
చిన్న తరహా పరిశ్రమలతో ఉపాధి
చేగుంట(తూప్రాన్): గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాలిటెక్నిక్‌తో చదువును ఆపేయాల్సి వస్తే చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందవచ్చని జిల్లా ఇండస్ట్రీయల్ సెంటర్ జీఎం ప్రకాశ్ అన్నారు. చేగుంటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ తృతీయ సంవత్సరం విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఉపాధి అవకాశాలు ఎంచుకొని ముందుకు సాగాలన్నారు. నెపుణ్యాలను బట్టి ప్రైవేట్ పరిశ్రమల్లో సైతం ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందన్నారు. పాలిటెక్నిక్‌తో ఉన్నత చదువులు చదివేవారు మంచి ఉద్యోగం సాధించే వరకు చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సంగీత, ప్రిన్సిపాల్ చక్రవర్తి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.