
ప్రతి ఒక్కరి ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. అందరితో కలిసిపోయి, ఆడుతూ పాడుతూ చిన్నపిల్లల్లా జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ రియాల్టీలో అది సాధ్యం కాదు. ఇవన్నీ ఆలోచనలకే పరిమితం అవుతాయి. జీవితానుభవం వేరేలా ఉంటుంది. అందుకే మనసుకి - ఆలోచనలకి అస్సలు పొత్తు కుదరదు. మీకు తెలుసా..? మన ప్రవర్తన, ఇతరులతో సంభాషించే విధానం, మన మాటలు, మన హావభావాలు ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయట. అవును.. వీటిని బట్టి ఎదురి వారి మనసును ఇట్టే చదివేయొచ్చు. అలాగే శరీర ఆకారాలు, కళ్ళ రంగు, జుట్టు పొడవు.. ఇలా ఒక్కటేమిటి నఖశిఖ పర్యాంతం వరకు మన వ్యక్తిత్వం ఇట్టే చెప్పేస్తాయ్..
అలాగే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల ద్వారా కూడా ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని పరీక్షించొచ్చని మానసిక నిపుణులు అంటున్నారు. అలాంటి ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అందులో మీరు మొదట ఏం చూస్తారనే దాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పొచ్చు. అంతేనా.. ఈ ఫొటోలో మొదట మీరు ఏం చూస్తారో దానిని బట్టి.. మీరు ఇంట్రావర్ట్ లేదా ఎక్స్‌ట్రావర్ట్ అనే విషయం కూడా తేలిపోతుంది.
ఇంతకీ ఇంట్రావర్ట్, ఎక్స్‌ట్రావర్ట్ అంటే ఏమిటో అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం..! పదిమందిలో ఉన్నా అంటీముట్టనట్టుగా, ఇబ్బందిగా ఫీల్ అవడాన్నే ఇంట్రావర్ట్ అంటారు. అదే ఒంటరిగా ఉన్నా తనచుట్టూ నలుగురు పోగయ్యేలా చేసేవారు ఎక్స్‌ట్రావర్ట్స్. ఇదీ తేడా. సరే ఈ కింది ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో మీరు ఫస్ట్ ఏం చూశారో నిజాయితీగా చెప్పేయాలి మరీ..
ఈ చిత్రంలో మీరు మొదట పెదవులు, చెట్టు, చెట్టు వేర్లు ఏది ఫస్ట్ చూశారు? ఒక వేళ మీరు చూసింది చెట్టు అయితే.. మీరు ఖచ్చితంగా ఎక్స్‌ట్రావర్ట్. మీరు ఇతరులతో సులభంగా కలిసిపోతారు. బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇట్టే చక్కబెట్టేస్తారు. అందరితో చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు. ఈ లక్షణాలే మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. కానీ ఇలాంటి వారు ఎక్స్‌ట్రావర్ట్ అయినప్పటికీ వీరి మనసును చదవడం మాత్రం అంతసులువుకాదు. చాలా టఫ్.
అదే ఈ చిత్రంలో మొదట వేర్లు చూసినట్లైతే.. మీరు ఇంట్రావర్ట్. చాలా సౌమ్యంగా, చిన్న విషయానికే హడలేత్తిపోయే స్వభావం కలిగి ఉంటారు. కానీ వీరిలో దృఢ సంకల్పం, మొండి పట్టుదల దండిగా ఉంటుంది. వీరి సంకోచ స్వభావం వల్ల తొలుత వీరిని అందరూ పక్కనపెట్టినా.. వీరి సామర్ధ్యాన్ని అర్ధం చేసుకుంటే జీవితంలో ఎప్పటికీ వదిలిపెట్టరు.
పై రెండూకాకుండా ఈ చిత్రంలో మీరు మొదట పెదవులు చూసినట్లైతే.. మీరు చాలా ప్రశాంతమైన వ్యక్తి అని అర్థం. ప్రకృతి సౌందర్యాన్ని, సరళతను ఆస్వాదించే ప్రశాంతమైన, స్థిరమైన వ్యక్తిత్వం కలిగిన వారు. ఇలాంటి వారు ఎదుటి వారి డ్రామాలను అస్సలు సహించలేరు. ఎల్లప్పుడూ ప్రశాంతమైన, సమతుల్య జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. స్ట్రెస్‌కి అంత సులువుగా ప్రభావితం కాలేరు. భావోద్వేగ స్థిరత్వం కలిగి ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు.
మన చుట్టూ ఉండేవారిలో ఇంట్రావర్ట్, ఎక్స్‌ట్రావర్ట్‌లేకాదు యాంబీవర్ట్ కూడా ఉంటారనే విషయం చాలా మందికి తెలియదు. ముందు రెండింటిలోని లక్షణాలన్నీ కలగలిపి బాగా ఒంట పట్టించుకున్న వారే యాంబీవర్ట్ వ్యక్తులు. అంటే అంతర్ముఖుడిలా మూతి ముడుచుకొని ఉన్నా.. సమయం వచ్చినప్పుడు బహిర్ముఖుడిలా చెలరేగిపోవడమే యాంబీవర్ట్స్ స్టైల్..!
(చదవండి: వాట్ ఏ డేరింగ్..! చెట్టుపైన డ్యాన్స్ అదుర్స్..! కానీ..)