ఇంఫాల్: మణిపూర్‌లో అల్లర్లు తగ్గుముఖం పట్టి అక్కడ పరిస్తితి ఇప్పుడిప్పుడే యధాస్థితికి చేరుకుంటోంది. అంతకుముందు మయన్మార్ నుంచి ఇక్కడికి వలస వచ్చినవారిని లెక్కించాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని గడువు సెప్టెంబర్ 30తో ముగియనుండటంతో కేంద్రం ఆ గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించింది.
మణిపూర్ అల్లర్లకు మయన్మార్ నుంచి వలస వచ్చిన వారు కూడా కారణమై ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బయోమెట్రిక్ ఆధారంగా మయన్మార్ వాసులను లెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్ర హోంశాఖ.మణిపూర్‌తో పాటు మిజోరాంలో కూడా ఈ వలసదారులను లెక్కించమని కోరిన మిజోరాం దానిని తిరస్కరించింది. అలా చేస్తే అక్కడి వారిపై వివక్ష చూపించినట్లవుతుందని మిజోరాం అభిప్రాయపడింది.
మే 29న కేంద్ర హోంశాఖ అక్రమ వలసదారులను బయోమెట్రిక్ ఆధారంగా గుర్తించాలని సెప్టెంబర్ 30 లోపే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. హోంశాఖ జాయింట్ సెక్రటరీ అంతకుముందు తెలిపిన వివరాల ప్రకారం మయన్మార్ వాసులు సాధారణంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తుంటారని అందుకే వారి గణన చేపట్టామన్నారు. ఎన్‌సీఆర్‌బీ(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) వారిచే శిక్షణ తీసుకున్న ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి కూడా అల్లర్లకు మయన్మార్ వాసులే కారణమని ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. మయన్మార్ వలసదారులు ఎక్కువగా అడవులను కొట్టి, గసగసాల సాగు, గంజాయి సాగుకి పాల్పడుతూ ఉంటారని సీఎం బైరెన్ సింగ్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: సీబీఐ క్లీన్‌చిట్ ఇస్తే రాజీనామా చేస్తారా? కేజ్రీవాల్ సవాల్!
Comments
Please login to add a commentAdd a comment