
ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు
మెదక్ మున్సిపాలిటీ/కొల్చారం(నర్సాపూర్): ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని కొల్చారం వెళ్లే రహదారిపై ఇటీవల ఓ వర్గం అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం, పోటీగా మరో వర్గం శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. దీంతో సోమవారం ఆ స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. మహనీయులను కించపరిచే విధంగా పనులు చేయడం, పైగా ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా రోడ్డుపై విగ్రహాలను ఏర్పాటు చేయడం తగదన్నారు. ఇరువర్గాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగాలని సూచించారు. లేదంటే చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ప్రసన్నకుమార్‌ను ఆదేశించారు. ఎస్పీ వెంట మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై మహమ్మద్‌గౌస్ ఉన్నారు. అనంతరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి