రైతులు ఇబ్బంది పడొద్దు
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
పోలీసుల భారీ భద్రత
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పర్యటనకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎప్పుడూ లేనిది ఇంత మంది పోలీస్‌లు వచ్చారేంటి అని నార్సింగి ఎస్‌ఐ అహ్మద్ మోహినొద్దీన్‌ను ఎమ్మె ల్యే సరదాగా ప్రశ్నించారు. కాగా రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిల్డర్లు డబ్బులిస్తామంటున్నారని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎ మ్మెల్యే పర్యటనను అడ్డుకుంటారేమోనని పోలీస్‌లు ముందు జాగ్రత్తగా భారీ భద్రత ఏర్పాటు చేశారు.
చిన్నశంకరంపేట(మెదక్): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన అధికారులను సస్పెండ్ చేయిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తీసుకువచ్చిన ధాన్యం వెంటవెంటనే కాంటా చేసి రైస్‌మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యంతో ప్రమాదాలకు ఆస్కారం ఉందని, వెంటనే కొ నుగోలు చేయాలని చెప్పారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ కరీం, ఎంపీడీఓ ఆనంద్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ సబిత, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని, వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. వరంగల్ రజతోత్సవ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.


