Imphal
-
మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి..భయంతో జనం పరుగులు
ఇంఫాల్:మణిపూర్‌లో ఇప్పట్లో శాంతి నెలకొనే పరిస్థితులు కనిపించడం లేదు. కొత్త సంవత్సరం తొలి రోజే ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో కాల్పులు, బాంబుల మోత మోగింది. కదంగ్‌బండ్ ప్రాంతంలో బుధవారం(జనవరి1) తెల్లవారకముందే ఉదయం మిలిటెంట్ల దాడి జరిగింది. అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరపడమే కాకుండా బాంబులు విసిరారు మిలిటెంట్లు.మిలిటెంట్ల దాడితో వెస్ట్ ఇంఫాల్‌లోని పలు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. మిలిటెంట్ల దాడిలోప్రాణ నష్టం జరగలేదన్నారు.మణిపూర్‌లో జాతుల మధ్య భారీ హింస చెలరేగిన 2023 మే నెలలో కదంగ్‌బండ్‌లో పలు హింసాత్మక సంఘటనలు జరిగాయి. మణిపూర్ ప్రశాంతంగా ఉండాలని నూతన సంవత్సర వేళ సీఎం బీరేన్‌సింగ్ ఆకాంక్షించిన వెంటనే మిలిటెంట్ల దాడి జరగడం గమనార్హం. ఇదీ చదవండి: లక్నోలో దారుణం.. తల్లి సహా నలుగురు చెల్లెల్ల హత్య -
మణిపూర్‌లో హై టెన్షన్.. పోలీసులు Vs ప్రజలు, విద్యార్థులు
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే 11 మంది మృతిచెందారు.అయితే, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. తాజాగా జరిగిన హింసలో దాదాపు 11 మంది ప్రజలు మృతి చెందారు. ఇక, నిన్న(సోమవారం) కూడా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఈరోజు విద్యార్థులు మణిపూర్‌లోని రాజ్‌భవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అటు నుంచి విద్యార్థులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. मणिपुर में प्रदर्शनकारियों ने राज्यपाल के घर पर किया पथराव. मोदी जी अभी रूस और यूक्रेन के बीच युद्ध रुकवाने में व्यस्त हैं!#ManipurVoilence #Manipur pic.twitter.com/t2E3honaQn— Newswala (@Newswalahindi) September 10, 2024 ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ప్రభుత్వంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. శాంతి భద్రతల రీత్యా తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ల జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా యంత్రాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. కర్ఫ్యూకు సంబంధించి కొత్త ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో అత్యవసర సేవలకు, మీడియాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.Imphal under CurfewIt seems to be the shortcut to maintaining law and order. @NBirenSingh @narendramodi @AmitShah After 16th months of #Manipurcrisis this is what you can come severely affecting the small-time business and unorganised workforce.#ManipurFightsBack… pic.twitter.com/2pDPUKTKrs— khaba (@krishnankh) September 10, 2024 ఏడాది నుంచి ఘర్షణలు..ఇదిలా ఉండగా.. ఏడాదికి పైగా కొనసాగుతున్న మణిపూర్ తెగల మధ్య ఘర్షణలు ఇంక తగ్గడం లేదు. కొండ ప్రాంతాల్లో నివసించే కుకీలు, మైదాన ప్రాంతాల్లో నివసించే మెయితీల మధ్య నెలకొన్న వైరం గత ఏడాది మే నెలలో ప్రత్యక్ష ఘర్షణలకు, దాడులకు దారితీసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ వివిధ స్థాయుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మెయితీల పక్షం వహిస్తూ కుకీల అణచివేతకు తోడ్పడుతున్నదనే ఆరోపణలున్నాయి. The condition in Manipur has become very critical now…#Manipur #ManipurConflict #ManipurCrisis #ManipurFightsBack pic.twitter.com/R8GKNFUOGg— Anindya Das (@AnindyaDas1) September 10, 2024 మరోవైపు.. మణిపూర్ ఘర్షణల్లో 220 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇరు వర్గాల వారు ఉన్నప్పటికీ కుకీలే అధికంగా ఉన్నట్టు సమాచారం. మహిళలపై కనీవినీ ఎరుగని రీతిలో అమానుషమైన దాడులు జరగడం మణిపూర్‌కు మచ్చ తెచ్చింది. మణిపూర్‌లో మారణహోమాన్ని ఆపేందుకు కేంద్రం జోక్యం చేసుకోకపోగా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు మణిపూర్ గురించి, అక్కడి మహిళలపై జరుగుతున్న ఘోరాల గురించి మాట్లాడకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో పౌర ప్రభుత్వ పాలన పట్టు తగ్గిపోయి మిలిటెంట్ గ్రూపుల హవా పెరిగింది.ఇది కూడా చదవండి: పూటుగా మద్యం సేవించి.. బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సంMatinee show for #ManipurCrisis. When #Meities have to stage a protest this is the precautions the state security forces react,in #Churachandpur and #Kangpokpi, #Kukis_Zo are allowed to march with guns. #ManipurConflict #iPhone16Plus #Kuki_ZoEngineeredManipurViolence #iPhone pic.twitter.com/28FPjkl4JH— Adu-Oirasu. (@themeiteitweets) September 10, 2024 Students are protesting in Manipur after the death of 9 People.The condition in Manipur is getting worse everyday.Godi media is busy in Hindu-Muslim Propaganda….they won’t show these things 👇pic.twitter.com/DHMUUwGilj— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) September 9, 2024 -
మీ సోదరుడిగా మణిపూర్‌కు వచ్చా: రాహుల్ గాంధీ
ఇంఫాల్: కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం మణిపూర్‌లో పర్యటించారు. మణిపూర్‌లో చోటుచేసుకున్న అల్లర్ల కారణంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను రాహల్ గాంధీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.‘నేను మణిపూర్ ప్రజలకు ఒక్కటి చెప్పదల్చుకున్నాను. నేను మీ సోదరుడిగా ఇక్కడి వచ్చాను. మాణిపూర్ మళ్లీ శాంతిని పునరుద్ధరించటం కోసం మీతో కలిసి పనిచేస్తాను. మాణిపూర్ చాలా విషాదకరమైన సమస్య చోటచేసుకున్నప్పటి నుంచి ఇక్కడికి మూడుసార్లు వచ్చాను. ఇక్కడి పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ.. ఆశించినంత మార్పు రాలేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.ఇవాళ మధ్యాహ్నం ఇంఫాల్ విమానాశ్రయంలో చేరుకున్న రాహుల్ గాంధీ.. జిరిబామ్, చురచంద్‌పూర్ జిల్లాల్లోని సహాయక శిబిరాలను సందర్శించారు. మణిపూర్‌లో చోటుచేసుకున్న హింసాకాండలో బాధితులకు రాహుల్ గాంధీ పరామర్శించి మద్దతుగా నిలిచారు. -
మణిపూర్‌లో ‘కుకీ’ల కొత్త డిమాండ్.. బీజేపీ నిర్ణయమేంటి?
ఇంఫాల్: మణిపూర్‌లో కొండ ప్రాంతాలతో కూడిన పలు జిల్లాల్లో సోమావారం కుకీ జో తెగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన రాల్యీలు చేపట్టాయి. మణిపూర్‌లో తెగల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలకు ముగింపు పలికి.. తామను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కుకీ తెగ ప్రజలు డిమాండ్ చేశారు.మణిపూర్‌లో తరచూ చెలరేగుతున్న జాతుల మధ్య ఘర్షణలకు పరిష్కారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 239ఏ ప్రకారం తమకు అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కుకీ తెగ ప్రజలు పెద్దఎత్తున చురచంద్‌పూర్, కాంగ్పోక్పి, చందేల్, ఫెర్జాల్-జిరిబామ్, తెంగ్నౌపాల్ పర్వత జిల్లాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన మంత్రి మణిపూర్ సందర్శించి.. తాము ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులను చూసి సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.తమ డిమాండ్‌ను వేగవంతం చేయాలని కోరుతూ.. కుకీ జో తెగ సంఘాలు జిల్లా అధికారుల ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మెమోరాండం సమరర్పించినట్లు తెలిపారు. చురచంద్‌పూర్ జిల్లా బీజేపీ ఎమ్యెల్యే పౌలియన్‌లాల్ హాకిప్ మీడియాతో మాట్లాడారు. ‘ కుకీ జో ఎమ్మెల్యేలు ప్రధాని మోదీని కలవాలని ఏడాది క్రితం విజ్ఞప్తి చేశాం. కానీ ఇప్పటికీ మాకు అనుమతి లభించలేదు. ఇక.. ఇప్పడు ప్రధాని మోదీ మా తెగల ఘర్షణకు పరిష్కారం చూపాలనుకుంటే ఇక్కడికే( మణిపూర్) రావాలి’అని అన్నారు. వీరికి వ్యతిరేకంగా ఇంఫాల్ వ్యాలీలో మైతేయి తెగకు సంబంధించిన మహిళా సంఘాలు మార్చ్ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం కుకీ మిలిటెంట్లకు మద్దతుగా ఉండొద్దని.. ‘ప్రత్యేక పరిపాలన వద్దు. గ్రామ వాలంటీర్ల అరెస్టు చేయొద్దు’ అనే నినాదాలతో భారీ సంఖ్యలో మహిళలు డిమాండ్ చేశారు. ఇక.. మే 3, 2023 నుంచి మణిపూర్‌లోని వ్యాలీ ప్రాంతాల్లో నివసించే మైతేయి తెగ, పర్వత ప్రాంతాల్లో ఉండే కుకీ జో తెగల మధ్య అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అల్లర్లతో ఇరు తెగల మధ్య తీవ్రమైన హింస చెలరేగటంతో 220 మంది మృతి చెందారు. ఈ ఘర్షణల్లో వేలమంది గాయపడ్డారు. ఘర్షణలు తట్టుకోలేక వేలమంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. -
అనిశ్చితి కొనసాగితే అంతులేని నష్టం
ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడలేదు. మణిపుర్ రాజధాని ఇంఫాల్‌తో నాగాలాండ్‌ను కలిపే జాతీయ రహదారి మీద ఉన్న వంతెనను దుండగులు పేల్చేశారు. మరో ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లను చంపేశారు. అరాచకం ఎంత స్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాంలో శాంతి యుగానికి నాంది పడింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్‌లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.హింస చెలరేగిన ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మరింత దారుణంగానే ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రధాన శక్తులు ఏకతాటిపైకి వచ్చి తక్షణ దిద్దుబాటు కోసం ఒక మార్గాన్ని అన్వేషించడమే ఇప్పుడున్న ఏకైక పరిష్కారం.సైన్యం లక్ష్యంగా దాడిమణిపుర్లో ఇటీవల జరిగిన మూడు సంఘటనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఏప్రిల్ 24న కాంగ్పోక్పి జిల్లాలోని జాతీయ రహదారి–2పై ఉన్న వంతెన మీద దుండగులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ వంతెన ఇంఫాల్‌ను నాగాలాండ్‌లోని దిమాపూర్‌తో కలుపుతుంది. ఈ రహదారి రాష్ట్రానికి ప్రధాన జీవనాధారం. రాష్ట్రం నిలువునా చీలిపోయిన కారణంగా మణిపుర్ ప్రజలకు అవసరమైన సామగ్రిని తీసుకువెళ్లే 100కు పైగా ట్రక్కులు అక్కడ నిలిచిపోవాల్సి వచ్చింది.ఏప్రిల్ 27న బిష్ణుపూర్ జిల్లాలోని నారాన్సీనా వద్ద జరిగిన దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు విడిది చేసి ఉన్న ప్రాంతానికి 200 మీటర్ల దూరంలోనే ఇండియా రిజర్వ్ బెటాలియన్ క్యాంపు (ఐఆర్బీ) ఉంది. ఐఆర్బీలో సిబ్బంది ప్రధానంగా మైతేయి కమ్యూనిటీకి చెందినవారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది తమ శిబిరాన్ని ఖాళీ చేసే పనిలో ఉన్నారనీ, అక్కడ ఒక ప్లాటూన్ మాత్రమే మిగిలి ఉందనీ తెలియవచ్చింది.దాడి చేసినవారు ఐఆర్‌బీలోని మైతేయి సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారని భావించే అవకాశం ఉంది; రాత్రిపూట దాడి జరిగినందున, వారు సీఆర్పీఎఫ్ శిబిరాన్ని ఐఆర్బీ అని పొరపడి ఉండొచ్చు.అయితే, ఆ దాడి లక్ష్యం సీఆర్పీఎఫ్ కూడా అయి ఉండవచ్చు – 1990ల మధ్యకాలంలో, అస్సాంలోని హిందీ మాట్లాడే ప్రజలను యథేచ్ఛగా హతమార్చడానికి ప్రయత్నించిన తిరుగుబాటు బృందం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా) కార్యాచరణను ఇది తలపింపజేస్తోంది. అప్పట్లో ఉల్ఫా కేంద్రప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి గట్టిగా ప్రయత్నించింది. అందులో విజయవంతం అయింది కూడా. ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుండి కొంతమంది ఎంపీలు హిందీ మాట్లాడే తమ సోదరులకు సహాయం చేయడానికి వెంటనే అస్సాంలో దిగారు. బయటి వ్యక్తులు తమ రాష్ట్రంలో దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించే ఒక వర్గం అస్సామీ జనాభాలో ఉండేది. అది ఇప్పటికీ అలాగే ఉంది.నారాన్సీనా ఘటనకు సంబంధించి, మణిçపుర్లో అరాచకం ఎంత తీవ్రస్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి. కాకపోతే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర పారామిలిటరీ బలగాలను వీరు గతంలో లక్ష్యంగా చేసుకోలేదని గమనించడం ముఖ్యం.ఒకే తాటిపైకి వస్తేనే...వంతెనపై ఐఈడీ పేలుడు, సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికి సంబంధించిన అనుమానపు చూపు ప్రధానంగా కుకీ మిలిటెంట్ల వైపు మళ్లింది. అయితే, అది చేసింది ఎవరైనా కావచ్చు. 2023 మే 3 నుండి నియంత్రణ లేకుండా ఉన్న రాష్ట్రంలో, దాదాపు ప్రతి సమూహం సైనికీకరించబడింది.మూడో విషయం రాజకీయ అండదండలతో కొనసాగుతున్న అరాచకానికి సంబంధించినది. అక్రమ ఆయుధాలతో ఉన్న అరామ్బాయీ తెంగోల్ సభ్యులను పట్టుకున్న తర్వాత, సైన్యానికి చెందిన కాస్పిర్ వాహనాన్ని మీరా పైబీలు(మహిళా బృందాలు) అడ్డగించారు. వందలాది మంది మీరా పైబీలు కాస్పిర్ను చుట్టుముట్టి సైనికులను దూషించారు. ఆ సమయంలో గనక సైనిక సిబ్బంది సంయమనం కోల్పోయి ఉంటే రక్తపాతం జరిగి ఉండేది.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాం శాంతి యుగానికి నాంది పలికింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్‌లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ఇది రంగాపహాడ్(నాగాలాండ్) కేంద్రంగా పనిచేసే 3 కోర్కు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మొత్తం నాయకత్వం కింద ఉండాలి. సహజంగానే సంప్రదింపుల తర్వాతే ఒక స్పష్టమైన స్వరం... శాంతి, సాధారణ స్థితికి రావడానికి కావాల్సిన వ్యూహాలు, మార్గాలు, సాధనాలపై దృష్టి పెట్టాలి. మణిçపుర్ విభజితమై ఉంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం దాదాపుగా పనిచేయడం లేదు. ఎటువంటి ఎదురూ లేని రాడికల్ మిలీషియా సంస్థకు పోలీస్ విభాగం తన బాధ్యతను వదిలేసుకుంది. కొంతమంది పోలీసులను ఆయుధాలు వదిలి వేయమని బలవంతం చేస్తూ అరామ్బాయీ తెంగోల్ ఒక డీఎస్పీని తీసుకెళ్లింది. ఇలాంటి తరుణంలో పోలీసులకు నాయకత్వం అవసరం. దురదృష్టవశాత్తు, అది పోలీసు శాఖ లోపల నుండి ఉద్భవించదు. దానిపై అధికారాన్ని 3 కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వంటి బలమైన సంస్థాగత మద్దతుతో కూడిన దృఢమైన నాయకుడికి అప్పగించాలి. అస్సాం రైఫిల్స్ అద్భుతంగా పని చేస్తోంది. కానీ అది పక్షపాత దృష్టితో ఉందని అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారు. మణిçపుర్ లోయ నివాసితులు దానిని తొలగించాలని కోరారు. మణిçపుర్లోని అనేక ప్రాంతాల నుండి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం తొలగించబడింది. దాంతో రాష్ట్రంలో ప్రభుత్వేతర శక్తులు చేస్తున్న చర్యలను ఎవరైనా చూడవచ్చు. అస్సాం రైఫిల్స్ ఇప్పటికే 3 కోర్ కార్యాచరణ కమాండ్ కింద ఉంది. కానీ దీనిని ఏకీకృత కమాండ్ వ్యవస్థ(యూసీఎస్)లో భాగం చేస్తే... ఆర్మీ, మణిపుర్ పోలీస్, కేంద్ర పారామిలిటరీ బలగాలతో దాని కార్యాచరణ కదలికలను క్రమాంకనం చేయడానికి అది వీలు కల్పిస్తుంది. అంతేగాక, యూసీఎస్ లోని ఇతర అంతిమ వినియోగదారులకు అనుగుణంగా పటిష్ఠమైన నిఘా వీలవుతుంది.అన్నీ కలగలిసే...మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్లకు పరస్పరం ముడిపడి ఉన్న సమస్యలే దీనికి కారణం. ఉదాహరణకు, ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ జోన్లను ఏర్పర్చిన తర్వాత, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్– ఇసాక్– ముయివా (ఎన్ఎస్సీఎన్–ఐఎమ్) సహాయంతో లోయ–ఆధారిత తిరుగుబాటు గ్రూపులు మణిçపుర్లోకి ప్రవేశించే సమస్యనుంచి ఎవరూ తప్పించుకోలేరు. అలాగే, ‘ఈస్టర్న్ నాగా నేషనల్ గవర్నమెంట్’ నుండి ఎన్ఎస్సీఎన్–ఐఎమ్కు లభిస్తున్న మద్దతు వెలుగులోనే, దక్షిణ అరుణాచల్‌లోని తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలలో జరిగే కుతంత్రాలను చూడాలి.భారత రాజ్యం, దాని సైన్యం చాలా శక్తిమంతమైనవి. అవి ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలవు. ఈ క్లిష్ట సమయంలో న్యూఢిల్లీ తీసుకోవాల్సిన ఏకైక చర్య తన బలగాలను బలోపేతం చేయడమే. అసాధ్యమైన వాటిని సాధించగల సామర్థ్యం సైన్యానికి ఉంది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిçపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.- వ్యాసకర్త భద్రత – తీవ్రవాద వ్యవహారాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- జైదీప్ సైకియా -
ఇంఫాల్ గగనతలంలో కలకలం.. రంగంలోకి రఫెల్
ఇంఫాల్: ఇంఫాల్ ఎయిర్‌పోర్టుపై గుర్తు తెలియని వస్తువు(యూఎఫ్ఓ)ను గాలించేందుకు భారత వాయుసేన రఫెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. హసిమారా నుంచి రెండు రఫెల్ విమానాలను ప్రయోగించింది. కానీ రఫెల్ విమానాలు ఆ అనుమానిత వస్తువును గుర్తించలేకపోయాయి. ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో తిరిగొచ్చాయని అధికారులు తెలిపారు. గగనతలంలో గుర్తుతెలియని వస్తువులు ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించాయి. రెండు గుర్తు తెలియని వస్తువులు మధ్యాహ్నం 2.30 నుంచి నాలుగింటి దాకా రన్‌వే పరిసరాల్లో ఎగురుతూ కనిపించినట్టు అధికారులు తెలిపారు. దాంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయాన్ని మూసేశారు. అయితే.. ఈ ఘటన జరిగిన వెంటనే ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజంను యాక్టివేట్ చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ కమాండ్ తెలిపింది. ఈ పరిణామాల తర్వాత ఆ వస్తువు కనిపించకుండా పోయిందని తెలిపారు. గుర్తు తెలియని వస్తువులను పసిగట్టడానికి వాయు సేన హషిమార నుంచి రఫెల్ యుద్ధ విమానాన్ని పంపించింది. అత్యాధునిక సెన్సార్లు కలిగిన ఈ విమానం అత్యంత ఎత్తులో గాలించినప్పటికీ ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో వెనక్కి వచ్చింది. కాసేపటికీ మరో రఫెల్‌ను అధికారులు పంపించారు. అప్పుడు కూడా ఎలాంటి వస్తువు కనిపించకలేదని అధికారులు తెలిపారు. యూఎఫ్‌వో కారణంగా మూడు గంటల పాటు విమానరాకపోకలకు అంతరాయం కలిగింది. ఇదీ చదవండి: Uttarakhand Tunnel Collapse: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు -
ఇంఫాల్ విమానాశ్రయంలో డ్రోన్ల కలకలం
ఇంఫాల్: గగనతలంలో డ్రోన్లు ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించాయి. రెండు గుర్తు తెలియని వస్తువులు మధ్యాహ్నం 2.30 నుంచి నాలుగింటి దాకా రన్‌వే పరిసరాల్లో ఎగురుతూ కని్పంచినట్టు అధికారులు తెలిపారు. దాంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయాన్ని మూసేశారు. విమానాల రాకపోకలను కూడా నిలిపేశారు. రెండు విమానాలను దారి మళ్లించగా అక్కణ్నుంచి బయల్దేరాల్సిన మూడు విమానాలు ఆలస్యమయ్యాయి. మూడు గంటల విరామం అనంతరం సేవలను పునరుద్ధరించారు. తూర్పున మయన్మార్‌తో మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. -
గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు.. ఎయిర్‌పోర్టు మూసివేత
ఇంఫాల్: గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు కనిపించడంతో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. బిర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతంలలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు గుర్తు తెలియని డ్రోన్లు ఎగురుతుండటం గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. అదే విధంగా ఇంఫాల్‌కు రావాల్సిన విమానాలను సైతం ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శాంతిభద్రతలు అదుపులోకి రాకపోవడంతో మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ప్రభుత్వం మరో అయిదు రోజులు(నవంబర్ 23 వరకు) పొడిగించిన నేపథ్యంలో ఈ సంఘటన వెలుగుచూడటం గమనార్హం. అల్లర్లు, హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 3నుంచి మైతీ, కుకీ తెగల మధ్య చెలరేగిన ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోగా కనీసం 50వేల మంది నిరాశ్రయులయ్యారు.మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించేందుకు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కొండ ప్రాంతాల్లో అత్యధికంగా నివసించే కుకీ వర్గం ప్రజలు దీనిని వ్యతిరేకించారు. నాటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. -
మణిపూర్ విద్యార్థుల హత్య కేసులో నలుగురు అరెస్ట్..
ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా తెలియజేశారు. మూడు నెలల క్రితం మణిపూర్ అల్లర్లలో జరిగిన దారుణ సంఘటన ఒకటి ఇటీవల వెలుగులోకి రావడంతో మరోసారి ఆ రాష్ట్రం భగ్గుమంది. కనిపించకుండా పోయిన ఇద్దరు మైనర్ విద్యార్థుల మృతదేహాల ఫోటోలు వైరల్ కావడంతో ఆగ్రహించిన విద్యార్థులు రోడ్లపైకి నిరసనలు తెలిపారు. వెంటనే ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం కేసును సీబీఐ చేతికి అప్పగించింది. మణిపూర్ పోలీసులు ఆర్మీ సంయుక్తంగా కేసులో దర్యాప్తు చేయగా నిందితులు ఇంఫాల్‌కు 51 కి.మీ. దూరంలో అత్యధిక సంఖ్యలో కుకీలు నివాసముండే చురాచంద్పూర్లో ఉన్నట్లు కనుగొన్నారు. హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న నలుగురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు మహిళలను కూడా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్టైన వారిని పావోమిన్లామ్ హవోకిప్, మల్సాన్ హవోకిప్, లింగ్నేచొంగ బైటే, తిన్నీఖోల్‌లుగా గుర్తించారు. మే 3న అల్లర్లకు బీజం పడింది ఈ చురాచంద్‌పూర్‌లోనే. దీంతో భద్రతా దళాలు అప్పట్లోనే ఇక్కడి తిరుగుబాటు వర్గాలతో ఎటువంటి అల్లర్లకు పాల్పడమని హామీ కూడా ఇచ్చారు. ఈ ప్రాంతంలో నిందితులను పట్టుకున్న భద్రతా దళాలు అక్కడి నుండి వారిని ఇంఫాల్ ఎయిర్‌పోర్టుకు తరలిస్తున్నారని తెలుసుకుని భారీ సంఖ్యలో జనం ఎయిర్‌పోర్టును చుట్టుముట్టారు. అప్పటికే అక్కడ కేంద్ర భద్రతా బలగాలను మోహరించడంతో వారు లోపలికి ప్రవేశించలేకపోయారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ వారిని ఇంఫాల్ ఎయిర్‌పోర్టు నుండి 5.45 కి ఆఖరి ఫ్లైట్‌లో అసోంలోని గువహతికి తరలించింది సీబీఐ. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ.. ఇద్దరు విద్యార్థులు హిజామ్ లువాంబి, హేమంజిత్ హత్య కేసులో ప్రధాన నిందితులను చురాచంద్పూర్లో అరెస్టు చేయడం జరిగింది. నేరం చేసిన వ్యక్తి అందరి కళ్లుగప్పి తప్పించుకోవచ్చేమో కానీ చట్టం చేతుల్లో నుంచి మాత్రం తప్పించుకోలేరు. వారు చేసిన తప్పుకు తగిన శిక్ష పడి తీరుతుందని రాశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. కొన్ని కుకీ తిరుగుబాటు గ్రూపులు మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన ఉగ్రవాదులతో చేతులు కలిపి మణిపూర్ అల్లర్లకు కారణమయ్యారని.. దాని ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రం ఉగ్రవాదులతో పోరాడుతోందని అన్నారు. హత్య కేసులో నిందితులు దొరికారు కానీ చనిపోయినవారి మృతదేహాల జాడ ఇంకా తెలియాల్సి ఉంది. I’m pleased to share that some of the main culprits responsible for the abduction and murder of Phijam Hemanjit and Hijam Linthoingambi have been arrested from Churachandpur today. As the saying goes, one may abscond after committing the crime, but they cannot escape the long… — N.Biren Singh (@NBirenSingh) October 1, 2023 ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ హత్య -
Manipur Violence: నిరసనలతో దద్దరిల్లిన ఇంఫాల్
ఇంఫాల్: మణిపూర్‌లో యువ జంట హత్యతో మొదలైన నిరసనలు గురువారం సైతం కొనసాగాయి. ఆందోళనకారులు ఇంఫాల్ వెస్ట్‌లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంపై దాడికి దిగారు. అక్కడున్న రెండు కార్లకు నిప్పుపెట్టారు. సీఆర్పీఎఫ్ బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బుధవారం రాత్రి పలు చోట్ల నిరసనకారులు భద్రతా బలగాలపై దాడులకు దిగారు. దీంతో, బలగాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. పోలీసు వాహనానికి నిప్పుపెట్టడంతోపాటు పోలీసు వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కెళ్లారు. థౌబల్ జిల్లా ఖొంగ్జమ్లో బీజేపీ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. గురువారం రాత్రి సీఎం బిరేన్ సింగ్ పూరీ్వకుల ఇంటిపై దాడికి జరిగిన ప్రయత్నాన్ని పోలీసులు వమ్ము చేశారు. మా వాళ్ల మృతదేహాలు ఎక్కడున్నాయో గుర్తించండి దుండగుల చేతుల్లో దారుణ హత్యకు గురైన తమ పిల్లల మృతదేహాల జాడ చెబితే అంత్యక్రియలు జరుపుకుంటామని వారి తల్లిదండ్రులు పోలీసులను కోరారు. మెయితీ వర్గానికి చెందిన యువతి, యువకుడు జూన్‌లో గుర్తు తెలియని దుండగుల చేతుల్లో హత్యకు గురి కావడం, వారి ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం తెలిసిందే. ఈ హత్య ఘటన మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలకు కారణమైంది. మెయితీల ఆచారం ప్రకారం..అంతిమ సంస్కారాలు జరపడానికి మృతులు ధరించిన దుస్తులకు సంబంధించిన చిన్న గుడ్డ ముక్కయినా ఉండాలి. అంత్యక్రియలు జరిపేవరకు వారి ఫొటోల వద్ద మృతుల తల్లులు అగరొత్తులు, క్యాండిల్ వెలిగిస్తూ రోజూ ఆహారం నివేదన చేస్తూ ఉండాలి. వారి లేని లోటు ఎవ్వరూ పూడ్చలేరు. కనీసం వారికి తగు గౌరవంతో అంత్యక్రియలు జరపాలనుకుంటున్నామని యువతి తండ్రి హిజామ్ కులజిత్ చెప్పారు. తాజాగా, సీబీఐ దర్యాప్తుతోనయినా తమ కోరిక నెరవేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మణిపూర్‌కు శ్రీనగర్ ఎస్ఎస్పీ బల్వాల్ బదిలీ న్యూఢిల్లీ: ఉగ్ర సంబంధ కేసులను డీల్ చేయడంలో సమర్థుడిగా పేరున్న శ్రీనగర్ సీనియర్ ఎస్పీ రాకేశ్ బల్వాల్ను కేంద్రం మణిపూర్‌కు బదిలీ చేసింది. మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, శాంతిభద్రతలు దారుణంగా దెబ్బతినడంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది. 2012 ఐపీఎస్ అధికారి అయిన రాకేశ్ బల్వాల్ను డిసెంబర్ 2021లో అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాల కేడర్‌కు మార్చారు. తాజాగా ఆయన్ను మణిపూర్ కేడర్‌కు మారుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన హోం వ్యవహారాల శాఖ ప్రతిపాదనకు నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. మణిపూర్‌లో ఆయన కొత్త బాధ్యతలను చేపడతారని తెలిపింది. జమ్మూలోని ఉధంపూర్‌కు చెందిన బల్వాల్ మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌కు 2017లో సీనియర్ ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. -
మణిపూర్‌లో వలసదారుల జల్లెడ కార్యక్రమం పొడిగింపు
ఇంఫాల్: మణిపూర్‌లో అల్లర్లు తగ్గుముఖం పట్టి అక్కడ పరిస్తితి ఇప్పుడిప్పుడే యధాస్థితికి చేరుకుంటోంది. అంతకుముందు మయన్మార్ నుంచి ఇక్కడికి వలస వచ్చినవారిని లెక్కించాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని గడువు సెప్టెంబర్ 30తో ముగియనుండటంతో కేంద్రం ఆ గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించింది. మణిపూర్ అల్లర్లకు మయన్మార్ నుంచి వలస వచ్చిన వారు కూడా కారణమై ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బయోమెట్రిక్ ఆధారంగా మయన్మార్ వాసులను లెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్ర హోంశాఖ.మణిపూర్‌తో పాటు మిజోరాంలో కూడా ఈ వలసదారులను లెక్కించమని కోరిన మిజోరాం దానిని తిరస్కరించింది. అలా చేస్తే అక్కడి వారిపై వివక్ష చూపించినట్లవుతుందని మిజోరాం అభిప్రాయపడింది. మే 29న కేంద్ర హోంశాఖ అక్రమ వలసదారులను బయోమెట్రిక్ ఆధారంగా గుర్తించాలని సెప్టెంబర్ 30 లోపే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. హోంశాఖ జాయింట్ సెక్రటరీ అంతకుముందు తెలిపిన వివరాల ప్రకారం మయన్మార్ వాసులు సాధారణంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తుంటారని అందుకే వారి గణన చేపట్టామన్నారు. ఎన్సీఆర్బీ(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) వారిచే శిక్షణ తీసుకున్న ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి కూడా అల్లర్లకు మయన్మార్ వాసులే కారణమని ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. మయన్మార్ వలసదారులు ఎక్కువగా అడవులను కొట్టి, గసగసాల సాగు, గంజాయి సాగుకి పాల్పడుతూ ఉంటారని సీఎం బైరెన్ సింగ్ ప్రకటించారు. ఇది కూడా చదవండి: సీబీఐ క్లీన్చిట్ ఇస్తే రాజీనామా చేస్తారా? కేజ్రీవాల్ సవాల్! -
మణిపూర్‌ను 'కల్లోలిత ప్రాంతం'గా ప్రకటించిన ప్రభుత్వం
ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థుల హత్య వెలుగులోకి రావడంతో మరోసారి అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. విద్యార్థుల మృతికి నిరసనగా పెద్దఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్టోబర్ 1 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టాన్ని (AFSPA) మరో ఆరు నెలల పాటు పొడిగించింది. మళ్ళీ మొదలు.. మే 3న మొదలైన అల్లర్లకు మణిపూర్ రాష్ట్రం నాలుగు నెలలుగా అట్టుడుకుతూనే ఉంది. ఇప్పటికీ ఒక్కో దారుణం వెలుగులోకి వస్తుండటంతో అక్కడ వాతావరణం చల్లారినట్టే చల్లారి అంతలోనే మళ్ళీ అల్లర్లు చెలరేగుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించిన వీడియో ఎలాంటి పరిణామాలను సృష్టించిందో తాజాగా ఇద్దరు విద్యార్థుల మృతదేహాల ఫోటోలు వెలుగులోకి రావడంతో మళ్ళీ అలాంటి ఉద్రిక్తతే నెలకొంది. The students of #Manipur have joined forces to express their solidarity, demanding #Justice4LinthoiNHemanjit. Our commitment to ensuring accountability for the tragic loss of the 2 Students is unwavering. The fact that not a single #Kuki spoke out against the slaughter is awful! pic.twitter.com/s1KAG6hxVt — YumnamEvelyn (@YumnamEvelyn) September 27, 2023 విద్యార్ధులపై లాఠీ.. ఇద్దరు విద్యార్థుల మృతదేహాల ఫోటోలు ఒక్కసారిగా ఇంటర్నెట్లో వైరల్ కావడంతో విద్యార్థులంతా ఇంఫాల్ వీధుల్లో నిరసనలకు దిగారు. ముఖ్యమంత్రి నివాసానికి దగ్గర్లోని కంగ్లా కోట సమీపంలో నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు. పోలీసుల దాడిలో సుమారు 45 మంది విద్యార్థినీ విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. కల్లోలిత ప్రాంతం.. మణిపూర్ అల్లర్లు జరిగి ఐదు నెలల తర్వాత సెప్టెంబర్ 23న మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించిన ప్రభుత్వం తిరిగి మంగళవారం నుండి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించింది. పదేపదే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. ఇంఫాల్ లోయ వద్ద 19 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాన్ని మినహాయించి మిగతా రాష్ట్రమంతా కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. అదేవిధంగా సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల అఫ్స్పా చట్టాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. సీఎం బైరెన్ సింగ్ ఇద్దరు విద్యార్థుల కేసులో దర్యాప్తుకు సీబీఐని ఆదేశించారు. The situation in #Manipur is very bad and PM Modi is busy campaigning for his party.#Manipur pic.twitter.com/MQvbraAWXB — Aafrin (@Aafrin7866) September 26, 2023 The students of Manipur continue to protest for justice for the "Murder of Linthoinganbi and Hemanjit" The police can act only on the protests in Imphal. Had they acted like on 3rd May, would the violence be there?#JusticeForLinthoiganbiAndHemanjit #Manipur #Imphal… pic.twitter.com/cmkyFYJYAy — babynongsha (@nongsha_meetei) September 27, 2023 ఇది కూడా చదవండి: కావేరీ జలాలపై సుప్రీం కోర్టులో సవాల్ చేస్తాం: సిద్దరామయ్య -
విద్యార్థుల హత్యతో రగిలిన మణిపూర్.. ఇంటర్నెట్ నిషేధం..
ఇంఫాల్: మణిపూర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గతంలో తప్పిపోయినట్టు ప్రచరం జరిగిన ఇద్దరు విద్యార్థులు విగత జీవులుగా మారారు. వీరి ఫోటోలు ఇప్పుడు వైరల్ కావడంతో అక్కడి విద్యార్థులు నిరసన కార్యక్రమానికి తెరతీశారు. దీంతో మరోసారి అక్కడ ఇంటర్నెట్ సేవల వినియోగాన్ని నిషేధించింది రాష్ట్ర ప్రభుత్వం. మే నెలలో జరిగిన అల్లర్లు మణిపూర్ రాష్ట్రంలో అల్లకల్లోలాన్ని సృష్టించాయి. మొత్తం 175 మంది ప్రాణాలు కోల్పోగా అనేకులు గాయపడ్డారు. వేలసంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. తరువాత కొన్నాళ్లకు అక్కడి పరిస్థితులు సద్దుమణగడంతో జులై 6న కొన్ని ఆంక్షలను సడలించింది మణిపూర్ ప్రభుత్వం. అందులో భాగంగానే ఇంటర్నెట్ సేవలపై ఉన్న ఆంక్షలను కూడా తొలగించింది. దీంతో అల్లర్ల సమయంలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటి వెలుగులోకి రావడం మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్, హత్య కేసు కూడా వెలుగులోకి వచ్చింది. జులై 6న ఆంక్షలు సడలించిన తర్వాత హిజామ్ లువాంబి(17) స్నేహితుడు హేమంజిత్(20)తో కలిసి నీట్ క్లాస్ కు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు వీరి తల్లిదండ్రులు. చివరిగా హిజామ్ ఫోన్ క్వాట్కా దగ్గర స్విచాఫ్ అయిందని ఆమె స్నేహితుడి ఫోన్ మాత్రం లమదాన్ వద్ద స్విచ్చాఫ్ అయినట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. చాలా రోజుల తర్వాత వారిద్దరికీ సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ఒక ఫోటోలో హిజామ్ తెల్లటి టీషర్టులోనూ హేమంజిత్ చెక్ షర్టులోనూ కనిపించరు. ఆ ఫోటోలో వారి వెనుక ఇద్దరు తుపాకులు పట్టుకుని ఉండటాన్ని చూడవచ్చు. ఆ ఫోటోతో పాటే వారి మృతదేహాలు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో విద్యార్థులు నిరసనకు దిగారు. ర్యాలీగా వారు ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ ఇంటిని ముట్టడి చేసే ప్రయత్నం చేయగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అనంతరం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఢిల్లీలోని జ్యువెలరీ షోరూంలో రూ.25 కోట్ల నగలు చోరీ.. -
మీడియా తప్పుడు కథనాలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రభుత్వం
ఇంఫాల్: మణిపూర్‌లో అల్లర్లను తగ్గుముఖం పట్టించేందుకు ఒకపక్క తాము అహర్నిశలు శ్రమిస్తుంటే మరోపక్క ఎడిటర్స్ గిల్డ్ ఇండియా మీడియా సంస్థ అగ్గికి ఆజ్యం పోసిందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అదనంగా ఎన్.శరత్ సింగ్ అనే సామాజిక కార్యకర్త కూడా ఈజీఐ పై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. మణిపూర్‌లో కుకీ, మెయిటీ తెగల మధ్య జరిగిన అల్లర్లు చిలికి చిలికి గాలివానై తర్వాతి దశలో పెను ప్రళయంగా మారి దారుణ మారణకాండకు దారితీశాయి. అల్లర్ల సమయంలో జరిగిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సింది పోయి తప్పుడు కథనాలను ప్రచురించి అల్లర్లకు మరింత చెలరేగడానికి కారణమయ్యారని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాపై కేసు నమోదు చేసింది మణిపూర్ ప్రభుత్వం. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా శనివారం ప్రచురించిన కథనం ప్రకారం మణిపూర్ ప్రభుత్వం అల్లర్ల సమయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించినట్లు స్పష్టమయ్యిందని.. ప్రజాస్వామ్య ప్రభుత్వంలా ప్రజలపట్ల సమానంగా వ్యవహరించకుండా ఒక పక్షంవైపే నిలిచిందని ఆరోపించింది. ఈ ఆరోపణలు అసత్యమైనవని చెబుతూ మొదట రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. #WATCH | The State government has filed an FIR against the members of the Editors Guild who are trying to create more clashes in the state of Manipur, says CM N Biren Singh. pic.twitter.com/gm2RssgoHL — ANI (@ANI) September 4, 2023 ఇది కాకుండా ఎడిటర్స్ గిల్డ్ ప్రచురించిన కథనానికి వ్యతిరేకంగా ఇంఫాల్‌కు చెందిన ఒక సామాజిక కార్యకర్త ఎం.శరత్ సింగ్ ఆగస్టు 7 నుంచి 10 లోపు మణిపూర్ వచ్చిన సీమా గుహ, సంజయ్ కపూర్, భారత్ భూషణ్‌లతో పాటు ఎడిటర్స్ గిల్డ్ ఆ ఇండియా ప్రెసిడెంట్ పైన కూడా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నివేదికలో ఉన్నఅనేక తప్పిదాలను సాక్ష్యాధారాలతో సహా ఎఫ్ఐఆర్లో ఏకరువు పెట్టారు. ఎఫ్ఐఆర్లో మే 3న నిప్పుల్లో కాలుతోన్న మణిపూర్ అటవీ శాఖాధికారి గృహం ఫోటోకు కింద 'తగలబడుతున్న కుకీ గృహం' అని ఎడిటర్స్ గిల్డ్ ప్రచురించిందని పేర్కొన్నారు. దీనికి సాక్ష్యంగా అదే రోజున స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను జతచేశారు. ఆ స్టేషన్ ఎస్ఐ జంగ్ఖొలాల్ కిప్జెన్ మాట్లాడుతూ ఇది కుకీలు నివాసం కాదని అల్లర్ల సమయంలో నిరసనకారులు తగలబెట్టిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇల్లని స్పష్టం చేశారు. దీంతో నాలుక్కరుచుకున్న ఎడిటర్స్ గిల్డ్ తమ తప్పును అంగీకరిస్తూ సెప్టెంబర్ 2న ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంటూ.. అసలు వివరాలు త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించింది. There was an error in a photo caption in the report released on Sep 2. The same is being rectified and updated report will be uploaded on the link shortly. We regret the error that crept in at the photo editing stage — Editors Guild of India (@IndEditorsGuild) September 3, 2023 అంతకు ముందు ఎడిటర్స్ గిల్డ్ ఇచ్చిన నివేదిక ప్రకారం మయన్మార్ మిలటరీ తిరుగుబాటు కారణంగా అక్కడి నుండి వలస వచ్చిన వారితో కలిపి మణిపూర్ ప్రభుత్వం కుకీలను కూడా వలసదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని ఆరోపించింది. కుకీలకు వ్యతిరేకంగా వ్యవహరించి మణిపూర్ ప్రభుత్వం అత్యధికులు ఆగ్రహానికి కారణమైందని రాసింది. ఈ విషయాన్ని కూడా శరత్ సింగ్ ఎఫ్ఐఆర్లో ప్రస్తావిస్తూ అక్రమ వలసదారులకు సంబంధించి ఈజీఐ కీలక సమాచారాన్ని ప్రచురించలేదని 2001తో పోలిస్తే సెన్సస్ 169 శాతం పెరిగిందని.. దీనిపై వారు కథనాన్ని ప్రచురించి ఉంటే బాగుండేదని అన్నారు. ఇటీవల ఎలక్షన్ కమీషన్ ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలు జరిగాయని సుమారు 1,33,553 డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లుగా వారు గుర్తించారని తెలిపారు. కొండ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కేవలం 10 శాతం అభివృద్ధి ఐదులను మాత్రమే వినియోగిస్తోందని ఎడిటర్స్ గిల్డ్ ప్రచురించిన కథనం కూడా అవాస్తవమని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులలో దాదాపు 40 శాతం గిరిజనులు నివసించే కొండప్రాంతాలకే వెచ్చింస్తోందని తెలిపారు.. ఇలా అడుగడుగునా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అనేక తప్పుడు కథనాలను ప్రచురించి పజాలను ఏమార్చి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని శరత్ సింగ్ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్పై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఇంకా స్పందించాల్సి ఉంది. State Government had stated on the floor of the Assembly in 2021 regarding the budget allocation for the Valley and Hills across all departmental works. A committee was formed to check the fund inflow over the last 10 years, the methodology was also explained. There has been a… pic.twitter.com/w8MuIumve9 — Rajkumar Imo Singh (@imosingh) August 24, 2023 ఇది కూడా చదవండి: ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..? -
Manipur Violence: మణిపూర్‌లో సజీవదహనమైన తల్లీకొడుకులు..
ఇంఫాల్: మణిపూర్‌లో తవ్వేకొద్దీ దారుణాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ చేతికి మొత్తం 20 కేసులను అప్పగించగా తాజాగా వారికి మరో సంచలనాత్మక కేసును అప్పగించారు మణిపూర్ పోలీసులు. ఆనాటి అల్లర్లలో బులెట్ గాయమైన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని ఆసుపత్రికి తీసుకెళ్తోన్న తల్లి, మేనత్తలను బిడ్డతో సహా సజీవ దహనం చేసిన ఈ సంఘటన అధికారులను సైతం కలచివేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 4న టాన్సింగ్(7) సహాయక శిబిరంలో ఉండగా మెయిటీ అల్లరి మూకలు జరిపిన కాల్పుల్లో ఒక బులెట్ అతడి తలలోకి దూసుకెళ్లింది. వెంటనే సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు అక్కడి ఎస్పీతో మాట్లాడి బాలుడి తోపాటు తల్లి, మేనత్తలను మాత్రమే వెంట ఆసుపత్రికి పంపాల్సిందిగా సూచించారు. ఎందుకంటే బాలుడి తండ్రి జాషువా హాంగ్సింగ్ కుకీ తెగకు చెందిన వారు కాగా తల్లి మీనా హాంగ్సింగ్ మాత్రం మెయిటీ తెగకు చెందింది. ఆమెనైతే మెయిటీలు ఏమీ చేయరన్న ఉద్దేశ్యంతో అలా చేసినట్టు ఆర్మీ అధికారి తెలిపారు. అధికారి చెప్పినట్టుగానే బాలుడిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు ఎస్పీ. అంబులెన్స్ కు తోడుగా ఇంఫాల్ వెస్ట్ సూపరింటెండెంట్ సహా పోలీసుల ఎస్కార్టును కూడా పంపించారు ఆర్మీ ప్రతినిధులు. సరిగ్గా ఇంఫాల్ సరిహద్దుకు చేరుకోగానే సుమారు 2000 మంది గుంపు చుట్టూ మూగడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కొంచెం వెనక్కి తగ్గినట్టే తగ్గి అలరిమూక ఒక్కసారిగా దాడి చేసి అంబులెన్సుకు నిప్పు పెట్టేశారు. పోలీసులు చూస్తుండగానే అంబులెన్స్ మంటల్లో చిక్కుకోగా అందులోని బాలుడు, అతడి తల్లి, మేనత్త సజీవ దహనమయ్యారు. బాలుడి తండ్రి జాషువా హాంగ్సింగ్ కాంగ్పోక్పి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా.. లాంఫెల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇదే కేసు నమోదైంది. దీంతో సీబీఐ ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించి రెండు కేసులు ఒక్కటేనని తేల్చి దర్యాప్తు చేసే పనిలో పడింది. మణిపూర్‌లో రెండున్నర నెలలుగా సాగుతున్న హింసాకాండలో ఇప్పటివరకు 160 మంది మృతి చెందగా అల్లర్ల సమయంలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు -
నా కొడుకు, భర్తను చంపేశారు..కనీసం వారి శవాలనైనా ఇప్పించండి..
ఇంఫాల్: మణిపూర్‌లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ప్రతిపక్ష ఎంపీలు రెండ్రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి రోజున వీరంతా బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా నగ్నంగా ఊరేగించబడిన మహిళల్లో ఒకరి తల్లి హృదయవిదారకమైన తన విన్నపాన్ని వారికి వివరించింది. నా భర్తను, కొడుకుని కూడా అదేరోజున చంపేశారు. దయచేసి వారి శవాలనైనా మాకు ఇప్పించండని వేడుకున్నారు. వర్గవివక్ష కారణంగా చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో మణిపూర్ రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు 21 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా వారు బాధితులను పరామర్శించారు. వారిలో నగ్నంగా ఊరేగించబడిన మహిళల్లో ఒకరి తల్లి మాట్లాడుతూ.. ఆరోజున నాకు జరిగిన నష్టం చాలా పెద్దది. నా కుమార్తెను వివస్త్రురాలికి చేసి దారుణంగా అవమానించారు. అడ్డుకున్న నా భర్త, కుమారుడిని చంపేశారు. కుకీలు, మెయిటీలు ఇకపై కలిసి ఉండటం జరగదని అన్నారు. ఆమెతో మాట్లాడిన తర్వాత సుష్మితా దేవ్ స్పందిస్తూ.. పోలీసుల సమక్షంలోనే ఆమె కొడుకును, భర్తను చంపేశారు. అయినా కూడా ఏ ఒక్క పోలీసును సస్పెండ్ చేయలేదు. సుమారు వెయ్యిమంది ఆరోజున దాడిలో పాల్గొన్నారని బాధితురాలు చెబుతోంది. ఆమె కుమార్తెను దారుణంగా నగ్నంగా ఊరేగించారు. ప్రస్తుతం ఆ యువతి పోలీసులను చూస్తేనే భయపడిపోతోంది. పోలీసు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవడమంటే అది రాజ్యాంగానికే మాయని మచ్చ. ఆమె తన భర్త, కొడుకుల శవాలనైనా ఇప్పించమని కోరుతున్నారు. నేను ఈ విషయాన్ని కచ్చితంగా గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు. ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. పాపం ఆ బాధితురాలి భర్త దేశ సైన్యంలో పనిచేశారు. దేశానికి రక్షణ కల్పించారు కానీ కుటుంబాన్ని రక్షించుకోలేకపోయారు. తనకు అంత నష్టం జరిగితే ఇంతవరకు ఆమెకు న్యాయం జరగకపోవడం దారుణమన్నారు. ఆ రోజున.. మే 4న ఒక్కసారిగా అల్లరి మూకలు విధ్వంసం సృష్టిస్తుండటంతో సేనాపతి జిల్లాలోని బి.ఫయనోమ్ గ్రామంలో ఓ పెద్దాయన(51) అతడి కుమారుడు(19), కుమార్తె(21), మరో ఇద్దరు మహిళలు కలిసి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు బయలుదేరారు. అంతలో 800 నుంచి 1000 మందితో ఉన్న ఓ భారీ గుంపు ఈ ఐదుగురిని సమీపించి మొదట యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమె తండ్రిని, తమ్ముడిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. తర్వాత యువతితోపాటు మరో మహిళను నగ్నంగా ఊరేగిస్తూ పొలాల్లోకి తీసుకెళ్ళి వారిలో ఒకరిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ వీడియో చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది కూడా చదవండి: మణిపూర్ మహిళల వీడియో కేసులో సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు -
Manipur: మతం రంగు పులమొద్దు
ఢిల్లీ: మణిపూర్ హింసకు మతం రంగును అద్ది.. ఏకంగా పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టింది యూకే. అయితే దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్గత విషయాల్లో జోక్యాన్ని సహించబోమని చెబుతూనే.. వలసవాద బుద్ధిని ప్రదర్శించారంటూ మండిపడింది. తాజాగా ఈ ఎపిసోడ్లో మరో పరిణామం చోటు చేసుకుంది. ఇంఫాల్‌కు చెందిన పౌర సంఘాలన్నీ Coordinating Committee on Manipur Integrity సంయుక్తంగా.. యూరోపియన్ పార్లమెంట్‌కు లేఖలు రాశాయి. మణిపూర్ అల్లర్లు వలస చిన్-కుకీ నార్క్ ఉగ్రవాదులకు, స్థానిక మెయితీ తెగలకు మధ్య జరుగుతోంది. అంతేకాని దానికి మతం రంగు పులమడం సరికాదని పేర్కొన్నాయి. ఈ మేరకు స్ట్రాస్బోర్గ్కు చెందిన యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాబర్టా మెట్సోలాకు సీవోసీవోఎంఐ కో-ఆర్డినేటర్ జితేంద్ర నిన్గోంబా లేఖ రాశారు. ‘‘మణిపూర్ అల్లర్లు.. హింసపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనవహించడం సరికాదని, కేంద్రం సత్వరమే జోక్యం చేసుకుని ఉంటే ఉంటే పరిస్థితి ఇలా తయారయ్యేది కాదని.. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలంటూ యూరోపియన్ పార్లమెంట్ తొలిసారిగా మణిపూర్ అంశం మీద తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ పరిణామాన్ని స్వాగతించిన సీవోసీవోఎంఐ.. మతం రంగు అద్దడంపై మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మణిపూర్ ఘర్షణలకు ఆజ్యం పోసింది నార్క్-టెర్రరిజం. అలాంటి ప్రధాన సమస్యను మీరు విస్మరించారు. తద్వారా మణిపూర్‌ను మరో న్యూ గోల్డెన్ ట్రయాంగిల్‌గా మారేందుకు అవకాశం కల్పించారు. (చైనా, లావోస్, మయన్మార్, థాయ్‌లాండ్‌లో డ్రగ్ ట్రాఫికింగ్ కారిడార్లను కలిపి ది గోల్డెన్ ట్రయాంగిల్‌గా అభివర్ణిస్తుంటారు.) ఇలాంటి తీర్మానం ప్రవేశపెట్టడం విచారకరం. చిన్-కుకీ ఉగ్ర సంస్థల ప్రచారం వల్లే.. మణిపూర్‌లో క్రైస్తవ మైనారిటీ, మెజారిటీ మెయితీ హిందువుల మధ్య వివాదంగా మీరు తప్పుగా అర్థం చేసుకోగలిగేలా చేసింది. మణిపూర్‌లో మతపరమైన కారణాల వల్ల హింస చెలరేగలేదు. పైగా ఇక్కడెంతో సామరస్యం విరజిల్లుతోంది కూడా. రాజధాని ఇంఫాల్ సహా మెయితీల ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లోనూ చర్చిల కార్యకలాపాలకు ఎలాంటి విఘాతం కలగలేదని మీరు గమనించాలి. మణిపూర్‌లో లక్షాల డెబ్భై వేల జనాభా ఉన్న మెయితీ తెగ ప్రజలు క్రైస్తవులే. అలాగే.. కుకీ జనాభాలో 35 శాతం క్రైస్తవులు ఉన్నారు. కేవలం గంజాయి, మత్తు పదార్థాల రవాణా(నార్కో టెర్రరిజం), ఆయుధాల అక్రమ రవాణా మీద ఆధారపడి ఉన్న వలస ‘చిన్-కుకీ’ గ్రూప్‌ల వల్లే మణిపూర్‌కు ఈ పరిస్థితి దాపురించింది. వీళ్ల ప్రభావం సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్‌కు కూడా తప్పడం లేదు అని లేఖలో స్పష్టం చేసింది సీవోసీవోఎంఐ. ఇదీ చదవండి: మెయితీల వలసబాట.. కారణం ఎవరంటే.. -
మణిపూర్‌లో మరో ఘోరం.. ఫ్రీడం ఫైటర్ భార్య సజీవ దహనం
ఇంఫాల్: మణిపూర్ ప్రజలు గడిచిన రెండున్నర నెలలుగా కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోందను కుంటున్న తరుణంలో అల్లర్ల సమయంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా వీధుల్లో ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన మరువక ముందే ఒక మహిళను ఇంట్లోనే పెట్టి సజీవ దహనం చేసిన మరో ఘటన సెరౌ పోలీస్ స్టేషన్లో నమోదైంది. మే 28న కక్చింగ్ జిల్లాలోని సెరౌ గ్రామంలో నివాసముంటున్న స్వాతంత్య్ర సమరయోధుడి భార్య ఐబెతొంబి(80)ను అల్లర్ల సమయంలో ఇంట్లోనే బంధించి ఇంటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. దీంతో బాధితురాలు ఎటూ తప్పించుకోలేక అగ్నికి సజీవ దహనమైంది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన మనవడు ప్రేమకంఠ(22) పై సాయుధులైన నిరసనకారులు బుల్లెట్ల వర్షం కురిపించడంతో అతడి చేతుల్లోకి తొడభాగంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అనంతరం అతడిని ఆసుపత్రిలో చేర్చగా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆరోజున ప్రమాదాన్ని పసిగట్టిన మృతురాలు కొద్దిసేపైన తర్వాత తిరిగి రండని చెప్పి ఇంట్లో వాళ్ళని బయటకు వెళ్ళమని చెప్పి తాను మాత్రం ఇంట్లోనే ఉండిపోయి అగ్నికి ఆహుతైందని చెప్పుకొచ్చాడు ప్రేమకంఠ. రెండు నెలల తర్వాత తిరిగొచ్చిన అతను శిధిలమైన ఇంటి నుండి జ్ఞాపకాలను తన వెంట తీసుకుని వెళ్ళాడు. వాటిలో మృతురాలి భర్త ఎస్. చురాచంద్ సింగ్(లేటు) భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా గౌరవ పురస్కారాన్ని స్వీకరించిన ఫోటో ఫ్రేము కూడా ఉంది. మణిపూర్ అల్లర్లలో అత్యధికంగా నష్టపోయిన గ్రామాల్లో సెరౌ గ్రామం కూడా ఒకటి. రాజధానికి 45 కి.మీ దూరంలో ఉండే ఈ ప్రాంతం హింసాకాండలో బాగా ప్రభావితమైంది. ప్రస్తుతం ఈ గ్రామంలో ఎక్కడ చూసినా సగం కాలిపోయిన ఇళ్ళు.. తూటాల రంధ్రాలతో నిండిన గోడలు దర్శనమిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ప్రధాని పదవి నుండి తప్పుకుని సమర్ధులకి అప్పగించాలి.. అశోక్ గెహ్లాట్ -
Manipur: అర్ధరాత్రి సీఎం ఇంటివైపు శవయాత్ర.. తీవ్ర ఉద్రిక్తత
ఇంఫాల్: కల్లోల మణిపూర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. గురువారం అర్ధరాత్రి దాటాక రాజధాని ఇంఫాల్‌లో ఆందోళనకారులు ఓ మృతదేహాంతో ఉరేగింపుగా ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇంటివైపు వెళ్లే యత్నం చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా.. వాళ్లను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి భద్రతా బలగాలు. కాంగ్పోక్పీ జిల్లాలో గురువారం ఉదయం ఆందోళనకారుల్లోని ఓ వర్గం జరిపిన కాల్పుల్లో.. ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మర్చంట్ నేవీ ఆఫీసర్ కావడంతో ఆగ్రహావేశాలు తారాస్థాయికి చేరాయి. అతని మృతదేహాన్ని ఓ శవపేటికలో ఉంచి.. రాత్రిపూట ఇంఫాల్ నడిబొడ్డున ఖ్వైరాంబంద్ బజార్ సెంటర్‌కు తీసుకొచ్చారు. పూలతో నివాళులు ఘటించేందుకు భారీగా జనం చేరుకున్నారు. అయితే ఆ మృతదేహంతో సీఎం బీరెన్ సింగ్ ఇంటి వైపు శవయాత్రకు మహిళలు సిద్ధపడగా.. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. రోడ్డు మధ్యలో టైర్లను కాల్చి నిరసనలు వ్యక్తం చేశారు వాళ్లు. పరిస్థితి చేజారేలా కనిపించడంతో పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారుల్ని చెదరగొట్టాయి. ఆపై మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుప్రతి మార్చురీకి తరలించాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని బలగాలు ప్రకటించుకున్నాయి. కాంగ్పోక్పి జిల్లా హరోథెల్ గ్రామంలో.. సాయుధ మూక కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మరణించాడని, అనేక మంది గాయపడ్డారని సైన్యం అధికారికంగా ప్రకటించింది. పరిస్థితి అదుపు చేసేందుకు తాము రంగంలోకి దిగినట్లు తెలిపింది ఆర్మీ. కుకీ పనే! కుకి మిలిటెంట్ల కాల్పుల్లో మర్చంట్ నేవీ ఆఫీసర్ వైఖోం నీలకమల్ మృతి చెందానంటూ ఆరోపిస్తోంది అవతలి వర్గం. అదే సమయంలో లీమాఖోంగ్-హరోథెల్లో గురువారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందగా.. మరికొందరు గాయపడినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కల్లోల ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి భద్రతా బలగాలు. ఇదీ చదవండి: మణిపూర్‌లో రాహుల్ గాంధీకి చేదు అనుభవం -
మణిపూర్‌లో అమిత్ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం
మణిపూర్ ఇటీవల చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ. 10 లక్షలు నష్టపరిహారం ప్రకటించింది. అదే విధంగా మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేడు (మంగళవారం) మణిపూర్‌లో పర్యటించారు. అల్లర్లు జరిగిన చురాచంద్ పూర్ జిల్లాలోని స్థితిగతులను పరిశీలించారు. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి బైరెన్ సింగ్‌తో భేటీ అయ్యి జరిగిన ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి ఏ విధమైన పరిహారం అందించాలన్న విషయంపై చర్చించారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ మణిపూర్‌లో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, ప్రాణనష్టం జరిగిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా వెంటనే అందిస్తామని తెలిపారు. పెట్రోల్, గ్యాస్, రైస్, నిత్యావసర వస్తువులకు కొదవ రానీయకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మే 3న ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగి మారణహోమం జరగడంతో యావత్ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. Had a fruitful discussion with the members of the different Civil Society Organizations today in Imphal. They expressed their commitment to peace and assured that we would together contribute to paving the way to restore normalcy in Manipur. pic.twitter.com/ao9b7pinGf — Amit Shah (@AmitShah) May 30, 2023 రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఆశ్రయముంటున్న మెయితేయి వారికి కుకి తెగల మధ్య రగిలిన చిచ్చు చిన్న గాలివానలా మొదలై పెనుమంటలను రాజేసింది. భారీగా ఆస్తి నష్టానికి, ప్రాణనష్టానికి దారితీసింది. ఈ అల్లర్లలో సుమారుగా 70 మంది ప్రాణాలను కోల్పోగా 230 మంది గాయపడ్డారు. సుమారుగా 1700 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. చదవండి: రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో.. కేసుపై పోలీసుల తంట..! -
ఇంఫాల్ నుంచి ఇంటికి వచ్చిన తెలంగాణ విద్యార్థులు..
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: మణిపూర్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు, ఇతర పౌరులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తోంది. తొలి విడతగా సోమవారం మధ్యాహ్నం 72 మంది విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి (6ఈ–3165 విమానంలో) చేరుకున్నారు. మొత్తం 130 మంది విద్యార్థులు అక్కడ ఉన్నట్టు వివరాలు సేకరించిన అధికారులు తరలింపు చర్యలను వేగవంతం చేశారు. రిజర్వేషన్ల అల్లర్లతో మణిపూర్ అట్టుడికి పోతున్న సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రానికి చెందిన విద్యార్థులను సురక్షితంగా రప్పించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో.. సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ ఎప్పటికప్పుడు మణిపూర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మేరకు సోమవారం ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న 72 మందికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, పలువురు పోలీసు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. తమను మణిపూర్ నుండి సురక్షితంగా రప్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. మణిపూర్‌లో ఉన్న మిగతా విద్యార్థుల్లో కొందరు సోమవారం రాత్రి, మరికొందరు మంగళవారం ఉదయానికి హైదరాబాద్‌కు చేరుకుంటారని అధికారులు తెలిపారు. విద్యార్థుల తరలింపు వ్యయం అంతా ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. విద్యార్థులను హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఉన్నా అండగా ఉంటాంమణిపూర్‌లోని ఎన్ఐటీ పక్కనే జరిగిన బాంబు దాడులతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. అయితే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు అక్కడి అధికారులతో మాట్లాడి విద్యార్థులు సురక్షితంగా రాష్ట్రానికి చేరుకునేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా, భరోసాగా ఉంటుందన్నారు. ఇప్పట్లో తిరిగి వెళ్లే పరిస్థితి లేదు.. నాతో పాటు తెలంగాణకు చెందిన నలుగురు అమ్మాయిలం రాష్ట్రానికి చేరుకున్నాం. ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇప్పట్లో తిరిగి వెళ్లి చదువుకునే పరిస్థితులు లేవు. ఉద్రిక్తతలు పూర్తిగా చల్లారిన తర్వాతే తిరిగి వెళతాం. – హరిణి, బీటెక్ విద్యార్థిని, మహబూబ్‌నగర్ మాకు సమీపంలోనే బాంబు దాడులు అల్లర్లు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. మాకు సమీపంలో బాంబు దాడులు కూడా జరిగాయి. దీంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యాం. తెలంగాణ ప్రభుత్వం అక్కడి అధికారులతో సంప్రదింపులు ప్రారంభించిన తర్వాత ఆందోళన తగ్గింది. – వంశీ, బీటెక్ విద్యార్థి, జనగామ ప్రభుత్వం అమ్మా, నాన్నలా స్పందించింది తాగడానికి నీరు, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడ్డాం. రాష్ట్ర ప్రభుత్వం ఓ అమ్మ, నాన్నలా స్పందించి మమ్మల్ని ఇక్కడికి క్షేమంగా చేర్చినందుకు ధన్యవాదాలు. – సాయికిరణ్, బీటెక్ విద్యార్థి, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి -
కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తెలుగు విద్యార్థులు
-
హైదరాబాద్ నుంచి విద్యార్థుల స్వస్థలాలకు చేర్చేందుకు స్పెషల్ బస్సులు
-
2 ప్రత్యేక విమానాల్లో విద్యార్థులను తరలిస్తున్న ఏపీ ప్రభుత్వం
-
సన్నీలియోన్ వెళ్లే ఫ్యాషన్ షో వేదిక సమీపంలో పేలుడు..
ఇంఫాల్: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని హట్ట కంగ్జీబాంగ్ ప్రాంతంలో శనివారం ఉదయం పేలుడు ఘటన జరిగింది. ఈ ప్రాంతంలోనే ఆదివారం నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోకు ప్రముఖ నటి సన్నీలియోన్ హాజరవుతున్నారు. ఈ వేదికకు 100 మీటర్ల దూరంలోనే పేలుడు జరిగింది. శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఈ పేలుడు ఐఈడీ వల్ల జరిగిందా? లేదా గ్రెనేడ్‌తో దాడి చేశారా? అనే విషయంలో స్పష్టత లేదు. మరోవైపు ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటన విడుదల చేయలేదు. చదవండి: రాళ్లు రువ్వి దాడికి యత్నం..పోలీసులనే పరుగులు తీయించారు -
Manipur: మణిపూర్‌కు కొత్త సీఎం?
Will Biren Singh Again CM For Manipur: మణిపూర్‌కు కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నాడా?.. ప్రస్తుత సీఎంగా ఉన్న బీరేన్ సింగ్‌కి అధిష్టానం మొండి చెయ్యి చూపించనుందా? ముందుగానే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం.. ముఖంలో జోష్ లేకపోవడం వెనుక వెనుక ఆంతర్యం ఏంటి? ఇప్పటిదాకా మణిపూర్‌కు సీఎం అభ్యర్థి పేరును బీజేపీ ఎందుకు ఖరారు చేయలేదు.. ఈ పరిణామాలన్నిపై రాజకీయ విశ్లేషకులు జోరుగా చర్చించేస్తున్నారు. మణిపూర్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఘనమైందే. ఎందుకంటే 2017 ఎన్నికల్లో 21 స్థానాలు గెలిచి.. సంకీర్ణ ప్రభుత్వంతో నెట్టుకొచ్చింది. అయితే 2022 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ను గల్లంతు చేస్తూ.. 32 స్థానాలు గెలిచి మ్యాజిక్ ఫిగర్‌తో నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ అందుకుంది. అయితే సోమవారం ఒక విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. ఇంఫాల్ అసెంబ్లీ హాల్లో 12వ శాసనసభ సభ్యుడిగా బీరెన్ సింగ్ ప్రమాణం చేశారు. ప్రమాణ సమయంలోనూ ముఖాభావంగా కనిపించారాయన. అంతకుముందు ఆయన రాజీనామాను మణిపూర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ముఖ్యమంత్రిగా Incumbent కొనసాగాలని గవర్నర్, బీరెన్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీరెన్ సింగ్ హెయిన్‌గాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రత్యర్థి పీ శరత్‌చంద్రను ఓడించారు. అయితే ఎన్నికల ప్రచార సమయం నుంచి సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే వస్తోంది. బీజేపీ కూడా అభ్యర్థి ఎవరనే దానిపై పెదవి విప్పడం లేదు. అయితే బీరెన్ సింగ్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేస్తారని తోటి ఎమ్మెల్యేలు చెప్తుండగా.. ఆయన అల్లుడు-ఎమ్మెల్యే అయిన రాజ్‌కుమార్ ఇమో సింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ తరుణంలో అధిష్టానం నుంచి మాత్రం సానుకూలత కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. మణిపూర్ అసెంబ్లీ గడువు మార్చి 19వ తేదీతో ముగియనుంది. -
ముగిసిన మణిపూర్ తొలిదశ పోలింగ్
-
వాళ్లు అగాథం పెంచితే.. మేం అభివృద్ధి చేశాం
ఇంఫాల్/అగర్తలా: గత ప్రభుత్వాలు అభివృద్ధిపరంగా ఈశాన్య రాష్ట్రాలకు, మిగతా దేశానికి మధ్య తీవ్ర అగాధాన్ని సృష్టించగా తమ ప్రభుత్వం మాత్రం లుక్ ఈస్ట్ విధానంతో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని ప్రధాని మోదీ అన్నారు. తమ నిరంతర కృషి ఫలితంగానే మిగతా దేశానికి, ఈశాన్యప్రాంతానికి మధ్య ఉన్న అంతరం తగ్గిందన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మంగళవారం ఆయన రూ.4,815 కోట్ల విలువైన 22 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగిస్తూ.. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల కృషి ఫలితంగా మణిపూర్, ఈశాన్యరాష్ట్రాల్లో తీవ్రవాదం, హింస స్థానంలో శాంతి, అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. ఒకప్పుడు దిగ్బంధానికి గురైన మణిపూర్, ఈశాన్యప్రాంతం ఇప్పుడు అభివృద్ధికి, అంతర్జాతీయ వాణిజ్యానికి ముఖద్వారాలుగా మారబోతోందని తెలిపారు. బీజేపీ హయాంలో దేశ పురోగతికి ఈశాన్య ప్రాంతం చోదకశక్తిగా మారిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన వాటిలో.. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ ఇంఫాల్ స్మార్ట్ సిటీ మిషన్, అత్యాధునిక కేన్సర్ ఆస్పత్రి ఉన్నాయి. వీటితోపాటు మణిపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ భవనానికి, 5 జాతీయ రహదారుల నిర్మాణానికి, మూడు తాగునీటి ప్రాజెక్టులు తదితరాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన త్రిపుర రాజధాని అగర్తలాలో మహారాజా బీర్ బిక్రమ్(ఎంబీబీ) విమానాశ్రయంలో రెండో టెర్మినల్ భవనంతోపాటు పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. గత ప్రభుత్వాల హయాం లో అవినీతికి, వెనుకబాటుతనానికి మారుపేరుగా ఉన్న త్రిపుర ఇప్పుడు ప్రముఖమైన వాణిజ్య కారిడార్‌గా మారిపోయిందని పేర్కొన్నారు. -
కారులో 260 బంగారు బిస్కెట్లు.. తీయడానికి 18 గంటలు
మణిపూర్: దేశంలో ఓ వైపు కరోనా వైరస్ వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. కానీ ఇవేవి అక్రమార్కులను అడ్డుకోలేక పోతున్నాయి. తాజాగా మణిపూర్‌లోని ఇంఫాల్‌లో రూ.21 కోట్ల విలువైన 43 కిలోల బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారుని పోలీస్ అధికారులు మంగళవారం తనిఖీ చేయడానికి నిలిపారు. అయితే వారిని ప్రశ్నించిన తర్వాత అనుమానం రావడంతో.. కారులో క్షుణ్ణంగా తనఖీలు చేశారు. కారులోని వేరు వేరు ప్రదేశాల్లో బంగారు బిస్కెట్లు దాచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో వివిధ చోట్ల దాచిన 260 విదేశీ బంగారు బిస్కెట్లను బయటకు తీయడానికి అధికారులకు 18 గంటల సమయం పట్టింది. గతంలో కూడా ఇదే వాహనాన్ని అక్రమ రవాణాలకు ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఇక గత మూడు నెలల్లో గౌహతి జోనల్ యూనిట్ మయన్మార్ సెక్టార్ నుంచి రూ. 33 కోట్లకు పైగా విలువైన 67 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో కేవలం జూన్‌లోనే 55 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా ఇండియా, మయన్మార్ సరిహద్దు మీదుగా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరింత కట్టుదిట్టమైన తనిఖీ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: 123 రోజులు సంకెళ్లతో.. ప్రపంచంలో ఏ జంట ఈ పని చేసుండదు? -
అమ్మ మళ్లీ నవ్వింది
‘ఇమా కీథెల్’ అంటే ‘అమ్మ మార్కెట్’ అని అర్థం. 5000 మంది స్త్రీలు నడిపే ఈ మార్కెట్ మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఉంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన స్త్రీ నిర్వహణా మార్కెట్‌గా ఖ్యాతి చెందిన ఈ మార్కెట్ మార్చి 21, 2020లో కరోనా కారణంగా మూతపడింది. ఇన్నాళ్ల తర్వాత సోమవారం ఫిబ్రవరి 15న తెరుచుకుంది. దాదాపు 3,600 మంది మహిళా అమ్మకందార్ల ముఖాన చిరునవ్వును తెచ్చింది. ఈ మార్కెట్ విశేషాలు... ‘ఇమా’ అంటే ‘అమ్మా’ అని అర్థం మణిపురి భాషలో. ఇమా మార్కెట్లో దాదాపు 4 వేల మంది అమ్మలు స్టాల్స్ నడుపుతుంటారు. అందరూ యాభై ఏళ్ల పైబడినవారే. అందుకే వీరిని ‘అమ్మ’ అని పిలుస్తారు. కూరగాయలు, పండ్లు, వస్త్రాలు, స్థానికంగా తయారైన హస్తకళాకృతు లు... ఇవి వందలాదిగా స్టాళ్లు ఏర్పాటు చేసి అమ్ముతుంటారు. ఇంఫాల్‌లో మాత్రమే కాదు, భారతదేశంలో మాత్రమే కాదు, ఆసియాలో మాత్రమే కాదు, మొత్తం ప్రపంచంలోనే కేవలం స్త్రీలు మాత్రమే అమ్మకందార్లుగా ఉండే ఏకైక పెద్దమార్కెట్‌గా ఇమా మార్కెట్ ఖ్యాతి గడించింది. ‘ఇమా మార్కెట్లో మగవాళ్లు రావచ్చు. సరుకులు కొనవచ్చు. కాని వారు అక్కడ అమ్మకందార్లు మాత్రం కాలేరు’ అని అంటారు అమ్మలు. మగవాళ్లు పెత్తనం చేసే మణిపూరి కుటుంబ జీవనంలో దాదాపు 500 ఏళ్ల క్రితం తమ స్వావలంబన కోసం అక్కడి స్త్రీలు ఏర్పాటు చేసుకున్న మార్కెట్ అది. ఆ రోజుల్లో అదో పెద్ద సామాజిక విప్లవం. కాలం ఎంత మారినా మార్కెట్ మారలేదు. మగవారి హస్తగతం కాలేదు. స్త్రీల చేతుల నుంచి జారిపోలేదు. ఇవాళ్టికీ స్త్రీలదే దాని మీద అధికారం. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం కూడా ఏ మాత్రం జోక్యం చేసుకోదు. ‘మమ్మల్ని అనుమతిస్తే నెలలో ఒకరోజు మా సిబ్బంది వచ్చి శుభ్రం చేసి వెళతారు’ అని సాక్షాత్తు అక్కడి ముఖ్యమంత్రి ఆ మార్కెట్లో ఉండే స్త్రీలను కోరారంటే వారు ఎంత స్వయం నిర్ణయాధికారంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సమస్యల కరోనా ఇమా మార్కెట్లో రిజిస్టర్ అయిన అమ్మకందార్లు 3,600 మంది ఉన్నారు. తమ స్టాల్స్ ద్వారా వచ్చే ఆదాయంతో వీరు కుటుంబాన్ని నిర్వహిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే మగవారి నిర్బాధ్యతకు వెరవక వీరు ఈ స్టాల్స్ ద్వారా నిశ్చింతగా ఉంటారు. అయితే కరోనా రూపంలో చింత రానే వచ్చింది. మార్కెట్ అంటే జన సమృద్ధి. ఇమా మార్కెట్ అంటే నిత్యం వేల మంది వచ్చేపోయే చోటు. కనుక అది కరోనాకు హాట్స్పాట్లాంటిది. అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించి మార్చి 21, 2020న ఆ మార్కెట్‌ను మూసేయించింది. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు. మార్కెట్ మూత పడితే ఎలా బతకాలో ఆ అమ్మలకు తెలియదు. కాని అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి. కష్టాలపై సాగిన పోరాటం ‘కొంచెం ఆర్థికంగా బాగున్నవారు తట్టుకున్నారు. చిన్న స్టాల్స్ ఉన్నవారు చాలా కష్టాలు పడ్డారు’ అంది ఇమా మార్కెట్లో నలభై ఏళ్లుగా స్టాల్ నడుపుతున్న ఒక 70 ఏళ్ల అమ్మ. మార్కెట్ మూతపడటంతో స్త్రీలు వేరే ఉపాధి కోసం చిన్న చిన్న పనుల కోసం వెళ్లాల్సి వచ్చింది. మార్కెట్ తెరవమని మొరపెట్టుకోవాల్సి వచ్చింది. మార్కెట్ మూత పడటం వల్ల ఈ తొమ్మిది నెలల్లో వచ్చిన నష్టం దాదాపు 4000 కోట్లు అంటే అక్కడ స్టాళ్లు నడిపే స్త్రీల చేతుల మీద ఎంత డబ్బు తిరిగేదో అర్థం చేసుకోవచ్చు. ‘ఇమా మార్కెట్ కేవలం వ్యాపార కూడలి కాదు. ఒక సాంస్కృతిక కేంద్రం కూడా. సామాజిక దురాచారాలపై స్త్రీలు ఈ మార్కెట్లోనే అవగాహన పెంచుకుని తిరగబడ్డారు. అంతేకాదు... ఒకరికొకరు అండగా నిలిచి తమను తాము బలపరుచుకున్నారు’ అని చెబుతారు విశ్లేషకులు. తిరిగి వచ్చిన చిరునవ్వు ఎట్టకేలకు కరోనా తగ్గుముఖం పట్టింది. మొన్నటి ఫిబ్రవరి 15న ఇమా మార్కెట్ తిరిగి తెరుచుకుంది. ఇంత కాలం మార్కెట్‌కు దూరమైన అమ్మలందరూ మళ్లీ మొలకెత్తిన చిరునవ్వుతో మార్కెట్‌కు వచ్చారు. కూరలు వచ్చాయి. పండ్లు వచ్చాయి. గల్లాపెట్టెలు తెరుచుకున్నాయి. సందడి మొదలయ్యింది. ‘కరోనా దృష్ట్యా ఈ సంవత్సరం మార్కెట్లో ప్రతి స్టాల్ కట్టాల్సిన కార్పొరేషన్ ఫీజును రద్దు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి ఈ సందర్భం గా ప్రకటించారు. ‘మేము మా కుటుంబాలను ప్రాణాలను ఉగ్గపట్టుకుని కూచున్నాం... ఎందుకంటే మా మార్కెట్ తెరుచుకుంటే మేము తిరిగి బతకగలం అనే నమ్మకంతో’ అని ఒక మహిళా వెండర్ చెప్పింది. ఇమా మార్కెట్ కేవలం వ్యాపార లావాదేవీలకే కాక స్త్రీ చేయగలిగే శ్రమకు, సామర్థ్యానికి కూడా ఒక గుర్తు. ఆనవాలు. ఇమా మార్కెట్‌లాంటి మార్కెట్ ప్రతి పెద్ద నగరంలో ఉంటే మరిన్ని కుటుంబాలకు కేవలం నాన్నల మీదే ఆధారపడాల్సిన అవస్థ తప్పుతుంది. – సాక్షి ఫ్యామిలీ -
మూడు రెక్కల దేవత
దేవతలకు రెండు రెక్కలు ఉంటాయి. మణిపూర్‌లోని లైబి ఓయినమ్‌కు మూడు రెక్కలు ఉన్నాయి. వాటిని మూడు చక్రాలుగా మార్చి ఆటో నడుపుతుంటుంది. కష్టంలో సాయం చేస్తే మనిషి అనొచ్చు. దైన్యావస్థలో ఆదుకుంటే దేవత అనాలి. లైబి ఓయినమ్ను ఇప్పుడు మణిపూర్‌లో దేవత అనే అంటున్నారు. ఆమె ఎటువంటి సహాయం చేసిందో తెలిస్తే మీరూ అంటారు. జూన్ 1, 2020. సాయంత్రం ఆరు గంటలకు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని తూర్పు ప్రాంతం డ్యూలాలాండ్లో ఒక అంబులెన్స్ ఆగింది. అందులో నుంచి ఒక అమ్మాయిని, ఆమె తండ్రిని దించేసి వెళ్లిపోయింది. ‘మమ్మల్ని ఇంటి దాకా దించుతామన్నారు కదా’ అన్నారు తండ్రీ కూతుళ్లు. ‘ఇక్కడ నుంచి జిల్లా మారిపోతుంది. జిల్లా లోపలి వరకే దించాలి. దాటకూడదని రూలు’ అని వెళ్లిపోయాడు అంబులెన్స్ డ్రైవర్. తండ్రీ కూతుళ్లు నిశ్చేష్టులయ్యారు. ఒకవైపు చూస్తే చీకటి పడుతోంది. అమ్మాయి పేషెంట్. కోవిడ్ బారిన పడి పద్నాలుగు రోజులు ఇంఫాల్‌లోని ప్రసిద్ధ వైద్య సంస్థ జె.ఎన్.ఐ.ఎమ్.ఎస్‌లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యింది. తీసుకెళ్లడానికి తండ్రి వచ్చాడు. వాళ్లది ఇంఫాల్ నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉన్న కాంజోంగ్ జిల్లాలో స్కిప్ అనే గ్రామం. అక్కడకు వెళ్లాలి. ఎలా? తండ్రి తన కూతురిని రోడ్డు పక్కన నిలబెట్టి టాక్సీల కోసం పరిగెత్తాడు. మొదట అందరూ వస్తామన్నారు. బేరం చేశారు. తీరా తీసుకెళ్లాల్సింది పేషెంట్‌ని అని తెలిశాక వెనక్కు తగ్గారు. ‘మా అమ్మాయికి కరోనా తగ్గిపోయింది. ఇప్పుడు లేదు. భయపడకండి’ అని తండ్రి చెప్పినా ఎవరూ వినలేదు. ‘అమ్మో.. మేము రాలేం’ అని తప్పించుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ల బాధ చూసిన ఎవరో లైబి ఓయినమ్‌కు ఫోన్ చేశారు. లైబి ఓయినమ్ ఇంఫాల్‌లో తొలి మహిళా ఆటోడ్రైవర్. అంతకు ముందు ఆమె స్ట్రీట్ వెండర్‌గా అవీ ఇవీ రోడ్డు పక్కన అమ్ముతూ ఉండేది. ఇప్పుడు ఆటో డ్రైవర్ అయ్యింది. ఇద్దరు పిల్లల తల్లి. భర్త ఉన్నా కుటుంబానికి తన సంపాదన ఆధారం. ‘కోవిడ్ పేషెంట్‌ను ఇంటికి తీసుకెళ్లాలి’ అని చెప్పారు వాళ్లు. ‘వారికి అభ్యంతరం లేకపోతే తీసుకెళతాను’ అంది లైబి. కాని ఆమెకు ఉన్నది ఆటో మాత్రమే. వెళ్లాల్సిన దూరం పెద్దది. అంత దూరం ఆటోలో వెళ్లడం సాధ్యమా? పైగా చీకటి పడిపోయింది. తోడు కోవిడ్ నుంచి బయటపడ్డ అమ్మాయి. రకరకాల ఆలోచనలు వచ్చినా లైబి ధైర్యం చేసి భర్తకు ఫోన్ చేసింది. ‘నాతో తోడురా. బేరం వచ్చింది’ అని చెప్పింది. భర్త ఆమెను చేరుకున్నారు. ఇద్దరూ కలిసి ఆ తండ్రీ కూతుళ్ల దగ్గరకు వెళ్లారు. ‘పదండి పోదాం’ అన్నారు. లైబి, ఆమె భర్త ముందు కూర్చుంటే వెనుక బాధితురాలు, ఆమె తండ్రి కూచున్నారు. ప్రయాణం మొదలైంది. గంట కాదు... రెండు గంటలు కాదు... ఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా ఆటోను నడిపింది లైబి. రాత్రి రెండున్నర ప్రాంతంలో పేషెంట్‌ను సురక్షితంగా ఇల్లు చేర్చింది. ఆమె చేసిన పనికి ఆ కుటుంబం శతకోటి నమస్కారాలు పెట్టింది. లైబి భర్తతో అప్పటికప్పుడు తిరిగి వచ్చేసింది. కాని ఈ విషయం వెంటనే పత్రికల ద్వారా లోకానికి తెలిసింది. లైబి చేసిన పనిని ఇంఫాల్లోనే కాదు దేశ విదేశాల్లో ఉన్న చాలామంది, ముఖ్యంగా మణిపూర్ వాసులు మెచ్చుకున్నారు. ఆమెకు కానుకగా ఇవ్వడానికి అందరూ డబ్బు పంపారు. అవన్నీ లక్షా పది వేల రూపాయలు అయ్యాయి. వాటిని జూన్ 11న మణిపూర్ సి.ఎం. ఎన్.బిరేన్ సింగ్ ఆమెకు అందజేశాడు. ఆమెకు శాలువా కప్పి సత్కరించాడు. లైబి ఆ పేషెంట్‌ను దింపి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సూచనల ప్రకారం తన భర్తతో కలిసి క్వారంటైన్లో ఉంటోంది. డిశ్చార్జ్ అయిన కోవిడ్ పేషెంట్‌తో అంత సేపు ఉన్నందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఈ పని చేసింది. మణిపూర్‌లో తొలి మహిళా ఆటో డ్రైవర్ అయిన లైబి మీద రెండేళ్ల క్రితం ‘ఆటో డ్రైవర్’ పేరుతో డాక్యుమెంటరీ తయారైంది. దానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ‘స్త్రీలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఆమె జీవితం ఉంది’ అని ఆ డాక్యుమెంటరీ చూసినవాళ్లంతా అన్నారు. ఇప్పుడు తన సేవాభావంతో కూడా ఆమె చాలామందికి స్ఫూర్తి కలిగిస్తోంది. దేవతలు తెల్లటి బట్టల్లో ఉండరని, సాదాసీదా ఖాకీ యూనిఫామ్ వేసుకు తిరుగుతుంటారు లైబిని చూస్తే మనకు అర్థమవుతుంది. శాలువాతో సత్కరిస్తున్న సీఎం. ఎన్.బిరేన్ తనను ఇంటికి చేర్చిన లైబీతో ప్రయాణికురాలు -
వైరల్ ఫొటో: తండ్రి, కూతుళ్లపై ప్రశంసలు
ఈ ఫొటో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలోని తండ్రి, కూతుళ్లపై ప్రముఖులతో పాటు నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్న పోలీసు అధికారి పేరు రతన గ్నసెప్పం. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో డిప్యూటీ ఎస్పీగా ఉన్న ఆమె పోలీసు యూనిఫామ్‌పై ఉన్న నక్షత్రాలను రతన్ తండ్రి ఆసక్తిగా గమనిస్తున్న ఈ ఫొటోను అమిత్ పంచాల్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. తన యూనిఫామ్‌పై ఉన్న నక్తత్రాలను తండ్రి కళ్లలో చూస్తున్న రతన్ అంటూ క్యాప్షన్‌తో ఈ ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. కూతురు సాధించిన విజయం తాలుకు సంతోషం తండ్రి కళ్లలో కనబడుతోందని కొందరు ప్రశసించగా, మహిళా సాధికారతకు ఉదాహరణగా మరికొందరు పేర్కొన్నారు. ఈ ఫొటోకు ట్విటర్లో ఇప్పటివరకు 15 వేలకు పైగా లైకులు రాగా, 2 వేల మందిపైగా రిట్వీట్ చేశారు. అయితే ఈ ఫొటో కొన్నినెలల కిందటిదని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించింది. రతన ప్రస్తుతం అడిషినల్ ఎస్పీగా పనిచేస్తున్నారని తెలిపింది. (54 రోజులుగా ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కడే!) -
గుడ్‌న్యూస్: ‘కరోనా ఫ్రీ’గా మరో రాష్ట్రం
ఇంఫాల్: గోవా తర్వాత మరో రాష్ట్రం కరోనా మహమ్మారి నుంచి బయటపడింది. తమ రాష్ట్రంలో ఒక్క కోవిడ్-19 కేసు లేదని గోవా ప్రకటించిన మరుసటి రోజే మణిపూర్ కూడా ఇదే ప్రకటన చేసింది. తమ రాష్ట్రంలో కోవిడ్ సోకిన ఇద్దరు బాధితులు పూర్తిగా కోలుకున్నారని, వారికి నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రకటించారు. ‘మణిపూర్ ఇప్పుడు కరోనా లేని రాష్ట్రమని ప్రకటించడానికి సంతోషిస్తున్నా. కోవిడ్ బాధితులిద్దరూ పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదు. ప్రజలు, వైద్య సిబ్బంది సహకారం, లాక్డౌన్ కారణంగానే ఇది సాధ్యమయింద’ని బీరేన్ సింగ్ ట్వీట్ చేశారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సడలించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఇంఫాల్‌లో మాత్రం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు లాక్డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అత్యవసర వస్తువుల దుకాణాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరుచుకోవచ్చని తెలిపారు. కాగా, కరోనా లేని మొదటి రాష్ట్రంగా గోవా నిలిచింది. ఇక్కడ కోవిడ్ బారిన పడ్డ ఏడుగురు పూర్తిగా కోలుకోవడం, కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో గోవా గ్రీన్‌జోన్‌లోకి వెళ్లింది. పాజిటివ్ కేసులు లేకపోయినప్పటికీ లాక్డౌన్ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు. చదవండి: హమ్మయ్య.. వారికి కరోనా నెగెటివ్ -
సహనానికి, ఓర్పుకు హద్దుంటుంది: మాజీ కెప్టెన్
ఇంపాల్ : ఇండియన్ ఉమెన్ హాకీ టీం మాజీ కెప్టెన్ సురాజ్ లతా దేవీ తన భర్త శాంతా సింగ్‌పై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం భర్త తనను తీవ్రంగా వేధిస్తున్నాడని, మానసికంగా, శారీరకంగా హింసకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం ఇంపాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ పెళ్లైన నాటినుంచి అదనపు కట్నం కోసం నా భర్త నన్ను వేధిస్తున్నాడు. అనైతిక ప్రవర్తన కారణంగానే నాకు అర్జున అవార్డు వచ్చిందంటున్నాడు. నేనీ విషయాన్ని పబ్లిక్ చేయాలనుకోలేదు. అతడిలో మార్పువస్తుందనే ఇన్నిరోజులు ఎదురుచూశాను. ఏదేమైనప్పటి సహనానికి, ఓర్పుకు ఓ హద్దంటూ ఉంటుంద’ని పేర్కొన్నారు. కాగా, 2005లో శాంతా సింగ్ అనే రైల్వే ఉద్యోగిని పెళ్లాడిన ఆమె హాకీ ఆటకు దూరమయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గతంలో కూడా ఆమె పలుమార్లు భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2002లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సురాజ్ లతా దేవీ సారధ్యంలోని ఇండియన్ ఉమెన్ హాకీ టీం మూడు బంగారు పతకాలు సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఉమెన్ హాకీ టీం కనబరిచిన ప్రతిభ స్ఫూర్తిగా బాలీవుడ్లో ‘ చక్ దే ఇండియా’ అనే సినిమా తెరకెక్కింది. -
మీరు స్టూడెంట్స్‌ని కలిస్తే బాగుంటుంది
ఇంఫాల్: విశ్వంపై జరుగుతున్నపరిశోధనల్లో భారత శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. దేశం సైన్స్ రంగంలో మరిన్ని విజయాల్ని సాధించాలంటే ప్రతి శాస్త్రవేత్త విద్యార్థులతో తమ అనుభవాల్ని పంచుకోవాలని కోరారు. మణిపూర్ యూనివర్సిటీలో 5 రోజులపాటు జరగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వందేళ్లలో ఈశాన్య భారతంలో సైన్స్ కాంగ్రెస్ జరగడం ఇది రెండోసారి అన్నారు. ‘9 నుంచి 11వ తరగతి విద్యార్థులతో ప్రతి సైంటిస్ట్ ఏడాదికి 100 గంటల చొప్పున వారి విజ్ఞానయాత్రా విశేషాల్ని పంచుకోవాల’ని మోదీ ఆకాంక్షించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ 2030 నాటికి అంతర్జాతీయంగా క్షయ మహమ్మారిని రూపుమాపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందని, అయితే, అంతకంటే ముందే భారత్‌లో 2025 నాటికి క్షయను పూర్తిగా నిర్మూలిస్తామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు పోషకాహార లోపం, మలేరియా, మెదపువాపు వంటి వ్యాధుల నివారణకు తోడ్పాటు అందించాలని కోరారు. -
‘ఎయిర్‌పోర్టుల్లో వీఐపీ కల్చర్ లేదు’
న్యూఢిల్లీ : ఇంఫాల్ ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ కన్నన్‌థానమ్ వివాదంపై పౌర విమానయాన శాఖామంత్రి జయంత్ సిన్హా తొలిసారి స్పందించారు. దేశంలోని ఏ విమానాశ్రయంలోనూ వీవీఐపీ కల్చర్ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే భద్రతాపరమైన సమస్యలు, ఇతర కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఏర్పడవచ్చని ఆయన తెలిపారు. విమానాశ్రయాల్లో తీసుకునే భద్రతా చర్యలు ప్రయాణికులు సెక్యూరిటీ కోసమేనని ఆయన తెలిపారు. భద్రతా కారణాల రీత్యా కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అంతేకాక భద్రత కల్పించాల్సిన ముఖ్యవ్యక్తులు విమానశ్రయాలకు వచ్చినపుడు సెక్యూరిటీ స్క్రీనింగ్ తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఇది వీవీఐపీ కల్చర్ కాదని జయంత్ సిన్హా స్పష్టం చేశారు. వీరు తప్ప మిగిలిన ఎవరినైనా విమానాశ్రయాల్లో ఎవరినైనాన సాధారణ ప్రయాణికుడిగానే అధికారులు చూస్తారని ఆయన తెలిపారు. నా బ్యాగ్‌ను నేను మోసుకుంటూ విమానం ఎక్కుతాను.. వీవీఐపీ కల్చర్ లేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. రెండు రోజుల కిందట ఇంఫాల్ విమానాశ్రయంలో ఒక మహిళ.. వీవీఐపీ కల్చర్‌పై కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ కన్నన్‌థానమ్‌ను నిలదీయడం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఇంఫాల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ రావడంతో.. మిగతా విమాన ప్రయాణికులను నిలిపేశారు. దీంతో మిగిలిన విమానాలు కూడా ఆలస్యం అయ్యాయి. మంత్రి రాకవల్ల ఇబ్బందుల పడ్డవారిలో ఒక మహిళా డాక్టర్ ఉన్నారు. ఆమె అత్యవసరంగా ఒకరికి చికిత్స అందించే క్రమంలో పట్నా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీవీఐపీ కల్చర్ వల్ల ఆలస్యం కావడంతో ఆగ్రహించిన ఆమె.. నేరుగా కేంద్రమంత్రినే ఎయిర్‌పోర్టులో నిలదీశారు. -
బీజేపీ ఆఫీస్‌పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
-
ఇంపాల్‌లో బాంబు పేలుడు
-
ఇంఫాల్‌లో మోదీ.. ఈశాన్యానికి హామీ!
-
ఇంఫాల్‌లో మోదీ.. ఈశాన్యానికి హామీ!
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ను గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీని గద్దెదించి.. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మణిపూర్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికి ఆర్థిక నిర్బంధం ఎంతమాత్రం ఉండబోదని, ఈ విషయంలో తాను భరోసా అని హామీ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి బీజేపీకి చెందిన మాజీ ప్రధాని వాజపేయి ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. వాజపేయి కృషిని కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు తీసుకుపోలేదని, అందువల్లే ప్రస్తుత దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక చట్టాన్ని బీజేపీ గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే 15 నెలల్లో మార్పు తీసుకొచ్చి చూపిస్తామని హామీ ఇచ్చారు. మణిపూర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో మార్చి 4న, 8న రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. గత 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్-బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. -
చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్ ఒకటి కలకలం రేపింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) ఆవరణలో దీనిని గుర్తించారు. మెడికల్ ఇనిస్టిట్యూట్‌కు వచ్చిన వారు శుక్రవారం కొత్త వస్తువేదో కనిపించడంతో దానిని ఆసక్తిగా గమనించారు. చివరికి దానిని ఒక గ్రెనేడ్‌గా గుర్తించి అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. అనంతరం మణిపూర్ పోలీస్ బాంబ్ స్క్వాడ్ దానిని నిర్వీర్యం చేసినట్లు అధికారులు వెల్లడించారు. చైనీస్ గ్రెనేడ్ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. రిమ్స్ ఆవరణలోకి అది ఎలా వచ్చింది అనే విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
దంపతులపై కాల్పులు.. భర్త మృతి
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మయన్మార్ సరిహద్దు ప్రాంతం మొరె పట్టణంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లో నిద్రిస్తున్న దంపతులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ధర్మేంద్ర(35) మృతి చెందగా.. అతడి భార్య దేవి(32) తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. దుండగులు ధర్మేంద్రపై రెండు రౌడ్ల కాల్పులు జరపగా.. దేవిపై అతిసమీపంలో నుంచి ఒకరౌండ్ కాల్పులు జరిపారని స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారిని మొరె జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ధర్మేంద్ర మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనకు నిరసనగా మొరెలో వ్యాపారకార్యకలాపాలు నిలిపివేయాలని స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
మణిపూర్ వర్సిటీ వద్ద బాంబు పేలుడు
ఇంపాల్: మణిపూర్‌లో మరో బాంబు పేలుడు సంభవించింది. అంతకుముందు బాంబుపేలుడు చోటుచేసుకొని గంటలు కూడా గడవకముందే మరో బాంబు పేలడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈసారి ఇంపాల్ లోని మణిపూర్ యూనివర్సిటీ వద్ద బాంబు పేలుడు సంభవించింది. రిమోట్ ద్వారానే ఈ రెండు బాంబు పేలుడ్లు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. బుధవారం ఉదయం 9గంటల ప్రాంతంలో మాపౌ అనే గ్రామం వద్ద బీఎస్ఎఫ్ బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనూహ్యంగా బాంబు పేలింది. అయితే, ఈ దాడి నుంచి బీఎస్ఎఫ్ జవాన్లు తప్పించుకోగా.. నాలుగేళ్ల పాపకు మాత్రం గాయాలయ్యాయి. రెండోసారి బాంబు దాడి మాత్రం యూనివర్సిటీ వద్ద సంభవించింది. ఈ ఘటన సమయంలో విద్యార్థులంతా క్లాస్ రూముల్లోనే ఉన్నారు. అయితే, ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని ప్రాథమిక సమాచారం. -
ఇంఫాల్‌లో బాంబుపేలుడు, ఇద్దరికి గాయాలు
ఇంఫాల్: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో శుక్రవారం శక్తిమంతమైన బాంబు పేలిన ఘటనలో రెండేళ్ల పాప, ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. రాజ్‌భవన్‌కు సమీపంలో స్టేట్ మ్యూజియం వద్ద ఈ బాంబుపేలుడు సంభవించినట్టు అధికారులు చెప్పారు. అక్కడ పార్క్ చేసిన కార్లు దెబ్బతిన్నాయి. క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు బాధ్యులు ఎవరన్నది ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురష్కరించుకుని మణిపూర్ వ్యాప్తంగా పోలీసులు, పారామిలటరీ బలగాలతో భద్రతను పటిష్టంచేశారు. -
ఇంపాల్ సమీపంలో భారీ భూకంపం
-
ఇంపాల్ సమీపంలో భారీ భూకంపం
-
టూరిస్టులకు ప్రత్యేకాకర్షణ..!
దేశ భక్తిని చాటే అతి పెద్ద త్రివర్ణ పతాకం.. ఇప్పుడా రాష్ట్రంలో టూరిస్టులకు ప్రత్యేకార్షణగా మారింది. డల్హౌసీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన జాతీయ పతాకం ఇంఫాల్ ప్రజలను ఆకట్టుకుంటోంది. గత సంవత్సరం అక్టోబర్ 19న పాఠశాల 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ మువ్వన్నెల జెండా ఆకాశ హర్మ్యాలను దాటి... రెపరెపలాడుతూ సందర్శకుల గుండెల్లో దేశ భక్తిని నింపుతోంది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అప్పట్లో వైస్ అడ్మిరల్ అనురాగ్ జి తపియాల్, ఏవీఎస్ ఎమ్ అండ్ బార్, డైరెక్టర్ జనరల్, భారత కోస్ట్ గార్డ్ లు ఈ జెండాను ఆవిష్కరించారు. ఇప్పటికే డల్హౌసీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మిగ్-21 యుద్ధ విమానం కూడ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఆర్మీ కమాండర్, పశ్చిమ కమాండ్, లెఫ్టినెంట్ జనరల్ కేజే సింగ్ ఆధ్వర్యంలో జూన్ 3న టి-55 రష్యన్ యుద్ధ ట్యాంక్ ను ఈ పాఠశాల ప్రాంగణంలో స్థాపించారు. ప్రస్తుతం క్రీడా దిగ్గజం మిగ్-21 యుద్ధ విమానం, సర్ఫేస్ టు ఎయిర్ పిఛోరా క్షిపణులు, టి-55 యుద్ధ ట్యాంక్ తో పాటు... పాఠశాలకే ప్రత్యేకాకర్షణగా నిలిచిన అతిపెద్ద జాతీయ పతాకం.. వీక్షకులకు అద్భుతాన్ని తలపిస్తోంది. ఈ ప్రాంగణంలో మిగిలిన ట్రోఫీల నుంచి ఓ నౌకను కూడా ఏర్పాటుచేస్తే.... ఇదో నావికా ప్రాతినిధ్య కేంద్రంగా రూపొందే అవకాశం ఉందని.. పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్, డాక్టర్ జీఎస్ థిల్లాన్ అన్నారు. దేశానికి సైనికులు గర్వకారణమని, వారికి సంబంధించిన వస్తువులను ప్రదర్శించడం వల్ల రక్షణ సేవలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహనతో కలగడంతోపాటు, వారిపై మంచి ప్రభావం ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
టీచర్‌పై దాడి.. ఆస్పత్రి పాలు
ఇంపాల్: మణిపూర్‌లో ఓ ప్రవైటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడిపై దాడి జరిగింది. తమ పిల్లాడిని బెత్తంతో కొట్టినందుకు ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు, ఓ స్టూడెంట్ వింగ్ కలిసి అతడిపై తీవ్రంగా దాడి చేశారు. పిడిగుద్దులు గుప్పించారు. దీంతో ఆ టీచర్ ఆస్పత్రి పాలయ్యాడు. ఇంపాల్లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో కంప్యూటర్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు ఆరో తరగతి చెందిన ఒక విద్యార్థిని తప్పుచేశాడని దండించాడు. క్లాస్ రూంలో అందరిమధ్య కర్రతో కొట్టాడు. దీంతో ఆ బాలుడు కుటుంబ సభ్యులతో పాటు ఓ విద్యార్థి యూనియన్‌కు చెప్పగా మొత్తం పదహారు మందివచ్చి దాడి చేశారు. వారందరనీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ విద్యార్థి తప్పు చేసినందునే తాను విద్యార్థిని దండించానని, కావాలని ఏ ఉపాధ్యయుడు తన విద్యార్థిని కొట్టడని బాధిత ఉపాధ్యాయుడు వాపోయాడు. అతడు కోలుకునేందుకు కొన్ని వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. -
భారత్ లో 'ఆ రెండు' నగరాలకు ముప్పు
లండన్ : భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల రాజధానులలో ఒకటైన ఇంపాల్, జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌పై తీవ్రవాదులు దాడి చేసే అవకశాలు అధికంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ముప్పు పొంచి ఉన్న వివిధ నగరాల జాబితాను శుక్రవారం లండన్‌లో విశ్లేషకులు విడుదల చేశారు. ఇంపాల్, శ్రీనగర్లకు తీవ్రవాద ముప్పు అధికంగా ఉందని తెలిపారు. విడుదల చేసిన జాబితాలో ఇంపాల్ 32వ స్థానం ... శ్రీనగర్ 49 వ స్థానంలో నిలిచాయన్నారు. అలాగే బెంగుళూరు 204 స్థానం... పుణె, హైదరాబాద్ నగరాలు వరుసగా 206, 207 స్థానంలో ఉన్నాయని వెల్లడించారు. ఆ తర్వాత కొన్ని స్థానాల తేడాతో ముంబై (298), న్యూఢిల్లీ (447) ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే నాగపూర్, కోల్కత్తా నగరాలు 2010, 2012 స్థానంలో ఉన్నాయని చెప్పారు. చెన్నై నగరానికి అయితే తీవ్రవాదుల ముప్పు మధ్యస్తంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1300 నగరాలు, వాణిజ్య కేంద్రాలపై తీవ్రవాదులు దాడి చేసి మారణహోమం సృష్టించడం..... ప్రజా రవాణ వ్యవస్థను నాశనం చేయడమే లక్ష్యంగా వారు పావులు కదుపుతున్నారని చెప్పారు. అయితే భారత్‌లో 113 నగరాలు ఆ జాబితాలో ఉన్నాయని తెలిపారు. అలాగే మధ్య ప్రాచ్య, ఆసియా మరియు యూరప్ దేశాలలో మొత్తం 64 నగరాలకు తీవ్రవాదుల దాడి పొంచి ఉందని చెప్పారు. -
మందలించిన ఉపాధ్యాయుడికి విద్యార్థి కత్తిపోట్లు!
ఇంఫాల్: తప్పు చేస్తున్న విద్యార్థిని మందలించిన ఉపాధ్యాయుడు కత్తి పోట్లకు గురయ్యాడు. పాఠశాల పరిసరాల్లో మద్యం సేవించవద్దని గట్టిగా చెప్పినందుకు ఓ విద్యార్థి ఉపాధ్యాయుడిని కత్తితో అయిదు పోట్లు పొడిచాడు. ఇక్కడి జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఘటన జరిగింది. 12వ తరగతి విద్యార్థి స్కూల్ పరిసరాల్లో మద్యం సేవిస్తుండగా ఓ ఉపాధ్యాయుడు అతడిని మందలించాడు. దాంతో ఆగ్రహించిన విద్యార్థి గురువుని కత్తితో ఐదుసార్లు పొడిచాడని పోలీసులు తెలిపారు. ఉపాధ్యాయుడి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని ఇన్టెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. అయితే విద్యార్థిని గుర్తించినప్పటికీ, పోలీసులు అతని పేరు బయట పెట్టలేదు. పొడిచిన అనంతరం విద్యార్థి తప్పించుకొనిపోయాడు. విద్యార్థిని పట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఇంఫాల్‌లో వరద బీభత్సం
-
శాంతి కోసం...స్త్రీల కోసం...
అన్నం పెట్టే కొడుకు అందనంత దూరం వెళ్లిపోతే నిస్సహాయంగా మిగిలిపోయిన తల్లులు వాళ్లు. బతుకంతా తోడుంటాడనుకున్న భర్త అర్ధంతరంగా తనువు చాలిస్తే చావలేక బతుకుతున్న భార్యలు వాళ్లు! ఒక పక్క ఉన్మాదం... మరోపక్క అది మిగిల్చిన విషాదం... బీనాలక్ష్మి వచ్చేవరకూ ఇవే తెలుసు వారికి. ఆమె వచ్చాక నవ్వడం తెలిసింది. నవ్వుతూ బతకడం తెలిసింది. జీవించడానికి ఆధారం దొరికింది. జీవితానికి ఓ కొత్త అర్థం ఏర్పడింది! ఇది బీనా సాధించిన విజయం! నిస్సహాయ మహిళలకు మంచి మనసుతో ఆమె చూపిన ప్రగతిపథం! అది 2004... డిసెంబర్. ఇంఫాల్‌లోని వాగ్బాయ్ గ్రామం. రోడ్డుపక్కన ఉన్న ఓ దుకాణం దగ్గర నిలబడి, కొందరితో మాట్లాడుతోంది బీనాలక్ష్మి నేప్రమ్. అంతలో తుపాకీ పేలిన చప్పుడు. ఉలిక్కిపడింది బీనా. చప్పుడు వచ్చినవైపు తలతిప్పి చూసింది. ఓ వ్యక్తి నేలకూలిపోతూ కనిపించాడు. అతడిని కాల్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడ్నుంచి వెళ్లిపోతున్నారు. ఓ నిండు ప్రాణం తీశామన్న ఆలోచన కానీ, అపరాధభావం కానీ లేదు వారిలో! చుట్టూ చూసింది బీనా. కొందరు ఆ శవాన్ని చూస్తూ వెళ్లిపోతుంటే, ఇంకొందరు చోద్యం చూస్తున్నట్టుగా నిలబడ్డారు. ఒక స్త్రీ మాత్రం మృతదేహం మీద పడి రోదిస్తోంది. ‘ఒంటరిగా నేనెలా బతకాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇంతకంటే నీతోపాటు నేనూ పోతే బాగుండేది కదా’ అంటూ గుండెలవిసేలా ఏడుస్తోన్న ఆమెను చూసి, బీనా కదిలిపోయింది. అప్పుడే నిశ్చయించుకుంది... తనరాష్ట్రంలో ఏ మహిళా జీవించలేక మరణించడం మేలు అనుకోకుండా చెయ్యాలని! నిజానికి తుపాకీ మోతలు, హత్యలు కొత్తేమీ కాదు బీనాకి. అప్పటికే చాలా కాలంగా హింసకు వ్యతిరేకంగా పోరాడుతోందామె. చిన్నప్పుడే ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే హింస అవగతమయ్యింది బీనాకి. ఎప్పుడూ ఏవో గొడవలు, కాల్చివేతలు,144 సెక్షన్లు! దానికితోడు పై చదువుల కోసం బీనా ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ లో చేరేందుకు సిద్ధపడుతోన్న సమయంలో... ఇంఫాల్ నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఎంతోమంది చనిపోయారు... బీనా మేనకోడలితో సహా! విచలిత అయ్యింది బీనా. దుఃఖాన్ని దిగమింగుకుని ఢిల్లీ వెళ్లిపోయింది. కానీ మనసంతా మణిపూర్ మీదే. మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో హింస పెచ్చుమీరి పోయింది. చిన్న చిన్న వాటికే ప్రాణాలు తీసేస్తున్నారు. అమా యకులెందరో చనిపోతున్నారు. ఆయుధాలు సులభంగా దొరకడమే అందుకు కారణమని అర్థమైంది బీనాకి. అందుకే కొందరు స్నేహితులతో కలిసి1997లో ‘కంట్రోల్ ఆర్మ్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ని స్థాపించి, ఆయుధాల అక్రమ వినియోగాన్ని నిర్మూలించేందుకు నడుం కట్టింది. పత్రికల్లో రచనలు చేసింది. హింసకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టింది. అందులో భాగంగానే వాగ్బాయ్కి వెళ్లినప్పుడు పై సంఘటన చూసింది. మృతుడి భార్య రెబికా వ్యధ, బీనా ఆలోచనలను మరోవైపు మళ్లించింది. అంతవరకూ శాంతికోసం పోరాడిన ఆమె, తమవారి మరణంతో ఆధా రాన్ని కోల్పోయిన మహిళల కోసమూ ఏదైనా చేయాలనుకుంది. ‘మణిపూర్ ఉమెన్ గన్ సర్వైవర్స్ నెట్వర్క్’ను ప్రారంభించింది. మహిళలకు మిత్రురాలిగా... మొదటగా... భర్త మరణంతో ఆధారాన్ని కోల్పోయిన రెబికాకి 4,500 రూపాయలతో ఓ కుట్టుమిషను కొనిచ్చింది బీనా. అలాంటివాళ్లు ఇంకా చాలామంది ఉంటారని ఆమెకి తెలుసు. అసలు తమవాళ్లు ఎందుకు చనిపోయారో, ఎవరు చంపారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఎందరో తల్లులు, భార్యలు ఉన్నారు. ఆధారాన్ని కోల్పోవడంతో ఎలా జీవించాలో తెలియక, పిల్లలకు కడుపునిండా తిండి కూడా పెట్టుకోలేక కుమిలిపోతున్నారు. వాళ్లందరికీ తన నెట్వర్క ద్వారా జీవనాధారం కల్పిస్తోంది బీనా. మణిపూర్‌లో ఇప్పుడు హింస తగ్గిపోలేదు. ప్రాణాలు పోవడం ఆగిపోనూ లేదు. కానీ ఇంతకుముందులా తమవారిని కోల్పోయిన మహిళలెవరూ బతుకులను భారంగా వెళ్లదీయడం లేదు. శోకం నుంచి బయటికొచ్చి సొంతగా బతకడం నేర్చుకుంటున్నారు. బిడ్డల భవిష్యత్తుకు బాటలు పరచుకుంటున్నారు. బీనా తన నెట్వర్క్ ద్వారా అందించే సాయంతో చిరువ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆర్థిక స్వావలంబనతో పాటు మానసిక స్థైర్యాన్నీ మూటగట్టుకుంటున్నారు. అందుకే వాళ్లంతా ముక్తకంఠంతో చెబుతారు... ‘తుపాకులు మా జీవితాల్లో విషాదాన్ని కుమ్మరిస్తే... బీనాలక్ష్మి రూపంలో వచ్చిన సంతోషం ఆ విషాదాన్ని పారద్రోలింది’ అని! మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో... 1974, అక్టోబర్ 19న జన్మించింది బీనా. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పాలని తపన పడుతోంది. ఆ తపనకు ఫలితంగా... ‘ఇండియన్ రియల్ హీరోస్ అవార్డ్’, ‘షాన్ మెక్‌బ్రైడ్ పీస్ ప్రైజ్’ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు బీనాని వరించాయి! -
మణిపూర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
మణిపూర్‌లో రెండు తీవ్రవాద గ్రూపుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉద్రవాదులు హతమయ్యారు. నాగాలాండ్ జాతీయ సామాజిక కౌన్సిల్-ఇసాక్, మూవా దళానికి, జిలియన్గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు బుధవారం పోలీసులు తెలిపారు. బాంబులు, ఆధునిక ఆయుధాలతో పరస్పరం దాడులకు పాల్పడినట్టు చెప్పారు. టమెన్గ్లాంగ్ జిల్లాలో ఐదు గంటల పాటు హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో జిలియన్గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్‌కు ముగ్గురు ఉగ్రవాదులు మరణించగా, నాగాలాండ్ జాతీయ సామాజిక కౌన్సిల్‌కు చెందిన మరి కొందరు గాయపడినట్టు పోలీసులు చెప్పారు. -
మణిపూర్ లో బాంబు పేలుడు, 8 మంది మృతి, ఏడుగురికి గాయాలు
మణిపూర్ లో శక్తివంతమైన బాంబు పేలుడు దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. మణిపూర్ లోని దక్షిణ జిల్లా ఇంఫాల్ లోని నాగంపాల్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా మణిపూరేతరులేనని సమాచారం. మణిపూర్ లో ఇతర ప్రాంతాలకు చెందిన కూలీల క్యాంపు వద్ద జరిగిన పేలుడు వెనుక మిలిటెంట్ల హస్తం ఉందని భావిస్తున్నారు. ఓ షాపు లో బాంబు అమర్చినట్టు పోలీసులు ప్రాథమికంగా అందించిన సమాచారం. ఈ ఘటనలో గాయపడిన వారంతా మణిపూర్ కు వలస వచ్చిన వారేనని తెలుస్తోంది. బాంబు పేలుడు తీవ్రత కిలోమీటర్ వరకు వ్యాపించిందని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. ఈ పేలుడికి ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతను ఏ తీవ్రవాద సంస్థ కూడా బాధ్యతను స్వీకరించలేదు. -
బెంగాల్, మణిపూర్‌లో బాంబు పేలుళ్లు
ఇంఫాల్/జల్పాయ్గురి: పశ్చిమబెంగాల్, మణిపూర్ రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో సంభవించిన బాంబు పేలుళ్లు స్థానికంగా కలకలం సృష్టించాయి. ఆయా పేలుళ్లలో పలువురు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. వివరాలు.. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో ఓ హోటల్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి 9 గంటల సమయంలో శక్తివంతమైన బాంబును విసిరారు. ఈ పేలుడు ధాటికి హోటల్లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హోటల్ యజమాని నుంచి డబ్బులు వసూలు చేసేందుకే తీవ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అదేవిధంగా, పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గురి జిల్లాలో ఉన్న బరోదిశా పట్టణంలో ఆదివారం ఓ బస్సులో బాంబు పేలింది. అప్పటికే ఓ హోటల్ ముందు ఆగి ఉండడంతో బస్సులో ప్రయాణికులు అందరూ కిందకి దిగిపోయారని, అయితే, అందులోనే ఉన్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని నేషనల్ లిబరేషన్ ఫోర్స్ ఆఫ్ బెంగాలీస్(ఎన్ఎల్ఎఫ్బీ) ప్రకటించుకున్నట్టు చెప్పారు. బెంగాలీలపై అస్సాంలో జరగుతున్న వేధింపులకు నిరసనగానే బాంబును అమర్చినట్టు ఎన్ఎల్ఎఫ్బీ ప్రకటించింది. -
మణిపూర్‌లో బాంబు పేలుడు: ముగ్గురికి గాయాలు
పశ్చిమ మణిపూర్ జిల్లాలో మంత్రిపుక్కిరి ప్రాంతంలో గత రాత్రి శక్తిమంతమైన బాంబు పేలి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి ఆదివారం ఇక్కడ వెల్లడించారు. రోడ్డు పక్కన ఉన్న హోటల్లో ఆ బాంబు పేలడం వల్ల ఆ హోటల్ సిబ్బంది ముగ్గురు గాయాలపాలైయ్యారన్నారు. అయితే వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారమని తెలిపారు. అయితే వారు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారన్నారు. బాంబు పేలుడుపై కేసు నమెదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. హోటల్ యజమానినికి తీవ్రవాదులు నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అతడు నిరాకరించడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి వివరించారు.