
రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
చిలప్‌చెడ్ (నర్సాపూర్): రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు జరపాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం చిలప్‌చెడ్ మండలంలోని ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మండల బీఆర్‌ఎస్ నాయకులతో కలసి చలో వరంగల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు నష్టపోకుండా త్వరితగతిన కొనుగోళ్లు ప్రారంభించి, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. గన్నీబస్తాలు, రవాణా, లారీల కొరత తదితర సమస్యలు రాకుండా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సన్నాలకు రూ.5 వందల బోనస్ జమ చేయాలన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
27న వరంగల్‌లో జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్, సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్‌చైర్మన్ రాంచంద్రారెడ్డి, యూత్ నాయకులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు రావొద్దు
వెల్దుర్తి: ఽకొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌మిల్లులకు తరలించి అన్నదాతలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవా రం సాయంత్రం వెల్దుర్తి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో కొనుగోలు ప్రక్రియలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ యేడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, మాజీ జెడ్పీటీసీ రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.కాగా, ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి