
కళలు, సంప్రదాయాలను ప్రోత్సహిద్దాం
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: కళలు, సంప్రదాయాలను ప్రోత్సహించి, భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవస రం ఎంతైనా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామలీల గేయ రామాయణ వాగ్గేయకారుడు రుక్మాభట్ల నరసింహా స్వామిని శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రుక్మాభట్ల గేయ రామాయణం రచించి తన జీవితాన్ని శ్రీ రా ముడికి అంకితం చేశారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉగాది పురస్కారం తీసుకున్న రుక్మాభట్లకు పద్మశ్రీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.