
24న టాలెంట్ టెస్టు
నర్సాపూర్: పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్టు ఆధ్వర్యంలో టాలెంట్ టెస్టును ఈనెల 24న నిర్వహిస్తున్నారని టీఎస్ యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు రవి, గంగాధర్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. నాలుగు నుంచి ఆరవ తరగతులు చదువుతున్న విద్యార్థులు టాలెంట్ టెస్టు రాసేందుకు అర్హులని చెప్పారు. అనాథ పిల్లలు, తల్లి, తండ్రి లేని పిల్లలు ఉన్నత విద్యకు దూరం కావొద్దన్న ఉద్దేశ్యంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత విద్య అవకాశం కల్పిస్తున్నారన్నారు. టెస్టులో ఎంపికై న వారికి ఉచిత విద్య అందిస్తారని, ఈనెల 18లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 99496 02664, 79897 30251 నంబర్లను సంప్రదించాలన్నారు.
నేడు భూ భారతిపై
అవగాహన సదస్సు
మనోహరాబాద్(తూప్రాన్): భూభారతి రెవెన్యూ చట్టంపై కలెక్టర్ రాహుల్‌రాజ్ గురువారం మనోహరాబాద్ మండలం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతిపై ఆర్డీఓ జయచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులతో మనోహరాబాద్ రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు పాల్గొని తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.
అసత్య ప్రచారం చేస్తే
క్రిమినల్ కేసులు
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చౌకబియ్యంపై అసత్య ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్‌రెడ్డి హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో చౌక దుకాణాలు ద్వారా ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారని జరుగుతున్న దుష్ప్రచారంపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. అలాంటి ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని ఆయన సూచించారు.
టీకాలతో పశువుల్లో
వ్యాధి నిరోధక శక్తి
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
వెంకటయ్య
చిలప్‌చెడ్(నర్సాపూర్): ముందస్తు జాగ్రత్తగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా లు వేయడం వల్ల పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, పశువులు ఆరోగ్యంగా ఉంటాయని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ వెంకటయ్య అన్నారు. బుధవారం ఆయన మండలంలోని శీలాంపల్లి, చిట్కుల్ గ్రామాల్లో గాలికుంటు నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన శీలాంపల్లిలో రైతులు సాగు చేస్తున్న (సూపర్ నేపియర్) గడ్డిని పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతీ పశువుకు టీకా ఇప్పించాలన్నారు. సూపర్ నేపియర్ గడ్డితో పశువులకు కలిగే లాభాలు వివరించారు. కార్యక్రమంలో వెటర్నరీ సర్జన్ డాక్టర్ వినోద్, పశువైద్య సిబ్బంది గట్టయ్య, శంకర్, సతీష్, రైతులు పాల్గొన్నారు.
కొత్త ఒప్పందాలతో
ఉద్యోగావకాశాలు
బీవీ రాజు ఇంజనీరింగ్
కళాశాల ప్రతినిధులు
నర్సాపూర్: కొత్త సంస్థ ఒప్పందాలతో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి, నైపుణ్యాలు పెంపొందించుకునే అవకాశాలు పెరుగుతాయని బీవీ రాజు ఇంజనీరీంగ్ కళాశాల ట్రైనింగ్ ప్లేస్‌మెంటు ఆఫీసర్ బంగర్రాజు, ఈసీఈ హెక్షడీ సంజీవరెడ్డి చెప్పారు. బుధవారం తమ కళాశాలతో క్యూఎన్‌ఎక్స్ సాప్ట్‌వేర్ సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుందని చెప్పారు. విద్యార్థులకు ప్రాజెక్టులపై శిక్షణ, ఇంటర్న్‌షిప్, మెడికల్‌కు సంబంధించిన ప్రాజెక్టు కంటెస్టుల్లో పాల్గొనే అవకాశం ఉందని వారు చెప్పారు.

24న టాలెంట్ టెస్టు