుమారు 4 కోట్ల మంది ఓటర్లు తమ ఛాయిస్ ఏమిటో చెప్పేశారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలైన ఫ్యూథాయ్, మూవ్ ఫార్వర్డ్ పార్టీలు రెండూ అధికార పార్టీని మట్టి కరిపించాయి. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూల శిబిరాలు విజయం సాధిస్తాయని ముందస్తు ప్రజాభిప్రాయ సేకరణల నుంచి ఊహిస్తున్నదే. కానీ, ఈ స్థాయి విజయం అనూహ్యం, అద్భుతమే. పట్టణప్రాంతాల్లో పట్టున్న, ప్రగతిశీల ‘మూవ్ ఫార్వర్డ్’ 151 స్థానాలతో అగ్రపీఠిన నిలుస్తుందని అంచనా. ప్రస్తుతం ప్రవాసంలో ఉన్న పదవీచ్యుత ప్రధానమంత్రి తక్షిణ్ శినవాత్ర తరఫున జనాకర్షక రాజకీయ పక్షమైన ‘ఫ్యూథాయ్’కి 141 స్థానాలు రావచ్చని లెక్క. అయితే, అధికార శక్తులు ఈ ఫలితాలను అంగీకరించి, ఈ సంస్కరణవాద పార్టీలు ప్రభుత్వం ఏర్పరిచేలా గద్దెను అప్పగిస్తాయా అన్నదే ప్రశ్న. గత∙రెండు దశాబ్దాల్లో స్వేచ్ఛగా ఎన్నికలైన ప్రతిసారీ తక్షిణ్ నేతృత్వంలోని పార్టీలు గెలుస్తూ వచ్చాయి. సైన్యం మాత్రం కోర్టు జోక్యంతోనో, తిరుగుబాట్లతోనో వారిని పదే పదే అధికారానికి దూరం పెడుతూ వచ్చింది. నిండా 36 ఏళ్ళ తక్షిణ్ కుమార్తె ఇంగ్లక్ ఇప్పుడు ‘ఫ్యూథాయ్’ పార్టీని నడుపుతున్నారు. అయితే, వారసత్వ రాజకీయాలతో విసిగిన లక్షలాది తొలి యువ ఓటర్లు ‘మూవ్ ఫార్వర్డ్’ వైపు మొగ్గడంతో, ఆ పార్టీకి ఎక్కువ సీట్లు దక్కుతున్నాయి. విదేశాల్లో చదివి, వ్యాపార నిమిత్తం తిరిగొచ్చి, సైనికపాలన, రాజరికానికి వ్యతిరేకంగా సాగిన ప్రజాస్వామ్య పోరులో పాల్గొన్న 42 ఏళ్ళ పిటా లిమ్జాయోన్రత్కు ఎన్నికల్లో జనం జై కొట్టారు. ఈ నేతలిద్దరూ సైన్యానికి ఎదురొడ్డిన ధనిక వ్యాపార కుటుంబాల వారే కావడం గమనార్హం. ఇక, చిన్నాచితకా ప్రతిపక్షాలు సైతం ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తుండడం విశేషమే. ఈ ప్రజాస్వామ్య అనుకూల పార్టీలన్నీ కలసి సంకీర్ణ సర్కార్‌గా పనిచేసేందుకు సుముఖంగా ఉన్నాయట. అలా అన్నీ ఒక తాటిపైకొస్తే సైనిక పాలన, రాచరికపు అపరిమిత అధికారాలకు చరమగీతం పాడాలన్న జనం కోరిక నెరవేరుతుంది. కానీ, పార్టీలు అనుకున్నంత మాత్రాన జరగాలని లేదు. 2019 ఎన్నికల్లో నేటి ‘మూవ్ ఫార్వర్డ్’ పార్టీ ముందస్తు రూపం ‘ఫ్యూచర్ ఫార్వర్డ్’ మూడోస్థానంలో నిలిచింది. తీరా పార్టీ సారథిని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించారు. పార్టీ రద్దయింది. ఇప్పుడు ప్రధాని కావాలని ఆశిస్తున్న ‘మూవ్ ఫార్వర్డ్’ నేత పిటాకు సైతం ఎన్నికైన ఎంపీల మద్దతుతో పాటు సైన్యం నియమించిన సెనేటర్ల మద్దతు అవసరం. ఎన్నికల్లో గెలిచినా సరే ప్రభుత్వ ఏర్పాటుకు ఇతరుల మద్దతు అవసరం కావడమే థాయ్ లోని విచిత్రం. ఇదంతా ఎన్నికల్లో గెలిచిన పార్టీల అధికారాన్ని సైతం తటస్థీకరించేలా, సెనేట్ను నియమిస్తూ 2017లో రాజ్యాంగాన్ని సైన్యం తిరగరాసిన ఫలితం. 2014లో జనరల్ ప్రయూత్ చాన్ – ఓచా అప్పటి పౌరప్రభుత్వాన్ని పడదోసి, సైన్యం, రాయలిస్ట్ పార్టీలు, రాచరికపు అండతో తనను తాను ప్రధానిగా నియమించుకున్నారు. న్యాయవ్యవస్థ సహా అన్నిటినీ విధేయులతో నింపేశారు. ఇటు నిరుపేద థాయ్లను ఆకర్షించే ఫ్యూథాయ్ పార్టీ అన్నా... అటు నిర్బంధ సైనిక శిక్షణ, రాజు – రాణులను పల్లెత్తు మాటన్నా 15 ఏళ్ళ దాకా జైల్లోకి నెట్టే కఠినమైన ‘లెస్–మాజెస్టీ’ చట్టాలకు చరమగీతం పాడతానంటున్న మూవ్ ఫార్వడ్ పార్టీ అన్నా... సహజంగానే సైన్యానికి గిట్టదు. కానీ, రాచరిక అనుకూల చట్టాలను మారుస్తానంటున్న పార్టీకి నవతరం థాయ్ ప్రజలు జేజేలు పలకడం ఈ ఆగ్నేయాసియా దేశంలో ప్రజాస్వామ్య మార్పు పవనాలకు సూచన. ఇది గ్రహించి సంప్రదాయ శక్తులు పట్టు సడలిస్తాయా? జనం ఎన్నుకున్న 500 సభ్యుల ప్రతినిధుల సభతో పాటు పాలక సైనిక వర్గమే నియమించిన 250 మంది సభ్యుల సెనేట్కూ ప్రధాని ఎంపికలో ఓటు ఉండడమే విషాదం. అంటే ఎన్నికల్లో పెల్లుబికిన ప్రజాస్వామ్య వెల్లువను సైతం సైన్యం పరోక్షంగా తొక్కేసే ముప్పుంది. ఇన్నేళ్ళుగా దేశాన్ని తమ కబంధ హస్తాల్లో ఉంచుకున్న సైనిక జనరల్స్ తాజా ప్రజా తీర్పును గౌరవించాలి. అధికారాన్ని గెలిచిన పార్టీలకు అప్పగించి, సైనిక విధులకు పరిమితం కావాలి. ఆ పని చేయక, ప్రజాకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అది థాయిలాండ్‌కే మంచిది కాదు. పొరుగునే మయన్మార్‌లో 2020 నవంబర్ ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూక్యీ అఖండ విజయం సాధించినా, మూడునెలల్లో సైన్యం అధికారం హస్తగతం చేసుకొని, ఎన్నికల ఫలితాన్ని రద్దు చేసింది. ఇప్పుడు అంతర్యుద్ధంతో అల్లాడుతున్న ఆ దేశంలా థాయ్‌లాండ్ తయారు కాకుండా ప్రపంచ దేశాలూ జాగరూకత వహించాలి. అప్పుడే థాయ్ ప్రజలు గెలిచినట్టు, అక్కడ ప్రజాస్వామ్యం నిలిచినట్టు! -
కాషాయ పార్టీకి షాకిచ్చిన ఆ ఓటర్లు.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన అంశాలు ఇవే!
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో అధికార బీజేపీకి షాకిస్తూ ఘన విజయాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే హస్తం పార్టీ గెలుపుకు పలు అంశాలు కలిసొచ్చినప్పటికీ ప్రధానంగా మాత్రం మూడు సామాజిక వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడమనే చెప్పాలి. అవేంటో చూస్తే.. లింగాయత్‌లు దెబ్బ బీజేపీకి భారీగానే నష్టాన్ని మిగిల్చింది. కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను పక్కన పెట్టడం, రాజకీయ విశ్లేషకుల ప్రకారం కాషాయ పార్టీని కోలుకోలేని దెబ్బతీసిందని అంటున్నారు. బీజేపీ తప్పు కాంగ్రెస్ కలిసొచ్చిందా! లింగాయత్‌ల ఆధిపత్యం ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఓట్ల శాతం పడిపోయింది(2018లో 41.8 శాతం నుంచి 2023లో 39.5 శాతానికి). అయితే ఓట్ల శాతం తక్కువే అయినప్పటికీ ఈ తేడా కారణంగా బీజేపీ ఊహించని నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని ప్రభావం దాదాపు సగం సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. (2018లో 41 నుంచి 2023లో 21 చేరుకుంది). మరోవైపు, జేడీ(ఎస్)కు స్థిరంగా ఉన్న ఓటు బ్యాంకును కాస్త కోల్పోయింది. ఈసారి లింగాయత్ ఓట్లలో ఐదు శాతంతో పాటు కమ్యూనిటీ ఆధిపత్యంలో ఉన్న మూడు స్థానాలను కోల్పోయింది. సాధారణంగా జనతాదళ్ (సెక్యులర్) వైపు మొగ్గు చూపే బీజేపీయేతర లింగాయత్ ఓటర్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు ఇది సూచిస్తుంది. జగదీష్ శెట్టర్, లక్ష్మణ్ సవాది వంటి లింగాయత్ నేతలు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించడం ఆ పార్టీకి దోహదపడి ఉండవచ్చు. అథని సీటులో సవాది గెలుపొందగా, హుబ్లీ-ధార్వాడ్ (సెంట్రల్) సీటులో షెట్టర్ ఓడిపోవడం గమనార్హం. లింగాయత్‌ల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కూడా ఇతర ప్రధాన సామాజిక వర్గాలు ఈసారి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడం కూడా పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. లింగాయత్ తర్వాత వారీ ఓట్లు కీలకంగా మారాయి లింగాయత్‌ల సామాజిక వర్గం తర్వాత వొక్కలిగలు, దళితులు ఆధిపత్య వర్గాలుగా ఉన్న స్థానాల్లో కూడా కాంగ్రెస్ బాగానే సాధించింది. మరోవైపు, వొక్కలిగ స్థానాల్లో కాంగ్రెస్ దాదాపు నాలుగు శాతం ఓట్ల లాభంతో 2018లో 14 నుంచి 2023లో 27 సీట్లకు రెట్టింపు అయింది. దీనికి మరో ప్రముఖ వొక్కలిగ నేత, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఒక కారణమని తెలుస్తోంది. కనకపుర నియోజక వర్గంలో 1.2 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన శివకుమార్ గౌడ గడ్డపై వొక్కలిగ ఓట్లను దూరం చేసి ఉండవచ్చు." జేడీ(ఎస్)కు కంచుకోటగా ఉన్న ఓల్డ్ మైసూరులో కాంగ్రెస్ పార్టీ 36 గ్రామీణ స్థానాల్లో విజయం సాధించడం ఓటర్లు మార్పునగా సూచనగా కనిపిస్తోంది. షెడ్యూల్డ్ కులాల ఓట్లతో కాంగ్రెస్‌కు మరో భారీ విజయం దక్కినట్లయింది. కాంగ్రెస్ పది సీట్లు, ఎస్సీ ప్రాబల్యం ఉన్న స్థానాల్లో 5.5 శాతం ఓట్లు సాధించింది. బీజేపీ, జేడీ(ఎస్) వరుసగా ఐదు, మూడు స్థానాలు కోల్పోయాయి. ఇవి నేరుగా కాంగ్రెస్‌లోకి వెళ్లినట్లు తెలస్తోంది. రాష్ట్రంలో దళితుల ఓట్లు సాధారణంగా చీలిపోతాయి. అయితే, ఈసారి, ఎస్సీ-ఆధిపత్య ప్రాంతాలు కాంగ్రెస్‌కు అత్యధికంగా ఓటేశారు. రాష్ట్రంలోని 37 ఎస్సీ-ఆధిపత్య స్థానాల్లో కాంగ్రెస్ 22 గెలుచుకుంది, గత ఎన్నికల్లో సాధించిన దానికంటే దాదాపు రెట్టింపుగా ఉంది. చదవండి: 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డిని ఉప ముఖ్యమంత్రి చేయాలి -
‘వచ్చే ఎన్నికల్లో పోస్టర్లు, బ్యానర్లు అంటించను.. అదే నన్ను గెలిపిస్తుంది’
న్యూఢిల్లీ: ఎన్నికల్లో విజయం కోసం పోస్టర్లు, బ్యానర్లపై కాకుండా సేవా రాజకీయాలపై ఆధారపడాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గంలో ఎలాంటి పోస్టర్లు అంటించబోనని, ఓటర్లు తన సేవను, చేసిన పనిని చూసే ఓట్లు వేయాలని పేర్కొన్నారు. అదే సమయంలో, రాబోయే ఎన్నికల్లో తనకు పోలయ్యే ఓట్లు సంఖ్యను కూడా పెంచుకుంటానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని సికార్ జిల్లా ఖచరియావాస్ గ్రామంలో మాజీ ఉపాధ్యక్షుడు భైరాన్ సింగ్ షెకావత్ వర్ధంతి కార్యక్రమంలో హాజరైన గడ్కరీ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను గతంలో కష్టతరమైన నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. ఆ సమయంలో అక్కడి నుంచి పోటీ చేయవద్దని పలువురు సూచించారు. అయినా పట్టుదలతో పోరాడాను. అలానే వచ్చే ఎన్నికల్లో పోస్టర్లు, బ్యానర్లు వేయకూడదని నిర్ణయించుకున్నాను. తనకు ఓటు వేయాలనుకున్న వాళ్లు వేస్తారు, ఇష్టం లేనివాళ్లు వేయరు’’ అని ఆయన అన్నారు. 'సేవా రాజకీయాలు', 'అభివృద్ధి కార్యక్రమాలు', గ్రామాల్లోని పేదల సంక్షేమం, పేద ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు, యువతకు ఉపాధి, పిల్లలకు మంచి విద్య అందించడం ద్వారా ఓట్లు లభిస్తాయి తప్ప పోస్టర్లు, బ్యానర్లతో కావని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్, ప్రతిపక్ష ఉపనేత సతీష్ పూనియా, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. చదవండి: కర్ణాటక ఫలితాలు: కరెంటు బిల్లులు కాంగ్రెస్ నుంచి వసూలు చేసుకోండి! -
రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే అర్బన్ ఓటర్లు కీలకం
-
కర్ణాటక ఎన్నికలు: 1985 నుంచి అదే ట్రెండ్.. బీజేపీ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా?
కర్ణాటకలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేనప్పటికీ ప్రధానంగా ప్రభుత్వ మార్పు అనేది మాత్రం సూచిస్తున్నట్లు ‘పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మరో విషయం ఏమనగా.. రాష్ట్రంలో 1985 నుంచి వరుసగా రెండో సారి ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. మరి బీజేపీ రానున్న ఎన్నికల్లో ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయగలదా లేదా అనేది ఫలితాలు వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. సర్వేలో ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తారని అడగగా.. ప్రస్తుత ముఖ్యమంత్రిగా పని చేస్తున్న బసవ రాజు బొమ్మైకి 20 శాతం మద్దతు ఇచ్చారు. మాజీ సీఎంలు సిద్ధరామయ్య, బి.యడియురప్పకు సానుకూలంగా 32 శాతం, 25 శాతం మంది ప్రాధాన్యత ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి 18 శాతం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు 5 శాతం మంది మద్దతు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ కృషి చేస్తుందని భావిస్తున్నారన్న ప్రశ్నించగా.. కాంగ్రెస్ అని 42 శాతం, బీజేపీ అని 38 శాతం, జేడీ (ఎస్) అని 14 శాతం మంది స్పందించారు. బీజేపీ ప్రభుత్వానికి మరోమారు అవకాశమిస్తారా అన్న నిర్దిష్ట ప్రశ్నకు 51 శాతం మంది ఇవ్వమని, 43 శాతం ఇస్తామని, ఆరు శాతం మంది చెప్పలేమనీ బదులిచ్చారు. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఏయే పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నారని అడగగా... కాంగ్రెస్ పార్టీ జేడీ (ఎస్)తో చేతులు కలపాలని 46 శాతం మంది చెప్పారు. 41 శాతం మంది బీజేపీ-జేడీ (ఎస్) కూటమిగా ఏర్పడాలని భావించారు. కాంగ్రెస్-జేడీ(ఎస్)-ఇతరుల కూటమికి ఆరు శాతం, బీజేపీ-జేడీ(ఎస్)-ఇతరుల కూటమికి ఏడు శాతం మంది ఓటర్లు ప్రాధాన్యతనిచ్చారు. యాత్రలు ►విజయ్ సంకల్ప యాత్ర (బీజేపీ) : బీజేపీ చేపట్టిన విజయ్ సంకల్ప యాత్ర సామన్య ప్రజలను ఆకర్షించడంలో విఫలమయ్యింది. మరోవైపు బీజేపీ చేపట్టిన బూత్ విజయ్ సంకల్ప అభియాన్ ప్రచారం విజయవంతం అయ్యింది. ► ప్రజాధ్వని యాత్ర (కాంగ్రెస్) : కాంగ్రెస్ చేపట్టిన ప్రజాధ్వని యాత్ర సామన్య ప్రజలను ఆకర్షించడంలో విఫలమయ్యింది. ► పంచరత్న యాత్ర (జేడీఎస్) : జేడీఎస్ చేపట్టిన పంచరత్న యాత్ర సామాన్య ప్రజలను ఆకర్షించడంలో విజయవంతం అయ్యింది. ►బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌లో ముఖ్యనేతలు రాష్ట్రంలో తక్కువగా పర్యటించారు. బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రంలో అనేకమార్లు విస్తృతంగా పర్యటించగా, కాంగ్రెస్ జాతీయ నాయకులు రాష్ట్రంలో ఒకటి, రెండు మార్లే పర్యటించారు. ►కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. ఈ గ్యారెంటీ కార్డుల గురించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం కూడా జరగలేదు. ►పీపుల్స్ పల్స్ ప్రతినిధులు ఈ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలలోని అన్ని నియోజకవర్గాల్లో నెల రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. ప్రతి నియోజకవర్గంలో ఓటర్లతో ముఖాముఖిగా మాట్లాడి, గ్రూపులవారీగా మాట్లాడి రాజకీయ పరిస్థితులను పరిశీలించి అక్కడ ఏ పార్టీవైపు మొగ్గు ఉందో ఒక అంచనాకు వచ్చారు. అవినీతి ఎన్నికల ప్రధాన ప్రచారాంశం ప్రస్తుతం పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టులలో, పథకాల అమలులో ‘40% సర్కార్’(కమీషన్లు) ఇటీవల వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. మరో వైపు కర్ణాటక ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రధానమైనవిగా ఉండగా కమలం పార్టీ వాటిని సవరణ చేసింది. ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసి వొక్కలింగాలకు, లింగాయత్‌లకు పంచింది. కీలకం కానున్న ప్రజా సమస్యలు రోడ్ల దుస్థితిపై ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో మంచినీటి సమస్య ప్రధానంగా ఉంది. పాత పెన్షన్ పథకం అమలుకు ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకం అమలు చేయడానికి ముందుకొచ్చే పార్టీకే మద్దతివ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. మతతత్వ అంశాలు, హిందుత్వ అంశాలు కోస్తా కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలలో కనిపిస్తున్నాయి. వొక్కలింగాల యోధులైన ఊరిగౌడ, నంజేగౌడలను టిప్పు సుల్తాన్ హత్య చేసిన అంశాన్ని బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేస్తూ ఆ సామాజిక వర్గాల మద్దతును కూడగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీ కోరుకున్నట్లు వొక్కలింగాల పూర్తిమద్దతు ఆ పార్టీకి లభించడం లేదు. వారు, మొదటి ప్రాధాన్యత జేడీ (ఎస్)కు, రెండో ప్రాధాన్యత కాంగ్రెస్‌కు ఇస్తున్నట్లు తెలుస్తోంది. -
‘రైతు బిడ్డను పెళ్లి చేసుకున్న వధువుకి రూ.2 లక్షలు’
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఆకట్టుకునేందుకు నేతలు హామీలు గుప్పిస్తున్నారు. తాజాగా జేడీ(ఎస్) నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తమ పార్టీ కొత్త పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రైతు బిడ్డను పెళ్లి చేసుకునే యువతులకు తమ పార్టీ రూ. 2 లక్షలు అందచేస్తుందని ప్రకటించారు. కోలార్‌లో జరిగిన 'పంచరత్న' ర్యాలీలో కుమారస్వామి ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు. రైతు బిడ్డల పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆడపిల్లలకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. రైతుల కొడుకులను వివాహం చేసుకునేందుకు ఆడపిల్లలు సిద్ధంగా లేరని తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ పథకం అమలు చేయడం ద్వారా మన యువకుల ఆత్మ గౌరవాన్ని కాపాడవచ్చని తెలిపారు. కర్ణాటకలో మే 10న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. 224 స్థానాలున్న అసెంబ్లీలో కనీసం 123 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న జేడీ(ఎస్) ఇప్పటి వరకు 93 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. -
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ఓటర్లకు కుక్కర్లు, చీరలు, నగదు పంపిణీ
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర విధానసభ ఎన్నికలకు సమయం ఎక్కువగా లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఆయా పార్టీల అభ్యర్థులు, ఆశావహులు నిమగ్నమై ఉన్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలుపొంది తీరాలని ఎవరికి వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ఓటర్ల మనసులు గెలుచుకునేందుకు కొన్ని పార్టీల నేతలు, ఆశావహులు నగదు, హెల్మెట్లు, కుక్కర్లు, చీరలు తదితర బహుమానాలను పంచడం చేపట్టారు. ఎన్నికల సంఘం అధికారులు కొన్నిచోట్ల దాడులు జరిపి కానుకలను జప్తు చేస్తోంది. విస్తృతంగా తనిఖీలు డబ్బు, వస్తువులు, వెండి బంగారు కానుకల పంపిణీ ఎన్నికలు రాగానే ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు బెంగళూరు వ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో తాత్కాలిక చెక్‌పోస్టులను తెరిచారు. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య, డ్రైవర్ల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. వివిధ మార్గాల్లో ప్రలోభాలు ఎంత పటిష్ట నిఘా ఉంచినా పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు, జీఎస్టీ అధికారులు, సిబ్బంది కళ్లుగప్పి టికెట్ ఆశావహులు, అభ్యర్థులు, వారి మద్దతుదారులు బహుమానాలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఆయా బహుమానాలను ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ముందస్తుగా ఓటర్లకు టోకెన్లను ఇచ్చి నిర్ణీత దుకాణాల్లో నిత్యవసర సరుకులను తీసుకునే వెసులుబాటును కల్పించారు. చేతి గడియారాలు, వెండి దీపాలు, హెల్మెట్, కుక్కర్లు, మిక్సీలు, టీవీలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు ఇందులో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు తామేమీ తక్కువ కాదన్నట్లు ముందుకు వస్తున్నారు. కాగా, వాణిజ్య పన్నుల శాఖ ఈ తనిఖీల్లో ముందంజలో ఉంది. రసీదు లేకుండా సరుకుల రవాణా చేసిన, అక్రమంగా గోడౌన్లో వస్తువులను దాచినా, అనుమానస్పద కొనుగోళ్లు చేసినా పట్టేస్తోంది. సరుకు రవాణాకు సంబంధించి ఈ–ఇన్వాయిస్, ఈవే బిల్, సరుకు ప్రమాణం, కొనుగోలు దారుడు, సరఫరా దారుడు, చిరునామా తదితర సమాచారాలను క్షుణ్నంగా పరిశీలిస్తోంది. రౌడీలకు హెచ్చరికలు ఎన్నికల్లో ఓటర్లను బెదిరించడంలో రౌడీలు ముందుంటారు. అందుకే రౌడీలపై పోలీసు శాఖ ఒక కన్నేసింది. రౌడీషీటర్ల నడవడికపై నిఘా పెంచింది. రౌడీషీటర్లుగా ముద్రపడిన వారిని ముందస్తుగా పోలీసు స్టేషన్‌కు పిలిపించి హెచ్చరికలు జారీ చేస్తోంది. అలాగే ప్రమాదకరంగా అనిపించే ప్రముఖ రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేస్తోంది. అలాగే పలువురు రౌడీషీటర్ల ఇంటిపై గస్తీ కాసే పోలీసులు హఠాత్తుగా తనిఖీలు చేస్తున్నారు. పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకుంటున్నారు. -
ముగిసిన మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల పోలింగ్
Updates మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన పోలింగ్ ముగిసింది. మేఘాలయలో 59 అసెంబ్లీ స్థానాలకు 3,419 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ నిర్వహించగా.. నాగాలాండ్‌లో 59 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మేఘాలయ, నాగాలాండ్‌తోపాటు ఫిబ్రవరి 16న జరిగిన త్రిపుర ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి. ► నాగాలాండ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 81.94% పోలింగ్ నమోదైంది. ► మేఘాలయలో సాయంత్రం 5 గంటల వరకు 74.32% పోలింగ్ నమోదైంది. ► నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటల వరకు 60.51% ఓటింగ్ నమోదైంది. ►మేఘాలయ తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు చార్లెస్ పింగ్రోప్ షిల్లాంగ్‌లోని తన నియోజకవర్గం నోంగ్తిమ్మాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. #MeghalayaElections2023 :TMC State President Charles Pyngrope voting in his Nongthymmai constituency in Shillong pic.twitter.com/mk4S553sl1 — All India Radio News (@airnewsalerts) February 27, 2023 ► నాగాలాండ్‌లో ఉదయం 11 గంటల వరకు 38.68 శాతం ఓటింగ్ నమోదు. ► ఓటు హక్కు వినియోగించుకున్న మేఘాలయ సీఎం కార్నాడ్ సంగ్నా. గారో హిల్స్‌లోని తురా పోలింగ్ స్టేషన్లో ఆయన ఓటు వేశారు. ఈ సందర్బంగా సీఎం సంగ్మా మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది శుభపరిణామం. ఎన్నికల ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయని నా నమ్మకం అంటూ కామెంట్స్ చేశారు. Meghalaya CM Conrad Sangma cast his vote at Walbakgre -29 polling station in Tura, Garo Hills "People coming out in large no. to vote. This is good for democracy. I've not see this kind of voter turnout in the past. We are confident that it'll be in our favour," he says. pic.twitter.com/wFkELDuNpE — ANI (@ANI) February 27, 2023 9.00AM ► ఉదయం తొమ్మిది గంటల వరకూ మేఘాలయలో 12 శాతం, నాగాలాండ్‌లో 15.76 శాతం పోలింగ్ నమోదైంది నాగాలాండ్, మేఘాలయల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ రోజు(సోమవారం) ఉదయం గం. 7.00లకు పోలింగ్ ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ జరుగనుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, రెండు రాష్ట్రాల్లో 552 మంది బరిలో ఉన్నారు. 34 లక్షలకు పైగా ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. మేఘాలయాలో 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా, బరిలో 369 మంది అభ్యర్థులు నిలిచారు. 21.6 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 60 స్థానాలకుకు గాను 59 స్థానాల్లో పోటీ జరుగునుంది. ఇక్కడ ఒక స్థానాన్ని బీజేపీ ముందుగానే కైవసం చేసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఖతేజో కినిమి అకులుటో నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగాలాం్‌లో 183 మంది బరిలో ఉన్నారు. ఇక్కడ ఓటర్లు సంఖ్య 13లక్షలకుపైగా ఉంది. మేఘాలయాలో ఇప్పటిదాకా ఏపార్టీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. నాగాలాండ్‌లో ఏ పార్టీ అన్నిచోట్లా పోటీకి దిగలేకపోయింది. ఇక తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. -
నూతన విధానానికి కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం.. ఎక్కడున్నా ఓటు పక్కా!
సాక్షి,షాబాద్(హైదరాబాద్): వలసదారుల ఓటు హక్కు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. స్వగ్రామంలో ఓటు హక్కు ఉన్నా బతుకు దెరువు కోసం సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఎన్నికల సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల రాలేకపోవడం.. ఓటు హక్కు వినియోగించుకోలేకపోవడం వంటి కారణాలను గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి వారు ఉన్నచోటే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించనుంది. దీంతో జిల్లా నుంచి వలస వెళ్లిన వ్యక్తులకు ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు అవకాశం లభించనుంది. వ్యవసాయాధారిత జిల్లా కావడం పల్లెలు ఎక్కువగా ఉండడం.. వ్యవసాయ పనులు లేని సమయంలో పొట్టచేత పట్టుకుని హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వగ్రామానికి వచ్చేందుకు ఆర్థిక భారం పడటం.. సుదూర ప్రాంతాల నుంచి రాలేక ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఓటింగ్ శాతం పడిపోయిన సందర్భాలున్నాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకురానున్న నూతన విధానం వల్ల ఉన్న చోటు నుంచే ఓటు వేసే రిమోట్ ఓటింగ్ సిస్టం ద్వారా అధిక శాతం నమోదుకు ఎన్నికల కమిషన్ ప్రయతి్నస్తోంది. ఓటర్లు తాము ఉంటున్న ప్రాంతాల నుంచే ముందస్తుగా ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. పెరగనున్న ఓటింగ్ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొస్తున్న నూతన విధానం వల్ల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రతీ ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు ఇతర ప్రాంతాల్లో నివసిస్తుండటం వల్ల ఓటు హక్కు వినియోగించుకోలేక పోతున్నారు. కేంద్రం తీసుకొచ్చే నూతన విధానం ఓటర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చదవండి: ఆమె కేవలం ఫ్రెండ్ అంతే!: నవీన్ తండ్రి -
'కాంగ్రెస్ ఓటర్లను తినేందుకే బీజేపీ చీతాలను తెచ్చింది'
భోపాల్: బీజేపీ ప్రభుత్వం ఆఫ్రికా నుంచి భారత్‌కు చీతాలను తీసుకురావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రగిలాల్ జాతవ్. కాంగ్రెస్ ఓటర్లను తినేందుకే బీజేపీ వీటిని తీసుకొచ్చిందని అన్నారు. సోమవారం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా నుంచి భారత్ వచ్చిన చీతాలు మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఉన్నాయి. ఈ ప్రాంతంలోని కరేరా నియోజకవర్గం నుంచే జాతవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో మాజీ సీఎం కమల్‌నాథ్ ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఓ సమావేశం ఏర్పాటు చేసి జాతవ్ మాట్లాడారు. 'కుట్రలో భాగంగానే చీతాలను కునో నేషనల్ పార్కులో ఉంచారు. ఇవి ఇప్పుడు చిన్నాగానే ఉన్నాయి. కానీ పెరిగి పెద్దయ్యాక మిమల్ని తినేస్తాయి. ఫలితంగా కాంగ్రెస్ ఓటర్ల సంఖ్యను తగ్గిస్తాయి. బీజేపీ కావాలనే పథకం ప్రకారం చీతాలను ఇక్కడకు తెచ్చింది. దీని కోసం రూ.117 కోట్లు ఖర్చుపెట్టింది.' అని జాతవ్ అన్నారు. జాదవ్ మాటలకు కాంగ్రెస్ శ్రేణులు చప్పట్లు, ఈలలతో హోరెత్తాయి. దీంతో ఆయన మొహంలో చిరునవ్వుతో వెలిగిపోయింది. అలాగే.. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, అణగారిన వర్గాలకు చెందిన ఎంతో మంది నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని జాతవ్ పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమని, జంతువుల ప్రయోజనాల కోసమే ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోందని సెటైర్లు వేశారు. 2020లో జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై జాతవ్ 30వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా.. దేశంలో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా నుంచి కేంద్రం చీతాలను తెప్పించిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌లో వీటిని కునో నేషనల్ పార్కురు తరలించింది. చదవండి: కేంద్రంపై నిప్పులు చెరిగిన రాహుల్.. అదానీ వ్యవహారంపై ప్రశ్నల వర్షం.. -
వీళ్లతో ఓటేయించుకోవాలంటే మనకు ఎన్ని కోట్లు కావాలో!?
-
Hyderabad: 90 లక్షలు దాటిన గ్రేటర్, శివారు ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,44,072 మంది ఓటర్లున్నారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6,12,700 ఓటర్లుండగా, చార్మినార్‌లో అత్యల్పంగా 2,14,774 ఓటర్లున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, మేడ్చల్ జిల్లాలోని 5 నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 91,86,375 మంది ఓటర్లు ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో కొంతభాగం మాత్రమే ఉండటంతో దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. హైదరాబాద్ జిల్లాలో ముసాయిదా జాబితాలో 41.46 లక్షల ఓటర్లుండగా, తుదిజాబితాలో ఆ సంఖ్య 42.15 లక్షలకు పెరిగింది. ఓట్లు గల్లంతయిన వారితోపాటు కొత్త ఓటర్ల నమోదుతో ఈ సంఖ్య పెరిగింది. (క్లిక్ చేయండి: మెట్రో ఛార్జీలు పెంపు!) -
వలస ఓట్లపై హడావిడి
ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచడానికి చేస్తున్న సరికొత్త ఆలోచన చర్చ రేపుతోంది. దేశీయంగా వలస వెళ్ళిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు వీలుగా రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఆర్వీఎం)లను తీసుకురావాలనే ప్రయత్నంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం జనవరి 18న ఈ కొత్త యంత్రాల ప్రయోగాత్మక ప్రదర్శన జరుపుతోంది. అది చూసి, నెలాఖరులోగా తమ సూచనలు తెలియపరచాలని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. ఏడు పదులు దాటిన భారత ప్రజాస్వామ్య ఎన్నికల చరిత్రలో ఇలా దేశంలోని లక్షలాది వలసజీవుల్ని సైతం భాగం చేయాలనే ఆలోచన స్వాగతనీయమే. కానీ, ఇప్పుడున్న ఈవీఎంల వినియోగంపైనే సందేహాలు మసురుతున్న వేళ... కొత్త ప్రయత్నం ఏ మేరకు లోపరహితమన్నది చూడాలి. ఇప్పటికే, కాంగ్రెస్, తృణమూల్, డీఎంకె సహా ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు జవాబులు వెతకాలి. వలస జీవులకు రిమోట్ ఓటింగ్ కల్పించడంపై ఎన్నికల సంఘంలో చర్చలు కొత్తేమీ కాదు. దేశీయ వలసదారులకు ఓటింగ్ అవకాశాలు కల్పించాలంటూ కొన్నేళ్ళుగా అభ్యర్థనలున్నాయి. అలా వచ్చిన ఓ అభ్యర్థనపై సుప్రీమ్ కోర్ట్ 2015లోనే ఆదేశాలిచ్చింది. రిమోట్ ఓటింగ్‌కు అవకాశాలు పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని నిర్దేశించింది. పరోక్ష ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్, ఇంటర్నెట్ ఓటింగ్, ముందస్తు ఓటింగ్ లాంటి పలు మార్గాలను ఎన్నికల సంఘ అధికారుల కమిటీ పరిశీలించింది. రకరకాల కారణాలతో ఆ పద్ధతులను సిఫార్సు చేయలేదు. సమగ్ర ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని సదరు కమిటీ సిఫార్సు చేసింది. ఎన్నికల సంఘం మాత్రం తాజాగా సమస్య సాంకేతిక పరిష్కారంతో, ఈ బహుళ నియోజకవర్గ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఆర్వీఎం) నమూనాను ముందుకు తెచ్చింది. ఇప్పటికే వాడుతున్న ఈవీఎం మోడల్‌కు మార్పులు చేర్పుల రూపమే – ఆర్వీఎం. వలసజీవులు తాము పనిచేస్తున్న నగరాల్లోని పోలింగ్ కేంద్రాల్లోనే తమ స్వస్థలానికి చెందిన నియోజక వర్గాల ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఈ ప్రతిపాదన అమలైతే సొంతూరికి దూరంగా ఉన్న ఓటర్ తన సొంత నియోజక వర్గం తాలూకు రిటర్నింగ్ అధికారితో ఆన్లైన్లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ ముందుగా రిమోట్ ఓటరుగా రిజిస్టర్ చేయించుకోవాలి. అప్పుడు ప్రస్తుతం సదరు ఓటర్ నివసిస్తున్నచోటే ప్రత్యేక పోలింగ్ కేంద్రం, ఆర్వీఎం పెడతారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఈ ఆర్వీఎం వివిధ నియోజక వర్గాలకు ఒకేసారి పనిచేస్తుందట. ఓటర్ నియోజక వర్గాన్ని బట్టి అప్పటికప్పుడు మారే డైనమిక్ బ్యాలెట్ డిస్ప్లే ద్వారా ఒకే రిమోట్ పోలింగ్ బూత్ నుంచి 72 నియోజక వర్గాలకు అది పనికొస్తుందట. దీనికి ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం లేదట. ఆలోచన మంచిదే. ఈ యంత్రాల్ని సరిగ్గా వినియోగిస్తే గనక స్వస్థలం నుంచి వలస వెళ్ళిన ఓటర్లు ఇప్పుడిక తమ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కు వినియోగానికి కష్టపడి సొంత జిల్లాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళలేని పరిస్థితుల్లో తమ హక్కును వృథా కానివ్వనక్కర లేదు. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 37 శాతం జనాభా (45.36 కోట్ల మంది) తమ స్వస్థలాల్ని వదిలి, దేశీయంగా వలసపోయినవారే. వీరిలోనూ నూటికి 85 మంది తమ సొంత రాష్ట్రంలోనే విద్య, ఉద్యోగం, వివాహం లాంటి రకరకాల కారణాలతో గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. వీరంతా ఎన్నికల వేళ స్వస్థలాల్లో ఓటు వినియోగించుకోలేక పోతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 91.2 కోట్ల మంది భారతీయులకు ఓటు హక్కుంటే, వారిలో 67.4 శాతమే ఓటేశారు. 30 కోట్ల పైచిలుకు మంది తమ హక్కును వినియోగించుకోలేదు. అంటే, ప్రతి ముగ్గురిలో ఒకరు ఓటు వేయనే లేదు. వలస వల్ల అధికశాతం ఓటు హక్కు వినియోగించు కోవట్లేదు గనక, వారు ఎక్కడున్నా ఓటేసే వీలు కల్పిస్తే పోలింగ్ శాతం పెరుగుతుందనేది ఎన్నికల సంఘం ఆలోచన. దీనికి చట్టపరంగా, సాంకేతికంగా, పాలనాపరంగా అనేక సమస్యలున్నాయి. ‘వలసజీవి’ అనే మాటకు భారత రిజిస్ట్రార్ జనరల్, కేంద్ర కార్మిక శాఖ, జాతీయ నమూనా సర్వే సంస్థల్లో ఒక్కోచోట ఒక్కో నిర్వచనం ఉంది. అసలు స్వస్థలానికి ఎంతకాలంగా దూరంగా ఉంటే వలస ఓటర్? రిమోట్ నియోజకవర్గాల్లో ఎన్నికల నియమావళి అమలుచేసేదెట్లా? ఈ వలసజీవుల్ని ఎలా గుర్తించాలి, ఎలా సురక్షిత వాతావరణం కల్పించాలి? రిమోట్ ఓటర్ల డేటా లేదని ఎన్నికల సంఘమే చెబుతోంది. కానీ, 2023లో 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఆర్వీఎంలను వాడాలనీ, 2024 సార్వత్రిక ఎన్నికలకు పూర్తిగా అమలు చేయాలనీ పాలకుల పనుపున తహతహలాడుతోంది. అసలు ముందుగా ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిర్వహణ, ఓటర్ల నమోదు నియమాలు మార్చాలి. ఆలోచించి చేయాల్సిన ఈ పనుల్ని హడావిడిగా నడిపించి, చటుక్కున చేతిలోకి రిమోట్ తీసుకుంటే అనుమానాలు బలపడతాయి. ఎలక్ట్రానిక్ డిస్ప్లేతో ఓటింగ్‌పై అంతర్జాతీయంగానూ అనుమానాలున్నాయి. బలమైన ఆధారాలు లేకున్నా ఎన్నికల్లో మోసాలకు ఇది వీలు కల్పిస్తుందని ఓ భావన. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్‌లో కుయుక్తులు, యంత్రాల భద్రత, వేసిన ఓట్లు ఏ మేరకు సురక్షితం లాంటి చర్చనీయాంశాలున్నాయి. ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో ఆఖరి గంటలో 10 – 12 శాతం ఓటింగ్ రేపిన సందేహాలనూ విస్మరించలేం. రేపు రిమోట్ ఓటింగ్‌లోనూ ఇలాంటివే పరిపాటైతే, అసలు ఎన్నికల ప్రక్రియపైనే నమ్మకం పోతుంది. అప్పుడిక ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది! -
ఈవీఎం తరహాలో ఆర్వీఎం.. ఈసీ సరికొత్త ప్లాన్!
ఢిల్లీ: దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఓటింగ్ శాతం గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. దాదాపు 30 కోట్ల మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. ఓటింగ్ శాతంలో వ్యత్యాసం బాగా కనిపించింది. సాంకేతికతంగా అభివృద్ధి చెందినా.. వలస ఓటర్లు దూరం అవుతుండడం సరికాదనే అభిప్రాయంలోకి ఉంది కేంద్రం ఎన్నికల సంఘం. ఎన్నికల సమయంలో ఉపాధి కోసం వేర్వేరు రాష్ట్రాలకు వలస వెళ్లిన వాళ్లు ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం, డబ్బు.. రెండూ వృథా అవుతాయనే ఆలోచనతో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో.. వాళ్ల ఓటింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(RVM)పద్ధతిని తీసుకురాబోతోంది. తద్వారా సొంత ఊళ్లకు వెళ్లకుండానే ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఓటింగ్ టూల్ ద్వారా వలస ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఉన్న చోటు నుంచే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఒక రిమోట్ పోలింగ్ బూత్ నుంచి ఆర్వీఎం ద్వారా 72 నియోజకవర్గాల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఈ కొత్త సాంకేతిక విధానాన్ని రాజకీయ పార్టీలకు వివరించేందుకు ఇప్పటికే ఈసీ ఆహ్వానించింది కూడా. ఈ నమునాను వివరించే కార్యక్రమం 2023 జనవరి 16వ తేదీన జరగనుంది. ఈ విధానంతో పాటు టూ వే మెథడ్ ఫిజికల్ ట్రాన్సిట్ పోస్టల్ బ్యాలెట్, ప్రాక్సి ఓటింగ్, స్పెషల్ ఎర్లీ ఓటింగ్, ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పోస్టల్ బాలెట్స్(వన్ వే లేదంటే టూ వే), ఇంటర్నెట్ బేస్డ్ ఓటింగ్ సిస్టమ్.. ఇలా ఎన్నో ప్రత్యామ్నాయాలను పరిశీలించింది కూడా. దేశంలో రాష్ట్రాల మధ్యే 85 శాతం అంతర్గత వలసలు సాగుతున్నట్లు ఒక అంచనా. కేంద్రం వద్ద ఈ వలసల లెక్కలు లేకపోయినా.. పనులు, వివాహాలు, చదువు తదితర కారణాలతో ఇలాంటి వలసలు కొనసాగుతున్నాయన్నది పలు విశ్లేషణల ద్వారా తేలింది. -
గుజరాత్లో ‘నరేంద్ర’జాలం
ఢిల్లీ స్థానిక ఎన్నికల ఫలితాలతో నిర్ఘాంతపోయిన బీజేపీకి గుజరాత్ ఓటర్లు గురువారం ఊహాతీతమైన విజయాన్ని అందించి సాంత్వనపరిచారు. అక్కడ వరసగా ఏడోసారి అధికారం అప్ప గించటం మాత్రమే కాదు... ఆ పార్టీకి ఎన్నడూలేని స్థాయిలో సీట్లు కట్టబెట్టారు. 182 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి ఏకంగా 156, కాంగ్రెస్‌కు కేవలం 17, ఆప్‌కు 5 స్థానాలు లభించటం గమనించ దగ్గది. ప్రధాని నరేంద్ర మోదీ సమ్మోహనశక్తి పనిచేయటంతోపాటు అధికార పక్షానికి గట్టి ప్రత్యామ్నాయం అందించగల శక్తి సామర్థ్యాలు విపక్షానికి కొరవడటం బీజేపీ అసాధారణ విజయానికి ఊతమిచ్చింది. మోదీ సీఎంగా ఉన్నప్పుడు సైతం అత్యధికంగా 127 స్థానాలు మాత్రమే గెలుచు కున్న చరిత్రగల బీజేపీ ఇప్పుడు భారీ మెజారిటీ సాధించటం మాటలు కాదు. హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం బీజేపీ బోర్లాపడక తప్పలేదు. ప్రతి అయిదేళ్లకూ అధికార పక్షాన్ని సాగనంపే సంప్రదా యాన్ని ఓటర్లు ఈసారి కూడా కొనసాగించటంతోపాటు అక్కడి సమస్యలపై పోరాడిన తీరు కాంగ్రెస్‌కు లాభించింది. అయితే రెండు పార్టీల ఓట్ల శాతం వ్యత్యాసం ఒక్క శాతంకన్నా తక్కువే. అక్కడి 68 స్థానాల్లో కాంగ్రెస్‌కు 40, అధికారం మెట్లు దిగుతున్న బీజేపీకి 25 రాబోతున్నాయి. ఢిల్లీలో దక్కిన విజయంతో సంతోషసంరంభాల్లో మునిగితేలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలూ షాక్ అనే చెప్పాలి. ఆ పార్టీకి కొత్తగా జాతీయ పార్టీ హోదా రావటం మినహా సీట్లపరంగా పెద్దగా దక్కిందేమీ లేదు. హిమాచల్‌లో గట్టి సవాల్ ఇస్తుందనుకుంటే కనీసం ఖాతా కూడా ప్రారం భించలేకపోయింది. గుజరాత్ గురించి సాక్షాత్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గొప్పలకు పోయినా ఎవరూ దాన్ని విశ్వసించలేదు. కానీ పొరుగునున్న పంజాబ్ మాదిరే హిమాచల్‌లో సైతం ఏదో ఇంద్రజాలం చేస్తుందని నమ్మినవారికి నిరాశే ఎదురైంది. ఆ పార్టీ చేసిన హడావుడికీ, వచ్చిన సీట్లకూ ఎక్కడా పొంతన లేకపోవటం గమనించదగ్గది. అధికార పక్షం పనితీరుకన్నా ఇతరేతర అంశాలు ప్రాధాన్యం సంతరించుకోవటం ఈమధ్య కాలంలో దేశంలో అక్కడక్కడ కనబడుతోంది. ఇప్పుడు గుజరాత్‌లోనూ జరిగింది అదే. ఇది విప క్షాల వైఫల్యం తప్ప మరొకటి కాదు. కరోనా మహమ్మారి కాటేయడంతో ఆ రాష్ట్రంలో దాదాపు అన్నివర్గాల జనం ఆర్థిక ఒడిదుడుకులతో సతమతమవుతున్నారు. సంపన్నవంతులైన సూరత్‌లోని జౌళి మిల్లుల యజమానులు మొదలుకొని అంతంతమాత్రంగా నెట్టుకొచ్చే పొగాకు రైతుల వరకూ అందరికీ సమస్యలున్నాయి. రాష్ట్రంలో వృద్ధి రేటు అరకొరగా ఉండగా ద్రవ్యోల్బణం పట్టిపీడిస్తోంది. నిరుద్యోగ సమస్య సరేసరి. సాధారణ పరిస్థితుల్లో ఇవన్నీ అధికార పక్షానికి చుక్కలు చూపాలి. కానీ రాష్ట్ర ఓటర్లలో 52 శాతంమంది మళ్లీ బీజేపీనే కొనసాగించాలనుకున్నారంటే విపక్షమైన కాంగ్రెస్‌పై వారికున్న అవిశ్వాసం ఎంతటిదో అర్థమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 41 శాతం ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ ఈసారి 27 శాతానికి పడిపోయిందంటే అది ఆ పార్టీ పతనావస్థను పట్టి చూపుతుంది. క్రితంసారి ఎన్నికల్లో సౌరాష్ట్ర ప్రాంతాన్ని బీజేపీనుంచి చేజిక్కించుకున్న కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో ఆప్ ఆగమనం వల్ల కావొచ్చు... ఓట్లు చీలి దాన్ని తిరిగి బీజేపీకే అప్పగించింది. ఆప్ కేవలం కాంగ్రెస్ ఓట్లను మాత్రమే కాదు... అంతో ఇంతో బీజేపీ ఓట్లను కూడా రాబట్టుకోగలిగింది. 2017 ఎన్నికల నాటికి పటీదార్ల ఉద్యమం గుజరాత్‌ను హోరెత్తించింది. అప్పట్లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. తమకు రాయితీలు దక్కటం లేదని రైతాంగం ఆగ్రహంతో ఉంది. అలాంటి సమయంలోనే లాగలేకపోయిన కాంగ్రెస్ ఇప్పుడు ఏదో చేస్తుందని ఎవరూ అనుకోలేదు. జనం ఎదుర్కొంటున్న సమస్యలపై తానే ఉద్యమించి అందరినీ కూడగట్టి ఉంటే ఆ పార్టీకి అంతో ఇంతో లాభించేది. అలాంటి చొరవ తీసుకున్న నేతలే లేకపోవటం కాంగ్రెస్‌కు పెద్ద శాపం. అటు ప్రధాని నరేంద్ర మోదీ 31 ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొంటే కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మినహా మిగిలిన బడానేతల జాడ అంతంతమాత్రం. గడప దాటకుండా, సమస్యలపై ఉద్యమించకుండా విజయం తనంతతాను దరి చేరాలని ఏ విపక్షం భావించినా తెలివితక్కువతనం. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు చూసినా, హిమా చల్లో కాంగ్రెస్ విజయం గమనించినా ఇదే రుజువవుతుంది. హిమాచల్‌లో బీజేపీ ప్రచారహోరు తక్కువేమీ లేదు. అది ప్రధాని మోదీ ఆకర్షణనూ, ప్రతిసారీ ఏకరువుపెట్టే ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వ వాదాన్నీ, ఉమ్మడి సివిల్ కోడ్‌నూ, జాతీయ భద్రతనూ ఎజెండాలోకి తెచ్చింది. అటు చూస్తే నిరుడు వీరభద్రసింగ్ మరణం తర్వాత కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ నాయకుడు లేకుండాపోయారు. అయినా రాష్ట్రంలో నిరుద్యోగంపై, యాపిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ఎన్నో ఉద్యమాలు చేసింది. జనం సతమతమవుతున్న సమస్యల్ని తీసుకుని ఉద్యమాలు నిర్మిస్తే విజయం పెద్ద కష్టం కాదని నిరూపించింది. ఆ రకంగా చూస్తే హిమాచల్ ఎన్నికల ఫలితాలు విపక్షాలకు మాత్రమే కాదు, బీజేపీకి సైతం హెచ్చరిక లాంటివే. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే. కానీ గెలిచిన పక్షం జనం ఎందుకు గెలిపించారో, వాగ్దానాల అమలుకు తాను చేయాల్సిందేమిటో గుర్తెరగాలి. ఓటమి పాలైన వారు తమవైపు ఎలాంటి లోపాలున్నాయో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓటమిని హుందాగా స్వీకరిం చటం నేర్చుకోవాలి. జనం అధికారం కట్టబెట్టనిచోట దాన్ని నయానో భయానో కొల్లగొట్టి పబ్బం గడుపుకుందామనే ఆలోచనలకు దూరంగా ఉండాలి. లేకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. -
ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ తొలి విడత పోలింగ్
05.30 PM ముగిసిన పోలింగ్.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ చిన్ని చిన్న ఘటనలు, విపక్షాల ఆరోపణల మధ్య ప్రశాంతంగా ముగిసింది. తొలి విడత ఎన్నికల్లో 60 శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 04:10 PM 13,065 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 48.48 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా తపి నియోజకవర్గంలో 63.98శాతం ఓటింగ్ నమోదైంది. 13,065 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. 02:20 PM గుజరాత్ తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంత జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 34.48 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుతీరారు. 11:50 AM నెమ్మదిగా పోలింగ్.. గుజరాత్ తొలి విడత ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 18.95 శాతం పోలింగ్ నమోదైంది. పలు చోట్ల ఓటింగ్ నత్త నడకన సాగుతోంది. 10:35 AM ఓటేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. భారత క్రికెటర్ రవీంద్ర జడేజా, ఆయన సతీమణి రివబ జడేజా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జామ్‌నగర్‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఓటు వేశారు. ప్రజలంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోలింగ్‌లో పాల్గొనాలని రవీంద్ర జడేజా పిలుపునిచ్చాడు. ఈ ఎన్నికల్లో అతని భార్య రివబ బీజేపీ తరఫున జామ్‌నగర్ నుంచే పోటీ చేస్తోంది. #GujaratElections2022 | Cricketer Ravindra Jadeja cast his vote at a polling station in Jamnagar. His wife and BJP candidate Rivaba Jadeja voted in Rajkot earlier today. Ravindra Jadeja says, "I appeal to the people to vote in large numbers." pic.twitter.com/TXyu2W8JoD — ANI (@ANI) December 1, 2022 తండ్రి కాంగ్రెస్.. రవీంద్ర జడేజా భార్య బీజేపీ తరఫున పోటీ చేస్తుంటే.. ఆయన తండ్రి అనిరుధ్ సిన్హ్ జడేజా మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. కుమార్తె నైనా జడేజాతో కలిసి వచ్చి జామ్‌నగర్‌లోని ఓ పోలింగ్ స్టేషన్లో ఓటేశారు. ఇద్దరూ కాంగ్రెస్‌కే మద్దతు తెలిపారు. రాజకీయ పార్టీల విషయంలో అభిప్రాయాలు వేరైనప్పటికీ కుటంబపరంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని జడేజా తండ్రి స్పష్టం చేశారు. తాను ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. #GujaratAssemblyPolls | Anirudhsinh Jadeja & Naina Jadeja - father & sister of cricketer Ravindra Jadeja - vote at a polling station in Jamnagar Ravindra Jadeja's wife Rivaba Jadeja is BJP candidate from Jamnagar North while Anirudhsinh & Naina campaigned for Congress candidate pic.twitter.com/RxCJGlDUGT — ANI (@ANI) December 1, 2022 9:30 AM ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. తొలి విడత పోలింగ్‌లో కాముబెన్ లాలాభాయ్ పటేల్ అనే 100 ఏళ్ల బామ్మ తన ఓటు హక్కు వినియోగుంచుకుంది. ఉమర్గాంలోని ఓ పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఓటేసింది. 9:10 AM గ్యాస్ సిలిండర్‌తో పోలింగ్ స్టేషన్‌కు.. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్ ధనాని సైకిల్‌పై గ్యాస్ సిలిండర్‌తో పోలింగ్ స్టేషన్‌కు పెళ్లారు. బీజేపీలో పాలనలో ధరల పెరుగుదలకు నిరసనగా ఇలా చేశారు. #WATCH | Amreli: Congress MLA Paresh Dhanani leaves his residence, to cast his vote, with a gas cylinder on a bicycle underscoring the issue of high fuel prices.#GujaratAssemblyPolls pic.twitter.com/QxfYf1QgQR — ANI (@ANI) December 1, 2022 8:30 AM ఓటేసిన మంత్రి.. గుజరాత్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. మంత్రి పూర్ణేష్ మోదీ.. సూరత్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 8:00 AM పోలింగ్ ప్రారంభం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 89 నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించునేందుకు పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమవుతుంది. సౌరాష్ట్ర, కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ హోరాహోరిగా ప్రచారాన్ని నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్ధ ప్రచారం అంటూ క్షేత్ర స్థాయిలో నాయకులు గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. 2017 ఫలితాలు ఇలా.. తొలి దశ పోలింగ్ జరుగుతున్న ఈ 89 స్థానాల్లో 2017 ఎన్నికల్లో బీజేపీ 48 చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్ 40 సీట్లలో గెలుపొందింది. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలం పుంజుకోవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలతో పాటుగా, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) కూడా పోటీ చేస్తున్నాయి. బరిలో 788 మంది తొలి దశలో 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.బీజేపీ, కాంగ్రెస్ మొత్తం 89 స్థానాల్లో పోటీ పడుతూ ఉంటే, ఆప్ 88 స్థానాల్లో పోటీ చేస్తోంది.. తూర్పు సూరత్ నియోజకవర్గం అభ్యర్థి ఆఖరి నిమిషంలో తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆప్ 88 స్థానాలకే పరిమితమవాల్సి వచ్చింది. ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ ద్వారక జిల్లాలోకి కంభాలియా నుంచి పోటీ పడుతూ ఉంటే ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా సూరత్‌లోని కటాగ్రామ్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి దశ పోటీలో ఉన్న ముఖ్యుల్లో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రవీబా జడేజా జామ్‌నగర్ (ఉత్తరం) నుంచి బరిలో ఉన్నారు. పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలు- 89 పోటీ పడుతున్న అభ్యర్థులు- 788 మహిళా అభ్యర్థులు- 70 స్వతంత్ర అభ్యర్థులు- 339 ఓటర్ల సంఖ్య- 2.39 కోట్లు పోలింగ్ కేంద్రాలు - 1,432 -
‘మునుగోడు’ పాఠం నేర్చుకుందాం
సాక్షి, హైదరాబాద్: నిత్యం అధికారిక కార్యక్రమాలు, పర్యటనలతో బిజీగా ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడు ఉప ఎన్నిక ద్వారా కొత్త పాఠాలు నేర్చుకున్నారా? పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల పర్యవేక్షణలో ఉప ఎన్నిక వ్యూహం అమలు, ప్రచారంలో ఎదురైన అనుభవాలు తమ పనితీరును అంచనా వేసుకునేందుకు వీలు కల్పించాయా? ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై, ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో నెలకొన్న అభిప్రాయాలను, వివిధ వర్గాలు తమపట్ల స్పందిస్తున్న తీరును బేరీజు వేసుకునేందుకు ఉప ఎన్నిక ఒక పాఠంలా పనిచేసిందా?.. ఈ ప్రశ్నలకు టీఆర్ఎస్ వర్గాలు ఔననే సమాధానం ఇస్తున్నాయి. ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను క్రోడీకరించి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోగా దిద్దుబాటు చర్యలు చేపట్టడం, కొత్త ఎన్నికల వ్యూహాన్ని రూపొందించుకుని అమలు చేయడంపై ఇప్పట్నుంచే దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ ఉప ఎన్నిక నొక్కి చెప్పిందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వచ్చే పది నెలల పాటు నియోజకవర్గంలోనే మకాం వేసి, ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన పరిస్థితిని గుర్తు చేసిందనే భావన కనిపిస్తోంది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ ‘ఐప్యాక్’సంస్థ వివిధ మార్గాల ద్వారా సేకరించి ఇస్తున్న సమాచారాన్ని సీఎం కేసీఆర్ విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వంద మందికో ఇన్చార్జిని నియమించాలని కేసీఆర్ ఆదేశించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ కోణంలోనే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలు, కేడర్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారని వివరిస్తున్నాయి. మోహరింపుతో స్వయం విశ్లేషణ మునుగోడు ఉప ఎన్నిక విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకుని పార్టీ కీలక నేతలందరినీ మోహరించారు. సుమారు 20రోజుల పాటు మునుగోడులో మకాం వేసిన నేతలు పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. అక్కడ 2,500 నుంచి 3వేల మంది ఓటర్లను ఒక యూనిట్‌గా విభజించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా గ్రామాలు, వార్డుల్లో మకాం వేసిన నేతలకు క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల పట్ల ఓటర్లలో నెలకొన్న అభిప్రాయాన్ని మదింపు చేసుకునే అవకాశం దక్కింది. ఏయే వర్గాలు పార్టీ పట్ల ఏ విధమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి, వారు ఉప ఎన్నికలో ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు, ఏయే అంశాలు వారిని ప్రభావితం చేస్తున్నాయన్న అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం దక్కింది. యువత, ఉద్యోగులు, కొత్త ఓటర్లు, మహిళలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఏం కోరుకుంటున్నారనే దానిపైనా స్పష్టత వచ్చింది. ఎమ్మెల్యేలు ఈ అనుభవాలను తమ నియోజకవర్గ పరిస్థితులతో పోల్చి చూసుకుంటూ.. వచ్చే ఎన్నికల్లో తమకు ఎదురయ్యే ఫలితంపై అంచనాలు వేసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, స్థానిక నేతలు ఏం కోరుకుంటున్నారు, ఏ అంశాలపై అసంతృప్తితో ఉన్నారు, అంతర్గత విభేదాలు ఏ విధంగా ప్రభావం చూపుతాయి, వారిని ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశాలపైనా ఎమ్మెల్యేలకు స్పష్టత వచ్చినట్టు పేర్కొంటున్నాయి. ఓటర్లకు చేరువ అయ్యేలా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నా.. వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ అవకాశంపై ఎమ్మెల్యేలు అంతర్గతంగా లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాలు, మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి కేడర్‌తో ఉన్న గ్యాప్‌ను సరిదిద్దుకోవడం, వారికి దగ్గరయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవడంలో నిమగ్నం అవుతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో భేటీలు, వివిధ సామాజిక వర్గాలతో సమావేశాల ద్వారా వారికి చేరువగా ఉన్నామనే అభిప్రాయం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ప్రతి వంద మంది ఓటర్లకు ఒక పార్టీ ఇన్చార్జిలను నియమించి, వారి ఫోన్ నంబర్ల జాబితాలను తెలంగాణ భవన్‌కు పంపాలని కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ ఇన్చార్జులు ప్రతీ ఓటరును చేరుకుని వారి పూర్తి వివరాలను సేకరించి ప్రొఫైల్స్‌ను రూపొందిస్తారు. ఓటరు కుటుంబం, వారిలో ఎందరికి ఓటు హక్కు ఉంది, ఎక్కడ నివాసం ఉంటున్నారు, నియోజకవర్గం బయట ఉండే వారి చిరునామా, ఫోన్ నంబర్ వివరాలన్నీ సేకరిస్తారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి, పట్టు పెంచుకునేందుకు ఈ కసరత్తు ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇదీ చదవండి: Hijab: నిరసనకారులకు గుణపాఠమా?! -
Himachal Elections 2022: హిమాచల్‌లో ముగిసిన పోలింగ్
Upadates హిమాచల్‌లో ముగిసిన పోలింగ్ - హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ నమోదు. ధర్మశాల, సిమ్లాలో ఎన్నికల సంఘం అధికారులు ఈవీఎం, వీవీప్యాట్స్‌కు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించారు. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8వ తేదీన వెలువడుతాయి. Voting in Himachal Pradesh Assembly elections concludes. EVMs and VVPATs being sealed and secured at polling booths in Dharamshala and Shimla Counting of votes on December 8 pic.twitter.com/PF2wWWhgtD — ANI (@ANI) November 12, 2022 02:00PM 1 గంట వరకు 37.19 శాతం ఓటింగ్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుతీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు 37.19 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లకు ప్రియాంక సూచన.. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి, భవిష్యత్తు కోసం విచక్షణతో ఓటు వేయాలని సూచించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. మీ గురించి, మీ రాష్ట్ర పరిస్థితి గురించి మీకే పూర్తిగా తెలుసునని, పరిస్థితులను గమనించి బంగారు భవిష్యత్తు కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 11:45AM 11 గంటల వరకు 17.98 శాతం ఓటింగ్.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 17.98 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 40-45 సీట్లు గెలుస్తాం: కాంగ్రెస్ సిమ్లాలోని రాంపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్. అభివృద్ధికి ఓటు వేయాలని సూచించారు. 68 స్థానాల్లో 40-45 సీట్లు గెలుస్తాని దీమా వ్యక్తం చేశారు. సిమ్లాలోని సైనిక్ రెస్ట్ హౌస్ లాంగ్వుడ్ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఆనంద్ శర్మ ఓటేసిన కేంద్ర మంత్రి.. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ థుమాల్, ఆయన కుమారు, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్లు తమ కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.హమిర్పుర్లోని సమిర్పుర్ పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో సీఎం జైరాం ఠాకూర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తమకే మళ్లీ అధికారం ఇస్తారని దీమా వ్యక్తం చేశారు అనురాగ్ ఠాకూర్. Former Himachal Pradesh CM Prem Kumar Dhumal, his son & Union Minister Anurag Thakur and their family cast their votes for #HimachalPradeshElections. Visuals from a polling station in Samirpur, Hamirpur. pic.twitter.com/D0vgw0ncxY — ANI (@ANI) November 12, 2022 10:30AM 5.02 శాతం ఓటింగ్ ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.02శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా సిర్మౌర్‌లో 6.26 శాతం, లాహౌల్‌లో అత్యల్పంగా 1.56శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొంది. 9:30AM ఓటింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాలి: పీఎం మోదీ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన క్రమంలో ఓటింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాలని ఆ రాష్ట్ర ప్రజలను కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజాస్వామ్య పండుగలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. కొత్తగా ఓటు హక్కు సాధించిన యువ ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. हिमाचल प्रदेश की सभी विधानसभा सीटों के लिए आज मतदान का दिन है। देवभूमि के समस्त मतदाताओं से मेरा निवेदन है कि वे लोकतंत्र के इस उत्सव में पूरे उत्साह के साथ भाग लें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट देने वाले राज्य के सभी युवाओं को मेरी विशेष शुभकामनाएं। — Narendra Modi (@narendramodi) November 12, 2022 ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జైరాం ఠాకూర్ కుటుంబం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఆయన కుటుంబంతో కలిసి వచ్చి సెరాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండీలోని పోలింగ్ స్టేషన్ 44లో ఓటు వేశారు. ఈ సందర్భంగా తాము ఎంతో ఉత్సాంగా ఉన్నామని, మండీ ఎప్పుడూ సీఎం జైరాం ఠాకూర్‌కు మద్దతుగా ఉంటుందన్నారు ఆయన కూతురు చంద్రికా ఠాకూర్. బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గమనించిన ప్రజలను మళ్లీ ఆ పార్టీకే ఓటు వేస్తారని దీమా వ్యక్తం చేశారు. 8:00AM హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం డబుల్ ఇంజన్ నినాదం, ప్రధాని మోదీ చరిష్మాతో చరిత్ర సృష్టించాలని బీజేపీ.. అధికార వ్యతిరేకత, ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చే దశాబ్దాల సంప్రదాయం కొనసాగుతుందన్న విశ్వాసంతో కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. తొలిసారి బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుందోనన్న ఆందోళన నెలకొంది. 68 స్థానాలున్న అసెంబ్లీకి శనివారం జరిగే ఎన్నికల్లో 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 55 లక్షలకు పైగా ఓటర్లు తేల్చనున్నారు. సీఎం జైరామ్ ఠాకూర్, దివంగత సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ వంటి ప్రముఖులు పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థుల్లో 82 శాతం, కాంగ్రెస్ అభ్యర్థుల్లో 90 శాతం కోటీశ్వరులే! మంచులో నడుస్తూ... మొత్తం 7,884 పోలింగ్ కేంద్రాల్లో 397 కేంద్రాలు మంచుతో నిండి అత్యంత సంక్లిష్టంగా ఉంటాయి. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో కాజాలోని తషిగాంగ్ పోలింగ్ బూత్ దేశంలోనే అత్యంత ఎత్తులో ఉండే పోలింగ్ కేంద్రం. నువ్వా, నేనా? బీజేపీ తరఫున ప్రచారాన్ని ప్రధాని మోదీ తానే ముందుండి నడిపించారు. ఆఖరి నిముషంలో ఓటర్లకు బహిరంగంగా లేఖ రాసి కమలం గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున ప్రచార భారమంతా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాపైనే పడింది. గత రెండేళ్లలో తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్ హిమాచల్‌లోనైనా గెలిచి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరసగా రెండోసారి గెలిచిన పార్టీగా చరిత్ర సృష్టిస్తుంది. ఈ విజయం వచ్చే ఏడాది హిందీ బెల్ట్‌లో జరిగే అత్యంత కీలకమైన తొమ్మిది రాష్ట్రాల గెలుపు అవకాశాలను పెంచుతుందన్న భావనలో పార్టీ ఉంది. -
11,36,873 మంది తొలగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 11,36,873 మంది ఓటర్లను తొలగించారు. కొత్తగా మరో 3,45,648 మందికి ఓటర్ల జాబితాలో చోటు కల్పించారు. ఈ ఏడాది జనవరి 5న ప్రక టించిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,03,56,894 మంది సాధారణ ఓటర్లుండగా.. తాజా తొలగింపులు, చేరికల అనంతరం మొత్తం ఓటర్ల సంఖ్య 2,95,62,932కి తగ్గింది. వార్షిక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2023లో భాగంగా ఈ మేరకు ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ గురువారం విడుదల చేశారు. డిసెంబర్ 8వరకు ఓటర్ల నమోదుకు అవకాశం ముసాయిదా జాబితాలో 1,48,58,887 మంది పురుషులు, 1,47,02,391 మంది మహిళలు, 1,654 మంది ట్రాన్స్‌జెండర్లున్నారు. 2,737 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 15,067 మంది సర్వీసు ఓటర్లు కలిపితే మొత్తం ఓటర్ల సంఖ్య 2,95,80,736కు చేరింది. 18–19 ఏళ్ల వయస్సు కలిగిన యువ ఓటర్లు 83,207 మంది ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 8 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. -
Munugode Bypoll: పోటెత్తిన ఓటర్లు.. 92 శాతం పోలింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. 92 శాతం పోలింగ్ నమోదైనట్లు గురువారం రాత్రి 11 గంటల సమయంలో అధికారులు ప్రకటించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తొలుత మందకొడిగా సాగింది. 50 ఏళ్ల పైబడిన వారు, వృద్ధులు అధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి ఓటర్లు బూత్‌లకు రావడం పెరిగింది. మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదు కాగా, 11 గంటల వరకు 25.8 శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.3 శాతం ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 3 గంటల వరకు 59.92 శాతం మంది ఓట్లు వేశారు. 50 మంది సర్వీసు ఓటర్లు మినహాయిస్తే మిగతా 2,41,805 మందికి గాను 1,44,878 మంది మధ్యాహ్నం వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 77.55 శాతం పోలింగ్ నమోదైంది. 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసే సమయానికి కూడా పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడ్డారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం సహా చాలా గ్రామాల్లో రాత్రి 8 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. ఈవీఎంల మొరాయింపు చండూరు మండలం కొండాపురం గ్రామంలో పోలింగ్ ప్రారంభమైన గంట తర్వాత ఈవీఎంలలో సాంకేతిక లోపం తలెత్తింది. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో ఈవీఎంలలో సాంకేతి లోపం ఏర్పడి దాదాపు గంట పాటు మొరాయించాయి. వాటిని మార్చేసి పోలింగ్ కొనసాగించారు. నాంపల్లి మండల కేంద్రంలో, సంస్థాన్‌నారాయణపురం మండలం కేంద్రంలోని జిల్లాపరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు సరిగా పనిచేయలేదు. అల్లందేవి చెరువు గ్రామంలో ఈవీఎంలో ఎర్రర్ చూపించడంతో 20 నిమిషాల వరకు పోలింగ్ ఆగిపోయింది. కేటీఆర్ హామీతో పోలింగ్‌కు హాజరు! గట్టుప్పల్ మండలం రంగతండా, హజినతండా గ్రామస్తులు మధ్యాహ్నం వరకు ఓటు వేయలేదు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, గ్రామ పంచాయతీలుగా చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామాల్లో వసతులు కల్పిస్తామని హామీ ఇస్తేనే ఓటింగ్‌లో పాల్గొనమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. 3 గంటల ప్రాంతంలో తహసీల్దార్ వచ్చి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఓ టీఆర్ఎస్ నాయకుడు..కొందరు గ్రామస్తులను మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడించారు. సమస్యలను పరిష్కరిస్తానని, తానే వచ్చి పనులకు శంకుస్థాపన చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో పోలింగ్‌లో పాల్గొన్నారు. పలుచోట్ల ఉద్రిక్తతలు పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జి చేశారు. మర్రిగూడ మండల కేంద్రంలో సిద్దిపేట జిల్లాకు చెందిన వారు ఉన్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారు వెళ్లిపోయేంతవరకు పోలింగ్‌ను ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో గొడవ ముదిరింది. పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో వరంగల్‌కు చెందిన వారు స్థానికంగా ఉన్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. మధ్యాహ్నం తర్వాత చండూరులో డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో పాటు గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. రూ.14.5 లక్షలు స్వాధీనం నాంపల్లి మండలం మల్పరాజు గ్రామంలో కొందరు ఓటర్లకు డబ్బులు పంపిణీకి ప్రయత్నిస్తుండడంతో పోలీసులు, ఇతర సిబ్బంది వారి నుంచి రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చండూరు పరిధిలో రూ.1.60 లక్షలు, గట్టుప్పల్ మండలంలో రూ. 2.90 లక్షలు పట్టుకున్నారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి పలు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. చదవండి: న్యాయవ్యవస్థే కాపాడాలి.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య: సీఎం కేసీఆర్ -
ప్రచార గడువు ముగిసిన మునుగోడులోనే తిష్టవేసిన నాన్ లోకల్స్
-
మునుగోడులో రోడ్డెక్కిన ఓటర్లు.. 10 వేలు, తులం బంగారం ఇస్తామని చెప్పి ..
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో నియోజకవర్గంలో పోటాపోటీగా ప్రలోభాల పర్వం కొనసాగుతోంది.ఎన్నికకు(నవంబర్3) ఒకరోజు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్థులు, తమ మద్దతురాలు ఓటర్లకు జోరుగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. అయితే తమకు డబ్బులు ఇందలేదని పలుచోట్ల ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. రూ. 10 వేలు, తులం బంగారం ఇస్తామని చెప్పి తక్కువ ఇచ్చారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు చెప్పిన విధంగా డబ్బులు పంచాలని మహిళా ఓటర్లు రోడ్డెక్కారు. ఇదిలా ఉండగా ప్రచారం గడువు ముగిసినా మునుగోడులో నాన్ లోకల్స్ తిష్ట వేశారు. మునుగోడు మండలం కోతులారంలో 30 మంది నాన్ లోకల్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నిస్తే భోజనాల కోసం ఆగమంటూ తలా తోక లేని సమాధానాలు చెబుతున్నారు. ఇలా నియోజకవర్గంలోని చాలాచోట్ల ఇతర జిల్లాల నేతలు మకాం వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Munugode Bypoll: ఆఖరి అస్త్రాలు సందిస్తున్నారు.. పోటాపోటీగా పంపకాలు! -
మునుగోడులో జోరుగా డబ్బు పంపిణీ
-
ఎల్బీ నగర్లో ఏం జరుగుతోంది?.. మునుగోడు ఎన్నికకు సంబంధమేంటీ?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం హైదరాబాద్ ఎల్బీ నగర్లో జరుగుతోందా? ఎల్బీ నగర్‌కు మునుగోడుకు సంబంధం ఏంటి? మునుగోడులో ఎవరు గెలిచేది ఎల్బీ నగర్ నిర్దేశించబోతోందా? మునుగోడు వెళ్లాల్సిన మూడు పార్టీల ముఖ్య నేతలంతా ఎల్బీనగర్లోనే ఎందుకు మకాం వేశారు? హైదరాబాద్ శివార్లపై దృష్టి తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు చావో రేవో అన్నట్లుగా ప్రయత్నిస్తున్నాయి. ఒక్క ఓటు కూడా పోకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేవు రాజకీయ పార్టీలు. అందుకే మునుగోడు ఓటర్లు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నారో గాలిస్తున్నారు. వెతికి పట్టుకుంటున్నారు. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆశలు రేకెత్తిస్తున్నారు. తాయిలాలు ఎరగా వేస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన వేలాది మంది ఓటర్లు ఉపాధి కోసం హైదరాబాద్ నగర శివార్లలోని పలు ప్రాంతాలకు వలస వచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోనే ఉంటూ ప్రయివేటు ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉంటున్నవారి అడ్రస్, ఫోన్ నెంబర్లు మునుగోడులోని వారి బంధు, మిత్రుల నుంచి సేకరించి వారితో భేటీలు నిర్వహిస్తున్నాయి రాజకీయ పార్టీలు. 25వేల మంది@ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో మునుగోడు ఓటర్లు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. దాదాపు 25 వేల మంది వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీరంతా మునుగోడు ఓటర్లే. దీనిపై పక్కా సమాచారం సేకరించిన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు వలస ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు మందు, విందు ఏర్పాటు చేసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారట. నాగార్జున సాగర్ రోడ్లో ఇబ్రహీం పట్టణం సహారా ఎస్టేట్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉన్న కాలనీల్లో మూడు పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారని టాక్. ఎవరికి వారు తమ పార్టీకే ఓటేసేవిధంగా వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఓటర్ల కోసం ముంబైలో గాలింపు పార్టీల ప్రచారం చూస్తున్న స్థానికులు ఎన్నిక జరుగుతోంది.. మునుగోడు లోనా ఎల్బీనగర్ లోనా అని చర్చించుకుంటున్నారట. ఇటువంటి పరిస్థితి ఒక ఎల్బీనగర్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఉపాధి వెతుక్కుంటూ ముంబాయి వెళ్లినటువంటి వలస కూలీల వద్దకు కూడా ఒక పార్టీ కీలక నేత వెళ్లి నవంబర్ మూడున ఓటు వేసేందుకు రావలసిందిగా కోరారట. అందుకు అవసరమైన ఖర్చు కూడా తామే భరిస్తామని.. ఏదైనా కోరితే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చి వచ్చారట. కొంత అడ్వాన్స్ కూడా చెల్లించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: Munugode Bypoll: జరిగే మేలు ఎవరికి?.. చీలే ఓట్లెవరివి.. -
Munugode Bypoll 2022: ఓటర్లకు ప్రలోభాలపై ఈసీ సీరియస్! కేసులు తప్పవా?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు అందిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. విచ్చలవిడిగా డబ్బులు, మద్యం, ఇతర తాయిలాలను పంపిణీ చేస్తున్నవారిపై, తీసుకున్నవారిపై ఐపీసీ సెక్షన్ 171(బీ) కింద కేసులు నమోదు చేయాలని ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా అభ్యర్థిని/ఓటరును/ మరే ఇతర వ్యక్తిని బెదిరించినా, గాయపర్చినా సెక్షన్ 171(సీ) కింద కేసు పెట్టాలని సూచించింది. ఈ రెండు కేసుల్లో ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఈ నిబంధనలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఆదేశించింది. ఉప ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) వికాస్‌రాజ్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించారు. మునుగోడుకు అదనంగా పరిశీలకులు మునుగోడులో అక్రమ నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు కేంద్రం ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఎన్నికల అదనపు పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సుభోత్ సింగ్, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సమత ముళ్లపూడిని తాజాగా నియమించింది. అక్రమ నగదు ప్రవాహం నియంత్రణలో వీరికి సహకరించేందుకు మరో ఏడుగురు ఆదాయ పన్నుశాఖ అధికారులను ఆ శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్స్) మునుగోడుకు పంపించనున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.2.49 కోట్ల నగదు, 1,483.67 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వికాస్‌రాజ్ తెలిపారు. 36 మందిని అరెస్టు చేసి 77 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: టీఆర్ఎస్లో ముసలం ఖాయం) -
ఓటర్లను యాదాద్రి తీసుకెళ్లి ప్రమాణాలు...టీఆర్ఎస్పై కేసు నమోదు
సాక్షి, యాదాద్రి: ఓటర్లను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తరలించి ప్రమాణం చేయించడంపై ఎన్నికల కోడ్ ప్రత్యేక బృందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ ఏసీపీ నూకల ఉదయ్‌రెడ్డి తెలిపారు. గురువారం చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన సుమారు 700 మందిని యాదగిరిగుట్టకు ప్రత్యేకంగా 15 ఆర్టీసీ బస్సుల్లో ఆ గ్రామ టీఆర్ఎస్ ఇన్చార్జి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో తరలించారు. ఓటర్లను తీసుకొనిపోయి స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించి, ఆలయంలో తమ పార్టీకే ఓటు వేయాలని ప్రమాణం చేయించారని పలువురు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఫొటోలు, వీడియోగ్రఫీ సాక్ష్యాల ఆధారంగా టీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారానికైన వ్యయాన్ని మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల ఖర్చులో వేయాలని ఎన్నికల కమిషన్ అధికారులను ఆదేశించింది. -
Munugode Bypoll: ప్రచారానికి జనాన్ని పిలిస్తే ఒక బాధ, పిలవకపోతే మరో బాధ
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా చేస్తున్నాయి. పోటీలో వివిధ పార్టీల అభ్యర్థులు, చాలా మంది స్వతంత్రులు ఉన్నప్పటకీ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమనే తీవ్రమైన పోటీ నెలకొంది. ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఈ మూడు పార్టీలు నిత్యం సభలు, సమావేశాలు నిర్వహిస్తూ జనం మధ్యలో ఉంటున్నాయి. ఆయా పార్టీలు తమ కార్యకర్తలో సమావేశాలు నిర్వహిస్తే హంగామా కనిపించకపోవడంతో.. సామాన్య ప్రజానీకాన్ని సమీకరిస్తున్నాయి. ఆ క్రమంలో గ్రామాలు, కాలనీలకు చెందిన జనం పార్టీల సమావేశాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. జన సమీకరణతో మొదలవుతున్న నేతల కష్టాలు సమావేశాలు నిర్వహణ వరకు బాగానే ఉన్నా అసలు సమస్య మాత్రం జనసమీకరణతోనే. సమావేశాలు, రోడ్‌షోలకు ఒకొక్కరికి రూ.500 నుంచి రూ.1000 వరకు చెల్లిస్తున్నారు. ఒక్కో పార్టీ ఆయా కార్యక్రమాల పరిస్థితి మేరకు జనాన్ని సమీకరిస్తున్నాయి. ఇంతే మంది కావాలని కూడా చెబుతున్నాయి. అయితే పిలిచినదాని కంటే ఎక్కవగా జనాలు తరలివెళ్తున్నారు. వద్దన్నా వినకుండా వస్తుండడంతో అందరికీ డబ్బులు చెల్లించలేక స్థానిక నేతులు తలలు పట్టుకుంటున్నారు. వద్దని చెబితే ‘రేపు మా ఓటు వద్దా’ అని ప్రశ్నిస్తున్నారు. దీంతో జనాన్ని వద్దనలేక, అధిష్టానం వద్ద సరిపడా డబ్బులను తెప్పించుకోలేక నానా పాట్లు పడుతున్నారు. ఒక్కోసారి స్థానిక నేతలే సొంతంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకునేందుకు కొందరు వెనుకడుగు వేస్తున్నారు. కొందరికి కాసులు.. మరి కొందరికి కష్టాలు.. సాధారణంగా ఎన్నికలు అంటేనే రాజకీయ పార్టీల నాయకులకు పండుగ అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుత ఉప ఎన్నికలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అన్ని పార్టీలకు స్థానికంగా బాధ్యతలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఇన్‌చార్‌్జలు వచ్చారు. వారంతా సభలు, సమావేశాలు, ప్రచార వ్యవహారాలు, జన సమీకరణ వంటి అన్ని అంశాలు చూసుకుంటున్నారు. దీంతో స్థానిక నేతలకు ఎలాంటి పని లేకుండా పోయింది. కేవలం అసిస్టెంట్లుగానే మారారు. ఇదిలా ఉంటే జన సమీకరణ, ఇతర విషయాల్లో ఆయా పార్టీల్లోని కొంత మంది స్థానిక నేతలకు కాసుల వర్షం కురిపిస్తే మరి కొందరికి మాత్రం కష్టాలు ఎదురవుతున్నాయి. కొందరు ఇన్‌చార్జ్‌లు స్థానిక నేతల ద్వారానే కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మరి కొందరు మాత్రం స్వయంగానే చూసుకుంటున్నారు. ఏదేమైనా ఇన్‌చార్‌్జల రాకతో అన్ని పార్టీల్లో లోకల్ లీడర్లకు మాత్రం నాలుగు పైసలు వెనుకేసుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. -
మునుగోడు ఉప ఎన్నికలో వారే కీలకం.. గెలుపోటములు వారి చేతిలోనే!
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో 30 ఏళ్లలోపు వయసు ఓటర్లు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కానున్నారు. మిగతా వయసు వారితో 30–39 ఏళ్లవారు ఎక్కువగా ఉండగా.. ఆ తర్వాత 30 ఏళ్లలోపువారి సంఖ్యే ఎక్కువగా ఉంది. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న 18–19 ఏళ్లవా రు 8,432 మంది ఉంటే.. 20 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వయసువారు ఏకంగా 51,131 మంది ఉన్నారు. అంటే 59,563 మంది ఓటర్లు 30ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. ప్రసన్నం చేసుకునే దిశలో.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మొదట్లో లక్ష ఓట్లను సాధించడం టార్గెట్‌గా పెట్టుకోగా.. కొత్త ఓటర్లతో సంఖ్య పెరగడంతో ఇప్పుడు లక్షా 25వేల ఓట్ల టార్గెట్‌తో పనిచేస్తున్నాయి. విపరీతమైన పోటీకారణంగా ఈసారి పోలింగ్ 90శాతానికి పైగా నమోదుకావచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో యు వ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో యువతపై పట్టున్న స్థానిక నాయకులను తమవైపు తిప్పుకొనేందుకు తాయిలాలు ఇస్తున్నాయి. ఆయా నేతల స్థాయిని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షలదాకా ఇచ్చేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. కొత్త ఓటర్లు 15,134 మంది ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన అక్టోబర్ 4వ తేదీ నాటికి ఓటు నమోదు, సవరణల కోసం 25,831 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 15,134 మంది ఓట్లు/సవరణలను ఆమోదించారు. మరో 10,696 మంది దరఖాస్తులను తిరస్కరించగా, ఒకరి దరఖాస్తు పెండింగ్‌లో పెట్టారు. -
Munugode Bypoll: ఆన్లైన్లో డబ్బులు పంపిణీ.. రిజర్వ్ బ్యాంక్ సాయం కోరతాం
సాక్షి, హైదరాబాద్: ‘‘మునుగోడు నియోజకవర్గంలో ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్స్ ద్వారా నగదు బదిలీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై నల్లగొండ జిల్లా కలెక్టర్ నుంచి సమగ్ర నివేదిక కోరాం. నివేదిక వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటాం’’అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్ తెలిపారు. ఓటర్లను ఇలా ప్రలోభాలకు గురిచేసే వారిని గుర్తించి, చర్యలు తీసుకునేందుకు రిజర్వు బ్యాంకు, ఇతర బ్యాంకుల సహకారాన్ని కోరే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. అయితే దీనిపై జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వికాస్‌రాజ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కొత్త ఓటర్లపై కోర్టు తీర్పు మేరకు నిర్ణయం మునుగోడులో 24 వేలకుపైగా కొత్త ఓటర్ల నమోదుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. మా వాదనలు వినిపించాం. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? ఎన్ని ఆమోదించాం? ఎన్ని తిరస్కరించాం? కారణాలేమిటన్నది కోర్టుకు వివరించాం. కోర్టు తీర్పు ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. వేలకోట్ల కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారంటూ టీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. టీఆర్ఎస్ పేరుమార్పుపై సమాచారం లేదు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చాలంటూ ఆ పార్టీ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. పార్టీ పేరు మార్పునకు అనుమతిపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మాకు ఎలాంటి సమాచారం కోరలేదు. పార్టీ పేరు మార్పునకు అనుమతి విషయంలో ఇంకా ఈసీఐ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. ఇక చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందన్న ఫిర్యాదుపై డీజీపీ, జిల్లా ఎస్పీల నుంచి నివేదిక కోరాం. ఇంకా అందలేదు. ఎక్కువ మంది ఉన్నా నిర్వహించగలం గతంలో నిజామాబాద్ స్థానం నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేసినా విజయవంతంగా ఎన్నికలు జరిపాం. మునుగోడులో ఇప్పటివరకు 40 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లను తెప్పించి సిద్ధంగా పెట్టాం. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలకుగాను గురువారం నాటికి 2,40,287 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికకు పాత ఈవీఎంలనే వాడుతున్నాం. ఒక పోలింగ్ కేంద్రానికి ఒక కంట్రోల్ యూనిట్ సరిపోతుంది. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 2,126 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేస్తున్నాం. 1,500 మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమిస్తున్నాం. 10 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి 2,500 మందిని పోలింగ్ బందోబస్తు విధులకు వాడుకుంటాం. ప్రలోభాల కట్టడికి కఠిన చర్యలు మునుగోడు నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో 113 పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేయిస్తున్నాం. మరో 45 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, వీడియో స్క్వాడ్స్, అబ్జర్వర్ల బృందాలు పరిశీలన జరుపుతున్నాయి. ఇప్పటివరకు రూ.20 లక్షల నగదు, రూ.16.2 లక్షల విలువ చేసే మద్యం జప్తు చేశాం. రోజువారీ మద్యం విక్రయాలపై నిఘా పెట్టాం. నియోజకవర్గంలోని 70 బెల్ట్ షాపులను మూయించాం. మద్యం సంబంధిత కేసుల్లో 60 మంది అరెస్టయ్యారు. అనుమతి లేని ప్రాంతాల్లో బ్యానర్లు, పోస్టర్లు అంటించడం వంటి ఘటనల్లో 15వేలకుపైగా కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. -
Munugode Bypoll: గూగుల్ పే ఓకేనా.. ఫోన్ పే చేయాలా?
సాక్షి, నల్లగొండ/చౌటుప్పల్‌రూరల్: ఓట్ల కొనుగోళ్లలోనూ డిజిటల్ లావాదేవీలు వచ్చేస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తులకు పైఎత్తులువేస్తూ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే యత్నం చేస్తున్నారు. ఓటర్లకు గతంలో మద్యం, డబ్బులు ఆశగా చూపి తమవైపు మళ్లించుకునే పార్టీలు ఈ ఉపఎన్నికలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ బూత్ వారీగా నియమించిన ఇన్చార్జులు తమకు కేటాయించిన 100 మంది ఓటర్లను కలుస్తూ డిజిటల్ లావాదేవీలవైపు మళ్లిస్తున్నారు. నియోజకవర్గంలో ఓటర్లను కలుస్తున్న బూత్ ఇన్చార్జులు, సహ ఇన్చార్జులు.. రోజువారీ గా ఎంత మంది ఓటర్లను కలిశారు.. ఎవరెవరిని కలిశారన్న వివరాలను రాష్ట్ర పార్టీకి చేరవేస్తున్నారు. వారితో ఫొటోలు దిగి వాట్సాప్ ద్వారా పంపుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఎవరెవరికి ఉంది.. గూగుల్ పే ఎవరికి ఉంది.. ఫోన్ పే ఎవరికి ఉందన్న వివరాలనూ పంపుతున్నారు. తమకు కేటాయించిన ఓటర్ల చుట్టూ తిరుగుతూ వారు అడగకముందే హామీలిచ్చి తమవైపు మళ్లించుకుంటున్నారు. చౌటుప్పల్ ప్రచారంలో ఈ సందడి నెలకొంది. ఫోన్‌పే, గూగుల్‌పే లేదంటే... ఫోన్‌పే, గోగుల్ పే లేనివారికి నగదు రూపంలోనే డబ్బులు అందించేలా ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అవి రెండు ఉన్నవారికి మాత్రం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేలా వారి ఫోన్ నంబర్లను రాసి పెట్టుకుంటున్నారు. ఇతర ఊళ్లు, జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను ఓటింగ్‌కు రప్పించేలా వారితో ఫోన్లో మాట్లాడి ఒప్పిస్తున్నారు. అలాంటి వారికి ముందుగానే ఆన్లైన్లో డబ్బు జమ చేసి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గోవా ట్రిప్ కోసం.. యువతను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. చౌటుప్పల్ మండలంలోని ఓ గ్రామంలో ఓ పార్టీ గోవా ట్రిప్‌కు ప్లాన్ చేస్తోందని సమాచారం. 10మంది యువకులు ఉండి, పార్టీ కండువాలు కప్పుకుంటే రూ.10 వేల చొప్పున ఖర్చులకు ఇచ్చి, విమానంలో వెళ్లి వచ్చేలా టికెట్లు ఇప్పించనున్నారని తెలిసింది. ఈ ఆఫర్‌కు 2గ్రూపులు ముందుకు వచ్చాయని సమాచారం. వచ్చే నాలుగైదు రోజుల్లో గోవాకు వెళ్లొచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. నగదు రూపంలో అడ్వాన్స్‌లు ఓటర్లకు ఓ పార్టీ నగదు రూపంలో అడ్వాన్స్‌లిస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన లీడర్లు తమ ఊళ్లలో అధిక ఓట్లను సాధించి, అభ్యర్థి మెప్పుపొందేందుకు ఓ గ్రామంలో ఓటర్లకు అడ్వాన్స్‌లు ఇస్తున్నారు. దసరా పండుగ రోజు కొన్ని కుటుంబాలకు రూ.2వేల చొప్పున ఇచ్చిన నాయకులు.. ఎన్నికలప్పుడు అవతలి పార్టీ వారు ఇచ్చిన దానికంటే ఎక్కువే ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. తటస్థంగా ఉంటేనే మేలని.. పార్టీ కండువా కప్పుకొని తిరిగితే ఒక పార్టీ వారే డబ్బులు ఇస్తారని అదే తటస్థంగా ఉంటే మూడు పార్టీలు ఇస్తాయనే ఆలోచనల్లో కొంతమంది చోటామోటా నాయకులున్నారు. చౌటుప్పల్ మండలంలోని జైకేసారం గ్రామంలో ఇప్పటిదాకా రాజకీయాల్లో తిరిగిన ఓ చోటా నాయకుడు ఇప్పుడు ఆ పార్టీ వైపు వెళ్లడం లేదు. రూ.5 లక్షలిస్తే పార్టీలో తిరుగుతా అని చెబుతున్నాడట. ఇది తెలిసిన ఓ పార్టీ రూ.2 లక్షలు ఇచ్చేందుకు ముందుకొచ్చిందని సమాచారం. -
మళ్లీ బీజేపీ వైపే హిమాచల్ ఓటర్లు
మండి: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లో మాదిరిగా మళ్లీ బీజేపీకే అధికారమివ్వాలని హిమాచల్ ఓటర్లు నిశ్చయించుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండికి చెందిన బీజేపీ యువజన విభాగం కార్యకర్తలనుద్దేశించి ప్రధాని శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. అననుకూల వాతావరణం కారణంగా మండిలోని పడ్డల్ మైదాన్‌లో భారతీయ జనతా యువమోర్చా ఏర్పాటు చేసిన ‘యువ విజయ్ సంకల్ప్ ర్యాలీ’కి హెలికాప్టర్ ద్వారా చేరుకోవడం సాధ్యం కాకపోవడంతో ఆయన ఆన్లైన్లోనే ప్రసంగించారు. ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చాలన్న సంప్రదాయాన్ని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఓటర్లు పక్కనబెట్టారని ఆయన చెప్పారు. అదేవిధంగా, బీజేపీ పాలన, అభివృద్ధి పనులను చూసి హిమాచల్ ఓటర్లు, యువత కూడా మరోసారి బీజేపీయే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. బీజేపీ యువత ప్రాతినిథ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఫార్మా హబ్‌గా రూపుదాలుస్తోందని, డ్రోన్ విధానం రూపకల్పనలో ముందుందని చెప్పారు. -
కోటి మంది ఓటర్లు ఆధార్‌తో అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోటి మంది ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసుకుని దేశంలోనే రికార్డు సృష్టించార ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈ వో) వికాస్ రాజ్ తెలిపారు. గత ఆగస్టు 1న ప్రారంభించిన ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధాన కార్యక్రమానికి రాష్ట్రంలో మంచి స్పందన లభించిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం సహా యక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) చొరవ తో రాష్ట్రంలో 40 లక్షలమంది ఓటర్లు ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నా రని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ హెచ్‌జీల సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఓటరు గుర్తింపుకార్డుల తో ఆధార్ అనుసంధానం స్వచ్ఛందంగా జరుగుతోందని స్పష్టం చేశారు. జిల్లా కలెక్ట ర్లు అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల ఆధార్ వివరాలు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఈ లెక్క సరైనదేనా?
వివాదం ముందు పుట్టి కశ్మీర్ తర్వాత పుట్టిందంటే అతిశయోక్తి కాదేమో! స్వతంత్ర భారతదేశంలో విలీనం దగ్గర నుంచి ఇవాళ్టి దాకా జమ్మూ – కశ్మీర్‌ను చుట్టుముట్టినన్ని వివాదాల కథ అలాంటిది మరి. జమ్మూ – కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370వ అధికరణం రద్దు తర్వాత గత మూడేళ్ళలోనూ ఇదే వరుస. ఓటర్ల జాబితా సవరణ అంశం ఆ జాబితాలో తాజాగా వచ్చి చేరింది. దేశంలోని ఈ అతి పిన్న వయసు కేంద్ర పాలిత ప్రాంతంలో ‘సాధారణంగా నివసిస్తున్నవారు’ సైతం ఓటర్లుగా నమోదు చేయించుకోవచ్చంటూ జమ్మూ – కశ్మీర్ ఎన్నికల ప్రధానాధికారి ఆగస్ట్ 17న ప్రకటించారు. బీజేపీ మినహా అక్కడి రాజకీయ పార్టీలన్నీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజా అనుమతితో గేట్లు ఎత్తేసినట్టేననీ, చివరకు స్థానిక ప్రజలు ఎన్నికల మైనారిటీగా మారిపోతారనీ రచ్చ రేగుతోంది. మునుపటి జమ్మూ– కశ్మీర్ రాష్ట్రంలో శాశ్వతవాసులే ఓటర్లుగా అర్హులు. అలా కానివారు సైతం ఇప్పుడు ఓటు వేయడానికి అర్హులే అన్నది ఎన్నికల ప్రధానాధికారి మాట. ఆర్టికల్ 370 రద్దుతో 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం అందుకు అవకాశమిస్తోందనేది ప్రాతిపదిక. దీని వల్ల జమ్మూ – కశ్మీర్ తుది ఓటర్ల జాబితాలో 20 – 25 లక్షల మంది ఓటర్లు కొత్తగా చేరతారని అంచనా. అలాగే, ఆ ప్రాంతంలో నియుక్తులైన దాదాపు 7 లక్షల భద్రతా దళ సిబ్బందీ ఓటర్లుగా నమోదు చేసుకొని, సరి కొత్త కేంద్రపాలిత ప్రాంతపు తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనవచ్చు. ఈ వైఖరే ఇప్పుడు స్థానిక ప్రధాన పార్టీల్లో అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఇది స్థానికేతరుల్ని ఓటర్లుగా చేర్చి, వారికి ఓటుహక్కు కల్పించే పన్నాగమనీ, స్థానికులు మైనారిటీగా మారిపోతారనీ, ఎన్నికల్లో వారి ప్రాధా న్యం తగ్గిపోతుందనీ నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ, సీపీఎం వగైరాల ఆరోపణ. దాదాపు దశాబ్ద కాలం తర్వాత తొలిసారిగా ఎన్నికల దిశగా వెళుతున్న కశ్మీర్లో 2019 ఆగస్ట్ 5న ఆర్టికల్ 370 రద్దుతో ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడమే పెను వివాదమైంది. ఆ పైన ప్రధాన పార్టీల నేతల్ని నిర్బంధంలో ఉంచడం మరో వివాదం. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపైనా ఆరోపణలొచ్చాయి. ఏడు అసెంబ్లీ స్థానాలు సృష్టిస్తే, 6 జమ్మూకు, ఒకటే కశ్మీర్‌కు దక్కాయి. ముస్లిమ్‌ల మెజారిటీ ఉన్న కశ్మీర్‌ను తగ్గించి, హిందూ మెజారిటీ జమ్మూకు రాజకీయ ప్రాధాన్యం దక్కేలా ఈ ప్రక్రియ సాగిందనే విమర్శ ఎదురైంది. తీరా ఎన్నికలకు వెళ్ళే ముందు ఆఖరు పనిగా 25 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చుకొనే తాజా ప్రతిపాదన అగ్నికి ఆజ్యం పోసింది. అయితే, ఈ కొత్త ఓటర్లలో అధిక శాతం మంది మునుపటి ఓటర్ల జాబితా సవరణ తర్వాత 18 ఏళ్ళు నిండినవారన్నది కశ్మీర్ ఎన్నికల యంత్రాంగం చెబుతున్న వివరణ. ఆ మాటతో స్థానిక పార్టీలు ఏకీభవించడం లేదు. 1987 నాటి తప్పులడక కశ్మీర్ ఎన్నికల లానే, ఇప్పుడీ తాజా నిర్ణయం తీసుకున్నారని పోలికలు తెస్తున్నాయి. అప్పట్లో అలా తప్పుదోవలో ఎన్నికల వల్లే, ఆ వెంటనే 1990లలో కశ్మీర్లో తీవ్రవాదం చెలరేగిందని పార్టీల వాదన. ఇప్పటికీ ఆ దెబ్బ నుంచి కశ్మీర్ కోలుకోలేదు. మళ్ళీ అదే 1987 నాటి వ్యవహారశైలిలో వెళితే ఉపద్రవమే అని హెచ్చరిస్తున్నాయి. యువతలో నిరుద్యోగం, స్థానికంగా పెరుగుతున్న అశాంతి సహా కశ్మీర్లో అనేక సమస్యలున్నాయి. 20 – 29 ఏళ్ళ మధ్య వయస్కుల్లో 55 శాతం మంది నిరుద్యోగులే. జాతీయ సగటుతో పోలిస్తే ఇది రెట్టింపు. నిరుద్యోగ యువతకు ఆర్థిక అవకాశాల కల్పన, కశ్మీర్‌ను మళ్ళీ పర్యాటక స్వర్గంగా మార్చడం లాంటి అనేక సవాళ్ళు రానున్న సర్కారుకున్నాయి. వీటన్నిటినీ పరిష్కరించడానికి ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం కావాలి. కశ్మీర్ ఎన్నికల నిర్వహణ ఓ బృహత్తర కార్యం అంటున్నది అందుకే! ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం నిష్పాక్షిక అంపైర్‌లా వ్యవహరించడమే కాదు... కనిపించాలి, అందరికీ అనిపించాలి కూడా! ప్రస్తుతం ప్రత్యేక ప్రతిపత్తి లేనందు వల్ల దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లానే జమ్మూ– కశ్మీర్‌లోనూ మామూలుగా నివసిస్తున్న వారందరికీ ఓటు హక్కునివ్వడం సరైన చర్యే కావచ్చు. అక్కడ సాధారణ పరిస్థితులు తీసుకురావడానికే ఈ చర్యలనీ చెప్పవచ్చు. అయితే, ఆలోచనతో పాటు ఆచరణలోనూ చిత్తశుద్ధి, ముందు జాగ్రత్త అవసరం. కశ్మీర్లో రాజకీయ ప్రక్రియకు ఊతమివ్వడానికే ఈ ఓటర్ల జాబితా సవరణ అనుకున్నా, అందుకు సంబంధిత వర్గాలన్నిటినీ ఒప్పించి, ఒక్క తాటి పైకి రప్పించడం కీలకం. రేపు ఎన్నికల ఫలితాలకు జనామోదం ఉండాలంటే, సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలంటే, శాంతి నెలకొనాలంటే అది తప్పనిసరి. 2014 తర్వాత ఎన్నికలే జరగని కశ్మీర్ మెరుగైన ప్రాథమిక వసతులు, జీవన ప్రమాణాల కోసం ఎదురు చూస్తోంది. రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని స్థానిక ప్రజల, పార్టీల దీర్ఘకాలిక డిమాండ్. కేంద్రం సైతం కశ్మీర్‌ను మళ్ళీ పట్టాలెక్కించేందుకు కంకణబద్ధులమై ఉన్నామంటూ పార్లమెంట్లో చాలాకాలం క్రితమే రోడ్ మ్యాప్ ప్రకటించింది. అపనమ్మకాన్ని పోగొట్టి, ఆ మార్గాన్ని సుగమం చేయడం అటు కేంద్రం, ఇటు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా పారదర్శకంగా ఉండాలి. స్థానిక ప్రజల, పార్టీల అనుమానాలన్నిటినీ ముందే నివృత్తి చేయాలి. మూడేళ్ళలో 25 లక్షల్లో పెరిగాయంటున్న ఈ ఓటర్ల లెక్కను చర్చకు పెట్టి, అవసరమైతే ప్రక్రియలోనూ, లెక్కల్లోనూ తప్పులు సరిదిద్దుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే అన్ని పక్షాల నమ్మకం చూరగొనడం సాధ్యం. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయంగా ఉంటేనే, ఎన్నికైన ప్రభుత్వానికీ విశ్వసనీయత. అదే లేకుంటే, ఎన్నికలు పెట్టినా మిగిలేది అనుమానాలు, ఆరోపణలే! -
వాళ్లను విశ్లేషించడం మూర్ఖత్వం!
‘‘నాకు తెలిసిన ఓ రిటైర్డ్ పోలీసాఫీసర్ కొండా మురళిగారి గురించి చెప్పారు. ఆ తర్వాత మాజీ నక్సలైట్లతో మాట్లాడాను. కథ ఒక కొలిక్కి వచ్చాక కొండా ఫ్యామిలీని కలిసి, సినిమా గురించి చెబితే వారు ఒప్పుకున్నారు’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘కొండా’. త్రిగుణ్, ఇర్రా మోర్ జంటగా నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్‌పై కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘కొండా మురళి, సురేఖల కాలేజీ జీవితం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు (1990 నుంచి 2000) ఈ సినిమా ఉంటుంది. కొండా దంపతుల కుమార్తె సుష్మిత ఈ చిత్రనిర్మాత కాబట్టి వాళ్లకు పాజిటివ్‌గా తీయలేదు.. తను నిర్మాత కాకున్నా నేను అనుకున్నది తీసేవాణ్ణి. ప్రస్తుతం ‘లడకీ’ అనే ఓ హిందీ చిత్రం తీశాను. అమితాబ్ బచ్చన్‌గారితో ఓ హారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. మనం చేసేది మనం చేస్తాం.. పరిస్థితులు ఇంకోటి చేస్తాయి. నాలుగు నెలల క్రితం ‘సినిమా టికెట్ రేట్లు తగ్గించి సినిమాలను చంపేస్తున్నారు’ అన్నారు. ఆ తర్వాత రేట్లు పెంచారు. ఇప్పుడు మళ్లీ తగ్గించారు. పరిస్థితులను బట్టి మారాల్సి వస్తుంది. ప్రేక్షకుడిని, ఎన్నికల్లో ఓటు వేసేవాళ్లను విశ్లేషించడమంత మూర్ఖపు పని ఇంకొకటి ఉండదు’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ.