mizoram
-
డబుల్ సెంచరీతో చెలరేగిన బాలీవుడ్ దర్శకుడి కొడుకు
ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మిజోరాం స్టార్ ప్లేయర్, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా తనయుడు అగ్ని చోప్రా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో భాగంగా నాడియాడ్ వేదికగా మణిపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అగ్ని చోప్రా అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.తొలి ఇన్నింగ్స్‌లో మణిపూర్ బౌలర్లను చోప్రా ఉతికారేశాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ తన రెండో ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 269 బంతులు ఎదుర్కొన్న అగ్ని చోప్రా.. 29 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 218 పరుగులు చేసి ఔటయ్యాడు.కాగా ఈ ప్రస్తుత రంజీ సీజన్లో చోప్రాకు ఇది వరుసగా రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్ కంటే ముందు అరుణాచల్ ప్రదేశ్‌పై సెకెండ్ ఇన్నింగ్స్‌లో చోప్రా ద్విశతకం సాధించాడు. అదే మ్యాచ్‌లో చోప్రా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కూడా నమోదు చేయడం గమనార్హం.ఈ ఏడాది సీజన్లో చోప్రా కేవలం ఐదు ఇన్నింగ్స్‌లలో 646 పరుగులు లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే.. చోప్రా విధ్వంసకర డబుల్ సెంచరీ ఫలితంగా మిజోరాం తొలి ఇన్నింగ్స్‌లో 536 పరుగుల భారీ స్కోర్ సాధించింది.చదవండి: WI vs SL: మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ..! కట్ చేస్తే.. విధ్వంసకర సెంచరీ -
కుప్పకూలిన క్వారీ.. పది మంది మృతి
ఐజ్వాల్: మిజోరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ రాతి క్వారీ కుప్పకూలి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఐజ్వాల్ జిల్లాలో జరిగిన క్యారీ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరికొంత మంది క్యారీలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.#Mizoram: 2 killed, many feared dead after stone quarry collapses in #AizawlTwo individuals were killed after a stone quarry collapsed in Aizawl’s Melthum and Hlimen border on May 28 around 6 am after #CycloneRemal wreaked havoc across Mizoram, as per latest reports.… pic.twitter.com/rCr7cExMGX— India Today NE (@IndiaTodayNE) May 28, 2024క్యారీలో చిక్కుకున్నవారిని రెస్య్కూ చేసి బయటకు తీసుకురావటానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. భారీ వర్షం, కొండచరియలు విరిగిపడే ప్రాంతం సెర్చ్ ఆపరేషన్‌కు ప్రతికూలంగా మారిందని వెల్లడించారు.10 Dead, Several Feared Trapped As Stone Quarry Collapses In Mizoram https://t.co/8B5FGdvLz6— Priyanka Krishnadas (@pri3107das) May 28, 2024 మరోవైపు భారీ వర్షం కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులుకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. అదే విధంగా కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో హైవేలు, కీలక రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. హుంతూర్ వద్ద జాతీయ రహదారి 6పై కొండచరియలు విరిగిపడటంతో ఐజ్వాల్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఆదివారం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లో రెమాల్ తుపాన్ బిభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. -
నాడు టీవీ యాంకర్.. నేడు అసెంబ్లీ స్పీకర్!
Mizoram First Woman Speaker : అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈశాన్య రాష్ట్రం మిజోరాం రాజకీయాల్లో చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. 40 మంది సభ్యులున్న మిజోరాం రాష్ట్ర అసెంబ్లీకి మొట్టమొదటి సారిగా ఓ మహిళ స్పీకర్‌గా నియమితులయ్యారు. జోరెమ్ పీపుల్స్ మూవ్మెంట్ నాయకురాలు, ఎమ్మెల్యే బారిల్ వన్నెహసాంగి మార్చి 7న జరిగిన అసెంబ్లీ సెషన్లో స్పీకర్ స్థానాన్ని అధిష్టించారు. మిజోరాం అసెంబ్లీకి ఇది ఒక ముఖ్యమైన చారిత్రక మైలురాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి, జోరెమ్ పీపుల్స్ మూవ్మెంట్ అగ్రనేత లాల్దుహోమా పేర్కొన్నారు. సాంప్రదాయ పరిమితులను దాటుకుని రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు ఈ మైలురాయి ఒక ప్రేరణగా నిలుస్తుందన్నారు. మిజోరాం మొదటి మహిళా స్పీకర్ బారిల్ వన్నెహసాంగి మార్చి 7న మిజోరాం మొదటి మహిళా అసెంబ్లీ స్పీకర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రంలో మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం చూపారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో జోరెమ్ పీపుల్స్ మూవ్మెంట్ కి చెందిన వన్నెహసంగి ఒకరు. మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి ఎఫ్. లాల్నున్మావియాపై ఆమె 9,370 ఓట్ల తేడాతో గెలుపొందారు. రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా కూడా 32 ఏళ్ల బారిల్ వన్నెహసాంగి చరిత్ర సృష్టించారు. రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకముందు వన్నెహసాంగి ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్‌గా పనిచేశారు. మేఘాలయలోని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ నుండి ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె టెలివిజన్ యాంకర్‌గా పనిచేశారు. వన్నెహసాంగికి ఆకట్టుకునే సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
5 వికెట్లతో చెలరేగిన తనయ్.. హైదరాబాద్ ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో హైదరాబాద్ జట్టు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఇన్నింగ్స్ విజయాలు సాధించి 35 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. ఆరు జట్లున్న ప్లేట్ డివిజన్లో భాగంగా మిజోరం జట్టుతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది. ఆట మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 458/8తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 9 వికెట్లకు 465 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 266 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మిజోరం 43.1 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 74 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈనెల 9 నుంచి జరిగే సెమీఫైనల్స్‌లో నాగాలాండ్‌తో హైదరాబాద్; మేఘాలయతో మిజోరం ఆడతాయి. ఫైనల్ చేరిన రెండు జట్లు వచ్చే ఏడాది రంజీ ట్రోఫీ సీజన్లో ఎలైట్ డివిజన్లో ఆడతాయి. చదవండి: NZ vs SA: రచిన్ రవీంద్ర విధ్వంసం.. ఏకంగా డబుల్ సెంచరీతో -
చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా కుమారుడు, మిజోరాం ఆటగాడు అగ్ని చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తన తొలి నాలుగు మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా అగ్ని చోప్రా ప్రపంచ రికార్డు సాధించాడు. రంజీ ట్రోఫీ-2024లో భాగంగా మేఘాలయాతో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలతో చెలరేగిన చోప్రా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌తో రంజీల్లోకి అరంగేట్రం చేసిన చోప్రా.. సిక్కింతో తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులు చేసిన అగ్ని, రెండో ఇన్నింగ్స్‌లో 92 పరుగులు సాధించాడు. అనంతరం నాగాలాండ్, అరుణాచాల్ ప్రదేశ్‌పై సెంచరీలతో కదం తొక్కాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు తన ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ సెంచరీతో మెరిశాడు. ఈ ఏడాది రంజీ సీజన్లో 4 మ్యాచ్‌లు ఆడిన చోప్రా.. 767 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఈ మధ్యే 12th ఫెయిల్ మూవీతో భారీ విజయం అందుకున్న విధు వినోద్ చోప్రా ఇప్పుడు పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. చదవండి: Mayank Agarwal: ఆ బాటిల్ తీసుకుని తాగగానే వాంతులు.. భయంకర పరిస్థితి -
మిజోరాంలో ప్రమాదానికి గురైన మయన్మార్ సైనిక విమానం..
ఐజ్వాల్: మిజోరంలో మయన్మార్ ఆర్మీకి చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. మయన్మార్ నుంచి వచ్చిన సైనిక విమానం రన్‌వేపై దిగుతుండగా అదుపు తప్పి కొంత దూరంలో ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. మిజోరాంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 13 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తమ దేశంలో జరుగుతున్న అతర్యుద్ధం కారణంగా సరిహద్దుల దాటి భారత్‌లోని మిజోరం రాష్ట్రంలోకి చొరబడిన మయన్మార్ సైనికులను స్వదేహానికి తీసుకెళ్లేందుకు ఈ విమానం వచ్చిన సమయంలో ప్రమాదం జరిగింది. కాగా టేబుల్‌టాప్ రనేవేలు (పీఠభూమి లేదా ఎత్తైన కొండ పైభాగం ప్రాంతాల్లో నిర్మించిన రన్‌వే) సవాలుతో కూడుకొని ఉన్నాయి. ఇలాంటి రన్‌వేలో భారత్‌లో ఆరు మాత్రమే ఉన్నాయి. వీటి వల్ల విమానాలు ల్యాండింగ్ అవుతున్న సమయాల్లో రన్‌వే నుంచి జారిపోయే ప్రమాదం ఉంటుంది. చదవండి: భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేదు.. ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు ఇక మయన్మార్‌లో తిరుగుబాటు గ్రూపులతో జరుగుతోన్న తీవ్ర ఘర్షణల నేపథ్యంలో ఆ దేశం నుంచి భారీగా సైనికులు భారత్‌లోకి చొరబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత వారం మొత్తం 276 మంది మయన్మార్ సైనికులు మిజోరాంలోకి ప్రవేశించారని, వీరిలో 184 మంది సైనికులను భారత్ సోమవారం వెనక్కి పంపినట్లు అస్సాం రైఫఙల్స్ సోమవారం పేర్కొంది. స్వతంత్ర రాఖైన్ రాష్ట్ర కోసం పోరాటం చేస్తున్న మయన్మార్ తిరుగుబాటు బృందం ‘అరాకన్ ఆర్మీ’ సాయుధులు గతవారం దేశ సైనిక క్యాంప్‌పై దాడి చేసి ఆక్రమించుకున్నారు. దీంతో మయన్మార్ సైనికులు మిజోరాంలోని లాంగ్ట్లై జిల్లాలోని భారత్-మయన్మార్-బంగ్లాదేశ్ ట్రైజంక్షన్ వద్ద ఉన్న బందుక్‌బంగా గ్రామం ద్వారా దేశంలోకి ప్రవేశించి అస్సాం రైఫిల్స్ క్యాంప్‌లో లొంగిపోయారు. వీరి వద్ద ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా ఉన్నాయి. మయన్మార్ సైనికులను పర్వాలోని అస్సాం రైఫిల్స్ శిబిరానికి తరలించారు. అనంతరం వారిని లుంగ్లీకి మకాం మార్చారు. ఐజ్వాల్ సమీపంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుండి మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలోని సిట్వేకు మయన్మార్ వైమానిక దళానికి చెందిన విమానాల్లో సైనికులను స్వదేశానికి పంపే ప్రక్రియ ప్రారంభించినట్లు అస్సాం రైఫిల్స్ అధికారి ఒకరు తెలిపారు. మిగిలిన 92 మంది సైనికులను నేడు మయన్మార్ తరలిస్తామని చెప్పారు. -
భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మయన్మార్ ప్రభుత్వ ఆర్మీ(జుంటా) సైనికులు భారత్‌లోకి చొచ్చుకురావటంపై కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయటంలో భాగంగా భారత సరిహద్దుల వెంట త్వరలో పటిష్టమైన కంచెను ఏర్పాటు చేయనున్నట్లు హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎలాంటి కంచె ఉందో.. ఇక్కడ (భారత్-మయన్మార్) సరిహద్దు వద్ద కూడా చాలా పటిష్టమైన కంచె ఏర్పాటు చేస్తామని అన్నారు. దీంతో మనదేశంలోకి సరిహద్దులు దాటుకొని మయన్మార్ సైనికులు రావటం సాధ్యం కాదని పేర్కొన్నారు. సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్‌లో ఆశ్రయం పొందుతున్నారు. మయన్మార్ ఆర్మీ సైనికుల విషయాన్ని.. మిజోరం సీఎం లాల్దుహోమ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. భారత సరిహద్దుల్లోని మిజోరం ప్రాంతం నుంచి మయన్మార్ ఆర్మీ సైనికులను వెనక్కి పంపించాలని కేంద్రాన్ని ఆయన అభ్యర్థించిన విషయం తెలిసిందే. చదవండి: భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన -
భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన
గౌహతి: మయన్మార్‌లో కొన్ని రోజులుగా దేశ సైనిక ప్రభుత్వం, అక్కడి ప్రజాస్వామ్య సాయుధ దళాలకు మధ్య ఉద్రిత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మయన్మార్ ఆర్మీ(జుంటా) సైనికులు భారత సరిహద్దులు దాటి భారత్‌లోని మీజోరంకి వరుసకడుతున్నారు. దీంతో మిజోరం ప్రభుత్వం అప్రమత్తమైంది. మీజోరం భూభాగంలోకి చొచ్చుకువస్తున్న జుంటా సైనికులను వెంటనే మయన్మార్‌కు తిరిగి పంపిచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్‌లో ఆశ్రయం పొందుతున్నారు. పెద్ద ఎత్తున సరిహద్దు దాటుకొని మిజోరం వైపు వస్తున్న మయన్మార్ సైనికులను వెనక్కి పంపిచాలని మిజోరం సీఎం లాల్దుహోమ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరినట్లు మిజోరం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిత్త పరిస్థితుల నేపథ్యంలో తిరిగి స్థిరత్వం నెలకొల్పడానికి మయన్మార్ సైనికులు వెనక్కి పంపించాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఇక.. ఇటీవల తరచూ మయన్మార్ సైనికలు భారత సరిహద్దులు దాటుకొని మిజోరం రాష్ట్రంలోకి వస్తున్నారని మిజోరం సీఎం లాల్దుహోమ తెలిపారు. మనవతా సాయం కింద మయన్మార్ సైనికులకు తాము సైనిక క్యాంప్‌లో సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇలా 450 మంది జుంటా సైనికులను వెనక్కి పంపించినట్లు తెలిపారు. 2021 నుంచి మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం.. ఇక్కడి ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థల నుంచి తీవ్రమైన తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలు నగరాల్లోని సైనిక స్థావరాలను తిరుగుబాటు సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: గాంధీలను మించిన అవినీతి పరులు ఎవరైనా ఉంటారా? -
తీవ్ర గాయాలతో భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. ఏమైందంటే?
మయన్మార్ (బర్మా) చెందిన 151 మంది సైనికులు భారత్‌లోకి చొచ్చుకొని వచ్చారు. మిజోరం రాష్ట్రంలో గల సరిహద్దు జిల్లా లాంగ్ట్లైలోకి మమన్మార్ సైనికులు తరలివచ్చినట్లు అస్సాం రైఫిల్స్ అధికారి వెల్లడించారు. ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థ అయిన అరాకన్ ఆర్మీ(ఏఏ) ఆ దేశ సైన్యం ‘తత్మాదవ్’ క్యాంప్‌ను ధ్వంసం చేసింది. దీంతో మయన్మార్ సైన్యంలోని 151 మంది సైనికులు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోని మిజోరంలోకి ప్రవేశించారు. కాగా.. కొన్ని రోజులుగా భారత్ సరిహద్దుకు సమీపంలోని మయన్మార్ ప్రాంతంలో ఆ దేశ సైన్యానికి, ప్రజాస్వామ్య అనుకూల సాయుధ సంస్థ అరాకన్ ఆర్మీకి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం తీవ్రమైన గాయాలతో కొంతమంది సైనికులు భారత్‌లోకి వచ్చినట్లు ధ్రువీకరించారు. అయితే అస్సాం రైఫిల్స్ అధికారులు గాయపడిన మయన్మార్ సైనికులకు ప్రథమ చికిత్స అందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం మయన్మార్ సైనికులు అస్సాం రైఫిల్స్ కస్టడీలో మయన్మార్ సరిహద్దు వద్ద ఉన్నారని పేర్కొన్నారు. వారిని మయన్మార్ పంపించడానికి భారత దేశ విదేశాంగ శాఖ, మయన్మార్ మిలిటరీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయని అస్సాం రైఫిల్స్ అధికారులు తెలిపారు. మరోవైపు మయన్మార్‌లో సైనిక పాలనను కూలదోసి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి అక్కడి ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థలు ఉమ్మడిగా పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. త్రీబ్రదర్‌హుడ్ అలయన్స్ (టీబీఏ), మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (ఎంఎన్డీఏఏ), టాంగ్ జాతీయ విమోచన సైన్యం(టీఎన్‌ఎల్‌ఏ), అరాకన్ ఆర్మీ(ఏఏ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. చదవండి: హౌతీ రెబెల్స్‌ను మళ్లీ దెబ్బ కొట్టిన అమెరికా -
మిజోరం సీఎంగా లాల్దుహోమా ప్రమాణ స్వీకారం
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ నేషనలిస్ట్ పార్టీ (జెడ్ఎన్పీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం జెడ్ఎన్పీ అధినేత లాల్దుహోమా చేత ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో మిజోరంలో భారీ విజయం సాధించిన జెడ్ఎన్పీ నూతన ప్రభుత్వం నేడు కొలువుదీరింది. #WATCH | Aizawl, Mizoram: Zoram People's Movement (ZPM) leader Lalduhoma takes oath as the Chief Minister of Mizoram as the swearing-in ceremony begins pic.twitter.com/oCMbU2xVSf — ANI (@ANI) December 8, 2023 నవంబర్ 7న జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాల్లో జోరామ్ నేషనలిస్ట్ పార్టీ 27 స్థానాల్లో ఘన విజయం సాధించింది. మిజో నేషనల్ ఫ్రంట్ కేవలం 10 స్థానాలకే పరిమితమైంది. -
కలల సాధకులు... చరిత్ర సృష్టించారు
విజయానికి తొలి మెట్టు కల కనడం. కల కనడం ఎంత తేలికో ఆ కలను నిజం చేసుకోవడం అంత కష్టం. అయితే లక్ష్య సాధన వైపు బలంగా అడుగులు వేసే వారికి కలను నెరవేర్చుకోవడం కష్టం కాదని ఈ ఇద్దరు నిరూపించారు. మిజోరం నేపథ్యంగా చరిత్ర సృష్టించి వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు వన్నెహ్సోంగీ, మనీషా పధి... మిజోరంలో రాజకీయ సంప్రదాయాన్ని పక్కన పెట్టి అధికారంలోకి రాబోతున్న జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్పీఎం) గురించి మాట్లాడుకున్నట్లుగానే ఆ పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికైన బారిల్ వన్నెహ్సోంగి గురించి కూడా ఘనంగా మాట్లాడుకుంటున్నారు. రేడియో జాకీగా పని చేసిన 32 ఏళ్ల బారిల్ వన్నెహ్సోంగి ‘జెడ్పీఎం’ నుంచి శాసనసభకు ఎన్నికైన అత్యంత చిన్న వయస్కురాలైన మిజోరం శాసనసభ్యురాలిగా రికార్డ్ సృష్టించింది... మిజోరం శాసనసభ ఎన్నికల్లో జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్పీఎం) ఘన విజయం సాధించడమనేది రాత్రికి రాత్రే జరిగిన అద్భుతం కాదు. అదృష్టం కాదు. మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), కాంగ్రెస్‌లను దాటుకొని అధికారం లోకి రావడం అంత తేలిక కాదు. అయితే ‘జోరం పీపుల్స్ మూమెంట్’ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు. ‘మనకంటూ ఒకరోజు తప్పకుండా వస్తుంది’ అని గట్టిగా అనుకుంది. సరిగ్గా ఇదే స్ఫూర్తి వన్నెహ్సోంగిలో కనిపిస్తుంది. చలాకీగా, నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే వన్నెహ్సోంగి రాజకీయ, సామాజిక సంబంధిత విషయాలను మాట్లాడుతున్నప్పుడు మాత్రం ‘ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకరేనా’ అన్నట్లుగా ఉంటుంది. బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నవారికి సైద్ధాంతిక పునాది కూడా ముఖ్యం. కాలేజీ రోజుల నుంచే రాజకీయ దిగ్గజాలతో మాట్లాడడం, ఎన్నో పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో విషయాలపై సాధికారత సాధించగలిగింది వన్నెహ్సోంగి. హైస్కూల్ రోజుల నుంచి మొదలు మేఘాలయా రాజధాని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేసిన సమయం వరకు వన్నెహ్సోంగి ఎప్పుడూ విన్న మాట, బాధ పెట్టిన మాట ... ‘రాజకీయాలు మహిళలకు తగనివి. రాజకీయాల్లోకి వచ్చినా రాణించలేరు’ ఈ భావన తప్పు అని నిరూపించడానికి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఆమె మనసులో బలంగా పడింది. రేడియో జాకీగా, టీవి ప్రెజెంటర్‌గా పని చేసిన వన్నెహ్సోంగి ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. ‘రాజకీయాలు అంటే టీవి మైక్ ముందు మాట్లాడినంత తేలిక కాదు’ అని ముఖం మీదే అన్నారు చాలామంది. వారి మాటలతో డీలా పడలేదు వన్నెహ్సోంగి. తమ మీద తమకు నమ్మకం ఉన్న వారి దగ్గర ఢీ అంటే ఢీ అనే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతోనే తొలిసారిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి కార్పోరేటర్‌గా గెలిచింది. విశాల రాజకీయ ప్రపంచంలో కార్పోరేటర్‌గా గెలవడం చిన్న విజయమే కావచ్చుగానీ ఆ విజయం తనకు అపారమైన ధైర్యం ఇచ్చి– ‘యస్. నేను సాధించగలను’ అని ముందుకు నడిపించింది. మిజోరంలోని ఐజ్వాల్ సౌత్–3 నియోజక వర్గం నుంచి 1,414 ఓట్ల మెజార్టీతో గెలిచిన బారిల్ వన్నెహ్సోంగి ‘సంకల్పబలం ఉండాలేగానీ మన కలల సాధనకు జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాదు’ అంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌తో ఎంతోమందికి చేరువ అయింది వన్నెహ్సోంగి. ఇన్స్టాగ్రామ్ అనేది ఆమె ఇంటి పేరుగా మారింది. ఇన్‌స్టాలో ఆమెకు మూడు లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నారు. ‘భవిష్యత్ లక్ష్యం ఏమిటీ?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం...‘చదువు ద్వారా అద్భుతాలు సాధించవచ్చు. అభివృద్ధి పథంలో పయనించవచ్చు. అందుకే రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను’ అంటుంది వన్నెహ్సోంగి. యంగ్, ఎనర్జిటిక్ అండ్ డేరింగ్ అని అభిమానులు పిల్చుకునే వన్నెహ్సోంగి మదిలో ఎన్నో కలల ఉన్నాయి. అవి రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉన్న కలలు. ఆ కలల సాకారంలో శాసనసభ్యురాలిగా తొలి అడుగు వేసింది. ఏడీసీ మనీషా చిన్నప్పుడు తండ్రి యూనిఫాంను పోలిన డ్రెస్ ధరించి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా తెగ హడావిడి చేసింది మనీషా. అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపోయింది. తండ్రి నడకను అనుకరించింది. ఆరోజు తమ ముద్దుల బిడ్డను చూస్తూ తెగ నవ్వుకున్న మనీషా తల్లిదండ్రులు, ఇప్పుడు కుమార్తె ఉన్నతిని చూసి గర్విస్తున్నారు. స్క్వాడ్రన్ లీడర్ మనీషా సాధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్‌కు ఎయిడ్–డి–క్యాంప్ (ఏడీసీ)గా నియామకం అయిన ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది... మనీషా పధి స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. తల్లి గృహిణి. తండ్రి మనోరంజన్ పధి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది మనీషా. చదువుకు తగ్గ ధైర్యం ఉండేది. తండ్రిలాగే ‘ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్’ కావాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నది. చిన్నప్పుడు తండ్రి యూనిఫామ్‌ను పోలిన డ్రెస్‌ను ధరించి సందడి చేసేది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసిన మనీషా ఆ తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరింది. గతంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్– పుణె చివరగా భటిండాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పనిచేసింది ‘ఏడీసీగా మనీషా పధి నియామకం ఒక మైలురాయి మాత్రమే కాదు. లింగ వివక్షతను కాలదన్ని వివిధ రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్న మహిళా శక్తికి నిదర్శనం. ఈ అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. అన్ని రంగాల్లో మహిళా సాధికారతను కొనసాగిద్దాం’ అని వ్యాఖ్యానించారు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు. ‘ఎయిడ్–డి–క్యాంప్’ అనేది సాయుధ దళాల్లో ఉన్నత స్థాయి అధికారికి సహాయపడే అధికారి హోదాను సూచిస్తుంది. మన దేశంలో ‘ఎయిడ్–డి–క్యాంప్’ గౌరవప్రదమైన హోదా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్... మొదలైన వాటిలో సర్వీస్ చీఫ్‌లకు సాధారణంగా ముగ్గురు ‘ఎయిడ్–డి–క్యాంప్’లు ఉంటారు రాష్ట్రపతికి ఆర్మీ నుంచి ముగ్గురు, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం అయిదుగురు ఉంటారు. ఇక రాష్ట్ర గవర్నర్లకు ఇద్దరిని నియమిస్తారు. మా కూతురు మా శక్తి మనిషా పధి తల్లిదండ్రులు ఒడిషాలోని భువనేశ్వర్‌లో నివాసం ఉంటున్నారు. తమ కుమార్తె మిజోరం గవర్నర్ ‘ఏడీసీ’గా నియామకం కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘2015లో ఫస్ట్ పోస్టింగ్ నుంచి ఇప్పటి వరకు విధి నిర్వహణకు సంబంధించి ఎంతో అనుభవాన్ని సొంతం చేసుకుంది. ఆ అనుభవమే మనీషాను ‘ఏడీసీ’గా నియామకం అయ్యేలా చేసింది. మనిషా తల్లిదండ్రులుగా ఈ నియామకం విషయంలో సంతోషిస్తున్నాం. గర్విస్తున్నాం’ అంటున్నాడు మనీషా తండ్రి మనోరంజన్ పధి. ‘చదువు విషయంలో, వృత్తి విషయంలో మనీషా మమ్మల్ని సంతోషానికి గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం నా సంతోషాన్ని వ్యక్తీకరించడానికి మాటలు రావడం లేదు. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగింది’ అంటుంది మనీషా తల్లి. ‘తన కలను నిజం చేసుకోవడానికి సొంత ఊరు దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు మాతో పాటు మనీషాకు ఎంతో మంది నిరుత్సాహపరిచే మాటలెన్నో చెప్పారు. మనీషా ఒక్క నిమిషం కూడా అధైర్యపడింది లేదు. అలాంటి మాటలను పట్టించుకోవద్దని మేము గట్టిగా చెప్పేవాళ్లం. అమ్మాయిల కెరీర్ డ్రీమ్స్‌కు తల్లిదండ్రులు అండగా నిలబడితే వారు అద్భుత విజయాలు సాధిస్తారు. తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తారు’ అంటున్నాడు మనోరంజన్ పధి. మనీషా పధి తల్లిదండ్రులకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటి సారాంశం ‘మీ అమ్మాయి బంగారం’ -
నాడు యాంకర్ నేడు ఎమ్మెల్యేగా..!
ఇటీవల ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వాటిలో నాలుగు రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించగా, ఒక్క మిజోరాం అసెంబ్లీ ఫలితాలు మాత్రం డిసెంబర్ 4న ప్రకటించడం జరిగింది. ఆ ఫలితాల్లో బారిల్ వన్నెహ్సాంగి అనే మహిళ ప్రధాన ఆకర్షణగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ ఎవరీమె? ప్రత్యేకత ఏంటీ అంటే.. 40 మంది సభ్యులు ఉన్న మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో జెడ్పీఎం అభ్యర్థిగా బారిల్ బరిలోకి దిగి మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థిని గద్దెదించింది. దీంతో ఆమె అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా నిలిచింది. ఆమె వయసు జస్ట్ 32 ఏళ్లే. బారిల్ ఐజ్వాల్ సౌత్ -III నుంచి పోటీకి దిగి, మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి(ఎంఎన్ఎఫ్) లాల్నున్మావియాను 9.370 మెజార్టీ ఓట్లతో ఓడించి విజయం సాధించింది ఇక ఆమె నేపథ్యం చూస్తే..మేఘాలయాలోని షిల్లాంగ్‌లో నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్‌ను అభ్యసించింది. ఆమె ప్రముఖ టీవీ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి..క్రమంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రాంలో బాగా ఫేమస్ అయ్యింది. ఆమెకు ఏకంగా దాదాపు 250కి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రేజే ఆమెను ప్రజలకు మరింత చేరువ చేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుక దోహదపడింది. ఇకఎన్నికల అఫిడవిట్ ప్రకారం..ఆమె గతంలో ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంఏసీ)లో కార్పొరేటర్‌గా పనిచేశారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఇక ఇదే రాష్ట్రం నుంచి బారిల్ వన్నైసంగీలానే మరో ఇద్దరు మహిళలు గెలుపొందడం విశేషం. వారిలో ఒకరు మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) అభ్యర్థి. (చదవండి: ఫోర్బ్స్ జాబితాలో నలుగురు భారతీయులకు చోటు! సీతారామన్ ఎన్నో స్థానంలో ఉన్నారంటే..?) -
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
-
మిజోరంలో ఓట్ల లెక్కింపు 4న
న్యూఢిల్లీ: íఇటీవల ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఒకే రోజు మొదలవుతుందని ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మిజోరంలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు శుక్రవారం ఈసీ తెలిపింది. క్రైస్తవులు మెజారిటీ కలిగిన ఈ రాష్ట్రానికి చెందిన వివిధ వర్గాల ప్రతినిధులు 3వ తేదీ, ఆదివారం తమకు ఎంతో ప్రత్యేకమైనది అయినందున ఓట్ల లెక్కింపు వాయిదా వేయాలని కోరినట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు కౌంటింగ్‌ను ఒక రోజు అంటే 4వ తేదీకి వాయిదా వేసినట్లు వివరించింది. -
Elections 2023: రిజల్ట్ చూద్దాం.. మజా చేద్దాం!
సినిమా కాదు.. క్రికెట్ మ్యాచ్ అంతకంటే కాదు కానీ, ఈ ఆదివారం సిసలైన మజాను కోట్ల మంది ఆస్వాదించబోతున్నారు ఎలాగంటారా?.. డిసెంబర్ 3.. రాజకీయ పార్టీలకు బిగ్డే చార్ పటాకా బద్ధలయ్యే రోజది మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్.. మూడు రాష్ట్రాల్లో రెండు ప్రధాన పార్టీల హోరాహోరీ పోరుపై నెలకొన్న ఆసక్తి ఇక ఇటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ప్రధాన పార్టీల నడుమ విజయధీమాలతో తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన వేళ.. ఓడేదెవరు? నెగ్గేదెవరనేది పక్కనపెడితే.. ఈ సూపర్ సండే మాంచి కిక్కు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.. రాజస్థాన్ చెరో దఫా ప్రభుత్వాల్ని ఇక్కడ కాంగ్రెస్-బీజేపీలు గత మూడు దశాబ్దాలుగా ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. అయితే.. గత మూడేళ్లుగా నడుస్తున్న గ్రూప్ రాజకీయాల నేపథ్యంలో ఈసారి రాజస్థాన్‌లో ఎవరు సర్కార్‌ను నెలకొల్పుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పుడున్న రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14, 2024తో ముగియనుంది. ఈలోపు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీకి.. 199 స్థానాలకు(ఒక దగ్గర అభ్యర్థి మరణంతో ఎన్నిక నిలిపివేశారు) నవంబర్ 25వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 75.45% పోలింగ్ నమోదైంది. ప్రభుత్వ ఏర్పాటుకు 101 స్థానాలు రావాల్సి ఉంటుంది. ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాల ప్రభావం తమను మళ్లీ గెలిపిస్తుందని కాంగ్రెస్.. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో పేరుకుపోవడంతో పాటు తాము ఇచ్చిన ఎన్నికల హామీలకు ప్రజలు పట్టం కడతారని బీజేపీ గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఎగ్జిట్‌పోల్ ఫలితాలు హోరాహోరీ పోటీనే చూపిస్తున్నాయి ఇక్కడ. మధ్యప్రదేశ్ కిందటి ఎన్నికల్లో నెగ్గి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేశామనే సంతోషం కాంగ్రెస్‌కు రెండేళ్లే ఉంది. తిరుగుబావుటా నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిణామాలు.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పుడున్న అసెంబ్లీ గడువు జనవరి 6, 2024తో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. నవంబర్ 17వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తంగా 5.6 కోట్ల ఓటర్లకుగానూ.. 77.15 శాతం నమోదు అయ్యింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి.. ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు రావాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్‌లో ఈ ఐదేళ్లలో రెండు ప్రభుత్వాలు వచ్చాయి. గత ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. రెండేళ్లు తిరగకముందే 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కుప్పకూలింది. సరిపడా బలం కమల్‌నాథ్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్‌లు ధీమాతో ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో సగం బీజేపీకి అనుకూలంగా.. సగం హంగ్ చూపిస్తుండగా.. ఓటర్ పల్స్ ఎలా ఉండనుందా? అనే ఆసక్తి నెలకొంది. ఛత్తీస్‌గఢ్ వరుసగా మూడు పర్యాయాలు(2003 నుంచి 2018 దాకా) సంపూర్ణ పాలన కొనసాగించిన బీజేపీకి చెక్ పెడుతూ కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమా కాంగ్రెస్‌లో కనిపిస్తుంటే.. కంచుకోటను చేజిక్కించుకుని తీరతామంటూ బీజేపీ ధీమా కనబరుస్తోంది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ గడువు జనవరి 3, 2024తో ముగియనుంది. ఈలోపు ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. రెండు ఫేజ్‌ల్లో నవంబర్ 7న, నవంబర్ 17న పోలింగ్ నిర్వహించింది ఈసీ. మొత్తం కోటి 63 లక్షల ఓటర్లు ఉండగా.. 76 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 46 రావాలి. రూరల్ డెవలప్మెంట్ అనేది ప్రధాన అస్త్రంగా.. సంక్షేమ పథకాలను కాంగ్రెస్ నమ్ముకుంది. మరో వైపు అవినీతి ఆరోపణలు, మత మార్పిడులు, హామీలు నెరవేర్చకపోవడం వంటి అస్త్రాలను బీజేపీ సంధించింది. మరోవైపు.. అద్భుతం జరిగితేనే బీజేపీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ ఈ సారి అధికారం నిలబెట్టుకున్నా సీట్లు తగ్గే అవకాశముందని, ఇవేవీకావు.. బీజేపీ ఏకపక్షంగా నెగ్గుతుందని ఇలా రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి అక్కడ. ఈ తరుణంలో.ఎగ్జిట్ పోల్స్ సైతం ఛత్తీస్‌గఢ్‌లో హోరాహోరీ అంచనా వేస్తుండడంతో ఆసక్తి నెలకొంది. తెలంగాణ గత రెండు దఫాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. హ్యాట్రిక్ కొడతామంటోంది. ఈ పదేళ్లలో ఘోరంగా అవినీతి జరిగిందని.. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో తారాస్థాయికి వెళ్లిందని.. అది తమకు అధికారం కట్టబెడుతుందని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలు చెప్పుకుంటున్నాయి. సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు.. ఈలోపే ఏకపక్షంగా వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. గెలుపుపై ఎవరికి వాళ్లే వ్యక్తం చేస్తున్న ధీమా పరిణామాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ను మరిపించడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మూడో అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఇప్పుడున్న అసెంబ్లీ కాలపరిమితి జనవరి 16, 2024తో ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 30 తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 3.26 కోట్ల ఓటర్లు ఉండగా.. 70 శాతం పైనే ఓటింగ్ నమోదు అయ్యిందని అంచనా. అంటే.. దాదాపు కోటి మంది దాకా పోలింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీకి 119 స్థానాలు ఉండగా.. అధికారం ఏర్పాటు చేయాలంటే 60 సీట్ల మెజారిటీ అవసరం. పదేళ్ల పాలన ప్రచార అస్త్రంగా బీఆర్ఎస్.. అత్యధిక సీట్లతో, మూడోసారి విజయంతో రికార్డు నెలకొల్పుతామని అంటోంది. ఇక ఈ పాలనలోనే జరగని అవినీతి లేదంటూ బీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారంతో కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లోకి వెళ్లాయి. సర్వేలు ఒకలా.. ఎగ్జిట్‌పోల్స్ మరోలా రావడంతో ఓటర్ పల్స్‌పై గందరగోళమే నెలకొంది. పైగా సాయంత్రం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడంతో.. తెలంగాణలో ఈసారి ఓటింగ్ గెలుపోటములను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇస్తారనే తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆ బెట్టింగ్స్ తారాస్థాయికి చేరాయంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఏమేర ఉత్కంఠ నెలకొందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద.. ఈ ఆదివారం డిసెంబర్ 3న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ.. ఫలితాల వెల్లడి.. నాయకుల గెలుపొటములతో.. పార్టల సంబురాలు-నిరుత్సాహాలతో కోట్ల మందికి(ప్రత్యేకించి ఓటర్లకు..) ఇత్యాది పరిణామాలు మస్త్ మజాను అందించబోతున్నాయి! -
లాల్దుహోమా ఎవరు? మిజోరం ఎన్నికల్లో ఎందుకు కీలకం?
మిజోరం.. దేశంలోని ఒక చిన్న రాష్ట్రం... అసెంబ్లీ కూడా చిన్నదే. 40 మంది సభ్యుల ఈ అసెంబ్లీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలో నవంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కారణంగా దేశవ్యాప్తంగా మిజోరం రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈసారి మిజోరంలో ముక్కోణపు పోటీ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), కాంగ్రెస్‌తో పాటు, ఈసారి లాల్దుహోమా నేతృత్వంలోని జోరామ్ నేషనలిస్ట్ పార్టీ (జెడ్ఎన్పీ)కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. దీంతో లాల్దుహోమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. యువత నుంచి లాల్దుహోమాకు అత్యధిక ఆదరణ దక్కుతోంది. మిజోరాం అభివృద్ధి గురించి, కాంగ్రెస్, ఎంఎన్ఎఫ్ నుంచి రాష్ట్రానికి విముక్తి చేయడం గురించి ఆయన మాట్లాడుతున్నారు. మిజోరాం సీఎంకు లాల్దుహోమా గట్టి పోటీదారు అని ఇక్కడివారంతా చెబుతున్నారు. ఇంతకీ లాల్దుహోమా ఎవరు? యువత ఆయనకు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? లాల్దుహోమా మిజోరంనకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి. 1977లో ఐపీఎస్ పూర్తి చేశాక, గోవాలో స్క్వాడ్ లీడర్‌గా విధులు నిర్వహిస్తూ స్మగ్లర్ల ఆటకట్టించారు. లాల్దుహోమా సాధించిన విజయాలు మీడియాలో తరచూ కనిపిస్తుంటాయి. 1982లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశారు. లాల్దుహోమా 1984లో ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన పేరిట ఓ ప్రత్యేక రికార్డు కూడా ఉంది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన మొదటి ఎంపీగా లాల్దుహోమా నిలిచారు. 1988లో కాంగ్రెస్ సభ్యత్వాన్ని వదులుకున్నందుకు లోక్‌సభ నుండి బహిష్కరణకు గురయ్యారు. లాల్దుహోమా.. జోరామ్ నేషనలిస్ట్ పార్టీ (జెడ్ఎన్పీ)వ్యవస్థాపక అధ్యక్షుడు. 2018 మిజోరాం శాసనసభ ఎన్నికల్లో జెడ్ఎన్పీ నేతృత్వంలోని జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) కూటమి మొదటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన నిలిచారు. ఐజ్వాల్ వెస్ట్-1, సెర్చిప్ నియోజకవర్గాల నుండి ఎన్నికైన లాల్దుహోమా.. సెర్చిప్కు ప్రాతినిధ్యం వహించేందుకు మొగ్గుచూపారు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సమయంలో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు 2020లో శాసనసభ సభ్యునిగా అనర్హుడయ్యారు. ఇది భారతదేశంలోని రాష్ట్ర శాసనసభలలో మొదటి ఉదంతంగా నిలిచింది. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో సెర్చిప్ నుంచి లాల్దుహోమా తిరిగి ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: చనిపోయిన 12 గంటలకు తిరిగి బతికిన చిన్నారి! -
మిజోరాం ఎగ్జిట్‌పోల్స్‌లో గెలుపు ఎవరిదంటే..!
ఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు వచ్చేశాయి. ఐదు రాస్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిజోరాంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) మరోసారి ఆధిక్యం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే స్పష్టం చేయగా, జోరమ్ పీపుల్స్ మూమెంట్(జేపీఎం) పైచేయి సాధిస్తుందని జన్ కీ బాత్ సర్వే తెలిపింది. 40 అసెంబ్లీ సీట్లున్న మిజోరాంలో ఎంఎన్ఎఫ్ 16 నుంచి 20 స్థానాలను సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే తెలపగా, జన్ కీ బాత్ సర్వే మాత్రం ఎంఎన్ఎఫ్ 10 నుంచి 14 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటివరకూ వచ్చిన మూడు సంస్థల ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం అక్కడ ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. మిజోరాం అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పీపుల్స్ పల్స్ సర్వే ఎంఎన్ఎఫ్ 16-20 జేపీఎం-10-14 ఐఎన్‌సీ 2-3 బీజేపీ 6-10 ఇతరులు-0 జన్ కీ బాత్ సర్వే ఎంఎన్ఎఫ్-10-14 జేపీఎం-15-25 కాంగ్రెస్-5-9 బీజేపీ-0-2 ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ఎంఎన్ఎఫ్ 14-18 జేపీఎం 12-16 కాంగ్రెస్ 8-10 బీజేపీ 0-2 ABP-Cvoter MNF-15-21 ZPM-12-18 OTH-0-10 Times Now-ETG MNF-14-18 ZPM-10-14 OTH-9-15 ఎగ్జిట్‌పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
ఎన్నికల వేళ భారీగా సొత్తు సీజ్: సీబీడీటీ
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో లెక్కల్లో చూపించని నగదు భారీగా పట్టుబడుతున్నట్లు ఆదాయ పన్ను విభాగం సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్)తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో 2019లో జరిగిన లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా బుధవారం తెలిపారు. సోదా, నిఘా చర్యలను ఎన్నికల కమిషన్ సమన్వయంతో చేపడుతున్నామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలున్న రాజస్తాన్‌లో పట్టుబడిన అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి తదితరాల మొత్తం విలువ మూడింతలయిందన్నారు. 2021లో సీజ్ చేసిన మొత్తం సొత్తు విలువ రూ.322 కోట్లు కాగా, 2022లో అది రూ.322 కోట్లకు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1,021 కోట్లకు పెరిగిందని గుప్తా పేర్కొన్నారు. -
మిజోరంలో 77 శాతానికి పైగా పోలింగ్
ఐజ్వాల్: అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), విపక్ష జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం), కాంగ్రెస్ మధ్య తీవ్రపోటీకి వేదికగా నిలిచిన మిజోరం శాసనసభ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 40 స్థానాలకూ ఒకే దఫాలో పోలింగ్ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు అందిన సమాచారం మేరకు 77.39 శాతం పోలింగ్ నమోదైందని అదనపు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్.లియాంజెలా చెప్పారు. సవరించిన తుది ఫలితాలు బుధవారం వచ్చేసరికి పోలింగ్ శాతం 80 శాతాన్ని తాకొచ్చు. 18 మంది మహిళలు సహా మొత్తంగా 174 మంది అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. రాష్ట్రంలోని 8.57 లక్షల ఓటర్లు ఉన్నారు. సెర్చిప్ జిల్లాలో అత్యధికంగా 84.49 శాతం, ఐజ్వాల్ జిల్లాలో అత్యల్పంగా 73.09 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు 7,200 భద్రతా సిబ్బందిని నియోగించారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ఓటేయబోతే మొరాయించింది ఐజ్వాల్‌లోని ఒక ఈవీఎం ఏకంగా ముఖ్యమంత్రినే రెండోసారి పోలింగ్‌కేంద్రానికి రప్పించింది. మొదటిసారి మొరాయించడమే ఇందుకు కారణం. ర్యామ్హ్యూన్ వెంగ్లాయ్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు ఉదయాన్ని ముఖ్యమంత్రి జోరామ్‌థంగా విచ్చేశారు. అప్పుడే ఈవీఎం మొరాయించింది. చేసేదేం లేక ఇంటికి వెనుతిరిగారు. మళ్లీ 9.40 గంటలకు వచ్చి ఓటేశారు. ‘ ఈసారి కనీసం 25 చోట్ల గెలుస్తాం’ అని సీఎం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లాల్సావ్తా ఐజ్వాల్ వెస్ట్–3 నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 96 ఏళ్ల అంధుడు పూ జదావ్లా పోస్టల్ బ్యాలెట్‌ను కాదని స్వయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. పోలింగ్ నేపథ్యంలో మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసేశారు. రాకపోకలను ఆపేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఏకంగా 81.61 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. డిసెంబర్ మూడో తేదీన ఓట్లలెక్కింపు ఉంటుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 చోట్ల గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఉపఎన్నికల్లో మరో రెండు చోట్ల గెలిచింది. విపక్ష జెడ్పీఎం ఎనిమిది చోట్ల గెలిచింది. బీజేపీ కేవలం ఒక్క స్థానంలో, కాంగ్రెస్ ఐదు చోట్ల విజయబావుటా ఎగరేశాయి. ‘ఈసారి పట్టణప్రాంతాల్లో జెడ్పీఎం, గ్రామీణ ప్రాంతాల్లో ఎంఎన్ఎఫ్ ఎక్కువ సీట్లు గెలవొచ్చు’ అన్న విశ్లేషణలు వినిపించాయి. -
3 రోజుల లాభాలకు బ్రేక్
ముంబై: దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడంతో స్టాక్ సూచీల 3 రోజుల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. ఆసియా, యూరప్ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించారు. ట్రేడింగ్‌లో 383 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరికి 16 పాయింట్ల స్వల్ప నష్టంతో 64,942 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 94 పాయింట్ల పరిధిలో కదలాడింది. ఆఖరికి ఐదు పాయింట్ల నష్టంతో 19,407 వద్ద నిలిచింది. చైనా అక్టోబర్ ఎగుమతులు భారీగా క్షీణించినట్లు డేటా వెల్లడికావడంతో ఆసియాలో ఒక్క తైవాన్ తప్ప మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు 2% నష్టపోయాయి. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన, ఇంధన షేర్ల పతనంతో యూరప్ మార్కెట్లు ఒకశాతం మేర పతనమయ్యాయి. హోనాసా కన్జూమర్ లిస్టింగ్ పర్వాలేదనిపించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.324) వద్దే లిస్టయ్యింది. చివరికి 4% లాభంతో రూ.337 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.10,848 కోట్లుగా నమోదైంది. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ చివరిరోజు నాటికి 73.15 రెట్లు సబ్స్క్రయిబ్ అ య్యింది. 5.77 కోట్ల ఈక్విటీలను జారీ చేయగా 422 కోట్ల ఈక్విటీలకు బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐబీ కోటా 173.52 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్ల కోటా 84.37 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 16.97 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. -
ఓటు వేయకుండానే వెనుదిరిగిన సీఎం జోరాంతంగా.. ఆ తర్వాత
ఐజ్వాల్: ఈవీఎం మొరాయించడంతో మిజోరాం సీఎం జోరాంతంగా ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి కాసేపు వేచి ఉన్న సీఎం.. అప్పటికీ ఈవీఎం పనిచేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చారు. మీడియా సమావేశం తర్వాత మళ్లీ తన ఓటు హక్కుని వినియోగించుకుంటానని స్పష్టం చేశారు. మరికాసేపటి తర్వాత మళ్లీ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడు మిజోరాంలో 40 స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7:00 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్య జనం పోలింగ్‌లో పాల్గొన్నారు. ఐజ్వాల్ నార్త్-II అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 19-ఐజ్వాల్ వెంగ్లాయ్ పోలింగ్ స్టేషన్లో ఈరోజు ఉదయం తన ఓటు వేయడానికి సీఎం జోరాంతంగా వెళ్లారు. అదే సమయంలో ఈవీఎం మొరాయించింది. తప్పని స్థితిలో సీఎం జోరాంతంగా వెనుదిరిగారు. మీడియా సమావేశం తర్వాత మళ్లీ తన ఓటు హక్కుని వినియోగించుకుంటానని తెలిపారు. కాసేపయ్యాక మళ్లీ వచ్చి ఓటు వేశారు. రాష్ట్రంలో అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో దిగారు. మొత్తం 8.57 లక్షల ఓటర్లకుగాను 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఇదీ చదవండి: ఎన్నికల వేళ మవోయిస్టు పేలుళ్లు.. సీఆర్పీఎఫ్ జవాన్‌కి గాయాలు -
ఛత్తీస్ గఢ్ లో మొదలైన పోలింగ్
-
మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్: ఇప్పటి వరకు ఎంత శాతమంటే?
Updates.. మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.. 11 గంటల వరకు పోలింగ్ ఇలా.. ►ఛత్తీస్‌గఢ్‌లో 22.97 శాతం పోలింగ్ ►మిజోరంలో 26.43 శాతం పోలింగ్ నమోదు 22.97% voter turnout recorded till 11 am in Chhattisgarh and 26.43% in Mizoram. #ChhattisgarhElections2023 #MizoramElection2023 pic.twitter.com/xKeNXk3etK — ANI (@ANI) November 7, 2023 ప్రజల కోసమే కాంగ్రెస్.. ►ఎన్నికల పోలింగ్ సందర్బంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ మాట్లాడుతూ.. ఐదేళ్లలో మేం చేసిన పనితో నక్సలిజం చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఫలితంగా గ్రామాల్లోనే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు.. ప్రజలు తమ గ్రామంలోనే ఓటు వేస్తారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వీటన్నింటి ప్రస్తావన ఉంది. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎప్పుడూ సామాన్య ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. #WATCH | Chhattisgarh Elections | CM and Congress leader Bhupesh Baghel says, "Naxalism has retreated to a great extent with the work we have done in 5 years. As a result, polling booths have been set up inside villages. People will vote in their village itself. There is a… pic.twitter.com/Lg01Hlushn — ANI (@ANI) November 7, 2023 ఉదయం తొమ్మిది గంటల వరకు పోలింగ్ ఇలా.. ►ఛత్తీస్‌గఢ్‌లో 9.93 శాతం ►మిజోరంలో 12.80 శాతం పోలింగ్ నమోదు 9.93% voter turnout recorded till 9 am in Chhattisgarh and 12.80% in Mizoram. #ChhattisgarhElections2023 #MizoramElection2023 pic.twitter.com/XkG5JYHGpp — ANI (@ANI) November 7, 2023 23ఏళ్ల తర్వాత పోలింగ్ ►సుక్మాలోని నక్సల్స్ ప్రభావిత కరిగుండం ప్రాంతంలో 23 ఏళ్ల తర్వాత ఓటింగ్ జరుగుతోంది. సీఆర్పీఎఫ్ 150 బెటాలియన్, జిల్లా బలగాల భద్రతతో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. #WATCH | Chhattisgarh Elections | Sukma: Voting being held in naxal-affected Karigundam area after 23 years. The polling process is being held under the security cover by CRPF 150 Battalion and District Force. (Video Source: CRPF 150 Battalion) pic.twitter.com/pk2tfpUs86 — ANI (@ANI) November 7, 2023 ► ఛత్తీస్‌గఢ్‌లో సుక్మా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు. #WATCH | Voters stand in a queue outside a polling booth in the Sukma Assembly Constituency to cast their votes for the Chhattisgarh Assembly elections 2023. pic.twitter.com/7OVHn0cCEl — ANI (@ANI) November 7, 2023 #WATCH | Chhattisgarh elections | Voters queue up outside a polling booth in Kondagaon as they await their turn to cast a vote in the first phase of Assembly elections.#ChhattisgarhElection2023 pic.twitter.com/p699iWnbpT — ANI (@ANI) November 7, 2023 ►ఓటు వేసిన మిజోరం గవర్నర్ హరిబాబు కంభంపాటి. ఐజ్వాల్‌లోని సౌత్-2 పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. #WATCH | Mizoram Governor Hari Babu Kambhampati casts his vote at a polling booth in Aizawl South - II. #MizoramElections2023 pic.twitter.com/wDjBQVlLRt — ANI (@ANI) November 7, 2023 ఈ సందర్బంగా గవర్నర్ హరిబాబు కంభంపాటి మాట్లాడుతూ.. మిజోరం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం, అక్షరాస్యత శాతం చాలా ఎక్కువ. ప్రజలు కూడా తమ హక్కుల గురించి తెలుసుకుంటారు. మిజోరాం ప్రజలందరూ ఓటు వేసి ఎన్నికల్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మిజోరంలో ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా ఉంది. ఈసారి కూడా చాలా ఎక్కువ శాతం ఉంటుందని నేను భావిస్తున్నాను. #WATCH | Mizoram Governor Hari Babu Kambhampati says, "Mizoram is a literate state, literacy rate is very high. People are also aware of their rights. I appeal to all the people of Mizoram to vote and participate in the election and strengthen democracy...I think in Mizoram,… https://t.co/A4GElwDrcR pic.twitter.com/ckV4Cronb6 — ANI (@ANI) November 7, 2023 ►ఓటు వేసిన మిజోరం కాంగ్రెస్ చీఫ్ లాల్సావ్తా ఓటు వేశారు. ఐజ్వాల్‌లోని మిషన్ వెంగ్తలాంగ్ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | State Congress chief Lalsawta says, "...We are confident that we can form the Government...This constituency is difficult to predict but I think we will come on top...We have already considered the possibility of securing 22 seats."#MizoramElections2023 https://t.co/T2jK0jh3Ft pic.twitter.com/wX8kam8lHl — ANI (@ANI) November 7, 2023 ఛత్తీస్‌గఢ్‌లో ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి కేదార్ కశ్యప్ ►ఓటు హక్కు వినియోగించుకున్న నారాయణపూర్ బీజేపీ అభ్యర్థి కేదార్ కశ్యప్.. భాన్‌పురి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ 212లో ఓటు వేశారు. #WATCH | BJP candidate from Narayanpur, Kedar Kashyap casts his vote for the Chhattisgarh Assembly Elections 2023 at polling booth number 212 in Bhanpuri Assembly Constituency. pic.twitter.com/cbh8FejMRI — ANI (@ANI) November 7, 2023 ►ఈ సందర్భంగా కేదార్ కశ్యప్ మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ గెలుపు ఖాయం. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓటు వేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు. బీజేపీకి ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ►ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిజోరంలో హంగ్ వచ్చే ప్రసక్తే లేదు. ఇక్క ఎంఎన్ఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. మెజార్టీపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. మిజోరంలో మేము చాలా అభివృద్ధి పనులు చేశాం. నేను ఓటు వేసిన సందర్బంగా ఈవీఎం పనిచేయలేదు. నేను కాసేపట్లో మళ్లీ ఓటు వేస్తాను. మిజోరంలో మ్యాజిక్ ఫిగర్ 21. కానీ, 25 స్థానాల్లో మేము గెలుస్తాం. #WATCH | Mizoram elections | CM and MNF president Zoramthanga says, "In order to form the Government, 21 seats are needed. We hope that we will be able to get more than that, maybe 25 or more. I believe that we will have a comofortable majority." pic.twitter.com/PozWwno2v5 — ANI (@ANI) November 7, 2023 ►ఈ క్రమంలో ఈవీఎం మొరాయించడంతో ఆయన ఓటు వేయలేకపోయారు. #WATCH | Mizoram elections | CM and MNF president Zoramthanga could not cast a vote; he says, "Because the machine was not working. I was voting for some time. But since the machine could not work I said that I will visit my constituency and vote after the morning meet." https://t.co/ytRdh7OpKe pic.twitter.com/f8uJdUUUrL — ANI (@ANI) November 7, 2023 ►ఓటు వేసిన మిజోరం సీఎం జోరంతంగా #WATCH | Chief Minister of Mizoram Zoramthanga casts his vote for the Mizoram Assembly Elections 2023 at 19-Aizawl Venglai-I YMA Hall polling station under Aizawl North-II assembly constituency. pic.twitter.com/w3MdGFLWme — ANI (@ANI) November 7, 2023 ►మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐజ్వాల్ వెంగలై-1 ఐఎంఏ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ►మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశలో పోలింగ్ ప్రారంభమైంది. Voting for Mizoram Assembly Elections 2023 begins. pic.twitter.com/qufBy3nlal — ANI (@ANI) November 7, 2023 Voting for the first phase of Chhattisgarh Assembly Elections 2023 begins. Twenty of the 90 assembly seats will be voting in the first phase of polls. Over 40 lakh electors will vote across 5,304 polling stations in the first phase. pic.twitter.com/HTHM9J39nj — ANI (@ANI) November 7, 2023 ►మిజోరం అసెంబ్లీకి నేడు జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) మధూప్ వ్యాస్ చెప్పారు. అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 8.57 లక్షల ఓటర్లకుగాను 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ►149 పోలింగ్ కేంద్రాలు మారుమూల ప్రాంతాల్లోనూ, మరో 30 కేంద్రాలు, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉన్నాయని చెప్పారు. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రంతో ఉన్న మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేశారు. వీటితోపాటు రాష్ట్రంతో ఉన్న అస్సాంలోని మూడు జిల్లాలు, మణిపూర్‌లోని రెండు, త్రిపురలోని ఒక జిల్లా సరిహద్దులను మూసివేశారు. భద్రతా విధుల్లో మూడు వేల మంది పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సేవలను వినియోగించుకుంటున్నారు. #WATCH | Aizawl: Preparations underway at the polling booth for the Mizoram Assembly Elections 2023 Voting for Mizoram Assembly Elections 2023 is to begin at 7 am today. (Visuals from 19-Aizawl Venglai-I YMA Hall polling station under Aizawl North-II assembly constituency.) pic.twitter.com/VPcOul2j4C — ANI (@ANI) November 7, 2023 ►ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు సిద్ధమైంది. అసెంబ్లీలోని 90 స్థానాలకు గానూ 20 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. తొలి దశలో పోలింగ్ జరుగనున్న ఈ 20 స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచిన 223 మంది అభ్యర్థుల్లో 25 మంది మహిళలున్నారు. తొలిదశలో మొత్తం 5,304 పోలింగ్ కేంద్రాల్లో 40.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. #WATCH | Rajnandgaon, Chhattisgarh: Preparations underway as voting for the first phase of #ChhattisgarhElections2023 to begin at 8 am today; visuals from Booth No - 96 Wesleyan English Medium School, Rajnandgaon. pic.twitter.com/vjMBeamlxN — ANI (@ANI) November 7, 2023 ►మొత్తం 5,304 పోలింగ్ స్టేషన్లకు గాను 25,429 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) చెప్పారు. పది నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మరో 10 నియోజకవర్గాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. మొదటి విడత పోలింగ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం బస్తర్‌లోని 12 నియోజకవర్గాల్లో జరగనున్నందున అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. వీరిలో 40 వేల మంది కేంద్ర సాయుధ రిజర్వు బలగా(సీఏపీఎఫ్)లున్నాయి. #WATCH | Aizawl: Preparations underway at the polling booth for the Mizoram Assembly Elections 2023 Voting for Mizoram Assembly Elections 2023 is to begin at 7 am today. (Visuals from 19-Aizawl Venglai-I YMA Hall polling station under Aizawl North-II assembly constituency.) pic.twitter.com/VPcOul2j4C — ANI (@ANI) November 7, 2023 ►తొలిదశలో బరిలో ఉన్న అభ్యర్థులలో బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్‌సింగ్‌తో పాటు ఆయన మంత్రివర్గంలో పనిచేసిన ఐదుగురు మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుత కేబినెట్లోని ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీ సహా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్‌లు బరిలో ఉన్నారు. తొలిదశలోని 20 స్ధానాల్లో ముఖ్యంగా చిత్రకోట్, రాజ్‌నంద్‌గావ్, కవర్ధా, కొండగావ్, కొంటా, కేశ్కాల్, నారాయణ్‌పూర్, బిజాపూర్, అంతాగఢ్, దంతెవాడ నియోజకవర్గాలపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. #WATCH | Chhattisgarh: Preparations, mock poll underway as voting for the #ChhattisgarhElections2023 to begin at 7 am today; visuals from a polling booth in Kondagaon. pic.twitter.com/CS6QJsQmBB — ANI (@ANI) November 7, 2023 ►రాజ్‌నంద్‌గావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ మాజీ సీఎం రమణ్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గిరీష్ దేవాంగన్‌ల మధ్య నెలకొంది. రాజ్‌నంద్‌గావ్ అసెంబ్లీ సీటు రమణ్ సింగ్‌కు బలమైన కోటగా పరిగణిస్తారు. 2008 నుంచి 2018 వరకు ఈ స్థానం నుంచి గెలుపొందారు. రమణ్‌సింగ్‌కు పోటీగా కాంగ్రెస్ సీనియర్ నేత గిరీష్ దేవాంగన్‌ను ఇక్కడి నుంచి పోటీకి దింపింది. చిత్రకోట్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి వినాయక్ గోపాల్ దీపక్‌కు సవాల్ విసిరారు. #WATCH | Chhattisgarh: Preparations, mock poll underway as voting for the first phase of #ChhattisgarhElections2023 will begin at 7 am today in Konta Assembly constituency of Sukma district. pic.twitter.com/LvoZgOttBv — ANI (@ANI) November 7, 2023 #WATCH | Chhattisgarh: Preparations, mock poll underway as voting for the first phase of #ChhattisgarhElections2023 will begin at 7 am today in Jagdalpur Assembly Constituency of Bastar district. pic.twitter.com/von3Pvi1qu — ANI (@ANI) November 7, 2023 -
మిజోరంలో నేడే పోలింగ్
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీకి నేడు జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) మధూప్ వ్యాస్ చెప్పారు. అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు చెప్పారు. మొత్తం 8.57 లక్షల ఓటర్లకుగాను 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. 149 పోలింగ్ కేంద్రాలు మారుమూల ప్రాంతాల్లోనూ, మరో 30 కేంద్రాలు, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉన్నాయని చెప్పారు. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రంతో ఉన్న మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేశారు. వీటితోపాటు రాష్ట్రంతో ఉన్న అస్సాంలోని మూడు జిల్లాలు, మణిపూర్‌లోని రెండు, త్రిపురలోని ఒక జిల్లా సరిహద్దులను మూసివేశారు. భద్రతా విధుల్లో మూడు వేల మంది పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సేవలను వినియోగించుకుంటున్నారు. -
ముగిసిన ప్రచారం.. అక్కడ రేపే పోలింగ్
ఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో రేపు(మంగళవారం) ఈశాన్య రాష్ట్రం మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో పోలింగ్ జరుగనుంది. మిజోరంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. దీంతో, ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్ ప్రభావిత బస్తర్ డివిజన్లోని ఏడు జిల్లాలు, మరో నాలుగు ఇతర జిల్లాల్లో ఈ 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 25 మంది మహిళలతో పాటు మొత్తం 223 మంది అభ్యర్థులు తొలి విడత బరిలో ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉన్నదని సర్వేలు చెప్తున్నాయి. తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న 20 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లను కైవసం చేసుకుంది. కాగా, రెండో విడుతలో 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరుగనుంది. మరోవైపు.. మిజోరంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. మొత్తం 8.57 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించనున్నారు. ఎన్నికల్లో 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతఃరాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దుల్లోని దాదాపు 30 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. బంగ్లాదేశ్, మయన్మార్‌తో సరిహద్దులు పంచుకొనే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మొత్తంగా 3 వేల మంది పోలీసు సిబ్బంది, 5,400 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించామని తెలిపారు. VIDEO | Mizoram elections 2023: EVMs being dispatched to various polling booths in Aizawl. Polling for 40 assembly constituencies will take place in Mizoram on November 7.#AssemblyElectionsWithPTI #MizoramElections2023 pic.twitter.com/Bo8CmO0o5e — Press Trust of India (@PTI_News) November 6, 2023 మూడు పార్టీల ముమ్మర ప్రచారం మిజోరంలో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), ప్రతిపక్ష కాంగ్రెస్, జోరం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నది. అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు ఎంఎన్ఎఫ్ ముమ్మర ప్రచారం చేసింది. అటు మిజోరంలో గత రెండు పర్యాయాలుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్నది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించిన జెడ్పీఎం పార్టీ ఈసారి ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా నిలిచి, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఉంది. #Chhattisgarh: Ahead of Assembly elections, polling teams leave by helicopter to #Naxal-hit areas, in Sukma The first phase of voting for #ChhattisgarhElections2023 will be held on November 7.#lokmat #lokmattimes #Elections2024 #AssemblyElection2024 #voting pic.twitter.com/yDRqGx6Xjg — Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) November 4, 2023 ఇది కూడా చదవండి: అవినీతిపరులంతా బీజేపీలోకే: కేజ్రివాల్