మిజోరంలో 2023, నవంబరు 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎన్నికల బరిలోకి దిగిన మొత్తం 174 మందిలో 112 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. అభ్యర్థుల అఫిడవిట్ల ప్రకారం 64.4 శాతం మంది అభ్యర్థులు రూ. కోటి లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు.
సంపన్న అభ్యర్థులలో ముందుగా వినిపించే పేరు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్రూ లాల్రెంకిమా పచువా. ఆయన రూ.69 కోట్లు విలువ చేసే ఆస్తులు కలిగివున్నారు. ఆయన ఐజ్వాల్ నార్త్-III నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇతని తరువాత సెర్చిప్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌కు చెందిన ఆర్ వన్‌లాలత్లుంగా రూ.55.6 కోట్ల ఆస్తులు కలిగివున్నారు. చంపై నార్త్ నుంచి పోటీ చేస్తున్న జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌కు చెందిన హెచ్ గింజలాలా రూ.36.9 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. అఫిడవిట్ ప్రకారం సెర్చిప్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థి రామ్‌లున్-ఎడెనా అత్యంత పేద అభ్యర్థి. ఇతని దగ్గర 1500 విలువైన చరాస్తులున్నాయి.
టుయిచాంగ్ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి తవాన్‌పుయ్ అభ్యర్థులలో అత్యధిక వయసు కలిగిన వ్యక్తి. ఆయనకు 80 ఏళ్లు. బీజేపీ అభ్యర్థి ఎఫ్ వాన్‌హమింగ్‌తంగా(31) ఎన్నికల బరిలోకి దిగిన అతి పిన్న వయస్కురాలు.
ఇది కూడా చదవండి: అత్యాచార బాధితురాలిని పట్టించుకోని శివరాజ్ సర్కార్!
Comments
Please login to add a commentAdd a comment