breaking news
Medak District News
-
దళారులను నమ్మి మోసపోవద్దు
కలెక్టర్ రాహుల్రాజ్హవేళిఘణాపూర్(మెదక్): మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూ చించారు. ఆదివారం మెదక్ మండల పరిధిలోని రాజ్‌పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తేమ శాతం పరిశీలించారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు, ఏర్పాట్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 498 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. తేమశాతం వచ్చిన తర్వాతే తూకం చేయాలని అన్నారు. రైతులకు టోకెన్లు అందించాలని సూచించారు. ధాన్యం తరలింపునకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
మృతదేహాలు అప్పగింత
హవేళిఘణాపూర్(మెదక్): కర్నూలు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు దుర్ఘటనలో మరణించిన తల్లీబిడ్డల మృతదేహా లను ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంధ్యారాణి, చందన మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించారు. ఈ మేరకు అంబులెన్స్‌లో బయలు దేరినట్లు కుటుంబీకులు తెలిపారు. సోమవారం శివ్వాయపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు. నర్సాపూర్: ప్రధాని మోదీ 127వ మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ పలువురి నాయకులతో కలిసి నర్సాపూర్‌లో వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమంలో ప్రధాని సూచనలు పాటిస్తామన్నారు. పార్టీ అభివృద్ధితో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు నగేశ్, బాల్‌రాజ్, చంద్రయ్య, శంకర్, రాజు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ మున్సిపాలిటీ: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈనెల 31న భారీ బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈనెల 30వ తేదీ సాయంత్రంలోగా ఆర్ఎస్ఐ నంబర్ (8712657954)లో సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు. కొమురవెల్లిలో భక్తుల సందడి కొమురవెల్లి (సిద్దిపేట): మల్లన్న ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. క్షేత్రానికి చేరుకున్న భక్తులు మొదట స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంత మంది గంగిరేణు చెట్టు ప్రాంగణంలో పట్నాలు వేసి, ముడుపులు కట్టారు. మరికొంత మంది అభిషేకాలు, కళ్యాణం జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ వెంకటేశ్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ పర్యవేక్షించారు. చివరి గింజ వరకు కొంటాండీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి కొండపాక(గజ్వేల్): ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని మోసపోవద్దని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కుకునూరుపల్లిలో ఆదివారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ గింజకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏ గ్రేడ్ క్వింటాల్ ధర రూ.2,389, కామన్ గ్రేడ్ ధర రూ. 2369లకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదన్నారు. మార్కెట్‌కు ధాన్యాన్ని తెచ్చేటప్పుడు తాలు, తేమ శాతం లేకుండా చూసుకొని తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి. పీఏసీఎస్ వైస్ చైర్మన్ అమరేందర్, నాయకులు పాల్గొన్నారు. -
పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం
అదనపు ఎస్పీ మహేందర్ మెదక్ మున్సిపాలిటీ: పోలీస్ కుటుబాలకు శాఖ అండగా ఉంటుందని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అమరవీరుడు హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాల మేరకు కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో మా ట్లాడి ఆరోగ్యం, జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఎల్లప్పు డూ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీస్ అధికారులను సంప్రదించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆడపిల్లను ఆదరిద్దాం
బాలికలు.. భవిష్యత్ దీపికలు ● ఉమ్మడి జిల్లాలో తగ్గిన జనన రేటు ● 2022తో పోలిస్తే 2023లో తగ్గిన జననాలు ● సీఆర్ఎస్ తాజా నివేదికలో వెల్లడి అవకాశాలు అందిపుచ్చుకుని ఆడపిల్లలు ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. అయినా ఇంకా కొంతమంది వదిలించుకోవాలన్న దురాలోచన చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బాలికల జనన రేటు దారుణంగా పడిపోయింది. కేంద్ర జనగణన విభాగం ఇటీవల విడుదల చేసి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం(సీఆర్ఎస్) నివేదిక–2023లో పలు అంశాలు వెల్లడయ్యాయి. ఇదిలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మహిళా కలెక్టర్లుగా అత్యున్నత స్థాయిలో ఉండి పురుషులకు దీటుగా పాలన కొనసాగిస్తున్నారు. –సాక్షి, సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం జననాలు 72,545, మరణాలు 17,392 జరిగాయి. 2023లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన సేవలు అందించడంతో 2022తో పోలిస్తే శిశుమరణాలు బాగా తగ్గాయి. సీఆర్ఎస్ నివేదిక ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2022లో 74,862 మంది, 2023లో 72,545 మంది జన్మించారు. ఈ నివేదిక ప్రకారం చూస్తే జననాలు 2,317 తగ్గాయి. 2022లో మగ శిశువులు 38,928, 2023లో 37,928 మంది పుట్టారు. 2022లో ఆడపిల్లలు 35,934, 2023లో 34,617 మంది జన్మించారు. పెరిగిన శిశు మరణాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో శిశు మరణాలు పెరిగాయి. 2023లో 471 మంది చిన్నారులు మృతి చెందితే అందులో 273మంది మగపిల్లలు, 198మంది ఆడ పిల్లలు మృతి చెందారు. 2022లో ఈ మొత్తం 447 మందిగా ఉంది. 2023లో నాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కృషితో సిద్దిపేట, గజ్వేల్ ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాయి. దీంతో శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయి. తగ్గిన మరణాలు 2022లో 22,014మంది, 2023లో 17,392 మంది మృతిచెందారు. మెరుగైన వైద్య సేవలు అందడంతో పాటు, ఆరోగ్యంపై అందరూ ప్రత్యేక దృష్టి సారిస్తుండటంతో గతంతో పోలిస్తే మరణాలు తగ్గాయి. -
కిక్కులక్కు ఎవరికో?
● దరఖాస్తుదారుల్లో టెన్షన్ ● నేడే మద్యం దుకాణాల లక్కీ డ్రా ● జిల్లాలోని 49 వైన్స్‌లకు 1,420 అప్లికేషన్లు జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. కిక్కు, లక్కు తమను వరిస్తుందా..? లేదా అని సోమవారం తీసే లక్కీ డ్రాపై గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. డ్రాను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. – మెదక్‌జోన్ జిల్లావ్యాప్తంగా 49 వైన్స్‌లు ఉండగా, రెండు విడతల అవకాశం.. నెల రోజుల సమయం ఇచ్చినా 1,420 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో కంటే 485 అప్లికేషన్లు తగ్గాయి. అయితే దరఖాస్తు ఫీజు రూ. 3 లక్షలకు పెంచడంతో రూ. 42.60 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో కంటే రూ. 4.50 కోట్లు ఎక్కువగా వచ్చింది. జిల్లాలోనే పోతం్శెట్టిపల్లి వైన్స్‌కు అత్యధికంగా 54 దరఖాస్తులు వచ్చాయి. ఏడుపాయల దేవస్థానం సమీపంలో ఉండటంతో ఇక్కడ పెద్దఎత్తున మద్యం విక్రయాలు జరుగుతాయి. ఆది, మంగళవారం సుమారు రూ. 25 నుంచి రూ. 30 లక్షల లిక్కర్ వ్యాపారం సాగుతోంది. అంతే కాకుండా ఈ వైన్స్ నుంచి ఏడుపాయల సమీపంలో గల బెల్ట్‌షాపుల నిర్వాహకులు లిక్కర్ కొనుగోలు చేస్తారు. దీంతో మిగితా దుకాణాలతో పోలిస్తే అత్యధికంగా గిరాకీ ఉండటంతో భారీ డిమాండ్ ఏర్పడింది. అలాగే అతి తక్కువగా నిజాంపేట వైన్స్‌కు కేవలం 15 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక్కడ రెండు మద్యం దుకాణాలు ఉండగా, ఒకదానికి 19 వచ్చాయి. మద్యం విక్రయాలు సైతం అంతంత మాత్రంగానే జరుగుతాయి. నిజాంపేట నుంచి ఐదు కిలోమీటర్ల వ్యవధిలోనే 6 మద్యం దుకాణాలు ఉండటంతో లిక్కర్ వ్యాపారం పెద్దగా జరగదనే వాదన ఉంది. దీంతో ఇక్కడ టెండర్ వేసేందుకు దరఖాస్తుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలిసింది. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న లక్కీ డ్రాను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. పాస్ ఉన్న వారిని మాత్రమే అధికారులు లోపలికి అనుమతించనున్నారు. లక్కీ డ్రా మొత్తం వీడియో రికార్డు చేయనున్నారు. ఇదిలా ఉండగా తమకే మద్యం దుకా ణాలు దక్కాలని ఆలయాల్లో దరఖాస్తుదారులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఎప్పుడు దారి కొచ్చేనో?
రామాయంపేట(మెదక్): ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రహదారులు, చెరువు కట్టలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇవి శిథిలమై రెండు నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదు. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఇబ్బందులపాలవుతున్నారు. ● లక్ష్మాపూర్ నుంచి దంతేపల్లి వరకు ఉన్న అంతర్ జిల్లా రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో ఈ రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. అలాగే లక్ష్మాపూర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే తారురోడ్డు మధ్యలో తెగిపోయింది. రెండు నెలలు గడిచినా, ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు అతి కష్టం మీద పంట చేల గుండా దాటుతున్నారు. ● నిజాంపేట మండల కేంద్రం నుంచి చల్మెడకు వెళ్లే రహదారిలో ఉన్న కల్వర్టు వర్షాలకు దెబ్బతింది. దీంతో కొన్ని రోజుల పాటు ఈదారిలో ప్రయాణాలు నిలిచిపోయాయి. కల్వర్టు ఒకవైపు దెబ్బతినగా, అడ్డంగా బోర్డు పెట్టారు. దీంతో ఆటోలు, బైక్‌లు మాత్రమే వెలుతున్నాయి. ● నిజాంపేట, నస్కల్ మధ్య రోడ్డు మరమ్మతులు పూర్తికాగా, కల్వర్టు నిర్మాణం చేపట్టకపోవడంతో వర్షాలకు ధ్వంసమైంది. పెద్ద వాహనాలు వెళ్లకుండా కల్వర్టుపై రోడ్డును కొంతమేర బ్లాక్ చేశారు. దంతేపల్లి, కాట్రియాల వద్ద చెరువు కట్టలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. యుద్ధ ప్రాతిపదికన వీటికి మరమ్మతులు చేయించాల్సి ఉండగా, ఇరిగేషన్ అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టడం లేదు. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే కట్టలు తెగే ప్రమాదం ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● వర్షాలకు జిల్లా పరిధిలో పంచాయతీరాజ్‌కు చెందిన 70 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతినగా, రోడ్డు భవనాల శాఖ పరిధిలో 40 కిలోమీటర్ల మేర రోడ్డు పాక్షికంగా ధ్వంసమైంది. కొన్ని రహదారులకు మాత్రమే తాత్కాలికంగా మరమ్మతులు చేయించిన అధికారులు నిధులు మంజూరు కాకపోవడంతో పర్మనెంట్ పనులకు ముందుకు రావడం లేదు. ● వరద నీరు పోటెత్తడంతో జాతీయ రహదారి 765 డీజీపై నందిగామ వద్ద ఏకంగా బ్రిడ్జి కుంగిపోయి పగుళ్లు వ్యాపించాయి. దీంతో 20 రోజుల పాటు ఈదారిలో ప్రయాణాలు నిలిచిపోయి మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దెబ్బతిన్న బ్రిడ్జి పక్క నుంచి తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించి 20 రోజుల తర్వాత ప్రయాణాలకు అనుమతించారు. హవేళిఘణాపూర్ మండలంలో దెబ్బతిన్న రహదారులకు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించారు. చౌట్లపల్లి వద్ద లోలెవర్ కల్వర్టు దెబ్బతింది. ఇదే విషయమై ఆయా శాఖల అధికారుల వివరణ కోరగా.. నిధులు మంజూరైతే తప్ప ఏమి చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేశారు. చల్మెడ వద్ద దెబ్బతిన్న కల్వర్టుకు అడ్డంగా బోర్డు ఏర్పాటుకోతకు గురైన లక్ష్మాపూర్– దంతేపల్లి రోడ్డు దెబ్బతిన్న రోడ్లు, చెరువు కట్టలకు మరమ్మతులేవీ? రెండు నెలలు గడిచినా చర్యలు శూన్యం ఇబ్బంది పడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు -
డీసీసీబీ మేనేజర్‌కు పదోన్నతి
నారాయణఖేడ్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఖేడ్ బ్రాంచి మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశంకు ఏజీఎంగా పదోన్నతి కల్పిస్తూ సీఈఓ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటేశం ఖేడ్ బ్యాంకు మేనేజర్‌గా బ్యాంకు అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. అయన స్థానంలో పాపన్నపేట మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కిషన్‌ను నియమించారు. వరద నష్టానికి రూ.1.50 కోట్లు మంజూరు చేయండి మంత్రి సురేఖకు ఎమ్మెల్యే విజ్ఞప్తి పాపన్నపేట(మెదక్): మంజీరా వరదల వల్ల ఏడుపాయల్లో దెబ్బతిన్న ప్రాంతాలను మరమ్మతు చేయడానికి రూ.1.50 కోట్లు మంజూరు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం కావడంతో లక్షలాది మంది భక్తులు దుర్గమ్మ దర్శనానికి తరలి వస్తుంటారని చెప్పారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన రామతీర్థం గ్రామానికి చెందిన కన్నె బోయిన గంగారాంకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. చాకరిమెట్లకు కార్తీక శోభ శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం మొదటి శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దంపతులు సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. భక్తులు రాజుయాదవ్, రవీందర్, శంకర్ నిత్యాన్నదానానికి రూ. 45 వేల విరాళం అందజేశారు. -
ఉద్యోగం ఇవ్వరు.. ఉపాధి చూపరు
‘డీఈఈటీ’ని పట్టించుకోని పరిశ్రమలు రిజిస్ట్రేషన్ తప్పనిసరి ప్రతి పరిశ్రమ తప్పనిసరిగా డీఈఈటీ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఇందులో నమోదు చేసుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారాలు అందిస్తామని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కంపెనీల పరిశీలనకు వెళ్లినప్పుడు డీఈఈటీలో తప్పనిసరి నమోదు చేసుకోవా లని యజమానులకు సూచిస్తాం. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన సమావేశాలు నిర్వహించి వివరిస్తాం. – ప్రకాశ్, జీఎం, జిల్లా పరిశ్రమల శాఖమెదక్ కలెక్టరేట్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ.. వారిని శక్తివంతులుగా తీర్చిదిద్దడానికి డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) యాప్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. నిరుద్యోగులు ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీల చుట్టూ తిరిగే పనిలేకుండా జాబ్ పొందే అవ కాశం లభిస్తుంది. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకునేలా నిబంధనలు పెట్టింది. అయితే జిల్లాలో కొన్ని పరిశ్రమలు మాత్రమే నమోదు చేసుకున్నాయి. ఆసక్తి చూపని పరిశ్రమల నిర్వాహకులు జిల్లాలో సుమారు 500 వరకు వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఐరన్, ఫోం, సీడ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ వంటివి ఉన్నాయి. అయితే అన్నీ కంపెనీలు తప్పనిసరిగా డీఈఈటీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. అయినప్పటికీ ఇప్పటివరకు కేవలం 67 కంపెనీలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వం యాప్ తీసుకొచ్చి ఏడాది కావొస్తున్నా.. ఇంకా 90 శాతం పరిశ్రమలు యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. వలసపోతున్న యువత జిల్లాలో వందలాది పరిశ్రమలు ఉన్నా.. ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో పరిశ్రమలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. వారికి కావాల్సిన ఉద్యోగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాయి. డీఈఈటీ యాప్‌లో జిల్లాకు చెందిన 1,951 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేవలం 10 మందికి మాత్రమే అవకాశం కల్పించాయి. జిల్లాకు చెందిన నిరుద్యోగులు హైదరాబాద్‌కు వలస వెళ్లి చాలీచాలని వేతనాలతో నానాఅవస్థలు పడుతున్నారు. నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం 1,951 మంది నిరుద్యోగులరిజిస్ట్రేషన్ కేవలం పది మందికే ఉద్యోగం -
అమరుల త్యాగాలు వృథా కావు
మెదక్‌మున్సిపాలిటీ: పోలీస్ అమరవీరుల త్యాగాలు వృథా కావని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారని తెలిపారు. రక్తదానంపై ఉన్న అపొహలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. పోలీస్ సిబ్బ ంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం రక్తదానం చేసిన వారిని అభినందించి వారికి పండ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఏఆర్ డీఎస్పీ రంగనాయక్, పోలీస్ అధికారులు, సిబ్బంది త దితరులు పాల్గొన్నారు. 99 యూనిట్ల రక్తం సేకరణ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో మొత్తం 99 యూనిట్ల రక్తం సేకరించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. ఇందులో 80 యూనిట్ల రక్తం నిలోఫర్ ఆస్పత్రికి, 19 యూనిట్లు మెదక్ బ్లడ్ బ్యాంక్‌కు ఇస్తామన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలకు స్మారకంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం సామాజిక సేవకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిలోఫర్ వైద్య సిబ్బంది, రెడ్ క్రాస్ సిబ్బంది, రక్తదాతలను ఆయన అభినందించారు. కార్య క్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు
సంగారెడ్డి: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల పెళ్లికి తోడ్పాటును అందిస్తాయని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ గార్డెన్లో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంగారెడ్డి ఆర్డీఓ రాజేందర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అక్షయపాత్ర సేవలు అమోఘం కంది(సంగారెడ్డి): విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు ఆధ్యాత్మికతను పంచుతున్న అక్షయపాత్ర సేవలు అమోఘమని మంత్రి దామోదర కొనియాడారు. శనివారం మండల కేంద్రంలోని హరేకృష్ణ కల్చరల్ సెంటర్లో చేపట్టిన మహా నరసింహ హోమం, ఆలయం గర్భాలయ యంత్ర స్థాపనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్షయ పాత్రలో విద్యార్థులకు తయారు చేస్తున్న భోజనం, వా టిలో వినియోగిస్తున్న బియ్యం తదితర వస్తువు లు, కిచెన్ షెడ్డును పరిశీలించారు. విద్యార్థులకు భోజనం సరఫరా చేయనున్న రెండు వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు.మంత్రి దామోదర రాజనర్సింహ -
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఆహుతయ్యాక అలర్ట్!మామూళ్ల మత్తులో రవాణాశాఖ అధికారులుపటాన్చెరు కేంద్రంగానే ప్రైవేట్ ట్రావెల్స్ కార్యకలాపాలుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రయాణికుల ప్రాణాలను బుగ్గిపాలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నప్పటికీ రవాణాశాఖ అధికారులు ఇన్నాళ్లు కళ్లు మూసుకున్నారు. కర్నూలులో వేమూరి కావేరి బస్సు దుర్ఘటన జరిగి 19 మంది ప్రాణాలు పోయాక, ఇప్పుడు తనిఖీల పేరుతో హడావుడి చేస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. శనివారం ముత్తంగి టోల్‌ప్లాజా సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేశారు. కాగా పటాన్చెరు కేంద్రంగానే ట్రావెల్స్ బస్సులు నడుస్తాయి. వందల సంఖ్యలో నిత్యం ఇక్కడి నుంచే బెంగుళూరు, ముంబై, ఏపీలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరుతుంటాయి. కర్నూలులో ప్ర మాదానికి గురైన బస్సు కూడా పటాన్చెరు నుంచే ప్రారంభమైన విషయం విధితమే. పటాన్‌చెరుతో పాటు, బీరంగూడ, లింగంపల్లి వద్ద ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తుంటాయి. రవాణాశాఖ కార్యాలయం ఉన్నప్పటికీ.. రవాణా శాఖకు సంబంధించి పటాన్‌చెరులోనే రవాణాశాఖ కార్యాలయం ఉంది. మో టార్ వెహికిల్ ఇన్స్పెక్టర్తో పాటు, పలువురు సహాయ అధికారులు ఈ కార్యాలయంలో పనిచేస్తుంటారు. వీరు నిత్యం రూట్ చెక్‌లో భాగంగా రోడ్డుపై వాహనాలను తనిఖీలు చేయాలి. కానీ ఈ ఏనాడు ఈ బస్సుల వైపు కన్నెత్తి చూసిన దాఖలాల్లేవనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన వేమూరు కావేరి ట్రావెల్స్ బస్సునే ఉదాహరణగా తీసుకుంటే.. ఈ బస్సు కూర్చుని ప్రయాణించే సీట్లతో మాత్రమే అనుమతి ఉంది. కానీ స్లీపర్ సీట్లు ఏర్పాటు చేసి నడుపుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దీన్ని బట్టి చూస్తే ఎన్ని బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎన్నో భధ్రతా పరమైన లోపాలతో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆయా ట్రావెల్స్ యాజమాన్యాలు రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడి ఉండటంతో పాటు, రవాణాశాఖ అధికారులకు ప్రతినెలా మామూళ్లు ముట్టజెపుతుంటారనేది బహిరంగ రహస్యం. దీంతో ఈశాఖ అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాగా శనివారం జరిగిన తనిఖీల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొనట్లు తెలిసింది. తమ విధుల్లో భాగంగా ఈ తనిఖీలు చేసినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుస్తున్నా కన్నెత్తి చూడని వైనం -
ప్రమాదాలు జరిగితేనే తనిఖీలు చేస్తారా?
మెదక్‌జోన్: బస్సు ప్రమాదాలు జరిగితేనే తనిఖీలు గుర్తుకువస్తాయా..? అని ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. శనివారం మెదక్ ఐబీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రమాదాలు చోటు చేసుకోగానే హడావుడిగా తనిఖీలు చేసే అధికారులు ఆ తర్వాత మరిచిపోవటం ఎంతవరకు సమంజసం అన్నారు. కర్నూలు బస్సు ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ప్రైవేట్ వాహనాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2047 వరకు వికసిత్ భారత్ మోదీ లక్ష్యమని గుర్తు చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, నాయకులు నందారెడ్డి సిద్దిరాములు, శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనాలి: ఎమ్మెల్యే హత్నూర(సంగారెడ్డి): రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని తెలిపారు. గన్నీ బ్యాగులతో పాటు హమాలీలను కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు ఆరబెట్టి తెచ్చిన ధాన్యాన్ని తూకం వేసి వెంటనే రైస్ మిల్లులకు పంపించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ డీపీఎం రమేశ్, తహసీల్దార్ పర్వీన్ షేక్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు రాష్ట్ర మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, ఏపీఎం రాజశేఖర్, సొసైటీ డైరెక్టర్ రాములు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైద్యానికి మూలం ఆయుర్వేదం సంగారెడ్డి టౌన్: ఆరోగ్య సమస్యల పరిష్కారానికి భారతీయ ఆయుర్వేదం సంపూర్ణ పరిష్కారాలు సూచిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. శనివారం ధన్వంతరి జయంతి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి విద్యానగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనారోగ్య సమస్యలతో ఇతర దేశాల నుంచి మన దేశంలోని ఆయుర్వేద ప్రకృతి వైద్యశాలలకు వస్తున్న ప్రజలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఎంఎన్ఆర్ ఆసుపత్రి సిబ్బంది వైద్య సేవలను అభినందించారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి న్యాయసేవలను అందించడం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి నాయీ బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షుడు దత్తాత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, ఎంఎన్ఆర్ ఆస్పత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఒకే సంస్థలో రెండు నిబంధనలా..? టీవీఏఈజేఏసీ చైర్మన్ సతీష్‌రెడ్డి మెదక్ కలెక్టరేట్: విద్యుత్ సంస్థలో ఎక్కడా లేని విధంగా రెండు నిబంధనలు అమలు చేసి ఆర్టిజన్ కార్మికులకు తీవ్ర అన్యా యం చేశారని టీవీఏఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మెదక్‌లోని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జా యింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈజేఏసీ) ఆధ్వర్యంలో ఆర్టిజన్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో త్వరలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. అనంతరం ఉమ్మడి మెదక్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
ఎలాంటి పొరపాట్లకు తావివ్వం
మెదక్ కలెక్టరేట్: ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి, అదనపు అధికారి లోకేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షించారు. ఈ ప్రక్రియను ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, ఇతర ఎన్నికల సిబ్బందితో కలిసి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్‌రెడ్డి, తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. భూభారతి రెవెన్యూ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. పదిరోజుల్లో 1,000 దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు.కలెక్టర్ రాహుల్‌రాజ్ -
దాచుకున్న మా డబ్బులు ఇవ్వరా..?
● టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్ ● తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం వద్ద తాము దాచుకున్న సొంత డబ్బులు రాక ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక టీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, బకాయి పడ్డ ఐదు విడతల కరువు భత్యం విడుదల చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులు పదవీ విరమణ పొంది 19 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారు దాచుకున్న పీఎఫ్ డబ్బులు వారికి రావాల్సిన ప్రయోజనాలు ఈరోజు వరకు చేకూరలేదని అన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడాలని, ఉద్యోగులు దాచుకున్న సొమ్ము తక్షణమే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అనురాధ, ఇక్బాల్ పాషా, ఫణి రాజ్, ఫజులుద్దీన్, రఘునాథరావు, శివాజీ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
నర్సాపూర్ రూరల్: నారాయణపూర్ గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను జూనియర్ సివిల్ జడ్జి హేమలత శనివారం సందర్శించారు. బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఎలుకలతో పాటు పాములు, ఇతర కీటకాలులోనికి రాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో పాటు బోధన సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ లలితాదేవికి సూచించారు. అనంతరం విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని పరిశీలించారు. నాణ్యమైన, రుచికరంగా ఉండే భోజనం అందజేయాలని సూచించారు. ఇదిలాఉండగా రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రఘువరణ్ ఆధ్వర్యంలో గురుకులంలో హెల్త్‌క్యాంప్ నిర్వహించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. -
దళారులను నమ్మి మోసపోవద్దు
కలెక్టర్ రాహుల్‌రాజ్ కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. బుధవారం మండలంలోని వెల్మకన్నలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 498 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో బోర్డుపైన లెక్కలు చేయించారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదవాలన్నారు. విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అలాగే రెండో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం, విద్యా ర్థుల పూర్వ ప్రాథమిక విద్యను పరిశీలించారు. గ్రామంలో ఇందరిమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, ఇప్పటివరకు ఎంతమందికి బి ల్లులు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు త దితరులు పాల్గొన్నారు. -
దుకాణ సముదాయానికి తాళం
● టెండర్లకు నోచుకోని వైనం ● తూప్రాన్ మున్సిపాలిటీలో అధికారుల నిర్వాకం తూప్రాన్: మున్సిపాలిటీకి రూ. లక్షల ఆదాయం సమకూర్చే దుకాణ సముదాయం టెండర్లకు నోచుకోవడం లేదు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ పక్కన ఎనిమిది దుకాణాల అగ్రిమెంట్ అయిపోయి ఏళ్లు గడుస్తుంది. టెండర్లు పిలువకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దుకాణాలు ఉన్న ప్రాంతం నిత్యం ప్రజలతో రద్దీగా ఉంటుంది. ఈ దుకాణాల అద్దె సుమారు రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు ఉంటుంది. కానీ అధికారులు కేవలం రూ. 6 వేల వరకు నామమాత్రంగా అద్దె వసూలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. దీని వెనుక అధికారుల పాత్ర ఉన్నట్లు వ్యాపారులు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. గతంలో టెండర్ల ద్వారా దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులు ఇతరులకు అధికంగా అద్దెకు ఇచ్చి వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో మేజర్ పంచాయతీగా ఉన్న కాలంలోనే దుకాణాల సముదాయం ఏర్పాటు చేశారు. టెండర్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రెండు చొప్పున ఎనిమిది దుకాణాలను కేటాయించారు. వాటికి అప్పట్లో నామమాత్రంగా కేవలం రూ. 550 నుంచి రూ.1,200 వరకు వసూలు చేశారు. మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత దుకాణాల సముదాయానికి రూ. 2,500 వరకు వసూలు చేశారు. తీరా అగ్రిమెంట్ పూర్తి కాగానే తిరిగి టెండర్లకు ఆహ్వానించారు. అయితే లక్ష్యానికి అనుగుణంగా టెండర్లు రాకపోవడంతో కొన్నాళ్లుగా దుకాణాల సముదాయానికి తాళం వేశారు. ప్రస్తుతం దుకాణాలు మూతపడి ఉండడంతో శిథిలావస్థకు చేరాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి దుకాణాలకు టెండర్లు పిలిచి దళారి వ్యవస్థ లేకుండా అర్హులైన వారికి కేటాయించాలని వ్యాపారులు కోరుతున్నారు. -
కార్మికులకు కేంద్రం అన్యాయం
నర్సాపూర్: కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేస్తూ అన్యాయం చేస్తుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం ఆరోపించారు. బుధవారం నర్సాపూర్‌లో సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులకు రూ. 26 వేల కనీస వేతనం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్, కనీస సౌకర్యాలు కల్పనలో ప్రభుత్వాలు విఫలం చెందాయని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమం కోసం సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కాగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు మెదక్‌లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగరాజు, అసిఫ్, చంద్రయ్య, నర్సింలు, లక్ష్మయ్య, అనిల్, శంకరయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
మట్టి.. కొల్లగొట్టి
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణ విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది. ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు వెలుస్తుండగా, పోటీ పడి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కాగా ఇంటి నిర్మాణాలకు మట్టి అవసరం ఉండగా, అధికారుల అనుమతితో తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. అయితే కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపడుతూ అడ్డదారిలో రూ. కోట్లు సంపాదిస్తున్నారు. – మెదక్‌జోన్ జిల్లా కేంద్రంలో లక్షకు చేరువలో జనాభా ఉండగా, 18 వేల నివాస గృహాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 30 శాతానికి పైగా వలస వచ్చిన ప్రజలతో పాటు ఉద్యోగులు అద్దెకు ఉంటున్నారు. దీంతో పట్టణంలో నూతనంగా ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారిని ఆనుకొని ఉంది. దీ ంతో రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున భవనాలు నిర్మిస్తున్నారు. కాగా మెదక్ పక్కనే గల చేగుంట రహదారిని ఆనుకొని పిల్లికొటాల్ శివారు, మంబోజిపల్లిని ఆనుకొని సహజ సిద్ధంగా వెలిసిన గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టల నుంచి అక్రమార్కులు పగ లు, రాత్రి తేడా లేకుండా మట్టిని ఇష్టానుసారంగా తవ్వి నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో టిప్పర్‌కు రూ. 4 నుంచి రూ. 5 వేల చొప్పున తీసుకుంటున్నారు. ఒక్కో ఇంటి ని ర్మాణానికి రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు గుంపగుత్తగా మాట్లాడుకొని టిప్పర్ల ద్వారా మట్టిని సరఫరా చేస్తున్నారు. పట్టణానికి చెందిన పలువురు మట్టి వ్యాపారులుగా అవతారమెత్తారు. నిబ ంధనల ప్రకారం ప్రభుత్వానికి చలాన్ చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం అధికారుల అనుమతి మేరకు మట్టిని ఎక్కడి నుంచి తరలించాలనేది నిర్ధారించుకోవాలి. కానీ జిల్లాలో అలాంటేవి జరగటం లేదు. మట్టి అవసరం వచ్చిందంటే చాలు అధికారులకు బదులు అక్రమార్కులను సంప్రదిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అనుమతి లేకుండా ఇష్టారీతిన తరలింపు ప్రభుత్వ ఆదాయానికి గండి చోద్యం చూస్తున్న అధికారులు అక్కరకు రాని కుమ్మరికుంట పిల్లికొటాల్ను ఆనుకొని రోడ్డు పక్కనే ఉన్న కుమ్మరికుంట నుంచి కొంతకాలంగా అక్రమార్కులు సుమారు 5 మీటర్ల లోతు వరకు మట్టిని తవ్వారు. దీంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వర్షాలకు నిండుకుండలా మారింది. అయితే ఆయకట్టు భూములు ఎత్తుగా ఉండటంతో కుంట నుంచి నీరు సాగు భూములకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా కొంతకాలంగా 50 ఎకరాలకు పైగా ఆయకట్టు భూములు బీడుగా మారింది. దీంతో చేసేది లేక రైతులు ఆ భూములను విక్రయానికి పెట్టారు. అలాగే కుంటలో ఏర్పడిన గుంతల్లో పడి ఇద్దరు పశువుల కాపరులు ప్రమాదవశాత్తు మరణించిన సంఘటనలు ఉన్నాయి. -
ఎఫెక్ట్
కొల్చారం(నర్సాపూర్): ఇందిరమ్మ ఇళ్ల పేరిట అక్రమంగా మంజీరా నుంచి ఇసుక రవాణా చేస్తూ సొ మ్ము చేసుకుంటున్న విషయమై ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఇసుకాసురులు’ కథనానికి రెవె న్యూ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. బుధవారం మండలంలోని పైతర శివారు మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను తహసీల్దార్ శ్రీనివాస్‌చారి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను పంచాయతీ ఆధీనంలో ఉంచారు. గురువారం పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. చిన్నశంకరంపేట(మెదక్): భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ భారతి రెవెన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలన్నారు. రైతులు కార్యాలయం చుట్టూ తిరగకుండా అధికారులు చొరవ చూపాలన్నారు. అనంతరం మండలంలోని చందంపేట ఎంఎస్ఎన్ పరిశ్రమపై గ్రామస్తులు ఫిర్యాదు చేయగా, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలిసి పరిశ్రమ పరిసరాలను పరిశీలించారు. ఆమె వెంట కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పఠాన్, తహసీల్దార్ మాలతి, ఆర్ఐ రాజు ఉన్నారు. నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు మంగళవారం పారిపోయిన విషయం తెలిసిందే. విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవల కారణంగా వేర్వేరుగా ఉంటున్నట్లు తెలిసింది. తండ్రి హైదరాబాద్‌లో ఉండగా, పిల్లలు వెతుక్కుంటూ తండ్రి వద్దకు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసు లు పారిపోయిన విద్యార్థులు మహ్మద్ ఆమెర్, మహ్మద్ నవాజ్ అలీని బుధవారం స్కూల్లో అప్పగించారు. దీంతో పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.గజ్వేల్: పట్టణంలో బుధవారం రాత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ చేతుల మీదుగా జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో సాగింది. రాత్రి 7:20 గంటల ప్రాంతంలో మంత్రి వివేక్, కలెక్టర్ హైమావతి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలతో కలిసి పట్టణంలోని ఐవోసీ సమావేశ మందిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొద్దిసేపు ప్రసంగించారు. ఇంతలోనే కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో మంత్రితో పాటు వేదికపైన ఉన్న వారు ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపు వేచి ఉన్నా కరెంటు రాకపోవడంతో మంత్రి వివేక్ చివరకు సెల్‌ఫోన్ లైట్ల వెలుతురుతో పాటు వీడియో కెమెరాల లైటింగ్‌లోనే కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 204 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, కొందరికే సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో మంత్రి అందించారు. సుమారు 10 నిమిషాలకుపైగా కార్యక్రమం సాగింది. ఆ తర్వాత కరెంటు సరఫరా రావడంతో మంత్రి మరోసారి వేదికపై ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కొద్దిసేపు ప్రసంగించి కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్లిపోయారు. కాగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి గల కారణాలను జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీశారు. స్థానిక విద్యుత్‌శాఖ ఏఈ మారుతిని అక్కడికి పిలిపించి వివరణ అడిగారు. ఈ సందర్భంగా ముట్రాజ్పల్లిలోని ట్రాన్స్ఫార్మర్ ఇన్సులేటర్పై బల్లి పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఏఈ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. చాలా సేపటి వరకు ఆ ఫీడర్‌లైన్ పునరుద్ధరణ కాకపోవడంతో ఐవోసీ వెనుకభాగంలో ఉన్న మరో ఫీడర్‌తో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు సమాచారం. -
వాహన బీమా.. భవితకు ధీమా
● ఆపద సమయంలో అండ ● విస్మరిస్తున్న వాహనదారులు ● జిల్లాలో 1.88 లక్షలకు పైగా వెహికిల్స్ మెదక్ మున్సిపాలిటీ: మనం ఉపయోగించే వాహనాలకు తప్పనిసరిగా బీమా చేయించాలి. కానీ ఈ విషయాన్ని చాలా మంది వివిధ కారణాలతో విస్మరిస్తున్నారు. జిల్లాలో దాదాపు 1.88 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో సగాని కంటే ఎక్కువ వాటికి బీమా లేనట్లు అధికారులు గుర్తించారు. మోటార్ వాహన చట్టం ప్రకారం ప్రతి వాహనానికి బీమా తప్పనిసరి. వాహనానికి అనుకొని ప్రమాదం జరిగితే.. బీమాతో తగిన పరిహారం పొందే అవకాశం ఉంటుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌తో ప్రమాదం జరిగితే డ్రైవర్‌కు లేదా ప్రయాణికులకు, ప్రమాదానికి గురైన వ్యక్తులకు నష్ట పరిహారం వర్తిస్తుంది. అయితే వాహనాన్ని బట్టి ప్రతి ఏడాది బీమా చెల్లించాలి. గతంలో లైసెన్స్ లేకపోయినా.. హెల్మెట్ లేకపోయినా జరిమానాలు విధించేవారు.. ఇప్పుడు వాహనానికి బీమా లేకుండా నడిపితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరగరాని నష్టం ఏం జరిగినా సదరు యజమానే నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఎలా నిర్ణయిస్తారు? వాహనం చోరీకి గురైనా.. ప్రమాదంలో నుజ్జునుజ్జయినా ఐడీవీని పాలసీదారుడికి చెల్లిస్తారు. వాహన కాల పరిమితి ఆధారంగా ఈ ఐడీవీని చెల్లించాల్సి ఉంటుంది. వాహనం కొనుగోలు చేసిన నెలలోపు అయితే 5 శాతం, ఏడాదిలోపు 15 శాతం, ఏడాది తర్వాత 20 శాతం, రెండేళ్లు దాటితే 30 శాతం, మూడేళ్లు దాటితే 40 శాతం, నాలుగేళ్లకు పైబడితే 5 శాతం తరుగుదల తీసేస్తారు. వాహన ప్రమాదానికి కారణమైన పాలసీదారుడు లేదా బాధితుడు, వారి తరఫున మరొకరు ప్రమాద సమాచారాన్ని వెంటనే బీమా కంపెనీకి, పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ కింద నష్టపరిహారం పొందడానికి బాధితులు మోటార్ వాహనాలకు సంబంధించిన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలి. సొంత వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగి నష్టం వాటిల్లితే వెంటనే బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి. కంపెనీ ప్రతినిధులు వచ్చే వరకు వాహనాన్ని ప్రమాద స్థలంలోనే ఉంచాలి. వాహనానికి సహజంగా జరిగే నష్టానికి బీమా కంపెనీలు పరిహారం చెల్లించవు. ఇబ్బందులు తప్పవు వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బీమా చేయించుకోవాలి. అనుకొని ప్రమాదం జరిగినప్పుడు బీమా ఉంటే 90 శాతం ప్రయోజనం చేకూరుతుంది. లేదంటే సర్వం కోల్పోవాల్సి వస్తుంది. వాహనదారులు నిర్లక్ష్యం వహించొద్దు. తనిఖీ సమయంలో బీమా లేని వాహనాలకు జరిమానా విధిస్తూ అవగాహన కల్పిస్తున్నాం. – మహేందర్, అదనపు ఎస్పీ -
చివరి గింజ వరకు కొంటాం
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: ప్రభుత్వం చివరిగింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఖేడ్, నిజాంపేట్, కల్హేర్ మండల్లాలోని పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు పంట ఉత్పత్తులను దళారులకు విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. గతంలో క్వింటాల్‌కు 7 కిలోల వరకు తరుగు పేరిట తీసేవారని, ఇప్పుడు అలా జరగకూడదని ఆదేశించామని చెప్పారు. మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్ అందిస్తుందని తెలిపారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోగా డబ్బులు జమ అవుతాయని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో రైస్‌మిల్లర్ల వద్ద కమీషన్లు తీసుకొని పనిచేశారని ఆరోపించారు. ధాన్యం తూకంలో అధికంగా తరుగు తీసుకుంటే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం విక్రయించేందుకు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ నూతన్ కుమార్, ఏవో శంకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
శతశాతం ఉత్తీర్ణత దిశగా..
పదవ తరగతిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా తయారు చేసిన అభ్యాసదీపికలు జిల్లాకు చేరుకోగా విద్యార్థులకు వాటిని పంపిణీ చేశారు. ఈ నెల 8నుంచి ప్రత్యేక తరగతులను సైతం ప్రారంభించారు. డిసెంబర్ నాటికి సిలబస్ పూర్తిచేసి జనవరి నుంచి రోజుకు 2 గంటలపాటు అదనంగా ప్రత్యేక తరగతులను నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. మెదక్‌జోన్: మెదక్ జిల్లా వ్యాప్తంగా 146 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా మోడల్‌స్కూల్, సోషల్ వెల్ఫేర్, కేజీవీబీ, బీసీవెల్ఫేర్, ప్రైవేట్ తదితర ఉన్నత పాఠశాలతోపాటు మొత్తం 231 ఉన్నాయి. వాటిలో 10వ తరగతి విద్యార్థులు 11,721 చదువుకుంటున్నారు. ఇందులో బాలురు 5,923 కాగా బాలికలు 5,798 మంది విద్యార్థులున్నారు. శతశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఈ నెల 8 నుంచి పాఠశాల ముగిసిన అనంతరం ఒక గంటపాటు అదనంగా ప్రత్యేక తరగతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాగా డిసెంబర్ నాటికి సిలబస్‌ను పూర్తి చేసి జనవరి నుంచి ఉదయం, సాయంత్రం గంట చొప్పున రోజుకు 2 గంటల పాటు అదనంగా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన అభ్యాసదీపికల్లో ప్రత్యేకంగా తయారు చేయించిన ప్రశ్నలపై ఉపాధ్యాయులు దృష్టి సారించి విద్యార్థులు ప్రతీ ప్రశ్నకు సమాధానం నేర్చుకునే విధంగా బోధిస్తున్నారు. గతేడాది 12వ స్థానంలో! గతేడాది పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రత్యేక చొరవ చూపించారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా పది విద్యార్థులకు అదనపు తరగతులు చెప్పించారు. కాగా, 2023లో రాష్ట్రంలో 18వ, స్థానంలో నిలిచిన మెదక్ జిల్లా గతేడాది 2024లో ఉత్తీర్ణతలో 12వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి వందశాతం ఉత్తీర్ణత సాధించి మొదటిస్థానంలో నిలిచేందుకు అధికారులు, ఉపాధ్యాయులు పకడ్బందీ కార్యాచరణను అమలు చేస్తున్నారు. అల్పాహారం ఎప్పట్నుంచో? పది విద్యార్థులకు ఇప్పటికే ప్రత్యేక తరగతులు ప్రారంభం కాగా జనవరి నుంచి రోజుకు 2 గంటల పాటు అదనంగా ప్రత్యేక తరగతులు ప్రారంభం కానున్నాయి. గతేడాది ఫిబ్రవరి 1నుంచి మార్చి 15 వరకు విద్యార్థులకు అల్పాహారం అందించారు. ఈసారి కూడా గతేడాది మాదిరిగానే సాయంత్రం వేళలో విద్యార్థులకు అల్పాహారం అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అభ్యాసదీపికల పంపిణీ ఈ నెల 8నుంచి ప్రారంభమైన ప్రత్యేక తరగతులు డిసెంబర్ నాటికి పూర్తికానున్న సిలబస్ జనవరి నుంచి రోజు అదనపు తరగతులు వందశాతం ఉత్తీర్ణత సాధిస్తాం గతేడాది రాష్ట్రస్థాయిలో పోల్చుకుంటే మెదక్ జిల్లా 12వ స్థానానికి పరిమితమైంది. ఈసారి వందశాతం ఉత్తీర్ణత సాధిస్తాం. అందుకు అనుగుణంగా ఇప్పటికే కార్యాచరణ రూపొందించాం. సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులను కొనసాగిస్తున్నాం. –రాధాకిషన్, డీఈఓ మెదక్ -
నూనె గింజల ఉత్పత్తిని పెంచాలి
కలెక్టర్ రాహుల్రాజ్రేగోడ్(మెదక్)/పాపన్నపేట(మెదక్): నూనె గింజల ఉత్పత్తులను పెంచాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రేగోడ్లోని రైతువేదిక కార్యాలయంలో మంగళవారం నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ అమలుపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ అధికారి, రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. పొద్దుతిరుగుడు 93%, శనగ విత్తనాలు 50% రాయితీతో ఎంపిక చేసిన రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా అధిక దిగుబడి సాధించడమే కాకుండా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. ప్రతీ రైతు ఈ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. నూనెగింజల ఉత్పత్తి ద్వారా స్థానిక సాధికారతను సాధించి దిగుమతులను తగ్గించుకోవచ్చని తెలిపారు. అనంతరం స్థానిక పశు వైద్యశాలను, పాపన్నపేట మండల పరిధిలోని పొడిచన్పల్లి ప్రాథమిక ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కిషన్, ఏడీఏ రాంప్రసాద్, ఏఓ జావీద్ తదితరులు పాల్గొన్నారు. 1,500 హెక్టార్లలో వేరుశనగ ఆయా మండలాల్లో రైతు సంఘాల సహకారంతో సుమారు 1,500 హెక్టార్లలో వేరుశనగ సాగును ప్రోత్సహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్‌కుమార్ తెలిపారు. నాణ్యమైన విత్తనాల సరఫరా, ఉత్పాదకత పెంపునకు శిక్షణా కార్యక్రమాలు, విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతు పొలంబడులను నిర్వహించనున్నట్లు వివరించారు. అలాగే బిందు సేద్యం ఏర్పాటు కోసం ఉద్యానవన శాఖ సహకారం అవసరమని అన్నారు. పంట అవశేషాలు తగుల బెట్టకండి: వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్ పాపన్నపేట(మెదక్): వరి పంట అవశేషాలు తగుల బెట్టవద్దని జిల్లా వ్యవసాయ అధికారి దేవ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం పాపన్నపేట మండలం ఆరెపల్లిలో వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. తగులబెట్టడం వల్ల భూమిలో ఉన్న సేంద్రియ కర్బనం, భూమి భౌతికస్థితి దెబ్బతినడంతోపాటు కాలుష్యం కూడా పెరుగుతుందన్నారు. సర్వేలో అందరూ పాల్గొనాలిమెదక్ కలెక్టరేట్: తెలంగాణ రైజింగ్–2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ స్వాతంత్య్రానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్–2047’సిటిజన్ సర్వేను చేపట్టిందని పేర్కొన్నారు. ఈ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. గతవారం ప్రారంభించిన ఈ సర్వే ఈ నెల 25తో ముగుస్తుందని, https://www.telangana.gov.in/ telanganarisingను సందర్శించి సలహాలు, సూచనలు అందించాల్సింది కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. -
రూ.వేలు ఖర్చవుతున్నాయి
ప్రతీ ఏటా పంటల సీజన్లో టార్పాలిన్ల అద్దెకోసం రూ.ఆరు వేల వరకు వేలు ఖర్చవుతున్నాయి. గతంలో మాదిరిగా ప్రభుత్వమే సబ్సిడీపై సరఫరా చేయాలి. ఇప్పటికే సమస్యల్లో కూరుకుపోయిన తమకు అదనపు భారంగా మారింది. –లాల్య నాయక్, చౌకత్పల్లి తండా ఉచితంగా సరఫరా చేయాలి ప్రతీ రైతుకు ప్రభుత్వమే ఉచితంగా టార్పాలిన్లు సరఫరా చేయాలి. ఇవి అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాలనుంచి అద్దెకు తెచ్చుకుంటున్నాం. ఈ భారాన్ని తమపై మోపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – కంలియా నాయక్, దంతేపల్లి తండా గతంలోనే రద్దయిందిరైతులకు సబ్సిడీపై టార్పాలిన్ల పంపిణీ పథకం నాలుగేళ్ల క్రితమే రద్దయింది. పథకాన్ని పునరుద్ధరించాలని చాలామంది రైతులు కోరుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నుంచి మంజూరైతే ఇస్తాం. –రాజ్‌నారాయణ, ఏడీఏ, రామాయంపేట -
సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి
ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: పేద వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. వివిధ గ్రామాలకు చెందిన పలువురికి ఆస్పత్రి ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని గుర్తు చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహ్మారెడ్డి నాయకులు అవుటి శంకర్ పాల్గొన్నారు. ఖేడ్ ఆర్టీసీ డీఎంగా బాధ్యతలు చేపట్టిన సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే సంజీవరెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఖేడ్ ప్రాంతంలో ఆయా రూట్లలో పలు బస్సులు నడపాల్సిన గ్రామాలను గురించి వారు చర్చించారు. ఖేడ్ క్యాంపు కార్యాలయంలో దీపావళిని పురస్కరించుకుని ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అనుపమారెడ్డి దంపతులు లక్ష్మిపూజ నిర్వహించారు. నర్సాపూర్: విద్యుత్ సమస్యలను గుర్తించేందుకే తమ శాఖ ప్రజాబాట కార్యక్రమం చేపట్టిందని మెదక్ డీఈ బాషా, ఏడీఈ రమణరెడ్డి చెప్పారు. మంగళవారం పట్టణంలో ప్రజా బాట కార్యక్రమాన్ని డీఈ ప్రారంభించారు. ప్రజాబాటలో పలు సమస్యలను గుర్తించామని, వాటిని రెండు విభాగాలు విభజించామని చెప్పారు. బడ్జెట్‌తో కూడుకున్న సమస్యలకు నిధులు రాగానే పరిష్కరిస్తామన్నారు. బడ్జేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని రమణరెడ్డి తెలిపారు. పలు వీధుల్లో కండక్టర్ వైరు పాతబడిందని, దానిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఏఈ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి న్యాల్కల్(జహీరాబాద్): రైతులకు సకాలంలో విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా మండలానికి 350 బస్తాలు శనగ విత్తనాలు, 5 క్వింటాళ్ల కుసుమ విత్తనాలు వచ్చాయని వెల్లడించారు. విత్తనాలు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న రైతులు పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులతో రైతు వేదిక వద్దకు మంగళవారం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విత్తనాలను న్యాల్కల్లోని రైతు వేదికల్లో రైతులకు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి అభినాష్ వర్మ, ఏఈఓలు సాయిలు, హీనా, రైతులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో 12మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటి భర్తీకి ఈ నెల 28న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు డీసీహెచ్ డాక్టర్ శివదయాల్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు 11, అసిస్టెంట్ సర్జన్ జీడీఎంఓస్ (01) పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈనెల 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 03 గంటల వరకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లోఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 93945 14999కు సంప్రదించాలన్నారు. -
పంట ఆరబోసేదెలా?
● టార్పాలిన్లు లేక ఇబ్బందులపాలవుతున్న రైతులు ● అద్దెకు తెచ్చుకుంటున్న రైతులపై అదనపు భారం గతంలో మాదిరిగా ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్లు ఇవ్వకపోడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ సీజన్లో ఒక్కొక్కరిపై కనీసం రూ.రెండు వేల నుంచి మూడున్నర వేలవరకు భారం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రామాయంపేట(మెదక్): పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికిగాను ప్రస్తుత పరిస్థితుల్లో టార్పాలిన్లు అత్యవసరం. గతంలో ప్రభుత్వం 50% రాయితీపై వాటిని సరఫరా చేసింది. గత నాలుగైదేళ్లుగా ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. టార్పాలిన్లు లేకపోవడంతో రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ధాన్యం ఆరబోస్తున్న రైతులు ఇబ్బందులపాలవుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అద్దైపె టార్పాలిన్లు అందించే వారిని ఆశ్రయిస్తున్నారు. గత ప్రభుత్వ హాయాంలో రైతులకు 50% సబ్సిడీపై వ్యవసాయశాఖ ద్వారా టార్పాలిన్లు సరఫరా చేసింది. ఎనిమిది అడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పు ఉన్న టార్పాలిన్ల అసలు ధర రూ.2,500 కాగా, రైతులకు రూ.1,250 కే అందజేసింది. రెండు, మూడేళ్లపాటు ఈ పథకం కొనసాగగా, పెద్ద సంఖ్యలో రైతులు వాటిని కొనుగోలు చేశారు. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో టార్పాలిన్లను సబ్సిడీపై అందజేయగా, గత నాలుగేళ్ల క్రితం ఈ పథకం రద్దయింది. రైతన్నలకు అదనపు ఖర్చు ఆంధ్రప్రదేశ్‌నుంచి వచ్చిన వ్యాపారులు కొందరు జిల్లాలోని పెద్ద గ్రామాలు, పట్టణాల పరిధిలో టార్పాలిన్లు అద్దెకు ఇచ్చే దుకాణాలు ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా పరిధిలో 80 వరకు తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకుని అద్దెకు ఇస్తున్నారు. రైతుల ఆధార్ కార్డులు తనఖా పెట్టుకుని టార్పాలిన్లు ఇస్తూ ఒక్కోదానికి రోజూ రూ.25 నుంచి రూ.30 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికిగాను సాధారణంగా ప్రతీ రైతుకు కనీసం ఆరు నుంచి పది టార్పాలిన్లు అవసరం అవుతుండగా, వాటిపై ప్రతీ రోజు రూ.300 వరకు భారం పడుతోంది. పంట నూర్పిడి చేయడం, ఆరబెట్టడం, సంచుల్లో నింపి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించడానికి రైతులకు కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన రైతులపై టార్పాలిన్ల అద్దె కోసం రూ.ఆరు వేల వరకు ఖర్చవుతుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై టార్పాలిన్లు అందజేయాలని రైతులు కోరుతున్నారు. -
శాంతిభద్రతల్లో పోలీస్ కీలకం
అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ రాహుల్‌రాజ్ మెదక్ మున్సిపాలిటీ: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల కీలకమని, వారి ధైర్య సాహసాలకు ప్రజలు అండగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులతో టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు ధైర్యసాహసాలే ప్రధానమన్నారు. మెదక్ జిల్లాలో కూడా గత 20 ఏళ్లలో చాలామంది పోలీసులు చనిపోవడం బాధాకరమన్నారు. అమరుల త్యాగాలు మరువలేనివని, వారు చూపించిన ఆశయాల కొనసాగింపే వారికి నిజమైన నివాళి అని తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ..అమరవీరుల త్యాగాలు చాలా గొప్పవని, ప్రతీ ఏటా అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ ధైర్యసాహసాలతో పోలీసు డిపార్ట్మెంట్ మరింత ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
భూ సేకరణ వేగవంతం చేయాలి సంగారెడ్డి జోన్: జిల్లాలో ఏర్పాటు కానున్న నిమ్జ్, టీజీఐఐసీ కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి, జహీరాబాద్ డివిజన్లలో జరుగుతున్న టీజీఐఐసీ, నిమ్జ్ భూసేకరణ పనుల పురోగతిపై ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు, టీజీఐఐసీ, నిమ్జ్ అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ సమీక్షించారు. నిమ్జ్ ప్రాజెక్టు మొదటి దశ ఏర్పాటుకు ఇప్పటివరకు 1,501 ఎకరాల భూసేకరణ పూర్తి చేసినట్లు రెవెన్యూ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మిగిలిన భూమిని సైతం త్వరలోనే సేకరించి అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...భూసేకరణకు అవసరమైన నిధులు టీజీఐఐసీ తక్షణం చెల్లించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భూసేకరణకు నిధుల కొరత లేదని తెలిపారు. ఇప్పటివరకు టీజీఐఐసీ, నిమ్జ్ ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీల ప్రకారం పరిహారం అందించినట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, నిమ్జ్ ప్రత్యేకాధికారి విశాలాక్షి, సంగారెడ్డి, జహీరాబాద్ ఆర్డీఓలు, టీజీఐఐసీ ప్రతినిధులు, నిమ్జ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
రామాయంపేట(మెదక్): అగ్ని ప్రమాదాల పట్ల ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరించారు. ఆదివారం ఆయన స్థానిక ఫైర్స్టేషన్ను తనిఖీ చేసి మా ట్లాడారు. జిల్లాలో ఫైర్స్టేషన్ల సేవలు అమోఘమని, ఎక్కడ అగ్నిప్రమా దం సంభవించినా క్షణాల్లో అక్కడికి వెళ్లి మంటలు ఆర్పుతున్నారని పేర్కొన్నారు. ఈసందర్భంగా ఫైర్‌కు సంబంధించిన పరికరాలను పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆపద సమయాల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని ఆదేశించారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి ఏమైనా సమస్యలున్నాయా..? అని ఆరా తీశారు. ఈసందర్భంగా జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా హవేళిఘణాపూర్(మెదక్): విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ మండలం పాతూర్ సబ్‌స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి సరఫరా తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకు ండా నిరంతరంగా విద్యుత్ సరఫరా కొనసాగించాలన్నారు. సిబ్బంది సమన్వయంతో పని చేయా లని సూచించారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ -
‘మద్యం’ దరఖాస్తుల గడువు పెంపు
మెదక్ అర్బన్: లేదు.. లేదంటూనే మద్యం దుకాణాల దరఖాస్తు గడువును పెంచుతూ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 23 వరకు అవకాశం కల్పించగా, లక్కీ డ్రా 27న నిర్వహించనున్నారు. అయితే టార్గెట్ కోసం గడువు పెంచారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 49 వైన్ షాపులుండగా, గతేడాది 1,905 దరఖాస్తులు రాగా, ఈసారి 1,369 మాత్రమే వచ్చాయి. గతంలో రూ. 38.10 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ. 41.07 కోట్లు సమాకూరాయి. ఆదాయం పెరిగినా దరఖాస్తుల వారీగా చూస్తే తక్కువగా వచ్చాయి. అయితే గతేడాది కంటే దరఖాస్తులు ఎక్కువగా వచ్చేందుకు ఎకై ్సజ్ అధికారుల నానా ప్రయత్నాలు చేశారు. వైన్ బిజినెస్‌తో సంబంధం ఉన్న వారికి ఫోన్లు చేసి మరీ టెండర్లు వేయించినా, గత టార్గెట్ చేరలేకపోయారు. అయితే దరఖాస్తు రుసుము రూ. 3 లక్షలకు పెంచడం.. వైన్స్ దందాలో ఆశించిన లా భాలు రాకపోవడంతో దరఖాస్తులు తగ్గాయని.. దీంతో ఎకై ్సజ్ అధికారుల టార్గెట్ ఫలించలేదని తెలుస్తోంది. అయితే గడువు పెంపుతో టెండర్‌దారులకు కొత్త పోటీ ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 23 వరకు అవకాశం జిల్లాలో గతేడాది 1,905, ఈసారి 1,369 దరఖాస్తులు టార్గెట్ కోసమే అంటున్న టెండర్‌దారులు 18న బీసీ బంద్ ఉంటుందని సమాచారం ఉండటంతో టెండర్దారులంతా ముందే బ్యాంకు డీడీలు తీసి ఉంచారు. అయితే చివరి రోజు సాయంత్రం వరకు ఏ షాపుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి. వాటి ఆఫ్ టెక్ ఎంత? లాభాల అవకాశాన్ని బేరీజు వేసుకొని షాపు దక్కే అవకాశాలను పరిశీలించి, చివరి సమయంలో షాపులను ఎంపిక చేసుకొని దరఖాస్తు చేశారు. శనివారం రాత్రి దాదాపు 12 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. జిల్లాలో అత్యధికంగా పోతంషెట్పల్లి వైన్స్‌కు 54 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా మెదక్ (గెజిట్ 45), నిజాంపేట (కల్వకుంట) షాపులకు 14 చొప్పు న దరఖాస్తులు అందాయి. అయితే చివరి సమయంలో శనివారం రాత్రి టెండర్ షెడ్యూల్ గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయ డంతో ఇప్పటికే టెండర్ వేసిన వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చెక్‌పోస్టులో ఏసీబీ సోదాలు
● లెక్కకు రాని రూ. 42,300నగదు స్వాధీనం ● రికార్డులను సీజ్ చేసి తీసుకెళ్లిన అధికారులు జహీరాబాద్: రాష్ట్ర సరిహద్దులోని మొగుడంపల్లి మండలం మాడ్గి శివారులోని రవాణశాఖ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఆదివారం తెల్లవారు జామున ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ, డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీల్లో పాల్గొన్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సరిహద్దు రవాణ శాఖ చెక్‌పోస్టుల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా జహీరాబాద్ సమీపంలోని 65వ జాతీయ రహదారిపై గల చెక్‌పోస్టులో ఆదివారం ఉదయం వరకు సోదాలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెక్‌పోస్టులో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యా దులు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో రూ. 42,300 నగదు దొరికిందని వివరించారు. ఇందుకు సంబంధించి ఏ ఎంవీఐ కిరణ్‌కుమార్ సరైన సమాధానం చెప్పకపోవడంతో నగదు, రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఏఎంవీఐ ప్రైవేటు వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. -
కొనుగోళ్ల జాడేది?
రెక్కలు ముక్కలు చేసుకొని మొక్కజొన్న పండించిన రైతులు పంటను అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇదే అదనుగా దళారులు నిండా ముంచుతున్నారు. దీనికి తోడు తూకంలో మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాపారస్తులు సిండికేట్‌గా మారి మద్దతు ధర అమాంతం తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. – రామాయంపేట(మెదక్) జిల్లావ్యాప్తంగా సుమారుగా 3 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగవుతోంది. గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు పంట తీవ్రంగా దెబ్బతింది. పంట దిగుబడి 30 శాతం మేర తగ్గడంతో పాటు చేలల్లో నీరు నిలిచి మొక్కజొన్నలు మొలకలెత్తి రంగు మారాయి. అష్టకష్టాల మీద రైతులు పంటను కోసి జూడు తీశారు. రంగు మారిన కంకులు మొలకలెత్తడంతో మార్కెట్లో తక్కువ ధరకే వ్యాపారస్తులు తీసుకుంటున్నారు. మార్క్‌ఫెడ్ జాడ ఎక్కడ..? పంట దెబ్బతిని నష్టపోయిన బాధిత రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి. జిల్లా పరిధిలో మొక్కజొన్నల కొనుగోలు నిమిత్తం మార్క్‌ఫెడ్ సంస్థ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా వారు మోసాలకు పాల్పడుతున్నారు. మొక్కజొన్నలకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 2,400 ప్రకటించగా, దళారులు కుమ్మకై రూ. 1,800 కొనుగోలు చేస్తున్నారు. డీసీఎంలో తూకం యంత్రంతో పాటు హమాలీలను తీసుకొని గ్రామాలకు వస్తున్న దళారులు రైతులను మోసం చేస్తున్నారు. క్వింటాల్‌కు కేజీ నుంచి కేజీన్నర తరుగు తీస్తూ దోపిడీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. మెదక్‌జోన్: అతివృష్టితో వేలాది ఎకరా ల పంటలు ధ్వంసం కాగా, చేతికందిన కొద్దిపాటి పంట ఉత్పత్తులను సకాలంలో అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టా లు పడుతున్నారు. కొనుగోలు చేయాల్సిన యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతులు ప్రైవేట్ వ్యా పారులను ఆశ్రయిస్తున్నారు. వచ్చిన కాడికి అమ్ముకొని తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. 37,200 ఎకరాల్లో పత్తి సాగు జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పత్తి సాగవుతోంది. ముఖ్యంగా ఈ పంటను నల్లరేగడి భూముల్లో వర్షాధారంగా సాగుచేస్తారు. టేక్మాల్, అల్లాదుర్గం, రే గోడ్, పెద్దశంకరంపేట మండలాలతో పాటు కొంత మేర చేగుంట మండలంలోనూ రైతులు సాగు చేశారు. ఈ సీజన్లో 37,200 ఎకరాల్లో పత్తి సాగు కాగా, అతివృష్టితో చాలా వరకు పంట దెబ్బతింది. మిగిలిన పంట చేతికందటంతో ప్రస్తుతం పత్తి ఏరుతున్నారు. కాగా జిన్నింగ్ మిల్లుల ద్వారా కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 8,100 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు రూ. 6 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతు లు డిమాండ్ చేస్తున్నారు. ప్రారంభం కాని తూకంఈ ఖరీఫ్ సీజన్లో వరి 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 4.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం 498 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 98 కేంద్రాల ద్వారా సన్నరకం ధాన్యం, 400 సెంటర్ల ద్వారా దొడ్డురకం ధాన్యం కొంటామని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 476 సెంటర్లను జిల్లావ్యాప్తంగా ప్రారంభించారు. కానీ తూకం (కాంటాలు) ఎప్పుడు ప్రారంభించలేదు. దీంతో రైతులు పంటలు కోసి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 100 సెంటర్లకుపైగా రైతులు ధాన్యం తరలించి ఆరబెట్టారు. గత రెండు, మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చల్లటి గాలులు వీయటం, మబ్బులు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రకటించిన మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఇదే విషయమై సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జగదీశ్ కుమార్‌ను వివరణ కోరగా.. వరి ధాన్యాన్ని దీపావళి తర్వాత తూకం వేస్తామని తెలిపారు. రైతులు తొందర పడొద్దు తొందరపడి రైతులు తక్కువ ధరకు మొక్కజొన్నలు విక్రయించొద్దు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 2,400 ఉంది. ఈరెండు, మూడు రోజుల్లో రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. – క్రాంతి, డీఎం, మార్క్‌ఫెడ్ భారీ వర్షాలతో నష్టపోయాం భారీ వర్షాలతో మొక్కజొన్న పంట దెబ్బతింది. మక్కులు రంగుమారాయి. పెట్టిన పెట్టుబడులు సైతం నష్టపోయాం. ఆదుకుంటామన్న అధికారులు పత్తాలేరు. విధిలేని పరిస్థితుల్లో దళారులకు తక్కువ ధరకు విక్రయించాం. – స్వామి, రైతు, శివాయపల్లి పత్తా లేని పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు భయపెడుతున్న వాతావరణ మార్పులు పట్టించుకోని అధికారులు -
మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
మెదక్‌జోన్: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావును పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మేడి సతీశ్‌రావు కోరారు. ఆదివారం పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆయనను కలిసి పలు డిమాండ్లపై వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాను చార్మినార్ జోన్లో విలీనం చేయాలని, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను త్వరగా మంజూరు చేయటంతో పాటు జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు సామ్యానాయక్, సబ్బని శ్రీనివాస్‌తో పాటు జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీని డిసెంబర్‌లోగా ప్రకటించాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి ప్రభుత్వాన్ని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. గత ప్రభుత్వం విస్మరించిన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. సీపీఎస్ రద్దు, మంచి ఫిట్మెంట్, పీఆర్సీ పెండింగ్‌లో ఉన్న డీఏలు, పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రెండేళ్లు అయినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సరికాదన్నారు. మనోహరాబాద్(తూప్రాన్): మండలంలోని కాళ్లకల్‌కు చెందిన సన్‌షైన్ షోటోకాన్ కరాటే క్లబ్ సభ్యులు హీరో సుమన్‌ను ఆదివారం కలిశారు. ఈసందర్భంగా కరాటే అసోసియేషన్, పోటీలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తమ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే నేషనల్ లెవల్ టోర్నమెంట్ గురించి సలహాలు తీసుకున్నట్లు క్లబ్ ఫౌండర్, అధ్యక్షుడు మల్లేశ్ తెలిపారు. వీరి వెంట మాస్టర్లు మహేశ్, శ్రీకాంత్, అభిలాశ్, తరుణ్, బాబి, అంజలి, తనుజ, స్పందన, నందిని తదితరులు ఉన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): ఓపెన్ స్కూల్లో ఇంటర్, పదో తరగతిలో చేరేందుకు ఈనెల 23వ తేదీ ఆఖరని ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ విఠల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్లో చేరే అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నర్సాపూర్: ప్రభుత్వం పీఆర్సీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్లం, లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇటీవల తపస్ నర్సాపూర్ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా ఎంపికై న శివకుమార్, రవికుమార్‌ను ఆదివారం సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, పెండింగ్ డీఏలను ఇవ్వాలని కోరారు. 317 జీఓ ద్వారా అన్యాయం జరిగిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు కొండల్, రాజు తదితరులు పాల్గొన్నారు. రాయికోడ్(అందోల్): సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్మాలంటే రైతులు తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్‌బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సారిక స్పష్టం చేశారు. -
దళారులను నమ్మి మోసపోవద్దు
టేక్మాల్(మెదక్): రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. శనివారం మండలంలోని బర్దిపూర్‌లో పత్తి పంటను పరిశీలించారు. వర్షాలకు పంటలు దెబ్బతిని దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆయనకు వివరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 25,939 మంది రైతులు 34,903 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని పాపన్నపేట సిద్ధార్థ జిన్నింగ్ మిల్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కొనుగోలు కేంద్రాలను మానిటరింగ్ చేసేందుకు లోకల్ కమిటీలను నియమించామన్నారు. ఎప్పటికప్పుడు రైతులు మద్దతు ధర పొందేలా అధికారులు కృషి చేయాలన్నారు. లీగల్ మెట్రాలజీ అధికారులు తేమ కొలిచే యంత్రాలను పరిశీలించాలన్నారు. సీసీఐ అధికారుల పర్యవేక్షణ ఉండాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా జిన్నింగ్ మిల్లు యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్, రైతులు ఉన్నారు.కలెక్టర్ రాహుల్‌రాజ్ -
49 షాపులు.. 1,350 దరఖాస్తులు
మెదక్‌జోన్: జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం ఎకై ్సజ్‌శాఖ నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గింది. జిల్లాలోని 49 మద్యం షాపులకు శనివారం రాత్రి వరకు అప్లికేషన్లు తీసుకున్నారు. రాత్రి 10 గంటల వరకు 1,350 దరఖాస్తులు వచ్చినట్లు ఈఎస్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గతంతో పోల్చితే ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గింది. 2023లో 1,905 దరఖాస్తులు, రూ. 38.10 కోట్ల ఆదాయం రాగా, ఈసారి పెరిగిన దరఖాస్తు ఫీజుతో రూ. 40.5 కోట్ల ఆదాయం వచ్చింది. రూ. 2.5 కోట్లు అదనంగా ఎకై ్సజ్‌శాఖకు సమకూరింది. ఆఖరు రోజు శనివారం రాత్రి 10 గంటల వరకు 517 దరఖాస్తులు రావటం గమనార్హం. ఈ నెల 23న కలెక్టరేట్లో లక్కీ డ్రా తీసి షాపులు కేటాయించనున్నారు. రూ.3 లక్షలకు పెంచడమే కారణమా! ప్రభుత్వం ఈసారి మద్యం షాపుల దరఖాస్తు ఫీజును భారీగా పెంచింది. 2023లో రూ. రెండు లక్షలు ఉన్న ఈ ఫీజును ఈసారి ఏకంగా రూ.3 లక్షలకు పెంచింది. దీంతో మద్యం వ్యాపారులు ఆచితూచి దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో ఒక్కో షాపునకు ఆరు ఏడు దరఖాస్తులు చేసుకున్న సిండికేట్ వ్యాపారులు ఈసారి నాలుగైదుతో సరిపెడుతున్నారు. గతంతో పోలిస్తే 555 తక్కువ పెరిగిన ధరతో రూ. 2 కోట్లు అదనం మద్యం షాపులకు ముగిసిన అప్లికేషన్ల ప్రక్రియ -
సమస్యల పరిష్కారానికి కృషి
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని బాలికల ఎస్టీ గురుకుల పాఠశాలను శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. గణితం బోధించే లెక్చరర్ లేకపోవడంతో ఇటీవల ఇంటర్ విద్యార్థినులు ధర్నా చేసిన విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతరం గురుకులంలోని వంటగది, తరగతి గదులను పరిశీలించారు. గురుకులం నిర్వహణ గురించి ప్రిన్సిపాల్ సుమతిని అడిగి తెలుసుకున్నారు. దారిలో వీధి దీపాలు లేకపోవడంతో గురుకుల సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, అలాగే మెరుగైన రోడ్డు లేదని ప్రిన్సిపాల్ ఆయన వివరించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎఎస్డబ్ల్యూఓ లింగేశ్వర్, తహసీల్దార్ శివప్రసాద్, ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి, హాస్టల్ వార్డెన్ రమేశ్, సిబ్బంది ఉన్నారు.ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
లెక్క ఎంచక్కా..
భూ కొలతలు పక్కా..నెల రోజుల నిరీక్షణకు తెర..జిల్లాకు లైసెన్స్డ్ సర్వేయర్లు వచ్చేస్తున్నారు ● మొదటి విడతలో 106 మందికి శిక్షణ.. 77 మంది అర్హత ● రెండో విడతలో 78 మందికి ట్రైనింగ్ ● నేడు సీఎం చేతుల మీదుగా లైసెన్స్లుమెదక్ అర్బన్: ఆధునిక పరికరాలతో సర్వే చేసి.. భూ కొలతలను పక్కాగా నిర్ధారించడానికి లైసెన్స్డ్ సర్వేయర్లు రంగంలోకి దిగుతున్నారు. జిల్లాలో శిక్షణ పొంది అర్హత సాధించిన 77 మంది సర్వేయర్లకు ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి లైసెన్స్‌లు అందజేయనున్నారు. అనంతరం జిల్లా అధికారులు మండలానికి నలుగురు నుంచి ఆరుగురు సర్వేయర్లను కేటాయించనున్నారు. తీరనున్న ఇబ్బందులు ప్రజలకు సులభంగా భూ సేవలు అందించేందుకు ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. జిల్లాలో 21 మండలాలు ఉండగా, కేవలం 10 మంది రెగ్యులర్ సర్వేయర్లు ఉన్నారు. దీంతో అర్హత గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరగా, మొదటి విడతలో 106 మంది ఎంపికయ్యారు. వీరికి 50 రోజుల శిక్షణ అనంతరం పరీక్ష పెట్టారు. అందులో అర్హత సాధించిన వారికి సీనియర్ సర్వేయర్ వద్ద 40 రోజుల క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తారు. అనంతరం నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత పొందితే, వారికి సర్వేయర్ లెసెన్స్ ఇస్తారు. ఈ క్రమంలో జిల్లాలో మొదటి విడతలో 106 మందిని ఎంపిక చేసి మే 26 నుంచి శిక్షణ ఇచ్చారు. అందులో నుంచి 77 మంది చివరి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వీరికి సీఎం చేతుల మీదుగా లైసెన్స్‌లు ఇవ్వనున్నారు. అనంతరం మండలానికి నలుగురు నుంచి ఆరుగురిని లైసెన్స్డ్ సర్వేయర్లనుగా నియమించనున్నారు. కాగా ఆగస్టు 18 నుంచి రెండో విడత శిక్షణ ప్రారంభం కాగా, జిల్లాలో 103 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 78 మంది మాత్రమే శిక్షణకు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఎంపికై న సర్వేయర్లకు ప్రభుత్వం అధునాతన డీజీపీఎస్ మిషన్లు ఇవ్వనున్నారు. వీటితో ఖచ్చితమైన కొలతలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే తమకు జీతాల విషయంలో స్పష్టత లేదని, ప్రభుత్వం తరఫున నెల నెలా జీతాలు ఇచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చాలని అభ్యర్థులు కోరుతున్నారు.లైసెన్స్డ్ సర్వేయర్లుగా ఉత్తీర్ణులైన వారు నెల రోజులుగా మండలాల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నారు. శిక్షణ ఇచ్చారు.. పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకపోవడంతో కొంత నిరాశ చెందారు. నెల రోజుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న రెండో బ్యాచ్‌కు వివిధ పరీక్షలను నిర్వహించిన తర్వాత లైసెన్స్‌లను జారీ చేయనున్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరించడమే
మెదక్ మున్సిపాలిటీ: సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదని, ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ఆయా సంఘాల నాయకులు, పార్టీల ప్రతినిధులు అన్నా రు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికై నా అక్రమ కేసులు, వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి పలు పార్టీలు, ప్రజాసంఘాల నేతల డిమాండ్ -
‘జాగ్రత్తలు తప్పనిసరి’
మెదక్ కలెక్టరేట్: జిల్లా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. అగ్ని ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాణాసంచా విక్రయించే వారు అనుమతులు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు సరళమైన ధరలకే అమ్మాలన్నారు. పటాకులు కాల్చేటప్పుడు పిల్లలు, పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పాల్గొనాలన్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన నాణ్యమైన పటాకులనే వినియోగించాలన్నారు. పర్యావరణహిత పటాకులను ఉపయోగించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. అగ్ని ప్రమాదాలు, గాయాలు సంభవించినప్పుడు వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించడంతో పాటు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 101 లేదా 8712699263కు తెలియజేయాలనివివరించారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి నర్సాపూర్: మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని ఇన్చార్జి డీడబ్ల్యూఓ హేమభార్గవి అన్నారు. మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం మున్సిపాలిటీలోని హన్మంతాపూర్‌లో అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వయం సహాయక సంఘాల మహిళలతో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగు పర్చుకోవడానికి పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. చదువుకొని విజ్ఞాన వంతులు కావాలన్నారు. సమావేశంలో లీగల్ సర్వీస్ కమిటీ సభ్యురాలు స్వరూపరాణి, జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ కోఆర్డినేటర్ సంతోష, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. సఖీ, భరోసా కేంద్రాలతో రక్షణ మెదక్‌జోన్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన సఖీ, భరోసా కేంద్రాలు ఎంతోమంది బాధిత మహిళలకు రక్షణ వేదికలని సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమా అన్నారు. శనివారం ఆమె పట్టణంలోని సఖీ, భరోసా కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. ఈ వేదికల ద్వారా ఎంతో మంది బాధిత మహిళలకు వైద్య సహాయం, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలు అందుతాయని తెలిపారు. బాలసదన్‌లో చిన్నారులతో మాట్లాడి, వారి సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట సిబ్బంది సుచిత, శ్వేత, అడ్వకేట్ బాల నరసింహులు తదితరులు ఉన్నారు. నూతన నియామకం మెదక్‌జోన్: Æ>çÙ‰ {糿¶æ$™èlÓ ÇOsñæÆŠḥz E§øÅ-VýS$ÌS çÜ…çœ$… hÌêÏ A«§ýlÅ-„ýS$-yìlV> Ô>Å…çÜ$…-§ýl-ÆŠ‡¯]l$ HMýS-{X-Ð]l…V> G¯]l$²-MýS$-¯é²Æý‡$. Ôèæ°-ÐéÆý‡… ç³rt׿ …ÌZ° ÇOsñæÆŠ‡z E§øÅ-VýS$ÌS ¿ýæÐ]l-¯]l…ÌZ HÆ>µr$ ^ólíܯ]l D çÜÐ]l*Ðól-Ô>°MìS çÜ…çœ$… Æ>çÙ‰ A«§ýlÅ-„ýS$yýl$ _ÍÐólÇ ^èl…{§ýl-Ôóæ-QÆŠ‡ Ð]l¬QÅ A†¤V> àf-Æý‡Ä¶æ*ÅÆý‡$. DçÜ…-§ýlÆý‡Â…V> BĶæ$¯]l Ð]l* sêÏ-yýl$-™èl*.. ÇOsñæÆŠ‡z E§øÅ-VýS$ÌS çÜÐ]l$-çÜÅÌS ç³Ç-ÚëPÆý‡… MøçÜ… °Æý‡…-™èl-Æý‡…V> MýS–íÙ ^ólÝë¢-Ð]l$-¯é²Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ Ð]l*i A«§ýlÅ-„ýS$yýl$ fVýS©‹Ù^èl…{§ýl, {糫§é¯]l M>Æý‡Å-§ýlÇØ çÜ™èlÅ-¯é-Æ>-Ķæ$׿, MøÔ>-«¨M>Ç VøÍ MýS$Ð]l*ÆŠæ, AÝùíÜÄôæ$sŒæ {ò³íÜyðl…sŒæ Æ>Ð]l¬Ë$, E´ë-«§ýlÅ„ýS$Ë$ ´ù^èlĶæ$Å, Ððl*çßæ-¯ŒSÆ>gŒæ, çÜ$ÖÌS ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. బీజేపీది రెండు నాల్కల వైఖరి: సీపీఎం మెదక్ కలెక్టరేట్: కేంద్రంలోని బీజేపీ తీరు రెండు నాల్కల వైఖరిగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ మండిపడ్డారు. శనివారం జిల్లాలో నిర్వహించిన బంద్‌కు మద్దతుగా మెదక్‌లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. -
ప్రజల గొంతు నొక్కడమే
వార్తలు రాసే మీడియా సంస్థలపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం భావ్యం కాదు. ప్రభు త్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారన్న కారణంతో ‘సాక్షి’ ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు పెట్టి వేధించడం సరికాదు. వార్తలు రాసే విషయంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదు. – మల్లేశం, సీపీఎం జిల్లా కార్యదర్శి ‘సాక్షి’పై దాడులు ఆపాలి సాక్షి మీడియాపై పోలీసుల దాడులు తక్ష ణం ఆపాలి. ప్రజాస్వా మ్యానికి నాల్గవ స్తంభంగా ఉన్న మీడియాకు సంకెళ్లు వేయ డం మంచిది కాదు. సాక్షి కార్యాలయాల్లో సోదాలు చేయటం, ఎడిటర్, రిపోర్టర్లకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేయడం పత్రిక స్వేచ్ఛను హరించడమే. – సురేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా కన్వీనర్ -
కబడ్డీలో మెదక్ జట్టు విజయం
ముగిసిన ఎస్జీఎఫ్ క్రీడలుపటాన్చెరు: మూడు రోజులుగా పటాన్‌చెరులోని మైత్రి మైదానం వేదికగా నిర్వహించిన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి క్రీడలు శనివారం ముగిశాయి. సాయంత్రం అండర్ 14 బాలుర కబడ్డీ ఫైనల్ మ్యాచ్‌లో నల్లగొండ జిల్లా జట్టుపై మెదక్ జట్టు ఘన విజయం సాధించింది. అండర్ 14 బాలికల కబడ్డీ ఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టుపై ఖమ్మం జట్టు ఘన విజయం సాధించింది. అండర్ 17 బాలుర వాలీబాల్ ఫైనల్ మ్యాచ్‌లో వరంగల్ జిల్లా జట్టుపై ఖమ్మం జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. క్రీడలకు, క్రీడాకారులకు కేంద్రంగా పటాన్చెరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని.. రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఈసందర్భంగా వాలీబాల్ జాతీయ స్థాయి క్రీడాకారుడు కృష్ణం రాజుతోపాటు రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమష్టికృషితో రాష్ట్రస్థాయి క్రీడలను విజయవంతం చేశామన్నారు. జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వీరేశ్ మాట్లాడుతూ.. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఎమ్మెల్యే లభించడం పటాన్చెరు నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయి కబడ్డీ జట్టులో తెలంగాణ క్రీడాకారుల ప్రాతినిధ్యం పెరగాలని ఆకాంక్షించారు. కబడ్డీ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి జగదీశ్ యాదవ్ మాట్లాడుతూ.. కబడ్డీ క్రీడలో జాతీయస్థాయిలో మెదక్ జిల్లా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడం ప్రశంసనీయమన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గం నుండి కబడ్డీ క్రీడాకారులు సైతం జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక కావాలని అభిలాషించారు. -
కూలీలకు ఉపాధి కల్పించాలి
రేగోడ్(మెదక్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలందరికీ పని కల్పించాలని అదనపు డీఆర్డీఓ రంగాచారి తెలిపారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 3.18 కోట్ల నిధులతో ఆయా పనులు చేపట్టారు. దీనిపై సోషల్ ఆడిట్ అనంతరం ప్రజా వేదిక ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులపై సభలో ఆడిట్ ఆధికారులు చదివి వినిపించారు. ఆయా పంచాయతీల్లో రూ. 70 వేలు రికవరీ చేసి రూ. 3 వేలు జరిమానా విధించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. చిన్న చిన్న తప్పులు జరగకుండా, రికార్డులను సైతం సక్రమంగా ఉంచేందుకు జాగ్రత్త వహించాలన్నారు. ఇందిరమ్మ గృహాలకు ఆ ఇంటి యజమానులు పని చేస్తే రూ. 28,280 చెల్లిస్తామన్నారు. అదే విధంగా మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 12 వేలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ రాజేందర్‌రెడ్డి, సోషల్ ఆడిట్ పీఈ సంపత్ కుమార్ ఆచార్య, ఎస్ఆర్పీ నాగరాజ్, ఏపీఓ జగన్మోహన్సింగ్, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.అదనపు డీఆర్డీఓ రంగాచారి -
మీడియా పాత్ర కీలకం
ప్రజాస్వామ్య దేశంలో వార్తా పత్రి కల పాత్ర కీలకం. అలాంటి మీడియాపై దాడులు చేయ టం సరికాదు. వాస్తవాలను ప్రచురితం చేసే ‘సాక్షి’ దినపత్రికపై ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న చర్యలు గర్హనీయం. వార్తలు రాసిన విలేకరులు, ఎడిటర్‌ను నోటీసుల పేరుతో వేధింపులకు గురి చేయటం మంచిది కాదు. – జనార్దన్‌రెడ్డి, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్, సీనియర్ న్యాయవాదిరాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన సాక్షిపై దాడులు చేయటం సరికాదు. ఏపీలోని కూటమి ప్రభుత్వానిది హేయమైన చర్య. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజాలు నిర్భయంగా రాసే పత్రిక గొంతు నొక్కితే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే. మీడియా జోలికి వస్తే సహించేది లేదు. – నోముల శ్రీకాంత్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు -
చెల్లిస్తామనడం సంతోషం
వడ్లు తూకం చేసిన 48 గంటల్లోనే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు బోనస్ చెల్లిస్తామని ప్రకటించడం సంతోషం. ఈసారి భారీ వానలతో, పొంగి పొర్లిన వరదలతో అనేక చోట్ల పంటలు దెబ్బ తిన్నాయి. రైతులు అనేక విధాలుగా నష్టపోయారు. కనీసం బోనస్ డబ్బులు ఇస్తే సకాలంలో అప్పులు తీర్చగలం. – పోచయ్య, రైతు పాపన్నపేట బకాయిలూ చెల్లించండి గత యాసంగికి సంబంధించి సన్న వడ్లకు బోనస్ ఇంత వరకు రాలేదు. సుమారు రూ.40 వేలు రావాలి. బకాయీల చెల్లింపుపై నిర్ణయం తీసుకోక పోవడం శోచనీయం. ప్రభుత్వాన్ని నమ్మి, బోనస్ ఆశకు చాలా మంది రైతులు సన్న వరి వేశారు. రైతులను ఇబ్బంది పెట్టడం తగదు. – మహిపాల్, రైతు, పాపన్నపేట -
క్రీడలతో స్నేహభావం: డీఎం సురేఖ
మెదక్ కలెక్టరేట్: మెదక్ జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం జిల్లాస్థాయి అండర్ 17, అండర్ 14 బాలికల ఖోఖో పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జిల్లాస్థాయి పోటీల్లో 21 మండలాల నుంచి 420 మంది బాలికలు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం పెంపొందిచుకోవచ్చన్నారు. ఈ పోటీల్లో అండర్ 17 విభాగంలో హవేళిఘనాపూర్ జట్టు మొదటి బహుమతి, , పాపన్నపేట ద్వితీయ బహుమతి, రామాయంపేట తృతీయ బహుమతి అండర్–14విభాగంలో ఫస్ట్ ఫ్రైజ్ పాపన్నపేట, సెకండ్ ఫ్రైజ్ మెదక్, థర్డ్ఫ్రైజ్ చేగుంట జట్లు సాధించాయి. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన జట్లు ఈనెల చివరి వారంలో మెదక్‌లో జరిగే ఉమ్మడి మెదక్ జిల్లా ఖో ఖో పోటీలలో పాల్గొంటాయని తెలిపారు. జిల్లాస్థాయి బాలికల ఖోఖో పోటీలు ప్రారంభం విజేతలకు బహుమతులు అందజేసిన డీఎం సురేఖ -
ప్రభుత్వాల వైఖరి మారాలి
మెదక్ కలెక్టరేట్: కార్మికులు, ఉద్యోగుల రంగాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మార్చుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సీఐటీయూ ఆధ్వర్యంలో మెదక్‌లోని టీఎన్జీఓ భవన్లో జిల్లా సెమినార్ నిర్వహించారు. జిల్లా సహాయ కార్యదర్శి గౌరీ అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు – ఉద్యోగులు, కార్మికులపై ప్రభావం అనే అంశంపై సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా ఉద్యోగులు, కార్మికులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలబడిన బ్యాంకింగ్, ఇన్సూరెన్‌న్స్ రంగాలలోకి విదేశీ ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని మండిపడ్డారు. పోస్టల్, టెలికంలోనూ ఇదే స్థితిలో కొనసాగుతుందని చెప్పారు. నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ విద్యను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల, ఉద్యోగుల సమస్యలపై సీఐటీయూ సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లేశం, జిల్లా సహాయ కార్యదర్శి గౌరీ, సంతోష్, జిల్లా కోశాధికారి నర్సమ్మ, అడివయ్య, మల్లేశం, అజయ్, యాదగిరి, దుర్గ, కవిత, వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు, ఉద్యోగుల రంగంపై విధానాలు మార్చుకోవాలి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య -
వన దుర్గమ్మ దర్శనాలు ప్రారంభం
62 రోజుల అనంతరం ఆలయ ప్రవేశం పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం ఎట్టకేలకు 62 రోజుల అనంతరం శుక్రవారం ప్రారంభమైంది. రెండు నెలలుగా, ఆగస్టు 14 నుంచి మంజీరా నదికి వరదలు రావడంతో దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. మధ్యలో రెండు రోజుల దర్శనం ప్రారంభించినప్పటికీ, తిరిగి వరదలు రావడంతో ఆలయాన్ని మూసి వేశారు. ఫలితంగా ఆలయానికి సుమారు రూ.1.50 కోట్ల నష్టం జరిగింది. ఇటీవల సింగూరు నుంచి వరద తగ్గడంతో ఆలయాన్ని శుభ్రం చేసి, భక్తుల దర్శనానికి అనుకూలంగా తీర్చిదిద్దారు. అర్చకులు దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు దర్శనం అవకాశం కల్పించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేసీపీఎం డిమాండ్ మెదక్ కలెక్టరేట్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక పోస్టాఫీసు వద్ద నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేశం విలేకరులతో మాట్లాడారు. బీసీల రిజర్వేషన్ వ్యవహారంపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. రాష్ట్ర బంద్ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం, నాయకులు కిరణ్, అజయ్, సత్యం, అజయ్, తదితరులు పాల్గొన్నారు. మత్తుకు బానిస కావొద్దున్యాయమూర్తి శుభావల్లి మెదక్‌జోన్: ఎట్టిపరిస్థితుల్లో మత్తుకు బానిస కావద్దని మెదక్ జిల్లా సీనియర్ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం శుభావల్లి సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్, మత్తుపై శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్ తీసుకునే వారి మానసిక స్థితి గురించి విద్యార్థులకు వివరించారు. ప్రాథమిక హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మద్యపానం వలన కలిగే నష్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ డ్రగ్స్ నిర్మూలన కమిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ రమణ కుమార్, ప్లాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆఫీసర్ జే.వెంకటేశ్వర్లు, లీగల్ అడ్వైజర్ ఎల్.సిద్ధాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులుమెదక్ కలెక్టరేట్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో రసాయన శాస్త్రం(1), కంప్యూటర్ సైన్‌న్స్ అప్లికేషన్న్ (1) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో కనీసం 55శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 50శాతం మార్కులుంటే అర్హులని తెలిపారు. సంబంధిత సబ్జెక్టులలో పీహెచ్డీ లేదా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉత్తీర్ణులైన వారికి, అలాగే బోధనా అనుభవం గల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులు ఈనెల 22న సాయంత్రం 4గంటలలోపు కళాశాలలో నేరుగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. 23న కళాశాల ప్రాంగణంలో డెమో క్లాస్‌తోపాటు ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు. పంట వివరాలు నమోదు చేసుకోవాలిజిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ పెద్దశంకరంపేట(మెదక్): మండలంలోని రైతులు తమ పంటల వివరాలను వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ శుక్రవారం తెలిపారు. మండల పరిధిలోని శివాయిపల్లి గ్రామంలో రైతులకు కాటన్ కపాస్ యాప్‌పై అవగాహన కల్పించారు. రైతులు తమ పత్తి పంటను అమ్ముకోవాలంటే ఈ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అమ్ముకునే అవకాశం ఉందన్నారు. -
విద్యాసామర్థ్యాలు పెంచండి
హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వ పాఠశాలలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమర్సీ (ఎఫ్ఎల్ఎన్) అమలులో ఆయా మండలాల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులదే కీలక బాధ్యత అని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. హవేళిఘణాపూర్ డైట్ కళాశాలలో శుక్రవారం ఎఫ్ఎల్ఎన్ అమలులో భాగంగా ఆయా మండలాల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ పట్టిషంగా అమలు చేసి విద్యార్థులు విద్యాసామర్థ్యాలు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంచి గుణాత్మక విద్యా బోధన ద్వారా భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్, అసిస్టెంట్ మానిటరింగ్ అధికారి సుదర్శన్‌మూర్తి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు. పోషణ లోపం పిల్లలను గుర్తించాలిమెదక్ కలెక్టరేట్: చిన్నారులు వ్యాధుల బారిన పడకుండా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే బాధ్యత డీడబ్ల్యుఓ సిబ్బందిపై ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ ఆరోగ్యంపై తల్లి, బిడ్డలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పోషణ లోపం ఉన్న చిన్నారులను గుర్తించి, వారిని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పిల్లల ఎత్తు, బరువును ఎప్పటికప్పుడు పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. గర్భిణిలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు తగిన ఆహారం, పోషకాహారం గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి ఎఫ్ఎల్ఎన్ పటిష్టంగా అమలు చేయాలి ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులదే బాధ్యత కలెక్టర్ రాహుల్‌రాజ్ -
బీసీ రిజర్వేషన్లకే అడ్డంకులెందుకు?
● నేటి బంద్‌ను విజయవంతం చేద్దాం ● బీసీ సంఘం నేత సురేందర్గౌడ్మెదక్జోన్: ఎకనామికల్ వీకర్ సెక్షన్(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లకు లేని అడ్డంకులు బీసీ రిజర్వేషన్లకే ఎందుకు అని బీసీ నేత కొండన్ సురేందర్‌గౌడ్ ప్రశ్నించారు. వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలనే డిమాండ్‌తో తలపెట్టిన రాష్ట్రబంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో వివిధ బీసీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయంగా ఏళ్లతరబడి అన్యాయానికి గురవుతున్న బీసీలందరూ పోరాటం సాగించాలని అన్నారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్దమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు చింతల నర్సింహులు, శంకర్ గౌడ్, మామిళ్ల అంజనేయులు, రామస్వామి, కృష్ణ, మంగ మోహన్ గౌడ్, ఎండీ హఫీజ్, గౌస్ ఖురేషి, మానవ హక్కుల వేదిక నేత షేక్ అహ్మద్ పాల్గొన్నారు. -
పల్లెప్రగతి ఎలా..?
కొత్త ఎంపీడీఓల ఆరా ఉపాధి, గ్రామాభివృద్ధి పనుల పరిశీలన చేగుంట(తూప్రాన్): ఇటీవల గ్రూప్ పరీక్షల్లో ఉద్యోగం పొందిన ఎంపీడీఓలు క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా శుక్రవారం చేగుంట మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా, మండల పరిషత్‌ల ఆధ్వర్యంలో గ్రామాల్లో నిర్వహించే ఉపాధిహామీ పనులతో పాటు గ్రామాభివృద్ధి విషయాల గురించి తెలుసుకున్నారు. ఉపాధి హామీ ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణం, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం, వ్యవసాయ సంబంధిత పనులు, రోడ్ల నిర్మాణం, నర్సరీల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. వాటి వివరాలను నమోదు చేసుకున్నారు. సీనియర్ ఫ్యాకల్టీ అనిల్‌కుమార్ వివిధ పనులపై వారికి అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీల ద్వారా నిర్వహించే గ్రామాభివృద్ధి కార్యక్రమాలను గురించి చిన్నశివునూర్ గ్రామంలో పరిశీలన జరిపారు. అనంతరం కొత్తగా విధుల్లో చేరుతున్న ఎంపీడీఓలకు జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావులు గ్రామాల్లో అభివృద్ధిలో ఎంపీడీఓల బాధ్యతల గురించి తెలియజేశారు. గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిజిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య నర్సాపూర్ రూరల్: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య రైతులకు సూచించారు. నర్సాపూర్ మండలంలోని చిన్నచింతకుంటలో గాలికుంటు నివారణ టీకాల శిబిరంలో శుక్రవారం పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పశు వైద్య సిబ్బంది ప్రతీ గ్రామానికి వెళ్లి పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేస్తున్నారని తెలిపారు. -
బోనస్ బొనాంజా
సన్నాలకు సర్కార్ బోనస్ బొనాంజా ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లు చేసిన 48 గంటల్లోనే కనీస మద్దతు ధరతో కలిపి బోనస్ కూడా చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈసారి దొడ్డు వడ్లకు మద్దతు ధర క్వింటాలుకు రూ.2,389కి పెరిగింది. ఈ లెక్కన బోనస్‌తో కలిపి సన్న వడ్లకు రూ.2,889 చెల్లించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉంటే గత యాసంగి బోనస్ బకాయిలూ కూడా చెల్లించాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. – మెదక్ అర్బన్ వానాకాలం సీజన్ సన్నాలకు అనుకూలం కావడం.. బోనస్ ధరపై ఆశతో రైతులు 1,00,464 ఎకరాల్లో సన్న వడ్లు సాగు చేశారు. ముఖ్యంగా మంజీరా తీర ప్రాంతాలు, బోరు ఆధారిత వ్యవసాయం చేసే పాపన్నపేట, కొల్చారం, మెదక్ , హవేలిఘనపూర్, నర్సాపూర్, కౌడిపల్లి, రామాయంపేట, నిజాంేపేట, తూప్రాన్ తదితర మండలాలలో సన్న రకం వరి సాగు చేశారు. గతంలో దొడ్డు ధాన్యం మద్దతు ధర రూ.2,320 ఉండగా, ఈసారి రూ.2,389కి పెంచారు. ఈ లెక్కన చూస్తే సన్నాలకు బోనస్‌తో కలిపి క్వింటాలుకు రూ.2,889 వస్తుంది. సాగు పరంగా పెట్టుబడి చూస్తే.. సన్న వడ్లకు ఎకరాకు రూ.25 వేలు, దొడ్డు రకం వడ్లకు రూ.20 వేలు అవుతుంది. అలాగే దిగుబడిని బేరీజు వేస్తే సన్నాలు 22 క్వింటాళ్లు, దొడ్డువి 25 క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది. బోనస్‌పై ఆశతో కొంత మంది సన్న వడ్లకు ప్రాధాన్యత ఇచ్చారు.యాసంగి బోనస్ ఏదీ? గత యాసంగి బోనస్ కు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయక పోవడంతో అన్నదాతలో అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఈ యేడు బోనస్ మద్దతు ధరతో కలిపి 24 గంటల్లోనే చెల్లిస్తామని ప్రకటించినా, బోనస్ బకాయీల ఊసే లేక పోవడంతో ఆందోళన వ్యక్త మవుతోంది. గత యాసంగిలో 14,994 మంది రైతులు 62,747 క్వింటాళ్ల సన్న ధాన్యాన్ని విక్రయించారు. వీరికి బోనస్ రూపంలో రూ.31.37 కోట్లు రావాల్సి ఉంది. వీటి కోసం నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్నారు.సన్నాలు కొనుగోళ్లు చేసిన 48 గంటల్లోనే చెల్లింపులు జిల్లాలో వానాకాలం సాగు లక్షా 464 ఎకరాలు దొడ్డురకం వడ్లకు మద్దతు ధర రూ.2,389కి పెంపు సన్నాలకు బోనస్‌తో కలిపి రూ.2,889 -
పత్రికా స్వేచ్ఛను హరించడమే..
మెదక్‌జోన్: నకిలీ మద్యంపై కథనాలు ప్రచురించిన సాక్షి విలేకరులతో పాటు ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చర్యలను జర్నలిస్టులు ఖండించారు. ఈ దమనకాండను నిరసిస్తూ శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని బస్‌డిపో సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా ఏపీలో సాక్షి పత్రికపై కక్ష గట్టి పత్రికా స్వేచ్ఛను హరిస్తూ రాజ్యాంగాన్ని కాలరాస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడమంటే ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించినట్లేనని పేర్కొన్నారు. ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను ఆపటంపై సర్వోన్నత న్యాయస్థానం కూటమి ప్రభుత్వానికి చీవాట్లు పెట్టినా, సాక్షి ప్రధాన కార్యాలయంపై మూడు రోజులుగా దాడులు చేస్తూ సంపాదకుడికి నోటీసులు ఇవ్వటం, రాజ్యాంగ విరుద్ధమైనా ప్రశ్నలు సంధించటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా దాడులు నిలిపివేసి, అకారణంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుటే యాజమాన్యాలకు అతీతంగా జర్నలిస్టుల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నరేశ్‌గౌడ్, సాక్షి జిల్లా ఇన్చార్జి నీలయ్య, ఐ న్యూస్ బ్యూరో ఇన్చార్జి క్రాంతి, సీనియర్ పాత్రికేయులు నాగరాజు, గోపాల్‌గౌడ్, వెంకట్‌గౌడ్, సురేందర్‌రెడ్డి, మురళి, శ్రీనివాస్, లక్ష్మణ్, కృష్ణమూర్తి, మల్లేశం, ఊశయ్య, తదితరులు ఉన్నారు. సాక్షిపై ఏపీ ప్రభుత్వం కుట్ర: మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి చిన్నశంకరంపేట(మెదక్): పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేల సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డిపై టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను పెట్టడం సరికాదని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఖండించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుట్రపూరితమైన చర్యలకు పాల్పడటం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ‘సాక్షి’పై ఏపీ సర్కార్ దాడులు హేయం కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి జర్నలిస్టుల డిమాండ్ మెదక్‌లో ధర్నా, కలెక్టర్‌కు వినతి -
ఇసుకాసురులు!
మంజీరా నుంచి అక్రమంగా రవాణా ● ఇందిరమ్మ ఇళ్ల కంటూ దబాయింపు ● కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులుకొల్చారం(నర్సాపూర్): ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మండలంలోని పోతంశెట్టిపల్లి శివా రు మంజీరా నది నుంచి వారం రోజులుగా అక్రమంగా రవాణా చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం ఉన్నా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమా ర్కులు అధికారులను మచ్చగా చేసుకొని మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ దందాను కొనసాగిస్తున్నార ని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా అడ్డుకుంటే ఇందిరమ్మ ఇళ్ల కంటూ దబాయిస్తున్నారు. సొమ్ము చేసుకుంటున్న దళారులు పోతంశెట్టిపల్లి, అప్పాజీపల్లి గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక రవాణా చేస్తామని చెప్పింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న దళారులు మధ్యవర్తిత్వం వహిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్ ఇసుకకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి రూ. 8 వేలు వసూలు చేస్తున్నారు. బరితెగించి ఇతర ప్రాంతాలకు ఇసుకను రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నది నుంచి ఇసుకను తీసేందుకు రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతి తప్పనిసరి. పైగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించే లబ్ధిదారుడు ఇసుక కోసం అనుమతి పత్రం అందజేయాల్సిన రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో లబ్ధిదారులు అధిక మొత్తానికి ఇసుకను కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. బుధవారం పైతరలో పోలీసులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టడం విమర్శలకు తావిస్తోంది. కఠిన చర్యలు తీసుకుంటాం ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఇసుకను రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంటి నిర్మాణ ధ్రువీకరణ పత్రాన్ని రెవెన్యూ కార్యాలయానికి తీసుకొచ్చి అనుమతి తీసుకోవాలి. అందుబాటులో ఉన్న చోటు నుంచి ఇసుకను రవాణా చేసుకోవచ్చు. కేవలం రవాణా ఖర్చులు మాత్రమే లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్‌చారి, తహసీల్దార్, కొల్చారం -
నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
పాపన్నపేట(మెదక్)/మెదక్ కలెక్టరేట్: ధాన్యం కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని పొడిచన్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడారు. ధాన్యం తేమ శాతాన్ని సరిగా నిర్ధారించాలని, తాలు లేకుండా చూడాలని సూచించారు. కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యం తూకం వేసి తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. గన్నీ బ్యాగులు, రికార్డులు, ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ హాజరయ్యారు. నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాల శాఖ ద్వారా పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఓటరు జాబితాలో వందేళ్ల వయసు కలిగిన ఓటర్లను గుర్తించి తగిన ఆధారాలు సమర్పించాలని తెలిపారు. బూత్‌స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఫారం 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్‌రాజ్ -
రంగంలోకి సిండికేట్లు
జిల్లాలో మద్యం టెండర్లు మందకొడిగా సాగుతున్నాయి. గత నెల 26న నోటిఫికేషన్ వెలువడగా, గురువారం సాయంత్రం వరకు 373 దరఖాస్తులు అందినట్లు ఈఎస్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో 49 వైన్‌షాపులు ఉండగా, గతేడాది 1,905 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఏపీ, హైదరాబాద్ సిండికేట్లు రంగంలోకి దిగడంతో ఈనెల 18 చివరి రోజు దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. – మెదక్ అర్బన్ లాభాల్లో 30 శాతం మామూళ్లకే గతేడాది టార్గెట్ చేరేనా! మద్యం దుకాణాల కోసం ఏకం -
హెచ్ఎంతో పాటు ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
నర్సాపూర్ రూరల్: హెచ్ఎంతో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు డీఈఓ రాధాకిషన్ గురువారం తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన హెచ్ఎం రాజప్ప నిధుల దుర్వినియోగానికి పాల్పడగా, మరో ఇద్దరు ఉపాధ్యాయులు అశోక్, లక్ష్మయ్య తరచూ విధులకు గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. అయితే వారి నుంచి హెచ్ఎం లంచాలు తీసుకొని వేతనాలు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు స్కావెంజర్ వేతనంలోనూ కోతల విధిస్తూ నిధులు కాజేస్తున్నట్లు తెలిసింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉన్నతస్థాయి అధికారులు ఇటీవల తనిఖీలు చేపట్టి విచారణ చేయగా నిధుల దుర్వినియోగం, ఉపాధ్యాయుల గైర్హాజరు, తరచూ గొడవలు జరుగుతున్నట్లు తేలింది. ఈ మేరకు వారిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి సందర్శన రామాయంపేట(మెదక్): డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఇమ్యూనైజేషన్ అధికారిణి మాధురి గురువారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఈసందర్భగా హెల్త్ వర్కర్లకు ఇచ్చే హెపటైటీస్ బీ వాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి, ప్రగతి ధర్మారం ప్రా థమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు హరిప్రియ, నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారు. -
ప్రజలతో సత్సంబంధాలు అవసరం
చిన్నశంకరంపేట(మెదక్): ప్రజలతో పోలీసులు సత్సంబంధాలు కలిగి ఉండాలని ఎస్పీ శ్రీనివాస్‌రా వు అన్నారు. గురువారం నార్సింగి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌లు నమోదు చేసిన కేసులపై క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు న్యాయమైన దర్యాప్తు చేపట్టాలన్నారు. ప్రతి కేసును ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. విలేజ్ పోలీస్ వ్యవస్థను క్రీయాశీలంగా నిర్వహించాలన్నారు. కేసులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఎస్ఐ సృజనకు సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి రోజు వాహనాల తనిఖీ చేపట్టడంతో పాటు అనుమానాస్పద వాహనాలను అదుపులోకి తీసుకోవాలని చెప్పారు. సిబ్బందికి ఎలాంటి సమస్యలున్నా తనతో నేరుగా మాట్లాడాలని సూచించారు. అనంతరం నార్సింగి మల్లన్నగుట్ట వద్ద ఉన్న పోలీస్ ఫైరింగ్ రేంజ్‌ను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ నరేందర్‌రెడ్డి, సీఐ వెంకటరాజంగౌడ్, ఎస్ఐ సృజన ఉన్నారు. సైబర్ మోసగాళ్ల వలలో చిక్కొద్దు మెదక్ మున్సిపాలిటీ: ఆఫర్ల మోజులో పడి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్ల పేరుతో సైబర్ మోసగాళ్లు సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా నకిలీ వెబ్సైట్లు, లింకులు పంపి ప్రజలను మోసం చేస్తుంటారని తెలిపారు. ఆ లింక్‌ల ద్వారా షాపింగ్ ఆఫర్లు, లాటరీలు, గిఫ్ట్ కూపన్లు వంటి ప్రలోభాలు చూపి డబ్బులు వసూలు చేస్తారన్నారు. ఇలాంటి ఫేక్ లింక్‌లు, వెబ్సైట్లకు వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక
పాపన్నపేట(మెదక్): మండలంలోని లింగాయపల్లి చీకోడ్ ఉన్నత పాఠశాల విద్యార్థి రూపొందించిన ప్రాజెక్ట్ జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై ంది. పదో తరగతి విద్యార్థి శివ చైతన్య రూపొందించిన ఆధునిక మల్టీ పర్పస్ అడ్వాన్స్ హైడ్రాలిక్ జేసీబీ అండ్ ఆల్ ఇన్ వెహికల్ ఎగ్జిబిట్ జిల్లా, రాష్ట్ర, దక్షిణ భారత స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగురవేసి జాతీయ విద్యా పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో జాతీయస్థాయికి ఎంపికై ంది. భోపాల్‌లో జరుగనున్న జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థి పాల్గొననున్నారు. కాగా విద్యార్థికి గైడ్‌గా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై న కిషన్ ప్రసాద్వ్యవహరించారు. -
కంపు.. భరించలేకపోతున్నాం
నర్సాపూర్ రూరల్: మండలంలోని కాగ జ్మద్దూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. పాఠశాల ఎదుట ఉన్న పౌల్ట్రీఫాం నుంచి వెదజల్లే దుర్వాసనతో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇటీవల పలువురు విద్యార్థులు వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందా రు. దుర్వాసనతో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు మెదడుకు ఎక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడో తరగతి విద్యార్థి నికిత్సాయి ఇటీవలే ఆస్పత్రిలో చేరగా, సుందరయ్య అనే ఉపాధ్యాయుడు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో పాఠశాల అంటేనే విద్యార్థులు, ఉపాధ్యాయులు జంకుతున్నారు. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించిచా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. -
టికెట్ నాకే.. ఎమ్మెల్యే నేనే
మెదక్ అర్బన్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం నేనే ఎమ్మెల్యే. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై నమ్మకం ఉంది. పార్టీ టికెట్ ఎలాగైనా ఇస్తారు. అమ్మవారి దయతో 2029 ఎన్నికల్లో నిజాంపేట బిడ్డగా.. ఎమ్మెల్యేగా మీ ముందుకొస్తానంటూ..’ నిజాంపేటలో ఆదివారం జరిగిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పంపిణీ కార్యక్రమంలో కంఠారెడ్డి తిరుపతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు గులాబీ దళంలో కాక రేపుతున్నాయి. మెతుకుసీమ రాజకీయాల్లో ఉద్యమ నేతగా పేరొందిన పద్మక్క.. ద్వితీయ శ్రేణి నాయకుడి ధిక్కార స్వరంతో కలవరపడుతోంది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పు లా ఉన్న ఆశలు.. ఒక్కసారిగా భగ్గుమనడంతో బీ ఆర్ఎస్లో అలజడి మొదలైంది. అయితే ఈ వ్యా ఖ్యల పరిణామాలను ట్రబుల్ షూటర్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.అప్పుడు నెయ్యం.. ఇప్పుడు కయ్యంగత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డికి మైనంపల్లి రోహిత్‌రావు రూపంలో పార్టీ షాకిచ్చింది. అనూహ్య పరిణామంతో తీవ్ర ఆందోళనకులోనైన కంఠారెడ్డి డీసీసీ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. మోసం చేసిన కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో హస్తం పార్టీలో ఉన్న తనవర్గాన్ని బీఆర్ఎస్లోకి తిప్పుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. కొంతమేర కృతకృత్యుడయ్యాడు. అప్పట్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారెడ్డి విజయం కోసం కృషి చేశారు. కాలం గడుస్తున్నా కొద్ది బీఆర్ఎస్లో కొంతమందిని తన వైపు తిప్పుకున్నాడు. విందులు, వినోదాలతో మరికొంత మందిని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గత ఎన్నికల అనంతరం మాజీ ఎమ్మెల్యే కొంతకాలం నియో జకవర్గానికి దూరంగా ఉన్న సమయాన్ని వినియోగించుకొని కొంతమేర పట్టు పెంచుకున్నాడు. ఆర్థిక సహాయాలు, ప్రజోపయోగ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీలో పరపతిని పెంచుకున్నాడు.ముందుగానే పసిగట్టిన పద్మారెడ్డిమెతుకుసీమ రాజకీయాల్లో ఎదురులేని ఏలికగా నిలిచిన బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మారెడ్డి, పార్టీలో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ముందుగానే పసి గట్టారు. ఎమ్మెల్యే పదవిపై ఆశలు పెంచుకుంటున్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కదలికలపై కన్నేసి, కౌంటర్ చర్యలు ప్రారంభించారు. పైకి సఖ్యతగా ఉన్నట్లు కనిపించినా, కంఠారెడ్డితో కలిసి ఉన్న సందర్భాల్లో పద్మారెడ్డి అసౌకర్యంగానే ఉన్నట్లు కనిపించేవారని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ తిరుపతిరెడ్డి తన స్వస్థలమైన నిజాంపేటలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో నెలకొన్న వర్గ విబేధాలను ప్రస్పుటం చేసేవిగా ఉండటంతో.. రెండు, మూడు రోజుల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించి, సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని పాపన్నపేటకు చెందిన బీఆర్ఎస్ ముఖ్యనాయకుడు ఒకరు తెలిపారు.గులాబీ దళంలో పెరిగిన కంఠ స్వరంమెతుకుసీమ బీఆర్ఎస్లోవర్గపోరు కొనసాగుతోంది. తాజాగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి వ్యాఖ్యలతో అలజడి మొదలైంది. ఈ పరిణామాలను పార్టీ నిశితంగా పరిశీలిస్తున్నట్లుతెలుస్తోంది. -
సేవాభావం అలవర్చుకోవాలి
ఏఎస్పీ మహేందర్ హవేళిఘణాపూర్(మెదక్): చదువుతో పాటు సేవాభావం పెంపొందించుకోవాలని ఏఎస్పీ మహేందర్ విద్యార్థులకు సూచించారు. మండల పరిధిలోని ముత్తాయికోటలో జరిగిన ఎన్ఎస్ఎస్ ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను కూడా ఎన్ఎస్ఎస్ వలంటీర్నేనని, కష్టపడే అలవాటు అప్పటి నుంచే ఏర్పడిందన్నారు. రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగావకాశాలు పొంది ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ చైర్మన్, ప్రిన్సిపాల్ హుస్సేన్, పంచాయతీ సెక్రటరీ హేమంత్, కిరణ్‌గౌడ్, రఘుబాబు, ప్రోగ్రాం ఆఫీసర్ మురళి, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఉమ్మడి మెదక్ జిల్లా ఎంజేపీ బీసీ గురుకుల సొసైటీ ఆర్సీఓ గౌతంకుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని తునికి ఎంజేపీ గురుకుల పాఠశాలలో అండర్–17 కబడ్డీలో పరుశురాం, వాలీబాల్‌లో హేమంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో అభినందించారు. ఈసందర్భంగా ఆర్సీఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ హరిబాబు, పీడీ అంజలి, పీఈటీలు కార్తీక్, శేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా కౌడిపల్లిలోని ఎస్టీ గురుకుల పాఠశాలకు చెందిన సిద్దార్థ్ అండర్– 14 ట్రిపుల్ జంప్‌లో ప్రథమస్థానం, ఇంటర్ విద్యార్థి నరేందర్ నాయక్ షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానంతో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అనుమానితులు కన్పిస్తే సమాచారం ఇవ్వాలి నర్సాపూర్: అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ ప్రజలను కోరారు. బుధవారం ఉదయం పట్టణంలోని చైతన్యపురి కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దని హితవు పలికారు. యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాగా సరైన డాక్యుమెంట్లు లేని 59 ద్విచక్ర వాహనాలు, ఏడు ఆటోలను స్వాధీనం చేసుకున్నామని సీఐ జాన్‌రెడ్డి చెప్పారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేస్తే అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐ రంగకృష్ణ, వెంకటరాజాగౌడ్, ఎస్ఐ రంజిత్‌రెడ్డితో పాటు ఏడుగురు ఎస్ఐలు సుమారు వంద మంది పోలీసులు పాల్గొన్నారు. దుర్గమ్మ దర్శనానికి వేళాయే పాపన్నపేట(మెదక్): ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దుర్గమ్మ ఆలయం భక్తుల దర్శనానికి ముస్తాబవుతోంది. 60 రోజులుగా మంజీరా వరదల్లో మునిగిన ఆలయాన్ని సిబ్బంది శుభ్రం చేశారు. లక్షలాది క్యూసెక్కుల ప్రవాహ ంతో ఆలయం పూర్తిగా దెబ్బతింది. క్యూలైన్లు, రేకులు, ఫ్లోరింగ్, గ్రానైట్ దెబ్బతిన్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్ కొట్టుకుపోయింది. సుమా రు రూ. కోటిన్నర నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఆలయాన్ని సిబ్బంది శుభ్రం చేశారు. కాగా విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరించలేదు. రెండు రోజుల్లో దర్శనాలు ప్రారంభం కావొచ్చని ఆలయ వర్గాలుతెలిపాయి. -
గంజాయి సాగు చేస్తే పథకాలు కట్
మెదక్ కలెక్టరేట్: గంజాయి సాగు చేసే రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వెంటనే నిలిపివేస్తామని, జిల్లాలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు వేయాలని ఆదేశించారు. గంజాయి సాగు చేస్తే జరిగే పరిణామాలపై రైతులకు వివరించాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ డీవీ మాట్లాడుతూ.. దాబాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పరిశ్రమలకు ఉపాధి కోసం వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అనంతరం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో బ్లాక్ స్పాట్లు గుర్తించి ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే చోట సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి జిల్లాలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో కనీస మౌలిక వసతులతో పాటు సరిపడా గన్నీ బ్యాగ్‌లు, టార్పాలిన్లు, తేమశాతం కొలిచే యంత్రాలు అందుబాటులో పెట్టుకోవాలన్నారు. ఇదే విషయమై మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమకుమార్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం బాల్య వివాహాల నివారణ గోడ పత్రికను ఆవిష్కరించారు. అలాగే చేయూత పథకంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ పింఛన్లకు గల అర్హతలను వాటి విధి విధానాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం అధికారులతో కలెక్టర్ రాహుల్‌రాజ్ -
పోషకాహార లోపాన్ని నివారిద్దాం
రామాయంపేట(మెదక్): మెదక్‌ను పోషకాహారలోపం లేని జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని డీడబ్ల్యూఓ హేమభార్గవి అన్నారు. ఐడీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణమాస వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాల విషయమై బాలికలు, వారి తల్లిదండ్రులను చైతన్యపరుస్తున్నామని తెలిపారు. పోషణలోపం, బాల్య వివాహాలను అరికట్టడానికి ముందుకెళ్తున్నామని వివరించారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే స్థానికంగా లభ్యమవుతున్న పండ్లు, ఆకుకూరలను తినాలని సూచించారు. ముఖ్యంగా ఆకుకూరలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని, వీటిలో పోషణ విలువలు అధికంగా ఉంటాయని వివరించారు. పోషణ వారో త్సవాలకు సంబంధించి గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీడీపీఓ స్వరూప, పలు మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.డీడబ్ల్యూఓ హేమభార్గవి -
రిజర్వేషన్ల అమలుకు పోరాడుదాం
రామాయంపేట(మెదక్)): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం అలుపెరుగని పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మెట్టు గంగారాం అన్నారు. బుధవారం పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాము ఏ కులానికి వ్యతిరేకం కాదని, తమకు అన్యాయం తలపెట్టిన వారికి వ్యతిరేకంగా పోరాడుతామని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల దక్కకుండా కొందరు కుట్రలు పన్నుతున్నారని, వారి ఆటలు సాగబోవన్నారు. ఈనెల 18న నిర్వహించనున్న బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బంద్‌నకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెదక్ బీసీ జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్, కోశాధికారి దామోదర్, ప్రధాన కార్యదర్శి భూమ కిషన్, సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్దరాంలు, మండలాధ్యక్షుడు రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం -
అక్రమ నిర్మాణాలపై కొరడా
మెదక్ బల్దియా అధికారులు మాస్టర్‌ప్లాన్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు. ఇటీవల నిబంధనలు అతిక్రమించి నిర్మించిన రెండు భవనాలను కూల్చివేశారు. అందులో ఓ భవనం గ్రీన్‌జోన్ పరిధిలో ఉండగా, మరో భవనం అనుమతిని మించి నిర్మించడంతో కఠినంగా వ్యవహరించారు. ఈ రెండు సంఘటనలతో మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించాలంటేనే పలువురు జంకుతున్నారు. – మెదక్‌జోన్ మెదక్ మున్సిపాలిటీ 1952లో ఆవిర్భవించింది. 18 వేల పైచిలుకు ఇళ్లు ఉండగా, సుమారు 80 వేల మంది ఇక్కడ నివసిస్తున్నారు. జనాభాతో పోటీపడి పట్టణ విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 1992లో దీనికి మాస్టర్‌ప్లాన్ అమలు చేయగా, ఇది అమల్లోకి వచ్చి 33 ఏళ్లు అవుతోంది. అయితే దీనిని ఇప్పటివరకు పక్కాగా అమలు చేసిన దాఖలాలు లేవు. దీంతో పట్టణంలో ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు కొనసాగించారు. అయినా అడ్డుచెప్పిన వారు లేరు. దీంతో అనేక రకాలుగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనట్లు పలువురు బహిరంగంగానే విమర్శిస్తుంటారు. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా పట్టణం అంతా జలమయంగా మారుతోంది. ఇటీవల రెండు భవనాల కూల్చివేత పట్టణంలో ఇటీవల అక్రమంగా నిర్మించిన రెండు భవనాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మిలటరీ కాలనీలో రోడ్డు పక్కన జీప్లస్ వన్ నిర్మాణం కోసం స్లాబువేశాడు. కాగా గ్రీన్జోన్లో ఇళ్లు నిర్మించటం నిషేధమని అధికారులు గుర్తించి నిర్మాణాన్ని నిలిపి వేయించారు. అలాగే అజంపుర ప్రాంతంలో గల ఏదులచెరువుకు సంబంధించి కొంత స్థలం ఉండగా, అందులో మహిళా జూని యర్ కళాశాలతో పాటు షాదీఖానాను ప్రభుత్వం నిర్మించింది. గతంలో పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇల్లు కూల్చివేయగా, అతడికి ఏదుల చెరువులో కొంత స్థలం కేటాయించారు. సదరు వ్యక్తి ఆ స్థలాన్ని ఇతరులకు విక్రయించాడు. దానిని కొనుగోలు చేసిన వ్యక్తి ఇటీవల ఆ ప్రదేశంలో షాపింగ్ (కమర్శియల్) భవనాన్ని నిర్మించాడు. కాగా కేటాయించిన దాని కన్నా ఎక్కువ స్థలంలో నిర్మించాడని గుర్తించిన అధికారులు కొంతభాగాన్ని కూల్చివేశారు. ఈ రెండు సంఘటనలతో మెదక్ బల్దియాలో అనుమతులు లేకుండా ఇళ్లు నిర్మించాలంటేనే పలువురు జంకుతున్నారు. అన్నిరకాల అనుమతులు ఉంటే తప్ప ఇళ్ల నిర్మాణాల జోలికి వెళ్లటం లేదు. నిబంధనలు అతిక్రమించినకట్టడాల కూల్చివేత మాస్టర్‌ప్లాన్ అమలులో భాగంగా కఠిన నిర్ణయాలు అక్రమ నిర్మాణాలంటేనేజంకుతున్న వైనం -
గాలికుంటు నివారణకు టీకాలు
నర్సాపూర్ రూరల్: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని నర్సాపూర్ డివిజన్ పశువైద్యాధికారి జనార్దన్ రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని కొండాపూర్, పెద్దచింతకుంటతో పాటు నర్సాపూర్‌లో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేసినట్లు తెలిపారు. మూడు గ్రామాల్లో కలిపి 186 పశువులకు టీకాలు వేసినట్లు చెప్పారు. ప్రతి ముందు జాగ్రత్తగా పశువులకు టీకాలు వేయించాలన్నారు. ఇందుకోసం అన్ని గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు పశు వైద్య సిబ్బందికి సహకరించాలని కోరా రు. కార్యక్రమంలో పశువైద్యాధికారులు సౌమిత్ కుమార్, స్వప్న, ఆంజనేయులు, వీరేశం, వెంకటేశ్, ఏసుప్రభు పాల్గొన్నారు.నర్సాపూర్ డివిజన్ పశువైద్యాధికారి జనార్దన్ -
కొనుగోలు కోలాహలం
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి కోతలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసారి 423 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశం ఉండగా, కొనుగోలు కేంద్రాలకు 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ఽధాన్యం రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. –మెదక్ అర్బన్ మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి కురిసిన వర్షాలు.. పోటెత్తిన వరదల్లో పంటలు మునిగి తేలాయి. దిన దిన గండంగా ఎవుసం చేసిన అన్నదాత ఎట్టకేలకు గట్టెక్కాడు. కొన్ని చోట్ల ఇంకా పంటలు చేతికి రాలేదు. జిల్లాలో సుమారు 3.80 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. ఇందులో 3.30 లక్షల మెట్రిక్ టన్నులు రైస్ మిల్లుల్లో దించుకుంటామని, మరో 60 వేల మెట్రిక్ టన్నులు సమీప జిల్లాలకు పంపించే అవకాశం ఉందని డీఎం జగదీశ్వర్ తెలిపారు. కాగా గత ఖరీఫ్‌కు సంబంధించి 90 శాతం, యాసంగికి సంబంధించి 50 శాతం సీఎంఆర్ పూర్తి చేశారు. ప్రస్తుతం మొత్తం 493 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐకేపీ 176, పీఏసీఎస్ 317 కేంద్రాలు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయి. కాగా ఈసారి 38 పారా, 47 రా రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించనున్నారు. ఎంపిక చేసిన మిల్లులు బ్యాంక్ గ్యారంటీ విధిగా ఇవ్వాల్సి ఉంటుంది. కోతలు ప్రారంభం కొల్చారం, రామాయంపేట, పాపన్నపేట మండలాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. కాగా కొల్చారం మండలంలోని వరిగొంతం, అప్పాజిపల్లి, అంసాన్పల్లి, పోతంశెట్టిపల్లి, కొంగోడ్, నాయిని జలాల్పూర్ , వెంకటాపూర్, కొల్చారం గ్రామాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. పాపన్నపేట మండలంలోని చీకోడ్, లింగాయపల్లి, లక్ష్మీనగర్‌లో వరి కోతలు కోస్తున్నారు. రామాయంపేట మండలంలోని కోనాపూర్, వెంకటాపూర్, ప్రగతి ధర్మారం, నిజాంపేట మండలం నస్కల్, నందిగామ, కల్వకుంట తదితర గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమైనా... ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ఏర్పాట్లు పూర్తి చేశాం ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. కోటి గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, ప్రస్తుతం 50 లక్షలు నిల్వ ఉన్నాయి. మిగతావి త్వరలో వస్తాయి. 13 వేల టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి. మరో 7 వేలు అవసరం అవుతాయి. అవసరమైనన్నీ మాయిశ్చర్ మీటర్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు అందుబాటులో ఉన్నాయి. ఈసారి కొత్తగా 100 ఆటోమెటిక్ ప్యాడీ క్లీనర్లను ఉపయోగిస్తాం. – జగదీశ్ కుమార్, డీఎం, సివిల్ సప్లయిస్ 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా 426 కొనుగోలు కేంద్రాలుప్రారంభం 7 వేల టార్పాలిన్లు.. 50 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో గోదాంలు -
దర్జాగా దగా
సీఎంఆర్ బియ్యం ఇవ్వడంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను సైతం ఖాతరు చేయడంలేదు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ మిల్లర్లు మొండికేస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మరాడించి సివిల్సప్లైకి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బియ్యాన్ని కాజేస్తున్నారు. తొమ్మిదేళ్లుగా 13 మంది మిల్లర్ల యాజమాన్యాలు 61వేలకుపైగా మెట్రిక్‌టన్నుల బియ్యం ఎగ్గొట్టారు. వీటి విలువ రూ. 214 కోట్లు. రికవరీ కోసం ఆర్‌ఆర్‌యాక్టు ప్రయోగించినా వసూళ్లు కాకపోవడం గమనార్హం. – మెదక్‌జోన్ మెదక్ జిల్లాలో గత తొమ్మిదేళ్లు(వానాకాలం, రబీ)గా 13 రైస్ మిల్లర్లు 61,786.193 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సివిల్సప్లైయ్కి బకాయి పడ్డారు. వీటికి సంబంధించి జరిమానా, వడ్డీ కలిపి మొత్తం రూ.214.15 కోట్లు ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వీటి రికవరీ కోసం ఆర్ఆర్ యాక్టు ప్రయోగించినా పెద్దగా ఫలితం లేదని తెలిపారు. రికవరీ చేయకుండానే కేటాయింపులు బకాయి పడిన మిల్లర్ల నుంచి పూర్తిగా బియ్యం రికవరీ చేశాకే మళ్లీ ధాన్యాం కేటాయించాల్సి ఉంది. కానీ అవేం నిబంధనలు పట్టించుకోకుండా తొమ్మిదేళ్ల పాటు వానాకాలం, రబీ సీజన్లలో 18 సార్లు బకాయిపడిన మిల్లులకు ధాన్యం కేటాయించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో ఉన్న నేతల ఒత్తిడి ఏమైనా ఉందా? లేకా మరేకారణాలు ఉన్నాయో తెలియదుకానీ వందల కోట్ల విలువైన బియ్యాన్ని 13 మంది మిల్లర్లు బొక్కడం గమనార్హం. ఒకే మిల్లు వద్ద రూ.4 కోట్ల బియ్యం బకాయి పాపన్నపేటకు చెందిన ఒక రైస్ మిల్లు.. 2012 నుంచి 2016 వరకు వానాకాలం, యాసంగిలో 70.128 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సివిల్సప్లైయ్కి బకాయి పడింది. ఇందుకు సంబంధించి జరిమానా, వడ్డి కలిపి ఆ బియ్యం విలువ రూ.4 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. సదరు మిల్లర్ యజమాని ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో దర్జాగా విక్రయించి రూ.కోట్లు సొమ్ము చేసుసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్‌ఆర్‌యాక్టు ప్రయోగం తొమ్మిదేళ్లుగా 61,786 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం బకాయి పడిన 13 మంది మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం. అయినా స్పందించక పోవటంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. ఆర్‌ఆర్‌యాక్టు ప్రయోగించాం. రికవరీకి చేర్యలు చేపడుతున్నాం. – జగదీశ్‌కుమార్, డీఎం సివిల్సప్లై తొమ్మిదేళ్లుగా సీఎంఆర్ బియ్యం ఎగవేత రైస్ మిల్లర్ల ఇష్టారాజ్యం 61,786 మెట్రిక్ టన్నుల రైస్ బకాయి పెనాల్టీతో వీటివిలువ రూ.214 కోట్లు క్రిమినల్ కేసులు నమోదు -
తాగునీటి కోసం తండ్లాట
మండల పరిధిలోని కామారం తండా వాసులు తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో వ్యవసాయ బోరుమోటార్లను ఆశ్రయించాల్సి వస్తుంది. తాగునీరు సరిగా సరఫరా కావడం లేదని, ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలని ఎన్నిసార్లు కోరినా గ్రామపంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని మహిళలు విమర్శించారు. వరి కోతలు మొదలైతే వ్యవసాయ రైతులు కూడా బోరుమోటార్లు బంద్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు తాగు నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. – చిన్నశంకరంపేట(మెదక్) -
పోషక ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం
ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులుతూప్రాన్: సమతుల్య ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునాని ఐసీడీఎస్ సూపర్ వైజర్ శివ కుమారి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పోషక ఆహారంపై 9, 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, స్పీచ్ కాంపిటీషన్ నిర్వహించారు. పోటీ పరీక్షలో గెలుపొందిన విద్యార్థులను అభినందించా రు. కిశోర బాలికలు తీసుకునే ఆహారంలో అన్ని రకా ల సమతుల్య ఆహారం తీసుకుంటేనే సరైన పోషణ లభిస్తుందని తెలిపారు. దీనితో పాటు వ్యక్తిగత పరి శుభ్రత, నిత్యం సుమారు 4లీటర్లకు అధికంగా మంచినీరు తాగాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో పోషణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురా లు ఫ్లోరిన్, అంగన్వాడీ టీచర్లు శ్రీలత, ఉమా పాల్గొన్నారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ శివకుమారి -
రూ.8 కోట్లతో పర్యాటక సొబగులు
● దంతేపల్లి శివారులో 80 ఎకరాలలో ఏర్పాటు ● జిల్లా అటవీ అధికారి జోజి ● పర్యాటక ప్రదేశం సందర్శన రామాయంపేట(మెదక్): రామాయంపేట అటవీశాఖ రేంజ్ పరిధిలో పర్యాటక ప్రాంతం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మండలంలోని దంతేపల్లి శివారులో 80 ఎకరాల అటవీప్రాంతాన్ని గుర్తించారు. రూ.8 కోట్ల వ్యయంతో ఇది ఏర్పాటు కానుంది. పర్యాటకులు రాత్రివేళ బస చేయడానికి వీలుగా గుడారాలు, గుట్టల చుట్టూ రహదారి సదుపాయం, లోపలిభాగంలో తిరుగడానికి వీలుగా సఫారి వాహనం, ఇతర వసతులు సమకూరనున్నాయి. మట్టిరోడ్డు వెంట పర్యాటకులు కూర్చోడానికి వీలుగా కుర్చీలు, బల్లలు, తాగునీటి సదుపాయం, మూత్రశాలలతో నిర్మించనున్నారు. కుంటలు, చెక్‌డ్యాంల నిర్మాణం, రెండు వాచ్ టవర్లు ఏర్పాటు, సోలార్ బోర్వెల్, వాటర్ ట్యాంక్, రహదారికి రెండువైపులా ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేయనున్నారు. మెదక్, కామారెడ్డి జిల్లాలను కలుపుతున్న అంతర్ జిల్లా రహదారిని ఆనుకునే పది కిలోమీటర్ల మేర వైశాల్యంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనితో పర్యాటకులకు వణ్యప్రాణులతోపాటు జలపాతాలు, అటవీ సొబగులు, గుట్టలు, కుంటలు వీక్షించే అవకాశం కలుగుతుంది. ఈకో నిధులతో.. వణ్యప్రాణి సంరక్షణ విభాగం పరిధిలో ఈకో నిధులతో పర్యాటక ప్రాంతం ఏర్పాటు చేయనున్నారు. దంతేపల్లి అటవీప్రాంతం పరిధిలో ఇందుకోసం ఆశాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. పర్యాటకుల కోసం దంతేపల్లి శివారులోని కాకుల గండి, లొంక ప్రాంతాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా అటవీ అధికారి జోజి, ఇతర అధికారులు అటవీప్రాంతాన్ని సందర్శించారు. -
అప్పులు తీర్చేందుకే రెండేళ్లు
మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు నిజాంపేట(మెదక్): గత ప్రభుత్వంలో చేసిన అప్పులు తీర్చడంతోనే రెండేళ్ల పాలన సరిపోయిందని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమ ంతరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో లీలా గ్రూప్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు డా.మోహన్ నాయక్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసినా ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. వచ్చే మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. అనంతరం మహిళలు గ్రామానికి బస్సులు నడపాలని విజ్ఞప్తి చేయడంతో డిపో మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, మహేందర్, సత్యనారాయణ, వెంకట్‌గౌడ్ పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండలం సంగాయిగూడతండాకు చెందిన కమలను హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్‌రూరల్ సీఐ జార్జ్‌కు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం కమల నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహిళలపై జరుగుతున్న హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్ర మహిళా మంత్రి కొండా సురేఖ, సీతక్క ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆమె వెంట జాగృతి జిల్లా నాయకుడు వీరప్ప గారి రమేశ్‌గౌడ్, రాజేశ్వరి తదితరులు ఉన్నారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రణీద్ కుమార్ నిజాంపేట(మెదక్): 317 జీఓ కారణంగా స్థానిక జిల్లాను కోల్పోయిన ఉపాధ్యాయులందరికీ శాశ్వతంగా వారి సొంత జిల్లాలకు కేటాయించేలా చూడాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రణీద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టీపీటీఎఫ్ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిజాంపేట మండలంలోని పలు ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బైతి ఐలయ్య మాట్లాడుతూ.. తాత్కాలిక డిప్యుటేషన్ కోసం ఇచ్చిన జీఓ 190 సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం చేసే లా ఉందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నవీన్ రత్నాకర్, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్, జిల్లా బాధ్యులు మోహన్, పరమేశ్వర్, శ్రీకాంత్‌రెడ్డి, వినయ్‌కుమార్ పాల్గొన్నారు. నర్సాపూర్: రాజ్యాంగం ద్వారా సంక్రమించే హక్కులను బాలికలు సంపూర్ణంగా పొందాలని ఇన్చార్జి డీడబ్ల్యూఓ హేమ భార్గవి పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశంలో బాలికల రక్షణ కోసం రాజ్యాంగంలో పలు చట్టాలు ఉన్నాయని, ఆయా చట్టాలను బాలికలు తమ రక్షణకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోకిరిల నుంచి రక్షణ పొందడానికి 100 కు ఫోన్ చేసి సహాయం పొందాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రంజిత్‌రెడ్డి, కోర్టు ఏజీపీ సుధాకర్, ఎంఈఓ తారాసింగ్, లీగల్ సర్వీస్ కమిటీ న్యాయవాదులు మధుశ్రీ, రాజునాయక్, సాయికుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సంతోష, జెండర్ కోఆర్డినేటర్ కవిత పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
498 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
● కలెక్టర్ రాహుల్‌రాజ్ ● అవినీతికి పాల్పడితే కేసులే.. రామాయంపేట(మెదక్): ధాన్యం కొనుగోలులో అవినీతికి పాల్పడితే కేసులు తప్పవని కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరించారు. మండలంలోని కోనాపూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోకుండా టార్ఫాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో 498 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందులో 430 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. పది కేంద్రాలకు రైతులు ధాన్యం తరలించారని, దీపావళి అనంతరం కేంద్రాలకు అధిక మొత్తంలో ధాన్యం వచ్చే అవకాశం ఉందని, తూకం యంత్రాలతోపాటు తేమ శాతాన్ని కొలిచే పరికరాలు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్ తదితరులున్నారు. విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దు మెదక్ కలెక్టరేట్: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులను బకాయిల కోసం గది బయటకు పంపితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దని చెప్పారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందని, తల్లిదండ్రులను ఫీజు కట్టమని అడగటం లేదా విద్యార్థులను బయటకు పంపడం వంటి వాటికి పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కంట్రోల్‌రూంను కలెక్టర్ ప్రారంభించారు. -
రెవెన్యూ చట్టాలపై అవగాహన: ఆర్డీఓ
తూప్రాన్: రెవెన్యూ పాలన, భూ చట్టాలపై డివిజన్ పరిధిలో నూతనంగా నియమితులైన గ్రామపాలన అధికారులకు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీఓ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వివిధ భూ సంబంధిత చట్టాలు, ప్రభుత్వ పథకాలు, గ్రామపాలన విధానాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా భూభారతి చట్టం గురించి వివరించి, గ్రామస్థాయిలో భూముల రికార్డుల డిజిటల్ నిర్వహణ, ప్రజలకు సులభంగా భూమి వివరాలు అందుబాటులో ఉంచడం, భూములపై అనధికార ఆక్రమణలు నివారించడం వంటి అంశాల గురించి వివరించారు. ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్, భూదాన్ భూములకు సంబంధించి చట్టపరమైన విధానాలు, వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వ పాఠశాలల్లో హైస్కూల్ స్థాయి విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ పుస్తకం తూచా తప్పకుండా అమలు చేయాలని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి అన్నారు. సోమవారం హవేళిఘణాపూర్ డైట్లో ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా విద్యార్థుల్లో కోడింగ్ డేటా సైన్స్, ఏఐ అంశాలలో నైపుణ్యం పెంపొందించేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు శ్రీకాంత్, నాగరాజు, రవికాంత్త్, భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని అవుట్డోర్ స్టేడియంలో ఉమ్మడి మెదక్ జిల్లా అథ్లెటిక్స్ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అండర్– 14, అండర్– 17 బాలుర పోటీల్లో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల నుండి 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇన్చార్జి యువజన క్రీడలశాఖ అధికారి, డీఈఓ రాధాకిషన్ హాజరై ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. అండర్–17లో 36 మంది అండర్–14లో 22 మంది మొత్తం 58 మంది ఉమ్మడి జిల్లా జట్టును రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పీడీలు శ్రీధర్‌రెడ్డి, మాధవరెడ్డి, మధుసూదన్, సత్యనారాయణ, శ్రీనివాసరావు, దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎండీకి ఎంపీ రఘునందన్ విజ్ఞప్తి దుబ్బాక: స్థానిక బస్‌డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఎంపీ రఘునందన్‌రావు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998లో 54 బస్‌లతో డిపో ప్రారంభించారని 134 మంది సిబ్బంది ప్రతిరోజు 14,014 కి,మీటర్ల ప్రయాణంతో రూ.8 లక్షల దినసరి ఆదాయం సాధించిందన్నారు. నష్టాల సాకుతో 2006లో దుబ్బాక డిపోను మూసి వేయడంతో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధుల నిరసనలతో వారం రోజుల్లోనే 10 బస్‌లతో మళ్లీ పునః ప్రారంభించారన్నారు. ప్రస్తుతం 35 బస్‌లతో రాష్ట్రంలో ఆదాయపరంగా ముందున్న డిపోలలో దుబ్బాక ఒకటన్నారు. డిపోకు డీఎం ను నియమించి 60 బస్‌లను కేటాయించి పూర్తిస్థాయి డిపోగా మార్చాలని ఎండీకి విన్నవించారు. -
హత్య కేసు దర్యాప్తు వేగవంతం: ఎస్పీ
కొల్చారం(నర్సాపూర్)/మెదక్‌మున్సిపాలిటీ: పోతంశెట్టిపల్లి శివారులో శనివారం గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యాచారం, హత్యకు గురైన మహిళ కేసును ఛేదించేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సోమ వారం ఘటనాస్థలిని సందర్శించి మాట్లాడారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే సంబంధిత పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఎస్పీ వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ఎస్ఐ మోహినొద్దీన్, సిబ్బంది ఉన్నారు. అనంతరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలపై 11 ఫిర్యాదులను అందజేయగా, వాటిని స్వయంగా స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కొన్నింటిపై సంబంధిత పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. -
ఎవరి చేతికో పగ్గాలు!
● నామినేషన్ వేసిన ఆంజనేయులుగౌడ్, రాజిరెడ్డి, రాంచందర్‌గౌడ్ ● అందరి అభిప్రాయాలతో నివేదిక సా్థనిక సంస్థల ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీని గ్రామీణస్థాయి నుంచి బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రజామోద యోగ్యమైన నాయకుడికి డీసీసీ పదవి కట్టబెట్టాలని, ఏకంగా ఏఐసీసీ నాయకులే రంగంలోకి దిగారు. సామాన్య కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం నామినేషన్లనే కాకుండా, పార్టీకోసం కష్టపడిన, సేవాభావం గల నాయకుల వివరాలు సైతం సేకరిస్తున్నట్లు తెలిసింది. సమావేశానికి రాలేకపోయిన వారు ఫోన్ల ద్వారా తమ అభిప్రాయాన్ని తెలపవచ్చని సూచించినట్లు సమాచారం. నాయకత్వ ఒత్తిడి, పరపతికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలు అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రధానంగా డీసీసీ అధ్యక్ష రేసులో ఉన్న ఇద్దరు నాయకులు, ఒకే నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో పోటీ తీవ్రంగానే ఉన్నట్లు కనపడుతుంది. రెండు జిల్లాలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు, చెరో అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నట్లు పార్టీవర్గాలు గుసగుసలాడుతున్నాయి. చివరికి ఎవరు జిల్లా కాంగ్రెస్ బాద్షా అవుతారో వేచి చూడాల్సిందే. డీసీసీ అధ్యక్షుడిని నియమించి పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిసింది. డీసీసీ పదవికి ముగ్గురు నామినేషన్లు వేసినా, ప్రధాన పోటీ ఇద్దరి మధ్యే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. – మెదక్ అర్బన్ డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ నుంచి జ్యోతి రౌతేలా, పీసీసీ నుంచి ఎన్నికల పరిశీలకులు జగదీశ్వర్‌రావు, నాసిర్ అహ్మద్, వరలక్ష్మిని నియమించారు. ఆదివారం మెదక్, రామాయంపేట బ్లాక్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిసింది. మెదక్ నియోజకవర్గంలోని రెండు బ్లాకుల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఒక అభ్యర్థి పేరును ప్రతిపాదించగా, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ ప్రాంతానికి చెందిన కొంతమంది ముఖ్య నాయకులు, సంగారెడ్డి జిల్లాకు చెందిన అమాత్యుల నిర్ణయమే తమ అభిప్రాయంగా భావించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే మెదక్ ప్రాంతానికి చెందిన నాయకులు కలిసికట్టుగా పరిశీలకుల ముందుకు వెళ్లి, తమ అభిప్రాయాన్ని ఏకకంఠంతో తెలిపినట్లు తెలుస్తోంది. మూడో అభ్యర్థి మాత్రం తాను నామమాత్రంగా పోటీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ ఏఐసీసీ పరిశీలకులు అవకాశం ఇస్తే స్వీకరిస్తానని తెలిపారు. సోమవారం నర్సాపూర్, కౌడిపల్లిలో జరిగిన సమావేశానికి నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం, మాసాయిపేట మండలాలకు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులకు మద్ధతు లభించినట్లు తెలుస్తోంది. -
పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు
నర్సాపూర్/కౌడిపల్లి(నర్సాపూర్): పార్టీ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఏఐసీసీ పరీశీలకురాలు జ్యోతి రౌతేలా అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో డీసీసీ అధ్యక్ష పదవి కోసం నర్సాపూర్, శివ్వంపేట మండలాలకు చెందిన పార్టీ నాయకుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతి థిగా ఆమె హాజరై మాట్లాడారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అగ్రనేత రాహుల్‌గాంధీ పలు కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. పార్టీ పదవుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, మైనార్టీ వర్గాల కార్యకర్తలు పోటీ పడవచ్చన్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించి పార్టీ పదవుల భర్తీ సమయంలో తగిన ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ అ బ్జర్వర్లు నసీర్ అహ్మద్, జగదీశ్వర్, వరలక్ష్మి, డీసీసీ అద్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. అనంతరం కౌడిపల్లి మండలం తిమ్మాపూర్‌లో కౌడిపల్లి, కొల్చారం, వెల్దుర్తి, మాసాయిపేట, చిలప్‌చెడ్ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ నిర్వహించారు. 18న ఏఐసీసీ కార్యాలయానికి దర ఖాస్తుల జాబితా పంపుతామని చెప్పారు.ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రౌతేలా -
తడి లేదు.. పొడి లేదు
● అలంకారప్రాయంగా షెడ్లు ● రూ. 40 లక్షల నిధులు వృథా ● నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ అపహాస్యమవుతోంది. పట్టణానికి దూరంగా ఏర్పాటు చేసిన డంప్‌యార్డులో తడి, పొడి చెత్తను వేరు చేయడానికి, వాటిని రిసైక్లింగ్ చేయడానికి గాను రూ. 40 లక్షల నిధులతో నిర్మి ంచిన రెండు షెడ్లు నిరుపయోగంగా మారాయి. వీటి కోసం ఖర్చు చేసిన 40 లక్షల నిధులు వృథాగా మారాయి. ఆరు బయటే చెత్త పారబోత పట్టణంలో ప్రతి రోజూ ట్రాక్టర్లు, ఆటోల్లో 12 వార్డుల నుంచి సేకరిస్తున్న తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. వేర్వేరుగా చెత్తను ఇవ్వడానికి గాను పట్టణంలోని అన్ని గృహాలకు బుట్టలు సరఫరా చేశారు. అయినా వేర్వేరుగా ఇవ్వకుండా ఒకే చోట ఇస్తున్నారు. డంపింగ్‌యార్డులో తడి చెత్త, కుళ్లిపోయిన కూరగాయలు, ఇతర వస్తువులను సెగ్రిగేషన్ షెడ్డులో వేసి సేంద్రియ ఎరువు తయారు చేయాలి. పొడి చెత్తతో పాటు ప్లాస్టిక్, బాటిళ్లు, ఇతర వస్తువులను డీఆర్సీసీ (డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్)కు తరలించి వేరు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు షెడ్లను వేర్వేరుగా నిర్మించారు. తయారు చేసిన సేంద్రియ ఎరువును మున్సిపాలిటీ పరిధిలో మొక్కలకు, నర్సరీల్లో వినియోగించి మిగితాది విక్రయిస్తారు. డీఆర్సీసీలో వేర్వేరు చేసిన చెత్త, ఇతర సామగ్రిని స్వచ్ఛంద సంస్థకు విక్రయించి చెత్త నుంచి సంపద సృష్టించాలి. దీంతో మున్సిపాలిటీకి ఆర్థికంగా చేయూత లభించడంతో పాటు చెత్త రహిత పట్టణంగా రూపొందుతుంది. కాగా పట్టణం మున్సిపాలిటీగా అవతరించి ఏడేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను ప్రారంభించలేదు. ట్రాక్టర్లు, ఆటోల్లో తరలిస్తున్న తడి, పొడి చెత్తతో పాటు ఇతర సామగ్రిని షెడ్లలో వేయకుండా ఆరు బయటనే వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా దుర్వాసన వెదజల్లుతోంది. ఈప్రాంతంలో పంటలు చేస్తున్న రైతులు దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. సెగ్రిగేషన్ షెడ్డు, డీఆర్సీసీ సెంటర్ నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు వినియోగంలోకి తీసుకురాలేదు. ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేసినా ఫలితం దక్కడం లేదు. -
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలపై కలెక్టర్‌కు వినతులు సమర్పించారు. మొత్తం 58 అర్జీలు అందజేయగా, ఇందులో భూ సమస్యలు 24, పెన్షన్లు 10, ఇందిరమ్మ ఇళ్ల కోసం 6, ఇతర సమస్యలపై 18 వచ్చాయి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల అభ్యర్థనలు గౌరవిస్తూ, పారదర్శకత, సమయపాలనతో సేవలందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, ట్రైనీ డీఆర్ఓ అహ్మద్, ఆయాశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా మార్కెట్ విలువకనుగుణంగా ట్రిపుల్ఆర్ పరిహారం ఇవ్వాలని నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామస్తులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పాత జీఓ ప్రకారమే వేతనాలివ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే రోజువారీ కార్మికులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఇసుక కొరత లేకుండా చూడండి నర్సాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ మైనింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నర్సాపూర్ ఇసుక బజార్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి విక్రయాలకు సంబంధించిన పలు రికార్డులను పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందిస్తున్నామని, నల్గొండ నుంచి తీసుకురావడానికి అయ్యే రవాణా చార్జీలను లబ్ధిదారుల నుంచి తీసుకుంటున్నట్లు చెప్పారు. పంచాయతీ కార్యదర్శి నుంచి టోకెన్ తీసుకొని వస్తే ఇసుక అందచేస్తారని వివరించారు. ఇసుక మాఫియాను తొలగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. జిల్లాలో తొమ్మిది వేల పైచిలుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, వాటి నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, మైనింగ్ శాఖ అధికారులు ఉన్నారు. -
లక్ష్యం.. నిర్లక్ష్యం
పచ్చదనం పెంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం జిల్లాలో మందకొడిగా సాగుతోంది. కొన్నిశాఖల నిర్లక్ష్యంతో లక్ష్యం నెరవేరడం లేదు. పథకం ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా, జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఇక జిల్లా పోలీస్‌శాఖ ఈ పథకాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. – మెదక్ కలెక్టరేట్ జూలై 17న కలెక్టరేట్లో ఇన్చార్జి మంత్రి వివేక్ మొక్కలు నాటి వన మహోత్సవం పథకాన్ని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 37 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ణయించారు. జిల్లాలోని 21 మండలాలు, 492 గ్రామాలు, 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మండలాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడే నర్సరీలు ఉన్నాయి. వీటిని డీఆర్డీఏ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తారు. అలాగే అటవీశాఖ ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసింది. వీటితో పాటు జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నాలుగు మున్సిపాలిటీల్లో ఇప్పటికే శాశ్వత నర్సరీలు ఉన్నాయి. వీటిలో నీడనిచ్చే వాటితో పాటు పండ్లు, పూలనిచ్చే 30 రకాల మొక్కలు పెంచుతున్నారు. ఆసక్తి చూపని మున్సిపాలిటీలు జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వన మహోత్సవంలో శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాన్ని కేటాయించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలు లక్ష్యానికి దాదాపు దగ్గర ఉన్నాయి. కానీ మున్సిపాలిటీల్లో మాత్రం పథకం ముందుకు సాగడం లేదు. 4 మున్సిపాలిటీలకు 2.60 లక్షలు లక్ష్యంగా కేటాయించగా, ఇప్పటివరకు 1,87,520 నాటడం పూర్తయ్యింది. మరో 72,480 లక్షలు పూర్తిచేయాల్సి ఉంది. అలాగే అగ్రికల్చర్ శాఖకు 30 వేలు కేటాయించగా 1,373 మాత్రమే నాటగా, పోలీస్‌శాఖకు 18 వేలు కేటాయించగా, ఒక్క మొక్క కూడా నాటకపోవడం గమనార్హం. ముందుకు సాగనివన మహోత్సవం పట్టించుకోని పోలీస్‌శాఖ అగ్రికల్చర్ అంతంతే.. 87 శాతం పూర్తి జిల్లాలో వన మహోత్సవం 87 శాతం పూర్తయ్యింది. కొన్ని శాఖలతో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో వన మహోత్సవం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. అందువల్లే లక్ష్యం పూర్తి కావడం లేదు. – జోజీ, డీఎఫ్ఓ -
బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
చిన్నశంకరంపేట(మెదక్): పాఠశాలల సమయానికి బస్సులు రాకపోవడంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు రోడ్డెక్కారు. సోమవారం మండలంలోని అంబాజిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టా రు. చిన్నశంకరంపేటలోని జెడ్పీ పాఠశాల, మోడల్ స్కూల్‌కు వెళ్లేందుకు రోడ్డుపై గంటపాటు వేచి ఉన్న బస్సు రా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల సమయానికి బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గు రయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నారాయణగౌడ్ పోలీస్ సిబ్బందితో వచ్చి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు. -
పట్నాలు వేసి.. మొక్కులు చెల్లించి
మల్లన్న ఆలయంలో భక్తుల కోలాహ లంకొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆల యం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. శనివారం సాయంత్రం నుంచి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించారు. స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ వెంకటేశ్, ఏఈఓ శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్‌లు పర్యవేక్షించారు. -
సీపీఆర్‌తో శ్రీరామ రక్ష
జిల్లాలో నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు మెదక్‌జోన్: మరణం ఎప్పుడు ఎలా వస్తుందో.. ఎవరూ చెప్పలేరు. అప్పటివరకు నవ్వుతూ కనిపించిన వారే కళ్ల ముందు కుప్పకూలుతుంటారు. రెప్పపాటులో కళ్లు మూస్తుంటారు. గుండెపోటుతో తరు చూ ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అయితే గుండెపోటు వచ్చిన వారిని సీపీఆర్ (కార్డి యో పల్మోనరీ రిససిటేషన్)తో సకాలంలో కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు వైద్యారోగ్యశాఖ శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి 17వ తేదీ వరకు జిల్లాలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్యులతో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఉరుకుల పరుగుల జీవితంలో మూడు పదుల వయసులోనే బీపీ, షుగర్‌తో పాటు ఎన్నో రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు ఎక్కువవుతున్నాయి. అవి మరణాలకు దారి తీస్తున్నాయి. ఈ మధ్యకాలంలో గుండె సమస్యలతో సంభవిస్తున్న మరణాల్లో యువతే ఎక్కువగా ఉంటున్నారని పలు అధ్యయనాలు తేల్చాయి. అయితే గుండెపోటు, ప్రమాదాలు వంటివి జరిగినప్పుడు స్పృహ కోల్పోయిన లేదా శ్వాస తీసుకోని వారికి అత్యవసర సమయంలో సీపీఆర్ ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంది. పోలీసులు, ఇతర సామాన్యులు కూడా సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడిన సంఘటనలు అనేకం ఉన్నా యి. జిల్లాలో ఇటీవల ఓ పోలీస్ కానిస్టేబుల్ మహిళ ప్రాణాన్ని కాపాడారు. ఈక్రమంలో వైద్యారోగ్యశాఖ సీపీఆర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాకు చెందిన వైద్యులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. ఇందులో చేగుంట పీహెచ్సీ వైద్యుడు అనిల్, వెల్దుర్తి పీహెచ్సీ వైద్యురాలు సౌజన్య, రెడ్డిపల్లి డాక్టర్ ఫర్నాజ్, సర్దన పీహెచ్సీ వైద్యుడు వినయ్సుశీల్ ఉన్నారు. వీరితో పాటు 108 సిబ్బంది అవగాహన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జిల్లాలో ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, జన సంచారం ఎక్కువగా ఉన్న రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్‌మాల్స్, వైద్యారోగ్య సెంటర్లలో అధికారులు విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ విధిగా అవగాహన కలిగి ఉండాలి. అకస్మాత్తుగా గుండె కొట్టుకోవటం ఆగి శ్వాస నిలిచిపోయిన వ్యక్తులకు వెంటనే సీపీఆర్ చేస్తే 60 శాతం బతికే అవకాశం ఉంటుంది. ప్రభు త్వం దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. – గణేశ్వర్, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, మెదక్ -
పర్యాటక సొబగులు
●అర్బన్‌పార్కుకు మరిన్ని హంగులు ●ప్రారంభానికి సిద్ధమైన కాటేజీలు ●సందర్శకులకు సకల వసతులు పర్యాటక పరంగా నర్సాపూర్ మరింత అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే అర్బన్‌పార్కుకు సందర్శకుల తాకిడి పెరిగింది. అదే పార్కులో వారు బస చేసేందుకు అనువుగా నిర్మించిన కాటేజీలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈనెల చివరి వారంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. – నర్సాపూర్ నర్సాపూర్– హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకొని పట్టణ శివారులోని 258 హెక్టార్లలో అటవీశాఖ అర్బన్‌పార్కు ఏర్పాటు చేసింది. వాచ్ టవర్‌పైకి ఎక్కితే పచ్చని అడవి అందాలతో పాటు పట్టణానికి చెందిన రాయరావు చెరువు, పట్టణ వ్యూ పర్యాటకులకు ఆహ్లాదం పంచుతోంది. కాగా సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 80 మ ంది వరకు పార్కుకు వస్తుండగా, సెలవు రోజుల్లో ఆ సంఖ్య రెట్టింపు అవుతోంది. అయితే అర్బన్‌పార్కును పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అటవీశాఖ అడుగులు వేసింది. పాత కాటేజీల పనులు పూర్తి చేయడంతో పాటు కొత్తగా మరిన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నీరు నిల్వ ఉండే ప్రాంతంలో 21 కాటేజీలు, ఒకే బ్లాక్‌లో ఉండే విధంగా మరో 12 కాటేజీలు, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్, సెమినార్ హాల్, ఇండోర్, అవుట్డోర్ గేమ్స్, నెట్ క్రికెట్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, పర్యాటకులకు భోజన సదుపాయం కల్పించేందుకు రెస్టారెంట్, దానిని ఆనుకొని కిచెన్ నిర్మాణాలు పూర్తయ్యాయి. కాగా కాటేజీల పరిసరాల్లో అక్కడక్కడ ఖాళీ స్థలంతో పాటు కొంత ఏరియాలో మొక్కలు నాటారు. త్వరలోనే అందుబాటులోకి.. అర్బన్‌పార్కులో చేపట్టిన కాటేజీల నిర్మాణ పనులు పూర్తి కాగా, కాటేజీలు, రెస్టారెంట్, ఇతర భవనాల్లో ఫర్నిచర్ సమకూర్చాల్సి ఉంది. ఈ మేరకు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంస్థ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. కాగా స్థానిక ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారకపోతే ఈనెల చివరి వారంలో లేదా వచ్చె నెలలో కాటేజీలు ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ చర్యలు చేపడుతోంది. అర్బన్‌పార్కుతో ఇప్పటికే నర్సాపూర్ పర్యాటకంగా పేరు గడించింది. పార్కులో నిర్మించిన కాటేజీలు అందుబాటులోకి వస్తే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉ ంటుంది. మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అటవీశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం
ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రౌతేలామెదక్జోన్: కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని ఉత్తరాఖండ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రౌతేలా అన్నా రు. ఆదివారం మెదక్‌లో డీసీసీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పారదర్శక ఎన్నిక కోసం అన్నిస్థాయిల కార్యకర్తల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మండల, బ్లాక్, జిల్లాస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు సందర్శిస్తున్నామన్నారు. పార్టీ కోసం పని చేసే నాయకులకు సముచిత ప్రాఽ దాన్యం లభిస్తుందన్నారు. ఈనెల 22న ఏఐసీసీకి నివేదిక సమర్పిస్తామని వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్‌రావు, పీసీసీ కోఆర్డినేటర్లు అహ్మద్ నజీర్, వరలక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురాంగౌడ్, నాయకులు ఆవుల రాజిరెడ్డి, హఫీజ్, మ్యాడం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మందులు అందుబాటులో ఉంచండి
కలెక్టర్ రాహుల్రాజ్కొల్చారం(నర్సపూర్): ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందేలా చూడాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం కొల్చారం,రంగంపేట ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్లు, సిబ్బంది హాజరుతో పాటు మ ందుల స్టాక్‌ను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల కేసులు, వా టికి సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయా..? అని ఆరా తీశారు. వ్యాధుల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట వైద్యులు ప్రవీణ్ కుమార్, సిబ్బంది త దితరులు ఉన్నారు. -
ముందస్తు అనుమతి తప్పనిసరి
మెదక్ మున్సిపాలిటీ: దీపావళి సందర్భంగా జిల్లా పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలు, మార్గదర్శకాల కోసం సంబంధిత సబ్ డివిజనల్ పోలీస్ అధికారిని సంప్రదించాలన్నారు. అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇటీవల జరుగుతున్న నేరాల గురించి ప్రస్తావించారు. లోన్‌యాప్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, బిట్‌కాయిన్, క్రిఫ్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. తక్కువ వడ్డీతో వెంటనే లోన్ ఇస్తామని చెప్పి కొన్ని యాప్‌లను ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు చెప్పారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే హెల్ప్‌లైన్ 1930 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
సేవలందించని రైతు వేదికలు
ప్రారంభానికి నోచుకోని ఫరీద్పూర్ రైతు వేదికఅధ్వానంగా ర్యాలమడుగు రైతువేదిక హవేళిఘణాపూర్(మెదక్): గత ప్రభుత్వ హయాంలో రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన రైతు వేదికలు అలంకారప్రాయంగా మిగిలాయి. క్లస్టర్ పరిధిలోని ఏఈఓలు కనీసం నిర్వహణను పట్టించుకోవడం లేదు. మండల పరిధిలోని ర్యాలమడుగు రైతువేదిక అధ్వానంగా మారింది. కనీసం వెళ్లేందుకు దారి కరువైంది. మెదక్, హవేళిఘణాపూర్ మండలాల పరిధిలోని అన్ని రైతు వేదికల పరిస్థితి ఇలాగే ఉంది. ఫరీద్‌పూర్‌లో నిర్మించిన వేదికను ఇప్పటివరకు ప్రారంభించలేదు. అధికారులు హవేళిఘణాపూర్, మెదక్ కార్యాలయాల్లోనే ఉంటూ రైతులను అక్కడికే రప్పించి పనులు చేస్తున్నారు. బూర్గుపల్లి శివారులో నిర్మించిన రైతు వేదిక సైతం ప్రారంభానికి నోచుకోకుండా పోయింది. ఇది మందుబాబులకు అడ్డాగా మారింది. ఇలాగే వదిలేస్తే అవి శిథిలావస్థకు చేరే అవకాశం ఉందని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రైతు వేదికలను వినియోగంలోకి తీసుకువచ్చేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కనీస నిర్వహణ కరువు -
చాకరిమెట్లలో పూజలు
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణస్వామి మండపంలో దంపతులు సామూహిక వ్రతాలు ఆచరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆంజనేయశర్మ, ఈఓ శ్రీనివాస్, అర్చకులు పాల్గొన్నారు. వైభవంగా బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ దుబ్బాక: పట్టణంలో శనివారం ప్రధాన గ్రామదేవత బొడ్రాయి (నాభిశిల, భూలక్ష్మీదేవి) విగ్రహాల ప్రతిష్ఠ కనులపండువగా జరిగింది.అంతకు ముందు వేదస్వస్తి తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు పలువురు ప్రముఖులు హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక పట్టణంలో బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. భవిష్యత్త్‌లో అమ్మవారి కృపతో దుబ్బాక పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. ఉత్సవంలో పట్టణంలోని అన్ని కులసంఘాల పెద్దలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయస్థాయిలో రాణించాలి మెదక్ మున్సిపాలిటీ: హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఎలైట్ ప్రీమియర్ లీగ్– సీజన్ 1 టోర్నమెంట్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన సాయిలాటిని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. ఈ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ తెలంగాణ పోలీస్, టాలీవుడ్ హీరోస్ జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. రెండు జట్లు అద్భుతమైన క్రీడా ప్రదర్శన కనబరిచినా, తెలంగాణ పోలీస్ జట్టు విజయాన్ని సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన సాయిలాటి కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అభినందించారు. క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయస్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సీజేఐపై దాడికి యత్నం అమానుషం గజ్వేల్: సీజేఐ జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడి ఘటనపై నిరసన వెల్లువెత్తింది. శనివారం దళిత, ప్రజా, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గజ్వేల్‌లోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇందిరాపార్కు చౌరస్తా నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, దళిత, ప్రజా సంఘాల నా యకులు మాట్లాడుతూ.. సీజేఐపై దాడి..దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. దేశంలో దళితులకు అత్యున్నత పదవులు దక్కుతున్నా.. ఆధిపత్య కులాల నుంచి అవమానాలు తప్పడం లేదనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. -
మెరుగైన వైద్యం అందించండి
చేగుంట(తూప్రాన్)/చిన్నశంకరంపేట(మెదక్): ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆస్పత్రి ఓపీ రికార్డులను పరిశీలించారు. మందులను పరిశీలించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందుల గురించి ఆరా తీశారు. గత నెలలో మండల పరిధిలో ఎంతమందికి డెలివరీలు చేయించారని ఏఎన్ఎంలను ప్రశ్నించారు. ఆస్పత్రి ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సిబ్బంది రాజిరెడ్డి, అనిత ఏఎన్ఎంలు, సిబ్బంది ఉన్నారు. అనంతరం చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూను పరిశీలించారు. వసతి గృహంలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా సహించేదిలేదని సిబ్బందిని హెచ్చరించారు.కలెక్టర్ రాహుల్‌రాజ్ -
ఉద్యాన పంటలపై దృష్టి సారించాలి
ములుగు ఉద్యానవర్సిటీవైస్ చాన్స్‌లర్ రాజిరెడ్డి ములుగు(గజ్వేల్): రైతులు అవకాడో, కూరగాయల లాంటి ఉద్యాన పంటలపై దృష్టి సారించి అధిక దిగుబడులు, లాభాలు సాధించాలని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ రాజిరెడ్డి సూచించారు. శనివారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ధన్–ధాన్య కృషి యోజన పథకంలో భాగంగా వి శ్వవిద్యాలయంలో రైతులు, అధికారులు, విద్యార్థులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యాన పంటల ఉత్పత్తి ఇప్పటికే 350 మిలియన్ టన్నులకు చేరిందని ఇది సాధారణ వ్యవసాయం కంటే ఎక్కువని రైతులకు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలపై అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని లాభాల దిశలో ముందుకు వెళ్లాలని వివరించారు. అనంతరం రైతులు ఉద్యాన శాస్త్రవేత్తలతో వివిధ అంశాలపై చర్చించారు. కరివేపాకు, మునగ వంటి ఇతర పంటలపై కూడా రైతులు దృష్టి సారించాలని శాస్త్రవేత్తలు సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన వర్సిటీ అధికారులు సురేష్‌కుమార్, సిందుజ, మల్లేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
తొమ్మిదేళ్లు.. అవస్థలు ఎన్నాళ్లు!
కోటి ఆశ లతో పదో వసంతంలోకి మెతుకుసీమÐðl$™èl$MýS$ïÜÐ]l$ ¯]l*™èl¯]l hÌêÏV> AÐ]l-™èlÇ…_ ™öÑ$Ã-§ólâ¶æ$Ï ç³NÇ¢ ^ólçÜ$-Mö° ç³§ø Ð]lçÜ…-™èl…-ÌZMìS Ayýl$-VýS$-ò³-sìæt…¨. Mö…§ýlÆý‡$ ´ëÌS¯]l ^ólÆý‡$-OÐðl…§ýl° B¯]l…-§ýl-ç³-yýl$™èl$…sôæ.. ç³Ë$-Ð]l#Æý‡$ Cº¾…-§ýl$Ë$ ™èlç³µyýl… Ìôæ§ýl° BÐól-§ýl¯]l Ð]lÅMýS¢… ^ólçÜ$¢-¯é²Æý‡$. Mö™èl¢ hÌêÏ HÆ>µ-r$MýS$ Ð]l¬…§ýl$ ´ëÌS-¯]l…™é çÜ…V>-Æð‡yìlz MóS…{§ýl…-V>¯ól ÝëW…-¨. §ýl*Æ>-¿ê-Æý‡…™ø {ç³fË$ A¯ólMýS AÐ]lçܦË$ ç³yézÆý‡$. hÌêÏÌS ç³#¯]l-Ç-Ó-¿ýæ-f-¯]l™ø D {´ë…™èl {ç³fÌS _Æý‡-M>ÌS MøÇMýS ¯ðlÆý‡-ÐólÇ…¨. 11 AMøtºÆŠæḥ 2016ÌZ ™ðlÌS…-V>׿ _{™èl-ç³r…Oò³ Ððl$§ýlMŠS {ç³™ólÅMýS hÌêÏV> AÐ]l-™èlÇ…_…-¨. – మెదక్‌జోన్ ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన తర్వాత మెదక్ కొంతమేర అభివృద్ధి వైపు పయనిస్తోంది. 2022లో జిల్లాకు రైలు రావటంతో ఇక్కడి ప్రజల చిరకాల కోరిక తీరింది. 2023లో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా పరిషత్, మాతా శిశు ఆస్పత్రి (ఎంసీహెచ్) భవనాలు అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర వైద్యం అందించే (క్రిటికల్ కేర్) యూనిట్ మాత్రం నిర్మాణంలో ఉంది. అలాగే మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరు కాగా, ఓ ప్రైవేట్ భవనంలో తరగతులు కొనసాగుతున్నాయి. భవనాల నిర్మాణం కోసం రూ. 180 కోట్లు మంజూరయ్యాయి. స్థల సేకరణ పూర్తి అయినప్పటికీ టెండర్ దశలో ఉన్నాయి. జిల్లాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూ రైంది. రామాయంపేటలో స్థల సేకరణ సైతం పూర్తి అయింది. అలాగే చేగుంట రైల్వేగేట్ సమీపంలో ఆర్వోబీ నిర్మాణం కోసం కేంద్ర ప్రభు త్వం రూ. 47 కోట్లు మంజూరు చేసింది. ఇటీవలే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా, పనులు ప్రారంభించారు. ఆశించిన ప్రగతి కరువు మెదక్‌కు రింగ్‌రోడ్డు లేకపోవటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. జిల్లాలో చూడదగిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చి, ఖిల్లా, పోచారం అభయారణ్యం, కామారెడ్డి– మెదక్ జిల్లాల సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు, ఏడుపాయల దేవస్థానం, కొల్చారంలో నిర్మించిన జైన మందిరం గత చరిత్రకు అద్దం పడుతున్నాయి. వీటిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఏళ్లుగా పాలకులు హామీలు ఇస్తున్నా, ఆచరణలో ముందుకు సాగటం లేదు. జిల్లాలో ఉన్నత విద్య సైతం అందని ద్రాక్షగానే మిగిలింది. పీజీ, ఇంజనీరింగ్, కేంద్రీయ విద్యాలయాలు కరువయ్యాయి. ఉన్నత చదువులకు విద్యార్థులు హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేవు. ఏకై క మధ్యతరహా ప్రాజెక్టు ఘనపూర్ రైతుల కల్పతరువు. దీని ఆయకట్టు ప్రస్తుతం 25 వేల ఎకరాలు మాత్రమే ఉంది. ఆనకట్ట ఎత్తు పెంచితే మరో 10 నుంచి 15 వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ఎత్తు పెంపు కోసం గతంలో నిధులు మంజూరు కాగా, నేటికీ ముంపునకు గురయ్యే భూములకు పరిహారం ఇవ్వలేదు. ఎత్తు పెంపు పనులు ముందుకు సాగటం లేదు. అలాగే కొన్ని మండలాల్లో కాళేశ్వరం కాలువల నిర్మాణం పూర్తి కాలేదు. మధ్యలో నిలిచిన పనులు జిల్లా కేంద్రంలోని పిట్లం చెరువు, గోసముద్రం చెరువులను మినీట్యాంక్ బండ్‌గా మార్చేందుకు 8 ఏళ్ల క్రితం రూ. 9 కోట్లు మంజూరయ్యాయి. ఇరిగేషన్ పరిధి పనులు పూర్తి అయినప్పటికీ, టూరిజం కింద చేపట్టిన పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. అలాగే పట్టణంలోని రాందాస్ చౌరస్తా, హెడ్ పోస్టాఫీస్, బోధన్ చౌరస్తాలు ఎలాంటి ప్రగతికి నోచుకోలేదు. మహానీయుల విగ్రహాలను నేటికీ పునరుద్ధరించలేదు. కరువైన రింగురోడ్డు.. కష్టతరంగా ప్రయాణం ఊసే లేని పర్యాటకం.. రైలుకూత, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తలమానికం -
సర్కారు బడుల్లో అల్పాహారం
మెదక్ అర్బన్: విద్యార్థుల హాజరుశాతం పెంచడంతో పాటు ఆకలి బాధలు తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్కార్ బడుల్లో ఉదయం పూట అల్పాహారం అందించనుంది. ఈ పథకానికి అయ్యే ఖర్చు, నిర్వహణ.. తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే నివేదిక రూపొందించినట్లు సమాచారం. జిల్లాలో లోకల్ బాడీ స్కూళ్లు 902 ఉండగా, విద్యార్థులు 64,681 మంది చదువుతున్నారు. కాగా 7 మోడల్ స్కూల్స్ ఉండగా, ఇందులో బాలురు సుమారు 2 వేలు ఉన్నారు. మొత్తం మీద సుమారు 66,681 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. వంట కార్మికుల జీతాలు పెంపు తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అందుకనుగుణంగా విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రతి రోజు ఉదయం రోజుకో రకం టిఫిన్ అందివ్వనున్నారు. వారంలో మూడు రోజులు పులిహోర, వెజ్ బిర్యాని, కిచిడి.. మరో రెండు రోజులు బోండా, ఉప్మా, ఇడ్లీ అందించాలని సంకల్పించారు. 1 నుంచి 5 తరగతుల వారికి రోజుకు రూ. 8తో, 6 నుంచి 10 వరకు రూ.12 తో అల్పాహారం అందివ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు అవసరమైన పాత్రలు, గ్యాస్ తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఇక వంట కార్మికులకు ప్రస్తుతం ఉన్న రూ. 3 వేల జీతాన్ని రూ. 3,500కు పెంచాలని నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు జిల్లాలో 66,681 మంది విద్యార్థులకు ప్రయోజనం ఇప్పటికే కొనసాగుతున్న రాగిజావ పంపిణీతీరనున్న ఆకలి బాధలు ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. సమయపాలనతో పాటు హాజరుశాతాన్ని పెంచేందుకు ఇటీవల ప్రభుత్వం విద్యార్థులతో పాటు టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ సిస్టం ప్రవేశపెట్టింది. సమీప గ్రామా ల నుంచి వచ్చే విద్యార్థులు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఉదయం 8 గంటలకే ఇళ్ల నుంచి బయలు దేరుతున్నారు. ఆ సమయానికి ఇంటి వద్ద వంటలు కాకపోవడంతో ఏమీ తినకుండానే బడికి వస్తున్నారు. కొంత మంది విద్యార్థులు ప్రార్థనలో కళ్లు తిరిగి పడిపోవడం కూడా జరుగుతుందని టీచర్లు అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. వారానికి మూడుసార్లు గుడ్లు, రాగి జావ ఇస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసుల సమయంలో సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నారు. ఈ విషయమై డీఈఓ రాధాకిషన్‌ను వివరణ కోరగా.. ఇప్పటివరకు అల్పాహారానికి సంబంధించి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మంచి లక్ష్యం.. అంతా నిర్లక్ష్యం
● గుంతలు తీశారు.. మొక్కలు మరిచారు ● పట్టించుకోని మున్సిపల్ అధికారులునర్సాపూర్ రూరల్: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తుకారాం తండాకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు అధికారులు గుంతలు తీయించారు. అయితే నాటడం మాత్రం మరిచారు. ప్రస్తుతం ఆ మొక్కలు ఎండుముఖం పట్టాయి. వన మహోత్సవంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో 30 వేల మొక్కలు నాటాలనే లక్ష్యం ఉంది. అందులో భాగంగా నర్సాపూర్ నుంచి తుకారం తండాకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు నెల రోజుల క్రితం గుంతలు తీశారు. వాటిలో నాటేందుకు రాయరావు చెరువు కట్టపై నుంచి మొక్కలు తెచ్చి పెట్టి నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఎండిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్డు వెంట మొక్కలు నాటారు. కానీ సంరక్షణ చర్యలు మాత్రం చేపట్టలేదు. ఇదే విషయమై మున్సిపల్ ఎన్విరాల్మెంట్ ఇంజినీర్ శ్రీకాంత్‌ను వివరణ కోరగా.. సిబ్బంది కొరత కారణంగా టార్గెట్‌ను రీచ్ కాలేకపోతున్నామని చెప్పారు. సిబ్బంది సమస్య తీరితే వన మహోత్సవంలో ఇచ్చిన 30 వేల మొక్కల నాటే టార్గెట్ పూర్తి చేసి సంరక్షిస్తామని తెలిపారు. -
అసలేం జరిగింది?
మెదక్‌జోన్: జిల్లాలో సంచలనం రేపిన గిరిజన మహిళ హత్యాచారం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి వద్ద సెల్‌ఫోన్ లేకపోవడంతో అసలేం జరిగిందనే దానిపై క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే మహిళ పని కోసం టిఫిన్ కట్టుకుని సమీప బంధువు (మహిళ)తో కలిసి మెదక్ అడ్డా వద్దకు ఇంటి నుంచి ఆటోలో బయల్దేరింది. ఆ తర్వాత ఎక్కడకు వెళ్లింది? ఎవరిని కలిసింది? అనే విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ శనివారం తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలిని పరిశీలించి క్లూస్‌టీంను రంగంలోకి దింపారు. ఆటోడ్రైవర్‌తో పాటు బాధితురాలితో వచ్చి న మరో మహిళను విచారించినట్లు తెలుస్తోంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మంబోజిపల్లి చౌరస్తాలో ఎన్ని ఆటోలున్నాయనే విష యాన్ని తెలుసుకునేందుకు అక్కడ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాధితురాలి భర్తతో పాటు ఆ తండాలోని పలువురిని సైతం విచారించారు. అయితే సదరు మహిళ మంబోజిపల్లికి రాగానే తనకు ఇక్కడే పని ఉందని ఆటో దిగిపోగా, ఆమె బంధువు ఓ మేసీ్త్ర వద్ద పనికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పని కల్పిస్తామని ఇద్దరు వ్యక్తులు ఆ మహిళను కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి, ఏడుపాయల దేవస్థానం సమీపంలోని ఓ వెంచర్ వద్దకు తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలో ఆమైపె అత్యాచారం చేయబోగా సదరు మహిళ ప్రతిఘటించటంతో చీరతో చేతులు కట్టేసి అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె బతికుంటే విషయం బయట పడుతుందని ఆమైపె దాడి చేశారు. చనిపోయిందని భావించిన దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న మహిళను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా మెదక్ జిల్లా ఆస్ప త్రికి తరలించారు. కాగా ఈ ఉదంతంలో ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మెదక్ మండలం జానకంపల్లి పంచాయతీ పరిధిలోని సంగాయిగూడ తండాకు చెందిన ఈ మహిళకు ఐదుగురు సంతానం. అందులో పెద్ద కుమార్తె పెళ్లి చేయగా, మిగతా నలుగురు పిల్లలను రెక్కల కష్టం మీద పోషిస్తున్నారు. దంపతులిద్దరూ అడ్డా కూలీలుగా పనిచేస్తుంటారు. గిరిజన మహిళ హత్యాచారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం సంచలనం రేపిన కొల్చారం ఘటన -
సంతకం కావాలి సారూ..
VðSh-sñæyŠæ íÜVóS²^èlÆŠḥMøçÜ… ´ër$Ï మెదక్ మున్సిపాలిటీ: ‘జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల తన కూతురు పెళ్లి జరిపించాడు. ప్రభుత్వం నుంచి వచ్చే కల్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తు పత్రాలపై గెజిటెడ్ సంతకం తప్పనిసరి అయింది. అధికారుల చుట్టూ తిరిగినా సంతకం చేసేందుకు విముఖత చూపారు. చేసేది లేక తెలిసిన వారిని ఆశ్రయించి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో సంతకం చేయించి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. అట్టి దరఖాస్తు పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో అందజేయగా తిరస్కరించారు. దీంతో మళ్లీ పత్రాలన్నీ సిద్ధం చేసి మరో గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాడు’. కొన్నింటికి తప్పనిసరి ప్రభుత్వ పథకాలకే కాక ప్రభుత్వ ఉద్యోగాలకు, పోటీ పరీక్షలు, పై చదువుల దరఖాస్తులకు కావాల్సిన సర్టిఫికెట్లపై గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తు సమయంలో దంపతులది మొదటి వివాహమేనని ధృవీకరించడానికి ఈ సంతకం అవసరం. అలాగే లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్, పోటీ పరీక్షల దరఖాస్తులపై ఫొటో గుర్తింపు, పుట్టిన తేదీ సర్టిఫికెట్లలో పేరు మార్పు, పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్లు, కోర్టుకు సమర్పించే జిరాక్స్ పత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ దరఖాస్తులోని సమాచారం వాస్తవమని ధృవీకరించినట్లు అవుతుంది. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు దరఖాస్తులపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించడం దరఖాస్తుదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఏ కార్యాలయానికి వెళ్లినా..గంటల తరబడి అధికారుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. కొందరు విసిగిపోయి పథకాలకు దరఖాస్తు చేసుకోవడం లేదు. తప్పనిసరిగా అవసరమైన వారు మాత్రం అధికారుల కోసం నిరీక్షిస్తున్నారు. అయితే సంతకం చేసేందుకు కొందరు అధికారులు సంకోచిస్తున్నారు. మరికొందరు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తుండటంతో అందుబాటులో ఉండటం లేదు. ఆయా అంశాలను పరిగణలోకి తీసుకొని గెజిటెడ్ అధికారి సంతకం విషయంలో వెసులుబాటు కల్పించాలని విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు. -
హస్తవాసి ఎవరికో!
● డీసీసీ రేసులో ఆ నలుగురు ● 11న ఏఐసీసీ పరిశీలకుల రాక ● క్షేత్రస్థాయిలో పర్యటన, వారం రోజుల్లో నివేదిక మెదక్ అర్బన్: సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కుదిర్చి, ఏకాభిప్రాయంతో సమర్థుడైన డీసీసీ అధ్యక్షుడిని నియమించేందుకు చర్యలు చేపట్టింది. ఈమేరకు ఈనెల 11న ఏఐసీసీ నుంచి 22 మంది పరిశీలకులు జిల్లాకు రానున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, అందరి అభిప్రాయాలు సేకరించి, సమగ్రమైన నివేదికను ఏఐసీసీకి అందజేయనున్నట్లు సమాచారం. కాగా డీసీసీ అధ్యక్ష పదవికి జిల్లాలో తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా నలుగురు నాయకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, మరికొందరు అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆంజనేయులుగౌడ్ నర్సాపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన ఆంజనేయులుగౌడ్ విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యూఐలో పలు పదవులు చేపట్టి, చురుకై న నాయకుడిగా రాజకీయ ఆరంగ్రేటం చేశారు. ఒకసారి ఎంపీటీసీగా పని చేశారు. ఆయన తల్లి, సోదరులు సొంత గ్రామా నికి సర్పంచ్‌లుగా సేవలందించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆంజనేయులుగౌడ్‌కు పార్టీ డీసీసీ బాధ్యత లు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి విజయం కోసం కృషి చేశారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు అనుంగు అనుచరుడిగా కొనసాగుతున్నారు. రెండోసారి డీసీసీ పదవిని ఆశిస్తున్నారు. ఆవుల రాజిరెడ్డి మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన ఆవుల రాజిరెడ్డి కుటుంబీకులు ఆది నుంచి కాంగ్రెస్‌వాదులే. ఆయన తండ్రి నారాయణరెడ్డి మాసాయిపేట ఎఫ్ఏసీఎస్ చైర్మన్‌గా రెండుసార్లు పనిచేశారు. విద్యాధికుడైన రాజిరెడ్డి లాయర్‌గా హైదరాబాద్‌లో పని చేస్తూనే, నర్సాపూర్ నియోజకవర్గంలో సునీతారెడ్డి అనుచరుడిగా కొనసాగారు. 2019లో సునీతారెడ్డి కాంగ్రెస్‌ను వీడిన తర్వాత, కష్టకాలంలో నర్సాపూర్ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి సునీతారెడ్డి చేతిలో ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష రేసులో ఉన్నారు. పబ్బతి ప్రభాకర్‌రెడ్డి పాపన్నపేట మండలం ఎల్లాపూర్‌కు చెందిన పబ్బతి ప్రభాకర్‌రెడ్డి 24 ఏళ్ల వయస్సులో పోలింగ్ ఏజెంట్‌గా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికీ ప్రతి ఎన్నికలో ఆయనే ఏజెంట్‌గా విధులు నిర్వహించడం విశేషం. 1998లో రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మండలస్థాయిలో కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ప్రభాకర్‌రెడ్డి ఇచ్చిన స్పీచ్‌కు ఆకర్షితులైన కాంగ్రెస్ నాయకులు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. అనంతరం ఏడేళ్ల పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందించారు. సీడీసీ డైరెక్టర్, ఏడుపాయల చైర్మన్, ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ నాన్ అఫీషియల్ మెంబర్, డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, సర్పంచ్‌గా, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ కార్యక్రమాలపై పట్టున్న ఆయన డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. సుప్రభాత్రావు రామాయంపేటకు చెందిన సుప్రభాత్రావు విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా యువతను ఆకట్టుకుంటూ పార్టీ నిర్మాణానికి కృషి చేశారు. 25 ఏళ్లుగా పీసీసీ మెంబర్‌గా పని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లిన తర్వాత డీసీసీ పదవిని ఆశించారు. అప్పట్లో పదవి వస్తుందనుకున్న తరుణంలో ఆంజనేయులుగౌడ్‌ను వరించింది. ప్రస్తుతం అవకా శం వస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. -
కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలి
మెదక్ మున్సిపాలిటీ: హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డ్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. ప్ర తిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను గుర్తు చేయడానికే కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రా రంభించినట్లు తెలిపారు. ఎకరానికి రూ. 15,000 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రూ. 2 లక్షల రుణమాఫీ ఊసేలేదని, రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి చేతులెత్తేశారన్నారు. ఈ మో సాలకు కాంగ్రెస్ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక పైళ్లెన ఆడబిడ్డలకు తులం చొప్పున బంగారం బాకీ అయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి -
ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు
ఏడీ సంధ్యారాణి నర్సాపూర్ రూరల్: ఆయిల్‌పామ్ సాగుతో మంచి లాభాలు పొందవచ్చని నర్సాపూర్ వ్యవసాయ శాఖ ఏడీ సంధ్యారాణి రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని తుజాల్పూర్లో ప్రసాద్‌రావు అనే రైతు పొలంలో ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీపై డ్రిప్పు అందజేయడంతో పాటు ఆయిల్‌పామ్ మొక్కలను కేవలం రూ. 20కే అందజేస్తుందన్నారు. నీటి సౌకర్యం సరిగా లేకుండా ఉన్న భూముల్లో సాగు చేసుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి సాధించవచ్చని వివరించారు. కార్యక్రమంలో లీవ్ ఫామ్ రిసోర్స్ కంపెనీ టెక్నికల్ పర్సన్ అజయ్, ఏఈఓ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. కౌడిపల్లి(నర్సాపూర్): రైతులందరూ తప్పనిసరిగా పంటల నమోదు చేసుకోవాలని డీఏఓ దేవ్‌కుమార్ సూచించారు. శుక్రవారం మండలంలోని కన్నారంలో పంటల నమోదును పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో తిరిగి పంటల నమోదు చేస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో నమోదు ప్రక్రియ ను పరిశీలించినట్లు తెలిపారు. పంటల నమోదు ఆధారంగా కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు సులభంగా జరుగుతాయని వివరించారు. ఆయన వెంట ఏఓ స్వప్న, ఏఈఓ స్రవంతి ఉన్నారు. -
వరద నష్టం రూ.262 కోట్లు
మెదక్‌జోన్: మెతుకుసీమలో భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కాగా, చెరువులు, కుంటలు తెగిపోయాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. వే లాది ఎకరాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయి. పలు ఇళ్లు నేలమట్టం కాగా, ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. కాగా వరద నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లాలో ఇటీవల కేంద్ర బృందం విస్తృతంగా పర్యటించింది. సుమారు రూ. 262.76 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ● జిల్లావ్యాప్తంగా ఆర్అండ్బీ రోడ్లు 307 కిలోమీటర్ల మేర ధ్వంసం కాగా, లోలెవెల్, హైలెవెల్ బ్రిడ్జిలు వరదల్లో కొట్టుకుపోయాయి. వీటి తాత్కాలిక మరమ్మతుల కోసం అత్యవసరంగా రూ. 2.56 కోట్లు అవసరం ఉండగా, పర్మనెంట్ పనులు చేసేందుకు రూ. 144 కోట్లు కావాలి. ● పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో 167 కిలోమీటర్ల మేర రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కాగా, ఇందుకోసం రూ. 67 కోట్లు అత్యవసరంగా మంజూరు చేస్తే రోడ్ల మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ● వరదల కారణంగా జిల్లాలో 218 చెరువులు, కుంటలు, నీటి కాలువలు, ఘనపూర్ ప్రాజెక్టు కెనాల్స్‌తో పాటు పంటలకు సాగు నీరందించే అనేక కాలువలు దెబ్బతిన్నాయి. వీటిలో అత్యవసరంగా 67 చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. వీటి కోసం రూ. 3.16 కోట్లు కావాల్సి ఉందని, పర్మనెంట్ పనులు చేసేందుకు రూ. 22.44 కోట్లు అవసరం ఉందని ఇరిగేషన్‌శాఖ అంచనా వేసింది. ● జిల్లాలో వరదల కారణంగా 6,470 ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యాయి. వాటిలో 1,200 ఎకరాల్లో ఇసుక మేటలు పేరుకుపోగా, మిగితా 5,270 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా రూ. 6.47 కోట్లు చెల్లించాల్సి ఉంది. పరిహారం త్వరగా చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ● వరద ఉధృతికి 3,500 విద్యుత్ స్తంభాలు దెబ్బతినగా, 646 ట్రాన్స్ఫార్మర్లు, ఒక సబ్‌స్టేషన్ నీటిలో మునిగిపోయింది. దీంతో విద్యుత్‌శాఖకు రూ. 13.50 కోట్ల నష్టం వాటిల్లింది. ● భారీ వర్షాల కారణంగా మెదక్ పట్టణంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, తూప్రాన్‌లోని బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలు దెబ్బతిన్నాయి. నూతన భవనాల నిర్మాణానికి రూ. 2.13 కోట్లు అవసరం ఉన్నట్లు విద్యాశాఖ పేర్కొంది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం తెగిన చెరువులు, కుంటలు స్వయంగా పరిశీలించిన కేంద్ర బృందం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆగస్టు 14 నుంచి మొదలుకుని నేటి వరకు వరద ఉధృతిలోనే ఉంది. సింగూరు నీటిని దిగువకు వదలటంతో భారీగా వరద వస్తోంది. ఆలయానికి సుమారు రూ. 1.50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సంబంధిత అధికారులు అంచనా వేశారు. -
భగీరథ నీళ్లు బంద్
● పైప్‌లైన్ పగిలి 10 రోజులుగా నిలిచిన నీటి సరఫరా ● దాహార్తిలో ఆరు మండలాల్లోని 449 గ్రామాలు ● మరమ్మతులకు మరో పది రోజులు పట్టవచ్చంటున్న అధికారులు హత్నూర(సంగారెడ్డి)/నర్సాపూర్: పుల్కల్ మండలం వెండికొలు గ్రామ శివారులో పదిరోజుల క్రితం మంజీరా నది నీటిలో పైప్‌లైన్ పగిలిపోయింది. దీంతో హత్నూర, జిన్నారం, గుమ్మడిదలతోపాటు మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట కౌడిపల్లి ఆరు మండలాల్లో 449 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో ఉండే రక్షిత మంచినీటి బోర్లను కనీసం మరమ్మతులు చేయకపోవడంతో నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నీటి సరఫరా చేసే బోర్లున్నప్పటికీ వాటికి మోటార్లు లేకపోవడం, మరమ్మతులు చేయించకపోవడంతో అవి నిరుపయోగంగా మారా యి. దీంతో ప్రజలు నీటి కోసం వ్యవసాయ బోరు బావులను ఆశ్రయిస్తున్నారు. నర్సాపూర్, దౌల్తాబాద్, పట్టణాలలో కొంతమంది నాయకులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజలకు సరిపోవడం లేదు. పైప్‌లైన్ మరమ్మతులు చేసేంతవరకై నా తాగునీటికి కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లైనా చేయా లని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సమస్య పరిష్కరించాలని వినతి తాగు నీటి సమస్యను పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్‌ను నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి కోరారు. ఈమేరకు శుక్రవారం మంత్రిని కలిసి నియోజకవర్గంలో నీటి సమస్యను వివరించారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు గోదావరి జలాలను కోమటిబండ నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా శివ్వంపేటలోని సంప్‌కు మళ్లించి నియోజకవర్గ ప్రజలకు నీటి సరఫరా చేపట్టాలని కోరారు.నీరు తగ్గుముఖం పడితేనే.. పైపులైన్ పగిలిపోవడంతో గ్రామాలకు గత పది రోజులుగా నీరు రావడం లేదు. మంజీరాలో నీళ్లు తగ్గితే పైపులైన్‌కు మరమ్మతు చేయడానికి వీలవుతుంది. ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. – రఘువీర్, జిల్లా మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ -
పనుల్లో వేగం పెంచండి
కలెక్టర్ రాహుల్రాజ్హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలో నిర్మిస్తున్న అధునాతన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హవేళిఘణాపూర్ శివారులో ని ర్మించిన ఏటీసీని సందర్శించారు. విద్యార్థులకు బోధన, కోర్సుల వివరాలు, ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీ లించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సెంటర్లో శిక్షణ పొందడం ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. కలెక్టర్ వెంట ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏటీసీ నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు. -
పత్తి కొనుగోళ్లకు కపాస్ కిసాన్
● యాప్‌లో నమోదు చేసుకుంటేనేమద్దతు ధర ● అవగాహన కల్పిస్తున్న అధికారులు సంగారెడ్డి జోన్: పత్తి కొనుగోలు, అమ్మకాలలో అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించి అందుబాటులోకి తీసుకువచ్చింది. పత్తి పంట రంగు మారిందని, నాణ్యత లేదని కొర్రీలు చూపిస్తూ రైతుల నుంచి దళారులు దోపిడీకి పాల్పడేవారు. కొనుగోలు చేసే సమయంలో తూకం సరైన విధంగా చేయకపోవడం, కొనుగోలు చేసిన తర్వాత సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం తదితర మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు అనుసంధానం చేస్తూ కపాస్ కిసాన్ యాప్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులకు తాము పండించిన పత్తి పంట సులభంగా కొనుగోళ్లు జరుపుకునేందుకు వీలుగా ఉంటుంది. దీనిపై మార్కెటింగ్ శాఖతోపాటు వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నమోదు తప్పనిసరి సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర పొంది పంటను అమ్ముకోవాలంటే ఈ కపాస్ కిసాన్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
బాబ్బాబూ.. దరఖాస్తు చేసుకోండి
వ్యాపారులకు ఎకై ్సజ్ అధికారుల ఫోన్లునర్సాపూర్: ‘గతంలో మీరు వైన్ షాపు నిర్వహణ లైసెన్స్ పొందడానికి దరఖాస్తు చేశారు. ఈనెల 18 వరకు గడువు ఉంది.. అవకాశం ఉంటే ఈసారి సైతం దరఖాస్తు చేయండి’ అని ఎకై ్సజ్ అధికారులు వ్యాపారులకు ఫోన్లు చేస్తున్నారు. దసరా రోజు భారీగా దరఖాస్తులు చేస్తారనే నమ్మకంతో పండుగకు ముందే ప్రభుత్వం మద్యం టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు వారాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నా.. వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లేదని తెలిసింది. దీంతో మండలస్థాయి అధికారులతో గతంలో దరఖాస్తు చేసిన వ్యాపారులకు ఫోన్లు చేయిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా దరఖాస్తు రుసుం రూ. 3 లక్షలకు పెంచడం పట్ల పలువురు వ్యాపారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఎకై ్సజ్ సీఐ గులాం ముస్తాఫాను వివరణ కోరగా.. మద్యం దుకాణాల లైసెన్స్ పొందడానికి దరఖాస్తు చేసుకునేందుకు తమ సిబ్బంది వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పా రు. గతంలో దరఖాస్తు చేసిన వారిలో పలువురికి మద్యం వ్యాపారం పట్ల ఆసక్తి ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి ఉందా..? లేదా..? తెలుసుకొని గడువు, తదితర వివరాలను తమ సిబ్బంది వివరిస్తున్నారని పేర్కొన్నారు. -
విద్యార్థినులు అన్నిరంగాల్లో రాణించాలి
హవేళిఘణాపూర్(మెదక్): ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో విద్యార్థినులు పాల్గొనడం అభినందనీయమని ఏఎస్పీ మహేందర్ అన్నారు. గురువారం కూచన్‌పల్లి జెడ్పీ హైస్కూల్లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థినులు అన్నిరంగాల్లో రాణించడంపై సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సమాజ సేవతో పాటు విద్య, వైద్య, పోలీస్ లాంటి రంగాలను ఎంచుకొని ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీలత, అధ్యాపకులు వెంకటేశ్వర్లు, సుధారాణి అరుంధతి, దీప్తి, గ్రామస్తులు పాల్గొన్నారు.ఏఎస్పీ మహేందర్ -
కాలుష్య తనిఖీల జాడెక్కడ?
● పరిమితికి మించి వెలువడుతున్న ఉద్గారాలు ● పట్టించుకోని రవాణాశాఖ అధికారులు జిల్లాలో 1.88 లక్షల వాహనాలుమెదక్ మున్సిపాలిటీ: పెరుగుతున్న అవసరాలతో ఇంటికో వాహనం తప్పనిసరైంది. వీటితో పాటు కాలుష్యం కూడా పెరుగుతోంది. జిల్లాలో 1.88 లక్షల వాహనాలు ఉండగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిపోయే వాహనాలు మరో లక్ష వరకు ఉంటాయని అంచనా. దీంతో పరిమితికి మించి ఉద్గారాలు వెలువడుతున్నాయి. తనిఖీలు చేసి నియంత్రించాల్సిన రవాణాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆరునెలలకోసారి తప్పనిసరి మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి తనిఖీలు చేయాలి. అయితే పర్యవేక్షించాల్సిన రవాణాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాహనాల కాలుష్యాన్ని పరిక్షించడం కోసం ప్రైవేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో నిబంధనల ప్రకారం పొల్యూషన్ పరీక్షలు జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. డబ్బుల కోసం నామమాత్రంగా పరీక్షలు చేసి పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పొల్యూషన్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తున్న పీయూసీ రవాణా శాఖ అధికారులు, తనిఖీల జోలికి మాత్రం వెళ్లడం లేదు. సదరు వాహనం నిర్దేశించిన పొల్యూషన్ పరిధిలో ఉందా? లేదా? అనేది విధిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఇష్టారాజ్యంగా పొల్యూషన్ సర్టిఫికెట్లు పొల్యూషన్ తనిఖీ కేంద్రాలు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా పీయూసీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో మొత్తం 1.88 లక్షల వాహనాలు ఉండగా, వీటిలో 15 ఏళ్ల కాలం తీరిన వాహనాలు వేలల్లో ఉన్నాయి. ఆటోలు, లారీలు మరమ్మతుల కారణంగా పరిమితికి మించి పొగను వదులుతూ వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇలాంటి వాహనాలను గుర్తించి సీజ్ చేయాల్సిన అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. వాతావరణం కలుషితం కాలం చెల్లిన వాహనాలు వదిలిన పొగతో వాతావరణం కలుషితమై ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అన్నిరకాల వాహనాలు నిర్దేశించిన విధంగా పొగను వదులుతున్నాయా? లేదా అని పరిశీలించేందుకు జిల్లాలో పొల్యూషన్ కేంద్రాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ కేంద్రాల నిర్వాహకులు నిబంధనల ప్రకారం వాహనాలను పరీక్షించి అవి వదులుతున్న కలుషితమైన పొగ ఏ మేరకు ఉందని వెల్లడించకుండా జిల్లా రావాణా శాఖ అధికారులు పీయూసీ జారీ చేస్తున్నారు. అయితే జిల్లాలో పొల్యూషన్ తనిఖీ చేసేందుకు మొత్తం 9 మోబైల్ వాహనాలు ఉన్నప్పటికీ, అవి ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. కాగా విద్యాసంస్థల బస్సులు, లారీలు, కమర్షియల్ వాహనాలు మాత్రమే పొల్యూషన్ పరీక్ష చేయించుకుంటున్నాయి. ద్విచక్ర వాహనాలు పది శాతం కూడా పరీక్షలు చేయించుకోవడం లేదు. ఆర్టీఏ, పోలీస్ అధికారులు పట్టుకున్నప్పుడు నామమాత్రపు జరిమానాతో తప్పించుకుంటున్నారు. ఇదే విషయమై ఇన్చార్జి డీటీఓ వెంకటస్వామిని వివరణ కోరగా.. తనిఖీలు చేయకుండా పీయూసీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. అలా జరిగినట్లు తేలితే చర్యలు చేపడుతామని తెలిపారు. -
అభ్యర్థుల ఉత్సాహంపై నీళ్లు
● నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను షురూ చేసినట్లు ప్రకటించిన ఆర్ఓలు ● తీరా బీసీ రిజర్వేషన్ల జీఓపైస్టే విధించిన హైకోర్టు ● వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలు మెదక్‌జోన్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గురువారం ఆసక్తిరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలి విడతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 10.30 గంటల నోటిఫికేషన్ జారీ అయింది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. తీరా సాయంత్రం బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ నంబర్ 9పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సైతం వాయిదా పడింది. దీంతో ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన అభ్యర్థుల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయింది. ఆశావహులకు నిరాశే మిగిలింది. రిజర్వేషన్లు కలిసి రాని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయోమయం.. ఉత్కంఠ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీఓ నంబర్ 9ని జారీ చేసింది. ఈ జీఓను రద్దు చేయాలని, మద్దతుగా పలువురు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటీషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు గురువారం జీఓ 9పై స్టే విధించింది. కౌంటర్లు దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి, పలువురు పిటీషనర్లకు ఆరువారాల పాటు గడువు ఇచ్చింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నాయకుల్లో ముందు నుంచి అయోమయమే నెలకొంది. ఎన్నికల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పును ఇ స్తుంది. అనే దానిపై ఉత్కంఠగా ఎదురు చూశారు. రిజర్వేషన్లు అనుకూలించిన వారు పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ వేసేందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థిత్వం ఎంపికపై కసరత్తు చేశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, నాయకులు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశాయి.ఈ నేపథ్యంలో గురువారం రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చా రు. కోర్టు విచారణ నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. -
నిర్బంధాలు మాకు కొత్త కాదు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డిమెదక్ మున్సిపాలిటీ: పోలీస్ నిర్బంధాలు మాకు, మా పార్టీకి కొత్త కాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ గురువారం పార్టీ ఛలో బస్ భవన్‌కు పిలుపునిచ్చింది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల ఎదుట భారీగా పోలీసులను మోహరించి ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈసందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో బస్సు చార్జీలు పెంచలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 22 నెలలకే చార్జీలు పెంచడం సరికాదన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అంటూనే చార్జీలు పెంచడంతో సామాన్యలపై భారం పడుతుందన్నారు. బస్భవన్్కు వెళ్లకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను నాయకుల ఇళ్ల వద్దకు పంపారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకునే వరకు నిరసన తెలుపుతూనే ఉంటామన్నారు. వినతిపత్రం ఇస్తామంటే హౌస్ అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. -
కోలాహలం.. నిరుత్సాహం
స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్చిన్నశంకరంపేట(మెదక్): స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో గురువారం ఉదయం కన్పించిన ఉత్సాహం సాయంత్రం కోర్టు తీర్పుతో నీరుగారింది. మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటుతో పాటు నామినేషన్ల స్వీకరణకు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి నాయకుల రాకపోకలతో కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పలువురు నాయకులు నామినేషన్ పత్రాలను సైతం తీసుకెళ్లారు. తీరా సాయంత్రం హైకోర్టు స్టే విధించడంతో నిరుత్సాహానికి గురయ్యారు. అప్పటి వరకు హడావిడి చేసిన అధికారులు సైతం సైలెంటయ్యారు. హెల్ప్‌డెస్క్ కోసం కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన టెంట్‌ను సిబ్బంది తొలగించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఆయా రాజకీయ పార్టీల నాయకులు హడావిడి చేశారు. మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో బీఆర్ఎస్ మండలస్థాయి ముఖ్య కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. ఎంపీటీసీ అభ్యర్థుల కసరత్తు కోసం గ్రామాల వారీగా గ్రూపు మీటింగ్ ఏర్పాటుచేశారు. ఈక్రమంలోనే హైకోర్టు స్టే విషయం తెలుసుకొని అర్ధంతరంగా సమావేశం ముగించారు. బీజేపీ నాయకులు ఉదయం నామినేషన్ పత్రాలు తీసుకొని జిల్లా కార్యాలయానికి వెళ్లారు. కాంగ్రెస్ నాయకులు సైతం గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. తీరా హైకోర్టు ఎన్నికలపై నాలుగు వారాలు స్టే విధించడంతో అవాక్కయ్యారు. టెంట్‌ను తొలగిస్తున్న సిబ్బందినామినేషన్ పత్రాల కోసం వస్తున్న నాయకులుటెంట్ను తొలగిస్తున్న సిబ్బందినామినేషన్ పత్రాల కోసం వస్తున్న నాయకులు -
కాంగ్రెస్‌లోకి మాజీ జెడ్పీటీసీ
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మాజీ జెడ్పీటీసీ, మాజీ ఏఎంసీ చైర్మన్ పోతరాజ్ రమణ కాంగ్రెస్‌లో చేరారు. గురువారం డీసీసీ అధ్యక్షుడు అంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో పార్టీలో చేరారు. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరిన రమ ణ, ఎన్నికల అనంతరం క్రియాశీల రాజకీయా లకు దూరంగా ఉన్నారు. మైనంపల్లి పిలుపుతో తిరిగి హస్తం గూటికి చేరుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాన సత్యనారాయణ, ప్రభాకర్, రాజ్‌కుమార్, ఉదయ్ ఉన్నారు. -
మళ్లీ కల్లాలొస్తున్నాయ్..
● ‘ఉపాధి’లో నిర్మాణానికికేంద్రం అంగీకారం ● జిల్లా రైతులకు చేకూరనున్న లబ్ధి ● గతంలో 2,500 కల్లాల నిర్మాణం రామాయంపేట(మెదక్): రైతులు పంట ఉత్పత్తులను ఆరబోసుకోవడానికి వీలుగా ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణానికి తాజాగా కేంద్రం అంగీకారం తెలిపింది. దీంతో జిల్లాలోని రైతులకు లబ్ధి చేకూరనుంది. గతంలో రెండేళ్లపాటు అమలులో ఉన్న ఈ పథకం కింద జిల్లావ్యాప్తంగా సుమారు 2,500 మంది రైతులు కల్లాలు నిర్మించుకున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు ధాన్యం ఆరబెట్టుకోవడానికి సరైన స్థలం లేకపోవ డంతో ఇళ్ల ఎదుట, సమీపంలోని రహదారులపై రైతులు ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండేళ్లుగా రోడ్లపై ఆరబోసిన ధాన్యం కుప్పలు ఢీకొని జిల్లాలో సుమారు 8 మంది మృతిచెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. అలాగే రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసినందుకు 10 మందికిపైగా రైతులపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. ధాన్యాన్ని ఆరబెట్టడానికి గాను అద్దె ప్రాతిపదికన టార్పాలిన్లు తీసుకుంటున్న వారు ఏటా కనీసం రూ. రెండు నుంచి రూ.మూడు వేల వరకు నష్టపోతున్నారు. అర్ధంతరంగా ఆగిన నిర్మాణాలు ఈ పథకం అమలులో ఉండగానే జిల్లా పరిధిలో 550 మందికిపైగా రైతులు ఎంపీడీఓ కార్యా ల యాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈమేరకు కొందరు నిర్మాణాలకు సంబంధించి ముగ్గు పోసుకొని పునాదుల తవ్వకాలు చేపట్టారు. ఈక్రమంలో అర్ధంతరంగా కల్లాల నిర్మాణ పథకాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ పథకాన్ని ప్రారంభించిన ఏడాదిన్నరకే రద్దు చేసిన కేంద్రం, పలువర్గాల విజ్ఞప్తి మేరకు తాజాగా అంగీకరించింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పెద్ద సంఖ్యలో రైతులు కల్లాలు నిర్మించుకోనున్నట్లు సమాచారం. ఇబ్బంది పడుతున్నాం కల్లాల నిర్మాణానికి సంబంధించి కేంద్రం వెంటనే అనుమతులు మంజూరు చేయాలి. ఈ పథకాన్ని రద్దు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. రోడ్లపై ధాన్యం ఆరబోస్తున్న క్రమంలో ప్రమాదాలు సైతం జరిగాయి. – రాజయ్య, రైతు, కాట్రియాల కల్లాల నిర్మాణం అత్యవసరం ధాన్యం ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికి రైతులకు కల్లాల నిర్మాణం అత్యవసరం. గతంలో ఒకసారి కేంద్రం అనుమతించగా, సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది నిర్మించుకోలేదు. ప్రస్తుతం మళ్లీ కేంద్రం కల్లాల నిర్మాణానికి అనుమతించడం సంతోషకరం. – గోపాల్, రైతు, దంతేపల్లి తండా -
ఆర్టీఐ సేవల్లో జిల్లాకు రెండో స్థానం
మెదక్ కలెక్టరేట్: సమాచార హక్కు చట్టం నిర్వహణలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు రెండోస్థానం దక్కింది. సమాచార హక్కు చట్టం వారోత్సవాలు గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా కలెక్టర్ రాహుల్‌రాజ్ అవార్డు అందుకున్నారు. 19 నెలల కాలంలో సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో నిబద్ధతకు ప్రతిభా పురస్కారం అందజేశారు. ఆర్టీఐ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, పెండింగ్ లేకుండా వ్యవహరిస్తున్నందుకు గాను జిల్లాకు ఈ అవార్డు దక్కింది. అధికారులు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిగజ్వేల్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లికి చెందిన బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బాల్‌రాజు, యూత్ ప్రెసిడెంట్ వెంకట్‌తోపాటు పలువురు నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రూ.2 లక్షల రుణమాఫీ, సన్న బియ్యం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వంటి కార్యక్రమాలతో గ్రామీణ సమాజంలో పరివర్తనకు నాందిపలుకుతున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ పాలన పూర్తిగా అవినీతిమయంగా సాగిందన్నారు. బీఆర్ఎస్ చేసిన మోసాలను వివరిస్తూ ఢోకా కార్డుల పేరుతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదం
మెదక్‌జోన్: {MîSyýlË$ Ð]lÅMìS¢™èlÓ ÑM>-Ýë-°MìS, {MýSÐ]l$Õ„ýS-׿MýS$, ÔèæÈÆý‡ §éÆý‡$-ÉéŰMìS G…™èl-V>¯ø §øçßæ§ýl-ç³-yýl-™éĶæ$° yîlDK Æ>«§éMìS-çÙ¯ŒS A¯é²Æý‡$. ´ëuý‡Ô>ÌS {MîSyé çÜÐ]l*QÅ B«§ýlÓÆý‡Å…ÌZ º$«§ýl-ÐéÆý‡… hÌêÏ MóS…{§ýl…ÌZ° þ°Ä¶æ$ÆŠḥæ MýSâêÔ>Ë OOÐðl$§é¯]l…ÌZ °Æý‡Ó-íßæ…-_¯]l MýSºyîlz ´ùsîæ-ÌSMýS$ hÌêÏ ¯]lË$-Ð]lÊ-ÌSÌS ¯]l$…_ »êÌS, »êÍ-MýSË$ àf-Æý‡-Ķæ*ÅÆý‡$. Ð]l¬W…ç³# M>Æý‡Å{MýS-Ð]l*-°MìS Ð]l¬QÅ A†¤V> yîlDK àfOÆð‡ Ñgôæ-™èl-ÌSMýS$ ºçßæ$Ð]l$-™èl$Ë$ A…§ýl-gôæ-Ô>Æý‡$. A¯]l…-™èlÆý‡… G‹Ü-i-G‹œ M>Æý‡Å-§ýlÇØ ¯éVýSÆ>k Ð]l*sêÏ-yýl$-™èl*.. {糆¿ýæ MýS¯]l-º-Ça¯]l ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ ¯ðlÌS 10¯]l çÜ…V>Æð‡-yìlzÌZ fÆý‡-VýS-¯]l$¯]l² EÐ]l$Ãyìl Ððl$§ýlMŠS hÌêÏ ´ùsîæÌZÏ ´ëÌŸY…-sêÆý‡° ™ðlÍ-´ëÆý‡$. M>Æý‡Å{MýS-Ð]l$…ÌZ Æ>çÙ‰ ï³Dsîæ çÜ…çœ$… M>Æý‡Å-°-Æ>Ó-çßæMýS A«§ýlÅ„ýS$yýl$ }°-Ðé-çÜ-Æ>Ð]l#, ï³yîlË$ ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. పంట నష్టం అంచనా కొల్చారం(నర్సాపూర్): గత నెల రోజులకుపైగా సింగూరు నుంచి ఘణపురం ఆనకట్టకు ఎడతెరిపి లేకుండా వస్తున్న వరద నీటితో మండలంలోని మంజీరా పరివాహక గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. బుధవారం చిన్నఘనాపూర్ పరిధిలో నీట మునిగిన పంటలను ఏఈఓ రాజశేఖర్‌రెడ్డి రైతులతో కలిసి సందర్శించారు. దాదాపు 62 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. వరద కారణంగా పంట నష్టపోయిన రైతుల వివరాలను పొందుపరుస్తూ పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం చిలప్‌చెడ్(నర్సాపూర్): బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీడబ్ల్యూఓ హేమభార్గవి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. చిలప్‌చెడ్‌లో మైనర్ బాలికను 34 ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకోవడంతో పెళ్లి కొడుకుతో పాటు సహకరించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు అయిందన్నారు. బాల్య వివాహాలకు పాల్పడిన, సహకరించిన చట్టరీత్యా నేరమని అన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే 1098, 100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఓటరు జాబితా కోసం ప్రత్యేక వెబ్సైట్ మెదక్ కలెక్టరేట్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాలో పేరును సులువుగా తెలుసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటర్లు తమ వివరాలను ఈ సైట్ ద్వారా ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. టీఎస్ఈసీ వెబ్‌సైట్‌కు వెళ్లి మొత్తం జాబితా పరిశీలించవచ్చు. లేదా ఎపిక్ నంబర్ ఆధారంగా ఓటరు వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. సదరు ఓటరు ఏ వార్డు పరిధికి చెందితే ఆ వార్డు పేజీని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. వార్డు పరిధిలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉంటే వారి వివరాలు తెలుసుకోవచ్చు. రోడ్డును బాగు చేయించండి మనోహరాబాద్(తూప్రాన్): మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి, కాళ్లకల్ పరిశ్రమల వాడ రోడ్డును బాగు చేయించాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును స్థానికులు కో రారు. బుధవారం మండల కేంద్రానికి వచ్చి న సందర్భంగా వారికి వినతిపత్రాన్ని అందజేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మహిపాల్‌రెడ్డి, నాయకులు నర్సింహా, నాగరాజు, నరేష్, రంగాచారి, రాంచందర్, వెంకటేష్, పెంటన్న, మహేష్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పరిషత్ సంగ్రామం
మెదక్‌జోన్/మెదక్‌కలెక్టరేట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక ఘట్టానికి గురువారం తెరలేవనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఉదయం 10.30 గంటలకు ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ జారీ కానుంది. ఆయా మండలాల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓలు) ఈ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఉంటుంది. ఈ మేరకు 21 జెడ్పీటీసీ స్థానాలకు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ కొనసాగిస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ కేడర్ అధికారులను ఆర్‌ఓలుగా నియమించారు. ఇక ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ప్రతీ రెండు, మూడు ఎంపీటీసీ స్థానాలకు ఒక ఆర్ఓను నియమించారు. క్లస్టర్ స్థాయిల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. గెజిటెడ్ అధికారులు, హెచ్ఎంలు, సూపరింటెండెంట్ కేడర్ అధికారులకు ఎంపీటీసీ స్థానాల ఆర్‌ఓలుగా వ్యవహరిస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ కేడర్ అధికారులను ఏఆర్ఓలుగా నియమించారు. రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం విదితమే. ఈ వాదనలు గురువారం కూడా కొనసాగనున్నాయి. బుధవారం హైకోర్టు ఎలాంటి స్టే విధించకపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం యథావిధిగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనుంది. మెదక్ డివిజన్లో.. మొదటి విడత జిల్లాలో 21 మండలాలు ఉండగా, 21 ఎంపీపీ, 21 జెడ్పీటీసీ 190 ఎంపీటీసీలు స్థానాలు ఉన్నాయి. మొదటి విడతలో మెదక్ డివిజన్ పరిధిలోని రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట, మెదక్, హవేళిఘణాపూర్, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, పెద్దశంకరంపేట మండలాలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించనున్నారు. 10 జెడ్పీటీసీ, స్థానాలకు ఎన్నికలు కొనసాగనుండగా, మెదక్ డివిజన్ పరిధిలోకి వచ్చే 91 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో నర్సాపూర్, తూప్రాన్ డివిజన్లోని 11 మండలాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ముహూర్తాలు చూసుకుంటున్న అభ్యర్థులు ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ముహుర్తాలు చూసుకుంటున్నా రు. ఈ మూడు రోజుల్లో వారికి కలిసి వచ్చే రోజు చూసుకొని నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సైతం వేగం పెంచింది. íܧýl®…V> E…yýl…yìl: MýSÌñæMýStÆŠæḥ మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి జిల్లాలో జరిగే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌రాజ్ తెలిపారు. బుధవారం రాత్రి ఆయన ఎన్నికల అధికారులు, సిబ్బందితో నామినేషన్ల ప్రక్రియపై గూగుల్ మీట్ నిర్వహించారు. మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఆర్వో, ఏఆర్ఓలకు శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రిపోర్టులను ఎప్పటికప్పుడు పంపిస్తున్నామని చెప్పారు. -
అన్నీ ఉన్నా.. అకాడమీ ఏదీ?
అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది మెతుకుసీమ పరిస్థితి. రూ. కోట్లు వెచ్చించి జిల్లా కేంద్రంలో నిర్మించిన సింథటిక్ ట్రాక్‌ను అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా అది వృథాగా మారింది. కానీ ట్రాక్ విషయం తెలుసుకున్న రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ఆర్మీ అభ్యర్థులు 80 మందికిపైగా ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నారు. – మెదక్‌జోన్ జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం అథ్లెటిక్స్ అకాడమీని ప్రారంభించి సింథటిక్ ట్రాక్‌ను మట్టితో నిర్మించింది. ఆ ట్రాక్‌పై ఎంతో మంది క్రీడాకారులు శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. కాగా 2018లో సింథటిక్ ట్రాక్ నిర్మాణం కోసం రూ. 6.20 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో ట్రాక్ నిర్మాణంతో పాటు అథ్లెటిక్స్ అకాడమీ భవన మరమ్మతులు, మరుగుదొడ్లు, కిచెన్‌షెడ్ తదితర పనులు చేశారు. కాగా నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఇక్కడ శిక్షణలో ఉన్న అథ్లెటిక్ క్రీడాకారులను హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి పంపించారు. 2020లో నిర్మాణం పూర్తయినా, హైదరాబాద్‌కు తరలించిన అథ్లెటిక్స్ అకాడమీని తిరిగి రప్పించే విషయంలో అధికారులు, పాలకులు విఫలం అయ్యారు. ఫలితంగా రూ. కోట్లాది రూపాయలతో నిర్మించిన సింథటిక్ ట్రాక్ వృథాగా మారింది. వెతుకుంటూ వచ్చారు ఆర్మీ ఎంట్రెన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు హన్మకొండలో వచ్చే నెల 10 నుంచి 23వ తేదీ వరకు ఫిజికల్ ఈవెంట్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 1600 మీటర్ల రన్నింగ్, లాంగ్, హైజంప్ లాంటి టెస్టులు నిర్వహించనున్నారు. కాగా ఆయా జిల్లాలో శిక్షణ పొందేందుకు సింథటిక్ ట్రాక్ లేకపోవటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 80 మందికిపైగా అభ్యర్థులు మెదక్ సింథటిక్ ట్రాక్‌పై గత కొన్ని రోజులుగా శిక్షణ పొందుతున్నారు.శిక్షణలో భాగంగా రన్నింగ్ చేస్తున్న ఆర్మీఅభ్యర్థులుమెదక్లో వృథాగాసింథటిక్ ‘ట్రాక్’ రూ. 6.20 కోట్లు వెచ్చించి నిర్మాణం పట్టించుకోని పాలకులు శిక్షణ పొందుతున్న ఆర్మీ అభ్యర్థులు మా జిల్లాలో లేదు మా జిల్లాలో సింథటిక్ ట్రాక్ లేదు. ఇక్కడ ట్రాక్ ఉందని తెలుసుకొని మా కోచ్‌తో పాటు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నాం. వచ్చే నెల 10 నుంచి ఆర్మీ ఈవెంట్స్ ఉన్నాయి. ట్రాక్‌పై శిక్షణ తీసుకోవటంతో ఈవెంట్స్‌లో రాణిస్తామనే నమ్మకం వచ్చింది. – మమత, వనపర్తి జిల్లా క్రీడాభివృద్ధికి కృషి చేయాలి జిల్లా కేంద్రంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణం పూర్తయి ఐదేళ్లు అవుతోంది. ట్రాక్ నిర్మాణంలో ఉండగా ఇక్కడి నుంచి అథ్లెటిక్ అకాడమీని హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి తరలించారు. ఆ అకాడమీని తిరిగి రప్పించాలని ఎంతో మంది నేతలను వేడుకున్నాం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి అకాడమీని రప్పించి ఈ ప్రాంతంలో క్రీడా అభివృద్ధికి కృషి చేయాలి. – మధుసూదన్, అథ్లెటిక్ జిల్లా కార్యదర్శి -
అక్షరాస్యత దిశగా మహిళలు
చేగుంట(తూప్రాన్): మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు విద్యాశాఖ యాక్షన్‌ప్లాన్ రూపొందించింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి చదువులు పూర్తి చేయించనుంది. ఇందుకోసం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గ్రామాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు కేవలం ఏడో తరగతి వరకు మాత్రమే ఉంటాయి. ఈ కారణంతో గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు ఏడో తరగతి లేదా పదో తరగతి వరకు మాత్రమే చదువు పూర్తి చేసుకునేవారు. ఈవిషయం క్షేత్రస్థాయిలో తెలుసుకున్న అధికారులు మహిళా సంఘాల సభ్యుల్లో ఏడో తరగతి పూర్తి చేసిన వారిని పదో తరగతి, పది పూర్తి చేసిన వారిని ఇంటర్ వరకు పరీక్షలు దూర విద్య ద్వారా రాయించేలా చర్యలు చేపట్టారు. చేగుంట మండలంలో 35 గ్రామైక్య సంఘాలు ఉండగా, 60 మందిని పదో తరగతి, 60 మంది ఇంటర్ పరీక్షలు రాయించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దూరవిద్య ద్వారా మహిళలు పదో తరగతి, ఇంటర్ పూర్తి చేస్తే స్వయం ఉపాధి కోసం సులభంగా రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
మరో విడత వచ్చేశాయి
జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలుఇంకా రావాల్సినవి 12,750వచ్చినవి 1,64,300మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు రెండో విడత పాఠ్య పుస్తకాలు సరఫరా చేయనున్నారు. జిల్లాలో మొదటి విడత పాఠ్య పుస్తకాలు (పార్ట్–1) జూన్‌లో విద్యార్థులకు అందజేశారు. తాజాగా రెండో విడతవి జిల్లా కేంద్రంలోని గోదాంకు చేరుకున్నాయి. వీటిని గురువారం నుంచి ఎమ్మార్పీలకు తరలించనున్నారు. అనంతరం పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేయనున్నా రు. జిల్లాకు 1,77,050 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, ప్రస్తుతం 1,64,300 వచ్చాయి. ఇంకా 12,750 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలలు 629 ఉండగా 25,911 మంది విద్యార్థులు, 128 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా 8,754 మంది, 146 ఉన్నత పాఠశాలలు ఉండగా 28,878 మంది, 19 కేజీబీవీలు ఉండగా 4,001 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా 3వ తరగతి గణితం, 4వ తరగతి ఈవీఎస్ పుస్తకాలు రావాల్సి ఉంది. -
వరద నష్టంపై ఆరా
మెదక్‌కలెక్టరేట్/హవేళిఘణాపూర్(మెదక్)/ రామాయంపేట/నిజాంపేట/పాపన్నపేట: ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం బుధవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించింది. మొదటగా కలెక్టరేట్‌కు చేరుకున్న కేంద్రం బృందం సభ్యులు డాక్టర్ పొన్నుస్వామి, వినోద్ కుమార్, అభిషేక్ కుమార్, ఎస్ఎస్పింటులకు కలెక్టర్ రాహుల్‌రాజ్ స్వాగతం పలికారు. కలెక్టరేట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వరద నష్టం తీరును వివరించారు. అనంతరం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మండలాల్లో పర్యటించారు. వారి వెంట కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, ఇతర అధికారులు ఉన్నారు. జిల్లాలో కేంద్ర బృందం పర్యటన దెబ్బతిన్న రోడ్లు, పంటల పరిశీలన -
న్యాయవాదుల నిరసన
హుస్నాబాద్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం.. న్యాయ వ్యవస్థపై దాడి చేయడమేనని హుస్నాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం న్యాయవాదుల ఆధ్యర్వంలో కోర్టు ఎదుట విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అలాగే నాలుగు రోజుల పాటు విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏజీపీ సదానందం, న్యాయవాదులు మల్లేశం, కన్నోజు రామకృష్ణ, ప్రవీణ్, హుస్నాబాద్ జేఏసీ కో–ఆర్టినేటర్ వీరన్నయాదవ్, నాయకులు గంపల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎన్నికల ఖర్చుపై నిఘా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై నిఘా ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుకు వీలు లేదని, ఇందుకు పరిమితులు ఉంటాయని చెబుతున్నారు. జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ.4 లక్షలకు మించరాదు. అలాగే ఎంపీటీసీ అభ్యర్థి వ్యయం రూ.1.50 లక్షల లోపు ఉండాలి. ఇక సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు కూడా ఓ లెక్క ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. ఐదు వేల జనాభా లోపు ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి అభ్యర్థి ఖర్చు రూ.1.50 లక్షల లోపు అలాగే వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.30 వేల లోపు ఉండాలి. మరోవైపు ఐదు వేలకు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు బరిలోకి దిగుతున్న అభ్యర్థులకు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యునికి ఖర్చు రూ.50 వేలు ఉండాలని ఎన్నికల ప్రవర్తన నియమావళి చెబుతోంది. ఖర్చు చేసే ప్రతీ రూపాయి బ్యాంకు లావాదేవీల ద్వారానే జరగాల్సి ఉంటుంది. ఆయా స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసే రోజుకంటే ఒకరోజు ముందుగా ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలి. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తమ ఎన్నికల ఖర్చు వివరాలను తెలపాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పరిశీలకుల నియామకం స్థానిక సంస్థలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెట్టేందుకు మండల స్థాయిలో సహాయక పరిశీలకులను (అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు) నియమించారు. గెజిటెడ్ అధికారుల నుంచి ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులను ఈ పరిశీలకులుగా నియమించారు.లెక్కలు తప్పనిసరిస్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఓ స్థాయిలో ఖర్చు చేస్తుంటారు. ప్రధానంగా పట్టణీకరణ ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలు, మండలాల్లో అభ్యర్థుల ఖర్చు భారీగానే ఉంటుంది. ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, పోస్టర్లు, కరపత్రాలు, కండువాలు, క్యాప్‌లు, టీషర్టులు వంటి ఖర్చులు ఉంటాయి. జెడ్పీటీసీ అభ్యర్థులు సమావేశాలు సైతం నిర్వహిస్తుంటారు. ఎన్నికల ప్రచారానికి వాహనాలను వినియోగిస్తుంటారు. ఇలా అభ్యర్థులు తాము పెట్టే ఎన్నికల ఖర్చుకు లెక్కలు చూపాలని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల విషయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు పాటించాలని ఎక్స్పెండిచర్ మానిటరింగ్ నోడల్ అధికారి, జిల్లా ఆడిట్ అధికారి బలరాం ‘సాక్షి’తో పేర్కొన్నారు.జెడ్పీటీసీకి రూ.4 లక్షలు.. ఎంపీటీసీకి రూ.1.50 లక్షలు అభ్యర్థులు వెచ్చించే వ్యయంపై పరిమితులు మండలస్థాయిలో సహాయక పరిశీలకులు అభ్యర్థులు ఎంసీసీని పాటించాలంటున్న అధికారులు -
ఆశల పల్లకిలో..
ఎవరికి వారు.. ప్రయత్నాల జోరు ● అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు ● ఫైనల్ లిస్టు కోసం నిరీక్షణనర్సాపూర్: రిజర్వేషన్ల జీఓపై హైకోర్టులో కేసు ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ నేపథ్యంలో నర్సాపూర్ మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల కోసం ఆయా పార్టీల్లో పలువురు నాయకులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు పదవుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో నాయకులు తమకే టికెట్ ఇవ్వాలని పోటీ పడుతున్నారు. కాగా బీసీ కేటగిరిలో ఉన్న ఎంపీటీసీ స్థానాలతో పాటు జనరల్ ఎంపీటీసీ స్థానం ఉన్న ప్రాంతాలకు చెందిన పలువురు ఆయా పార్టీల నాయకులు ఎంపీపీ అధ్యక్ష పీఠంపై దృష్టి పెట్టి పార్టీ అగ్ర నాయకుల వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీపీ అధ్యక్ష పదవి బీసీ జనరల్ నర్సాపూర్ ఎంపీపీ అధ్యక్ష పదవి బీసీ జనరల్‌కు కేటాయించబడింది. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీపీ అధ్యక్ష పదవి కోసం రుస్తుంపేటకు చెందిన మాజీ సర్పంచ్ అశోక్, చిన్నచింతకుంటకు చెందిన మాజీ ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ తన భార్య అనురాధ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. కాగా బీఆర్ఎస్ నుంచి పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బోగ చంద్రశేఖర్‌తో పాటు అదే పార్టీకి చెందిన ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శివకుమార్ తన కుమారుడు సుదీప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఇదిలాఉండగా బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు నగేశ్ భార్య నవనీత, పెద్దచింతకుంటకు చెందిన గుర్రాల వాణితో పాటు మరో నాయకుని పేర్లతో కూడిన జాబితాను బీజేపీ మండల శాఖ పార్టీ రాష్ట్ర అధిష్టానానికి పంపినట్లు తెలిసింది. సందిగ్ధంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బోగ చంద్రశేఖర్ ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల్లో ఏ పదవికి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఎంపీపీ అధ్యక్ష పదవి బీసీ జనరల్‌కు కేటాయించగా, జెడ్పీటీసీ బీసీ మహిళకు రిజర్వేషన్లో కేటాయించారు. కాగా ఎంపీపీ కోసం తాను ఎంపీటీసీగా పోటీ చేయాలా లేక జెడ్పీటీసీ పదవికి తన భార్య రాణిని పోటీలో నిలపాలా? అనే సందిగ్ధంలో ఉన్నాడని, తన మిత్రుల సలహాలు తీసుకుంటున్నాడని చెబుతున్నారు. ఇదిలా ఉండగా పార్టీ అధిష్టానం ఏ పదవికి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తారోననే డైలమాలో సైతం ఉన్నట్లు తెలిసింది. జెడ్పీటీసీకి ప్రయత్నాలు షురూ.. నర్సాపూర్ జెడ్పీటీసీ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ భార్య సంధ్యను పోటీలో నిలిపే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అదే పార్టీ నుంచి చిప్పల్‌తుర్తికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సురేశ్‌గౌడ్ తన భార్య స్వప్నకు టికెట్ కోసం పార్టీ అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. కాగా బీఆర్ఎస్ నుంచి మండలంలోని మూసాపేటకు చెందిన రవి తన భార్య సునీతకు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా బీజేపీ నుంచి ముగ్గురి పేర్లను మండల పార్టీ రాష్ట్ర అధిష్టానానికి పంపినట్లు తెలిసింది. -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
నిజాంపేట(మెదక్): స్థానిక ఎన్నికల నేపథ్యంలో నిజాంపేట మండలంలోని సమస్యాత్మకమైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశీలించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, చల్మెడ, కల్వకుంట, నార్లాపూర్ గ్రామాలల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఆయనతో పాటు రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్, నిజాంపేట ఎస్ఐ రాజేశ్, ఎంపీడీఒ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. మెరుగైన బోధన చేయాలి డీఈఓ రాధాకిషన్ శివ్వంపేట(నర్సాపూర్): చదువులో వెనకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈఓ రాధాకిషన్ ఉపాధ్యాయులు సూచించారు. మంగళవారం మండలంలోని చండి, దొంతి, కొంతంపల్లి, దంతాన్పల్లి పలు పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులతో చేతిరాత రాయించడంతోపాటు గణితంలో చతుర్విద ప్రక్రియలు చేయించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అకాడమిక్ మానిటర్ అధికారి సుదర్శన మూర్తి, నవీన్, రాజు సీఎస్ఎఫ్ ఫౌండేషన్ సభ్యులు సిరి ఆదిత్య, ఎంఈఓ బుచ్చా నాయక్ పాల్గొన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రవిబాబు చేగుంట(తూప్రాన్): చేగుంటలోని మోడల్ పాఠశాలలో పని చేస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు రవిబాబుకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు వరించింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ చంద్రకళ తెలిపారు. జాతీయ క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన కార్మక్రమంలో రవిబాబుకు అవార్డు అందుకున్నారని చెప్పారు. కాగా, రవిబాబుకు అవార్డు రావడం పట్ల పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. నేషనల్ చాంపియన్‌షిప్‌కు ఎంజేపీ విద్యార్థి హవేళిఘణాపూర్(మెదక్): మహాత్యాజ్యోతిరావుపూలె బాలుర రెసిడెన్షియల్ హవేళిఘణాపూర్ విద్యార్థి జశ్వంత్ నేషనల్ –2025 చాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ సృజన మంగళవారం తెలిపారు. ఎంజేపీ బాలుర పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి జశ్వంత్ అక్టోబర్ చివరి వారంలో కర్ణాటక రాష్ట్రంలో జరిగే నేషనల్ లెవెల్ పోటీల్లో పాల్గొననున్నాడని పేర్కొన్నారు. నేషనల్ లెవెల్ చాంపియన్‌షిప్‌కు ఎంపిక కావడం పట్ల పాఠశాల అధ్యాపకులు సంతోశ్, విద్యార్థులు తదితరులు అభినందించారు. -
రుణ లక్ష్యాలు సాధించాలి
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ ,ప్రైవేటు బ్యాంకర్లు నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ బ్యాంకు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్ నుంచి జిల్లాలోని పలు బ్యాంకుల అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఎక్కువగా వర్షాలు పడటం వల్ల ఖరీఫ్, రబీ సీజన్లో సమృద్ధిగా పంటలు పండే అవకాశం ఉందన్నారు. డిసెంబర్ కల్లా 80 శాతం రుణ లక్ష్యాలు సాధించాలన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక, స్వయం సహాయక, ముద్ర, ఎంఎస్ఎంఈ, సూక్ష్మ, చిన్న , మీడియం ఎంటర్‌ప్రైజెస్‌లకు నిర్దేశించిన రుణాలను ఆర్బీఐ నిబంధనల మేరకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్‌తోపాటు డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. 12 వరకు ఆర్టీఐ వారోత్సవాలు జిల్లాలో సమాచార హక్కు చట్టం వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 నుంచి 12 వరకు వారోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ వారంలో రెవెన్యూ డివిజన్లు, మండల ప్రధాన కార్యాలయాల్లోని అన్ని విభాగాల్లో నిర్వహించాలని చెప్పారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలి మెదక్‌జోన్: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. త్వరలో నిర్వహించే మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల బ్యాలెట్‌బాక్సులను పట్టణంలోని గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో భద్రపరచనున్న నేపథ్యంలో వాటిని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రతతోపాటు సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు తదితరులు ఉన్నారు.బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశం -
బిల్లులివ్వకుంటే భోజనమెట్లా..?
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళాపేరు షబీనాబేగం. పట్టణంలోని ఫతేనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో వంట కార్మికురాలిగా పనిచేస్తోంది. 180 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతుంది. నాలుగు నెలలుగా మధ్యాహ్న భోజనం బిల్లులు రాకపోతుండటంతో షబీనాబేగం తన బంగారు ఆభరణాలు రూ.80వేలకు కుదవబెట్టి పిల్లలకు వంట చేసి పెడుతోంది. బిల్లులతోపాటు ఆమెకు రావాల్సిన గౌరవ వేతనం కూడా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడంతో అప్పు తెచ్చిన చోట వడ్డీ పెరిగిపోతోందని షబీనా బేగం ఆందోళన చెందుతోంది. ఇది ఒక్క షబీనా బేగంకే కాదు. జిల్లాలో వేలాది మంది వంట కార్మికులది దాదాపు ఇదే పరిస్థితి. మెదక్‌జోన్: మెదక్ జిల్లా వ్యాప్తంగా 882 ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం పథకం కొనసాగుతోంది. వీటిలో 63 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. మధ్యాహ్నభోజనం వండి పెట్టినందుకుగానూ 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు రూ 6.29 చొప్పున అలాగే 9–10 విద్యార్థులకు రోజుకు రూ.8.40 చొప్పున దీనికి తోడు గుడ్డుకోసం ప్రత్యేకంగా రూ.6 ప్రభుత్వం ఇస్తోంది. వారంలో 3 సార్లు గుడ్డు విద్యార్థులకు పెట్టాల్సి ఉండగా పప్పు, కూరగాయలు, సాంబారుతో మాత్రమే భోజనం వడ్డిస్తున్నారు. రూ 3.50 కోట్ల బకాయిలు! విద్యార్థులకు అందించే మధ్యాహ్నభోజన బిల్లులతో పాటు వంట నిర్వాహకులకు ఇచ్చే గౌరవవేతనంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తోంది. 1–8 వ తరగతి విద్యార్థులకు అందించే భోజన బిల్లుల్లో 60% కేంద్ర ప్రభుత్వం 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాయి. వంట నిర్వాహకులకు ఒక్కో మహిళకు నెలకు రూ.3000 చొప్పున చెల్లిస్తుండగా అందులో రాష్ట్రప్రభుత్వం రూ.2,400 ఇస్తుండగా కేంద్రం రూ.600 చొప్పున చెల్లిస్తోంది. 1–8 విద్యార్థులకు సంబంధించిన భోజన బిల్లులు ఆగస్టు నుంచి 2 నెలలు పెండింగ్‌లో ఉండగా 9–10 వ, తరగతి విద్యార్థులకు సంబంధించి భోజన బిల్లులను మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే జూన్ నుంచి 4 నెలల బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. అలాగే వంట కార్మికులకు ఇచ్చే గౌరవవేతనం సైతం నాలుగు మాసాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. అమలుకాని మెనూ..! నాలుగు మాసాలుగా మధ్యాహ్నభోజన బిల్లులతో పాటు వంట కార్మికులకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వక పోవటంతో అనేక బడుల్లో మెనూ అమలు కావటంలేదు. వంటకార్మికులకు బిల్లులు రాకపోవటంతో ఉపాధ్యాయులు సైతం వంట నిర్వాహకులను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని నిర్వాహకులు చేతులు ఎత్తేస్తే ఉపాధ్యాయులే వడ్డీకి డబ్బులు ఇప్పించి విద్యార్థులకు మధ్యాహ్నభోజనం సాగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వారం రోజుల్లో బడ్జెట్ రావచ్చు మరోవారం రోజుల్లో మధ్యాహ్నభోజన బిల్లులతోపాటు వంట కార్మికులకు జీతం సైతం వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్రాగానే కార్మికులకు అందజేస్తాం. – రాధాకృష్ణ డీఈఓ మెదక్కూచన్పల్లి ఉన్నత పాఠశాలలో వంట చేస్తున్న వంట కార్మికులు -
సన్నాల బోనస్ ఏమాయె!
నాలుగు నెలలుగా ఎదురుచూపులుదసరా పోయి దీపావళి వస్తున్నా.. సన్న వడ్లకు రావాల్సిన యాసంగి బోనస్ ఇంకా అందకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బోనస్‌పై ఆశతో ఎన్నో కష్టనష్టాల కోర్చి సన్నాలు సాగు చేశామని, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కన్నీళ్లే దిక్కవుతున్నాయని రైతులు చెబుతున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికల వేళ బోనస్ బకాయిలు ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులుభావిస్తున్నారు – మెదక్ అర్బన్ మంజీరా తీరం.. వరి పంటలకు నిలయంగా విరాజిల్లుతోంది. చుట్టూర మంజీరా నది ప్రవ హిస్తుండటం.. ఘనపురం ఆనకట్ట కాలువల నీరు పంటలకు ప్రాణం పోస్తున్నాయి. జిల్లాలో గత యాసంగి సీజన్లో 3,19,144 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. అయితే సన్నాలకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభు త్వం ప్రకటించింది. దీంతో 14,994 మంది రైతు లు 62,747 టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. వీరికి బోనస్ రూపంలో రూ.31.37కోట్లు రావాల్సి ఉంది. మరికొంత మంది రైతులు సన్నాలు పండించినా వారి అవసరం మేరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. నాలుగు నెలలైనా రాకపోవడంతో.. నాలుగు నెలలు కావస్తున్నా బోనస్ రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ప్రస్తుత సీజన్లో చాలా మంది సన్నాలు సాగు చేశారు. భారీ వర్షాలతో వేలాది ఎకరాల వరి పంట నీటమునిగింది. అయితే గత యాసంగి బోనస్ ఇప్పటి వరకు రాలేదని, ఇక ఖరీఫ్ సీజన్ బోనస్ ఎప్పుడు వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోనస్ ప్రభావం సా్థనిక ఎన్నికలపై సన్న వడ్ల బోనస్ ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరా పండుగ, ఎన్నికల నేపథ్యంలో బోనస్ ఇస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు బోనస్ చెల్లింపులు జరగలేదు. దీంతో ఏ రైతు నోట విన్నా.. బోనస్ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు సైతం బోనస్ అంశాన్ని ప్రధాన అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందు కోసం డాక్యుమెంటరీ చిత్రాలతో పాటు, సోషల్ మీడియా, పాటల సీడిలు, కళాబృందాలను ఉపయోగించి రైతులను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికై నా ఇవ్వండి సారూ.. బోనస్ వస్తుందన్న ఆశతో యాసంగిలో రెండు ఎకరాల్లో సన్న వరి వేశాను. సుమారు రూ.17 వేల బోనస్ రావాలి. ఈ ఖరీఫ్‌లో వేసిన వరి పంట నీట మునిగింది. కష్ట సమయంలో కనీసం బోనస్ వస్తే కొంత ఉపశమనంగా ఉంటుంది. పండుగలకు ఉపయోగపడతాయి. – కిషన్‌రెడ్డి, రైతు, పాపన్నపేట -
విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలి
డీఈఓ రాధాకిషన్ చేగుంట(తూప్రాన్): విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో రాణించేలా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపా లని డీఈఓ రాధాకిషన్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. అన్ని పాఠశాలల్లో ఎక్కువ శాతం విద్యార్థులు బాగా చదివేలా చూడాలని తెలిపారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించి విద్యా ప్రమాణాల మెరుగు కోసం పని చేయాలన్నారు. విద్యాపరమైన విషయంలో మెదక్ జిల్లా ముందు వరుసలో ఉండేలా కృషి చేయాలన్నారు. పదోతరగతి ఫలితాల్లో సైతం మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ నీరజ, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా వ్యవహరించాలి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుమెదక్ మున్సిపాలిటీ: స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, శాంతి భద్రతల మధ్య సజావుగా జరిగేలా ప్రతి పోలీస్ అధికారి కృషి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా తూ ప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి నిబంధనలు ఉల్లంఘిస్తే తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి అధికారి తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి పరిస్థితులను అవగాహన చేసుకోవాలన్నారు. ఎలాంటి ఘర్షణలకు తావు ఇవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు కఠినంగా నిర్వహించి అక్రమ రవాణా, అసాంఘిక చర్యలను అరికట్టాలని వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరేందర్‌గౌడ్, రంగానాయక్, సీఐలు సందీప్‌రెడ్డి, మధుసూదన్‌గౌడ్, జాన్‌రెడ్డి, రంగాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఎన్నికలు
కౌడిపల్లి(నర్సాపూర్): స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతవరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్‌హాల్ కోసం మండలంలోని ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, ఆర్ఎస్ శ్రీహరి, సర్వేయర్ మొగులయ్య తదితరులు ఉన్నారు. నర్సాపూర్: తమకు ఏడు నెలలుగా జీతాలు లేవని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నర్సాపూర్ డివిజన్ పరిధిలోని ఎస్టీ హాస్టళ్లలో పనిచేసే సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీ ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్ ఎదుట బైఠాయించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, తమనే పర్మనెంట్ చేయాలని, అప్పటివరకు జిల్లా కలెక్టర్ గెజిట్ మేరకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము గత నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగ జేఏసీ నాయకులు సురేష్, సువర్ణ తదితరులు ఆరోపించారు. పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం ఏడుపాయల వన దుర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. మొదట రాజగోపురంలోని ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు చేసిన అనంతరం ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): స్థానిక ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు సోమవారం మండల కేంద్రానికి చేరుకున్నాయి. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలో ఒక జెడ్పీటీసీ, 12 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి గాను 61 పోలింగ్ కేంద్రాల పరిధిలో 73 బ్యాలెట్ బాక్సులు మండల కేంద్రానికి రాగా, వాటిని మండల పరిషత్ కార్యాలయంలో భద్రపర్చారు. నారాయణఖేడ్: ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోమ వారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు. ఆయన వెంట ఇబ్రహీంపట్నం, నకిరేకల్, భువనగిరి ఎ మ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, వేముల వీరేశం, అనిల్‌కుమారెడ్డి తదితరులు ఉన్నారు. -
సమర్థవంతంగా ఎన్నికల విధులు
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్/తూప్రాన్/మనోహరాబాద్(తూప్రాన్): స్థానిక ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులంతా పనిచేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. సోమ వారం కలెక్టరేట్లో అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో అన్ని అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. నామినేషన్ నుంచి లెక్కింపు వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావు, డీపీఓ యా దయ్య, డీఈఓ రాధాకిషన్, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, జిల్లా సైన్స్ అధి కారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే తూప్రాన్ మండలంలోని లింగారెడ్డిపేట సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించనున్న కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్‌రాజ్ పరిశీలించారు. రేపు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన మెదక్ కలెక్టరేట్: వరద నష్టం అంచనా వేసేందుకు ఈనెల 8న జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పాలన యంత్రాంగం వరద నష్టంపై బృందం సభ్యులకు వివరించనున్నట్లు తెలిపారు. మెదక్, నిజాంపేట, రామాయంపేట, హవేళిఘణాపూర్, పాపన్నపేట మండలాల్లో పర్యటన కొనసాగుతుందన్నారు. అలాగే ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. -
పంటలు వర్షార్పణం
కొల్చారం(నర్సాపూర్): రెండు రోజులుగా మండలంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగలంతా ఎండ కాస్తూ రాత్రి వర్షం పడుతోంది. ఆదివారం, సోమవారం 16 గంటల వ్యవధిలో 65.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే ఎడతెరిపి లేని వర్షాలతో మండలవ్యాప్తంగా పత్తి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతి న్నాయి. వాతావరణంలో తేమశాతం పెరగడం, దీనికి తోడు వర్షాలు కురుస్తుండటంతో చేన్లు తెగుళ్ల భారిన పడుతున్నాయి. మరో 15 రోజుల్లో పంట చేతికొచ్చి దశలో కొన్నిచోట్ల వరిలో కాండం కుళ్లు తెగులు సోకి పంట నేలవాలుతోంది. అటు పత్తికి సైతం ఇదే పరిస్థితి ఉంది. ఇలాగే కొనసాగితే పత్తి రంగు మారి, దిగుబడి తగ్గి పెట్టుబడి కూడా రాని పరిస్థితులు నెలకొంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
స్థానికంపై ఫోకస్
● వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు ● పావులు కదుపుతున్న నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. హస్తం సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా, కాషాయ పార్టీ ఖాతా తెరవలేదు. అయితే ఈసారి త్రిముఖ పోరు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. – మెదక్‌జోన్ స్థానిక పోరుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, మెతుకుసీమలో మాత్రం ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మెదక్‌లో కాంగ్రెస్ గెలుపొందగా, నర్సాపూర్ అసెంబ్లీ స్థానం మాత్రం బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. ఎంపీ రఘునందన్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధి ంచారు. అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య గెలుపొందారు. జిల్లాలో మూడు ప్రధాన పార్టీలను ప్రజలు అక్కున చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో కారుదే హవా జిల్లాలో 2019లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది. అప్పట్లో 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, 18 చోట్ల బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 2 చోట్ల మాత్రమే గెలుపొందింది. బీజేపీ ఖాతా తెరవని పరిస్థితి. దీంతో జెడ్పీ పీఠం గులాబీ పార్టీ కై వసం చేసుకుంది. అలాగే మండల పరిషత్ స్థానాలు 189 ఉండగా, 117 చోట్ల బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ 44 చోట్ల గెలుపొందగా, ఇతరులు 28 చోట్ల విజయం సాధించారు. దీంతో 20 ఎంపీపీ స్థానాలకు 14 చోట్ల బీఆర్ఎస్, 4 చోట్ల కాంగ్రెస్, ఇతరులు 2 స్థానాలు కై వసం చేసుకున్నారు. ఈసారి త్రిముఖ పోటీఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో త్రిముఖ పోరు జరుగనుంది. అధికార కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకుంది. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఇన్చార్జి మంత్రి వివేక్ జిల్లాలో పర్యటించి శ్రేణులను సమాయత్తం చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులే ఎజెండాగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఇదే విషయమై మాజీ మంత్రి హరీశ్‌రావు స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇక బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది. జీఎస్టీ శ్లాబుల తగ్గింపును తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఎంపీ రఘునందన్‌రావు జిల్లాలో విస్తృతంగా పర్యటించి కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నా రు. ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సైతం గతంలో జిల్లాలో పర్యటించి క్యాడర్లో జోష్ నింపారు. -
సామాజిక భద్రతకు భరోసా
● వృద్ధులు, కిశోర బాలికలకుకొత్త సంఘాలు ● కొనసాగుతున్న అర్హుల గుర్తింపు రామాయంపేట(మెదక్): ఆదరణ కరువైన వృద్ధులు, కిశోర బాలికలను గుర్తించి ఆదుకోవడంతో పాటు వారితో వేర్వేరుగా సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధిశాఖ జిల్లావ్యాప్తంగా సభ్యుల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా 20 మండలాల్లో గ్రూపులకు సంబంధించి సభ్యుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న మహిళా సమాఖ్య, దివ్యాంగుల సంఘాలతో పాటు అదనంగా కిశోర బాలికలు, వృద్ధులతో సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామ సంఘం కనీసం ఒక గ్రూపు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. 60 ఏళ్లు నిండిన మహిళలకు మళ్లీ అవకాశం సాధారణంగా 60 ఏళ్లు నిండిన మహిళలు మహిళా సంఘాల్లో ఉండటానికి నిబంధనలు అంగీకరించవు. వారు సంఘం నుంచి పక్కకు తప్పుకోవాల్సిందే. ప్రస్తుతం వారిని గుర్తించి ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 21 గ్రూపులను ఏర్పాటుచేసిన అధికారులు 210 మందిని సభ్యులుగా చేర్పించారు. మేమున్నామని వారికి మనోధైర్యం కల్పిస్తున్నారు. సంఘంలో సభ్యులుగా ఉన్న వృద్ధులు తమ వారి ఆదరణకు దూరమైతే వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఈమేరకు వీరికి ప్రభుత్వం ప్రత్యేకంగా రివాల్వింగ్ ఫండ్ మంజూరు చేయనున్నట్లు సమాచారం. అలాగే 14 నుంచి 18 ఏళ్ల బాలికలను గుర్తించి వారితో ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 43 సంఘాలను ఏర్పాటు చేసిన అధికారులు 430 మందిని సభ్యులుగా చేర్పించారు. వారిలో ఆత్మవిశ్వాసంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొవడం వంటి విషయాల్లో చైతన్యపరుస్తామని అధికారులు చెబుతున్నారు. కొత్త ఎస్‌హెచ్‌జీలకు కసరత్తు మహిళా సంఘాల్లో ఇప్పటివరకు సభ్యులుగా చేరని వారిని గుర్తించి వారితో కొత్త సంఘాలు ఏర్పాటు చేయించడానికి గ్రామాల వారీగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 56 సంఘాలను ఏర్పాటు చేసి 560 మందిని సభ్యులుగా చేర్పించారు. వీరికి పొదు పు చేయడం, సంఘాల బాధ్యతల విషయమై అవగాహన కల్పిస్తున్నారు. దివ్యాంగులతో సైతం.. అలాగే జిల్లాలో గతంలో ఉన్న 172 సంఘాలకు తోడు కొత్తగా అదనంగా మరో 14 దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం తోడ్పాటు అందించే విధంగా కృషి చేస్తున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పనిముట్లు, పరికరాల్లో ప్రాధాన్యం ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా పథకాలను వర్తింపజేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రోత్సాహం అందిస్తాం జిల్లాలో ఉన్న పాత మహిళా సంఘాలకు తోడు కొత్తగా మరిన్ని సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. వృద్ధులతో పాటు కొత్తగా కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సంఘాలకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం, తోడ్పాటు అందే విధంగా కృషి చేస్తాం. – శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
సింగూరు రికార్డు బ్రేక్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టు వరద జలాల రికార్డులు బ్రేక్ అయింది. ఈ వర్షాకాలం సీజనులో ఇప్పటి వరకు ఏకంగా 200 టీఎంసీల వరద జలాలు ఈ ప్రాజెక్టులోకి వచ్చాయి. దీంతో వరద నీటిని ప్రాజెక్టు గేట్లు ఎత్తి మంజీరా నదిలోకి వదలేశారు. ప్రాజెక్టు చరిత్రలో ఇంత రికార్డు స్థాయిలో వరద జలాలు నదిలోకి వదలడం ఈ ఏడాదే మొదటిసారని నీటి పారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 1989లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. 1998–99లో ఈ ప్రాజెక్టుకు 176 టీఎంసీల వరద వచ్చినట్లు నీటి పారుదల రికార్డులు చెబుతున్నాయి. 2010 –11 సంవత్సరంలో కూడా భారీగానే వరద వచ్చింది. ఆ సంవత్సరం 106 టీఎంసీల వరద వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2016–17లోనూ 105 టీఎంసీలు, 2021–22లో 101 టీఎంసీలు వచ్చి ంది. సుమారు 27 ఏళ్ల తర్వాత ఈసారి ఏకంగా 200 టీఎంసీలు దాటడం గమనార్హం. సాధారణంగా ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. ఈ లెక్కన 200 టీఎంసీలతో సుమారు 20 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తేవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఏ స్థాయిలో వరద జలాలు మంజీరా నది పాలయ్యాయనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కర్నాటక, మహారాష్ట్రల్లో క్యాచ్మెంట్.. జిల్లాలో ఉన్న ఏకై క బహుళార్థక సాధక ప్రాజెక్టుకు జిల్లాతో పాటుగా, కర్నాటక, మహారాష్ట్రల పరిధిలో క్యాచ్మెంట్ ఏరియా ఉంది. ఈ ఏరియాల్లో ఈసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ కారణంగా ఈ ప్రాజెక్టుకు వరద జలాల రాక ఉధృతంగా సాగుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద జలాలను మంజీరా నదిలోకి వదులుతున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు ఆనకట్ట దెబ్బతిన్న నేపథ్యంలో డ్యాం సేఫ్టీ అధారిటీ నీటి నిల్వలను 16 టీఎంసీలకే పరిమితం చేయాలని సూచించింది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.9 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 16 టీఎంసీలకే పరిమితం చేస్తున్న విషయం విదితమే. క్రాప్ హాలీడే ప్రకటించిన సంవత్సరంలో.. సింగూరు ప్రాజెక్టు ఆయకట్టుకు ఈ ఏడాది ప్రభుత్వం క్రాప్ హాలీడే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా క్రాప్‌హాలీడే ప్రకటించిన సంవత్సరంలోనే ఇంత భారీ స్థాయిలో వరద రావడం గమనార్హం. మరోవైపు భారీ ఎత్తున వరద జలాలు రావడంతో విద్యుత్ ఉత్పత్తి కోసం జెన్కోకు కూడా నీటి విడుదల కొనసాగుతోంది. నిర్దేశిత లక్ష్యం మేరకు ఈసారి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని జెన్కో అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ఈ జలాశయం ఆధారంగా ఉన్న ఘనపురం ఆనకట్టకు, కామారెడ్డి జిల్లాలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా నీటి విడుదల చేశారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్తో పాటు, మిషన్‌భగీరథ అవసరాల కోసం కూడా ఈ నీటిని వినియోగిస్తున్న విషయం విదితమే. 200 టీఎంసీలు దాటిన వరద జలాల రాక 1998–99లో వచ్చిన వరద 176 టీఎంసీలు 27 ఏళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో వరద మంజీరా నది పాలైన జలాలు -
హస్తంలో నిస్తేజం
మెదక్ అర్బన్: ఈనెల 5వ తేదీకల్లా జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసేందుకు అర్హులను గుర్తించి, ఒక్కోస్థానం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను గాంధీ భవన్‌కు పంపాలని పీసీసీ ఆదేశించినా.. మెదక్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎన్నికల సందడి కనిపించడం లేదు. స్థానిక నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి, అభ్యర్థుల పేర్లు గుర్తిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల గాంధీభవన్ వర్గాలు మాత్రం కొంతమంది కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులకు ఫోన్ చేసి ఆశావహుల వివరాలు అడిగినట్లు సమాచారం. ఆశావహుల్లో ఆందోళన జిల్లాలో 21 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, మెదక్ నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈనెల 5 కల్లా జెడ్పీటీసీ స్థానాలకు ఆశావహులను గుర్తించి, ఒక్కో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పంపాలని జిల్లా పార్టీ కమిటీలను పీసీసీ ఆదేశించింది. జిల్లాకు చెందిన, ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కానీ ఇప్పటివరకు అలాంటి సమావేశాలు ఏర్పాటు కాలేదని మండల కార్యవర్గాలు అంటున్నాయి. ఓ వైపు ముగ్గురేసి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి పీసీసీకి పంపాలనే సూచనలు ఉన్నాయి. కాగా రెండు, మూడు రోజుల కింద పీసీసీ వర్గాలు, కొంతమంది మండల కాంగ్రెస్ శాఖ అధ్యక్షులకు ఫోన్లు చేసి, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న వారి వివరాలు అడిగినట్లు తెలుస్తుంది. అయితే వారు తమకు తెలిసిన కొన్ని పేర్లు చెప్పినట్లు సమాచారం. మెదక్ నియోజకవర్గంలో పోటాపోటీ మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట మండలంలో కాంగ్రెస్ నుంచి పంతుల భూమన్న, శ్రీకాంతప్ప, రమేశ్‌గౌడ్, రాజశేఖర్, భరత్‌గౌడ్, సూఫీ, మెదక్ మండలం జెడ్పీటీసీకి శంకర్, నాగరాజు, మురళి, హవేళిఘణాపూర్ మండలం నుంచి శ్రీనివాస్, పరుశురాంగౌడ్, చిన్నశంకరంపేట నుంచి సాన సత్యనారాయణ, భిక్షపతి, ప్రభాకర్, పడాల సిద్దిరాములు, రామాయంపేట నుంచి మహేందర్ రెడ్డి, మోహన్‌నాయక్, శివప్రసాద్‌రావు, నిజాంపేట నుంచి వెంకటేశంతో పాటు ఇంకా కొంతమంది నాయకులు జెడ్పీటీసీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. పేర్లు పంపిస్తాం పీసీసీ సూచన మేరకు ఆదివారం సాయంత్రానికల్లా ఒక్కో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పంపిస్తాం. ఇప్పటికే మండలాల వారీగా సమాచారం సేకరించాం. కొన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేయలేదు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్న వారి పేర్లు తీసుకున్నాం. – ఆంజనేయులు గౌడ్, డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్‌లో ఖరారు కాని ఆశావహుల పేర్లు మండల సమావేశాలు నిర్వహించని వైనం 5 వరకు జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితా పంపాలని కోరిన అధిష్టానం రాజకీయాల్లో అనాధిగా అగ్రవర్ణ నాయకుల అధిపత్యం కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో ఓసీలకు చాలా చోట్ల రిజర్వేషన్లు ప్రతికూలంగా వచ్చాయి. దీంతో వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రియాశీలకంగా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్లపై కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన కూడా రాజకీయ వాతావరణాన్ని రగిలించడం లేదు. దీంతో చాలా చోట్ల ఎన్నికల సన్నాహక సమావేశాలు జరుగలేదని తెలుస్తోంది. -
స్థానికంగానే నామినేషన్లు
● ఎంపీడీఓ కార్యాలయాల్లోనే కౌంటర్లు ● 21 ఏళ్లు నిండిన వారే పోటీకి అర్హులు నారాయణఖేడ్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు స్థానికంగా మండల పరిషత్తు కార్యాలయాలు (ఎంపీడీఓ)ల్లోనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీటీసీ స్థానానికి గానీ, జెడ్పీటీసీ స్థానానికి గాను ఆయా మండలాలకు సంబంధించిన వారు సదరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసే కౌంటర్లో ఆర్వోలకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఎంపీటీసీ స్థానం ఎన్నికల నిర్వహణకు గాను గెజిటెడ్ హోదా ఉన్న హెడ్మాస్టర్లు, లెక్చరర్లు, ఇతర అధికారులను రిటర్నింగ్ అధికారిగా నియమించనున్నారు. సదరు అధికారి తాను పనిచేసే మండలం, సొంత మండలం రెండు అంశాలను పరిగణలోకి తీసుకుని ఇతర మండలాల వారిని ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తున్నారు. జెడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఆ క్లస్టర్ పరిధిలో వచ్చే ఎంపీటీసీ స్థానాల వివరాలను సంబంధిత ఆర్వోల వద్ద ప్రదర్శిస్తారు. తొలివిడత పరిషత్ ఎన్నికల కోసం ఈ నెల 9న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. పోటీ చేసే అభ్యర్థితోపాటు ముగ్గురికి మాత్రమే నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ర్యాలీలు, ప్రచారాలకు అనుమతులు లేవు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థి వయస్సు నామినేషన్ల స్వీకరణ నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కేటగిరీని బట్టి డిపాజిట్ చెల్లించాలి. ఎంపీటీసీగా పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250, జెడ్పీటీసీ జనరల్ అభ్యర్థులు రూ.5,000, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.2,500, గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసే జనరల్ అభ్యర్థి రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.1000, వార్డు సభ్యుడు జనరల్ అభ్యర్థి రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.250లు చెల్లించాలి. పోటీ చేసే అభ్యర్థులు పంచాయతీకి పన్ను బకాయి, కరెంటు బిల్లులు క్లియర్ చేసి ఆ రశీదును తీసుకోవాల్సి ఉంటుంది. తమ నామిషన్ల సందర్భంగా కులధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. -
ఓట్లడిగే హక్కు ఆ పార్టీలకు లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుజోగిపేట(అందోల్): స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకొని ప్రధాని మోదీకి గిఫ్ట్‌గా ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రకటించారు. ఆదివారం అందోలులో నిర్వహించిన అలయ్– బలయ్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రజల్లో బీజేపీ పార్టీకి ఆదరణ ఉందన్నారు. ఎక్కడికి వెళ్లినా తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కార్యకర్తల ఉత్సా హం చూస్తుంటే సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌్ పదవిని బీజేపీ కై వసం చేసుకోవడం ఖాయమని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును కూడా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా ఐకమత్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సంగారెడ్డి, నారాయణఖేడ్ అసెంబ్లీ ఇన్చార్జిలు దేశ్‌పాండే, సంగప్ప, నాయకులు అనంతరావు కులకర్ణి, ప్రభాకర్‌గౌడ్, లక్ష్మినర్సింహ రెడ్డి, వివిధ మండల శాఖల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అన్నదాతకు వరుణ గండం
మెదక్‌జోన్: ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన రైతన్నకు పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తునాయి. ఆదివారం జిల్లాలోని పలు మండలాల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరికోత దశలో వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వదలని వానతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కర్షకులు కొట్టుమిట్టాడుతున్నారు. 503 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లావ్యాప్తంగా 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో దొడ్డు రకం 2.28 లక్షలు, సన్నాలు 77 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇందుకోసం 7.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో 3.39 లక్షల మెట్రిక్ టన్నులు రైతులు ఆహారం కోసం నిల్వ ఉంచుకుంటారు. విత్తన కంపెనీలకు కొంతమేర పోనూ, మరికొంత బయట వ్యాపారులకు విక్రయిస్తారని భావిస్తున్నారు. అదిపోను కొనుగోలు కేంద్రాలకు 4.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 3 గంటలు.. 12 సెంటీమీటర్లు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సుమారు 3 గంటల పాటు వర్షం దంచికొట్టింది. జిల్లాలోని చిన్నశంకరంపేట, చేగుంట, మెదక్, హవేళిఘణాపూర్, నార్సింగి, కౌడిపల్లి, కొల్చారం, నర్సాపూర్, పాపన్నపేట, టేక్మాల్, చిలప్‌చెడ్ తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇప్పటికే మొక్క జొన్న పంటను కోసి ఆరబెట్టగా, 40 శాతం వరి పంటలు కోతకు వచ్చాయి. కానీ వర్షాల కారణంగా పంట చేతికందుతుందా..? లేదా అని రైతు లు ఆందోళన చెందుతున్నారు. కోత కోయలేరు.. ఆరబెట్టలేరు ఈ ఏడాది భారీ వర్షాలతో ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కాగా మిగిలిన పంటనైనా కోసి అమ్ముకుందామంటే వర్షాలు వెంటాడుతున్నాయి. చైన్ మిషన్లతో వరి పంటను కోసినా, ధాన్యాన్ని ఆయబెట్టలేని దుస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరికోతల వేళ వెంటాడుతున్న వర్షాలు ధాన్యం కొనుగోళ్లకు అధికారుల ఏర్పాట్లు జిల్లాలో 4.23 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా -
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
పాత చిక్కులు..కొత్త ముడులుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల లొల్లి తెరపైకి వస్తోంది. పలు నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రూపులు తయారైన నేపథ్యంలో ఈ ఎన్నికల టికెట్లు ఎవరికి దక్కుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ దృష్టి సారించింది. ప్రధానంగా జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఒక్కో మండలానికి ముగ్గురు చొప్పున పేర్లతో నియోజకవర్గాల వారీగా జాబితాను రూపొందిస్తోంది. గ్రూపు విభేదాలు ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది ఆ పార్టీలో ప్రహసనంగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జహీరాబాద్‌లో గ్రూపుల లొల్లి.. జహీరాబాద్ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి. ఇక్కడ పార్టీ మూడు వర్గాలుగా విడిపోయింది. నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్‌రెడ్డి వర్గాలు ఎవరికి వారే అన్నచందంగా తయారయ్యాయి. ఈ గ్రూపులకు తోడుగా ఎంపీ సురేశ్ షెట్కార్ అనుచరవర్గం కూడా మరో వర్గంగా వ్యహరిస్తోంది. అప్పట్లో ముగ్గురు వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకునేందుకు ఆయా వర్గాల నేతలు పట్టుబట్టే అవకాశాలున్నాయి. దీంతో ఇక్కడ ఎవరి అనుచరులకు టికెట్లు దక్కుతాయనేది చర్చనీయాంశంగా మారింది. ఖేడ్‌లోనూ అంతర్గతంగా ఆధిపత్య పోరు నారాయణఖేడ్‌లోనూ కాంగ్రెస్ కేడర్ రెండు వర్గాలుగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్ అనుచరుల మధ్య ఆధిపత్య పోరు ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బయట పడకపోయినా..అంతర్గతంగా మాత్రం కొనసాగుతోంది. ఇప్పుడు ఇక్కడ కూడా అభ్యర్థుల ఎంపిక అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నర్సాపూర్‌లోనూ అదే తీరు మెదక్ జిల్లా నర్సాపూర్‌లోనూ హస్తం పార్టీ కేడర్ రెండు గ్రూపులుగా తయారైంది. నియోజకవర్గం ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి వర్గంతోపాటు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సన్నిహితంగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినీరెడ్డి వేర్వేరుగా పార్టీ కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా అభ్యర్థుల ఎంపిక అనేది కత్తి మీద సాముగానే మారింది. ఎవరికి వారే తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకునేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.గ్రూపులున్న చోట్ల ప్రత్యేక కమిటీలు గ్రూపుల లొల్లి తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ పరిశీలిస్తోంది. ఆయా వర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారిలో వడపోత కార్యక్రమం చేపట్టే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తామని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. అవసరమైతే సర్వే నిర్వహించి టికెట్లు కేటాయింపులు ఉంటాయని చెబుతున్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆయా నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.ఒక్కో నియోజకవర్గంలో రెండు, మూడు గ్రూపులు ఏ గ్రూపునకు ‘స్థానిక’ టికె ట్లు దక్కుతాయనే దానిపై ఆసక్తి తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు నేతల పట్టు పలు నియోజకవర్గాల్లో హస్తం పార్టీలో ఇదీ పరిస్థితి ఇప్పటికీ పలుచోట్ల బయటపడుతున్న విభేదాలు సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలు వేసే యోచనలో పార్టీ నాయకత్వం! -
డీజీపీని కలిసిన ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్‌రెడ్డిని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు, నేర నియంత్రణ, నేర నిరోధక చర్య లు, పోలీస్ విభాగం పనితీరుపై ఆయనతో చర్చించారు. జోరు తగ్గిన మంజీరా పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో శనివారం మంజీరా నది జోరు తగ్గింది. సింగూరు నుంచి 38,467 క్యూసెక్కుల నీరు వదలగా, గతంలో పోలిస్తే ప్రవాహం తక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ రాజగోపురంలోనే దుర్గమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తున్నారు. వైద్య సేవలపై ఆరా చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలోని పల్లె దవాఖానను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. స్టాఫ్‌నర్స్ రేణుకతో మాట్లాడి మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబు, పట్టణ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. విద్యా సామర్థ్యాలు పెంచాలి వెల్దుర్తి(తూప్రాన్): ప్రాథమిక దశ నుంచే విద్యా సామర్థ్యాలు పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. శనివారం మండలంలోని శంశిరెడ్డిపల్లితండా, చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, మధ్యా హ్న భోజన పథకం, పరిసరాలు, రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల రీడింగ్ సామర్థ్యాలను పరిశీలించి సిబ్బంది పనితీరును అభినందించారు. అదేవిధంగా ఎంఆర్సీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. పాఠశాలల వారీగా సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాల మెరుగకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆయన వెంట ఎంఈఓ సీతారాం ఉన్నారు. బీజేపీకే ప్రజాదరణ నర్సాపూర్: జిల్లాలో బీజేపీకే ప్రజాదరణ ఉందని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో మండల శాఖ అధ్యక్షుడు నగేశ్ అధ్యక్షతన నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాలను కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని, వారి మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు నారాయణరెడ్డి, రాములునాయక్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ.. జంపింగ్‌ల మేళా
జోరుగా రాజకీయ వలసలు మెదక్‌జోన్: Ý린MýS çÜ…çܦÌS G°²-MýSË$ çÜÒ$í³-çÜ$¢¯]l² Ðólâýæ hÌêÏÌZ f…í³…VŠæ ´ëÍ-sìæMŠSÞ gZÆý‡…-§ýl$-MýS$¯é²Æ‡$$. Æð‡…yýl$ ¯ðlÌS-Ë$V> D ç³Æý‡…ç³Æý‡ ÝëVýS$-™èl*¯ól E…¨. Ýë«§é-Æý‡×æ M>Æý‡Å-MýS-Æý‡¢Ë$ Ððl¬§ýl-Ë$-Mö° °Äñæ*-f-MýS-Ð]lÆý‡Y, Ð]l$…yýl-ÌSÝë¦Æ‡$$ ¯éĶæ$-MýS$ÌS Ð]lÆý‡MýS$ ´ëÈ-tË$ Ð]l*Æý‡$-™èl$-¯é²Æý‡$. D Ð]lÅÐ]làÆý‡…ÌZ ½BÆŠḥG‹Ü, M>…{VðS‹ÜË$ §ýl*MýS$yýl$V> Ð]lÅÐ]lçß ÇçÜ$¢¯é²Æ‡¬. VýS™èl AòÜ…½Ï G°²-MýSÌS çÜÐ]l$-Ķæ$…ÌZ Ððl$§ýlMŠS GÐðl$ÃÌôæÅ Æøíßæ-™Œæ-Æ>Ð]l# Ððl¯]l²…sìæ E¯]l² Ķæ¬Ð]l-¯ól™èl iÐ]l-¯ŒS-Æ>Ð]l#, Æ>Ð]l*-Ķæ$…õ³r Ð]l*i Ð]l*Æð‡PsŒæ MýSÑ$sîæ O^ðlÆý‡Ã¯ŒS VýS…V> ¯]lÆó‡…-§ýlÆŠ‡ ĶæÊrÆŠ‡² ¡çÜ$-Mö° Æð‡…yýl$ ¯ðlÌSÌS {MìS™èl… ½B-ÆŠ‡-G‹Ü ¡Æý‡¦… ç³#^èl$a-MýS$-¯é²Æý‡$. Aç³µsZÏ hÌêÏÌZ C¨ àsŒæ-sê-í³MŠSV> Ð]l*Ç…-¨. ©°MìS Mú…r-ÆŠ‡V> GÐðl$ÃÌôæÅ Æøíßæ-™Œæ-Æ>Ð]l#, M>…{VðS‹Ü Æ>çÙ‰ ¯ól™èl OÐðl$¯]l…ç³-ÍÏ çßæ¯]lÃ…-™èl-Æ>Ð]l# hÌêÏÌZ ¿êÈ ºíßæ-Æý‡…VýS çÜ¿ýæ¯]l$ HÆ>µ-r$-^ólÔ>Æý‡$. ï³ïÜïÜ `‹œ Ð]l$õßæ-ÔŒæ-MýS$-Ð]l*-ÆŠ‡VúyŠæ, hÌêÏ C¯ŒS-^é-Çj Ð]l$…{† ÑÐól-MŠS¯]l$ Bà-Ó-°…-^éÆý‡$. D çÜ¿ýæÌZ °Äñæ*-f-MýS-Ð]lÆý‡Y…ÌZ° ç³Ë$ Ð]l$…yýl-ÌêË$, {V>Ð]l*-ÌSMýS$ ^ðl…¨¯]l Ð]l*i çÜÆý‡µ…-^Œl-ÌS™ø ´ër$ ½B-ÆŠ‡-G‹Ü, ½gôæ-ï³ÌS ¯]l$…_ M>Æý‡Å-MýSÆý‡¢Ë$, ¯ól™èlË$ ò³§ýlª-G-™èl$¢¯]l M>…{VðS‹Ü ¡Æý‡¦… ç³#^èl$a-MýS$-¯é²Æý‡$. ÐéÇ™ø ´ër$ {ç³Ð]l¬Q çÜ…çœ$ õÜÐ]lMýS$yýl$ ÎÌê {VýS*‹³ O^ðlÆý‡Ã¯ŒS Ððl*çßæ-¯ŒS-¯éĶæ$-MŠS¯]l$ M>…{VðS-‹Ü-ÌZMìS Bà-Ó-°…-^éÆý‡$. అటోళ్లు ఇటు.. ఇటోళ్లు అటు కౌడిపల్లి మండలం దేవులపల్లికి చెందిన సుమారు 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు రెండు రోజుల క్రితం అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి ఎమ్మె ల్యే సునీతారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఇటీవల యూరియా కొరతతో పాటు స్థానికంగా ఉన్న నేతలతో పొసగకపోవటమేనని తెలుస్తోంది. పెద్దశంకరంపేట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సీనియర్ నేత మురళి (పంతులు) ఇటీవల ఆ పార్టీని వీడారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమక్షంలో ఆయనతో పాటు మరో 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దశంకరంపేట మేజర్ పంచాయతీతో పాటు ఆ మండల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు సైతం జనరల్ మహిళాకు రిజర్వేషన్ కావటంతో ఆయన అధికార పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తాజాగా శనివారం పాపన్నపేట మండల పరిధిలోని పలు పార్టీలకు చెందిన నాయకులు హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు స మక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, జిల్లా నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పార్టీల వలసల పరంపర కొనసాగుతుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మళ్లీ బీజేపీ వైపు పంజా చూపు! రామాయంపేట(మెదక్): స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన నిజాంపేట మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పంజా విజయకుమార్ జూలై 20న కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ పంజా ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి పంజా పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు. కార్యకర్తలతో సైతం అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరిన 75 రోజుల్లోనే మనసు మార్చుకొని బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈవిషయమై బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా తన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించలేదని ‘పంజా‘ సాక్షితో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను కాషాయ పార్టీలోనే ఉన్నట్లు పేర్కొన్నారు. ముదిరాజ్ కుల ంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన విజయకుమార్ తిరిగి బీజేపీలో చేరితే కొన్ని మండలాల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. -
నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఎంసీఎంసీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంసీఎంసీ ద్వారా చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూంను పరిశీలించారు. అభ్యర్థులు తమ ఎన్నికల ప్రకటనల కోసం ఎంసీఎంసీ ద్వారా అనుమతి పొందాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా పంచా యతీ అధికారి యాదయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి రామాయంపేట/నిజాంపేట(మెదక్): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు వంతెనలు, చెరువుల తాత్కాలిక మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం రామాయంపేట, నిజాంపేట మండలాల్లో పర్యటించారు. మెదక్ కలెక్టరేట్: స్థానిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి హెల్ప్‌డెస్క్ ద్వారా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. -
స్థానిక ఎన్నికల విధుల్లో టీచర్లు
● పరిషత్ పోరుకు 3,500 మంది ● పంచాయతీకి 3,800 మంది ● ఇప్పటికే రెండు విడతల్లో శిక్షణ పూర్తి మెదక్ కలెక్టరేట్: జిల్లాలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల విధుల్లో అత్యధికంగా ఉపాధ్యాయులు పనిచేయనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎంపిక చేసి వారికి ఎన్నికల నిర్వహణపై రెండు విడతల్లో శిక్షణ సైతం ఇచ్చారు. కాగా పరిషత్ పోరుకు 3,500 మంది, పంచాయతీ ఎన్నికలకు 3,800 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించనున్నారు. ఇందులో సీనియర్ ఉపాధ్యాయులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా, సూపర్వైజర్లుగా, ప్రిసైడింగ్, స్టేజ్–1, స్టేజ్– 2 అధికారులుగా పనిచేయనున్నారు. అలాగే డీఈఓ రాధాకిషన్‌తో పాటు మరో 11 మంది అధికారులు జిల్లా ఎన్నికల నోడల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. వీరితో పాటు పంచాయతీ సెక్రటరీలకు పోలింగ్ కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మొదటి దశలో మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లోని 99 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 23న పోలింగ్ జరగనుంది. రెండో దశలో నర్సాపూర్ డివిజన్లోని 5 మండలాలు, తూప్రాన్ డివిజన్లోని 6 మండలాల పరిధిలో గల 11 జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు 27న పోలింగ్ నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలు సైతం రెండు దశల్లో జరుగనున్నాయి. మొదటి దశలో మెదక్ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో 244 పంచాయతీ, 2124 వార్డులకు వచ్చే నెల 4న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడతలో నర్సాపూర్, తూప్రాన్ డివిజన్లోని 11 మండలాల్లోని 248 పంచాయతీలకు, 2,096 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటికి నవంబర్ 8న పోలింగ్, అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. -
పేటలో పోటీ.. జెడ్పీ పీఠంపై గురి
రామాయంపేట(మెదక్): జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించడంతో ఈ స్థానాన్ని కై వసం చేసుకోవడానికి ప్రధాన పా ర్టీలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. జిల్లాలోని 21 జెడ్పీటీసీ స్థానాల్లో రామాయంపేట, కొల్చారం,తూప్రాన్ స్థానాలు జనరల్, నిజాంపేట, పెద్దశంకరంపేట, మనోహరాబాద్ జెడ్పీటీసీ స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించారు. మూడు ప్రధాన పార్టీల్లో మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత, మాజీ జిల్లా అధ్యక్షులు, గుర్తింపు పొందిన నేతలు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. జెడ్పీటీసీగా గెలిస్తే చాలు ఎలాగైనా జెడ్పీ పీఠం కై వసం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్న నాయకులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. రామాయంపేటలో పోటీ చేయడానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ భర్త దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మెదక్ నియోజవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావు ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఆర్ వెంకటాపూర్ మాజీ సర్పంచ్ మహేందర్‌రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన మోహన్‌నాయక్, దామరచెరువు మాజీ సర్పంచ్ శివప్రసాదరావు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములుతో పాటు మరికొందరు టికెట్ ఆశి స్తున్నారు. తమ మండలాల్లో రిజర్వేషన్లతో పోటీ చేయడానికి అవకా శం లేని నాయకులు పక్క మండలాలపై దృష్టి సారిస్తున్నారు. కాగా జెడ్పీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీ ల అభ్యర్థుల ఎంపిక విషయమై జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. -
పరిషత్ పోరుకు కసరత్తు
సంగారెడ్డి జోన్: పరిషత్ పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాను సైతం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ తాజాగా పరిషత్తు స్థానాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఎన్నికలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన 12 మందిని నోడల్ అధికారులుగా నియమించారు. ఒక్కో అంశంపై ఒక్కో అధికారిని పర్యవేక్షించే విధంగా బాధ్యతలను అప్పగించారు. 261 ఎంపీటీసీ.. 25 జెడ్పీటీసీ స్థానాలు జిల్లాలో 25 మండలాల పరిధిలో 613 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 261 ఎంపీటీసీ, 25 జెడ్పీటీసీ స్థానాలకు పోరు జరగనుంది. రెండు విడతలలో పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొదటి విడతలో జహీరాబాద్‌తో పాటు నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలాల్లో ఉన్న 141 ఎంపీటీసీ స్థానాలు, 13 జెడ్పీటీసీ స్థానాలకు, రెండో విడతలో అందోల్, సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గంలోని 12 జెడ్పీటీసీ, 120 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం ఇప్పటికే 1,458 కేంద్రాలను గుర్తించారు. జిల్లాలో 1,748 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.పేరు అధికారి హోదా అంశం వెంకటేశ్వర్లు విద్యాశాఖ సిబ్బంది నియామకం అభిలాష్‌రెడ్డి సాంఘిక సంక్షేమ బ్యాలెట్ బాక్సులు అరుణ జిల్లా రవాణాశాఖ రవాణా రామాచారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిక్షణ కార్యక్రమాలు స్వప్న డిప్యూటీ సీఈఓ సామగ్రి పంపిణీ జగదీష్ బీసీ సంక్షేమశాఖ ఎన్నికల ప్రవర్తన, నియమావళి బలరాం ఆడిట్ అధికారి వ్యయ పరిశీలన సూర్యారావు అదనపు డీఆర్డీఓ రిపోర్టులు సమర్పణ బాలరాజ్ అదనపు డీఆర్డీఓ బ్యాలెట్, పోస్టల్ పేపర్ ముద్రణ ఏడుకొండలు డీపీఆర్ఓ మీడియా కమ్యూనికేషన్ సాయిబాబా డీపీఓ హెల్ప్‌లైన్, ఫిర్యాదుల కేంద్రం చలపతిరావు హౌసింగ్, పీడీ అబ్జర్వర్ 12 మంది నోడల్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ ఇప్పటికే ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితా -
పండుగ కిక్కు
కొల్చారం(నర్సాపూర్): ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దసరాకు ‘కిక్కు’ అదిరింది. ఈనెల 2న దసరా రావడం అదే రోజు గాంధీ జయంతి ఉండడంతో ముందస్తుగానే మద్యం దుకాణాదారులు అమ్మకాలు చేపట్టారు. జిల్లాలోని కొల్చారం మండలం చిన్నఘనాపూర్ శివారులోని మద్యం ఆధారిత నిల్వ కేంద్రం (ఐఎంఎల్ డిపో) ద్వారా పండగకు ముందు గత నెల 29, 30 ఈనెల 1 (ఈ మూడు రోజుల్లో) ఏకంగా రూ. 22.17 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు డిపో వర్గాలు తెలిపాయి. వీటిలో 23,714 కేసుల లిక్కర్, 18,988 కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ. 3.57 కోట్ల అధిక మద్యం అమ్ముడైంది. -
వరికి తెగుళ్ల బెడద
మెదక్‌జోన్: ఖరీఫ్‌లో వరి సాగు కలిసి వస్తుందనుకున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. వరి పంట చేతికందే సమయంలో తెగుళ్లు ఆందోళనకు గురిచేస్తోంది. పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఈఏడాది అన్నిరకాల పంటలు కలిపి 3.29 లక్షల ఎకరాలు సాగు కాగా, అందులో 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేశారు. అందులో 2.28 లక్షల ఎకరాల్లో దొడ్డురకం, 77 వేల ఎకరాల్లో సన్నా లు సాగు చేశారు. కాగా ఈ ఏడాది జిల్లాలో భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గొలకాటు, మెడవిరుపు, కాటుక తెగుళ్లు సోకి పాలుపోసే దశలో గింజలు పొల్లుపోతున్నాయి. అధికారులు సూచించిన పురుగు మందులు ఒకటికి, రెండుసార్లు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో అత్యధికంగా కొల్చారం, పాపన్నపేట, హవేళిఘణాపూర్, మెదక్, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, రామాయంపేట, నిజాంపేట, నర్సాపూర్, శివ్వంపేట, తూప్రాన్ తదితర మండలాల్లో అధికంగా వరి సాగు చేశారు. టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడు, పెద్దశంకరంపేట మండలాల్లో పత్తి సాగు చేశారు. పత్తికి సైతం కాయకుళ్లు, ఎండుతెగులు సోకి తీవ్ర నష్టం జరిగింది. చిరుపొట్ట దశలో భారీ వర్షాలు కురవడంతోనే పంటలకు తెగుళ్లు ఆశించినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.పంటంతా దెబ్బతింటుంది నాకున్న రెండెకరాల్లో దొడ్డురకం వరి సాగు చేశాను. భారీ వర్షాలతో గొలకాటు వచ్చింది. ప్రస్తుతం వరి గింజలు పాలు పోసుకొనే దశలో పంటంతా దెబ్బతింటుంది. ఇప్పటికీ రెండుసార్లు పురుగు మందులు పిచికారీ చేశారు. వర్షాలతో పనిచేయకుండా పోయింది. ఇది మూడోసారి పిచికారీ చేస్తున్నాను. – ఆంజనేయులు, రైతు చందాపూర్ -
ఇసుక నోస్టాక్..!
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను అందుబాటులో ఉంచేందుకు జిల్లాలో అందోలు, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ప్రభుత్వం శాండ్ బజార్లు ఏర్పాటు చేసింది. డిజిటల్ మానిటరింగ్ సిస్టం ద్వారా విక్రయించేందుకు ఆర్భాటంగా కేంద్రాలను ప్రారంభించింది. అయితే అనుకున్నస్థాయిలో లబ్ధిదారులకు ఇసుకను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. శాండ్ బజార్ నిర్వాహకులు విఫలం చెందారనే విమర్శలున్నాయి. – జోగిపేట(అందోల్) జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 1,350 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారులకు ఇసుక భారం కాకుండా ఉండేందుకు జిల్లాలో అందోలు, నారాయణఖేడ్ ప్రాంతాల్లో శాండ్ బజార్లు ఏర్పాటు చేసింది. టన్నుకు రూ. 1,200 చొప్పున విక్రయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం శాండ్ బజార్లో ఇసుక అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద టన్నుకు రూ. 2,800 చొప్పున లబ్ధిదారులు కొనుగోలు చేయా ల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు వస్తుందో చెప్పడానికి కేంద్రం వద్ద ఎవరూ అందుబాటులో లేరు. ఇసుక రావొచ్చునన్న ఆశతో టేక్మాల్, పుల్కల్, అందోలు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు నిత్యం శాండ్ బజార్ల వద్దకు వచ్చి పోతున్నారు.ఇబ్బంది పడుతున్నాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాండ్ బజార్లో 15 రోజులు గా ఇసుక నిల్వలు లేవు. గత్యంతరంలేక టన్నుకు రూ. 2,800 చెల్లించి బయట కొనుగోలు చేస్తున్నాం. సెంటర్ వద్ద లబ్ధిదారులకు సమాచారం ఇచ్చే వారు లేరు. టన్నుకు రూ. 1,200 అయితే తమకు గిట్టుబాటు అవుతుంది. లేదంటే తలకు మించిన భారం అవుతుంది. – నాగరాజు, లబ్ధిదారుడు, జోగిపేట ఆందోళన చెందొద్దు నల్గొండ, కొండపాక ప్రాంతాల నుంచి ఇసుక తీసుకువస్తాం. ప్రస్తుతం వర్షాల కారణంగా తీసుకురాలేకపోయాం. ఇప్పటివరకు అందోలులో 1,200 మెట్రిక్ టన్నులు, ఖేడ్‌లో 480 మెట్రిక్ టన్నుల ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు విక్రయించాం. త్వరలో ఇసుకను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు. – శ్రీకాంత్, పీఓ, శాండ్ బజార్ ఇందిరమ్మ లబ్ధిదారుల పరేషాన్ 15 రోజులుగా తప్పని తిప్పలు టన్నుకు రూ. 2,800 వెచ్చించి బయట కొనుగోలు జిల్లాలో రెండు చోట్ల శాండ్ బజార్ల ఏర్పాటు -
నిలిచిన రేషన్ సంచుల పంపిణీ
● ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ● జిల్లాకు 2.36 లక్షల పర్యావరణ హిత బ్యాగులు సరఫరారామాయంపేట(మెదక్): ఎన్నికల కోడ్ మూలంగా జిల్లాలోని తెల్లరేషన్ కార్డుదారులకు పర్యావరణ హిత సంచుల పంపిణీ నిలిచిపోయింది. జిల్లాలో ఉన్న 520 రేషన్ దుకాణాల్లో 2,32,579 తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. రేషన్ వినియోగదారులకు సరఫరా చేయడానికి గాను జిల్లాకు మొత్తం 2.36 లక్షల సంచులు సరఫరా అయ్యాయి. అక్టోబర్ నెల కోటాతో పాటు సంచులు వినియోగదారులకు అందజేయాలని మొదట్లో పౌర సరఫరాలశాఖ ఆదేశాలు జారీ చేసింది. సదరు సంచిపై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభయహస్తం చక్రం, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చిత్రాలు ముద్రించారు. ఇప్పటికే జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లకు, కొన్ని రేషన్ దుకాణాలకు సంచులు సరఫరా చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో లబ్ధిదారులకు సంచులు పంపిణీ చేయవద్దని తాజాగా పౌర సరఫరాలశాఖ ఆదేశాలు జారీ చేసింది.కోడ్ ముగిసిన తర్వాతే.. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రేషన్ విని యోగదారులకు పర్యావరణ హిత సంచుల సరఫరా నిలిపివేశాం. ఈమేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కోడ్ ముగిసిన తరువాత లబ్ధిదారులకు అందజేస్తాం. – జగదీశ్, డీఎం, పౌరసరఫరాలశాఖ


