మణిపూర్ లో బాంబు పేలుడు, 8 మంది మృతి, ఏడుగురికి గాయాలు | Eight non-Manipuris killed in bomb blast in labourers' camp | Sakshi
Sakshi News home page

మణిపూర్ లో బాంబు పేలుడు, 8 మంది మృతి, ఏడుగురికి గాయాలు

Published Fri, Sep 13 2013 9:22 PM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM

Eight non-Manipuris killed in bomb blast in labourers' camp

మణిపూర్ లో శక్తివంతమైన బాంబు పేలుడు దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. మణిపూర్ లోని దక్షిణ జిల్లా ఇంఫాల్ లోని నాగంపాల్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా మణిపూరేతరులేనని సమాచారం. మణిపూర్ లో ఇతర ప్రాంతాలకు చెందిన కూలీల క్యాంపు వద్ద జరిగిన పేలుడు వెనుక మిలిటెంట్ల హస్తం ఉందని భావిస్తున్నారు. ఓ షాపు లో బాంబు అమర్చినట్టు పోలీసులు ప్రాథమికంగా అందించిన సమాచారం. ఈ ఘటనలో గాయపడిన వారంతా మణిపూర్ కు వలస వచ్చిన వారేనని తెలుస్తోంది. బాంబు పేలుడు తీవ్రత కిలోమీటర్ వరకు వ్యాపించిందని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. ఈ పేలుడికి ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతను ఏ తీవ్రవాద సంస్థ కూడా బాధ్యతను స్వీకరించలేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement