Medak
-
మే నెల సెలవు ఇవ్వండి
మెదక్ కలెక్టరేట్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మిని టీచర్లు అందరికీ మే నెల అంతా ఒకేసారి సెలవులు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలను ఇళ్లలో ఉంచడమే మంచిదన్నారు. కర్ణాటకలో మే నెల అంతా అంగన్వాడీ సెంటర్లకు వేసవి సెలవులు ప్రకటించారని గుర్తు చేశారు. లేదంటే టేక్ హోం రేషన్ ద్వారా ఇంటింటికీ సరుకులు పంపిణీ చేయాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్‌కు వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ నాయకుడు మల్లేశం సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణ ,తదితరులు పాల్గొన్నారు. -
ఈత.. కారాదు కడుపు కోత
తల్లిదండ్రులూ ఓ కన్నేయండిమెదక్జోన్: పిల్లలకు వేసవి సెలవులు రావడంతో సంతోషంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. కొందరు అమ్మమ్మ ఇంటికి వెళ్తే.. మరికొందరు సరదాగా గడిపేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. దీంతో యువకులు చెరువులు, కుంటల వైపు పరుగులు పెడుతున్నారు. ఈత కొడుతూ కేరింతలు కొడుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మూడేళ్లలో 25 మంది మృత్యువాత వేసవి సెలవులు రావటంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు అత్యధికంగా ఈతకోసం వెళ్తుంటారు. ప్రస్తుతం వరి కోతలు.. ఉపాధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పెద్దలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనుల్లో నిమగ్నం అవుతున్నారు. పిల్లలు చెరువులు, కుంటలు, వాగుల్లోకి ఈత కోసం వెళ్లి ప్రమాదాల బారిన పడుతుంటారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కని పెట్టాల్సిన అవసరం ఉంది. గడిచిన మూడేళ్లలో జిల్లాలో పాతిక మందికి పైగా యువకులు ఈత కోసం వెళ్లి నీట మునిగి మృత్యువాత పడ్డారు. జిల్లాలో ఏడుపాయల ఆలయం వద్ద ఘనపూర్, మెదక్– కామారెడ్డి జిల్లాల సరిహద్దులో పోచారం ప్రాజెక్టు ఉంది. వీటిలో స్నానానికి దిగి పలువురు మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. అలాగే మెదక్ మండలం బాలనగర్ శివారులో గల బొల్లారం మత్తడి ఏడాది పాటు నీటితో కనివిందు చేస్తుంది. మెదక్, హవేళిఘణాపూర్ మండలాలకు కెనాల్ ద్వారా సాగు నీరు పారుతుంది. గడిచిన ఆరు నెలల్లో ఈ మత్తడి ఆరుగురు యువకులను పొట్టన పెట్టుకుంది. ప్రమాదాలకు ప్రధాన కారణాలు చెరువులు, బావుల్లో నీటి లోతు తెలుసుకోకపోవడం, దరికి దూరంగా ఈత కొట్టుకుంటూ వెళ్లే క్రమంలో అలిసిపోవడం, అక్కడి నుంచి వెనుకకు వద్దామన్నా రాలేక.. ఊపిరాడక నీటిలో మునిగిపోతున్నారు. మద్యం మత్తులో ఈతకు వెళ్లే సందర్భాల్లోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నీటి ప్రవాహానికి ఎదురీదడం, చెరువులు, కాలువ, బావి గట్ల వద్ద సెల్ఫీలు దిగే సందర్భంలో ప్రమాదవశాత్తూ నీటిలో పడి మృత్యువాత పడుతున్నారు. -
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వీ హబ్’
డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావుమెదక్ కలెక్టరేట్: స్వయం సహాయక సంఘాల మ హిళా పారిశ్రామిక వేత్తలకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు నెలకొల్పడానికి వీ హబ్ చేయూతనిస్తుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు అన్నారు. గురువారం కలెక్టరేట్లో స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ‘ర్యాంప్’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రెండేళ్లుగా కొనసాగనున్న ఈ ప్రోగ్రాంలో ఎంపికై న మహిళా పారిశ్రామికవేత్తలు తమ బిజినెస్‌ను వేగవంతం చేసుకొని ఆదాయాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. అనంతరం వ్యాపారులకు పలు రంగాలకు సంబంధించి బిజినెస్ నైపుణ్యాలపై శిక్షణ ఉంటుందన్నారు. అలాగే యువ విద్యార్థులకు కోసం స్కిల్ డెవలప్మెంట్, కెరీయర్ రెడినీస్ కోసం వీ హబ్ నిర్వహిస్తున్న ‘ఐ లీప్’ క్యాంపస్ ప్రేణ్యూర్ కార్యక్రమంపై వివరించారు. కార్యక్రమంలో మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
టూరిస్టులపై ఉగ్రదాడి అమానుషం
మెదక్‌జోన్: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ప ర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అన్నారు. గురువారం టీఎన్జీఓ భవన్లో అత్యవసర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలో మతాల మధ్య ఐక్య తను చెదరగొట్టి మత చిచ్చు పెట్టాలన్నదే ఉగ్రవాదుల అభిమతమన్నారు. తమ దేశంలోని కాశ్మీర్ అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులు పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి పహల్గాం అమరులకు జోహార్ అంటూ నినదించారు. కార్యక్రమంలో టిఎన్జీఓ జిల్లా సహా అధ్యక్షుడు ఎండీ ఇక్బాల్ పాష, ఉపాధ్యక్షులు ఫజులుద్దీన్, కోటి రఘునాథరావు, సంయుక్త కార్యదర్శి శివాజీ తదితరులు పాల్గొన్నారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ రామాయంపేట(మెదక్): ఉగ్రదాడికి నిరసనగా వీహెచ్‌పీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి రామాయంపేటలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్య నా రాయణ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ వద్ద నుంచి ర్యాలీని ప్రారంభించారు. వీహెచ్‌పీ ప్రతినిధులతో పాటు బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
కొత్త రేషన్ కార్డులు ఎప్పుడో?
అయోమయంలో దరఖాస్తుదారులు మెదక్ కలెక్టరేట్: కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఇటీవల ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ, రాజీవ్ యువవికాసం వంటి పథకాలు ప్రవేశపెట్టడంతో దరఖాస్తుదారుల్లో మరింత ఆతృత పెరిగింది. తమకు రేషన్‌కార్డులు ఎప్పుడొస్తాయన్న ఆందోళన నెలకొంది. రేషన్‌కార్డు ప్రమాణికం కావడంతో సంక్షేమ పథకాలు పొందలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో.. ప్రభుత్వం గతేడాది నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా రేషన్‌కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. కానీ ఇప్పటికీ కొత్త కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇటీవల కార్డులు జారీ అయినట్లు వచ్చిన జాబితాలపై అధికారులు మరో మారు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు తల్లిదండ్రుల పేరిట ఉన్న కార్డుల్లో ఉన్న వారు పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో కలిసి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల పేర ఉన్న కార్డుల్లో తమ పేర్లను తొలగించుకున్నారు. కొత్త కార్డు రాక, పాత కార్డులో పేరు లేక పోవడంతో రేషన్ బియ్యానికి, రాజీవ్ యువ వికాసం వంటి సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. దీంతో చాలా మంది రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 2,13,828 రేషన్‌కార్డులు ఉండగా, 522 రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. మీసేవ ద్వారా 1,816 దరఖాస్తులు ఇటీవల జిల్లావ్యాప్తంగా 21 మండలాలకు నుంచి మీ సేవ ద్వారా కొత్త కార్డుల కోసం 1,816 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటితో పాటు ప్రజాపాలన ద్వారా 35,831 దరఖాస్తులు స్వీకరించారు. అందులో 2,488 దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తికాగా, మరో 33,343 దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. అయితే చాలా వరకు కొత్తగా పెళ్లి అయిన యువత తల్లిదండ్రుల నుంచి వేరుగా ఉంటూ కొత్తకార్డుల కోసం అప్లయ్ చేసుకున్నారు. మరికొంత మంది తమ పిల్లల పేర్లు రేషన్‌కార్డుల్లో చేర్చాలని అర్జీలు సమర్పించారు. -
కొత్త చట్టంలో రికార్డుల సవరణ
కలెక్టర్ రాహుల్రాజ్రైతులు ఎలాంటి ఇబ్బంది పడొద్దుఅదనపు కలెక్టర్ నగేష్ వెల్దుర్తి(తూప్రాన్)/నిజాంపేట(మెదక్): రైతుల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొత్త చట్టంలో రికార్డుల్లో తప్పు ల సవరణకు అవకాశం కల్పించిందన్నారు. సాదాబైనామా దరఖాస్తులు సైతం పరిష్కారం అవుతాయన్నారు. భూ సమస్యల పరిష్కారానికి అప్పీలు వ్యవస్థ ఉందని, భూదార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలు, ఆబాది, రైతులకు ఉచిత న్యాయ సహాయం ఈ చట్టంలో పొందుపర్చారన్నారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో మోసపూరితంగా నమోదై ఉంటే వాటిని రద్దు చేస్తామన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ వల్ల బడుగు, బలహీనవర్గాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కార్యక్రమంలో తూ ప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ కృష్ణ, మండల ప్రత్యేక అధికారిణి నీలిమ, ఎంపీడీఓ ఉమాదేవి, ఏఓ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. అలాగే నిజాంపేటలో ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కొత్త చట్టంతో చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, డీపీఆర్ఓ రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.టేక్మాల్(మెదక్): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. గురువారం మండలంలోని ఎలకుర్తి, చల్లపల్లి గ్రామాల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొల్లు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లకు పంపాలన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. ధాన్యం పూర్తిగా ఆరిన తర్వాతే తూకం చేయాలని చెప్పారు. లారీలు, గన్నీ బ్యాగుల కొరత ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎండల నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లోనే ధాన్యం తూకం చేయాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ పతనం ప్రారంభం
చిన్నశంకరంపేట(మెదక్): బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం కాబోతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఈనెల 27న వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభ సన్నాహ క సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాధనే ఏకై క ఎజెండాగా ఏర్పడిన గులాబీ పార్టీ 25 ఏళ్లుగా ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన ప్రజలకు మేలు చేసిందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనతోనే ప్రజలు విసిగిపోయారని, కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. రజతోత్సవ సభకు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు రాజు, లక్ష్మారెడ్డి, సుజాత, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక మెదక్‌జోన్: జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఇద్దరు బాలురు ఎంపికై నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 14వ తేదీ నుంచి 16వ వరకు వనపర్తిలో జరిగిన అండర్– 14 బాలుర రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో మెదక్ జిల్లా నుంచి పాల్గొన్న హసన్, శరత్చంద్ర మంచి ప్రతిభ కనబరిచారు. ఈనెల 25వ తేదీ నుంచి 29 వరకు మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ నుంచి పాల్గొననున్నారు. జట్టులో మొత్తం 18 మంది క్రీడాకారులు ఉండగా, జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులకు చోటు దక్కడం గర్వకారణం అన్నారు. కాగా శరత్‌చంద్రది రామాయంపేట పట్టణం కాగా, హసన్ మెదక్ పట్టణానికి చెందిన బాలుడు. సన్నబియ్యం నిరుపేదలకు వరం వెల్దుర్తి(తూప్రాన్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం నిరుపేదలకు వరంలాంటిదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఆరెగూడెంలో లబ్ధిదారుడు కౌడె సత్తయ్య ఇంట్లో మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి సన్నబియ్యం భోజనం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద, సామాన్య ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు. ప్రభుత్వంపై భారం పడుతున్నా పేదలను దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, శేఖర్, సుధాకర్‌గౌడ్, మల్లేశం, నర్సింహారెడ్డి, రవితేజ తదితరులు పాల్గొన్నారు. సాఫ్ట్‌స్కిల్స్, ఏఐపై శిక్షణ మెదక్ కలెక్టరేట్: సాఫ్ట్ స్కిల్స్, ఏఐపై మెదక్ డిగ్రీ కళాశాలలో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ హుస్సేన్ మాట్లాడుతూ.. కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన లేదా తృతీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థుల కోసం ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో శిక్షణ నిర్వహిస్తున్న ట్లు చెప్పారు. 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన యువత దీనికి అర్హులని, శిక్షణ పూర్తయిన తర్వాత వార్షికంగా రూ. 2 నుంచి 3 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. -
రైతులు సహకరించాలి
చిలప్‌చెడ్(నర్సాపూర్): కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులు నిర్వాహకులకు పూర్తి సహకారం అందించాలని మెదక్, సంగారెడ్డి జిల్లాల నాబార్డ్ డీడీఎం కృష్ణతేజ అన్నారు. బుధవారం మండల పరిధిలోని గౌతాపూర్‌లో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. దళారుల నుంచి మోసపోకుండా ఉండేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా నాబార్డ్ డీడీఎం నిఖిల్‌రెడ్డి, ఎంపీడీఓ ఆనంద్, ఏఈఓ దివ్యశ్రీ, పంచాయతీ కార్యదర్శి శ్రావణి సింధూజ, రైతు ఉత్పత్తిదారుల సంఘం మండల అధ్యక్షుడు యాసిన్, నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రాచీన ఆలయాల జీర్ణోద్ధరణ అభినందనీయం పెద్దశంకరంపేట(మెదక్): వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన రామాలయ జీర్ణోద్ధరణ అభినందనీయమని తిరుమల తిరుపతి బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి, తొగిట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామిలు అన్నారు. బుధవారం పెద్దశంకరంపేటలో శ్రీ సీతారామచంద్రుల విగ్రహ ప్రతిష్ఠ, హనుమాన్, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని మాట్లాడారు. భావితరాలకు ఆలయ విశిష్టతను తెలియజేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, విజయ్‌పాల్‌రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి పాపన్నపేట(మెదక్): జిల్లాలో 80 శాతం వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో అన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి ఎంత మేర వరి కోతలు జరిగాయి, అందుకు సంబంధించి కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని పరిశీలించాలన్నారు. రైతులకు అవసరమైన టార్పాలిన్లు, హమాలీలు, లారీల కొరత లేకుండా చూడాలని కోరారు. పనులు త్వరగా పూర్తి చేయాలి రేగోడ్(మెదక్): గ్రంథాలయ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అ న్నారు. రేగోడ్‌లో నిర్మాణ పనులను బుధ వారం పరిశీలించి మాట్లాడా రు. భవనాన్ని త్వరగా పూర్తి చేసి పాఠకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సమ్మెను జయప్రదం చేయండి: సీఐటీయూ మెదక్ కలెక్టరేట్: మేడేతో పాటు మే 20వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా 139 ఏళ్ల క్రితం కార్మికులు సాగించిన సమరశీల పోరాటాల ఫలితంగానే ప్రపంచ కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
2024–25లో రూ. 26 లక్షలు పడిపోయిన రాబడి ● డాక్యుమెంట్ల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గుముఖం ● రియల్ఎస్టేట్ రంగం సంక్షోభమే కారణమంటున్న అధికారులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 16 ఎస్ఆర్ఓ కార్యాలయాలురియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల ప్రభావం ఈ రంగంపై తీవ్రంగా పడిన సంగతి తెలిసిందే. దీంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏడాదికేడాది పెరగాల్సింది పోయి తగ్గుముఖం పట్టింది. ఇందుకు ఈ రంగం సంక్షోభమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంగారెడ్డితో పాటు, మెదక్, సిద్దిపేట జిల్లాలో హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు పెద్ద ఎత్తున వెలిశాయి. వెంచర్లలో నివాస స్థలాల క్రయవిక్రయాలు చాలా మట్టుకు నిలిచిపోయాయి. కొత్తగా ఏర్పాట్లు చేస్తున్న వెంచర్ల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. ఉన్న వెంచర్లలోనే నివాస స్థలాలను కొనుగోలు చేసే నాథుడే లేకుండా పోయారు. దీంతో చాలా వెంచర్లలో పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. అలాగే ఈ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ అవసరాల కోసం విక్రయిద్దామంటే కూడా కొనుగోలుదారులు లేకుండా పోయారు. సెకండ్ సేల్ కూడా లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోయింది. దీనికితోడు రియల్ వ్యాపారులు నివాస స్థలాల రేట్లను విపరీతంగా పెంచడంతో సామాన్యులు ప్లాట్లను కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే అపార్టుమెంట్లు, ఇతర ఆస్తుల క్రయవిక్రయాలు కూడా పడిపోయాయి. ఇలా రియల్ రంగం సంక్షోభం ప్రభావం రిజిస్ట్రేషన్ల ఆదాయంపై స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా తగ్గింది. అలాగే రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా కొంతమేరకు పడిపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2024–25 ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయంలో రూ.25.74 లక్షలు తగ్గింది. 2023–24లో మొత్తం 1.29 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా ప్రభుత్వ ఖజానాకు రూ. 1,135.19 కోట్ల ఆదాయం వచ్చింది. 2024–24లో 1.13 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, 1,109.45 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు జమ అయింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. సర్కారుకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఈ రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎంతో కీలకమైంది. రిజిస్ట్రేషన్ చార్జీలతోపాటు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ కింద ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తుంది. రిజిస్ట్రేషన్ ఆస్తి విలువలో సుమారు 7.5% మొత్తాన్ని ఈ రిజిస్ట్రేషన్ చార్జీల కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతూ వస్తుండగా... ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఆదాయం పడిపోవడం గమనార్హం. అనధికారిక లే అవుట్ రిజిస్ట్రేషన్లపై నిషేధంతో.. అనధికారిక లేఅవుట్లలోని స్థలాలను రిజిస్ట్రేషన్లను చేయకూడదని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ను ఆదేశించిన విషయం విదితమే. ఇది కూడా రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోవడానికి ప్రధాన కారణమని ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇలా రిజిస్ట్రేషన్ల ఆదాయం స్వల్పంగా తగ్గడానికి పలు కారణాలున్నాయని చెబుతున్నారు.రియల్ రంగం కుదేలే కారణం! -
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డిలో బుధవారం జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి–గుణచైతన్యరెడ్డి నిశ్చితార్థ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. జపాన్ పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా సంగారెడ్డికి చేరుకున్న రేవంత్‌రెడ్డి ముందుగా రాంనగర్లో ఉన్న రామాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నిశ్చితార్థ కార్యక్రమానికి చేరుకుని కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డితోపాటు, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ సురేశ్ షెట్కార్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
కొత్త చట్టంతో భూ సమస్యలకు చెక్
కలెక్టర్ రాహుల్రాజ్వెల్దుర్తి(తూప్రాన్)/చేగుంట/చిన్నశంకరంపేట(మెదక్): నూతన ఆర్ఓఆర్ చట్టం భూ భారతితో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం మాసాయిపేట మండల కేంద్రంలోని రైతువేదికలో భూభారతిపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన చట్టం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించడంతో పాటు రైతుల అనుమానాలను నివృత్తి చేశారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను త్వరితగతిన నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న సాదా బైనామాల పరిష్కారానికి భూ భారతిలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని వివరించారు. అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. స్టోర్ రూం, స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ జ్ఙానజ్యోతి, ఎంపీడీఓ విఘ్నేశ్వర్, ఏడీఏ పుణ్యవతి, గిర్దావర్ ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతువేదికలో కొత్త చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. చేగుంట మండలం కేంద్రంలో సైతం భూ భారతి చట్టంపై రైతులకు కలెక్టర్ అవగాహన కల్పించారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలి తూప్రాన్: ఇంటర్లో 468 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన తూప్రాన్ గీతా కళాశాల విద్యార్థిని టి. కృతికను కలెక్టర్ రాహుల్‌రాజ్, ఆర్డీఓ జయచంద్రారెడ్డి బుధవారం అభినందించారు. మాసాయిపేట మండల కేంద్రంలో భూ భారతి కార్యక్రమానికి హాజరైన కలెక్టర్‌ను కృతికతో పాటు తల్లిదండ్రులు కలిశారు. ఈసందర్భంగా విద్యార్థినిని సన్మానించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి సేవ చేయాలన్నారు. విద్యార్ధిని తల్లిదండ్రులతో పాటు కళాశాల యాజమాన్యం, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మా చదువుల కోసం నాన్న ఇబ్బంది పడుతున్నారని, భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం సాధించి నాన్న కష్టంలో పాలుపంచుకుంటానని కృతిక పేర్కొంది. -
రజతోత్సవం.. సమాయత్తం
బీఆర్ఎస్ సభకు భారీ సన్నాహాలు ● గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం ● ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 2లక్షల మందిని తరలించేందుకు కసరత్తు ● సమీక్షలు, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్న హరీశ్‌రావు ● సిద్దిపేట నుంచి పాదయాత్రగా యువత సాక్షి, సిద్దిపేట: బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు తరలేందుకు మెతుకుసీమ గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) 24 ఏళ్లు పూర్తి చేసుకుని ఈ నెల 27న 25 ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దాదాపు 2లక్షల మంది గులాబీ దండును తరలించేందుకు సమాయత్తం మవుతున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సమీక్షలను, టెలికాన్ఫరెన్స్‌లను నిర్వహిస్తూ కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి భారీగా తరలివెళ్లి ఉద్యమాల గడ్డ అని మరోమారు సత్తా చాటేందుకు స్థానిక గులాబీ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. ముమ్మరంగా ఏర్పాట్లు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దాదాపు 2లక్షల మందికి పైగా సభకు వెళ్లేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు. నాయకులకు పలు బాధ్యతలను అప్పగించారు. గజ్వేల్ నుంచి గులాబీ దండును తరలించే పనిలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రతాప్ రెడ్డి, మాదాసు శ్రీనివాస్‌లు దృష్టి సారించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించారు. సభకు తరలేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హుస్నా బాద్ నియోజకవర్గం పరిధిలోనే సభ జరుగుతుండటంతో ఎక్కువ మందిని తరలించేందుకు ప్రత్యేక దృష్టిపెట్టారు. అలాగే మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ నుంచి సైతం జన సమీకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. జోరుగా వాల్ రైటింగ్ ఎల్కతుర్తి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రధాన రహదారుల వెంట వాల్‌రైటింగ్ రాయించారు. అలాగే పలువురు బీఆర్ఎస్ నేతలు వాల్ పోస్టర్లను రూపొందించి అతికించారు. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే నాయకులు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. తరలివెళ్దాం రండి..ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భా రీగా తరలిరావాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం కోసం జరిగిన ఉద్యమంలో దుబ్బాక నియోజకవర్గం క్రీయాశీలక పాత్ర పోషించిందన్నారు. కనీవిని ఎరుగని స్థాయిలో జరుగనున్న రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి 15 వేలకు పైగా క్రీయాశీలక కార్యకర్తలు హాజరుఅవుతారన్నారు. సభకు సంభందించి ఇప్పటికే నియోజకవర్గంలోని కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి తగిన ఏర్పాట్లపై చర్చించామన్నారు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వక్ఫ్‌చట్టంతో పేద ముస్లింలకు మేలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ మెదక్‌జోన్: పేద ముస్లింలకు మేలు జరుగుతోందనే ఉద్దేశంతో ప్రధాని మోదీ వక్ఫ్‌బోర్డు చట్టాన్ని తెచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ అన్నారు. మంగళవారం వక్ఫ్‌బోర్డు చట్ట సవరణ జన జాగరణ అభియాన్‌లో భాగంగా చట్టం గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్చట్టాలపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు. ఈ చట్టంపై కొందరు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారి నోరు మూయించాలంటే ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బూత్ కమిటీ సభ్యులపై ఉందన్నారు. కార్యక్రమంలో చంద్రయ్య, మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, రాగిరాములు, కొండలరావు జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎంఎల్‌ఎన్‌రెడ్డి, ఓబీసీ నేత కాశినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతి రైతులకు వరం
నేడు భూభారతి అవగాహన సదస్సుమే 20వరకు పూర్తి చేయాలి ‘యువ వికాసం’ దరఖాస్తులపై కలెక్టర్కుర్తివాడ అనాథ పిల్లలను ఆదుకుంటాంరామ్, అరుణ్ గుప్తా ఫ్యామిలీ ఫౌండేషన్ సభ్యులురేగోడ్/పెద్దశంకరంపేట(మెదక్): భూ భారతి చట్టం రైతులకు, పేద ప్రజలకు వరమని, రైతుల భూ సమస్యల పరిష్కరించడానికి ప్రజల వద్దకే అధికారులు వెళ్తారని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మండల కేంద్రమైన రేగోడ్లోని రైతు వేదిక కార్యాలయంలో, పెద్దశంకరంపేటలో మంగళవారం భూ భారతి చట్టంపై ప్రజలు, రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి సందేశాన్ని టీవీ ద్వారా వినిపించారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ద్వారా ఎలాంటి సమస్యలైనా పరిష్కరిస్తామని, భూ కబ్జాలు, అక్రమాలు, వివాదాలు తొలగించి, శాటిలైట్ ద్వారా మ్యాప్‌లు పట్టా పాస్‌బుక్‌లో పొందుపర్చుతామని అన్నారు. పౌతి అమలు వంటిని పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూన్ 2నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. ఆధార్ లింకు ద్వారా భూధార్ కార్డులు ఇస్తామన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. గతంలో పెద్దశంకరంపేట ప్రాంతంలో రాణి శంకరమ్మ భూములు పేద రైతులకు దక్కకుం డా ధరణి ద్వారా భూస్వాముల పరమయ్యాయని అన్నారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని, బీఆర్ఎస్ పార్టీ బినామీలకు పట్టాలు అందించిందన్నారు. అనంతరం రేగోడ్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ రాహుల్‌రాజ్ తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, ఆస్పత్రికి వచ్చే రోగుల వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ రమాదేవి, పీసీసీ సభ్యుడు ఎం.కిషన్, ఆర్అండ్బీ ఈఈ సర్దార్ సింగ్, తహసీల్దార్ దత్తరెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సీతారావమ్మ, ఇన్చార్జి ఎంపీడీఓ విఠల్‌రెడ్డి, ఏఓ జావిద్, ఆర్ఐలు ఫెరోజ్, విజయలక్ష్మి, సీనియర్ నాయకులు సురేందర్‌రెడ్డి, మధు, నారాగౌడ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షు రాలు భవానీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎస్.దిగంబర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ మన్నన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ రాహుల్‌రాజ్ హాజరుకానున్నారని తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. మెదక్ కలెక్టరేట్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు విచారణ ప్రక్రియ మే 20వ తేదీ వరకు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టర్ తన చాంబర్లో జిల్లా, మండల స్థాయిలో విచారణ టీంల ఏర్పాటుపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం యూనిట్లు ఏర్పాటు చేసే లబ్ధిదారులకు బ్యాంకర్లు రుణాలు అందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 32,640 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. తుది జాబితా ఆయా కార్పొరేషన్‌కు పంపనున్నట్లు తెలిపారు. యూనిట్లు ఏర్పాటును బట్టి ఎంపిక చేసిన లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నెలాఖరులోగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి అనంతరం హైదరాబాద్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌతమ్‌లతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలోఅదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావు, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, ఆర్డీఓ రమాదేవి, నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్రెడ్డిలతోపాటు ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.పాపన్నపేట(మెదక్): పాపన్నపేట మండలం కుర్తివాడ అనాథ బాలికలను అన్ని విధాలుగా ఆదుకుంటామని రామ్, అరుణ్ గుప్తా ఫ్యామిలీ ఫౌండేషన్ సభ్యులు తెలపారు. మంగళవారం వారు బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనాథ బాలికలను కుర్తివాడలో కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ముగ్గురు పిల్లలకు విద్యాభ్యాసం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కావాల్సిన ఆర్థిక వనరులు సమాకూరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజల వద్దకే అధికారులు వెళ్తారు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు కలెక్టర్ రాహుల్‌రాజ్ -
ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య నర్సాపూర్ రూరల్: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. మంగళవారం మండలంలోని పెద్ద చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సోషల్ ఉపాధ్యాయిని రుక్మిణి పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రుక్మిణి 41 సంవత్సరాల పాటు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తప్పనిసరన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైందన్నారు. రుక్మిణి సేవలను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ తారాసింగ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పాఠశాల హెచ్ఎం ఇందిరా, లుచ్చానాయక్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు శ్రీనివాస్ ఎల్లం పాల్గొన్నారు. అనంతరం రుక్మిణిని ఘనంగా సన్మానించారు. తాగునీటి సమస్య పరిష్కారం మిషన్ భగీరథ డీఈ ప్రవీణ్ చిలప్‌చెడ్(నర్సాపూర్): తండావాసుల తాగునీటి సమస్య పరిష్కరించామని మిషన్ భగీరథ డీఈ ప్రవీణ్ తెలిపారు. మండల పరిధిలోని బద్య్రాతండా పంచాయతీ పరిధిలోని బంజారానగర్ తండాలో కొంతకాలంగా తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో తండావాసులు తాగునీటి కోసం నానా అవస్థలు పడ్డారు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే సునీతారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె స్పందించారు. మంగళవారం సంబంధిత అధికారులు స్థానిక ఓవర్ హెడ్ ట్యాంకులోకి నీటి సరఫరా చేయడంతో తండావాసుల తాగునీటి సమస్య పరిష్కారమైంది. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ సురేశ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఆన్వేష్‌రెడ్డి, ఎంపీడీఓ ఆనంద్, ఏపీఓ శ్యామ్, ఇన్చార్జి ఎంపీఓ తిరుపతి, పంచాయతీ కార్యదర్శి మోహన్ పాల్గొన్నారు. నూతన విద్యా విధానం అమలు చేయాలి నర్సాపూర్: రాబోయే విద్యా సంవత్సరం నుంచి నూతన విద్యా విధానం అమలు చేయాలని తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్లం, లక్ష్మణ్ డిమాండ్ చేశారు. వారు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. నూతన విద్యా విధానంతో విద్యార్థులలో జీవన నైపుణ్యాలు పెంపొందుతాయని, వారికి నచ్చిన వృత్తిని ఎంచుకొని ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయని చెప్పారు. సెమిస్టర్ విధానంతో విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే ప్రకటించాలని, పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారి వెంట జిల్లా సంఘం నాయకులు నరేందర్‌గౌడ్, రాంచందర్ పాల్గొన్నారు. తాగునీటి సమస్య తలెత్తొద్దు చిన్నశంకరంపేట(మెదక్): గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని డీపీఓ యాదయ్య కోరారు. మంగళవారం నార్సింగి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో సాగునీటి సరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ ఆనంద్‌కుమార్, ఈఓ నాగభూషనం ఉన్నారు. పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లండి ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లో సరైన ఆధారాలు లేని వాహనాలను సీజ్ చేశామని, సరైన పత్రాలు చూపించి తీసుకెళ్లాలని ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 239 సీజ్ చేసి ఉండగా, ఇందులో ద్విచక్ర వాహనాలు 224, త్రీవీలర్స్ 09, ఫోర్ వీలర్స్–06లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 102 వాహనాలపై సీఆర్పీసీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డాక్యుమెంట్లు తీసుకొచ్చి వాహనాలు తీసుకొని వెళ్లాలన్నారు. పూర్తి సమాచారం కోసం జిల్లా నోడల్ అధికారి అడిషనల్ ఎస్పీ మహేందర్, 871265 7901, 8712657911, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శైలేందర్ 8712657912 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. లేనిచో ఆరు నెలల తర్వాత వేలం వేస్తామన్నారు. -
ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి డీఆర్ఓ భుజంగరావు, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై 61 వినతులు అందజేశారు. భూ భారతితో సమస్యలు పరిష్కారం పెద్దశంకరంపేట(మెదక్): భూభారతి చట్టంతో రైతుల సమస్యలు దూరం కానున్నాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట తహసీల్దార్ కార్యాలయంలో భూ సమస్యలపై అధికారులతో చర్చించారు. మంగళవారం రైతువేదికలో నిర్వహించే అవగాహన సదస్సుకు సంబంధించి పలు సూచనలు చేశారు. అయా గ్రామాల రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొని రావాలని, రైతులు ఎక్కువగా హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ విఠల్‌రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మధు, నాయకులు సురేందర్‌రెడ్డి, గంగారెడ్డి, కుంట్ల రాములు, రాజన్‌గౌడ్, గోవింద్రావు, తదితరులు పాల్గొన్నారు. ‘బైపాస్’ వద్దే వద్దు రామాయంపేట(మెదక్): మెదక్– ఎల్కతుర్తి (765 డీజీ) జాతీయ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మించవద్దని భూ నిర్వాసితులు సోమవారం సర్వే పనులను అడ్డుకోవడానికి యత్నించారు. పనులు ఆపి వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. సీఐ వెంకట్‌రాజాగౌడ్, ఎస్ఐ బాల్‌రాజ్ వారిని సముదాయించారు. పనులు అడ్డుకుంటే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో పనులు కొనసాగుతాయని, నష్టపరిహారం పెంపు, ఇతర సమస్యలుంటే పై అధికారులను సంప్రదించాలని ఆర్డీఓ రమాదేవి సూచించారు. ఇదిలా ఉండగా ఈ గొడవల మధ్య సర్వే కొనసాగింది. బైపాస్ రోడ్డు నిర్మాణంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. వెంట వెంటనే ధాన్యం తరలింపు చిన్నశంకరంపేట(మెదక్)/హవేళిఘణాపూర్: కొనుగోలు కేంద్రాల్లో కాంటా చేసిన ధాన్యం వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. సోమవారం మండలంలోని ధరిపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంటా చేసిన ధాన్యం వెంటనే తరలించాలని సూచించారు. రైస్‌మిల్లు సమస్యలు ఉన్న, లారీల కొరత ఉన్నా వెంటనే తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. అలాగే హవేళిఘణాపూర్ మండల పరిధిలోని కూచన్‌పల్లి, గాజిరెడ్డిపల్లి, బూర్గుపల్లి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. లారీల కొరత లేకుండా చూడాలన్నారు. బాల్య వివాహాలపై అవగాహన అవసరం మెదక్ మున్సిపాలిటీ: బాల్య వివాహాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని మెదక్ సీనియర్ సివిల్ జడ్జి రామశర్మ అన్నారు. సోమవారం పట్టణంలోని అవుసులపల్లిలో పోక్సో చట్టం.. బాల్య వివాహాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. -
ఓర్వలేకే ఎమ్మెల్యేపై ఆరోపణలు
రామాయంపేట(మెదక్): మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌పై బీఆర్ఎస్ నాయకులు అవనసర ఆరోపణలు చేస్తే ఊరుకోమని కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు హెచ్చరించారు. సోమవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే వారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధిని 15 నెలల కాలంలో చేసినందుకు వారు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. రామాయంపేట వెనకబడటానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ నాయకులేనని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై బీఆర్ఎస్ కార్యకర్త సోషల్ మీడియాలో ఆరోపణలు చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారని, ఇందులో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేపై అవనసర ఆరోపణలు చేసినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు అల్లాడి వెంకటి, నా యకులు సరాపు యాదగిరి, నాగరాజు, యాదగిరి, చింతల యాదగిరి, డాకి స్వామి నాయకులు తదితరులు పాల్గొన్నారు.పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు -
ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు
మెదక్ మున్సిపాలిటీ/కొల్చారం(నర్సాపూర్): ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని కొల్చారం వెళ్లే రహదారిపై ఇటీవల ఓ వర్గం అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం, పోటీగా మరో వర్గం శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. దీంతో సోమవారం ఆ స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. మహనీయులను కించపరిచే విధంగా పనులు చేయడం, పైగా ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా రోడ్డుపై విగ్రహాలను ఏర్పాటు చేయడం తగదన్నారు. ఇరువర్గాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగాలని సూచించారు. లేదంటే చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ప్రసన్నకుమార్‌ను ఆదేశించారు. ఎస్పీ వెంట మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై మహమ్మద్‌గౌస్ ఉన్నారు. అనంతరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు.ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి -
ఎంత పని చేశావమ్మా..
తూప్రాన్: కన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే వారిని కడతేర్చింది. చుట్టుముట్టిన ఆర్థిక పరిస్థితులతో జీవితం భారమై వారిని వాగులోకి తోసి అంతమొందించింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. అయితే.. తృటిలో ప్రాణాలతో బయటపడింది. ఈ హృదయ విదారకరమైన సంఘటన తూప్రాన్‌లో సోమవారం జరిగింది. ఎస్ఐ శివానందం, గ్రామస్తుల కథనం ప్రకారం.. మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి స్వామి– మమత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మద్యానికి బానిసైన స్వామి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ పెద్ద లేకపోవడంతో కుటుంబం గడవడం కష్టతరంగా మారింది. ఇద్దరు చిన్నారులతో కూలి పనులకు వెళ్ల లేక పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. చిన్న తనంలోనే మమత తల్లిదండ్రులను కోల్పోవడంతో చిన్నమ్మ పెద్ద చేసి పెళ్లి చేసింది. ఈక్రమంలో భర్త చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. దీంతో శివ్వంపేట మండలం దంతాన్‌పల్లిలో ఉండే చిన్నమ్మ మైసమ్మ వద్దకు ఇద్దరు చిన్నారులతో కలిసి చేరింది. కూలికి వెళ్లి వచ్చిన డబ్బులతో తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటుంది. పెద్ద కూతురు పూజిత (7) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా, రెండో కూతురు తేజస్విని (5) అంగన్వాడీ స్కూల్లో చదువుకుంటుంది. దశదినకర్మకు వెళ్తున్నానని.. దుబ్బాక మండలం వడ్డెపల్లిలో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు వెళ్తున్నానని చిన్నమ్మకు చెప్పిన మమత.. ఇద్దరు కూతుర్లతో కలిసి ఇంటి నుంచి ఉదయం 8.30 గంటలకు బయలు దేరింది. నాగులపల్లి సమీపంలోని రైలు పట్టాలపై కూర్చొని తన బిడ్డలతో ‘నాన్న వద్దకు వెళుదాం’అని చెప్పింది. అనంతరం దంతాన్‌పల్లిలోని తన ఇంటి పక్కన ఉన్న కుటుంబ సభ్యులతో ఫోన్లో పిల్లలతో మాట్లాడించింది. ‘మా అమ్మ మమ్ముల్ని.. మా నాన్న వద్దకు తీసుకెళుతానంటుంది, మేము అక్కడికే వెళ్తున్నాం’ఆ చిన్నారులు ఫోన్లో మాట్లాడారు. అనుమానం వచ్చిన పక్కింటి వారు రైలు పట్టాల వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఫోన్ పని చేయలేదు. గంట అనంతరం హల్దీవాగులో ఇద్దరు చిన్నారులతో కలిసి దూకింది. మమత ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగా.. పిల్లలు మృత్యువాతపడ్డారు. గజ ఈతగాళ్ల సహాయంతో వాగు నుంచి ఇద్దరు చిన్నారుల మృతదేహాలపై బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించా రు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటన స్థలా నికి చేరుకొని బో రున విలపించారు. పోలీసులు తల్లి మమతను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులతో కన్న పిల్లలను కడతేర్చిన తల్లి ఆపై తాను వాగులోకి దూకి ఆత్మహత్యాయత్నం తృటిలో ప్రాణాపాయం నుంచి బయటకు.. -
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య
డీఈఓ రాధాకిషన్రామాయంపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని డీఈఓ రాధాకిషన్ అన్నారు. సోమవారం మండలంలోని ప్రగతి ధర్మారంలో ముందస్తుగా ఏర్పాటు చేసిన బడిబాట కా ర్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. నూతన అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం బడిబాట కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు త దితరులు పాల్గొన్నారు. -
వడగండ్లు.. కడగండ్లు
మెదక్‌జోన్: వడగండ్ల వర్షం రైతులకు కడగండ్లు మిగిల్చింది. ఈనెల 17, 18 తేదీల్లో శివ్వంపేట, నర్సాపూర్, పెద్దశంకరంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, చేగుంట తదితర మండలాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సుమారు 19 వందల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో వరి 1,860 ఎకరాలు ఉండగా, 40 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఆయా మండలాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధిత రైతులు, పంటల వివరాలను సేకరించారు. రాష్ట్రస్థాయి అధికారులకు నివేదికను అందజేశారు. గతేడాది 794 ఎకరాల్లో నష్టం గతేడాది యాసంగిలో కురిసిన వడగండ్ల వానకు 794 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అయితే గత మార్చిలో దెబ్బతిన్న 714 ఎకరాలకు మాత్రమే ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఎకరాకు రూ. 10 వేల చొప్పున అందజేసింది. ఏప్రిల్, మేలో దెబ్బతిన్న 80 ఎకరాలకు సంబంధించి ఇప్పటివరకు రైతులకు ఎలాంటి పరిహారం అందలేదు. ఫసల్ బీమా ఎప్పుడో..? పంట నష్టం జరిగినప్పుడు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెటింది. కాగా 2014 నుంచి రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయలేదు. దీంతో పంట నష్టం జరిగినప్పుడు బాధిత రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ పేరుతో పరిహారం మాత్రమే అందించారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపద సమయంలో అన్నదాతలను ఆదుకునేందుకు ఫస ల్ బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన ప్రీమియం మొత్తంలో 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. కేవలం 25 శాతం మాత్రమే రైతు వాటా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తే రైతులకు కొండంత అండగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో 1,860 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు 40 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం ప్రభుత్వానికి నివేదిక అందించిన అధికారులు -
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
టేక్మాల్(మెదక్)/పాపన్నపేట/చిలప్‌చెడ్(నర్సాపూర్): భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం చిలప్‌చెడ్ రైతువేదికలో భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు. ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని, కొన్ని రకాల భూ సమస్యలకు పరిష్కరమే లేదన్నారు. రైతులు ఒక్క రూపాయి చెల్లించకుండానే రెవెన్యూ అధికారులు నేరుగా గ్రామాలకు వచ్చి భూ సమస్యలు పరిష్కరిస్తారన్నారు. భూధార్ కార్డులో భూ రికార్డులు, హద్దులు, మ్యాప్ అన్ని వివరాలు ఉంటాయన్నారు. రెవెన్యూ సిబ్బందిలో ఏ స్థాయి అధికారైనా అవినీతికి పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం టేక్మాల్ మండలంలోని రైతు వేదికలో కొత్త చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. భూ కబ్జాలు, అక్రమాలు, వివాదాలను తొలగించి, రైతులకు భద్రత కల్పించేందుకు ఈ చట్టం కీలకంగా పనిచేస్తుందన్నారు. నిషేధిత భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూములన్నింటికీ భూ భారతిలో పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. అంతకుముందు సదస్సుకు వచ్చి న రైతులు, తమ సందేహాలను ఉన్నతాధి కారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలంలోని ఎల్లుపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. పాపన్నపేట మండలం మల్లంపేటలో సైతం భూ భారతి కొత్త చట్టంపై రైతు లకు అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, అర్డీఓలు మహిపాల్, రమా, ఏడీఏ పద్మ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ -
భూ భారతితో సమస్యలకు చెక్
కౌడిపల్లి/కొల్చారం(నర్సాపూర్): భూభారతి చట్టంతో భూ సమస్యలు త్వ రగా పరిష్కారం అవు తాయని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్య ఉన్న భూములపై రైతులు ఫిర్యాదు చేస్తే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. భూమి సర్వే నంబర్, సరిహద్దుల పూర్తి వివరాలతో త్వరలో రైతులకు భూదార్ నంబర్ కేటాయిస్తామన్నారు. జూన్ 2వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహించి భూ భారతి ద్వారా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సమస్య ఉన్న రైతులు తహసీల్దార్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, గ్రామసభలో ఫిర్యాదు చేస్తే సరిపోతుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, ఏడీఏ పుణ్యవతి, తహసీల్దార్ ఆంజనేయులు, ఏఓ స్వప్న, ఆర్ఐ శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. అనంతరం కొల్చారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కలెక్టర్ కొత్త చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. కొత్త చట్టంలో మార్పులు చేసేందుకు తహసీల్దార్లకు అధికారం ఉంటుందని.. ఇక కలెక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో కొత్త చట్టాన్ని జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వాటికి త్వరలోనే పరిష్కారం చూపుతామని చెప్పారు. భూ భారతి చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.కలెక్టర్ రాహుల్‌రాజ్ -
పక్షం రోజుల్లో అందరికీ రైతుభరోసా
కంగ్టి(నారాయణఖేడ్): పక్షం రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ స్పష్టం చేశారు. కంగ్టి మండలంలోని తడ్కల్ రైతు వేదికలో కంగ్టి ప్యాక్స్ చైర్మన్ మారుతిరెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. రూ. 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ...తడ్కల్ మండలం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారు. గతంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తే తడ్కల్‌లో ప్రా థమిక వ్యవసాయ పరపతి సంఘం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. రేషన్‌లో సన్నబియ్యం ఉచితంగా ఇస్తూన్నా నూకలు ఇచ్చారని సోషల్ మీ డియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దామ నాగన్న, పార్టీ మండల అధ్యక్షుడు మల్రెడ్డి, ఏఓ హరీశ్పవార్, నాయకులు డాక్టర్ హమీద్, మల్లారెడ్డి, బాబుసాబ్, ప్యాక్స్ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ -
ప్రభువా.. కరుణించు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఆదివారం ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఇన్చార్జి బిషప్ రూబెన్‌మార్క్ హాజరై దైవసందేశం ఇచ్చారు. పరలోక దేవుడు ఏసయ్య పాపుల రక్షణ కోసం సిలువ వేయబడి, తిరిగి మూడు రోజుల అనంతరం సమాధి నుంచి లేచిన పర్వదినాన్ని ఈస్టర్ డేగా జరుపుకుంటామని తెలిపారు. అనంతరం ప్రెసిబెటరీ ఇన్చార్జి శాంతయ్య మాట్లాడుతూ.. పరలోక దేవుడు పాపుల రక్షణ కోసమే అవతరించాడన్నారు. అంతకుముందు ఉదయం 10 గంటలకు చర్చి చుట్టూ శిలువను ఊరేగించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్చి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. – మెదక్‌జోన్ -
రైతుకు ‘గుర్తింపు’
అన్నదాతల సమగ్ర సమాచారం ఆన్లైన్లో పొందుపరచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రతీ రైతుకు ‘ఆధార్’ మాదిరి 11 అంకెల ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తూ గుర్తింపు కార్డుల జారీకి చర్యలు చేపడుతోంది. ఈనెల 22 నుంచి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు శిక్షణ సైతం పూర్తయింది. – మెదక్‌జోన్ ఆధార్ తరహాలో 11 అంకెల సంఖ్య రేపటి నుంచే శ్రీకారం ఇప్పటికే అధికారులకు శిక్షణ పూర్తిరైతుల సమగ్ర వివరాలను ఒకే చోట పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రైతు పూర్తి డేటాను సేకరించి 11 అంకెల ప్రత్యేక నంబర్‌ను కేటాయించనుంది. ఆ నంబర్ క్లిక్ చేస్తే చాలు రైతు పేరు, ఇతర వివరాలు ఇట్టే తెలుస్తాయి. సర్వే నంబర్లు, రైతు స్వగ్రామం, భూమి ఏ ప్రాంతాల్లో ఎంత ఉంది. అది సారవంత మైనదేనా..? ఆ భూమి ఏ పంటలకు అనువైనవిది.. దానిపై సదరు రైతుకు బ్యాంకు ఎంత అప్పు ఇవ్వొచ్చు, అంతే కాకుండా సబ్సిడీ వ్యవసాయ పరికరాలు, రసాయన ఎరువులతో పాటు పీఎం సమ్మాన్ నిధి, పంటనష్ట పరిహారం తదితర పూర్తి వివరాలను అందులోనే పొందుపరచనున్నారు. ఇక నుంచి బ్యాంకు రుణం కోసం పట్టాపాస్‌బుక్, ఇతర పత్రాలను అధికారులకు చూపించాల్సిన అవసరం ఉండదు. కేవలం రైతుకు కేటాయించిన 11 అంకెల డిజిట్ నంబర్‌ను సదరు అధికారికి చెబితే సరిపోతుంది. ఇందుకు సంబంధించి ఈనెల 15వ తేదీన హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన ఇద్దరు అధికారుల శిక్షణ పొందారు. వారు ఈనెల 17న కలెక్టరేట్లో ఏఈఓలు, ఏఓలతో పాటు ఇతర అధికారులకు వివరించారు. కాగా ఈనెల 22 నుంచి ఆయా గ్రామాల రైతులు వారి పట్టాపాస్ పుస్తకం, ఆధార్‌కార్డుతో పాటు ఫోన్ నంబర్‌ను మండల వ్యవసాయశాఖ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. రైతుల డేటాను పూర్తిగా ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత సదరు రైతు ఫోన్‌కు 11 అంకెలు గల ఐడీ నంబర్ వస్తోంది. దానిని రైతు భద్రంగా ఉంచుకోవాలి. రుణం కోసం బ్యాంకుకు వెళ్లినా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పడకపోయినా, సంబంధిత అధికారికి ఈ నంబర్ చెబితే సరిపోతుంది.వివరాలు తప్పనిసరి ఈనెల 22 నుంచి రైతులు వారి ఆధార్ కార్డు, పట్టా పాస్‌బుక్‌లు తీసుకొని ఆయా మండలాల వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ ఏఈఓలు, ఏఓలకు వాటిని అందించడంతో పాటు ఫోన్ నంబర్ తప్పనిసరిగా చెప్పాలి. వారు ఆన్లైన్ నమోదు చేసి ప్రతి రైతుకు 11 అంకెలు గల గుర్తింపు నంబర్‌ను ఇస్తారు. – వినయ్, జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారిజిల్లాలో 2.91 లక్షల మంది రైతులు జిల్లాలో 4.50 లక్షల ఎకరాలు వ్యవసాయ భూములు ఉండగా, అందులో 3,92,904 సారవంతమైన భూములు ఉన్నాయి. రైతులు 2,91,399 మంది ఉన్నారు. నెలరోజుల వ్యవధిలో రైతుల వివరాలను ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’లో పొందుపరిచి ప్రతి రైతుకు పదకొండు అంకెలు గల విశిష్ట గుర్తింపు నంబర్లను ఇవ్వనున్నారు. -
సబ్సిడీ టార్పాలిన్లు ఏవీ?
రామాయంపేట(మెదక్): ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో 50 శాతం సబ్సిడీపై రైతులకు టార్పాలిన్లు అందించేవారు. ప్రస్తుతం ఆ పథకం రద్దు కావడంతో నానా పాట్లు పడుతున్నారు. అద్దె టార్పాలిన్ల కోసం రూ. వేలు ఖర్చు చేస్తూ అదనపు భారం మోస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయశాఖ అధికారులు టార్పాలిన్లు ఇచ్చే వారు. ఎనిమిది ఫీట్ల పొడవు, ఆరు ఫీట్ల వెడల్పు ఉన్న టార్పాలిన్ల అసలు ధర రూ. 2,500 కాగా, ప్రభుత్వం రూ. 1,250కే రైతులకు అందజేసింది. రెండు, మూడేళ్ల పాటు ఈ పథకం కొనసాగగా, పెద్ద సంఖ్యలో రైతులు వాటిని కొనుగోలు చేశారు. రైతులకు అదనపు ఖర్చు ఏపీ నుంచి వచ్చిన వ్యాపారులు కొందరు జిల్లా పరిధిలోని పెద్ద గ్రామాలు, పట్టణాల పరిధిలో 70 వరకు తాత్కాలికంగా టార్పాలిన్లు అద్దెకు ఇచ్చే దుకాణాలు ప్రారంభించారు. రైతుల ఆధార్ కార్డులు తమ వద్ద పెట్టుకొని టార్పాలిన్లు అద్దెకు ఇస్తున్నారు. ఒక్కోదానికి రోజూ రూ. 20 నుంచి రూ. 25 వరకు అద్దె తీసుకుంటున్నారు. సాధారణంగా ప్రతి రైతుకు కనీసం ఆరు నుంచి పది టార్పాలిన్లు అవసరం పడతాయి. దీంతో ప్రతి రోజూ రూ. 250 వరకు అదనపు భారం పడుతుంది. పంట నూర్పిడి చేయడం, ఆరబెట్టడం, సంచుల్లో నింపి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించడానికి కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతోంది. ఈ లెక్కన రైతులపై టార్పాలిన్ల అద్దె కోసం రూ. ఐదు వేల వరకు ఖర్చవుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై టార్పాలిన్లు అందజేయాలని రైతులు కోరుతున్నారు.అన్నదాతల ఎదురుచూపులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలు అద్దెతో అదనపు భారం ధాన్యం కాపాడుకునేందుకు నానాపాట్లు -
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి మెదక్ మున్సిపాలిటీ: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యే ప్రవర్తన ఉండాలన్నారు. దిగజారే మాటలు మానుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన వారు ఎదుటివారి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీ లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. సమావేశంలో మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్ లావణ్యరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఆత్మీయ సన్మానం మెదక్ కలెక్టరేట్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద బదిలీపై వెళ్తున్న సందర్భంగా జిల్లా న్యాయశాఖ ఉద్యోగులు ఆదివారం పట్టణంలోని ఓ గార్డెన్లో ఆత్మీయ సన్మాన సభ నిర్వ హించారు. ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ప్రధాన న్యాయమూర్తి సేవలను కొనియా డారు. అనంతరం న్యాయమూర్తిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సిరి సౌజన్య, స్పెషల్ మొబైల్ మెజిస్ట్రేట్ ప్రభాకర్, మెదక్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీరాములు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభం రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి, కోమటిపల్లి గ్రామాల్లో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజనికుమారి, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు రాజ్‌నారాయణ, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, ఇతర నాయకులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలిపాపన్నపేట(మెదక్): కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జిల్లా నాన్ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు జఫీరొద్దీన్, ఉపాధ్యక్షుడు రాకేష్ గోస్వామి, కార్యదర్శి భూమయ్య, మెదక్ టౌన్ అధ్యక్షుడు ముజీబ్ డిమాండ్ చేశారు. ఆదివారం పాపన్నపేటలో వారు విలేకరులతో మాట్లాడారు. డిమాండ్ల సాధన కోసం ఈనెల 25న జిల్లాలో నిర్వహించే ఆకలి కేకల రథయాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈనెల 27న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే సమావేశానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. -
రన్నింగ్‌లో ఊడిన బస్సు టైర్లు.. తప్పిన పెను ప్రమాదం
మెదక్,సాక్షి: మెదక్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. తూప్రాన్ వద్ద రాజస్థాన్ నుండి హైదరాబాద్ వెళుతున్న వేగంగా వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ ఊడింది. దీంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ బస్సు ప్రమాదంలో పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ ప్రయాణికుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
అర్హులందరికీ పథకాలు అందిస్తాం
మంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డి: అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డిలో శనివారం జరిగిన కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలో ఎన్నో రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా అమలు చేసిందన్నారు. ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుని వారిని ఆదుకునే పథకాలను తీసుకొచ్చే ఉద్దేశంతో రాష్ట్రంలో కులగణన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని కొనియాడారు. వర్గీకరణ ఫలాలు అందరికీ అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పార్టీలకు, రాజకీయాలకతీతంగా గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఒకవైపు వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ మరోవైపు నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రాయితీ రుణాలను ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వ్లెడించారు. త్వరలో మరో 20 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు
మెదక్ మున్సిపాలిటీ: అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి వెంట ఉండే గ్రామాల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్యాసింజర్ వాహనాలపై పరిమితికి మించి ప్రయా ణికులను ఎక్కించడం, అధిక లోడుతో వాహనాలు నడపడం ప్రమాదకరం అన్నారు. రహదారులపై వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు, కేసులు నమో దు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. హెల్మెట్, సీటు బెల్ట్ విధిగా పెట్టుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలన్నారు.ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి -
పేటకు పూర్వ వైభవం తెస్తా
రామాయంపేట(మెదక్): అన్నిరంగాల్లో వెనుకబడిన రామాయంపేట పునర్విభజనలో మళ్లీ నియోజకవర్గ కేంద్రం అయ్యే అవకాశం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. జాతీయ రహదారి (765 డీజీ) నిర్మాణంలో భాగంగా పేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న రైతులు, వ్యాపారులతో శనివారం సమావేశం నిర్వహించారు. బైపాస్ రోడ్డు నిర్మాణం వద్దని, పాత రహదారి గుండానే జాతీయ రహదారి నిర్మించాలని భూ నిర్వాసితులు ఎంపీకి మొరపెట్టుకున్నారు. ఇప్పటికే రామాయంపేటకు అన్ని రంగాల్లో తీరని అన్యాయం జరిగిందని.. బైపాస్ రోడ్డు పూర్తయితే పరిస్థితి మరీ అధ్వానంగా మారుతుందని వాపోయారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. బైపాస్ రోడ్డు నిర్మాణానికి గెజిట్ విడుదలైనందున ఆ భూములు ప్రభుత్వ పరం అయ్యాయని చెప్పారు. పట్టణ అభివృద్ధికి తనవంతుగా సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. భూములు కోల్పోతున్న బాధితులతో వచ్చే నెలలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని అన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి గాను ఎంజాయిమెంట్ సర్వేను అడ్డుకోవద్దని సూచించగా, బాధితులు అంగీకరించలేదు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ రజనికుమారి, డీఈ అన్నయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకరించండి మెదక్ ఎంపీ రఘునందన్‌రావు -
అర్బన్‌పార్కుకు హంగులు
నర్సాపూర్ అడవులను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అర్బన్‌పార్కు సందర్శకులకు ఆహ్లాదం పంచుతుండగా.. పార్కు ఆవరణలో రెండు దఫాలుగా కాటేజీల నిర్మాణం చేపట్టారు. ఇవి అందుబాటులోకి వస్తే పర్యాటకులకు మరిన్ని వసతులు సమకూరే అవకాశం ఉంది. – నర్సాపూర్● పర్యాటకుల కోసం కాటేజీలు, ఇతర వసతులు ● చివరి దశకు చేరిన పనులు ● వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశంనర్సాపూర్– హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన అటవీశాఖ అధికారులు 258 హెక్టార్ల అడవులు కేటాయించి అర్బన్‌పార్కుగా అభివృద్ధి చేశారు. కనుచూపు మేర పరుచుకున్న అడవులు కనివిందు చేస్తుండగా.. రాయరావు చెరువు, పట్టణాన్ని వీక్షిస్తూ పర్యాటకులు ఆహ్లాదం పొందుతున్నారు. పార్కును సందర్శించే వారికి టికెట్ నిర్ణయించి అనుమతిస్తున్నారు. మామూలు రోజుల్లో రోజుకు 70 నుంచి 80 మంది, సెలవు రోజుల్లో 140 నుంచి 160 మంది వరకు అర్బన్ పార్కును సందర్శిస్తున్నారు. వారికి బస, భోజన వసతి కోసం కాటేజీలు, రెస్టారెంట్, ఇతర సదుపాయాలు అందుబాటులోకి తెచ్చే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.●నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్మురుగన్ సంస్థకు బాధ్యతలు పాత కాటేజీలు సరిపోవనే అభిప్రాయాలు రావడంతో తాజాగా 21 పాండ్ కాటేజీల నిర్మాణానికి అటవీశాఖ శ్రీకారం చుట్టింది. కొత్త వాటి నిర్మాణంతో పాటు పాత కాటేజీల నిర్వహణ బాధ్య తలను మురుగన్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. నీరు నిల్వ ఉండే చోటును ఎంపిక చేసి నీటిపై కొంత ఎత్తులో కాటేజీల నిర్మాణ పనులు చేపట్టారు. వాటి పనులు చివరి దశకు చేరాయి. పాత కాటేజీలకు కొత్త పాండ్ కాటేజీలకు మధ్య ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్, సెమినార్ హాల్, ఇండోర్ గేమ్స్ ఆడుకునేందుకు సదుపాయాలు, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ థియేటర్ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆయా నిర్మాణ పనులు కొన సాగుతున్నాయి. కొత్తగా చేపట్టిన పాండ్ కాటేజీల పనులు పూర్తవగానే వాటిని ప్రారంభించాలని, పాత కాటేజీల ఆధునీకరణ పనులు తర్వాత చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.రూ. 2 కోట్లు.. 11 కాటేజీలు..పర్యాటకులకు మరిన్ని వసతులు అందుబాటులోకి తెచ్చేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. గతంలో రూ. 2 కోట్ల వ్య యంతో 11 కాటేజీలు నిర్మించింది. వాటిలో కిచెన్, డైనింగ్ హాలు, రిసెప్షన్ ఉండేలా.. ఆరు కాటేజీలను నిర్మించారు. అయితే అవి నిర్మించి సుమారు రెండేళ్లు కావొస్తున్నా పలు కారణాలతో అందుబాటులోకి తేలేకపోయా రు. పర్యాటకపరంగా ఇప్పటివరకు ఉన్న కాటేజీలు సరిపోవనే ఉద్దేశంతో మరిన్ని నిర్మిస్తున్నారు. అయితే గతంలో నిర్మించిన వాటిని ఆధునీకరించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. -
డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన
తూప్రాన్: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త విధానాలు తీసుకురావడం కారణంగా ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని డాక్యుమెంట్ రైటర్లు శనివారం ఆందోళనకు దిగారు. వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దుకాణాలను బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా డాక్యుమెంట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ విధానాన్ని రద్దు చేసి, పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు. డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి పొందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానంతో 30 వేల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రాజ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. డాక్యుమెంట్ రైటర్లు బంద్‌తో క్రయవిక్రయదారులు లేక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు ప్రశాంత్, అఫ్రోజ్, శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్, హరీష్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకంగా మరింత అభివృద్ధి
అర్బన్‌పార్కును పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాం. గతంలో నిర్మించిన కాటేజీలలో కొంత మార్పు చేసి ఆధునీకరించాలని నిర్ణయించాం. కొత్తగా కాటేజీల నిర్మాణ పనులు మురుగన్ సంస్థకు అప్పగించగా.. పనులు చివరి దశకు చేరాయి. అక్కడ పర్యాటకుల సౌకర్యార్థం ఇతర పనులు వేగంగా సాగుతున్నాయి. మేలో కాటేజీలు ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. – అరవింద్, అటవీశాఖ రేంజ్ అధికారి● -
దుర్గమ్మ సేవలో జడ్జి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మను శనివారం జిల్లా జడ్జి లక్ష్మీశారద దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం ఆమెకు సిబ్బంది, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ అధికారి ప్రతాప్‌రెడ్డి సత్కరించారు. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. చివరి గింజ వరకు కొంటాం నర్సాపూర్/చిలప్‌చెడ్: రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. శనివారం మండలంలోని రెడ్డిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలోనే వడ్లను అమ్మి మద్దతు ధర పొందాలని చెప్పారు. ఆయన వెంట జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రకాష్, ఐపీఎం గౌరిశంకర్ ఇతర సిబ్బంది ఉన్నారు. అనంతరం చిలప్‌చెడ్ మండలంలోని సామ్లా తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు. లారీల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రజతోత్సవ సభకు తరలిరండి పెద్దశంకరంపేట(మెదక్): ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పెద్దశంకరంపేటలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య రానీయొద్దు చిన్నశంకరంపేట(మెదక్): గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అధికారులను ఆదేశించారు. శనివారం నార్సింగి మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కార్యాలయ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవిలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం రాజీవ్ యువ వికాసం దర ఖాస్తులపై ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల గురించి ఎంపీడీఓ ఆనంద్‌ను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తపై కేసు రామాయంపేట(మెదక్): సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు వ్యతిరేకంగా పోస్టు పెట్టినందుకు గాను బీఆర్ఎస్ కార్యకర్త నర్సింగరావుపై శనివారం రామాయంపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నర్సింగరావు అసభ్య పదజాలం వాడుతూ పోస్టు పెట్టాడని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు నర్సింగరావుకు నోటీస్ ఇచ్చిన పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని నర్సింగరావు ఆరోపించారు. కేటీఆర్, హరీశ్‌రావు తనను కేసుల నుంచి కాపాడాలని అభ్యర్థించారు. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని సీఐ వెంకట్‌రాజాగౌడ్ హెచ్చరించారు. -
ఆధార్‌లా ‘భూధార్’ కార్డు
నర్సాపూర్/శివ్వంపేట: ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం నర్సాపూర్ రైతు వేదిక, శివ్వంపేటలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎవరు బాధపడొద్దన్నారు. సాదా బైనామాలు పరిష్కరించేందుకు త్వరలో మార్గదర్శకాలు రానున్నాయని తెలిపారు. ఆధార్ కార్డు మాదిరిగా భూములకు భూధార్ నంబర్ రానుందని, హద్దులు సైతం వస్తాయని వివరించారు. జూన్ 2 నుంచి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఏమైన సమస్యలు ఉంటే రెవెన్యూ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి ద్వారా అసలైన పట్టాదారులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సన్నబియ్యం సరఫరా, యాసంగి ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతరం నర్సాపూర్ మండలంలోని చిప్పల్తుర్తి కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసి బాలికలతో కలిసి భోజనం చేశారు. మెనూ పక్కాగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ నగేష్ ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏడీఏ సంధ్యారాణి, ఎంపీడీఓ మధులత, ప్యాక్స్ చైర్మన్ రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. కొత్త చట్టంపై అవగాహన అవసరం కలెక్టర్ రాహుల్రాజ్పాఠశాల అభివృద్ధి అభినందనీయం శివ్వంపేట(నర్సాపూర్): ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శివ్వంపేట ప్రాథమిక పాఠశాలను గ్రామానికి చెందిన నవీన్‌గుప్తా సొంత నిధులతో మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దడం గొప్ప విషయమని కొనియాడారు. -
అన్నదాతల మేలుకే ‘భూ భారతి’
అల్లాదుర్గం(మెదక్): రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని చేవెళ్ల గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త చట్టంలో మార్పులు చేసేందుకు తహసీల్దార్లకే అధికారం ఉంటుందన్నారు. ఇక కలెక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకుంటే గ్రామంలో విచారణ జరిపి పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి రైతుకు భూమిపై హక్కులు కల్పి స్తూ భూదాన్ కార్డులు అందజేస్తామన్నారు. ఆన్లైన్లో ఐడీ నంబర్ కొడితే పూర్తి వివరాలు, హద్దులు తెలుస్తాయని వివరించారు. పట్టా ఒకరిపై, కబ్జాలో ఒకరు.. పట్టా భూమి అసైన్డ్గా రికార్డులో ఉండటం, అసైన్డ్ భూమి పట్టాగా మారిన సంఘటనలు ఉన్నాయన్నారు. వీటిని గతంలో మార్పు చేసే అధికారం లేకుండా ఉండేదన్నారు. ప్రస్తుత చట్టంతో దరఖాస్తులు స్వీకరించి పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరిస్తామన్నారు. పట్టా భూమి అసైన్డ్ భూమిగా మారిందని ఓ రైతు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జిల్లాలో ఇలాంటి సమస్యలు 14 వేలకు పైగా ఉంటే 10 వేల సమస్యలు పరిష్కరించామని చెప్పారు. మరో 4 వేలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కొత్త చట్టంలో పరిష్కరిస్తామన్నారు. తహసీల్దార్ వద్ద తప్పు జరిగితే ఆర్డీఓకు.. అక్కడ తప్పు జరిగితే కలెక్టర్‌కు అప్పిల్ చేసుకోవచ్చని తెలిపారు. అక్కడ తప్పని భావిస్తే సీసీఎల్‌లో అప్పిల్ చేసుకొనే అవకాశం కొత్త చట్టంలో కల్పించినట్లు వివరించారు. సాదాబైనామా, పౌతి అమలుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, అదనపు కలెక్టర్ నగేశ్, తహసీల్దార్ మల్లయ్య, ఏఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. సాదాబైనామా, పౌతి అమలుకు ఇబ్బంది ఉండదు 30 రోజుల్లో సమస్యలు పరిష్కారం కలెక్టర్ రాహుల్‌రాజ్ -
నష్టపోయిన వారిని ఆదుకోండి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్/శివ్వంపేట(నర్సాపూర్): వడగళ్ల వా నతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25 వేల పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నర్సాపూర్, శివ్వంపేట మండలాల్లో అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోవడం తప్ప, చేసిందేమి లేదని విమర్శించారు. బడ్జెట్లో పంటల బీమా కోసం నిధులు కేటాయించలేదని విచారం వ్యక్తం చేశారు. బీమా ఉంటే రైతులకు ధీమా ఉండేదన్నారు. తాను అసెంబ్లీలో రైతులు పండిస్తున్న పంటలకు బీమా చేయాలని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చేతికొచ్చిన పంటలు వడగళ్ల వానతో పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆమె వెంట ఆర్ఐ కిషన్, ఏఈఓ మౌనిక, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు. -
ధరణితో భూములు దోచుకున్నారు
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రామాయంపేట(మెదక్): గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరిణి పోర్టల్‌తో కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆరోపించారు. భూ భారతి చట్టంపై శుక్రవారం రైతువేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాది ప్రజా ప్రభుత్వమని, ప్రజల సమస్యలు తీర్చడమే తమ ధ్యేయమన్నారు. ధరణితో రైతులు తీవ్ర ఇబ్బందుల పడ్డారని ఆరోపించారు. ప్రజా సంక్షేమం మరిచిన బీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ది చెప్పారని అన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌లో పట్టా మార్పిడి అధికారం లేదని, భూభారతిలో ఈ అవకాశం ఉందన్నారు. కొత్త చట్టంలో కొంత మార్పు ఉందని, దీనితో రైతులకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు. -
కొనుగోళ్లు వేగవంతం చేయండి
డీఎస్ఓ సురేష్‌రెడ్డి కొల్చారం(నర్సాపూర్): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డీఎస్ఓ సురేష్‌రెడ్డి నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని రంగంపేట, సంగాయిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఎం జగదీష్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూకంలో వ్యత్యాసం ఉండొద్దని నిర్వాహకులను ఆదేశించారు. సంగాయిపేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధిక తూకంతో రైతులు నష్టపోతున్నారన్న విషయాన్ని ‘సాక్షి’ డీఎస్ఓ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన ఆయన సంఘం చైర్మన్ వెంకట్‌రెడ్డిని ఫోన్ ద్వారా ఆరా తీశారు. ధాన్యం తూర్పార పట్టకపోవడం వల్లే అధిక తూకం వేయాల్సి వస్తోందని సమాధానమిచ్చారు. దీంతో డీఎస్ఓ తూర్పార బట్టిన ధాన్యాన్ని మాత్రమే తూకం వేయాలని, ఏదో ఒక సాకుతో అధిక తూకం వేయడం సరికాదని ఆదేశించారు. -
సన్న బియ్యం పేదలకు వరం
అల్లాదుర్గం(మెదక్)/నిజాంపేట: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పేదలకు వరంగా మారిందని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గడిపెద్దాపూర్‌లో లబ్ధిదారుడి ఇంట్లో సన్న బియ్యంతో భోజనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్‌షాపుల్లో నాణ్యమైన సన్న బి య్యం అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం నిజాంపేట మండల పరిధిలోని కె. వెంకటపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగం తూప్రాన్: కేసీఆర్ పదేళ్ల పాలన స్వర్ణయుగం అని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. వరంగల్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి పట్టణంలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసత్య పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలో హామీలను తుంగలో తొక్కిందన్నారు. ఆరు గ్యారంటీలను విస్మరించిందని విమర్శించారు. వరంగల్ సభ ప్రతిష్టాత్మకమని.. నియోజకవర్గంలోని ప్రతి ఊరు నుంచి పెద్ద సంఖ్యలో గులాబీ సైనికులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణగౌడ్, రాఘవేందర్‌గౌడ్, దుర్గారెడ్డి, వెంకటేశ్, సత్యలింగం, శ్రీనివాస్, బురాన్, తదితరులు పాల్గొన్నారు. కొమురవెల్లిలో సమూల మార్పులు కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సమూల మార్పులకు ఈఓ అన్నపూర్ణ శ్రీకారం చుట్టారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆలయ ఉద్యోగులు, అర్చకులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. సిబ్బ ంది పంచె, తెల్ల చొక్కాతో విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ఆలయంలో నిర్వహిస్తున్న వేద పాఠశాల విద్యార్థులు అన్నదాన సత్రం నుంచి టిఫిన్, భోజనం తెచ్చుకునే వారు.. గమనించిన ఈఓ శుక్రవారం వేద పాఠశాల ఆవరణలోనే వంటను ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు దేవాదాయ ధర్మదాయ శాఖ ఆగమ సలహాదారు మహంతయ్య ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించగా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఏఈఓ బుద్ది శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్‌రెడ్డి, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం మెదక్ మున్సిపాలిటీ: బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కావాలని, పథకాలకు పరిమితమైతే అభివృద్ధి అంధకారమవుతుందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ అన్నారు. శుక్రవారం బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గండి వీరేందర్‌గౌడ్‌తో కలిసి పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. కులగణనతో రాష్ట్రంలో బీసీ సామాజిక విప్లవం మొదలైందన్నారు. బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నేటి నుంచి జిల్లాల పర్యటన ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అనంతరం జిల్లా ఇన్చార్జి కన్వీనర్‌గా ఉగ్గి అంజయ్య, జిల్లా ఇన్చార్జిగా పాతూరి దయాకర్గౌడ్లను నియమించారు. -
అంచెలంచెలుగా అభివృద్ధి పనులు
● మంత్రి దామోదర రాజనర్సింహ రాయికోడ్(అందోల్): రాష్ట్రంలో అంచెలంచెలుగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి దా మోదర రాజ నర్సింహ అన్నారు. శుక్రవారం రాయికోడ్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ కచూరిరావు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై మాట్లాడారు. ఆత్మ కమిటీ సభ్యులు నెలకో మండలంలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకొని తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. త్వరలోనే నీటి ప్రాజెక్టుల పనులు ప్రజారోగ్య భద్రతలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు మంజూరు చేయగా ఆ పనులు కొనసాగుతున్నాయని మంత్రి దామోదర చెప్పారు. త్వరలోనే మునిపల్లి, రా యికోడ్ మండలాల్లోని రైతులకు సాగు నీరు అందించే ప్రాజెక్టుల పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. సన్నబియ్యం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించామన్నారు. రేషన్ కార్డుల జారీ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. -
రైతులు ఇబ్బంది పడొద్దు
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిపోలీసుల భారీ భద్రత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పర్యటనకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎప్పుడూ లేనిది ఇంత మంది పోలీస్‌లు వచ్చారేంటి అని నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహినొద్దీన్‌ను ఎమ్మె ల్యే సరదాగా ప్రశ్నించారు. కాగా రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిల్డర్లు డబ్బులిస్తామంటున్నారని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎ మ్మెల్యే పర్యటనను అడ్డుకుంటారేమోనని పోలీస్‌లు ముందు జాగ్రత్తగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. చిన్నశంకరంపేట(మెదక్): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన అధికారులను సస్పెండ్ చేయిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తీసుకువచ్చిన ధాన్యం వెంటవెంటనే కాంటా చేసి రైస్‌మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యంతో ప్రమాదాలకు ఆస్కారం ఉందని, వెంటనే కొ నుగోలు చేయాలని చెప్పారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ కరీం, ఎంపీడీఓ ఆనంద్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ సబిత, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. వరంగల్ రజతోత్సవ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
ఓర్వలేకే బీజేపీ కుట్ర
నర్సాపూర్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే బీజేపీ ఈడీ పేరుతో భయబ్రాంతులకు గురి చేసేందుకు కుట్ర చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌గాంధీ పేర్లను చార్జిషీట్లో నమోదు చేయడాన్ని నిరసిస్తూ గురువారం బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మా నాయకుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ రాజుయాదవ్, నాయకులు మల్లేష్, చిన్న ఆంజిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన అవసరం హవేళిఘణాపూర్(మెదక్): ప్రజలకు ఏదైనా నష్టం జరిగితే చట్టాలను వినియోగించుకొని తగిన న్యాయం పొందవచ్చని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ అన్నారు. గురువారం మెదక్ మండల పరిధిలోని తిమ్మక్కపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వినియోగదారుల హక్కులు, ప్రామీ సరీ నోట్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. రైతు ఏదైనా కంపెనీ నుంచి పొందిన వస్తువు నకిలీ అని తేలితే వారిపై కేసు నమోదు చేసి పరిహారం ఇప్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో షీటీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆయిల్‌పామ్‌తో అధిక లాభాలు కొల్చారం(నర్సాపూర్): ఆయిల్‌పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానవన శాఖ మేనేజర్ అశోక్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని రంగంపేట పంచాయతీ ఆవరణలో రైతులకు ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం ద్వారా రూ. 193 విలువ గల మొక్కను సబ్సిడీ కింద రూ. 20కే అందిస్తున్నట్లు తెలిపారు. డ్రిప్ ఏర్పాటు కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీ, ఇతరులకు 90 శాతం రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జైన్ లిఫ్ట్ ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు సంజీవరావు, కష్ణ రైతులు పాల్గొన్నారు. రికార్డుల పరిశీలన తూప్రాన్: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రికార్డులను గురువారం జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పరిశీలించారు. ఈసందర్భంగా గ్రా మాల వారీగా రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల వివరాలు, సమ్మర్ యాక్షన్ ప్లాన్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సోషల్ ఆడిట్‌పై ఆరా తీశారు. ఎండల తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేషాద్రి, ఎంపీఓ సతీష్, ఏపీఓ సంతోష్ సిబ్బంది పాల్గొన్నారు. 21న ఐటీఐలో అప్రెంటీస్‌షిప్ మేళా మెదక్ కలెక్టరేట్: ఈనెల 21వ తేదీన మెదక్ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటీస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఐటీఐల్లో పలు కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటీస్‌షిప్ మేళా ఉంటుందన్నారు. ఇందులో ఎంఆర్ఎఫ్, గ్రౌండ్ ఫార్మా లిమిటెడ్, మేధా సెర్వో, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ తదితర కంపెనీలు పాల్గొంటాయని వివరించారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, కోఫా, ఇతర ఐటీఐ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
‘భూ భారతి’తో సమస్యలు పరిష్కారం
తూప్రాన్/మనోహరాబాద్(తూప్రాన్): రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతిని అందుబాటులోకి తీసుకొచ్చిందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం తూప్రాన్, మనోహరాబాద్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ యాజమాన్య హక్కులతో పాటు ఆర్ఓఆర్ చట్టం ప్రకారం అనేక అంశాలను పటిష్టంగా పొందుపరిచిందన్నారు. ధర ణిలో వచ్చిన సమస్యలను గుర్తించి భూ భారతిలో ఎలాంటి తప్పిదాలు లేకుండా చేయడమే ముఖ్య ఉద్దేశం అని స్పష్టం చేశారు. అనంతరం రైతులతో నేరుగా కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూ భారతిలో ప్రతి రిజిస్ట్రేషన్ పారదర్శకంగా ఉంటుంద న్నారు. రైతులకు భూధార్ కార్డు అందజేయనున్నట్లు తెలిపారు. ధరణిలో చిన్న చిన్న మార్పులతో పాటు ప్రతిది కలెక్టర్ చూసే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదన్నారు. సాదాబైనామా కోసం దరఖాస్తు చేసుకొని పెండింగ్‌లో ఉన్నవాటిని సైతం పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ నూతన చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కాగా గత నాలుగు నెలలుగా తమకు వేతనాలు రావడం లేదని పంచాయతీ కార్మికులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ విజయలక్ష్మి, రైతులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మనోహరాబాద్ మండల పరిధిలోని కూచారం కేజీబీవీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. జిల్లావ్యాప్తంగా 105 తదితర గురుకులాల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేలా బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని తెలిపారు.కలెక్టర్ రాహుల్‌రాజ్ -
జల సంరక్షణ అందరి బాధ్యత
డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావుటేక్మాల్(మెదక్)/నర్సాపూర్: భూగర్భజలాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డీఆర్డీఓ పీడీ శ్రీనివా సరావు అన్నారు. గురువారం మండలంలోని కుసంగిలో వాటర్‌షెడ్ యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి సంరక్షణ పెంచడం, పారే నీటిని ఆపడంలో అందరూ ముందుండాలని పిలుపునిచ్చారు. ఇంకుడు గుంత లు, ఊట కుంటలు నిర్మించాలన్నారు. గ్రామాల్లోని రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త ఉదయ్‌కుమార్, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సతీష్, ఎంపీడీఓ విఠల్, మాజీ జిల్లా కో– ఆప్షన్ మెంబర్ యూసుఫ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. అలాగే రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. అనంతరం నర్సాపూర్ మండల సమాఖ్యలో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సెర్ప్ ప్రాజెక్ట్‌లో కొత్తగా చేపట్టిన చిన్న సంఘాలను సైతం ఆడిట్ చేయడం వల్ల సంఘ సభ్యుల ఆర్థిక స్థితి పారదర్శంగా ఉంటుందన్నారు. తద్వారా సంఘాలు బలోపేతం అవడంతో పాటు, ఎక్కువ మొ త్తంలో రుణాలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. -
బీఆర్ఎస్ హయాంలో విద్య, వైద్యంపై నిర్లక్ష్యం
రామాయంపేట(మెదక్)/చిన్నశంకరంపేట/ పాపన్నపేట: బీఆర్ఎస్ హయాంలో విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేశారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ విమర్శించారు. బుధవారం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన బేటీ బచావో– బేటీ పడావో కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నశంకరంపేట, గవ్వలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, అలాగే.. పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం, మత్స్య సహకార భవనాన్ని ప్రారంభించారు. మెదక్‌లో మెడికల్ కళాశాలతోపాటు రామాయంపేటకు రూ.200 కోట్లతో ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించానన్నారు. అనంతరం అంగన్వాడీ పిల్లలకు పోషణ పక్షం క్యాలెండర్‌తో పాటు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్దళారులను నమ్మొద్దు ధాన్యం కొనుగోలు విషయంలో దళారులను నమ్మొద్దని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అనంతరం కొత్తపల్లిలో ఇటీవల మరణించిన త్యార్ల సుజాత సంస్మరణ సమావేశంలో పాల్గొని నివాళులు అర్పించారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. -
24న టాలెంట్ టెస్టు
నర్సాపూర్: పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్టు ఆధ్వర్యంలో టాలెంట్ టెస్టును ఈనెల 24న నిర్వహిస్తున్నారని టీఎస్ యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు రవి, గంగాధర్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. నాలుగు నుంచి ఆరవ తరగతులు చదువుతున్న విద్యార్థులు టాలెంట్ టెస్టు రాసేందుకు అర్హులని చెప్పారు. అనాథ పిల్లలు, తల్లి, తండ్రి లేని పిల్లలు ఉన్నత విద్యకు దూరం కావొద్దన్న ఉద్దేశ్యంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత విద్య అవకాశం కల్పిస్తున్నారన్నారు. టెస్టులో ఎంపికై న వారికి ఉచిత విద్య అందిస్తారని, ఈనెల 18లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 99496 02664, 79897 30251 నంబర్లను సంప్రదించాలన్నారు. నేడు భూ భారతిపై అవగాహన సదస్సుమనోహరాబాద్(తూప్రాన్): భూభారతి రెవెన్యూ చట్టంపై కలెక్టర్ రాహుల్‌రాజ్ గురువారం మనోహరాబాద్ మండలం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతిపై ఆర్డీఓ జయచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులతో మనోహరాబాద్ రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు పాల్గొని తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. అసత్య ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చౌకబియ్యంపై అసత్య ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్‌రెడ్డి హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో చౌక దుకాణాలు ద్వారా ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారని జరుగుతున్న దుష్ప్రచారంపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. అలాంటి ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని ఆయన సూచించారు. టీకాలతో పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య చిలప్‌చెడ్(నర్సాపూర్): ముందస్తు జాగ్రత్తగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా లు వేయడం వల్ల పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, పశువులు ఆరోగ్యంగా ఉంటాయని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ వెంకటయ్య అన్నారు. బుధవారం ఆయన మండలంలోని శీలాంపల్లి, చిట్కుల్ గ్రామాల్లో గాలికుంటు నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన శీలాంపల్లిలో రైతులు సాగు చేస్తున్న (సూపర్ నేపియర్) గడ్డిని పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతీ పశువుకు టీకా ఇప్పించాలన్నారు. సూపర్ నేపియర్ గడ్డితో పశువులకు కలిగే లాభాలు వివరించారు. కార్యక్రమంలో వెటర్నరీ సర్జన్ డాక్టర్ వినోద్, పశువైద్య సిబ్బంది గట్టయ్య, శంకర్, సతీష్, రైతులు పాల్గొన్నారు. కొత్త ఒప్పందాలతో ఉద్యోగావకాశాలుబీవీ రాజు ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులు నర్సాపూర్: కొత్త సంస్థ ఒప్పందాలతో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి, నైపుణ్యాలు పెంపొందించుకునే అవకాశాలు పెరుగుతాయని బీవీ రాజు ఇంజనీరీంగ్ కళాశాల ట్రైనింగ్ ప్లేస్‌మెంటు ఆఫీసర్ బంగర్రాజు, ఈసీఈ హెక్షడీ సంజీవరెడ్డి చెప్పారు. బుధవారం తమ కళాశాలతో క్యూఎన్ఎక్స్ సాప్ట్వేర్ సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుందని చెప్పారు. విద్యార్థులకు ప్రాజెక్టులపై శిక్షణ, ఇంటర్న్‌షిప్, మెడికల్‌కు సంబంధించిన ప్రాజెక్టు కంటెస్టుల్లో పాల్గొనే అవకాశం ఉందని వారు చెప్పారు. -
అనాథ పిల్లలకు అండగా ఉంటాం
పాపన్నపేట(మెదక్): పాపన్నపేట మండలం కుర్తివాడలో అనాథలుగా ఉన్న పిల్లలకు అండగా ఉంటామని డీడబ్ల్యుఓ హైమావతి, డీసీపీఓ కరుణశీల అన్నారు. బుధవారం వారు బాధితుల పూరిగుడిసెను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కుర్తివాడకు చెందిన భూతిపురం రవి గతంలో ప్రమాదవశాత్తు మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కొడుకు సంతానం. వారిని పోషించడం భారంగా మారడంతో తల్లి సంపూర్ణ పిల్లలను వదిలేసి వెళ్లింది. దీంతో దూరపు బంధువులు ఇద్దరు ఆడపిల్లలను, అబ్బాయిని వసతి గృహాల్లో చేర్పించి చదివిస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు వస్తుండటంతో వసతి గృహాలు మూతపడనున్నాయి. ఇంటికి వచ్చి ఉందామంటే పూరి గుడిసెలో ఉండలేని పరిస్థితి.ఈ విషయం తెలుసుకున్న డీడబ్ల్యుఓ హైమావతి, డీసీపీఓ కరుణశీల, ఐసీడీఎస్ సూపర్వైజర్లు వివరాలు సేకరించారు. -
యూనిఫామ్‌లో మార్పులు
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న యూనిఫామ్‌లో మార్పులు చేశారు. 6 నుంచి 12 తరగతి వరకు బాలబాలికలకు ఒకే విధంగా ఉండేలా మార్పు చేయనున్నారు. ముఖ్యంగా ఎదిగే బాలికలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా తయారు చేయనున్నారు. గతంలో విద్యా సంవత్సరం సగం ముగిసే వరకు యూనిఫామ్‌లు కుట్టుడం కొనసాగేది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఈసారి మాత్రం విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే యూనిఫామ్‌లు అందేలా పక్కాగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పరిశీలన బాధ్యతలు ఎంఈఓలకు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే యూనిఫామ్‌ల క్లాత్ తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెస్కో) సరఫరా అందిస్తుంది. జిల్లాకు చేరిన యూనిఫామ్‌ల క్లాత్‌ను పరిశీలించి, భద్రపర్చే బాధ్యతలను సంబంధిత ఎంఈవోలకు అప్పగించారు. ప్రస్తుతం ఒక జతకు సంబంధించిన క్లాత్ మాత్రమే వచ్చింది. వాటిని స్వయం సహాయక సంఘాల సభ్యులతో కుట్టించేలా కార్యాచరణ రూపొందించారు. ఎంఈఓల పర్యవేక్షణలో డీఆర్డీఏ, అర్బన్, మెప్మా, టీఎల్ఎఫ్ మహిళా సంఘాల సభ్యులకు క్లాత్ అందజేశారు. ఒక్కో జత కుట్టడానికి రూ.75 చొప్పున చెల్లించనున్నారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. యూనిఫామ్‌లో చేసిన మార్పులు ఈ విద్యాసంవత్సరంలో అందించే యూనిఫామ్‌లలో స్వల్ప మార్పులు చేశారు. చొక్కాలు, లాంగ్ గౌన్లకు పట్టీలు, భుజాలపై కప్స్ వంటివి లేకుండా సాధారణ యూనిఫామ్‌గా డిజైన్ చేశారు. బాలురకు ఆరు నుంచి 12 తరగతి వరకు నిక్కర్లు కాకుండా ప్యాంట్లు అందించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి నెక్కర్లకు మాత్రమే వస్త్రం జిల్లాకు చేరింది. జిల్లాలో 932 పాఠశాలలు జిల్లాలో ప్రభుత్వ, యూపీఎస్, పీఎస్, కేజీబీవీ, జెడ్పీ, ఎయిడెడ్, యూఆర్ఎస్, టీఎస్‌ఆర్‌ఈఐఎస్, మోడల్ స్కూళ్లు మొత్తం 932 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో బాలికలు 37,742 మంది, బాలురు 36,523 మంది ఉన్నారు. స్కూళ్లలో 1 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్‌లు అందించనున్నారు. ఎంఈఓల పర్యవేక్షణలో పనులు మహిళా సంఘాల సభ్యులకు కుట్టే బాధ్యత బడిబాటకు ముందే పాఠశాలలకు చేరేలా ప్రణాళికబడిబాటకు ముందే.. మే నెలాఖరులోగా యూనిఫామ్‌లు పూర్తి చేసి బడిబాటకు ముందే పాఠశాలలకు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇప్పటి వరకు జిల్లాకు చేరిన యూనిఫామ్ క్లాత్‌ను ఎంఈఓల పర్యవేక్షణలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సమన్వయంతో స్వయం సహాయక సంఘాల సభ్యులతో కుట్టించడం జరుగుతుంది. కొత్త దుస్తుల్లో పిల్లలు విద్యాసంవత్సరం ప్రారంభానికి తరగతులకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాం. – రాధాకిషన్, డీఈఓ, మెదక్ -
20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
మెదక్ కలెక్టరేట్: ఈనెల 20 నుంచి మే 26వ తేదీ వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. బుధవారం పరీక్షల కోసం సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పది పరీక్షలకు 459 మంది, ఇంటర్లో 876 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 9 నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పదికి 3..ఇంటర్‌కు 5 కేంద్రాలు జిల్లాలో జరిగే పదో తరగతి పరీక్షలకు మెదక్, నర్సాపూర్, తూప్రాన్లలో ఒక్కోక్కటి చొప్పున మొత్తం 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ పరీక్షల కోసం మెదక్(2), నర్సాపూర్(2), తూప్రాన్(1) చొప్పున మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా కనీస వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రిమినల్ కేసులు పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా వారిపై చట్టం 25/1997 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఈఓ హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక సిట్టింగ్ స్క్వాడ్, ఇద్దరు ప్లయింగ్ స్క్వాడ్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారని తెలిపారు. 5 నిమిషాలు ఆలస్యమైతే నో ఎంట్రీ అభ్యర్థులకు గుర్తింపు కార్డు తప్పనిసరి డీఈఓ రాధాకిషన్ఆలస్యమైతే నో ఎంట్రీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఐదు నిమిషాలకు మించి ఆలస్యమైతే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని డీఈఓ రాధాకిషన్ తెలిపారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందు కేంద్రంలోని చేరుకోవాలన్నారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
చిలప్‌చెడ్ (నర్సాపూర్): రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు జరపాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం చిలప్‌చెడ్ మండలంలోని ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మండల బీఆర్ఎస్ నాయకులతో కలసి చలో వరంగల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు నష్టపోకుండా త్వరితగతిన కొనుగోళ్లు ప్రారంభించి, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. గన్నీబస్తాలు, రవాణా, లారీల కొరత తదితర సమస్యలు రాకుండా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సన్నాలకు రూ.5 వందల బోనస్ జమ చేయాలన్నారు. పోస్టర్ ఆవిష్కరణ 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్, సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్‌చైర్మన్ రాంచంద్రారెడ్డి, యూత్ నాయకులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు రావొద్దు వెల్దుర్తి: ఽకొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌మిల్లులకు తరలించి అన్నదాతలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవా రం సాయంత్రం వెల్దుర్తి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో కొనుగోలు ప్రక్రియలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ యేడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, మాజీ జెడ్పీటీసీ రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.కాగా, ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి -
యువ వికాసం సద్వినియోగం చేసుకోవాలి
చిన్నశంకరంపేట(మెదక్)/వెల్దుర్తి(తూప్రాన్): రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం చేయూత అందించేందుకు తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం యువత సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య కోరారు. బుధవారం చిన్నశంకరంపేట, మాసాయిపేట మండల పరిషత్ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తు చేసిన ప్రతీ ఒక్కరూ హర్డ్ కాపీని తీసుకొచ్చి ఎంపీడీఓ కార్యాయలంలో అందించాలన్నారు. ఎంపీడీఓ కార్యాలయ రికార్డులు, ఈజీఎస్ సోషల్ ఆడిట్ రికార్డులు పరిశీలించి, ఉపాధిహామీ పనులపై ఆరా తీశారు. నీటి ఎద్దడి నివారణకు పటిష్ట చర్యలు వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ఆదేశించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, తాగునీటి సమస్యలపై పలు సలహాలు, సూచనలు అందజేశారు. నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ విఘ్నేశ్వర్ తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితా పరిశీలన చేగుంట(తూప్రాన్): మండలంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారుల జాబితాను జెడ్పీ సీఈఓ ఎల్లయ్య బుధవారం పరిశీలించారు. చేగుంట ఎంపీడీఓ కార్యాలయం సందర్శించిన జెడ్పీ సీఈఓ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాతో పాటు ఉపాధి కూలీల సామాజిక తనిఖీ రిపోర్టును పరిశీలించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు యాక్షన్ ప్లాన్ ప్రకారం పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ చిన్నారెడ్డికి సూచించారు. ఈ పరిశీలనలో ఉపాధి హామీ ఏపీఓ స్వేత, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.జెడ్పీ సీఈఓ ఎల్లయ్య -
నాణ్యమైన భోజనం అందించండి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం కౌడిపల్లిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్‌ను కలెక్టర్ సందర్శించారు. ఫుడ్ పాయిజన్‌తో 30మంది విద్యార్థినులు అస్వస్తతకు గురై చికిత్స పొందుతున్న విషయం విదితమే. దీంతో కలెక్టర్ సందర్శించి హాస్టల్లో గదులు, కిచెన్, బాత్రూంలతోపాటు సరిసరాలను పరిశీలించారు. విద్యార్థినులతో ప్రత్యేకంగా మాట్లా డి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా నాకు ఫోన్ చేయండి, తక్షణమే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ భరోసా కల్పించి తన ఫోన్ నంబర్‌ను ఇచ్చారు. అస్వస్థతకుగురైన వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యసేవలపై వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టల్లో పరిశుభ్రతను పాటిస్తూ రోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చేస్తే చర్యలు తప్పవని అధికారులను, సిబ్బందిని హెచ్చరించారు. విద్యార్థులకు అస్వస్థతకు గురికావడంపై విచారణ జరుగుతోందన్నారు. అస్వస్థతకు గురైన వారందరూ ప్రస్తుతం బాగున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఓ పద్మజ, వార్డన్ నర్సమ్మ, డాక్టర్ ఫెర్నాజ్, సీహెచ్ఓ ఎలిజబెత్‌రాణి వైద్యసిబ్బంది పాల్గొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు కలెక్టర్ రాహుల్‌రాజ్ ఇంటిగ్రేటెడ్ బాలిక హాస్టల్ సందర్శన విద్యార్థినులతో మాట్లాడి సమస్యలపై ఆరా -
తాగునీటి సరఫరాకు ప్రణాళిక
● పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ● అధికారులతో కలెక్టర్ రాహుల్‌రాజ్ సమీక్ష మెదక్ కలెక్టరేట్: ఎండలు మండుతున్నందున గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాలు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి నీటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ప్రత్యేక సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించి తద్వారా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి తాగునీరు ఇబ్బందులు తొలగించి, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సూచించారు. రానున్న రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరాను ప్రతిరోజు పర్యవేక్షించాలని, అవసరమైన చోట్ల ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. వారం రోజుల్లో పూర్తి చేయాలి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో దారిద్య రేఖ కు దిగువన ఉన్న కుటుంబాలను ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని, గెజిటెడ్ అధికారులను విచారణ అధికారులుగా నియమించనున్నట్లు తెలిపారు. ప్రతి గెజిటెడ్ అధికారికి 200 మంది లబ్ధిదారుల జాబితా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు కనీసం 25 మంది లబ్ధిదారుల విచారణ చేపట్టి ఈ ప్రక్రియను ఎనిమిది రోజుల్లో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్ఓ భుజంగరావు, హౌసింగ్ పీడీ మాణిక్యం, ఆర్డబ్ల్యఎస్, మిషన్ భగీరథ అధికారులతోపాటు మున్సిపల్ కమిషనర్, స్పెషల్ ఆఫీ సర్స్, ఎంపీడీవోలు, ఎంపీఓలు పాల్గొన్నారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలిమెదక్ జోన్: సాక్షి కథనంపై కలెక్టర్ రాహుల్‌రాజ్ స్పందించారు. మంగళవారం రాత్రి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. నిర్వాహకులు ప్రతి రోజు కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన వెంటనే ఓపీఎంఎస్లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలని, తద్వారా సకాలంలో రైతులకు డబ్బులు అందుతాయని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కువ రోజుల వరకు కేంద్రంలోనే పెట్టుకోకుండా తేమ శాతం రాగానే కాంటా పూర్తిచేసి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు రోజుకు ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు. అనంతరం భూ భారతి పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ భుజంగరావు, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, తూప్రాన్ ఆర్డీఓ చంద్రారెడ్డి, నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. మంగళవారం ఐకేపీ, ీపీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో మండలంలోని వెంకట్రావ్పేట, రాజీపేట, రాయిలాపూర్, నాగ్సాన్పల్లి, తిమ్మాపూర్, మహమ్మద్‌నగర్, కౌడిపల్లి, దేవులపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్నవడ్లకు ప్రభుత్వం ఇస్తామన్నా బోనస్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే గత ఏడాది జిల్లాలో పేరుకుపోయిన రూ.7కోట్లకు పైగా ఉన్న బోనస్ బకాయిలను త్వరగా రైతులకు చెల్లించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ స్వప్న, ఏపీఎం సంగమేశ్వర్, ఏఈఓలు సౌజన్య, సృజన, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రామాగౌడ్, సొసైటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, వైస్‌చైర్మన్ చిన్నంరెడ్డి, మాజీ ఎంపీపీ రాజు, ఉపాధ్యక్షుడు నవీన్‌గుప్త, మండల మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, నాయకులు మహిపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కాంతారావ్, పురుషోత్తం, శ్యాంసుందర్‌రావ్, అమర్‌సింగ్, శివ, లింగం, సంజీవ్, రాజిరెడ్డి, రమేశ్ గుప్త, సందీప్, ప్రతాప్‌గౌడ్, రవిసాగర్ పాల్గొన్నారు. సన్నాల బోనస్ బకాయిలు చెల్లించాలి ఎమ్మెల్యే సునీతారెడ్డి -
అలా పొందండి
ఇలా పెంచండి...● డీఆర్డీఏ ఆధ్వర్యంలో భూగర్భజలాలుపెంపునకు చర్యలు ● సబ్సిడీ పథకాలతో సర్కార్ ప్రోత్సాహంమెదక్జోన్: భూగర్భజలాలు రోజురోజుకు గణనీయంగా పడిపోతుండటంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. గ్రామీణాభివృద్ధి (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలైన ఊటకుంటలు, ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీచార్జి స్ట్రక్చర్స్ వంటివాటిని వినియోగించుకుని భూగర్భ జలాలను పెంపొందించాల్సిన అవసరం ఉంది. మెదక్ జిల్లాలో చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేక పోవటంతో నూటికి 90శాతం మంది రైతులు బోరుబావుల ఆధారంగా వ్యవసాయం చేస్తున్నారు. త్రీ ఫేజు విద్యుత్ ఉన్నంత సేపు వ్యవసాయ పంపు సెట్లు నడుస్తుండటంతో బోరుబావుల్లో నీటి ఊటలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. దీనికితోడు మండే ఎండలు మరో కారణం. కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా వేసవిలో భూగర్భజలాలను పెంపొందించుకునే దిశగా జాబ్‌కార్డు కలిగిన ప్రతీరైతుకు భూగర్భజలాలను పెంపొందించుకునే అవకాశం కల్పించింది. కాగా, ఈ పథకాలను అతికొద్దిమంది రైతులు మాత్రమే వినియోగించుకుంటుండగా, ఎక్కువశాతం మంది ఆ పథకాలను పట్టించుకోవటం లేదు. ఫలితంగా ప్రతీ ఏటా మార్చి నుంచి జూన్ మాసం వరకు బోరుబావుల్లో నీటి ఊటలు తగ్గిపోయి సాగు, తాగు నీటి తిప్పలు తప్పటంలేదు. ఎండిన బోరు బావుల్లోనూ.. పంటపొలాల్లో కానీ, పట్టణాల్లో ఇళ్ల కోసం తవ్వించిన బోరుబావుల్లో నీరు రాకున్నా, లేక కొన్నేళ్లపాటు నీరు వచ్చి ఉన్న పళంగా వట్టిపోయినా, వేసవిలో మాత్రమే నీరు తగ్గిపోయి వర్షాకాలం, చలికాలంలో మాత్రమే నీరు వచ్చే బోరుబావుల్లో నీటి ఊటలు పెరిగి ఎప్పుడూ నీరు రావాలంటే ఆ బోరుబావిని రీచార్జి స్ట్రక్చర్ చేయాల్సి ఉంటుంది. బోరుబావిలో దింపిన కేసింగ్ చుట్టూ ఒక్కమీటరు లోతు మీటర్ వెడల్పుతో గొయ్యి తవ్వాలి. అనంతరం కేసింగ్‌కు 12నుంచి 24 చిన్నపాటి రంధ్రాలు కొట్టాలి. ఆ రంధ్రాల చుట్టూ స్టీల్‌తో తయారు చేసిన సన్నటి జాలీని కట్టాలి. అనంతరం 40 ఎంఎం, 20 ఎంఎం కంకరతో పాటు దొడ్డుపాటి ఇసుకతో గుంతను పూర్తిగా పూడ్చాలి, వర్షాకాలం వరదను ఆ బోరువద్దకు మళ్లించాలి. దీంతో ఆ నీరంతా బోరుబావిలోకి ఇంకి ఏడాది పొడగునా నీరు పుష్కలంగా లభిస్తుంది. విఫలమైన బోరుబావుల నుంచి సైతం తిరిగి నీరు అందిపుచ్చురోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.25వేలు రైతులకు అందజేస్తుంది. ఇంకుడు గుంతలు...! పట్టణం, పల్లెటూరు అనేతేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి. ఇందులో వ్యక్తిగత ఇంకుడు గుంతతో పాటు కమ్యూనిటీ పరంగా కూడా నిర్మించుకోవచ్చు. ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం బోరువేసుకున్న ప్రతీవ్యక్తి దాని పక్కనే ఇంకుడు గుంత తవ్వితే భూమిలోకి నీరు ఇంకి భూగర్భ జలమట్టం పెరుగుతుంది. కాగా, వ్యక్తిగత ఇంకుడు గుంత నిర్మించుకుంటే రూ.6,100 డీఆర్డీఏ ద్వారా లభిస్తుంది. అదే కమ్యూనిటీ పరంగా నిర్మించుకుంటే రూ.14,600 చొప్పున ఇస్తారు. ఊటకుంటలు పంటపొలాల్లో రైతులు ఊటకుంటను నిర్మిస్తే దాని పరిమాణాన్ని బట్టి రూ.1.20 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు రైతులకు ప్రభ్వుత్వం అందిస్తుంది. దీంతో గణనీయంగా భూగర్భజలాలు పెరిగి బోరుబావుల్లో పుష్కలంగా నీరు లభిస్తుంది. అలాగే ఆ కుంటలలో ప్లాస్టిక్ కవర్ వేసుకుని ఆరుతడి పంటలను పండించవచ్చు ముఖ్యంగా కూరగాయలు సాగుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. -
ధాన్యం కొనుగోలుకు సహకరించండి
రైస్‌మిల్లర్లకు ఆర్డీఓ జయచంద్రారెడ్డి విజ్ఞప్తి వెల్దుర్తి(తూప్రాన్): రబీ ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సంపూర్ణ సహకారం అందించాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి కోరారు. సోమవారం వెల్దుర్తి పీఏసీఎస్ కార్యాలయంలో రబీ ధాన్యం కొనుగోలుపై మిల్లర్లు, మండల పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఖరీఫ్‌లో లాగే రబీలో సైతం సహకారం అందించాలని, ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ధాన్యాన్ని దించుకోవాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల నుంచి ఽరైస్మిల్లుల వరకు ధాన్యం తరలించడానికి లారీలపైనే ఆధార పడకుండా ట్రాక్టర్లలో వచ్చిన ధాన్యాన్ని సైతం ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు. ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్‌లకు అవసరం మేరకు హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ అనంతరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ సమస్యలు పరిష్కరించడంలో విఫలం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ కౌడిపల్లి(నర్సాపూర్): హాస్టల్ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్‌గౌడ్ విమర్శించారు. మంగళవారం కౌడిపల్లిలోని బాలికల హాస్టల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల హాస్టల్లో సరైన వసతులు లేవని, పరిశుభ్రత లోపించిందని చెప్పారు. లైట్లు, ఫ్యాన్లు, టాయిలెట్స్ సరిగా లేవన్నారు. కిచెన్‌లో కనీసం ఫుడ్ లేదన్నారు. ఇలాంటప్పుడు విద్యార్థుల భవిష్యత్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సన్నబియ్యం గురించి గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. హాస్టల్లో భోజనం చేస్తే సమస్య తెలుస్తుందని చెప్పారు. 32 మంది అనారోగ్యం బారిన పడితే.. ఒక్క కాంగ్రెస్ నాయకుడు హాస్టల్ వైపు చూడలేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, మండల అధ్యక్షుడు రాకేష్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ నిర్వహణపై ఆర్డీఓ అసహనం కౌడిపల్లి(నర్సాపూర్): కిచెన్‌లో దుర్వాసన వస్తుంది.. టాయిలెట్స్ బాగా లేవు.. పరిసరాలు పరిశుభ్రంగా లేవు.. మొత్తం హాస్టల్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలో గల ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహాన్ని ఆర్డీఓ తనిఖీ చేశారు. హాస్టల్ గదులు, టాయిలెట్స్, కిచెన్‌తోపాటు పరిసరాలను తనిఖీ చేశారు. కిచెన్, హాస్టల్ పరిసరాలు శుభ్రం చేయడంలేదా అని సిబ్బందిని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా నిధులు ఇస్తున్నప్పటికీ పరిసరాలు శుభ్రం చేయకుండా, చిన్ని చిన్న మరమ్మతులు చేయకపోతే ఎలాగన్నారు. సరిపోను గదులు ఉన్నా కేవలం నాలుగు మాత్రమే వాడుతున్నారని మిగితా గదులు ఎందుకు వాడటంలేదని వార్డెన్‌ను ప్రశ్నించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సమస్యలు పరిష్కరిస్తామని ఆందోళన లేకుండా శ్రద్ధగా చదువుకోవాలన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల గురించి మండల వైద్యాధికారి శ్రీకాంత్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్ఐ శ్రీహరి, ఏఎస్డబ్ల్యూఓ పద్మజ, వార్డెన్ సర్సమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయాలు ఆదర్శం ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద మెదక్ కలెక్టరేట్: కోర్టు ప్రాంగణంలో మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మిశార ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, ఇతర న్యాయమూర్తులు రూబినా, సౌజన్య, సాయి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 18న ఖేడ్‌లో ముస్లింల ప్రదర్శన నారాయణఖేడ్: వక్ఫ్ చట్ట సవరణను నిరసిస్తూ ఖేడ్‌లో ఈనెల 18న నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు పట్టణ ముస్లిం పెద్దలు తాహెర్ అలీ, షబ్బీర్ సాబ్, మాజీద్, ముస్లిం యాక్షన్ కమిటీ బాధ్యులు తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం మసీదులలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆర్డీవో, తహసీల్దార్‌కు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ వినతి పత్రాలు అందజేస్తామన్నారు. -
ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
సంగారెడ్డి(తూప్రాన్): యువతి అదృశ్యమైన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఎస్ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. మండలంలోని కాళ్లకల్ గ్రామంలో నివాసముంటున్న చామంతుల గణేశ్, మంజులకు కూతురు నాగలక్ష్మీ(19), కుమారుడు ఉన్నారు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. నాగలక్ష్మీ 10 రోజుల నుంచి మేడ్చల్ మండలంలోని అత్వెల్లి గ్రామ పరిధిలోని నేషనల్ మార్ట్‌లో పనికి వెళ్తుంది. 12న ఉదయం పనికి వెళ్లిన యువతి సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. యువతి తల్లి మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్లాపూర్‌లో గృహిణి శివ్వంపేట(నర్సాపూర్): గృహిణి అదృశ్యమైన ఘటన మండల పరిధి సికింద్లాపూర్ పంచాయతీ పిట్టల వాడలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్‌రెడ్డి కథనం మేరకు.. పిట్టలవాడకు చెందిన సునీత 6న ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం సునీత భర్త సురేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.– సంగారెడ్డిలో యువకుడు, గృహిణి సంగారెడ్డి క్రైమ్: ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. మెదక్ జిల్లా రంగంపేట మండలానికి చెందిన ఎరుపుల వెంకట్ (37) బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి ఏడాది కిందట పట్టణంలోని శాంతినగర్‌కి వచ్చి మేస్త్రీగా పని చేస్తూ జీవిస్తున్నారు. గత నెల 28న దంపతులు గొడవ పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి అదే రోజు ఇంట్లోంచి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం సాయంత్రం భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గృహిణి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన బేగరి ప్రసన్న కుమార్, సరళ భార్యాభర్తలు. సరళ (30) భర్తతో గొడవపడి 11న నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నీళ్ల చారుతో భోజనమా?
కౌడిపల్లి(నర్సాపూర్): హాస్టల్లో సిబ్బందికి మంచి భోజనం వండి విద్యార్థులకు మాత్రం నీళ్ల చారు పెడతారా..? రెండు నెలలుగా కోడి గుడ్డు లేదు.. మీ ఇంట్లో పిల్లలకు ఇలాంటి భోజనమే ఇస్తారా అంటూ హాస్టల్ వార్డెన్‌తో పాటు సిబ్బందిపై ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్‌తో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుకొని సోమవారం కౌడిపల్లి ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్‌ను సందర్శించారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులతో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ గదులు, పరిసరాలు, టాయిలెట్స్‌ను పరిశీలించారు. పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. హాస్టల్ సిబ్బంది మంచి భోజనం వండుకొని పిల్లలకు నీళ్ల చారు పెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. చింతపండు తప్ప ఏ స్టాక్ లేదన్నారు. హాస్టల్ నుంచే కలెక్టర్‌తో మాట్లాడి సమస్యలను వివరించారు. ఆమె వెంట తహసీల్దార్ ఆంజనేయులు, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గణేశ్వర్, మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, ఆర్ఐ శ్రీహరి, మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు నవీన్‌గుప్త, నాయకులు పాల్గొన్నారు. మెరుగైన చికిత్స కోసం మెదక్ తరలింపు ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థుల్లో 11 మందిని సోమవారం సాయంత్రం మెదక్ ఎంసీహెచ్ తరలించారు. ఉదయం మండల వైద్యాధికారి శ్రీకాంత్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో హాస్టల్లో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 31 మందికి చికిత్స అందించారు. మరో నలుగురికి మందులు పంపిణీ చేశారు. కాగా ఇందులో వివిధ తరగతులకు చెందిన 11 మంది విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం 108లో మెదక్ ఎంసీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉందని, ముందు జాగ్రత్తగా జిల్లా అధికారులు సూచన మేరకు మెదక్ తరలించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. మీ పిల్లలకు ఇలాగే పెడతారా.. హాస్టల్ వార్డెన్‌పై ఎమ్మెల్యే సునీతారెడ్డి ఫైర్ చికిత్స పొందుతున్న విద్యార్థులకు పరామర్శ సిబ్బందికి మాత్రం నాణ్యమైన ఫుడ్‌పై ఆరా.. -
డబుల్ బెడ్రూంలు కేటాయించాలి
చేగుంట(తూప్రాన్): అర్హులకు డబుల్బెడ్రూంలు కేటాయించాలని కోరుతూ మండల కేంద్రంలో సోమవారం గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం చేగుంటలో లబ్ధిదారుల సర్వే నిర్వహించి అర్హులకు డబుల్ బెడ్రూంలు ఇస్తామని చెప్పారని, ఇప్పటివరకు ఇళ్లు కేటాయించకపోవడంతో ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎంపిక చేసిన వారికి ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చే వరకు నిరసన విరమించేది లేదని స్పష్టం చేశారు. రాస్తారోకోతో ట్రాఫిక్ సమస్య ఏర్పడగా, పోలీసులు రెవెన్యూ అధికారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఉపాధి.. భవిష్యత్తుకు పునాది
సంగారెడ్డిటౌన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు శిక్షణతోపాటు ఉపాధి కల్పిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది సంగారెడ్డిలోని గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి వారిని ఉన్నత స్థానంలో ఉంచాలనే లక్ష్యంతో ఈ సంస్థ 2010లో జూన్ 7న ఏర్పాటు చేయగా నాటి నుంచి ఎస్బీఐ సౌజన్యంతో యువతీ, యువకులకు ఉపాధి కల్పించే అనేక రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. సంస్థ ద్వారా ఇప్పటివరకు 435 బ్యాచ్‌లకు శిక్షణ కల్పించి ఎంతోమంది ఉపాధికి బాటలు వేశారు. శిక్షణతోపాటు ఉచితంగా భోజనం, వసతి కల్పించడమే కాకుండా వ్యాపార రుణాలను సైతం మంజూరు చేస్తోంది. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న నిరుద్యోగ యువతకు గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ అండగా నిలుస్తూ ఉపాధి కల్పిస్తుండడంతో ఈ శిక్షణ కేంద్రంపై నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తి చూపుతోంది. దీంతో రోజురోజుకు దీనికి ఎంతో ఆదరణ పెరుగుతుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు గత 15 ఏళ్లుగా మహిళలకు టైలరింగ్, బ్యూటీపార్లర్, మగ్గంవర్క్, కంప్యూటర్ శిక్షణతోపాటు ఇటీవల ఉచిత కారు డ్రైవింగ్ శిక్షణ అందిస్తుండగా పురుషులకు మోటార్ వెహికల్ మెకానిక్, సెల్‌ఫోన్ రిపేరింగ్, సీసీ టీవీ, ఫొటోగ్రఫీ, కెమెరా ఇన్స్టాలేషన్ శిక్షణతోపాటు ఉచితంగా వసతి, భోజనం సదుపాయం కల్పిస్తున్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన ట్రైనింగ్ సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో గ్రామీణ నిరుద్యోగ యువత శిక్షణ తీసుకునేందుకు తరలివస్తున్నారు.సొంతంగా బైక్ మెకానిక్ షాపు పెట్టుకున్న స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉచితంగా బైక్ మెకానిక్‌లో శిక్షణ పొంది అనంతరం సొంతంగా గ్రామంలోనే మెకానిక్ షాప్ పెట్టుకుని ఉపాధి పొందుతున్నాను. నెలకు రూ.35 వేల వరకు సంపాదిస్తూ మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను. – సురేశ్, మునిపల్లి మండలం కంకోల్ గ్రామంకుటుంబానికి ఆసరాగా నిలుస్తా గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ద్వారా ఉచితంగా కుట్టు మెషీన్ శిక్షణ తీసుకుంటున్నాను. శిక్షణ అనంతరం ఎస్బీఐ ద్వారా రుణం పొంది సొంతంగా కుట్టు మెషీన్ ప్రారంభించి కుటుంబానికి ఆసరాగా ఉంటాను. – అర్చన, మెదక్ జిల్లా, టేక్మాల్ మండలం, సూరంపల్లి11,545 మందికి ఉచిత శిక్షణ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ, యువకులకు శిక్షణతోపాటు బ్యాంకు ద్వారా రుణాలను కల్పిస్తున్నాం. ఉచిత వసతితోపాటు వ్యాపారాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. శిక్షణ ఇవ్వడంతోపాటు సొంతంగా ఉపాధి పొందేందుకు అవకాశాలు కల్పిస్తున్నాం. ఇటువంటి అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. – రాజేంద్రప్రసాద్, గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ డైరెక్టర్బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న న్యూస్ పేపర్లో వచ్చిన ఉచిత శిక్షణ ప్రకటనను చూసి సంగారెడ్డి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాను. ఆ తర్వాత ఉచితంగా హాస్టల్లో ఉంటూ బ్యూటీషియన్లో శిక్షణ పొందాను. ప్రస్తుతం సంగారెడ్డి లో పార్లర్ నడుపుతున్నాను. నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదిస్తున్నాను. మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను. – అశ్విని రాథోడ్, విట్టునాయక్ తండా, మొగుడంపల్లి మండలంఎస్బీఐ సౌజన్యంతో వ్యాపార రుణాలు 11,545 మందికి ఉచిత శిక్షణ లబ్ధి పొందుతున్న నిరుద్యోగులు30 రోజుల పాటు శిక్షణ 2010 జూన్ 7న ప్రారంభమైన ఈ శిక్షణ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 11,545 శిక్షణ తీసుకోగా అందులో 8,116 మంది స్వయం ఉపాధిలో స్థిరపడ్డారు. 3,303 మందికి బ్యాంకుల ద్వారా రుణాలను అందించారు. 834 మంది వివిధ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారు. శిక్షణలో భాగంగా వ్యక్తిత్వ వికాసం, వ్యాపార సంబంధ బ్యాంకింగ్ విషయాలపై సైతం అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత భోజనం, ఉచిత నివాసం ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తుంది. 30 రోజులపాటు ఈ శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను అందజేస్తారు. -
కాంగ్రెస్‌తోనే పేదలకు మేలు
మనోహరాబాద్(తూప్రాన్): కాంగ్రెస్‌తోనే పేదలకు మేలు జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం రంగాయపల్లిలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. లింగారెడ్డిపేట, కాళ్లకల్‌లో దళితవాడల్లో పర్యటించి లబ్ధిదారుడు వర్గంటి యాదగిరి ఇంట్లో సన్నబియ్యం భోజనం చేశారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ర్యాకల కృష్ణగౌడ్, పెంటాగౌడ్ ఉన్నారు. వైఎస్సార్ బాటలోనే పాలనశివ్వంపేట(నర్సాపూర్): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చూపిన బాటలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని డీసీసీ అధ్య క్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. సోమవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని చిన్నగొట్టిముక్ల నుంచి గోమారం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈసందర్భంగా గోమారంలో సన్నబియ్యం లబ్ధిదారుడు నాగరాజుయాదవ్ నివాసంలో భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని, ప్రతి ఒక్కరూ అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్రామిరెడ్డి, మాధవరెడ్డి, నవీన్‌గుప్తా, తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వర జలం.. అన్నదాతల హర్షం తూప్రాన్: మండలంలోని మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రధాన చెరువులు, కుంటలు కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్నాయి. నెల రోజుల పాటు రైతులు తమ సొంత ఖర్చులతో కాళేశ్వరం జలాల కోసం సమష్టిగా చేసిన కృషి ఫలించడంతో వారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. తొమ్మిది కిలోమీటర్ల మేర కాలువ పనులను రూ. 4 లక్షల వ్యయంతో చేయించారు. దీంతో చెరువులు నిండడంతో పాటు పంట పొలాలు ఎండిపోకుండా కాపాడుకున్నారు. మూడు చెరువులు అలుగు పారతుండడంతో సోమవారం శనిగచెరువు వద్ద వేద పండితులతో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కనీస వేతనం ఇవ్వాలి: సీఐటీయూ మెదక్ కలెక్టరేట్: మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా మహాసభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనం రూ. 26,000 నిర్ణయించి, అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం కేవల్ కిషన్ భవన్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు సంతోష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పద్మారావు, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లచ్చగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మహోన్నత వ్యక్తి అంబేడ్కర్
మెదక్ కలెక్టరేట్: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేడ్కర్ అని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా, పోస్టాఫీస్ సర్కిల్ వద్ద అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ జీవితాన్ని స్ఫూ ర్తిగా తీసుకొని సమాజంలో అసమానతలను రూపుమాపడానికి కృషి చేయాలని హితవుపలికారు. అనంతరం కలెక్టరేట్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించారు. అయితే కలెక్టర్, అదనపు కలెక్టర్ లేకుండా మహనీయుల జయంతి ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారని దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. స్పందించిన డీఆర్ఓ భుజంగరావు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి శశికళ మాట్లాడుతూ.. కలెక్టర్ సీఎం సమావేశానికి హైదరాబాద్ వెళ్లగా, తల్లి అనారోగ్యం కారణంగా అదనపు కలెక్టర్ నగేష్ సెలవులో ఉన్నారని తెలిపారు. కార్యక్రమానికి ఎస్పీ వస్తున్నారని సముదాయించగా.. ఆందోళన విరమించారు. ఈసందర్భంగా వక్త లు మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలకనుగుణంగా నాయకులు పనిచేయాలన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత విద్యాభ్యాసం చేసి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, డీఎంహెచ్ఓ శ్రీరామ్, వివిధ కులసంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్‌రాజ్ -
కల్లాల ఆశలు కల్లలు
ధాన్యం ఆరబెట్టలేక రైతుల తిప్పలురామాయంపేట(మెదక్): ఆరుగాలం శ్రమించే రైతులకు పంటను ఆరబెట్టడం పెద్ద సమస్యగా మారుతోంది. కల్లాలు లేక రహదారుల వెంట ఆరబోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో రైతులు కల్లాలు నిర్మించుకోవడానికి వీలుగా కేంద్రం ఉపాధి హామీ పథకంలో నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లా పరిధిలో 2,000 మందికి పైగా రైతులు వీటిని నిర్మించుకున్నారు. అయితే గత రెండున్నర ఏళ్ల క్రితం ఈ పథకం రద్దు కావడంతో ఆందోళన చెందుతున్నారు. పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడం, తూర్పార పట్టడానికి సరైన స్థలం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో తారు రోడ్లు, వ్యవసాయ బోర్ల వద్ద మడుల్లో ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ముఖ్యంగా రోడ్డుపై ఆరబెడుతున్న ధాన్యంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ధాన్యం కుప్పలను ఢీకొని రెండేళ్లలో జిల్లా పరిధిలో ఎనిమిది మందికి పైగా వాహనదారులు మృతిచెందారు. రోడ్డుపై ధాన్యం ఆరబోసినందుకు గాను జిల్లా పరిధిలో కొందరు రైతులపై గతంలో కేసులు సైతం నమోదయ్యాయి. కల్లాలు మంజూరు చేసిన మొదట్లో సరైన అవగాహన లేకపోవడంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో చాలా మంది పూర్తిస్థాయిలో నిర్మించుకోలేదు. కల్లాలు అత్యవసరమని ఇప్పుడిప్పుడే రైతులు గుర్తిస్తున్న క్రమంలో ఈ పథకం రద్దయింది. కేంద్రం తిరిగి ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. పథకం రద్దయింది గతంలో ఉపాధి హామీ పథకంలో కేంద్రం కల్లాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. దీంతో జిల్లా పరిధిలో చాలా మంది రైతులు వీటిని నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఈ పథకం రద్దయింది. తిరిగి పునరుద్ధరిస్తే రైతులకు మేలు కలుగుతుంది. – శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్ హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని సర్దన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈసందర్భంగా ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపర్చాలన్నారు. రోగులతో మాట్లాడి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు..? అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా? ఏమైనా ఇబ్బందులు ఏర్పడుతున్నాయా? అని ఆరా తీశారు. మందులన్నీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి ఆయన సూచించారు. ఆయన వెంట ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. నేడు కలెక్టరేట్లో అంబేడ్కర్ జయంతి మెదక్ కలెక్టరేట్: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతిని సోమవారం జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కలెక్టరేట్లో కార్యక్రమం ఉంటుందన్నారు. -
వైద్య వృత్తి మహోన్నతమైనది
మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటఅర్బన్: వైద్య వృత్తి మహోన్నతమైనదని, వృత్తిలో రాణించి తల్లిదండ్రులకు, సమాజానికి గొప్ప పేరు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మిట్టపల్లి సమీపంలో సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మొదటి గ్రాడ్యుయేషన్ వేడుకలకు మంత్రితో పాటు ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే హరీష్‌రావు, యూనివర్సిటీ వీసీ నందా కుమార్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్దిమందికి మాత్రమే డాక్టర్‌గా అయ్యే అవకాశం ఉంటుందన్నారు. కనబడే దేవుళ్లు డాక్టర్లేనని అన్నారు. గతంలో మెడికల్ కాలేజీ లు తక్కువగా ఉండేవని తెలంగాణ వచ్చాక చాలా కాలేజీలు వచ్చాయన్నారు. నేటి విద్యార్థులు డాక్టర్లు అవ్వాలని, తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడంతో పాటు సామాజిక బాధ్యతతో వైద్యం అందించాలని అన్నారు. డాక్టర్లుగా వెళ్తున్న 2019 బ్యాచ్ విద్యార్థులు మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సురభి మెడికల్ కాలేజీ చైర్మన్ హరిందరావు, మహేందర్ రావు, మనోహర్ రావు, డీన్ రఫీ, మెడికల్ డైరెక్టర్ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
నర్సాపూర్: అగ్నిమాపక వారోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో అగ్నిమాపక లీగల్ ఫైర్‌మెన్ ఐలయ్య, ఇతర సిబ్బంది జానారెడ్డి, వెంకటేశం, అనిల్, బీఆర్ఎస్ నాయకులు సత్యంగౌడ్, బాల్‌రెడ్డి, ప్రసాద్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మకు మొక్కులు పాపన్నపేట(మెదక్): దుర్గమ్మా... దండాలమ్మ అంటూ వేలాది భక్తులు వేడుకున్నారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూ జలు చేశారు. ఒడిబియ్యం పోసి, బోనాలు సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మండుటెండలో చెట్లకింద సేదదీరి విందు చేసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఎస్ఐ శ్రీని వాస్, ఆలయ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. కేసీఆర్‌ను కలిసిన భాస్కర్ టేక్మాల్(మెదక్): మండలంలోని బొడ్మట్‌పల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బేగరి భాస్కర్ ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలను ఆయనకు వివరించారు. అర్హులు ఇందిరమ్మఇళ్లు నిర్మించుకోవాలినారాయణఖేడ్: అర్హులైన ప్రతీ ఒక్కరూ ఇదిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. మనూరు మండలం దుదగొండలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ...అర్హులకే ఇళ్లను మంజూరు చేశామన్నారు. అనంతరం గ్రామంలో బీరప్పస్వామి, ఊరడమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు వినోద్‌పాటిల్, దిగంబర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, సంగన్న, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఉత్సాహంగా కుస్తీ పోటీలు నారాయణఖేడ్: హనుమాన్ జయంతి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్ ఆలయం ఆవరణలో ఆదివారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ కుస్తీపోటీలకు స్థానికులతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. చివరి కుస్తీ పోటీకి 5 తులాల వెండి కడియాన్ని బహుమతిగా అందజేశారు. కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహారాజ్, ఇరక్‌పల్లి దేవిదాస్ మహారాజ్, గోపాల్, కిషన్, విఠల్‌నాయక్, రాంచెందర్, దేవీసింగ్, నందు, బక్షిరాం పాల్గొన్నారు. వరంగల్ సభను విజయవంతం చేయాలిఎమ్మెల్యే మాణిక్‌రావు పిలుపు జహీరాబాద్ టౌన్: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు పార్టీ శ్రేణులను కోరారు. మండల కేంద్రమైన మొగుడంపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
అంబేడ్కర్ ఆశయాలను సాధిద్దాం
నర్సాపూర్ రూరల్: అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని అచ్చంపేటలో పార్టీ కార్యకర్తలతో కలిసి స్వచ్ఛభారత్ నిర్వహించారు. గ్రామంలోని వీధులను శుభ్రం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు, యువత, విద్యార్థులు అంబేడ్కర్ ఆశయాలకనుగుణంగా పనిచేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. అంబేడ్కర్ దేశంలోని అన్నివర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని పొందుపరచారన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నగేష్, దళిత మోర్చ నాయకులు అంజి, భిక్షపతి, విక్రం, లడ్డు, నారాయణరెడ్డి, విక్రం పాల్గొన్నారు. -
రెండు లక్షల ఉద్యోగాలు బోగస్సే
సిద్దిపేటజోన్: ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు బోగసేనని, నేటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ యువత, విద్యార్థి విభాగాల ప్రతినిధులతో వరంగల్ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ‘నాడు నిరుద్యోగుల కోసం ప్రొఫెసర్ కోదండరాం, రియాజ్, వెంకట్, మురళి, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి అశోక్‌నగర్ కోచింగ్ కేంద్రాల చుట్టూ తిరిగారు. బస్సు యాత్రలు చేపట్టారు.. రాహుల్ గాంధీని అశోక్ నగర్‌కు తీసుకొచ్చి ప్రామిస్ చేయించారు. మీకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి.. కానీ నిరుద్యోగులకు రాలేదు.. ఎందుకు మీ గొంతులు మూగపోయాయని హరీశ్ రావు ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాల పేరిట యువతను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. రాహుల్ గాంధీకి నిరుద్యోగుల బాధలు కనబడడం లేదా వినబడడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చెప్పిన నిరుద్యోగ భృతి వట్టి మాటేనన్నారు. బీఆర్ఎస్ పార్టీకి యువత కీలకమని, రజతోత్సవ సభకు వరంగల్ వరకు వెయ్యి మంది యువత పాదయాత్ర చేయనున్నారని అన్నారు. సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి వట్టిమాటేనా? ప్రభుత్వ తీరుపై హరీశ్ ఫైర్ -
భూ సమస్యలకు మోక్షం
భూ సమస్యలకు మోక్షం!సర్వేకు నోచుకోని వేలాది ఎకరాలు జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల ఎకరాలకు పైగా భూములు సమస్యల్లో ఉన్నాయి. ఆ భూములు మావి అని రెవెన్యూ శాఖ వారు అంటే, కాదు మావి అంటూ ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. రెవెన్యూ అధికారులు భూమిలేని నిరుపేదలకు అసైన్మెంట్ పట్టాలు ఇస్తే, అవి మావంటూ ఫారెస్ట్ అధికారులు లాక్కున్న ఘటనలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆ భూములు సర్వేకు నోచుకోకుండా పోయాయి. ధరణి స్థానంలో ‘భూ భారతి’ ● జిల్లావ్యాప్తంగా పార్ట్(బీ)లో 30 వేల ఎకరాలు ● కొత్త మాడ్యూల్స్‌తో లభించనున్న పరిష్కారం నూతన రెవెన్యూ చట్టం భూ భారతితో భూ సమస్యలకు మోక్షం లభించనుంది. మొన్నటి వరకు ధరణిలో ఎలాంటి భూ సమస్యలున్నా దరఖాస్తు చేసుకుంటే అది కలెక్టర్ లాగిన్‌కు వచ్చేది. దీంతో చాలా జాప్యం జరగగా.. ఏళ్లుగా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం తీసుకొస్తున్న భూ భారతి చట్టం ద్వారా తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో.. మొత్తంగా జిల్లాలోనే భూ సమస్యలకు పరిష్కారం లభించనుంది. – మెదక్‌జోన్ జిల్లాలో సుమారు 30 వేల పైచిలుకు భూములు నిషేధిత పార్ట్ (బీ)లో ఉన్నాయి. గత ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన ధరణి చట్టంలో తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్‌కు సైతం అధికారం ఇవ్వకుండా మాడ్యూల్స్‌ను తయారుచేశారు. ఏ చిన్న సమస్య ఉన్నా, వాటిని వెంటనే పార్ట్(బీ)లో పెట్టారు. ముఖ్యంగా గ్రామాల్లో భూముల క్రయ, విక్రయాలు నిరంతరంగా కొనసాగుతాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించే వీఆర్ఓలను తొలగించారు. గతంలో భూ సమస్యలు ఉత్పన్నం అయితే తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్ స్థాయి అధికారుల వద్ద పరిష్కారం లభించేది. ధరణిలో అలాంటివేవి లేకుండా చేశారు. మచ్చుకు కొన్ని.. ● మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాబుపేటలో 236, 216, 309 సర్వే నంబర్లలో 800 ఎకరాల పరంపోగు (పట్టా) భూములకు సంబంధించి 250 మంది రైతులకు పట్టాలు ఉన్నాయి. వారు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని బోర్లు వేసి పంటలు పండించుకున్నారు. కాగా ధరణి కంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం భూ ప్రక్షాళన పేరుతో సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఆ గ్రామంలోని మూడు ఈ సర్వే నంబర్లను పరిశీలించగా రికార్డుల్లో 1,000 ఎకరాలు ఉన్నట్లు తెలింది. ధరణి వచ్చాక ఆ గ్రామంలోని 800 ఎకరాలను పార్ట్(బీ)లో పెట్టారు. ఏళ్ల తరబడి ఉన్న పట్టాలను రద్దు చేశారు. అధికారుల తప్పిదంతో రికార్డుల్లో ఎక్కువ భూమిని రాస్తే మా భూములు (పార్ట్ బీ)లో ఎలా పెడతారని పేద రైతులు ప్రశ్నించారు. ● కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌లో సుమారు 80 ఎకరాల భూములకు సంబంధించి ఆ గ్రామంలోని కొంత మంది రైతులకు పట్టాలు ఉండగా, వారు భూములు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ధరణి చట్టం అమల్లోకి వచ్చాక గతంలో ఆ భూములు ఓ భూస్వామివని తేలింది. అతని పేరు తెరపైకి రావడంతో సదరు వ్యక్తి హైదరాబాద్‌లో ఉండి మరో వ్యక్తికి భూములు విక్రయించారు. వాటిని కొనుగోలు చేసిన వ్యక్తి గ్రామానికి వచ్చి భూములు తమవే అని అనడంతో ప్రస్తుతం గ్రామంలో గొడవలు జరుగుతన్నాయి. ● చిన్నశంకరంపేట మండలం జంగరాయి శివారులో 406, 360, 274 సర్వే నంబర్లలో అబ్దుల్ ఖాదర్ భూములు 500 ఎకరాలు ఉండగా.. వాటిని కొంతకాలంగా వందలాది మంది రైతులు పట్టాలు చేసుకుని సాగు చేసుకుంటున్నారు. ధరణి అమల్లోకి వచ్చాక ఆ మూడు సర్వే నంబర్లను తీసి వేసి ఒకటే సర్వే నంబర్‌గా మార్చి అసైన్మెంట్ పట్టాలుగా రికార్డుల్లో పొందుపరిచారు. గతంలో ఆ భూములకు సంబంధించి రైతులు క్రయ, విక్రయాలు జరిపారు. ప్రస్తుతం వాటిని అసైన్మెంట్గా మార్చడంతో ఆందోళన చెందుతున్నారు. -
అట్టహాసంగా ధ్వజస్తంభ ఊరేగింపు
పెద్దశంకరంపేట(మెదక్): సీతారాముల ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ధ్వజస్తంభం ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమలాపూర్ హనుమాన్ ఆలయం వద్ద ధ్వజ స్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళల నృత్యాలు, మంగళ హారతులు, కేరళ వాయిద్యాలు, డాక్టర్ ఐశ్వర్యరెడ్డి అధ్వర్యంలో సాయితుంబుర వారి కూచిపూడి నృత్యాలు, భారీ హనుమాన్ విగ్రహ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈనెల 21వ తేదీ నుంచి 23 వరకు నూతన ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ప్రజలకు విస్తృత సేవలు
జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్జహీరాబాద్: పార్లమెంట్ కేంద్రమైన జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయం ద్వారా ప్రజలకు మరింత విస్తృతమైన సేవలు అందించనున్నట్లు ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. జహీరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా జహీరాబాద్ క్యాంపు కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. పార్లమెంట్ క్యాంపు కార్యాలయ ఇన్చార్జిగా సీనియర్ నాయకుడు పస్తాపూర్‌కు చెందిన శుక్లవర్ధన్రెడ్డిని నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, ఐడీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం.డి.తన్వీర్, కాంగ్రెస్ నాయకులు పి.నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శౌకత్, భాస్కర్‌రెడ్డి, మక్సూద్, అర్షద్, అశోక్, అస్మాతబస్సుమ్ పాల్గొన్నారు. -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
హనుమాన్ నామస్మరణతో మెతుకుసీమ పుర వీధులు మార్మోగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సాపూర్ రాయరావు చెరువు సమీపంలోని హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్,ఆయా పార్టీల నాయకులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం శోభాయాత్రలో పాల్గొన్నారు. – నర్సాపూర్ -
ప్రతి గింజకూ మద్దతు ధర
కొండపాక(గజ్వేల్): ప్రతి గింజకూ మద్దతు ధర అందించేలా ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి, బందారం గ్రామాల్లో శనివారం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని తూర్పార పట్టాక పాసింగ్ చేయాలన్నారు. సన్న రకం ధాన్యం క్వింటాల్‌కు మద్దతు ధరకు అదనంగా రూ. 500 బోనస్‌ను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లింగారావు, పీఏసీఎస్ డైరెక్టర్ సురేందర్‌రావు, నాయకులు వెంకటేశంగౌడ్, సుదర్శన్, పర్శరాములు, ప్రభాస్, నరేందర్ రావు, నర్సింగరావు, రైతులు, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి -
రజతోత్సవ సభకు తరలిరండి
శివ్వంపేట(నర్సాపూర్): ఈనెల 27న వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని వివిధ కూడళ్లతో పాటు తూప్రాన్– నర్సాపూర్ హైవే పక్కన గల కల్వర్టు గోడపై రాస్తున్న వాల్ రైటింగ్‌ను శనివారం పరిశీలించారు. ప్రతి గ్రామం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణగౌడ్, నాయకులు మన్సూర్, హన్మంత్‌రెడ్డి, లాయక్ తదితరులు పాల్గొన్నారు. వన దుర్గమ్మకు పల్లకీ సేవ పాపన్నపేట(మెదక్): పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయలలో శనివారం వన దుర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరి ంచుకొని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీపై ఊరేగించారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు మనోహరాబాద్(తూప్రాన్): హనుమాన్ జయ ంతి సందర్భంగా శనివారం మండలంలోని కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం, కూచారంలోని హనుమాన్ దేవాలయం, కోదండ రామాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా.. హనుమంతుడికి ఆమె పట్టువస్త్రాలు సమర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మా ట్లాడుతూ.. హనుమాన్ దేవాలయ అభివృద్ధికి గతంలో కేసీఆర్ రూ. 22 లక్షలు అందజేశారని గుర్తుచేశారు. ఆమె వెంట ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ జెడ్పీ మాజీ చైర్పర్సన్ హేమలత, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, స్థానిక నాయకులు కొట్టాల యాదగిరి, పురం రవి, రేణుకుమార్, భిక్షపతి, అర్జున్, దాసరి నరేష్, ఉదయ్రంజన్గౌడ్, ఆంజనేయులు, రాజు తదితరులు ఉన్నారు. ఇదిలాఉండగా నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పంచాయతీ కార్మికులు ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం అందజేశారు. న్యాయం చేయండి కొల్చారం(నర్సాపూర్): విధులు నిర్వర్తించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న పాలకమండలి సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని చిన్నఘనాపూర్ పీఏసీఎస్ సీఈఓ సత్యనారాయణరెడ్డి రెండు రోజులుగా కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్నారు. పాలకమండలి, సీఈఓ మధ్య మూడేళ్లుగా లావాదేవీల విషయమై వివాదం కొనసాగుతోంది. సంఘానికి చెందిన సొమ్మును సొంతానికి వాడుకున్నారని సీఈఓను పక్కన పెట్టారు. ఈ విషయం సత్యనారాయణరెడ్డి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. దీంతో హైకోర్టును ఆ శ్రయించగా.. అనుకూలంగా తీర్పు వచ్చింది. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, 44 నెలల పెండింగ్ వేతనం చెల్లించాలని కలెక్టర్, మరో నలుగురు అధికారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇటీవలే విధుల్లోకి తీసుకున్నా రు. మూడు రోజుల అనంతరం కార్యాలయంలోనికి వెళ్లకుండా పాలకమండలి సభ్యులు గదికి తాళం వేశారు. చేసేది లేక ఆరుబయటే ఉంటూ నిరసన తెలుపుతున్నాడు. డంపింగ్‌యార్డ్ మాకొద్దు67వ రోజుకు చేరిన నిరసన జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్‌యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు శనివారం నాటికి 67వ రోజుకు చేరుకున్నాయి. నల్లవల్లి, ప్యారానగర్, గుమ్మడిదల గ్రామాల్లో రిలే నిరాహార దీక్షలు శాంతియుతంగా కొసాగుతున్నాయి. -
గునపం పట్టి.. కదకం తవ్వి
రామాయంపేట(మెదక్): మండలంలోని పర్వతాపూర్ అటవీలో కొనసాగుతున్న ఉపాధి పనులను శనివారం కలెక్టర్ రాహుల్‌రాజ్ పరిశీలించారు. గ్రామం నుంచి కాలినడకన అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆయన కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గునపం పట్టుకొని తవ్వకం చేపట్టారు. కందకాలను పరిశీలించి కొలతలు సేకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనులతో అటవీ భూమిలో నీటి మట్టం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రతి పంచాయతీ నుంచి 50 మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారని, వీరి సంఖ్య 100 పెరగాలని సిబ్బందికి సూచించారు. ఉపాధి కార్డున్న ప్రతి కూలీ పనిలో పాల్గొనాలన్నారు. అనంతరం కాట్రియాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. దారిలో వరి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆయన వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్తో పాటు ఇతర అధికారులు ఉన్నారు. -
రేపటి నుంచి బేతాళస్వామి జాతర
అల్లాదుర్గం(మెదక్): ఏడుపాయల జాతర తర్వాత జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించే బేతాళ స్వామి జాతర ఈనెల 14 నుంచి ప్రారంభం కానుంది. జాతరకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్రతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు హాజరవుతుంటారు. జాతరలో జంతు బలులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా బేతాళస్వామి దేవాలయాన్ని అల్లాదుర్గంలో 4 వందల ఏళ్ల క్రితమే నిర్మించినట్లు సమాచారం. సమీప గ్రామాలకు చెందిన భక్తులు ఎడ్ల బండ్లను అలంకరించి ఆలయం చట్టూ తిప్పుతారు. బేతాళ స్వామిపై భక్తితో అల్లాదుర్గంతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారు తమ పిల్లలకు బేతయ్య, బేతమ్మ పేర్లను ఎక్కువగా పెట్టుకుంటారు. 14న పోలేరమ్మ దేవతకు, 15న పోచమ్మకు, 16న దుర్గమ్మకు, 17న బేతాళస్వామికి బోనాలు తీయడం అనావాయితీ. 18న ఆలయం చుట్టూ ఎడ్ల బండ్లు తిప్పటం. 19న భాగవతం, 20న భజనలు, 21న వినోద కార్యక్రమాలు, 22న ఉదయం పాచి బండ్లు తిరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. -
డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత
మెదక్ మున్సిపాలిటీ: మత్తుతో జీవితం నాశనం అవుతుందని, డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఇందుకు సంబంధించి శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. డ్రగ్స్ మత్తులో దాడులు, నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్‌శాఖ డ్రగ్స్ నిర్మూలన కోసం నిరంతరం నిఘా నేత్రాలతో పర్యవేక్షిస్తుందన్నారు. పౌరులు, ప్రజలు బాధ్యతగా సహకరించాలని కో రారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతలో మార్పు రావాలని అన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుందని, భవిష్యత్ అంధకారం అవు తుందని వివరించారు. ఇది దేశ యువశక్తిని నిర్వీ ర్యం చేస్తుందన్నారు. డ్రగ్స్ వినియోగం, సరఫరా చేయడం తీవ్రమైన నేరమన్నారు. డ్రగ్స్‌కు అలవాటుపడిన వారి గురించి సమాచారం ఇస్తే వారికి కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి -
జీవవైవిధ్యం.. ఆహ్లాదం
125 ఎకరాల్లో అర్బన్ పార్క్రూ. 2 కోట్ల కేంద్రం నిధులతో ఏర్పాటు ముమ్మరంగా సాగుతున్న పనులు ప్రజల జీవ వైవిధ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి కేంద్ర ప్రభుత్వం అర్బన్ పార్కు నిర్మాణానికి చర్యలు చేపట్టింది. నగర వన యోజన పథకంలో భాగంగా జిల్లాలోని అక్కన్నపేట అటవీ ప్రాంతంలో దీని నిర్మాణానికి రూ. రెండు కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. – రామాయంపేట(మెదక్) పట్టణ ప్రజలతో పాటు జాతీయ రహదారి (765 డీజీ)పై ప్రయాణించే వాహనదారులు సేద తీరడానికి వీలుగా రోడ్డును ఆనుకొని అర్బన్ పార్కు నిర్మిస్తున్నారు. ఇది రామాయంపేట మున్సిపాలిటీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం టెండర్ ప్రక్రియ పూర్తికాగా పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం అటవీ ప్రాంతంలో 125 ఎకరాల మేర స్థలం కేటాయించారు. నిర్మాణం పూర్తయిన అనంతరం తాత్కాలిక రుసుముతో దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ప్రధాన రహదారి వైపు మెయిన్ గేట్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. 125 ఎకరాల చుట్టూ తిరిగి రావడానికి వీలుగా మట్టి రోడ్డు నిర్మించనున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన స్ధలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. నిర్మించాల్సినవి ఇవే.. నగర వన యోజన పథకంలో భాగంగా వాచ్ టవర్, పగోడ, మెయిన్ గేట్, టాయిలెట్స్, హర్బల్, బొటానికల్ గార్డెన్లు, వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయన్నారు. ఇందులో సోలార్ లైట్లతో పాటు సీసీ కెమెరాలు అమర్చనున్నారు. చెక్ డ్యాంలతో పాటు నీటి కుంటలు, రాళ్ల తెట్టెలు, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఆట పరికరాలు ఏర్పాటు కానున్నాయి. అటవీ ప్రాంతాన్ని వీక్షించడానికి వీలుగా వాచ్‌టవర్ నిర్మిస్తున్నారు. ఈ పార్కులో అరుదైన ఔషద మొక్కలు నాటనున్నారు. పర్యావరణంపై అవగాహన కొత్తగా నిర్మిస్తున్న అర్బన్ పార్కులో ప్రధానంగా సందర్శకులకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం ఎన్విరాన్మెంట్ సెంటర్ నెలకొల్పుతున్నారు. సందర్శకులకు పర్యావరణం, అటవీ ప్రాంతంలో ఉన్న జంతువుల వివరాలు, వాటి మనుగడ, అడవుల సంరక్షణతో కలిగే లాభాల గురించి అవగాహన కల్పించనున్నారు.పర్యావరణం, జంతువుల సంరక్షణకు పెద్దపీట అక్కన్నపేట అటవీ ప్రాంతంరూ. 2 కోట్లు మంజూరయ్యాయి పట్టణ ప్రజలతో పాటు రహదారి వెంట వెళ్లే ప్రయాణికులు సేద తీరడానికి గాను కేంద్ర నిధులతో అర్బన్ పార్కు నిర్మిస్తున్నాం. ఈ మేరకు కేంద్రం నుంచి రూ. రెండు కోట్లు మంజూరయ్యాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న జంతువుల మనుగడ, వాటి జీవన విధానంపై సందర్శకులకు అవగాహన కల్పిస్తాం. – విద్యాసాగర్, రామాయంపేట రేంజ్ అధికారి -
ఆకస్మిక తనిఖీలతో హడల్
మెదక్‌జోన్: ఆకస్మిక తనిఖీలతో కలెక్టర్ హడలెత్తిస్తున్నారు. రిజిస్టర్లో సంతకాలు పెట్టి విధులకు ఎగనామం పెట్టే ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ముగ్గురిని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. తాజాగా శనివారం జిల్లా కేంద్రంలోని గోల్కొండ వీధి బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి తాళం వేసి ఉండటంతో సిబ్బంది పనితీరుపై స్థానికంగా ఆరా తీశారు. విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని తెలుసుకొని మెడికల్ ఆఫీసర్, స్టాఫ్‌నర్స్, సపోర్టింగ్ స్టాఫ్‌ను విధుల నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా గతేడాది మార్చిలో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌రాజ్ క్షేత్రస్థాయి పర్యటనలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాలలు, కళా శాలలు, కేజీబీవీలు, గురుకులాలు, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులతో పాటు మారుమూల గ్రామా ల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్ దవాఖానలను వరుసగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఆయా శాఖల సిబ్బంది, అధికారులు సక్రమంగా విధులకు హాజరవుతుండగా, కొంత మందిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఫలితంగా కలెక్టర్ ఆగ్రహానికి గురవుతున్నారు. ఉద్యో గులు పనిచేసే చోట ఉండాలని, ఎవరెవరు ఎక్కడ అద్దెకు ఉంటున్నారో పూర్తి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ జంట నగరాల నుంచి నిత్యం వచ్చిపోయే అధికారులు సైతం స్థానికంగా నివాసం ఉంటున్నారు. అంతే కాకుండా ప్రతి అధికారి క్షేత్రస్థాయి పర్యటన తప్పకుండా చేయాలని కూడా సూచించారు. విధులకు ఎగనామం పెట్టే వారిపై కలెక్టర్ రాహుల్‌రాజ్ వేటు తాజాగా ముగ్గురు సిబ్బంది సస్పెన్షన్ -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
మెదక్ ఎంపీ రఘునందన్రావుమెదక్జోన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులే గెలవాలని, ఆదిశగా నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో శుక్రవారం పట్టణంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పారు. ఎమ్మెల్సీల గెలుపులో బీజేపీ కార్యకర్తలు, తపస్ నేతల కృషి మరిచి పోలేనిదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కొమురయ్య మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బీజేపీ అభ్యర్థులను గెలిపిద్దామన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి నిరంతరంగా కృషి చేస్తానని చెప్పారు. అంతకుముందు పట్టణంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, నేతలు ఎంఎల్ఎన్ రెడ్డి, శివ, తదితరులు పాల్గొన్నారు. సీఎం మూర్ఖుడిలా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. తెలంగాణలో బీ జేపీని రానివ్వమని అంటున్నారని, ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వి జయం సాధించిన విషయం ఆయనకు కనబడటంలేదా అని ప్రశ్నించాడు. దేశంలో కాంగ్రెస్ పని అయిపొయిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ప్రభుత్వ స్థలాలు విక్రయించిందన్నారు. మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ల కోసం వేలాది ఎకరాల పేదల భూములు లాక్కున్న చరిత్ర వారిదేనని ఆరోపించారు. ప్రస్తుతం భూములు ఎలా అమ్ముతారని కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. -
స్కాన్ చెయ్.. టికెట్ తీస్కో..
మెదక్ మున్సిపాలిటీ: ‘టికెట్‌కు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్‌కు సహకరించగలరు’ అనే నినాదానికి ఇక నుంచి ఆర్టీసీ సంస్థ స్వస్తి పలకనుంది. వేధిస్తున్న చిల్లర సమస్యను తట్టుకునేందుకు బస్సుల్లో నగదు రహిత సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రతి బస్సులో ఈ–టిమ్ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తుంది. దీంతో ప్రయాణికులు, కండక్టర్ల మధ్య చిల్లర గొడవ తీరిపోనుంది. గతంలో చిల్లర లేక కండక్టర్లు ఇతర ప్రయాణికులతో డబ్బులు జత చేసి ఇవ్వడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. మెదక్ డిపోకు 80 ఈ–టిమ్ మిషన్లు మెదక్ డిపోలో మొత్తం 94 బస్సులు ఉండగా, ఇందులో 39 ప్రభుత్వ, 55 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. వీటి కోసం ఆర్టీసీ యాజమాన్యం 80 నగదు రహిత ఈ–టిమ్ యంత్రాలను మెదక్ డిపోకు కేటాయించినట్లు డిపో మేనేజర్ సురేఖ తెలిపారు. ఈ యంత్రాలతో (ఫోన్ పే, గూగుల్ పే) నగదు రహిత ఆన్లైన్ యాప్ ద్వారా స్కాన్ చేయవచ్చని తెలిపారు. అలాగే డెబిట్ కార్డులతో స్వైపింగ్ చేసి టికెట్ తీసుకునే సౌకర్యం ఆర్టీసీ కల్పించిందన్నారు. డిపోలో ప్రస్తుతం ఈ–టిమ్ యంత్రాలను సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. మిగితా యంత్రాలను త్వరలోనే అన్ని బస్సుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. ఆర్టీసీలో నగదు రహిత సేవలు ప్రస్తుతం సూపర్ డీలక్స్ బస్సుల్లో ప్రారంభం దశలవారీగా అన్ని సర్వీసుల్లో అమలు -
ఆయిల్‌పామ్ సాగులో మోడల్‌గా నిలపాలి
మంత్రి తుమ్మల నాగేశ్వర్రావునంగునూరు(సిద్దిపేట): తెలంగాణకు గుండెకాయగా ఉన్న సిద్దిపేటను ఆయిల్‌పామ్ సాగులో ఆదర్శంగా నిలపాలని వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. నర్మెటలో 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సందర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ మంత్రిగా ప్రమాణ స్వీ కారం చేయగానే నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్ ఫ్యాక్టరీపైనే తొలి సంతకం చేశానన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అధునాతన మిషన్లు, టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని, ఇక్కడే రిఫైనరీ చేస్తారన్నారు. జూన్ నెలాకరు వరకు ఫ్యాక్టరీ ప్రారంభించేలా ఆయిల్‌ఫెడ్ చైర్మన్, కలెక్టర్ చొరవ తీసుకొని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేయాలన్నారు. నూనె వినియోగం పెరగడంతో లక్ష కోట్ల రూపాయల విదేశీ మారకం వృథాగా మారుతోందని, దీన్ని అరికట్టేందుకు 70 లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
పనిమంతులు
అతివలే ‘ఉపాధి’ పనుల్లో మహిళలే ఎక్కువ● ఉమ్మడి మెదక్ జిల్లాలో జాబ్ కార్డులు 5.8లక్షలు ● కూలీలు 11.29లక్షలు ● వసతులు కల్పిస్తే సంఖ్య మరింత పెరిగే అవకాశం మహిళలు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాల్లోనే కాకుండా వ్యవసాయం, కూలీ పనుల్లోనూ చెమటోడ్చి కష్టపడుతున్నారు. గ్రామీణ నిరుపేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఓ వరం లాంటిది. ఉమ్మడి మెదక్ జిల్లా (2024–25)లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పని దినాలను ఉపయోగించుకుని భేష్ అనిపించారు. సాక్షి, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లాలో 5.8లక్షల జాబ్ కార్డులుండగా 11.29లక్షల మంది ఉపాధి కార్మికులున్నారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమైన కొత్తల్లో పురుషులే పనులకు వెళ్లేవారు. రానురాను క్రమంగా మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ పని దినాలను వినియోగించుకోవడంలో మహిళలలే ముందు వరుసల్లో నిలిచారు. ఉమ్మడి జిల్లాలో మహిళలు 90,88,784 పని దినాలను, పురుషులు 56,09,316 పని దినాలను ఉపయోగించుకున్నారు. నైపుణ్య శిక్షణ పథకంలో భాగంగా వంద రోజుల పని దినాలు పూర్తి చేసిన కుటుంబాల్లో యువతీ యువకులుంటే వారికి గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉన్నతి అనే పథకం ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. ఉన్నతి శిక్షణలో సైతం అనేక రకాల నైపుణ్యాలు నేర్చుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ శిక్షణతో మరింత రాణించి ఆర్థికంగా ముందుకు సాగుతున్నారు. మరిన్ని వసతులు కల్పిస్తే.. ఉపాధి హామీ పథకంలో కూలీలకు అన్ని వసతులు కల్పిస్తే మహిళల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. రోజుకు 3 నుంచి 5గంటల వ్యవధిలో రూ.307 వరకు సంపాధించుకునే ఆస్కారం ఉండడంతో వ్యవసాయ ఆధారిత కూలీలు సైతం ఉపాధి పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. -
తాగునీటి ఎద్దడి రాకుండా చూడండి
ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే వేసవి సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. మిషన్ భగీరథ పథకం అమలు చేస్తూనే పట్టణంలోని అన్ని బోర్లకు మోటార్లు బిగించి, నీటి సరఫరా పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ సరిగా చేపట్టకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. కాగా పట్టణంలో కరెంట్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఫిర్యాదులు వస్తున్నాయని, సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాయరావు చెరువు పంట కాల్వ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నిరంతర వైద్య సేవలు అందించాలి: డీఎంహెచ్ఓపాపన్నపేట(మెదక్): రోగులకు నిరంతర వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ శ్రీరాం వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం పాపన్నపేట పీహెచ్‌సీని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. జాతీయ కార్యక్రమాలు ఎయిడ్స్, పైలేరియా, కుష్టు, మలేరియా తదితర రోగాల నివారణకు వైద్య సిబ్బంది నిరంతర కృషి చేయాలని చెప్పారు. ఆయన వెంట డాక్టర్ హరిప్రసాద్, అన్వర్, సీహెచ్ఓ చందర్, శ్రీనివాస్‌రెడ్డి, వైద్య సిబ్బంది ఉన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో శనివారం ఆయా ప్రాంతాల్లో విద్యుత్ మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మెదక్ విద్యుత్ శాఖ ఏడీఈ మోహన్‌బాబు, పట్టణ ఏఈ నవీన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంలో పట్టణ ప్రజలు తమకు సహకరించాలని కోరారు. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు నర్సాపూర్ రూరల్: రాజకీయ పార్టీలకు కార్యకర్తలే పట్టుగొమ్మలని బీజేపీ రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు రమేష్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దచింతకుంటలో మండల పార్టీ అధ్యక్షుడు నీలి నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ క్రియాశీల సభ్యత్వ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజేష్, బూత్ అధ్యక్షులు సాయినాథ్, నాగరాజ్ పాల్గొన్నారు. నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు నర్సాపూర్ రూరల్: పట్టుదలతో పాటు నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్. ప్రకాష్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం నర్సా పూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువు పూర్తి కాగానే ఉద్యోగం రాలేదని నిరాశ చెందవద్దన్నారు. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్, వైస్ ప్రిన్సిపాల్ సమీరా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి సురేష్ కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మహనీయుడు జ్యోతిబా పూలే
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: కుల, మతాలకు అతీతమైన సమాజాన్ని నిర్మించడానికి యువత నడుం బిగించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని కలెక్టరేట్లో నిర్వహించగా.. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, వివిధ బీసీ సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పూలే దంపతులు సమాజ హితం కోసం పాటుపడ్డారని కొనియాడారు. ప్రభుత్వం సమీకృత గురుకులాలు ఏర్పాటు చేసి అన్నివర్గాల పిల్లలు విద్యనభ్యసించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజీవ్ యువ వికాస పథకం ద్వారా జిల్లాలో సుమారు 4,500 మందికి రూ. 50 కోట్లతో స్వయం ఉపాధి రుణాలు సబ్సిడీతో ఇస్తున్నామన్నారు. అనంతరం సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. సమాజ రుగ్మతలను రూపుమాపేందుకు జ్యోతిబా పూలే నిరంతరం పోరాడరని తెలిపారు. అంతకుముందు పట్టణంలోని ధ్యాన్‌చంద్ చౌరస్తాలో జ్యోతిబా పూలే విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్, సెక్రటరీ రాజ్‌కుమార్, డీపీఓ యాదయ్య, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది, జిల్లా బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారం, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు నోముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి హవేళిఘణాపూర్/మెదక్ కలెక్టరేట్: వర్షాలు కు రిస్తే ధాన్యం తడిసిపోకుండా రైతులకు టార్పాలి న్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మెదక్ మండల పరిధిలోని శివ్వాయిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రైతుల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలింపులో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో..మెదక్ మున్సిపాలిటీ: కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన గొప్ప మహనీయుడు మహాత్మ జ్యోతిబా పూలే అని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పూలే అంటరాని తనం, కుల వ్యవస్థ నిర్మూలనకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆశాలపై వేధింపులు ఆపాలి
మెదక్‌జోన్: మాతా, శిశు సంక్షేమ ఆస్పత్రిలో ఆశావర్కర్లకు రెస్ట్ రూంను కేటాయించడంతో పాటు డాక్టర్లు, నర్సులు, హోంగార్డుల వేధింపులు ఆపాలని ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కడారి నర్సమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మెదక్ ఎంసీహెచ్ ఎదుట 4 గంటల పాటు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాతా, శిశు సంక్షేమ ఆసుపత్రికి గర్భిణులు, బాలింతలను ఆరోగ్య తనిఖీలు, డెలివరీలకు గ్రామాల నుంచి ఆశావర్కర్లు తీసుకొస్తారని తెలిపారు. ఆ సమయంలో 2 నుంచి 4 రోజులపాటు ఆస్పత్రి లోనే ఉండాల్సి వస్తుందన్నారు. ఆస్పత్రి సిబ్బ ంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆశావర్కర్ల సమస్యలను వెంటనే పరి ష్కరించాలని, ఆస్పత్రిలో రెస్ట్‌రూం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
రైతులను ఆదుకోండి
సిద్దిపేటజోన్: పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. గురువారం కలెక్టర్ మనుచౌదరి, వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న, వరి, మామిడి పంట లను అకాల వర్షం తీవ్రంగా నష్టపరిచిందన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సూ చించారు. నష్టపోయిన రైతులకు రూ. 20 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
రైతులకు అండగా కాంగ్రెస్
ప్యాడీ క్లీనర్‌తో ధాన్యం శుభ్రం చేయాలికలెక్టర్ రాహుల్రాజ్హవేళిఘణాపూర్(మెదక్): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని శుభ్రం చేసిన తర్వాత విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం మెదక్ మండలం పాతూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు ప్యాడీ క్లీనర్‌తో ధాన్యం శుభ్రం చేయకపోవడం వల్ల రెండు, మూడు కిలోల తరుగుపోతుందన్నారు. రైతులు పంటలు కోసిన వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా చూడాలన్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. తేమ శాతం 17 ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ. 2,320, సాధారణ రకానికి రూ. 2,300 నిర్ణయించినందని వెల్లడించారు. జిల్లాలోని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులకు ధాన్యం విక్రయించవద్దని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.సంగారెడ్డి/జోగిపేట(అందోల్) : రైతులకు అండగా ఉండేది, వ్యవసాయాన్ని పండగగా మా ర్చింది కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. జోగిపేట్ డివిజన్లో గురువారం జరిగిన ఆత్మ కమిటీ ప్రమాణస్వీకారానికి మంత్రి హాజరై చైర్మన్ తిమ్మారెడ్డి గారి మల్లారెడ్డి తో పాటు 23 మంది డైరెక్టర్లను అభినందించారు. అంతకుముందు జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో అందోల్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత శ్రీ జోగినాథ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా జరిగిన శివ పార్వతుల కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఆలయ పూజారులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వా గతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సింగూరు లిఫ్టు ప్రాజెక్టు శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామ న్నారు. అందులో భాగంగానే రూ.170 కోట్లతో సీసీ లైనింగ్ పనులను చేపడుతున్నట్లు వివరించారు. మంత్రి దామోదర రాజనర్సింహ -
రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర
కొల్చారం(నర్సాపూర్)/కౌడిపల్లి: బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చి, దేశంలోని ప్రజలను మతాలు, కులాల వారీగా విభజించాలని చూస్తోందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ ఆరోపించారు. గురువారం మండలంలోని సంగాయిపేట నుంచి రంగంపేట అంబేడ్కర్ విగ్రహం వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశంగౌడ్, ఉపాధ్యక్షుడు గోవర్దన్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆగంగౌడ్, జిల్లా నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చందు, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, అనిల్ మధుసూదన్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, శేఖర్, మల్లారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. అలాగే కౌడిపల్లి మండలంలోని వెల్మకన్నలో నిర్వహించిన పాదయాత్రలో ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులుగౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
గ్యాస్ ధరలు తగ్గించాల్సిందే
గజ్వేల్: గ్యాస్ ధరలు తగ్గించేవరకు పోరాటం కొనసాగిస్తామని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి హెచ్చరించారు. గురువారం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇష్టానుసారంగా గ్యాస్ ధరలను పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ సామాన్యుల నడ్డి విర్తుస్తోందని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఒక్కో సిలిండర్‌పై రూ.50 ధరను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. -
వాన గుబులు.. రైతు దిగులు
మెదక్‌జోన్: అకాల వర్షం అన్నదాతను వెంటాడుతోంది. ఏటా మొలకనాడు ఎండ.. కోతనాడు వానతో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో వరి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న తరుణంలో వర్షాలు వణుకు పుట్టిస్తున్నాయి. గురువారం రేగోడ్‌లో భారీ వర్షం కురిసింది. మెదక్, చిన్నశంకరంపేట, తూప్రాన్ తదితర మండలాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొస్తున్న వేళ వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో ఇటీవల ప్రభుత్వం కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. వరి పంట కోసిన వారు వాన నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రోడ్ల వెంట ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్ద కాగా కుప్పలపై ప్లాస్టిక్ కవర్లు కప్పి ఉంచుతున్నారు. మరికొందరు వరి కోయాలా..? వద్దా అని ఆలోచిస్తున్నారు. వర్షం వస్తే పొలాల్లో పనులు సాగవని, హార్వెస్టర్లు దిగబడటంతో కోతలకు కష్టం అవుతుందంటున్నారు. గతేడాది ఇదే విధంగా వర్షం రావడంతో కొనుగోలు కేంద్రాల్లోనే వందల క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్ద అయింది. చాలా మంది రైతులు తడిసిన ధాన్యాన్ని అతి తక్కువ ధరకు మిల్లర్లకు విక్రయించి తీవ్ర నష్టాలు చవి చూశారు. ప్రస్తుత వర్షాలకు తేమశాతం రాకపోవడంతో నానా తంటాలు పడాల్సి వస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయాలంటే తేమ శాతం 17 ఉండాలి. లేనిచో నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయడానికి నిరాకరిస్తారు. గత నెలలో కురిసిన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి జిల్లాలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా 386 విద్యుత్ స్తంభాలు విరిగిపోగా 16 ట్రాన్స్ఫార్మర్లు విరిగిపోయాయి. ట్రాన్స్‌కోకు సుమారు రూ. 1.80 కోట్ల నష్టం వాటిల్లింది. అలాగే వందలాది రైతుల మోటార్లు కాలిపోయాయి. -
లబ్ధిదారులు అప్పుల పాలు కావొద్దు
మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావుహవేళిఘణాపూర్(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకొని అప్పుల పాలు కావొద్దన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. బుధవారం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న కొచ్చెరువు తండాలో ఆయన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అధికారుల నిబంధనల మేరకు నిర్మించుకుంటే స్థలం సరిపోకుండా ఉందని, చెల్లించాల్సిన డబ్బులు చెల్లిస్తే మిగితా డబ్బులు వేసి నిర్మించుకుంటామని లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వీలైనంత వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా చూడాలని ప్రజలకు సూచించారు. అనంతరం పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొజ్జ పవన్, శ్రీనివాస్, తండా వాసులు శ్రీనునాయక్, రెడ్యా, అమ్రియా తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేగుంట(తూప్రాన్): రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరగాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వడియారం, అనంతసాగర్, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూకం వేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్లైన్లో వెంటనే నమోదు చేసి సకాలంలో రైతులకు ధాన్యం డబ్బులు వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం రుక్మాపూర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహా ఆవిష్కరణలో పాల్గొన్నారు. అలాగే కసాన్పల్లి దౌల్తాబాద్ మండలం మాచిన్పల్లి సరిహద్దులోని రామాయంపేట కెనాల్‌ను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఉప కాల్వలు పూర్తి చేయించి చెరువుల్లో నీరు నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, ఎంపీడీఓ చిన్నారెడ్డి, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు స్వామి నాయకులు పాల్గొన్నారు. -
జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు
రామాయంపేట(మెదక్): అక్రమార్కుల ధన దాహానికి గుట్టలు కరిగిపోతున్నాయి. గత వారం రోజులుగా అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యారు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన మైనింగ్ రుసుముకు గండి పడుతోంది. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిని అనుకొని ఉన్న 1421 సర్వే నంబర్లో 764 ఎకరాల మేర ప్రభుత్వ భూములున్నాయి. పట్టణానికి దూరంగా ఉండటంతో పాటు ఆప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా నెలల తరబడి మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లు జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వెలుతుండటంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ఈ సర్వే నంబర్లో గుట్ట పైభాగంలో జేసీబీ తవ్వకాలతో పెద్దఎత్తున ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. గతంలో కలెక్టర్ రాహుల్‌రాజ్ సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి గాను స్థలం ఎంపిక కోసం వచ్చిన క్రమంలో ఈ గుంతలను పరిశీలించారు. కాగా జిల్లా పరిధిలో మట్టి తవ్వకాల విషయమై ఆయా మండలాల్లో అధికారులు కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తుండగా, రామాయంపేటలో మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయమై తహసీల్దార్ రజనికుమారి వివరణ కోరగా.. అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా మట్టి తవ్వితే సదరు వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తెలిపారు. -
నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్: సన్న బియ్యం పంపిణీని తాము స్వాగతిస్తున్నామని, అయితే నాణ్యమైన బియ్యం అందజేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పలు రేషన్ దుకాణాల ద్వారా పేదలకు అందజేస్తున్న సన్న బియ్యంలో 30 నుంచి 40 శాతం వరకు నూకలు వస్తున్నాయని తెలిపారు. మరికొన్ని దుకాణాల్లో సన్నబియ్యంలో దొడ్డు రకం బియ్యం కలిసి ఉంటున్నాయని వాపోయారు. నాణ్యమైన సన్న రకం బియ్యమే అందరికీ అందేలా చూడాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు ఇచ్చి వారికి సైతం సన్న బియ్యం అందించాలన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల సంఖ్యను కుదించవద్దని కోరారు. కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ దుకాణాలను కాంగ్రెస్ కార్యాలయాలుగా మారుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు అశోక్‌గౌడ్, భిక్షపతి, ప్రసాద్, ఆంజనేయులుగౌడ్, సద్దాం తదితరులు ఉన్నారు. -
సంతృప్తిగా సన్నబువ్వ
కలెక్టర్ రాహుల్రాజ్బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలుఎస్పీ ఉదయ్కుమార్రెడ్డిటేక్మాల్(మెదక్): సన్నబియ్యంతో భోజనం సంతృప్తిని ఇచ్చిందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం మండలంలోని చంద్రుతండాలో పంచాయతీ కార్మికుడు రమావత్ పీరియ ఇంట్లో సన్నబియ్యం భోజనం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీతో పేదలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. పేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. సన్నబియ్యం పంపిణీతో పేదవారి కళ్లలో స్వయంగా ఆనందాన్ని చూశానని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని అన్ని చౌక ధరల దుకాణాలకు సన్నబియ్యం స్టాక్ చేరినట్లు వివరించారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, తహసీల్దార్ తులసీరాం, ఎంపీడీఓ విఠల్, ఆర్ఐ సాయి శ్రీకాంత్, ఎంపీఓ రియజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రేపు అధికారికంగా పూలే జయంతి మెదక్ కలెక్టరేట్: ఈనెల 11వ తేదీన మహాత్మ జ్యోతిబా పూలే 199వ జయంతిని అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ధ్యాన్‌చంద్ చౌరస్తాలో గల జ్యోతిబా పూలే విగ్రహానికి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలు అధిక సంఖ్యలో పా ల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో క్రికెట్, మరే ఇతర బెట్టింగులకు పాల్పడినా, ప్రోత్సహించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి బంగారు భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని యువతకు సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్‌లతో అప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ సీజన్ ప్రారంభమైందని తెలిపారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై నిఘా పెట్టాలన్నారు. ఎవరైన బెట్టింగులకు పాల్పడినట్లుగా తెలిస్తే తక్షణమే డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 8712657888 నంబర్‌కు సమా చారం అందించాలని సూచించారు. -
చంద్రశేఖర్‌కు డాక్టరేట్
తూప్రాన్: పట్టణానికి చెందిన గౌడేల్లి రాములు, యశోద దంపతుల రెండవ కుమారుడు చంద్రశేఖర్ పీహెచ్డీ డాక్టరేట్ పట్టా సాధించాడు. ఆధునిక నావిగేషన్ ఎలక్ట్రానిక్స్‌లో పరిశోధన కొనసాగించి, ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో అత్యున్నత డిగ్రీ అయినా పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను పొందాడు. పరిశోధనకు సహకరించిన ప్రొఫెసర్లు, ఉద్యమకారులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎమ్మెల్సీ కవితను చంద్రశేఖర్ కలువగా ఆమె ప్రశంసించారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
జిల్లాపరిషత్ సీఈఓ ఎల్లయ్య టేక్మాల్(మెదక్): క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతగా పని చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య హెచ్చరించారు. మంగళవారం టేక్మాల్ మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, నిర్వహణ సక్రమంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అందరికీ అందేలా చూడాలన్నారు. రికార్డులు ఎప్పటికప్పుడూ పూర్తి చేస్తూ ఆన్లైన్ చేయాలన్నారు. ఆయన వెంట జిల్లాపరిషత్ డిప్యూటీ సీఈఓ రంగాచారి, ఎంపీడీఓ విఠల్ తదితరులు ఉన్నారు. వైద్య సేవలు అందుతున్నాయా? రామాయంపేట(మెదక్): ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరాం రోగులను ఆరా తీశారు. మంగళవారం మండలంలోని ప్రగతి ధర్మారంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి రోగులతో మాట్లాడారు. రోజూ ఎంతమంది రోగులు వస్తున్నారని, రక్త నమూనాలు సేకరించి మెదక్ ఆసుపత్రికి పంపుతున్నారా? అని సిబ్బందిని ప్రశ్నించారు. సక్రమంగా విధు లు నిర్వర్తించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు రికార్డులు పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిప్రియ, సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. నిరంతర సాధన చేయాలి చేగుంట(తూప్రాన్): విద్యార్థులు అనుకున్న లక్ష్యం చేరే వరకు నిరంతర సాధన చేయాలని గ్రూప్ 1 రాష్ట్ర స్థాయి ఎనిమిదో ర్యాంకు సాధించిన నిఖిత అన్నారు. చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆమెకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజుకు ఎనిమిది గంటలకు పైగా చదువుకోవడంతో ర్యాంకు సాధించానని చెప్పారు. నిఖితను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు బాగా చదువుకోవాలని ఎంఈఓ నీరజ సూచించారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి, ఉపాధ్యాయులు రాజేశ్వర్, సుధాకర్‌రెడ్డి, రాధా, రమ, లక్ష్మణ్, నరేందర్, శారద, వెంకటేశ్, భవానీ, రేఖ, శ్రీవాణి, సరస్వతి, ఉమామహేశ్వరి, రమేశ్, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు హవేళిఘణాపూర్(మెదక్): గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు ప్రజలకు మెరుగైన సేవలందించాలని డీపీవో ఎల్లయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తొగిట గ్రామాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ రికార్డులను, డంపింగ్‌యార్డు, మురుగునీటి కాలువలు, తాగునీటి సరఫరా గురించి అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజలు చెత్తను బయట వేయకుండా ఇంటి వద్దకు వచ్చే చెత్తబండిలోనే వేయాలని ఆయన సూచించారు. డీపీవో వెంట పంచాయతీ సెక్రటరీ శారద, సిబ్బంది ఉన్నారు. -
చిన్న తరహా పరిశ్రమలతో ఉపాధి
చేగుంట(తూప్రాన్): గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాలిటెక్నిక్‌తో చదువును ఆపేయాల్సి వస్తే చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందవచ్చని జిల్లా ఇండస్ట్రీయల్ సెంటర్ జీఎం ప్రకాశ్ అన్నారు. చేగుంటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ తృతీయ సంవత్సరం విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఉపాధి అవకాశాలు ఎంచుకొని ముందుకు సాగాలన్నారు. నెపుణ్యాలను బట్టి ప్రైవేట్ పరిశ్రమల్లో సైతం ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందన్నారు. పాలిటెక్నిక్‌తో ఉన్నత చదువులు చదివేవారు మంచి ఉద్యోగం సాధించే వరకు చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సంగీత, ప్రిన్సిపాల్ చక్రవర్తి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
18 రోజులు.. రూ.8లక్షలు
ఇందిరమ్మ ఇళ్లలో నాణ్యతకు ప్రాధాన్యం కలెక్టర్ రాహుల్‌రాజ్ అధిక బిల్లులు వేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు నర్సాపూర్: తన భర్త రోడ్డు ప్రమాదంలో గాయపడితే స్థానిక కేఏకే ఆసుపత్రిలో చేర్పించగా అడ్డగోలుగా బిల్లులు వసూలు చేశారని పట్టణానికి చెందిన బైల్పాటి లక్ష్మి ఆరోపించింది. మంగళవారం ఆమె ఆసుపత్రి వద్ద విలేకరులతో మాట్లాడారు. తన భర్త గణేశ్ జనవరి 8న రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైతే స్థానిక కేఏకే ఆసుపత్రిలో చేర్పించగా 18 రోజుల పాటు వైద్యం చేసి రూ.8లక్షల బిల్లు వేశారని తెలిపారు. ఏమాత్రం నయం కాలేదని, బిల్లు మొత్తం చెల్లించి సంగారెడ్డిలోని మరో ఆసుపత్రికి వెళ్లి అక్కడ వారం రోజుల పాటు వైద్యం చేయించినా ప్రయోజనం లేకపోవడంతో ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించామని చెప్పింది. కాగా కేఏకే ఆసుపత్రిలో వారిష్టమున్నట్టు టెస్టులు చేయించారని, వాటికి ఎక్కువ ధరలు వసూలు చేశారని ఆమె ఆరోపించారు.అప్పులు చేసి మరీ బిల్లులు చెల్లించామన్నారు. కాగా ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చానని, తమకు జరిగిన అన్యాయం నాయకులకు వివరించి తనకు న్యాయం చేయాలని అభ్యర్థిచండానికి వచ్చానన్నారు. తాను వచ్చే సరికి అందరూ వెళ్లిపోయారని విచారం వ్యక్తం చేశారు. తమకు అన్యాయం జరిగిందని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని లక్ష్మి ప్రభుత్వ అధికారులను, నాయకులను కోరింది. ఈ విషయమై ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ హసన్బాషాను వివరణ కోరగా బైలపాటి గణేశ్ విషయం తనకు తెలియదని, అతనికి వైద్యం చేసిన డాక్లర్లు ప్రస్తుతం అందుబాటులో లేరని చెప్పారు. రామాయంపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలోని దామరచెరువులో ఇళ్ల నిర్మాణం, రామాయంపేటలో నిర్మించిన మాడల్ హౌజ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువులోగా ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇళ్ల నిర్మాణ పనులు నాణ్యతగా త్వరగా పూర్తయ్యేలా చూడాలని, ఈ మేరకు లబ్ధిదారులను చైతన్యపర్చాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పుకోవాలన్నారు. అనంతరం ఈ పథకానికి సంబంధించి హెల్ప్‌డెస్క్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట గృహ నిర్మాణశాఖ పీడీ మాణిక్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ద్రాక్ష.. ఏదీ రక్ష!
ఉమ్మడి జిల్లాలో సాగు కనుమరుగు!● సొంత రాష్ట్రంలో అంతరిస్తున్న దుస్థితి ● పొరుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న ‘వైన్ టూరిజం’ ● సాగు పెంపుపై ఉద్యాన, హార్టికల్చర్ ప్రత్యేక కార్యాచరణతెలంగాణలో పుట్టిన ద్రాక్ష కనుమరుగు దశకు చేరుకుంటోంది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో మాత్రం జోరుగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ‘వైన్ టూరిజం’ పేరిట పర్యాటకులను ఆకర్షించే స్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణలో పూర్వవైభవానికి ఏం చేద్దాం..? అంటూ ఉద్యాన శాఖ, హార్టీల్చర్ యూనివర్సిటీలు సమష్టి కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. గజ్వేల్: దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోనే ద్రాక్ష సాగుకు బీజం పడింది. 1890లో ఎనాబ్–ఇ–సాహి ద్రాక్ష రకాన్ని హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ బక్వీర్ అనే వ్యక్తి సాగు చేశారు. ఆ తర్వాత కాలం 1960లో దివంగత హార్టికల్చరిస్ట్ శంకర్పిల్లై ఇదే రకాన్ని అభివృద్ధి చేసి నగరంలో సాగు చేశారు. హెక్టారుకు 105 టన్నుల దిగుబడిని సాధించి ప్రపంచ రికార్డు సాధించారు. దీని ద్వారా ద్రాక్ష సాగుకు తెలంగాణ పుట్టినిల్లుగా మారింది. ఇదే క్రమంలో పదిహేనేళ్ల క్రితం వరకు రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలే ఈ తోటల సాగుకు ఆధారంగా ఉండేవి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా కొంత విస్తీర్ణం సాగయ్యేది. ఆయా జిల్లాల్లో మొత్తంగా ఏటా 50వేల ఎకరాలకుపైగా తోటలు సాగులోకి వచ్చేవి. విదేశాలకు ఎగుమతి చేసేందుకు దోహదపడే రకాలను ఇక్కడి రైతులు ప్రధానంగా సాగుచేసేవారు. విదేశాలకే కాకుండా ఇక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కూడా ద్రాక్ష ఎగుమతి అయ్యేది. సాధారణంగా ఎకరా ద్రాక్ష తోట సాగు చేయాలంటే నిపుణులైన కూలీలు, ఎరువులు, ఫంగీసైడ్స్, ఇతర అవసరాలు కలుపుకొని ఎకరాకు రూ.10లక్షల వరకు పెట్టుబడి అవసరముంటుంది. ఇంత భారీ పెట్టుబడి పెట్టినా 2006 వరకు రైతులు లాభాలు బాగానే గడించారు. ఆ తర్వాత కాలంలో తోటలు తెగుళ్ల బారిన పడటం వరుసగా చోటుచేసుకుంది. దీంతో రైతులు భారీగా నష్టాలు చవిచూశారు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి కూడా వారికి ప్రోత్సాహాం కరువైంది. ఈ దశలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకొని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో రైతులు ద్రాక్ష తోటలు తొలగించి ప్లాట్లుగా మార్చారు. కనుమరుగు దశకు.. పదిహేనేళ్ల క్రితం రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌తోపాటు పలు జిల్లాల్లో 50వేల ఎకరాల్లో ఉన్న సాగు.. నేడు 400ఎకరాలకే పరిమితమయ్యింది. గతంలో వేలాది మంది రైతులుండగా, నేడు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 25మంది రైతులు మాత్రమే సాగు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితి వల్ల రాష్ట్రంలో ద్రాక్ష కనుమరుగు దశకు చేరుకుంటోంది. మహారాష్ట్ర, కర్నాటకల్లో వైన్ టూరిజం..ప్రస్తుతం మన రాష్ట్ర అవసరాలకు మహారాష్ట్ర నుంచి ద్రాక్షను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాకుండా అక్కడి ప్రభుత్వం రైతులకు విరివిగా సబ్సిడీలను అందిస్తుండటంతో సాగు క్రమంగా పెరుగుతోంది. మరో ముఖ్యమైన అంశమేమిటంటే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ‘వైన్ టూరిజం’ ట్రెండ్ కొనసాగుతోంది. ద్రాక్ష తోటలు సాగుచేస్తున్న రైతులు.. తమ తోటలను ‘ఎకో టూరిజం’ ప్రాంతాలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. తోట ల్లో ఎక్కువగా వైన్ వైరెటీగా చెప్పుకునే రేసిన్ రకం ద్రాక్షను సాగు చేస్తున్నారు. అంతేకాకుండా తోటల్లోనే వైన్ ఉత్పత్తి యూనిట్లను సైతం ఏర్పాటుచేసి.. తమ తోటల్లో వచ్చే పర్యాటకులకు తక్కువ ధరకు వైన్ అందిస్తున్నారు. ప్రస్తుతం లిక్కర్‌కు వైన్‌ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. లిక్కర్లో అల్కాహాల్ శాతం 46శాతం వరకు ఉంటే వైన్‌లో కేవలం 8–10శాతం అల్కాహాల్ ఉండటం వల్ల ప్రత్యేకించి యువతతోపాటు అన్ని వయసుల వారు వైన్ సేవించడానికి మక్కువ చూపుతున్నారు. తమ కళ్లముంగిటే సహజమైన పద్ధతుల్లో వైన్ దొరుకుతుండటంతో దీనిని ఇష్టంగా సేవిస్తున్నారు. -
చిన్నారులకు వైద్య పరీక్షలు
అంగన్వాడీ కేంద్రాల్లో... ● శారీరక, మానసిక ఎదుగుదలపై కూడా ● పిల్లల మానసిక స్థితిపై తల్లికి 42 ప్రశ్నలు ● సమస్య ఉన్నట్లు తేలితే వైద్యం ● మూడునెలల పాటు కొనసాగనున్న చెకప్ మెదక్‌జోన్: అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో పాటు పూర్వ ప్రాఽథమిక విద్య నేర్చుకుంటున్న ఆరేళ్లలోపు చిన్నారులకు వైద్య పరీక్షలు ప్రారంభించారు. కంటిచూపుతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలపై కూడా పరీక్షలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి చిన్నారుల తల్లులకు వైద్య సిబ్బంది 42 ప్రశ్నలు అడుగుతున్నారు. మూడు నెలల పాటు కొనసాగే వైద్య పరీక్షల్లో పిల్లలకు ఏదైనా లోపం ఉన్నట్లు తేలితే వెంటనే వైద్యం అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,076 అంగన్వాడీ కేంద్రాల్లో 52,619 మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. కాగా వారికి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే) ఆధ్వర్యంలో కంటిచూపుతో పాటు శారీరక, మానసిక ఎదుగుదల పై వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నారుల తల్లులకు 42 ప్రశ్నలు సంధిస్తూ మీ బాబు, లేదా పాప పాలుతాగడం, వినికిడి శబ్దం ఎలా ఉంది? ఆహారం ఏవిధంగా తీసుకుంటున్నాడు? కారణం లేకుండా ఏడ్వటం, ఫిట్స్, ఆకస్మిక కదలికలు, సృహతప్పటం, ఇతరపిల్లలతో పోల్చితే ముఖకవలికలు భిన్నంగా ఉన్నాయా? శారీరక వైకల్యం ఉందా? ఇలా మొత్తం పలు అంశాలపై తల్లులకు ప్రశ్నలు వేస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏప్రిల్, మే, జూన్‌లో పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేసి ఎలాంటి లోపం ఉన్నా వెంటనే చికిత్స చేస్తారు. ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే పెద్దాసుపత్రికి రెఫర్‌చేసి చికిత్స అందించనున్నారు. గతేడాది 741 మందికి ఎదుగుదల లోపం గతేడాది జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో తీవ్ర, అతితీవ్రలోపం పోషణతో 741 మంది చిన్నారులను గుర్తించారు. వారి కోసం ప్రత్యేకంగా గుడ్లు, బాలామృతాన్ని అందించారు. కాగా 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు సాధారణ పిల్లలకు నెలకు 16 గుడ్లతో పాటు బాలామృతాన్ని ఇస్తారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే 3నుంచి 6 ఏళ్ల పిల్లలకు రోజుకో గుడ్డుతో పాటు భోజనం వండి పెడతారు. ఆర్బీఎస్కే చిన్నారులకు వరం! ప్రతిఏటా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే)ద్వారా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సమస్యలు ఉన్న వారికి వైద్యం అందిస్తున్నారు. గడిచిన మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 64,933 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,155 మంది కంటి సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించి 2,858 మందికి కళ్లద్దాలను అందజేశారు. మిగతా 297 మంది తీవ్రమైన సమస్యలు ఉన్నాయని, మరికొన్ని పరీక్షలు నిర్వహించి అవసరమైతే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని ఆర్బీఎస్కే సిబ్బంది తెలిపారు. మూడు నెలల్లో పూర్తి... జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కంటిచూపుతో పాటు శారీరక, మానసిక స్థితిపై వైద్య పరీక్షలను ఈనెల 7న, ప్రారంభించాం. మూడు నెలల్లో పూర్తి చేస్తాం. అనారోగ్య సమస్యలు ఉన్న పిల్లలను గుర్తించి వారికి వైద్యం అందిస్తాం. – మాధురి, ప్రోగ్రాం ఆఫీసర్, ఆర్బీఎస్కే -
పరిహారం అందించేందుకే సర్వే..
శివ్వంపేట(నర్సాపూర్): ట్రిబుల్ ఆర్ కోసం కేటాయించిన భూముల్లో అధికారులు సర్వే చేశారు. మండలంలోని లింగోజిగూడ, కొత్తపేట, రత్నపూర్, పాంబండ, పోతులబోగూడ, కొంతన్‌పల్లి గ్రామాల్లో ట్రిబుల్ ఆర్ లో రైతులు భూములు కోల్పోతున్నారు. ఆర్ఐ కిషన్, సర్వేయర్ అరుణ్‌కుమార్, పంచాయతీ రాజ్ సిబ్బంది మంగళవారం లింగోజిగూడ గ్రామంలో సర్వే చేపట్టారు. ట్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో రైతులకు సంబంధించి బోరుబావులు, పైపులైన్, చెట్ల వివరాలు నమోదు చేశారు. భూములతో పాటు ఇతర కట్టడాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతులకు పరిహారం అందిస్తామని, అందుకు గాను ఆ భూముల్లో సర్వే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
డీసీసీబీకి అవార్డు
పాపన్నపేట(మెదక్): పాపన్నపేట డీసీసీబీ బ్యాంకుకు 2024–25 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ ప్రతిభ అవార్డు లభించింది. ఈ మేరకు సోమవారం సంగారెడ్డిలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవెందర్ రెడ్డి, సీఈఓ శ్రీనివాస్, డీడీఎం కృష్ణ తేజ, నిఖిల్ కుమార్ చేతుల మీదుగా బ్యాంక్ మేనేజర్ కిషన్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ తాను పాపన్నపేటలో బాధ్యతలు చేపట్టేనాటికి రూ.31 కోట్ల బిజినెస్ కొనసాగేదని, ఇప్పుడు రూ.51.5 కోట్లు దాటిందన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. -
ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
సన్న బియ్యం పేదలకు వరంకలెక్టర్ రాహుల్‌రాజ్ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం కొల్చారం(నర్సాపూర్): సన్న బియ్యం పథకం నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమ వారం మండల పరిధిలోని రాంపూర్‌లో పారిశుద్ధ్య కార్మికుడు దుర్గారాజు ఇంటిలో కలెక్టర్ భోజనం చేశారు. కుటుంబ సభ్యుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 520 రేషన్ షాపులకు గాను 7 లక్షల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యత గల సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. గతంలో దొడ్డు బియ్యం రేషన్ షాపుల ద్వారా తీసుకొని బయట విక్రయించే వార న్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఎంపీడీఓ రఫీ ఉన్నిసా, తహసీల్దార్ గఫార్‌మియా, ఎంపీఓ కష్ణవేణి, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. త్వరలోనే ఇంటర్ ఫలితాలు మెదక్‌జోన్: త్వరలోనే ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నాయని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. సోమవారం పట్టణంలోని బాలుర జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఇంటర్ మూల్యాంకన సెంటర్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగిసిందని.. ప్రస్తుతం రీకౌంటింగ్, రీవాల్యువేషన్ ప్రక్రియ నడుస్తుందన్నారు. కాగా 690 మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొని దాదాపు 1.87 లక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేశారని తెలిపారు. అంతకు ముందు కలెక్టర్ టెలీ కాన్ఫరెనన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. రాజీవ్‌యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిజాంపేట(మెదక్): రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని కె. వెంకటాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం రైతులను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ హయా ంలో నిరుపేదలకు సన్న బియ్యంతో పాటు ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తేమశాతం 17 ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. రామాయంపేటలో రూ. 200 కోట్లతో సమీకృత గురుకులం పనులు ప్రారంభించనున్న ట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్‌రావు, మండల డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, మండల వ్యవసాయ అధికారి సోమ లింగారెడ్డి, ఎంపీడీఓ రాజిరెడ్డి, నాయకులు మహేందర్, లింగంగౌడ్, అమరసేనారెడ్డి, అజయ్, సామల మహేష్ వెంకటేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.నర్సాపూర్ రూరల్: మండలంలోని తుజాల్పూర్లో సోమవారం డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. దానిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడిపై ఉందని గుర్తుచేశారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గుప్త, బ్లాక్ కాంగ్రెస్ రిజ్వాన్, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, నాయకులు సుధీర్‌గౌడ్, మోహన్దాస్గౌడ్, మాజీ ఎంపీటీసీ మేఘమాల, కిషన్ పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడాలి
డీబీసీడబ్ల్యూఓ జగదీష్కౌడిపల్లి(నర్సాపూర్): హాస్టల్ విద్యార్థులు శ్రద్ధగా చదివి జీవితంలో ఉన్నతస్థాయిలో స్థిరపడాలని జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి జగదీష్ అన్నారు. సోమవారం రాత్రి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో వసతిగృహ సంక్షేమాధికారి ప్రణయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. హాస్టల్లో అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్‌తో పాటు పైచదువులు బాగా చదివి తల్లిదండ్రులు, హాస్టల్‌కు మంచిపేరు తేవాలన్నారు. అనంతరం టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్టల్లో మెరుగైన సదుపాయలు ఉన్నాయన్నారు. కార్పొరేట్ స్థాయిలో వార్షికోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో హెచ్‌డబ్ల్యూఓల సంఘం జిల్లా అధ్యక్షుడు శేషాచారి, ఎస్టీ ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజ్, జిల్లాలోని వివిధ హాస్టల్ల హెచ్‌డబ్ల్యూఓలు శేఖర్, మహేందర్, నవీన్, స్వామి, ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ మాజీ చైర్మన్ జగన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కొమురవెల్లి నూతన ఈఓగా అన్నపూర్ణ
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఈఓగా అన్నపూర్ణ బాధ్యతలు స్వీకరించారు. అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామాంజనేయులును దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో నగరంలోని చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి దేవాస్థానం అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణకు మల్లన్న ఆలయ ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు అన్నపూర్ణ సోమవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్ రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు -
ఎకై ్సజ్ కార్యాలయం ఏదీ?
అల్లాదుర్గం(మెదక్): 2016 పునర్విభజనలో భాగంగా అల్లాదుర్గంలో ఎకై ్సజ్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. తొమ్మిదేళ్లు గడిపోయినా ఇప్పటికీ మంజూరు కాలేదు. ఎకై ్సజ్ అధికారులు ఇక్కడి రావాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో కల్తీ కల్లు, గంజాయి విక్రయంపై నిఘా కొరవడిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం అల్లాదుర్గంలో సబ్ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేసింది. అల్లాదుర్గం సర్కిల్ కేంద్రంగా టేక్మాల్, రేగోడ్, పెద్దశంకరంపేట మండలాలను కలుపుతూ పోలీస్ సర్కిల్ కార్యాలయం, పంచాయతీరాజ్, ఇరిగేషన్ సబ్ డివిజన్, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాలతో పాటు, జూనియర్ సివిల్ ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పునర్విభజనకు ముందు ఈ మండలాలు జోగిపేట సర్కిల్ పరిధిలో ఉండేవి. కాగా అల్లాదుర్గంలో పోలీస్ సర్కిల్ కార్యాలయం 2016లోనే ఏర్పాటు చేశారు. ఎకై ్సజ్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. అయితే అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో అది కలగానే మిగిలింది. అయితే అల్లాదుర్గంలో కార్యాలయం ఏర్పాటు చేయడానికి పాత పోలీస్‌స్టేషన్ భవనం వాడుకోవచ్చని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ భవనం వృథాగా ఉందన్నారు. ఇదే విషయమై జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా.. అల్లాదుర్గంలో ఎకై ్సజ్ కార్యాలయం మంజూరుకు గతంలో ప్రతిపాదనలు పంపిన విషయం వాస్తవమేనని అన్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం కొన్నిస్టేషన్లను మంజూరు చేసిందని.. జిల్లాకు మాత్రం మంజూరు కాలేదన్నారు. జిల్లాలో గంజాయి సాగు చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కల్తీ కల్లు విక్రయాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. రహదారుల పక్కన కల్లు విక్రయించకూడదని అన్నారు. తొమ్మిదేళ్ల క్రితం ప్రతిపాదనలు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు -
తగ్గని చికెన్ ధరలు
మెదక్ పట్టణం ఆటోనగర్‌లోని ఓ చికెన్ సెంటర్లో బర్డ్‌ఫ్లూ వైరస్‌కు (రెండు నెలల) ముందు నిత్యం 10 క్వింటాళ్ల చికెన్ విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం రోజుకు క్వింటాల్ చికెన్ మాత్రమే విక్రయిస్తున్నారు. గతంలోనూ కిలో చికెన్ ధర రూ. 180 పలకగా, ప్రస్తుతం దాని ధర రూ. 210కి చేరింది. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 90 శాతం చికెన్ విక్రయాలు పడిపోయాయి. అయినా ధర ఏ మాత్రం తగ్గలేదు. – మెదక్‌జోన్ ఎన్ని అవాంతరాలు ఎదురైనా బ్రాయిలర్ కోడి ధర తగ్గేదేలే అంటోంది. మొన్నటి వరకు బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్ మార్కెట్ భారీగా పతనమైన విషయం తెలిసిందే. భారీ నష్టాలతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకానికి దూరం అయ్యారు. దీంతో డిమాండ్‌కు తగిన సప్లై లేక ఈ మధ్య చికెన్ ధర అమాంతం పెరిగింది. రెండు నెలల క్రితం చికెన్ అంటేనే జనం జంకే పరిస్థితులు ఉండేవి. ఈ క్రమంలో కిలో చికెన్ ధర రూ.150కు పడిపోయింది. బర్డ్‌ఫ్లూ భయం పోగొట్టేందుకు ఫాల్ట్రీ యజమానులు చికెన్ వంటకాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. అయినా మార్కెట్ పుంజుకోలేదు. జిల్లావ్యాప్తంగా 3 వేల పైచిలుకు కోళ్ల ఫారాలు ఉండగా, వీటి ఆధారంగా వేలాది మంది రైతులతో పాటు కూలీలు జీవనం సాగిస్తున్నారు. కాగా ఫిబ్రవరిలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపటంతో చాలా వరకు చికెన్ తినడం మానేశారు. ఇక మార్చిలో అంతుచిక్కని వైరస్‌తో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. మార్కెట్లో చికెన్ విక్రయాలు తగ్గటంతో సదరు కంపెనీకి చెందిన నిర్వాహకులు సైతం వాటిని ఫారాల్లోనే వదిలేశారు. దీంతో కోళ్ల ఫారం నిర్వాహకులు వైరస్ సోకిన కోళ్లను గుంతలు తీసి పూడ్చిపెట్టారు. అయితే పలు కంపెనీల నిర్వాహకులు కోడి పిల్లలతో పాటు దాణను సమకూరుస్తారు. కోళ్లను పెంచిన ఫౌల్ట్రీ రైతుకు వాటి బరువును బట్టి కమీషన్ ఇస్తుంటారు. కాగా 2 నెలలుగా కోళ్లు చనిపోవటంతో పోషకులకు కమీషన్ ఇవ్వడం మానేశారు. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. కోడి పిల్లలు తీసుకోండి.. బర్డ్‌ఫ్లూతో సుమారు 2 నెలల పాటు కోళ్ల ఫారాలు కూనరిల్లాయి. ఇక వైరస్ పోయింది.. కోడి పిల్లలను తీసుకోవాలని సదరు కంపెనీల నిర్వాహకులు కోళ్లపెంపకం దారులను కోరుతున్నట్లు తెలిసింది. అయితే ఒక బ్యాచ్ కోళ్లు పెరగాలంటే 50 నుంచి 55 రోజుల గడువు పడుతుండటంతో అప్పటిలోగా పూర్తిగా సమసిపోతాయని రైతులకు నచ్చచెబుతున్నారు. అయినప్పటికీ రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్రజల్లో పూర్తిస్థాయిలో భయం పోయి చికెన్ తినటం ప్రారంభించినప్పుడే కోళ్లను పెంచటం మంచిదని భావిస్తున్నట్లు తెలిసింది. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో కోళ్ల పరిశ్రమలకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. దీంతో 90 శాతం చికెన్ విక్రయాలు తగ్గాయి. అయితే చికెన్ ధరలు ఏమాత్రం తగ్గటం లేదు. మార్చిలో రంజాన్ నేపథ్యంలో కిలో చికెన్ ధర రూ. 280 పలికింది. హలీం తయారీ కోసం చికెన్ ఎక్కువగా ఉపయోగించటంతో చికెన్ ధర భారీగా పెరిగిందని పలువురు చెబుతున్నారు. అయితే వారం రోజులుగా కాస్త ధర తగ్గి ప్రస్తుతం కిలో ధర రూ. 210 పలుకుతోంది. -
కేతకీ ఆలయాభివృద్ధికి కృషి
● ఎంపీ సురేశ్ షెట్కార్ ● నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం ఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ హామీనిచ్చారు. నూతనంగా ఏర్పాటైన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఆలయంలో నిర్వహించారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఆయన గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ...ఆలయానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి పాటుపడతానన్నారు. అభివృద్ధి జరిగితేనే మరింతగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, సునీతా పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
బీటీ రణదివెకు నివాళి
మెదక్ కలెక్టరేట్: భారత కార్మికవర్గ ఐక్య పోరాటాల రథసారధి బీటీ రణదివె వర్ధంతిని ఆదివారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో నిర్వహించారు. ఈసందర్భంగా ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ.. రణదివె మరణించే వరకూ ట్రేడ్ యూనియన్ ఉద్యమమే ఊపిరిగా సాగిందన్నారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని కొనియాడారు. ఉద్యమాల్లో భాగంగా అనేకసార్లు జైలు జీవితం గడిపారని తెలిపారు. కార్మికుల ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత జీవితం పట్ల ఆసక్తి లేని నిస్వార్థ కార్మిక నేత రణదివే అని కొనియాడారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మల్లేశం, సంతోష్, అజయ్, చౌకత్, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
కలెక్టర్ రాహుల్రాజ్కాలువలు నిర్మించే వరకు పోరాటంటేక్మాల్(మెదక్): గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సిబ్బంది హాజరు, ఓపీ రిజిస్టర్, మందులను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలన్నారు. సమయపాలనతో విధులు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఓవర్ లోడింగ్ తదితర విషయాల గురించి విద్యుత్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కోతలు లేని విద్యుత్ అందించాలని ఆదేశించారు. అనంతరం కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి ఆరా తీశారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వేగవంతంగా సన్నబియ్యం సరఫరా పాపన్నపేట(మెదక్): పండుగ పూట కలెక్టర్ తన విధులు నిర్వర్తించారు. ఆదివారం సెలవు అయినప్పటికీ పాపన్నపపేట సివిల్ సప్లై గోదాం తనిఖీ చేశారు. సన్న బియ్యం నాణ్యత, నిల్వలను పరిశీలించారు. సన్నబియ్యం పంపిణీ నిరాటంకంగా కొనసాగించాలని సూచించారు. స్టేజ్ వన్ కాంట్రాక్టర్లు బియ్యం వేగంగా పంపిణీ చేయాలన్నారు. అంగన్వాడీలు, హాస్టళ్లు, రేషన్ కార్డుదారులకు ఎంత బియ్యం అవసరమవుతాయన్న వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అందుకనుగణంగా బియ్యం నిల్వలు ఉంచాలని ఆదేశించారు. దుబ్బాకరూరల్: నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూర్తి చేసేవరకు పోరాడుతామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం పోతా రం గ్రామంలో ఎమ్మెల్యే దంపతులు సీతారాముల కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయని అన్నారు. ఇంకా అక్కడక్కడా కాలువలు పూర్తి కాలేదని వాటిని పూర్తి చేసే దాకా పోరాడుతానని తెలిపారు. శ్రీరామనవమి రోజున తన సొంత గ్రామమైన పోతారం చెరువుకు నీళ్లు రావడం సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండా లని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో నిండిన చెరువును పరిశీ లించారు.ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి -
కాంగ్రెస్‌తోనే సంక్షేమం
మనోహరాబాద్(తూప్రాన్): కాంగ్రెస్‌తోనే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కాళ్లకల్, లింగారెడ్డిపేట, కూచారం గ్రామాల్లో రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెంటాగౌడ్, వీరబోయిన గోపాల్, సత్యనారాయణ, ర్యా కల కృష్ణాగౌడ్, లక్ష్మీనర్సింలుగౌడ్, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోనాపూర్ పీఏసీఎస్‌లో నిధుల దుర్వినియోగం! రామాయంపేట(మెదక్): మండలంలోని కోనాపూర్ సహకార సంఘంలో పెద్దఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. సుమారు రూ. 2 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు గ్రామస్తులు గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం ఫైల్ ముందుకు కదిలింది. సంగారెడ్డి అసిస్టెంట్ రిజిస్ట్రార్ విచారణ అధికారిగా సహకారశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈమేరకు ఆయన పలు దఫాలుగా విచారణ నిర్వహించారు. గ్రామంలో సంఘం డైరెక్టర్లు, మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఇదే విషయమై జిల్లా సహకార అధికారి కరుణాకర్‌ను సంప్రదించగా, తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదన్నారు. విచారణ అధికారిగా నియమితులైన సంగారెడ్డి అసిస్టెంట్ రిజిస్ట్రార్ నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని పేర్కొన్నారు. నియామక ఉత్తర్వులు పాపన్నపేట(మెదక్): మండలంలోని కొడుపాకకు చెందిన పంతుల సంతోష్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్‌గా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఎంటెక్ పూర్తి చేసిన ఆయన ఇటీవల వెలువడిన ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించారు. సంతోష్ సోదరుడు టీచర్‌గా పనిచేస్తున్నారు. మారుమూల గ్రామం నుంచి డీఏఓగా ఎంపిక కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దుర్గమ్మా.. దండాలమ్మా పాపన్నపేట(మెదక్): ఏడుపాయల పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున అమ్మవారిని పూజారులు పట్టువస్త్రాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఒడి బియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
కల్యాణ వైభోగమే..
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025శ్రీరామనవమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అభిజిత్ లగ్నంలో రామచంద్రమూర్తి సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు. అలయ పూజారి మధుసూదనాచార్యులు కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, కలెక్టర్ రాహుల్‌రాజ్ దంపతులు, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షుడు బండ నరేందర్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. – మెదక్ మున్సిపాలిటీ -
అనుమతి లేకుండానే నిర్మాణాలు
మంజీరా నది ఒడ్డు నుంచి ఇరువైపులా 100 మీటర్ల మేర బఫర్‌జోన్‌లో పరిధిలోకి వస్తుంది. ఇందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. అవసరమైన నిర్మాణం చేయాలనుకుంటే, ఇరిగేషన్ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అలాగే బఫర్ జోన్లో ఉన్న భూములను రెవెన్యూ అధికారులు నాలాగా మార్చొద్దు. వ్యవసాయ భూములను గుంటల్లో రిజిస్ట్రేషన్ చేయొద్దు. కానీ కాసులకు కక్కుర్తి పడిన రెవెన్యూ అధికారులు ఆ పనీ చేశారు. డీటీసీపీ లే అవుట్లు లేకుండానే ఎకరాల కొద్ది భూమిని ప్లాట్లుగా మార్చారు. పంచాయతీ కార్యదర్శులు సైతం అక్రమ నిర్మాణాలకు దర్జాగా అనుమతులిచ్చారు. గతంలో నాగ్సాన్పల్లి కార్యదర్శిగా ఉన్న నవీన్, ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న దుర్గాభవాని సుమారు 8 అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చినట్లు తెలిసింది. ఇందులో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి. లాడ్జీలు నిర్మించారు. రాళ్ల భూములను చదును చేసే క్రమంలో భారీ బండరాళ్లను నిషేధిత డిటోనేటర్లతో పేల్చారు. పగిలిన రాళ్లను మంజీరా నదిలో వేస్తున్నారు. దీంతో మంజీరా పరివాహ ప్రదేశం తగ్గి వరదలు వచ్చినప్పుడు, దిగువన ఉన్న ఆలయం, పక్కన ఉన్న నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అక్రమ భవనాలకు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో మురికి నీరు మంజీరా నదిలో కలుస్తుంది. అదే నీటిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. చిత్రమేమిటంటే నది ఒడ్డున దేవాదాయ శాఖ నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లకు సైతం ఎన్ఓసీ తీసుకోలేదని సంబంధిత అధికారి తెలిపారు. సర్వే నంబర్ 1 నుంచి 8లో సైతం అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. అయితే ఈ విషయమై కొల్చారం మండల అధికారులు విచారణ జరపాలనే డిమాండ్ ఉంది. ఇదే విషయమై నాగ్సాన్పల్లి పంచాయతీ కార్యదర్శి దుర్గాభవానిని వివరణ కోరగా.. నేను ఒక నిర్మాణానికి ఎన్ఓసీ లేకుండా అనుమతి ఇచ్చాను. అంతకుముందు పనిచేసిన నవీన్ ఇతర నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని చెప్పారు. -
కళలు, సంప్రదాయాలను ప్రోత్సహిద్దాం
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుసిద్దిపేటజోన్: కళలు, సంప్రదాయాలను ప్రోత్సహించి, భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవస రం ఎంతైనా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామలీల గేయ రామాయణ వాగ్గేయకారుడు రుక్మాభట్ల నరసింహా స్వామిని శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రుక్మాభట్ల గేయ రామాయణం రచించి తన జీవితాన్ని శ్రీ రా ముడికి అంకితం చేశారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉగాది పురస్కారం తీసుకున్న రుక్మాభట్లకు పద్మశ్రీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. -
చెరువుల చెంత.. సమస్యల చింత
● కనుచూపుమేర గుర్రపు డెక్క ● ప్రజలకు కరువైన ఆహ్లాదం ● చెత్తా చెదారంతో దుర్వాసనమల్లం చెరువుపై వ్యర్థాలు.గుర్రపు డెక్కతో కనుమరుగైన మల్లం చెరువుమెదక్ మున్సిపాలిటీ: జిల్లాలోని చెరువులు ఆహ్లాదానికి దూరంగా, చెత్తాచెదారంతో నిండిపోయాయి. దోమలు, ఈగలు, ప్రాణాంతక కీటకాలకు ఆవాసంగా మారుతున్నాయి. చెరువులను ఆనుకొని ఉన్న ప్రాంతాలు, కాలనీలు కంపుకొడుతున్నాయి. దీంతో స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పట్టణంలోని మల్లం చెరువు కనుచూపు మేర గుర్రపుడెక్కతో నిండిపోయింది. చెరువుపై నాగులమ్మ, కట్టకింద వీరహనుమాన్ ఆలయాలు ఉన్నాయి. చెరువు పరిసరాలు చెత్తమయం కాగా, ఆలయా లకు వచ్చే భక్తులు అనేక అవస్థలు పడుతున్నారు. భక్తులకు ఆహ్లాదం పంచాల్సిన చెరువు కంపుతో స్వాగతం పలుకుతోంది. పట్టణంలోని పిట్లం చెరువుది అదే తీరు. పలు వీధులకు చెందిన మురికి నీరు అందులో కలుస్తోంది. దీంతో ఆహ్లాదం కోసం చెరువు కట్టపైకి వెళ్లే ప్రజలకు కంపు కలవరపెడుతుంది. చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చుదిద్దుతామంటూ పదేళ్లుగా ఊరిస్తున్నా.. పనులు మాత్రం మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో సేద తీరేందుకు, వ్యాయామం చేయడానికి వస్తుంటారు. దుర్వాసనతో అటు వైపు వెళ్లడానికే జంకుతున్నారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్, విద్యుత్ దీపాలు, వాకింగ్ ట్రాక్ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్కులు, చిన్నారులకు ఆటస్థలాలు, సేదతీరటానికి కుర్చీలు, పర్యాటక హంగులు సమకూర్చాలని పలువురు కోరుతున్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం మెదక్‌లోని మల్లం చెరువు, పిట్లం చెరువులో పలు వీధులకు చెందిన మురుగునీరు వచ్చి చేరుతోంది. దీంతో చెరువులు దుర్వాసన వెదజల్లడంతో పాటు గుర్రపు డెక్క పెరుగుతుంది. మున్సిపల్ అధికారులు మురుగునీరు చెరువుల్లో కలువకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. – రాజు, ఇరిగేషన్ డిప్యూటీ డీఈ -
బఫర్‌లో బరితెగింపు!
దుర్గమ్మ సాక్షిగా భూ దందా ● అక్రమార్కులకు అడ్డాగా టేకులగడ్డ ● ఏడుపాయల్లో అక్రమ నిర్మాణాలు ● ఎన్ఓసీ లేకుండానే కార్యదర్శుల అనుమతులు ఏడుపాయల రియల్ మాఫియాకు కేంద్రంగా మారింది. దుర్గమ్మ సాక్షిగా అవినీతి భూ దందా కొనసాగుతోంది. పచ్చని వనాలతో కళకళలాడిన టేకులగడ్డ.. అక్రమార్కులకు అడ్డాగా మారిపోయింది. మంజీరా తీరాన ఉన్న బఫర్ జోన్లో బరితెగించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఎన్ఓసీ లేకుండానే రెవెన్యూ, పంచాయతీ అధికారులు కాసుల వేటలో అడ్డగోలు అనుమతులిస్తున్నారు. 1 నుంచి 8, 144, 145 సర్వే నంబర్లలో ఉన్న సుమారు 30 ఎకరాల భూమిలో అక్రమ రియల్ భూం కొనసాగుతుంది. – పాపన్నపేట(మెదక్) మంజీరా నది ఏడుపాయలుగా చీలి ప్రవహించే సుందర ప్రదేశం వనదుర్గానిలయం. తలాపునే 30 వేల ఎకరాలకు సాగు నీరందించే ఘనపురం ప్రాజెక్టు.. దిగువన భక్తులు స్నానాలు చేసేందుకు.. వృధాజలాన్ని ఒడిసి పట్టేందుకు చెక్ డ్యాం నిర్మించారు. నదికి ఇరువైపులా కొల్చారం మండలంలో 1 నుంచి 8, పాపన్నపేట మండలంలో 144, 145 సర్వే నంబర్లలో ఉన్న సుమారు 30 ఎకరాల భూమి పచ్చని చెట్లతో కళకళలాడేది. 2015– 16లో పోతంషెట్పల్లి నుంచి వచ్చే దారిలో మంజీరా నదిపై 3 బ్రిడ్జిలు నిర్మించి డివైెడర్లతో కూడిన సీసీ రోడ్లు వేశారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దృష్టి ఈ భూములపై పడింది. అప్పట్లో ఎకరాకు రూ. 2.30 లక్షలు ధర పలికిన ఈ భూములు .. ప్రస్తుతం రూ. 2.50 నుంచి రూ. 3 కోట్లు పలుకుతున్నాయి. అవసరానికనుగుణంగా భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు బఫర్ జోన్లో వాణిజ్య నిర్మాణాలు ప్రారంభించారు. అనేక లాడ్జీలు నిర్మించి రూ. లక్షలు ఆర్జిస్తున్నారు. నిర్మాణాలు గుర్తించాం ఏడుపాయల్లో మంజీరా నది తీరాన బఫర్ జోన్లో ఉన్న 8 నిర్మాణాలను గుర్తించాం. సంబంధిత యజమానులకు నోటీసులు అందించాం. ఇంతవరకు ఏడుపాయల్లో ఎలాంటి నిర్మాణాలకు ఇరిగేషన్ శాఖ నుంచి నో అబ్జెక్షన్ అనుమతి తీసుకోలేదు. పోతంషెట్పల్లి నర్సాపూర్ ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుంది. బఫర్‌జోన్‌లో నాలా చేయొద్దు, నిర్మాణాలు అక్రమం. వీటిపై తగిన చర్యలు తీసుకుంటాం. – విజయ్, ఇరిగేషన్‌శాఖ ఏఈ -
ప్రాణాలు తీస్తున్న సరదా
మెదక్‌జోన్: ఈత సరదా యువకుల ప్రాణాలు తీస్తోంది. జిల్లాలో కేవలం ఆరునెలల వ్యవధిలో పాతికేళ్లలోపు యువకులు నలుగురు మృత్యువాత పడ్డారు. గతంలో మంజీరా నదిలో ఇద్దరు.. తాజాగా శనివారం మధ్యాహ్నం బొల్లారం మత్తడిలో మరో ఇద్దరు ప్రాణాలు వదిలారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నీటి వనరుల వద్ద భద్రతా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అందరూ పాతికేళ్లలోపు వారే.. అయితే బొల్లారం మత్తడి మెదక్ మండలంలోని పలు గ్రామాలకు సమీపంగా ఉంటుంది. ఇందులోకి ఘనపూర్ ఆనకట్ట నుంచి నీరు వచ్చి చేరటంతో మండు వేసవిలో నిండుకుండలా మారుతుంది. దీంతో యువత అందులోకి ఈత కోసం వెళ్తుంటారు. అయితే ఇప్పటివరకు ఈ మత్తడి నలుగురు యువకులను బలి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరిలో జానకంపల్లికి చెందిన యువకుడు మిత్రులతో కలిసి స్నానం చేస్తుండగా నీట మునిగి మృతిచెందాడు. అలాగే తిమ్మక్కపల్లికి చెందిన మరో యువకుడు మత్తడిలో మునిగి చనిపోయాడు. ఇంత జరుగుతున్నా అధికారులు అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదు. అలాగే ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం సమీపంలో మంజీరా నది ఎప్పుడు నిండుకుండలా ఉంటుంది. భక్తులు ముందుగా మంజీరా పాయల్లో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే గత నెల 1వ తేదీన హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం ఏడుపాయలకు వచ్చి మూడు రోజుల పాటు అక్కడే గడిపారు. అందులో ఇద్దరు యువకులు పోతంశెట్‌పల్లి 2వ బ్రిడ్జి వద్ద నదిలో ఈతకు దిగి నీటమునిగి దుర్మరణం చెందారు. మంజీరాలో లోతు ఎక్కువగా ఉండటంతో పాటు రాళ్లు రప్పలతో నిండి ఉంది. ఈ ప్రదేశంలోనికి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అక్కడ నిరంతరం పోలీస్ సిబ్బందిని ఉంచితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. పండుగ పూట విషాదం మెదక్ మండలం బాలనగర్‌కు చెందిన తుండు అనిల్ (17), తుండుం నవీన్ (25) శనివారం మధ్యాహ్నం బొల్లారం మత్తడికి ఈతకు వెళ్తున్నా మని కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరారు. అయితే రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు మత్తడి వద్దకు వెళ్లి చూడగా గడ్డపై ఇద్దరి దుస్తులు, చెప్పులు కనిపించారు. దీంతో గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో వెతకగా ఆదివారం మధ్యా హ్నం ఇద్దరి మృతదేహలు లభ్యమయ్యాయి. దీంతో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామానికి చెందిన తుండుం లలిత, పద్మయ్యకు కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా కూతురు పెళ్లిచేయగా.. అనిల్ పదో తరగతి వరకు చదువుకొని ఇంటి వద్ద తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అయితే చేతికందివచి్చన కొడుకు నీటి మునిగి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదే గ్రామానికి చెందిన తుడుం బాలయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. నీట మునిగి మృతిచెందిన నవీన్ (25) రెండో కుమారుడు. అతడికి మూడేళ్ల క్రితం పెళ్లి చేయగా రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతడి భార్య గర్భిణి. భర్త నీటి మునిగి చనిపోయాడని తెలియటంతో ఆమె రోదనలు మిన్నంటాయి. -
రాములోరి కల్యాణానికి వేళాయే
మెదక్‌జోన్: సీతారాముల కల్యాణ మహోత్సవానికి రామాలయాలు ముస్తాబయ్యాయి. జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయాన్ని నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాలు, స్వాగత తోరణాలతో అలంకరించారు. ముత్యాల ముగ్గులు, తీరొక్కపూలతో పెళ్లి మండపం కల్యాణ క్రతువుకు సిద్ధమైంది. సిరి కల్యాణపు తిలకం, బుగ్గన చుక్క, పాదాలకు పారాణితో వరుడు రామయ్య, కస్తూరి నామం, పూలజడతో వధువు సీతమ్మ పెళ్లికి ముస్తాబయ్యారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తిరు కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఎదుర్కోలు, మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో రాములోరి పెళ్లి కనుల పండువగా జరగనుంది. కాగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు దంపతులు సమర్పించనున్నారు.నేడే శ్రీరామనవమి -
సన్ ఫ్లవర్ రైతులను ఆదుకోండి
సిద్దిపేటజోన్: సిద్దిపేట నియోజకవర్గం సన్ ఫ్లవర్ రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే హరీశ్‌రావు శనివారం ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. చిన్నకోడూరు మండల రైతుల సమస్యలను తెలుసుకున్న హరీశ్.. మంత్రికి ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. మండలంలోని రైతులు 18 వేల క్వింటాళ్ల దిగుబడి సన్ ఫ్ల్లవర్ సాగు చేసినట్టు పేర్కొన్నారు. అందులో 5 వేల క్వింటాళ్లు పీఏసీఎస్ ద్వారా, మరో 2 వేల క్వింటాళ్లు మార్కెట్ కమిటీ ద్వారా కొనుగోలు చేసినట్టు తెలిపారు. మిగతా 11 వేల క్వింటాళ్ల సన్ ఫ్ల్లవర్ మిగిలిందని, దీనితో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరాముడు చూపిన మార్గం అనుసరణీయం ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఆదర్శప్రాయుడు శ్రీరాముడు చూపిన మార్గం మనందరికీ అనుసరణీ య మని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.మంత్రి తుమ్మలకు ఎమ్మెల్యే హరీశ్ విజ్ఞప్తి -
ఒకే తాటిపైకి రెవెన్యూ ఉద్యోగులు
● భూభారతితో రైతులకు మెరుగైన సేవలు ● తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ● ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంసిద్దిపేటఅర్బన్: రెవెన్యూ శాఖలోని ఉద్యోగులందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేటలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని, రెవెన్యూ ఉద్యోగులకూ భరోసా ఉంటుందని చెప్పారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు సంబంధించి త్వరలోనే ప్రభు త్వం శుభవార్త చెబుతుందని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు సానుకూలంగా ఉందన్నారు. ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖల్లోకి వస్తున్న గ్రామ పరిపా లన అధికారులు (జీపీవో) సర్వీసుపరమైన అభద్రతకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. వీరందరికి కామన్ సర్వీస్, పదోన్నతులు ఉంటాయన్నారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారిని నియమించడం వల్ల రైతులకు రెవెన్యూ సేవలు చేరువ కావడంతో పాటు ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు లభిస్తాయని వివరించారు. రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలి భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలని లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను క్రమంగా సాధించుకుంటున్నామని, సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూభారతి చట్టంతో తహసీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాల వికేంద్రీకరణ జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని, సమస్యపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్టు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి వెంకట్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు చల్లా శ్రీనివాస్, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాములు, రమేష్, టీజీజీఏ జనరల్ సెక్రటరీ పూల్‌సింగ్, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, కా ర్యదర్శులు రాంరెడ్డి, భిక్షం, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దర్శనంగౌడ్ పాల్గొన్నారు. -
మహనీయుడు జగ్జీవన్‌రామ్
కలెక్టర్ రాహుల్‌రాజ్ మెదక్ కలెక్టరేట్: నేటి యువతకు బాబు జగ్జీవన్‌రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కలెక్టర్ రాహుల్‌రాజ్ కొనియాడారు. శనివారం కలెక్టరేట్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని జగ్జీవన్‌రామ్ జయంతిని నిర్వహించగా.. కలెక్టర్ రాహుల్‌రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసినిరెడ్డి జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యంతకాలం కేబినేట్ మంత్రిగా కొనసాగిన ఘనత అయనకే దక్కిందన్నారు. రక్షణ మంత్రిగా ఇండో–పాక్ యుద్ధ సమయంలో దేశానికి విజయాన్ని సాధించిపెట్టడంలో ఆయన పాత్ర కీలకం అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని తెలిపారు. జిల్లాలో అంబేడ్కర్ భవన్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్లతో విద్యలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ భుజంగరావు, ఎస్సీ సంక్షేమ అధికారి శశికళ. టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, కార్యదర్శి రాజ్‌కుమార్, వివిధ దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో జగ్జీవన్‌రామ్ జయంతిని నిర్వహించారు. ఎస్పీ కార్యాలయంలో.. మెదక్ మున్సిపాలిటీ: బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ రంగానాయక్, సిబ్బంది పాల్గొన్నారు. -
రండి.. చూసొద్దాం
వేసవి సెలవుల్లో ఎటైనా టూర్‌కు వెళితే బాగుంటుందని అందరూ భావిస్తుంటారు. దూరప్రాంతాల్లో కాకుండా దగ్గర్లో ఉంటే అనువుగా ఉంటుందని కోరుకుంటారు. అలాంటి వారికి జిల్లాలో కొలువుదీరిన ఎన్నో పర్యాటక, దర్శనీయ స్థలాలు రారమ్మని పిలుస్తున్నాయి. సరస్సులు, ప్రాచీన కట్టడాలు, పురాతన ఆలయాలు, అభయారణ్యాలు ఒకటేమిటి.. ఇలా ఎన్నింటినో చూసే వీలుంది. హైదరాబాద్ నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం.. మెతుకుసీమ పర్యాటక, దర్శనీయ స్థలాలను చుట్టేసేందుకు సిద్ధం కండి. – మెదక్‌జోన్ మెతుకుసీమలో ఎన్నో పర్యాటక, దర్శనీయ స్థలాలు సొంత వాహనం ఉంటే వెళ్లొచ్చు హాయిగా.. అందుబాటులోనూ బస్సు సౌకర్యంనర్సాపూర్ అర్బన్‌పార్కు హైదరాబాద్‌కు అతి సమీపంలో నర్సాపూర్ అర్బన్ పార్కు ఉంది. మండు వేసవిలోనూ పచ్చటి అడవి అందాలు, స్వచ్ఛమైన గాలి ఇక్కడ సొంతం.అడవి లోపలిభాగంలో సహజ సిద్ధ మట్టిరోడ్లు, ఆకాశాన్ని అందుకునే విధంగా పెరిగిన చెట్లు, అడవి అందాలను తిలకించేందుకు నిర్మించిన వాచ్టవర్లు, పార్కును ఆనుకొని తొణకిసలాడే రాయరావు చెరువు చూడదగిన అందాలు.పోచారం అభయారణ్యం మెదక్ పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో పోచారం అభయారణ్యం ఉంది. అందులో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం కొనసాగుతోంది. వాటితో పాటు అనేక రకాల జంతువులు ఉన్నాయి. ప్రవేశ రుసుం పెద్దలకు రూ. 100, చిన్న పిల్లలకు రూ. 50 చెల్లించాలి. కెమెరా తీసుకెళ్తే అదనంగా మరో రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. చెంగుచెంగున దుమికే చుక్కల జింకలు, పురివిప్పి నాట్యం చేసే నెమళ్లు, కొండగొర్లు, నీల్గాయిలాంటి ఎన్నో రకాల జంతువులు కళ్ల ముందు కదలాడుతుంటాయి. అలాగే అభయారణ్యాన్ని ఆనుకొని కొండలు, గుట్టల నడుమ నిజాం హయాంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు చూడదగినది. దీనిని 1916–1922 మధ్య మంజీరా నదికి ఉపనదిగా ఆలేరుపై నిర్మించారు. రిజర్వాయర్ మధ్యలో ఉన్న ద్వీపం వివిధ జాతుల పొదలకు నిలయం. ప్రఖ్యాతిగాంచిన చర్చి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా సందర్శించే చర్చిలలో ఒకటి మెదక్ చర్చి ఒకటి. దీనిని బ్రిటిష్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ నిర్మించారు. 1914 నుంచి 1924 వరకు పదేళ్ల పాటు దీనిని నిర్మించారు. ఇది చరిత్రాక కట్టడం. చర్చి గోపురం ఎత్తు 175.. పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులు ఉంటుంది. తూర్పున ఏసు క్రీస్తు జన్మవృత్తాతం, పడమర క్రీస్తును శిలువ వేసిన.. ఉత్తరాన క్రీస్తు చనిపోయి 3వ రోజు సజీవుడైన దృశ్యాలు కనిపిస్తాయి. పైమూడు దృశ్యాలు పగలు మాత్రమే కనిపించడం ప్రత్యేకత.ఏడుపాయల దుర్గమ్మ ఋషులు తపస్సు చేసిన కీకారణ్యం రాతి గుహలో ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం వెలిసింది. ఈ ఆలయం రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది. వనదుర్గమ్మ దర్శనానికి ఏటా 30 లక్షలకుపైగా భక్తులు వస్తుంటారు. రాష్ట్రం నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తరలివస్తారు. ఆది, మంగళవారాల్లో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతాయి.మెదక్ ఖిల్లా మెదక్ ఖిల్లా (కోట) ఒక వారసత్వ నిర్మాణం. 2వ శతాబ్దంలో కాకతీయుల ఆఖరిరాజు ప్రతాపరుద్రుడి హయాంలో ఈ కోట నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. దీనిని మొదట తెలుగులో ‘మెతుకుదుర్గం’ అని పిలిచేవారు. ఇది కాకతీయుల తర్వాత కుతుత్షాహిలకు కమాండ్ పోస్టుగా పనిచేసింది. ఈ కోటలో కుతుబ్షాహిస్ నిర్మించిన ప్రాంగణంలో 17వ శతాబ్దపు మసీదు, అలాగే ధాన్యాగారాలు ఉన్నాయి. ఇది భూమట్టం నుంచి సుమారు 90 మీటర్ల ఎత్తులో కొండ ప్రాంతంలో 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. హైదరాబాద్ నుంచి ఒకటిన్నర గంటల ప్రయాణంలో చేరుకోవచ్చు. -
కార్యకర్తలకు అండగా ఉంటా
నర్సాపూర్: కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శనివారం ఆమె పుట్టిన రోజును పురస్కరించుకొని క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి రాగానే ఆదరించి, వరుసగా మూడుసార్లు గెలిపించారని, ప్రతిపక్షంలో ఉన్నా తన వెన్నంటి ఉంటున్న కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చా రు. తనను నిరంతరం ఆదరిస్తున్న ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అక్రమ కేసులకు భయపడవద్దని, అండగా నేనున్నానని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ఆయా పథకాలే బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకొ స్తాయని జోస్యం చెప్పారు. శనేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని వెల్మకన్న శనేశ్వరాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ పూజారులు శనేశ్వరునికి పూ జలు చేసి తైలాభిషేకం చేశారు. వివిధ గ్రా మాల నుంచి తరలివచ్చిన భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సన్నబియ్యం.. నూకలే అధికం కౌడిపల్లి(నర్సాపూర్): ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా సరఫరా చేస్తున్న సన్నబియ్యంలో ఎక్కువగా నూకలే వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుంది. అయితే గతంలో కంటే భిన్నంగా ఉగాది నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. మండల కేంద్రమైన కౌడిపల్లిలో రెండు షాపుల్లో శుక్రవారం రాత్రి నుంచి లబ్ధిదారులకు రేషన్‌కార్డుపై సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే బియ్యం బాగున్నాయని.. 24 కిలోల బియ్యంలో 5 కిలోలకుపైగా నూకలు వచ్చాయని వాపోయారు. నూకలు లేకుండా సన్నబియ్యం పంపిణీ చేస్తే మరింత బాగుంటుందని కోరుతున్నారు. జూన్‌లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం నంగునూరు(సిద్దిపేట): అత్యాధునిక టెక్నాలజీతో నంగునూరు మండలం నర్మేటలో నిర్మి స్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని జూన్‌లో ప్రారంభిస్తామని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు, ఎల్లాయిగూడ, రంగ నాయకసాగర్లోని ఆయిల్‌పామ్ నర్సరీల స్థితిగతులను, పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. సిద్దిపేట, జనగామ జిల్లాల వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో సాగు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని సందర్శించారు. వివిధ గ్రామాల నుంచి రైతులు తెచ్చిన ఆయిల్ గెలలను పరిశీలించి వారితో మాట్లాడారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న నిర్మా ణం పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగుకు జనగామ, సిద్దిపేట జిల్లాలోని భూము లు అనువుగా ఉన్నాయని, పెద్ద ఎత్తున సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. -
ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం
మెదక్ కలెక్టరేట్: విద్యుత్ సమస్యలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) చైర్మన్ నాగేశ్వర్రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం వద్ద పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజీ, విద్యుత్ మీటర్ సమస్యలు, బిల్లుల్లో సమస్యలు, కొత్త సర్వీస్‌లు, యాజమాన్య బదిలీ, కనెక్షన్ల పునరుద్ధరణ, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ పరిష్కార వేదికలో 105 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను 41 రోజుల్లో ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ శంకర్, ఇండిపెండెంట్ కమిటీ మెంబర్ వెంకట్, టెక్నికల్ డీఈ శ్రీనివాస్, మెదక్ డీఈ చాంద్‌పాష, తూప్రాన్ డీఈ గరుత్మంతా రాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.సీజేఆర్ఎఫ్ చైర్మన్ నాగేశ్వరరావు -
అత్యవసర వైద్యం
మరింత చేరువగానర్సాపూర్: వైద్యారోగ్యశాఖలో కొత్త పాలసీని తీసుకొస్తున్నామని, రహదారులపై 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఒక ట్రామా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శుక్రవారం నర్సాపూర్‌లో ఎమ్మెల్యే సునీతారెడ్డి, కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 7,500 ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అంబులెన్స్‌లు సైతం అందుబాటులో ఉంచుతామన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించి కాపాడుతామన్నారు. వ్యసనాలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. పేదల కడుపు నింపడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగా రేషన్ దుకాణాల ద్వారా అర్హులైన పేదలకు సన్న బియ్యం అందించే కార్యక్రమం ప్రారంభించినట్లు వివరించారు. మహిళా సాధికారతే ధ్యేయంగా బాలికల విద్యను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. నర్సాపూర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ట్రామా సెంటర్, సీటీస్కాన్ సదుపాయాన్ని త్వరలో ప్రారంభించేందుకు చర్య లు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. చెక్కుల పంపిణీలో ఆరు నెలల పాటు కాలయాపన జరగడంతో పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మంత్రి వెళ్లిన అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మైక్ ఇవ్వాలని అడగ్గా అధికారులు ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగే ష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, ఆర్డీఓ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం ముఖ్యం రాజకీయాల్లో వ్యక్తిత్వం ముఖ్యమని మంత్రి దా మోదర అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను, సునీతారెడ్డి మంత్రులుగా కొనసాగామని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొన్నారు. మహోన్నతమైన వ్యక్తిత్వం వైఎస్సార్ సొంతమని కొనియాడారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలన్నారు. సమన్వయంతో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం చాలా ముఖ్యమని అన్నారు. త్వరలో ట్రామా కేంద్రాల ఏర్పాటు పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం మంత్రి దామోదర రాజనర్సింహ -
సర్కారు వైద్యం గాలిలో దీపం
పెద్దాస్పత్రిలో అరకొర వైద్య సేవలుమెడికల్ కళాశాల మంజూరైన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగుపడలేదు. కొందరు వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వచ్చీరాని వైద్యంతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. – మెదక్‌జోన్ మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం సర్దన గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ గత నెల 5న దాయరవీధిలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. నైట్‌డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది తుంటి ఎముక విరిగిందని నిర్ధారించారు. ముందుగా యూరిన్ పైపు వేసి చికిత్స ప్రారంభిస్తామన్నారు. అయితే మూత్రనాలంలో పైపు వేసేందుకు అరగంట ప్రయత్నించి విరమించుకున్నారు. ఉదయం మూత్రనాలంలో పైపు వేస్తుండగా రక్తం వస్తుందని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వారు సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, వైద్య పరీక్షలు చేసి మూత్రనాలంలో పైపు సరిగా వేయకపోవటంతో తీవ్రగాయం అయిందని చెప్పారు. ఆపరేషన్ చేసి పైపు ద్వారా యూరిన్ బయటకు తీశారు. అనంతరం విరిగిన ఎముకకు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. అయితే మొత్తం ఆస్పత్రి ఖర్చు రూ. 2.50 లక్షలు అయిందని బాధితుడు వాపోయారు. కాగా సదరు ఆస్పత్రి యాజమాన్యం డిశ్చార్జి సమ్మరిలో యూరిన్ పైపు సరిగా వేయకపోవటంతో మూత్రం నాళం లోపల దెబ్బతిందని ఇచ్చారు. అలాగే చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యాదగిరి గత నెల 22న తలకు బలమైన గాయం కావటంతో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరారు. సీటీస్కాన్ చేయించుకొని రావాలని డ్యూటీ డాక్టర్ క్షతగాత్రుడి తలకు పట్టి కట్టి పంపించాడు. రక్తం అలాగే కారుతుండడంతో కుటుంబీకులు సదరు వైద్యుడిపై మండిపడగా అప్పుడు కుట్లు వేసినట్లు తెలిసింది.రోగుల ప్రాణాలతో చెలగాటం! తప్పనిసరి పరిస్థితిలో ‘ప్రైవేట్’కు -
కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి
పెద్దశంకరంపేట(మెదక్): ఆర్టీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్గో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా కార్గో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇసాఖ్ అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట బస్టాండ్‌లో కార్గో సెంటర్‌ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరామనవమి సందర్భంగా స్వామి వారి తలంబ్రాలు, ము త్యాలను కార్గో ద్వారా ఇంటి వరకు అందిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 20 కార్గో సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ శివశంకర్, రీజినల్ కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్, పేట కార్గో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గోదాం మేనేజర్ సహా మరో నలుగురు అరెస్ట్ మెదక్‌జోన్: జిల్లా కేంద్రంలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ నుంచి బియ్యాన్ని అక్రమంగా తరలించిన ముగ్గురు సిబ్బందితో పాటు వాహన డ్రైవర్, యజమానిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ నాగరాజు కథనం ప్రకారం.. గత 31వ తేదీన ఎలాంటి అనుమతి లేకుండా సీడబ్ల్యూసీ గోదాం నుంచి 35 క్వింటాళ్ల బియ్యాన్ని ఓ డీసీఎంలో పంపించారు. ఇదే విషయమై ఈనెల 2వ తేదీన సాక్షిలో ‘దొంగ చేతికి తాళం’ అనే కథనం ప్రచురితం కావడంతో డీసీఎం డ్రైవర్‌తో పాటు దాని యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. అయితే గోదాం మేనేజర్, మరో ఇద్దరు సిబ్బంది సహకారంతో బియ్యాన్ని తరలించామని వారు తెలిపారు. గతంలోనూ చాలా సార్లు బియ్యం ఇచ్చినట్లు పోలీసుల విచారణలో చెప్పారు. దీంతో డీసీఎం డ్రైవర్ చందర్, యజమాని సంతోష్‌తో పాటు మేనేజర్ కోటేశ్వర్రావు, టెక్నికల్ సిబ్బంది శ్యాం, సునీల్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. 7 నుంచి లీగల్ లిటరసీ క్యాంపులు నర్సాపూర్: ఈనెల 7వ తేదీ నుంచి మండలంలో లీగల్ లిటరసీ క్యాంపులు నిర్వహించనున్నట్లు మెదక్ ప్రిన్సిపల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సిరి సౌజన్య తెలిపారు. నారాయణపూర్‌లోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఈనెల 7, నర్సాపూర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8, 9న మండలంలోని రెడ్డిపల్లి ఇందిర క్రాంతిపథం గ్రూపు మహిళల కోసం క్యాంపులు నిర్వహిస్తామని ఆమె చెప్పారు. ఆన్లైన్లో కొత్త పంచాయతీల వివరాలు డీపీఓ యాదయ్య కౌడిపల్లి(నర్సాపూర్): కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల వివరాలను ఆన్లైన్లో త్వరగా నమోదు చేయాలని డీపీఓ యాదయ్య కంప్యూటర్ ఆపరేటర్లను ఆదేశించారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో కొత్త గ్రామ పంచాయతీల ఆన్లైన్ వివరాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా 24 గ్రామ పంచాయతీలు ఏర్పాటైనట్లు తెలిపారు. కాగా పాత పంచాయతీల నుంచి గ్రామ పంచాయతీలకు ఇండ్లు, ఇతర ప్రభుత్వ ప్రదేశాలను వేరుచేసి ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు. కౌడిపల్లి మండలంలో ఆరు పంచాయతీలు కొత్తగా ఏర్పాటైనట్లు వివరించారు. నాలుగు పంచాయతీలలో ఆన్లైన్ పూర్తి అయిందని, మిగితా రెండు పంచాయతీల వివరాలు సైతం త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. -
వన్యప్రాణుల దాహం దాహం
తొనిగండ్ల అటవీ ప్రాంతంలో నీరు లేక ఎండిపోయిన కుంట● నీటి కోసం పంట చేన్లు, గ్రామాల్లోకి వన్యప్రాణులు ● తాజాగా లక్ష్మాపూర్ వద్ద జింకను హతమార్చిన కుక్కలుఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం రామాయంపేట రేంజ్ పరిధిలోని వన్యప్రాణులకు తాగు నీరు అందించడానికి కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో పంచాయతీ వారి సహకారంతో ట్రాక్టర్లలో నీరు నింపుకొని సాసర్పిట్లలో పోస్తున్నాం. నీటి ఎద్దడి విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – విద్యాసాగర్, రామాయంపేట రేంజ్ అధికారిరామాయంపేట(మెదక్): వన్యప్రాణులు తాగు నీటి కోసం అల్లాడుతున్నాయి. నీటి కోసం వ్యవసాయ బోర్లు, గ్రామాల్లోకి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి. తాజాగా శుక్రవారం అటవీ ప్రాంతం నుంచి లక్ష్మాపూర్ గ్రామంలోకి వచ్చిన జింకపై కుక్కలు దాడి చేసి హతమార్చాయి. రామాయంపేట, చేగుంట మండలాల్లో దట్టమైన అటవీప్రాంతం విస్తరించి ఉంది. రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు తాగు నీటి వసతి కల్పనకు గాను 105 సాసర్‌పిట్లతో పాటు 15 చెక్‌డ్యాంలు, 27 చిన్నస్థాయి కుంటలున్నాయి. ఏటా వేసవిలో సాసర్పిట్లలో నీరు నింపి వన్యప్రాణుల దాహర్తి తీరుస్తున్నారు. అయితే రెండేళ్లుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఆశాఖ అధికారులు నీటి సదుపాయం కల్పించలేకపోతున్నారు. ప్రస్తుతం కొన్ని సాసర్పిట్లు పాక్షికంగా ధ్వంసం కాగా రేంజ్ పరిధిలోని నాలుగైదు గ్రామాల్లో మాత్రం ఆశాఖ అధికారులు పంచాయతీ ట్రాక్టర్‌తో సాసర్పిట్లలో నీరు పోయిస్తున్నారు. అటవీ ప్రాంతంలో చిరుతలతో పాటు జింకలు, ఎలుగుబంట్లు, అడవి పందులు, రేసుకుక్కలు, మనుబోతులు, ఇతర జంతువులు ఉన్నాయి. రాయిన్‌పల్లి చెరువు అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉండటంతో రాత్రివేళ పదుల సంఖ్యలో జంతువులు చెరువు వద్దకు వెళ్లి తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. -
ప్రతి రికార్డు భద్రంగా ఉండాలి
కౌడిపల్లి(నర్సాపూర్)/రామాయంపేట(మెదక్): కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని శుక్రవారం జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ యువవికాసం దరఖాస్తుల గడువు ఈనెల 14 వరకు ప్రభుత్వం పొడిగించిందన్నారు. దరఖాస్తులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వారీగా ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదు చేసి భద్రపర్చాలని తెలిపారు. ప్రతి రికార్డు భద్రంగా ఉండాలని సూచించారు. అనంతరం మండలంలో ఉపాధిహామీ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ రంగాచారి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్ల, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.జెడ్పీ సీఈఓ ఎల్లయ్య -
ప్రైవేట్‌కు పంపితే కఠిన చర్యలు
తూప్రాన్: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రోగులను ప్రైవేట్‌కు సిఫార్సు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. శుక్రవారం తూప్రాన్‌లోని సీహెచ్‌సీ నూ తనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించి మాట్లాడారు. కార్పొరేట్ ఆస్ప త్రులకు ధీటుగా ప్రభుత్వ దవాఖానాలు తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరో 80 అంబులెన్స్‌లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రీజినల్ కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని దృష్టి సారించినట్లు తెలిపారు. తూప్రాన్ ఆసుపత్రిలో ప్రతిరోజు 20 మందికి డయాలసిస్ సేవలు అందించవచ్చని వివరించారు. అనంతరం పట్టణ సమీపంలోని బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పోటాపోటీ నినాదాలు డయాలసిస్ సెంటర్ ప్రారంభ ం సందర్భంగామంత్రి దామోదర, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. దీంతో కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీ యాల గుర్తించి పలువురు చర్చించుకున్నారు. -
రాజ్యాంగ పరిరక్షణకు కదలిరావాలి
వెల్దుర్తి(తూప్రాన్): అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని, దానిని అడ్డుకుని తీరాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో నాయకులు పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ కబంధహస్తాల కింద దేశం నలిగిపోకుండా కాపాడాలన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ స్వాతంత్య్రం కోసం ఆవిర్భవించిన పార్టీ అయితే బీజేపీ కేవలం మతపరమైన పార్టీ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ నినాదంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ శ్రేణు లు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సుధాకర్‌గౌడ్, మల్లేశం, శ్రీశైలం, శేఖర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
వడ్లకుప్పలను ఢీకొనడంతో ప్రమాదం నిజాంపేట (మెదక్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి నిజాంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని నాలాపూర్కు చెందిన అబ్దుల్ రహ్మాన్ (50) ఫోన్ రావడంతో చేగుంట మండలం పులిమామిడికి బైక్‌పై బయలుదేరాడు. గ్రామ శివారులో రోడ్డుపై ఉన్న వడ్ల కుప్పలను ఢీకొనడంతో కింద పడిపోయాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు. రహ్మాన్ మరణ వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.చదవడం, రాయడం తప్పనిసరి చేగుంట(తూప్రాన్): విద్యార్థులకు చదవడం రాయడం వచ్చేలా శిక్షణ ఇవ్వాలని డీఈఓ రాధాకిషన్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం మండలంలోని వడియారం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదవడం, రా యడం ఖచ్చితంగా రావాలన్నారు. గణితంలో చతుర్విద ప్రక్రియలకు అనుగుణంగా బోధించాలని సూచించారు. తొలిమెట్టు మూల్యంకన ఫలితాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం నిత్యం పర్యవేక్షించాలని చెప్పారు. డీఈఓ వెంట ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు ప్రియదర్శిని, ఉపాధ్యాయులు వసంత, సంతోషిమాత తదితరులు ఉన్నారు. సమగ్ర వివరాలు నమోదు చేయాలి శివ్వంపేట(నర్సాపూర్): రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు సంబంధించి సమగ్ర వివరాలు నమోదు చేయాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. గురువారం శివ్వంపేట ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పత్రాలను కార్యాలయంలో తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివరాలు నమోదుకు ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటుచేయాలన్నారు. అలాగే ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచే విధంగా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నరేందర్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ స్వామి, ఏపీఓ అనిల్‌కుమార్ ఉన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు రామాయంపేట(మెదక్): నాసిరకం విత్తనాలు, క్రిమి సంహారక మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్‌నారాయణ హెచ్చరించారు. గురువారం రైతు వేదికలో డివిజన్ పరిధిలోని రామాయంపేట, నిజాంపేట, చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన విత్తనాలు, క్రిమి సంహారక మందుల డీలర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విత్తన చట్టాలకు లోబడి డీలర్లు వ్యాపారం నిర్వహించుకోవాలని, నెలవారీ నివేదికలను ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. విత్తనాలు, క్రిమి సంహారక మందులకు సంబంధించి అమ్మకాలు, నిల్వల వివరాలను ప్రతినెల తప్పనిసరిగా అందజేయాలని ఆదేశించారు. ఏఓలు సోమలింగారెడ్డి, యాదగిరి, ఏఈఓ ప్రవీన్, డీలర్లు పాల్గొన్నారు. మహనీయుడు వాజ్‌పేయి మెదక్‌జోన్: దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి గొప్ప నేత అని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి మీసాల చంద్రయ్య అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాజ్‌పేయి శత జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 6వ తేదీన బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, బూత్ అధ్యక్షులు నిర్వహించాల్సిన కార్యక్రమాలను వివరించారు. జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నేతలు శివ, విజయ్, ప్రసాద్ పాల్గొన్నారు. -
కొనేవారు లేక.. రైతన్న గోస
నిరుపయోగంగా పెద్దశ ంకరంపేట సబ్ మార్కెట్ యార్డు పెద్దశంకరంపేట(మెదక్): రైతులు పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర మార్కెట్ యార్డుల్లో దొరుకుతుందంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ఆచరణలో మాత్రం లోపాలున్నట్లు స్పష్టమవుతోంది. 2016లో పెద్దశంకరంపేటలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన సబ్ మార్కెట్ యార్డు లో ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభించలేదు. నాబార్డు నిధులు వెచ్చించి దాదాపు రూ. 4 కోట్లతో 161వ జాతీయ ప్రధాన రహదారిని ఆనుకొని నిర్మించారు. 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం ఏర్పాటు చేశారు. కేవలం దీనిని గోదాం లాగానే వినియోగిస్తున్నారు తప్ప, కొనుగోళ్లు చేపట్టడం మరిచారు. దీంతో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన తూకం వృథాగా మారింది. మార్కెట్ యార్డుగా మారిస్తే మేలు పెద్దశంకరంపేట సబ్ మార్కెట్ యార్డును పూర్తి స్థాయి మార్కెట్ యార్డుగా మారుస్తానని గతంలో మాజీ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. దీంతో ఈ ప్రాంత రైతులు అప్పట్లో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కె ట్ యార్డుకు పెద్దశంకరంపేట సబ్ మార్కెట్ యా ర్డు అనుబంధంగా ఉంది. అప్పట్లో కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో ఎవరూ దీనిని పట్టించుకోలేదు. ప్రస్తుతం మార్కెట్ యార్డుగా మార్చి నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తే అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పేట మండలాలకు చెందిన రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సబ్‌మార్కెట్ యార్డ్ అలంకారప్రాయంగా మారింది. కేవ లం సివిల్ సప్లై గోదాంగా మార్చి బియ్యం, వడ్లు మాత్రమే నిల్వ చేస్తున్నారు. కరువైన వసతులు పెద్దశంకరంపేట సబ్ మార్కెట్ యార్డులో సరైన వసతులు కరువయ్యాయి. 161వ జాతీయ రహ దారి విస్తరణలో ప్రహరీ కూల్చివేశారు. నష్ట పరిహారం కింద నిధులు మంజూరైనా ఇప్పటికీ ప్రహరీ నిర్మాణం పూర్తి చేయలేదు. దీంతో పాటు సీసీ రోడ్డు నిర్మాణం, రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి ప్లా ట్ఫాంలు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి వసతులు ఏర్పాటు చేసి వినియోగంలోనికి తేవాలని రైతులు కోరుతున్నారు.కొనుగోళ్లు చేపట్టాలి ఈ ప్రాంతంలో ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, శనగపంటలు సాగవుతాయి. సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపడితే రైతులకు సరిౖన మద్దతు ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – మారుతి, రైతు, పెద్దశంకరంపేట ఉన్నతాధికారులకు నివేదిస్తాం పెద్దశంకరంపేట సబ్ మార్కెట్ యార్డును మా ర్కెట్ యార్డుగా మార్చే విషయమై ఉన్నతాఽ దికారులకు నివేదిస్తాం. ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు తగిన చర్యలు చేపట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – సునీల్, జోగిపేట మార్కెట్ యార్డు సెక్రటరీ -
నెరవేరేనా..!
సొంతింటి కల పేద, మధ్య తరగతి ప్రజలను ఊరిస్తున్న సొంతింటి కల అందని ద్రాక్షగానే మారింది. గత ప్రభుత్వంలో 688 డబుల్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ పంపిణీకి నోచుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోవడమూ లేదు. ఈ క్రమంలో సొంతింటి నిర్మాణానికి ఇందిరమ్మ పథకాన్ని ప్రకటించింది. దీంతో ఎంతో మంది అర్హులు అర్జీలు పెట్టుకున్నారు. అయితే ఆ ప్రక్రియ సైతం ముందుకు సాగడం లేదు. – మెదక్‌జోన్ జిల్లాలో దశాబ్ద కాలంగా ప్రభుత్వం పేదలకు సరిపడా ఇళ్లు మంజూరు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు 4,776 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో 3,975 ఇళ్లకు మాత్రమే టెండర్ పూర్తయింది. వీటి నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం రూ. 243 కోట్లను విడుదల చేసింది. టెండర్ అయిన వాటిలో 3,011 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా లబ్ధిదారులకు 2,323 ఇళ్లను మాత్రమే పంపిణీ చేసింది. ఈ లెక్కన నిర్మాణాలు పూర్తయినవి మరో 688 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి. వాటికి చిన్నచిన్న మరమ్మతులు మాత్రమే చేయాల్సి ఉంది. అయితే కొత్త ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలపై మాత్ర మే దృష్టి సారించింది. ప్రజాపాలనలో ఇళ్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో జిల్లాలో లక్షపై చిలుకు మంది దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి ఆ గ్రామంలోని అర్హులకు ఇళ్లు మంజూరు చేశారు. 21 మండలాల పరిధిలోని 21 గ్రామాలను ఎంపిక చేసి 1,555 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. వారికి జన వరి 26న మంజూరు పత్రాలను అందించారు. అయితే ఇప్పటివరకు మూడు నెలలు అవుతున్నా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. జిల్లాలో 493 గ్రామాలు ఉండగా, ఇప్పటివరకు కేవలం 21 గ్రామాల్లోనే ఈ పథకాన్ని అమలు చేశారు. మిగితా గ్రామాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు పూర్తయిన 688 ఇళ్లను ఎప్పుడు పంపిణీ చేస్తారని అడుగుతున్నారు. ఏళ్లుగా తప్పని ఎదురుచూపులు గత ప్రభుత్వంలో నిర్మించిన688 ఇళ్లు పంపిణీకి సిద్ధం వాటి ఊసే ఎత్తని పాలకులు,అధికారులు ముందుకు సాగని ఇందిరమ్మఇళ ్ల నిర్మాణం ఆసక్తి చూపని లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. మూడు నెలల క్రితం జిల్లాలోని 21 గ్రామాలకు 1,555 ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటివరకు కేవలం 34 మంది లబ్ధిదారులు మాత్రమే బెస్మెంట్ లెవల్ వరకు నిర్మించుకున్నారు. మరో 120 మంది పనులు ప్రారంభించారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్రూం ఇంటిలో హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండగా, వాటిని పిల్లర్లతో నిర్మించారు. ఇందిరమ్మ ఇంటిలో కేవలం ఒక బెడ్రూం మాత్రమే ఉండగా, అందులో పిల్లర్లు లేకుండా నిర్దేశించిన డిజైన్లోనే కట్టుకుంటే బాగుంటుందని అధికారులు చెబుతు న్నారు. కనీసం 400 చదరపు అడుగుల నుంచి అత్యధికంగా 600 చదరపు అడుగుల వరకు ఇంటిని నిర్మించుకోవాలని సూచిస్తు న్నారు. అయితే 400 చదరపు అడుగుల ఇంటిని నిర్మించుకుంటే ఏ మాత్రం సరిపోదనే భావనతో చాలా మంది లబ్ధిదారులున్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం
పెద్దశంకరంపేట(మెదక్): జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం అన్నారు. గురువారం మండలంలోని దానంపల్లిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి 38 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 5 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. మిగితా వారు కూడా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ ఏఈ విద్యాసాగర్, ఎంపీఓ విఠల్‌రెడ్డికి సూచించారు. అన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, వాటికి వెంటవెంటనే బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మధు, నాయకులు నారాగౌడ్, సంగమేశ్వర్, పెరుమాండ్లుగౌడ్, పంచాయతీ సెక్రటరీ నరేందర్ పాల్గొన్నారు.జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం -
అభివృద్ధి నిరోధకులుగా మారొద్దు
వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వం ఎవరిదైనా ఎమ్మె ల్యేగా తాను ప్రపోజల్స్ పంపిస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మంజూరు వస్తుందని, అధికార పార్టీ నాయకులకు చేతనైతే అదనపు నిధులు తేవాలి కానీ అభివృద్ధిని అడ్డుకోవద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హితవు పలికారు. గురువారం మాసాయిపేట మండలంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. అయితే రెండు రోజుల తర్వాత మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు తెలపడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తుగా సమాచారం ఇచ్చి అర్ధాంతరంగా చెక్కుల పంపిణీ నిలిపివేసినందుకు నిరసనగా నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేస్తున్నారు, నర్సాపూర్‌లో మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నిధు ల విడుదలలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. తన హక్కులను కాలరాసేలా ప్రవర్తిస్తే చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి నాయకులు నర్సింలు, నాగరాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే సునీతారెడ్డి హితవు -
సన్న బియ్యం నిరుపేదలకు వరం
కలెక్టర్ రాహుల్‌రాజ్ పాపన్నపేట(మెదక్)/చిన్నశంకరంపేట: సన్న బియ్యం నిరుపేదలకు వరమని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం మండలంలో ఎమ్మె ల్యే రోహిత్‌రావుతో కలిసి లబ్ధిదారులకు సన్నబియ్యం, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 520 రేషన్ షాపులు, 2.13 లక్షల రేషన్‌కార్డులు ఉండగా, 6.96 లక్షల లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. వీరందరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. సన్న వడ్లు పెట్టిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ప్రయోజనకారిగా ఉందన్నారు. రాజీ వ్ యువ వికాసం స్కీంతో నిరుద్యోగులకు ఉపాధి చూపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆ ర్ఎస్ హయాంలో ధనికులు సన్న బియ్యం తింటే, నిరుపేదలు మాత్రం దొడ్డు బియ్యం తినాల్సి వచ్చేదన్నారు. ఈ విధానానికి చెక్ పెట్టేలా సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, ఎమ్మార్వో సతీష్, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, మాజీ జెడ్పీటీసీ మల్లప్ప నాయకులు పాల్గొన్నారు. అలాగే చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సన్న బియ్యం పథకం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్లలో వెనకబడిన మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా సివిల్ సప్లై అధికారి సురేష్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ రాజు, నాయకులు పాల్గ్గొన్నారు. -
తూప్రాన్ మున్సిపాలిటీకి అవార్డు
తూప్రాన్: జిల్లాలోనే తూప్రాన్ మున్సిపాలిటీకి అరుదైన గౌరవం దక్కింది. 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆస్తి పన్ను వసూళ్లలో 82.17 శాతం లక్ష్యాన్ని సాధించింది. ఈసందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి చేతులమీదుగా కమిషనర్ పాతూరి గణేష్‌రెడ్డి బెస్ట్ అప్రిషియేషన్ అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమష్టి కృషి ఫలితంగానే అవార్డు దక్కిందని తెలిపారు. -
బియ్యం అమ్మితే రేషన్ కార్డు కట్
కలెక్టర్ రాహుల్రాజ్నర్సాపూర్రూరల్/హవేళిఘణాపూర్(మెదక్): సన్న బియ్యం అమ్మితే లబ్ధిదారుల రేషన్ కార్డు కట్ చేస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరించారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సన్న బియ్యం పంపిణీ చేస్తే అందరూ తినగలుగుతారని ఆలోచించి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. జిల్లావ్యాప్తంగా 2,13,820 తెల్ల రేషన్‌కార్డుదారులకు 4430.496 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆనంద్, మాజీ కౌన్సిలర్లు లలిత, సరిత, మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు సుధాకర్, జైపాల్, నర్సింలు, స్వరూప, ఫహిం తదితరులు పాల్గొన్నారు. అలాగే హవేళిఘణాపూర్‌లో సన్న బియ్యం పంపిణీని పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. కొందరు అంత్యోదయ కార్డు ద్వారా 30 కిలోల బియ్యం వచ్చేవని, ప్రస్తుతం రాకపోవడంతో పూట గడవడం కష్టంగా మారిందని కలెక్టర్‌తో మొరపెట్టుకున్నారు. దీంతో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. -
అదృశ్యమై.. భువనగిరిలో ప్రత్యక్షమై
అధికారులను పరుగులెత్తించిన కేజీబీవీ విద్యార్థిని పాపన్నపేట(మెదక్): కేజీబీవీలో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని బుధవారం పాపన్నపేటలో అదృశ్యమై.. భువనగిరిలో ప్రత్యక్షం అయింది. పోలీసుల కథనం ప్రకారం.. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌కు చెందిన దంపతులకు ఒక కుమార్తె (15) ఉంది. కొంతకాలం క్రితం తండ్రి మరణించడంతో తల్లి, కూతురు భువనగిరి ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్కడ కూతురును మొదట భువనగిరిలోని కేజీబీవీలో చేర్పించి తర్వాత పట్టించుకోవడం మానేసింది. దీంతో బాలికను అధికారులు కొంతకాలం అక్కడి బాల సదనంలో చేర్పించారు. అక్కడి నుంచి మెదక్ బాలసదనం తీసుకొచ్చారు. ఈఏడాది పాపన్నపేట కేజీబీవీలో 8వ తరగతిలో చేర్పించారు. అయితే జాయిన్ అయినప్పటి నుంచి ఇక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో బుధవారం అటెండెన్స్ తీసుకున్న అనంతరం అదృశ్యమైంది. వెంటనే విషయాన్ని గుర్తించిన ఎస్ఓ బాలలక్ష్మి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. డీఈఓ రాధాకిషన్, ఎంఈఓ ప్రతాప్‌రెడ్డి పాపన్నపేట కేజీబీవీకి చేరుకొని జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే సాయంత్రం బాలిక భువనగిరి బాలసదనం చేరుకోవడంతో వారు అక్కడి సఖి కేంద్రంలో అప్పగించారు. విషయాన్ని పోలీసులు, అధికారులు ధృవీకరించారు. పొద్దంతా ఉరుకులు పరుగులతో ఆందోళన చెందిన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
పరీక్షలు ముగిశాయోచ్
పాపన్నపేట(మెదక్): విద్యార్థి దశలో కీలకమైన పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 21వ తేదీన ప్రారంభమైన పరీక్షలు సాంఘీక శాస్త్రం పరీక్షతో పరిసమాప్తమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 10,388 మంది విద్యార్థులకు 10,241 మంది పరీక్షలు రాశారు. 147 మంది వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదు. చివరి పరీక్ష రాసి కేంద్రాల్లో నుంచి బయటికి వచ్చిన విద్యార్థులు ఆనందంగా కన్పించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ పర్యవేక్షణలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. -
4న విద్యుత్ సమస్యలపై గ్రీవెన్స్ డే
చిన్నశంకరంపేట(మెదక్): ఈనెల 4న మెదక్ విద్యుత్‌శాఖ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యలపై గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ దినకర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు అందించవచ్చని తెలిపారు. దరఖాస్తుతో పాటు విద్యుత్ బిల్లు, ఆధార్‌కార్డు జిరాక్స్‌ను జతచేయాలని సూచించారు. పోరాటయోధుడు పాపన్నగౌడ్ మెదక్‌జోన్: బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం పాపన్నగౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత, జాతి విభేదాలు లేకుండా సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. గౌడ కులస్తుల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆ పరిశ్రమపై చర్యలు తీసుకోండి మనోహరాబాద్(తూప్రాన్): కార్మికుడి మరణానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డిలో డిప్యూటీ లేబర్ కమిషనర్ రవీందర్‌రెడ్డికి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని కొండాపూర్ శివారులోని శ్రీయాన్ పాలిమార్స్ పరిశ్రమలో మంగళవారం రఘునాథ్‌సింగ్ అనే కార్మికుడు విద్యుత్ ప్రమాదంలో మృతి చెందడన్నారు. పరిశ్రమ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పలు పరిశ్రమల్లో కనీస వసతులు లేకుండానే, భద్రతా చర్యలు చేపట్టకుండానే కార్మికులతో 10 నుంచి 12 గంటల చొప్పున పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాకి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. మైనర్లకు బైక్‌లు ఇస్తే కఠిన చర్యలు: ఎస్పీమెదక్ మున్సిపాలిటీ: మైనర్లకు బైక్‌లు ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించా రు. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు బావు లు, చెరువులు, వాగుల్లో ఈతకు వెళ్లే అవకాశం ఉందని, పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేదంటే ఈత సర దా ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నారు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే వారిని పట్టుకొని వాహన యజమానులపై కేసు నమోదు చేస్తామన్నారు. వేసవిలో క్రీడా శిక్షణ కేంద్రాలకు పంపి మీ పిల్లలలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని కోరారు. ఢిల్లీ వెళ్లిన బీసీ సంఘం నేతలు రామాయంపేట (మెదక్): 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనకు జిల్లాకు చెందిన బీసీ సంఘం నాయకులు భారీగా తరలివెళ్లారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారం ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గోదాముల్లో గోల్మాల్!
గోదాం ఇన్చార్జిల అక్రమాలు ● ఐదేళ్లలో 11 వేల క్వింటాళ్ల బియ్యం మాయం ● 19 లక్షల గన్నీబస్తాలు విక్రయం ● రూ. 15.67 కోట్ల ప్రభుత్వ సొమ్ము పక్కదారి ● సస్పెండ్ అయిన వారే మళ్లీ విధుల్లోకి.. మెదక్ కేంద్ర గిడ్డంగుల సంస్థకంచె చేను మేసిన చందంగా.. పేద ప్రజలు తినే బియ్యాన్ని నిల్వ ఉంచే ఎంఎల్ఎస్ పాయింట్లకు రక్షణ కల్పించాల్సిన గోదాం ఇన్చార్జిలు అడ్డదారి తొక్కారు. వేలాది క్వింటాళ్ల బియ్యంతో పాటు లక్షలాది గన్నీ బస్తాలను అమ్ముకున్నారు. ఐదేళ్ల వ్యవధిలో రూ. 11.67 కోట్ల విలువ చేసే ప్రభుత్వ సొమ్మును మింగారు. అయినా వారి నుంచి ఆర్ఆర్యాక్ట్ కింద ఒక్కపైసా రికవరీ చేయలేకపోయారు. విచిత్రమేమిటంటే సస్పెండ్ అయిన వారే మళ్లీ విధుల్లో చేరుతున్నారు. – మెదక్‌జోన్ : జిల్లావ్యాప్తంగా పెద్దశంకరంపేట, పాపన్నపేట, చేగుంట, మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్‌లో మొత్తం 7 ఎంఎల్ఎస్ స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వీటిలో గత ఐదేళ్ల కాలంలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, చేగుంట నాలుగు (ఎంఎల్ఎస్) స్టాక్ పాయింట్లలో ఐదుగురు గోదాం ఇన్చార్జిలు విధులు నిర్వర్తించారు. వీరు పోటీ పడి మరి ఐదేళ్ల కాలంలో 11,086.66 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టించారు. అంతేకాకుండా 19,44,200 లక్షల గన్నీ బస్తాలను అమ్ముకున్నారు. వీటి విలువ అక్షరాల రూ. 15,67,90,862 కోట్లు. అయితే ఆలస్యంగా పసిగట్టిన ఉన్నతాధి కారులు విచారణ జరిపి సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఈవిషయా న్ని అప్పట్లో బట్టబయలు చేయగా, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పైసా రాబట్ట లేదు.. గోదాంల ఇన్చార్జిలు ఐదుగురి నుంచి రూ. 15.67 కోట్ల ప్రజాధనాన్ని ఆర్ఆర్యాక్ట్ ఉపయోగించి తిరిగి కక్కిస్తామని గతంలో అధికారులు చెప్పారు. కానీ ఇప్పటివరకు వారి నుంచి పైసా రికవరీ చేయలేదు. కేసులు నమోదు చేసి జైలుకు పంపగా, బెయిల్‌పై తిరిగి వచ్చి యథావిధిగా విధుల్లో చేరుతున్నారు. ఐదుగురు నిందితుల్లో ఇప్పటికే ఇద్దరు విధుల్లో చేరగా, మరో ముగ్గురు ఉద్యోగంలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.తాజాగా 35 క్వింటాళ్ల బియ్యం నమ్మకానికి మారుపేరైనా కేంద్ర గిడ్డంగుల సంస్థ నుంచి తాజాగా మార్చి 31వ తేదీన 35 క్వింటాళ్ల బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా డీసీఎంలో తరలించారు. గమనించిన ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మెదక్ పట్టణ పోలీసులు వాహనాన్ని వెంబడించి అదుపులోకి తీసుకొన్నారు. తమదైన శైలిలో విచారణ జరిపి డ్రైవర్‌తో పాటు యజమానిపై కేసు నమోదు చేశారు. కాగా కేంద్ర గిడ్డంగుల అధికారి ఆదేశాల మేరకే తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది.గోదాంలో తనిఖీలు కేంద్ర గిడ్డంగుల సంస్థ గోదాం నుంచి మార్చి 31వ తేదీన 35 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా తరలించిన విషయమై మంగళవారం ‘సాక్షి’లో ‘దొంగ చేతికి’ తాళం అనే కథనం ప్రచురితమైంది. దీనిని స్పందించిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) సిబ్బంది బుధవారం గోదాంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బియ్యం తక్కువగా వచ్చినట్లు నిర్ధారించారు. ఈ విషయమై రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎఫ్‌సీఐ ఇంటెలిజెన్స్ సిబ్బంది తెలిపారు. కాగా వారి పేర్లు తెలిపేందుకు వారు నిరాకరించారు. -
బెట్టింగ్ యాప్‌లతో జర భద్రం
డీఎస్పీ ప్రసన్నకుమార్పాపన్నపేట(మెదక్): మొబైల్ యాప్‌లలో వచ్చే ప్రకటనలు నమ్మి, బెట్టింగ్‌లు పెట్టి ఆర్థికంగా నష్టపోయి ప్రాణాలు తీసుకోవద్దని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి సూచించారు. బుధవారం పాపన్నపేటలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 22 మంది బాధితులకు వాటిని రివకరీ చేసి అప్పగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా చోరీకి గురైన ఫోన్లను గుర్తించామన్నారు. మొబైల్ ఫోన్ చోరీకి గురి కాగానే బాధితులు వెంటనే తమ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఐఎంఈఐ నంబర్‌ను భద్రపర్చుకోవాలన్నారు. రాష్ట్రంలో మొబైల్ ఫోన్ల రికవరీలో మెదక్ జిల్లా ముందంజలో ఉందని వివరించారు. ఈసందర్భంగా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, ఏఎస్ఐ సంగన్న, గాలయ్య, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్‌ను అభినందించారు. 02ఎన్ఆర్ఎస్62ఎ: భక్తుల బోనాల ఊరేగింపు