
ఇంఫాల్: కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం మణిపూర్‌లో పర్యటించారు. మణిపూర్‌లో చోటుచేసుకున్న అల్లర్ల కారణంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను రాహల్ గాంధీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
‘నేను మణిపూర్ ప్రజలకు ఒక్కటి చెప్పదల్చుకున్నాను. నేను మీ సోదరుడిగా ఇక్కడి వచ్చాను. మాణిపూర్ మళ్లీ శాంతిని పునరుద్ధరించటం కోసం మీతో కలిసి పనిచేస్తాను. మాణిపూర్ చాలా విషాదకరమైన సమస్య చోటచేసుకున్నప్పటి నుంచి ఇక్కడికి మూడుసార్లు వచ్చాను. ఇక్కడి పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ.. ఆశించినంత మార్పు రాలేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.
ఇవాళ మధ్యాహ్నం ఇంఫాల్ విమానాశ్రయంలో చేరుకున్న రాహుల్ గాంధీ.. జిరిబామ్, చురచంద్‌పూర్ జిల్లాల్లోని సహాయక శిబిరాలను సందర్శించారు. మణిపూర్‌లో చోటుచేసుకున్న హింసాకాండలో బాధితులకు రాహుల్ గాంధీ పరామర్శించి మద్దతుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment