
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
నర్సాపూర్: అగ్నిమాపక వారోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో అగ్నిమాపక లీగల్ ఫైర్‌మెన్ ఐలయ్య, ఇతర సిబ్బంది జానారెడ్డి, వెంకటేశం, అనిల్, బీఆర్‌ఎస్ నాయకులు సత్యంగౌడ్, బాల్‌రెడ్డి, ప్రసాద్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మకు మొక్కులు
పాపన్నపేట(మెదక్): దుర్గమ్మా... దండాలమ్మ అంటూ వేలాది భక్తులు వేడుకున్నారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూ జలు చేశారు. ఒడిబియ్యం పోసి, బోనాలు సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మండుటెండలో చెట్లకింద సేదదీరి విందు చేసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఎస్‌ఐ శ్రీని వాస్, ఆలయ సిబ్బంది చర్యలు తీసుకున్నారు.
కేసీఆర్‌ను కలిసిన భాస్కర్
టేక్మాల్(మెదక్): మండలంలోని బొడ్మట్‌పల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బేగరి భాస్కర్ ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలను ఆయనకు వివరించారు.
అర్హులు ఇందిరమ్మఇళ్లు నిర్మించుకోవాలి
నారాయణఖేడ్: అర్హులైన ప్రతీ ఒక్కరూ ఇదిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. మనూరు మండలం దుదగొండలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ...అర్హులకే ఇళ్లను మంజూరు చేశామన్నారు. అనంతరం గ్రామంలో బీరప్పస్వామి, ఊరడమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు వినోద్‌పాటిల్, దిగంబర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, సంగన్న, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఉత్సాహంగా కుస్తీ పోటీలు
నారాయణఖేడ్: హనుమాన్ జయంతి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్ ఆలయం ఆవరణలో ఆదివారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ కుస్తీపోటీలకు స్థానికులతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. చివరి కుస్తీ పోటీకి 5 తులాల వెండి కడియాన్ని బహుమతిగా అందజేశారు. కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహారాజ్, ఇరక్‌పల్లి దేవిదాస్ మహారాజ్, గోపాల్, కిషన్, విఠల్‌నాయక్, రాంచెందర్, దేవీసింగ్, నందు, బక్షిరాం పాల్గొన్నారు.
వరంగల్ సభను
విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే మాణిక్‌రావు పిలుపు
జహీరాబాద్ టౌన్: బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు పార్టీ శ్రేణులను కోరారు. మండల కేంద్రమైన మొగుడంపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి