
మెరుగైన వైద్యసేవలు అందించాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
కాలువలు నిర్మించే వరకు పోరాటం
టేక్మాల్(మెదక్): గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సిబ్బంది హాజరు, ఓపీ రిజిస్టర్, మందులను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలన్నారు. సమయపాలనతో విధులు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఓవర్ లోడింగ్ తదితర విషయాల గురించి విద్యుత్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కోతలు లేని విద్యుత్ అందించాలని ఆదేశించారు. అనంతరం కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి ఆరా తీశారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
వేగవంతంగా సన్నబియ్యం సరఫరా
పాపన్నపేట(మెదక్): పండుగ పూట కలెక్టర్ తన విధులు నిర్వర్తించారు. ఆదివారం సెలవు అయినప్పటికీ పాపన్నపపేట సివిల్ సప్లై గోదాం తనిఖీ చేశారు. సన్న బియ్యం నాణ్యత, నిల్వలను పరిశీలించారు. సన్నబియ్యం పంపిణీ నిరాటంకంగా కొనసాగించాలని సూచించారు. స్టేజ్ వన్ కాంట్రాక్టర్లు బియ్యం వేగంగా పంపిణీ చేయాలన్నారు. అంగన్‌వాడీలు, హాస్టళ్లు, రేషన్ కార్డుదారులకు ఎంత బియ్యం అవసరమవుతాయన్న వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అందుకనుగణంగా బియ్యం నిల్వలు ఉంచాలని ఆదేశించారు.
దుబ్బాకరూరల్: నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూర్తి చేసేవరకు పోరాడుతామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం పోతా రం గ్రామంలో ఎమ్మెల్యే దంపతులు సీతారాముల కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయని అన్నారు. ఇంకా అక్కడక్కడా కాలువలు పూర్తి కాలేదని వాటిని పూర్తి చేసే దాకా పోరాడుతానని తెలిపారు. శ్రీరామనవమి రోజున తన సొంత గ్రామమైన పోతారం చెరువుకు నీళ్లు రావడం సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండా లని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో నిండిన చెరువును పరిశీ లించారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

మెరుగైన వైద్యసేవలు అందించాలి