Medak District Latest News
-
మా సమస్యలు పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం 11వ రోజుకు చేరుకోగా కలెక్టరేట్ ఎదుట బోనాలతో నిరసన తెలిపారు. అనంతరం హౌసింగ్ బోర్డులో గల గ్రామ దేవత నల్లపోచమ్మకు బోనాలు సమర్పించి తమను రెగ్యులరైజ్ చేసేలా చూడాలని వేడుకున్నారు. వీరికి పీఆర్టీయూ టీఎస్ ఎమెల్సీ అభ్యర్థి మహేందర్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ నాయకులు, సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు సిబ్బది తదితరులు పాల్గొన్నారు. -
అమిత్షానుబర్తరఫ్ చేయాలి
నర్సాపూర్: అమిత్‌షాను మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను విమర్శించడం దారుణమని అన్నారు. అలాగే చిల్డ్రన్స్ పా ర్కులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నిరసన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, దళిత సంఘాల నాయకులు భిక్షపతి, సంజీవ, నరేష్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం: డీడబ్ల్యూఓ హైమావతిమెదక్ కలెక్టరేట్: జిల్లాలో డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారిణి హైమావతి పిలుపునిచ్చారు. శుక్రవారం నషా ముక్త్ భారత్ అభియాన్‌పై కలెక్టరేట్లో అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అంగన్వాడీలు ప్రజలకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె వివరించారు. -
మల్లన్న కల్యాణానికి ఏర్పాట్లు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్నస్వామి కల్యాణోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. శుక్రవారం పోలీస్ కమిషనర్ అనురాధ, వివిధ శాఖల అధికారులతో కలిసి స్వామివారి కల్యాణం జరిగే తోటబావి, వీఐపీ దర్శనం, వీఐపీ పార్కింగ్, ఎల్లమ్మ ఆలయం, క్యూకాంప్లెక్స్, తదితర పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వామివారి కల్యాణం ఈనెల 29న జరగనుండటంతో ఏర్పాట్లను వేగిరం చేయాలన్నారు. ఆలయ పరిసరాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాదారులు తమ సామగ్రిని రోడ్డుపై ఉంచకుండా చూడాలన్నారు. భక్తులకు వైద్యసేవలు అందించాలని తాత్కాలికంగా స్టాల్స్ ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులను సూచించారు. అనంతరం పోలీస్ కమిషనర్ అనురాధ మాట్లాడుతూ.. స్వామి వారి కల్యాణంతో పాటు బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
శనివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
పర్యావరణపరిరక్షణపై సమర శంఖం.. అలుపెరుగని పోరాటం.. చెత్త సేకరణ, రీసైక్లింగ్‌లో మంచి ఫలితాలు.. ప్లాస్టిక్ నియంత్రణపై వ్యూహం.. ఫలితంగా తూప్రాన్ మున్సిపాలిటీకి ఘన కీర్తి దక్కింది. మున్సిపల్ కమిషనర్ గణేష్‌రెడ్డి చొరవ, ప్రణాళికతో ఈ అవార్డుసొంతం అయింది. – తూప్రాన్మెదక్ జిల్లాలోని తూప్రాన్ మున్సిపాలిటీ కేంద్ర ప్రభుత్వ అవార్డుతో ఘన కీర్తి సాధించింది. నాలుగు గ్రామాల విలీనం తర్వాత మున్సిపాలిటీ పరిధిలో 16 వార్డులు, సుమారు 25 వేలకు పైగా జనాభా ఉంది. కుటుంబాలు 7,124 ఉన్నాయి. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పరిరక్షణతో పాటు చెత్తను సేకరించేందుకు 46 మంది కార్మికులు పనిచేస్తున్నారు. చెత్త సేకరణకు 10 వాహనాలను వినియోగిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి చెత్త సేకరణ జరుగుతోంది. సగటున రోజుకు 11 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. దానిని పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డుకు చేరవేసి, అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారు. అక్కడే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా సీస ముక్కలు, బ్యాటరీలు, ఇతర ఘన వ్యర్థాలు భూమిలో చేరి భూసారం దెబ్బతినకుండా రీసైక్లింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించి మంచి ఫలితాలు తీసుకురావడంలో మున్సిపల్ కమిషనర్ గణేష్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. కంపోస్ట్ తయారీ ఇలా.. పట్టణంలో రోజూ సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి, అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి 42 రోజుల పాటు నిల్వ చేస్తున్నారు. అది ఎరువుగా మారిన తర్వాత రోజుకు టన్ను చొప్పున హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు వినియోగిస్తున్నారు. ఫలితంగా మున్సిపాలిటీపై మొక్కలకు వినియోగించాల్సిన ఎరువుల భారం తగ్గుతోంది. అలాగే చెత్త నుంచి వేరు చేసిన డ్రై వేస్టును విక్రయిస్తున్నారు.డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్తను వేరుచేస్తున్న కార్మికులు న్యూస్రీల్పారిశుద్ధ్యంపై పోరాటం పర్యావరణ పరిరక్షణలో జయకేతనం తూప్రాన్ మున్సిపాలిటీకి ఘన కీర్తీ కమిషనర్ ప్రత్యేక శ్రద్ధమరింత బాధ్యత పెంచింది కేంద్ర ప్రభుత్వం చేంజ్ మేకర్ అవార్డు ప్రదానం చేయడం సంతోషం కలిగించింది. ఇది మరింత బాధ్యతను పెంచింది. పర్యావరణ పరిరక్షణతో పారిశుద్ధ్య నివారణ చర్యలు అవార్డుకు బాసటగా నిలిచాయి. ప్రభుత్వ ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయడంతో పాటు కార్మికుల్లో నూతన ఉత్తేజం కల్పిస్తూ వారి ద్వారా మరింత సేవలు అందించేలా చొరవ తీసుకుంటా. – పాతూరి గణేష్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి
మెదక్‌మున్సిపాలిటీ: కాంగ్రెస్‌కు దమ్ముంటే శాసనసభ సమావేశాల్లో ఫార్ములా ఈ– రేస్‌పై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఫార్ములా ఈ– రేసును తీసుకొచ్చి కేటీఆర్ హైదరాబాద్ ఇమేజ్ పెంచారని కొనియాడారు. ఎలాంటి అవినీతి జరగకున్న కేటీఆర్‌ను అరెస్టు చేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. 2023 ఫిబ్రవరిలో మొదటిసారి నిర్వహించిన ఫార్ములా ఈ– రేస్‌తో రాష్ట్రానికి రూ. 700 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. అలాగే హైదరాబాద్‌కు ఎలక్ట్రిక్ వాహ నాల కంపెనీలు సైతం వచ్చాయన్నారు. ఇందులో ఒక్క రూపాయి పక్కదారి పట్టలేదన్నారు. పర్యావరణాన్ని పరిరక్షణకు చర్యలు తీసుకున్నట్లు చెప్పా రు. కేసీఆర్ చరిత్రను రూపుమాపాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ ఆంజనేయులుతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న పద్మారెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి -
పెండింగ్ కేసులను ఛేదించాలి
– ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి మెదక్ మున్సిపాలిటీ: ప్లాన్ ఆఫ్ యాక్షన్‌తో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. తమ పరిధిలోని గ్రామాలను పోలీస్ అధికారులు సందర్శించాలని తెలిపారు. తరచుగా తగాదాలు, నేరాలకు పాల్పడేవారిపై నిఘా ఉంచాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. లాంగ్ పెండింగ్, గుర్తుతెలియని మృతదేహాల కేసులను త్వరగా ఛేదించాలన్నారు. అవసరమైతే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలని చెప్పారు. సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సైబర్ క్రైం డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, సిబ్బంది పాల్గొన్నారు. -
గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ రాహుల్‌రాజ్ మెదక్‌జోన్: గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22వ తేదీన కొల్చారం మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, మెదక్ చర్చిని సందర్శిస్తారని తెలిపారు. గవర్నర్ రాక మొదలు బయలుదేరే వరకు షెడ్యూ ల్ ప్రకారం పర్యటన సాగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు కొల్చారం మండల కేంద్రంలో గల పాఠశాలతో పాటు పరిసరాలను పరిశీలించారు. ఆయన వెంట నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, కొల్చారం తహసీల్దార్ గఫర్‌మియా, ఇతర అధికారులు ఉన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోండి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. దివ్యాంగులకు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని, ఎలాంటి అనారోగ్య సమస్యలైన పరిష్కరించాలని వైద్యులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులు సిబ్బంది ఉన్నారు. -
రైతు బీమా డబ్బులు కాజేసిన మహిళ అరెస్ట్
హవేళిఘణాపూర్(మెదక్): భర్త బతికి ఉండగానే చనిపోయాడని ధ్రువపత్రాలు సృష్టించి రైతు బీమా డబ్బులు డ్రా చేసిన మహిళను అరెస్ట్ చేసినట్లు హవేళిఘణాపూర్ ఎస్ఐ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బూర్గుపల్లి క్లస్టర్ ఏఈఓ స్వాతి పీఎం కిసాన్ యోజన పథకం అర్హుల జాబితా తయారు చేస్తున్న క్రమంలో మృతిచెందిన వారి పేర్లు తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఈక్రమంలో లెంక మల్లేశం మృతి చెందినట్లు తెలపగా గ్రామస్తులు అతడు బతికే ఉన్నాడని తెలిపారు. ఈ విషయంపై ఆరా తీసిన ఏఈఓ వెంటనే హవేళిఘణాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మల్లేశం భార్య పద్మ అక్రమంగా రైతు బీమా డబ్బులు డ్రా చేసినట్లు గుర్తించారు. ఈమేరకు అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకు రిమాండ్‌కు తరలించారు. -
కుటుంబాలు 2.27 లక్షలు
తాళం వేసిన ఇళ్లు 1,629 ● ముగిసిన సమగ్ర కుటుంబ సర్వే ● ఆన్లైన్లో వివరాల నమోదు పూర్తి మెదక్‌జోన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వే ముగిసింది. జిల్లాలో 2,27,936 లక్షల కుటుంబాలు ఉన్నట్లు తేలింది. అయితే 1,629 ఇళ్లకు తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. అక్టోబర్ ఆఖరు వారంలో 1,852 మంది ఎన్యుమరేటర్లతో మొదలు పెట్టిన సర్వే ఈనెల 4వ తేదీ నాటికి పూర్తి చేశారు. ఆన్లైన్లో వివరాల నమో దు ప్రక్రియను సైతం పూర్తి చేశారు. 21 మండలాలు.. 4 మున్సిపాలిటీ లు జిల్లాలో 21 మండలాలు, 4 మున్సిపాలిటీలతో పాటు 493 గ్రామ పంచాయితీలు ఉండగా, వాటి పరిధిలో 2,29,565 ఇళ్లకు ఎన్యుమరేటర్లు స్టిక్కర్లు అతికించారు. సుమారు నెలన్నర పాటు శ్రమించి 2,27,936 ఇళ్ల సర్వేను పూర్తి చేశారు. 1,629 ఇళ్లకు తాళం వేసి ఉండడంతో వదిలేశారు. ఈ లెక్కన జిల్లాలో 99.3 శాతం సర్వే చేశారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో 4,650 ఇళ్లు ఉండగా 3,177 ఇళ్లు మాత్రమే సర్వే చేశారు. ఈ లెక్కన ఇంకా 1,473 ఇళ్లు చేయలేదు. మొత్తంగా 68.3 శాతం నమోదు కాగా 31.7 శాతం ప్రజలు సర్వేకు దూరంగా ఉన్నారు. అత్యధికంగా కొ ల్చారం మండలంలో 10,028 ఇళ్లు ఉండగా, 10,149 ఇళ్లను సర్వే చేశారు. ఈ లెక్కన 101.2 శాతం నమోదైంది. అలాగే చేగుంట, చిలప్‌చెడ్, హవేళిఘనాపూర్, కౌడిపల్లి, మనోహరాబాద్, నర్సాపూర్, నార్సింగి తదితర మండలాల్లో 100 శాతంపైగా సర్వే చేశారు. కులాల జాబితా తర్వాతే.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ముగిసిన నేపథ్యంలో కులాల వారీగా షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు తెలిసింది. కాగా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఓటరు జాబితాను ఫైనల్ చేసిన అధికారులు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సైతం గుర్తించారు. రిజర్వేషన్లు ఖరారు కాగానే స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారని సమాచారం. -
ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు
మెదక్‌జోన్: సీఎం కప్ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజు శుక్రవారం బాల, బాలికల విభాగంలో పట్టణంలోని అవుట్ డోర్ ఇండోర్ స్టేడియంలో చెస్, యోగా పోటీలను నిర్వహించారు. అలాగే వెస్లీ ఉన్నత పాఠశాల మైదానంలో హ్యాండ్‌బాల్, జెడ్పీహెచ్ఎస్ నర్సాపూర్‌లో కిక్‌బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన క్రీడాకారులను జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజు అభినందించి బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం 58 మంది బాల, బాలికలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులు ఈనెల 27వ తేదీ నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు కరణం గణేష్ రవికుమార్, జాతీయ రెఫరీ సత్యనారాయణ, పీడీలు శ్యామయ్య, దేవేందర్‌రెడ్డి, రాజేందర్, మహిపాల్ పాల్గొన్నారు. -
25న ఏడుపాయలకుసీఎం రేవంత్‌రెడ్డి
పాపన్నపేట(మెదక్): ఈనెల 25వ తేదీన ఏడుపాయలకు సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు. ఈమేరకు కలెక్టర్ రాహుల్‌రాజ్ శుక్రవారం ఏడుపాయలలో పర్యటించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అమ్మవారి దర్శనం, పార్కింగ్ స్థలాలు, హెలిప్యాడ్ ఏర్పాటు ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆలయ సిబ్బంది, అధి కారులు ఉన్నారు. మైనార్టీ మహిళలకుఉచిత కుట్టు మిషన్లు మెదక్ కలెక్టరేట్: ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందజేయనున్నట్లు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి జెమ్లా నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు హార్డ్ కాపీలను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయంలో అందజేయాల్సిన అవసరం లేదని తెలిపారు. విద్యార్థులు ఇష్టంగాచదవాలి: ఆర్డీఓ మనోహరాబాద్(తూప్రాన్): విద్యార్థులు ఇష్టంతో చదివి భవిష్యత్‌కు మంచి బాటలు వేసుకోవాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నా రు. శుక్రవారం మండలంలోని కూచారం కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం వంట గదిని తనిఖీ చేసి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. వంటలు నాణ్యతతో చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల భోజనంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఆయన వెంట కేజీబీవీ ప్రత్యేక అధికారి గౌతమి, సిబ్బంది ఉన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక పాపన్నపేట(మెదక్): రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు 12 మంది క్రీడాకారులు ఎంపికై నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని యూసుఫ్‌పేటలో ఆయన మాట్లాడారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 27వ తేదీ నుంచి జనగాంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో అసో సియేషన్ సెక్రటరీ రమేష్, జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, క్రీడాకారులు పాల్గొన్నారు. జీవన నైపుణ్యాలు మెరుగుపర్చాలి మెదక్ కలెక్టరేట్: విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను మెరుగుపర్చేలా బోధన చేయాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్స్‌లో రిసోర్స్ పర్సన్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవన నైపుణ్యాల విద్యను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారిణి హైమావతి, డీసీపీఓ కరుణశీల, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాలకు అండగా నిలవాలి పటాన్చెరు టౌన్: ప్రజా సమస్యలకు కార్మిక వర్గం అండగా నిలవాలని, కార్మిక వర్గ సమస్యలపై సీపీఎం ముందుభాగాన నిలిచి పోరాడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని సాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ చుక్కారాములుకు యూనియన్ ఆధ్వర్యంలో రూ.5 లక్షల విరాళం అందజేశారు. -
అమిత్‌షా క్షమాపణ చెప్పాలి
కొల్చారం(నర్సాపూర్): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని రంగంపేటలో గురువారం ధర్నా నిర్వహించారు. మెదక్– సంగారెడ్డి రహదారిపై రహదారిపై బైఠాయించి అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కొల్చారం పోలీసులు నాయకులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. అమిత్‌షాను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. -
పత్తి రైతులను ఆదుకోండి
కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌కు ఎంపీ షెట్కార్ వినతి నారాయణఖేడ్: పత్తి పంటకు సరైన మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఎంపీ సురేశ్ షెట్కార్ కేంద్ర జాళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ను కోరారు. ఈ ఏడాది పత్తికి రూ.7,521 ప్రకటించినా రైతులకు మాత్రం దక్కడం లేదన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యలను వివరిస్తూ కేంద్రమంత్రికి గురువారం షెట్కార్ వినతిపత్రం అందించారు. వాతావరణంలో నెలకొన్న మార్పుల వల్ల అధిక తేమను సాకుగా చూపి కొనుగోలు దారులు రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే రూ.100 నుంచి 200ల వరకు తక్కువగా చెల్లిస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలతో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అధికశాతం రైతులు సీసీఐకి పత్తిని విక్రయించారని, అందువల్ల రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. -
తూప్రాన్‌కు చేంజ్ మేకర్ అవార్డు
తూప్రాన్: 2021 నుంచి 2024 వరకు స్వచ్ఛత కార్యక్రమాలతో పాటు స్వచ్ఛ సర్వేక్షన్లో మెరుగైన ప్రదర్శన చేపట్టినందుకు గాను తూప్రాన్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం అందించే చేంజ్ మేకర్ అవార్డు దక్కిందని మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేశ్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్వచ్ఛ కార్యక్రమాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మున్సిపాలిటీలకు సీఎస్సీ, ఎంఓహెచ్‌యూఏ సంయుక్తంగా గురువారం ఢిల్లీలో అవార్డులు అందజేసింది. ఈ మేరకు డా.సునీత నరైన్ (సీఎస్సీ డైరెక్టర్) చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆయన వెంట స్థానిక ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ చింతల మధు ఉన్నారు. -
మహిళలకు రూ. 29 కోట్ల రుణాలు
డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావు కౌడిపల్లి(నర్సాపూర్): డ్వాక్రా మహిళలకు ఈ ఏడాది రూ. 29.95 కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకున్నామని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావు తెలిపారు. గురువారం కౌడిపల్లి ఐకేపీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా రుణాలు, రికవరీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు ద్వారా రూ. 28.28 కోట్ల రుణాలు లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ. 22.70 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. సీ్త్రనిధి ద్వారా రూ.1.67 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ. 1.17 కోట్లు ఇచ్చామన్నారు. మిగితా రుణాలు సైతం ఈనెలాఖరు వరకు పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకుంటామని వివరించారు. మహిళలకు జీవనోపాధి కల్పించి సుస్థిర ఆదాయం వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తీసుకున్న రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం సంగమేశ్వర్, సీసీలు పాల్గొన్నారు. -
పిల్లల ఆహారంపై శ్రద్ధ అవసరం
అదనపు కలెక్టర్ నగేష్కొల్చారం(నర్సాపూర్): వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు అందించే ఆహారం పట్ల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా వంట గదిలోకి వెళ్లి ఆహార పదార్థాలతో పాటు ఉపయోగిస్తున్న సామగ్రిని పరిశీలించారు. వంట గదితో పాటు వంట కోసం ఉపయోగించే పాత్రలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారికి అందుతున్న వసతులపై ఆరా తీశారు. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా ముందుకు సాగాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ గఫార్ మియా, ఆర్ఐ ప్రభాకర్, పాఠశాల సిబ్బంది ఉన్నారు. -
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
మెదక్ కలెక్టరేట్: పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా బోధన జరగాలని, జిల్లాను రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిపేందుకు సమష్టి కృషి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఎంఈఓలను ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను బేరీజు వేసుకొని ఈ ఏడాది ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలుచేయాలని సూచించారు. విద్యార్థుల వారీగా వివరాలు తీసుకొని ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఈనెలాఖరులోగా సిలబస్ పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని సూచించారు. చదువుతో పాటు మంచి పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈఓ రాధాకిషన్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, సంబంధిత ఎంఈఓలు పాల్గొన్నారు. గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు మెదక్‌జోన్/కొల్చారం(నర్సాపూర్): ఈనెల 22వ తేదీన గవర్నర్ విష్ణుదేవ్‌వర్మ మెదక్ చర్చితో పాటు కొల్చారం సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను సందర్శిస్తారని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. గురువారం చర్చిని సందర్శించి నిర్వాహకులు, అధికారులతో మాట్లాడారు. రూట్‌మ్యాప్, పార్కింగ్, చర్చి ఆవరణలో ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం కొల్చారం బాలికల గురుకుల కళాశాలను సందర్శించారు. వంటగదిని, పరిసరాలను పరిశీలించారు. పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులకు ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ‘పది’లో జిల్లాను మొదటిస్థానంలో నిలబెట్టాలి ఎంఈఓలతో కలెక్టర్ రాహుల్‌రాజ్ సమీక్ష -
ఇబ్బందులు తీరేనా?
రామాయంపేట(మెదక్): ‘గత ప్రభుత్వ హయాంలో కొత్త రెవెన్యూ డివిజన్లను అస్తవ్యస్తంగా ఏర్పా టు చేశారు. దీంతో ప్రస్తుతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీఎం, ఇతర మంత్రులతో చర్చించి వాటిని సరిచేసేలా చర్యలు తీసుకుంటా’నని ఇటీవల శాసనసభలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. నాలుగేళ్ల పాటు పార్టీలకతీతంగా పెద్దఎత్తున కొనసాగిన ఉద్యమంతో దిగివచ్చిన గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను ప్రకటించింది. నిరుపయోగంగా ఉన్న పాత హాస్టల్ భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసింది. గతేడాది అక్టోబర్‌లో అప్పటి మంత్రి హరీశ్‌రావు కార్యాలయాన్ని ప్రారంభించారు. 14 నెలల క్రితం ప్రారంభమైనా ఇప్పటివరకు గెజిట్ విడుదల కాకపోవడం గమనార్హం. కార్యాలయ ఏర్పాటు కేవలం బోర్డుకే పరిమితం కాగా.. ఇప్పటికీ ఆర్డీఓ, ఇతర సిబ్బందిని నియమించలేదు. కేవలం ఒక అటెండర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. తూప్రాన్ ఆర్డీఓకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. బోర్డుకే పరిమితమైన రామాయంపేట ఆర్డీఓ కార్యాలయం అసెంబ్లీలో మంత్రి ప్రకటనతో ఆశలు!ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే..రామాయంపేటకు ఆర్డీఓ పోస్టుతో పాటు ఇతర సిబ్బంది నియామకం కాలేదు. ఉత్తర్వులు జారీ కాగానే సిబ్బంది నియామకం చేపడుతాం. అప్పటి వరకు ఇన్చార్జి బాధ్యతలు కొనసాగిస్తారు. – నగేశ్, అదనపు కలెక్టర్, మెదక్ డివిజన్ పరిధిలో మండలాలు కొత్తగా ఏర్పాటు చేసిన రామాయంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోకి రామాయంపేట, నిజాంపేట, నార్సింగి , చిన్నశంకరంపేట మండలాలను చేర్చారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భవనంలో కొంత ఫర్నీచర్ తప్పించి కంప్యూటర్లు, సిబ్బంది ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్‌ను తాత్కాలికంగా ఆర్డీఓ కార్యాలయంలో నియమించారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తున్న రైతులు తమ పనులు కాకపోవడంతో గతంలో మాదిరిగానే మెదక్ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్తున్నారు. రామాయంపేటలో ఆర్డీఓ కార్యాలయం ప్రారంభమైనా తమ ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. -
డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం
ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డివెల్దుర్తి(తూప్రాన్)/చిన్నశంకరంపేట/శివ్వంపేట: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చ ర్యలు తీసుకుంటూనే డ్రగ్స్, గంజాయి రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరా లు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. గంజాయి రవాణాను జిల్లా లో పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడైనా సరఫరా జరుగుతున్నట్లు గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు. వెల్దుర్తి ఉమ్మడి మండలంలో అనుమతి లేకుండా మట్టి, ఇసుక రవాణా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అనంతరం చిన్నశంకరంపేట, శివ్వంపేట పోలీస్స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు తనిఖీ చేశారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎస్పీ వెంట తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి సిబ్బంది ఉన్నారు. -
ఆయిల్‌పామ్‌తో అధిక దిగుబడి
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ప్రతాప్సింగ్తూప్రాన్: ఆయిల్‌పామ్ సాగుతో అధిక దిగుబడు లు సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి ప్రతాప్‌సింగ్ అన్నారు. గురువారం పట్టణంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ పంట సాగు చేయాలని సూచించారు. ఎకరా వరికి సరిపోయే నీటితో ఐదెకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయవచ్చని వివరించారు. జిల్లాలో 2023– 24లో 78 మంది రైతులు 336 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారని తెలిపారు. 2024– 25కు సంబంధించి ఇప్పటివరకు 1,623 ఎకరాలకు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి కృష్ణ, ఉద్యానశాఖ అధికారి రచన, ఏఓ గంగుమల్లు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాలు సాధించాలి: ఆర్డీఓ
తూప్రాన్: వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్త మ ఫలితాలు సాధించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. చదువులో పోటీతత్వం అలవర్చుకొని మంచి మార్కులు సాధించాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. అనంతరం విద్యార్థుల హాజరు, పాఠశాల నిర్వహణ, తరగతి గదుల పరిస్థితి, విద్యా బోధన ప్రమాణాలు, పరిసరాల పరిశుభ్రతను పర్యవేక్షించారు. -
స్తంభించిన విద్యా వ్యవస్థ
● కేజీబీవీ, భవిత కేంద్రాల్లో నిలిచిన బోధన ● జిల్లాలో 600 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యల సాధన కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఈనెల 10 నుంచి విధులు బహిష్కరించి రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. నేటికీ 10 రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే వీరి సమ్మె ప్రభావం విద్యావ్యవస్థపై తీవ్రంగా పడింది. విద్యాశాఖలో అనేక రకాల సేవలు పూర్తిగా స్తంభించాయి. కేజీబీవీలు, భవిత కేంద్రాల్లో బోధన కుంటుపడింది. మెదక్‌జోన్: జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు సుమారు 600 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు అత్యధికంగా విద్యాశాఖలోనే ఉన్నారు. పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరుతో పాటు మధ్యాహ్న భోజన వివరాలను పరిశీలిస్తారు. ఇదే కాకుండా బడిబయట పిల్లలను గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించడం, పాఠశాలల నుంచి విద్యార్థుల వివరాలు సేకరించి యూ డైస్లో నమోదు చేస్తారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయులు సెలవుపై వెళ్లినప్పుడు ఆ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పడం వంటివి చేస్తుంటారు. వీరంతా సమ్మెలో ఉండడంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి. నిలిచిన కార్యకలాపాలు ● ప్రభుత్వం ఐదు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు విడుదల చేయకపోవడంతో వంట కార్మికులు అప్పులు తెచ్చి విద్యార్థులకు వండి పెడుతున్నారు. ● వారం రోజుల క్రితం 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ. 1.67 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ● కానీ ఈ బిల్లుల వ్యవహారం అంతా కంప్యూటర్ ఆపరేటర్లు (సమగ్ర శిక్ష) చూస్తుండడంతో కార్మికులకు బిల్లులు అందకుండా పోయాయి. ● జిల్లావ్యాప్తంగా 19 కేజీబీవీలు ఉండగా, వాటిలో వేలాది మంది అనాథ, పేద, మధ్య తరగతి బాలికలు చదువుకుంటున్నారు. ● కాగా ఈ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా సమగ్ర శిక్ష ఉద్యోగులే. వీరు పది రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నారు. ● దీంతో బాలికలు చదువుకు దూరమవుతున్నారు. ఇప్పటికే ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ వచ్చింది. ● మార్చిలో 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభం అయ్యాయి. ● ఇలాంటి సమయంలో విద్యార్థినులకు బోధన అందకపోతే వారి భవిష్యత్ అంధకారమయ్యే పరిస్థితి ఉంది. ● మానసిక, శారీరక (దివ్యాంగులు) పిల్లలకు రోజూ ఫిజియోథెరఫీతో పాటు పలు బొమ్మలు చూపుతూ బోధించటం సమగ్ర శిక్ష సిబ్బంది విధి. ● అయితే వీరు గత పది రోజులుగా సమ్మెలో ఉండడంతో భవిత సెంటర్లు పూర్తిగా మూతపడ్డాయి. ● ఇంత జరుగుతున్నా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● అయితే సమగ్ర శిక్ష ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని చెబుతున్నారు. కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన -
బెనిఫిట్స్ అందజేయాలి
మంత్రి సీతక్క ఇచ్చిన హామీ మేరకు రిటైర్మెంట్ పొందిన అంగన్వాడీ టీచర్లకు రూ. 2 లక్షలు, ఆయాలకు రూ. 1 లక్ష చొప్పున బెనిఫిట్స్ అందజేయాలి. ఆటు ఉద్యోగం పోయి, ఇటు ఆర్థిక సహాయం అందకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రెండు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలి. – అన్నపూర్ణ, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నిధులు రావాల్సి ఉంది గతంలో పదవీ విరమణ పొందనున్న టీచర్లకు రూ. 2 లక్షలు, ఆయాలకు రూ. 1లక్ష బెనిఫిట్స్ పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ జీఓ అమలులోకి రాలేదు. ముందు పంపించిన కొన్ని జిల్లాల్లో రిటైర్మెంట్ పొందిన ఆయాలకు రూ. 50 వేలు, టీచర్లకు రూ. 1 లక్ష అందజేస్తున్నారు. జిల్లాకు సంబంధించిన వివరాలు కమిషనర్‌కు పంపించాం. నిధులు రావాల్సి ఉంది. – హైమావతి, డీడబ్ల్యూఓ, మెదక్ -
పనుల్లో వేగం పెంచండి
కలెక్టర్ రాహుల్రాజ్కౌడిపల్లి(నర్సాపూర్): ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ రాక సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కేవీకేలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్, సేంద్రియ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవీకే సమీపంలోని గిరిజన రైతుల పంట పొలాల్లో నాలుగు హెలిప్యాడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల భూమికి నష్టం జరగకుండా మట్టితో క్యూరింగ్ చేయాలన్నారు. చెట్లు నరకవద్దని అధికారులకు సూచించారు. కాగా కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రవికుమార్ ఏర్పాట్ల గురించి వివరించారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో వివిధ గ్రామాలకు చెందిన 500 మంది సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో పాటు మరో 300 మంది రైతులు రానున్నారని తెలిపారు. తప్పనిసరిగా మెనూ పాటించాలి మెదక్‌జోన్: మెనూ తప్పకుండా పాటించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కాలేజీని అకస్మికంగా తనిఖీ చేశారు. వసతులు, భోజనం నాణ్యతలో ఎలాంటి వ్యత్యాసం రావొద్దని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్లో ఇంటర్మీడియెట్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష నిర్వహించారు. ఉత్తీర్ణత శాతం పెరగాలంటే డ్రాపౌట్స్‌ను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా బోధనలో సమూల మార్పులు తీసుకురావాలని ఆదేశించారు. -
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం
ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డిమెదక్ మున్సిపాలిటీ: ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా జిల్లా పోలీస్‌శాఖ పనిచేస్తుందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో క్యూఆర్టీ పార్టీలతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. సామాన్యులకు భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో నేర నియంత్రణ అదుపునకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తే వెంటనే డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూం 8712657888 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.